Monday 28 January 2019

ఆరాధ్య భక్తి లీల -



ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

పుడమి తల్లికి నీరు పెట్టి విత్తనాలు నాటాలి 
కడలి పొంగుల గాలి చేను చేర కుండ చూడాలి  

సుగుణ వల్లికి ప్రేమ చేసి సద్దు చేసి కోరాలి 
మగణి మాటకి మాయ వీడి మంచి చేసి తీరాలి 

అరకు ఆశను తీర్చి వేటు నుంచి మార్పు తేవాలి 
చెరకు తీపియు చూసి ఘాటు ప్రేమ తీర్పు ఇవ్వాలి 

మమత అంతయు చూపి కాల మార్పు అందు కోవాలి     
కలల పంతము మాని అన్న దాత ప్రేమ పండాలి
   
నిట్టూర్పు ఊబినుండి 
కర్షక స్వేదం నుండి
ఎండిన ఎద నుండి 
ప్రతి జీవి బతికి తీరాలి
వేణుగోపాల ప్రేమ సుమా    


--((**))--





నేటి నాపట 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

చిరునగవుల చిందులు చూపి  
చిరుతలా ఉరకలు పరుగులు పెట్టుట ఎందుకే   
పరువు పోతుందని వంకచూపి 
పరుల మాటవిని నన్ను మరచి పోయావెందుకే

చరితను వేలెత్తి చూపి   
దారియేదో తెల్పి మనసు మార్చుట ఎందుకే
బరిలో దిగమని ఆశ చూపి 
వరి కంకులా గాలికి ఉగమన్నావు ఎందుకే

చిన్నదానా వలపును చూపి 
చిన్నమాటకు చిందులు వేయుట ఎందుకే     
ఉన్నమాటని వాదనచేసి
కన్నవారికి నాకు దూరము ఉండుట ఎందుకే  

ఓచిన్నదానా మనసు పంచి 
వేచిఉన్న మనసుకు వేదనే పంచుట ఎందుకే   
దోచితివే నా హృదయము  
పోచగనను తీసివేసి మరచి వెళ్ళుట ఎందుకే 

చిరునగవుల చిందులు చూపి  
చిరుతలా ఉరకలు పరుగులు పెట్టుట ఎందుకే   

--((**))--

Art Saved by SRIRAM

నేటి పాట
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

ఇదేనా మన సంస్కృతి 
మనిషిని మనిషిగా గుర్తించలేని జాతి 
ఎప్పుడు మారును ఈ స్థితి 
ఆ దేవుడే మార్చాలి ఈ పరిస్థితి  

పరువు ప్రతిష్ట అంటూ 
వేదించే గుణాలు 
బరువు భాద్యతలు 
గమనించని మేధావులు  
మిత్రత్వం, భందుత్వం 
మధ్య విభేదాలు 
బిడ్డలకు తల్లితండ్రులకు 
మధ్య పెరిగిన దూరాలు 

ప్రేమతత్వం అర్ధం చేసుకోలేని 
పిన్నలు పెద్దలు 
ఎవరి వారుగా యమునాతీరంగా 
మారుతున్న ప్రవర్తనలు  
చిత్ర విచిత్ర సంఘటలతో 
నిత్యం కలగే మార్పులు
జీవితాలన్నీ మంచి చెడుల  
మధ్య ఉండే జీవితాలు 

సమయాన్ని దుర్వినియోగం చేసే 
పండిత ప్రముఖులు  
గెలుపుకోసం రాజకీయ నాయకులు 
ప్రజలసోమ్మే ప్రజలకు దానాలు 
ప్రకృతి వైపరిత్యానికి 
అవకాస ముష్కర మూఖలు   
విద్యా, వైద్య, రక్షణ విధి 
విధానాలు అర్ధంకాని పరిస్తుతులు   

ఇదేనా మన సంస్కృతి 
మనిషిని మనిషిగా గుర్తించలేని జాతి 
ఎప్పుడు మారును ఈ స్థితి 
ఆ దేవుడే మార్చాలి ఈ పరిస్థితి  


--((**))--


Saturday 19 January 2019

యదార్ధం


నేటి హాస్యం

స్కూటర్ మీద భార్య భర్తలు సినిమాకు  ప్రయాణిస్తున్నారు.

భర్త : నేను నడుప్తు నప్పుడు జాగర్తగా కూ ర్చోవటం నేర్చుకో అన్నాడు
భార్య : ముందు స్పీడ్ బ్రేక్ ఉంది జాగర్త చూసుకో  అన్నాది
భర్త : నడిపేది నేను స్కూటర్  ను ఆపి మరీ అన్నాడు
భార్య : మహాను భావ జాగార్తాగా నడుపూ అన్నది
భర్త : మహానుభావు డెవరే
భార్య : ఎవరో ఉన్నారులే ముందు నడుపు

సినిమా నుండి ఇంటికి చేరారు     
భర్త: భోజనం చేస్తూ కూరలో ఉప్పులేదే అన్నాడు
భార్య : వంట విషయంలో వేలు పెట్టకండి ఇది మాకు సొంతం
భర్త : మహా స్త్రీ  నీ ఒక్కసారి తిని చెప్పమ్మా   
భార్య : ఆవిడెవరు
భర్త ఎవరో ఉన్నారులే ముందు వడ్డించు

ఆ     .........      ఆ     .......

"నా తిరుమల తిరుపతి ప్రయాణ అనుభవాలు " 
ఇది కధ కాదు, యదార్ధం (1 ) (15=1=2019 నుండి 18=1=2019)

కాలచక్రం ఇంత గిర్రున తిరుగుతుందని అనుకోవటం లేదు ఎందుకనగా రిటైరై కాలక్షేపంగా ఏదన్న చదువు కుందామని, వ్రాసుకుందామని ఆలోచించాను అప్పుడే తెలిసింది మీరు ఇంకా ఉద్యోగమూ చేయవచ్చు ఇంకో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవచ్చు అన్నవార్త విని ఒక్కసారి నిద్ర లేచాను.

ఏమిటండి కలలు కంటున్నారు ఇంకా రెండు సంవత్సరాలు ఉద్యోగం చేయాలని  కుంటున్నావా,  ఇక చాలు నిద్ర లేవండి మనం తిరుపతికి వెళ్ళాలి.  కనుక మీరు త్వరగా లేస్తే  చెక చెక దుప్పట్లు సర్ది ఆ తర్వాత తిరుపతి కి తీసుకెళ్లే బ్యాగ్ సర్దాలి, కవర్లు తావాలి. అట్లాగే అంటూ నిద్రలేచాడు భార్య మాటకు భర్త రామకృష్ణుడు. 

ఏవండీ ముందు  మీ చెల్లికి ఫోన్ చెయ్యండి, " మనం వస్తున్నట్లు " 
అసలే టివిలో జనం తిరుమలలో బాగా ఉన్నారని చెబుతున్నారు  
               
ఎందుకైనా మంచిది రికమండేషన్ లెటర్ తీసుకోని వెల్దామా 
వద్దులేవె ..  ... 

మా బావగారు ఉద్యోగం చేసేది దేవస్థానం లో కదా తిరుమలలో చేస్తున్నారో, తిరుపతిలో చేస్తున్నారో మాత్రం నాకు తెలియదు. ఇక లెటర్ ఎందుకె వాళ్ళ ఇంటికి వెళదాం, అక్కడ నుండి వారు ఏమి  చెపితే ఆవిధముగా నడుచుకుందాం. దర్శనం టిక్కట్లు రూమ్ టిక్కెట్లు అన్ని తీసుకోని రడీగా ఉంటారని నాకు నమ్మకముంది. 
ఏమీ లేదు అనుకోని విధముగా మనం బయలు దేరాము కదా ఎటువంటి ఇబ్బంది పడ  కూడదని ఉద్దేశ్యముతో మాట్లాడుతున్న అంతే

మనకు తోడు ఆ వేంకటేశ్వరుడున్నాడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, అయన ఉద్దేశ్యము ఎట్లాగుంటే అట్లాగే మనం ప్రవర్తించుతాము, మన సొంతనిర్ణయాలు ఏమి తిరుమల యందు జరగవు " రూము కానీ, దర్శనం కానీ " ఆ పరమాత్ముడే నిర్ణ ఇస్తాడు  అది అనుభవముతో చెపుతున్నాను అని అన్నాడు శ్రీమతితో రామకృష్ణుడు. 

*సరేలే అంతే  మీ మాట ఎప్పుడు కాదన్నాను, మీరు ఎట్లాగంటే అట్లాగే కదా, మమ్మల్ని ఏమి సంప్రదించరు, మీ ఉద్దేశ్యములు ఖచ్చితంగా చెప్పరు, మన ప్రయాణంలో మీ భార్యగా మీ వెనక ఉన్నానని మరవకండి, అసలే నోట్లో నాలుక లేని దాన్ని. 
ఏమి అంటున్నావు           
ఏమి అనలేదు, బ్యాగ్ సగం సర్దాను, మీకు మూడు ప్యాంటులు, షర్టులు సరిపోతాయా 
అవి సరిపోతాయి కానీ డ్రాయర్లు బనియన్లు  పెట్టటం మరువకు. 
అట్లాగే చీరలు, జాకెట్లు, లంగాలు దుప్పట్లతో  
ఆ మరిచాను పంచ టవల్, మరియు లాల్చీ పైజామా కూడా పెట్టు
ఇంకా ఏమి కావాలో ముందే చెప్పండి, 
ప్రయాణంలో తక్కువ బరువు తీసికెళ్ళటం మంచిదని మా అమ్మ చెప్పేది. అయినా మనజాగర్తలో మనం ఉండాలి  'బ్యాగ్లకు చిన్న తాళాలు బయటకు పోయినప్పుడు తెండి '  
అట్లాగే కవర్లు తాళాలు తీసుకొస్తా 
అంటూ బయటకు బయలు దేరాడు రామకృష్ణుడు. 
         .             

( ఇది కధ కాదు, యదార్ధం (2 )) 
         .             
ఆ వచ్చారా 
వచ్చాను నీవు  చెప్పిన వణ్ణి తెచ్చాను. 
అవిసరే ముందు మన అమ్మాయిలకు ఫోన్ చెయ్యండి తత్కాలక టిక్కెట్లు దొరికాయో లేదో అవి దొరకపోతే బస్సులోనే  పోవాలి 

ఆ ఉండు మన అమ్మాయ్ ఫోన్ చేస్తున్నది  
నాన్న టిక్కెట్లు తీసుకున్నాను, మీ ఫోన్ కు మెసేజ్ పంపాను చూడు అన్న మాటలకు
ఆ ఫోన్ ఇలా ఇవ్వండి 
అన్నమాటలకు శ్రీమతికి ఫోన్  అందించాడు 
యోగక్షేమాలు అడుగుతూ నా ఫోన్ కు కూడా మెసేజ్ పంపు 

నీ ఫోన్ లో కూడా పంపానమ్మా నీవు చూడటం రాదని అంటూ  ఉంటావని ఇద్దరికీ పంపాను. 
అన్నీ సర్డుకున్నావా ఏ టి యం కార్డు జాగర్తగా పెట్టుకోమను, ఇద్దరి అదార్ కార్డులు తీసుకెల్లండి  

ఫోన్ చేయండి నేను కూడా మీకు ఫోన్ చేస్తాను జగార్తగా వెళ్ళి లాభంగా రండి 
అంటూ ఫోన్ కట్ చేసింది కూతురు. 
చూసావ అమ్మాయి టిక్కెట్లు  రిజర్వేషన్  చేసింది, నీవు గాబరా పడ్డావు.

అవునండి మీ కున్న ధైర్యం మాకుండదు, మీరు రిజర్వేషన్ చేయమంటే చెయ్యరు, ఏవో పాత  కార్డులు అంటారు వాటిద్వారా రావంటారు. 
అవునే నిజమే చెప్పాను మన అమ్మాయితో చేయించుకోవటం తప్పు కాదుకదా      
తప్పు కదనకో పెల్లిచేసేసాం అవతలవారు ఎమన్నా అనుకుంటారో ఒక్కసారి ఆలోచించాలి కదా 

ఏమి అనుకోరు, టిక్కెట్లకు  ఎంత ఖర్చయిందో అంతా ఇచ్చేద్దాం 
ఏమిటే ఎదో పిండి వంట మొదలపెట్టావ్       


అవునండి మనం 3 రోజులు తిరుమలలో ఉంటాం కదా లై ట్  గా టిఫెన్  చేస్తాను 
ఎందుకె శ్రమ నీకు అక్కడే కొనుకుందాములే 

సలే మీ చెల్లి ఇంటికి వెళ్తున్నాము కొంత అక్కడ ఇచ్చినట్లు ఉంటుంది మనకు ఉపయోగ పడుతుంది 

మీ ఆడవాళ్ళ శ్రమను ఎవరూ ఆపలేరు 

వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు            

మీతో మాట్లాడుతుంటే పనే కాదు 

నేను సహాయ పడతానులే నీకు తోడు 

వద్దు లేండి మీకెందుకు శ్రమా ఆ కష్టాలేవో మమ్మల్నే పడ నీయండి, మేము చేసిన వాటిలో వంకలు పెట్టకుండా వుంటే చాలు

నేను ఎప్పుడైనా పెట్టానా 

పెట్టకపోయినా కష్టమే పెడితే సర్డుకు పోతాము 

 పెట్టినా అక్షరమే పెట్టకపోగా కష్టమే మీ ఆడవాళ్ళ మాటలను అర్ధం చే సుకోవటం ఎవరి వళ్ళ సాధ్యము కాదు. 

ట్రైన్ టైం కు ముందుగా పోదాం ఎందుకంటే కాచిగూడ స్టేషన్ లో ఏ ప్లేట్ ఫామ్  లో ట్రైన్ పెడాతారో, బ్యాగ్లు మోసుకెళ్ళాలి కదా  

 కదా ఆటో శ్రీనివాస్ ను పిలుస్తాను 

ఆటో శ్రీనివాస్ రానంటున్నాడండి 

మన పెద్దమ్మాయికి ఫోన్ చేసి క్యాబ్ బుక్ చేయమని చెప్పు 

క్షణాలమీద క్యాబ్ బుక్ చేయటం ఎక్కటం జరిగింది 

అలామాప్రయాణం సాగింది 

ట్రైన్ ప్లాట్ఫార్మ్ పై ఉన్నట్లు ఎనౌన్సు చేసారు 

అప్పుడే నేను వేగంగా రెండుచేతుల్లో రెండు బ్యాగులు పట్టుకొని యక్షులేటర్ ఎక్కాను 
అంతే బ్యాగ్ పట్టు కుందో ఏమయిందో తెలియలేదు ఒక్కసారి తల క్రిందులుగా వెనక్కి పడ్డాను, ఎవరో పట్టుకొని లేపినట్లు, ఎక్స్ లేటర్ ఆపినట్లు తెలిసింది. 

వెనకున్న శ్రీమతి అరుపు ఒక్క సారి గుండె జల్లుమన్నది. తాతగారు బ్యాగ్ మెం పట్టుకుంటాం మీరు అట్లాగే నిల బడండి అన్న అరుపుకు నిలబడ్డ. అంతే ఒడ్డుకు చేరిన నావలా ఒక్క గంతు తో ముందుకు వచ్చా. 
 
ఎదో అపశృతి అనుకుంటూ సాగాను రైలు పెట్టేవరకు

నెమ్మదిగా మేము కూర్చొని పడు కొనే స్తలం వరకు వెళ్ళాము 

అప్పటికే మాకన్నా ముందు వచ్చి కొందరున్నారు 

మాకు రైల్ ల్లో మధ్యది, పైది పడుకొనే బెడ్ రావటం, వచ్చిన వారిని అడిగి మరియు మధ్యలో పడుకోవటం జరిగింది. 

మీకు దడ తగ్గిందా నేను వాటర్ బాటిల్ తెస్తానని బయటకు వెళ్లి తీసుకోని వచ్చి నాకు నీళ్లందించింది నా శ్రీమతి. 
             
గబా గబా త్రాగి కొంత విశ్రాంతి తీసు కొని  ఉండగా టిక్కెట్ కలెక్టర్ రావడం, నేను సెల్ చూపటం ఆటను ఎదో టిక్ చేసుకోవటం జరిగింది. 

తిరపతిలో దిగాల్సి ఉన్న రేణుగుంటలో దిగాము అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని కారకంపాడు ప్లాట్స్ అక్కడ తారకరామా నగర్ ల్లో ఉన్న మా చెల్లి ఇంటికి గతుకుల రోడ్డు నెమ్మదిగా ఆటోవాడు పోనిచ్చాడు (మేము దబ్బున ఈ రోడ్డుకు రాము, ఎదో మీరు ఆడి గారని మేము వస్తున్నాము, ఈ  రోడ్డు మీద ఆటో నడిపే బదులు తిరుపతి దాకా పోయి రావచ్చు ) అన్నమాటలకు సరి ఐన వసతులు లేని ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నారు అంటూ     చేరాం. 

కనీసం మేము వస్తున్నట్లు ముందుగా చెప్పిన మా బావగారు లేక పోవటం ముందుగా ఎటువంటి టిక్కెట్లు తిరుమలలో తినుకోలేదు ( దర్శనం, మరియు రూమ్ ) 

అన్నయ్యా మీకు రూమ్ కోసం తిరుమలకు వెళ్లారు ఇప్పుడే వస్తారు, మీరు ఫ్రేష్ అవ్వండి అందరు కలసి తిరుమలకు వెళదాం అన్న మాటలకు కొంత ఊపిరి వచ్చింది. 
అన్నయ్య మనం నది పైకి వెళదాం, పైన దర్శనం టోకెన్లు ఇవ్వటం లేదుట నడచి వెళదాం టోకెన్ కడతారు దర్శనం చేసుకోవచ్చు అన్న మాటలకూ ఏమి చెప్పాలో తెలియలేదు. 

శ్రీమతి ఎదురు చెప్పఁలేదు, 61 వయసులో ఎక్క గల్నో లేదు అనుకోకుండా 
సరే అందరు ఎట్లాగంటే అట్లాగే అని ఊరుకున్నాను. 

ఇద్దరూ ఆడవారు ఒక చోట చేరితే నా ఊహా సంభాషణలు 

ఇలా వంట చేస్తూ మెగవారి జాడ్యాలను నా అనుభవాలను కలిపి చెపుతా విను.

* మనం ఎప్పుడైనా షాపింగ్ వెల్దామంటే ఏడుపు మొహం పెడతారు, ఎదో మనం  సొమ్మును ఖర్చు చేయిస్తున్నట్లు ఊహిస్తారు, కనీసం ఆనందంగా వెంట నడుస్తూ కూడా ఉండారు.

* మగ వాళ్లకి ఎక్కడకన్నా వెళ్లాలని ఇష్ట మైనదనుకో వెంటనే రెడీ అవ్వమని చెపుతారు, ఓ ఆరగంట  ఆయినదో లేదో "ఇంకా ఎంతసేపు అని విసుక్కోవటం మొదలు పెడతారు, ఇంకా ఈ ఆడవారికి చీర సింగారించు కోవటానికి ఒక గంట సమయము ఇచ్చిన సరిపోదు అంటారు.

* మనం ఏదన్నా టివి సీరియల్ చూస్తున్నా మనుకో, దగ్గరగా వచ్చి ఆ సిరియాల్ చూసి మరెందుకు ఏడుస్తారు, అంటూ రిమోట్ లాకుంటారు ఎంతసేపు న్యూస్, స్పోర్ట్స్, లేదా అర్ధం కాని ఇంగ్లీషు సినిమా ను మార్చి మార్చి చూస్తారు, మనల్ని కూడా చూడమని విసిగించి చం పుతారు.

* మనకు మనస్సు బాగాలేనప్పుడు దగ్గరగా వచ్చి, ప్రేమగా ఒక మాట చెప్పఁటమూ,  తీసుకోవటం చస్తే చేయరు, ఇంకా తిండి తినలేదు ఎదో ఆలోచిస్తారు అనీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు.

* ఒక మంచి మాట చెప్పరు పొద్దస్తమానం, ఆకురా అలా చేస్తే బాగుండును కదా, ఆ ప చ్చడి ఎండుమిరపకాయలతో చేస్తే బాగుండేది కదా అని నవ్వు తూ  సతాయిస్తారు. వారు ఇది చేయమని చెప్పరు చేసినదానిని మాత్రం వంక పెడతారు..

* రొమాంటిక్ కధలు చెప్పడం, భార్యను ముద్దుచేయడం కాదనీ  అది భార్యకు లొంగి పోవటమని ఊహిస్తారు, మనం దగ్గర చేరామనుకో   చులకనగా చూస్తారు .

* పురుష అహంకారం  క్వింటాల్లో ఉంటుంది,  చేసిన తప్పు ఒప్పుకోరు, ఒక కోరిక పట్టు పట్టారనుకో నిద్ర పోరు నిద్రపోనీయరు.


* పూలు చీరలు కొనటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు .