Monday 31 December 2018

ప్రాంజలి ప్రభ ఆదివార పత్రిక



ఉద్యోగమా - పెళ్లా (కధ) 
ప్రాంజలి ప్రభ  (1-) 
రచయత: మల్లా ప్రగడ రామకృష్ణ 

ఏమిటే ఆలా మెలికలు తిరి పోతున్నావు, నన్ను ఒకడు ప్రేమిస్తున్నాడని అన్నడే  అన్నది శిరీష , స్నేహితులు అన్నారు, ఒక అమ్మాయిని పొందా లంటే ఆబ్రహ్మ దేవునికి సాధ్యం కాదు, ఆ అశోక్ గాడిని పిలువు, బారుకి తీసుకెళ్లి బాగా వదిలిద్దాం, అప్పుడు ప్రేమ వద్దు అని చెప్పవచ్చు అని స్నేహితులు చెప్పారు.

ఒక నవ్వు నవ్వి అశోక్ ను శిరీష పిలిచింది, క్లబ్ కు పోదామంది, పీకల దాకా దాగింది, అశోక్ ను నోటికి   వచ్చి నట్లు తిట్టింది, అక్కడే క్రింద పడింది, అప్పుడు పోలీసులు రైడ్ చేశారు, స్నేహితులు పరిగెత్తారు శిరీషను వదిలి, కొంత పైకము తీసుకోని పోలీసులు వెళ్లి పోయారు.  అప్పుడే ఆమె బ్యాగులో సెల్ మ్రోగింది, వెంటనే చెప్పాడు మీ అడ్రస్ చెప్పండి, మీ అమ్మాయి త్రాగి క్లబ్బులో పడింది, తీసుకొస్తున్నాము అని కబురు పంపి తీసుకొచ్చి దించి వెళ్లి పోయాడు  అశోక్ .

పొద్దున్నే లేచి అమ్మా నన్ను ఎవరు  తెచ్చారు, ఎవరో అశోక్ టా, నీకు ఎన్ని సార్లు చెప్పిన నీ అలవాట్లు మానుకోవు, డబ్బు మనిషిని పాడు చేస్తుంది, డబ్బు చేతికి అందక పొతే పిచ్చి వాణ్ని చేస్తుంది, అసలే నీవు యవ్వనం లో ఉన్నావు, బీటెక్ పూర్తిచేసావు, ఉద్యోగ కోసం ప్రయత్నిస్తున్నావు.

ఇదే చివరి మాట ఇక చెప్పేది లేదు, ఇక పెళ్లి చేయటమే మా తక్షణ కర్తవ్యమ్ , నీవు ఉద్యోగం చేసి మాకు సంపాయించి నక్కరలేదు అని గట్టిగా చెప్పారు తల్లి తండ్రులు.

క్షమించండి అని చెప్పి లోపలకు వీళ్లింది.

అప్పుడే ఆతల్లి కూతురు ప్రవర్తనకు భాదపడుతూ ఆ  భగవానుకి మోర పెట్టుకున్నది. 
మానసమ్మందు నో మాధవా నీవె నా ప్రాణమీ ధారుణిన్ 
బాలు పోయంగ రా వానలో నెండలో వంతలో విందులో 
ధ్యాన మా నామమే దానవారీ హరీ చిత్తమం దెప్డు నా చింత 
నీవేగదా పొత్తమం దెప్డు నీ మూర్తి నే జూతురా ముత్తెముల్ 

నీవెగా మోహనానంద నా విత్తముల్ నీదెగా ప్రేమ 
చింతామణీ నల్లనౌ దేహమే నాకు నెల్లప్పుడున్ దెల్లఁగాఁ 
దోఁచురా తేలి నే పోదురా యుల్ల మూయాలగా యూఁగురా 
తూఁగుచున్ మెల్లగా నవ్వుచున్ మేలమాడంగ రా పూవులోఁ 

జూతు నిన్ బ్రొద్దులో జూతు నిన్ గ్రోవిలో విందు నిన్ 
ద్రోవలో విందు నిన్ నీవు నేనందురా నిన్ను నాకందురా 
జీవమున్ గావఁరా జీవితేశా నమస్తే నమస్తే నమస్తే నమః 
తండ్రి కూరివద్దకు వచ్చి ఈ విధముగా తెలియ పరిచాడు 

        స్త్రీలు అనాదిగా మోసపోతూ ఉన్నారు, అది ఎవరి 
వలనని ఆలోచించటం అనవసరం, ఎందుకంటే తిరగక పొతే చెడిపోతాడు మొగవాడు, తిరిగితే చెడి పోతుంది ఆడది,  అర్ధం కాలేదను కుంటా ఆడవారు కళ్ళ బొల్లి మాటలకు లొంగి పోతారు తిరిగితే, కాలు జారీనా జారవచ్చు, బయట పడేది ఆడదాని శీలం విలువ, అదే మొగ వాడు తిరుగక ఇంట్లో ఉంటే     ఆడంగి వేషాలు వేసుకొని బ్రతికేవాడుగా, ఆడదానికన్నా ఘోరముగా మారుతాడు.    

నీవు చేసింది మంచో చెడో నాకు అర్ధం చేసుకొనే చదువు లేదు, ఎదో తోటను నమ్ముకొని బ్రతుకుతున్నాను దానిమీద వచ్చిన పైకముతో పైకి వచ్చాను, అదే నీకు నాకు కూడు పెడుతున్నది.

అనాది నుండి  నేటివరకు నింగి నేల కలిసినట్లు కనబడుతున్నది కానీ కలుస్తుందో లేదో తెలియదు కానీ భార్య భర్తల సంగమమే అనురాగ భందమై జీవిత సానిత్యానికి పిల్లలు పుడతారు.   వారి ఆనందానికి తోడ్పడే వాళ్లు తల్లితండ్రులు మాత్రేమే, ఎప్పుడూ పిల్లలకు ప్రేమను పంచుతారు, విషం మాత్రం పంచరు.

స్త్రీ జీవితము అనగా ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, బిడ్డగా రూపాంతరము చెంది అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్నది, సూర్యుడికన్నా ముందే లేచి పాచిపని , ఇంటిపని , వంట  పని  చేస్తూ

పిల్లలకు స్కూలుకు  క్యారేజీ   రడీచేసి, భర్తకు   క్యారేజ్  రడీ చేసి, భర్తను ముద్దు చేసి ఆఫీసుకు పంపి అలసి పోయి, తాను  ఉద్యోగమూ చేస్తూ నిరంతరము ఓర్పు తో బస్సుల్లో తిరిగి ఇంటికి చేరే పరిస్థితి ఉన్నది, అవసరమయితే  స్త్రీలు దుర్మార్గులపై బ్ధద్రకాళి రూపము దాల్చి చండాడే విధముగా మారాలి నేటి సమాజములో. నీవు వళ్ళు మరచి త్రాగి తల్లి తండ్రులకు తలవంపులు తెస్తావనుకోలేదు.
మా పెంపకంలో ఎక్కడో ఎదో లోపం జరిగింది, అయినా దేవుడు మన యందు దయచూపాడు, నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చాడు.   నేనొక కధ చెపుతాను వినమ్మా. 

ఇంటికి ఆలస్యంగా త్రాగి వచ్చిన కూతురిని పై చదువుల కోసం ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు.

"చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? " అని నిల దీసింది కూతురు  . 

"సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? ఈ  రోజే  మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం " అని తండ్రి బదులిచ్చాడు. కూతురు సరే అన్నాది . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు.

తండ్రి కూతురితో   కలిసి వారి మామిడి తోటకి తీసుకెళ్ళి "నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగిరా అని బదులిచ్చాడు" కూతురు ఒక గంట తర్వాత తిరి గొ చ్చింది . తోటలో నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి. "అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది . ఆరోగ్యం గా లేదు . మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగింది .  దానికి తండ్రి "మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు . లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ . అన్నీ చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టుని  కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా స్వేఛ్చ గా పెరగనిద్దాము అని వదిలేసాము" అని బదులిచ్చాడు.కూతురికి విషయం అర్ధమయ్యింది. 

"అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో .. అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు, చెట్టంత కూతురు చల్లగా ఉండాలని. అంతే కానీ స్వేఛ్చని అడ్డుకోవాలని కాదు " అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు .

బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి తల్లి దండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని ఐ కధనీకు చెప్పాను. 

తల్లి తండ్రులను ఒకచోట  కూర్చోపెట్టింది, శిరీష పాదాలకు  నమస్కరించి నాతప్పు తెలుసుకున్నా, నేను చదువు కోమంటారా, ఉద్యోగము చేయమంటారా లేదా పెళ్లి చేస్తాము అంటారా మిరే చెప్పండి అని అడిగింది.

నీ వయసుని బట్టి ధైర్యముగా ఉద్యోగము సంపాదించి పెళ్లి చేసుకుంటే మంచిది అని చెప్పారు. 

అదికాదు ఎదో ఒకటే చెప్పండి ఉద్యోగమా, పెళ్లా నిర్ణయం చేసుకొని మేరె చెప్పండి అన్నది. 

