Monday 30 April 2018

Pranjali prabha -(1-05-2018)


  ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
  (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం 



నేడు కార్మిక దినోత్సవము (మే డే ) సందర్భముగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు
    

నేటి పద్యం - జీవన జ్యోతి 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

కలలు రేపగనేల కలువ పూబాల   -  పలకవే చిలకా మనసుకు శాంతి నిలపవే 
కళలు చూపగనేల మనసు  పూబంతి  -  కలవవే  మొలకా  మమతకు కాంతి నిలపవే 
వలపు పండుగవేళ తలపు ఓహీల -  కలతలా తగునా  పలుకుల బ్రాంతి వదలవే 
కనుల వెల్గులలోన నిజము చూపాలి -  తనువుయే తపమే తరుణికి సేవ తలుచుటే         

కలలు కళ్లలవుతాయి, మన:శాంతి కరువవుతుంది ఎందుకంటే అందమైన కలువబాల, కాంతి వంతము చేసుకొనేందుకు కలవవచ్చు,  మనసు నీ కళలతో మా మాటలను పంచవే పూబంతి. పండుగనాడుకూడా కలత చెందక భ్రాంతి వదలవేం ఓ హీల.  తనువూ తపము కనుల వెల్గులలో నిజము చూపి తరుణి సేవ లందుకొనుటే కదా  
--((*))--     

నేటి హాస్యం

స్కూటర్ మీద భార్య భర్తలు సినిమాకు  ప్రయాణిస్తున్నారు.

భర్త : నేను నడుప్తు నప్పుడు జాగర్తగా కూ ర్చోవటం నేర్చుకో అన్నాడు
భార్య : ముందు స్పీడ్ బ్రేక్ ఉంది జాగర్త చూసుకో  అన్నాది
భర్త : నడిపేది నేను స్కూటర్  ను ఆపి మరీ అన్నాడు
భార్య : మహాను భావ జాగార్తాగా నడుపూ అన్నది
భర్త : మహానుభావు డెవరే
భార్య : ఎవరో ఉన్నారులే ముందు నడుపు

సినిమా నుండి ఇంటికి చేరారు   
భర్త: భోజనం చేస్తూ కూరలో ఉప్పులేదే అన్నాడు
భార్య : వంట విషయంలో వేలు పెట్టకండి ఇది మాకు సొంతం
భర్త : మహా స్త్రీ  నీ ఒక్కసారి తిని చెప్పమ్మా 
భార్య : ఆవిడెవరు
భర్త ఎవరో ఉన్నారులే ముందు వడ్డించు
.....  
ఆ     .........      ఆ     .......



కంప్యూటర్ల  వ్యాధుల నివారణ వినండి ఒకరో ద్వారా 

Sunday 29 April 2018


తేనె లొలుకు తెలుగు వెల్గు కళల పంట
ఆన తీయును ధైర్యము నరుల వెంట
వాన మళ్లెను హృదయము సిరులు చెంత
లోన షరతులు లేవుగా బతుకు నంత
  
కాన రానట్టి రచనలు తెరల మునుగు
మీన మీసాలు చూపిన ఫలిత మేది
తాన తందనా అన్నను బతక లేవు
వీణ మీటియు నాదము తెల్ప లేవు



నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రజలు ప్రభ - మేడే
ద్రాచాయట: మల్లాప్రగడ రామకృష్ణ

దున్నే నాగలి, చేను కోసే కొడవలి కను మరుగైనాయి
 -  నారుపోసి నీరుపెట్టె మనుషులు కరువైనారు 
ఆశా చావదు గొప్ప కోసం కొదువకు పొయి మలుపైనాడు
 -  గాలి మాట బట్టి కరిగిన మనసైనాడు

శ్రీ శ్రీ - సిరిసిరిమువ్వా!
సాహితీమిత్రులారా!
శ్రీశ్రీ పద్యాలు రాయలేదని కొందరు
కేవలం గేయాలే రాశాడని అపోహలో ఉన్నారు.
అది సత్యంకాదు.
శ్రీశ్రీ పద్యాలు చూడండి.
ఇవి అన్నీ కందపద్యాలే. సిరిసిరిమువ్వా మకుటంతో రాశారు.
"పందిన చంపిన వాడే
కందం రాయాల" టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా రా
సేందు కయో షరతులేల సిరిసిరిమువ్వా!
కుర్చీలు విరిగిపోతే
కూర్చోడం మాననట్లు గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే
చేర్చదగునొకింత చెత్త సిరిసిరిమువ్వా!
అవురా! శ్రీరంగం శ్రీ
నివాసరావూ, బలే మనిషివే, ఇక నీ
కవితా వాద్యం చాలిం
చి వెళ్ళి పొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా!
"దెయ్యాలను చూపిస్తా
నయ్యా!" రమ్మనుచు నొక్క ఆసామీ నా
కయ్యో, తన కూతుళ్ళను
చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా!
నాకేమో లోకంలో
కాకవులే కానరారు, కవిదూషణ న
న్నాకర్షించదు, రచనో
త్సేకాన్నే మెచ్చుకొండు సిరిసిరిమువ్వా!
తెగకుట్టి వదలి పెట్టిన
వగణిత వైడాగు దోమలశ్వత్థామల్
పొగరెక్కిన రెక్కేన్గులు
సెగలెగసెడు తమ్మముళ్ళు సిరిసిరిమువ్వా!
బారెట్లా అయితే సాం
బారెట్లా చెయ్యగలడు? భార్య యెదుట తా
నోరెట్లా మెదలించును?
చీరెట్లా బేరమాడు? సిరిసిరిమువ్వా!
నాలాగ కందబంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్ సద్గీతా
లాలపించే కవితా
శ్రీలోలుడు నహినహీతి సిరిసిరిమువ్వా!
తొందరగా చిందరగా
వందరగా పరుగులెత్తు వాళ్ళకు వేరే
గందర భూగోళంలో
చిందుల చదివింతలేల సిరిసిరిమువ్వా!
----------------------------------------
- ఏ.వి.రమణరాజు



గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :-
పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .
ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు .
1.పాగేలమ్మ
2.ముత్యాలమ్మ
3 .గంగమ్మ
4.గంగానమ్మ
5.బంగారమ్మ
6.గొంతెమ్మ
7.సత్తెమ్మ
8.తాళమ్మ
9.చింతాలమ్మ
10.చిత్తారమ్మ
11.పోలేరమ్మ
12.మావుళ్లమ్మ
13.మారెమ్మ
౧౪.బంగారు బాపనమ్మ
15.పుట్టానమ్మ
౧౬.దాక్షాయణమ్మ
17.పేరంటాలమ్మ
18.రావులమ్మ
19.గండిపోచమ్మ
20.మేగదారమ్మ
21.ఈరినమ్మ
22.దుర్గమ్మ
23.మొదుగులమ్మ
24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )
25.మరిడమ్మ
26.నేరెళ్లమ్మ
27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )
28.మాచరమ్మోరు
29.మద్ది ఆనాపా అమ్మోరు
30.సొమాలమ్మ
31.పెద్దయింట్లమ్మ
32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )
33 .అంబికాలమ్మ
34.ధనమ్మ
35.మాలక్షమ్మ
36.ఇటకాలమ్మ
37.దానాలమ్మ
38.రాట్నాలమ్మ
39.తలుపులమ్మ
40.పెన్నేరమ్మ
41.వెంకాయమ్మ
42.గుణాళమ్మ
43.ఎల్లమ్మ (విశాఖపట్నం )
44.పెద్దమ్మ
45.మాంటాలమ్మ
46.గంటాలమ్మ
47.సుంకులమ్మ
48.జంబులమ్మ
49.పెరంటాలమ్మ
50.కంటికలమ్మ
51.వణువులమ్మ
52.సుబ్బాలమ్మ
53.అక్కమ్మ
54.గనిగమ్మ
55.ధారాలమ్మ
56.మహాలక్షమ్మ
57.లంకాలమ్మ
58.దోసాలమ్మ
59.పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )
60.అంకాళమ్మ .
61.జోగులమ్మ
62.పైడితల్లమ్మ
63.చెంగాళమ్మ
64.రావులమ్మ
65.బూరుగులమ్మ
66.కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )
67.పోలమ్మ
68.కొండాలమ్మ
69.వెర్నిమ్మ
70.దే శిమ్మ
71.గరవాలమ్మా
72.గరగలమ్మ
73.దానెమ్మ
74.మహాంకాళమ్మ
75.వేరులమ్మ
76.మరిడమ్మ
77.ముళ్ళ మాంబిక
78.యలారమ్మ
79.వల్లూరమ్మ
80.నాగులమ్మ
81.వేగులమ్మ
82.ముడియలమ్మ
83.రేణుకమ్మ
84.నంగాలమ్మ
85.చాగాలమ్మ
86.నాంచారమ్మ
87.సమ్మక్క
88.సారలమ్మ
89.మజ్జిగౌరమ్మ
90.కన్నమ్మ -పేరంటాలమ్మ
91.రంగమ్మ -పేరంటాలమ్మ
92.వెంగమ్మ -పేరంటాలమ్మ
93.తిరుపతమ్మ
94.రెడ్డమ్మ
95.పగడాలమ్మ
96.మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )
97.కుంచమ్మ విశాఖపట్నంలో
98.ఎరకమ్మ
99.ఊర్లమ్మతల్లి
100.మరిడమ్మ
101.సుంకాలమ్మవ్వ ఉన్నారు .
నుసకపల్లి ,పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .
1.నుసకపల్లమ్మ
2.వెలగలమ్మ
3 .ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )
4.పైళ్లమ్మతల్లి
5.బల్లమ్మతల్లి
6.లొల్లాలమ్మతల్లి
7.ఊడలమ్మ తల్లి
8.కట్వాలాంబిక
9.నాగాలమ్మ నాంచారమ్మతల్లి
10.సింగమ్మతల్లి
11.ఘట్టమ్మతల్లి
12.అంజారమ్మతల్లి .
౧౩. మంత్రాలమ్మ తల్లి
౧౪.పాతపాటేశ్వరి తల్లి
౧౫.కుంకుళమ్మ ద్వారకా తిరుమల
౧౬.చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా
అలాగే ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .
అలాగే మికు తెలిసిన గ్రామదేవతలు పేర్లు ఉంటే పెట్టగలరు .
***జై అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు జై


Thursday 26 April 2018

Pranjali prabha - 28-04-2018


ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
  (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం  


సర్వేజన సుఖినోభవంతు 

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరికి ఒక శక్తి 
అదే మనుష్యులను ఉత్తేజ పరిచే యుక్తి 
అందుకే ఉండాలి  జీవుని నిరంతరం భక్తి
తల్లి తండ్రుల పాద సేవే అందరికీ  ముక్తి  

అదే మనకు కలిగించును దివ్యాను రక్తి 
జగత్ యొక్క నిజతత్వాన్ని తెల్సుకొనే శక్తి 
సత్యం శివం సుందరం అని  తల్చటమే భక్తి
ఇదే మాయా బ్రమలను తొలగించే ముక్తి 

విడదీయరాని భంధంగా కలవటమే రక్తి 
వ్రుర్తి - ప్రవుర్తి ధర్మ భద్దంగా ఉంటేనే ముక్తి 
కాల  గమ్యం బట్టి ఉంటేనే ఉండు శక్తి 
నిత్యకర్మలతో  నామ జపమే నిత్య భక్తి   

ప్రణయ  ప్రాధాన్యాన్ని రక్షించేది రక్తి 
వినయ విధేయతను పెంచేది ముక్తి 
మన: శాంతితో ధైర్యాన్ని ఇచ్చేది శక్తి 
మనుగడకు సహాయంగా ఉండేది భక్తి   


--((*))--

నేటి పద్యం జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ 
రచయత:మల్లాప్రగడ రామకృఫ్ణ

కర్తవ్యం ఉంటే ఉండు మనో నిబ్బరం
 - మానవత్వానికి అదే ఆదర్శం

భాందవ్వం ఉంటే ఉండు జన్మ విశ్రుతం -
బంధుప్రీత్వానికి అదే అణ్యూణ్యం.

స్త్రీ తత్వం ఉంటే ఉండు ప్రేమ మిశ్రితం
సౌలభ్యత్వానికి అదే మాత్రృత్వం

కారుణ్యం ఉంటే ఉండు దైవ కల్పితం
కార్యసమ్మోహని అదే జీవత్వం


కర్తవ్యాన్ని గుర్తించే మనో నబ్బర శక్తిని పెంచే మానవాభ్యుదయం ఉండాలి.

బందుత్వం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటేనే బాంధవ్వం పెరుగుతుంది.

స్త్రీ గా ఉండి స్త్రీ ప్రేమ నందించి మాత్రృత్వం పొంది జీవ సాఫల్యం పొందాలి.

దైవ సంకల్పం ప్రకారంగా ప్రతిఒక్కరు మోహానికి లొంగి కరునకు చిక్కి జీవితం సాగించాలి
--((*))--



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రేమతో - ప్రేమ లేఖ (3)

రాధా మన పెళ్లి కాకముందు జరిగిన సంఘటనను ఇదిగో మెసేజ్ గా నీకు గుర్తు చేస్తున్నాను, ఒక్కసారిగా ౩౦ సంవత్సరాలు వెనక్కి పోయి ఇప్పుడు వ్రాస్తున్నాను, నేను వ్రాసిన లేఖలో ఏదన్న మరచి పోయినా నీ లేఖలో నాకు తెలుప గలవు, మన ప్రమ లేఖలు మనల్ని ఇంతకాలం బ్రతికిస్తున్నాయి.మన తీపి జ్ఞాపకాలు మన పిల్లలు చదువుకొని నవ్వుకుంటారో మరి ఏమో నాకు మాత్రం తెలియదు . 

ఆనాడు నీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తు ఉన్నది, నేను గుంటూరులో ఉన్నప్పుడు నీవు ,మాప్రక్క ఇంటిలో కొత్తగా అద్దెకు మీరు  వచ్చారు గుర్తున్నదా, అవును నీవు మరచి పోయి ఉంటావు ఆసంఘటన ఇప్పుడు మరలా గుర్తు చేస్తున్నందుకు ఏమి అనుకోకు.
అప్పుడు మీ అక్కకు పెళ్లి కుదిరింది అప్పటికి నివయసు 14 సంవత్సరములు చిన్న చిన్న లంగాలు వేసుకొని, కాళ్లకు పట్టాలు పెట్టుకొని, చెవులకు దిద్దులు పెట్టుకొని, లంగా పైకెత్తుకుని కోడె దూడ ఎగిరినట్లు ఎగురుతున్న విషయం నన్ను కవ్వించిన విషయం ఏనాటికి మరవలేను, ఆ పరుగులే నాలో ఎదో కలవరింతలు రేపినవి.

 అప్పుడే నాదగ్గరకు వచ్చి మాధవ్ నాకు జామకాయ కోసి పెట్టవా అని అడిగావు, అంతే అంతే ఒక్క గంతులో హనుమంతునిలా ఎగిరి జామకాయ కోశాను గుర్తున్నదా, పెట్టు పెట్టు అన్నప్పుడు, అప్పుడే కాకి ఎంగిలి అని గుడ్డ అడ్డం పెట్టి కొరికి మరీ ఇచ్చాను, పెదాలు రుచి ఎంత బాగున్నది అన్నావు, అప్పుడే అనాలోచనముగా వెంటనే బుగ్గను ముద్దు పెట్టుకొని పరుగెత్తాను, అప్పడే భామ్మా అంటూ ఏడుస్తూ లోపలకు వెళ్లి ఎదో చెప్పావు, అప్పుడు ఏమి జరిగిందో నాకు తెలియదు నీకు గుర్తుందో వ్రాస్తే సంతోషిస్తాను.

బామ్మ అరుస్తున్నది పక్కింటి పిల్లగాడు ఖాళీగా ఉన్నాడేమో ఒక్కసారి పిలువు అని రాధను పురమాయించింది.
మాధవ్ మాధవ్ అంటూ గోడకు వెనుకాల నుండి మెల్లగా పిలిచావ్.తర్వాత గట్తిగా పిలిచావు.  
అప్పుడు నాలో వణుకు పుట్టింది, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, చమట పట్టేసింది, ఎం చెప్పిందో రాధ, నాకు ఈరోజు ఎదో జరగ పోతుంది, ఎం ఝరిగినా రాధ కోసం వేచి ఉండాలి, రాధ పిలుస్తున్నది కనుక పోవాలి అని నెమ్మదిగా బామ్మ దగ్గరకు వచ్చాను.

ఏమిటిరా అలా దిక్కులు చూస్తావు అని ఘర్జించింది బామ్మ , అయోమయం పక్షిలాగున్నావు, ఏమిటి ఆ బిత్తర చూపులు, నిన్నెవరు కొరుక్కు తినటంలేదు, వేధించటం లేదు ఇక్కడ, చలికి వణికి నట్లు వణుకుతూ ఏమిటి అలా కార్చుకున్నావు,  పోయి డ్రస్సు మార్చుకొని రా అన్నాది బామ్మ అప్పటికి కానీ నేను ఏం చేసానో తలచుకొని చాలా సిగ్గు పడ్డాను, అక్కడ ఉండక వెంటనే వెనక్కు వచ్చా,

బామ్మ అరుపులు విన్న ఏమన్నదో తెలియదు, పనివారు లోపలకొచ్చి గుడ్డతో తుడిచినట్లు నేవే ఒకసారి చెప్పి బాల్య చేష్టలు అని చెప్పి నన్ను ఉడికించిన విషయం నాకు ఇంకా గుర్తు ఉన్నది, అదికూడా పెళ్లైన మొదటి రాత్రిలో గుర్తు చేసికొని మరి నవ్వుకున్నాము.

ఒకనాడు నీవే నాదగ్గరకొచ్చి చిల్లు గారే తింటావా అన్నావు, నాకొద్దులే అన్నాను, అప్పుడే వేలుకి గుచ్చుకొని నాదగ్గరకొచ్చి తిను మాధవా అంటూ వేలు అందించావు, అప్పుడే నీ వేలును కూడా కొరికాను,  అప్పడే నీకు పిచ్చి కోపము వచ్చి నన్ను నాలుగు ఉతికి మరీ ఏడుస్తూ పోయావు.

అప్పుడు బామ్మకు చెపుతావని అనుకున్నా, కానీ అట్లు చేయక గారెలు బూరెలు కవర్లో తెచ్చి నీవు తిను నీమీద నాకు కోపము లేదే అంటూ నవ్వుకుంటూ జడ తిప్పుకుంటూ వెళ్ళటం నాకు ఇంకా గుర్తు ఉన్నది.

నాకింకా గుర్తుంది రాధా, నీవు పుట్టినరోజు పండుగగా బుట్టఁగౌన్ వేసుకొని కేక్ కట్ చేస్తూ కొంత వంటిమీద పడేసు కొనగా మీ బామ్మా అక్షంతలు వేయగా తర్వాత గౌన్ కడుగు కొనుటకు బాత్ రూంలో చేరగా అక్కడ సబ్బుపై కాలుమోపి పెద్దగా కేకవేసి క్రింద పడ్డావు, అప్పుడే బామ్మ మాధవ్ నీవు వెళ్లి చూడు అన్నప్పుడు వెంటనే పరుగెత్తి బాత్ రూంలో చేరా నీ పరిస్థితిని నాకు భయం ఏర్పడినది అప్పుడే బామ్మను పిలిచా బామ్మ బాత్ రూమ్ లో రాధను చూసి ఓరై నీవు ఆటుపోరా నేను రాధను తెస్తాను అన్న మాటలు ఇంకాగుర్తు ఉన్నాయి. 

నీవు పుష్పావతి అయినట్లు గమనించి చీరకట్టించి పెద్ద బంతి ఏర్పాడు చేసి భోజనాలు ఏర్పాటు చేసి అనై దీవెనలు ఇప్పించి నన్ను మాత్రం ఆనాటి నుండి ఓర చూ పులతో ఉడికించి, కొత్త అందాలతో ఎగసి పడుతున్న విషయాలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్న ఇంకా వ్రాయాలని ఉంది, కానీ ఆనాటి అనుభవాలు నీవు వ్రాస్తావని నా వ్రాతలు ముగిస్తున్నాను.   
written by Malapragada RamaKrishna
  --((*))--
                                   
ఓం శ్రీ మాత్రేనమః

శ్రీ దుర్గా సూక్తమ్

ఓం || జాతవే’దసే సునవామ సోమ’ మరాతీయతో నిద’హాతి వేదః’ |
స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా’ నావేవ సింధుం’ దురితా‌உత్యగ్నిః ||

తామగ్నివ’ర్ణాం తప’సా జ్వలంతీం వై’రోచనీం క’ర్మఫలేషు జుష్టా”మ్ |
దుర్గాం దేవీగ్‍మ్ శర’ణమహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ ||

అగ్నే త్వం పా’రయా నవ్యో’ అస్మాంథ్-స్వస్తిభిరతి’ దుర్గాణి విశ్వా” |
పూశ్చ’ పృథ్వీ బ’హులా న’ ఉర్వీ భవా’ తోకాయ తన’యాయ శంయోః ||

విశ్వా’ని నో దుర్గహా’ జాతవేదః సింధున్న నావా దు’రితా‌உతి’పర్-షి |
అగ్నే’ అత్రివన్మన’సా గృణానో”‌உస్మాకం’ బోధ్యవితా తనూనా”మ్ ||

పృతనా జితగ్ం సహ’మానముగ్రమగ్నిగ్‍మ్ హు’వేమ పరమాథ్-సధస్థా”త్ |
స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా క్షామ’ద్దేవో అతి’ దురితా‌உత్యగ్నిః ||

ప్రత్నోషి’ కమీడ్యో’ అధ్వరేషు’ సనాచ్చ హోతా నవ్య’శ్చ సత్సి’ |
స్వాంచా”‌உగ్నే తనువం’ పిప్రయ’స్వాస్మభ్యం’ చ సౌభ’గమాయ’జస్వ ||

గోభిర్జుష్ట’మయుజో నిషి’క్తం తవేం”ద్ర విష్ణోరనుసంచ’రేమ |
నాక’స్య పృష్ఠమభి సంవసా’నో వైష్ణ’వీం లోక ఇహ మా’దయంతామ్ ||

ఓం కాత్యాయనాయ’ విద్మహే’ కన్యకుమారి’ ధీమహి | తన్నో’ దుర్గిః ప్రచోదయా”త్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||



శ్రీనివాసమూర్తి గంజాం గారికి ప్రాంజలి ప్రభ తెలుగు ప్రజలకు అందించినందుకు అభినందనలు.   


11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
 ( మృత్యు భయమువలన) 

12. జీవన్మృతుడెవరు? 
(దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు) 

13. భూమికంటె భారమైనది ఏది?
 (జనని) 

14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
 (తండ్రి) 

15. గాలికంటె వేగమైనది ఏది? 
(మనస్సు) 

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? 
( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది) 

17. తృణం కంటె దట్టమైనది ఏది? 
(చింత) 

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? 
(చేప) 

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
 ( అస్త్రవిద్యచే) 

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?

