Monday 28 January 2019

ఆరాధ్య భక్తి లీల -



ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

పుడమి తల్లికి నీరు పెట్టి విత్తనాలు నాటాలి 
కడలి పొంగుల గాలి చేను చేర కుండ చూడాలి  

సుగుణ వల్లికి ప్రేమ చేసి సద్దు చేసి కోరాలి 
మగణి మాటకి మాయ వీడి మంచి చేసి తీరాలి 

అరకు ఆశను తీర్చి వేటు నుంచి మార్పు తేవాలి 
చెరకు తీపియు చూసి ఘాటు ప్రేమ తీర్పు ఇవ్వాలి 

మమత అంతయు చూపి కాల మార్పు అందు కోవాలి     
కలల పంతము మాని అన్న దాత ప్రేమ పండాలి
   
నిట్టూర్పు ఊబినుండి 
కర్షక స్వేదం నుండి
ఎండిన ఎద నుండి 
ప్రతి జీవి బతికి తీరాలి
వేణుగోపాల ప్రేమ సుమా    


--((**))--





నేటి నాపట 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

చిరునగవుల చిందులు చూపి  
చిరుతలా ఉరకలు పరుగులు పెట్టుట ఎందుకే   
పరువు పోతుందని వంకచూపి 
పరుల మాటవిని నన్ను మరచి పోయావెందుకే

చరితను వేలెత్తి చూపి   
దారియేదో తెల్పి మనసు మార్చుట ఎందుకే
బరిలో దిగమని ఆశ చూపి 
వరి కంకులా గాలికి ఉగమన్నావు ఎందుకే

చిన్నదానా వలపును చూపి 
చిన్నమాటకు చిందులు వేయుట ఎందుకే     
ఉన్నమాటని వాదనచేసి
కన్నవారికి నాకు దూరము ఉండుట ఎందుకే  

ఓచిన్నదానా మనసు పంచి 
వేచిఉన్న మనసుకు వేదనే పంచుట ఎందుకే   
దోచితివే నా హృదయము  
పోచగనను తీసివేసి మరచి వెళ్ళుట ఎందుకే 

చిరునగవుల చిందులు చూపి  
చిరుతలా ఉరకలు పరుగులు పెట్టుట ఎందుకే   

--((**))--

Art Saved by SRIRAM

నేటి పాట
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

ఇదేనా మన సంస్కృతి 
మనిషిని మనిషిగా గుర్తించలేని జాతి 
ఎప్పుడు మారును ఈ స్థితి 
ఆ దేవుడే మార్చాలి ఈ పరిస్థితి  

పరువు ప్రతిష్ట అంటూ 
వేదించే గుణాలు 
బరువు భాద్యతలు 
గమనించని మేధావులు  
మిత్రత్వం, భందుత్వం 
మధ్య విభేదాలు 
బిడ్డలకు తల్లితండ్రులకు 
మధ్య పెరిగిన దూరాలు 

ప్రేమతత్వం అర్ధం చేసుకోలేని 
పిన్నలు పెద్దలు 
ఎవరి వారుగా యమునాతీరంగా 
మారుతున్న ప్రవర్తనలు  
చిత్ర విచిత్ర సంఘటలతో 
నిత్యం కలగే మార్పులు
జీవితాలన్నీ మంచి చెడుల  
మధ్య ఉండే జీవితాలు 

సమయాన్ని దుర్వినియోగం చేసే 
పండిత ప్రముఖులు  
గెలుపుకోసం రాజకీయ నాయకులు 
ప్రజలసోమ్మే ప్రజలకు దానాలు 
ప్రకృతి వైపరిత్యానికి 
అవకాస ముష్కర మూఖలు   
విద్యా, వైద్య, రక్షణ విధి 
విధానాలు అర్ధంకాని పరిస్తుతులు   

ఇదేనా మన సంస్కృతి 
మనిషిని మనిషిగా గుర్తించలేని జాతి 
ఎప్పుడు మారును ఈ స్థితి 
ఆ దేవుడే మార్చాలి ఈ పరిస్థితి  


--((**))--


1 comment: