Monday 2 December 2019


 మాతృశ్రీ వందన పుష్పాలు
గడియారం
పాలను బాధ పెడితే
 భార్య
మాతృశ్రీ వందన పుష్పాలు =25  

NRC అంటే....., 

జ్ఞానం పెరిగే దెపుడు

అజ్ఞానానికి కనువిప్పు తెప్పించేదెపుడు
మనిషికి జ్ఞానమే పెరిగే దెపుడు
కామక్రోధాలను తగ్గే దెపుడు
అవనిపై మహనీయుడు పుట్టేదెపుడు

పురుషార్ధాలకు పురుడు పోసే దెపుడు
సత్య మార్గానికి దారి నిచ్చే దెపుడు
తృప్తికి నిర్వచనము ఇచ్చే దెపుడు
సోమరికి కష్టము విలువను తెలిపే దెపుడు

రాతి పొరల్లో దాగిన నిజాన్ని తెల్పేదెపుడు
ఆకాశంలోని నక్షత్రాలును లెక్కింపు దెపుడు
సంద్రములో  కల్లోలాలు  తగ్గే దెపుడు
సృష్టిలోని ధర్మాసనం బతికే దెపుడు

వేదంలోని సారాన్ని తెలుసుకునే దెపుడు
ఆకాశంలోని రహస్యాన్ని తెలుసుకొనే దెపుడు
అవని యొక్క భారాన్ని  తగ్గించే దెపుడు
జ్ఞానమే అందరి బతుకు బతికిం చే దెపుడు

కొలిచే సాధనం గా నిలిచే శక్తి ఉండే దెపుడు
అజ్ఞానాంధకారంలో అల్లాడే వారి మార్పుతెచ్చే  దెపుడు
సృష్టి అంతటికీ శాంతి కల్గించే జ్యోతై వెలిగే దెపుడు
చీకటిని చీల్చిన అస్త్రం జ్ఞానం తెలుసుకొనే దెపుడు

ఓంకార రూపంలో దర్శనమిచ్చే లో కొన్ని రక్షణ ఎపుడు
తమస్సును హరించే..దెపుడు
మనస్సు  ప్రభుత్వం  మార్చే  దెపుడు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగులో బోధన లెపుడు

అధికారుల నిజాయితీ గా బతికే దెపుడు
రామకృష్ణ బోదలు అర్థం చేసుకునే దెపుడు

✍ ప్రాంజలి ప్రభ

మాతృ శ్రీ వందన పుష్పాలు -27

కిరణాల చలవతో అమృతమ్ము కురిపించు
పవనాల విలువతో గగనమ్ము కురిపించు
పరువాలా కథలతో మనసమ్ము కురిపించు
హృదయాల తపనతో మధురమ్ము కురిపించు

భవరోగ పీడితుల పై కరుణ రసం కురిపించు
మన:శాంతి పీడితుల పై వినయ రసం కురిపించు
మధుమోహ పీడితుల పై మమత రసం కురిపించు
అనురాగ పీడితుల పై ఆధర రసం కురిపించు

ముసి ముసి నవ్వుల చూపు మత్తు కురిపించు
భలె భలె పువ్వుల రూపు మత్తు కురిపించు
గల గల మువ్వల ఊపు మత్తు కురిపించు
దబ దబ సమ్మెట దెబ్బ మత్తు కురిపించు

దర్పమ్ము తొలగించి ఆనందమ్ము కల్పించు
వైరమ్ము మరిపించి బ్రహ్మాండమ్ము కల్పించు
స్నేహమ్ము కలిగించి సద్భావమ్ము కల్పించు
ప్రేమమ్ము కురిపించి సంతోషమ్ము కల్పించు


--(())--


గడియారం

ఒక తండ్రి తాను చనిపోయే ముందు, తన కొడుకుని పిలిచి ఒక గడియారం
 చూపించి, ఇది 200 సం. పైగా వయస్సు కలిగి, మా తాత ముత్తాతల కాలం నుండి నాకు సంక్రమించింది. అయితే ఇప్పుడు నేను దీనిని నీకు ఇచ్చేముందు ఒకసారి నువ్వు బజారులోని గడియారాల షాప్ కి వెళ్లి దీనికి వెల కట్టించుకొని రా అని పంపించాడు. కొంచెం సేపటికి కొడుకు తిరిగి వచ్చి, ఈ గడియారం బాగా పాతది ఐనది కావున 5 డాలర్లకు మించి రావన్నారు అని చెప్పాడు. అయితే తండ్రి ఈ సారి కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల ( యాంటిక్ ) దుకాణానికి పంపి మరలా వెల కట్టించమన్నాడు. ఈ సారి తిరిగి వచ్చిన కొడుకు ఇక్కడ ఆ గడియారానికి 5000 డాలర్ల వెల కట్టినట్లు చెప్పగా.. ఆ తండ్రి అంతటితో ఆగకుండా మరలా కొడుకుని మ్యూజియంకు అదే గడియారం తీసుకొని వెళ్లి వెల కట్టించమన్నాడు..తిరిగివస్తున్న కొడుకు మొహం వెలిగిపోతుండగా, మ్యూజియంలో ఈ పాత గడియారంను పరిశీలించటానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి, ఈ పాత గడియారంకు ఒక మిలియన్ డాలర్ల వెలకట్టినట్లు చెప్పాడు!!

కాగా అది విన్న తండ్రి.. కొడుకుతో  దీని ద్వారా నీకు చెప్పాలని అనుకుంటున్నది ఏమిటంటే నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశం బట్టి, నీ విలువ కూడా మారుతూ ఉంటుంది.. అందుకే నిన్ను నీవు ఎప్పుడూ తప్పు ప్రదేశంలో ఉండవద్దు. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని, నీకు కనీస విలువ లేని ప్రదేశంలో
అస్సలు ఉండవద్దు..అంటూ ముగించాడు!!
👏👏👏👏👏👏
 

పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది.
👉 పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది. Tv tv
👉 వెన్నని కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది.
👉 పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ.
👉 కానీ, ఈ నాలిగింటి రంగు తెలుపే.
👉 దీని అర్థం ఏమిటంటే... మాటిమాటికి దుఃఖం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో, సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది.
👉 పాలు ఉపయోగ పడేవే, కానీ ఒక రోజు కోసమే..
తరువాత అవి  పాడైపోతాయి.
👉 పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేస్తే అది పెరుగు అవుతుంది.
కానీ రెండు రోజులే ఉంటుంది.
👉 పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది. ఇది కూడా 3 రోజులు ఉంటుంది...
👉 వెన్నని కాచి నప్పుడు నెయ్యి వస్తుంది. నెయ్యి ఎప్పుడూ పాడవ్వదు...
👉 ఒక్కరోజులో పాడయ్యే పాలలో ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది...
👉 అదేవిధంగా మీ మనసు కూడా లెక్కలేన్నని శక్తులతో నిండి ఉంది, దానిలో మంచి ఆలోచనలని నింపి..
మీకు మీరే
: చింతన చెయ్యండి.
ఏ సమస్య వచ్చినా ఇలానే విశ్లేషించి చూడండి...
👉 మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి అవుతారు....💐💐
 🙏👍💪✊


 భార్య

భరించేది భార్య,
బ్రతుకునిచ్చేది భార్య,
చెలిమినిచ్చేది భార్య
చేరదీసేది భార్య,
ఆకాశాన సూర్య   లేకపోయినా...
ఇంట్లో  భార్య లేకపోయినా...
అక్కడ జగతికి వెలుగుండదు.
ఇక్కడ ఇంటికి వెలుగుండదు.
మన వంశానికి సృష్టికర్త,
మన అంశానికి మూలకర్త,
కొంగు తీసి ముందుకేగినా...
చెంగు తీసి మూతి తుడిచినా...
తనకు ఎవరు సాటి ఇలలో...
తను లేని ఇల్లు... కలలో....
ఊహకందని భావన...
చేతికందని దీవెన...
బిడ్డల ఆదరించి...
పెద్దల సేవలో తరించి
భర్తని మురిపించి...మైమరపించి...
బ్రతుకు మీద ఆశలు పెంచి...
చెడు ఆలోచనలు త్రుంచి...
భ్రమరంలా ఎగురుతూ...
మనల్ని భ్రమల నుండి క్రిందకు దించుతూ...
కళ్ళు కాయలు కాచేలా...
మన జీవితాన పువ్వులు పూచేలా...
జీతం లేని పని మనిషి...
జీవితాన్ని అందించిన మన మనిషి...
ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం,
మనం తనకు భారం కాకుండా ఉండడం
అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం
: అమ్మ, అక్క & చెల్లెలు కూడా!
వారి భర్తలకి భార్యలే కదా!!
🙏🙏🙏🙏🙏




మాతృశ్రీ వందన పుష్పాలు =25
 
శ్వేత ముఖ దేహ కాంతుల నొప్పి మహిత
స్వేచ్ఛ పద వాక్కు వెల్గుల నొప్పు మహిత
జ్వాల మయ మస్త కాంతులు తెల్పు మహిత
ప్రేమ మయ వేద బోధలు తెల్పు మహిత

వాక్కుల సృష్టి కర్త మదిలో ఉండే మహిత
దాహము తీర్చు భర్త మదిలో ఉండే మహిత
దేహము ఇచ్చి పుచ్చు మదిలో  ఉండే మహిత
దానము చేసి సేవ మదిలో ఉండే మహిత

వశిన్యాదులైన దేవతలతో కలసి ఉండే మహిత
చరితార్థులైన మౌనులతో కలసి ఉండే మహిత
చదువార్జులైన విద్యలతో కలసి ఉండే మహిత
సముపార్జులైన శక్తులతో కలసి ఉండే మహిత

కవి కావ్యాలతో మన:శాంతి కల్పిస్తూ ఉండే మహిత
మది భాష్యాలతో మనసంత మెప్పిస్తూ వుండే మహిత
గుణ లక్ష్యాలతో విధి మార్పు చేయిస్తూ వుండే మహిత
చిరు హాస్యాలతో వయసంత గుప్పిస్తూ వుండే మహిత

--(())--


NRC అంటే.....

N నేషనల్ - R. రెజిస్టర్ - C సిటిజన్   ?

దేశపు పౌరసత్వ ధృవీకరణ పత్రం

ఇంతవరకూ మన దేశంలో మనకు పౌరసత్వం కార్డు లేదు.

 ఇప్పుడు దేశంలో పౌరసత్వ రిజిష్టరు లేదు.

దేశ పౌరులందరికీ పౌరసత్వ కార్డు ఇస్తారు.

దీని కోసం....
...ఈ సమాచారం సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం

ప్రభుత్వానికి మీరు (ప్రతీ పౌరుడు) ఈ క్రింది సమాచారం సరైనది అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.

మీరు ఎక్కడ పుట్టారు.
మీ నాన్న ఎక్కడ పుట్టారు.
మీ తాత ఎక్కడ పుట్టారు.
మీ నాయనమ్మ ఎక్కడ పుట్టింది.
మీ అమ్మ ఎక్కడ పుట్టింది.
మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది.
మీ పెదనాన్న ఎక్కడ పుట్టాడు.
మీ పెద్దమ్మ ఎక్కడ పుట్టింది.
మీ బాబాయి ఎక్కడ పుట్టారు.
మీ పిన్నమ్మ ఎక్కడ పుట్టింది.
మీ మేనమామ/మామయ్య  ఎక్కడ పుట్టారు.
మీ మేనత్త/అత్తయ్య ఎక్కడ పుట్టారు.
మీరు ఏఊరిలో పుట్టారు.
మీవాళ్ళు ఏఊరిలో పుట్టారు.
మీపుట్టిన రోజు , జనన పత్రం ఉన్నదా.
మీ పేరు మీద రేషన్ కార్డు ఉన్నదా.
మీకు ఆధార్ కార్డు ఉన్నదా.
మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా.
మీకు పాస్ పోర్ట్ ఉన్నదా.
మీకు పాన్ కార్డు ఉన్నదా.
మీకు ఓటరు కార్డు ఉన్నదా.
మీ వాళ్ళ ఓట్లు ఏఊరిలో ఉన్నాయి.
మీకు ఫోన్ నంబర్ ఉన్నదా.
మీ పర్మినెంట్/తాత్కాలిక ఇంటికి అడ్రస్ ఏది.
మీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి.
ఈ వివరాలన్నీ ఈదేశంలో పుట్టిన వారందరికీ ఉంటాయి.

అందువలన ఈ దేశంలో పుట్టిన వారందరూ NCRకి భయపడనక్కరలేదు.

