Saturday 2 December 2023

*రామ నామ మహిమ..ఫలితం


పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ.. ‘తెలియక చేసినా తెలిసి చేసినా రామ నామంతో ముక్తి లభిస్తుందన్నది వాస్తవమేనా నాథా’ అని సందేహం వెలిబుచ్చినప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్పాడు. వాళ్లు తమ జీవన విధానం గురించి. 

 

వనేచ రామః వసుచాహ రామః

నదీన్త రామః నభయం స్మరామః

ఇతీరయంతో విపినే కిరాతా

ముక్తిం గతాః రామ పదానుషంగాత్‌


అని చెప్పేవారట. ‘‘మనం వనంలో తిరిగే వాళ్లం. ధనాన్ని అపహరిస్తాం. నదీనదాలను దాటుతుంటాము. భయం అన్నది మనకు స్మరణకే రాదు’’ అని దీని అర్థం. వారికి తెలియకుండానే ఈ నాలుగు వాక్యాల్లో చివర ‘రామ’ శబ్దం ఉండడంతో రామనామాన్ని అనుసంగమం చేసుకొని వారి మరణానంతరం వారు ముక్తి పొందారట. అనాలోచితంగానే రామ శబ్దం ఇంతటి పుణ్యాన్నిస్తుంది. ఇక తెలిసి రామ చింతన చేస్తే.. ఇంకా చెప్పేదేముంది? ముక్తి లభించడంలో సంశయం అక్కరలేదు. శంకరుల వారి ఈ మాటలకి పార్వతి సంతృప్తి చెందింది. రామ శబ్దంలోని ర, మ అనునవి రెండు బీజాక్షరములు. శ్రీ మహావిష్ణువు అష్టాక్షరీ మంత్రంలోఐదో అక్షరం ‘రా’, శివ పంచాక్షరీ మహామంత్రంలోని రెండో అక్షరం ‘మ’. అలా రామ శబ్దం నిర్మితమైంది. ఐదు, రెండులను గుణిస్తే పది అవుతుంది. పదిని మరో పదితో గుణిస్తే వంద. దాన్ని మరో పదితో గుణిస్తే వెయ్యి. అంటే.. మూడుసార్లు రామనామాన్ని ఉచ్చరిస్తే వెయ్యిసార్లు ఉచ్చరించినట్టే. 

 

శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.

 

రామ శబ్దానికి ముందు ఓం ఉచ్ఛరించవలసిన అవసరం లేదు. కారణం రామ శబ్దమే ఓంకారానికి ప్రతీక. రామ శబ్దం ఉచ్చరిస్తే చాలు ఏ జపాలు మంత్రాలూ, తంత్రాలు అక్కరలేదు. రామ శబ్ద పారాయణం విష్ణు సహస్రనామ పారాయణకు సర్వసమానం. అందుకే మనలో చాలామందికి.. ఉత్తరాల పైభాగంలో ‘శ్రీరామ’ అని రాసిన తరువాతనే తదుపరి సమాచారం రాయడం అలవాటు. రామ శబ్దం పలకడానికి శౌచం అశౌచం లేదు. వేళతో నిమిత్తం లేదు.  


ప్రణవ నిలయ మంత్రం శ్రీ ప్రాణ నిర్వాణ మంత్రం

ప్రకృతి పురుష మంత్రం శ్రీ బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం

ప్రకలు దురిత రాగద్వేష నిర్నాశమంత్రం

రఘుపతి నిజ మంత్రం శ్రీరామ రామేతి మంత్రం. 


ప్రాంజలి ప్రభ .. రోజు చదువుకొనే కధలు -01 -12  -2023 


   **అమ్మా** మాతృశ్రీ **

అరచేతిలో ఉన్న గీతలేవో అదృష్టరేఖలట అవి...

అమ్మ అరచేతిలో నాకు ముద్దిచ్చి, చేసిన ఆశీర్వాదం..

పొత్తిళ్ళలో పొదివి పట్టుకుని, నుదుటిపై ముద్దెట్టి..

లాల పోసే వేళ శ్రీరామా రక్షంటూ తలపై నీళ్ళు తిప్పి, దిష్టి తీసి, సాంబ్రాణి ధూపాన్ని-

జుత్తoతా పట్టించి, అoగారు బొట్టు దిద్ది, కళ్ళ కాటుక పెట్టి, బొజ్జ నిండా పాలుపట్టి,

అరి పాదాలు ముద్దెట్టి, అరిపాదాల దిష్టి బొట్టు పెట్టి, 'నా బంగారు కొండ'అంటూ మురిపంపు నవ్వుతో..

ఉయ్యాల లో ఊపి...

ఎందుకేడ్చేనో ..అనిఆత్రంగా పరుగెత్తి...

ఒడలంతా తడిమి చూసి, బొజ్జ లోనికి పోయె...

నా చిట్టి తల్లంటూ ..

పొట్ట నిండా పాలు పట్టేవేళ నీ ఆకలే మరచి ...

నను సాకె నా తల్లి....


ఎన్ని పనులు చేయ వలెనొ సుఖము నెరిగి  మసలగా 

నెన్ని కనులు మాయ వలెనొ మనసు గెలిచి మసలగా 

నెన్నో తలపు పల్కు వలెనొ తనువు గెలిచి మసలగా 

కన్న  పిలుపు ప్రేమ వలెనొ వయసు గెలిచి మసలగా 


తల్లినైనా వేళ తలచలేదే నేను దూరమైతే కానీ నీ విలువ తెలియ రాలేదు మదిలోని భావాలూ తెలియ జేసేవేళ నీవు లేనేలేవు.

నా బాధేలా తెలిపేది మళ్ళీ ఒక్కసారి నా ఒడిలోకి రావూ...

నాపాపగా నిన్ను లాలించుతాను , మురిపెమ్ము తీరగా సాకాలనుంది...


భాధను తెలపలేనులె  

వ్యధను తెలపాలని విధి వాకిట నుంటిన్

కధలే జీవితమగుటే   

వేదపఠనమై మనసగు గీత చరితమే     

మరలిరాని లోకాల నను కన్నతల్లీ నీ ఆశీర్వాదమే నాకు కొండంత అండ!!

హృదయవిదారకం విశ్వవ్యాపితం, మరువలేని మమతానురాగాలు సంపద మా అమ్మ 

యీ కథపై మిభిప్రాయాలు చెప్పగలరు,  షేర్చేయగలరు, 

అమ్మలుగన్న పెద్దమ్మకు దండాలు,  

 

మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

pranjali pdrabha ..006 *శ్రీ ఆంజనేయం *
నేను లేకపోతే? ఏమయ్యేదొ అనుకోవద్దు..
🌹రామాయణ అద్భుత ఘట్టం..
అశోక వనంలో రావణుడు.. సీతమ్మ వారి మీద కోపంతో.. కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.. హనుమంతుడు అనుకున్నాడు
"ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని.. రావణాసురుని తలను ఖండించాలి" అని.
కానీ మరుక్షణంలోనే మండోదరి.. రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! ఆశ్చర్య చకితుడయ్యాడు.
"నేనే కనుక ఇక్కడ లేకపోతే.. సీతమ్మను రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట” అనుకున్నాడు హనుమంతుడు!
బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, ‘నేను లేకపోతే ఎలా?’ అని.సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు.అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది. "ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో.. వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు" అని. మరింత ముందుకు వెళితే త్రిజట.. తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ.. దాన్ని నేను చూశాను.. అనీ చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది.
ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను.. అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు.. తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.. అనుకున్నాడు. హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు.. హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి ‘అన్నా! దూతను చంపటం నీతి కాదు’ అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని పై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే.. విభీషణుడు ఆ మాట చెప్పగానే.. రావణుడు ఒప్పుకుని ‘కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం. తోకకు నిప్పు పెట్టండి’ అన్నాడు.
అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. “ప్రభువు నాకే చెప్పి ఉంటే.. నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి!" ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. పరమాశ్చర్యం ఏంటంటే.. వాటన్నిటికే ఏర్పాట్లు.. రావణుడే స్వయంగా చేయించాడు. అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు.. తనకు ”లంకను చూసి రా” అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది!
అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో జరుగుతున్నదంతా భగవంతుని సంకల్పానుసారంగానే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం. అందువల్ల..
నేను లేకపోతే ఏమవుతుందో!!! అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు.. "నేనే గొప్పవాడి"నని గర్వపడవద్దు. భగవంతుడి కోటానుకోట్ల దాసులలో అతి చిన్న వాడను అని ఎఱుక కలిగి ఉందాం.
జై శ్రీమన్నారాయణ!
సేకరణ...

 ప్రాంజలి ప్రభ .. రోజు చదువుకొనే కధలు -02 -12  -2023 

*చీకటిని తరిమే వెలుగు* 


జతగా చెలిమీ చేసిరి
పడకే కలసే ఊపిరి
వనుకే ముదిరే అల్లరి
తనువే అదిరే ప్రాసరి    

భగభగ లాడే భాస్కరుడే, చిరునవ్వుల చిద్విలాస వదనుడై, చిరుకాంతులు చిందిస్తూ కెంజావివర్ణ
విభూషితుడై, ఉదయాద్రుల నెగబ్రాకుతున్నాడు....

గగనతలానికి పాకుతున్నబాలాదిత్యున్ని ప్రోత్సహించే పులుగు రాశి కేరింతలేస్తుంటే, ఆ కువకువ రావాలువిన్నకువలయానికి మెలుకువొచ్చిందేమో!

చిమ్మచీకట్లను కప్పుకున్న ధరణీ నల్లని దుప్పటిని తొలగించి ఆదిత్యునందాలని చూడసాగింది....

"పొద్దంత నా మదిలో పొంచింది చాలక"
అద్దంల నీ చూపులో  హెచ్చింపు అలక
యుద్ధంల నా కొరకే  ఉన్నావు ఆనక
హద్దులు నీ కెప్పుడూ ఉండవు చిలక"

దుప్పటికదలికతో ఉత్పన్న మైన గాలి పిల్లతెమ్మరై వక్షాలను కదిలిస్తూంటే పూపశీతలానిలము
హుషారుకలిగిస్తుంటే నిద్రాప్రియులని ఇంకా మైమరిపిస్తుా జోలపాడుతుంది, మేలుకో మిత్రమా
మిత్రునియందాలగాంచ మేలుకో మేలుకో ఇదే సుప్రభాత రాగం విరచిత భావగీతం

సర్వలక్షణ శోభితా సహకరీ సర్వామనోనేత్ర వై
ధర్మరక్షణ సేవ భావపు కళా విశ్వాస శోభాత్రి వై
నిర్వాదక్ష సుఖాలయ లతా కారుణ్య భవ్యాత్రి వై
చర్యాచర్య విధీ తిధి మదీ మాలిణ్య తొల్గించుమా

సూర్యునిరాక, ఆనందాల మల్లిక, హృదయంలో కేక, ఆరాధ్యదైవానికి నమస్కారాలు తెలపటం అందరి వంతు, ప్రత్యక్ష దేవుని లీలలు కనటం, స్సర్వకాల సర్వా విధినిర్ణయం లోబడి బ్రతికే జీవనం మా అందరి క్షేమం మీ వంతే 

యీ కథపై మిభిప్రాయాలు చెప్పగలరు,  షేర్చేయగలరు, అమ్మలుగన్న పెద్దమ్మకు దండాలు,  

 మీ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

 ప్రాంజలి ప్రభ .. రోజు చదువుకొనే కధలు -03 -12  -2023 

*ఆలింగనం తప్పనిసరి*

అశ్రువుల ఆలింగనం తప్పనిసరి అయినపుడు కొంగును కౌగిలించుకునే వున్నాను, శోకం శ్లోకమై ఒలికినపుడు గుండెను గట్టిగానే బిగపట్టుకున్నాను, స్రవించే గాయం సవరించే కాలంకొలమానం లేని ఉపమానాలెన్ని భరించలేదు మనసు సానుభూతి సంకెళ్ళైనపుడు సంఘర్షణకు సవరణ తప్పనిసరౌతుంది, నిర్లక్ష్యపు మనసులు నిశ్శబ్దంగా వున్నా, మౌనంతోనే సమరం మనసు గాయానికి గెలుపోటములకు ఆరాటపడని భావాలనే నమ్ముకుని, అంతరంగంతో మాటలు అనివార్యమైనపుడు అక్షరాలను ఆవహించుకుంటూ, చెమ్మగిల్లిన చరిత్రలు చెప్పుకున్నాను, నిన్నలు కుదేలైనపుడు ఙ్ఞాపకాలు బావురుమంటున్నా, 

*కలయిక

జలపాతాల శబ్దం ఒక నాదం
మనోఉల్లాసానికి అది ఒక అద్భుతం    
కెరటాల ఉరవడి ఒక మనోహరం
అది మనసుకు కల్గించు ఒక ఆహ్లాదం  
  
తరంగాల లాస్యాలు ఒక స్పందనం
అది హృదయానికి ఒక కేంద్రం 
 చినుకుల విన్యాసాలు ఒక ఉల్లాసం
అది ఒక ఆనంద పారవశ్యం  
    
ఆకుల గల గల శబ్దం ఒక కల
ఊగే చెట్ల కొమ్మలు ఒక గాలి 
వాయుతరంగ గాలులు ఒక లాలి
స్వర విహారాలు మనసుకు ఒక జాలి

మబ్బుల గర్జనలు ఒక స్వరాలు
హృదయ శబ్దాలు  ఒక ప్రేమలు 
స్నేహాల భావాలు ఒక చిహ్నాలు
మాటల కలయకలు ఒక ఆందాలు

నేటిలోకి జారిపోవడం తప్పసరి వెంటరాని క్షణాలన్ని రేపటి ఆశల రెక్కలు కట్టుకుంటాయి
ఉగ్గబట్టిన ఊహలు ఉసూరంటూ ఉనికిచాటుతుంటాయి వేదనైనా యానం తప్పదు
వేకువ వెల్లి విరియక ఉంటుందా సునాయాస ముంగిపుకై మౌననివేదన నాదయ్యిందిపుడు...!!
యీ కథపై మిభిప్రాయాలు చెప్పగలరు,  షేర్చేయగలరు,
....

 ప్రాంజలి ప్రభ .. రోజు చదువుకొనే కధలు -04 -12  -2023
*అంతర్యామి *

చలనానికి ఏ శక్తి అవసరమో నిశ్చలానికి కూడా అదే, జననానికి ఏ శక్తి అవసరమో మార్చడానికి కూడా అదే, విజయానికి ఏ శక్తి అవసరమో ప్రళయానికి కూడా అదే,
తరుణానికి ఏ శక్తి అవసరమో నాశనానికి కూడా అదే.

పైకి రావటానికి లోనికి పోవటానికి కారణం నువ్వే, మంచి చేయటానికి చడ్డను చేరటానికి కారణం నువ్వే, ప్రేమ పంచటానికి ధోషిగ మారటానికి కారణం నువ్వే, 
ఆశ పెర్గటానికి కోర్కెను తీర్చడానికి కారణం నువ్వే.

భగవంతుడ్నే దేవుడెక్కడుంటాడని అడిగితే ఎట్లా, ధనవంతుడ్నే డబ్బు ఏల వస్తుందని అడిగితే ఎట్లా, వెలయాలి న్నే సౌఖ్యమెక్కడుంటుందని అడిగితే ఎట్లా,
మకరందా న్నే తుమ్మెదప్రకోపానిని అడిగితే ఎట్లా.

ఆత్మ శక్తి ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఎందుకు, దైవ భక్తి ని ఎవ్వరూ గుర్తించుకోవడం లేదు ఎందుకు, ప్రేమ భుక్తి ని ఎవ్వరూ చర్చించుకోవడం లేదు ఎందుకు, సేవ యుక్తి ని ఎవ్వరూ కల్పించుకోవడం లేదు ఎందుకు

ఏకాగ్రత ఏకాంత భక్తి అంతా అంతర్యామి శక్తియే, 
ప్రేమార్పిత సద్భుధ్ధి యుక్తి అంతా అంతర్యామి శక్తియే  
దేహార్పిత దుర్బుద్ధి ముక్తి అంతా అంతర్యామి శక్తియే  
తర్వుల్ వలె కాలమ్ము మారు అంతా అంతర్యామి శక్తియే 
*****

యీ కథపై మిభిప్రాయాలు చెప్పగలరు,  షేర్చేయగలరు,   

ప్రాంజలి ప్రభ .. రోజు చదువుకొనే కధలు -05 -12  -2023
ఒక్క క్షణం విలువ చిన్న కధ  

ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే 
వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది. 

ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సునిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.

 కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.  ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా!  ఎంత మంది తినటంలేదు?
 నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి?
 ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......'
అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.  అంతలో వూరు వచ్చింది.... బస్సు ఆగింది.
కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి
"మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు.
 దానికి ఆ కండక్టర్ "అయ్యా! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను.
మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు.

పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో
నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను...
నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని
నా విలువలను కాపాడింది' అనుకున్నాడు. 
 *జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడాసర్వనాశనం కావడానికి క్షణం చాలు....
 ఒకానొక సందర్భం లో మీ శత్రువులు కూడా మీమీద ప్రయోగం చేస్తారు... మీ మంచితనాన్ని నాశనం చేయడానికి.... మీకు సంబంధం లేకుండానే మీ గురించి ప్రచారం చేస్తుంటారు... ఆ ప్రచారం అవునా కదా అని తెలుసుకోకుండా వాళ్ళు కళ్ళు ఉండి కూడా గుడ్డిగా నమ్ముతారు... అది వాళ్ళ కర్మ...

 కానీ మీరు మాత్రం జాగ్రత్త... గడియారం లో సెకండ్ ముళ్ళు ఎలా తిరుగుతుందో అలానే మీ జీవితాన్ని ప్రతి సెకండ్ ని గమనిస్తూ ముందుకు సాగండి....
 మంచితనానికి ఎపుడు చావు లేదు.... ☘
మీరు బ్రతికి ఉన్నంత కాలము మంచి పేరుతో జీవించాలి... మరణించాకా కూడా ఆ మంచి పేరు నిలచిపోవాలి.
mallapragada 
యీ కథపై మిభిప్రాయాలు చెప్పగలరు,  షేర్చేయగలరు,

ప్రాంజలి ప్రభ .. రోజు చదువుకొనే కధలు -06 -12  -2023

*అత్తగారు! మైసూర్ పాక్ *
అత్తగారు! స్వీట్ ప్యాకెట్ లో మైసూర్ పాక్ లేదు, ఏమైందత్తయ్యగారు!

ఏమోనే నాకేం తెలుసు? రాత్రి నువ్వో, మీ ఆయనో తినేసి వుంటారులే, అయినా సంసారంలో అన్ని లెఖ్ఖలేంటే కోడలా!

అత్తయ్యగారు! మీ కడుపులో చక్కెర ఫేక్టరీ వుంది, నిన్న రక్త పరీక్ష లో 450 వుంది!
మీ అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ హెచ్చరిస్తున్నారు, మీ అబ్బాయి అయితే మరో అడుగు ముందుకేసి "నీ అశ్రద్ధ తో మా అమ్మని చంపేసేలాగున్నావు" అంటారు, మీరు చూస్తే ఇలా, చావేదో నాకొచ్చినా బాగుణ్ణు!

కోడలు పిల్లా! ముందు కంటతడి ఆపి ఇలారా తల్లీ!

చెప్పండత్తయ్యగారూ!

నాకు చిన్నప్పటినుంచి మిఠాయిలంటే ప్రాణం!
మంచి వయసులో వుండి, మిఠాయిలు అందుబాటులోనున్నా తినలేకపోయాను, కారణం మా అమ్మ "ఒసే! నువ్విలాగ మితం లేకుండా మిఠాయిలు తింటే బాగా వొళ్ళొచ్చేసి నీకు పెళ్ళి అవకుండా పోతుందే " 
శోభనముగదిలో అన్నీ వున్నా ఆయనేమనుకుంటారోనని తినలేకపోయాను, అత్తారింటిలో వుమ్మడి కుటుంబం మూలాన"భగవంతుడా! ఈ పనులెప్పుడు పూర్తౌతాయి, మగవాళ్ళ భోజనాలెప్పుడవుతాయి, నా కడుపులోకి పిడికెడు మెతుకులెప్పుడెళతాయి" అనిపించేది!
క్రమేపీ నా సంసారమన్నది ఏర్పడ్డాక అంతులేని భాద్యతలతో తిండి మీద ధ్యాస పోయింది!
అమ్మయ్య! కొడుకు బుద్ధిమంతుడు, కోడలు బంగారం ఇక నాకు కావలసిన మిఠాయిలు తినేయొచ్చనుకునేసరికి తోబుట్టువుల్లాగ ఈ చక్కెర, రక్తపోటూ వచ్చి పడ్డాయి, నన్నర్దము చేసుకో తల్లీ!

నిజమే అత్తగారు! ఈ విషయం లో భగవంతుడు మీకు అన్యాయం చేసాడు, ఇకమీదనుండి మీ ఇంట్లో మీరు దొంగతనం చేయాల్సిన పని లేదు, నేనే స్వయంగా నేతి మిఠాయిలు కొని తెచ్చి మీకిచ్చేస్తా, మీ కెన్ని కావాలంటే అన్ని తినొచ్చు! అయితే మీరు నన్ననుగ్రహించి నా ప్రశ్నకు జవాబు చెప్పాలి!

ఏమిటమ్మ అది?

మీకు కడుపుతీపి అంటే ఎక్కువిష్టమా?
నోటితీపి అంటే ఎక్కువ ఇష్టమా?

కోడలా! నీ అంతరంగం నాకు అద్దంలా కనిపిస్తోంది, నా కొడుకు మీద ఒట్టేసి చెపుతున్నాను "ఇక నేను మిఠాయిలు ముట్టను " ఇదిగో నీ మైసూర్ పాక్!
--((**))--
mallapragada 
యీ కథపై మిభిప్రాయాలు చెప్పగలరు,  షేర్చేయగలరు,

ప్రాంజలి ప్రభ .. రోజు చదువుకొనే కధలు -07 -12  -2023
*. ఒక పొడుపు కథ.. 

అతి ప్రాచీన కాలమున హిందువులు ఒక పిట్టకథను చెప్పుకొనుచుండెడివారు. ఆర్యులలో మొదటి తెగవారే హిందువులు. ఆర్యులలో జ్యేష్టులు వారే. వారు చెప్పుకొను కథ యిట్లున్నది. అనగ అనగ ఒక రాజ్యములో ఒక మహామృగముండెడిది. అది రోజున కొక జీవుని చొప్పున భక్షించుచుండెడిది. ఆ మృగము  ఆకాశమున ఎగురగలదు. భూమిపై పరుగిడగలదు. నీటిలో ఈద గలదు. దానికి ముందు చూపేగాని వెనుక చూపు లేదు. అది, అడ్డు, ఆపులేక జీవులను భక్షించుచునే యుండెడిది.

ఒకనాడు దాని కంటికొక యోగి కనిపించెను. అతనిని భక్షించుట కుద్యమించెను. యోగి నవ్వుకొని పరుగెత్తుచు, సమీపమున గల ఒక మహా సరస్సున జొరపడెను. మృగము కూడ జొరపడినది. మృగము యోగి కొఱకై వెతుకుచుండగ యోగి మృగము వీపు పైకెక్కి కూర్చుండెను. వెనుక చూపు లేని మృగము యోగికై వెతుకుచు నుండెను. యోగి కనపడక పోగ క్రమముగ మృగమునకు పంతము పెరిగెను. యోగికొరకై వెతుకుట సాగించెను. నేటికిని వెదకులాడు కొనుచునే యున్నది. యోగి మృగము వీపున తన యోగమును సాగించుచునే యున్నాడు. పై కథను విప్పుకొనుట సాధకుల కర్తవ్యము.

mallapragada Ramakrishna 
యీ కథపై మిభిప్రాయాలు చెప్పగలరు,  షేర్చేయగలరు,

*భగవత్తత్త్వము*

కార్యభారమంతా మీ భుజస్కంధాలపై ఉన్నట్లు గుర్తించండి. మీరు భారతమాతకు చెందిన నవ యువకులు, మీరే దేశోధ్ధారణకు ఎన్నుకోబడ్డారని భావించండి; కార్యనిమగ్నులవ్వండి. భగవంతుడు మిమ్మల్ని దీవించుగాక.

భగవత్తత్త్వము విశ్వమంతా వ్యాపించి ఉన్నది. మనకేదో అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తుంది.

నిజముగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే దైవపరముగా చెప్పినది నీవరకు నీవు ఆచరిస్తూ ఉంటే, అదే నీకు అందుబాటులోకి వచ్చి, నీకు వికాసము కలిగిస్తుంది. అప్పడు దైవము తన తత్త్వమును కొంత చూపిస్తాడు. ఆ తత్త్వము అనంతము. ఇలా కొంత దూరం వెళ్లి, అది ఎంత ఉంటే మనకెందుకు? మనము ఆయన లోనే ఉండిపోదాము అనుకుంటాడు. అది ఎంత ఉన్నది ఎవరికీ తెలియని విషయము.

ఈ సృష్టి కొనసాగింపునకు జీవాత్మభావన ఏర్పడడం తప్ప ప్రత్యేక కారణం లేదు. వ్యక్తిగతంగా ఎదురయ్యే అనుభవాలు, కష్టసుఖాలు, అన్నీ అందులో అంతర్భాగాలే. అందుకే ఆత్మ ఎప్పుడూ కారణరహితంగా ఉంటుంది. నేను పరబ్రహమును అన్న జ్ఞానుల బోధను విశ్వసించి దృఢమైన భావాన్ని బలపర్చుకుంటే ఆత్మనిష్ఠలో ఉండవచ్చు. మనసు, స్మృతి, లోకం వీటికి స్థిరమైన ఉనికి లేదు. స్థిరమైన ఉనికి లేని కలను మనం ఎలా పరిగణిస్తామో, కాలగమనంలో ఇవి కూడా అంతే. అందుకే శాశ్వతమైన సత్యవస్తువుగా ఉండే ఆత్మతో పోల్చినప్పుడు మనసు, స్మృతి, లోకం ఇవన్నీ తాత్కాలిక సత్యాలే అవుతాయి !

భక్తి అంటే దేనిపైనో ఆధారపడటం కాదు. దేనికీ ప్రభావితం కాని ఖాళీని తెలుసుకోవటం. ఇష్టంగా ఒక పుస్తకంను చదవటంలో, ధ్యానంలో, జపంలో జరిగే అనుభవం ద్వారా మనసే ఖాళీగా ఉందని తెలుస్తుంది. అది ప్రతి అనుభవంలో ఉందని గుర్తించవచ్చు. లోపల చైతన్యం ఖాళీగా ఉన్నప్పుడే ఏదైనా అనుభవం సాధ్యమవుతుందని తెలుస్తుంది. ఇష్టంలో కర్త ఉన్నాడు. కానీ విధానంలో కర్తలేడు. ఇది అర్ధం అయితే కర్తృత్వం పోతుంది. కర్త లేడని, భోక్తలేడని తెలిశాక దాని నిరంతర ఖాళీ నిరంతరాయంగా గమనింపులోకి వస్తుంది !!


ప్రాంజలి ప్రభ .. రోజు చదువుకొనే కధలు -08 -12  -2023
 దైవం అంటే? 

1) ఈ విశ్వం అనంతమైంది, కోటానుకోట్ల galaxies ఈ విశ్వంలో ఉన్నాయి,. 

ఒక్కొక్క galaxy లో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడిగా పరిగణింప బడుతుంది. సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు కలిపి ఒక సౌరకుటుంబం అంటారు. అలా కోటానుకోట్ల సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు ఏ మాత్రం అందదు

2) ఇనుముని పరిశీలిస్తే ఇనుము ఘనరూపంలో, ద్రవరూపంలో వాయురూపంలో ఉంటుంది. అంటే frequency  పెరిగే కొద్దీ సాంద్రత పెరుగుతుంది. అలాగే higher frequency లోకాలు అందుకే కనపడవు. ఎలా అయితే వాయువును మనం చూడలేమో అలానే ఉన్నత లోకాలను మనము చూడలేము. 

భూమి మీద కూడా ఎన్నో కనపడని higher frequency లోకాలు ఉన్నాయి ఉదాహరణకు శంబాల. అలా మన సౌర వ్యవస్థలో కనపడని ఎన్నో higher frequency లోకాలు ఉన్నాయి.

3) దైవము మానవ రూపంలో ఉంటాడని మహిమాన్విత శక్తి ఉంటుందని లోకసంరక్షకుడు అంటారు. అలా మనం 3d తలమైన భూమికి మాత్రమే అన్వయించు కుంటున్నాము. మన మనస్సులో వుండే భావాలకు అనుగుణంగా దేవుడిని ఊహించుకుంటున్నాము.

4) ఆయన దీనజన బాంధవుడని, పాహిమాం అని ఆర్తనాదాలు చేస్తే కాపాడుతాడని భ్రమ పడుతుంటాము. పాపాత్ములని శిక్షిస్తాడు, భక్త వత్సలుడు భక్తుల కోర్కెల్ని తీరుస్తాడని  అనుకుంటాము . 

ఆయన నిర్గుణుడు. ప్రార్థనలు ద్వారా భజనలు ద్వారా పూజల ద్వారా ప్రసన్నుడవుతాడు, ఇలా మనం మానవుడి గుణాలన్నింటిని దేవునికి ఆపాదిస్తుంటాము.

5) మన ఆత్మను పరిశీలిస్తే ఆత్మ ఎన్నో లోకాలలో ఎన్నో దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతుంది. మరి 3d తలంలో మానవుని నిర్వచనాలకు దేవుడికి వర్తిస్తాయా ఒక్కసారి ఆలోచించండి.

6) ఈ విశ్వంలో కోటానుకోట్ల లోకాలున్నాయి అనంత బ్రహ్మా0డ విశ్వాన్ని మహాసముద్రంతో పోలిస్తే నీటి బొట్టంత పరిమాణం కూడా లేని భూమి మీద ఉండే మానవ జాతి నిర్వచనాలకు దైవము అందుతాడా.

7) ఈ విశ్వాన్ని భూగోళంతో పోలిస్తే గుండు సూది మోనంత కూడా లేని భూమిలో నివసించే మానవుని యొక్క భక్తి పారవశ్యానికి దాసోహమవుతాడా దేవుడు ఆలోచించండి.

8) మన ప్రార్ధనలకు పూజలకు సంతోషిస్తాడా, కోటానుకోట్ల లోకాలలో కోటానుకోట్ల రకాల జీవరాసులున్నాయి. మరి వాటి సంగతేంటి.

9) పాపాత్ములని శిక్షిస్తాడు అంటున్నాము మరి దేవుడికి మానవుని గుణాలు ఉండాలి కదా.

10) అనంత బ్రహ్మా0డ విశ్వంలో కూసంత కూడా లేని భూమి మీద ఉండే మానవుని రూపంలో దేవుడుంటాడు  అనేది ఆధ్యాత్మిక లోపం వల్లనే మసనవుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు.

11) దేవుడు అంటే విశ్వమంతా వ్యాపించివున్నమూలచైతన్యం.

12) దేవుడంటే పురుషుడు కాదు,స్త్రీ కాదు,దేవుడంటే శక్తిస్వరూపం, కోటానుకోట్ల లోకాలు, ఆ లోకాలలో ఉన్న జీవాత్మలు అన్నీ దైవమే.

13) దైవము కోటానుకోట్ల గుణాలతో చైతన్య పరిణామం చెందుతూ తనను తాను విస్తరించుకుంటూ ఉంది.

14) అనంత బ్రహ్మాండ మైన మూలచైతన్యం అనంతమైన గుణాలను అనంతమైన ధర్మాలను ఏకకాలంలో కలిగి ఉంది.
***
mallapragada Ramakrishna 
యీ కథపై మిభిప్రాయాలు చెప్పగలరు,  షేర్చేయగలరు,
***

2. # నీతికథ #
ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండచుట్టి విసిరేశాడు. ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి. ఆనందం తో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి.

అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. 

కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది.
ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది. ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఓ కాకి చూసింది. కాకి తెలివితక్కువతననికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా .
మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి. ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది.
మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది.
'అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా' అంటూ ముగించింది. తన వర్ణనలో 'ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం' అనే ముక్క చేర్చలేదు.
ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. 'తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ ' అంటూ మరో మాట చేర్చింది.
ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి.
వాటిలో ఓ కాకి అయితే 'కాకి కన్ను పొడిస్తే ... పాపం! రక్తం కారిందట కూడానూ' అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది.
మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి 'ఆ గోడపై రక్తపు చారికలు చూసాను 'అంటూ వాపోయింది.
మరో కాకి 'నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది' అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది.
అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి.
ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులును స్నేహంగా చూసింది.
అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు చప్పున మాటలు ఆపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి .
కాకికి ఏమి అర్థంకాలేదు. రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులుతున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది.
'"ఒక్కోసారి అంతే! మన ప్రమేయం ఏమి లేకుండానే మనని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. నీలాపనిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకో చాలు. అలాంటి వందలమంది నీకేలా? " అంటూ ఓదార్చింది కొమ్మమీద కోయిలమ్మ.
వసంతం వచ్చిందంటూ కమ్మగా కూసింది. దిగులు తగ్గిన కాకి కోయిల కూతకు మురిసింది...

--((**))--

సేకరణ 

*మనం* *అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి* 

*యజమాని, ఇల్లు ** *ఖాళీ చేయమని ఆదేశియస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము.** 

*ఎక్కడకు* *వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము.* 

*అలాగే* *ఈ* *శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము.* 

*ఋణం* *తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటివేయబడుతుంది.* 

*దానికి ఆ* **తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు.* 
*అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు,* *అంతకముందు జన్మల* *పాపపుణ్యాలను* *వెంటబెట్టుకుని, వెళుతుంది.* అవే *సంచితకర్మలు* . 

*3. ప్రారబ్ధ కర్మలు* - *అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు* *ప్రయాణిస్తుంటాడు* . 

*ఏ* *ప్రాణి* *అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో,* 

*అప్పుడు* *అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ* 

*కర్మలు* *అయితే పక్వానికి* *వస్తాయో* , *లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి,* 

*జీవుడికి* *తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన* 

*కర్మలలో* *అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ.ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది.* 

*ప్రారబ్ధం* *ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే.* 

*ప్రారబ్ధం* **తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.* 
*ప్రారబ్ధం* *ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు,* 

*బంధవులు* *మొదలైన వారంతా* *ఒక* *జన్మలో మన కర్మల* 
*ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆయ* 

*వ్యక్తులతో* *మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము.* 

ఈ *శరీరం* *ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి* 

*ఖర్చయుపోగా* , *జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి.* 

ఈ *మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభవించడాన* ికి 

*సిద్ధమవుతాయో* , *అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం* *ఇలానే* *కొనసాగుతుంది* . 

అందుకే *ఆదిశంకరులు* భజగోవింద స్తోత్రంలో 
**పునరపి జననం పునరపి మరణం* 
**పునరపి జననీ జఠరే శయనం"* 
అని అన్నారు. 
*మళ్ళీ* *పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లుగర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు.* 

*ఎప్పుడైనా* *కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము* , 

*అంటే* *ఇదే. మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము.* 

*అలాగే* *పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము.* 

*పాపం* *పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది.* 

*ఎప్పుడో* *చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది.* 

ఆ *ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే.* 



*విత్తనం* *చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు.* 

*అలానే* *చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది.*
--((*))-- 

ఇదెక్కడి న్యాయం 

చీకట్లు కమ్ముకున్నా యంటే వ్యభిచారుల కొంపలు వేల్గిపోతాయి అది చట్టబద్ధం అంటారు
ఇదెక్కడి న్యాయం 

ఒక్క రోజు జైల్లో ఉన్నవాడు అనర్హుడు అంటారు కాని నాయకులకు ఇది వర్తించదు ఎందుకో 
మనిషి మనిషికి తేడాతో ఇదెక్కడి న్యాయం 

తల్లి తండ్రులు ప్రేమతో బిడ్డల్ని పెచుతారు, ఎదిగిన బిడ్డలు గుర్తించ లేదని బాధబడతారు 
బిడ్డల తల్లితండ్రుల మధ్య వ్యత్యాసం ఇదెక్కడి న్యాయం 

చదువు తగ్గ ఉద్యోగం లేదు,  వృత్తికి తగ్గ విలువలేదు, నెల బక్షం అంటూ బిచ్చగాళ్ళు ను
మార్చే నాయకులు ప్రశ్నించే హక్కు ఎవ్వరికి ఉండదు ఇదెక్కడి న్యాయం  

--((*))--
అశ్వంగా మారిన అప్సరస

సాహితీమిత్రులారా!
ఈ సాహిత్యంశం చదవండి-
ఒక అప్సరస అశ్వంగా మారితే అది ఒక సత్ప్రబంధం అవుతుంది! అదెలాగో తెలియాలంటే ఈ వ్యాసం సాంతం చదవాల్సిందే.

