Sunday 12 February 2023

PRANJALI PRABHA ఉషోదయ కవిత్వం 🌹



ఇహపరసుఖమే, వలపుల తలపే, మధురిమ పదసేవకే

సహనపు మదిలో, మెరపుల వలపే, వరునికి రజనీ కరే

అహమిది తిలకం, లిఖితము విధిగా, మరువని నయ విందులే

మహిమని మదనే, సుమధుర వదనే, పెదవుల సుఖ మాయలే

........

అనుకరణ మదీ, కులుకుల సొగసే, వినయపు ధరహాసమై 

అణుకువ హృదయం, థలుకుల మెరుపే, మదనపు విధి వాంచలై 

చినుకులు తడిపే, హృదయపు పొగరే, చితికియు మరబొమ్మ వై

వణుకులు మటు, మాయమగు సమరమే, జరిగియు మదనమ్ముయే 

.........

పలుకుల మయమై, పదనిస పరమై, పరువపు చెలి బంధమై

థలుకుల మెరుపై, థకదిమి వరుసై, సమయపు మది మిత్రమై

కులుకులు కథలై, సహనపు కలువై, కనికర మగు శాంతమై

అలకలు మెదిలే, అదనపు సుఖమై, అలసట కళ గంధమే 

..........

నేటి కవితా ప్రక్రియ -- పాఠము -- 


 విశ్వాసం ఉంటె చాలు - మనసు అర్ధమవటానికి

నమ్మకం ఉంటే చాలు - రహస్యం తెల్పటానికి

సహనమ్ము ఉంటే చాలు - ఆశయం బ్రతకటానికి 

ఆశలు లేకుంటె చాలు - గుండె వికసించటానికి - 


మోక్కలు నాటితే చాలు - పుడమి పులకించటానికి

మలయమారుతమ్ము చాలు - జీవిగా బతకటానికి

మంచి పలకరింపు చాలు - మనిషి గుర్తించటానికి

ఎడారిలొ నీరు చాలు  - నరకం తప్పించటానికి


నీలొ త్యాగ బుద్ధి చాలు - నలుగురు మెచ్చటానికి 

నీలొ ధర్మగుణం చాలు - నలుగురు బత్కటానికి 

సమాజమ్ము  బాగు చాలు - మానవత్త్వ నిలయానికి   

శ్రమతొ విద్య ఉంటె చాలు - లెక్క గౌరవ సంపదకి 


ఒక్క చూపు చూపు చాలు  - మాయను చేర టానికి  

ఒక్క పలుకు పల్కు చాలు - జీవితమ్ము మార డానికి

స్త్రీల నీలి చిత్రాలు చాలు  - మనిషి చెడి పోవటానికి

మనిషి కి మాదక ద్రవ్యాలు - మరణం సృష్టించటానికి 

  

స్త్రీ కి  మాంగల్య కట్టు బొట్టు చాలు - దుష్టులను మార్చటానికి 

స్త్రీల నిస్వార్థం చూపులు చాలు  - స్వార్ధం బయటబడటానికి 

కర్షక కార్మిక స్వేదం చాలు  - మానవుల ను బ్రతి కించ టానికి   

ప్రేమ మమత సమత ఉంటె జాలు - జీవితం సుఖమవ్వటానికి  


***ప్రాంజలి ప్రభ ఛందస్సు పాఠము : UIU IIUIIUU - UIU IIUIIUU

*****


నిత్యమూ సుమ నాదము యేగా - నిండగా విధి వేదము యేగా  

తత్వమూ సుఖ ధామము యేగా - ధన్యతా విధి సేవలు యేగా  

సత్యమూ నిజ సాహస మేగా   -  సాధనా విధి నైజము యేగా  

పైత్యమూ ఇక పైకము యేగా - మైకమూ  విధి దాహము యేగా  


ధ్యానమే సుఖదా వరదానమ్ - తత్వమే విధిగా సుఖదానమ్   

మౌనమే సుఖమార్గ పయనమ్ - మోక్షమే విధి నిత్య పయనమ్  

దానమే నిజధర్మ వినయమ్ - మానమే విధి కర్మ వినయమ్  

గానమే జతగమ్య  తరుణమ్ -  ప్రాణమే విధి మర్మ తరుణమ్  


కాలమై  మన ఊహల ప్రేమే - గాలమై మన ఆశల దాహమ్ 

మూలమై మన కూడిక దేహమ్ - జ్వాలయై మన దేహపు ధైర్యమ్ 

***
కంద పద్య మాల 

నగలే నాగులు కలిగే
నగలే పుర్రెలు కలిగియు జ్ణానపు నేత్రా 
నగలే పార్వతి ధరించె  
నగధర హృదయమ్ముపూజ నమ్మక దైవమ్

వెన్నెలలో కధ కదిలే
తన్మాయచిగురు మనోబలముగా స్వేచ్ఛే
కన్నప్రేములు కళలై
మన్నన చూపుట సహనము మనసున సాగే

శుభకృత్ శుభమాయేలే
అభయం అమృతం కురిసిన అర్ధం పొందే
ఉభయసభలు గాను తెలుగై
ప్రభలై జయహో జయప్రద మగుట శోభా 

కోయిల కూతే మారదు
హాయిని కోరేవారి బుధ్ధి అర్తిగ మారే
రేయిన శుభకృత్ కలలులె
కోయిలగీతం యుగాది కానుక శుభమై 

చీకటి పిడికిళ్లు కధే
వాకిటిలేనిదియు జీవి వరుసే మారే
తాకిన తొలగని తపనే
మకిలం కృంగియు కృశించి మనసే కాదా

తనువేతాపమ్ముగనే
కణములు ఉడికే ను బిగువున కదలిక వల్లెన్
మానసికంగా బుధ్ధియె
 చినుకులు గానే తడిపి యు చెంతకు చేరెన్

వేదికపై కళ కాలము
వేదన సుఖమే కదలిక మరచియు సాగున్
మోదముచెందియు వేడుక
ఆదమరచి యే సుఖాల విందును పొందే

వత్తిడెపుడు పనిలోననె
చిత్తము చొప్పున కరిగియె చిత్తుగ మారున్
మత్తుకు చిక్కియు లొంగియు
వత్తుకు దాహమ్మె తృప్తి వదలక ఉండెన్

గంగన ముంచియు తేల్చెద
రోగము శాంతము కదలిక ఋణమే కాదా 
యోగపు సిద్ధిని పొందుట
ఆగమనం కదులు టేగ ఆశ్రిత మే గా

0
తే::ఉరవడిని ఆప లేరులే ఉరుకు ఉరుకు
మనసు లో స్పందనలు మాయ మాయ
హృదయ కళలన్ని కరుగక హలము లయలు
చిరుత పరుగులా చరితము చలము చలము
......
తే::చిమ్మ చీకటి నా చేతి దీప మగుట
తరువు కౄరదృష్టిగలగి తపన యగుట 
బ్రహ్మ రాక్షసిలా భయ బంధమగుట 
పదముల ధ్వనే హృదయమ్ము ప్రేమలోన
.....
తే:: చెయ్య వలసిన పని యున్న చేయి రాక   
నిద్ర నటన యేల కలుగు నింద పడగ,
శాంతి యేల కలుగ నేల శవము బతుకు  
బోధ పడెన నీకు ఇపుడు బోధ నీశ
.....
కం. ఏ కమగు న్యాయము యే  
రాకలు పోకలు జరుగుట రక్షణ యగుటన్
వాకిటి సౌఖ్యము కడుగున్
ఏకులు మేకులు యగుటయు యెల్లఁరు చూచున్
 .....     

కం. శ్రీకనకదుకూలధరాం ,
రాకేందువదనాం  , మురారిమనోజ్ఞామ్..
రాకేందుభగినీం , శ్రియం ,
మహాలక్ష్మీం  అర్చయామ్యహమ్  !!! "
----
84.  మాత్రా బద్దము (1)
IIU IIUII UI
నేటి కవిత - లోకంలో పోట్లు -పాట్లు

మనిషీ అనురాగము జోలు  - మతిలేకయు చిక్కిన పట్లు
కలమాయను రోగము జోలు - గతిలేకయు చిక్కిన పట్లు
కుల మంతయు గోలను చేసి - కను మాయకు చిక్కుట కెట్లు
విధి బోధయు అంతయు తెల్పి  - తనువంతయు చిక్కుట కెట్లు

మది మాయను వేలము వేసి  -  మది తప్పియు  శీలముతూట్లు
విధి లేకయు  గాలము వేసి -   కల కాలము రోగము పోట్లు
చిరు దీపము చీకటి చీల్చె  - చిరు నవ్వులు మాయకు తూట్లు
శిఖ పింఛము అందము పెంచె - శిఖ పట్టులు తన్నుల పోట్లు

గురు సేవయు చేసిన మంచి  - గురు పాదము పట్టిన పాట్లు 
గురు పత్నిని కోరిన తప్పు  -  గురు పత్నిని తిట్టిన పోట్లు 
సమభావము పెంచిన మంచి - సమ యోచన తెల్పినపట్లు
సమరాగము  పల్కిన మంచి  -   సమ సేవలు చేసిన పట్లు

గిరిగీచుక కూర్చొనఁ బోకు - - సరి లేరని నాకెవరెట్లు
మరి యాదగ నుండుట మేలు -  ధరనెచ్చట నున్నను పాట్లు

--(())--
హృదయ చేష్టలు.. తేటగీత మాల 

మొయిలునైతేను మిన్నుసమోన్న తయగు
హొయిలు నీవైన తేలించ హాయి గొలుపు 
కోయి లైతేన చందుని కళలు చూపు
చేయి చేయి తో మురిపించ చేష్టలవియు 
......
దిగులుమబ్బులు కమ్ముతూ సెగలు ఏల 
మిగులు జీవుడి ముగియడం మేల ఏల
వగలు నాటక ప్రళయమే వ్యాధి ఏల
మగువ అవధులు దాటితే మనసు ఏల
......
హృదయమంత చీకటి గను హద్దు ఏల
పొదల మాటుసరశ మైన పోరు ఏల
అదును లేని దై వినయము ఆశ ఏల 
యదను సామరశ్యముగాను ఏల మాయ 
......
దివ్వెనైతేను వత్తిగా దీన బతుకు
నవ్వె రానీక బంధమై నటన బతుకు
కొవ్వె కరగక పొందు చకోరి లేక
అవ్వె ఏమిచేయక గతి ఆట యనుచు
......
పుడమినైతివి మెప్పించ పురుడు కోరి 
పడక లోన భేదము చూపు పగటి కలలు 
నడక మార్చుమనియు పోరు నాటకమ్ము
కడలి పొంగులో కలియుటే కాల మాయ 
......
ఆశవిత్తులు జల్లుతూ ఆత్మ శిక్ష
పాశ మని బంధ తొత్తువు పాట పాడు
త్రాసు లాగ కదలి చుండు తాప మేల
కాసు కోరి కర్కశబుద్ధి కాల మాయ
.....
పైరునైతివి  పండించ పగల సెగలు
వైప రీత్యమనుచు బాధ పైరు మల్లె
సైర సైరాయనుచు పోరు కైపు చాపు
ధైర్య మున్నాను భక్తిగా దీన చూపు 
......
వేరునీవుగా ఎదిగించ వినయ చూపు
చూరు పట్టి లాగియు చేష్ట  చూడు బుద్ధి
మారు మాటనీయక బుద్ధి మంత నాలు
చేరువైన చేష్ట కదలి చింత చేయు 
......
 నీడ భంగపాటుల నుంచి నిమ్న గతిగ
రాత్రి అంధకారము బంధు రంగ మేను
యాత్రిక గ్రుడ్డి వాణ్నిగా ఏల నీడ  
ఇచ్చి నడిపించకే వెళ్ళు ఇష్ట మేల
.......
నిస్పృహయె నన్ను విముఖుణ్ణి  చేయు కలలు
 కాంతి రహితమై శోకదీపానికి యగు
జ్ఞాన జవస త్వాలను తాకి జ్ఞప్తి మారె
ప్రాంజలి ఘటించి తెలిపెద ప్రభల లీల 
........
అలసి సొలసినది సుషుప్తశక్తినీడ
జాగృతం కాక నష్టాన్ని జాగ జగతి 
మందిరాన్ని గురించియె మనసు తాకు
అడుగడుక్కీ నటన కీర్తి  రాత్రి పగలు
........
అంధకారమయంగాను ఉండి నాను
 అందుచే, నీవు చేయూత అక్కరగుట
ఇచ్చి, నడిపించుకునె వెళ్ళు ఇష్ట మేది 
బ్రతుకు వేటలో నిజముయే భయము తెచ్చె 

మనసులొక్కటె మనమని మధన పెట్టు
తనువు తనువు రాపిడి యని తలను పట్టు
చినుకు చెమట కారాలిగా చింత గుట్టు
వణుకు పుట్టినా ఆపక వడిసి పట్టు 
.....
మేనునైతేను ఉసురునీవైన బతుకు
మాను నేనుగా బతుకుటే మాత్ర యగుట
తాను గా కత్తెర యగుట తంతు చితుకు
పానుగా నోటికి దక్కియు పడక నీడ 
......
కలియుగంలోమి ట్టాడుతూ కలసి మెలసి
చలిగిలి పులికి చిక్కియు చలనమాయె
ఆలి ఏలిక గమనించి అడుగు వేయు
గాలిలా కలసియు నుండు గళము ఇదియు
........

నేటి పాఠము ప్రాంజై ప్రభ ...అంత్యాను ప్రాస కవితా 

పెదవి పలుకు స్పటికము సుఖముకొరకు వెలుగవుటయు  
పిత్తపు మాటలే అధికుల బ్రతుకు ఆటలగుటయు 
పెత్తనమే పరిహాస పురులాయె విధియనుటయు 
పొద్దు పొడు ప్రాణ భయ మాయే దీన బ్రతుకఁగుటయు  
.....
కంట నీరు వెల్లువాయె కాటికి కథ చేరుటయు  
కంఠ శోష అధికమాయె కనికరమే బ్రతుకాయు  
కలత నిదుర భారమాయె కనుదోయి జల్లు లవియు 
వలలాయే కాపురమె కడలిలోని అలలగుటయు 
.....
ఉట్టికూడు ఊటమట్టి లోనఆశ పూవనియు 
ఊట బావి గట్టి నమ్మ కపునీరుగ సాగనియు  
ఉషోదయము నిత్యా నవపూజ నవోదయమనియు 
ఉరుములతో జల్లులేను ఉనికిగను జీవమనియు 
.....
ఆకాశా నక్షత్రాలె త్రోవ రేఖలనియు 
ఆశ దీక్ష రూపమె పక్ష పరోక్షదీపమనియు 
జగతి గాలి జల మాలలే జీవన ధారలనియు 
జెముడు కళల ముళ్ళే జీవితాలే బాధలనియు 
.....
తరుల కడుపు కోత తల్లుల భాధలు గాధలనియు 
తుప్పల పల్లేరులె జీవితాల పరీక్షలనియు 
కొండరాబండలే కోరికలే గట్టుశిఖలనియు 
కోతకుప్పల సిరులేను పుత్ర పుత్రి రూపనియు 
......
జీవమేను జగతి చంద్రికల నిత్య ఆటలనియు 
జగమే నిత్యసత్య యోగ మాయల సత్యపు గననియు 
...
మీ విధేయుడు మల్లాప్రగడ  రామకృష్ణ
*అక్షరాల ఉషోదయ చూపుల కళయిక ముఖ పుస్తకమిది మీ చూపులతో ఒక్కసారి నన్ను చదవ గలరా?

తే. అడుగడుగునా నిఘా ఇది అలక చూపు
అవును అయినా ఇదియు దగా ఆత్ర చూపు
మది మధించెడి మదనపు మంత్ర చూపు
మానసమ్ము అర్పణ చేయు మోహ చూపు
.......
*తే.నిన్ను స్పష్టంగ గమనించు నిజము చూపు
పరమ పదమును పొందెడి ప్రతిభ చూపు
ప్రకృతి పురుషవివేకము ప్రగతి చూపు
ఇంద్రియాలు అర్పణ చేయు ఇష్ట చూపు
......
*తే. నాన్యమైన యంత్రమ్ము గా శబ్ద చూపు
నిండు కుండ కదిలిక గా నిద్ర చూపు
స్వచ్ఛతనుపోంద దివ్యత్వ స్వేచ్ఛ చూపు
ఆత్మ స్వచ్ఛత ఆశయం ఆట చూపు
.......
*తే. పాఠశాలలు నేర్పని పాట చూపు
భౌతికాకర్షిత కలిగే బౌమ్య చూపు
కోరుకొనెడి పొందు పిలుపు బోధ చూపు
ప్రాధమిక పరి పూర్ణత ప్రభల చూపు
.........
*తే.మాట పొదుపుగా పలికెడి మనసు చూపు
యోగ సాధన పరిపక్వ యోగ్య చూపు
బ్రహ్మ తేజస్సు తో శక్తి భక్తి చూపు
బ్రాంతిని తొలగించే సెడి ప్రేమ చూపు
.........
*తే. మౌన నిశ్శబ్ద మంత్రాల మర్మ చూపు
గొంతు మౌనమై మనసుతో కోరు చూపు
మనసు మౌనమై హృదయంతొ మాయ చూపు
హృదయ అంతరాత్మ పిలుపు శబ్ద చూపు
.......
*తే.అల తరంగాల సుడిగుండ ఆశ చూపు
కెరట పరుగులా కళయిక కలల చూపు
వరద పొంగులా ముంచేటి వాలు చూపు
ఇకను వేవిళ్ళు తెప్పించు ఇష్ట చూపు
.......
*తే.మాట కోటకూల్చెడి బాణ మౌన చూపు
మనిషికి మననం నేర్పెడి ముందు చూపు
అందలేని లోతుల జ్ఞాన ఆశ చూపు
మగత మదనమ్ము రేపేటి మధుర చూపు
.......
ఎల్లలు అడగని మురికి ఎఱ్ఱ చాపు
నిలకడ తెలపక కదిలే ఎఱ్ఱ చాపు
మనసున మరోచరిత్రగా ఎఱ్ఱ చూపు
బాలు సరిత విషాదపు ఎఱ్ఱ చాపు
..........
చూపులు కలసిన శుభాల ఊపు చూపు
చినుకుల మెరుపు మనసున చేష్ట చూపు
రత్న వెలుగుల రవ్వల రాశి చూపు
వినయ వాంఛలు తీర్చేటి వింత చూపు
.........
ఎంత చెప్పినా తక్కువే యదల చూపు
అక్షరాల పొందిక నేస్త ఆట చూపు
చదువు ప్రేమ కలగలుపు చరిత చూపు
నిత్య ఆనంద ఆత్మీయ నిజము చూపు
.........
*తే. ఓర చూపుల ఓర్పుకు ఓపి కేది
వణుకు తోను వయ్యారియే వాలు చూపు
వద్దని వలపు కలిగించు వరద చూపు
కిలకిలా నవ్వు కీర్వాన్ని కీల చూపు
.......

.....
*తే. మనసు సకలమై సుఖసేవ మంగళమగు 
యవరు యని యంచకే మది యాట యదియు 
బ్రతుకు భవ రోగ హితము కోరి బంధ సుబ్ర
హ్మణ్య మంత్రరాజము నాకు హాయి గొలుపు
.......
* తే. రాజకీయ అదును చూడు రాజ్య మేల
ఉచిత దారదత్తత మని ఊరు మారు
ఓటు ధనము చుట్టు తిరుగు ఓర్పు లేక
కోర్కె తీర్చ బిక్ష ముగను గొప్ప చెప్ప
......
*తే.నేల నీదని చులకన గీత మొద్దు
నేల కొరిగిన జీవితం గీత మౌను
త్యాగ గుణము సహనమేను దారి తెలుపు
నింగి నేల మధ్య బ్రతుకు నీది కాదు
......
*తే. ఒంపు సోంపుల వనజాక్షి ఒప్పు కొనక
వాలు చూపు వల విసిరే వాకిటయని
బిగువు కుచ కుంభలా రాట బేల చూపు
వయసు పొంగు పోరాటమే వెళ్ళు వాయె
....
*ఆ. మేత కొలువు తట్టె మేలుకొలుపు యిది
మెరుపు కాంతి వలయ మౌన బంతి
మెచ్చు కొనును మదిని మేళతాళముగను
ప్రాంజలి కళ ప్రకృతి ప్రభల తీరు
.......
తే. గండు తుమ్మెద గంతులు గడబిడయగు
ఉండ బట్టలేని మనసు ఉరక లేయ
బేల బ్రతుకు ఊయల యగు బిడియ పడక
మృధు మధుర రసమును జుర్ర ముంగిటయగు
......
*తే.చేయ గలిగిన సాయమే చింత మాపు
స్థిరము శాంతి ఆనందము స్థితి గతి మతి
వినయ ఉపకారము విధిగా విజయ మిచ్చు
విశ్వ విశ్వాస బంధము చెలిమి తృప్తి
......

