Thursday 18 May 2023

1. మేము కాశ్మీరు వెళ్ళాం

“ఇప్పడు నీకు ప్రయాణం చెయ్యడానికి తగ్గంత బలం వచ్చింది. నేను నీతో కాశ్మీరు వస్తాను,” అన్నాడు శ్రీయుక్తేశ్వర్‌గారు; ఏషియాటిక్ కలరా అద్భుతంగా నయమై నేను కోలుకున్న రెండు రోజుల తరవాత.

ఆ రోజు సాయంత్రం మా జట్టు ఆరుగురం కలిసి ఉత్తరదేశానికి వెళ్ళే బండి ఎక్కాం. మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా; హిమాలయ పర్వతాలనే సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగరరాణి ఇది. అద్భుతమైన దృశ్యాల్ని చూసి ఆనందిస్తూ ఏటవాలు వీధుల్లో సంచరించాం.

“ఇంగ్లీషు స్ట్రాబెరీలున్నాయి,” అని అరుస్తూ ఒక ముసలామె, అందమైన ఆరుబయటి అంగడి వీథిలో కూర్చుని ఉంది.

చిత్రమైన ఆ చిన్నచిన్న ఎర్రటి పళ్ళమీద గురుదేవులకు ఆసక్తి కలిగింది. ఆయన ఒక బుట్టెడు పళ్ళు కొని, పక్కనున్న నాకూ కనాయికీ పెట్టారు. ఒక పండు రుచి చూసి వెంటనే తుపుక్కున నేలమీద ఉమ్మేశాను.

“పులుపు రొడ్డండి సార్! స్ట్రాబెరీలు నాకు ఒక్కనాటికి నచ్చవు?”

మా గురుదేవులు నవ్వారు. “ఆఁహాఁ, నీకు నచ్చుతాయవి - అమెరికాలో. అక్కడొకరి ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు, నీకు ఆతిథ్యమిచ్చే ఆవిడ, వాటిలో పంచదారా మీగడావేసి ఇస్తుంది. ఆ పళ్ళని ​ఆవిడ ఫోర్కుతో బాగా ఎనిపిన తరవాత నువ్వు రుచి చూసి, ‘ఎంత రుచిగల స్ట్రాబెరీలు!’ అంటావు. అప్పుడు నీకు గుర్తు వస్తుంది, సిమ్లాలో ఈ రోజు.

(శ్రీయుక్తేశ్వర్‌గారు చెప్పిన జోస్యం నా మనస్సులోంచి తొలగిపోయింది. కాని మూడేళ్ళ తరవాత, నేను అమెరికాలో అడుగుపెట్టిన కొత్తల్లో మళ్ళీ మనస్సులో మెదిలింది. మెసాచుసెట్స్‌లోని వెస్ట్ సోమర్విల్ లో మిసెస్ ఆలిస్ టి. హేసీ అనే ఆవిడ ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్ళాను. భోజనాల బల్లమీద స్ట్రాబెరీల డిసర్ట్ పెట్టినప్పుడు, మా ఆతిథేయిని ఒక ఫోర్కు తీసుకొని, బెరీపండ్లకు మీగడా పంచదారా కలిపి, వాటిని బాగా ఎనిపింది. “ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది; దీన్నిలా చేస్తే మీకు నచ్చుతుందనుకుంటాను,” అన్నదామె. నేను నోరుపట్టినంత తీసి పెట్టుకున్నాను. “ఎంత రుచిగల స్ట్రాబెరీలు!” అంటూ ఆశ్చర్యం ప్రకటించాను. వెంటనే, సిమ్లాలో మా గురుదేవులు చెప్పిన జోస్యం, ఆగాఢమైన నా స్మృతిగహ్వరంలోంచి బయల్పడింది. దైవానుసంధాన శీలకమైన ఆయన మనస్సు చాలాకాలం కిందటే, భవిష్యదాకాశంలో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు నేను అప్రతిభుణ్ణయాను).

