Saturday 13 July 2019

తప్పుకాదే
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

న్యాయ మనేది లేదనకు ..
ప్రేమించుట తప్పు కాదే ..
శిక్ష అనుభవించక తప్పదనకు ..
అనుమానించుట తప్పుకాదే .!

గుండె లయల పాట చిలుకు .
మూగవోయె ఉండుట తప్పు కాదే
తపన పడుట ఒక కళ మనకు ..
పెదవుల పిలుపు తప్పుకాదే .!

ధర్మమంతా నిర్మలం మనకు ..
నిశ్చింతగ తా వెలుగు కాదే ..
అంతా గొడవ గొడవ అనకు ..
వలపుల తలపులు తప్పుకాదే.!

మనసుకెంత కొంత చురుకు ..
ప్రేమలేఖ వ్రాయుట తప్పుకాదే.
అంత బాగు చూచుటే మనకు
నవ్వులు ఏడ్పులు తప్పుకాదే.!
.
పరుగు వలదు మనకు ..
అల్లరి చేయుట తప్పుకాదే
కలసి మెలసి బతుకు
చెడును మార్చుట తప్పుకాదే !
--((***))--


--((***))--

మానవహితం కోరు
శాంతి సౌభాగ్యాలు చేరు
ఆధ్యాత్మికం తో మనసుమారు
ప్రశాంత కు ప్రేమేతో చేరు

శిశిరం తీరు మారు
వసంతం ఒకటే జోరు
పున్నమి వెన్నెల తీరు
మనుష్య మనస్సు చేరు

కాలక్షేపం జోరు
కాలాతీతం తీరు
అంతరంగంలో కల్లోలం చేరు
ప్రేమతత్వం తో కొంతమరు

నవ్వు ల్లో కనిపించే జోరు
నిరుత్సాహం కే బేజారు
మాటల్లో వినిపించే తీరు
మనస్సు రంజిల్లి మారు

మంచి చెడుతో పోరు
కనురెప్పల తీరు
చెడు మంచితో పోరు
ఉషోదయపు తీరు

మనిషి మనిషితో చేరు
మానవత్వం తీరు
మమత బంధం చేరు
ధనవ్యామోహాల తీరు

ఎవరో వస్తారు
వారు పరిమళింపచేస్తారు
మరెవరో వస్తారు
మనసునే తుంచేస్తారు

--((***))--



అంశం..వెంకటేశుని సప్త గిరులు  .

ఉపవాసముతో ఏడుకొండలు ఎక్కి
మెట్టు మెట్టుకు బొట్లు పెట్టి
ఏకాగ్ర చిత్తముతో మొక్కు కట్టి
నీచెంతకు చేరితిమి తిరుమలేశా..

వాయుదేవుడే కదిలించి
స్వర్ణముఖీ చెంతజేర్చిన..
ప్రధమాద్రి శేషాద్రిని ఎక్కితిని

అహంకార విసర్జనగా
నీలాంబరి తలనీలాలర్పించిన..
ద్వితీయాద్రి నీలాద్రిని ఎక్కితిని 

ఉపవాసముతో ఏడుకొండలు ఎక్కి
మెట్టు మెట్టుకు బొట్లు పెట్టి
ఏకాగ్ర చిత్తముతో మొక్కు కట్టి
నీచెంతకు చేరితిమి తిరుమలేశా..

దాయాదులజంపి పాపపరిహార్ధమై..
గరుక్మంతుడు కొలువున్న..
త్వితీయాద్రి గరుడాద్రిని ఎక్కితిని

వాయుఫలప్రసాదముగా ఆంజనేయునికి..
జన్మనిచ్చిన అంజనమ్మపేరున్న.
చతుర్ధాద్రి అంజనాద్రిని ఎక్కితిని

ఉపవాసముతో ఏడుకొండలు ఎక్కి
మెట్టు మెట్టుకు బొట్లు పెట్టి
ఏకాగ్ర చిత్తముతో మొక్కు కట్టి
నీచెంతకు చేరితిమి తిరుమలేశా..
 
మహాశివునికి నైవేద్యముగా..
నరికిశిరసునుంచిన వృషభునిపేరున్న..
పంచమాద్రి వృషభాద్రిని ఎక్కితిని

నారాయణమహర్షి తపఫలము..
విధాత దీవెనఫలము..
షష్టాద్రి నారాయణాద్రిని ఎక్కితిని శ్రీనివాసా..

పాపములు హరించుతూ.. కలియుగదైవంగా
నీవుకొలువున్న..
సప్తమాద్రి వెంకటాద్రిని ఎక్కితిని .

మెట్టుమెట్టు ఎక్కుతూ
ఒక్కొక్కమెట్టు మొక్కుతూ..
ఏడుకొండలు ఎక్కితిని శ్రీనివాసా..
నీ మొక్కుతీర్చ వచ్చితిని తిరుమలేశా..

Monday 8 July 2019


12002848_904750326283163_9038594344569313896_n.jpg

దశ మహా విద్యలు - వాటి ఫలితాలు.

1. తొలి మహా విద్య శ్రీకాళీదేవి

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీతారాదేవి

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి

దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ భగళాముఖీ దేవి

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే

శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే

శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

ధన్యవాదాలు:

శ్రీ కాళీ రాఘవేంద్రాచార్యులు గారు

---(***)---

ప్రాంజలి ప్రభ రోజువారి కధలు (1)


ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ: - ప్రాంజలి ప్రభ రోజువారి కధలు  
(ఆనందం - ఆరోగ్యం- ఆధ్యాత్మికం )

ప్రాంజలి ప్రభ - రోజువారి కధలు (5)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ప్రాంజలి ప్రభ - రోజువారి కధలు (4)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

#ప్రపంచంఅంతాఒకనాడుభరతవంశానికిచెందినదే

(#దయచేసికొంచెంఓపికగాచదవండి.)



వేదాన్ని మన జాతి తన సంపదగా పరిరక్షించుకుంటూ వస్తుంది. మరి వేదాన్ని ఆచరించని పాశ్చాత్యుల విషయం ఏమి. మనం ఈనాడు చూస్తున్న ఇన్ని మతాలు ఎక్కడివి.


రామాయణ, భారత కాలాల్లో మతాలు అంటూ ఏమి లేవు. మతం అంటూ చెప్పాలంటే వైధిక మతం అని చెప్పాలి. కొందరు దాన్ని అచరించేవాల్లు. మరికొందరు పాటించనివారుండే వారు.

అయితే ఆ వేదాలని ఆచరించే వారిలో కూడా ఎన్నో శాఖలు ఉండేవి.

అయితే ఈ భూమిమీద ఉండే ప్రతి మానవుడూ భరత వంశంలోంచి వచ్చినవారే. ఈ విషయం శ్రీమద్భాగవతం అయిదవ స్కదంలో ఉంది.

ఈ భూమి సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అంతా ఒకే భూ భాగం క్రింద ఉండేది ఒక నాడు. అందుకే సంధ్యా వందనాదుల్లో "చతుస్సాగర పర్యంతం" అని కనిపిస్తుంది మనకు.

సుమారు 100 కోట్ల సంవత్సరాల క్రితం నుండి విడిపోవడం ప్రారంభించినది.

సుమారు 50 లక్షల సంవత్సరాల కాలంగా మనం ఇప్పుడు చూస్తుండే ఖండంగా ఏర్పడ్డది.

మన పురాణాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే మన పంచాంగల్లో సృష్టి ఆది 198 కోట్ల 58 లక్షల సంవత్సరాలు అని ఉంది.

అమేరికాలోని చికాగో లో న్యాచురల్ సైన్స్ మ్యుజియంలో ఈ భూమి ఆకృతి 200 కోట్ల సంవత్సరాల క్రింద ఇలా ఉంది, 100 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా అంటూ చూపిస్తూ 50 లక్ష్లల సంవత్సరాల క్రితంగా మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచ ఆకృతిని చూపించారు. వాటికి వారి వద్ద ఏ ఆధారాలు లేవు.

మనం కచ్చితంగా 198 కోట్ల సంవత్సరాలు అని చెప్పగల్గుతున్నాం. మన వద్ద గ్రహించిన విషయాన్నే వాళ్ళు తిరిగి ప్రపంచానికి తెలియజేస్తున్నారు మేం చెబుతున్నాం అన్నట్టుగా. వాళ్ళు ఇంతవరకే చెబుతున్నారు.