సీ. ప్రియుని కెమ్మోవి చుంబింప నోపని లేమ
కఠిన ఖలీన మేగతి వహించు
హారంబు బరువని యలయు లతాతన్వి
వాగెల నెట్టి కైవడి ధరించు
జడసోకు లోర్వగా జాలని తరళాక్షి
కడువంక పల్ల మే కరణి బూను
నొడ్డాణమును దాల్ప నోపని సతి పొట్ట
బట్టెడ బిగి నెటువలె సహించు

తే. మిగుల మెత్తని నడుపుల మెలగు నింతి
మనసు కంటెను జవమున మసలు నెట్టు
లనుచు దేవత లద్భుత మంది చూడ
రాజకులనాథ సాంబ్రాణి తేజి యయ్యె

ఒక చిత్రమైన సన్నివేశాన్ని వర్ణిస్తున్న పద్యం ఇది. ‘సాంబ్రాణి తేజి’ అంటే ఉత్తమజాతి అశ్వం. అతిలోక సుందరి, సుకుమారి, సొగసుల నెరజాణ అయిన ఒక అప్సర స్త్రీ గుఱ్ఱంగా మారుతూ ఉంటే చూస్తున్న దేవతలు, ఆమె పడే అవస్థని ఊహించుకొంటూ, అయ్యో పాపం అనుకొంటున్న సందర్భం. ఇలాంటి విచిత్రమైన సన్నివేశాలని సృష్టించి వినేవాళ్ళ, చదివేవాళ్ళ ఊహశక్తికున్న అవధిని విస్తృతపరచడంలో మన పూర్వకవులు సిద్ధహస్తులు. ఈ పద్యం కన్నా, దీని తర్వాత జరిగిన కథ మరీ చిత్రమైనది!

పూర్వం మన కథలన్నీ చివరకు కంచికే వెళ్ళేవి. అందుకే వాటి ముగింపుతో మనకి పెద్దగా నిమిత్తం లేదు. ఆ మాటకొస్తే కథతో కూడా లేదు! కథనంలో వచ్చే కల్పనలు, సంభాషణలు, వర్ణనలు, అవి రేకెత్తించే ఆలోచనలు, అనుభూతులు- అవీ మనకు ముఖ్యం. అందుకే మన కావ్యాలలో పురాణాలలో, అవే పాత్రలు రకరకాల కథలలో కనిపిస్తాయి. అవే కథలు రకరకాలుగా వినిపిస్తాయి. కథ మొదట్లోనే దాని ముగింపు తెలిసిపోతుంది! ఈ కావ్యం కూడా సరిగ్గా అలాగే మొదలవుతుంది. సూతుడు శౌనకాది మునులకు కథ చెప్పడం మొదలుపెడుతూనే ఇలా అంటాడు: “వినండి మహాత్ములారా. విచిత్రంగా, ఒక రాజు వల్ల కృష్ణునికీ అర్జునునికీ యుద్ధం జరిగింది. ఒక్క ధర్మరాజుని తప్ప, అర్జునునితో సహా అతని సైన్యం మొత్తాన్ని కృష్ణుడు తన చక్రధారతో చంపేశాడు. ఆ తర్వాత, కృపతో ఉభయ సైన్యాల వీరులందరినీ తిరిగి బతికించాడు.”

అదీ కథ! ఇలా కథని ముగింపుతో సహా ముందే చెప్పేస్తే ఇక దాని మీద ఆసక్తి ఎలా ఉంటుంది- అని సందేహించ నక్కర లేదు. అసలు అలా మొదలు పెడితేనే వినేవాళ్ళకి కథ గూర్చి మరింత ఆసక్తి పెరుగుతుంది. కృష్ణార్జునుల మధ్య యుద్ధం ఎలా సంభవించింది చెప్మా. కాస్త వివరంగా చెప్పండి మహానుభావా అంటూ మహర్షులు సూతుని తొందర చేస్తారు. ఇలా కథను టూకీగా ముందుగానే చెప్పేయడం మనకి రామాయణాది పురాణ కావ్యాలలో కూడా కనిపిస్తుంది. మన పురాణాలలో సామాన్యంగా కనిపించే మరొక కథన విధానం- ఒకరు మరొకరికి చెపుతున్నట్టుగా సాగడం. అది కూడా రెండు మూడు పొరలలో సాగుతుంది. మహాభారతం కూడా సూతుడు శౌనకాది మునులకు చెప్పేదే. అందులో మళ్ళీ జనమేజయునికి వైశంపాయనుడు ఆ కథ చెప్పినట్టుగా సూతుడు చెపుతాడు. జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు, అంటే పాండవుల మనవడు. మనవడు తాతల గురించిన కథ వింటాడన్నమాట. ఈ కథలో కూడా అదే సంవిధానం కనిపిస్తుంది. సూతుడు చెప్పే కథలో అసలు కథని శుకమహర్షి ఇలావంతుడికి చెపుతాడు. ఇలావంతుడు అర్జున కుమారుడు. ఇక్కడ తండ్రి కథని తనయుడు వింటున్నాడు. ఇలా ఒకే కథకి ఇద్దరు కథకులు ఉండడం, ఈ కథలు ఒకరు చెప్పగా మరొకరు వినే మౌఖిక సంప్రదాయానికి చెందినవన్న విషయాన్ని గుర్తుచేస్తాయి. అంతే కాదు, వినేవాళ్లు రెండు మూడు దృక్కోణాలనుండి కథను వినే అవకాశం ఉంటుంది. పై పద్యంలో ‘రాజకులనాథ’ అనేది ఇలావంతునితో శుకుడు చేసిన సంబోధన. ప్రస్తుతం కథ ఇలావంతుని దృష్టినుంచి వింటున్నామన్నమాట. ఇలా రెండు పొరలు చాలవన్నట్టు, దీనికి మరొక పొర మన తెలుగు కవులు చేరుస్తారు. అది, తాము స్వయంగా తమ కృతిభర్తలకి కథ చెప్పడం. ఈ కథ చెపుతున్న కృతికర్త చరిగొండ ధర్మన. కృతిభర్త ఎనుమలపల్లి పెద్దన మంత్రి. చరిగొండ ధర్మన్న పదహారవ శతాబ్దానికి చెందిన కవి. అతను నిర్మించిన ఈ కావ్యం పేరు చిత్రభారతం.

పేరుకు తగ్గట్టే ఇది చిత్రమైన కావ్యం. భారతంలో వచ్చే పాత్రలే ఇందులోనూ వస్తాయి. అయితే సంఘటనలూ సన్నివేశాలూ మాత్రం పూర్తిగా భిన్నం. కృష్ణార్జునుల మధ్య యుద్ధం తటస్థపడుతుంది. కౌరవ పాండవులు ఏకమై యుద్ధానికి సన్నద్ధులవుతారు. మొత్తం వారి బలం పద్ధెనిమిది అక్షౌహిణీలు. కర్ణుడు అర్జునుని పరాక్రమాన్ని పొగుడుతాడు. సహదేవుడు సంధికై కృష్ణుని వద్దకు దూతగా వెళతాడు. కర్ణ దుర్యోధనాదుల పరాక్రమాన్ని కృష్ణునికి వర్ణించి చెప్తాడు సహదేవుడు. సంధి పొసగదు. కురుక్షేత్రంలోనే యుద్ధం జరుగుతుంది. శల్యుడు అర్జునుని రథసారథి. భీముడూ దుర్యోధనుడూ కలిసి బలరామునితో యుద్ధం చేస్తారు. అర్జునబాణానికి బలరామ కృష్ణులు మూర్ఛపోతారు. కృష్ణుని కుమారులు యుద్ధంలో మరణిస్తారు. చివరకి కృష్ణుడు ధర్మరాజుని తప్ప యుద్ధంలో అందరినీ చంపేస్తాడు. మరి యింత చిత్రమైన కథ ‘భారతం’ ఎలా అయింది? ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. సంఘటనలూ సన్నివేశాలూ చిత్రమైనవి కావచ్చు. కానీ అందులోని పాత్రలు ముమ్మూర్తులా భారతంలో పాత్రలే. అంటే ఆ పాత్రల స్వభావాలు, వాటి మధ్యనున్న సంబంధాలు, భారతంలో కనిపించినట్టుగానే ఉంటాయి. ఇందులోనూ అర్జునుడు విక్రముడే, ధర్మరాజు నీతివేత్తే. సుయోధనుడు మదమాత్సర్య మత్తుడే. కౌరవపాండవులు కలిసి యుద్ధం చేసినా, వారి మధ్య వైరిభావం ఎక్కడికీ పోదు. కృష్ణార్జునులు యుద్ధం చేసినా, వారి మధ్యనున్న పరమస్నేహం అలానే ఉంటుంది. అందుకే అది భారతమే అయ్యింది. పాత్రల స్వభావాలను అలానే ఉంచుతూ, కేవలం సన్నివేశ కల్పన ద్వారా ఇలాంటి నూతనమైన, అతి విచిత్రమైన కథలు నిర్మించడం మన భారతదేశ సాహిత్యంలో కనిపించే విశిష్టమైన అంశం. ఇలాంటివే రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, అర్జున-బభ్రువాహన యుద్ధం (అర్జునుని మరొక కుమారుడు బభ్రువాహనుడు) మొదలైనవి.

ఈ చిత్రభారతం కథ వినగానే శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమా గుర్తుకు వస్తుంది. అందులోనూ ఇదే కథ కదా. అయితే అందులో కౌరవ పాండవులు కలిసి యుద్ధానికి రావడం ఉండదు. అలాగే యుద్ధంలో కృష్ణుడు అందరినీ సంహరించడమూ ఉండదు. అందులో శివుడు ప్రత్యక్షమై ఇద్దరి యుద్ధాన్నీ ఆపుతాడు. కాబట్టి ఇది వేరే కథ. కృష్ణార్జునయుద్ధం గయోపాఖ్యాన నాటకం ఆధారంగా తీయబడిన చిత్రం. అందులో గయుడనే గంధర్వుని వలన కృష్ణార్జునులకు యుద్ధం సంభవిస్తుంది. ఈ చిత్రభారతంలో చతుర్ధనుడు అనే రాజు వలన వస్తుంది. రెంటిలోనూ శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ ఒకటే. ఇంద్రుడు, బ్రహ్మ, శివుల వద్దకు రక్షణకై వెళ్లి, అక్కడ కుదరక చివరకు అర్జునుని శరణు కోరడమూ సామాన్య అంశమే. అయితే చిత్రభారతంలో, పాండవ కౌరవుల మధ్య కురుక్షేతంలో జరిగిన సమరమంతటి ఘోర యుద్ధమే, పాండవ యాదవుల మధ్య జరుగుతుంది. ధర్మరాజుని తప్ప పాండవ కౌరవ సేనావాహిని అంతటిని, చతుర్ధనుడితో సహా, శ్రీకృష్ణుడు సంహరించడం చిత్రం అయితే, తిరిగి అందరూ బతకడం అద్భుతం. తన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ధర్మరాజు ఒక్కడే రోదిస్తూ ఉంటాడా యుద్ధభూమిలో. అప్పుడు కృష్ణుడు ఓదార్చడానికి వస్తే, తనను కూడా చక్రంతో చంపేయమని కోరుకొంటాడు. శ్రీకృష్ణుడు అతని పరిస్థితికి జాలిపడి, చనిపోయిన అందరిలోనూ ఒకే ఒక్కరిని బతికిస్తానని, అది ఎవరో కోరుకోమని ధర్మరాజుకు వరమిస్తాడు. అప్పుడు ధర్మరాజు, తాము యిచ్చిన మాట నిలుపుకోనేటట్టుగా చతుర్ధనుని బతికించమని కోరుకొంటాడు. ధర్మరాజు ధర్మ నిరతికి సంతోషించిన కృష్ణుడు, యుద్ధంలో మరణించిన వారందరినీ తిరిగి బతికిస్తాడు. ఇందులో అర్జునుని పరాక్రమంతో పాటు యుధిష్ఠిరుని ధర్మవీరం కూడా ప్రదర్శింపబడిందన్న మాట!

గయుని కథ దక్షిణాది భాషలలో యక్షగానంగాను, నాటకంగానూ ప్రసిద్ధి పొందింది. అయితే సంస్కృత పురాణాలలో ఎక్కడా ఆ కథ ఉన్నట్టు లేదు. ఈ చిత్రభారతం బ్రహ్మాండ పురాణం లోనిదని చరిగొండ ధర్మన్న ఈ కావ్య అవతారికలో పేర్కొన్నాడు. నేను బ్రహ్మాండ పురాణం మొత్తం చదవలేదు కాని, చూసినంత వరకూ అందులో ఈ కథ మాత్రం నాకు కనిపించలేదు. దీనికి మరే సంస్కృత గ్రంథమైనా మూలమేమో తెలియదు. బహుశా దేశభాషలలో ఉన్న గయోపాఖ్యానాన్ని ఆధారం చేసుకొని అలాంటి కథనే ఒక కావ్యంగా ధర్మన్న మలచి ఉండవచ్చును. తన కావ్యానికి గౌరవాన్ని తీసుకురావడం కోసం అది బ్రహ్మాండ పురాణంలోని కథగా పేర్కొని ఉండవచ్చు! సంస్కృత సాహిత్యంతో కొంత లోతైన పరిచయం ఉన్నవాళ్ళు నిగ్గు తేల్చాల్సిన విషయమిది.

మహాభారతంలో అనేక ఉపకథలు వచ్చినట్టుగానే చిత్రభారతంలో కూడా వస్తాయి. ఇంద్రుని దగ్గరకు రక్షణ కోరి వెళ్ళిన చతుర్ధనుడికి పారిజాతాపహరణ కథను వినిపిస్తాడు ఇంద్రుడు. అయితే అది నంది తిమ్మన చెప్పిన కథ కన్నా కొంత భిన్నమైనది. నరకాసురుని సంహరించిన తర్వాత అదితి కుండలాలను తీసుకొని స్వర్గానికి వెళతాడు కృష్ణుడు. అక్కడ శచీదేవి పారిజాత పుష్పాన్ని అలంకరించుకొని, దాన్ని ధరించే అర్హత దేవతాస్త్రీలకు మాత్రమే ఉందని సత్యభామతో అంటుంది. దానితో సత్య అలగడం, ఆమె అలక తీర్చడానికి ఇంద్రునితో యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని కృష్ణుడు భూమికి తీసుకుపోవడం జరుగుతుంది. తన పారిజాతాన్నే కాపాడుకోలేని తాను, కృష్ణునినుండి చతుర్ధనుని ఎలా కాపాడగలనని చెప్పి పంపిస్తాడు ఇంద్రుడు. అలాగే చతుర్ధనుడు శివుని దగ్గరకు వెళ్ళినపుడు అతనికి బాణాసుర వృత్తాంతాన్ని చెపుతాడు శివుడు. బ్రహ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు భాగవతంలో వచ్చే బ్రహ్మ గర్వభంగ కథను అతను చెపుతాడు. ఇలా అచ్చమైన పురాణ బాణీని అనుసరిస్తూ విచిత్రమైన కల్పనలతో సాగుతుంది ఈ కావ్యం.

ఇంతకీ చతుర్ధనుని చంపుతానని కృష్ణుడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? అది తెలుసుకోవాలంటే మన పద్యం దగ్గరకి తిరిగి రావాలి. పద్యానికి అర్థాన్ని వివరించుకొని ఆ తర్వాత మళ్ళీ కథలోకి వెళదాం. ఒక అప్సరస గుఱ్ఱంగా మారుతోంది. అది ఉత్తమజాతి అశ్వమే. సర్వాలంకారభూషితం కూడానూ. అయినా అవి స్త్రీలు ధరించే అలంకారాలు కావు కదా, గుఱ్ఱానివాయెను! అంచేత పాపం ఆ అప్సర వాటిని ఎలా భరిస్తోందో కదా అని దేవతలందరూ ఆశ్చర్యపడుతున్నారు. ప్రియుని పెదవుల తాకిడినే సహించలేనంత లేత పెదవులు ఆ అప్సరవి. ఇప్పుడా పెదాలకు గుఱ్ఱపు కళ్లెం తగిలించబడింది! అసలే ఆమెది తీగలాంటి మేను. మెడలో హారాన్ని కూడా మోయలేనంతటి సుకుమారమైన ఆ శరీరం వాగెలను, అంటే పగ్గాన్ని ఎలా ధరిస్తుంది! వెనక ఊగే జడ తాకిడులు కూడా ఓర్వలేని ఆ తరళాక్షి వంపైన పల్లము (అంటే కూర్చునేందుకు గుఱ్ఱంపై వేసే జీను) ఎలా మోస్తుంది! ఒడ్డాణాన్ని సైతం భరించలేని ఆమె పొట్ట పట్టెడ బిగింపుని ఎలా సహిస్తుంది! అతి మెల్లగా సుకుమారంగా నడిచే ఆమె ఇప్పుడు మనోవేగంతో ఎలా పరిగెత్తగలదు! ఇలా అనుకొంటూ దేవతలు అద్భుతంతో చూస్తూ ఉండగా, ఆమె సాంబ్రాణి తేజిగా మారిపోయింది. ఒక అందమైన ఆడది గుఱ్ఱంగా మారిపోయే సన్నివేశం కాని, దాన్ని ఇలా వర్ణించే పద్యం కాని బహుశా ప్రపంచ సాహిత్యంలో మరెక్కడా లేదేమో!

అలా గుఱ్ఱంగా మారిన అప్సరస మరెవరో కాదు, నలకూబరుని వలచి వలపించిన దేవకాంతామణి రంభ. తుల్యుడనే మహర్షి తపస్సుని భగ్నం చేయడానికి ఇంద్రుని పంపున వచ్చి, ఆ ముని కోపానికి గురి అయి అతనిచ్చిన శాపం వలన గుఱ్ఱంగా మారుతుంది. చతుర్ధనుడు కుండిన రాజ్యాన్ని ఏలే రాజు. గొప్ప గుణవంతుడు, పుణ్యమూర్తి. అతను చేసిన పుణ్యం కారణంగా అతనికి సశరీరంగా అన్ని లోకాలనూ చూసే యోగం ఉంది. అతన్ని తనపై ఎక్కించుకొని సర్వలోకాలు తిప్పి తీసుకువస్తే అప్పుడు రంభకు శాపవిమోచనం జరుగుతుంది. కుండిన రాజ్యం దగ్గరలో ఉన్న అరణ్యాన్ని చేరి అశ్వరూపాన్ని పొందుతుంది రంభ. వేటనుండి వస్తూ అడవిలో ఆ ఉత్తమాశ్వాన్ని చూసి చతుర్ధనుడు రాజ్యానికి పట్టుకువస్తాడు. ఒక శుభముహూర్తం చూసి దానిని అధిరోహిస్తాడు. అది ఆకాశానికి ఎగిరి, స్వర్గ వైకుంఠ కైలాసాది సకల లోకాలనూ చూపించి తిరిగి అతని రాజ్యానికి తీసుకువస్తుంది. అలా వచ్చే తోవలో ఒక చోట శ్రీకృష్ణుడు అర్ఘ్యం ఇస్తూ ఉంటే, ఈ గుఱ్ఱపు మొహాన ఉన్న చెమట కాస్తా జారి, గాలివాటుకి వచ్చి కృష్ణుని చేతిలో పడుతుంది. ఆ తర్వాత కథ పైన మనం చెప్పుకున్నదే. ఎక్కడి తుల్య మహర్షి తపస్సు, ఎక్కడి పాండవ యాదవ యుద్ధం! ఇప్పుడు మనం చెప్పుకొనే ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ అంటే ఇదే కదూ!

తాను రచించినది పురాణ కథ అని ధర్మన్న చెప్పుకొన్నా, యిది ప్రబంధ బంధురమైన రచన. కొత్త కొత్త వర్ణనలు, అద్భుత రసపోషణ, ధారాధుర్యమయిన పద్య రచన ఈ కావ్యంలో మనకి కనిపిస్తాయి. రంభ గుఱ్ఱంగా మారిన తర్వాత ఆ అశ్వాన్ని ప్రబంధంతో పోలుస్తూ చెప్పే పద్యంలో తన కావ్య గుణాలను అన్యాపదేశంగా ఇతను పేర్కొన్నాడని భావించవచ్చు.

పదముల చొప్పును వడి యొ
ప్పిదము నలంకారలక్ష్మి పేర్మియు ధారా
స్పద భావము గల్గి శుభ
ప్రదమై హయ మమరె సత్ప్రబంధము రీతిన్

పదముల అందము (గుఱ్ఱానికి కాళ్ళు, ప్రబంధానికి మాటలు), చక్కగా ఒప్పారే వడి (వడి అంటే వేగము, తెలుగు పద్యంలో యతి అని రెండు అర్థాలు), అలంకార శోభ, గొప్ప ధారతో కూడిన స్వభావము (అశ్వగతికి ప్రత్యేకించి ధార అని పేరు) కలిగిన శుభ్రప్రదమైన ఉత్తమాశ్వం సత్ప్రబంధంలా అనిపించడంలో ఆశ్చర్యమేముంది!
-----------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు - ఈమాట మే 2017
-----------------------------------------------------
- ఏ.వి.రమణరాజు



మూల చైతన్యం  

రాళ్లు, కొండలు, పర్వతాలు, గ్రహాలు, galaxies అన్నిటికి ఆత్మ ఉంది. విశ్వమంతా ఆవరించి ఉన్న ఆత్మయే అనంత బ్రహ్మాండ మూలచైతన్యం.

1) భూమి మీద ఒక వ్యక్తి చైతన్య పరిణామం చెందినా విస్తరించిన, కదలిక ఏర్పడిన దాని ప్రభావం మూలచైతన్యంలో multidimensional కోణాలతో అనంత దిశలు ప్రతిస్పందిస్తుంది.

2) ప్రతి సెకనులో పది లక్షల వంతు సమయంలో మూలచైతన్యం అనంతమైన combinations అనంతమైన సంభావ్యతలతో అనంత రూపాలతో అనంత దేహాలతో తనను తాను సృష్టించుకుంటుంది. ఈ అనంత తత్వాన్ని దర్శించాలంటే అంతర్ ప్రయాణం, ధ్యానం ఒక్కటే మార్గం.

3) భూమి, భూమి పైన నివసించే మానవజాతి జీవాత్మలన్నీ చైతన్య పరిణామం చెందడానికి అనంతమైన సంభావ్యతలు ఉన్నాయి.

for ex:-మనం అమెరికా నుండి ఇంగ్లాండ్ వెళ్ళడానికి లెక్కలేనన్ని మార్గాలను ఎంచుకోవచ్చు.

రోడ్ ద్వారా గాని,జల మార్గం ద్వారా గాని, ఆకాశమార్గం ద్వారా గాని ఎన్నో సంభావ్యతలును  ఎంచుకుంటాము. మనం ఒక మార్గాన్ని ఎంచుకుంటే అదే మన వాస్తవం అవుతుంది.

కానీ మన అంతర్ ప్రపంచం ద్వారా అనంతమైన సంభావ్యత లు ఎంచుకుని చైతన్య పరిణామం ఏకకాలంలో పొందుతున్నాము.  మనం  చైతన్య పరిణామం చెందాలంటే ఈ క్షణమే అనంతమైన సంభావ్యత లు కలిగివున్నాము.
***