త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి, రావల్పిండి బండి ఎక్కింది. అక్కడ మేము జోడుగుర్రాలు పూన్చిన గూడుబండి ఒకటి అద్దెకు తీసుకుని శ్రీనగర్‌కు ప్రయాణమయాం; శ్రీనగర్ కాశ్మీరుకు రాజధాని. మేము ఉత్తరదిశకు ప్రయాణం సాగించిన రెండోనాడు హిమాలయాల నిజమైన విస్తారం మా కంటబడింది. మా బండికున్న ఇనప చక్రాలు, మలమల మాడుతున్న రాతిగొట్టు బాటల్లో కీచుమని రొదచేస్తూ సాగుతూ ఉండగా, ఆ పర్వతశోభలో మారుతున్న తరుశ్రేణుల రామణీయకతకు మేమంతా ముగ్ధులమయిపోయాం. ​“గురుదేవా, మీ పావన సాహచర్యంలో ఈ మనోహరదృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నానండి,” అంటూ గురుదేవులతో అన్నాడు ఆడీ. ఆ ప్రయాణానికి నేను ఆతిథేయిగా వ్యవహరిస్తున్నందువల్ల, ఆడీ మెప్పుకి నాలో రవ్వంత ఉల్లాసం పెల్లుబికింది. శ్రీయుక్తేశ్వర్‌గారు నా ఆలోచన పసిగట్టారు; నావేపు తిరిగి గుసగుసలాడారు:

“నిన్ను నువ్వు ఉబ్బేసుకోకు; ఆడీ, మనని విడిచిపెట్టి పోయి ఒక సిగరెట్టు కాల్చుకురావడానికి దొరికే అవకాశాన్ని తలుచుకుని ముగ్ధుడవుతున్నంతగా ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడవడం లేదు,” అన్నారాయన.

నేను అదిరిపడ్డాను. గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అన్నాను. “గురుదేవా, మీరు దయచేసి ఇలాటి వెగటు మాటలతో మా పొత్తు చెడ గొట్టకండి. ఆడీ ఒక దమ్ముకోసం ఆరాటపడుతున్నాడంటే నేను ఒక్కనాటికి నమ్మను.” మామూలుగా, ఎవరూ అదుపుచెయ్యడానికి లొంగని మా గురుదేవుల వేపు అనుమానంగా చూశాను నేను.

“సరేలే, నేను ఆడీతో ఏమీ అనను,” అంటూ గురుదేవులు ముసి ముసిగా నవ్వారు. “కాని నువ్వే కాసేపట్లో చూస్తావు; మన బండి ఆగినప్పుడు అతను ఆ అవకాశం జారనివ్వడు.”

మా బండి ఒక చిన్న కారవాన్‌సెరాయి దగ్గిరికి చేరుకుంది. మా గుర్రాల్ని నీళ్ళు పట్టడానికి తోలుకువెళ్తూ ఉండగా, ఆడీ అడిగాడు, “గురుదేవా, నేను బండివాడితో బాటు కాసేపు అలా స్వారి చేసివస్తే మీకు అభ్యంతరమాండి? నాకు కొంచెం బయటిగాలి పీల్చుకోవాలని ఉంది.”

శ్రీయుక్తేశ్వర్‌గారు అనుమతి ఇచ్చారు. కాని, “అతనికి కావలసింది స్వచ్ఛమైన గాలి కాదు, స్వచ్ఛమైన దమ్ము,” అన్నారాయన నాతో. ​బండి మళ్ళీ బయల్దేరి, దుమ్ము రోడ్లమీద రొదచేసుకుంటూ ముందుకు సాగింది. గురుదేవుని కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి; ఆయన నాతో అన్నారు:

“బండి తలుపులోంచి మెడ సారించి స్వచ్ఛమైన గాలితో ఆడీ చేస్తున్న వేమిటో చూడు.”

ఆయన చెప్పినట్లు చేశాను. ఆడీ, రింగులు రింగులుగా సిగరెట్టు పొగ వదిలే కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్ర్భాంతి చెందాను. క్షమార్పణ కోరుతున్నట్టుగా శ్రీయుక్తేశ్వర్‌గారి వేపు చూశాను.

“మీరే రైటండి; ఎప్పటిలాగే. ఆడీ ప్రకృతి దృశ్యంతో బాటు దమ్ముకొడుతూ ఆనందిస్తున్నాడు.” మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడు; ఆడీ కలకత్తానుంచి సిగరెట్లేమీ తీసుకురాలేదని నాకు ముందే తెలుసు.