తల్లి తండ్రులు ఆలోచించి పెళ్లే  మా నిర్ణయం, మరి నీ నిర్ణయము మాకు చెప్పు, నీవు ఎవరి నైనా ప్రేమించావా, లేదా మేము చూసిన సంభంధం చేసుకుంటావా చెప్పు అని అడిగారు. 

అశోక్ పై మీ అభిప్రాయము ఏంటో తెలుపుతారా 
నీవు అతన్ని ప్రేమించావా 

ప్రేమించలేదు, ఇప్పుడు ప్రేమిద్దామని అనుకున్నా,  మంచిది 
వారి తల్లి తండ్రులను సంప్రదించి అన్ని వివరాలు రేపు నీకు చెపుతాము తల్లి
మనసులో అనుకున్నారు తల్లి తండ్రులు ఒకనాడు పెద్దలు మాట పిల్లలు వినేవారు, నేడు పిల్ల మాటలకు తల్లి తండ్రులు నోరు పిదప లేని స్థితి తెస్తున్నారు ఇదేమి లోకం. 

      -((*))--

తాత మానవుడి చిన్న కధ            
ప్రాంజలి ప్రభ (2 )
రచయత: మల్లప్రగడ రామకృష్ణ

తాత గొప్ప వారు ఎవరు తాత అని మనవుడు అడిగాడు ? 
ప్రతి ఒక్కరు గొప్పవారే సమయానాన్ని వ్యర్ధ చేయకుండా, ఎవ్వరికి భారం కాకుండా, ఎవ్వరిని మోసం చేయకుండా, నమ్మిన కళలో విజయ సాధించాలని తీవ్రకృషి చేసిన వారు గొప్పవారు, ధనం ఉన్న వారు గొప్పవారు అనుకోవటం తప్పు, 
అందుకే ఒక చిన్న కధ చెపుతా విను మనవుడా               

కాలం కదులుతుంది అది మనకు తెలియదు, పగలు రాత్రి కలయికతో ఒక రోజు కదుల్తుంది. ఆ మధ్య సమయంలో అనేక మార్పులు నిత్యమూ గోచరమౌతాయి. 

అందరి కన్నా గొప్ప నేను అనుకుంటారు ఎవరికి వారు అనగా ఓ అందమైన భవనాన్ని నిర్మించు టకు ఇటికలు గొప్పవని చెప్పుకున్నాయి. ఆ ప్రక్కనే ఉన్న సిమెంటు అన్నది  మీరు విడిగా ఉన్నప్పుడు ఎవరు గమనించరు, ఇటుకలను  ఎక సూత్రముగా కలుపుటకు నేనుండగా మీ గొప్ప పెరిగింది అన్నది. అక్కడే ఉన్న దర్వాజాలు, కిటికీలు అందముగా మేము ఉండుటవల్లే ఇంటికి అందం పెరిగింది అది మీరు గమనించండి అన్నాయి.

అప్పుడే అటుగా మేస్త్రి పోతూ వీళ్ళ సంభాషణలు విని నేను కూలీలను  చేర్చి చక్కగా నిర్మించుట  వల్లా,  గొప్పగా కనిపించింది ఈ భవనము. అప్పుడే  అటుగా పోతున్న ఇంటి యజమాని వచ్చి మీ రందరు కాదు ఇది నా సంపాదన వళ్ళ ఏర్పడినది మీరందరు  నేను పిలవగా వచ్చిన వారు అన్నాడు.. అప్పుడే అటుగా ఒక స్త్రీ భాదపడుతూ వచ్చింది.

అమ్మా ఎవరు మీరు బాధ పడుతున్నారు అని అడిగాయి. నేను పుడమి తల్లిని మీ బరువు నంతా మోసున్నాను నన్ను మరిచి పోయారు మీరు,  మిరే గొప్ప అని అను కుంటున్నారు అది ఎంత వరకు నిజం  మీలో  "సంయమనం, సహనం, పరస్పర  సహకారం " లోపించింది. అందువల్లే నేను భాధ పడుతున్నాను . మమ్మల్ని క్షమించండి మా తప్పులు మన్నించండి. మేమందరం మీ బిడ్డలం .

మీకందఱకు నేను ఒకటే చెప్పేది ఐకమత్యం లోపించి, వ్యక్తిత్వమే ప్రాధాన్యత వహించిన చోట  సదా పతనం, పరాభవం లభిస్తుంది. మీ గొప్పలు ఆవతలు పెట్టి  ఐకమత్యంగా ఉండి " సంయమనం  సహనం పరస్పర  సహకారం ఉన్నత కాలం నేను మీ వెంటే ఉంటాను. మీరు ఎదురు తిరిగితే నేను పెట్టె కష్టాలను భరించ వలసి ఉంటుంది అని తెలుసు కొండి. ఒకరికొకరు సహకరాం అందించుకుటూ ఉంటేనే పగలు రాత్రి ప్రశాంతముగా ఉంటాయి.                 
తాతా అన్నిటి కన్నా గొప్పది భూమాత కదా తాత, అవునురా అందరికన్నా గొప్ప 
ఇంకా ప్రత్యక్ష దైవాలు " సూర్యచంద్రులు, పంచభూతాలు, తల్లి తండ్రులు, గురువు గొప్పవారు. 
మనవుడు నెమ్మదిగా వచ్చి  తాత పాదాలకు నమస్కరించాడు. 
ఏమిటిరా ఏ రోజు స్పెషల్ గొప్ప విషయాలు చెప్పారు, నా మనసుకు తృప్తి కలిగింది తాత               
ఏమీ తెలిసిందిరా నీకు 
ఎవ్వరూ గొప్పవారు కాదు, సత్యమ్, ధర్మం,న్యాయం నిలబెట్టే పరమేశ్వరుడే  గొప్పవారు తాత
అవును .........  అవునా  .......   అవును ... అవును   
--((**))--
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
 (కధ) సంసారి
ప్రాంజలి ప్రభ (3 )
రచయత: మల్లా ప్రగడ రామకృష్ణ
3.విషంక్రక్కే భుజంగం లా, కదంత్రొక్కే తురంగం లా, మదం పట్టిన గజం లా, వలయ విచల ద్విహంగం లా, విలయ సాగర తరంగం లా, చిత్రకార్తి కుక్కలా నావెంట పడ్డా వెందుకు,  నాదగ్గర ఏమి ఆశిస్తున్నావు, ధనమా, సుఖమా, మరి ఏమి కావాలి నీకు, నన్ను వెంబడించ కుండా ఉండాలంటే నేను నేమి చేయాలో చెప్పు, నన్ను వదలి వెళ్ళు, నాదగ్గర నీవు ఏమి ఆశించిన అంతా సూన్యము తప్ప ఏమి దొరకదు అది మాత్రం గుర్తించుకో, నామీద ఆశలు వదులుకో, నీ మాయలో చిక్కే మనిషిని కాదు, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అందాలు చూపిన నేను మారి మూర్ఛ పోయే మనిషిని కాదు.

నీకో విషయం తెలియపరుస్తా నిష్టా గరిష్టుడుగా ఉన్న సంసారిని ఎవరూ వేరు చేయలేరు, ప్రలోభాలకు లొంగ దియలేరు ఇది సత్యము ఆది శంకరాచార్యలు ఇవిధముగా తెలియపరిచారు " మోక్షమం దత్వంతా సక్తి గల పురుషుడు శబ్దాది విషయ వాసనలను నిర్మూలించి, సర్వ కర్మలను బరిత్యజించి, గురు వేదంత వాక్యములందు విశేష శ్రద్ధతో  శ్రవణ మననాదుల సభ్య సించిన ఎడల, వట్టి వాని బుద్ది రాజోగుణ రహితమై పరిశుద్ధ మగును "

నేనంత వాడిని కాక పోయినా నీతో వాదన దిగే శక్తి నాకులేదు, నీతో మాట్లాడుతే తప్పు, అయిన ఓర్పుతో ఆడదాని వని ఎటువంటి గట్టి దండన చర్య తీసుకో కుండా నన్ను వెంటాడ వద్దని తెలియ పరుస్తున్నాను.

గులాబీ నెమ్మదిగా ఈ విధముగా అన్నది మాధవ్ తో

ఈ పూట కేమేమి -ఈ రాత్రి వెన్నెల్లొ - నవ్వు ల్లె పువ్వుల్లొ
 నావెల్గు నీవేగ - నాతృప్తి నీ వేగ  - ఈ వేష మెచ్చేన 
 ఈ మాట ఏ తీర్పు- ఈ ఆశ ఏ మాయ- ఈ బొమ్మ నీదేను   
రారాసు రామా- నువే నాప్రియా నిన్ను పొందాలి ఇప్పట్లొ 
   
ప్రాణమ్ము నీదేను, ప్రాణమ్ము మాయేను  - ప్రాణమ్ము బ్రహ్మమ్ము
 ప్రాణమ్ము ధైర్యమ్ము, ప్రాణమ్ము మోక్షమ్ము ప్రాణమ్ము దేహమ్ము    
ను వ్వాడు  యీసంధ్య వెల్గుల్లొ - నమ్మించు యీసృష్టి వెల్గుల్లొ
మాట్లాడు  ఈ మంచి వెల్గు ల్లొ - ప్రేమంత చూపాలి  ఈ రాత్రి వెల్గుల్లొ 

నీవు మొగడివి, మఘధీరుడివి, నా కళ్లకు నీవు గోపాల కృష్ణుడివి, అందుకే ఒక గులాబీ గా నిన్ను అరాదిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఈ రోజుకు వెళుతున్నాను, నా ప్రయత్నములు మానను ఏ రోజు కైనా సరే నిన్ను నా పాదాలు పట్టించు కోక పోతానా అని అంటూ వెను తిరిగింది గులాబి.