తృణ కంకణం 

*తే.విరహ జలిత మనస్సుయే విభవ చనగ
తపము సలప రింత కడకు అడవి వలెను 
జత కలియు జప రగిలె జయము కుదురు 
మనసు కుదుటగా సుదతియే మరుడు ఒసగె 
........
*. తే.కటిక తిమిరమ్ము తొలగెను కామ్య దివిన 
సురభి వలెను ఇలకువచ్చి సుఖము తివిగ
వెలుగు నొసగి సుర కుడిపి వెతలు  మరచె 
బతుకు వరము నొసగ నిత్య భక్తి వెలుగు 
.......
*తే.పనస తొనల పెదవు లవి పలక రింప 
చిలికి పదిలమ్ము కుసుమాలు చెలియ కళ్ళు 
మరులు గొలుపు మధుపములు మతులు చెదర 
విరుల సుధల తపన వింత తొలగ 
......
*తే.వయసు మదపు మెరుపులన్ని వలపు జిలుకు 
మొదవు రసము లిడువ గాను పొదుగు లనగ
చెలిమి  పెదవి పరవ శమ్ము చేష్ట సఖుని 
తరుణి చెంప అనుగు లగు ప్రియము లొలుక 
.......
*తే.కనులు చెదరు సొగసు పంచి సిరుల నొసగి
మనసు తెలిసి నిలిచి తెల్పు మదిన సఖియ 
దరిని తెలిపి కరములన్ని కలిపి నడిపె 
విజయ మరయ సరసమేను నిలువు జయము
.......
*తే. నీది నాదికాదు ప్రకృతి నీడ ఇదియు 
ఏది సుఖము కష్ట మనేది ఏల తెలియు
బ్రతుకున భవిష్యత్తు తెలియ బాధ ఏల
చిరునగవు తోను పలుకుయే చింత తొలగు
......
*తే. వ్యక్తి రూపమ్ము మనసుగా వ్యక్త మవుట
శబ్ద రూపమ్ము వేదాలు చరిత తెలుపు
జలము తీర్ధమై జనులకు సేవ సలుపు
ప్రథ్వి నందు క్షే త్రాలు ప్ర సన్నత గను
........
*తే.గడచి పోయిన రోజులు గళము వల్ల
ఫలిత మేమిలేదు అయినా ప్రజల బ్రతుకు
ప్రేమ కధ జ్ఞాపకాలు గా ప్రీతి కలిగి
అడుగులు కదల వచ్చును అందరి కథ
........
* తే.ఏటి గలగలా శబ్దమ్ము ఎగిరి తాకు
ఆకు కదలిక శబ్దమ్ము అదిరి తాకు
నిదుర పోతుంటేను గురక తాకు
చిలిపి పరుగుల శబ్దమ్ము చెలిమి తాకు
.......

*తే. దివ్య జీవనమున సాగె, ధైర్య పంచ 
చేరె, అంతరాన్నకధలు, ఆట పెట్టె   
స్పృహ దర్శనం పడవలో, సాగు చుండె 
సమత నేత సుచిత్రగా, సవ్య చెలిమి
........
*తే.తప్పు ఏముందని తెగింపు తపన రాణి
కట్టు బట్ట అందము చూపె కనుల బోణి
అంగ సౌష్టమదృష్టము అందు కొనెడి
మగమహారాజు చూపులు మనసు చెరచు
.........
*తే.కళ్ళ లోనకైపు కరుణ కాల మాయ
కథలు చెప్ప కదులు టేల కామ్య భావ
స్తన్య కదలిక ఉర్రూత సహజమైన
మగువ మాయలన్ని బ్రతుకు మానసమ్ము
.......
*తే. స్వేచ్ఛ ఉదయించి నప్పుడే సమసి పోక
జీవ గమన ఉపాధియే కీలక మగు
జ్ఞానుడని శృతులు పలికె జ్ఞప్తి తెలుప
కాల నిర్ణయమ్ము కదుల కళ్ళు కలిపి
........
*తే::ఏది ఆగదు ఎందుకొ ఎదను తాకు           
ఘడియ ఘడియకదులుతుంది గంట కొట్టి 
తెలుసు కొనులోపు నయనాలు తేలిపోవు 
చూడ సమయము దాటింది పూట మలుపు      
.....
*తే: దక్కనిది తల పే మాది దారి లేక  
బాధ పడడమె తెలియక బంధ కేక
మనిషి మరవకుండు కధలు మాయ చిక్కి 
కాల నిర్ణయవ్యసనమె కాటి మలుపు 
......
*తే. ఏమి గణపయ్య ఈ బాధ ఏల చెప్ప
మనసు తప్పొప్పులను చెప్ప మార్గ మేది
వయసు ఉడుకుయే తప్పుగా వలపు నివ్వ
బ్రతుకు వేటనా మదిలోన భాద్యత గతి
........
*తే. నుదుటికి తిలకం అందమే చురుకు తెచ్చు
కురులకు కుసుమం అందమే కులుకు లిచ్చు
వెలుగుకు ఉదయం అందమే విలువ లిచ్చు
చెలిమికి హృదయం అందమే శుభము నిచ్చు 
........
* తే. రవి వెలుగులు చిమ్మి హృదయ రమ్య తపన
నిత్యము రసజ్ఞత కలిగి నిజము తెలప
శృతుల కళయిక కొరకనే శృతిలయళగు
అందచందాల ఆధరాల అంద పుచ్చ
........
* తే. బాహ్యమైన ఇంద్రియ సుఖ బంధ మివ్వ
అనుకరణ మమకారమే ఆశ పెంచ
ఆత్మ యందు దివ్వె వెలుగు అధర మాయె
అంతులేని ఆనందము ఆట బ్రతుకు
........
*తే. కళ్ళు కళ్ళు కలయుటే కావ్య జగతి
కళ్ళ తీర్పుల సుఖమునే కలత తీర్చు
కళ్ళ మెరుపు కళలు వల్ల కార్య శోభ
కళ్ళ రెప్పల కదలిక కామ్య మగుట
........
*తే.రాజ్య అంగము ఉత్తమం రవ్వ వెలుగు
భోజ్య మంత్రుల కాంక్షలు కోరుచున్న
ధర్మ మే నిదురకు దారి ధరణి యందు
జనుల ఘోషల రక్షక భట గళము భరత
.......
తే. గాలికి పెరిగే మొక్కలు కాల మేది?
యువత మెచ్చేటి వ్యామోహ యునికి ఏది?
హద్దుల ఎరగని మనసు గళము ఏది?
ఈ మతోన్మాద మనుషుల ఇష్ట మేది?
.........
*తే. తరగి పోతున్న జీవితం కలల మల్లె
ఆగనిసమయం వెతుకుటే ఆశ మల్లె
మిత్రుల మనసు అర్ధమే మేలు మల్లె
జంట సుఖముయే కొన్నాళ్ళు జపము మల్లె
........
*తే. కుంభకోణాల కవితలు కూలి పోయె
మత్తు మందు బానిస ఖర్చు మార బోదు
రాజకీయ యెత్తుగడయే రాజ్య మాయె
జనులు జండాలు మార్చినా జయము ఆట
..........
*తే. ఆర్ధిక బలము సంబంధ కాల మేను
అవసరాల కోసం వేష ఆశ యేను
సంతసం ప్రేమ మధ్యనే సమయ మేను
జీవనసమరం మనిషికి గీత గాను
.........
 *తే.జ్ఞాన వైరాగ్య సిద్ధికి జపము మూల
మగుట, అజ్ఞానమే పోయి మంచి జరుగ
జన్మ కర్మ బంధము లను శాంత పరచి
తల్లి తండ్రి గురువు సేవ తృప్తి నిచ్చు
.......
*తే.మాకు అగ్ని దేవుడు తేజ మీయు గాక
మాకు ఇంద్రుడు ఇంద్రియ మీయు గాక
మాకు సూర్యడు ఆరోగ్య మీయు గాక
మాకు మారుతి ధైర్యమ్ము మివ్వు గాక
......
*తే. దాహ మాకలి బలమగు ధరణి యందు
సూర్య చంద్రులు సంచార సూత్ర పరులు
యవ్వనం ధనం అతిధులు ఏళ్ళ వేళ
భూమి వృక్షము సహనమ్ము భుక్తి నిచ్చు
.......
*తే. తరగి పోతున్న జీవితం కలల మల్లె
ఆగనిసమయం వెతుకుటే ఆశ మల్లె
మిత్రుల మనసు అర్ధమే మేలు మల్లె
జంట సుఖముయే కొన్నాళ్ళు జపము మల్లె
........
ప్రాంజలి ప్రభ ...ఉషోదయ పద్యాలు    24 --02 -2023
తే:: కలత యే హలం కఱ్ఱుకు కాళ్ళు ఇరిగి  
నలత యే కలం కఱ్ఱుకు నడక నలిగి  
కొలత యే బలం కఱ్ఱుకు ముడత కలిగి 
చలన మే గళం  కఱ్ఱుకు చరిత ఎరిగి
......
తే:: జీవిత నట ఘట మకుట జీవ యాత్ర
జ్ఞాప కాల నృత్య జగతి జాతి మాది  
గజ్జెల గలగల సరళం గమక మగుట 
తరుణి నాద జక్కు పదాల తపన కళలు
......
తే:: చిలిపి పరదాల కదలిక చలము ఏల 
తలపు తగువేల వయసున తాపమేల  
వలపు వయ్యారాల కళలు వాపు ఏల   
మలుపు మందార మనసులో మాయ ఏల 
.......
తే:: కనులు మూస్తే ను కదలిక కాలమవదు   
కనులు ను తెరిచె ప్రాణము కదలికయగు  
రెప్పపాటుకాలంలోన రెపరెపరెప 
సాధ్య కృపయు అసాధ్యము సాక్షి అమ్మ  
....
చింత లేని ప్రభుత్వము చిత్రమిది యు
దగ్గ లేక కక్క నులేక ధరణి దూత
ఈ గతి అరణ్య రోదన ఈప్సి తమ్ము
ఆంధ్ర చదువుల అర్ధము ఆట యగుట
..........
తే. విత్తు మరణించి మొక్కగా విస్తరించు
నేను మాయమైతేను మనసుకు శాంతి
రాయి చెక్కిన దైవమై రత్న వెలుగు
స్వార్ధ మొదళి నిస్వార్ధము సమయ తృప్తి
.........
తే. నీరు లేకయు ఎండిన నీడ చెట్టు
పట్టువీడని ప్రార్ధన పగలు రాత్రి
గాలి నాశించి మేఘము గమన మగుట
వర్ష భావము కొరకునే వగచి యుండె
.........
తే. గగనము జగములు గడగడ వనికేను
వగసిన మనసు కకవిక వరద పొంగు
చిగురు తొడిమలు చితికెను చింత కలిగి
మగువ తెగువ మనుగడయు మచ్చ తొలచె
........
తే.తీరనివ్యధ అనుటేల తేరుకొనియు
తప్పు తెలిసికొనిన జీవి తృప్తి వెతక
ధైర్య వచనాలు చెలిమిగా దైవ పూజ
నిగ్రహము నుంచి బ్రతుకులో నిజము పలుకు
.........
తే. మనసు రూపమ్ము లేదులే మనుగడ కళ
గాలి రూపమ్ము లేదులే గమన జీవి
వెలిగుకు స్థితి గతి లేదు వెన్నెలగుట
మనిషి గుణము అహముచుట్టు మాయ తెలుపు 
........
తే. పసుల వన్నె వేరును వర్ణ పాలు తెలుపు
పూల రంగులు పరిమళం పూజ యొకటి
దర్శనంబు వేరు మనసు దైవ మొకటి
ప్రేమ అంతరమున నుండు ప్రియము కాదు
.........
తే. ఉన్న భయముతోను అబద్ద ముగను బుద్ధి
ఉన్న నిజములో  ధైర్యము ఉడుకు తోడు
ఉన్న తప్పుడు ఆనంద హృదయ లీల
ఉన్న గౌరవమ్ము నిజము డుపు ఇదియు
.........
తే. పలికి బొంకిన పదవికి పనికి రాడు
అల్ప బుద్ధితో అధికుడు అవని చేటు
బ్రతక నేర్చిన మనిషియే బాధ పెట్టు
బుద్దిగల అవిటియు మేలు భూమి తృప్తి
.........
తే:: నాది నాదనే వాదన నాంది పలుకు   
ఏది నీదనే మనసులే ఏది చిలుకు 
వాది చెలగాట పలుకులే వలపు కులుకు   
నాది నటనయే ఆయిననుఁ నడక వణుకు   
........




* హరిగతి రగడ..ప్రాస,అంత్యప్రాస, పాదములు రెండు 8చతుర్మాత్ర గణాలు

సకలము నిత్యము కోరును నీడను 
వికసిత కష్టము ఇప్పుడు తగ్గెను
మకుటము కోరుట మధ్యన మల్లెను 
మక్కువ వల్లనె మనసును కోరెను
ఆకలికి కలలు కనడం జరుగును
వాకిలి తలుపులు తెరిచే పిలిచెను
చాకిరి నంతయు తప్పక మారును
వెకిలిగ వేషము నీకును ఏలను
.....
*బానల నీరును పెట్టే
మానస యత్నము యె జూపి మాత్రలు జల్లెన్
చేనుయు యేపుగ పెర్గెన్
వానలు రాకున్న గాని పంటలు పండున్
.......

తేటగీతి
*గుండె రాయి గా మారినా గుర్తు ఉంది 
బండ బ్రతుకునే మార్చితీ భద్రముగనె
మోండి వానిసైతము మార్చి మోక్ష మిచ్చె
కొండ గట్టు మూర్తి హనుమా కొలతు నిన్ను
.......
*నవ వసంతము నవ్య వనరమ మామి
కొమ్మ ఆకులచివురులు కోరికోరి
పాటపాడెడి పరబృతం పగలు రాత్రి
ఎవ్వరాపుదురో ఇక ఏమి ఎరుక
........
*పచ్చి మిర్చి తినాలి లే పగ వలదులె
దుఃఖ సాగరం ఈ దాలి దురద కాదు
మనసు మైదాన మగుటలే మచ్చ కాదు
మోక్క మొలిచింది కలకలే మోక్ష మవదు
......
*కష్ట మున సుఖం తృప్తి యే కానుకవట
ఇష్ట మున సుఖం స్వర్గం మే ఈప్సి తమ్మె
నష్ట మున సుఖం మార్పు కే నటన కాదు
అష్టమి నవమి కష్టాలే అనుట కలలు
......
*గాలి చొరబడని కిటికీ గండ మగుటె
జాలి చూపని తాళము జపము నగుటె
తలుపు లను తీయని పడతి తెగువ నగుటె
ఊరు వళ్లకాడను మాట ఊపిరగుటె
.....
*జలజలా రాల్చు కన్నీరు జాతి కొరకు
స్త్రీ గను విముక్తి పన్నీరు శీతలముయె
నువ్వు నవ్వతూ బ్రతుకటే నాన్య తవ్వె
ధనము కన్నీరు ప్రేమకే ధరణి పలుకు
.......
*చలమ నుంచే జలముబికే జలకళకళ
స్వచ్ఛ తనుకోరు గుణము యే సకలముకళ
వెన్ను తట్టి చూపు కధలు విజయపు కళ
మన్ను తిన్న పాల బతుకు మనసు న కళ
......
*కవన మని మురవకు లే కలల మల్లె
నవవిధాల కధల కావ్య నాట్య చరిత
విధిన వెలువడే మనసుయే వేకు వగుటె
పదుగురు స్పందనలు మార్పు పలక రింపు
నిత్య జీవితంలో ప్రధాని యగుకవియె
....
*ఓర్పు గనె భూషణమ్ము నే ఒడిసి పట్టి
దుర్జన గుణము మార్పుకె దునియ నందు
బీడు భూమిన అగ్ని యే యేల ననుచు
తనకు తానుగా హిమమగా తృప్తి చెందు
.........

*సీ॥
రామభక్తహనుమరమణీయగుణతేజ
వానర కపిరాజ వజ్రరూప
భీమబలశ్యామ బీజయక్షరధామ
పవనంబుయేనీవు పవనహనుమ
కోమల రూపమా కోదండ మారుతీ 
వీరాంజనేయుడా విజయహనుమ
సింధూర మందార చిరునవ్వు చిందించు
భక్తవత్సలభవ భానుస్నేహ!

తే॥గీ॥
కొలుతు కూర్మితోమారుతీ  కోరి నిన్ను 
నిలుపు మామధి నిరతంబు నిశ్చయముగ
పలుకు పావన కేసరీ పవనసుతుడ
రామ భక్తుల పాలిట రక్షగావ
......
*రాముని సన్నిధీ సుఖము రమ్యత పెంచియు బల్కుచుండి, యా
రాముని పెన్నిధీ మనవిరామము తెల్పుచు ప్రేమ పంచు సం
మ్మోముయు కాంతికోరితిమి మోహపు వాంఛల యందు జీవమై
స్వామిగ నిత్యనామ కపి శాంతిని కూర్చునె నా మనంబునన్
.......
 * జ్ణానము మన్నదే మనిషి జ్ణానిగ మార్చుట వీలౌనుగా
జ్ణానము తోకఠోరశ్రమ జ్ణాపక శక్తియు మిన్నగా పులే
జ్ణానము తో బహ్మగను లె జ్ణాతిగ యుక్తిగ కష్ట జీవిలే
జ్ణానము విశ్వమందు కళ జాతిని మారుతి మేలు కోరులే
కలియుగ బ్రహ్మ హనుమంతుని కొలుద్దాం
.......
* సంమతి పొంది నా కళలె సంతస భాగ్యము శాంతి నిచ్చుటన్
స్కాముల వల్లనే మనసు సాక్షి గ వేదన సంభవమ్ముగన్
రమ్యత నిత్యసత్యముగను రాగములేలును ప్రేమపాశమున్
ముందర కాళ్ళ మచ్చట తీర్చుట సత్యమౌగదా
......
* నడికుడి నాటకమ్ కధ నమత్తుసకాలముచిత్తు యేయగున్
సుడులుగ తిర్గటే కళ సుఖమ్ము సమాన విపత్తు చేరగన్
ముడుపులు కట్టి నా సమము విద్య సుదీర్ఘ సుహాస వేడుకన్
నడివడి కూర్చి నీదయను నాయెడ నుంచుము దివ్య దైవమా
.....
*సీస పద్యం 
కేదార పతినీవు --వేదాల సాక్షివి
రామేశ్వరంబున -- రామలింగ
మధ్యరేఖవుమార్గ --మహదేవ యీశుండ
హద్దుగా వెలసేవు -- యాత్మలింగ
పృధ్వి రూపపుకంచి --చిధ్విలాసమునీవు
జంబుకేశ్వరునిగా -- జలపులింగ
కాళేశ యాకస -- కాలహస్తీశ్వరపు
పంచభూతముగావ --పరమలింగ
*ఆటవెలది 
పంచభూతరూపపరమేశ వరదుండ
పాలకుండశివపు ఫ్రమథఘనము
క్షేమ వీర్యయభయ కేదార రామేశ
భరతఖండమధ్య భాగ్యధాత
***
*కళ్ళే కైపును చూపెను
ముళ్ళై గుండెలను గుచ్చి ముక్కెర చూపెన్
జళ్ళై కళ్ళలొ జలజల
గళ్ళై మనసును చురుకుగ గాళము యగుటన్
---
*బాసల పస చెలిమిగనే
యాసల పస పలుకులుగనె యాకలి మార్చున్
పూసల పస పుడమిన నే 
ప్రాసల పస పద్యమౌను ప్రకటన కవులున్
.........
*కుంకుడు పులుసును కళ్ళలొ
ఇంకుడు గుంట గను చేరి ఈశ్వరిలీలల్
మంకేల నీకు మనసున
వంకర కళ్ళలొ నులుసులు వరుసగ మార్చెన్
........
*కొబ్బరి పచ్చడి తిన్నా
నిబ్బరమైన మనసులకు  నియమమ్ముగనన్
అబ్బురపరిచే కళలే
నబ్బుట విధిగా జరుగుట నరముల బలమున్
.......
* భూమియు అంతా పుత్తడి
కామిక బుద్ధులు మెలుకువ కాలము అలికే
సామిని కోరిన తీరదు
ఆమని ఆశకు కలలగ ఆకలి తీరెన్
---
 మనిషి మనిషి దూరముయే
మనసే మగువైన నమ్మె మత్రం ఇదియున్
అణువంత సొగసు కులుకే
తనువే భూమిగ గగనము తాపము తీర్చెన్
---
* చిన్నది కన్నది కళలై
ఉన్నది తెలిపిన కనవలె ఉనికియు గతులన్
మిన్నగ చూసెను బతుకున
మన్నని లేకయు సుఖమగు మనసే భకరువున్
---
* చిన్నది అన్నది కళలై
ఉన్నది తెలిపిన కనవలె ఉనికియు గతులన్
మిన్నగ చూసెను బతుకున
మన్నని లేకయు సుఖమగు మనసే భరువున్
......
*గురిచేరిన చోటున నే
మరి మరి అందరు సహాయ మనునది చూపున్
గురి కుదరక యే విమర్శ
చేరే ఆశీర్వాదము చింతగ మారున్
.........
*మల్లెల రోదన గుట్టుయు
మల్లిక చూపుల పలుకులు మాలను చూపెన్
తల్లడిలి కనికరమ్మే
నల్లికవి యదే కదిలెను నటనకు లొంగెన్
---
*నింగియు చూపుల నివ్వెర
ఒంగిన వయ్యారపు నడుము ఒంపులు పిలుపున్
సంగమ కాంక్షకు చిక్కియు
సింగము ఆత్రుతనుచూపి సిరులను దోచెన్
--
*అడిగిన పొగడిన తిరిగిన
వడివడి తలుపులు తెలుపుచు వలచుచు బ్రతికెన్
నడకల మలుపుల  నడుముతొ
పిడికెడు కడుపుకు కళలతొ బిగువున నలిగెన్
.......
జూ.యన్.టి.ఆర్. జన్మదినోత్సవ శుభాకాంక్షలు