 ( యజ్ఞం చేయుటవలన) 

Pranjali Prabha (27-04-2018)

ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
  (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం  


సర్వేజన సుఖినోభవంతు 
ఈరోజు  జూపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాక్షలు 

అల్లరితో, ఆకర్షణతో, అనుకోని ఆనందంతో 
ఆకతాయితనముతో,  కొత్త కొత్త మాటలతో
సరదా కబుర్లతో, వింత వింత కోరికలతో 
అమ్మ కొంగు వీడని బిడ్డలా,  కోరికతో అలకలా 
కోపాలను మరిచి కొత్త కొత్త ఆలోచనల కళా 
నైపుణ్యముతో రంగ రంగ వైభవముగా 
అందరికి ఆనందం పంచుతూ  నలుగురూ 
బాగుండాలని అమాయకత్వముతో ఉన్న 
కొత్త బట్టలు ధరించి ఉన్న, తల్లి తండ్రుల దీవెనలను 
పొందు తున్న ప్రతి ఒక్కరికి ప్రాంజలి ప్రభ 
తరుఫున అందరికి శుభాకాంక్షలు 


నేటి పద్యం (జీవన జ్యోతి )
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

నవ్వుల పువ్వుల మాలను వాడ నీకు -  అడుగులు జారనీకు నీ వెప్పుడు     
అర్ధపు ప్రార్ధన  ఎప్పుడు  మార  నీకు -  మనసును మారనీకు నీ విప్పుడు
స్వార్ధము కోపము ఎప్పుడు వద్దు నీకు -  మమతను  జాలిచూపు నీ  ఒప్పుడు 
నిత్యము నూత్నము  ఎప్పుడు జార నీకు -  కలయిక  ఓర్పు చూపు నీ కాలమె   



నిత్యము నవ్వులు ఇంటిలో ఉంటె ఆయిల్లు స్వ ర్గమని పెద్దలు అన్నారు, ఇంటి ఇల్లాలు అడుగు జారకుండా, ఇతరులను జార నీకుండా ఎప్పుడు ఉండాలి. మనసు మనసులో  ఉంచుకొని ప్రార్ధన ఫలితము ఉంటుందని గమనించాలి,    మమతా జాలి ఉన్న చోట స్వార్ధము, కోపము దరిదాపుల్లోకి రావు . ఒకరికొకలు కలిసికొని నిత్యం నూతన ఆలచనలతో ఉండుట నిజమైన ఓర్పు అందరికి.   
    

ప్రేమతో - ప్రేమ లేఖ (2)


నీ మెసేజ్ అందింది, నాలో కలవరం మొదలైనది, నీకు మెసేజ్ పంపాలని తాపత్రయం పెరిగింది, ల్యాబ్ టాప్ తీసాను, నాకు తెలిసిన విధముగా ప్రేమ లేఖను వ్రాస్తున్న, నీకు నచ్చుతుందని నేను ఆశిస్తా, నీ రూపు రేఖలు నా కాంతిలో చిక్కి ఉన్నాయి. నాప్రేమ నంతా రంగరించి, నిన్ను మరువ లేక, నేను ఉండలేక వ్రాస్తున్నాను, ఇదే నాకు కొంత మన:శాంతి.

పరిమళించే పరువపు రెమ్మవు, ఎమన్నా పట్టించుకోక తనువును అర్పించిన బొమ్మవు, రతిని మించిన రసరూపమ్ము చూపించి తన్మయ పరిచే అతిలోక దివ్య సుందరివి, పలుక నేర్చిన చిలుకవు, నడక నేర్చి, నాట్య మాడే, పలకరించి నాట్య మయూరివి, కనులతో కవ్వించి, పెదాలతో పలకరించి, నడకను వయ్యారంగా చూపించి, జడ తిప్పుతూ కదిలే వయ్యారివి.

నిన్ను అర్ధం చేసు కోవటానికి చాలదు నాజీవితం, త్రిగుణాల సమ్మేళనమే నీ గుణం, మొగవాడ్ని గుప్పెట్లో పెట్టుకొనే బ్రహ్మాస్త్రం ఉన్నదానివి, అలసి వచ్చిన వానికి సేద తీర్చే నీలో ఉంది కరుణాస్త్రం,  గాలిద్వారా మనసును ఆకర్షించి చిరు నవ్వును చూపి మనసును దోచే పవనాస్త్రం ఉన్నదానివి, ఎన్ని కష్టాల్లో ఉన్న మనసును రంగ రించి, మొహాన్ని పంచే సమ్మోహనాస్త్రం ఉన్నదానివి, అన్ని సమయములలో ఓర్పు వహించి ఓదార్పు చూపించే సహనాస్త్రం గలదానివి, ఇట్లా ఎన్నో అస్త్రాలు నీలో నిండి ఉన్నాయి. అందుకే నేను నిన్నుఅంటాను  సర్వాస్త్ర సుందరివి.

చీకట్లో కూడా కనిపించే తెల్లని మంచు తెరగల దేహంగా, తళ తళా మెరుస్తూ నిలకడగా ఉన్న నదిగా, వెచ్చని వేడి నందించి చల్లని మనసుకు హాయిగా , ఆహ్లదంగా, ఊరట కల్పించే దిశగా, నిశ్చలముగా, నిర్మలంగా, నిలకడగా స్వశ్చంగా సుఖాన్ని అందించే నా కలల సుందరివి.

అంటూ ప్రేమ లేఖను (మెసేజ్)  రాధకు వ్రాసాడు మాధవ్

ఆ మెసేజ్ చూసి రాధ మాధవ్ కు మెసేజ్ పెట్టింది.
నవమన్మధాకారా రూపంతో, ధ్రుడకాయముతో, ఆరడుగుల ఎత్తుతో తెల్లని పంచ లాల్చీ ధరించి, చేతులకు ఉంగరాలతో, మేడలో బంగారు గొలుసుతో నా మనసునుని దోచిన నటనాగ్రేసుడవు నీవు, నా ఊహలన్నీ నీమీదే
నీమాటలకు చిక్కి నీవు ఆడమన్నట్లుగా ఆడి, నీకు ఉల్లాసము కల్పించి ఉత్సాహము పెంచి, సమయాన్ని సద్వినియోగము గా శకలం అర్పించాను ఆనాడు, ఆతీపి గుర్తులే నాకు బంధువులు.

నన్ను అస్త్రాలతో పోల్చి మూలగచెట్టు ఎక్కించావు ఎందుకు, నేను ఎప్పుడు నీమాట జవదాట లేదు, నేనెప్పుడూ నీ నీడగా వెనకాలే ఉండేదాన్ని, ఒక చెట్టులాగా ఎదిగి చెట్టు చేసిన ఉపయోగాలన్నీ నేను నీకు చేసాను. కాలంతో మారకుండా నాకోసం వేచిఉన్నావని సంతోషముగా ఉన్నది. నిన్ను తలవని రోజు లేదు, నీకోసం ఎదురు చూడని రోజులేదు, నీవు చేసే సమాజ సేవకు నీ చేదోడుగా ఉండి సహాయము చేసిన రోజులు ఇంకా గుర్తు ఉన్నాయ్.

రాగాలన్నింటిలో అనురాగము గొప్పది, బంధాలన్నింటిలో అనుబంధం గొప్పది, స్వేశ్చవాయువుల్లో వెలుగుబాట గొప్పది, పున్నమి వెన్నెలలో పూల పరిమళాలు గొప్పవి, నువ్వు నువ్వుగా గుర్తింపు తెచ్చుకోవటం అన్నింటికన్నా గొప్పది. మగవానికి సహజంగా ఉండే అహంకారము లేకుండా ప్రేమను పంచే తత్వం నీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషము మరియు నిత్యం ధరిత్రియందు నాకోసం ఎదురు చూపులతో ఉన్నందుకు నేనే నీకు సర్వం అర్పించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాను.

కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, క్షమయా ధరిత్రిగా, కులధృమ పత్నిగా, మన కుటుంబానికి నేనొక ఆశాకిరణంగా నీకోసం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను
నిమెసేజ్ కోసం ఎదురు చూస్తుంటాను మాధవా                  
Written By. మల్లాప్రగడ రామ కృష్ణ


ప్రాంజలి ప్రభ - (జి.కె -3)

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు అడిగారు. 

వాటికి ధర్మరాజుగారు ఇచ్చిన జవాబులు: 

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
 (బ్రహ్మం) 

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
 (దేవతలు) 

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? 
(ధర్మం) 

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
 (సత్యం) 

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
 (వేదం) 

6. దేనివలన మహత్తును పొందును?
 (తపస్సు) 

7. మానవునికి సహయపడునది ఏది?
 (ధైర్యం) 

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
 (పెద్దలను సేవించుటవలన) 

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును?
 (అధ్యయనము వలన) 

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? 
(తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.) 

ప్రవ ర్తన                                                                                    

   జైలర్ : మీ సత్ ప్రవర్తనకు శిక్ష తగ్గించ్చారు
           ఈ రోజే నిన్ను విడుదల చేస్తున్నాము
           ఇదిగో నీకు రావలసిన పైకము, గుడ్డలు
           ఇంటికి వెళ్లి హాయ్ గా బ్రతుకు అన్నడు దొంగతొ

దొంగ:  మీ మర్యాదలను మరువ లేనండి
           ఇక్కడైతే నాకు వేలకు భోజనం దొరుకుతుంది
           దయచేసి నన్ను ఇక్కడే ఉంచండి,
           దొంగలు,దగాకోరులు, మోసకారులు ఉన్న లోకంలో
           బ్రతకలేను, అందుకే ఈ రాడ్తో మిమ్మి కొట్టి
           ఇక్కడే ఉంటానండి  ఏమనుకోకండి ..............  



10. పచ్చగా
టీచర్ : రామకృష్ణ  నీవుచేప్పు తెల్లజుట్టు నల్లగా మారాలంటే ఏంచేయాలి
           ఏముంది టీచర్ కాస్త తారు పూసుకుంటే సరిపోతుందికదా టీచర్
           ఒకటే నవ్వులు
టీచర్ : శ్రీదేవి నువ్వు చెప్పమ్మా నల్లటి చ\జుట్టు తెల్లగా రావాలంటే  ఏంచేయాలి
           ఏముంది టీచర్ కాస్త ఫెవికాల్  పూసుకుంటే సరిపోతుందికదా టీచర్  ఒకటే నవ్వులు

టీచర్ : తలకు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగాను, నలుపురంగు వేసు కుంటే నల్లగాను జుట్టు మొత్తం తీసి గుండు చేసుకుంటే తెల్లగాను దానిమీద గంధం వ్రాసు కుంటే పచ్చగాను చల్లగాను ఉంటుంది తెలుసు కోండి 
బ్రహ్మం: మరి టీచర్ బట్టలు లేకుండా ఆకులు కప్పుకుంటే పచ్చగా ఉంటాము  గదండి  ఆమాటలకు ఒకటే నవ్వ్వులు ...........  


   
Korisepati Balakrishna Reddy
26 April at 16:51
ఎవరో వస్తారని....
---------------------

పలుగు పార తీసుకొంటే
బండరాయి భయంగా వణికింది

రాయి రాయి ఒరుసుకొంటే
చీకటి రేయి తోక ముడిచింది

కంటిరెప్ప పైకి లేచినప్పుడే
కలిమికి లేమి గుర్తొస్తోంది

చెదిరిన గుండె గాండ్రించినప్పుడే
చెవిటికి శంఖం వినిపిస్తోంది

చెమ్మగిలిన కనులు చెలరేగినప్పుడే
చరిత్ర పేజీ... విస్తరిస్తోంది

చేలాంచలాలు బిగిసినప్పుడే
జాతి జాతకం మారుతోంది

గడ్డపారలు ఎలాగూ చిగురించవు
మట్టిబెడ్డల ముద్దుబిడ్డలు ...
గరికపోచలే స్పందించి
కరుణా కుసుమాలు పూస్తాయి

ఎత్తైన కొండలెప్పుడు చలించవు
పిల్లవాగులే వాటి గుండెలపై నుండి కదిలి
పేదల హృదయంలోకి ప్రవహిస్తాయి

ఎండ మావులేనాడు దాహం తీర్చవు మండుటెండలే చెలరేగి
ఉప్పెన జండాలు ఎగరేసుకొంటూ
ఏరువాకల్ని మోసుకొస్తాయి.
*** *** **** 
  





ॐॐॐ వేంకటేశ్వర నామములో అంతరార్ధం
వేం = పాపములను
కట = ఖండించు వాడై
ఈశ్వరుడు = ఆ చంద్రార్కం శాశ్వతుడై శుభములను ప్రసాదిం
చువాడు,,,,,
వేం + కట + ఈశ్వరుడు = పాపములను తొలగీంచీ శుభముల
ప్రసాదించు శాశ్వతుడైన దైవం,,,,
 తిరుపతి + తిరుమల నామములో అర్ధము
తిరు =పరమ పవిత్రమైన
పతి = భర్త ( తండ్రి ) భరించువాడు దైవం
తిరుపతి = భూ భారములను భరించు పవిత్రమైన తండ్రి
తిరు = పరమ పవిత్రమైన
మల = కొండ శిఖరం ఎత్తైనప్రదేశం గుట్ట
తిరుమల = పమపవిత్రమైన కొండ
వేంకటేశ్వరుడు సదా మంగళములు సర్వులకు ఇచ్చు గాక
హరిఃఓం హరిఃఓం హరిఃఓం

Wednesday 25 April 2018

Pranjali Prabha -26-04-2018



ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
  (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం  


సర్వేజన సుఖినోభవంతు 




నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
మల్లాప్రగడ రామకృష్ణ 

నేను చెప్పిన మాట ఎపుడు ఒప్పినావు నేస్తమా 
మన కబురులు ఆట ఎచట విప్పినావు నేస్తమా 

మనసు మాట చెప్పుకొనగ నీవు గాక ఉందేవ్వరు 
నీ  తీయని పలుకు లన్నీ నాకు  తెల్పినవే నేస్తమా 

ఎంత ఓర్పు,  ఎంత నేర్పు,  కూర్పు కడలి హృదయమా 
చెప్పరాని నా నేత్రం చెప్ప మంటున్నది మిత్రమా 

మనసు విప్పు చెప్పు కొనుటకు  నీకన్నా నాకెవ్వరు 
చెప్పు కోలేనివి  తెల్పినా ఫలితము లేదుగా నేస్తమా  

స్వస్చమైన పాల వలే ఉన్నది నీ  హృదయం 
అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియని స్నేహమా 

చిత్తశుద్ధి మంత్రముంది, మాటనేర్పు ఉంది నీ దగ్గరా   
గుండెను బట్టి ఆర్ధం చేసుకొనే తత్వం లేదు మిత్రమా 

దివ్య ప్రేమ సందేశం, మనసుకు శాంతి తెల్పవా 
నీ శ్వాస సాక్షిగా నా మాటలు గమనించవా నేస్తమా 

--((*))--
  


నేటి పద్యం జీవన జ్యోతి 
ప్రాంజలి ప్రభ 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

మనసుకు భావమేది , భావానికి వయసు ఏది -  
చివరికి  నేస్తమేది   నేస్తానికి  బంధము ఏది
   
వయసుకు గాయమేది - గాయానికి మరుపు ఏది -  
భందానికి భాష ఏది  - భాషకు  ప్రేమ ఏది 

మరపుకు  గానమేది - గానానికి వలపు ఏది 
ప్రేమకు  మార్పు ఏది - మార్పుకు ఓర్పు ఏది 

వలపుకు  మాట ఏది   - మాటలకి  చివరి ఏది  
ఓర్పుకు  తీర్పు ఏది  - తీర్పుకు నేర్పు ఏది 

ఐ లోకంలో అందరు మెధాఉలే  ప్రతిఒక్కరు సలహాలిచ్చేవారే ఆచరణకు వచ్చేటప్పటి కల్ల తోక ముడిచేవారే మాటా గారడి ఒక్క సారి చదవండి మికేఅర్ధం అవుతుంది 



నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామక్రృష్ణ

కుటుంబంలో రెండు మనస్తత్వాలు ఉంటాయి - అవి తాత్కాలమే రాత్రి కి సర్దు కుంటాయి.

బాదించే కోపం నీదీ - భరించే తత్వం నాది
హింసించే వైనం నీదీ - సహించే భావ్వం నాది
ద్వెషించే గోప్యం నీదీ - శ్రమించే లక్ష్యం నాది
ఛేదించే ధైర్యం నీదీ - క్షమించే గుణం నాది


శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

written by Mallapragada ramakrishna 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేణమ:
ప్రాంజలి ప్రభ ( జికె -2)

1 .ద్విత్వ అక్ష రాలు తెలుపుము ?

ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
మగ్గము
పగ్గము
ముగ్గురు
గజ్జెలు
తప్పెట
వియ్యము
కయ్యము
కళ్ళు
నమ్మకం

2 . ప్రక్రుతి వికృతిలు కొన్ని వ్రాయుము ? 
ప్రకృతి - వికృతి

భాష - బాస
రాజు - రేడు
శాస్త్రము - చట్టము
వర్ణము - వన్నె
విద్య - విద్దె
అక్షరము - అక్కరము
ఆధారము - ఆదరువు
కుమారుడు - కొమరుడు
కృష్ణుడు - కన్నడు
పద్యము - పద్దెము
న్యాయము - నాయము
దీపము - దివ్వె
భద్రము -  పదిలము

3. లింగములు ఎన్ని ? 

లింగములు 3 రకాలు అవి

1. మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు.

2. మహతీ వాచకములు - స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములు మహతీ వాచకములు - వీటిని స్త్రీలింగములనియు అందురు - సీత, బుద్ధిమంతురాలు.

3. అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటిని నపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.

Tuesday 24 April 2018

ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
  (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం  
సర్వేజన సుఖినోభవంతు 



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

Learn English is fun!





చిన్న పిల్లల కోసం  ఒక్క సారి చూడండి 





Monday 23 April 2018

Pranjali Prabha (24-04-2018)

ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
  (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం  
సర్వేజన సుఖినోభవంతు 



సౌందర్యలహరి- 


శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్, 

నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. 

శ్లో|| మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం 

స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి | 

మనోzపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం 

సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9 

ఓ భగవతీ! నువ్వు మూలాధారంలోవున్న పృథివీతత్త్వాన్ని, మణిపుర చక్రంలోవున్న ఉదకతత్త్వాన్ని, స్వాధిష్ఠాన చక్రంలోని అగ్నితత్త్వాన్ని, అనాహత చక్రంలోని వాయుతత్త్వాన్ని, అంతకు పైనవుండే విశుద్ధచక్రంలోని ఆకాశ తత్త్వాన్ని, కనుబొమల నడుమనుండే ఆజ్ఞాచక్రంలోని మనస్తత్త్వాన్ని వీడి, సుషుమ్నా మార్గాన్ని ఛేదించుకొని సహస్రార కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి రహస్యంగా విహరిస్తున్నావు. 

భాస్కరానంద భావము:- 

శ్రీ గురువులు ఈ శ్లోకము ద్వారా మనకు అమ్మ వారి యొక్క సూక్ష్మ ఆరాధన తెలియజేస్తున్నారు. పిండాండము లోని చక్ర సాధన, అంతర్యాగము ద్వారా అమ్మను ఎలా చేరు కోవాలి, కుండలిని సాధన ఎలా చేయాలి? యోగ సాధన ఎలా చేయాలి? యోగ మార్గములో ఎలా వెళ్ళాలి ? అని షట్చక్ర సాధన, నిరూపణ గురించి చెబుతున్నారు. అమ్మ మన శరీరంలో ఎక్కడెక్కడ ఏయే రూపాలలో నివసిస్తుందో శక్తి ఏ మూలకంగా చైతన్యముగా చలిస్తుందో చెప్పియున్నారు. ఈ శ్లోకము యోగ రహస్య సాధనకు సంబందిచినది. పిండాండమును బ్రహ్మాండమును ఏ విధముగా సమన్వయము చేసుకోవాలో నేర్పినారు ఇచ్చట. ధ్యానము ఎలా చేయాలి? నాద బిందు యోగము మొదలగు సూక్ష్మ మైన విషయములను గుప్తముగా ఇక్కడ చెప్పియున్నారు . కుండలినీ సాధనాపరులకు ఇది అత్యంత శక్తిమంతమైన శ్లోకము. బ్రహ్మాండమునందు ఆవరించి వున్న సమిష్టి రూప కుండలినియే పిండాండమునందు వ్యష్టి రూపములో వున్నది, అదే శ్రీచక్ర రూపములో బాహ్యమున పూజలు అందుకొంటున్నది. శరీరమే ఒక శ్రీచక్రము. బాహ్యమున శ్రీచక్రారాధన చేసేవాళ్ళు, అంతర్ముఖమున షట్చక్ర భేదనముచే సహస్రారము చేరి శివుని తో ఐక్యం చెందుదురు. 

శక్తి శివుడు ఐక్యం కావడమే నాద బిందు కళ అని అందరు. కులపథం అంటే కుల మార్గము, కుండలినీ మార్గము అని. ఈ శ్లోకములో కుండలినీ శక్తి యొక్క గమనమును గురించి గురుదేవుళ్ళు చక్కగా వివరించియున్నారు. 

నాద బిందు కళ :- 

శరీరము, లేదా షట్చక్రములను నాదము అందురు. బిందువు అంటే శ్రీచక్రములోని మధ్యభాగమున, లేదా అగ్ర బాగమున వున్న బిందువు, లేదా సహస్రారం లోని బిందువు అని. షట్చక్రములను బిందువును అనుసంధానం చేయు ప్రక్రియను నాద బిందు కళ అని అందురు. ఇది యోగ విద్యా రహస్యము. యోగ మార్గము ద్వారా దీనిని సాధన చేయ వలెను. పంచదశీ మహా విద్యతో మూలాధారములోని కుండలినీ శక్తిని ఉత్కీలనము గావించి సుషుమ్న నాడి ద్వారా మూడు గ్రంధులను దాటి సహస్రారములోని బిందువుతో ఐక్యం చెందడం నాద బిందు కళ అందురు. ఈ సమయములో సాధకుడు పంచ పుష్పములతో సాధన చేయ వలెను. అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమా గుణములే పంచ పుష్పములు. గురు అనుగ్రహము పూర్తిగా వున్న వారికీ మాత్రమే కుండలినీ చలనం కలుగును. మార్గము తెలియును. 

భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రితా 

శక్తిః కుండలినీ నామ బిసతంతు నిభాzశుభా || ........... (వామకేశ్వర తంత్రం) 

మూలాధారాంబుజారూఢా ..... స్వాధిష్టానాంబుజగతా .... మణిపూరాబ్జ నిలయా....అనాహతాబ్జ నిలయా ....విశుద్ధ చక్ర నిలయా....ఆజ్ఞాచక్రాబ్జ నిలయా .....సహస్రదళ పద్మస్థా.......(లలితా సహస్ర నామం) 

శ్లో: మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంధి విభేదినీ 

మణి పూరాంతరుదితా విష్ణు గ్రంధి విభేదినీ 

ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్ర గ్రంధి విభేదినీ, 

సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ 

తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా 

మహా శక్తి: కుండలినీ బిసతంతు తనీయసీ ...... .......(లలితా సహస్ర నామం) 

మూలాధారాంబుజా రూడా పంచవక్త్రాస్థి సంస్థితా, 

అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా, 

ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణీ 

1.మూలాధార చక్రము :- 

మూలాధార కమలము (గుద స్థానము) నాలుగు దళములతో, పృథివీ తత్వము రూపములో సర్వాధారభూతమైన చక్రము నందు కుండలనీ శక్తి రూపములో సర్పాకారములో తోకను నోటితో కరచీ పట్టుకొని నిద్రావస్థలో వుంటుంది. అందుకే ఆమెను కులాంగనా కులాంతస్థా కులయోగినీ ....అని అందురు. 

ఈ సాధన వలన యోగులు గాలి లోకి లేవడం జరుగుతుంది. తీవ్ర వత్తిడితో సాధన చేయడం వలన గుద స్థానంలో అమిత మైన వేడి జనించును. అందుకని పెసరపప్పుతో చేసిన అన్నము పులగమును ఎక్కువగా తీసుకోనినచొ ఒళ్ళు చలువ చేయును. సాధనాపరులు పులగమును మాత్రమే తీసుకొంటూ సాధన చేయ వలెను. 

2. మణిపూర చక్రము:- 

మణి పూరాబ్జ నిలయా వదనత్రయ సంయుతా, 

వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా, 

రక్త వర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీత మానసా, 

సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణీ 

ఇది జల తత్వము. నాభి స్థానము. పది దళములతో లాకిన్యంబా స్వరూపములో యోగినీ దేవత ఇచ్చట కలదు. మణుల కాంతితో వెదజల్లుతూ వుంటుంది కనుక దీనికి మణిపూరక చక్రము అని పేరు. గర్బసంచి వుండే స్థానము, చల్లని ప్రదేశము కావున కాస్త వేడి చేయడానికి బెల్లం తినాలి. ఈ సాధన చేసే వాళ్ళు విధిగా బెల్లం అన్నం తినాలి. దీనిని జయించిన వాళ్ళు నీటిపై తేలుట, నడుచుట శక్తులు కలిగి వుండుదురు. 

పద్మము ఎప్పుడు నీటిలో ఉండును. బిసతంతు తనీయసి ....వెన్నెముక వెనుక భాగమున సుషుమ్నా నాడి తామర తూడు లాగ వుండి, దాని కొస నీటి అడుగు బాగాన జలతత్వం అయిన మణి పూర చక్రము దాటి మూలాధారము వరకు విస్తరించి వుంటుంది. కమలము యొక్క తల సహస్రారము లోను, తోక మూలాధారము లోను వుంటుంది. ఈ కమలమును పూర్ణగిరి పీఠము అని అందురు. 

3. స్వాధిష్టాన చక్రము:- 

స్వాధిష్టానాంబు జగతా చతుర్వక్త్ర మనోహరా, 

శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాzతి గర్వితా, 

మేదోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా, 

ధధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపదారిణీ 

స్వాధిష్టాన కమలము ఆరు దళములతో కాకినీ అను యోగినీ దేవత లింగ స్థానమున మేధస్సు రూపములో మధువు నందు ప్రీతీ కలిగి ఉండును. అగ్నితత్వము. పీత వర్ణము కలిగి వుంటుంది.. ఈ సాధన చేసే వాళ్ళు పెరుగు అన్నమును తినవలెను. ఈ కమలమును కామగిరి పీఠము అని అందురు. 

4. అనాహత చక్రము:- 

అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా, 

దంష్ట్రోజ్జ్వలాక్షమాలాది ధరా రుధిర సంస్థితా, 

కాళ రాత్ర్యాది శక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా, 

మహావీరేంద్ర వరదారాకిన్యాంబా స్వరూపిణీ 

అనాహత కమలము, 12 దళములు, హృదయ స్థానము, వాయుతత్వము. ఈ కమలమును జాలంధర పీఠము అని అందురు. ఈ సాధన చేసే వాళ్ళు నేతితో వండిన అన్నమును తినవలెను. రక్తము అనే ధాతువు నందు రాకిని అను యోగినీ దేవత శ్యామ వర్ణముతో ఉండును. 

5. విశుద్ధ చక్రము:- 

విశుద్ధ చక్ర నిలయాzzరక్తవర్ణా త్రిలోచనా 

ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా 

పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి 

అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ 

విశుద్ది కమలము 16 దళములతో, శ్వేత వర్ణముతో కంఠస్థానమున, ఆకాశ తత్వముతో కూడి, పాయసాన్నము నందు ప్రీతి కలిగి, చర్మము అనే ధాతువు నందు డాకిని అను యోగినీ దేవత రక్త వర్ణముతో కలదు. 

6. ఆజ్ఞా చక్రము :- 

ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్ల వర్ణా షడాననా, 

మజ్జా సంస్థా హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా 

హరిద్రాన్నైక రసికా హాకినీరూప ధారిణీ 

ఆజ్ఞా కమలము 2 దళములతో, భ్రూమధ్య స్థానమున, మనస్త త్త్వాత్మకము తో కూడి హరిద్రాన్నం నందు ఆసక్తి కలిగి తెల్లని రంగుతో హాకీని అను దేవత ఇచ్చట కలదు. ఈ దేవత ఎముకలలోని మజ్జ యందు వుండి అన్ని చక్రములకు సర్వ శక్తులు ఇచ్చు చుండును. ఈ కమలమును ఓడ్యాణ పీఠము అని అందురు. 

7. సహస్రార చక్రము :- 

సహస్ర దళ పద్మస్థా సర్వ వర్ణోప శోభితా 

సర్వాయుధ ధరా శుక్ల సంస్థితా సర్వతో ముఖీ, 

సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణీ 

సహస్రార కమలము , 1000 దళములతో శిరో మధ్య భాగమున బ్రహ్మ రంద్రము దగ్గర సహస్ర దళ కమలము గలదు. సకల వర్ణముల చేత ప్రకాశించుచూ సకల ఆయుధములు ధరించి సకల పదార్దముల యందు ఆశక్తి కలిగి శుక్ల ధాతువు, వీర్యము నందు జీవ రూపములో యాకిని అను యోగినీ దేవత కలదు. 

ఈ ఆరు చక్రములలో మూలాధార, స్వాధిష్టానములను ప్రధమ ఖండము, వాగ్భవ కూటము అని, 

మణిపూర, అనాహతా చక్రములను ద్వితీయ ఖండము, కామరాజ ఖండము అని, 

విశుద్ది, ఆజ్ఞా చక్రములను తృతీయ ఖండము, శక్తి ఖండము అని మూడు భాగములుగా విభజించిరి. 

ప్రధమ ఖండము పై భాగమున బ్రహ్మ గ్రంధి, ద్వీతీయ ఖండము పై భాగమున విష్ణు గ్రంధి, తృతీయ ఖండము పై భాగమున రుద్ర గ్రంధి కలవు. 

బ్రహ్మ గ్రంధిని అగ్ని మండలము, సృష్టి స్థానము అని, 

విష్ణు గ్రంధిని సూర్య మండలము, స్థితి స్థానము అని, 

రుద్ర గ్రంధిని చంద్ర మండలము, లయ స్థానము అని అందురు. 

సర్వ వేద మయీ దేవి సర్వ మంత్ర స్వరూపిణీ 

షన్మాసాభ్యాస యోగేన చైతన్యా కుండలీ భవేత్ ...............రుద్రయామళ తంత్రము:- 

ఆరు నెలల అభ్యాసముచే కుండలినీ శక్తి జాగృతమగును. గురు సేవా పరాయణుడు, శుద్ధ సత్వ గుణ సంపన్నుడు, భక్తీ అష్టాంగ యోగ ప్రవర్తకుడు అయిన సాధకుడు కుండలినీ శక్తి యొక్క అనుగ్రహమును పొందును. సంవత్సరమునకు ఒక్కొక్క శక్తి పీఠము నందు నివసించుచూ కుండలినీ సాధన చేయ వలెను. 

బ్రహ్మచర్యముతో, మౌన వ్రతముతో, నిర్మలమైన మనస్సుతో యోగుల సాంగత్యముతో ఈ సిద్ధి కలుగును. మూలాధారము నందు మనస్సును లగ్నము చేసి ఉదరము నందు వాయువును పూరించి శ్రీవిద్యా మంత్రములతో రేచక పూరక కుంభకములు చేసిన ప్రాణాయామము సిద్దించును. ఎడతెరగని ప్రాణాయామ సాధన వలన కుండలినీ శక్తి ఉద్ధీపనము అగును. బ్రహ్మచర్యముతో శక్తిని (వీర్యమును) ఊర్ధ్వముఖము గావించి సహస్రారములోని శివునితో సంగమించి స్పందించడమే స్కలించడమే ... శివేన సహా మోదతే. 

గూడార్ధము:- 

జీవుడు కుండలినీ (శక్తి) రూపములో సుషుమ్న నాడి ద్వారా షట్చక్రములను దాటి, సిద్దులను కాదని, గ్రంధి త్రయమును దాటి (కాదని), మనస్సును జయించి సహస్రారములోని పరమాత్ముడు అయిన శివున్ని కలసి క్రీడించడమే ..... శివేన సహా మోదతే .....జీవుడు పరమాత్మతో ఐక్యం కావడమే మోక్షం సాధన. ఇది సాధకుని యొక్క లక్ష్యం. 

ఆ పరమ శివునికి నమస్కరిస్తూ ........ 

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం, 

అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం. 

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు. 

భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ. 

(సరస్వతీ రామచంద్ర రావు)/
(Bhaskarananda Natha గారికి కృతజ్ఞతలు ) 
మీదగ్గర రచనలు ఎమన్నా ఉంటె పతిరోజు పచారించుటకు సహకరించండి ఇది కేవలము విజ్ఞాన్ ఆధ్యామిక ఆరోగ్య ఆనంద అంతర్జాల పత్రిక ఇక్కడ అందరికి ఉచితం ఇట్లు మల్లాప్రగడ రామకృష్ణ  
ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం

శ్రీ మాత్రే నమ:

శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 


    

సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:


శ్రీ వీర హనుమత్ కవచము

ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే  ప్రళయ కాలానల ప్రజ్వలనాయ, ప్రతాప వజ్ర దేహాయ, అంజనా గర్భ సంభుతాయ,  ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగణ  గ్రహ భంధనాయ, ప్రేత గ్రహ భంధనాయ, పిశాచ గ్రహ భంధనాయ, శాకినీ,  డాకినీ  గ్రహ భంధనాయ, కాకినీ కామినీ గ్రహ భంధనాయ,  బ్రహ్మ  గ్రహ భంధనాయ,   చొర గ్రహ భంధనాయ, మారీ    గ్రహ భంధనాయ,  ఏహి, ఏహి , ఆగచ్ఛ ఆగచ, అవేశయ అవేశయ మమహృదయే ప్రవేశయ  ప్రవేశయ స్పుర స్పుర,  ప్రస్పుర ప్రస్పుర,  సత్యం కధయ,  వ్యాఘ్ర  ముఖ భందన,  సర్ప  ముఖ భంధన, రాజ ముఖ భంధన, నారీ  ముఖభంధన , సభా ముఖభంధన , శతృ  ముఖభంధన ,లంకా ప్రాసాదభంజన , అముకం మే వశమానయ,   శ్రీం, క్లీం, క్లీం, క్లీం, హ్రీం, శ్రీం, శ్రీం, రాజానం వశమానయ,   శ్రీం, హ్రీం, క్లీం, స్త్రిణాం ఆకర్షయ  ఆకర్షయ,   శత్రూన్ మర్దయ మర్దయ,  మారయ మారయ,  చూర్ణయ  చూర్ణయ,  ఖే, ఖే,  శ్రీ రామచంద్రాజ్ఞయా మామ కార్య సిద్ధిం కురు కురు,  ఓం,  హ్రాం,   హ్రీం,  హ్రుం,  హ్రైం,   హ్రౌం , హ్ర :ఫట్ స్వాహా  విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ  శత్రూన్ భస్మయ కురు కురు హన హన  హుం  ఫట్ స్వాహా । 



శ్రీ పంచముఖి  హనుమంతమాల ఓం నమో భగవతే పంచ వక్త్రాయ ప్లవంగాది పతయే  స్మరణ మాత్రేన  అవాహిత భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస దాన శిద్ధ విద్య  ధరాప్స  రోయక్ష రాక్షస   మహాభయ  నివారాణాయ, తత్వజ్ఞాన నిష్టా  గరిష్టాయ, కామ రూప ధరాయ, జ్ఞాన ప్రదాయినీ అంజనీ  గర్భ సంభూతాయ, మహాత్మనే వాయు పుత్రాయ,  సర్వ కామ ప్రదాయ, నానా భంధ విమోచనాయ, కారాగ్గృహ  విమోచన దీక్షా దురంధరాయ, మహా బాల శాలినే సకల భూతదాయ, మమ సర్వాభిష్ట  సిద్ద్యర్ధం సర్వ జన వశీకరణార్ధం మమ.........  వ్యాధి నివారాణాయ,   అం ఆకర్ష  ప్రదాయ,  సాధ్య భంధణాయ, ఇం వాక్ప్రదాయ, సం  సర్వ విద్యా  విశేష శాలినే,  క్లీం  సకల జగద్వశీకరణాయ, సకల నిష్టా గరిష్టాయ, సౌ: , హుం, హుం , ప్రతి పక్ష మన క్షోభన కరాయ,  అన్యూన్య విద్వేషణ ప్రౌఢ  ప్రతాపనాయ, శ్రీం సర్వ  సంపత్ప్రదాయ,  గ్లౌం సకల భూత మండలాది పతయే , భూత ప్రతాప ప్రచండ వితరణా గ్ర గణ్యాయ, హ్రీం చిరంజీవినే వానర సార్వ భౌమాయ,  బ్రహ్మా  క్షత్రియ నానా జాతి గ్రహదీన్ శ్రీఘ్రమ్ వశ్యం కురు కురు శ్రీఘ్రం ఆకర్షణం కురు కురు హమ్ వౌషట్                         


శ్రీ హనుమత్ ప్రార్ధన                
                
అంజని  తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా                
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా                
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!                
లంఘించి వారాశి  లంకను పరిమార్చి ! రాకాసి మూకలు  శోకాలు మునుగంగా                
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక  మరువగా బోమయ !!అంజని!!                
భక్తి  శ్రద్ధల  తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము                
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా  రామ రాజార్చితా!!అంజని!!                   

శ్రీ  అంజనేయ సుప్రభాతము                
                
శ్రీ రామ భక్త ! కపిపుంగవ ! దీనభంధో  !                
సుగ్రివమిత్ర ! దనుజాంతక ! వాయుసూనో !                
లోకైకవీర ! పురపాల ! గదాప్తపాణే !                
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !                 
                
ఉత్తిష్ఠదేవ ! శరణాగత రక్షణార్ధం                
దుష్ఠ గ్రహాన్ హన విమర్దయ  శత్రు సంఘాన్                
దూరీకురుష్వ భువి సర్వభయం  సదామే                
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !               



శ్రీ హనుమత్  ద్వాదశ  నామ స్తోత్రము                
                
హనుమానంజనా సూను : వాయుపుత్రో మహాబల:                
రామేష్ఠ: ఫాల్గుణ: సఖ: పింగాక్షో అమిత విక్రమ:                
ఉదధి క్రమణ శ్పైవ  సితాసోక వినాశక:                
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీ వస్య దర్పహొ !!                
                
ద్వాదశైతాని  నామాని కపీంద్రస్య మహాత్మన :                
స్వాపకాలేపఠేన్నిత్యం  యాత్రాకాలే విశేషత:                
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్                 


  శ్రీ  రామదూతాంజనేయ స్తోత్రం               
               
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంస్ట్రాకరాళం               
రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం                
రం రం రం రాజయోగం సకలశుభనిధిమ్ సప్తభేతాల భేద్యం                
రం రం రం రాక్షసామ్తం సకలదిశయశమ్ రామదూతమ్ నమామి॥                
               
ఖం ఖం ఖం   ఖడ్గాహస్తం విషజ్వర హరణం వేద వేదాంగదీపం                
ఖం ఖం ఖం   ఖడ్గ రూపమ్ త్రిభువన నిలయం  దేవతాసుప్రకాశం      
     ఖం ఖం ఖం   కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయ స్వరూపమ్               
ఖం ఖం ఖం   కాలచక్రం సకల దిశయశం  రామదూతమ్ నమామి॥               
              
ఇం ఇం ఇం  ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం            
ఇం ఇం ఇం  సిద్ధి యోగం  నతజన సదయం ఆర్యపూజార్చితాంగం      
   ఇం ఇం ఇం  సింహనాదం అమ్రుతకరతలం ఆది అంత్య ప్రకాశం         
      ఇం ఇం ఇం  చిత్స్వరూపమ్ సకలదిశయశం  రామదూతమ్ నమామి॥                
               
సం  సం  సం  సాక్షిరూపమ్ వికసిత వదనం పింగలాక్షం సురక్షం               
సం  సం  సం  సత్య గీతమ్ సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం              
సం సం సం  సామవేదం  సిపునసులితం నిత్య తత్త్వం స్వరూపమ్             
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతమ్ నమామి                 
               
హం హం హం హంసరూపమ్ సుప్త వికటముఖము సూక్ష్మ సూక్ష్మావతారమ్               
హం హం హం  అమ్తరాత్మం రావిశశినయనం రమ్యగంభీరభీమం       
        హం హం హం  అట్టహాసం  సురవరనిలయం ఊర్ద్వరోమం కరాళం     
         హం హం హం  హంసహంసం సకలదిశయశం  రామదూతంనమామి॥                                
ఓం నమోభగవతే  వాయునందనాయ