 వ్యతిరేకించవలసిన అవసరం లేదు.

పైగా ఇంతవరకూ మన దేశంలో మనకు పౌరసత్వం కార్డు లేదు.

 ఇప్పుడు దేశంలో పౌరసత్వ రిజిష్టరు లేదు.

దేశ పౌరులందరికీ పౌరసత్వ కార్డు ఇస్తారు.

మనకు ఎలాంటి నష్టం లేదు.ఇక ముందు దేశంలోకి బయటవారు రాలేరు.వచ్చినా దొరికిపోతారు. జైలుకు వెళతారు. వాళ్ళు రావటం ఆగిపోతుంది.
విదేశీయులకి మాత్రమే నష్టం. వాళ్ళు ఈ వివరాలు చెప్పలేరు. అబధ్ధాలు చెప్పినా,వ్రాసినా వాటిని చెక్ చేస్తారు.ధృవపరుచు కుంటారు.పౌరులు కాని వారిని తేలుస్తారు.అస్సాంలో ఇలా వివరాలు చెప్పలేనివాళ్ళు 40లక్షలమంది తేలారు.
ఇలా దేశంలో అక్రమంగా ఎన్ని కోట్లమంది ఉన్నారో తేలిపోతుంది.ఎప్పడు బయటపడినా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది.అందుకే ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు నెమ్మది నెమ్మదిగా బోర్డర్ దాటి వాళ్ళ దేశాలకు కొద్ది కొద్దిగా తిరుగు ముఖం పడుతున్నారు.ఇంకా పడతారు కూడా.

NRC వలన మనకి మనదేశానికి ఏమిటి లాభం. దేశంలో ఈదేశ పౌరుల లెక్క తేలుతుంది.అందరికీ కావలసిన వసతులు కల్పించే ప్రణాళికలు రచన జరుగుతుంది.ఉద్యోగాలు,సబ్సిడీలు ఈదేశ పౌరులకు అర్హులైన వారికి అందుతాయి.ఆర్థిక భారం తగ్గుతుంది.దేశం అభివృద్ధి చెందుతుంది. ఆధార్ కార్డులు అనుసంధానం జరుగుతుంది. వీటిని ఎన్నికల జాబితాతో అనుసంధానం చేస్తారు. డిజిటలైజేషన్ వలన ఎవరు ఎక్కడ ఏ గొడవచేసినా ఆధారాలతో సహా తెల్సిపోతుంది దొరికిపోతారు. మనకి,మన దేశరక్షణకి ఇది అత్యవసరం.ఇక్కడ పుట్టిన ఏ మతం వారికి దీనివలన ఇబ్బంది లేదు.రాదు. పౌరసత్వానికి మతానికి సంబంధం లేదు.ఇక్కడ పుట్టారా లేదా ఇక్కడ వాళ్ళా కాదా . అదే తేలుతుంది.అంతే.
ఇతర దేశాల వాళ్ళు ఎవరో ఎలా వచ్చారో ఎందుకు వచ్చారో తేలుతుంది.దేశద్రోహకార్యకలాపాలు తగ్గుతాయి. వాళ్ళని వాళ్ళదేశాలకి సురక్షితంగా వెనక్కి పంపబడతారు.ఇది మన దేశ రక్షణ దృష్ఠ్యా అవసరం,అత్యవసరం.అత్యంత అవసరం కూడా. దీనిని ఈ దేశ పౌరులందరూ గుర్తించాలి.అందరికీ తెలియజేయాలి కూడా.

ఎవరైనా వాళ్ళని ఇక్కడే ఉంచాలి అనేవాళ్శు వాళ్ళని ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉంచరు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఏదేశానికి పోతారో చెప్పి వాళ్ళతో పాటు కట్టకట్టుకుని నిరభ్యంతరంగా స్వేచ్ఛగా ఈదేశం విడిచి వెళ్ళి పోవచ్చు.వాళ్ళని ఇక్కడ ఎవరూ ఆపటంలేదు.వారికి ఇక్కడ నుండి వారు కోరుకుంటున్నట్లు.

అజేయభారత్
సుదృఢ భారత్
సురక్షిత భారత్.
కోసం అందరికీ అవగాహన కల్పించటం దేశభక్తులుగా ఈదేశ పౌరులుగా మనందరి కర్తవ్యం.🙏