కళ్ళు చెమ్మగిళ్ళె నటన కాల మగుట
పట్టుదలతో ను కధలకు ప్రాణ మిచ్చె
తాత వారస నటనతో తెలుగు భాష
నందమూరి తారక రామ నాట్య రుద్ర
---
తేటగీతి పద్యాలు

* అమ్మ పలుకులే ఆదర్శ ఆత్మతో డు
నిత్య అనురాగ బంధము నియమ నీడ
హృదయ వాంఛను తీర్చియు హాయినింపు
కళల సాహిత్య సంపద కలిగితోడు
---
మగువ పైశీల నింద యే మనసు మాట
లోక మందు న జోడించు లహరి యాట
శోక పాకమై నలుగుట శకుని మాట
ఏక మవక కూడుకొరకు యెక్కి యాట
---
స్నేహము పటిష్ట మైనది సేతు వల్లె
మోహము బతుకు మార్గము మోజు మల్లె
ద్రోహము జరిగే జీవితం లోన జల్లె
అహము ఆహారము గనులే ఆట వల్లె
.........
మధుర మైన యుగాన న మనసు గాన
ఎండు టాకుగానము చూడు యదలొ గాన
పిల్ల ఏడ్పు గానమున మారు పికమె గాన
గాన గంధర్వ కళలోన గాన హృదయ

"గాన" అనే పదములు ఈ పద్యములో వేర్వేరు అర్ధాలు తో చూడగలరు
........

కాటు కెట్టుకో కళ్ళలో కళలు వల్లి
నుదురు పైబొట్టు పెట్టుకో నిత్య మల్లి
కొప్పులో మల్లె లెట్టుకో కొత్త లిల్లి
నడుము వడ్డానమును పెట్టి నన్ను జూడు
----
అడుగులో అడుగేసియు అందు కొనుము
కాళ్ళ పారాణి గజ్జలు ఘల్లు ఘల్లు
వలపుల తొ మద్దులివ్వవే వలపు రాణి
వయసు అడగను ప్రేమతో వలపు పంచు
---
జీవన మార్గమ్ముగనే
జీవిత నౌక నడిపించి జయమే గాంచెన్
జీవిత చక్రము తిప్పెన్
భావితరమ్ముకు పలుకుల బంధము తెల్పెన్
......
న భ ర న న న ర..12...సురభూజ రాజము
పలుకవే సుధ కోమలాంగి ఉపకరణమగుటె శోభగన్
చిలకవే మదిచిత్రమాయెను చరణ కమలమె ప్రేమగన్
అలకలేలను సాధనమ్మున అతి మతి గతియగు టేలగన్
పలక మారుట గొప్పకాదుగ పలుక గలవులె జీవితమ్
........
కోమలి వృత్తము...1,3 పాదములు..న. జ. జ. య.../8
2,4, పాదాలు జ భ స జ గ.../9

మనసున చిందెను మధ్య సుఖమ్ముయే
వినోద భావము యెవివేక లక్ష్యమై
తనువున సౌఖ్యము తత్వ మనమ్ముయే
మనోమయమ్మున మనమేక మవ్వుటే
....
అతనికలం కళ కావ్య మయమ్ముగా
గతీప్రభావముయె సుఖాల విశ్వమై
మతిని మనోమయమయ్యె విధమ్ముగా
పతీప్రకాశముయె ఉపాయధర్మమై
.......
మత్తేభము
మనసే అర్ధము కాదుగా మగువలో మాధుర్య అందమ్ములే
కన లేనే ఇది ప్రేమలో సహనమై కారుణ్య భావమ్ములే
మనలేనే ఇది భక్తిలో వినయమై మాత్సర్య లక్ష్యమ్ములే
వినుమారీతిని కోరెదే హృదయమై వేదాంత దేహమ్ములే
......
ఉత్పలమాల
ఆగదు లే మనస్సు కళ ఆశల పాశము కాపురమ్మునన్
వేగముగా యశస్సు కళ వేదము లక్ష్యము వేకువవ్వుటన్
రోగము లెన్నియున్ననులె రోషము మాత్రము తగ్గ గుండుగన్
వీగని సానుకూలత ను వేల్పుల లేకయు సాగు జీవమున్
.......
బాధలు పంచు బుధ్ధియును బాధ్యత తోననె బంధమవ్వుటన్
బాధ పడేటి హృద్యమును బాసల తోనునె బాగుచెయ్యుటన్
బంధువు ఆశలే వలదు బంధముపైననె ప్రేమయుంచుమున్ 
హృద్యము జాగరూకతయు హాయిని పంచియు కష్టసౌఖ్యమున్
---
పుట్టిన రోజులే కళలు పూర్ణిమ వెల్గులె చిమ్ముచుండగా
పట్టిన పట్టునే అనక పాఠము నిత్యము సత్య మ య్యదా
మట్టిని నమ్మియే నిజము మానస మంతయు పంచిబత్కుటన్
కట్టిన తాళికే విలువ కాలము యందును ఇచ్చిపొందుటన్
---
శార్దూలము
అమ్మేలే జయసూత్రమవ్వుట యులే ఆరాధ్యదైవమ్ముగన్
మమ్మేలే మహిమాన్వితమ్ము కళే మాధుర్య మయ్యేనులే
నమ్మామమ్మ మనోబలాన్ని విజయాన్నీకోరి ప్రార్ధించితిన్
సమ్మోహమ్ము కధాసుఖమ్ము కళలై సంతృప్తి కల్గించుమున్
........
సౌందర్యం సహనమ్ము గాను విషయం సౌభాగ్య ధారుడ్య మే
సౌందర్యం సుఖమే వినీల మయమై సౌకర్య దాహమ్ముగన్
సౌందర్యం హిమమై న వేడి వినయం సౌలభ్య సంతృప్తి యే
సౌందర్యం భరణమ్ముసేవ తరుణం సౌశీల్య సాహిత్య మే
***
ప్రాంజలి ప్రభ వారి సమస్యను పూరించండి........
పాపము లేనిచో జగతి పాడయి పోవును నిక్కువంబుగన్ 
......

*కోపము లేనిచో ప్రగతి కోరుట సాధ్యము కాదుకాదుగన్
తాపము లేనిచో ప్రతిభ దారిన చేరుట సాధ్యమేలనున్
ఓపిక లేనిచో బ్రతుకు ఓడుట బాధకు బంధనమ్ముగన్
పాపము లేనిచో జగతి పాడయి పోవును నిక్కువంబుగన్
..
చంపకమాల

*విధిన న నేమి జర్గునని విద్యను నేర్చిన పండితుండనెన్
మధువును దోచు లక్షణము మాధ్యమికానన విద్యపాశమున్
పదములుతెల్పుపాఠముయు ప్రేమకు చిహ్నము అయ్యెనే యగున్
విధుడు గళంకహీనుడగబేరు గనెన్ గురుపత్ని గూడుటన్
---



నేటి సూక్తి 

" పద్యపఠనంబుఁజేయఁగహృద్యమగును

పద్య రచనయెబ్రతుకంతపాటుయౌను

పద్యమాకలినిద్రలఁ బట్టనీదు

పద్యసాహిత్యశీలికి వందనాలు !!! "

( పద్యాతురాణాం న సుఖం న నిద్రా )..

----

కోశాలు - అనువైన వైద్యం:-

➡️ అన్నమయ కోశం - అల్లోపతి (ఆంగ్ల వైద్యం), ఆయుర్వేదం

➡️ ప్రాణమయ కోశం - ఆక్యుపంక్చర్ (సూదుల వైద్యం),  ఆయుర్వేదం

➡️ మనోమయ కోశం - హోమియోపతి (బలోపేత క్రియ {పొటెన్సీ} - మందు మోతాదు  ఎంత తక్కువ అయితే అంతా ఎక్కువ ప్రభావం), ఆయుర్వేదం

➡️ విజ్ఞానమయ కోశం -   హిప్నాటిజం (ఉద్దేశపూర్వకంగా సృష్టి చేయబడే నిద్ర)

➡️ ఆనందమయ కోశం - ధ్యానం (మెడిటేషన్)


 ప్రాథమికం - చికిత్స

 ద్వితీయం - నిద్ర 

 అంతిమం - ధ్యానం


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀  77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।

వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀

🌻 347. 'విమలా'🌻 

మలములచే తాకబడనిది విమల అని అర్థము. శ్రీమాత మలములచే తాకబడనిది. ఆకలిదప్పులు ప్రధాన మగు మలములు. దరిద్రము మలము. అష్ట దరిద్రములు గలవు. అవి అన్నియూమలములే. కామక్రోధాది అరిషడ్వర్గములు మలములు. అతిక్రమించు కామము మలము. వికారమగు మనోభావములు మలములు. అధర్మము, అవినీతి మల భావములు. అధిక్రమించు రజస్సు, తమస్సులు (రజస్తమస్సులు) మలములు. మలముల మొత్తమును అవిద్య అందురు. కనుక అవిద్య మలము, మలములకు సమగ్ర నిర్వచనము. అజ్ఞానమే అవిద్య. అది కారణముగనే అహంకారము గట్టిపడును. అప్పుడు రజస్తమస్సులు సత్వము కన్న బలము కలవై వర్తించును. వానికి లోబడిన అహంకార పురుషుడు వికారమగు భావములు కలిగి అష్ట బంధములను సమకూర్చుకొనును. అష్ట కష్టములు పడును.

అట్టి నరుడు త్రికరణ శుద్ధిగ శ్రీమాతను ఆరాధింప ప్రారంభించినచో క్రమముగ అవిద్య తొలగును. విమలుడగును. త్రిగుణములకు లోనైన జీవు లందరూ కూడ అహంకారమను ఆవరణమున వసింతురు. అవిద్యకిది ప్రథమావరణము. త్రిగుణములకు ఆవల శుద్ధచైతన్య స్వరూపిణిగ శ్రీమాత యున్నది. ఈవల అహంకారులై జీవు లున్నారు. అహంకారావరణము దాటినచో జీవులు విమలత్వము చెందగలరు. అట్లు పొందుటకు శ్రీమాత అనుగ్రహమే ఉపాయము. అనుగ్రహమును పొందుటకు నిత్య చింతన, ఆరాధన జరుగవలెను. శ్రీమాత అనుగ్రహించినచో ఎట్టి వారైననూ విమలత్వమును పొందగలరు.

సశేషం...

నేటి నూతన పరవళ్లు 


వెన్నెల్లో దీపమై 
ఆకాశంలో మేఘమై 
పుడమికి అంబరమై 
సృష్టికి ప్రతిసృష్టినై 

వెన్నె లంతా కురిసే నేలపై
నిండు దనమే ఆనందానికి ఆధారమై  
విరహ వేదన తగ్గుటకై 
మనసు మనసు ఏకమగుటకై 

రూప లావణ్య మెరుపుకు దాసుడునై 
తనువంతా మధురాతి మధురమై
మౌనపు చీకట్లో కౌగిలింతల మయమై 
చెలి చెంత చేరి వేడి దుప్పటి నై .

వలపుల కొలనులో  రాపిడి స్నానమై 
నాట్య మయూరి నర్తనకు ఆలమై 
కలువ పూల రేకుల దరహాసమై 
విచ్చుకున్న పువ్వులా వికసించే ఆనందమై .

మధుర స్మృతులకు మార్గమై 
దోబూచులాటలకు నిలయమై 
విలుకాడు విసిరే అస్త్రమై 
హృదయానంద భరిత ప్రేమ రసమై 

నడిరేయి స్వప్నాల మొహమై 
చెంతచేరి బంధించే చెలి రూపమై 
అనురాగపు ఆత్మీయతాభావమై 
తనువంతా సువాసనలు ఘంధమై 

ప్రకృతి తో కనువిందు అపురూపమై  
ఆశల పల్లకిలో చెలి సంతోషమై 
ఇంద్రధనస్సు ఉయ్యాల్లో ఊహలై 
మాటలెన్నో పూలమాలలా నలిగినవై  

 ప్రేమ రథములో కదలికనై 
మగువ మనసుకు అర్ధమై 
మౌనంగా ఆశలు తీరినిదై 
ఆధార మధురం ఆనందమై 
సృష్టికి శ్రీకరమై నూతన జంట ఏకమై 

****

   -                                             -    🙏.

తే. అంధ కారము వల్లనే ఆంధ్ర మాత
కనులు విప్పినా చూడకే కదలి కదలి
శాప మిచ్చె కర్మలవల్ల శాంతి కరువు
ఆంధ్ర నుద్ధారణ జరుగు అదును బట్టి
.........



Friday 3 February 2023

ఉషోదయ తేటగీతి పద్యమాల..





నిండు మనసుగా నీ పూజ నిత్యముగను
అండఁ గోరకుండుటదియు అడ్డ మవదు
చెండు మాదిరిగా వుండి జేయు చుంటి
పాడు చుంటిని భక్తితో పలుకు నంత
   
యిందు హరి గలఁ డందును లక్ష్మి లేఁడనేటి 
నింద బడకయే నీ పూజ నేను చేసె
కొందరూ చుట్టాలు గ పగ కలిగి ఉండె
అందు నేను మానుటలేదు హరి పూజ
   
తిట్టు ల తొ నున్న దీవెనె గొంత అనియు
నెట్టు కోనిదే మరువలేని దియు పూజ
పెట్టినది యంత బంగారు పెంకు ననియు 
అట్లె సరి యనుటదియు నీ పూజ వల్ల

ఆర్య అనుటయు ధర్మము అలక వద్దు
సర్వము ను పంచి తెలిపితి సమయమందు
గర్వమనునది చేరియు గాయ పరిచె
నిర్వి రామకృషి వలన నీకు పూజ

కారు చీకట్లు కమ్మగా కనుల వెలుగు
చేరి నిన్నే ను కొలచియు చలువ చేసి
మారు పలుకులు లేకయే పగలు రాత్రి
కోరికయు లేక కొలిచితి కమల నాధ
***


తృణ కంకణం 
*తే.విరహ జలిత మనస్సుయే విభవ చనగ
తపము సలప రింత కడకు అడవి వలెను 
జత కలియు జప రగిలె జయము కుదురు 
మనసు కుదుటగా సుదతియే మరుడు ఒసగె 
........
*. తే.కటిక తిమిరమ్ము తొలగెను కామ్య దివిన 
సురభి వలెను ఇలకువచ్చి సుఖము తివిగ
వెలుగు నొసగి సుర కుడిపి వెతలు  మరచె 
బతుకు వరము నొసగ నిత్య భక్తి వెలుగు 
.......
*తే.పనస తొనల పెదవు లవి పలక రింప 
చిలికి పదిలమ్ము కుసుమాలు చెలియ కళ్ళు 
మరులు గొలుపు మధుపములు మతులు చెదర 
విరుల సుధల తపన వింత తొలగ 
......
*తే.వయసు మదపు మెరుపులన్ని వలపు జిలుకు 
మొదవు రసము లిడువ గాను పొదుగు లనగ
చెలిమి  పెదవి పరవ శమ్ము చేష్ట సఖుని 
తరుణి చెంప అనుగు లగు ప్రియము లొలుక 
.......
*తే.కనులు చెదరు సొగసు పంచి సిరుల నొసగి
మనసు తెలిసి నిలిచి తెల్పు మదిన సఖియ 
దరిని తెలిపి కరములన్ని కలిపి నడిపె 
విజయ మరయ సరసమేను నిలువు జయము
.......
*శా.మర్మమ్మే విజయమ్ము వాంఛ పెరిగే మంత్రమ్ము ఔపోసనే
ధర్మమ్మే అవనీ తలమ్ము వినయం ధర్మార్ధ కామమ్ము యే
చర్మమ్మే చలితం సుఖమ్ము విదితం జాడ్జ్యమ్ము తొల్గేనులే
కర్మ న్నిష్ట ఇదే మనస్సు మమతా కాలమ్ము కామ్యమ్ము యే 
----
" शार्दूले...
--
రాకేంద్వాస్యనిభే ! గిరీశ హృదయే ! రాజన్యసంపూజితే !
రాకేద్వంశకఫాలభూషితవరే ! లాస్యప్రియే !శాంకరీ 
రాకేంద్వంశుసమప్రశీతనయనే రాజ్యప్రదే ! శ్రీప్రదే !
రాకేంద్వగ్రజదేవి ! గౌరి ! శుభదే రాగాత్మికే పాహిమామ్ !!! "
----(అప్పాజీ )
* తే.కార్య కారుణ సద్భావ కామకాళి
భావన తరంగిత సమయ బంధ కాళి
హృదయ లీల మనసు శాంతి హృద్య కాళి
కాంచన యుగళ మెరుపుగా కామ్య కాళి
   

PRANJALI PRABHA ... 07-03-2023
స్త్రీ విద్య రంగరించే మది భావపు సమీకృతం 
స్త్రీ శక్తి  సేవ లక్ష్యమ్ముయె నిత్యము సుఖామృతం 
స్త్రీ యుక్తి ధైర్య సంపాదన విద్యయు మనోమృతం 
స్త్రీ రక్తి అద్భుతమ్మే ఇది దేహము జయామృతం 
 .......     
అతివ సుందర అతిగాను అర్ధమున్న
అపహరము, అతి గర్వము, దాన మతియు
అంత మవ్వు స్థితియు చేరు ఆశ వలదు
నీవుగా త్వజించ అతియే నిజము ఇదియు
........
శుభము కల్గ ఎల్లరు సుఖ శోభ నుండ
తృప్తి జీవితమ్ము కదలి తల్లి ప్రేమ
తండ్రి తనయుల సుఖముగా సమయ వినయ
సహజ సేవశుభాకాంక్ష సహన మగుట
......
తిరిగి తిరిగి వచ్చితి నేను తేరు కుంటి
బద్ద కమ్ముయు కాదులే బడలి వల్ల
బందువులు విదేశ పయణం భద్ర తయని
చెప్పి తిరిగి వచ్చితి మేము చేష్ట లగుట
.....
ఎన్ని సార్లు చెప్పెది నీకు ఎరుక పరుచ
మన్న, దులుపు కొని కలలు మాది రగుట
వినయ మార్గాన తెలపమని పలికితిని
నాకు పని ఏమి అనుచునే నమ్మ బలుకు
......
మమత బృందావని తిరుగు మనసు చేర్చ
హృదయము తడిమి ప్రేమ ప్రధాన భరిత
గుండె కు సహాయ మారోగ్య గుర్తు చేయ
వెళ్ళబోకు నన్నొదలి యే వినతి గాను
......
తలుపు తట్టు అదృష్టము తనివి తీర
తెరవకు తలుపు దురదృష్ట తట్ట వచ్చు
ముందడుగుయే ప్రయత్నము ముఖ్య మగుట
ఫలిత మాసించక బతుకు ఫలము చూడు
.......

శ్రీశంభు మీశ్వరం శ్రీకరి చర్మధ రణాంచితం ,
శ్రీశంకరంగురుం శ్రీగిరిధామనిలయంభవమ్..
ఈశానముగ్రరూపంశుచినేత్రనిటలం శివం ,
శ్రీశాంతిదాయినం శబ్దశివప్రదమహం భజే !!! "
221  212  211 211 1212

*మహిళా దినోత్సవ సందర్భముగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు*

నీ రూపమే, నాలోననే, నారూపమే, నీలోననే
దేహానికే బింబానివై, దానానికే ధర్మానివై,
ఉంచాలిలే ఈ కన్నులే కన్నీటికే దూరమ్ముగా,
ఓ ప్రేయసీ, నాదారిలో ఓర్పే ఇదీ, నీ దారిలో.
......
పూజల్లు లై మెత్తమ్ముగా, వర్షమ్ముగా తోట్పాటు లే,
రాగాలతో సంతోషమై, వాధ్యాలనే మ్రోగించె లే,
వాసంతమై రంజిల్లగా, ఆనందమై చిందేయు లే,
పాడాములే గమ్మత్తుగా, ఆడాముగా ఇష్టమ్ము లే.
........
ఈ ఆశయే నిత్యమ్ముగా,  ఈనాడులే   సొంతమ్ము గా,
ఈ కానలో స్నేహమ్ముగా, ఈవేళలో ప్రాణమ్ము గా,
ఈ తోటకే పూగంధమై, వీచేనులే ప్రేమమ్ము గా, 
ఈ దారినే నాదారిగా, నీదారిలో ధైర్యమ్ము గా.
........

ప్రేమమ్ము తో  ఈ లోకమే, ప్రేమించియే మార్చావు లే,
వాగ్దాటిగా న్యాయమ్ముగా, సామర్ధమే చూపావు లే,
నీ దేహ మే హృధ్యమ్మునా, స్వర్ణమ్ముగా ఉన్నావులే,
నీవే కధా ఉద్గ్రంథమై నిత్యమ్ముగా సంతృప్తి లే.
   ......
మాత్రా క్రమత:--2212
 మీ విధేయుడు
 మల్లాప్రగడ రామకృష్ణ
తే. బలము దర్ప అహంకార బంధ మొదలి
వస్తు సంగ్రహ క్రోధము వదలి వేసి 
కామము మమకారంమ్మొద్దు కథలు వదలి
సర్వ మోక్ష  సమర్ధుడు సమయ బోధ
.....
తే. అతను అమరలింగేశ్వరా ఆమె శక్తి
అతను మంగళ శక్తి శివ స్వ రూప
అతను గళము ఆమెయు అర్ధ నారి నీడ
అతను జాడ ఆమెయు పట్టు ఆట విడుపు
........
తే. ఏది నిజము నిజాయితీ ఏల చెప్ప
అనుభవం వల్ల తెలియగల్గేటి విషయ
వాంఛలన్ని యు ఎవ్వరూ చెప్ప లేరు
కాలవిధి నిర్ణ నిర్ణయం కలసి వచ్చు
........
తే. మనిషి ఉన్నతి మహిళయే మరువ కండి
సహన నిజసహాయము చేసి సమయ తృప్తి
ఒక్కటే ప్రేమ యనక ఓదార్పు నిచ్చు
జీవితంలో వెలుగు నింపు జీవి మహిళ..
.......
తే. కాల నిర్ణయం కదలికగాను సహన
కవిత సాహిత్య హృధ్యమ్ము గాను నిత్య
సత్య సంభాషణ పరము నీడ నందు
సమయ స్ఫూర్తిగా స్వేచ్ఛగా సమర తెలుగు..
........
మహిళ కనిపించని వేరు మనసు చేరు
వనితల దినోత్సవము నాడు వినయ విజయ
ఉత్సవమ్ముగా గౌరవ వేల్పుల నియు
తల్లి చెల్లి అక్క మహిళ తరము ఇదియు..
........
తే. మాటకు పదును లేకున్న మనసు చేరి
అనువణువు అనుమానము దాని శక్తి 
మౌనమునకు రూపం లేదు మనసు చేరి 
అగ్ని వలెను దహించుటే దాని శక్తి..
.......
తే. తిండి లేక చావటమనే తీరు లేదు
తినను లేక చచ్చెడి వారు తీరు పెరుగు
తోడు లేని అనాదులు పోరు లేదు 
అందరున్న అనాదులు ఆట పెరుగు
.......
మహిళ తేటగీతి  మాల

తే. అవనిలో ఆడ జన్మయు అద్భు తమ్ము
ఆత్మ విశ్వాసమును చూపు ఆడది యగు 
ఇంటి ఇల్లాలు అమ్మగా ఇష్ట మగుట
ఈమె తత్వమే ప్రేమగా ఈద గలుగు
........
తే. ఉగ్గు పాలతో ధైర్యము ఉజ్వలమగు
ఊహ ఊపిరి దైవత్వ ఊయ లామె
ఋణము తీర్చ సహనం రుజువు ఆమె
ఎగసి పడె కెరటం ఆమె ఎల్లరందు 
........
తే. ఏడు జన్మల స్నేహము ఎరుక గలిగి
ఐణ ఐశ్వర్య నిధి ఆమె అయిదొ తనము
ఓర్పు కునిలువెత్తునిదర్శ ఓడిపోని
ఔ షదవిధి ఔదార్యము ఔను ఆమె 
......

అపు రూప మైనది ఆడజన్మ మహా మనో భవ శాంతియే
సమయమ్ము సేవల కారణమ్మువిశాల దృక్పధ కాంతియే
చిరుహాస మాటలు సంతసమ్ము వినోద మోక్షపు మార్గమే 
దరిచేరువారికి సత్యవాక్కు సరాగరాగము దీపమే
.......
ఇరువురి నడుమ ఇరకాట ఇష్టమేల
పరుగులాటలో అలసట పంత మేల
అలసి సొలసిన దేహల ఆట ఏల
తడిసి ముద్దయ్యె  ముద్దకు తంతు ఏల 
.........
మూడు ముళ్ళ ముచ్చట వల్ల మురిసి పోయి
మరచి పోక మగని ముందు మడత పేచి
పెట్టి మనసు ముచ్చట మభ్యపెట్ట గలిగి 
రాత్రులు ముగియ నివ్వక రాశి కెక్క
.......
గంధ తరువు సర్పము చుట్టి గళము నొక్కి
విధి శుఘంధ మొందకయుండి  మివ్వ కున్న
గంధ వన్నెలు తగ్గవు గమ్య మందు
సర్పమేమిచేయనులేదు సమయ మందు
......
పలు తెరంగుల వచి యింప పలుక లీల
చిలకరింపు మదిపులకరింపు లీల
థలుకు కులుకు లన్ని కలసి థాగ లీల
అలక మెలికల కథలన్ని ఆశ లీల
........
మనవిధి విజయానికి వేయ్యి వక్ర     
బుద్దు లే అడ్డు, తలుపులు బురద పాలు    
ఆత్మవిశ్వాస మే, ప్రేమ ఆట మారె   
లక్ష్య, సాధ్య, ప్రయత్నాన్ని లంకె, పెట్టె  .
........
నీవు లేకున్నను బతకలేను నిన్ను
మరచి నేనుండలేనులే మంద హాస
మేమి కాదులే నిజమునే తెల్పు చుంటి
వాది ప్రతివాది నేనేను వాద మొద్దు
.......
ప్రేమ నిష్కలమ్ము గను లే ప్రీతి నిచ్చి
హృదయ భావాని కర్ధము హృద్య మౌను
ఆట పాటల ప్రేమల ఆశయమ్ము
చమురు లేని దీపపు ప్రేమ సమయ వెలుగు
.......
పరిచయాల పరిమళమ్ము పలుకు సాగి
పలక రింపుల ప్రేమలు పిలిపు లాయె
పరిణ మించుతే వరమగు ప్రతిన ఇదియు
పరితపించు మనసు తృప్తి పడక సాగు
......
శిష్ట కిరణమ్ము లన్నియు శిరము దాల్చ
ఇష్ట మదిలోన కవితలు నిజము తెలిప
పృష్ఠ భోజన మే తిన్న పృద్వి కవిత 
చేష్ట లన్నియు అనుభవ చేను వెలుగు
........
తెల్ల చీర కట్టిన బొమ్మ తేట తెలుపు
మౌఖ్య బొట్టు కాటుక అంద మంత తెలుపు
నవ్వుల కళతో నయనాలు నలుపు తెలుపు
ఆడజన్మ యే అపురూప ఆత్మ తెలుపు
*****

తల్లి, చెల్లి, ఆలియు, అక్క, తృప్తి పరచ   
అల్లి, బిల్లి, ఆటల, ప్రేమ, అలక నుంచి 
పలుకు భావాల అలవోక ప్రతిభ, నెంచి 
ఉరక ఉబుసుపోక మనసు, ఊహ చిలుక   
......
మాటలేవో, తెలప గల్గు, మమత నెంచ
సోది కాదు, మై మరిపించు, సొమ్ము కాదు 
సుఖపు, ఆత్మీయతను, పంచు శుభము, నెంచ 
సమత మమతల, అనుభూతి, సమయ మందు
......     
సమ సమాజ నిర్మాణము, సకల సేవ 
ఆశయాల, భావపు పట్టు, కలము తీర్పు
జన పదమున మనము యుండి, జనుల జాడ్య 
ములను తొలగించి, చెడుభావ, ముప్పు తప్ప 
.....  
నేను నడిపిస్తు, నాచేయి, నియమ మించి  
పడిన వారిని లేపుతూ,  పలుక రించి  
బొమ్మ రింటిలో రాగాలు, పోరు తీర్చి 
ఆట లందు ఆడియు, పాడి, అలుపు తీర్చ  
.....
హద్దు, చెప్పనీ, మనసుగా, హాయి నిచ్చి 
బంధ లోగిళ్ళ, సందడి, భాగ్య మిచ్చి  
నిలువ నీడ నిచ్చియు, ఉనికిని కను గొనియు  
కన్న వారికి, స్వేచ్ఛను, కనుల ముందు  
....
ఘాటు ప్రేమ 
ఎంత ఘాటు ప్రేమ యిదియు ఏల యనకు
వడివడిగను వెలువడిన వినయ మిడియు
పరిగిడిన యద అడుగుడి పలుకు చిలక
తడబడు బ్రతుకు తకధిమి తరుణ మాయ
........
బాల్య చూపులు కలయిక బాధ నాడు
యవ్వన మెరుపు చూపులు యదన నేడు
నాడు తెలియలేదును ప్రేమ నటన యేను
నేడు తెలిసిన పరిమితి నియమ ప్రేమ 
.......
ఎన్నియాతనలో ప్రేమ ఏల యనకు
ప్రేమలేఖ నిర్మాణమే ప్రియము మనకు
గుండెలో ఊహ గుబులేల గుర్తు మనది
సాగర కెరటాల వలెను సాగ గలము
.........
మనసుకుజ్వరం తగిలించె మగువచూపు
ముగ్ధ మందార మైకమ్ము మనసు చూసె
ప్రాయము కనకం కాంచనం పాడు చేసె 
ఉప్పెనయె కమ్మె మోహము ఊయ లూగ
........
పరిచయాల పరిమళమ్ము పలుకు సాగి
పలక రింపుల ప్రేమలు పిలిపు లాయె
పరిణ మించుతే వరమగు ప్రతిన ఇదియు
పరితపించు మనసు తృప్తి పడక సాగు
.....
విఘాత ప్రేమ
సంఘ చత్వమ్ము బుద్దినే సంవదత్వ
విలయ వర్త పు పరివర్త వినయ మేది
చెలిత కలగా పులగవుటే చేష్ట లుడికి
బలమనే గర్వ ధనముగా బాద బాధ
......
గంధ తరువు సర్పము చుట్టి గళము నొక్కి
విధి శుఘంధ మొందక యుండి మివ్వ కున్న
గంధ వన్నెలు తగ్గవు గమ్య మందు
సర్పమేమిచేయనులేదు సమయ మందు
.........
శిష్ట కిరణమ్ము లన్నియు శిరము దాల్చ
ఇష్ట మదిలోన కవితలు నిజము తెలిప
పృష్ఠ భోజన మే తిన్న పృద్వి కవిత 
చేష్ట లన్నియు అనుభవ చేను వెలుగు
.........
మనవిధి విజయానికి వేయ్యి వక్ర     
బుద్దు లే అడ్డు, తలుపులు బురద పాలు    
ఆత్మవిశ్వాస మే, ప్రేమ ఆట మారె   
లక్ష్య, సాధ్య, ప్రయత్నాన్ని లంకె, పెట్టె  .
.........
సకలము నిజాన్ని మార్చేటి శక్తి లేదు   
 మార్చ శక్తి నిజానికి మనసు వుంది.
ఈ ప్రపంచానికే ప్రేమల ఇచ్ఛ వుంది         
దాశరధి అనుభవ మేను దారి చూప
........
యుగయుగానికి మార్పు సయోగ్య మౌను
నిత్య సంధిగ్ధ సందేహ స్థిరము గాను
విశ్వమున ధర్మ సత్యము విద్య గాను
వత్తు మీదవత్తులు దొర్లు వయసు బట్టి
.........
 గాలి కౌగిట చేరితి గమ్య మేది
లేక జలమునే త్రాగియు లేత వయసు
బలము కోరి భర్తను చేరి బంధ మంటె
కాటి కాపురం శివుడని కల్ల లొద్దు 
.........
పిడిక లెత్తిపో రాడుటే పిడుగు లాగ
శబ్ద జుంకార మినిపించ సమయ మిదియు 
న్యాయ ఘోషకొరకు ఉద్య మించ వలెను
చేయి చేయి కలిపి ధైర్య మెంచు గలుగు
........
నీతి ఏమి ఎంచక బూతు నీడ యనుట
బూతు లాడ నవ్వు కదులు భూమి నందు
నీతి యే లోకమని యుంటె నిర్ణయమ్ము
నిజము దాగుట ఎందుకో నిన్న నేడు
........
ఎన్ని తప్పొప్పుల కథలు ఏల ఇపుడు
మంచి చెడులు కధా పరము మనసు చెరచు
యిది వివాద మవదు కాని ఇచ్ఛ మారు
విద్య ఉద్యోగ సంపదా విజయ వాంఛ 
.........

IIIU UI U. IIIU UIU (ఖండ గతి )
నేటి కవిత 
అణువులో అర్ధమే అలకలో తీర్ధమే 
తనువులో వేడియే తమకమై పొంగెనే 
మనసులో ప్రేమనే మలుపులే తిప్పెనే
కలత లే వచ్చినా కథలుగా మారుటే 
.......
నిలిచెనే సత్యమై నియమమై ఉండుటే 
బ్రతుకులే  పున్న మై ప్రగతిలో  వెల్గులే 
చెలిమి లో మౌనమే చినుకులా మార్చునే
కవిత లే కళ్ళ లో  కనికరం లేదులే 
......
విరహమే నిప్పులా  విజయమై చల్లనే 
వయసునే వింతగా వలపుగా మారెనే 
అలల పై నీడలా కలలుగా తేలెనే 
వెదుకుతూ ఉండనీ విగతగా వద్దులే 
......
పగల తో జీవితం సెగలతో కాపురం
అవని పై అందరూ అనకువే జీవితం 
అతిధిలా మృత్యువే అదునుగా ఉండుటే
మనసులో మోహమే మమతగా మారెనే
.......
చినుకులే వచ్చెనే చెలియతో చందమే
మనసులో మబ్బులై సెలవిచ్చి   చందమే
వణుకులో మత్తుగా వరుసలో చందమే 
గుణములో గుప్తమై గురువుగా చందమే 

 * అంతయును బ్రహ్మమేరా!...  3 /2023
తే:: ఇచట ప్రవచింపదగిన దే ఇష్టమేది ? 
నటన  ప్రవచింపరాని దే నష్ట మేది  ?
ప్రేమ కన్న చేయదగిన ప్రియము ఏది ?  
పాపమే  చేయగూడని పాపి ఎవరు ? 
.....
తే:: నీవుగా చదువదగిన నిజము ఏది ? 
నిజము చదువరాని పలుకు నీడ ఏది ? 
నిత్య సేవింపదగిన దే నియమ మేది ? 
నిజము  సేవింపరాని దే నిలకడేది  ? 
......
తే:: తెలియ దగిన దే నమ్మేట్లు చెప్పు టేల? 
తెలియ రాని దే వద్దని చెప్పు టేల?  
తిన దిగిన దేను అనిచెప్ప తీర్పు ఏల
మనము  తినరానిదేమిటి మాయ ఏల ? 
......
తే:: మనము చేయవలసినదే మనసు దృఢము  
అన్ని వేళల యందును ఆత్మ శాంతి  
అన్ని చోటులయందును అరుణ  ముక్తి  
హంస ధ్యాన మొక్కటియేను ఆచరింప .
>>>
హంస ధ్యానము :- గాలిని లోనికి బీల్చుచు 'సో ' అను అక్షరమును - విడుచుచు 'హం' అను అక్షరమును అనుసంధానము చేయవలెను. ఇది బ్రహ్మానుభవమును గలిగించు ప్రక్రియ. వివరములకు 'సూత సంహితను పరిశీలించునది.
****

నేటి అమృత ఘడియాల తేటగీతి పద్యాలు 
.....
త. మాటైన చెప్పాలి మాయైన మోయ్యాలి
కూడైన చూపాలి కూల్చైన ఉంచాలి 
వేటైన ఉండాలి వేల్పైన చెయ్యాలి
తోడైన ఉండాలి తీటైన మార్చాలి
.....
త. సన్యాస ఆరాధ్య  సాహిత్య మేదేది
విన్యాస తీర్ధమ్ము విశ్వాస మేదేది
అన్యాయ మాపేటి ఆహ్వాన మేదేది
తిన్మాయ తీర్చేటి తత్త్వమ్ము ఏదేది
.....
త. ఏరోజు కారోజు ఏర్పాటు కాదేది
ఆరోహ మారోహ ఆర్భాట మేదేది
ఊరేను మారేను ఊహేను ఏదేది
చేరేను కోరేను చింతేల సేవేది
.....
తే. ఇంట నున్నది వదిలేసి ఇష్ట మనుచు
బిక్ష కై తిరిగే వాడు, గీత చెప్ప
ఇంట గెలవ లేక సలహా ఇచ్చు వాడు
భార్యను సుఖ పెట్టక వెర్రి బాధ చూడు
.....
తే. తీర్ధమే తరింప గలుగు తీరు ముఖ్య 
దేహ మానసికమ్ము శుద్ధి దివ్య తేజ
న్యాయ ధర్మప్రవర్తన చక్క జేయ
దైవ సంకల్ప నిర్వహణ నియు తృప్తి
......
తే. బాధ తేనె తుట్టెయగుట, భయము నింపి
బొంగరం తిర్గి నట్లునే, ఒరిగి పోయి
కరుణ లేని కాలమగుటే కన్న పేగు
చేయ లేక ఉండ నులేక చింత బ్రతుకు
.....
తే. మాట గొప్ప చేతలు లేక మాయ చేయ
గోడ తగిలిన బంతిగా గోడు తెలిప
దారి తెలియని బ్రతుకని దీన పలుకు
మౌన హృదయ వాస్తవముయే మౌఖ్య మగుట
.....
తే. చికిత మానవ మోక్షపు చక్ర గతియు
చెప్ప నలవికాని మతియు చింత స్థితియు
భయము వికసిత మగుతయే బంధ మందు
ఏది మంచి తెలిప మని ఎవరి నడగ
.....
తే. మనిషిగా నిలవాలన్న మనసు పంచు
మనిషిగా ఎదగాలన్న మమత పంచు
మనిషిగా కొన సాగాలి మంచి చెలిమి
మాటవిని నడుచుట మంచి మనిషి తెలివి
.....
తే. మౌని పరిమళం అశ్వాద మౌని దోషి
దొంగ పూలు కోసియు దోచె దొరగ బ్రతుకు
చిన్న మేధావి చేస్తేను పెద్ద తప్పు
నేడు దొరికితే నే దొంగ లేక దొరయు 
......
తే. వేచి విసిగు వేసారితి వివర మేది
కాచి వడపోసి తెలిపినా కదలి కేది
నేటి తీరు మారక నుండు నీడ ఏది
చెప్ప నలవిలేని బ్రతుకు చింత ఇదియు
.....
తే. అనుభవాలు తడుముతుంది అభినయనము
కలతలు వలన నలిగెను కాపురమ్ము
తలపు వలపుచుట్టు తిరుగు తుంది నిజము
ప్రశ్న కలలు చెరుగు తుంది ప్రగతి కోరి
.....
తే. మౌనము తపస్సు చింతన మౌఖ్య మవదు
అంత రంగాన్ని తెలిపేటి ఆశ యదియు
అర్ధ వంత మైనది మౌన ఆలక తీరు
మౌనమే ఆత్మ సాక్షాత్క  రౌను నిజము
.....
తే. పుటలు కదలిక చదువుయే పుస్తకమ్ము
కొత్త ఆలోచనలు పుట్టు కొలువు నందు
మెదడు పరుగులు విధిరాత మోపు అయిన
దేహ దారుధ్య మస్తకం దివ్య మగుట
....

