Wednesday 24 April 2019

01-03-2023

-01 -03 -2023 నాటి రచనలు    

సమస్యను పరిష్కరించడం

ఉదయ రాగ గీతం 

గజిల్... దైవమా

నేటి కధ . (కలసిన హృదయాలు)


1 . ప్రాంజలి ప్రభ... సమస్యను పరిష్కరించడం..... 01 -౦౩-2023

కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్ 

...

ఉ:: జీరయు కాదులే మగువ జేష్టలు మగ్గుత మారమేమియున్

నేరము ఏలనో ఇపుడు. నీడల పంచన సేవచేయుటన్

సారము నాది నీదియగు సాధణ శోధన చెందుటే అహం

కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్ 

.....

ప్రాంజలి ... ఉదయ రాగ గీతం 01/03/2023.

*****

పాట సందర్భంపై నా విశ్లేషణ.

********* 

పార్వతీ పర మేశ్వర శృంగార ఆటవెలది సరస సల్లాప గీతమ్ ...!

 పల్లవి:-

****

పా:: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ

       నాదు చిలిపి ఊహ నాట్య మాడె 

       కోర మీస మేను కోరియు తిప్పంగ 

       నాదు వలపు వీణ నాట్య మాడె   

ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....  

ప:: దోర వన్నె చేయి దోభూచు ఆడంగ  

       నా తణువు అగ్గి నటన అయ్యె   

       బుగ్గ గిల్ల చుంటె బురబుర పొంగేను 

       సిగ్గు చీర విడిచి చిందు లయ్యె 

ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....  

ప. పా ::  ఓర చూపు నిన్ను ఓర్పుగా  చూడంగ

      నాదు చిలిపి ఊహ నాట్య మాడె

      దోర వన్నె చేయి దోభూచు ఆడంగ  

      నా తణువు అగ్గి నటన అయ్యె   

చరణం:-

***

పా:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....  

పా ::  మనసు దోచు చున్న మగ మహారాజువి 

        సామ జవర గమన సాహ సంబు 

        కొంత నాకు పంచు కోరిక తీర్చుమా 

        అంత నీవు దోచు ఆశ గాను

ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....  

ప. ::  ఇదియు సంతసమ్ము  ఇన్నాళ్ళు నాలోన

       అంద మంత నీది ఆత్ర మేను 

       కొత్త దనము తెచ్చు కోరు వసంతము 

       అందు కొమ్ము నన్ను ఆత్ర మేను 

పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....  

ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....  

పల్లవి:-

****

ప. పా ::  ఓర చూపు నిన్ను ఓర్పుగా  చూడంగ

      నాదు చిలిపి ఊహ నాట్య మాడె

      దోర వన్నె చేయి దోభూచు ఆడంగ  

      నా తణువు అగ్గి నటన అయ్యె   

చరణం:-

****

పా:: ఎన్ని లక్షణాలు ఏలనమ్మాళిలే 

       నీదు వేష మాయ నిజము యేన   

       ఇన్ని నాళ్ళు నమ్మె ఇష్ట మాయా మగడా 

       నీదు ఆశ తీర్చ నిజము గాను  

పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... 

ప::  గాలి లోని పలుకు గాళమై పట్టెనే   

       గంధ పరిమళాలు గాయ మేను 

      వెన్నె కళల మోము వేగమై పిలిచెను 

      నీదు చుంభ నముయె నాదు జపము 

పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... 

పా::  ప్రాణ మేను నీది ప్రాయము దోచుకో  

        కమ్ము కొమ్ము నన్ను కాల మిదియు 

        ఈక్షణమ్ము నేను ఇష్టమ్ము చేసెద 

        సత్య పలుకు నాది సమయ మిదియు  

పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా ....

పల్లవి:-

***

పా. ప:: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ

       నాదు చిలిపి ఊహ నాట్య మాడె 

       కోర మీస మేను కోరియు తిప్పంగ 

       నాదు వలపు వీణ నాట్య మాడె   

**********

గజిల్... దైవమా 01=03=2024


నిన్ను నేను ప్రార్థించే ఒకందుకే దైవమా

నాలోనిది, లోభిత్వo, అనుమానం దైవమా


సంకుచితత్వాన్ని సమూలంగానే చేధించు

కష్టసుఖాలను తేలికగ పొందాలి దైవమా


 భరించే శక్తిని తేలికగ నాకు ప్రసాదించు.

 ప్రేమను నీ సేవలొ ఫలప్రదం చేయు దైవమా


 పేదవారిని తిరస్కరించకుండా ఆదరించు

అధికార గర్వం లేని ప్రేమపెంచు దైవమా


నా హృదయాన్ని అహరహాలు జపం చేయ కరుణించు

ఇంతకన్న నాకు వేరే ఏమీ వద్దు దైవమా 


తలవంచకుండా వుండే బలాన్ని  అనుగ్రహించు.

కష్టాలను ఓదార్చు గుణము నాకివ్వు దైవమా 


ప్రేమతో నా సర్వస్వాన్నీ, నీకే అర్పితం దైవమా 

నీ ఇచ్ఛకు సమర్పించు శక్తినివ్వు దైవమా 

.......

ప్రాంజలి

01-03-2023 నేటి కధ . (కలసిన హృదయాలు)

నాన్న నాకప్పుడే పెళ్ళికి తొందరెందుకు, నాకు మంచి ఉద్యోగము రాలేదు, ఈ ట్యూషన్సు వల్ల పెళ్లి చేసుకుంటే కష్టం కదా.

అట్లా నేను అనుకుంటే నాకు అసలు పెళ్లి అయ్యేదే కాదు, ఎందుకంటే నా పెళ్లప్పుడు మునిసి పాలిటీ అత్తర్, చెత్త వ్యాన్ డ్రైవర్  పనిచేసే వాడ్ని, అందరూ  పెళైన కొత్తలో చెత్త బాబాయి అనేవాళ్ళు, వాళ్ళు అలా అన్నారని మీ అమ్మను ఎప్పుడూ భాద పెట్ట లేదు.

నీవేమి భయపడకు ఆ దేవుడు వ్రాసి నట్లే జరుగుతుంది అంతా మనకోసం జరిగిందను కోవాలి ఎంత చెట్టుకు  అంతే గాలి అయిన మానవ ప్రయత్నం చేయాలి కదా, నీవేమి ఆశలకు పోవటం లేదు కదా, కంతకు తగ్గ బొంత కోసం వెతు కుంటున్నావు, ఏమో నాన్న నీవు చెప్పావు కాబట్టి అమ్మాయిని చూసి వస్తా, నాకు నచ్చక పోతే నచ్చ లేదని చెపుతా అంతకు ఇష్ట మైతేనే పిల్లని చూస్తా, సరే నీతోపాటు పక్క ఇంటి గోపాలం గారిని తీసుకొనివెళ్ళు అన్నాడు.

ఆలా పిల్లను చూడటం నచ్చలేదని  నాన్నకు చెప్పఁటం జరిగింది.

ఎందుకు నచ్చలేదో చెప్పాలి, అమ్మాయి వాళ్లు నీచేత కంప్యూటర్, జిరాక్స్ మిషన్ కొని ఇంటర్ నెట్ సెంటర్ పెడుతారుట, స్వతంత్రంగా బ్రతక వచ్చు ఇలా ట్యూషన్సు చెప్పే బదులు ఒక్కసారి ఆలోచించు, అది అంత  తెలికకదా, నిన్ను వదలి వెళ్ళి బతకాలనిలేదు.

అది కాదు నాన్న" పిల్ల ", నాకునచ్చలా పిల్ల కళ్ళు గాజుకళ్ళు, పగలు చూడాలంటే నాకు భయ మేసింది, ఇక రాత్రి విషయం తలుచు కుంటే ఇంకా భయమేస్తుంది.

     సరేరా  మన గోపాలం గారి చుట్టా లెవరో ఉన్నారట చూసి వస్తావా.

నాన్న నేను మాత్రం ముందు చూడను, నీవు చూసి నచ్చింది, చూడరా అంటే చూస్తాను అంతే చివరికి మానాన్న గారు చూసిన సంభంధము కుదిరింది.   

పెళ్లి రంగ రంగ వైభవముగా జరిగింది, పార్వతి పరమేశ్వరులు అని దీవించారు, నాకు గవర్నమెంటు ఉద్యోగమూ వచ్చింది, నాన్న గారిని వదలి వేరొక ఊరులో ఉద్యోగ నిమిత్తము కాపురం పెట్ట వలసి వచ్చినది. (నాన్న గారు గుడిలో పూజారిగా ఉంటాను, ఈ వయసులో మీ మధ్య నేనెందుకు అని మమ్ము భాగ్య నగరానికి  పంపించారు.

ఇంతకీ నాపేరు చెప్పలేదు కదా, నాపేరు మాధవ్  భార్యపేరు రాధ

ఇక సంసారంలో సరిగమలు వినండి

నన్ను పొద్దున్నే రాధ నిద్ర లేపుతుంది వాకింగ్ పొమ్మంటుంది, తనేమో పాలు ఆలస్యముగా వస్తే వాడితో    గొడవ పెట్టు కుంటుంది, పని అమ్మాయి ముందు వస్తే నా నిద్ర చెడ గొట్టావ్ అని ఎగిరి పడు తుంది, నేను   తిరిగి వచ్చాక కూడా రుస రుస లాడుతూ ఉంటుంది,   పే పరు బాయ్ ఇంటిలోకి విసిరేశాడని వానితో గొడవ పెట్టు కుంటుంది, నేను ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళతో తగాదా పడ కూడ దన్నా విని పించుకోదు, నన్నే ఉరిమి  ఉరిమి  చూస్తుంది, అప్పుడను కూనే వాణ్ని ఇలాంటి వాళ్ళను కాలమే బాగు చేయాలి,   నోటితో న్యాయం చెప్పఁటం కన్నా మౌనం గా ఉండుట మేలు అని తలచి కాపురము చేస్తున్నాను. టివి అదే పనిగా చూస్తుంది, సీరియల్సస్ లో లీనమై పోతుంది, వంటకాలు చూసి రోజు కొక  వంటకం తయారు చేస్తుంది .

ఏదన్నా అంటే ఈ వయసులో కాక ఏ వయసులో సుఖపడతాం అంటుంది, పిల్లలు మాత్రం ఇపుడే వద్దంటుంది, మీ సంపాదన పిల్లలు ఉంటే సరి పోదంటుంది. ఎవరు ఏమి చెప్పిన ఇట్టే నమ్మేస్తుంది, ఆఫీసులో ఆలస్య మైనదనుకో ఆరోజు నాకు పస్తే నోరు చేసుకొని కాపురం చేస్తుంది.

ఒక రోజు నాన్నగారు మా ఇంటికి వచ్చారు, ఎరా ఆలా ఉన్నావు, కోడల పిల్ల లేవ లేదా, వంట్లో      నలతగా ఉన్నది. అందుకని నేనే గ్రైండర్ లో పప్పు రుబ్బి దోశలు వేయుటకు నేను రడీగా ఉన్నా నాన్న, నీవు కాళ్ళు చేతులు కడుక్కొని రా, నీకు దోశలు పెడతాను, నాకు తొందర లేదురా, ఇప్పుడే రైల్లో దిగి ప్రక్కనే ఉన్న హోటల్లో టిఫిన్  తిని వచ్చానురా, నీవు ఆఫీసుకు పోతావేమోనని తొందరగా వచ్చాను, నీవు అమ్మాయి తినండి,  నీ పరిస్థితి చూస్తుంటే నాకు దిగులుగా ఉందిరా, నాన్న నేను ఆఫీసుకు పోయి  వచ్చాక అన్నీ మాట్లాడు కుందాం, నేను  కూడా నా స్నేహితుని కొడుకు మ్యారేజ్ చూసి వస్తాను . అమ్మాయికి ఒకేమారు చెప్పి పోతాను పిలుస్తావా.

రాధా అని పిలిచాడు.

         మావయ్యగారు ఎప్పుడు వచ్చారు, ఏమిటి  చెప్పకుండా వచ్చారు, సరేలేండి భోజనం చేసి మరి వెళ్ళండి.

ఏమిటే ఆ  మాటలు నాన్నతో

నేనేం తప్పు మాట్లాడ లేదు ఉన్న నిజం చెప్పా అంతేకదా

బాబు మీ సంసారం చూసాక మీకు కొన్ని విషయాలు చెప్పి వెళతాను అన్నాడు అట్లాగే నాన్న.   

ఏమిటండి, మీనాన్న నాకు చెప్పేది అన్నది

 మా నాన్నగారు వెళ్ళేదాకా అన్న నీ నోరు కంట్రోల్లో  పెట్టుకో, లేదా నేను చేయి చేసు కోవాల్సి ఉంటుంది,

ఏమిటి మీ చేయి లేస్తుంది, మీ నాన్న కోసం మీరు చెప్పినట్లుగా బుద్ధిమంతురాలుగా ఉంటాను నోరు ఎత్తను అన్నది.

చూడు బాబు మారాలి మారాలి భార్య అని ఆమె చెప్పిన వన్నీ కోపంతోగాని ప్రేమతో గాని చేయటం తప్పు కాదు,    కాని నేను ఉద్యోగం చేస్తున్నాను అని అహంకారము భార్య ముందు ప్రదర్శించ కూడదు, భార్య భర్తలలో ఎవరికి   ఎవరు ఎక్కువకాదు .. తక్కువ కాదు ... సమానమే

మనస్పర్థలు రాకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రతి విషయము  సాల్వు చేసు కోవాలి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆయన ఒకరి కొకరు ప్రేమను పంచుకొని సంసారాన్ని స్వర్గమయం చేసుకోండి, ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం నాముందు కీచులాటలు మాత్రం ప్రవర్తించ కండి.

మీ సంతోషానికి నేను అడ్డురాను, మీరు ఏ తిండి పెడితే అదే తింటాను, నాకు   పెన్షన్ వస్తుంది అది కూడా మీకే నేను ఇక్కడ ఉన్నంత కాలము మీకే ఇస్తాను.

మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నాకు మనవుడో  మనవరాలో ఇవ్వండి వాళ్ళతో ఆడు కుంటూ ఇక్కడే ఉంటా .

అప్పుడే మావయ్యగారు నన్ను  క్షమించండి  తప్పుగా మాట్లాడితే మన్నించండి, మీరు ఇష్టమున్న రోజులు ఇక్కడ ఉండవచ్చు

నాన్న మీరు ఎక్కడికీ పోనక్కరల్లేదు ఇక్కడే ఉండండి.

మీరు కీచులాట లాడితే మాత్రము ఇక్కడ ఉండలేను ముందే చెపుతున్నాను.       

చీకటి పడింది, మావయ్యగారు పడుకొనే  గది చూపించి, మంచి నీళ్లు పెట్టి ఏ అవసరము వచ్చిన మీ అబ్బాయి నా సెల్లు నెంబర్లు ఇవి ఫోన్ చేయండి అనిచెప్పి పడక గది చేరి భర్తతో ఇంటి పనులు అన్నీ నే చూసు కుంటా, ఆఫీసు పనులు మీరు చూసుకోండి

అబ్బా ఈ రోజు పండు వెన్నలుగా ఉన్నది మంచం పై ఒకరికొకరు తన్మయత్వంలో మునిగి తేలారు, ఏవండీ నేను కూడా ఉద్యోగం చేయనా, మీ నాన్నగారు కూడా ఉన్నారుగా, ఇప్పుడు మనకు డబ్బుని గూర్చి ఆలోచించ వద్దు పిల్లలగురించి ఆలోచిద్దాం, అవునండి మనకు పిల్లలు కావాలి, మీ నాన్నగారు కూడా ఉండాలి,   (శంకరం మనసులో   అను కున్నాడు  ఇంట్లో పెద్దలు ఉంటె ఆ యిల్లు సుఖశాంతితో ఉంటుంది)   అంటూ    వారిరువురి హృదయాలు ఆనందంతో నిండినాయి.   

రచయిత మల్లాప్రగడ రామకృష్ణ ,  

  --((*))--


Tuesday 23 April 2019



24 - 4 - 2 ౦ 1 9 ప్రపంచం గతిని మార్చింది -పుస్తకం. మానవాళికి ఆలోచించడం నేర్పింది – అక్షరం. పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనా వేయడం ఆకాశాన్ని కొలవడం వంటిదే. పుస్తకాలు లేని ప్రపంచాన్ని ఊహించాలంటేనే పరమ చేదుగా ఉంటుంది. అందుకే పుస్తకాన్ని ప్రపంచ ప్రజలంతా ఒకే క్షణంలో ఆరాధించే ఒక కార్యక్రమాన్ని యునెస్కో రూపొందించింది. అదే ప్రపంచ పుస్తక, కాపీరైట్‌ దినోత్సవం.


ఓం నమః శివాయ ..
శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. 
శివుడు అభిషేక ప్రియుడు. 

హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. 
ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.

అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం.

ధారాభిషేకం:
కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’.
ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం.

ఆవృత్త్భాషేకం:
జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి. ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు.

రుద్రాభిషేకం:
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు ‘తేజోలింగం’. 
తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు.

శతరుద్రాభిషేకం:
చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ‘ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి. శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు.

ఏకాదశ రుద్రాభిషేకం:
శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు ‘వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం. ఏకాదశ రుద్రాదాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది.

లఘురుద్రాభిషేకం:
ఒరిస్సాలోని కోణార్క్‌లోని శివలింగం ‘సూర్యలింగం’. సూర్యరూపధారియైన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి. లఘురుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని 
శాస్త్ర వచనం. 

మహారుద్రాభిషేకం:
భటగావ్‌లోని శివలింగం చంద్రనాధ లింగం. ‘చంద్రలింగం’. చంద్రరూపధారియైన శివునకు మహా రుద్రాభిషేకం ఇష్టం. మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి .

అతిరుద్రాభిషేకం:
ఖట్మండువద్ద త్రినాధ క్షేత్రంలోని పశుపతి లింగం ‘యజలింగం’ 
సర్వరూపధారియైన శివునకు అతి రుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది. 
అతిరుద్రాభిషేకంవల్ల అఖండ పుణ్యం, ముక్తి చేకూరుతుంది.

శివలింగానికి ఆవుపాలతో సంతాన ప్రాప్తి , బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు 
ఆరోగ్య అభివృద్ధి. స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు,కొబ్బరినీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం, నేయి లాంటివాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం.

శివాభిషేకంలో..మహన్యాసం, లఘున్యాసం, నమకం,చమకం, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త మంత్రాలు, దశ శాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా, ఏకాదశ రుద్రాభిషేకమైనా విధిగా చెప్పాలి.

శివపూజకు బిల్వపత్రాలు వినియోగించాలి. మారేడు చెట్టునే బిల్వవృక్షమని, 
శ్రీ వృక్షమని అంటారు. కాని ఎండిపోయిన బిల్వపత్రిని కూడా శివుడు ఆనందంగా స్వీకరిస్తాడు. 

ఈ బిల్వపత్రాలతో శివపూజ చేసిన వారికి మరుజన్మ ఉండదు. 
ఒక్క మారేడు దళం లక్ష బంగారు పువ్వులకు సమానమని శివపురాణంఅంటుంది. 

బిల్వ వృక్షాన్ని పెరట్లో పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది. 
వెయ్యిమందికి అన్నదాన ఫలం లభిస్తుంది. నిత్యం బిల్వపత్రితో శివుని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు. 

మారేడు చెట్టుకింద కూర్చుని ‘నమఃశివాయ’ పంచాక్షరీ మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యం అవుతుంది.ఆరోగ్యరీత్యా మారేడు చెట్టు వేరు, ఆకు రసము, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతి, జఠర దీప్తిని కలిగిస్తుంది. 
జ్వరము హరిస్తుంది. మూత్రరోగాలు నయం చేస్తుంది. గుండె దడ నివారిస్తుంది. 
విరేచన మందం పోగొడుతుంది. దోరగా పండిన మారేడు పండు గుజ్జు పంచదార కలిపి తీసుకుంటే గ్రహణి, రక్తగ్రహణికి ఎంతో మేలు చేస్తుంది. పండు రసం పుండ్లను మాన్పుతుంది. 

రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు,పశుపతి, ఈశానుడు, మహాదేవుడు, ఇలా శివునకు ఎన్నేన్నో నామాలున్నాయ. 
వీటిలో ఏది పిలిచినా శివుడు అభయం ఇచ్చి తీరుతాడు. 
అసలు శివా అనే రెండు అక్షరాలు పలికితే చాలు శివసాయుజ్జం లభించినట్లే. 
ఈశ్వరుడు పంచకృత్యపారాయణుడని వాయుపురాణం అంటుంది. 

సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనేవి 
ఈ పంచకృత్యాలు. భక్తసులుభుడైన శివుడిని అటు మానవులు 
ఇటు దానవులే కాదు శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడు.

శివలింగం మీద నీళ్లు చిలకరించి కొద్దిగా పత్రి భక్తితో పడవేసిన వారు కల్పవృక్షానికీ, కామధేనువుకూ అథిపతి అవుతారని శివభక్తులంటారు. 

ప్రదోషకాలంలో శివుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. ప్రదోష కాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో శివపూజ మహాఉత్కృష్టమైనదని శివపురాణం చెప్తోంది.

--((**))--


ప్రాంజలి ప్రభ నిత్య సత్యాలు  
 ప్రకృతి సత్యం


ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 
పశ్చాతాపులను క్షమించాలి. 
 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.
--((**))--


ప్రాంజలి ప్రభ నిత్య సత్యాలు  
 ప్రకృతి సత్యం

ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.

బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.
ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.

అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.
ఎందుకంటే
ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం. 

ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.
చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.

సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..

కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.

అందుకే కదా
భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.

యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.

మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పి మహాత్ములు అవ్వండి.
--((**))--


రాజకీయాలకు పెన్షన్ వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయబడింది.

ఈ విషయాన్ని సపోర్ట్ చేయండి మరియు షేర్ చేయండి 

ఇప్పుడు నాయకుల నాయకుడు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు, మీ అంచనా కోసం దీనిని పంపుతున్నారు ..

భారతదేశం యొక్క ప్రియమైన / గౌరవనీయమైన పౌరులు ... మీరు ఈ సందేశాన్ని చదవడానికి అభ్యర్థించబడ్డారు మరియు మీరు అంగీకరించినట్లయితే దయచేసి మీ సహకారం తో అందరు వ్యక్తులకు పంపండి మరియు వారందరు ప్రతి ఒక్కరికి  పంపమని అడుగుదాం.

మూడు రోజుల్లో, ఈ సందేశం మొత్తం భారతదేశంలో అందరికీ అందాలి. ప్రతి పౌరుడు భారతదేశంలో తన స్వరాన్ని వినిపించాలి. __

2018 అభివృద్ధి చట్టం

ఎంపీలు పింఛను పొందరాదు .ఎందుకంటే రాజకీయాలు అనేవి ఉద్యోగం లేదా ఉపాధి కాదు, కానీ ఉచిత సేవ. - మాత్రమే 
రాజకీయాలు అనేవి పబ్లిక్ రిప్రజెంటేషన్ చట్టం ప్రకారం ఎన్నికలు, దాని పునర్నిర్మాణంపై పదవీ విరమణ లేదు, కానీ వారు అదే పరిస్థితిలో తిరిగి ఎన్నిక అవుతారు. (ప్రస్తుతం 5 సంవత్సరాల సేవ తరువాత వారు పింఛను పొందుతున్నారు).

ఈ విషయంలో మరొక సమస్య ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక కౌన్సిలర్ గా ఎన్నిక అవుతాడు, తరువాత శాసన సభ్యుడుగా అవుతాడు మరియు శాసన సభ్యుడు అవుతాడు, అప్పుడు అతను ఒకటి కాదు, మూడు పెన్షన్లు పొందుతున్నాడు.

 వెంటనే ఈ ACT ని ఆపడానికి    దేశం లో ఉన్న పౌరులు పాల్గొనాలి. ఇది ఆపటానకి ప్రయత్నం చేయక పోతే అది ఒక గొప్ప ద్రోహం అవుతుంది....

సెంట్రల్ పే కమిషన్ తో, MP ల జీతం, భత్యం సవరించబడింది .... ఇది ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి ....

 ప్రస్తుతానికి, ఎంపీలు వారి వేతనాలు మరియు అనుమతులను తమకు ఓటు వేయడం ద్వారా పెంచుతారు, ఆ సమయంలో అన్ని పార్టీలు ఐక్యమయ్యాయి.

MP లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుండి తొలగించబడాలి .. ప్రస్తుతం వారి మరియు భారత ప్రజల ఆరోగ్యం వంటి ఆరోగ్య సంరక్షణ  చికిత్స విదేశాల్లో జరుగుతుంది ఇతర పౌరునికి లా శ్రద్ధ తీసుకోవాలి .. వారు విదేశాల్లో కాకుండా పూర్తి గా , తమ సొంత ఖర్చుతో జరిగేలా చట్టం రావాలి .

విద్యుత్తు, నీరు మరియు ఫోన్ బిల్లు వంటి అన్ని రాయితీలు అంతం కావాలి. (వారు అటువంటి అనేక రాయితీలను తొలగించి  వారు కూడా క్రమంగా తప్పకుండా కట్టేలా చూడాలి.)

క్రిమినల్స్ ఎన్నికలలో పోటీ చేయకూడదు అనుమానాస్పద వ్యక్తులను నిరోధించడం చేయాలి, శిక్షాత్మక రికార్డులు, నేరారోపణలు మరియు నిర్ణయం, గతంలో ఉంటే వారిని  ప్రస్తుత పార్లమెంటు నండి నిషేధించాలి.

కార్యాలయంలోని రాజకీయవేత్తల కారణంగా వారి వలన జరిగే ఆర్థిక నష్టాన్ని కూడా వారి నుండి తిరిగి పొందవచ్చు, వారి నామినీలు, ఆస్తులు - MP లు సాధారణ పౌరులకు వర్తించే అన్ని నిబంధనలు కూడా అనుసరించాలి.

పౌరులచే ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ ఎటువంటి డీడక్షన్ MPలు, MLAలు, ఇతర సబ్సిడీలు, పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ ఆహారాలతో సహా వెనక్కి తీసుకోవాలి.

పార్లమెంటులో పనిచేయడం ఒక గౌరవం, దోపిడీ కోసం ఒక లాభదాయక వృత్తి కాదు.

ఉచిత రైలు మరియు విమానం ప్రయాణం ఆపాలి.

సామాన్య మానవుడు వారి సరదాలను ఎందుకు భరించాలి?

ప్రతి వ్యక్తి కనీసం ఇరవై మందితో కమ్యూనికేట్ చేస్తే, భారతదేశంలో చాలా మంది ప్రజలు ఈ సందేశాన్ని పొందడానికి మూడు రోజులు మాత్రమే సమయం ఉంది .

ఈ సమస్యను తొలగించటానికి ఇది సరైన సమయం కాదా?

మీరు దీనిని అంగీకరిస్తే, ఈ మెసేజ్ ను forward చేయండి.

లేకపోతే, దీన్ని తొలగించండి.

మీరు నా 20+ మందిలో ఒకరు, దయచేసి దీన్ని కొనసాగించండి ...

ధన్యవాదాలు. జైహింద్ వందే మాతరం ... 🙏

--((**))--


అన్నీ ఉచితం ! అంతా ఉచితం !
✍🏻
45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి
45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను 
ఇంక జీవితంలో లేదు టెన్షన్,
.
ఆకలేస్తే అన్న క్యాంటిన్
రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు
నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,
చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !
.
అంతా బాగానే ఉన్నది !
భూతల స్వర్గం భారతదేశం !
.
అన్న క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?
రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?
ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?
.
వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా !
.
సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?
Is it worth living !
.
ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే "సంఘర్షణ"
ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే "సంఘర్షణ "
తన కలలు పండించుకోవడానికి  ఒక "కలామ్ " పడ్డది "సంఘర్షణ "
మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!
.
పథకం చూడటానికి గొప్పదే !
.
ఇప్పటికే ప్రతి రంగం పని చేసేవారు లేక కుదేలయిపోయింది !
.
వ్యవసాయానికి కూలీలేడు 
కొట్లోకి గుమాస్తా దొరకడు !
పనికి రమ్మంటే ఒక్కడూ రాడు !
.
మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి ! కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !
.
ఎవరికి ఉచితమివ్వాలి ?
పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు అభాగ్యులకు !
వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను రూపొందించండి ! 
.
అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !


పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది.

ఒక్కసారి ఆలోచించండి....

వాట్స్ అప్  లో నిది ప్రాంజలి ప్రభ కు పంపారు 

--((**))--


హార్ట్ ఎటాక్ అనే చింత,  టెన్షన్లను ఇప్పుడిక వదిలివేయండి. 
ఒక శుభవార్త 
ఈ క్రింది వీడియో జాగ్రత్తగా చూడండి 
ఒక క్రొత్త టెక్నిక్ తో కేవలం ఐదు వేల రూపాయలతో మాత్రమే గుండెలోని బ్లాకేజీలను  ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా  తొలగించుకోవచ్చును 
.......ఈ గొప్ప అవకాశము బాంబేలోని జేజే హాస్పిటల్ లో కలదు .ఇంతటి అద్భుతమైన శుభ సమాచారాన్ని మరియు ఈ వీడియోని అన్ని గ్రూపులకు ,నీకు తెలిసిన అందరికీ వెంటనే షేర్ చేయగలరు షేర్ చేయగలరు .ఇలాంటి మంచి సమాచారాన్ని పదిమందికి తెలిపి అందరి మరియు దేవుని ఆశీర్వాదాలు పొందగలరు 🙏🙏

Tuesday 16 April 2019

నిన్నే నిన్నే పిలిచా
నిన్నే నిన్నే తలిచా

నన్నే నన్నే ఎందుకు పిలిచావ్
నన్నే నన్నే ఎందుకు తలిచావ్

ఈరోజు ఆక్షయ తృతీ
సింహాచలేశ్వరుని నిజ
రూప దర్శనం చూద్దామా
అక్షయ పుత్తడి దుకానంకు
వెళ్ళి ఏమన్నా కొందామా
బ్రాహ్మణ బ్రహ్మచారి కి
భోజనం పెడదామా
వెండి వస్తువుని ఎన్నుకొని
ఎవరికైనా దానం చేద్దామా

నిన్నే నిన్నే పిలిచా
నిన్నే నిన్నే తలిచా

మట్టి కుండ తెచ్చి నీటితో
నింపి కొందరి దాహం తీరుద్దాం
చల్ల మజ్జిగ చేసి కుండలో
పోసి కొందరి వేడి తగ్గిద్దాం
కొబ్బరికాయ కొట్టి నీటితో
కూజా నింపి దప్పిక తీరుద్దాం




U I U I U - I I U I U

తెలుగు భాష నేర్చుకుందాం 
రచయాత: మల్లాప్రగడ రామకృష్ణ 

మౌన మేలనే - చిరు హాసినీ 
సేవ చేసితీ - సుఖ భోగినీ
పేరు మార్చకే - నవ మోహినీ  
పేరు తెల్పవే - మధు హాలినీ

ఆశ వద్దులే  - కల మొహినీ
కాల మడ్డులే - జవ రాలువీ   
జాలమేలరా - సర సమ్ముతో
సాదనం ముందే - వయ సుందిలే 

మారు పల్కగా - మది నింపరా
ఆరు నూరుగా - ఇది సత్యమే 
కారు మబ్బులే - మన పొందురా
వాన చిన్కులే - మన హాయిరా   

మ్రోల రమ్మురా - మురిపెమ్ముతోఁ
గాల మయ్యెరా - కరుణించరా
ప్రేమ ఉందిరా - పదిలమ్ముతో  
పూల స్పర్శతో - మురిపించరా
  
--((**))--


UIU IIIU - UIU IIIU - UIU IIIU - UIU UU
తెలుగు భాష నేర్చుకుందాం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

రవ్వగా మెఱయుచున్ - పువ్వుగా విరియుచున్ -
నవ్వులన్ జిలుకుచున్ - జవ్వనీ రావా

మల్లెలే మెఱయుచున్ - వెన్నెలే విరియుచున్
చిన్కులున్ జిలుకుచున్ - జవ్వనీ రావా 

పల్లవీ చదువుచున్ - గానమే పలుకుచున్
రాగమే రగులుచున్ - జవ్వనీ రావా   

భావమే వినయమున్ - భారమే పదిలమున్
భాద్యతే నిలయమున్ - జవ్వనీ రావా

కాలమే మనదియున్ - ప్రేమయే వరదయున్
సేవయే వరుసయున్ - జవ్వనీ రావా

గొప్పగా బతికియున్ -  ఒప్పుగా పలికెదన్
నిప్పుగా కదిలియున్ - జవ్వనీ రావా     

మాటలే మనసుయున్ - చేతలే ఫలితమున్ 
రాతలే గుణములన్ - జవ్వనీ రావా

--((**))--


తకధిం తాన ధింతనా తానా
తన్నుకున్న కూన తకధిం తానా
నమ్ముకున్న జాన జలధిం తానా
మన్నుతున్న మాన మధితం తానా

తకధిం తాన ధింతనా తానా
ఉరికే ఊడ ఉజ్వల తానా
మరిగే జాడ మవ్వల తానా
కరిగే కాడ కంచల తానా

తకధిం తాన ధింతనా తానా

ప్రాంజలి ప్రభ చైతణ్య గీతం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

రంగుల రవ్వల వెలుగై
కన్నుల కాంతుల జిలుగై
మల్లెల జాజుల మెరుపై
చక్కటి చిక్కటి బ్రతుకై

చిగురల్లే చిరుమందహాసం చిందించే
మరుమల్లే మనో నేత్రంగా మధించే
కలవల్లే నిద్రరానీయకుండా కదిలించే
శిరిమల్లే వచ్చి శీఘ్రంంగా చలించే.....ర

మంచువల్లే మదిని దోచి కరిగించే
అగ్గివల్లే యెగసిపడి వేడిపుట్పించే
మబ్బువల్లే రంగుల మార్చి ఊరించే
శక్తివల్లే కదిలి వచ్చి కధలా కనికరించే.....ర

పుత్తడివల్లే మెరుపును చూపించి కవ్వించే
రత్నం వల్లే మరుపును చేసియు మెప్పించే
వజ్రంవల్లే విలువను పెంచేసి మురిపించే
సత్యంవల్లే అనురాగంతో హాయిని కల్పించే....ర

ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నవ్వు నవ్వించి నవ్వులు పండించు
ఊ.....ఊ...... ఊహలు లాలించు
నా మనసు నవ్వులతో ఊరడించు
ఊ..... ఊ..... ఊహలు పండించు

పువ్వు పువ్వుగా పరిమలళించు
ఊ..... ఊ.....  ఆశలు లాలించు
మకరందంతో మై మరిపించు
ఊ.... ఊ...... ఆశలు గెలిపించు

నవ్వులతో  హృదయాన్ని కదిలించు
ఊ... ఊ.... .  దడలు లాలించు
నవ్వులతో నమ్మకం కలిగించు
ఊ..... ఊ..... దడలు తొలగించు

పువ్వులతో అందాలను మురుపించు
ఊ...... ఊ.......  కలలు లాలించు
పువ్వులతో వయస్సును ఊరడించు
ఊ.....  ఊ..... కలలు కరీగించు

నవ్వులతో  మనసు జయించు
ఊ....... ఊ......  అలలు లాలించు
నవ్వులతో నాట్యము చేయించు
ఊ.... ఊ..... అలలు నడిపించు

పువ్వులతో మకరందాన్ని కురిపించు
ఊ....... ఊ.......  తలపు లాలించు
పువ్వులతో పూజలు చేయించు
ఊ..... ఊ....... తలపులు తగ్గించు

నవ్వులతో  తాపము చూపించు
ఊ...... ఊ......  వలపు లాలించు
నవ్వులతో నటనలు చేయించు
ఊ..... ఊ..... వలపులు పండించు

పువ్వులతో కదలి గుభాలించు
ఊ...... ఊ.....  మలుపు లాలించు
పువ్వులతో అందాలను అందించు
ఊ.... ఊ..... మలపులు తొలగించు

అలా ఇరువురు నవ్వులు పువ్వులై, పువ్వులు నవ్వులై ఊ.... ఊ...., ఊజాడి ఊపిరీ ఏకమై

ప్రాంజలి ప్రభ చైతన్య గీతం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఓరోరి ఓరోరి ఓరన్నా
ఒట్టిమాటలు చెప్పుట వ్యర్ధమోరన్నా
వ్యక్తి మాటలు ముందు వినురోరన్నా
ఎక్కువ విని తక్కువ మాట్లాడోరన్నా
ఓరోరి ఓరోరి ఓరన్నా

మంచుకన్నా మల్లెకన్నా మిన్మ  మానవత్వం మన్నా
అదియే మనసును బట్టి అర్ధం చేసుకొనే
స్నేహమోరన్నా
ఆత్మీయతకు అనురాగానికి మూలమైనది స్నేహమోరన్నా
అలసిన దేహానికి చేయూతనిచ్చి ఆదుకొనేది
స్నేహమోరన్నా
.........ఓరోరి
ప్రేమను గప్పించి మనసును మెప్పించి మాయే
స్నేహమోరన్నా
ప్రేమను కల్పించి హృదయాన్ని‌ కదిలించేదియే
స్నేహమోరన్నా
ప్రేమ ప్రేమగా గౌరవించి ప్రాణానికి ప్రాణమగుటయే స్నేహమోరన్నా
ఎవ్వరుకాదన్నా ఆపదలో ఆదుకొని సహకరించేదియే స్నహమోరన్నా.  ....ఓరోరి

స్త్రీ పురుష భేధలేకుండా ఒకరికొకరు ఆదరణ చూపేది స్నేహమోరన్నా
స్త్రీ కి పురూషుడు పురుషునికి  స్త్రీ అవినాభావ సంబంధమే స్నహమోరన్నా
స్త్రీ కి స్త్రీ యే, పురుషునకు పురుషుడే ద్రోహులుగా ఉండటం కూడా స్నేహమేరన్నా
తల్లితండ్రులకు పిల్లలపై, దేవునిపై ఉండే నమ్మకమే స్నేహమోరన్ని

ప్రాంజలి ప్రభ చైతన్య గీతం
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

ఆహా ఓహో అనిపించేటట్లు  నాట్యమాడవే నవమల్లికా
ఆహా ఓహో అనిపించేటట్లు నాట్యమాడవే నవమల్లికా

నవ రాగాలకు నాట్యము చూపవే
నవ విధాలుగా నాట్యమాడి మెప్పించవే
హావ భావ విన్యాసాన్ని చూపవే
అంగాగాలు కదిలించి ఆనంద పరచవే....

నాట్యమాడవే నవమల్లికా
నాట్యమాడవే నవమల్లిక

ఉల్లము ఝల్లని పించేటట్లు
పురివిప్పి మయూరంలా నాట్య మాడవే
అల్లన మెల్లగ సాగే కెరటంలా నాట్యమాడవే
ఉప్పెనలా సాగే వరదల్లా నాట్య మాడవే
హృదయాన్ని హత్తుకొని మక్కువ చూపే నవరసాలను కురిపించి నాట్యమాడవే ....అఅహా

నయనాల కదలికతో, ఊరువుల ఊపులతో, కేశముల కదలికతో, కరముల విన్యాసముతో, పాదముల సవ్వడితో, కుండల శబ్ధాలతో, నడుము వయ్యొరంతో, ఉండి ఉండని స్వేత వస్త్రాలతో, చక్రబ్రమణంలా కదులుతూ, విరహాకృతిగా, ధర్మాకృతిగా, కృపాకృతిగా, దేహాకృతిగా, సర్పాకృతిగా, మీనాకృతిగా,   ఉల్లాసాకృతివై, శోకాకృతివై, ప్రేమాకృతివై, భయాకృతివై,  నిజాకృతివై అహా ఓహా అనిపించేటట్లు నాట్యమాడవే నవమల్లికా .........
నాట్యమాడవే నవమల్లికా..........
ఆహా ఓహో ఉల్లము ఝల్లనిపించవే...
నవమల్లికా......

--((*))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

ఇద్దరు త్రాగి పెళ్ళి సందడిలో పాడారు

ఏ ...ఏ. .....
 ఏదో అనుకున్నా
ఆ.... ఆ.... మరేదో అయ్యింది ....... 2

పెళ్ళి ...పెళ్ళి కొడుకు మహా శృంగార ప్రియుడు
మళ్ళి... మళ్ళి పిలిచి మతి పోగొట్టే ప్రియుడు
గళ్ళి ..... గళ్ళి తిరిగి గంతు లేసేటి ప్రియుడు
తుళ్ళి ..... తుళ్ళి పడే దున్నపోతు లాంటి ప్రియుడు
 ( అప్పుడే ఇద్దరినీ బయటకు నెట్టారు)

ఏ.... ఏ.... ఏదో అనుకున్నా
ఆ.... ఆ.... మరేదో అయ్యింది

తొగుబోతు మాటలు నిజమని తెలుసు కోలేని మూర్ఖులు
హంగు ఆర్భాటం,  మంది మార్బలం, చూసి మోసపోయే మూర్ఖులు
ఆడదాని మనస్సుని గమనించక పట్టుదలకు పోయే అధములు
పెద్దవారు ప్రేమను గుర్తించ లేక పిల్లలను బలిచేసే  మూర్ఖులు

ఏ... ఏ... ఏదో అనుకున్నా
ఆ... ఆ.... మరేదో అయ్యింది

కళ్ళెదుట ఉన్న వారిలో  చెడుని గుర్తించలేరు
ఎవరో చెప్పారని ఏదో సహాయం చేస్తారనేవారు
నీడ లాంటి బతుకే మేలని బ్రమింప చేసారు వారు
తాగినోడి మాటల్లో నిజం తెలిసికోలేని పరమ మూర్ఖులు

ఏ...ఏ... ఏదో అనుకున్నా
ఆ... ఆ... మరేదో అయ్యింది..
మరేదో అయ్యింది

పాల సంద్రంలో విష్ణువు పుట్టాడంటా, విష్ణువు హృదయంలో శ్రీమతి యంటా
విష్ణువు నాభిలో బ్రహ్మపుట్టాడంటా, బ్రహ్మ నాలుకపై శ్రీమతి యంటా
బ్రహ్మ నుదుటి నుండి శివుడొచ్చాడంటా, శివుని సగభాగం శ్రీ మతి యేనంటా
వాలందరు కానరాని దేవుల్లు మనకెందు కంటా
మనల్ని నమ్మించి మోసగించి వేరొకరి ప్రాణంతో చెలగాట మాడే మూర్ఖ ప్రియుని నమ్మేదెవరంటా

ఏ....ఏ.. ఏదో అనుకున్నా
ఆ...ఆ.. మరేదో అయ్యింది....మరేదో అయ్యింది

(అలా పాడగా నిజం గమనించి మూర్ఖున్ని చెరశాల , - నూరేళ్ళ జీవితం బుగ్గి పాలు కాకుండా ఆపారు పెళ్ళి యీ తాగుబోతులు)

ప్రాంజలి ప్రభ - చైతన్య గీతం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నేను నేనుగా నీవు నీవుగా
నేను నేనుగా నీవు నీవుగా

నేనే నీవుగా నీవు నేనుగా
నేనే నీవుగా నీవు నేనుగా

నేనే వాక్కు నేనే అర్ధం
నీవే వెలుగ నీవే మెరుపు

నేనే పుష్పం నేనే పరిమళం
నీవే మేఘం నీవే పిడుగు

నేనే వెన్నెల నేనే చల్లదనం
నీవే ద్రవం నీవే దృవం

నేనే ఇష్టం నేనే మోనం
నీవే కృఫ్ణం నీవే వర్షం

నింగీ నేల మనువాడటం
నేల నింగి ఏక మవటం
కలలు నెరవేర్చు కవటం
కన్నీరు పన్నీరు అవటం

కాలం గమ్యం ఒక టవటం
ప్రేమ శ్రమ ఫలించటం
మాయ బ్రమ తొలగి పోవటం
నిత్యం సత్యంగా మారటం

అణువణువు ఉత్తేజం
సమచిత్తా సమీకరణం
సర్వేంద్రియ సంతర్పణం
ఏకమైన రాగరంజితం

‌స్పర్శతో, మాటతో, చూపుతో
సర్వాంగాల ఇష్ట కలయకతో

రసజ్ణ రమనీయ సౌందర్యం
మనోజ్ణ మాధుర్యం సంకల్పం

గమ్యం, లక్ష్యం తో దాంపత్యం
ఆలుమగల రస యోగం
ఏకత్వ భావన సంయోగం
అద్వైత స్ధితికి అపూర్వ నీరాజనం

నేను నీవుగా నీవు నేనుగా
హాయి హాయిగా ఊయలూగుదాం

నేను నువుగా నీవు నేనుగా
హాయి హాయిగా ఊయలూగుదాం
నేను నీవుగి నీవు నేనుగా............

ప్రాంజలి ప్రభ - తెలుగు భాష నేర్చు కుందాం
రచయత: మల్లా ప్రగడ రామకృష్ణ

Ui ui ui ui
చెట్టు పైన నుండి జారి
ఎండ బండ నుండి జారి
నీళ్ళ గట్టు చెంత చేరి
కూలి కొచ్చి చెప్పి వెళ్ళె

స్పర్శ తాకి మంట చేసి
తాకి నంత వచ్చి పోయె
అడ్డు ఆపే వారు లేక
జిడ్డు మడ్డి రూపు మారె

పక్షి గూటి చెంత చేరి
నీడ పంచ లేక పక్షి
తెచ్చి ఆకు కప్పి ఉండె
రక్ష కల్పి చల్ల పర్చె

కొండ ఎండ వాలు కమ్మె
ఎండ పూలు వచ్చి పోయె
మబ్బు వాన చిన్క వచ్చె
ఎండ మండి గుండె మండె

చెర్వు నీరు ఎండి పోయె
చేప కప్ప కొంగ ఏడ్చె
రైతు రాజు రోగి రొప్పె
ఎండ నుండి పుట్టు జారి

వాన లేక వళ్ళు మండె
చెప్ప లేక కంట నీరె
చేసె దేది లేక చేత
కాక కూడు గుడ్డ మండె

--((**))--






ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

తకధిం తకధిం తోం తోం థా
వినయం జననం లేదు లేదు అనకు
తరుణం మరణం లేదు లేదు అనకు

తోం తౌం థా తకధిం తకధిం
లేదు లేదు అనకు జంఝాటం బంబాటం
లేదు లేదు అనకు విరోధం సరోగం

తకధిం తకధిం తోం తోం థా
కోపము లోపము లేదు లేదు అనకు
శోకము తాపము  లేదు లేదు అనకు

తోం తౌం థా తకధిం తకధిం
లేదు లేదు అనకు నిర్మలం నిర్ణయం
లేదు లేదు అనకు శోభనం శోధనం
తకధిం తకధిం తోం తోం థా
సజలం సఫలం  లేదు లేదు అనకు
సీతలం పీడణం లేదు లేదు అనకు

తోం తౌం థా తకధిం తకధిం
లేదు లేదు అనకు ఆరాటం పోరాటం
లేదు లేదు అనకు కోలాటం సల్లాపం


ప్రాంజలి ప్రభ (4)

పున్నమి కమ్మిన రేయి
వెన్నెల చిమ్మిన రేయి
పువ్వులు రాల్చిన రేయి
నవ్వులు పంచిన రేయి

చల్లని గాలుల రేయి
వర్షము కుర్శిన రేయి
ఊయల ఊగిన రేయి
వలపు పంచిన రేయి

కలలు పండిన రేయి
సుఖము పొందిన రేయి
బిడియము లేని రేయి
బిగువు పంచిన రేయి

విరహ వేదన రేయి
తనువు తపించు రేయి
తపన తగ్గించు రేయి
తలపు తెలిపే రెయి

మనసు విచ్చిన రేయి
సొగసు పంచిన రేయి
వయసు పండిన రేయి
కలుపు తీసిన రేయి

చిగురు చితికే రేయి
చమట కలిసే రేయి
బతుకు తడిసే రేయి
అగ్గి నీరు కల్సే రేయి


ప్రాంజలి ప్రభ చైతన్య గీతం
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ‌‌‌

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ
ఎన్నెన్నో జన్మల బంధం నాది నీదీ

పువ్వులా వికసించుట వంతు నాదీ
పరిమళాన్ని దోచేటి మనసు నీదీ
మనసులు కలిపేటి బంధం నాదీ
చిత్తంలో పంచేటి వలపు ధనం నీదీ

తొలినాటి కోర్క తీర్చే హృదయం నాదీ
హృదయిన్నే అర్పించే మనసు నీదీ
ప్రేమ అందించి పొందే పరువం నాదీ
పరువాన్ని తృప్తి పరిచే వయసు నీదీ

కాలాన్ని బట్టి నడిచుకొనే ప్రవర్తన నాదీ
ప్రవర్తనతో బాధను పంచనితత్వం నీదీ
నిముషంకూడా వ్యర్ధం చేయని పని నాదీ
పనిలోకూడా పరమార్ధం గుర్తింపు నీదీ

నిత్యం సుఖాన్ని అందించే తత్వం నాదీ
సుఖంలో సౌందర్యం ఆస్వాదించే గుణం నీదీ
నిత్వం వినయ విధేయతా స్వభావం నాదీ
సహనమే ఆయుధముగా ఉండే ప్రేమనీదీ

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ
ఎన్నెన్నో జన్మల బంధం నాదీ నీదీ

హనుమత్ జయంతి సందర్భంగా స్వామిని గూర్చి కాస్త


హనుమత్ జయంతి సందర్భంగా స్వామిని గూర్చి కాస్త

బలవంతుడు, శక్తి సామర్థ్యాలు, ధైర్యవంతుడు, ఆపాయ్యత, నిజాయితీ, నిజమైన భక్తికి నిదర్శనం జై హనుమాన్. ముఖ్యంగా హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. హనుమంతుడు పుట్టినరోజుని హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం.

🌸 మనలో ఉత్తేజాన్ని నింపే ఆంజనేయుడి గొప్ప లక్షణాలు

రామాయణం, మహాభారతంలోనే కాకుండా హనుమంతుడు వివిధ కథల్లో ప్రస్తావించారు. ఈ కథల ఆధారంగా హనుమంతుడు అంటే.. చాలా సాహసోపతమైన దైవంగా మనకు అర్థమవుతుంది. అయితే హనుమంతుడి, బలం, ధైర్య సాహసాలు, అమితమైన భక్తి మాత్రమే కాదు.. ఆంజనేయస్వామి గురించి మీకు తెలియని, మీరు గతంలో ఎప్పుడు వినని ఆసక్తికర విషయాలు మీకు పరిచయం చేయబోతున్నాం..

🌸 రాముడిపై హనుమంతుడి విజయం
యయాతిని చంపాలని.. విశ్వామిత్రుడిని రాముడు ఆదేశించాడు. అప్పుడు యయాతి హనుమంతుడిని సహాయం కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా రక్షిస్తానని యయాతికి వాగ్ధానం చేశాడు. అయితే ఈ సంగ్రామంలో హనుమంతుడు ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు. కేవలం రామనామం జపిస్తూ కూర్చున్నాడు. రామబాణాలు హనుమంతుడి దగ్గరకు వచ్చినా.. అవి ఎలాంటి హాని చేయలేదు. అలా హనుమంతుడు రాముడిపై విజయం సాధించాడు.

🌸 హనుమంతుడి ఆకలి
సీతను కలవడానికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లినప్పుడు తానకు సీతమ్మ వండిన ఆహారం తినాలనే కోరిక ఉందని చెప్పాడు. అప్పుడు సీతాదేవి రకరకాల వంటకాలను వండి హనుమంతుడికి వడ్డించింది. కానీ.. హనుమంతుడికి ఆకలి మాత్రం తగ్గలేదు.. ఆశ్రమంలో ఉన్న సరుకులన్నీ అయిపోవచ్చాయి. అప్పుడు సీతాదేవి రాముడిని ప్రార్థించగా.. రాముడు తులసీదళం వడ్డించడం వల్ల.. హనుమంతుడి ఆకలి తగ్గుతుందని చెప్పగా.. హనుమంతుడి ఆకలి తీరింది.

🌸 పంచముఖి ఆంజనేయుడు
హనుమంతుడి వివిధ రూపాల్లో.. పంచముఖిగా దర్శనమిస్తాడు. రావనాసురుడి సోదరుడైన అహిరావన్ ను రాముడు, లక్ష్మణుడు అపహరిస్తారు. అహిరావన్ ని సంహరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది 5 దీపాలు, 5 మార్గాల్లో తీసుకెళ్లాలి. అప్పుడు హనుమంతుడు తన రూపంతో పాటు, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవుడిగా 5 మార్గాల్లో వెళ్లాడు.

🌸 రాముడి మరణం
రాముడు చనిపోవడానికి హనుమంతుడు అంగీకరించలేదు. అయోధ్యలోకి యముడు ప్రవేశించకుండా అడ్డుకున్నాడు. దీంతో హనుమంతుడిని మళ్లించాలని భావించిన రాముడు తన చేతి ఉంగరాన్ని కిందకు పడేస్తాడు. దాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశిస్తాడు రాముడు. ఉంగరం కోసం వెళ్లిన హనుమంతుడికి సర్పాలదీవికి చేరుకున్నాడు. ఇలా రాముడు తన బంటుని పక్కకు పంపి.. తన ప్రాణాలు కోల్పోయాడు.

🌸 దేవుళ్ల అనుగ్రహం
హనుమంతుడిని యుద్ధంలో ఏ ఆయుధంతోనూ ఎవరూ చంపలేని వరం బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. అలాగే దీర్ఘాయుష్సు, ఆధ్మాత్మిక చింతన, సముద్రం దాటే ధైర్యాన్ని శివుడు ప్రసాదించాడు.

🌸 పంచభూతాలు
ఆంజనేయస్వామికి పంచభూతాల అనుగ్రహం కూడా ఉంది. వరుణుడు నీటితో రక్షిస్తానని, అగ్ని దేవుడు ఎప్పటికీ.. అగ్నికి ఆహుతికావని, సూర్యడు అతిపెద్ద, అతి చిన్న రూపాల్లో మారే శక్తిని, వాయు దేవుడు ఎక్కువ వేగంతో వెళ్లగలిగే శక్తిసామర్థ్యాలను, యముడు ఆరోగ్యవంతమైన జీవితం, అలాగే తన యమపాశం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. అంటే తన ద్వారా హనుమాన్ కి మరణం ఉండదని అనుగ్రహిస్తాడు.

🌸 భీముడితో సంబంధం
భీముడి సోదరుడిగా హనుమంతుడిని చెబుతారు. వీళ్లద్దరికి తండ్రి ఒక్కరే వాయు దేవుడు.

🌸 కురుక్షేత్ర యుద్ధంలో
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో తనతో పాటు హనుమంతుడు ఉన్నాడని.. అర్జునుడు చెబుతాడు. చివరికి తాను తీసుకొచ్చిన జెండాలో హనుమంతుడు ఉన్నాడని వివరిస్తాడు. యుద్ధం తర్వాత హనుమంతుడు తన నిజరూపంలోకి వస్తాడు. హనుమంతుడు కిందకు దిగగానే అర్జునుడి వాహనం కాలిపోతుంది. అంటే.. ఎప్పుడో కాలిపోవాల్సిన వాహనాన్ని హనుమంతుడే రక్షించాడని.. కృష్ణుడు వివరిస్తాడు.

🌸 హనుమంతుడి అవతారాలు
హనుమంతుడిని రకరకాల రూపాలు, అవతారాల్లో చూసినట్టు.. మతగురువు చెబుతారు. 13వ శతాబ్ధంలో మాధవాచార్యుడిగా, 16 వ శతాబ్ధంలో తులసీదాస్ గా, 17వ శతాబ్దంలో సమర్త్ రామదాసుగా, 17వ శతాబ్ధంలోనే రాఘవేంద్రస్వామిగా, 20వ శతాబ్ధంలో స్వామి రామదాస్ గా కనిపించాడని చెబుతారు.

🌸 శాశ్వత స్థానం
హనుమంతుడు ఏడుగురు చిరంజీవుల్లో ఒకరు. అంటే తర్వాత సత్యయుగం వరకు జీవించి ఉంటారని అర్థం. సీతా దేవి ఇచ్చిన ముత్యాల హారాన్ని హనుమంతుడు స్వీకరించలేదు. రాముడు లేని ఎలాంటి వస్తువుని తాను తీసుకోనని సీతకు చెప్పాడు. అదే సమయంలో.. తనలో ఎప్పుడూ రాముడు అమరంగా ఉంటాడని.. తన గుండె చీల్చి చూపిస్తాడు.

🌸 హనుమంతుడి పాదాలు తాకడానికి మహిళలు దూరం
హనుమాన్ జయంతి రోజు భక్తులు సింధూరం రాసుకుని.. హనుమంతుడి ఆలయాలు దర్శిస్తారు. కోతులకు అరటిపండ్లు తినిపించి.. ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. హనుమంతుడు బాల బ్రహ్మచారి. కాబట్టి.. హనుమంతుడిని మహిళలు పూజించవచ్చు. కానీ.. ఆయన విగ్రహాన్ని తాకడానికి వీలులేదు.

🌸 సింధూరం ఎందుకు ?
ఒకసారి సీతాదేవి తన నుదిటిపై సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు.. ఎందుకు అక్కడ సింధూరం పెట్టుకున్నారని సీతను అడికాడు. తన భర్తైన రాముడి బాగుండాలని, ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటూ పెట్టుకున్నానని చెబుతాడు. వెంటనే హనుమంతుడు తన శరీరాన్నంతటికీ సింధూరం రాసుకున్నాడు.. ఎందుకు అంటే.. రాముడు కలకాలం ఉండాలని చెప్పాడు. కాబట్టి.. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పిస్తే.. మీ కోరిక నెరవేరుతుంది.🌹

🙏🏼🙏🏼🙏🏼 జై శ్రీరామ్🙏🏼🙏🏼🙏🏼



https://vocaroo.com/i/s04ezENoaKEX
ఆనందజ్యోతి

https://vocaroo.com/i/s0bXkiensiP7   (13 నిముషములు 

Monday 8 April 2019


నేటి హాస్యం (1) 
ప్రాంజలి ప్రభ (మల్లాప్రగడ రామకృష్ణ )

1. డబ్బా 

పిల్లవాడు డబ్బా కట్టుకొని ఆడుకొంటున్నాడు .
పక్కింటి అంకుల్ వచ్చి కారు బాగుంది అన్నాడు.  
పిచ్చి అంకుల్ కారు కాదు, డబ్బా అని కూడ  మీకు తెలవదు. 

వయసు రావటం కాదు మాట్లాడేటప్పుడు కొంచం  ఇంకిత జ్ఞానం  ఉండాలి 
ఆ .....  ఆ..... 

--((**))--


 

 

ప్రాంజలి ప్రభ 

సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 

కవి సార్వభౌముని చాటువు

కొందరు భైరవాశ్వములు కొందరు పార్థుని తేరి టెక్కెముల్

కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు పార్థుని ఎక్కిరింతలున్

కొందరు కృష్ణ జన్మమున కూసినవారాలు ఈ సదస్సు లో

అందరు నందరే మరియు నందరు నందరు నందరే గనన్

భావము : భైరవుని రథానికి పూన్చేది కుక్కలను, అర్జనుని రథ పతాకము పై గల గుర్తు 'కపి రాజు' ఆంజనేయుడు,సముద్రములో మునుగు భూమిని లేవనెత్తినది వరాహాహావతారములో విష్ణువు అంటే ఇక్కడ అన్వయములో మాత్రము పందులు, కృష్ణ జన్మ సమయమున కూసినవి గాడ్దెలు,(వసుదేవుడు-గాడ్దె కాళ్ళు), సభలో కూర్చున్నవారంతా ఈ జంతువులతో సమానమని నర్మగర్భంగా వంగ్య పూరితమైన ఈ పద్యాన్ని, ఒక రాజు,సభలో గల తన ఆస్థాన కవులను గూర్చి గొప్పగా చెప్పంటూ ఈ సమస్య ఇస్తే,శ్రీనాధులవవారు పై విధంగా తెలిపినారు .

పరమకల్యాణి! యోభాగీరథీగంగ! వార్థిభామిని! పోయివత్తునమ్మ!

అమరేంద్రులార! లోలార్క కేశవులార! వనజసంభవ! పోయివత్తునయ్య!

శ్రీవిశాలాక్షి! దాక్షిణ్య పుణ్యకటాక్ష! వాసవార్చిత! పోయివత్తునమ్మ!

శ్రీపూర్ణభద్ర పారిషద నాయకులార! వటుకభైరవ! పోయివత్తునయ్య!


తీర్థ సంవాసులార! కృతార్థులార!

పాశుపతులార! భాగ్యసంపన్నులార!

మందిరోద్యాన వాటికా మఠములార!

పోయివచ్చెద మీకాశిపురము విడిచి||


కలహంసి! రారాదె కదలి నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

కదళికాకాంతార! కదలి రాననుగూఁడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

శ్రీవిశాలాక్షి! విచ్చేయు నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

నాతోడఁ గూడి యంతర్గేహ! యేతెమ్ము, నీవేల వత్తమ్మ నెమ్మినుండి


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


49. T .V లో

శుభలేఖ చివర గమనిక అని వ్రాసిఉన్నది అది ఏమిటో అని చదివింది పార్వతమ్మగారు

మీరు రాలేదని ఎవ్వరు అనుకోరు, T .V లో వస్తుంది చూడండి

మిమ్మలిని ఖర్చు పెట్టుకొని రమ్మని మేము గట్టిగా చెప్పటములేదు

ఇట్లు మీ భవదీయుడు ........................ 

 

50. రచయత

రచయత స్నేహితుడితో సంభాషణలు జరుపుతున్నాడు

స్నేహితుడు : కవిగారు మీ రచనలు ముద్రణలు ఎప్పుడవుతాయి

కవి: కడుపుతో ఉన్నవారు బిడ్డను 9నెలలు మోస్తేగాని బిడ్డ బయటకు రాదు అవును

మరి నా రచనలు ముద్రణ అవటానికి ఎన్ని నెలలు పాడుతాయో ....... 


51. వాగుడు మనిషి

ఒక యువకుడు ఆపకుండా ఉపన్యా స మిస్తున్నాడు ఎవరతను

ఈ వాగే గుణం కుటుంమ్బము నుమ్చి వచ్చింది

నికెట్లా  తెలుసు

ఏముంది వాళ్ళ తాత లెక్చరర్ , వాళ్ళనాన్న రాజకీయనాయకుడు

వాళ్ళ అన్నయ్య లాయరు , ఇక వాళ్ళ అమ్మ ఒక స్త్రీ కదా


52. కొత్తరకంజబ్బు

మా ఆవిడకు కొత్తరకం జబ్బు వచ్చింది

రాత్రి  2 గంటల వరకు నిద్ర పోకుండా వేచి ఉంటుంది

అరె పాపం అంతవర ఎం చేస్తుంటుంది

నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ...................    


91. చక చక

మూడు  రోజుల్లో  చక చక నడుస్తానన్నారు

నా ఆరోగ్యం కోసం ఉన్న కారు అమ్మికదా  డాక్టరు ఫీజు కట్టింది

ఇక చక చక నడవక చస్తాన అన్నడుభార్యతో  ....................

92. బిల్లు

పెళ్ళిచూపులు అంటు ఒక ఇంటికి వచ్చి స్వీట్ అనీ బాగున్నాయి అన్నారు

ముందు  పిల్ల నచ్చితే వెంటనే చెప్పండి

లేదా మీరుతిన్న వాటికి బిల్లు కట్టి మరీ వెళ్ళండి ...........

93. భర్త

అప్పుడే నూరెల్లు నిండి నాయా అని ఏడుస్తున్నాడు ఒకడు

ఎవరు పోయారు అంత పెద్దగా ఎడు స్తున్నరు 

మా ఆవిడ రెండవ భర్త .........ఆఅ .............

మీరెంన్నో  భర్త మీ ఆవిడకు .....



ప్రాంజలి ప్రభ (1)
నేటి పద్యం (మల్లాప్రగడ రామకృష్ణ)  

కమలములు నీట బాసిన 
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌ 
తమ తమ నెలవులు దప్పిన 
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ. 

భావం- ఏ వస్తువయైనా సరే తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహ భాందవ్యం చక్కగా సాగుతుంది. ఎపుడయితే ఆ స్థానాలు  విడిచిపెడతారో తమ మిత్రులే శత్రువులుగా మారతారు. కమలము నీటిలో ఉన్నంత వరకే సూర్యకాంతికి వికసించును. ఎపుడైతే నీటిని విడుచునో అదే సూర్యకాంతికి వాడిపోవును.

--((**))--


ప్రాంజలి ప్రభ (2)


నేటి పద్యం (మల్లాప్రగడ రామకృష్ణ)  
భర్తృహరి సుభాషితం ! 

"ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్ 
భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బా 
హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం 
ఛా పరివృద్దియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జానాళికిన్" 

భావం: 


ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము చూపుట, కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్పకోరిక అనునవి మాహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు.

--((**))--


విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను;
వేఱేమియును లేదు విశ్వమునకు
భవవృద్ధిలయము లా పరమేశుచే నగు;
నీ వెఱుంగుదు గాదె నీ ముఖమున
నెఱిఁగింప బడ్డది యేక దేశమున నీ;
భువన భద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము, ;
రమణతో హరిపరాక్రమము లెల్ల.....
టీకా:
విష్ణుండు = శ్రీహరే; విశ్వంబు = విశ్వము; విష్ణుని = హరి; కంటెను = కంటే; వేఱు = వేరైనది; ఏమియును = ఏమీకూడా; లేదు = లేదు; విశ్వము = విశ్వము; కున్ = కు; భవ = సృష్టి; వృద్ధి = స్థితి; లయములు = లయములు; ఆ = ఆ; పరమేశు = పరమమైన ఈశుని / భగవంతుని; చేన్ = చేతనే; అగున్ = అగును; నీవు = నీవు; ఎఱుంగుదు = తెలియుదువు; కాదె = కదా; నీ = నీ; ముఖమునన్ = నోటిద్వారానే; ఎఱిఁగింపబడ్డది = చెప్పబడినది; యేకదేశమునన్ = అంశముగ; ఈ = ఈ; భువన = లోకముల; భద్రమున = క్షేమము; కై = కొరకు; పుట్టినట్టి = అవతరించినట్టి; హరి = హరియొక్క; కళ = అంశతో; జాతుండవు = జన్మించినవాడవు; అని = అని; విచారింపుము = తెలిసికొనుము; రమణ = ప్రీతి; తోన్ = తో; హరి = హరియొక్క; పరాక్రమములు = సామర్థ్యములు; ఎల్లన్ = సమస్తము;
.
భావము:
ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె ఇతర మైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితిసంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియంది ఏముంది. నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పి ఉన్నావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్నించానన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను సంస్తుతించు మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, ఔదార్యానికీ, అనుష్ఠానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించటమే.
(పోతన తెలుగు భాగవతం.)

--((**))--

మానవజన్మ - సుగుణాలు 

హస్తస్య భూషణం దానం -- చేతులకు దానమే భూషణం 
సత్యం కంఠస్య భూషణం -- కంఠమునకు సత్యమే భూషణం 
శ్రోతస్య భూషణం శాస్త్రం -- చెవికి ధర్మ వచనములే ఆభరణం. 
ఇవే సహజమైన, శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు భర్తృహరి. మానవ ధర్మానికి సంబంధించిన ఈ సుగుణాలు లేకుంటే మానవజన్మ వ్యర్ధమవుతుందని హెచ్చరించాడు.    

ఒక అడవిలో మనుష్య శవం ఉంది. కొద్ది దూరంలో మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శవాన్ని తినేందుకు నక్క ముందుగా శవం చేతులను సమీపించింది. ఆ మహర్షికి అతరాయం కలిగి కన్నులు తెరచి చూశాడు. వెంటనే దివ్య  దృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు. నక్కను ఉద్దేశించి " ఈతని చేతులు ఎన్నడూ దానం చేసి ఎరుగవు. కనుక వాటిని తినకూడదని" అన్నాడు. అప్పుడా నక్క చేతులను వదలి చెవులను తినబోగా, " ఈతని చెవులు ఏనాడు ధర్మశాస్త్రాలు గాని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశాలనుగాని వినలేదు. కాబట్టి చెవులు ముట్టతగినవి కావు" అని అన్నాడు. అప్పుడా నక్క కళ్ళను తినబోయింది. " ఈ నేత్రాలెన్నడు సాధువులను దర్శించినవి కావు. కనుక తినరాదని" అన్నాడు. అప్పుడా నక్క కాళ్ళను తిందామనుకుంది. అది గ్రహించి, " ఆ కాళ్ళు ఏనాడు మానవులను భవసాగరమునుంచి తరింప సజ్జనులను, తీర్ధాలను దర్శించి ఎరుగవు. కావున తినడానికి తగినవి కావని" అన్నాడు. 

మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అదీ తినకూడనిదేనని మహర్షి చెప్పాడు. అప్పుడా నక్క కనీసం తలనైనా తిని తన పొట్ట నింపుకొందామనుకుంది. బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది. అదీ  తినేందుకు తగింది కాదని మహర్షి వారించాడు. మహర్షి ఆ నక్కకు తన ఆశ్రమంలోని కందమూలములు ఇచ్చి దాని క్షుద్భాధ తీర్చి పంపాడు. 

" సత్యవాది, ధర్మాత్ముడు, సదాచారశీలి . సౌశీల్యమూర్తిగా మనిషి మెలగితేనే మానవధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినట్లు " అని ఈ కధ ద్వారా మనం గ్రహించాల్సినది.

--((**))--




శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0801)
(శ్రీ శేషప్ప కవి)
.
సీ|| తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడివేళ
నీ స్వరూపమును ధ్యానించునతఁడు
నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని,
యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు;
పరమసంతోషాన భజనఁ జేసెడి వాని
పుణ్య మేమనవచ్చు భోగిశయన !
మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య నళిననేత్ర !
.
తే|| కమలనాభుని మహిమలు కానలేని
తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్న
భిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,
తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని
యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,
దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు
జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు
ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,
మేలుకలిగినఁ జాల మిణుఁకుచుండు,
.
తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును
భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


Sunday 7 April 2019

శివుడు గరళ

ఓం శ్రీ రాం   శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణయాణమ:
ప్రాంజలి ప్రభ - ఆధ్యాత్మిక  ప్రభ 
Ngắm nhìn những trái tim tình yêu đập rộn ràng, lung linh tỏa sáng với tải hình nền tình yêu lấp lánh tuyệt đẹp nào!
సర్వేజనా సుఖినోభవంతు






సుభాషితాలు !


గుణ దోషౌ బుధో గృణ్హన్ ఇందు క్ష్వేడా వివేశ్వరః 
శిరసా శ్లాఘ్య తే పూర్వం పరం కంఠే నియచ్ఛతి!

శివుడు గరళమును కంఠము నందుంచు కొని,  చంద్రకళను శిరమున ధరించినట్లుగా పండితుడైనవాడు పరుల దోషములను లోపలే వుంచుకొని, గుణలేశములను శిరసావహిస్తాడు. 

సతాం ధనమ్ సాధుభి రేవ భుజ్యతే 
దురాత్మభి రుదుశ్చరితా త్మనామ్ ధనం
శుకాదయ శ్చూత ఫలాని భుజంతే 
భవంతి నింబా: ఖలు కాకభోజనాః

మంచివారి సంపదలు మంచివారికే అనుభవానికి వస్తాయి. దురాత్ముల దానములు దుష్టచరిత్రులకే వినియోగ పడతాయి. మామిడిపండ్లను చిలుకలు ఆరగిస్తాయి. వేపపండ్లు కాకులకే భుక్తం అవుతాయి.
ఇది లోకములో జరుగుతూనే వున్నది.కదా!

మనసులో సద్గుణాలను బాగా వృద్ధి చేయండి, నేల దున్ని కలుపు తీయండి బుద్ధిని మధించి పాపాలనే కలుపు మొక్కల్ని తరిమి వేయండి. 
భుక్తి కై అన్ని విధాలా కృషి చేయండి ముక్తి కై సర్వ విధాల పాటు పడండి.

తన రహస్యము నోకనితో చెప్పి మరల నితరులకు చెప్ప వలదని హెచ్చరించు కంటే చెప్పక యుండుట కరము మేలు నాల్క దాటిన మాటలు నగరు దాటు మామూలుగా లోకం లో చాలా మంది రహస్యమని 
ఒకరితో చెప్పి ఇంకెవరికీ చెప్ప వద్దని చెప్తూ వుంటారు.

మన తెలుగులో ఒక సామెత వుంది
"పెదవి దాటితే పృథ్వి దాటుతుంది" అని  అందుకని చెప్పకుండా ఉండడమే మేలు కదా!
--((***))--

శ్రీ ఆదిశంకరుల విరచిత కాశీ విశ్వనాథాష్టకం
🕉ఓం శ్రీమాత్రే నమః 🕉

అద్వైత చైతన్య జాగృతి
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం 
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 ||

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 ||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 ||

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 ||

పంచాననం దురిత మత్త మతంగజానాం 
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 ||

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 ||

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 ||

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 ||

వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||

--((**))--

కాశీవిశ్వనాథాష్టకం -తాత్పర్యం
*******************
గంగాధరుడు 
************
గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం:
************
గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః
వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం
వామేన విగ్రహ వరేణ కళత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
పదములకు, వర్ణనకు అందని అనేక గుణాలు కలిగిన స్వరూపంతో ఉన్న, బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలచే సేవించబడిన పాదములు కలిగిన, తన ఎడమ వైపు శుభములు కలిగించే పార్వతిని కలిగి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

పులిచర్మము ధరించిన శశిధరుడు
భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకుశాభయ వర ప్రద శూల పాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
సమస్త భూతములకు అధిపతియైన, సర్పములను ఆభరణంగా కలిగిన, పులిచర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము (తాడు), అంకుశము, త్రిశూలము ధరించిన, అభయము, వరాలను ప్రసాదించే, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నెలవంక సిగపూవు నవ్వగా

శీతాంశు శోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచ బాణం
నాగాధిపారచిత భాసుర కర్మ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
చల్లదనాన్ని ఇచ్చే చంద్రుని కిరీటముగా కలిగి భాసిల్లుతున్న, తన ఉగ్రనేత్రముతో మన్మథుని దగ్ధము చేసిన, నాగేంద్రుని కర్ణములకు అలంకారముగా ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

రౌద్రమున, ఆనందమున తాండవము
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
మదించిన ఏనుగులపాలిటి సింహంలా ఉన్న, అసురులపాలిటి గరుత్మంతుని వలె ఉన్న, మరణాన్ని, శోకాన్ని, వృద్ధాప్యాన్ని నాశనం చేసే అగ్నిలా ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

నిరంజనుడు, నిర్గుణుడు

తేజోమయం సుగుణ నిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
తేజస్సు కలిగి, సుగుణములు కలిగి, గుణములు లేని, వేరే సాటిలేని, ఆనందకారకుడైన, ఓటమి ఎరుగని, తర్కానికి అందని, సర్పములకు ఆత్మయై, అన్ని శుద్ధ స్వరూపములు తానేయై, ఆత్మ స్వరూపుడైన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

సచ్చిదానందుడు

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ
ఆదాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************

ఏ కోరికలూ లేనివాడైన, దోషములు ఎంచని, నింద చేయని, పాపములకు దూరముగా ఉండి సమాధి స్థితిలో ఉన్న హృదయకమలము మధ్యలో నివసించి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

గరళ కంఠుడు

రాగాది దోష రహితం స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహయం,
మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
**************
రాగద్వేషాది దోషములు ఎరుగని, తన భక్తులను ప్రేమతో చూసే, వైరాగ్యము, శాంతికి నిలయమై, హిమవంతుని పుత్రిక సహాయం పొందుతూ, మాధుర్యము, ధైర్యము కలిగి విషాన్ని ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము

ఫలశ్రుతి:
***********
వారాణసీ పురపతే స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం

తాత్పర్యం:
************
వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని అష్టకాన్ని పఠనం చేసే మనుష్యులకు దేహమున్నప్పుడు విద్య, మంచి, ఎనలేని సుఖము, అనంతమైన కీర్తి, అటు తర్వాత మోక్షము లభించును.

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

తాత్పర్యం:
************
ఈ విశ్వనాథ అష్టకం శివుని సన్నిధిలో చదివిన వారికి శివలోకము, ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదురు.
అంతర్యామి - అంతయును నీవే

--((**))--

🕉 *లింగాష్టకం యొక్క అర్థం*🕉

 *బ్రహ్మమురారిసురార్చిత లింగం* 

బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!

 *నిర్మల భాషిత శోభిత లింగం* 

నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!

 *జన్మజ దుఃఖ వినాశక లింగం* 

జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!

 *తత్ ప్రణమామి సదాశివ లింగం* 

ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!

 *దేవముని ప్రవరార్చిత లింగం* 

దేవమునులు మహా ఋషులు పూజింప లింగం..!!

 *కామదహన కరుణాకర లింగం* 

మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!

 *రావణ దర్ప వినాశక లింగం* 

రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *సర్వ సుగంధ సులేపిత లింగం* 

అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!!

 *బుద్ధి వివర్ధన కారణ లింగం* 

మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!

 *సిద్ధ సురాసుర వందిత లింగం* 

సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *కనక మహామణి భూషిత లింగం* 

బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!

 *ఫణిపతి వేష్టిత శోభిత లింగం* 

నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం..!!

 *దక్ష సుయజ్ఞ వినాశక లింగం* 

దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *కుంకుమ చందన లేపిత లింగం* 

కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం..!!

 *పంకజ హార సుశోభిత లింగం* 

కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం..!!

 *సంచిత పాప వినాశక లింగం* 

సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *దేవగణార్చిత సేవిత లింగం* 

దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం..!!

 *భావై ర్భక్తీ భిరేవచ లింగం* 

చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం..!!

 *దినకర కోటి ప్రభాకర లింగం* 

కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

 *అష్ట దలోపరి వేష్టిత లింగం* 

ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం..!!

 *సర్వ సముద్భవ కారణ లింగం* 

అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం..!!

 *అష్ట దరిద్ర వినాశక లింగం* 

ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం..!!

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!

 *సురగురు సురవర పూజిత లింగం* 

దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం..!!

 *సురవన పుష్ప సదార్చిత లింగం* 

దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!

 *పరమపదం పరమాత్మక లింగం* 

ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము

 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 

నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!

 *లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ* 

ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది..!!

*శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే* 

శివ లోకం లభిస్తుంది ..!!
శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది. 

⚜సర్వేజనా సుఖినో భవంతు..⚜
--((***))--

Image may contain: 1 person, smiling