నెమ్మదిగా ఇంటికి చేరాడు మాధవ్, తలుపు కోట్టాడు, తలుపు తీస్తూనే ఏమిటండి మీ మొఖం అట్లాగుంది, ఎదో మార్పు ఉన్నది అన్నది, ఏమి లేదులే ఎండలో వచ్చాగా అందుకే నీకు నా మొఖము కమిలి నట్లు కనిపించి ఉంటుంది, ఏమి లేదు బాగానే ఉన్నాను, మీకు వంట్లో బాగా లేక పోతే చెప్పండి ఆసుపత్రికి వెళ్దాం, రోగం దాచు కోకండి అన్నది, నాకు పట్టిన రోగం చెప్పేది కాదు, చెప్ప కూడనిది కాదు అని గొణుక్కున్నాడు, ఏమిటండి అలా గోనుక్కుంటారు ఎమన్నా అనాలంటే మొఖం మీదే అనండి అన్నది. అబ్బా కాసేపు కూర్చొనిస్తావా, మంచి నీల్లెమైనా ఇస్తావా రాధ అని వాలు కుర్చీలో నడుం వాల్చాడు మాధవ్ .

ఇదుగోనండి మంచి నీరు అనగా తీసుకోని గడ గడ త్రాగి ఒక 10 నిముషాలు నన్ను లేపకు అని కళ్ళు మూసుకొని పడుకున్నాడు.
నిద్రలేచిన తర్వాత రాధ మాధవ్ తో ఈ రోజు గుడిలో ఒక వింత జరిగింది, ఒక ఆరడుగుల అందకత్తె మంచి పట్టు చీరకట్టుకొని అక్కయ్యగారు బాగున్నారా అని అడిగింది. నాకేం అర్ధం కాలేదు అసలెవరమ్మా మీరు అన్నా, ఏమిటండి నన్ను అమ్మా  అంటారు మీ కన్న చిన్నదాన్ని, మీ వారికి బాగా తెలిసిన దాన్ని నన్ను చెల్లీ అని పిలవండి చాలు అన్నది, మల్లో ఉన్న అంతరార్ధం అర్ధం కాలేదు. మీ వారు చాలా మంచి వారండి,  పరస్త్రీ మొఖం కూడా చూడరు, కానీ మీ వారు మిమ్మల్ని వివాహము చేయక ముందు నుంచి నాకు బాగా తెలుసు, మిమ్మల్ని మోసం చేస్తున్నారామె నని అనుమానం ఉన్నది  అన్నది. నాకు కోపం వచ్చింది పైకి కనిపించకుండా నేను అసలు విషయం సూటిగా చెప్పండి, డొంక తిరుగుడు వద్దు చెప్పండి, ఏమీ లేదండి మీరు వప్పుకుంటే మీవారిని నేను పెళ్లి చేసుకుంటా, మీ కిష్ట మున్న లేకున్నా ఉంచు కుంటా అని గట్టిగా చెప్పిందండి. ఏ పేరు చెప్పింది, ఆ గుర్తు రావటంలేదు బంతో, చామంతో ఆ ఆ గుర్తొచ్చింది "గులాబి " అన్నది.

ఏమి తెలియని వాడిలా మాధవ్ ఇంతకీ ఆమెతో ఏమి చెప్పావు
నేనేమి చెప్పలేదు కొందరు మనుష్యులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు అదీ జరిగింది.
ఆ మనుష్యులు ఎవరో కనుకున్నావా ఏమో నాకేం తెలుసు
లేదు నీవు కనుక్కొనే ఉంటావు నా దగ్గర దాస్తున్నావు 
అవునండి తెలుసుకున్నా నేను "ఆమె పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చిందట, ఆమె మీద 3 మర్డర్ కేసులు  కూడా ఉన్నాయిట .
పాపం ఏ తప్పు చేసిందో
ఈమెకు మద పిచ్చి పెరిగి ఒకర్ని ప్రేమించిందట, పేమించినవాడు దిన్ని మోసం చేసి వేరొకర్ని పట్టుకొచ్చి సర్వం అర్పించ మన్నాడుట అంతే ఆమాటలకు తట్టుకో లేక వచ్చిన వాడ్ని ప్రేమించిన వాడ్ని చెడుగుడు ఆడి మరి చంపి పోలీసులకు లొంగి పోయిన్ది. మానసిక రోగిగా మారింది. ఎర్రగా బుర్రగా అందంగా ఉన్న మగవాడ్ని చూస్తే బుట్టలోకి లాగి మరీ చంపు తున్నదిట, మొన్న జైల్ నుంచి వచ్చాక ఒకర్ని లొంగ దీసుకొని మొగవాళ్ళు మూర్ఖులు అని మరీ చంపి, తప్పించుకొని వేరొక మొగాడితో తిరుగు తుందట, పెళ్లైనవాడ్ని వారిని సంభందించిన వారిని లొంగ దీసుకొని వేటాడు తుంటూ ఉంటుందట. ఆమె కధ వింటుంటే నా ప్రాణం పైన పోయిన్ దనిపించింది. నామంగళ సూత్రం గట్టిది,
మావారు అలాంటి వారు కాదని నమ్మకము నాకు ఉన్నది అని చెప్పింది.

ఒక్కసారిగా ఊపిరి పీల్చాడు ఇదుగో రాధా ఇక్కడ ఆడవారు చాలా గట్టివారు మోసకారి లాగున్నారు కదూ. ఎందుకండీ అలా అంటారు మగవాళ్ళు గట్టిగా ఉంటే ఏ ఆడది భయపడ నవసరము లేదు.
ఇలాంటి మానసిక వ్యధకు గురైనవారు తటస్థపడితే మనమే జాగర్తగా ఉంటే చాలు, భయపడ నవసరంలేదు.

ఓరాధా  నీవు చెప్పింది మంచి విషయమో, చెడ్డ విషయమే తెలుసు కోలేకున్నాను ఒక స్త్రీ బాధపడితే నామనసు భాదలో ఉంటుంది పాపం ఆమెకు మంచి జరగాలని ఆదేవుడ్ని కోరుకుందాం పదా గుడిదాకా వెళ్లి వద్దాము అన్నాడు మాధవ్ .
అప్పుడను కున్నది రాధ మావారు ఎంత మంచివారు ఇతరులకోసం కోసం కూడా గుడికి వెల్దామంటున్నాడు ఏమిటో  విషయం
ఏమీ లేదు మీ ఆడవాళ్ళ బుధ్ధి మాత్రం మార్చుకోరు, ఏది అన్న ఎదో తప్పు పడుతుంటారు
అంతలేదండి నాలో మీరెలా గంటె అలా ..  లేదు లేదు నీవెలా అంటే ఆలా
మహాప్రభూ మీతో మాట్లాడలేను నేను పదండి గుడికి ...  ఆ ఆ వసున్నా                                                                        
--((**))--

ప్రాంజలి ప్రభ - సెల్ ఫోన్ (చిన్న కధ) (4)