 తే. అం బలి ద్వేషి శుభమేను అర్ధ మేను
చింత కాయ శుభప్రద చెలిమి ధీర
కూర గాయ భయోత్పాత గుర్తు చేయ
ఆవు పాల నేయి ప్రియ  ప్రేమ కృష్ణ
............
ఒక చమత్కార శ్లోకం చూడండి ...
 అంబలి ద్వేషిణం వందే
 చింతకాయ శుభ ప్రదమ్
 కూరగాయ కృత త్రాసం
 పాలనేతి గవాం ప్రియమ్
తెలుగూ, సంస్కృతమూ కలగూరగంపలా కలగలిసి పోయిన ఈ శ్లోకం చూసారా ? 
కవిగారి అభావ చేష్ఠ అని పోనీ లెమ్మని సరి పెట్టుకుందామంటే అర్ధం కూడా అదోలా లేదూ?
అంబలిని ద్వేషించే వాడికి వందనమట. 
చింతకాయ చాలా శుభ దాయకమట.
 కూరగాయ భయోత్పాతకమట. 
ఆవు పాల నేయి ప్రియమైనదట. 
ఏమిటీ కారు కూతలూ అనుకుంటున్నారా ?
అం , బలి = బలిని అణచి వేసిన వాడు
చింతక , ఆయ = నామ స్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటి వాడు
కు , ఉరగాయ = దుష్ట సర్పమును ( కాళీయుని) అణచి వేసిన వాడు
పాలన , ఇతి = గోవులను కాచునట్టి వాడు (అయినట్టి) ( శ్రీ కృష్ణునికి )
వందే = నమస్కరించుచున్నాను.
ఇది శ్రీ కృష్ణ నామ స్మరణ చేసే శ్లోకం.
🌷🌷🌷🌷🌷🌷

.......
తే:: ఈ జగమ్మున మాయయె ఈశ్వ రేచ్ఛ 
బ్రతుకు వేదాంత భావము భాగ్య మౌను  
జీవ సారమింతేనయా  కీలక మగు 
కష్ట సుఖ కావడిని మోయు కామ్య మగుట 
 ......
తే:: కుడి యడమల సరాగము కూల గుండ
ఎరుక నిశ్చలానందము ఏళ్ల వేళ
బ్రతుకు సుడిగుండమై తిర్గ భయము వలదు 
జీవితం ఎదురీదుటే స్థిరముగాను  
         
తే.. ఉప్పు కన్నీళ్ళు కట్టడి ఊసు వద్దు 
మబ్బు కన్నీళ్ళు పడగానె మనసు ముద్దు    
బ్రతుకు చన్నీళ్ళు వేణ్ణీళ్ళు బంధ హద్దు 
మనిషి మూన్నాళ్ళ జీవితం మాయ సద్దు
.........
తే. వినయమార్గోపదేశము వింత గుండ
కనిన చిత్ర విధి విచిత్ర కలల గుండ
తనివి తీరదు దేనికీ తలప గుండ
మనవి ఏదైన మనుగడ మనసు గుండె
.........
తే. నిజముకే నీడ కరువగు నిత్య మందు
వింతది అబద్దము నిజము విజయ మొందు
ఈ అబద్దము ఆస్థిర ఊహ పలుకు
నిజము సత్య స్థిర పలుకు నింగి నేల
.....
తే. అం బలి ద్వేషి శుభమేను అర్ధ మేను
చింత కాయ శుభప్రద చెలిమి ధీర
కూర గాయ భయోత్పాత గుర్తు చేయ
ఆవు పాల నేయి ప్రియ ప్రేమ కృష్ణ
.....
తే. అక్షర తపస్వి మనసునే ఎంచలేవు
ఊహ నిజమౌను సత్యమై ఉన్న తమ్ము
ఓ మధురజ్ఞాన విజ్ఞాన ఓటమవని
ఓర్పు చూపు విద్య వినయ మోక్ష మౌను
......
తే. ఏది అత్యాశ ఆవేశ మేల చెప్ప
గలవు బ్రతుకులో బ్రాంతియే గొప్ప గాను
పిచ్చి పనులు మంచివి గాను పేరు చెప్ప
ఊహ లోకాన సమరమే ఊయలగుట
......


మల్లాప్రగడ
28=02=2023
మీకు నచ్చిన పద్యము నచ్చని పద్యము తెలుపగలరు ఇవి కేవలము ఊహల కళల కలల పద్యాలు 
......

తే..చీకటంతయు నీవల్లె చేరి వగచె
బాసలన్ని యు నీవల్లె బదులు లేక
చిగురు ప్రేమైంది నీవల్లె చెప్ప లేను
మనసు తేజము నీవల్లె మంత్ర మాయె
.......
తే. చలన కన్నుల కన్నీరు చావలేదు
హేయ మనసుకు ఎక్కడ తావు లేదు
ఆశ కనుల జోడుకు దారి కొదువ లేదు
వేదన యని పలుకులోన విలువ లేదు
..........
తే..మేలు కొలుపులే మోహనా, మిన్న తలపు
లేదులే, ధ్వని కరుణయే ఈ పదాలు
చెవికి ఇంపు యగుటయేను, చేరు వగుట
ఉభయ ద్వందాల సేవలే ఉజ్వలమగు
........
తే.కడలి పొంగులు  పయనము గట్టు వరకు
మనిషి పరుగులు సుఖముకై మట్టి నందు
స్త్రీలు ఊహల కదలిక స్వేచ్ఛ కొరకు
కాల చక్రము తిరుగును కలుసు కొనుచు
........
తే. పువ్వు వికసించిగా నేత్ర పూజ్య మగుట
నారి నేత్ర కదలిక యే నాట్య భంగి
చూడ డెందమా నందము పూల వలెను
పూలు యే స్త్రీలు సున్నితంగాను నుండు
.......
తే. నింగి మేఘాల దుప్పటి నీడ గాను
ఇండ్ల తలపుల కదలిక ఇష్ట మౌను
ఉదయ కళ్ళు మూత యగుట ఊహ మారు
తేలివచ్చి పోవు కిరణ వెల్గు నీడ
.........
తే. కొంగలా ఎకాగ్రత నుంచి పోరు సలుపు
సింహము వలనే ధైర్యము స్వేచ్ఛ పోరు
కోడి లో నిబద్ధత చూపు వోడ కుండ
కాకి నమ్మదు ఎవరినీ కాల మందు
........
తే. ఉట్టిమాట ఎట్టా అన ఉత్త ముండు
గట్టి పోటు పెట్టి యు గట్టు గాటు నాటు
ఒట్టు చుట్టచుట్టి యు మట్టు ఓర్పు కాటు
చెట్టు నాటునోట్లును పంచు చిరుత వేటు
........
తే. నీలి గగనాన నెలరాజు నిలిపె జూపు
మగువ కురుల మల్లెలవైపు మాయ కైపు
ఘుమఘుమలు గగనమ్ము నే కమ్ముకొనియు
మన్మధుని వీక్షణ మగువ మనసు చెరచు
........
తే. నల్లుల తలపు మగవారి నటన యదియు
ఆగ్రహం అవ మానము ఆశ పొగరు 
భాగ్య అక్రోశ శరఘాత భార మగుట
నిత్య హారతి కప్పుర నీడ గున్న
.......
తే. చరిత గతిమార్చవచ్చును చలన మగుట
బుద్ధి గమన వేగన్ని ఏ పూజ మార్చు
ద్రోహ బుద్ధి దాగనులేదు పోరు యున్న
మంచి మనసున చేరక మడత పడును
....
తే. వంపులున్న యవ్వన చూపు వలపు ఏది?
దప్పి కొన్న కనుల చూపు మెరుపు ఏది?
బతుకు తోటలోన విరుల భాగ్య మేది?
కౌగిలింత సుఖము ఇచ్చు కాల మేది?
.........
తే. మనిషి భార్యేషణ మదిగా మనుగడయగు 
మనిషి పుత్రేషణ సుఖము మాయ కూర్చు 
మనిషి మద ధనేషణ వల్ల మచ్చ చేర్చు 
మనిషి అన్వేషణ బ్రతుకు మనసు వణకు
......

ప్రాంజలి ప్రభ /ఉషోదయ పద్యాలు ... 27 -02 -2023
.....
వేంకటేశ మమ్ము కలవ నీక ఏల
బాధ పెడుతున్నావుగదా నిదానము ననె 
నీవు ధర్మా న్కి అధికారి నిజము ఇదియు
దర్శనముమాకు కష్టమే దయయు లేదు
........
తే. ఎంత చెప్పిన తక్కువే యదలొ మాట....
ఎరుక నీవంతు ఇప్పుడు ఎల్ల వేళ....
ఉజ్వలభవిష్యతే నీది ఊయ లైన...
వేకువన చేరి కోరితి వేంకటేశ....
......
తే. గురువు లఘువుల కళయిక గుర్తు నీవు
స్వార్ధ నిస్వార్ధ జగతిన సమయ సృష్టి
సగుణ నిర్గుణ జీవితం సర్వము శివ
మోహ మదమత్సర నిదాన మోము విధియు
......
తే. చైతన్య స్వరూపాత్మయే చింత ఏల
పదము పలుకు పదార్ధము పరమ శివుని
వర్తమాన భూత భవిష్య వరుస వాక్కు
స్త్రీ పురుషుల శృంగారమే ఈశ్వర కళ
.......
తే. ఆత్మయే ప్రాణ మందిర అంతరమున
జీవుని మనసు ఆత్మగా కీలకమగు
జీవి దేహాన నీడగా జైత్ర ఆత్మ
దేహభాగాల మహరాజు దీన బంధు
......
తే. తెలిసి తెలియదనుట నీతి తెలపకాదు
సూర్య కిరణచూపులు చాలు సూత్ర పద్మ
వికసిత వదన వయ్యారి విస్త రించ
మాధుర్య సువాసనలు పంచ మంచి చేయ
.......
తే. నలుపు తెలుపను సరిబేసి నయన తీర్పు
మేనులోన బయట శాంత మేను నియమ
కక్షలో తిప్పు తూ కళ కాంక్ష కదలి
నదియె కడలిలో కలియుటే నటన లీల
......
తే. ఒక్క రూపైన భావము ఓర్పు జూపి
వయసు వాకిట కౌగిలి వరుసకలిపి
విశ్వ సుఖము ఇదేనులే విజయ మేను
వినయ వాంఛలు విదితము వీన విందు
......
తే. అక్కరకు వన్నె తెచ్చుటే ఆటలవియు
దిక్కు గాను అంతర్యామి తిధి మతి గతి
మ్రోక్కిన సతి పతులుగా మోహ చరిత
అదియి మూలమే జీవితం ఆశయవిధి
......
తే. తనది తనకొరకు ప్రవృత్తి తనువు వృత్తి
లౌకిక విషయం అనుభవం లౌఖ్య వృత్తి
తాననుభవించటము దైవ దయయు కృపయు
మెలగ డం నివృత్తి గ మార్గ మేలు జరుగు
........
తే.తపన ఎంత తీవ్రంగాను తరుము తున్న 
 కాల నిర్ణయం విజయమే కలసి వచ్చు           
జీవితంలో ప్రతిది బాధ కీలక మగు
ప్రతి గుణపాఠమే మన ప్రతిభ బాట
........
తే. ధనము చుట్టు కదులు ఓటు ధరణి యందు
సంఘ బలమున్న నమ్మక సమయ వాక్కు
హిందువులు ధర్మ లక్ష్య మ హీన బలము
సేవ తత్పరుల కృషియు శీగ్ర జయము 
.......

ప్రాంజలి ప్రభ అమృతఘడియలో తేటగీతి పద్యాలు 26=02=2023
తే. గుండె గుండె తట్టుటయేను గురువు పలుకు 
లెక్కమార కూడియు తీయు లయలు చిలుకు
హెచ్చరిక గుణకారమ్ము హెచ్చు తగువు
భరిత భవ హరకళ యేను భజన బిగువు
..........
తే. నీదు వేషమ్ము మనసునే నిలవనీదు
నీదు సేవించెడి విషమ్ము  నీమరణము
నటన బంధాలు మాత్రమే నయన విందు
శాశ్వతమనేది ఋణముక్తి శాంతి భక్తి
..........
తే. పొగడి పొడిచేను ప్రోద్బల పోరు ఇదియు
వగచి వలికెను వయ్యార వాకిటిదియు
ఎగసిన కనుల లీలలే ఎదల విధియు
ముగిసిన నటన వీధిన ముష్టి మదియు
........
తే. దుష్ట దుఃఖ చతుష్టయ దూర్తల మతి 
నష్ట నయనాంధకారమ్మె నాట్య జగతి
సృష్టిలో భరించి బ్రతుకు సమయ నీతి
బ్రష్టు పట్టినా ధర్మమే బ్రహ్మ చరిత
..........
తే..పిరికి వాళ్ల మాటలు నీవు ఏల నమ్మ
మురికి నీళ్లను త్రాగము ముంపు యున్న 
భయపడుతు బతుకున నీడ భక్తి ఏల
మోహ మొహమాటము వద్దు మోజు యున్న
.....
తే.  కోరికలు శ్వాస బంధము కోరి వచ్చు
అంద మానంద కష్టము ఆశ తోను
మొఖము వాచే అదృష్టము మొదలు ఉండి
తుదకు తప్పు పతిదని యే తూర్పు దిక్కు
.......
తే. మనసు చేసేది మునిగేటి మనుగడ మాల
అదియు లోకమనియు ఉచ్చు బిగువు చిక్కి
గతి మతి సతి చుట్టు కదిలె గళము మాయ
ఊహల నిజము ఉరుములై ఊయల గుట
..........
తే.  నిర్మల కొన ఊపిరి యిది నిజము కోరి
మర్మము తెలియని దేశాన మనిషి నేను
కర్మ వాక్కులు యివియన్ని కళల తీరు
జీవితాన సర్వమనెడి జీవ యాత్ర
.........
తే..లేవడంలోన కోడిగా లేత పిలుపు
పరుగులో గుఱ్ఱంఅగుట యేను పగలు తలపు
వినటలో పిల్లి బ్రతుకుగా వేల్పుల గుట
కుక్క విశ్వాసముగనులే కూడు దొరుకు
..........
తే.. ఎద్దులా సేవ చేయుటే ఎల్ల వేళ
కోకిల గళము స్వరమగు కోరు వేళ
నెమలి నాట్యము గానులే నెమరు వేళ
హంస విజ్ఞానమును పొంది హాయి గొనుము
..........
తే. సహసమున పులి మాదిరై సహన ముంచి
సింహ పు పరాక్రమమునే చేయ నేంచి
నిశిత దృష్టిలో చీమగా నియమ ముంచి
మనిషి ద్రోహబుద్ది గుణము మాత్ర మొద్దు
..........
తే.అర్ధ పరమార్ధ గణము ఆశ్రయమ్ము
ఆది పురుషుని ఆటలే ఆత్మ కదలె
అంధ కారమ్ము తరిమెటి ఆశ వెలుగు
ఆత్మ తృప్తియే కలిగించు అద్భుతమ్ము
........
తే...సకల వేదాంత సంసార సారమగుట
గురు పరబ్రహ్మ ధర్మమే గురి యగుట యె
జ్ఞాని విపులీ కరణ కర్మ జ్ఞాన మదియె
శ్రీ గురుభ్యో నమః భక్తి శ్రీనివాస
.......
తే...శాంతి రూప గణ గుణ మే సామ జవర
గమన భక్తిగా ధైర్యము గమ్య మగుట
సకల సృష్టికర్త నిలయం సర్వ సుంద
రమ్ము, జనులకెళ్ళ వినయ రమ్య తగుట

తే. చెలిమి చేరువగుట యేను చింత తొలగు
మనసు పలుకుగా ఉండినా మమత మెరుగు
హృదయ పలుకులన్ని కరుణ భావ ముంచి
సహన చరిత జీవితముగా సమయ తృప్తి 
.........
తే. పిరికి వాళ్ల మాటలు నీవు ఏల నమ్మ
మురికి నీళ్లను త్రాగము ముంపు యున్న 
భయపడుతు బతుకున నీడ భక్తి నన్న 
మోహ మొహమాటము వద్దు మోజు యున్న
.........
తే. ముద్దు చేసియు మోజు తో ముచ్చటించి
సద్దు చేయక సమతృప్తి సమయ మిచ్చి
హద్దు హద్దనే దాకనే హాయి గొలిపి
వద్దు వద్దనే దాకనే వయసు గలుపు
..........
తే. చేరుకోలేనిది పయనం చింత వలదు
గుండె శబ్దము అక్రో శ గుర్తు చేయు
అనుభవం పాఠము గనులె ఆశయమగు
మానవత్వమ్ము గమ్యమై మనుగడగను 
......
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ.👍

తే:: బాల కృష్ణ నటన తోను బంధ జనులు 
పగల రాత్రి నటన తోను  ప్రజల కొరకు
తండ్రి ఋణము తీర్చు గలుగు  తెలుగు కళలు 
నందమూరి నటన తోను నయన కళలు
......

తే::గురక నిద్ర లోకము నందు గుర్తు వరకు
లోక రీతు లయలకేను లోటు లేదు
చీకటార్పలేము వెలుగు చేర కున్న
మాటవిలువ పోగ మనము మనగ లేము
......
తే::చోటు మూడడుగులు కల్సి చెప్ప లేవు
విజయ వాంఛలకు కళలు వేగ పరచు 
సెగల ఎగతాలి పలుకులు సేతు వవవు
చరిత తెల్పుసత్యము జీవి జీవితమ్మె
.......
తే::రెప్పలు కదిలే కంటిపై రక్షగా ను
కిరణ కదలిక తప్పదూ కిక్కు కొరకు
మళ్ళి మల్లిక ప్రేమయు మాన దీక్ష
ఏది వద్దని అనియున్న ఏల బ్రతుకు 
***

తే::తామరాకు జలము చేత తపన భద్రత
దివ్య పురుషుల వాక్కుతో దినము మారు
సాహచర్యము మనలోన సాక్షి గుణమ
నోమయమగుట సత్వ ర నొచ్చు టకల
.....
తే::కనుల జూపు మనసు  కమనీయ శుభ్రత
కలలు ఎన్ని కన్న కాంతి మారు
మృధుమధురముగను లె మృత్యువు తోమమ
కార్య సాధనమ్ము కప్పము కల
......

తే. మనసు దోచిన  వెన్నెల కాయు రోజు
 నవ్వులన్ని దో చిన మల్లి పూయు రోజు.
నింగి అద్దమై దోచిన నిజము రోజు 
 దాచుకున్న వెన్నెల వెల్గు కాయు రోజు
........
తే. దోచుకున్న మల్లిక చూపు పూయు రోజు.
 మోమునే దాచివుంచెడి మోజు రోజు 
మనసు ఒద్దిక జాబిలి చూపు రోజు.
తొలి పరువపు సిగ్గులుయన్ని తోచు రోజు
......
తే. మనసు కొలనులోని కలువ కన్ను రోజు
చీకటి పరచిన మదిలో చిక్కె రోజు 
ఒక్క ఆశ పరవశించ ఓర్పు రోజు.
 తెరను మూసిన గది చూపు తీర్పు రోజు
......
తే. రెప్పల కనుల బాసలు చేయు రోజు.
కనుల సుందర కలయిక కామ్య రోజు 
తొలి పరువపు సిగ్గు ల చూపు తడిచ రోజు 
కలువ కన్నులుమూసిన కథల రోజు
.......
పరచిన మది భావాన్ని యె పలుకు రోజు 
ఆశ పరవశించిన కావ్య రాసె రోజు.
చెప్ప బాసలు చేసిన చెలిమి రోజు.
కలసి కట్టుగా కళలు కథలు రోజు
........
తే. ఇంత వలపక్ష మేల శ్రీ కాంత రోజు 
ఇంత బహుమతి మేల శ్రీ భామ రోజు 
ఇంత శుభమివ్వ మేల శ్రీ సత్య రోజు 
ఇంత నిజమని మేల శ్రీ విద్య రోజు 
.......
తే. వెళుతు చీకటినే నేను వదలె రోజు 
ఆశల తరువుల చిదిమి ఆట రోజు 
ప్రమిదలోన చమురునంత ప్రగతి రోజు 
దుఃఖము మదిలో నింపియు సుఖము రోజు
.........
తే. మనసునే కమ్ము కనువిందు మధువు రోజు 
అదియు అత్యద్భుతమయిన హరియు రోజు 
సకల హృదయమ్ము రంజిత సమత రోజు 
ధన్య వాదాలు తెల్పుతూ  ధరణి రోజు
..........
ఉషోదయ తేటగీతి పాధ్యాల మాల.. ప్రాంజలి ప్రభ.25=02=2023

*గృహము - పద్య కవిత 

తే::  గృహము కొబ్బరి కాయలా గడప తోను 
ఇరుకు లేని వెలుతురున్న ఇల్లు అదియు 
సేద తీర్చు లోగిలి ఇది స్వేశ్చ నిచ్చు 
రంగుల కలల సౌధము రమ్య పరచు    
.....
తే:: ఇదియె హృదయాల సంగమ0 ఈశ్వరేశ్చ 
గోడల కలయికయె కాదు గూడు అదియు 
మనుషుల బ్రతుకు చిరునామ మనసు పంచు 
మనసు లో సుస్థిరత్వము మనుగడ గది
......
తే:: దూరపుశిఖరం నునుపుగా ధూప వెలుగు
వెండి రూపునత్త మనకు వెండి బ్రమ యె
యెండ మావులు జలముగా యెదను బ్రమయె
తెలుసుకోదగ్గ దేదియు లేదు లేదు
......

తే:: దిగులు తాకట మంటేను తిట్టు ఏల  
తెగులు సోకటమేయగు తిరుగు టేల   
చెట్టు లా బ్రతకాలిలే చింత లేల 
చిక్కి పోవటమే యని చిందు లేల 
---
తే::తామరాకు మీది జలము తట్టి కదులు
సుఖము నుత్యాగ పరిచినా సుడుల తిరుగు
ఆ లొచనపుట్ట మనసునే ఆశ తెరలు
మోహము కలిగి ఉండకే మోజు కళ్ళు 
---
తే:: మబ్బు రక్త వర్ణములతో మసక వెలుగు 
రెబ్బ రెక్క రెపరెపల రంగు మారు  
దెబ్బ పిడుగులా గగనమ్ము దడలు పెరుగు 
డబ్బు విలువయే చూపేది ఢమరకమ్ము
---
తే. గురువు నమ్మి సేవలు చేసి గుర్తుగుండి
జ్ఞాన విజ్ఞాన అభ్యాస పాద సేవ
కర్మ పరిపక్వత సహనం కాల మంత
విశ్వ నాధుని ప్రార్ధన విజయ మేను
..........
తే. యోగ్య మైనది తెల్ప అయోగ్య కొంద
రికిని యుక్తము యె అయుక్త  నియమ మగుట
 రాహువుకుఅమృత మరణం ఆశ వల్ల
శంకరుని కంఠ భూషణ సమయ విషము
........
తే. పరిమితి అపరిమితి కళ ప్రకృతి పరము
వినదగు వివరములు కళ విధిగమనము
తనువు తపనలు ఆరోగ్య తృప్తి వనము
మించిన పనియు లేదులే మేలు చేయ
..........
తే. వెళుతు చీకటినే నేను వదలి వెళ్ళ
ఆశల తరువుల చిదిమి ఆట వెళ్ళ 
ప్రమిదలోన చమురునంత ప్రగతి వెళ్ళ 
దుఃఖము మదిలో నింపియు సుఖము వెళ్ళ
..........
తే..  పాముకే కాళ్ళు లేవులే పలక లేదు 
కప్పకే మెడ లేదులే బెకబెకబెక 
పీతలకు తల లేదులే ప్రియము కాదు 
మనిషి కే బుద్ధి సక్రమంగాను లేదు
.........
తే. మనసునే కమ్ము కనువిందు మధుర మాయ
అదియు అత్యద్భుతమయిన హరియు నీడ
సకల హృదయమ్ము రంజిత సమయ మిదియు
ధన్య వాదాలు తెల్పుతూ  ధరణి యందు
..........
తే. ఇంత వలపక్ష మేల శ్రీ కాంత నీకు
ఇంత బహుమతి మేల శ్రీ భామ నీకు
ఇంత శుభమివ్వ మేల శ్రీ సత్య నీకు
ఇంత నిజమని మేల శ్రీ విద్య నీకు
............
తే...బద్ధక మతి నిరాశ భయము వల్ల
క్రోధము నిరుచ్చాహము కోప మెల్ల
అనునయ అనుమానపు రోగ మేల ఎల్ల
పుడమి వృద్ధియా గి ప్రకృతి పుష్ప మవదు
..........
తే. అమ్మ లయకారి చెప్పేది ఏమి మీరు
శివుడి లా ఆదరించక సరళ మేల
పంచ భూతల కోటకు ప్రగతి ఏది
కోట సోమరాజుకు వంద నాళ తెలుగు
.........
తే. విలువ లేనిచోట మనసు విప్పవద్దు
ప్రేమ లేనిచోట మనసు ప్రియము వద్దు
మనది కాని దాన్ని మనసు మెచ్చ వద్దు
ఆశ పడియు పోగొట్టుట ఆట వద్దు
..........
తే. సహజ నిశ్శబ్ద క్షణములో సరయు చుండు
కొన్ని కిటికీలు ఎప్పుడూ  తెరుచు కొనుట
గాలి వచ్చుటా పోవుటా కానరాదు
పారవశ్యస్థితున ఉండు ప్రగతి మనిషి
........
తే. పుష్పములయందు పరిమళం పుడమి యందు
లేత చిగురు ఆకర్షణ ఆశ పుట్టు
నవ్వులపసిపాప నడక సంతసమ్ము
పైవి ముదిరిన వైభవ మేను తగ్గు
.........
తే.ఎవరిమాటలో  తోటలు ఎన్ని గలవు
ఎవరి మాటలో కోతలు ఎన్ని గలవు
ఎవరిమాటలో తూటాలు ఎన్ని గలవు
ఎవరి మాటలో సత్యాలు ఎన్ని గలవు
.........
తే. గజ్జి పట్టి వదలలేడు గజదొంగ
పదవి పట్టి వదలలేడు ప్రధమ వ్యక్తి
సంచి సహకార సహనమే సమయతృప్తి
ఎవరికున్న యుక్తి యె వారి ఏలు భుక్తి
.........
తే..ఆత్మ జీవత్మ పరమాత్మ చేరువగుట 
ఆత్మ యే సాక్షాత్కారము అంతి మదశ
ఆత్మ జ్ఞాన స్వరూపము ఆశ్రయమగు 
కొన్ని పరమాత్మ ప్రాప్తికి కోరు ప్రకృతి
.........
.
మీ విధేయుడు... మల్లాప్రగడ రామకృష్ణ



తే. ఆడ దాని బ్రతుకు యిది ఆట ఇదియు
అంద మని చిక్కితే గతి ఆత్ర మగుట
ధనము ఆరోగ్యము కళలు దారితప్పు
యిది విచిత్ర చిత్ర జగతి ఇచ్ఛమాయ
........
ఎవరి హృదయ స్వరము వల్ల ఏల కదులు
ఎల్ల వేళల కాలము ఎదను తట్టు
వానలా కలసియు ఉండి వరద లవక
గాలిలా కలసి బ్రతుకు గాయమవదు
.........
తే.కలము కలలన్ని తెలిపితే కాల మాయ
కనక బ్రతక గలుగుట యే కామ్య నిజము
లోకము నయన చూపులు కోప తాప
మదిన మహిమయే జీవితం మనుగడయగు
.........
తే. యింత పాపంబు జగతిలో నేచటనైన
గలదె నాపాప మిటు పండె గాక అయిన
ధరణి నీ మదికరుణ మాత్రంబు తప్పి
చెప్ప లేని కన్న కొడుకు చేర విధియు
.........
తే. చెలియ శాకుంతల కలలు చేరు వాయె
పృద్వి రాజు ప్రేమ చిగురు పెళ్లి చేరి
సంగమ సుఖము పొందియే జారు కొనియు
గర్భవతి సతి గమనించ లేని రాజు
......
తే. చరణ పద్మము మీదియు చంద్రకాంతి
సిరులు మించిన గుణముయు శీతలమగు
మోహనా కృతి మీరగా మురువు యున్న
దేహమను దాహ మగుటయే తేన తీరు
.........
తే. తియ్య నైనభాష మనసు తల్లి భాష
అక్షరాల పద కళల ల్లాంటి భాష
అమ్మలు మరిపించే ఆశయాల భాష
నిత్యమూ సుగం దాలుగా నియమ భాష
.........
తే. బ్రహ్మ మతిలేని నాసృష్టి బంధ మణియు
గమ్య మెరుగని దారినే గళము విప్పె
అవని బ్రతుకులో చెడుగుడు ఆశ చూపె
గురువుగా విధాత తెలివి గుర్తు రాదు
.........
మర్మ మేమిది కాదులే మసక వెలుగు
బ్రహ్మ సృష్టియే విధి వ్రాత బంధ మగుట
అడగ లేని జీవమగుట అలక కాదు
తెలుసు కోలేని ఫలము యే తేట నీతి
..........
తే. పెళ్లి తో కవిత్వము పుట్టు ప్రేమ కొరకు
జీవితం గాయ మయినను జపము కవిత
నిలువ నీడ కొరకు నిజ నియమ కవిత
బీదరికము లోన బ్రతుకుల గీత బోధ
........
తే. మంచు తెర విడిపోయినా మనుగడ గుట
పదపదమని ఉషోదయం పలుకరింపు
పక్షుల కువకువ గళము పగలు తెల్పు
గుడి బడిన గంట గణ గణ గుర్తు చేయు
........
తే. చెంచె లా అని పిలిచేను చేరి గిరిజ 
బిచ్చగాని భార్యవు నీవు పిలుపు లక్ష్మి
తండ్రి ఎవరు అని పలుకు చేరి గిరిజ 
నీటిలినుండి పుట్టావు నీవు లక్ష్మి
.........
......
ఏ నిమిషమును నీదియు ఏది కాదు 
నిజము తెలిపితే బతుకంత నీది నీది
ఏ కలము రాత నీదియు ఏది  కాదు
నిజము హృదయము పట్టితే నీది నీది
......
శ్వాస నుండివచ్చేది విశ్వాస మవదు
విశ్వ మంతయు ఉన్నను విజయ మేను 
కర్మ లన్నియు మర్మాలు కాదు కాదు
ధర్మ మంతయు సంపద దాత  కాదు 
.......
నీస్వ రములు నీవియు కానె నీడ మల్లె 
నిన్ను ఆవహించే శక్తి  నిజము నీది
సంప దంతయు కష్టమ్ము సమర మేను 
ఉన్న దంతయు పొందేది ఊహ కాదు 
......
నీకు మాత్రమే తెలిసింది నిజము ఏది 
నీకు ఉన్నట్టి ప్రేమయు  నీది కాదు 
నీవు చేసేవి నిజముగా నిలకడవవు 
నీవు పొందే సుఖములన్ని నేటి వరకు 
.....
*యవ్వనంలో మనసు ఏది యంటె యదియె
తిండిలో కూడ ఎక్కువే తెలుపు చుండు
వృధ్ధ దశలో అనారోగ్య వృద్ధి చెంది
తిండి కి కరువై మందులే తినుట బ్రతుకు 
.....
*కనుల రెప్పలా కదులుచూ కాయ ముండు
కేశములు ఖండనగుచుండు కీడు కాదు
లోక సంఘర్షణల వల్ల లోలకమగు
వ్యక్తుల విపత్తు నెదిరించి వేగ పడకు
......
తల్లి తండ్రుల కళలన్ని తనయ పొంది
తాత నేర్పిన కధలన్ని తండ్రి కోరి
కాల మార్పులో వృధ్ధులై కలువ లేక
బిడ్డ లనలేక వీధిన బ్రతుకు లేల
.........
జ్ణాన మననుది ఓర్పుతో జ్ఞాని నీడ 
జ్ణాన సంపదే మనలోన జ్ఞప్తి లక్ష్మి
జ్ణాన నిర్ణయం జీవితం జాతి నందు
జ్ణాన ప్రకృతి యే కదులుతూ జాతి నందు 
.......
జ్ణాన ఉదయమే జ్ణానమ్ము జీర్ణ శక్తి
నిత్య మేధస్సు పెరుగుట నేటి ప్రగతి
సత్య వాక్కులు ప్రతిభగా సమయ మందు
విధిగ జ్ణాణోదయము పొందు వేద వాక్కు
....
సిరివెలుగులతో విరజిమ్మి స్వేచ్ఛ నొసగి
జనుల ఆకాంక్ష తీర్చియు జయము నుంచి
సకల సదుపాయ సహనమ్ము సిరుల నెంచె
ఇదియె మన తెలంగాణగా ఈశ్వరేశ్ఛ
.....
మీ విధేయుడు రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

తే. తరతమ తమక తకధిమియే తెలుగు తపన
తేట తెలుగు తనము తడి తీట బట్టె
తెలుపు తనము లేక తెలుగు తాప బుద్ధి
మాతృ భాష మడత మంచ మాయె ఏల
.....
తే. మనసు మూగబోయె పలుకు మరవ నీక
మనసు విరుగు మాట మనిషి మాయ చిలుక
మమతలావిరగుట వల్ల మనిషి మారు
వినయ వాంచలన్ని జరిగేవి విదిగ

తే::  సకల లోక మేలు తెలుగు సహన నీతి
అమ్మ నీకు చేసెడి సేవ తెలుగు నీతి 
అందు లేదు ఇందునుశక్తి తెలుగు నీతి 
మేలు కొల్పు మనసు  శాంతి నీతి 
....... 
తే::  అమ్మ తనువు చెలిమి వళ్ళ చలువ తెలుగు 
సృష్టి లోన లేమి కదర సరయు తెలుగు 
అమ్మ పాల లోని బలిమి ఆశ తెలుగు  
నీదు లోన శ్రేష్ఠ మనుట నీడ తెలుగు  

తే. వందనమ్ము తెలుగుతల్లి వ్యక్తి గాను
దోహదపడేది తెలుగుయే దోష మేళ
అమృత తుల్యమైన తెలుగు ఆట ఏల
మృగ్య మయ్యే వరకు ఏల మనసు తెలుగు
......
తే. అవనిలో అవ ధానిగాను తెలుగు
పుడమి భాష మహారాణి పుష్ప తెలుగు
కాళి దాసు, బానుడు కావ్య తెలుగు
దండి భాసుడు కవులలో ధర్మ తెలుగు
.......
తే. సిరులు పంచనున్న తెలుగు వినుట ఏది
పలకరింపులో మధురాతి పలుకు ఏది
బిడ్డ ఉన్నతి సంపదే స్థిరము ఏది
ప్రేమనే పంచు తెలుగు కే పేరు మార్చె
.......
తే. అమ్మ నాన్న చెప్పుట మాని అద్ద మగుట
మాతృ భాష మరచియేను మమ్మి డాడి
కర్మ ఏమి మన తెలుగు కాటి కగుట
తల్లి తండ్రు లే మూలమై తప్పు చేయ
.......
తే. మాతృభాష మసకబడి మాయ మగుట
పరుల భాష కక్కుర్తి యే పడక నేడు
మీరు ఏమిచేయ దళచే చెప్పలేక
కమ్మనైన భాషకు రోగ కమ్ము కుండె
........
తే. తరతమ తమక తకధిమియే తెలుగు తపన
తేట తెలుగు తనము తడి తీట బట్టె
తెలుపు తనము లేక తెలుగు తాప బుద్ధి
మాతృ భాష మడత మంచ మాయె ఏల
.......
తే. తియ్య నైనభాష మనసు తల్లి భాష
అక్షరాల పద కళల ల్లాంటి భాష
అమ్మలు మరిపించే ఆశయాల భాష
నిత్యమూ సుగం దాలుగా నియమ భాష
........
తే. చీకటి తరిమే వెలుగుయే తెలుగు భాష
మనిషిలో తరిమే చిక్కు మహిమ భాష
వినయ విధి విధానం మతి తెలుగు భాష
పలుకు లన్ని తెలుగు కళ ప్రగతి భాష
......
తే . తియ్యనిమన తెలుగు మాట విజయ  కోట
అది కవులు పంచిన తెలుగు ఆశ ఊట,
 పెంచినారు జన తెలుగు  పూల దోట,
దేశభాషలందు తెలుగు లెస్స ఊట
.......
తే. అష్ట దిగ్గజాల పలుకు  తెలుగు నోట
మృదు మధుర మనోహర మనసు నోట
భావ భవ అక్షరకళ  భాగ్య అట
కృష్ణ శాస్త్రి ఊహల్లో ని కలల ఊట
......
తే. అభ్యుదయ కవిత్వాననె అందెఆట
 వెన్నెలల్లా తెలుగు  పేల్చ వేకువాట 
తెలుగు వెలుగులు పెంచుతూ తీపి మాట
అందలం ఎక్కె తెలుగుయే ఆత్మ చోట
......
తే. నరనరాన చేర్చిన ఊపిరిగను మాట 
 ఉన్నతికి ఉద్యమించడం మార్గ మాట
ఉగ్గుపాలతో ఉయ్యాల ముఖ్య పాట 
జై తెలుగు తల్లి  వర్ధిల్లు జైత్ర పాట
........
తే. యుగ యుగాలునుండు తెలుగు యోగ్య మాట
గాలి కదలిక కథలుగా గళము మాట
నీరు జలజలా శబ్దము నీడ ఆట
పుడమి తల్లి పులకరింపు పట్టు పాట
.......


నేటి తేటగీతి పద్య మాల
తే.వేట నక్కల భ్రమలన్ని విడిచి సుఖము 
ఆశ పాశమునకు గురి చేయు సుఖము 
కాల గర్భము ననె ముంచు కళలు సుఖము 
ప్రకృతి మెచ్చెడి వారికి పరమ సుఖము
........
తే. ధరణిలో దేహమనెడిది ధరయు లేదు
ధనము శాశ్వత అలజడి ధరయు కాదు
బంధ సుతులు మిత్ర స్థిర ధరయు ఏది
బంధుజాలబృత్యులు చేరు ధరయు నాంది
......
తే. అంత రంబున చెలికార నంట గానె
జాలి అతుకుల లంకెయు జపము గానె
స్నేహమౌ అపూర్వ సుఖము సేతు గానె
ప్రేమ కోరేది తనువవ దేను ఆత్మ
.........
తే. స్థిరము స్త్రీ మొహం వవదులే సమయ మందు
పురుషవాంఛ లోంచి మెలకెత్తును పుడమిన
ఓపికను బట్టి బంధమై ఒడిసి పట్టు
నిగ్రహం సమగ్రత వల్ల నీడ వుండు
........
ఎవరి పెదవులు తాకినా ఏకమనియు
ఎవరి కన్నీళ్లు తాకినా ఏల దుఃఖ
ఎవరి పలుకుల ప్రేమయు ఎదను తాకు
ఎవరి కరుణ దయ కృపయు ఏమి చేయు
.........
తే. దివ్వె వెలిగించ మసకలు చెల్లి పోవు
నవ్వు వెలిగించ అలకలు చెల్లి పోవు
పున్నమిన సిగ్గు భయముచూపులను పోవు
ప్రేమలు కలసి బ్రతుకులో పేరు పోవు
....
తే.....తలపులలొ తాపము తట్ట తలుపు నోరు 
తట్టిచస్తేగదాకథ తారు మారు 
కవితలువ్రాసేది మనసు కలల తీరు
తనువులు మురిస్తె తపనలు తృప్తి వేరు 
.......
తే.  మాటలు వదిలితేగదా మనసు చేరు 
మనసులుకలిసేది నిజము మాయ పోరు 
మంచి చెడుతెలిసేదియే మగువ తీరు 
తెలియు మౌనంవహిస్తేను తిరుగు మారు 
........
తే. కళ్ళు మూతలై తేగదా కలలు రావు 
నిద్రవచ్చేది విశ్రాంతి విజయమగుట 
నవ్వితేగదా మోములు వెలుగు పుట్టు 
అడుగు కలసియే లేస్తేగ ఆట పట్టు 
........
తే. అభ్యసిస్తేగ పదవులు ఆశ పట్టు 
పదవులుదొరికేది ధనము  పగలు రాత్రి 
నీటిలో దిగితేగదా లోతు తెలుసు 
వెనుదిరిగితేను కథలన్ని వెనకబడవు 
......
తే. రుచితెలిసి తింటె కడుపు ఋణము తీరు 
విత్తునాటితేగద మొక్క నిలివ గలుగు 
జాలు వారునీరు పరుగు జయము నిచ్చు 
కోరు వలపుతలపు ప్రేమ ఓడి గెలుచు
........
తే. కళ్ళకే జోడు అవసరం కీలకమగు
కాళ్లకే జోడు నడకకే కీలకమగు
కరములకు కర్ర జోడుయే కీలకమగు
మనిషి మనిషికి తోడుయే మేలు యగుట
.......
తే. మనసు మూగబోయె పలుకు మరవ నీక
మనసు విరుగు మాట మనిషి మాయ చిలుక
మమతలావిరగుట వల్ల మనిషి మారు
వినయ వాంచలన్ని జరిగేవి విదిగ 
........
తే. తరతమ తమక తకధిమియే తెలుగు తపన
తేట తెలుగు తనము తడి తీట బట్టె
తెలుపు తనము లేక తెలుగు తాప బుద్ధి
మాతృ భాష మడత మంచ మాయె ఏల
***

ప్రాంజలి ప్రభ నేటి ఉషోదయ తేటగీతి పద్యాలు రచయిత మాల్లప్రగడ రామకృష.. పెద్దలు గురువులు తప్పులు తెలపగలరు మీ విధేయుడు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ
తే. చారు తులసీదళ శమక్షమాది రామ
సౌర్య శ్రీంగార రమవల్ల భవుడు రామ
రాక్షస విరామ లోకాలు కాచు రామ
మంగళకరములను పంచు మనసు రామ
........
కృషి ఫలితము అమ్మ కృపయే కృష్ణ మాయ
సహన తోడునీడ కలసి సహచరముగను
జరుగు సంఘటనల కళ జపము కథలు
వెళ్ళు విరియుట జీవితం విజయ మగును
........
ఎవరు మీరు ఏమనను లే ఏది అయిన
అమ్మ పలుకులవి వినయ ఆశ లివియు
నమ్మలేని నిజా లతో నటన నాది
అడుగు వారులేక పుడమి ఆట కవిత
.......
తే. సేవ నిష్కామ కర్మకు సేతువేది
శాంతి చేకూర్చు ఆధార శాస్త్ర మేది
మీరు గుర్తించు విద్యకు మీస మేది
చెప్పు పలుకులు తేలిక చేత లేవి
........
తే. వీడకు చిరునవ్వులు విశ్వవిద్య విధిత
మరువకు మమత కళలు మాన వత్వ
మందిరాన మనసు పంచు మరులు గొలిపి
శాంతి చేకూర్చు సంపదే సమయ తృప్తి
.........
తే. ఆది అంతము నుండును ఆట శివుడు
పగలు రాత్రియు  ఉపవాస ప్రకృతి తోడు 
జాగరూకత జాగార జాము రాత్రి
హృదయ మందు శంకర నామ హృద్య ఫలము
........
తే. కడిగి చేయవచ్చును శుద్ధి కడవ నైన
కాల్చి చేయవచ్చును శుద్ధి ఖనిజ మైన
మలిన మైన బుద్ధిని మార్చ మనసు ఏది
దుష్ట గుణము న్న ధూర్థుల దూర ముండు
........
తే. సార్ద కత నమ్మకం పైన సహన ముంచి
స్వంత మన్నదీ ఏదియ సేతు వవదు
విధియు వైకుంఠ మార్గము విజయ మవుట
వాసుదేవో సకల సృష్టి హాయి నిచ్చు
.........
తే. విర్ర వీగకు సంపద నీదు కాదు
నీదు దేహము నిత్యమూ  నిలకడవదు
కాల నిర్ణయమే కళ సాగు చుండు
రక్త పాశ యముకలతో రంగు మారు
.........
తే. మగువ ఆకర్షణ నడుము మనసు చేరు
నడుమ కున్నవడ్డా నమే నడక చూపు
నయన  కాంచన వెలుగును నరుడు చూడు
ఎక్క దిగ అయినా ఆకర్ష మరవ నీదు
.........
తే. మగువ కరములందు కళలు మనసు చూపు
కరము లలొ కట్టె వంకె సంతసము తెచ్చు
హావ భావాల హృధ్యమే హాయి గొలుప
మెరపుల కరములు చూడు మేలు చేయ
........
తే. చంద్ర హారము మెరుపులు చెలము నీరు
లాగ హృదయము తాకియు లయలు కోరి
తరుణి విశ్వాస తేజస్సు దారి చూపు
హృదయ వాంఛలు తీర్చేటి అరుణ కిరణ
తే. విధి నడక తెల్ప లేనిది వినయ మనుచు
ఆశలు అడియాశలు చేయు ఆట ఇదియు
అందరం దైవ నిర్ణయం యదలు తట్టు
పుడమి ఋణముతీరగ స్వర్గ పురము చేరు
.........
తే. సుందరి సువర్ణ లేఖలు సురులు నరులు
చదివి నేనంటె నేననె చేరు వగుట
హావ భావ విన్యాశాలతోను హాయి
పంచ దలచి ఒకరొకరు ప్రతిభ జూపె
......
ఒంటికి వలపు బిగువుగా ఒడిసి పట్టి
అవయవాలు సౌష్టము చూప ఆశ పెరిగి
పురుష శ్రేష్ఠలు పిరుధుల స్ఫూర్తి హృదయ
వాంచ తో నరకము పొంది వదిలె జీన్సు
........
తే. మగువ ఆకర్షణాశబ్ద మగని జూపు
చెవుల కుండేటి జూకాలు చెంత చేర్చి
ప్రియుని ఉద్దేశ్వ ముద్దుల ప్రేమ పెంచి
మేను పొంద సౌఖ్యము యిది నేటి తీరు
.......
తే. చంద్ర హారము మెరుపులు చెలము నీరు
లాగ హృదయము తాకియు లయలు కోరి
తరుణి విశ్వాస తేజస్సు దారి చూపు
హృదయ వాంఛలు తీర్చేటి అరుణ కిరణ
.........
తే. కళ్ళకే జోడు అవసరం కీలకమగు
కాళ్లకే జోడు నడకకే కీలకమగు
కరములకు కర్ర జోడుయే కీలకమగు
మనిషి మనిషికి తోడుయే మేలు యగుట
.........
తే. పెసరు పప్పుచారు రుచులు పిలిపు లాగ
జిహ్వ చాపల్య మును పెంచ చురుకు
బుద్ధి పుట్టియు ఆరోగ్య ఋణము లాగ
మనసు హృదయ వాంచ పరుగు మనుగడకునె
.........
తే. తనువని యడి కల్పతరువు తాప తపము
ఫలము కొనెడి విజ్ఞానము పగలు రాత్రి
కోయల గళము పుట్టుట పోవుట యగు
నిశ్చయము మది ఉల్లాస నీడ నిజము
........
శ:: ఏమమ్మా సహజమ్ముయేను కనులే ఏమాయ చేసావులే 
క్షేమమ్మే తరుణమ్ము యేను తనువే క్షామమ్ము కాదేనులే        
కామమ్మే వినయమ్ము యేను సహనమ్మే సామదాహమ్ములే    
ప్రేమమ్మే మనమధ్య యేను విజయమ్మే ప్రేమతోడ్పాటులే      

తే. దేని నుంచి వచ్చిందో యదే యిదియని
దేని తో జీవనమ్ము గా దేశ మయిన
దేని లో అంతయు లయమౌ శివ మహిమయె
సృష్టి యంతయు శివుడేను శృతి గమనము 
.......
తే. లౌకిక ప్రపంచానికి సౌమ్య దేవ 
నిర్వి కార తత్త్వము తెల్ప లింగ రూప
ఆది మధ్యాంతరము లేని ఆది దేవ
నిర్గుణస్వరూపమ్ముయే శివ శివ శివ 
.........
తే. చూడు వీరితో జాగ్రత్త చూపు మార్చు
సందు ఇచ్చావ మొత్తాన్ని సొమ్ము చేయు
వ్రేలు కదపలేని పరిస్థితిగను యుండు
అనుమతే కోరు నిలయము ఆశ చూపు
.......
తే. హృదయ పూర్వక ధన్యత హృధ్య మిదియు
సకల విద్య పండిత వర సఖ్య తిధియు
తెలుగు వెలుగు సాహిత్య మనస్సు ఇదియు
శ్రేస్టుల కళయిక మనసు సేవ విధియు
.......
తే. ఒకటి ఆశ నిరాశయే ఓటమి యగు
వేరొకటి బహుశా మది విజయ మగుటె
మరొకటి కళల ప్రేమయు మనసు యగుటె
జీవి పేరాశ యగుట యే దీన బ్రతుకు
.......
తే. తరుణి తరుణ సద్వినియోగ పదవి నిచ్చ
తరుణి వినయ వాంచలు తీర్చ విరుల మాల
తరుణి తెలిపెడి పాఠము తృప్తి నిచ్చ
తరుణి కనుల పిలుపు లీల పరిగిడు కథ
......
తే. కుదవ పెట్టినా బ్రతుకులో కునుకు లేదు
తీరిక కొన కలిగిన మదీ కధేది
అమ్ముకొని నేను మనుటకే ఆశ లేదు
ఉన్న వన్నీ కలలు యగు ఊత మేది
....
తే..నన్ను ఓడించు వలపుల నయన రెప్ప
భూమి చిల్చుకొనే వచ్చు భుక్తి రెప్ప
నాపె దాల కదలిక అకాల మోప్ప
పిడికలి బిగించి తెలుపుటే ప్రేమ చెప్ప
.......
తే. సార మేదైన పలుకులో సహన ముంచు 
వీర వనిత ధైర్య ముగాను  విజయ మెంచు 
మార లీలలే బ్రతుకేటి మనిషి నెంచు 
తార లక్ష్యమే జీవితం కామ్య మెంచు
.......

తేటగీతి ప్రేమ మాల కంటి
మల్లాప్రగడ రామకృష్ణ 
తే. ప్రేమ సాలీడునై గూడు పెట్టు కొంటి
చలికి వాలిపోయి వలలో చిక్కు కుంటి
రంగుల కలలో మెలకువ రూపు కంటి
పవలు రేయి కళలు చూపి కలలు గంటి
.......
తే. ఆమె రాకతో వసంత శోభ కంటి 
దరికి పిరికి మదిన సంశయించి కంటి 
కామనలు ఎన్ని ప్రియురాలి కైపు కంటి 
కోమలి సహజీవనముయె కోరు కొంటి
.......
తే. వాలిన కురులు రేయిలో వలపు కంటి 
చెంద్రును కళలు చెలి మోము చేరి యుంటి  
నడుము మన్మధ ధనువని నెంచి కంటి 
జలదరించ కళలు కవ్వించ మది కంటి 
........
తే.  తనువున ఫల పుష్పములతో తపన కంటి 
కనులకింపుగా  కొసంగ కనులు కంటి 
ప్రాణ సఖి మనలేనులె పలికు వింటి 
ఆనతిచ్చిన అంకిత జేతు కుంటి
......
నవ్వుల నెలరాజు పిలిపు నయన గంటి 
ప్రియడు గోపాలుని వలపు ప్రేమ గంటి
రాధ మృధుమధుర పలుకు రమ్య గంటి
వేణు నాదమై మనసున వేల్పు గంటి
.........

PRANJALI PRABHA ఉషోదయ కవిత్వం 🌹
......
తే. పద్మ రాగశిలలు వలె ప్రభల లీల
విలసిత కనకాంబర మగు వినయ లీల
ప్రణతి ప్రణమామ్య పద్మజా ప్రకృతి లీల
ప్రేమ సౌరి ప్రియ మదీయ ప్రియము లీల 
.....
తే. ఎంత చూసినా కొత్తగా ఏల లీల 
ఔర యనిపించు అందము ఔర లీల 
ఎవరి పిలుపుకో అదరహో ఎదురు లీల 
సూడు ఎటు చూస్తున్న ది ఆమె సూపు లీల
.....
తే. కమ్మనైన సు ధారస కైపు లీల
మధువును గ్రోలి మైకపు మగువ లీల
రమ్య త మదిలో రాధిక రవ్వ లీల
తుమ్మెదను కోరి మకరంద తృప్తి లీల 
......
తే. రాజు రారాజు అయినను కాంత దాసు
డగుట ఊరకుండ గలుగు నా కధలగు
కళ్ళలో నిల్చి పోవాలనెడి ది ఆశ
నీడలా నిను తాకేద నిజము ప్రేమ
......
తే. సన్నని నడుము వంపులు సఖ్యతగను
గుట్టుగ పెదాలు కదలిక చురుకు గాను
గాజు బొమ్మను నేనులే కలలు గాను
గుండె గుడిగాను మార్చితి గుర్తు గాను
.....
తే. ఈ వరూధిని మనసులో ఇష్ట లీల
నిన్ను మనువాడ కొరికే నియమ లీల
లక్షణాల కళ లగుట లయల లీల
నిత్య వికసించు కలవను నేను లీల
....
ఉషోదయ తేటగీత పద్యాలు 
తే. దిశను అందించిన ప్రకృతి దేశ తరువు
ఉక్తి గమన ఉదా మనసు ఊహ తరువు
ఋతి ఎడ మనకు తెల్పిన ఋణము తరువు
సామదాన భేద మనసు సరియు తరువు 
.......
తే. తెల్పిన ఐతి ఐక్యత భావ తెల్ప తరువు
ఒమ్ము కల్పించిన పుడమి ఓర్పు తరువు
కళలు కల్పనా చతురత కల్ప తరువు
బడయు జీవితం విజయమ్ము బ్రహ్మ తరువు
.......
తే. పరువు పెరిగితే బ్రతుకులో పడక కరువు
కరువు పెరిగితే బ్రతుకులో కడకు బరువు
బరువు పెరిగితే బ్రతుకులో నడక అరువు
అరువు పెరిగితే బ్రతుకులో అలక చెరువు
.......
తే. ముక్కెర తొడిగిన మానితో ముద్దు కరువు 
చక్కని హాసము మనసున చల్లు తరువు 
మక్కువ పగడం కాంతియే మనసు బరువు 
చిక్కిన మనసు  కనుగవ వెండి చెరువు
......
తే. విలువ కట్టని విజ్ఞాన వినయ తావు 
దైవ మిచ్చినా దానము ధనము తావు 
మనకు గొప్పలో నర్ధంబు నటన తావు 
నిత్య పోరుసల్పుట విధి నీచ తావు

....

పెండ్లి పల్లకీ తేటగీత మాల 
. మల్లాప్రగడ రామకృష్ణ 
......
తే. వధువువై వలపును పంచ వరుడి చేరి 
సొగసు వయ్యార వంపులు సోకు చూపి 
మధువువై మనసు చెరచు మత్తు చూపి 
దీపమై ధగ ధగ లాడు ధరణి యందు
......
తే. దడదడ పెరగ ఆత్రము తపన చూపి 
ఊహలో చేరి బిగువుగా ఊయ లూపి 
ఉల్లమే జల్లు గామారి ఊత మవుచు 
విధిగ ఉత్సాహ పరిచెను వినయ మందు 
......
తే. గంగవై కలవరపు నగవులగటయె 
గుటక గానామృత మను జిగురుని పంచి 
పవనమై ప్రసరణ వల్ల పరిమళమగు
పీల్చుకోమను చుండియు ప్రేమ జూపె 
......
తే. తేనె చుక్కలు చల్లతు తీపి పంచి 
ప్రాణమై పరిపాలించు పరిధి నందు 
పువ్వువై గుభాలించుము పుడమి నీది 
మాలగా కూర్చి అందాల మహిమయనుట 
........
 తే. పాటవై పడుకోబెట్టి సాన పెట్టి 
కలను వచ్చి కవ్వించియు కళను జూపి 
కలము కదిలించి వ్రాసియు కరుణ జూపి 
కాగితాలను నింపిస్తు కాల జగతి
.......
తే. కమ్మకమ్మగా కురిపించు గరకు తనము 
సహన సహజీవనంచేస్తు సమయ మందు 
సంచరించమంటుకదలి శఖ్యతయగు 
కొత్తదంపతుల కలలు కోరి తీరు
.....
తే. ఊక నిప్పులా రగిలించి ఉండి పోక 
నిముష మైన వెలుగి నింగి నేల
మధ్య గాలికి తోడుగా మనుగడగుచు
గుండె చెప్పుడుతో నుండి గుప్పు గుప్పు
......
తే. తంతు నుత్తమ చిత్తము తక తక ధిమి
వంతు చతురత తరగతి వలపు తలపు
చిత్తు చిత్తగు మత్తులో చేష్ట లగుట
చిత్తము కదలి కళలుగా చేరువగుట
.....
తే. ఆశ నమ్మకం కలిగించి ఆట సలిపి
కోరక ప్రేమ చుట్టెడిది అభిమాన
బాధ అంతర్మధ నముగా బంధ మౌను
ధైర్య సంపద నిన్నుగా బైట పెట్టు
.....
తే. తప్పు లోప్పుల మేలులే తన్నుకోక
తాపసమ్ముయు పంచెడి తరుణ మేను
నృతము అనృతము ఆటలే నృత్యమేను
చెప్పుకుండెనిజాయతీ చేస్టలాయె
....
తే. మొదట యె అసత్య పలుకులు మేలు చేయు
తదుపరి అవియు చేదు యగును తప్పు జరుగు
సత్యము మొదట చేదుయే సమయ మగుట
తదుపరి అదియు తీపి యగు బంధ మందు
....
ప్రాంజలి ప్రభ ఉషోదయ తేటగీతి పద్య మాల

తే. మనసు కిటికీలు కళ్ళేను మనుగ డగుట
వెన్నెల అలవరించుతూ విజయ మగుట
చూసె చూపును బట్టియే పూలు కులుకు
కావ్య కమణీయ సౌందర్య కనుల విందు
.....
తే. చెప్పిన పలుకు చెప్పుత  చింత పలుకు
చెప్పు బుద్దియు, గుణముయు చేష్ట చిలుకు
చెప్ప లేని పలుకు బూతు చెప్పి కులుకు
చెప్ప గలిగేటి మాటలే నిత్య థలుకు
.....
తే. గుప్త విద్య యొక్కటి మది కులుకు కాంత
వేద విద్యగా విశ్వమ్ము వేశ్య కాంత
భ్రమల చదువులే నిత్యమూ పడగ కాంత
లౌకిక సమస్యలతొ నీతి కౌలు కాంత
.....
తే. నిత్య ఆరాట పోరాట నియమ మవదు
అదియు పతనమగు కళలు ఆశ కలలు
శత్రువుతో మిత్రత్వము ఆశ సమర మేను
మిత్ర శత్రువనుట హత్య మిధ్య యగుట
.....
తే. ఆత్మశుద్ధితో విద్యను ఆచరించు
చిత్త శుద్ధితో పూజలే చరిత నిలుపు
విత్తనమ్ము ఎదగనివ్వి వేకువవుట
వత్తిడి సహజమైనను వెలుగు నివ్వు
.....
తే. ఆశ నీడలు ఏలను ఆశయమగు
స్వార్ధ బుద్దియు విజయసాకారమేల
దుష్ట గుణముయే బ్రతుకుకు దురిత మగుట
త్రాసు వల్లే మనసు ఏల పాప మదియు
.....
తే. ప్రకృతి వద్దన్న పరిణామ ప్రభలు చిందు
జీవితం వృధా అవటమేను జీవ గమన
సృష్టి భాగమయ్యే నులే సరయు బంధ
మనలొ అభిరుచి ఆకాంక్ష  మనుగడగుట

......
వర్ణన.....
విశ్వమావవ సౌభ్రాతృత్వం.
మానవులంతా సహోదరులే........
✳️✳️✳️✳️✳️✳️🏵️🏵️🏵️
జీవి తాలను మార్చునా జీవ గమ్య
ప్రేమ నీలోన చచ్చునా ప్రియము అనియు
అందమును హచ్చ చేసేడి హంతకుడవు
మైలపడిపోయె నీ జన్మ మనిషి బ్రతుకు
......
తే. పనికి పనికి విరామము పగలు రాత్రి
కప్పురమ్ము బ్రతుకు చూడు కావ్య జగతి
వేడుకోవటం తప్పక విజయమిచ్చు
హారతి వెలుగు అర్ధమే హాయి నింపు
.......
సభకు వచ్చు పొగడ్త విశాల సాక్షి
పొంగి పోయి పలుకు మార్చ పోరు ఏల
మనసు మర్మ ముందనీ చూడు మరువ లేని
ప్రేమ నీడల వేడుకయే యగుటయు
........
దీర్ఘ కాలమందున దీక్ష చేయలేవు
పరిచయము ఇచ్చి పుచ్చుట ప్రగతి కాదు
ఒకరికి ఒకరు  ఆత్మీయ ఓర్పుతోను
కలయు అనుబంధ తత్త్వము కాల మాయ
........
విశ్వ మనసు సౌ భ్రాతృత్వ విజయ కాంక్ష
నిన్ను నన్ను నిలవనీదు నేటి సాక్షి 
నమ్మకమ్ము సహోదర నయన దీక్ష
మాతృవాశ్చల్య సోదరి మార్గ రక్ష
.......
తే. ప్రశ్నకు జవాబు తాండవ ప్రభల లీల
అర్ధమవని ఆత్మ కలువ ఆశలవియు
అదియు అంతము తెలపని ఆకలినియు
కలవ పూల బ్రతుకు సహన కాల మిదియు
......
తే. ఒడిన చేరి పాల కుడితి ఓర్పు వేరు 
బడిన ఉన్నప్పుడే వచ్చు మనసు వేరు
గుడిన చేరి ప్రార్ధనలు ఎగుటయి వేరు
చెడిన వాడ్ని మార్చు తలపు చింత వేరు
.......
తే. మనసు చేతన్యమే విధి మానసికము
పరమ పరతత్వ శక్తిని వెలువ రించు
జగతి వర్ణించబడినది సకల జీవ
నేల నింగి మధ్య మనసు నీడలగుట
........
తే..స్తూల దేహము పంచ భూతాల మయము
నిత్య దుఃఖోప శమనమే నేతి మనసు
ప్రీతి సాధణ సుఖ ప్రాప్తి ప్రేమయగుట
కదలిక మహా శివుని లీల కామ్య చరిత
........
తే. సంప్రదాయ క్షేత్రంలోణ సౌమ్య గురువు 
అభ్యుదయము పండించె ఆది గురువు 
దర్శకత్వ యోగిగనులే ధర్మ గురువు 
సున్నితాంశాల గప్పిట స్ఫూర్తి గురువు
.....
తే. చాకచక్యంగ తెరిచిన జాతి గురువు 
దార్శనిక ఋషి నిత్యమూ దాత గురువు 
సహన సాహిత్య ప్రనవమే సమత గురువు
నిత్య సామాన్యుల దరికి చేర్చు గురువు
......
తే.నిత్య ఆచార వ్యవహార నియమ గురువు 
వాస్తవిక దృష్టితో చూడు వాది గురువు
ప్రేక్షకుల మనసు గెలిచే ప్రేమ గురువు 
చలనచిత్ర అమృత కధ చెలము గురువు
......
తే. ధ్యానమును పంచి పెట్టిన ధ్యాస గురువు 
జగతిలో అపూర్వ శక జ్యోతి గురువు
ప్రణవ నాథుడు ఓంకార ప్రతిభ గురువు 
భౌతికంగా సహన ముండె బంధ గురువు 
.....
తే. పంచ భూతాల ఐక్యమై ప్రధమ గురువు 
 గాలి  నేల, ఈ సెలయేరు గమ్య గురువు
నాథమై వినిపిస్తారు నమ్మ గురువు
కాల నిర్ణయం తెలిపేటి గమ్య గురువు 
.....
తే. విశ్వకర్మ సృష్టి మెరుపు వినయ గురువు
కుంచె రవివర్మ అందము గుర్తు గురువు
కామ సూత్ర వాచ్ఛా యన కామ్య గురువు
విశ్వ మందు విశ్వామిత్ర విద్య గురువు
.....
తే. భయము ఉన్న బాధ కనదు భ్రమల గురువు
దుఃఖము తరిమె ఆనంద దృతియు గురువు
శంకటములు వున్న వలపు శాంతి గురువు
వేడికి చలియే గిలిగింత వినయ గురువు
......
తే. పచ్చి పాలలో వెన్నయు పరమ గురువు
ఇచ్ఛ కొలది పంచెడి వాడు ఇష్ట గురువు
భక్తి కొలది మనసుగాను బంధ గురువు
పలుకు లోన తేటతనము పసిడి గురువు
.....
తే. జ్ఞానమున్న వానితొ వాద గాన గురువు 
పొందు కొంత విజ్ఞానము పోరు గురువు 
మంచి పలుకుగ్రహించియు మనసు గురువు 
పంచ గలుగు మనిషి నిత్య పలుకు గురువు
.....
తే. ఎవరు నాయందు మనసుంచ యదను గురువు 
లగ్న ఏకాగ్రత కలిగి లయలు గురువు 
శ్రద్ధ భక్తుల తరుణము శుభము గురువు 
ప్రీతి పాత్రులు నిత్యమై ప్రేమ గురువు
.....
తే. నీడ నిన్ను తాకిన పోల్చ లేని గురువు
అద్దమున ముఖం మారక ఆత్మ గురువు
ఆశలకు చిక్క మార్చని ఆర్య గురువు
స్వప్న దృశ్యము నిద్రలో మార్పు గురువు
.....
తే. మళ్ళి మళ్ళి రాని వయసు మాయ గురువు
కళ్ళ రెప్పలా కదలిక కాల గురువు
దూరమగు భారము ఇదను దూత గురువు
పెళ్లి బ్రతుకు నేర్పు కథల గీత గురువు
......
తే. జివ్వు మను చున్న కాశ్మీర జ్యేష్ట గురువు
రివ్వు మని ఎగిరే పక్షి రేళ్లు గురువు
నవ్వు మలపుల వలపుల నటన గురువు
నవ్వు కొవ్వుతో కదిలించు నాట్య గురువు
.....
బద్ధకం వదిలించేది భాగ్య గురువు
మెద్దు మనసుకే లెక్కను మోపు గురువు
సద్దు కొను జీవితమ్ము శారదయు గురువు
పద్దు పెద్దరికం చూపు పరమ గురువు 
.......
మీ విధేయుడు... మల్లాప్రగడ రామకృష్ణ
వర్ణన........
.
సినిమాల వలన లాభములను వర్ణించండి.
🟢🟢🟢🟢🟢🟢♣️♣️♣️
తే. నెమలినడకల కళలగు నీడ సినిమ
కన్నులు కలయు కథలన్ని తెలుపు సినిమ
హృదయ తాపాన్ని తగ్గించి హాయి గొలుపు
మూడు గంటల సంతసం ముఖ్య సినిమ
........
తే. నటన సామర్ద సంగీత నయన సినిమ
విజయ వినయ వినోదము విశ్వ సినిమ
గురువు భోదల చిత్రమై గుర్తు సినిమ
చిన్ననాటినుండి స్నేహ చిత్ర సినిమ
........
తే. తెలుగు చిత్ర పరిశ్రమ తేట సినిమ
ఆత్మ గౌరవాన్ని పెంచు ఆశ సినిమ
శంకరాభరణం కథ సమయ సినిమ
స్వాతి ముత్యాల శుభలేఖ సరళ సినిమ
.......
తే. భారతీయ శృతిలయలు భాగ్య సినిమ
అన్ని నీవను అధ్యంత ఆది సినిమ
రాఘవామరుగేలరా రమ్య సినిమ
సప్తపది అపద్భాన్ధవ సరయు సినిమ
.......
తే. ఆమురళి జీవిత చక్రమ యమ్ము సినిమ
ఇదియు సాగర సంగమ ఇష్ట సినిమ
నిత్య సిరిసరి మువ్వలు నిజము సినిమ
కళల కాలనిర్ణయములే కథల సినిమ
........
దశదిశలు చాటి చెప్పిన ధరణి సినిమ
ఆత్మ గౌరవ నిలిపేటి ఆట సినిమ
ఆశయాల సాధన సంపద యగు సినిమ
స్వర్ణ కమళ శుభోదయం సత్య సినిమ
.....
ఆత్మ పరమాత్మ లీలలు ఆది సినిమ
శివము సీతామహాలక్ష్మి గీత సినిమ
స్వాగతం జీవనజ్యోతి సమయ సినిమ
కాశి నాధుని సృష్టియే కాల సినిమ
......
జన్మత విధి స్వయంకృషి జన్మ సినిమ
ధ్యాన వేద మంత్రాలగా ధ్యాస సినిమ
అన్య వర్ణాలను కలుపు అలల సినిమ
మాధవ కళలు మహనీయమ్మగుట సినిమ
.......
అమృత  కళల స్వరాభిషేక కధ సినిమ
నేరమూ శిక్ష తెలిపేటి నిత్య సినిమ
విశ్వనాధ్ సృష్టి విశ్వమై విధిత సినిమ
మనసులో నున్న మహనీయ మధుర సినిమ
........
వెలుగు వైపుప్రయాణము విద్య సినిమ
ప్రతి మనిషి కధ వణికించు ప్రీతి సినిమ
పూల రాగాలు పులకించు పూజ్య సినిమ
ప్రణవ ప్రణతి శృతి ప్రభువు ప్రభల సినిమ
.......
రాజ్య కీర్తి పదవి ధనం రంగు సినిమ
బంధమే వదలి నడక భాగ్య సినిమ
విషయ భోగము విదితమై విశ్వ సినిమ
స్వాతి కిరణాల శారద సహన సినిమ
.....
కనికరము చూపెడి కళాత పశ్విని కళ
కాశి నాధుని చెంతనే చేర్చు వేళ
కాల గర్భాణ కళసేటి కాల మిదియు 
 జన్మ ఎత్తి జాతి సినిమా జీవి నీవు
......
తే. జగతిపై హితమును జూపు జపము సినిమ
మనసు బ్రతికించు సెగలన్ని మనువు సినిమ
ఎవ్వ రెవ్వారి కళలతో యదన సినిమ
తెగి సకలము ఆత్మ పలుకు దివ్య సినిమ
........
తే. నరుడి తలపు నటన ఈశ్వర కళ సినిమ
తలపు ఘటన నడుమ కళ తపన సినిమ
విధి విధాత జీవితము యే వినయ సినిమ
ప్రణవ నాధకనుల కళ ప్రభల సినిమ
........
తే. ఒప్పు కోనిది సత్యమే ఓర్పు సినిమ
స్వేకరించ లేని నిజము స్వేచ్ఛ సినిమ
సుకృతి యే రస సిద్ధియే సుఖము సినిమ
పుట్టుక మరణం విధిగాను పుడమి సినిమ
.......
తే.నవగ్రహములుగా చెలియంచు నిజము సినిమ
మంచి చెడుల వివరములు మనసు సినిమ
పురష మహిళలు యత్నమే పూజ్య సినిమ
కర్మలు జమ చేసుకొనెడి కామ్య సినిమ
.........
చివరికి మిగిలేది పలుకు చెలిమి సినిమ
కలలు తీర జీవి గమన కాల సినిమ
మలుపు మెరుపు కలలు జీవి మనసు సినిమ
మరణ మైన సహజ మౌను మార్గ సినిమ
..........
వయసులో నున్నప్పుడు పొగ రగుట సినిమ
వయసు ఒదిగినప్పుడు ఓర్పు విమల సినిమ
వయసు పలుకు లన్ని బ్రతుకు వ్యాధి సినిమ
వయసు ఖండాతరము సాగు విద్య సినిమ
...........

బ్రతుకుల బంధము.. తేటగీతి మాల..ఆశ తనము మల్లాప్రగడ రామకృష్ణ ... ఛీ యనిన ఆశ వుండును చేయు తనము ఛా చపలము యనిన ఆశ ఛాతి తనము పాప మనినా మనసు ఆశ ప్రతిభ తనము పో రు ఉన్నాను పుడమిన పోటు తనము ఆశ జోరు కలల పోరు ఆట ఇదియు తెలియు చేసిన కలలలో తేట తనము మనసు చదివిన విన్నది మెరుయు తనము ఆశ అనుభవం ఆనంద ఆత్ర తనము రెచ్చ గొడుతూ పరుగుల రెప్ప తనము సమయ తృప్తికై తాపత్రయమగు తనము సాధన కొరకు ఉద్రేక సాధ్య తనము ఆశ ఆలస్య మవదులే ఆటతనము చేయ్యవద్దని మనసునే తొల్చు తనము వెనకకూ తగ్గవద్దని వెన్ను తనము తొందరపెడుతు ముంచుట గొప్ప తనము ఆశ విడువదు కెలుకును ఆడ తనము నిత్య ఆలోచనలు రేపుతున్న తనము అర్ధ అంతర్ముఖుడినిగా చేయు తనము జీవితాన మరువలేని జిడ్డు తనము ఆశ గుర్రమై పరిగెత్తు జాతి తనము ఇదియు అదిరించి బెదరించి ఇచ్ఛతనము మోచికొనిపోత గుణముగా మోహ తనము అంతు చిక్కని ఆవేశ అంటు తనము ఆశ అంతమవక కీడు అలక తనము తరుణ అన్యాయ ఆత్రమ్ము తపన తనము దిగువ ఎగువను లేనిది దిట్ట తనము వ్యధపెడుతున్న మనసున వ్యాధి తనము ఆశ చిగురాశ మలుపుల అప్పు తనము అంబుధి అగాధము సృష్టి అచ్చు తనము అన్న కావలసిందే ను అనెడి తనము అంత రంగ అగాధాల ఆశ తనము నిత్య అధికార దౌర్జన్య నియమ తనము అల్లుకుంటున్న బిడ్డల ఆశ తనము ప్రాకుతున్నాయి పైపైకి ప్రభల తనము సుఖమనియు కొంపకే వ్యాపిస్తున్న తనము పుడమినే ముట్టెమనసుగా మొరటు తనము ఈ ప్రలోభమె పెడుతున్న ఇచ్ఛతనము వలలు విసురుతున్నాయిలే వలపు తనము పల్లకిని ఎక్కి ఊరేగు పడచు తనము వశపరచుకుంటున్నాయిలే వలపు తనము ఇదియు అత్యాశలకుపోవు ఇప్సి తనము నిత్య అగసాట్లు పెట్టుటే నిద్ర తనము ఇవియు అనర్ధాలు తెచ్చుటే ఇంతి తనము ఆశ అన్యధా భావించ కాని తనము ........


మనిషి మనసు ... రవళి ***

డ్రమ్ము మోతతో సంగీత భ్రమలు కదిలి
పీలికల వస్త్ర ధారణ పీల వెకిలి 
భౌతి కాకర్షణల ప్రేమ చౌక నకిలి 
సహన జీవనాన్నికలిగి సంబరకళి

ఇవియు గిమ్మిక్కులను చూపు సినిమ రవళి 
పక్క పోరాట కళలతో పడచు రవళి 
పెదవు పోరాట ఆరాట ప్రేమ రవళి
వీధి స్వామ్యమై బ్రతుకుగా విజయ రవళి

అధిక ఆరాట పోరాట ఆట రవళి
రాజకీయము తెలియని రవ్వ రవళి 
ఆస్తి లేనికుటుంబము ఆశ రవళి 
 దారితప్పని సరదాల ధరణి రవళి

సంస్కృతి వదలకుండియు సరయు రవళి 
భుక్తి మార్గాన్ని చదువుగా భజన రవళి
కోరి కోర్కెతీరిస్తేటి గొప్ప రవళి 
మందు పోయిస్తె ను కదులు మిత్ర రవళి

ఎంత బండిని  లాగినా ఏడ్పు రవళి 
దెబ్బలు కలుగక తప్పవు  దీన రవళి 
ఎంత  రుచికరమైనను ఏమి రవళి 
రాళ్ల  దెబ్బలు  తప్పవు రవ్వ రవళి

అయిన వారందరితొ పంచు ఆట రవళి
నవ్వడం నలుగురిలోన నటన రవళి    
బైటపట్టింపు  పదిమంది కైపు రవళి
వున్నను మరచిపోవాలి ఊహ రవళి

కవులు కౌలుకి పోతేను గమ్య రవళి 
త్యాగ్యులంత భోగులగుటే తపన రవళి
వీరులంత మౌనమగుట వీధి రవళి
సాగిల పడుటే మదిలోన సంఘ రవళి 
....
ప్రాంజలి ప్రభ..
జానకి రాముని కళ్యాణం
చూడగ శాంతియు కళ్యాణం 
......................
ఇనకుల తిలకుని కళ్యాణం.....
మమతల మనసున మాధుర్యం....
ఇలలో జరిగే వైభోగం.....
మదిలో మెదిలే మాధర్యం....

శివధనస్సును విరిచిన వీరుడట....
మన మనస్సును కలచిన దేవుడట.....
అవనిజ మనసును గెలిచిన ధీరుడట..
పుడమిని తలచియు కొలిచిన ధీరుడట....

రఘుకుల సోముడు రాముడట..
ఇనకుల ధీరుడు రాముడట...
నుదుటన తిలకము దిద్దెనట..
కరమున ధనసును పట్టెనట....

పరిణయ మాడగ కదిలె నట.
తరుణము చూడగ మెదిలెనట
జగతికి కన్నుల పండుగట..
ప్రగతికి మన్నన మెండుగట..

అంగరంగ వైభోగమట..
కన్నులు రెండూ చాలవట..
సీతమ్మకు సిగ్గులే అందమట....
ఊరంతయు ముగ్గులే అందమట...

పుత్తడి బొమ్మకు పెండ్లియట....
చిత్తము చిన్మయ పెండ్లియట....
పుడమి తల్లి దీవించెనట..
కడలి పొంగు ఆశించెనట...

పుర జనుల జీవితము ధన్యమట..
శుభ శకున కాలముగ ధన్యమట....

సీతా రాముల కళ్యాణం...
నింగి నేల మురిసేనట..
రఘుపతి రాజ కళ్యాణం
సర్వ రాజ్య మురిసేనట....

ముత్యాల జల్లులే కురిసెనట..
నృత్యాల ఆటలే మురిపెమట....
భువి తలంబ్రాలుగు మెరిసెనట.....
భాజ భజంత్రీలు మొతలేయట...

జానకి రాముల పెండ్లియట..
భారత భాగ్యుని పెండ్లియట....
జగదానందము పొందెనట....
హృదయానందము చిందెనట...

కళ్యాణ ఘడియల వేళ ఇదే ...
గీర్వాణ సరిగమ మేళ ఇదే...
కమనీయ దృశ్యముల శోభ ఇదే..
మదిలోన భవ్యముల మో హమదే....
‌‌‌‌‌...................