నదులూ, లోయలూ, నిటారుగా నిలిచిన కొండ కొమ్ములూ, అసంఖ్యాకమైన పర్వతశ్రేణులూ గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ గజిబిజి దారిగుండా ప్రయాణం సాగించాం. ప్రతి రాత్రీ మే మొక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునేవాళ్ళం. నేను భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీయుక్తేశ్వర్‌గారు, నా పథ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటికింకా నీరసంగానే ఉన్నాను. బరబరలాడే ఆ బండి కచ్చితంగా మా అసౌకర్యంకోసమే తయారై ఉన్నప్పటికీ, అప్పటికింకా నేను నీరసంగానే ఉన్నా- రోజూ రోజూకీ ఆరోగ్యం మెరుగవుతోంది.

మేము మధ్య కాశ్మీరుకు చేరువవుతూ ఉండగా, పద్మసరోవరాల దివ్యలోకం, నీటిమీద తేలే తోటలు, అందాల గుడ్డపందిళ్ళు వేసిన నావ ​ఇళ్ళు, అనేక వంతెనలుగల జీలంనది, పూలు పరిచినట్టున్న గడ్డి మైదానాలు, వీటన్నిటినీ చుట్టిఉన్న హిమాలయాలూ చూడబోతున్నామన్న ఆనందం మా హృదయాల్లో నిండింది.

మేము శ్రీనగర్‌కు వెళ్ళే దారికి ఇటూఅటూ ఉన్న పొడుగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎత్తయిన కొండల నేపథ్యంలో ఉన్న రెండతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాం. అక్కడ నీటి కుళాయిల సౌకర్యం లేదు; దగ్గరలో ఉన్న నూతిలోంచి నీళ్ళు తోడుకునే వాళ్ళం. వేసవి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది: వెచ్చటి పగళ్ళూ చిరుచలి రాత్రులూ.

శ్రీనగర్‌లో శంకరాచార్య స్వామివారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశాం. ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరిశిఖరాశ్రమం మీదికి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎక్కడో ఒక దూరదేశంలో కొండమీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం నాకు గోచరమయింది; శ్రీనగర్‌లో మహోన్నతంగా నెలకొన్న ఆ శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ, అనేక సంవత్సరాల అనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలై జేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్టు దర్శనమయింది (నేను మొట్టమొదట కాలిఫోర్నియాలో లాస్‌ఏంజిలిస్‌ను సందర్శించి మౌంట్ వాషింగ్టన్ కొండ కొమ్మునున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు, అంతకుపూర్వం ఎప్పుడెప్పుడో, కాశ్మీరులోనూ ఇతర చోట్లా నాకు కలిగిన అంతర్దర్శనాన్ని బట్టి వెంటనే దాన్ని గుర్తుపట్టాను).

***

2.🍀 198। వివిధ కోణాలు 🍀

🕉 ఇతరులను విభిన్న కోణాల్లో అనుభూతి చెందడం ఎల్లప్పుడూ మంచిది, ఎందుకంటే వ్యక్తులు బహుళ అంశాలను కలిగి ఉంటారు। 🕉

మనమందరం మనలో ఒక ప్రపంచాన్ని కలిగి ఉంటాము మరియు మీరు నిజంగా ఒక వ్యక్తిని తెలుసుకోవాలనుకుంటే మీరు అతనిని లేదా ఆమెను సాధ్యమైన అన్ని కోణాల నుండి తెలుసుకోవాలి। అప్పుడు ఇద్దరు వ్యక్తులు అనంతం కోసం ఒకరికొకరు ఆకర్షణీయంగా ఉండగలరు, ఎందుకంటే అప్పుడు ఏ పాత్ర కూడా స్థిరంగా ఉండదు। కొద్దిరోజుల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మార్పు సంభవించినప్పుడు మళ్లీ భార్యాభర్తల పాత్రల్లో వస్తే అందంగా, కొత్తదనంగా ఉంటుంది! అప్పుడు చాలా రోజుల తర్వాత కలుస్తున్నట్లు అనిపిస్తుంది।

మార్పు ఎప్పుడూ మంచిదే। ఒక వ్యక్తితో, కొత్త పరిస్థితులతో సంబంధం కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ కొత్త విధానాలను మరియు మార్గాలను కనుగొనండి। ఎప్పుడూ పాతదానిలోనే ఉండిపోవద్దు। అప్పుడు సంబంధం ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది। ఎల్లప్పుడూ ఆశ్చర్యకరమైనవి ఉంటాయి; మరొకరిని ఆశ్చర్యపరచడం ఎప్పుడూ మంచిదే; అప్పుడు సంబంధం ఎప్పటికీ చావదు।

కొనసాగుతుంది।।।

🌹 🌹 🌹 🌹 🌹

3. ఓం సదాశివ పతివ్రతాయై నమః

తానవతరించిన వివిధ అవతారము లందును సదా శివుడే పతిగా, శివునిలో తను సగమై అర్ధనారీశ్వర తత్వమునకు ప్రతీకగా, శివునితో అవినాభావ సంబంధం గలిగి పాతివ్రత్యమునకు సంకేతమై నిలచిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సదాశివపతివ్రతా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సదాశివ పతివ్రతాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సర్వకామార్ధసిద్ధి సంప్రాప్తించి, అంత్యమున సాయుజ్యమునందగలరు.

శివుడు అంటే మంగళకారుడు. సదాశివుడు అంటే నిత్యమూ మంగళకారుడు. అటువంటి సదాశివుని జగన్మాత భర్తగాపొందినది. తాను అవతరించిన ప్రతీ అవతారములోను ఆయననే తన భర్తగాపొందినది. పార్వతీ-పరమేశ్వరులు అన్నారు. ఎందుచేతనంటే తనభర్తతో అవినాభావసంబంధం గలిగి పాతివ్రత్యానికి సంకేతమై తను నిలిచినది. అందుకనే జగన్మాతకు తనభర్త సదాశివునిలో గల అన్ని విభూతులు గలిగియున్నది. శివశక్త్యైక స్వరూపిణి. రూపంలోను, నామంలోను, పంచకృత్యాలలోను అన్నివిధాలా పరమేశ్వరునితో జగన్మాత సమన్వయింపబడినది. సాధకుడు యోగసాధనలో కుండలినీ శక్తిని జాగృతంచేసి ఊర్ధ్వముఖంగా పయనింపజేయగా, బ్రహ్మ,విష్ణు,రుద్ర గ్రంథులను ఛేదించి, షట్చక్రాలకావల సహస్రారంలోని చంద్రమండలంలో సుధాసాగరమధ్యమందు పరమేశ్వరునిచేరి ఆయనతో ఆనందతాండవమాడిన తరుణంలో అమృతధారలను వర్షింపజేసినది అంటే ఆ సదాశివుని ఎంతగానో కోరినదైన జగన్మాత సదాశివపతివ్రతా యని స్తుతింపబడవలసినదేగదా! సౌందర్యలహరిలో, 96వ శ్లోకంలో  శంకరభగవత్పాదుల వారు అమ్మవారి పాతివ్రత్యాన్ని ఇలా చెప్పారు:

కళత్రం వైధాత్రం - కతికతి భజంతే న కవయః

శ్రియో దేవ్యాః కోవా - న భవతి పతిః కైరపి ధనైః|

మహాదేవం హిత్వా - తవ సతి సతీనామచరమే‌

కుచాభ్యా మాసంగః - కురవకతరో రప్య సులభః||96||

సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడా లభించదు.

భావము:

అమ్మా! పతివ్రతాగ్రగణ్యా - ఎందరెందరో కవులు సరస్వతిని ఉపాసించి ఆమె అనుగ్రహం తో కవీశ్వరులై సరస్వతీ వల్లభులు అనిపించుకుంటున్నారు. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె దయతో ధనవంతులై లక్ష్మీపతులు అవుతున్నారు. కాని అమ్మా శివునికి మాత్రమే సొంతమై శివునిలో అర్ధభాగమై ఉండు నీ అనుగ్రహం పొందుట మాత్రం అంత తేలికైన విషయం కాదు.లోకంలో కురవకవృక్షం ( గోరింటాకు చెట్టు) పండుటకు ఉత్తమ స్త్రీ ఆలింగనం చెప్పబడి ఉన్నది. నీ ఉద్యాన వనంలో ఆ చెట్టుకు నీవు దోహదం చేయునప్పుడు కూడా ఆ వృక్షమునకు నీ స్పర్శ నీలో అర్ధభాగమైన సదాశివునితోనే తప్ప శివేతరగా (శివుడు లేకుండా) నిన్ను తాకుట కుదరదు. అటువంటి పతివ్రతవు నీవు.పతివ్రతలలో అగ్రగణ్యవు (ముందు లెక్కింపవలసినదానవు) నీవు.

ఇచట శ్రీ ఆదిశంకరులు చెబుతున్నది ఏమనగా - బ్రహ్మ లేకుండా సరస్వతిని ఉపాసించి సరస్వతిని మాత్రం పొందవచ్చు, విష్ణువు లేకుండా లక్ష్మిని ఉపాసించి లక్ష్మి‌ని మాత్రం పొందవచ్చు. కాని జగన్మాత విషయంలో మాత్రం అలాకాదు, ఆమె ఒక్కరేగా నిన్ను అనుగ్రహించదు.ఆమె అనుగ్రహం పొందాలంటే అర్ధనారీశ్వరులైన వారిరువురినీ కలిపి ఉపాసించవలసినదే. అంతేకాదు లోకంలో ఎవరైనా ఎప్పటికైనా విద్యావంతులు కావచ్చు,  లక్ష్మీవంతులు కావచ్చు కాని లలితా కటాక్షవంతులు కావటం మాత్రం పరమ దుర్లభం. ఎంతో కఠోరమైన "యమ నియమ ఆసన ప్రత్య ఆహార ధ్యాన ధారణ సమాధి" ఇత్యాది అష్టాంగ యోగ నిష్ఠాగరిష్టులై అనన్య భక్తితో ఉపాసించు వారికి తప్ప ఇతరులకు ఇది సాధ్యం కాదు. ఇహ లోకంలో సుఖములను ఉపకరించు ఈ విద్యా, ధనం పొందినంత సులభం కాదు పరలోకంలో ముక్తిని అనుగ్రహించు అమ్మ పాదాలు పొందుట అని కవి భావము.

జగన్మాత ఆయన ప్రేమఅనే మణిరత్నాన్ని మొత్తంగా తనదిగా చేసుకోవడానికి తన స్తన ద్వయమనే ప్రపిఫలాన్ని అచ్చం ఇచ్చేసిందనడానికి,  శ్రీలలితా సహస్రనామావళిలోని 33వ  నామ మంత్రాన్ని పరిశీలించుదాము: కామేశ్వరప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ పరమ పదాన్ని పొందడానికి భక్తి, జ్ఞానములు రెండూ కూడా కావాలని గూఢార్థము.

ఆ మహాతల్లి ఎంతటి పతివ్రత అంటే కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా (శ్రీలలితా సహస్ర నామావళి లోని 39వ నామ మంత్రము). పతివ్రతామతల్లులు తమ ముఖపద్మమును సహితం ఒరులకు  కనుపింపనీయరు. అటువంటిది కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్య మృదుత్వాలతోగూడిన ఉరుద్వయం గలిగిన మహాతల్లి జగన్మాత ఎంతటి పతివ్రతామతల్లి. శివశక్త్యైక్యము ఇక్కడ నిరూపితమౌతోందిగదా!

తన భర్త వలదు వలదని చెప్పినా వినక తన తండ్రి (దక్షుడు) నిర్వహించు దక్షయజ్ఞమునకు వెళ్ళగా, తాను (జగన్మాత) పిలవని పేరంటమునకు వచ్చినదనియు, అలా పంపించిన పరమేశ్వరుని (దక్షుడు) నానా దుర్భాషలాడగా, తన భర్త అవమానము తనదిగా భావించిన జగన్మాత, యజ్ఞకుండంలో తనువు చాలించి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నది.

సురాసురులు అమృతము కొరకై చేయు క్షీరసాగరమథనమందు లోకభయంకరమైన హాలాహలము ఉత్పన్నమైనవేళ, జీవకోటి హాహాకారములు చేస్తుండగా, లోకానికి వచ్చిన పెనుముప్పుకు తల్లడిల్లినది జగన్మాత. ఆ తల్లి ఆ పెనుముప్పును తప్పించలేకనా?  తన మాంగల్యసౌభాగ్యమును, తన పాతివ్రత్య మహనీయతను ఎంతగానో విశ్వసించినదిగా, అంతటి భయంకరమైన హాలాహలమును పరమేశ్వరునిచే సేవింపజేసింది. ఎందుకని? తన పాతివ్రత్యాన్ని, తన మాంగల్యబలాన్ని అందరికీ ఆదర్శంగా ఉండడంకోసం . ఇదే విషయాన్ని బమ్మెర పోతనామాత్యులవారు అమ్మవారి పాతివ్రత్యానికి అబ్బురపడిన ఈ పద్యరత్నములను ఒకసారి పరిశీలిద్దాము.

కంద పద్యము

మ్రింగెడి వాఁడు విభుం డని

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

తాత్పర్యం

ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

ఆ హాలాహలమును పరమ శివుడు గ్రోలినప్పుడు

మత్తేభ విక్రీడితము

కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు

ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;

వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ

బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.

తాత్పర్యము

మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.

అంతటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సదాశివపతివ్రతాయై నమః అని అనవలెను.

***

3. ఓం సంశయఘ్న్యై నమః

దేహము, ఇంద్రియాలే తాను అనే అజ్ఞానభావన అను హృదయగ్రంథి విడిపోయి, సాధకునికి తానే సచ్చిదానందరూపుడనే జ్ఞానమును అన్ని వర్ణముల (బ్రహ్మక్షత్రియవైశ్యశూద్ర యను వర్ణముల) వారికి ప్రసాదించు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సంశయఘ్నీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సంశయఘ్న్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి సంశయములన్నియు తీర్చి, సచ్చిదానంద స్వరూపుడునను జ్ఞానాన్ని ప్రసాదించును.

పరమాత్మస్వరూపిణి అయిన జగన్మాతను ఆరాధిస్తున్నాము. అనేక సంశయాలు ఉండడం సహజం.  

అజ్ఞానమను అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమనే జ్యోతిని వెలిగించు నతడు గురువు. మంత్రోపదేశం చేసి, దీక్ష ఇచ్చి, ఎలా సాధనచేయాలో తెలియజేయునతడు గురువు. సాధకునికి సంశయాలు ఉండడం సహజం గనుక సంశయాలకు సమాధానంచెప్పేది గురువు మాత్రమే.  అటువంటి గురుస్వరూపిణి కాబట్టి సంశయఘ్నీ యను నామము కలిగియున్నది.

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. గురుమూర్తిః (603వ నామ మంత్రము)  గురువుయొక్క రూపముగా ఉన్నది జగన్మాత. అందుచే సంశయఘ్నీ అను నామ మంత్రము కలిగియున్నది.

త్రిమూర్తిః (628వ నామ మంత్రము)  సత్త్వరజస్తమోగుణ ప్రకృతులకు అధిదేవతలైన త్రిమూర్తిస్వరూపిణి,  త్రిగుణాతీతమైన పరబ్రహ్మను సూచించే గురుస్వరూపిణి గనుక ఆ తల్లి భక్తుల సంశయములను తీర్చుతుంది. అందుచే అమ్మవారిని సంశయఘ్నీ అని స్తుతిస్తున్నాము.

దక్షిణామూర్తిరూపిణీ (725వ నామమంత్రము) వటవృక్షం క్రింద, దక్షిణాభిముఖంగా, పద్మాసనంలో, చిన్మయముద్రతో, తురీయస్థితిలో కూర్చుని త్రిమూర్తులకే గురువుగా ప్రసిద్ధికెక్కిన దక్షిణామూర్తి స్వరూపిణి అమ్మవారు. దక్షిణామూర్తి స్వరూపంలో జగన్మాత దర్శనం సర్వసంశయములను పోగొడుతుంది. గనుకనే జగన్మాత సంశయఘ్నీ యని నామ ప్రసిద్ధి చెందినది. శ్రీవిద్యాపరంపరలో సిద్ధౌఘమునందున్న సనకసనందనాదులచే ఆరాధింపబడిన గురుస్వరూపిణి గనక జగన్మాత సంశయఘ్నీ యని స్తుతింపబడుచున్నది.

 శివజ్ణానప్రదాయినీ (727వ నామ మంత్రము) జగన్మాత శివసంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదించు గురుస్వరూపిణి గనుక జగన్మాత సంశయఘ్నీ యను నామమునకు సార్థకత కలిగియున్నది. 

అజ్ఞానంతో ఈ దేహము, ఇంద్రియములు మాత్రమే తాను అనే భావన అయిన హృదయగ్రంథి విడిపోయి, సాధకుడు తానొక సచ్చిదానంద స్వరూపుడనను జ్ఞానంతో తనలోనున్న సంశయనాశనమునకు కారణమైన జగన్మాత సంశయఘ్నీ యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సంశయఘ్న్యై నమః అని అనవలెను.

***  

4. సుదీర్ఘ సాధన ఒక్కటే పరిష్కారం 

సుదీర్ఘ సాధన ఒక్కటే పరిష్కారం. ఈ కష్టాలు, సమస్యలు, బాధలు, సంస్కారాలు మరియు కోరికలను మన దగ్గర ఉన్న ఏ కవచం లేదా పరికరంతో ఎదుర్కోలేము. నిరంతర సాధన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ కోరికలతో మనం చేస్తున్న ఒక రకమైన సత్యాగ్రహం అని మనం చెప్పుకోవచ్చు. అవి కూడా అంతే శక్తివంతులు కాబట్టి మనం వాటిని నేరుగా యుద్ధంలో ఎదుర్కోలేము. కానీ, అవి మళ్లీ తలలు చూపించే అవకాశం లేదన్నంత పట్టుదలతో ఉంటాం. ఒక వ్యక్తి తన లక్ష్యం వైపు పయనిస్తున్నాడనే భావన సంవత్సరాలు సాధన తర్వాత ప్రారంభమవుతుంది-నెలల తర్వాత కాదు.

జ్ఞానేశ్వర మహారాజ్, జనకుడు వంటివారు పూర్వ జన్మలలో ఈ అభ్యాసం చేసి మరియు జీవితంలో చిన్న వయసు లోనే నైపుణ్యం మరియు విజయానికి సంబంధించిన సంకేతాలను చూపించిన ఆత్మస్థైర్యం కలవారు.  ఇతరులకు ఇది ఒక హింసలా కనిపిస్తుంది కానీ మన పంచకోశ శరీరాలను ప్రక్షాళన చేయడానికి ఇదే మార్గము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ - ఈ ఐదు కోశాలు కోరిక యొక్క అభివ్యక్తి యొక్క వివిధ సాంద్రతలు.

కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹

 5. 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 195 🌹

🍀. ఎవరి హృదయాలు అద్భుతంతో నాట్యం చేస్తాయో ఎవరి అస్తిత్వం సంభ్రమంతో సంచలిస్తుందో దేవుడు వాళ్ళకు సన్నిహితంగా వుంటాడు. అస్తిత్వం అలుపు లేనిది. అద్భుతం నిరంతరం కొనసాగుతుంది. రహస్యం కొనసాగుతుంది. 🍀

6.*. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు -  Ratha Saptami, Narmada *

*ప్రసాద్ భరద్వాజ*ప్రాంజలి ప్రభ..

*🌹🌻. రథసప్తమి - బీష్మాష్టమి విశిష్టత 🌻🌹*

*సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా*

*సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి*

*ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి.  సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించు వారును భారతీయులే.*

*సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,*

*అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.*

*మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,*

*కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.*

*మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.*

*రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయ వలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.*

7 *🌻. సూర్య స్తోత్రం 🌻*

*ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం*

*భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్*

*ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం*

*భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్*

*🌻. పాలు పొంగించే విధానం 🌻*

*సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.*

*ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం చేసుకోవాలి. ఈ పరమాన్నం  సూర్యునికి ఎంతో ప్రీతి.*

*🌹.బీష్మాష్టమి విశిష్టత 🌹*

*ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.*

*భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజ అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.*

*🍀. భీష్మ అష్టమి తర్పణ శ్లోకం 🍀*

*వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |*

*గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే  ౧*

*భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |*

*ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్  ౨*

*వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ |*

*అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే  ౩*

*భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం*

🌹 🌹 🌹 🌹 🌹





No comments:

Post a Comment