అమ్మా నాన్నా ఫోన్ చేస్తున్నాడు తీయనా, నీవు తీస్తావా అన్నది పుత్రిక రత్నం " హిమబిందు "
తియ్యవే, మీనాన్న గారితో మాట్లాడు మీరిద్దరూ ఒకటేగా, నీమీద ఈగ వాలనీడు, నీవు ఏదంటే అది తెచ్చి ఇస్తాడు.
అట్లయితే నువ్వే మాట్లాడు నేను మాట్లాడునులే అని లోపలకు వెళ్ళింది.
ఫోన్ మళ్ళీ మ్రోగింది, హలొ అని మొదలు పెట్టింది శ్రీమతి శ్రీదేవి
ఏమండి మీరెలా ఉన్నారండి అని అడిగింది
నేను బాగానే ఉన్నా, ముందు అమ్మాయి కి ఫోన్ ఇవ్వు
అట్లాగేనండి
హిమబిందు నాన్నగారు నీతో మాట్లాడుతారుట మాట్లాడు
అమ్మా చిట్టితల్లి " నీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుదామని ఫోన్ చేసాను"
మంచిది నాన్న మీకు ధన్యవాదములు,
చిట్టితల్లి నీకు కొరియర్ లో గిఫ్ట్ పంపుతున్నాను, నాన్న మీరు రావటంలేదా
లేదమ్మా నాకు చిన్న పని ఉండటంవల్ల రాలేక పోతున్నాను, అమ్మ నువ్వు జాగర్తగా ఉండండి, నాన్న మీరు రాక పొతే నేను పుట్టిన రోజు ఏమి చేసుకోను, మీరొస్తేనే చేసుకుంటాను అంతే అంటూ ఫోన్ కట్ చేసింది.
మల్లా ఫోన్ మోగింది
ఏమండి మీరెలా ఉన్నారండి, వేలకు భోజనం చేస్తున్నారా, నిద్రపోకుండా ఎక్కవ కష్టపడకండి, మీ మీద ఆధారపడినవారు ఉన్నారండి అది మాత్రం మర్చిపోకండి. నీవు చెప్పినవన్నీ పాటిస్తున్న ముందు అమ్మాయికి ఫోన్ ఇవ్వు
హిమబిందు నాన్నగారు నీతోనే మాట్లాడుతారుట
ఏమిటి నాన్న
నీకు కోపం వచ్చిందని నాకు తెలిసింది, ఇక్కడ నా పరిస్థితులు నీకు, మీ అమ్మకు వివరించలేను అది అర్ధం చేసుకో,
నేను నీకు పంపినది స్మార్ట్ ఫోన్ దాన్ని ఎలా ఉపయోగించాలో నేను నీకు చెప్పనవసరము లేదను కుంటాను, థాంక్స్ నాన్న అంటూ ఫోన్లో ముద్దు పెట్టింది హిమబిందు
చూడమ్మా నీ పుట్టిన రోజు ఆన్లైన్ వీడియో లో నేను దివిస్తాను, నీవు ఆన్ చేసి ఉంచు, ఒక్క సారి అమ్మకు ఫోన్ ఇవ్వు. 
ఏమిటే అమ్మాయి పుట్టినరోజు కదా,   ఈరోజు స్పెషల్ ఏమి చేస్తున్నావు
నామతి మండా ఆవిషయమే మరిచాను, మీరు దూరముగా ఉన్నప్పటినుండి నామనసు మనసులో లేదు, ఎంత సేపటికి మీ ఆలోచనలే, మీరు జాగర్తగా ఉండాలని, దేవళ్ళందరినీ మొక్కుకుంటున్నాను.

 నీ మొక్కుల ఫలిత మేమో ఒక్క వారంలో నీదగ్గర వాలిపోతా
ఎంత చక్కటి వార్త చెప్పారండి అమ్మాయి బర్తడే కేక్ కొరియర్లో పంపిస్థాను వెంటనే తినండి.
నా బంగారు చిట్టి తల్లి హిమబిందు మీ నాన్నగారు వారం రోజుల్లో వస్తారట, ఇంటిని శుభ్రం చేయాలి  అందులో ఈ రోజు నీ పుట్టినరోజు కదా అందరిని పిలువు గ్రాండుగా చేసు  కుందాం 
అట్లాగేనమ్మా              
               
అమ్మహడావిడితో నాన్న వీడియో సెల్ ఫోన్ దీవెనలతో నవ్వుల కేరింతల మధ్య జరిగింది పుట్టినరోజు .
మనుషులు దూరముగా ఉన్నా వస్తున్నాను అనే శుభవార్తె కొందరిలో ఉన్న అశాంతి  తొలగించి ఉత్సాహం నింపుతుంది.                        

--((**))--

ప్రాంజలి పభ  కవులను రచయితలను ఆహ్వానిస్తున్నది  
మీ రచనలను రామకృష్ణమల్లాప్రగడ 101 @ జిమెయిల్.కం కు పంపగలరు 

Sunday 18 November 2018

తల్లి తండ్రుల పాఠాలు

తల్లి తండ్రుల పాఠాలు ( 1 ) (Telugu daily serial)   
ప్రాంజలిప్రభ.  (నిత్య సంతోషం )

అది ఒక కుటుంబం  

కళ్ళజోడు సర్దుకుంటూ చెప్పులు మూల వదలి చేతి కర్రను గట్టిగా పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు తాతగారు.  

నాన్న ఇప్పుడేనా రావటం అంటూ ఎదురు వచ్చాడు కొడుకు  

ముందు కబురు చెయ్యబోయ్యావా నేను స్టేషన్కు వచ్చేవాడ్ని కదా అంటూ చేతిలోని సంచి అందుకున్నాడు. 

నీకు ఇబ్బంది ఏమోనని స్టేషన్ దగ్గరదగా వుంది నీ ఇల్లు అందుకే  నేనే వచ్చాను

అమ్మకెలాఉంది నాన్న 

ఎలావుంటుంది అలా నే వుంది "చెట్టంత మొగుణ్ణి ప్రక్కన ఉన్నా కొడుకు ఎలా ఉన్నాడు మనవుళ్లు ఎలా ఉన్నారు అని ఒకటే కలవరింత.

నీతోపాటు తీసుకు వస్తా బాగుండేది, అమ్మ కూడా 2  రోజులు ఉండి పొయ్యేది కదా 

అంటే నన్ను 2 రోజులు ఉండి పొమ్మంటావా ఏంటి ?

అదికాదు నాన్న నేను ఏది మాట్లాడినా " తప్పు పట్టుకుంటావు " ఇంకా మారలేదు మీరు. 

మేమెందుకు మారాలి మీకేమన్న తక్కువ చేశామా, చక్కగా చదువు చెప్పించాము 
కదా 

అవును చెప్పించారు ఎం లాభం ఆ చదువు బతకటానికి కూడా పనికి రాలేదు ఇక బతికించుకోవటం ఎట్లా ?

నీకో విషయం చెపుతా విను " పక్షులు రెక్కలు వచ్చేదాకా పోషిస్తాయి, " తర్వాత స్వేశ్చగా తిరగమంటాయి.   

పక్షులకు మనకు తేడా వుంది కదా నాన్న

వుంది లేదనను 

"మనం జంతువులనుండి పుట్టామని తెలుసుకో కలిగిన వాడే నిజమైన మానవుడు"  

 అంటే ఏమిటి అర్ధం కాలేదు 

ఎందుకు అర్ధం అవుతుంది మాతృభాష వదలి "ఇంగ్లీషు " నేర్చుకోవటం వళ్ళ 

బతికించు కోవాటానికి ఉపయోగ పడుతుందేమో కానీ జ్ఞాన సంపద పెరుగు తుందంటే నేను నమ్మను.

నాన్న  మీరు భాషను తక్కువ చేసి మాట్లాడు తున్నారు 

అవునురా చేతకాని ప్రభుత్వాలు ఉన్నంత వరకు ఇట్లా గే మాట్లాడుతాను 

"ఎక్కువ జనాభా ఉన్నప్రాంతాలో మెదడు ఉపయోగించుకొని వారి పోషణకు ఆధారపడాలి కానీ వారి పొట్టలు కొట్టి విదేశీ "కంప్యూటర్ " వ్యవస్థను కొన్ని కోట్లు పెట్టి తెస్తున్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకొచ్చారు. ఎప్పుడు కరంటు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఇంటర్నెట్ ఉంటుందో తెలియదు.   

అర్ధం కాలేదు నాన్న 

ఎందుకు అర్ధం కాదు నేను తెలుగులో నే కదా మాట్లాడింది 

అందుకే అర్ధం కాలేదంటున్నాను. 

మాతృభాష వదలి పరభాష నేర్పించి నేనే మోసపోయాను, కనీసం మన భాష సంస్కృతి తెలుసు కోలేని కొడుకుని కన్నందుకు మేమె భాధ పడాలి. 

 25 -11-2 0 1 8                                                                 
మల్లా ప్రగడ రామకృష్ణ (6281190539)    
మిగతా భాగం రేపు  


తల్లి తండ్రుల పాఠాలు ( 2 ) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )
అందరూ ఒకే కుటుంబం  
  
          నాన్న ఆధునిక పద్ధతులు, నేర్చుకోవాలి, కొత్త విధానాలతో ముందుకు పోవాలి, ఎంత సేపటికి  పాత చింతకాయ పచ్చడే  గొప్ప అంటే ఎట్లాగు నాన్న, నీకా పెద్ద వయసు వచ్చింది, ఒక మూల కూర్చొని కృష్ణ రామ అంటూ మనవళ్లుతో  ఆడుకోవచ్చుకదా. ఎదన్నా మాట్లాడితే చాలు  రోషం వచ్చేస్తుంది,  రాకెట్టులో చంద్రమండ లానికి పోయే రోజులు వచ్చాయి, అక్కడే కొత్త నగరాలను సృష్టించటానికి మన శాస్త్రజ్ఞులు విశ్వ  ప్రయత్నాలు చేస్తున్నారు.  

గుడ్డొచ్చి పిల్ల నెక్కి రించినట్లు లాగా ఉన్నాయరా నీ మాటలు, అయినా నీవు చెప్పిన దానిలో కొంత నిజం దాగి ఉన్నది.  పాత చింతకాయ పచ్చడిని చులకన చేయవద్దు అది మన ఆరోగ్యానికి ఏంతో  అవసరం, ఎండు మిరపకాయలు వేయించి, ఇంగువవేసి నూనెతో తిరగమోత పెట్టి చింత తొక్కును కలిపి రోలు యందు వేసి రోకలితో దంచి పచ్చడి చేస్తే దాని వాసన  పది గ్రామాల దాకా వ్యాపించేది అనేవారు. అన్నంలో పచ్చడి కలుపుకొని నూనె వేసుకొని తింటే దాని రుచి  ఇంత అని చెప్పలేము, మరియు దానికి తోడు తల్లి కూడా చేయలేని ఉల్లిపాయను కోరొక్కొని తింటే  అబ్బా అబ్బా  ఉంటుంది తిన్నవాడికే తెలుస్తుంది. ఎంతసేపటికి ఆధునికమని "పిజ్జాలు, గప్ చిప్పులు, చాక్ లేట్లు " తింటే అనారోగ్యము మరియు జీర్ణము కాకా ఏంతో భాధ పడాలి. తిండి విషయంలో ఆధునికమా పాత అని ఆలోచించటం తప్పు, శుభ్రంగా చేసింది ఏది, శరీరానికి హానికలుగా కుండ శక్తి వంతుడుగా మార్చే పౌష్టిక ఆహరం తీసుకోవాలి. 

మరో విషయం పెద్ద వయసు వచ్చింది మూల కూర్చో అనే హక్కు నీకు లేదు, ఎవరి కష్టార్జితం వారిది, ఎవరి శక్తి వారిది, పెద్ద వయసులో జ్ఞానం పెరుగుతుంది, హితబోధ చేయుటకు సహకరిస్తుంది, శరీరము కూడా మందులపై ఆధార పడుతుంది. తండ్రిగా చేయవలసినది చేసాం,  మాలో ఉన్న శక్తిని 50% మీకే  దారపోసామ్, నేను ఉన్నాను, నేను చదివిన రామాయణ భారత భాగవతాలలో ఉన్న   అంతర్గత సూక్తులను రోజుకు ఒక స్కూలుకు వెళ్లి చెపుతున్నాను,  అట్లా చేయుట వళ్ళ నాకు మీ అమ్మకు ఏంతో  తృప్తిగా ఉన్నది. నీవు అనవచ్చు  నీవు చెప్పే కధలు ఇంగ్లీషు మీడియంలో చదివే వారికి ఏమి అర్ధం అవతాయని, నీ  ప్రయత్నం శుద్ధ దండగా అని అనవచ్చు. ఏది ఏమైనా మన సంస్కృతి సంప్ర దాయాలని కాపాడాలని మా ప్రయత్నం మాత్రం ఆపను, నా వయసులో ఉన్న వారికీ మన: శాంతి కల్పించి చేతనైన సహాయము చేయాలని అను కుంటున్నాను. తెలుగు భాష బతకాలనీ నా ప్రయత్నం మానను, అందర్నీ తెలుగు నేర్చుకోమని ప్రాధేయ పడతాను.                        
   
              రోషం వస్తుందంటావు, కష్టపడ్డ వాడికి తెలుస్తుంది సుఖ విలువ, సుఖ పడే వానికి ఎం తెలుస్తుంది కష్టం విలువ.  మంచి చెడు ఆలోచించ కుండా, చిన్న పెద్ద ఆలోచించ కుండా, మిడి మిడి జ్ఞానముతో దేవుడు సహకరించిన ధనాన్ని చూసుకొని, ఇది నా కష్టార్జితమ్  మూర్ఖుడుగా మారి నోటికి ఏది వస్తే అది అంటే పడేవారు కాదు పెద్దవారు. పేద వయసులో పిల్లల  సంపాదన కన్నా తక్కువ ఉండవచ్చు సంపాదన, అంత  మాత్రాన చేతకాని వారిలాగా చూస్తే ఎవ్వరూ ఊరుకోరు కొడుకులందరు అది గుర్తించు కోవాలి.        

  25 -11-2 0 1 8                                                                 

మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (6281190539)    
                                                                                                      మిగతా భాగం రేపు   



తల్లి తండ్రుల పాఠాలు ( 3 ) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )
అందరూ ఒకే కుటుంబం  
  
చూడు బాబు ఎదో నా మనసు ఒప్పక కొన్ని విషయాలు నీకు తెలపాలనుకున్నా ఎందుకంటే మానవ ప్రయత్నమూ ఎంత ఉన్న భగవంతుని ప్రయత్నము తప్పక ఉండ వలెను. ఉపయోగము, నిరుపయోగము గూర్చి వివరిస్తాను. ఎందు కంటే మనిషన్న తర్వాత కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆవిషయాల వళ్ళ మనకు జ్ఞానము పెరగాలి.      
చెట్టుపై అందని ఫలాలున్నా ఎంత నిరుపయోగమో
 - భక్తి పుత్తడి పూతలా ఉంటే అంతే నిరుపయోగమూ  

నీటి మీద, గాలి మీద రాత ఎంత నిరుపయోగమో
 - శ్రీవత్స మొక్కక అన్య మొక్కు అంతే నిరుపయోగమూ

చదువు  లేని మూర్ఖుడు ఉన్నా ఎంత నిరుపయోగమో
 - తల్లి తండ్రుల్ని చూడని బిడ్డ అంతే నిరుపయోగమూ

 శ్రీ పద్మావతీ అమ్మవారిని ప్రార్థిస్తే ఉపయోగమే 
- శ్రీ వెంకటాపతి కరుణ కలిగితే జీవి యోగమే   

ఏమిటిరా అల్లా బిత్తర చూపులు చూస్తున్నావు, నువు చెప్పేవి ఏమి అర్థకాని మొహంలా  ఉన్నది. అసలు దేవుడు భక్తి అనేది ఎదో తెలియకుండా పెరిగావ్, ఎదో నీ  అదృష్టమో, మా అదృష్టమో, తక్కువ మార్కులు వచ్చినా  ఉద్యోగం సంపాదించి కాలర్ ఎగరేస్తున్నావు అది నీ  గొప్పతనం కాదు, అది దేవుని సహకారము వళ్ళ వచ్చిందని గమనిస్తే నీకు మాకు ధర్మము. 

"మృదు స్వభావం కలవాడు ఎల్లప్పుడూ అవమానాలకు గురి అవుతాడు. కోపిష్టికి ఎప్పుడూ విరోధాలు ఎదురవుతాయి. ఈ రెండింటినీ వదలి మధ్యేమార్గాన్ని ఆశ్ర యించాలి "       


నాన్న నన్ను క్షమించు నేను ఎమన్నా తప్పు చేస్తే మన్నించు అన్న మాటలకూ తండ్రి వెంబడి కళ్ళు నీరుకారాయి. 

చూడు బాబు   ఎండిన ఆకు రాలక తప్పదు, లేత ఆకు పండి ఎండేదాకా ఆగక తప్పదు.            
 26-11-2 0 1 8                                                                 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ     
(ఈ కధ  ఎవ్వరిని ఉద్దేశించినది కాదు సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఆధారం) 
  

                                                                                                         మిగతా భాగం రేపు   


తల్లి తండ్రుల పాఠాలు ( 4) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )
అందరూ ఒకే కుటుంబం  
నాన్న నీవు చాలా మంచి విషయాలు తెల్పావు, మీకు కాఫీ కలుపుకొస్తాను అన్నాడు. 

ఏమిటిరా కోడలు లేదు ఇంట్లో. 

లేదు నాన్న ఉద్యోగ రీత్యా క్యాపుల్కి వెళ్తున్నది

మరి ఎప్పుడొస్తుంది     

ఇంకా 4  రోజులు పడు తుంది 

మరి పిల్లలు ఎరిరా 

స్కూల్ హాస్టల్లో చేర్చాను 

చిన్న పిల్లలే కదా వారు ఇంట్లో మీదగ్గర చదివితే మంచిది. అక్కడ తిండి ఎలా ఉంటుందో 

అది కాదు నాన్న ఇద్దరం ఉద్యోగం కు వెళ్ళాలి 

పిలల్లను పెంచటం కష్టమని ఈ పనిచేసాను నాన్న

అట్లయితే నీదగ్గర నేను కూడా ఉండటం కష్టమే 

నీకు పిల్లలకు తేడా ఉందికదా నాన్న

ఏమిటి తేడా వయసా 

60 ఏళ్ళు నిండినవాడు 6  ఏళ్ళు వయసు వారితో సమానమని ఎక్కడో చదివాను రా 

మీ పురాణాలు నాకెందుకు నాన్న

ఇదిగో కఫీ త్రాగు ముందు         

గీజెర్ వేసా నీళ్లు కాగాయి ముందు స్నానం చేసిరా 

ఆ తర్వాత టేబుల్ పై ఇంగ్లీసు పాపర్ ఉంది చదువుకో 

అవును నీకు ఇంగ్లిష్ రాదు కదా 

తెలుగు బాషా పిచ్చోడివి 
  
అవునురా నేను పిచ్చో డ్ని 

మిడిసి పడకు 
ఎప్ప టికైనా బతికి బతికించేది మాతృ భాష మాత్రమే, అది మాత్రం గుర్తించుకో

ఇంగ్లిష్ చదువులు మేఘం లాంటివి 

గాలి వీస్తే మేఘాలు కదిలినట్లు, భాషా పరిజ్ఞానమ్ పెరుగుతున్నది ఇప్పుడున్న కంప్యూటర్లో ఆంట్ తెలుగు భాషగా మారుతున్నది, అప్పుడు మీరు తెలుగు నేర్చుకోవాల్సి వస్తుంది 

సరే ముందు స్నానము చేసి రండి 

తర్వాత ప్రక్కన ఉన్న హోటల్ కే పోయి టిఫిన్ తిందాం 

ఇంతకూ నిన్ను అడగటం మరిచా మన పొలం కవులు కిచ్చావుగా ఏమైనా డబ్బు ఇచ్చారా అవి తీసుకొచ్చావా 

హాస్టల్ ఫీజు కట్టాలి 

ఇద్దరు ఉద్యోగం చేస్తూ కూడా ఈ అడుక్కోవడం ఎందుకురా 

ఈ సంపాదనలో కనీసం తిండి కూడా తినలేక పోతున్నారు 

ఆరోగ్యాలు చెడితే ఇంకా కష్టం, అదేనెను చెప్పా దాలిచా 

ఎరా నన్ను కనీసం స్నానమన్న చేయ నిస్తావా, ఇట్లా బస్సు ఎక్కి పొమంటావా

నేను అడిగినది ఏమిటి, నీవు చెప్పేది ఏమిటి, అర్ధం అసలు కావటం లేదు నాన్న

అవునురా అర్ధం చుట్టూ తిరుగుతున్నావు, ఆ అర్దమే పరమార్ధం  అను కుంటున్నావు అది

 నిన్ను ఒక్క చోట నిల్వ నీయదు, మన: శాంతి ని మింగేస్తుంది

అది ఇప్పుడు అవసరమా 

నాన్న నేను నీతో మాట్లాడలేను ముందు స్నానమ్ చేసి రండి                   

సరే అట్లాగే చేస్తా 

సంచి ఇక్కడ ఉంచవచ్చు వచ్చు, ఎం పర్వాలేదు ఎక్కడెవ్వరు లేరు దొంగలు 

ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేరుట ఎవరి జాగర్త వారిది 

(ఈ కధ  ఎవ్వరిని ఉద్దేశించినది కాదు సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఆధారం) 

-11-2 0 1 8                                                                 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ     

  మిగతా భాగం రేపు   



బాబు నేను ఒక్క విషయం చెప్పా దలుచుకున్నాను

మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేస్తే అది " దానం ". మనకోసం ఆలోచించకుండా ఇతరుల శ్రేయస్సు కోరి చేసిన సహాయం "త్యాగం" అవుతుంది. అలాంటి త్యాగ గుణం ఉన్నప్పుడు మనిషి మనిషిగా గుర్తింపు పొంద గలుగుతారు.

ఏమో నాన్న దానం అంటూవుంటావో, త్యాగం అనుకుంటావో అది నీ ఇష్టం నాకు మాత్రం డబ్బు కావాలి అది నీవు సర్దాలి అంతే

నేను నీకు ఇవ్వకపోతే ఏమ్చేస్తావ్

ఏంచేస్తాను ఏమి చేయను, నాకున్న దానిలో స్దర్దుకుంటాను

అయితే నేను నీకు డబ్బు ఎందుకు ఇవ్వటం, అయితే సర్దుకో ఎవరైనా దగ్గరగా ఉంటె ప్రేమ చూపిస్తారు, దూరమయిన కొద్ది ప్రేమ పెంచు కుంటారు, నీవేమో కేవలం డబ్బు చుట్టూ తిరుగుతున్నావు, డబ్బే ప్రేమ అనుకుంటున్నావు, తల్లితండ్రులు సహాయం చేశారే వారికి చేయూతగా ఉండాలని ఒక్క నిముషమైన అనుకున్నావా, కేవలము నీపెళ్ళాం, నీపిల్లలని ఆలోచించుకుంటుంన్నావు, నీకూ వయసు రాక పోతుందా, అనుభవం రాక పోతుందా అన్ని నేను చూస్తానురా

నాన్నా డబ్బు అడిగినందుకు ఇంట ఉపన్యాసం అవసరమా

సరే నాన్న ఇక్కడ టిఫిన్ తిందాం

ఇక్కడ ఎక్కడ హోటల్ లేదుకదరా

అదిగో నాన్న ఆ బడ్డి కొట్టు పాకా క్రింద దోశలు వేస్తున్నారు కనిపించాలా

నీ బుద్ధి, అక్కడ ఉన్న స్థితి చూస్తే నాకు ఆకలి చచ్చి పోయింది రా

నీవు రోజు ఇక్కడే తింటావా

లేదు నాన్న ఇంట్లో రోజు నేనే చేస్తాను, ఇప్పుడు మా ఆవిడ లేదుకదా నీవేమో ఆకలిగున్నావు అందుకని

అందుకని ఇక్కడకు తెచ్చానంటావ్ , ఇక్కడ కూర్చొని తినమంటావ్

తినేవారు మనుష్యులు కాదంటావా

కాదనను పరిశుభ్రం పాటించమన్నారు, ఉన్నవాటిలో సుబ్రహముగా ఉంచమన్నారు, ఇఇగాలు దోమలు రాకుండా చూడమన్నారు, రోడ్డు మీద పోయే వాహనాలు పొగ దూర కూడదన్నారు, మంచి నీరు పాకెట్లుకాని, మంచి నీరు కాం కానీ ఉండాలన్నారు, జంతువులూ రాకుండా చూడాలన్నారు. అక్కడ  చూస్తే అన్ని వ్యతిరేకముగా ఉన్నాయ్ .

అల్లాంటప్పుడు

అల్లాంటప్పుడు ఇక ఊరికి వెనక్కి వెళ్ళితే ఆకలితో అలమటిస్తావ్ . నాకెందుకు పాపం తండ్రికి కూడా కూడు పెట్టలేని కోడుకు అని లోకులు అనుకుంటారు.

అబ్బో నీకు ఎంత దయార్ద్ర హృదయం, తండ్రి మీద ఎంత గౌరవం, చాలు బాబు చాలు

నీ వినయ నయనాల చూపులకు, నేను లొంగి పోతాననుకుంటున్నావా ?

ముందు నీ సెల్ తీ ఎవ్వరో పిలుసున్నారు,  మీ ఆవిడ అయితే, నీకు ఇంకా కష్టం ముందు దానికి సమాధానము చెప్పు

నాన్న మా ఆవిడ ఫోన్  నీవిక్కడే ఉండు నేను అలా మాట్లాడి వస్తాను.

తండ్రి వద్ద కూడా ఫోన్ మాట్లాడలేని పరిస్థితి కల్పించిన భగవంతుని ప్రార్ధించటం తప్ప ఏమి చేయలేను.

నాన్నా

ఏమిటి కన్నా

మా ఆవిడా

అలా పెదాలు తిప్పకు, అసలు విషయం చెప్పు

మా ఆవిడ వచ్చి టిఫెన్ చేస్తుందట ఇంటికెల్దామ్ పదా నాన్న అన్నాడు

నీ శ్రీమతి రాలేదుకదా

ఒక్క అరగంట లో వస్తుంది నాన్న

ఒక్క అరగంట

అవునూ ఒక్క అరగంట

"మార్గం పదునైన కత్తి అంచులా నిశితమై, ఎన్నో అవరోధాలతో నిండి ఉంటుంది. అయినా నిస్పృహ చెందకుండా, లేవండి, మేల్కొండి గమ్యాన్ని చేరేవరకు విశ్రమించకండి అన్నారు స్వామి వివేకానంద నాన్న "

అవును కదా నాన్న

ఏమిటి అల్లా నావు కుంటున్నావు

నీ  నోటినుండి మంచి వాక్యం కూడా వింటున్నానే  అని ఆశ్చర్యంగా  ఉన్నది , అందుకే నాకు నవ్వు వచ్చింది

అవును కదా నాన్న నీ కొడుకే కదా

విత్తు వేసిన మెక్కే కదా చెట్టుగా మారేది

వేరే చెట్టు ఎలా ఎదుగు తుంది నాన్న

అవునురా నీ  బుద్దిని అర్ధం చేసుకోలేని మూర్ఖున్ని నేనే

పద పదా ఇంటికి పోదాం

లేక పొతే నీకు అక్షన్తులు పడతాయ్, దానికి నేను కారకుణ్ణి కాకూడదు

నాకు ఆకలి లేనే లేదురా పద పద ఇంటికిపొదాం
   


నమస్కారం రామకృష్ణ శర్మ గారు మిమ్మల్నిచూసి ఎన్ని రోజులయిందో
బాగున్నారా
బాగున్నాను, మిమ్మల్ని గుర్తు పట్టలేదు
నేనండీ గుంటూరులో ఆంజనేయస్వామి గుడి వద్ద ఉండేవారు, అప్పుడు మీరు లెక్కల పాఠాలు చెప్పేవారు
ఎప్పటి విషయం 40 సంవత్సరాల వెనకటి విషయం కదా అది
నేను మీ శిష్యుణ్ణి అప్పటి నుండి మిమ్మల్ని కలుద్దామను కుంటున్నా
ఇక్కడే మాయిల్లు
ఒక్క సారి మాఇంటికి రండి మమ్మల్ని దీవించండి
నేను మా అబ్బాయి ఇంటికి వచ్చాను.
నేను మీ అబ్బాయిని అడుగుతాను, మీకు అభ్యంతరం లేదుకదా
నాకేం అభ్యంతరం లేదు,
బాబు నీవు కూడా రా ఒక్కసారి మా ఇంటిదాకా రండి, కాఫీ టిఫిన్
తీసుకోవచ్చు 
వద్దులెండి నాకు పని ఉంది తొందరగా పోవాలి
నాన్న గారు మీ శిష్యుడు అంతగా అడుగుతున్నాడుగా వెలతారా నాతో  వస్తారా
బాబు మీ ఆవిడ నుంచి ఎదో ఫోన్ వచ్చింది కదా
నేను మా శిష్యుని దగ్గరకు పోయి వస్తాను
నాన్న ఇల్లు గుర్తుందా మీకు
మీ ఇల్లు అడ్రస్సు చెప్పండి నాకు, నేనే దించుతాను గురువు గారిని           
సరే మీ ఫోన్ నెంబరు చేయాండి ఇది నా ఫోన్ నెంబర్ అంటూ చెప్పఁటం జరిగింది
అడ్రస్ తీసుకోవటం, కొడుకు వెళ్ళటం, గురువుగారు శిష్యుని ఇంటికి చేరటం క్షణాల్లో జరిగి పోయింది
ఇల్లు బాగా కట్టుకున్నావు ఎం చేస్తున్నావు, ఎపి మోడల్ స్కూల్ ల్లో టీచర్ గా పనిచేస్తున్నాను.
ఏ సబ్జెక్టు చెపుతున్నావు
 లెక్కలు -
చాలా సంతోషం
గురువుగారు అడిగినానని అనుకోవద్దు మీరు ఏంచేస్తున్నారు
నేను కొన్నాళ్ళు లెక్కల టీచర్ గాను, అనేక సంస్థలలో పనిచేయటం జరిగింది.
ప్రస్తుతం కాలక్షేపం కోసం తెలుగు సాహిత్యాన్ని వృద్ధి పరుచుటకు కృషి చేస్తున్నాను
మంచిది గురువుగారు నేను కూడా మీకు సహకరిస్తాను మన మాతృభాష వృద్ధికి నేను సహకరిస్తాను.
అల్పాహార విందు అద్భుతముగా ఉన్నది. మీ శ్రీమతి ని వత్తిడి చేయలేదు కదా
మేము రోజు చేసుకొనేవే మేము పెట్టాము అంతే
మీ సంతోషాన్ని చూస్తే మీకు నాలుగు మంచి వాక్యాలు చెప్పాలని ఉంది చెప్పమంటే చెప్పఁగలను,           
ఆకలిగా ఉన్న వానికి అల్పాహారం పెట్టిన పార్వతి పరమేశ్వరుల్లా  కనిపిస్తున్నారు, నేను మీ కన్నా పెద్ద వాన్ని కదా, దీవెనలు అందించ గలను, అంత కన్నా ఏమి ఇవ్వలేను, అన్యదా భావించ వద్దు.
అయ్యో ఏమిటండి ఆ మాటలు
ఏమిటి బాబు అవి
ఏమిలేదు, మీకు టీచరమ్మగారికి "రాములువారికి చేసిన హనుమంతుని  భక్తిగా " ఎదో నా శక్తి కొద్ధి వస్త్రాలు సమర్పించు కుంటున్నామండీ  అంతే
అవన్నీ ఇప్పుడెందుకు బాబు
అట్లాగణకండి ఇది మాతృప్తి
అలా కూర్చోమ్మ ఎంత సేపు నుంచొని ఉంటావ్
నీవుకూడా కూర్చో మీ మాటలను కాదన లేక పోతున్నాను
అక్షంతలు ఇవ్వండి ఆశీర్వదిస్తాను   
ఆ పరమేశ్వరుని నమ్ముకొని సుఖ శాంతులతో జీవించండి. అన్నారు గురువుగారు
గురువుగారు మీ సందేశం వినాలని ఉంది.
అలాగే             
సావధానంగా వినండి ....

 దీపం ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూరం. పరమాత్ముడు అందరిపై ఒకే విధముగా ప్రవర్తిస్తాడు. అదేవిధముగా మనము కూడా అందరిపై ప్రేమా ను రాగాలను పంచాలి. స్వార్ధం అనేది మనసులోకి రాకుండా జాగర్త పడాలి. మనలో దానవత్వం పోవాలంటే అసురగుణాలను తరిమి మనస్సును పరిసుద్ధముగా మార్చుకొని, బుద్ది వికసించుకొని, వివేకముతో ఉదయించాలి, అనగా మనలో ఉన్న చీకటిని తరిమి జ్ఞానవేలుగును అందరికి పంచాలి.

           దీప ఎవరు వెలిగించినా వెలుగు తుంది దానికి అస్పృశ్యభావన లేదు, వర్ణ వివక్షత లేదు, ఆడ, మొగ, అనే భేదము లేకుండా ఎవరు వెలిగించిన వెలిగేది దీపం. అలాగా మనం జాతి, మత, కులాల అతీతంగా ఎదిగేలా హృదయంలో ఉన్న దీప వెలుగును, అధికారంలో ఉండి అలమటిస్తున్న జీవులకు చేయతనిచ్చి వెలుగు నింపాలి.

           దీపం ఏ నూనె వేసినా వెలుగు తుంది అలాగే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్న, ఎలాంటి వారితో ఉన్న, మనకర్తవ్యం ఏమిటి అని అలోచించి మన పని చేసుకొంటూ పనిలో ఉన్న వెలుగును చీకటి కమ్మకుండా (అనగా చీకటి తెచ్చే దుష్ట ఆలోచనల పరిబ్రమలు తొలగించుకోవాలి)  పనిలో ఇతరులకు సహాయము చేసి వాళ్ళ కల్లో వెలుగును చూడాలి అదే  నిజమైన దీపం అని గ్రహించాలి.

           దీపం పెద్ద మెడలోని, చిన్న గుడిసెలోను ఒకే విధముగా వెలుగుతుంది. అలాగే మనకు సిరిసంపదలు ఉన్న లేకపోయినా,     
అధికులపట్ల, అధములపట్ల ఒకేవిధముగా కష్టాలలోను సుఖాలలోను వెలుగును నింపాలి. సూర్య భగవానుడు తూర్పును ఉడాయించి పడమర అష్టమికిన్చేవార్కు తన వెలుగును పంచుతూ సర్వజీవుల ఎలా ఉపయోగ పడుతున్నారో అలాగే ప్రతిఒక్కరు ఉపయోగ పడాలి అప్పడే దేశం వెలిగి పోతుంది అంతా శుభ సూచనలే మన వెంట ఉంటాయి.
 
              అందుకే అన్నారు కంటికి వెలుగు, ఇంటికి దీపం ఇల్లాలిని అన్నారు. ఏది లేకపోయినా ఆయిల్లు చికటితో సమానమని అన్నారు.
అనడు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకాసుని వధించాడు. అలానే ఏపని చేసిన శ్రీమతికి తెల్పి శ్రీమతి చెప్పే సలహా మంచో చెడో ఒక్కసారి ఆలోచించి ( అనగా ఆ ఆలోచనే వెలుగు) చేస్తే అదే కుటుంబానికి వెలుగు.                   
పుడమి తల్లికి ఉన్న ఓర్పు ప్రతి స్త్రీ కి ఉంటుంది కనుక సలహాను అనుకరించటం తప్పు కాదు అదే ఒప్పే అని భావించాలి. జ్ఞమనే పురుషుడు, వివేకమనే స్త్రీ తో కలసి మనలో ఉన్న అసురగుణాలను తొలగించుకొని నిత్యకల్యాణం పచ్చతోరణంగా వెలుగుతూ ఉండటమే జీవితం.

             దృష్టి (వెలుగు) దోషముకూడా ఉంటుంది, కనుక మన మనస్సు ఒకరి వృద్ధినిచూసి మరొకరు అసూయపడకుండా, మనస్పర్ధలు లేకుండా సమెక్యత భావము తో పనిచేస్తూ, అంతటా ఆనంద జ్యోతులను వెదజల్లి   ప్రతిఒక్కరు జీవితాన్ని సాగించాలి.   అదే అందరిలో వెలిగే నిత్య దీపావళి         

          చివరిగా ఒక్క మాట తెలుపుతున్నాను మన మనస్సు ఒక బూతద్ధం (ఆశలు అనే) దూళికమ్మి ఉంటుంది. దాన్ని తొలగించు కోవాలను కుంటే  అరిషడ్వర్గ రూపంలో మన మనో అంటుకున్న మాలిన్యాన్ని తొలగించు కుంటే నిత్యవసంతం, అండ పిండ బ్రహ్మాణ్డె లోకాలను దర్శించే వెలుగు శక్తి మన వెంటే ఉంటుంది అదే మన: శాంతి.   

          సూర్యుని వెలుగు చీకటిని పారద్రోలినట్లు దారిద్రమనే చీకటిని పారద్రోలి శ్రేయస్సును కలిగించే లక్ష్మి కళ నిజమైన దీపం. మానవజన్మ (స్మృతి, మతి, బుధ్ధి, ప్రజ్ఞ ) అనగా గతం గత: జరిగి పోయిన కాలాన్ని పదే పదే ఆలోచించటం అనవసరం అదే భూతకాల "స్మృతి", ప్రకృతిని బట్టి, కాలాన్ని బాట్టి బుద్దిని ఉపయోగించటమే వర్తమానకాలం "బుద్ధి",  జరగ బొయ్యేది ఎవ్వరూ ఊహించలేరు భవిషత్ కాలం గురించి ఆలోచనే "మతి " సమయాన్ని వ్యర్ధ పరచ కుండా జీవించే వ్యక్తికీ భవిషత్ కాలం గురించి ఆలోచనే రాదు. మానవ మేధస్సే "ప్రజ్ఞ " ఇదే ప్రతిఒక్కరిలో వెలిగే దీపం.      

అని రామకృష్ణ శర్మ గారు తనకు ఆతిథ్యం ఇచ్చిన దంపతులకు అమూల్య సందేశము అందచేశారు

     





Monday 29 October 2018


సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు!
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ 
ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే కానీ... 
తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు. 
ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం 
తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే!
దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో 
మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ 
లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ 
భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా 
భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం 
రాకూడదన్న వరాన్ని పొందారు.
వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఏకంగా స్వర్గం 
మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు 
శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు. కానీ ఆ 
ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ
సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది.
శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని 
గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన 
కార్తికేయుని, ఆరుగురు అక్కచెల్లెళ్లు (కృత్తికలు) పెంచారు. కొన్నాళ్లకి కార్తికేయుడు తన 
తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న 
కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు.
ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి 
కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద 
కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి 
సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం 
చేశారు.
కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం 
శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం 
ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు 
యుద్ధానికి బయల్దేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే 
మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది.
శూరపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే
ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు 
కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట.
దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి. 
నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు 
కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది
స్వస్తి! (శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో)

Sunday 28 October 2018

ఆరాధ్య లీల



ఆరాధ్య లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

సుధలు పొంగేటి యధరాలు పిలుస్తున్నాయి 
నిదుర పోయేటి నెలవంక కలువమన్నాది       
ఎదురు చూసేటి నయనాలు పిలుస్తున్నాయి 
బదులు రానట్టి మరు మాయ కలువమన్నాది 

మదిని రేపేటి కధనాలు పిలుస్తున్నాయి 
కదలి రావాలి మను బేల కలువమన్నది    
ఎదను పర్చాను మునగంగ పిలుస్తున్నాయి 
బెదురు పోవద్దు మనసంత కలువమన్నది        

మనసు రమ్మంది రణరంగ పిలుస్తున్నాయి    
వయసు పిల్చింది తనువంత కలువమన్నది  
మమత చూపంగ మమకార పిలుస్తున్నాయి  
సోగసు రాగాలు పిలవంగ కలవమన్నది  

రసకేళి ఆడుట - మాధుర్యం పంచుట 
సంతసము పొందుట - సహచరించుట  
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

--((**))--




ఆరాధ్య ప్రేమ లీల (మనోరమ)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఉషోదయ కిరణాలు భాసించె సుందర సుమాలెన్నో   
ఉహాపర విజయాలు సాధించె వందన కళ  లెన్నో    
ఉపాసన రుతురాగ హేమంత  పుష్పము హొయలెన్నో  
ఉమాపతి మురిపాల సౌగంధ పార్వతి ప్రేమలెన్నో 

సుముద్దుల సరి చేసె చామంతి పుష్పము రంగులెన్నో 
సుపొద్దుల  కనులారా సేవించు కల్పపు శోభలెన్నో          
సుహద్దుల ప్రతి గుండె ప్రేమించు ధన్యపు భోధలెన్నో 
సుపద్దుల  ఉదయానె ధర్మంగ  వ్రాయుట రోజులెన్నో 

సుహాసిని సుమమాయె ఆశించె సౌక్యపు సేవలెన్నో     
విలాసిని అనురాగ ఆనంద భాష్పపు  ప్రేమలెన్నో 
వినోదిని  వినురాగ వేదాంత వాద్యపు  త్రోవలెన్నో 
మనోరమ మనువాద మాధుర్య మాంద్యపు మాత్రలెన్నో 


--((**))--  




ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  



Street Art
ఆరాధ్య లీల (కాలచేక్రం) 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

1. పనికి రాని వారు ఉండరు 
    పనిచేయించుకొనే వారు ఉండరు
    గడియారంలా కదులుతుంటారు
    గడియారంలా రెండుసార్లు కలుసుకుంటారు 

పెద్దముళ్లు, చిన్న ముల్లు లా 
పుణ్య, పాపములులా 
స్త్రీ పురుషులు ఏకమయ్యేవిధానములా 
కాలచక్రం గమనించా లంటారు 

2 పేదరికంలో సలహాలిస్తుంటారు 
    సంపాదనలో ఆశపెడుతుంటారు 
.   సంపాదించాక దొచు కుంటారు  
    మన:శాంతి లేకుండా చేస్తారు 

స్నేహితులు శత్రువు లయ్యేలా 
శత్రువులు స్నేహితు లయ్యేలా 
ఆరోగ్య సంరక్షణ కరు వయ్యేలా   
ధనం చుట్టూ తిరిగే వారుంటారు 

3. నవ్వి నవ్విస్తూ ఉండ మన్నారు 
    నవ్వులో అపార్ధాలు తొలుగు తాయంటారు 
    నవ్వుతో ఆరోగ్యమే మార్పంటారు
    నవ్వుతు బతికి నవ్వుతూ చావాలంటారు 
     
మకరందాన్ని పొందేందుకు నవ్వాలా
శత్రువు పోయాడని నవ్వాలా 
భార్య కోరికతో ఏడుస్తూ నవ్వాలా 
నవ్వేవారిని చూసి మోస పోవద్దంటారు 

4 .దొరికేది దోచుకో మంటారు  
    దోరకంది దాచుకోమంటారు 
    దొరికేది ఎక్కువకాలం ఉండదంటారు 
    ఎక్కువకాలం ఉండేది దొరకదంటారు

దొరికిన దానితో సంతృపి చెందాలా
పొందిన దానిలో సంతృపి వెతకాలా
శాశ్వితమనేది లేదని తెలుసుకోవాలా
ఉన్నదానితో తృపి చెందితే గొప్పంటారు 

5. జరిగే వణ్ణి మనమంచికే అంటారు 
    జరగని వణ్ణి మనవి కావంటారు        
    మంచి చెడు, చూడాలంటారు     
    ప్రేమ, స్నేహం తెల్సుకో మంటారు 

మానవత్వాన్ని మరచినవి చూడాలా 
మానవత్త్వమే లేదని పోరాడాలా 
మనసుని మార్చుకొని బ్రతకాలా  
ప్రతిదీ తేలిక భావం ఉంటే మంచి అంటారు 

6. రోగాలు కుందేలులా వస్తాయంటారు 
    రోగాలు తాబేలులా పోతాయంటారు 
    ధనం తాబేలులా  వస్తా యంటారు    
    కుందేలులా పోతా యంటారు 

వెంటనే వచ్చే రోగం తాగించాలా 
నిదానంగా పోయేరోగాన్ని తొలగించాలా 
వచ్చిన ధనం వేగంగా పోతుందని తెలుసు కోవాలా 
ధనమే రోగమని తెలుసు కొంటె మేలంటారు 

7. చిన్న మాటలో మర్మం తెల్సుకోమంటారు 
    మాటల ఆనందాన్ని పంచు కోమంటారు 
    పెద్ద మాటాలు వద్దన్నా వస్తాయంటారు 
     మాటలను తూటాలుగా వాడే వారుంటారు

చిన్న పిల్లల మాటలు అనుకరించాలా 
చిన్న మాటలని ఉపేక్షించాలా
మాటల పట్టింపు లేకుండా ఉండాలా       
మాట మాట పెరిగితే జీవితమే లేదంటారు 

8. సుఖాలలో దేవుడ్ని గమనించరు 
    కష్టాలలో దేవుడేమి చేయలేదంటారు 
    కష్టసుఖాలు కావడి కుండలంటారు  
    కోరికలను తీర్చేది దేవుడని తెలుసుకోలేరు 

హమేషా దేవుణ్ణి ప్రార్ధిస్తూ ఉండాలా
దేవుడే సర్వం ఇస్తాడని ఉండాలా 
శ్రమకు తగ్గ ఫలితమని తెల్సుకొని ఉండాలా 
దేవుడిపై నమ్మకమే బ్రతుకంటారు   

--((**))--