మన వద్ద ఇంతకు మించి ఆధారాలు కనిపిస్తున్నాయి.

ఈ భూమిని ఖండాలుగా విభజించిన " నాభి " అనే చక్రవర్తి ఉన్నాడు. భరత వంశానికి చెందిన వాడు. తన సంతానానికోసం ఇలా విభజించి మొత్తం తన వంశాలవారినే అన్ని ఖండాల్లో విస్తరించాడు. వారే ఒక రథాన్ని ఉపయోగించి భూభాగాన్ని జరిపారు అని తెలుస్తోంది.

మనం ఇప్పుడు చూస్తున్న ఆస్ట్రేలియా ఖండం ఒకనాడు భారతదేశపు ఆగ్నేయ భాగంలో ఉండేదని ఇప్పటి శాస్త్రవెత్తలూ అంగీకరిస్తారు.ఆస్ట్రేలియా లో ఉత్తర భాగంలో ఉన్న అడవులూ, పక్షులూ మన తమిళనాటి అడవులను, పక్షులను పోలి ఉంటాయి.

ఈ భూమి అలా క్రమేపీ జరుగుతూ ఉండటంచే అక్కడి పక్షులూ తమిళనాటికి వలస వస్తూ ఉంటాయి ఈ కాలం వరకు.

అక్కడ ఉన్న ఒకప్పటి వాళ్ళు మన దేశ తమిళనాటి వారిలాగే ఉంటారు. వారి భాష కూడా అట్లానే ఉంటుంది. అక్కడ ఉండే బంగారు నిధుల కోసం బ్రిటీష్ వారు అక్కడ కాలు పెట్టి వారిని నామ రూపాలు లేకుండా చేసారు.

ఇప్పుడు మనం అనుకుంటున్న అమేరికా కూడా అంతే. అక్కడి వారిని అనిచివేసి మేం అమెరికా అని ఈనాడు చెప్పుకుంటున్నారు.

అమేరికాలోని మనం ఈ నాడు కాలిఫోర్నియా కూడా మనం మన పురాణాల్లో చూడవచ్చు. మనకు సగర చక్రవర్తి కుమారులు కపిల మహర్షిని వల్ల కాలి బూడిదైపోతే భగీరతుడు గంగను రప్పించాడు అని మనకు తెలుస్తుంది. అయితే ఆ కపిల మహర్షి ఉన్న అరణ్యమే మనం ఇప్పుడు చూస్తున్న కాలిఫోర్నియా.

అదెలా అంటే, సంసృతంలో కొన్ని పదాలు వాటి స్వభావన్ని బట్టి అక్షరాలు మారుతాయి. హింస చేయునది సింహం అంటారు.

ఇక్కడ 'స' 'హ' అక్షరాలు మారాయి.అలాగే కపిలారణ్య లో 'ప''ల' అక్షరాలు తిరగరాస్తే క-లి-ప అరణ్య, అలా కాలిఫోర్నియా అయ్యింది.

ఆ నాడు భరత వంశానికి చెందిన వాళ్ళు ఈ భూమిని విభజించాక బర్డ్ ఐ వ్యూ ఎట్లా ఉందో మన పురాణాల్లో ఉంది. అదెలా అంటే ఒక కుందేలు తన కాల్లపై లేచి ఎదురుగా ఉండే గడ్డి పొదకై చూస్తున్నట్లుగా ఉందని మన పురాణాల్లో ఉంది.

మన పురాణాల లోనికి వారు వెల్లలేదు కనక ఈ విషయం పాశ్చాత్యులకి దొరకలేదు. లేకుంటే ఈ విశయాన్ని కూడా వాల్లే చెప్పే వాళ్ళు . ఈ చిత్రం మనం ప్రపంచ పటాన్ని తిప్పి చూస్తే కనిపిస్తుంది.

మొత్తం ఆసియా, యూరోప్ ఖండాలు గడ్డిగా, అమేరిక కుందేలుగా కనిపిస్తుంది. దక్షిణ అమేరికా కుందేటి తల, ఇక ఉత్తర అమేరికా ఆ కుందేటి పొట్ట భాగం. అందుకే కాబోలు ప్రపంచాన్నంతా దోచుకుతిన్నారు!! అమేరికాలో ఉన్న విలువైన బంగారం అంతా ఒక నాడు ఇక్కడి నుండి దోచుకున్నదే.

ఈ విషయం పక్కన పెడుదాం. ప్రపంచ పటాన్ని మేం తయారు చేసాం అని చెబుతున్న వాల్లకు ఇన్ని విషయాలు తెలియవు.

ఈ పాశ్చాత్యులు అలా చీలిన భూభాగాల్లో నివసించే వారిలో వేదాలని ఆచరించక బ్రతికేవాల్లలోకి చెంది ఉంటారు. భూమిని విభాగలుగా చీల్చిన వృషభుడి కుమారుడు భరతుడు. ఆయన తన నియంత్రణ కేవలం తన భూభాగానికే పరిమితం కాక పాలించేవాడు.

అందరూ ఆయన పేరు చెప్పుకొనే వారట, అందుకే భరతీయ అనే పేరు ఈ భూమి అంతటా ఉండేది. ఈ భరతుడు స్వాయంభువ మన్వంతరానికి చెందినవాడు. అయితే ఈ నాడు మనం శకుంతల కుమారుడు భరతుడు, అతని ద్వారా భారతదేశం అని చెప్పుకుంటున్నాం. ఈ భరతుడు వైవత్సువ మన్వంతరానికి చెందినవాడు.

దురదృష్ట కరం ఈనాడు మనం వాటి విలువను తెలియక మన పురాణలపై, ఇతిహాసాలపై ఏమాత్రం గౌరవంలేనివాల్లలా తయారయ్యాం. ఇవి వాస్తవం అని గుర్తించాలి.

--((**))--



ప్రాంజలి ప్రభ - రోజువారి కధలు (3)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

జీవన్ముక్తి 

ఓరామచంద్రా ! హృదయమను బిలమున  చుట్టచుట్టుకొని గర్వపరవశమై ఉన్న మనస్సు అను మహాసర్పము ఎవనికి సంపూర్ణముగ నశించి పోయినో మరియు ఎవడు స్వస్వరూప అనుభూతి

పొందెనో అనగా ఆత్మానందమును పూర్తిగ అనుభవించినాడో అట్టి మహానిర్మలుడు అగు తత్వవేత్తకునమస్కరించు చున్నాను. మహా నరకము అను సామ్రాజ్యమున అభిషిక్తము లైనివియు, పాపములు అను మద గజములతో కూడి ఉండినవియు, ఆశలను బాణశకలాలచే పూర్ణమై ఉన్న ఇంద్రియములను శత్రువులను జయించుట మహాకష్టతరము. కళేబరమగు ఈ శరీరమున ఎవడు వివేకము అను ధనము కలిగి ఉండునో ఆతడు తన యందు ఉన్న
ఇంద్రియములు అను శత్రవులచే బంధిపబడడు. మనస్సును స్వాధీనపరుచుకొనిన వారును తమ శరీరమను పట్టణమునకు ప్రభువులై ఉండువారునగు మనుజులు ఎట్టి సుఖమును పొందుదురో అట్టి సుఖమును పామరులు పొందజాలరు. ఏకత్వమగు బ్రహ్మతత్వమును గూర్చిన అభ్యాసముచే మనస్సు  జయింపబడనంత వరకు అజ్ఞానమను గాడాంధకారమున హృదయవాసనలను బేతాళములు విజృభించుచునే ఉండును . అనగా కోరికలు పుట్టుచునే
ఉండును అని అర్ధము. 

ఓరామచంద్రా ! ఈ ప్రకారముగ అజ్ఞానము అను బురదచే విశేషముగ

కళింకతమై ఉన్న మనస్సు అను మణిని మోక్షసిద్ధి కొరకై వివేకము అను జలముచే బాగుగా కడిగి ప్రకాశవంతుడవు కమ్ము. అనగా జ్ఞానయుక్తుడువు కమ్ము అని అర్ధము. ఓరామచంద్రా! అనేక ఆపదలచే పరిపూర్ణములైనట్టి భయంకరములైన సంసారమునందు వివేకము లేనివాడివై
ప్రవర్తించకుము.మరియు పామరునివలె సంసారమందును వివశుడవై పడిపోకుము.
అనగా ఆత్మానందముతో ఉండుము అని అర్ధము.

--((**))--


ప్రాంజలి ప్రభ - రోజువారి కధలు (2)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:

శ్రీకృష్ణుడు నెమలి పించం ధరించడం వెనుక అసలు కథ
కృష్ణుడు అంటేనే లీలలు .. కృష్ణుడు ఎప్పుడు నెమలిపించం ధరించకుండా కనబడడు.. అసలు శ్రీకృష్ణుడు నెమలి పించం ఎందుకు ధరిస్తాడు ?
ఒక విశ్లేషణ నెమలి శారీరిక సంపర్కం చేయదు కాబట్టి:
ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం.

మగనెమలికి పించం ఉంటుంది. వర్షాకాలంలో గంభీరంగా ఉరుముతున్నప్పుడు పులకించిన మగనెమలి నాట్యం చేసినపుడు కంటి నుండి ఆనంద భాష్పాలు రాలుతాయి. ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం ద్వారా ఆడనెమలి సంతాన భాగ్యాన్ని పొంది గర్భం ధరిస్తుందట.


ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు అని ఒక విశ్లేషణ.
మరో విశ్లేషణ బ్రహ్మదేవుడు నెమలికి ఇచ్చిన వరం:
ఒకానొక రోజు బ్రహ్మ లోకాన బ్రహ్మదేవుడు దీక్షగా కూచుని రకరకాల పక్షులను తీర్చిదిద్దుతున్నాడు. చిలకలు, పిచ్చికలు , గోరువంకలు, పాలపిట్టలు, పావురాలు ఇలా ఒక్కోదానికి ఒక్కొక్క పేరు ఖాయం చేస్తున్నాడు.

అన్ని పక్షులు చిన్న చిన్నవే అవుతున్నాయని అప్పుడు ఒక పెద్ద పక్షిని ఊహించి, తయారుచేయడం మొదలు పెట్టాడు. దాని రూపురేఖలు, రంగులు అన్నీ కొత్తగా దిద్దాడు. దానికి రెక్కలను చిన్నదిగా, చిత్రంగా అమర్చాడు. పొడవైన తోక పెట్టాడు. దానికి చిత్రాతిచిత్రమైన యీకలు సమకూర్చాడు. అది తలుచుకుంటే ఆ తోకను విసనకర్రలా విప్పాలి . అప్పుడు ఆ పక్షి ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనుకున్నాడు .

ఇదంతా ఒక పక్కనుంచి గమనిస్తున్న సరస్వతీదేవి ఆ పక్షి అందచందాలకు చాలా మురిసిపోయింది. “దానికి మంచి నాట్యకౌశలం కూడా వుంటే, ఆ చక్కదనానికి మరింత శోభ చేకూరుతుంది” అని బ్రహ్మ కు సలహా ఇచ్చింది.

విద్యా బుద్ధులు అనేది నీపని, నువ్వే అనుగ్రహించాలి అని బ్రహ్మ అనగా, అనుగ్రహించి దానికి “నెమలి” అని పేరు పెట్టింది సరస్వతి. అంతే కాకుండా తన వాహనంగా స్థానం కల్పించింది.

నెమలి అందానికి, ఆటకి సార్ధకత చేకూరిందని బ్రహ్మ ఆనందించాడు. కానీ నెమలి ముఖంలో మాత్రం ఆనందం కనిపించలేదు. ఏమిటీ నీ కోరిక? అన్నాడు బ్రహ్మ .
ఒక్క బ్రహ్మ లోకానికే పరిమితం కావడమా? అని అడిగింది నెమలి
అయితే కుమారస్వామికి వాహనమై కైలాసంలో గెంతులు వెయ్యమని కటాక్షించాడు. నెమలి ఆ మాట వినగానే ఒక్కసారి పురివిప్పి ఆనందంతో నాట్యం చేసింది.
కొంత సేపు నాట్యం కాగానే నెమలి పించం ముడుచుకుంది. దానితో పాటు దాని ముఖమూ చిన్నపోయింది.
నీకు మళ్ళీ ఏమైంది? అన్నారు బ్రహ్మ మరియు సరస్వతి.
మరి విష్ణులోకంలో నా సంగతి తెలిసేదెలా? అని దీనంగా ముఖం పెట్టింది నెమలి తెలివిగా .
బ్రహ్మకు ఆ మాట వినగానే కోపం వచ్చింది. కాని నిదానించుకొని, ఎంతైనా తను ఏరికోరి తయారుచేసిన ప్రాణి కదా!

పైగా అది అనూహ్యంగా అద్భుతంగా కూడా తయారైంది. అందుకని తెలియకుండానే దాని మీద, మమకారం ఏర్పడింది.

అంతే కోపాన్ని అణచుకొని విష్ణులోకంలో కాదు కానీ, ద్వాపర యుగంలో ని నెమలి పించం కృష్ణుని తలపై కిరీటంలో నిత్యం రెపరెపలాడుతుంది. సరేనా!” అన్నాడు.
అప్పుడు నెమలి ముఖం దీపంలా వెలిగింది..


ఈ విధం గా బ్రహ్మ వారానికి ఫలితం గా ద్వాపరయుగం లో శ్రీకృష్ణుడు నెమలి పించం ధరిస్తాడని మరొక విశ్లేషణ.

--((**))--

ప్రభ - రోజువారి కధలు(1)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:

నేటి కధ . (కలసిన హృదయాలు)


నాన్న నాకప్పుడే పెళ్ళికి తొందరెందుకు, నాకు మంచి ఉద్యోగము రాలేదు, ఈ ట్యూషన్సు వల్ల పెళ్లి చేసుకుంటే కష్టం కదా.


అట్లా నేను అనుకుంటే నాకు అసలు పెళ్లి అయ్యేదే కాదు, ఎందుకంటే నా పెళ్లప్పుడు మునిసి పాలిటీ అత్తర్, చెత్త వ్యాన్ డ్రైవర్  పనిచేసే వాడ్ని, అందరూ  పెళైన కొత్తలో చెత్త బాబాయి అనేవాళ్ళు, వాళ్ళు అలా అన్నారని మీ అమ్మను ఎప్పుడూ భాద పెట్ట లేదు.


నీవేమి భయపడకు ఆ దేవుడు వ్రాసి నట్లే జరుగుతుంది అంతా మనకోసం జరిగిందను కోవాలి ఎంత చెట్టుకు  అంతే గాలి అయిన మానవ ప్రయత్నం చేయాలి కదా, నీవేమి ఆశలకు పోవటం లేదు కదా, కంతకు తగ్గ బొంత కోసం వెతు కుంటున్నావు, ఏమో నాన్న నీవు చెప్పావు కాబట్టి అమ్మాయిని చూసి వస్తా, నాకు నచ్చక పోతే నచ్చ లేదని చెపుతా అంతకు ఇష్ట మైతేనే పిల్లని చూస్తా, సరే నీతోపాటు పక్క ఇంటి గోపాలం గారిని తీసుకొనివెళ్ళు అన్నాడు.

ఆలా పిల్లను చూడటం నచ్చలేదని  నాన్నకు చెప్పఁటం జరిగింది.


ఎందుకు నచ్చలేదో చెప్పాలి, అమ్మాయి వాళ్లు నీచేత కంప్యూటర్

జిరాక్స్ మిషన్ కొని ఇంటర్ నెట్ సెంటర్ పెడుతారుట, స్వతంత్రంగా బ్రతక వచ్చు ఇలా ట్యూషన్సు చెప్పే బదులు ఒక్కసారి ఆలోచించు, అది అంత  తెలికకదా, నిన్ను వదలి వెళ్ళి బతకాలనిలేదు.


అది కాదు నాన్న" పిల్ల ", నాకునచ్చలా పిల్ల కళ్ళు గాజుకళ్ళు, పగలు చూడాలంటే నాకు భయ మేసింది, ఇక రాత్రి విషయం తలుచు కుంటే ఇంకా భయమేస్తుంది.



     సరేరా  మన గోపాలం గారి చుట్టా లెవరో ఉన్నారట చూసి వస్తావా.

