Tuesday 7 March 2017

మహిళా దినోత్ససందర్భముగామహిళా లందరికి శుభాకాంక్షలు
 మచ్చుతునక పద్యాలు 


1. వెచ్చని మీగడ కన్నా
మెచ్చిన శ్రీమతి పలుకులు కులుకులు కన్నా
వచ్చిన పాప నవ్వులు కన్నా
మిత్రుని ప్రేమ అన్నిటి కన్నా మిన్నా


2. ఆగడు కాల చక్రము
వేగముగ ప్రాణ వాయువు తప్పదు మనకున్
జోగిల వేట ఉన్నను
మూగగ మారిన మిత్రుని స్నేహము మిన్నా


3. మేను ముడతలు వచ్చి
కనుల చూపు మందగించి మిసిమి తగ్గెన్
ఆణువణువవు భాదతొ
అనారోగ్యుని అండ మిత్రుని ప్రేమ శాంతిఁన్

4.భారత భాగవతములు 
అర్ధము బాగా తెలుసుకొని చదవగ వలయున్ 
కరుణ వీరరస కధలు 
అర్ధములే జీవిత సత్యము తెలుపున్ మిత్రమా 

5. పోతన భాగవతంబున 
నీతి కధలు కృష్ణుని వినోద లీలలు చదువూ 
 సత్యము పల్కెడి మార్గము 
నిత్యము ధర్మము తెల్పె కధలు  మిత్రమా

6. చిన్నతనమున నేర్చిన 
సన్నుత గుణములే కీర్తి సంపద దెచ్చున్
 వన్నెల వింజామరులే
ఎన్నడూ దిరుగఁ వలదు తెలుసుకో మిత్రమా 
✌:

కంద పద్యాలు - మిత్రమా(2)

7.  ఆంగ్లము కొరకే మనసు
 మొగ్గును చూపకు తెలుగును చదువుట ఎంచుకో
వ్రాయుట నేర్చుకో అదియే
 మనకు కూడు గుడ్డ కుటుంబ రక్షణ మిత్రమా

8. కోరికలే రూప్యములా
చేరిచితిని కోట్లకొలది - చిఱుకోరికలన్
బారులుగాఁ బడగ లెగిరె
నా రమ్య గృహమ్ముపైన - నా చెలికొఱకున్

9. అతిశము పెచ్చుపెరుగగా
మతితప్పి నడచుగ మిన్ను మన్నునులేకన్
అతి సర్వత్రా నింద్యము
మతిమాలి నడవకు !మంచి మనిషిగ నీవున్

కంద పద్యాలు - మిత్రమా(3)

10. కోరను కోరిక లెవ్వియు
కోరను నినుగోరికోరి కూడని వెవియున్ .
దారుణ దుఃఖిత జీవుల
కూరిమి కాపాడు మనుచు గోరెద నిన్నున్.

11. సంసార సాగరమ్మున
హింసకు తోడై ప్రబలెడు హీనత నందున్,
సంచిత పాపము జోడుచు
పంచాగ్నులునింపినావ పంచముఖేశా !

12. పంచ మకార నిలయమిది
వంచన తోడై వెడలెడు వహికము నందున్.,
సంచిత పాపము తోడుగ
పంచాగ్నులునింపినావ పంచముఖేశా !

కంద పద్యాలు - మిత్రమా(4)

13. నాశములేనిదియైనను
నాశముజేయగలవాడు నరుడే యిలలో.
లేశము యైనను బెదరడు
కాశముయైనవదులడవకాశము యున్నన్.

14. నేనొక బేహారిని విను
నేనమ్మెద రంగు లెన్నొ - నిండిన కలలన్
రా నీకమ్మెదఁ జౌకగఁ
దేనెలలోఁ జిందుచుండు - తీయని కలలన్

15. గత మొక శీతాకాలము
మితిలేని హిమాల రాశి - మెండుగఁ జీఁక
ట్లతులిత వసంత కాల
మ్మిత మివ నరుదెంచు నెప్పు - డెఱుగకనుంటిన్

కంద పద్యాలు - మిత్రమా(3)


పసితనమునఁ బలు యాటలు
మిసగల యౌవనమునందు - మేలగు కలలున్
రసమయమగు బ్రదుకు పిదప
మసృణమగు స్మృతులు ప్రేమ-మయి యంతమునన్

వదలిన బట్టలొ యనఁగా
విదిలించితి వీవు నన్ను - వేగముగా నీ
మదిలో నేమనుకొంటివొ
వదలను నిను నేను నాదు - ప్రతినను వినుమా




విరి వాడును విరి రాలును
విరికి మఱొక జన్మ యున్న - వెండియుఁ బూయున్
మఱి యీ కోరిక విరికిన్
మఱుజన్మయు నున్నఁ జెప్పు - మరునికిఁ దండ్రీ
  

చిన్నప్పుడు నా కలలను
వన్నెల చట్రమ్ము నుంచి - ప్రమదించితి నీ
వెన్నెలలో నా స్మృతులను
వన్నెల చట్రమ్ము నుంచి - స్వప్నము గంటిన్
 









 కంద పద్యాలు - మిత్రమా -5
   
ఓ మగువా  నీవేషము చూస్తే
నా మది తలపులను తట్టి లేపుతున్నది
నీ కళ్ళ నిషా చూపులు చూస్తే
కవ్వింత కాగడాల వెలుగు కనబడుతున్నది
నీ పయ్యెద కదలికలు చూస్తే
శృంగారభావం హృదయాన్ని తాకి మెరుస్తుంది  
నీ వాలు జడ కదలిక చూస్తే
మరిచిపోలేని నితంబులకదలిక కనబడుతుంది
నీ కొప్పులో విరజాజులు చూస్తే
పరిమళాల మత్తుకు చిక్కి ఉండి పోవాలిని ఉంది
గులాబి రేకలు రాలుట చూస్తే
వలువలు లేని వయ్యారిని చూడాలని పిస్తుంది