నాన్న నేను మాత్రం ముందు చూడను, నీవు చూసి నచ్చింది, చూడరా అంటే చూస్తాను అంతే

చివరికి మానాన్న గారు చూసిన సంభంధము కుదిరింది.   

పెళ్లి రంగ రంగ వైభవముగా జరిగింది, పార్వతి పరమేశ్వరులు అని దీవించారు, నాకు గవర్నమెంటు ఉద్యోగమూ వచ్చింది, నాన్న గారిని వదలి వేరొక ఊరులో ఉద్యోగ నిమిత్తము కాపురం పెట్ట వలసి వచ్చినది. (నాన్న గారు గుడిలో పూజారిగా ఉంటాను, ఈ వయసులో మీ మధ్య నేనెందుకు అని మమ్ము భాగ్య నగరానికి  పంపించారు.



ఇంతకీ నాపేరు చెప్పలేదు కదా, నాపేరు మాధవ్  భార్యపేరు రాధ

ఇక సంసారంలో సరిగమలు వినండి

నన్ను పొద్దున్నే రాధ నిద్ర లేపుతుంది వాకింగ్ పొమ్మంటుంది, తనేమో పాలు ఆలస్యముగా వస్తే వాడితో    గొడవ పెట్టు కుంటుంది, పని అమ్మాయి ముందు వస్తే నా నిద్ర చెడ గొట్టావ్ అని ఎగిరి పడు తుంది, నేను   తిరిగి వచ్చాక కూడా రుస రుస లాడుతూ ఉంటుంది,   పే పరు బాయ్ ఇంటిలోకి విసిరేశాడని వానితో గొడవ పెట్టు కుంటుంది, నేను ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళతో తగాదా పడ కూడ దన్నా విని పించుకోదు, నన్నే ఉరిమి  ఉరిమి  చూస్తుంది, అప్పుడను కూనే వాణ్ని ఇలాంటి వాళ్ళను కాలమే బాగు చేయాలి,   నోటితో న్యాయం చెప్పఁటం కన్నా మౌనం గా ఉండుట మేలు అని తలచి కాపురము చేస్తున్నాను. టివి అదే పనిగా చూస్తుంది, సీరియల్సస్ లో లీనమై పోతుంది, వంటకాలు చూసి రోజు కొక  వంటకం తయారు చేస్తుంది .


ఏదన్నా అంటే ఈ వయసులో కాక ఏ వయసులో సుఖపడతాం అంటుంది, పిల్లలు మాత్రం ఇపుడే వద్దంటుంది, మీ సంపాదన పిల్లలు ఉంటే సరి పోదంటుంది. ఎవరు ఏమి చెప్పిన ఇట్టే నమ్మేస్తుంది, ఆఫీసులో ఆలస్య మైనదనుకో ఆరోజు నాకు పస్తే నోరు చేసుకొని కాపురం చేస్తుంది.

       

ఒక రోజు నాన్నగారు మా ఇంటికి వచ్చారు, ఎరా ఆలా ఉన్నావు, కోడల పిల్ల లేవ లేదా, వంట్లో      నలతగా ఉన్నది. అందుకని నేనే గ్రైండర్ లో పప్పు రుబ్బి దోశలు వేయుటకు నేను రడీగా ఉన్నా నాన్న, నీవు కాళ్ళు చేతులు కడుక్కొని రా, నీకు దోశలు పెడతాను, నాకు తొందర లేదురా, ఇప్పుడే రైల్లో దిగి ప్రక్కనే ఉన్న హోటల్లో టిఫిన్  తిని వచ్చానురా, నీవు ఆఫీసుకు పోతావేమోనని తొందరగా వచ్చాను, నీవు అమ్మాయి తినండి,  నీ పరిస్థితి చూస్తుంటే నాకు దిగులుగా ఉందిరా, నాన్న నేను ఆఫీసుకు పోయి  వచ్చాక అన్నీ మాట్లాడు కుందాం, నేను  కూడా నా స్నేహితుని కొడుకు మ్యారేజ్ చూసి వస్తాను . అమ్మాయికి ఒకేమారు చెప్పి పోతాను పిలుస్తావా.

రాధా అని పిలిచాడు.

         మావయ్యగారు ఎప్పుడు వచ్చారు, ఏమిటి  చెప్పకుండా వచ్చారు, సరేలేండి భోజనం చేసి మరి వెళ్ళండి.



ఏమిటే ఆ  మాటలు నాన్నతో

నేనేం తప్పు మాట్లాడ లేదు ఉన్న నిజం చెప్పా అంతేకదా

బాబు మీ సంసారం చూసాక మీకు కొన్ని విషయాలు చెప్పి వెళతాను అన్నాడు అట్లాగే నాన్న.   

ఏమిటండి, మీనాన్న నాకు చెప్పేది అన్నది

 మా నాన్నగారు వెళ్ళేదాకా అన్న నీ నోరు కంట్రోల్లో  పెట్టుకో, లేదా నేను చేయి చేసు కోవాల్సి ఉంటుంది,

ఏమిటి మీ చేయి లేస్తుంది, మీ నాన్న కోసం మీరు చెప్పినట్లుగా బుద్ధిమంతురాలుగా ఉంటాను నోరు ఎత్తను అన్నది.



చూడు బాబు మారాలి మారాలి భార్య అని ఆమె చెప్పిన వన్నీ కోపంతోగాని ప్రేమతో గాని చేయటం తప్పు కాదు,    కాని నేను ఉద్యోగం చేస్తున్నాను అని అహంకారము భార్య ముందు ప్రదర్శించ కూడదు, భార్య భర్తలలో ఎవరికి   ఎవరు ఎక్కువకాదు .. తక్కువ కాదు ... సమానమే



మనస్పర్థలు రాకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రతి విషయము  సాల్వు చేసు కోవాలి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆయన ఒకరి కొకరు ప్రేమను పంచుకొని సంసారాన్ని స్వర్గమయం చేసుకోండి, ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం నాముందు కీచులాటలు మాత్రం ప్రవర్తించ కండి.


మీ సంతోషానికి నేను అడ్డురాను, మీరు ఏ తిండి పెడితే అదే తింటాను, నాకు   పెన్షన్ వస్తుంది అది కూడా మీకే నేను ఇక్కడ ఉన్నంత కాలము మీకే ఇస్తాను.



మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నాకు మనవుడో  మనవరాలో ఇవ్వండి వాళ్ళతో ఆడు కుంటూ ఇక్కడే ఉంటా .


అప్పుడే మావయ్యగారు నన్ను  క్షమించండి  తప్పుగా మాట్లాడితే మన్నించండి, మీరు ఇష్టమున్న రోజులు ఇక్కడ ఉండవచ్చు


నాన్న మీరు ఎక్కడికీ పోనక్కరల్లేదు ఇక్కడే ఉండండి.

మీరు కీచులాట లాడితే మాత్రము ఇక్కడ ఉండలేను ముందే చెపుతున్నాను.       


చీకటి పడింది, మావయ్యగారు పడుకొనే  గది చూపించి, మంచి నీళ్లు పెట్టి ఏ అవసరము వచ్చిన మీ అబ్బాయి నా సెల్లు నెంబర్లు ఇవి ఫోన్ చేయండి అనిచెప్పి పడక గది చేరి భర్తతో ఇంటి పనులు అన్నీ నే చూసు కుంటా, ఆఫీసు పనులు మీరు చూసుకోండి


అబ్బా ఈ రోజు పండు వెన్నలుగా ఉన్నది మంచం పై ఒకరికొకరు తన్మయత్వంలో మునిగి తేలారు, ఏవండీ నేను కూడా ఉద్యోగం చేయనా, మీ నాన్నగారు కూడా ఉన్నారుగా, ఇప్పుడు మనకు డబ్బుని గూర్చి ఆలోచించ వద్దు పిల్లలగురించి ఆలోచిద్దాం, అవునండి మనకు పిల్లలు కావాలి, మీ నాన్నగారు కూడా ఉండాలి,   (శంకరం మనసులో   అను కున్నాడు  ఇంట్లో పెద్దలు ఉంటె ఆ యిల్లు సుఖశాంతితో ఉంటుంది)   అంటూ    వారిరువురి హృదయాలు ఆనందంతో నిండినాయి.   


  --((*))--

Friday 5 July 2019

*సంకట నాశన గణేష స్తోత్రమ్*

*సంకట నాశన గణేష స్తోత్రమ్*
🕉ఓంశ్రీమాత్రేనమః🕉

*నారద ఉవాచ:*

@@@@@@@@@

*ఓం శ్రీప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్౹౹*


*భక్తావాసం స్మరే న్నిత్య మాయుః కామార్థ సిధ్ధయే॥*


*ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్౹౹*


 *తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్॥*


*లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ౹౹*


*సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకమ్॥*


*నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకమ్॥*


*ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్౹౹*


*ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః౹౹*


*న చ విఘ్నభయం తస్యసర్వసిధ్ధికరం ప్రభో॥*


*విధ్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్౹౹*


*పుత్రార్థి లభతే పుత్రా న్మోక్షార్థి లభతే గతిమ్॥*


*జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్॥*


*సంవత్సరేణ సిధ్ధిం చ లభతే నాత్ర సంశయః॥*


*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹*


*తస్య విద్యా భవేత్ సర్వా గణేషస్య ప్రసాదతః॥*

💫🌞🌏🌙🌟🚩


*సంకట నాశక గణేశ స్తోత్రము... అర్ధ సహితముగా*

💫🌞🌎🌙🌟🚩
 *నారద ఉవాచ:*

*ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |*

*భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||*

దేవతలందరికంటే  ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా  నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను.


*ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |*

*తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||*

ప్రధమ నామం: వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు), ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు), తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు),చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు).


*లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |*

*సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || 3 ||*

పంచమ నామం: లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు), షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు), సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు), అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు).


*నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకమ్ |*

*ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||*

నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు), దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు) ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు).


*ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |*

*న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || 5 ||*

నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు), దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు) ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు).


*విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |*

*పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||*

ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును.


*జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |*

*సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||*

ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు.


*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹*

*తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||*

ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును.


            
*🌏ఆధారశక్తి🌏*

*!! శ్లోకం!!*

*! గం గం గం గం నమో నమో !!*

*! గణపతయే గణపతయే ప్రియపతయే !!*

*! నిధిపతయే శృతిపతయే నమో నమ: !!*

*విశ్వపతయే పుష్టిపతయే తుష్టిపతయే  శిష్టపతయే వ్రాతపతయే భూతపతయే*
*మంత్రపతయే విశ్వపతయే నమో నమ: !!*

*ఆధారము లేకుండా ఏదీ నిలువలేదు...  ఆధారశక్తి "గణపతి" సకల విశ్వాలకూ...  ఆధారమైనవాడు... అధేవిదంగా సకల జీవులకు ఆధారశక్తి అయిన మూలాధారం "గణపతి స్థానం".....*


*ఇహలొకంలో జీవికకూ... ఆధ్యాత్మిక ఎదుగుదలకూ ఆధారశక్తి మూలం... పంచభూతాలను కలుపుకున్న పృధ్వీ అన్నింటికీ ఆధారం... ఆ పృధ్వికీ అధిష్టాన ధైవం.*

     *"గణపతి"..............మూలాధారంలో ఆరంభమయి..............షట్చక్రాలలో వ్యాపించి ఉన్న చిన్మయశక్తి 💥 "గణపతి".గణపతిని ధ్యానిస్తే... షట్చక్రాలనూ అధిగమించి సిద్దిపొందవచ్చును...*

🕉🌞🌏🌙🌟🚩

*రమణాశ్రమ లేఖలు / బ్రహ్మోత్సవం*
🕉🌞🌎🌙🌟🚩

 (తరవాత భాగం)*

__*ఎక్కడో పాలసముద్రం ఉన్నదనీ,  అందులో శ్వేత దీపం ఉన్నదని, ఆ ద్వీపంలో శ్రీమహావిష్ణువుంటాడనీ, ఆ విష్ణువును సేవించే నిమిత్తం, దేవతలంతా చుట్టూచేరి ఆనందిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పారు.*_

_*అంతటా నిండి ప్రవహిస్తున్న వర్షజలం క్షీరవారధిగాను, విద్యుద్దీపకాంతితో నిండిన స్వర్ణోత్సవ పర్ణశాల శ్వేతదీపంగాను, అందున్న రమణపరమాత్ముడే  శ్రీ మహావిష్ణువుగాను, చుట్టూచేరి సేవించుచున్న భక్తబృందమే  దేవతలుగాను నాకు అనిపించింది. ఆ దృశ్యం చూచి నా హృదయం పొంగిపోయింది.*_

    _ఇంకా ఎన్నెన్నో తలంపులతో ఎదుటికి వెళ్లేసరికి, చిరునవ్వు నవ్వుట ఆరంభించారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. నమస్కరించి లేచానో,  లేదో "జనం గుంపుగా రాకముందే వేదపారాయణ ముగించివేశారులే" అన్నారు భగవాన్.  రెండు నెలలక్రితం, స్వర్ణోత్సవమప్పుడు,  రోజుకన్నా ఒక గంట ముందే వేదపారాయణ ప్రారంభించటవల్ల మనం అంతా వెళ్ళేసరికి ఆ కార్యక్రమం ముగింపయింది. "ఇప్పుడు అంతే అయిందిలే" అన్నారని, శ్రీవారి నవ్వుకు అర్థం గ్రహించి, నా అజాగ్రత్తకు కించపడి "భగవాన్ ! రాత్రంతా ఇక్కడే ఉన్నారా ఏమి?" అన్నాను. "లేదు, లేదు ఏటేటా రెండు గంటల నుంచే జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. అందువల్ల; రెండింటికే ఇక్కడికి వచ్చాం. వానవల్ల ఇంకా గుంపులు రాలేదు" అన్నారు భగవాన్. "మీరింత ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా వేస్తాం" అన్నారొక భక్తులు. అంత నవ్వుకున్నాం._

  _అంతా ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కూర్చుంటే;  రామస్వామి పిళ్ళై, కుప్పుస్వామి అయ్యర్ వచ్చి సోఫాముందు నిలిచారు. "ఏమి? పారాయణ ఏమైనా ఉన్నదా?" అన్నారు భగవాన్. అవును స్నానానికి ఇంకా వేళ కాలేదు. *దేవారం చదువుతాం" అన్నారు పిళ్ళె.  "సరే" నన్నారు భగవాన్. పాడటం ప్రారంభించారు. ముగిసేసరికి "స్నానానికి వేళయిం" దంటూ వచ్చాడు రంగసామి. మణివాచకులు వ్రాసిన "తిరువెంబావై" పాడుతామంటారు పిళ్ళె. "ఇరవై చరణాలున్నవి. అదంతా పాడేదాకా ఎవరుంటారు? వేళయిం" దంటూ, కాళ్లు సర్దుకున్నారు భగవాన్. ఆపుతామంటూనే "అణ్ణామలైయా" అనే ఒక చరణం పాడారు పిళ్ళె. దాని తాత్పర్యం ఇది. *"ఓ సఖీ, అరుణాచలేశ్వరుని పాదపద్మముల కాంతిచే నమస్కరించు అమరుల మకుట మణుల కాంతి క్షీణించి, మరుగైనట్లు ఉదయించు భానుకిరణముచే చీకటి విచ్చి, నక్షత్రముల కాంతి తగ్గియుండగా,  స్త్రీయై, పురుషుడై నపుంసకుడై,  దివ్యతేజోమయ అంబరమై వుండు ఆ పాదారవిందమును కొనియాడుకొనుచూ,  పులతటాకమున  నీది, నీరాడుదము లెమ్ము ."*

                       తిరువెణ్ బావై:
     
   అణ్ణామలైయా నడిక్కమలం చెన్ఱిఱైంచుమ్
   విణ్ణోర్  ముడియిన్ మణిత్తొ హై వీఱ ఱ్ఱ్రార్పోర్
   క్కణ్ణారిరవి కదిర్ వందు కార్కరప్పత్తణ్ణారొళి
   ముల్లంగి త్తారకైకళ్  దామకల
   ప్పెణ్ణాకి యాణా యలియాయ్ ప్పిఱంగొళిశేర్
   విణ్ణాకి మణ్ణాకి యిత్తనైయున్ వేఱాకి
   క్కణ్ణా రముదముమాయ్ నిన్ ఱాన్  కళల్ పాడి ప్పెణ్ణే
   యిప్పూంబునల్ పాయ్ దాడేలో  రెంబావాయ్'.

  ఆ పాట ముగింపు రావటం, భగవాన్ సోఫానుండి కాలు క్రింద పెట్టడం ఒకేసారి జరిగింది. 'నీరాడుదము లెమ్ము' అనేసరికి "ఇదిగో వెడుతున్నాను స్నానానికే" అని నవ్వుతూ లేచారు భగవాన్. అందరికీ నవ్వు వచ్చింది. *స్త్రీ పురుష నపుంసక మూర్తి కానీ పరతత్వం రమణ రూపంతో వచ్చినా*‌ అరుణాచలేశ్వరుని అర్చించే విషయంలో, అబలాభావంతో మాటాడేసరికి, నాకెక్కడలేని సజాతిగర్వం వచ్చింది. *మణివాచకులు అబలాభావం పొందే ఆ పాటలు పాడారట. "అక్షరమణమాల" కూడా అబలాభావంతోటే వ్రాశారు భగవాన్.* ఆధ్యాత్మిక దృష్టిలో అబలాభావం ఎంత అగ్రస్థానం వహించిందో చూచావా?_

    _గత ఏడాది, ఈ కృత్తికోత్సవానంతరం అరుణాచలేశ్వరుడు గిరిప్రదిక్షణార్ధం వచ్చిన సందర్భంలో "అప్పకు పిళ్ళై అడక్కం" -  *తండ్రికి బిడ్డ విధేయుడు.* అన్న భగవద్వాణి* పురస్కరించుకొని, లేఖారచన ఆరంభించాను.  అవన్నీ మొన్ననే అచ్చుకు పంపారుకదా?  ఈ ఏడు కృత్తికోత్సవానికి, ఈ తిరువెంబావై పాటలో "ఓ సఖి నీరాడుదము లె" మ్మని పాడేసరికి; ఇదిగో వెడుతున్నాను స్నానానికే" నన్న ఈ భగవద్వాణిని పురస్కరించుకొని మళ్ళి వ్రాయటం కారంభించాను._         
           
                                                 ఇక సెలవు
                                                    సోదరి.
*స్వర్ణోత్సవ సందర్భంగా నిర్మించబడ్డ పర్ణశాల.
*అరవపాట.

🕉🌞🌙🌟🌎🚩

 ఆత్మయొక్క గుహ్యస్థానము


శిష్యుడు - అయ్యా , అయితే మీరెవరే నుద్దేశించి “ నిన్ను నీవు తెలుసుకొనుము ' అని అంటూవుంటారు ?


 మహర్షి - నీ వెవరవై యున్నావో అట్ట నీవే . యీ అహంకారమే ( జీవుడే ) తనయొక్క మూలమును తెలుసుకోవలసిన అవసరము తనకు స్పురించినపుడు ఆ సంజ్ఞను ( ఉపదేశమును గ్రహించి , లోపలికి చొచ్చును అచ్చట తన నిజజన్మస్థానమును , నిజస్వభావము కనిపెట్టును ; కనుక , జీవుడు తన్ను తెలుసుకొనుట ప్రారంభించి ( తనను ) ఆత్మను కనిపెట్టి ముగించును.

🕉🌞🌎🌙🌟🚩

 అంతర్ముఖత్వ సాధన

మహావాక్యాలూ, వాటి అర్ధనిర్ణయాలూ అంతులేని చర్చలకు దారితీసి సాధకుల మనస్సులను బహిర్ముఖంగా ప్రసరింపజేస్తూ ఉంటాయి. మనస్సును అంతర్ముఖం చెయ్యాలంటే సాధకుడు సూటిగా “నేను" లో నిలకడ సంపాదించుకోవటం అవసరం. బాహ్య ప్రవృత్తులంతరించి అతనికి అప్పుడు పరమశాంతి చేకూరుతుంది.

🕉🌞🌎🌙🌟🚩

పులికి జింక నమస్కరించింది


భగవాన్ భక్తులందరూ "తిరువాయ్ మొళి "ప్రబంధాన్ని చేతిలో పెట్టుకుని వైష్ణవ సంప్రదాయాన్ని శ్లాఘిస్తూ మాట్లాడారు. అంతా వినిన భగవాన్ వారితో “సర్వ సమర్పణకు తగిన మంత్రాన్ని ఉచ్చరించి గురువుకు దక్షిణ ఇస్తే, అంతా అర్పణo అయిపోతుందని అనుకుంటున్నారు. తర్వాత ఏమి చేసినా పరవాలేదు వైకుంఠంలో సీటు రిజర్వు అవుతుందని అంటున్నారు.” అని ఎంతో చనువుతో అన్నారు. ఇంకా “అర్పణమన్నది అంత సులభం కాదు. మనసు తన స్థితిలో అణగి ఐక్యమవ్వాలి. ఇలాగా అవడానికి స్వప్రయత్నము, ఈశ్వరానుగ్రహము లేకుండా జరగదు. ఈశ్వర శక్తి మనల్ని పట్టుకుని లోపలికి లాగి అహమునందు స్థిర పరుస్తుంది. అప్పుడే సర్వసమర్పణo కాగలదు.
మనం అర్పించుట ఏమిటి? మనం అర్పించడానికి ఎక్కడున్నాము? తానే అర్పణమై  పోతుంది. ఇటువంటి పూర్ణ శరణాగతి సాధించేందుకు మనసు అల్లాడి పోతూనే ఉంటుంది. ప్రయత్నం చేసుకుంటూనే ఉంటుంది. ఇట్ల ఉంటే చివరకు ఎప్పుడో ఫలితం లభిస్తుంది. అర్పణం అర్పణం అని ఊరకనే నోటితో అంటే ఏం ప్రయోజనం? ఏదో దక్షిణ ఇచ్చామన్నది తప్ప మనసుకుఏముంది? అర్పణం అయిన తర్వాత మనసు ఇక తిరిగి రాదు. "నేను" అని ఒకటి ఉంటేనే అర్పించవచ్చును. "నేను" ఎవరిని అని తెలియనంత వరకు సర్వ సమర్పణo జరుగదు.” అని ముగించారు శ్రీ భగవాన్.


“రమణ కరుణాసాగర తరంగాలు “ నుండి సేకరణ


  1. 🕉🌎🌞🌙🌟🚩
_*శ్రీరమణీయం* *-(217)*_
🕉🌞🌎🌙🌟🚩

_*"గురువు అనుగ్రహాన్ని ఏవిధంగా పొందవచ్చు ?"*_

_*గురువు ఆశించినట్లుగా ఉండటమే నిజమైన వినయం. 'గురువైనా, దైవమైనా' మన నుంచి నమస్కారాలు, పొగడ్తలు, కానుకలు కోరుకోరు. వారికి మన నుండి కావలసింది సత్ప్రవర్తన, సదాచారం, సచ్చీలత, సాధన.. ఇవే మనని గురువు అనుగ్రహానికి పాత్రులను చేసేవి. మనలో కోరికలు మాత్రమే ఉంటే అందుకోసం దైవాన్ని ఆరాధించేందుకు దేవాలయానికి వెళ్ళాలి. అదే మనలో సద్గుణాలు ఉంటే దైవమే మన వెంట నడిచి వస్తుంది. మనకి దైవికమైన జ్ఞానం కలిగే కొద్దీ తృప్తి వస్తుంది. దైవం అంటే ఏమిటో తెలుసుకోవాలన్నా, అనుగ్రహానికి సదాపాత్రులమై ఉండాలన్నా, మన గుణాలను సంస్కరించుకోవాలి. గురువు పట్ల వినయం కేవలం దేహపరమైనది కాదు. గురువు ఆశించినట్లుగా నడుచుకోవటం, గురువు గుణాలను స్వీకరించి అనుసరించటమే సాధకుని ప్రథమ కర్తవ్యం !*_

_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'ముక్తి, విచారణ కొత్తగా తెచ్చుకునేవి కావు !'*-

🕉🌞🌎🌙🌟🚩

దేశం గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పొలాల్లో...

🌱🍅🌰🍠🥔🌶🌽🍆

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమోనని భయపడే
దేశ భక్తులారా....
ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా....
ఒక్కసారి ఆలోచించండి...

@ దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా.......
🍅🍅🍅
ఇష్టమయిన క్రికేటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....
🍏🍏🍏
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....
🌽🌽🌽
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్
అనే ఆందోళన నీకుందా ?...
🌶🌶🌶
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులకెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....
🥕🥕🥕
నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......
🍆🍆🍆
అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....
🍋🍋🍋
ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....
🍠🍠🍠
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన
నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....
🥒🥒🥒

🍍🍍🍍
ఎప్పుడయినా ,
గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....
🍇🍇🍇
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా.
🍈🍈🍈
కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు  ఏనాడైనాచూసావా... ?
🥜🥜
🍊🍊🍊
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....
🌿🌿
🐓🐓🐓
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పోలాల్లో ....
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి .. !

🌾"అన్నదాత సుఖీభవ"🌹🙏



Thursday 4 July 2019




 04. శ్రీరామకృష్ణుని కధామృతం లోని కొన్ని అమృత బిందువులు- 11 .
🕉🌞🌎🌙🌟🚩

శ్రీరామకృష్ణులు -విద్యాసాగర్.

అందరూ యెంతో శ్రద్ధగా తనవాక్కులు వింటుండగా,   విద్యాసాగరుల సమక్షంలో,   రామకృష్ణులు,  ఋష్యాదులు, బ్రహ్మజ్ఞాన సాధనకు యెంత శ్రమించారో, చెబుతున్నారు. 

ఋషులకు బ్రహ్మజ్ఞానం కలిగిందంటే,  వారికి విషయాల మీద ఆసక్తి లేకపోవడం వలననే. వారు యెంత శ్రమించేవారు !   వేకువనే ఆశ్రమాన్ని వదలివెళ్ళి, ఏకాంతంలో, బ్రహ్మచింతనలో  గడిపేవారు.  ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత, కందమూలాలని  ఆహారం గా తీసుకునేవారు.  ఇంద్రియముల బారిన పడకుండా, శబ్ద స్పర్శ,  రూప రస గంధాది విషయాలనుండి మనస్సును దూరంగా వుంచేవారు.   అప్పుడు వారి చైతన్యమే బ్రహ్మమయమై వుండేది.  

ప్రస్తుత కాలంలో జీవులు అన్నగత ప్రాణులు అయినందువలన,  దేహాభిమానం నశించదు.  అలాంటి వారికి సో>హం  అనే భావన చెప్పినా తలకెక్కదు.    అన్ని కార్యక్రమాలూ చేసుకుంటూ,  ' నేను బ్రహ్మమును ' అనుకోమని చెప్పడం కూడా ఉచితం కాదు.   విషయబుద్ధి త్యజించలేని వారు కనీసం,  ' నేను భగవద్ భక్తుడిని,  ఆయనకు దాసుడిని. '  అనే భావం నిలుపుకోవడం మంచిది.  అదే కదా భక్తి మార్గం. 

ఇక జ్ఞాని అయినవాడు,  ' నేతి నేతి  ( న ఇతి   న ఇతి ) '  అని విచారణ చేస్తూ, విషయబుద్ధిని పూర్తిగా జయిస్తాడు.   అదే బ్రహ్మాన్ని తెలుసుకునే మార్గం.    ఒక్కొక్కమెట్టును వదులుతూ మేడపైకి చేరుకోవడం లాంటిది, ఈ సాధన. 

విజ్ఞాని అయినవాడు,  అంటే జ్ఞానికన్నా ఎక్కువ సాధన చేసినవాడు,  మేడ, మెట్లు రెండిటియందు వున్న విషయము ఒకటే అని తెలుసుకుని, నిర్గుణపరబ్రహ్మాన్ని, సగుణ బ్రహ్మంగా కూడా దర్శిస్తాడు.   అంటే ప్రతి చైతన్యంలో పరబ్రహ్మ తత్వమే కనబడుతుంది.  

ఇంటి మేడమీద ఎక్కినవారు ఎక్కువసేపు అక్కడ వుండక ఎలా దిగివస్తారో, సమాధిస్థితి కలిగి, బ్రహ్మసాక్షాత్కారం పొందినవారు కూడా,  కొద్దిసేపటికి దిగివచ్చి జగత్తును, జీవులను భగవంతునిగానే చూస్తారు.   ఇలాంటి  జ్ఞానానికి విజ్ఞానమనిపేరు.   జ్ఞానమార్గం, జ్ఞాన-భక్తి మార్గం, భక్తిమార్గం,  యివన్నీ భగవంతుని చేరే మార్గాలే.  ' నేను ' అనే భావం వున్నంతవరకు, భక్తి మార్గంలోనే పాకులాడాలి. అదే సులభం. 

విజ్ఞాని అయినవాడు,  బ్రహ్మాన్ని భగవంతునిగా దర్శిస్తాడు.  త్రిగుణాతీతుడైనవాడే షడ్ ఐశ్వర్య సంపన్నుడైన భగవంతుడని తెలుసుకుంటాడు.  ఈ బ్రహ్మాండం, మనస్సు, బుద్ధి, భక్తి, వైరాగ్యం, జ్ఞానం అన్నీ అయన సంపదలే !  '   అని చెబుతూ రామకృష్ణులు, ఇల్లూ వాకిలి లేనివాడిని ఎవరూ జమీందారు అన్నారు కదా !  ఈశ్వరుడు పరిపూర్ణ ఐశ్వర్యవంతుడు కాబట్టే,  ఆయన మాట అందరూ వింటారు.  లేకుంటే ఎవరు లెక్కచేస్తారు ?  '  అని అనగానే అంతా ఆమాటలకు ఫక్కున నవ్వి,  తమ ఆమోదం తెలిపారు. . 

ఇది అంతా విద్యాసాగర్ గారు కూడా యెంతో శ్రద్ధగా వింటున్నారు.  సామాన్యంగా విద్యాసాగర్ ధర్మ సంబంధిత బోధలు చెయ్యరు.  కానీ, అయన తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడే.   ఆయన గొప్ప మానవతావాది.  మానవసేవే మాధవసేవ అని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు.   ఇతరులు మనలను ఉదాహరణగా అనుసరించాలనీ, అందరూ ఆ విధంగా జీవితసరళిని  దిద్దుకుంటే,  భూలోకమే, స్వర్గలోకం లాగా వుంటుందని, నమ్మేవాడు.  

విద్యాసాగర్ గారు చర్చలో పాలుపంచుకుంటూ,  '  భగవంతుడు కొందరికి అధికశక్తి, మరికొందరికి అల్పశక్తి ప్రసాదిస్తాడా ?  '  అని అడిగారు.   ఆయన సందేహం నివృత్తి చేయడానికి,  రామకృష్ణులు   చెప్పసాగారు. 

🕉🌞🌎🌙🌟🚩
 అంతా చిద్విలాసం
🕉🌞🌎🌙🌟🚩 

శివ శక్తులన్నా, ఈశ్వర జగత్తులన్న అంతా శివస్వరూపమే. ఒకటి శివుని అచల స్వరూపం, రెండవది శివుని సచల స్వరూపం, చిద్వస్తువే అటు అచలంగా , ఇటు సచలంగా కూడా ఉంది. చైతన్య స్వరూపులు కానివారెవ్వరు? చైతన్య స్వరూపమైన ఆత్మ ప్రత్యక్షం కాకపోతే శివుడు ప్రత్యక్షం కాలేదన్నమాటే.

🕉🌞🌎🌙🌟🚩

 మరణాన్ని ఎదుర్కొంటే మరణ భయం పోతుంది.


      మణ వాసి రామస్వామి అయ్యర్ ఇంటిదగ్గర ఎవరో పోయారు. ప్రక్కింట్లో చావు కాబట్టి రామస్వామి అయ్యర్ ఇంట్లో పిల్లలను  ఆ రోజంతా ఆశ్రమంలోనే ఉండమని పంపించారు. మణ వాసి రామస్వామి అయ్యర్ కుమార్తె రమణికి మనస్సులో ఏదో తెలియని భయం ఆవరించింది. భయంతో బెదిరి పోయింది. పిల్లలు ఆశ్రమం చేరారు. రమణి ఎటువంటి ఆలోచనలు లేకుండా తిన్నగా పాత హాలుకు భగవానుని దర్శించాలని వెళ్ళింది. భగవాన్ ను దర్శించి గానే మరుక్షణమే ఆమె తన భయాన్ని కోల్పోయింది. భగవాన్  రమణి తో "చనిపోయిన శవాన్ని చూసి ఎందుకు భయపడాలి ? ప్రాణం ఉన్న శవాన్ని చూసి ఒకవేళ భయపడినా అర్థం ఉంది "అన్నారు


“రమణ కరుణాసాగర తరంగాలు “ నుండి 

🕉🌞🌎🌙🌟🚩

 శిష్యుడు - అయితే , హృదయమే జీవునికి మూలస్థానము ( కేంద్రము ) అని చెప్పుచుంటిరిగదా . . . ? 


మహర్షి - నిజమే ! అది ఆత్మయొక్క పరమకేంద్రము , దానిని గురించి సంశయమక్కరలేదు . సత్యవస్తువగు ఆత్మయే హృదయమునందు జీవుని వెన్నంటియున్నది .

🕉🌞🌎🌙🌟🚩

 05. రమణాశ్రమ లేఖలు/ స్వర్ణోత్సవ కార్యక్రమము 9-9-46


  నిన్నటి జాబులో స్వర్ణోత్సవం గురించి కొంతవరకు వివరించాను. ఈ జాబులో నాటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడుంబావు వరకు జరిగిన కార్యక్రమము క్లుప్తంగా వ్రాస్తున్నాను. 
  
     ఉదయం ఏడుంపావుకు  ఉమా, మొదలైన పుణ్యాంగనలు భజనలతో పాల కలశాలు తెచ్చి భగవానులకు, భక్తులకు సమర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. పిదప భక్తులనేకులు సంస్కృతంలో, అరవం, తెనుగు, కన్నడం, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో వ్రాసిన వ్యాసాలు, పాటలు, పద్యాలు చదివారు. ఈ స్తోత్రం కొంత, కొంత వ్యవధితో మధ్యాహ్నం రెండింటివరకూ జరుగుతూనే ఉన్నది. సుమారు ఎనిమిదిన్నర మొదలు, తొమ్మిదిన్నరవరకూ బూదులూరి  కృష్ణమూర్తి అయ్యర్ పాటకచేరి. తొమ్మిదీ ముప్పావు మొదలు పదింటివరకు విశ్రాంతి. పదింపావుకు మాతృభూతేశ్వరాలయంలో పూజ,కర్పూర హారతి జరిగినవి. పదుకొండు గంటలకు అరుణాచలేశ్వరాలయం నుంచి గురుకుల ప్రసాదం తెచ్చి భక్తిపూర్వక ప్రణామంతో భగవానులకు సమర్పించారు. పదకొండు మొదలు పన్నెండువరకు విశ్రాంతి. 

   యధాప్రకారం రెండింటివరకు భగవాన్ హాలులో వుండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని భక్తులు కోరారు గానీ, వారొప్పుకుంటారా?  భోజనమయ్యీ కాకుండానే కొలువు కూట మలంకరించారు. ఎంతెంత దూరం నుంచో ఎందరెందరో స్తుతించి సేవించాలని వస్తే, వ్యవధి చాలక వారికి ఆశాభంగ మౌతుందని; తమ శరీర కష్టాన్ని పాటించక ఆ కరుణామూర్తి అలా సేవను స్వీకరించి అనుగ్రహించారు.


   రెండింటివరకూ  భగవాన్ దర్శనం ఉండదని చాలామంది ఇంటికి వెళ్లారు.  భోజనానంతరం ఇట్టే వచ్చి చూతునుగదా  కోటిసూర్య ప్రకాశమానమగు తేజస్సుతో, భక్త బృందపరీవృతులై భగవాన్ పాకలో సోఫామీద కూర్చుని ఉన్నారు.  స్తోత్రం జరుగుతూనే ఉంది. ఏ చక్రవర్తినీ, ఏ దైవాన్నీ ఈ పురుషోత్తమునికి సరిపోల్చరాదు. ఏమంటే చక్రవర్తి దర్శనానికి  వెడితే ఎన్నో ఆటంకాలు, ఎంతమంది సిఫార్సులు కావాలి. దేవతా దర్శనమంటావా? వైకుంఠానికి వెళ్ళినా జయ-విజయులు ద్వారం దగ్గర కాపలా వుండి వేళకాదు పొంమ్మంటారు.  కైలాసానికి వెడితే ప్రమధ గణాలూ అంతే!   ఇక్కడో పశుపక్ష్యాదులతో సహా ఎప్పుడూ ఎవరికీ ఏ ఆటంకమూ పెట్టగూడదని ఒకటే శాసనం. చక్రవర్తి శాసనానికైనా తిరుగుందిగానీ; దీనికి తిరుగు లేదు. ఈ దయామూర్తి కెవరు సాటి? వారికి వారే సాటి. (ఇంక ఉంది)

🕉🌞🌎🌙🌟🚩
06-గీతా మకరందము.     అర్జునవిషాదయోగము
🕉🌞🌎🌙🌟🚩  
  
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అస్మాకం తు విశిష్టా  యే 
తాన్నిబోధ ద్విజోత్తమ
నాయకా మమ సైన్యస్య 
సంజ్ఞార్థం  తాన్ బ్రవీమి తే|| 

తా:- ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరుకలరో వారలను జ్ఞాపకముకొఱకు మీకు చెప్పుచున్నాను. (వినుడు).

వ్యాఖ్య:- ప్రతిపక్షవీరులను మాత్రము తెలిపినచో ద్రోణున కొకవేళ అధైర్యము కలుగునేమోయని తలంచి ధైర్యోత్పాదనము కొఱకు స్వకీయ శూరవీరులను గూడ దుర్యోధనుడు తెలుప నారంభించుచున్నాడు. 


08
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ 
కృపశ్చ సమితింజయః | 
అశ్వత్థామా వికర్ణశ్చ 
సౌమదత్తి స్తథైవ  చ * || 


09
అన్యే చ బహవశ్శూరా 
మదర్థే త్యక్తజీవితాః | 
నానాశస్త్ర ప్రహరణాః 
సర్వే యుద్ధవిశారదాః ||


తా:- మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొఱకు తమతమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందఱును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్రసంపన్నులై ఇచట నున్నారు.

వ్యాఖ్య:- దుర్యోధనుడు వీరులను పేర్కొనునపుడు తన పక్షమునకు భీష్ముడు సేనాపతి
యైయుండ, ఆతని పేరు ముందు చెప్పక ద్రోణునిపేరు ఏల చెప్పవలసివచ్చెను? ఎదుటనున్న ద్రోణు డేమి భావించుకొనునోయని సందేహించికాని, గురువును ప్రప్రథమమున ఎన్నుకొనుట భావ్యమని తలంచికాని, ద్రోణాచార్యుని ఉత్తేజపఱచు నుద్దేశ్యముతోగాని అట్లు చేసియుండవచ్చును.
రెండు సేనలయందలి శూరవీరులను ద్రోణాచార్యుడెఱిగియున్నను, అతనితో జెప్పునెపమున దుర్యోధనుడు వారలను తిరిగి జ్ఞాపకము చేసికొని బలాబలములను లెక్కించుచున్నాడు. 

'త్యక్తజీవితాః' = (ప్రాణములను విడిచిపెట్టినవారు) — అను పదము దుర్యోధనుని ముఖతః వెలువడుటబట్టిచూడ తన వారందఱున్ను నశించియే పోవుదురని ముందుగనే అతని అంతరాత్మ భావించియుండవచ్చునని తోచుచున్నది. ఆ ప్రకారముగ పలుకుట దుర్యోధనునకు దుర్నిమిత్తసూచకమని కొందఱి మతము.
------------
*సౌమదత్తిర్జయద్రథః - (పాఠాన్తరము)

🕉🌞🌎🌙🌟🚩
07  శ్రీ ఆదిశంకరాచార్య  విరచితం
శ్రీ జగన్నాథాష్టకం
🕉🌞🌎🌙🌟🚩

1)కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


2)భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటక్షం విదధత్
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


3)మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


4)కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


5)రథారూఢో గచ్ఛన్పథీ మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః
దయాసింధుర్భంధుః సకలజగతాః సింధుసుతయా
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


6)పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనంతశిరసి
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


7)న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవే
న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరపధూమ్
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే || 


8)హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశ
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ||