Sunday 12 February 2023

PRANJALI PRABHA ఉషోదయ కవిత్వం 🌹



ఇహపరసుఖమే, వలపుల తలపే, మధురిమ పదసేవకే

సహనపు మదిలో, మెరపుల వలపే, వరునికి రజనీ కరే

అహమిది తిలకం, లిఖితము విధిగా, మరువని నయ విందులే

మహిమని మదనే, సుమధుర వదనే, పెదవుల సుఖ మాయలే

........

అనుకరణ మదీ, కులుకుల సొగసే, వినయపు ధరహాసమై 

అణుకువ హృదయం, థలుకుల మెరుపే, మదనపు విధి వాంచలై 

చినుకులు తడిపే, హృదయపు పొగరే, చితికియు మరబొమ్మ వై

వణుకులు మటు, మాయమగు సమరమే, జరిగియు మదనమ్ముయే 

.........

పలుకుల మయమై, పదనిస పరమై, పరువపు చెలి బంధమై

థలుకుల మెరుపై, థకదిమి వరుసై, సమయపు మది మిత్రమై

కులుకులు కథలై, సహనపు కలువై, కనికర మగు శాంతమై

అలకలు మెదిలే, అదనపు సుఖమై, అలసట కళ గంధమే 

..........

నేటి కవితా ప్రక్రియ -- పాఠము -- 


 విశ్వాసం ఉంటె చాలు - మనసు అర్ధమవటానికి

నమ్మకం ఉంటే చాలు - రహస్యం తెల్పటానికి

సహనమ్ము ఉంటే చాలు - ఆశయం బ్రతకటానికి 

ఆశలు లేకుంటె చాలు - గుండె వికసించటానికి - 


మోక్కలు నాటితే చాలు - పుడమి పులకించటానికి

మలయమారుతమ్ము చాలు - జీవిగా బతకటానికి

మంచి పలకరింపు చాలు - మనిషి గుర్తించటానికి

ఎడారిలొ నీరు చాలు  - నరకం తప్పించటానికి


నీలొ త్యాగ బుద్ధి చాలు - నలుగురు మెచ్చటానికి 

నీలొ ధర్మగుణం చాలు - నలుగురు బత్కటానికి 

సమాజమ్ము  బాగు చాలు - మానవత్త్వ నిలయానికి   

శ్రమతొ విద్య ఉంటె చాలు - లెక్క గౌరవ సంపదకి 


ఒక్క చూపు చూపు చాలు  - మాయను చేర టానికి  

ఒక్క పలుకు పల్కు చాలు - జీవితమ్ము మార డానికి

స్త్రీల నీలి చిత్రాలు చాలు  - మనిషి చెడి పోవటానికి

మనిషి కి మాదక ద్రవ్యాలు - మరణం సృష్టించటానికి 

  

స్త్రీ కి  మాంగల్య కట్టు బొట్టు చాలు - దుష్టులను మార్చటానికి 

స్త్రీల నిస్వార్థం చూపులు చాలు  - స్వార్ధం బయటబడటానికి 

కర్షక కార్మిక స్వేదం చాలు  - మానవుల ను బ్రతి కించ టానికి   

ప్రేమ మమత సమత ఉంటె జాలు - జీవితం సుఖమవ్వటానికి  


***ప్రాంజలి ప్రభ ఛందస్సు పాఠము : UIU IIUIIUU - UIU IIUIIUU

*****


నిత్యమూ సుమ నాదము యేగా - నిండగా విధి వేదము యేగా  

తత్వమూ సుఖ ధామము యేగా - ధన్యతా విధి సేవలు యేగా  

సత్యమూ నిజ సాహస మేగా   -  సాధనా విధి నైజము యేగా  

పైత్యమూ ఇక పైకము యేగా - మైకమూ  విధి దాహము యేగా  


ధ్యానమే సుఖదా వరదానమ్ - తత్వమే విధిగా సుఖదానమ్   

మౌనమే సుఖమార్గ పయనమ్ - మోక్షమే విధి నిత్య పయనమ్  

దానమే నిజధర్మ వినయమ్ - మానమే విధి కర్మ వినయమ్  

గానమే జతగమ్య  తరుణమ్ -  ప్రాణమే విధి మర్మ తరుణమ్  


కాలమై  మన ఊహల ప్రేమే - గాలమై మన ఆశల దాహమ్ 

మూలమై మన కూడిక దేహమ్ - జ్వాలయై మన దేహపు ధైర్యమ్ 

***
కంద పద్య మాల 

నగలే నాగులు కలిగే
నగలే పుర్రెలు కలిగియు జ్ణానపు నేత్రా 
నగలే పార్వతి ధరించె  
నగధర హృదయమ్ముపూజ నమ్మక దైవమ్

వెన్నెలలో కధ కదిలే
తన్మాయచిగురు మనోబలముగా స్వేచ్ఛే
కన్నప్రేములు కళలై
మన్నన చూపుట సహనము మనసున సాగే

శుభకృత్ శుభమాయేలే
అభయం అమృతం కురిసిన అర్ధం పొందే
ఉభయసభలు గాను తెలుగై
ప్రభలై జయహో జయప్రద మగుట శోభా 

కోయిల కూతే మారదు
హాయిని కోరేవారి బుధ్ధి అర్తిగ మారే
రేయిన శుభకృత్ కలలులె
కోయిలగీతం యుగాది కానుక శుభమై 

చీకటి పిడికిళ్లు కధే
వాకిటిలేనిదియు జీవి వరుసే మారే
తాకిన తొలగని తపనే
మకిలం కృంగియు కృశించి మనసే కాదా

తనువేతాపమ్ముగనే
కణములు ఉడికే ను బిగువున కదలిక వల్లెన్
మానసికంగా బుధ్ధియె
 చినుకులు గానే తడిపి యు చెంతకు చేరెన్

వేదికపై కళ కాలము
వేదన సుఖమే కదలిక మరచియు సాగున్
మోదముచెందియు వేడుక
ఆదమరచి యే సుఖాల విందును పొందే

వత్తిడెపుడు పనిలోననె
చిత్తము చొప్పున కరిగియె చిత్తుగ మారున్
మత్తుకు చిక్కియు లొంగియు
వత్తుకు దాహమ్మె తృప్తి వదలక ఉండెన్

గంగన ముంచియు తేల్చెద
రోగము శాంతము కదలిక ఋణమే కాదా 
యోగపు సిద్ధిని పొందుట
ఆగమనం కదులు టేగ ఆశ్రిత మే గా

0
తే::ఉరవడిని ఆప లేరులే ఉరుకు ఉరుకు
మనసు లో స్పందనలు మాయ మాయ
హృదయ కళలన్ని కరుగక హలము లయలు
చిరుత పరుగులా చరితము చలము చలము
......
తే::చిమ్మ చీకటి నా చేతి దీప మగుట
తరువు కౄరదృష్టిగలగి తపన యగుట 
బ్రహ్మ రాక్షసిలా భయ బంధమగుట 
పదముల ధ్వనే హృదయమ్ము ప్రేమలోన
.....
తే:: చెయ్య వలసిన పని యున్న చేయి రాక   
నిద్ర నటన యేల కలుగు నింద పడగ,
శాంతి యేల కలుగ నేల శవము బతుకు  
బోధ పడెన నీకు ఇపుడు బోధ నీశ
.....
కం. ఏ కమగు న్యాయము యే  
రాకలు పోకలు జరుగుట రక్షణ యగుటన్
వాకిటి సౌఖ్యము కడుగున్
ఏకులు మేకులు యగుటయు యెల్లఁరు చూచున్
 .....     

కం. శ్రీకనకదుకూలధరాం ,
రాకేందువదనాం  , మురారిమనోజ్ఞామ్..
రాకేందుభగినీం , శ్రియం ,
మహాలక్ష్మీం  అర్చయామ్యహమ్  !!! "
----
84.  మాత్రా బద్దము (1)
IIU IIUII UI
నేటి కవిత - లోకంలో పోట్లు -పాట్లు

మనిషీ అనురాగము జోలు  - మతిలేకయు చిక్కిన పట్లు
కలమాయను రోగము జోలు - గతిలేకయు చిక్కిన పట్లు
కుల మంతయు గోలను చేసి - కను మాయకు చిక్కుట కెట్లు
విధి బోధయు అంతయు తెల్పి  - తనువంతయు చిక్కుట కెట్లు

మది మాయను వేలము వేసి  -  మది తప్పియు  శీలముతూట్లు
విధి లేకయు  గాలము వేసి -   కల కాలము రోగము పోట్లు
చిరు దీపము చీకటి చీల్చె  - చిరు నవ్వులు మాయకు తూట్లు
శిఖ పింఛము అందము పెంచె - శిఖ పట్టులు తన్నుల పోట్లు

గురు సేవయు చేసిన మంచి  - గురు పాదము పట్టిన పాట్లు 
గురు పత్నిని కోరిన తప్పు  -  గురు పత్నిని తిట్టిన పోట్లు 
సమభావము పెంచిన మంచి - సమ యోచన తెల్పినపట్లు
సమరాగము  పల్కిన మంచి  -   సమ సేవలు చేసిన పట్లు

గిరిగీచుక కూర్చొనఁ బోకు - - సరి లేరని నాకెవరెట్లు
మరి యాదగ నుండుట మేలు -  ధరనెచ్చట నున్నను పాట్లు

--(())--
హృదయ చేష్టలు.. తేటగీత మాల 

మొయిలునైతేను మిన్నుసమోన్న తయగు
హొయిలు నీవైన తేలించ హాయి గొలుపు 
కోయి లైతేన చందుని కళలు చూపు
చేయి చేయి తో మురిపించ చేష్టలవియు 
......
దిగులుమబ్బులు కమ్ముతూ సెగలు ఏల 
మిగులు జీవుడి ముగియడం మేల ఏల
వగలు నాటక ప్రళయమే వ్యాధి ఏల
మగువ అవధులు దాటితే మనసు ఏల
......
హృదయమంత చీకటి గను హద్దు ఏల
పొదల మాటుసరశ మైన పోరు ఏల
అదును లేని దై వినయము ఆశ ఏల 
యదను సామరశ్యముగాను ఏల మాయ 
......
దివ్వెనైతేను వత్తిగా దీన బతుకు
నవ్వె రానీక బంధమై నటన బతుకు
కొవ్వె కరగక పొందు చకోరి లేక
అవ్వె ఏమిచేయక గతి ఆట యనుచు
......
పుడమినైతివి మెప్పించ పురుడు కోరి 
పడక లోన భేదము చూపు పగటి కలలు 
నడక మార్చుమనియు పోరు నాటకమ్ము
కడలి పొంగులో కలియుటే కాల మాయ 
......
ఆశవిత్తులు జల్లుతూ ఆత్మ శిక్ష
పాశ మని బంధ తొత్తువు పాట పాడు
త్రాసు లాగ కదలి చుండు తాప మేల
కాసు కోరి కర్కశబుద్ధి కాల మాయ
.....
పైరునైతివి  పండించ పగల సెగలు
వైప రీత్యమనుచు బాధ పైరు మల్లె
సైర సైరాయనుచు పోరు కైపు చాపు
ధైర్య మున్నాను భక్తిగా దీన చూపు 
......
వేరునీవుగా ఎదిగించ వినయ చూపు
చూరు పట్టి లాగియు చేష్ట  చూడు బుద్ధి
మారు మాటనీయక బుద్ధి మంత నాలు
చేరువైన చేష్ట కదలి చింత చేయు 
......
 నీడ భంగపాటుల నుంచి నిమ్న గతిగ
రాత్రి అంధకారము బంధు రంగ మేను
యాత్రిక గ్రుడ్డి వాణ్నిగా ఏల నీడ  
ఇచ్చి నడిపించకే వెళ్ళు ఇష్ట మేల
.......
నిస్పృహయె నన్ను విముఖుణ్ణి  చేయు కలలు
 కాంతి రహితమై శోకదీపానికి యగు
జ్ఞాన జవస త్వాలను తాకి జ్ఞప్తి మారె
ప్రాంజలి ఘటించి తెలిపెద ప్రభల లీల 
........
అలసి సొలసినది సుషుప్తశక్తినీడ
జాగృతం కాక నష్టాన్ని జాగ జగతి 
మందిరాన్ని గురించియె మనసు తాకు
అడుగడుక్కీ నటన కీర్తి  రాత్రి పగలు
........
అంధకారమయంగాను ఉండి నాను
 అందుచే, నీవు చేయూత అక్కరగుట
ఇచ్చి, నడిపించుకునె వెళ్ళు ఇష్ట మేది 
బ్రతుకు వేటలో నిజముయే భయము తెచ్చె 

మనసులొక్కటె మనమని మధన పెట్టు
తనువు తనువు రాపిడి యని తలను పట్టు
చినుకు చెమట కారాలిగా చింత గుట్టు
వణుకు పుట్టినా ఆపక వడిసి పట్టు 
.....
మేనునైతేను ఉసురునీవైన బతుకు
మాను నేనుగా బతుకుటే మాత్ర యగుట
తాను గా కత్తెర యగుట తంతు చితుకు
పానుగా నోటికి దక్కియు పడక నీడ 
......
కలియుగంలోమి ట్టాడుతూ కలసి మెలసి
చలిగిలి పులికి చిక్కియు చలనమాయె
ఆలి ఏలిక గమనించి అడుగు వేయు
గాలిలా కలసియు నుండు గళము ఇదియు
........

నేటి పాఠము ప్రాంజై ప్రభ ...అంత్యాను ప్రాస కవితా 

పెదవి పలుకు స్పటికము సుఖముకొరకు వెలుగవుటయు  
పిత్తపు మాటలే అధికుల బ్రతుకు ఆటలగుటయు 
పెత్తనమే పరిహాస పురులాయె విధియనుటయు 
పొద్దు పొడు ప్రాణ భయ మాయే దీన బ్రతుకఁగుటయు  
.....
కంట నీరు వెల్లువాయె కాటికి కథ చేరుటయు  
కంఠ శోష అధికమాయె కనికరమే బ్రతుకాయు  
కలత నిదుర భారమాయె కనుదోయి జల్లు లవియు 
వలలాయే కాపురమె కడలిలోని అలలగుటయు 
.....
ఉట్టికూడు ఊటమట్టి లోనఆశ పూవనియు 
ఊట బావి గట్టి నమ్మ కపునీరుగ సాగనియు  
ఉషోదయము నిత్యా నవపూజ నవోదయమనియు 
ఉరుములతో జల్లులేను ఉనికిగను జీవమనియు 
.....
ఆకాశా నక్షత్రాలె త్రోవ రేఖలనియు 
ఆశ దీక్ష రూపమె పక్ష పరోక్షదీపమనియు 
జగతి గాలి జల మాలలే జీవన ధారలనియు 
జెముడు కళల ముళ్ళే జీవితాలే బాధలనియు 
.....
తరుల కడుపు కోత తల్లుల భాధలు గాధలనియు 
తుప్పల పల్లేరులె జీవితాల పరీక్షలనియు 
కొండరాబండలే కోరికలే గట్టుశిఖలనియు 
కోతకుప్పల సిరులేను పుత్ర పుత్రి రూపనియు 
......
జీవమేను జగతి చంద్రికల నిత్య ఆటలనియు 
జగమే నిత్యసత్య యోగ మాయల సత్యపు గననియు 
...
మీ విధేయుడు మల్లాప్రగడ  రామకృష్ణ
*అక్షరాల ఉషోదయ చూపుల కళయిక ముఖ పుస్తకమిది మీ చూపులతో ఒక్కసారి నన్ను చదవ గలరా?

తే. అడుగడుగునా నిఘా ఇది అలక చూపు
అవును అయినా ఇదియు దగా ఆత్ర చూపు
మది మధించెడి మదనపు మంత్ర చూపు
మానసమ్ము అర్పణ చేయు మోహ చూపు
.......
*తే.నిన్ను స్పష్టంగ గమనించు నిజము చూపు
పరమ పదమును పొందెడి ప్రతిభ చూపు
ప్రకృతి పురుషవివేకము ప్రగతి చూపు
ఇంద్రియాలు అర్పణ చేయు ఇష్ట చూపు
......
*తే. నాన్యమైన యంత్రమ్ము గా శబ్ద చూపు
నిండు కుండ కదిలిక గా నిద్ర చూపు
స్వచ్ఛతనుపోంద దివ్యత్వ స్వేచ్ఛ చూపు
ఆత్మ స్వచ్ఛత ఆశయం ఆట చూపు
.......
*తే. పాఠశాలలు నేర్పని పాట చూపు
భౌతికాకర్షిత కలిగే బౌమ్య చూపు
కోరుకొనెడి పొందు పిలుపు బోధ చూపు
ప్రాధమిక పరి పూర్ణత ప్రభల చూపు
.........
*తే.మాట పొదుపుగా పలికెడి మనసు చూపు
యోగ సాధన పరిపక్వ యోగ్య చూపు
బ్రహ్మ తేజస్సు తో శక్తి భక్తి చూపు
బ్రాంతిని తొలగించే సెడి ప్రేమ చూపు
.........
*తే. మౌన నిశ్శబ్ద మంత్రాల మర్మ చూపు
గొంతు మౌనమై మనసుతో కోరు చూపు
మనసు మౌనమై హృదయంతొ మాయ చూపు
హృదయ అంతరాత్మ పిలుపు శబ్ద చూపు
.......
*తే.అల తరంగాల సుడిగుండ ఆశ చూపు
కెరట పరుగులా కళయిక కలల చూపు
వరద పొంగులా ముంచేటి వాలు చూపు
ఇకను వేవిళ్ళు తెప్పించు ఇష్ట చూపు
.......
*తే.మాట కోటకూల్చెడి బాణ మౌన చూపు
మనిషికి మననం నేర్పెడి ముందు చూపు
అందలేని లోతుల జ్ఞాన ఆశ చూపు
మగత మదనమ్ము రేపేటి మధుర చూపు
.......
ఎల్లలు అడగని మురికి ఎఱ్ఱ చాపు
నిలకడ తెలపక కదిలే ఎఱ్ఱ చాపు
మనసున మరోచరిత్రగా ఎఱ్ఱ చూపు
బాలు సరిత విషాదపు ఎఱ్ఱ చాపు
..........
చూపులు కలసిన శుభాల ఊపు చూపు
చినుకుల మెరుపు మనసున చేష్ట చూపు
రత్న వెలుగుల రవ్వల రాశి చూపు
వినయ వాంఛలు తీర్చేటి వింత చూపు
.........
ఎంత చెప్పినా తక్కువే యదల చూపు
అక్షరాల పొందిక నేస్త ఆట చూపు
చదువు ప్రేమ కలగలుపు చరిత చూపు
నిత్య ఆనంద ఆత్మీయ నిజము చూపు
.........
*తే. ఓర చూపుల ఓర్పుకు ఓపి కేది
వణుకు తోను వయ్యారియే వాలు చూపు
వద్దని వలపు కలిగించు వరద చూపు
కిలకిలా నవ్వు కీర్వాన్ని కీల చూపు
.......

.....
*తే. మనసు సకలమై సుఖసేవ మంగళమగు 
యవరు యని యంచకే మది యాట యదియు 
బ్రతుకు భవ రోగ హితము కోరి బంధ సుబ్ర
హ్మణ్య మంత్రరాజము నాకు హాయి గొలుపు
.......
* తే. రాజకీయ అదును చూడు రాజ్య మేల
ఉచిత దారదత్తత మని ఊరు మారు
ఓటు ధనము చుట్టు తిరుగు ఓర్పు లేక
కోర్కె తీర్చ బిక్ష ముగను గొప్ప చెప్ప
......
*తే.నేల నీదని చులకన గీత మొద్దు
నేల కొరిగిన జీవితం గీత మౌను
త్యాగ గుణము సహనమేను దారి తెలుపు
నింగి నేల మధ్య బ్రతుకు నీది కాదు
......
*తే. ఒంపు సోంపుల వనజాక్షి ఒప్పు కొనక
వాలు చూపు వల విసిరే వాకిటయని
బిగువు కుచ కుంభలా రాట బేల చూపు
వయసు పొంగు పోరాటమే వెళ్ళు వాయె
....
*ఆ. మేత కొలువు తట్టె మేలుకొలుపు యిది
మెరుపు కాంతి వలయ మౌన బంతి
మెచ్చు కొనును మదిని మేళతాళముగను
ప్రాంజలి కళ ప్రకృతి ప్రభల తీరు
.......
తే. గండు తుమ్మెద గంతులు గడబిడయగు
ఉండ బట్టలేని మనసు ఉరక లేయ
బేల బ్రతుకు ఊయల యగు బిడియ పడక
మృధు మధుర రసమును జుర్ర ముంగిటయగు
......
*తే.చేయ గలిగిన సాయమే చింత మాపు
స్థిరము శాంతి ఆనందము స్థితి గతి మతి
వినయ ఉపకారము విధిగా విజయ మిచ్చు
విశ్వ విశ్వాస బంధము చెలిమి తృప్తి
......

తృణ కంకణం 

*తే.విరహ జలిత మనస్సుయే విభవ చనగ
తపము సలప రింత కడకు అడవి వలెను 
జత కలియు జప రగిలె జయము కుదురు 
మనసు కుదుటగా సుదతియే మరుడు ఒసగె 
........
*. తే.కటిక తిమిరమ్ము తొలగెను కామ్య దివిన 
సురభి వలెను ఇలకువచ్చి సుఖము తివిగ
వెలుగు నొసగి సుర కుడిపి వెతలు  మరచె 
బతుకు వరము నొసగ నిత్య భక్తి వెలుగు 
.......
*తే.పనస తొనల పెదవు లవి పలక రింప 
చిలికి పదిలమ్ము కుసుమాలు చెలియ కళ్ళు 
మరులు గొలుపు మధుపములు మతులు చెదర 
విరుల సుధల తపన వింత తొలగ 
......
*తే.వయసు మదపు మెరుపులన్ని వలపు జిలుకు 
మొదవు రసము లిడువ గాను పొదుగు లనగ
చెలిమి  పెదవి పరవ శమ్ము చేష్ట సఖుని 
తరుణి చెంప అనుగు లగు ప్రియము లొలుక 
.......
*తే.కనులు చెదరు సొగసు పంచి సిరుల నొసగి
మనసు తెలిసి నిలిచి తెల్పు మదిన సఖియ 
దరిని తెలిపి కరములన్ని కలిపి నడిపె 
విజయ మరయ సరసమేను నిలువు జయము
.......
*తే. నీది నాదికాదు ప్రకృతి నీడ ఇదియు 
ఏది సుఖము కష్ట మనేది ఏల తెలియు
బ్రతుకున భవిష్యత్తు తెలియ బాధ ఏల
చిరునగవు తోను పలుకుయే చింత తొలగు
......
*తే. వ్యక్తి రూపమ్ము మనసుగా వ్యక్త మవుట
శబ్ద రూపమ్ము వేదాలు చరిత తెలుపు
జలము తీర్ధమై జనులకు సేవ సలుపు
ప్రథ్వి నందు క్షే త్రాలు ప్ర సన్నత గను
........
*తే.గడచి పోయిన రోజులు గళము వల్ల
ఫలిత మేమిలేదు అయినా ప్రజల బ్రతుకు
ప్రేమ కధ జ్ఞాపకాలు గా ప్రీతి కలిగి
అడుగులు కదల వచ్చును అందరి కథ
........
* తే.ఏటి గలగలా శబ్దమ్ము ఎగిరి తాకు
ఆకు కదలిక శబ్దమ్ము అదిరి తాకు
నిదుర పోతుంటేను గురక తాకు
చిలిపి పరుగుల శబ్దమ్ము చెలిమి తాకు
.......

*తే. దివ్య జీవనమున సాగె, ధైర్య పంచ 
చేరె, అంతరాన్నకధలు, ఆట పెట్టె   
స్పృహ దర్శనం పడవలో, సాగు చుండె 
సమత నేత సుచిత్రగా, సవ్య చెలిమి
........
*తే.తప్పు ఏముందని తెగింపు తపన రాణి
కట్టు బట్ట అందము చూపె కనుల బోణి
అంగ సౌష్టమదృష్టము అందు కొనెడి
మగమహారాజు చూపులు మనసు చెరచు
.........
*తే.కళ్ళ లోనకైపు కరుణ కాల మాయ
కథలు చెప్ప కదులు టేల కామ్య భావ
స్తన్య కదలిక ఉర్రూత సహజమైన
మగువ మాయలన్ని బ్రతుకు మానసమ్ము
.......
*తే. స్వేచ్ఛ ఉదయించి నప్పుడే సమసి పోక
జీవ గమన ఉపాధియే కీలక మగు
జ్ఞానుడని శృతులు పలికె జ్ఞప్తి తెలుప
కాల నిర్ణయమ్ము కదుల కళ్ళు కలిపి
........
*తే::ఏది ఆగదు ఎందుకొ ఎదను తాకు           
ఘడియ ఘడియకదులుతుంది గంట కొట్టి 
తెలుసు కొనులోపు నయనాలు తేలిపోవు 
చూడ సమయము దాటింది పూట మలుపు      
.....
*తే: దక్కనిది తల పే మాది దారి లేక  
బాధ పడడమె తెలియక బంధ కేక
మనిషి మరవకుండు కధలు మాయ చిక్కి 
కాల నిర్ణయవ్యసనమె కాటి మలుపు 
......
*తే. ఏమి గణపయ్య ఈ బాధ ఏల చెప్ప
మనసు తప్పొప్పులను చెప్ప మార్గ మేది
వయసు ఉడుకుయే తప్పుగా వలపు నివ్వ
బ్రతుకు వేటనా మదిలోన భాద్యత గతి
........
*తే. నుదుటికి తిలకం అందమే చురుకు తెచ్చు
కురులకు కుసుమం అందమే కులుకు లిచ్చు
వెలుగుకు ఉదయం అందమే విలువ లిచ్చు
చెలిమికి హృదయం అందమే శుభము నిచ్చు 
........
* తే. రవి వెలుగులు చిమ్మి హృదయ రమ్య తపన
నిత్యము రసజ్ఞత కలిగి నిజము తెలప
శృతుల కళయిక కొరకనే శృతిలయళగు
అందచందాల ఆధరాల అంద పుచ్చ
........
* తే. బాహ్యమైన ఇంద్రియ సుఖ బంధ మివ్వ
అనుకరణ మమకారమే ఆశ పెంచ
ఆత్మ యందు దివ్వె వెలుగు అధర మాయె
అంతులేని ఆనందము ఆట బ్రతుకు
........
*తే. కళ్ళు కళ్ళు కలయుటే కావ్య జగతి
కళ్ళ తీర్పుల సుఖమునే కలత తీర్చు
కళ్ళ మెరుపు కళలు వల్ల కార్య శోభ
కళ్ళ రెప్పల కదలిక కామ్య మగుట
........
*తే.రాజ్య అంగము ఉత్తమం రవ్వ వెలుగు
భోజ్య మంత్రుల కాంక్షలు కోరుచున్న
ధర్మ మే నిదురకు దారి ధరణి యందు
జనుల ఘోషల రక్షక భట గళము భరత
.......
తే. గాలికి పెరిగే మొక్కలు కాల మేది?
యువత మెచ్చేటి వ్యామోహ యునికి ఏది?
హద్దుల ఎరగని మనసు గళము ఏది?
ఈ మతోన్మాద మనుషుల ఇష్ట మేది?
.........
*తే. తరగి పోతున్న జీవితం కలల మల్లె
ఆగనిసమయం వెతుకుటే ఆశ మల్లె
మిత్రుల మనసు అర్ధమే మేలు మల్లె
జంట సుఖముయే కొన్నాళ్ళు జపము మల్లె
........
*తే. కుంభకోణాల కవితలు కూలి పోయె
మత్తు మందు బానిస ఖర్చు మార బోదు
రాజకీయ యెత్తుగడయే రాజ్య మాయె
జనులు జండాలు మార్చినా జయము ఆట
..........
*తే. ఆర్ధిక బలము సంబంధ కాల మేను
అవసరాల కోసం వేష ఆశ యేను
సంతసం ప్రేమ మధ్యనే సమయ మేను
జీవనసమరం మనిషికి గీత గాను
.........
 *తే.జ్ఞాన వైరాగ్య సిద్ధికి జపము మూల
మగుట, అజ్ఞానమే పోయి మంచి జరుగ
జన్మ కర్మ బంధము లను శాంత పరచి
తల్లి తండ్రి గురువు సేవ తృప్తి నిచ్చు
.......
*తే.మాకు అగ్ని దేవుడు తేజ మీయు గాక
మాకు ఇంద్రుడు ఇంద్రియ మీయు గాక
మాకు సూర్యడు ఆరోగ్య మీయు గాక
మాకు మారుతి ధైర్యమ్ము మివ్వు గాక
......
*తే. దాహ మాకలి బలమగు ధరణి యందు
సూర్య చంద్రులు సంచార సూత్ర పరులు
యవ్వనం ధనం అతిధులు ఏళ్ళ వేళ
భూమి వృక్షము సహనమ్ము భుక్తి నిచ్చు
.......
*తే. తరగి పోతున్న జీవితం కలల మల్లె
ఆగనిసమయం వెతుకుటే ఆశ మల్లె
మిత్రుల మనసు అర్ధమే మేలు మల్లె
జంట సుఖముయే కొన్నాళ్ళు జపము మల్లె
........
ప్రాంజలి ప్రభ ...ఉషోదయ పద్యాలు    24 --02 -2023
తే:: కలత యే హలం కఱ్ఱుకు కాళ్ళు ఇరిగి  
నలత యే కలం కఱ్ఱుకు నడక నలిగి  
కొలత యే బలం కఱ్ఱుకు ముడత కలిగి 
చలన మే గళం  కఱ్ఱుకు చరిత ఎరిగి
......
తే:: జీవిత నట ఘట మకుట జీవ యాత్ర
జ్ఞాప కాల నృత్య జగతి జాతి మాది  
గజ్జెల గలగల సరళం గమక మగుట 
తరుణి నాద జక్కు పదాల తపన కళలు
......
తే:: చిలిపి పరదాల కదలిక చలము ఏల 
తలపు తగువేల వయసున తాపమేల  
వలపు వయ్యారాల కళలు వాపు ఏల   
మలుపు మందార మనసులో మాయ ఏల 
.......
తే:: కనులు మూస్తే ను కదలిక కాలమవదు   
కనులు ను తెరిచె ప్రాణము కదలికయగు  
రెప్పపాటుకాలంలోన రెపరెపరెప 
సాధ్య కృపయు అసాధ్యము సాక్షి అమ్మ  
....
చింత లేని ప్రభుత్వము చిత్రమిది యు
దగ్గ లేక కక్క నులేక ధరణి దూత
ఈ గతి అరణ్య రోదన ఈప్సి తమ్ము
ఆంధ్ర చదువుల అర్ధము ఆట యగుట
..........
తే. విత్తు మరణించి మొక్కగా విస్తరించు
నేను మాయమైతేను మనసుకు శాంతి
రాయి చెక్కిన దైవమై రత్న వెలుగు
స్వార్ధ మొదళి నిస్వార్ధము సమయ తృప్తి
.........
తే. నీరు లేకయు ఎండిన నీడ చెట్టు
పట్టువీడని ప్రార్ధన పగలు రాత్రి
గాలి నాశించి మేఘము గమన మగుట
వర్ష భావము కొరకునే వగచి యుండె
.........
తే. గగనము జగములు గడగడ వనికేను
వగసిన మనసు కకవిక వరద పొంగు
చిగురు తొడిమలు చితికెను చింత కలిగి
మగువ తెగువ మనుగడయు మచ్చ తొలచె
........
తే.తీరనివ్యధ అనుటేల తేరుకొనియు
తప్పు తెలిసికొనిన జీవి తృప్తి వెతక
ధైర్య వచనాలు చెలిమిగా దైవ పూజ
నిగ్రహము నుంచి బ్రతుకులో నిజము పలుకు
.........
తే. మనసు రూపమ్ము లేదులే మనుగడ కళ
గాలి రూపమ్ము లేదులే గమన జీవి
వెలిగుకు స్థితి గతి లేదు వెన్నెలగుట
మనిషి గుణము అహముచుట్టు మాయ తెలుపు 
........
తే. పసుల వన్నె వేరును వర్ణ పాలు తెలుపు
పూల రంగులు పరిమళం పూజ యొకటి
దర్శనంబు వేరు మనసు దైవ మొకటి
ప్రేమ అంతరమున నుండు ప్రియము కాదు
.........
తే. ఉన్న భయముతోను అబద్ద ముగను బుద్ధి
ఉన్న నిజములో  ధైర్యము ఉడుకు తోడు
ఉన్న తప్పుడు ఆనంద హృదయ లీల
ఉన్న గౌరవమ్ము నిజము డుపు ఇదియు
.........
తే. పలికి బొంకిన పదవికి పనికి రాడు
అల్ప బుద్ధితో అధికుడు అవని చేటు
బ్రతక నేర్చిన మనిషియే బాధ పెట్టు
బుద్దిగల అవిటియు మేలు భూమి తృప్తి
.........
తే:: నాది నాదనే వాదన నాంది పలుకు   
ఏది నీదనే మనసులే ఏది చిలుకు 
వాది చెలగాట పలుకులే వలపు కులుకు   
నాది నటనయే ఆయిననుఁ నడక వణుకు   
........




* హరిగతి రగడ..ప్రాస,అంత్యప్రాస, పాదములు రెండు 8చతుర్మాత్ర గణాలు

సకలము నిత్యము కోరును నీడను 
వికసిత కష్టము ఇప్పుడు తగ్గెను
మకుటము కోరుట మధ్యన మల్లెను 
మక్కువ వల్లనె మనసును కోరెను
ఆకలికి కలలు కనడం జరుగును
వాకిలి తలుపులు తెరిచే పిలిచెను
చాకిరి నంతయు తప్పక మారును
వెకిలిగ వేషము నీకును ఏలను
.....
*బానల నీరును పెట్టే
మానస యత్నము యె జూపి మాత్రలు జల్లెన్
చేనుయు యేపుగ పెర్గెన్
వానలు రాకున్న గాని పంటలు పండున్
.......

తేటగీతి
*గుండె రాయి గా మారినా గుర్తు ఉంది 
బండ బ్రతుకునే మార్చితీ భద్రముగనె
మోండి వానిసైతము మార్చి మోక్ష మిచ్చె
కొండ గట్టు మూర్తి హనుమా కొలతు నిన్ను
.......
*నవ వసంతము నవ్య వనరమ మామి
కొమ్మ ఆకులచివురులు కోరికోరి
పాటపాడెడి పరబృతం పగలు రాత్రి
ఎవ్వరాపుదురో ఇక ఏమి ఎరుక
........
*పచ్చి మిర్చి తినాలి లే పగ వలదులె
దుఃఖ సాగరం ఈ దాలి దురద కాదు
మనసు మైదాన మగుటలే మచ్చ కాదు
మోక్క మొలిచింది కలకలే మోక్ష మవదు
......
*కష్ట మున సుఖం తృప్తి యే కానుకవట
ఇష్ట మున సుఖం స్వర్గం మే ఈప్సి తమ్మె
నష్ట మున సుఖం మార్పు కే నటన కాదు
అష్టమి నవమి కష్టాలే అనుట కలలు
......
*గాలి చొరబడని కిటికీ గండ మగుటె
జాలి చూపని తాళము జపము నగుటె
తలుపు లను తీయని పడతి తెగువ నగుటె
ఊరు వళ్లకాడను మాట ఊపిరగుటె
.....
*జలజలా రాల్చు కన్నీరు జాతి కొరకు
స్త్రీ గను విముక్తి పన్నీరు శీతలముయె
నువ్వు నవ్వతూ బ్రతుకటే నాన్య తవ్వె
ధనము కన్నీరు ప్రేమకే ధరణి పలుకు
.......
*చలమ నుంచే జలముబికే జలకళకళ
స్వచ్ఛ తనుకోరు గుణము యే సకలముకళ
వెన్ను తట్టి చూపు కధలు విజయపు కళ
మన్ను తిన్న పాల బతుకు మనసు న కళ
......
*కవన మని మురవకు లే కలల మల్లె
నవవిధాల కధల కావ్య నాట్య చరిత
విధిన వెలువడే మనసుయే వేకు వగుటె
పదుగురు స్పందనలు మార్పు పలక రింపు
నిత్య జీవితంలో ప్రధాని యగుకవియె
....
*ఓర్పు గనె భూషణమ్ము నే ఒడిసి పట్టి
దుర్జన గుణము మార్పుకె దునియ నందు
బీడు భూమిన అగ్ని యే యేల ననుచు
తనకు తానుగా హిమమగా తృప్తి చెందు
.........

*సీ॥
రామభక్తహనుమరమణీయగుణతేజ
వానర కపిరాజ వజ్రరూప
భీమబలశ్యామ బీజయక్షరధామ
పవనంబుయేనీవు పవనహనుమ
కోమల రూపమా కోదండ మారుతీ 
వీరాంజనేయుడా విజయహనుమ
సింధూర మందార చిరునవ్వు చిందించు
భక్తవత్సలభవ భానుస్నేహ!

తే॥గీ॥
కొలుతు కూర్మితోమారుతీ  కోరి నిన్ను 
నిలుపు మామధి నిరతంబు నిశ్చయముగ
పలుకు పావన కేసరీ పవనసుతుడ
రామ భక్తుల పాలిట రక్షగావ
......
*రాముని సన్నిధీ సుఖము రమ్యత పెంచియు బల్కుచుండి, యా
రాముని పెన్నిధీ మనవిరామము తెల్పుచు ప్రేమ పంచు సం
మ్మోముయు కాంతికోరితిమి మోహపు వాంఛల యందు జీవమై
స్వామిగ నిత్యనామ కపి శాంతిని కూర్చునె నా మనంబునన్
.......
 * జ్ణానము మన్నదే మనిషి జ్ణానిగ మార్చుట వీలౌనుగా
జ్ణానము తోకఠోరశ్రమ జ్ణాపక శక్తియు మిన్నగా పులే
జ్ణానము తో బహ్మగను లె జ్ణాతిగ యుక్తిగ కష్ట జీవిలే
జ్ణానము విశ్వమందు కళ జాతిని మారుతి మేలు కోరులే
కలియుగ బ్రహ్మ హనుమంతుని కొలుద్దాం
.......
* సంమతి పొంది నా కళలె సంతస భాగ్యము శాంతి నిచ్చుటన్
స్కాముల వల్లనే మనసు సాక్షి గ వేదన సంభవమ్ముగన్
రమ్యత నిత్యసత్యముగను రాగములేలును ప్రేమపాశమున్
ముందర కాళ్ళ మచ్చట తీర్చుట సత్యమౌగదా
......
* నడికుడి నాటకమ్ కధ నమత్తుసకాలముచిత్తు యేయగున్
సుడులుగ తిర్గటే కళ సుఖమ్ము సమాన విపత్తు చేరగన్
ముడుపులు కట్టి నా సమము విద్య సుదీర్ఘ సుహాస వేడుకన్
నడివడి కూర్చి నీదయను నాయెడ నుంచుము దివ్య దైవమా
.....
*సీస పద్యం 
కేదార పతినీవు --వేదాల సాక్షివి
రామేశ్వరంబున -- రామలింగ
మధ్యరేఖవుమార్గ --మహదేవ యీశుండ
హద్దుగా వెలసేవు -- యాత్మలింగ
పృధ్వి రూపపుకంచి --చిధ్విలాసమునీవు
జంబుకేశ్వరునిగా -- జలపులింగ
కాళేశ యాకస -- కాలహస్తీశ్వరపు
పంచభూతముగావ --పరమలింగ
*ఆటవెలది 
పంచభూతరూపపరమేశ వరదుండ
పాలకుండశివపు ఫ్రమథఘనము
క్షేమ వీర్యయభయ కేదార రామేశ
భరతఖండమధ్య భాగ్యధాత
***
*కళ్ళే కైపును చూపెను
ముళ్ళై గుండెలను గుచ్చి ముక్కెర చూపెన్
జళ్ళై కళ్ళలొ జలజల
గళ్ళై మనసును చురుకుగ గాళము యగుటన్
---
*బాసల పస చెలిమిగనే
యాసల పస పలుకులుగనె యాకలి మార్చున్
పూసల పస పుడమిన నే 
ప్రాసల పస పద్యమౌను ప్రకటన కవులున్
.........
*కుంకుడు పులుసును కళ్ళలొ
ఇంకుడు గుంట గను చేరి ఈశ్వరిలీలల్
మంకేల నీకు మనసున
వంకర కళ్ళలొ నులుసులు వరుసగ మార్చెన్
........
*కొబ్బరి పచ్చడి తిన్నా
నిబ్బరమైన మనసులకు  నియమమ్ముగనన్
అబ్బురపరిచే కళలే
నబ్బుట విధిగా జరుగుట నరముల బలమున్
.......
* భూమియు అంతా పుత్తడి
కామిక బుద్ధులు మెలుకువ కాలము అలికే
సామిని కోరిన తీరదు
ఆమని ఆశకు కలలగ ఆకలి తీరెన్
---
 మనిషి మనిషి దూరముయే
మనసే మగువైన నమ్మె మత్రం ఇదియున్
అణువంత సొగసు కులుకే
తనువే భూమిగ గగనము తాపము తీర్చెన్
---
* చిన్నది కన్నది కళలై
ఉన్నది తెలిపిన కనవలె ఉనికియు గతులన్
మిన్నగ చూసెను బతుకున
మన్నని లేకయు సుఖమగు మనసే భకరువున్
---
* చిన్నది అన్నది కళలై
ఉన్నది తెలిపిన కనవలె ఉనికియు గతులన్
మిన్నగ చూసెను బతుకున
మన్నని లేకయు సుఖమగు మనసే భరువున్
......
*గురిచేరిన చోటున నే
మరి మరి అందరు సహాయ మనునది చూపున్
గురి కుదరక యే విమర్శ
చేరే ఆశీర్వాదము చింతగ మారున్
.........
*మల్లెల రోదన గుట్టుయు
మల్లిక చూపుల పలుకులు మాలను చూపెన్
తల్లడిలి కనికరమ్మే
నల్లికవి యదే కదిలెను నటనకు లొంగెన్
---
*నింగియు చూపుల నివ్వెర
ఒంగిన వయ్యారపు నడుము ఒంపులు పిలుపున్
సంగమ కాంక్షకు చిక్కియు
సింగము ఆత్రుతనుచూపి సిరులను దోచెన్
--
*అడిగిన పొగడిన తిరిగిన
వడివడి తలుపులు తెలుపుచు వలచుచు బ్రతికెన్
నడకల మలుపుల  నడుముతొ
పిడికెడు కడుపుకు కళలతొ బిగువున నలిగెన్
.......
జూ.యన్.టి.ఆర్. జన్మదినోత్సవ శుభాకాంక్షలు

కళ్ళు చెమ్మగిళ్ళె నటన కాల మగుట
పట్టుదలతో ను కధలకు ప్రాణ మిచ్చె
తాత వారస నటనతో తెలుగు భాష
నందమూరి తారక రామ నాట్య రుద్ర
---
తేటగీతి పద్యాలు

* అమ్మ పలుకులే ఆదర్శ ఆత్మతో డు
నిత్య అనురాగ బంధము నియమ నీడ
హృదయ వాంఛను తీర్చియు హాయినింపు
కళల సాహిత్య సంపద కలిగితోడు
---
మగువ పైశీల నింద యే మనసు మాట
లోక మందు న జోడించు లహరి యాట
శోక పాకమై నలుగుట శకుని మాట
ఏక మవక కూడుకొరకు యెక్కి యాట
---
స్నేహము పటిష్ట మైనది సేతు వల్లె
మోహము బతుకు మార్గము మోజు మల్లె
ద్రోహము జరిగే జీవితం లోన జల్లె
అహము ఆహారము గనులే ఆట వల్లె
.........
మధుర మైన యుగాన న మనసు గాన
ఎండు టాకుగానము చూడు యదలొ గాన
పిల్ల ఏడ్పు గానమున మారు పికమె గాన
గాన గంధర్వ కళలోన గాన హృదయ

"గాన" అనే పదములు ఈ పద్యములో వేర్వేరు అర్ధాలు తో చూడగలరు
........

కాటు కెట్టుకో కళ్ళలో కళలు వల్లి
నుదురు పైబొట్టు పెట్టుకో నిత్య మల్లి
కొప్పులో మల్లె లెట్టుకో కొత్త లిల్లి
నడుము వడ్డానమును పెట్టి నన్ను జూడు
----
అడుగులో అడుగేసియు అందు కొనుము
కాళ్ళ పారాణి గజ్జలు ఘల్లు ఘల్లు
వలపుల తొ మద్దులివ్వవే వలపు రాణి
వయసు అడగను ప్రేమతో వలపు పంచు
---
జీవన మార్గమ్ముగనే
జీవిత నౌక నడిపించి జయమే గాంచెన్
జీవిత చక్రము తిప్పెన్
భావితరమ్ముకు పలుకుల బంధము తెల్పెన్
......
న భ ర న న న ర..12...సురభూజ రాజము
పలుకవే సుధ కోమలాంగి ఉపకరణమగుటె శోభగన్
చిలకవే మదిచిత్రమాయెను చరణ కమలమె ప్రేమగన్
అలకలేలను సాధనమ్మున అతి మతి గతియగు టేలగన్
పలక మారుట గొప్పకాదుగ పలుక గలవులె జీవితమ్
........
కోమలి వృత్తము...1,3 పాదములు..న. జ. జ. య.../8
2,4, పాదాలు జ భ స జ గ.../9

మనసున చిందెను మధ్య సుఖమ్ముయే
వినోద భావము యెవివేక లక్ష్యమై
తనువున సౌఖ్యము తత్వ మనమ్ముయే
మనోమయమ్మున మనమేక మవ్వుటే
....
అతనికలం కళ కావ్య మయమ్ముగా
గతీప్రభావముయె సుఖాల విశ్వమై
మతిని మనోమయమయ్యె విధమ్ముగా
పతీప్రకాశముయె ఉపాయధర్మమై
.......
మత్తేభము
మనసే అర్ధము కాదుగా మగువలో మాధుర్య అందమ్ములే
కన లేనే ఇది ప్రేమలో సహనమై కారుణ్య భావమ్ములే
మనలేనే ఇది భక్తిలో వినయమై మాత్సర్య లక్ష్యమ్ములే
వినుమారీతిని కోరెదే హృదయమై వేదాంత దేహమ్ములే
......
ఉత్పలమాల
ఆగదు లే మనస్సు కళ ఆశల పాశము కాపురమ్మునన్
వేగముగా యశస్సు కళ వేదము లక్ష్యము వేకువవ్వుటన్
రోగము లెన్నియున్ననులె రోషము మాత్రము తగ్గ గుండుగన్
వీగని సానుకూలత ను వేల్పుల లేకయు సాగు జీవమున్
.......
బాధలు పంచు బుధ్ధియును బాధ్యత తోననె బంధమవ్వుటన్
బాధ పడేటి హృద్యమును బాసల తోనునె బాగుచెయ్యుటన్
బంధువు ఆశలే వలదు బంధముపైననె ప్రేమయుంచుమున్ 
హృద్యము జాగరూకతయు హాయిని పంచియు కష్టసౌఖ్యమున్
---
పుట్టిన రోజులే కళలు పూర్ణిమ వెల్గులె చిమ్ముచుండగా
పట్టిన పట్టునే అనక పాఠము నిత్యము సత్య మ య్యదా
మట్టిని నమ్మియే నిజము మానస మంతయు పంచిబత్కుటన్
కట్టిన తాళికే విలువ కాలము యందును ఇచ్చిపొందుటన్
---
శార్దూలము
అమ్మేలే జయసూత్రమవ్వుట యులే ఆరాధ్యదైవమ్ముగన్
మమ్మేలే మహిమాన్వితమ్ము కళే మాధుర్య మయ్యేనులే
నమ్మామమ్మ మనోబలాన్ని విజయాన్నీకోరి ప్రార్ధించితిన్
సమ్మోహమ్ము కధాసుఖమ్ము కళలై సంతృప్తి కల్గించుమున్
........
సౌందర్యం సహనమ్ము గాను విషయం సౌభాగ్య ధారుడ్య మే
సౌందర్యం సుఖమే వినీల మయమై సౌకర్య దాహమ్ముగన్
సౌందర్యం హిమమై న వేడి వినయం సౌలభ్య సంతృప్తి యే
సౌందర్యం భరణమ్ముసేవ తరుణం సౌశీల్య సాహిత్య మే
***
ప్రాంజలి ప్రభ వారి సమస్యను పూరించండి........
పాపము లేనిచో జగతి పాడయి పోవును నిక్కువంబుగన్ 
......

*కోపము లేనిచో ప్రగతి కోరుట సాధ్యము కాదుకాదుగన్
తాపము లేనిచో ప్రతిభ దారిన చేరుట సాధ్యమేలనున్
ఓపిక లేనిచో బ్రతుకు ఓడుట బాధకు బంధనమ్ముగన్
పాపము లేనిచో జగతి పాడయి పోవును నిక్కువంబుగన్
..
చంపకమాల

*విధిన న నేమి జర్గునని విద్యను నేర్చిన పండితుండనెన్
మధువును దోచు లక్షణము మాధ్యమికానన విద్యపాశమున్
పదములుతెల్పుపాఠముయు ప్రేమకు చిహ్నము అయ్యెనే యగున్
విధుడు గళంకహీనుడగబేరు గనెన్ గురుపత్ని గూడుటన్
---



నేటి సూక్తి 

" పద్యపఠనంబుఁజేయఁగహృద్యమగును

పద్య రచనయెబ్రతుకంతపాటుయౌను

పద్యమాకలినిద్రలఁ బట్టనీదు

పద్యసాహిత్యశీలికి వందనాలు !!! "

( పద్యాతురాణాం న సుఖం న నిద్రా )..

----

కోశాలు - అనువైన వైద్యం:-

➡️ అన్నమయ కోశం - అల్లోపతి (ఆంగ్ల వైద్యం), ఆయుర్వేదం

➡️ ప్రాణమయ కోశం - ఆక్యుపంక్చర్ (సూదుల వైద్యం),  ఆయుర్వేదం

➡️ మనోమయ కోశం - హోమియోపతి (బలోపేత క్రియ {పొటెన్సీ} - మందు మోతాదు  ఎంత తక్కువ అయితే అంతా ఎక్కువ ప్రభావం), ఆయుర్వేదం

➡️ విజ్ఞానమయ కోశం -   హిప్నాటిజం (ఉద్దేశపూర్వకంగా సృష్టి చేయబడే నిద్ర)

➡️ ఆనందమయ కోశం - ధ్యానం (మెడిటేషన్)


 ప్రాథమికం - చికిత్స

 ద్వితీయం - నిద్ర 

 అంతిమం - ధ్యానం


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀  77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।

వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀

🌻 347. 'విమలా'🌻 

మలములచే తాకబడనిది విమల అని అర్థము. శ్రీమాత మలములచే తాకబడనిది. ఆకలిదప్పులు ప్రధాన మగు మలములు. దరిద్రము మలము. అష్ట దరిద్రములు గలవు. అవి అన్నియూమలములే. కామక్రోధాది అరిషడ్వర్గములు మలములు. అతిక్రమించు కామము మలము. వికారమగు మనోభావములు మలములు. అధర్మము, అవినీతి మల భావములు. అధిక్రమించు రజస్సు, తమస్సులు (రజస్తమస్సులు) మలములు. మలముల మొత్తమును అవిద్య అందురు. కనుక అవిద్య మలము, మలములకు సమగ్ర నిర్వచనము. అజ్ఞానమే అవిద్య. అది కారణముగనే అహంకారము గట్టిపడును. అప్పుడు రజస్తమస్సులు సత్వము కన్న బలము కలవై వర్తించును. వానికి లోబడిన అహంకార పురుషుడు వికారమగు భావములు కలిగి అష్ట బంధములను సమకూర్చుకొనును. అష్ట కష్టములు పడును.

అట్టి నరుడు త్రికరణ శుద్ధిగ శ్రీమాతను ఆరాధింప ప్రారంభించినచో క్రమముగ అవిద్య తొలగును. విమలుడగును. త్రిగుణములకు లోనైన జీవు లందరూ కూడ అహంకారమను ఆవరణమున వసింతురు. అవిద్యకిది ప్రథమావరణము. త్రిగుణములకు ఆవల శుద్ధచైతన్య స్వరూపిణిగ శ్రీమాత యున్నది. ఈవల అహంకారులై జీవు లున్నారు. అహంకారావరణము దాటినచో జీవులు విమలత్వము చెందగలరు. అట్లు పొందుటకు శ్రీమాత అనుగ్రహమే ఉపాయము. అనుగ్రహమును పొందుటకు నిత్య చింతన, ఆరాధన జరుగవలెను. శ్రీమాత అనుగ్రహించినచో ఎట్టి వారైననూ విమలత్వమును పొందగలరు.

సశేషం...

నేటి నూతన పరవళ్లు 


వెన్నెల్లో దీపమై 
ఆకాశంలో మేఘమై 
పుడమికి అంబరమై 
సృష్టికి ప్రతిసృష్టినై 

వెన్నె లంతా కురిసే నేలపై
నిండు దనమే ఆనందానికి ఆధారమై  
విరహ వేదన తగ్గుటకై 
మనసు మనసు ఏకమగుటకై 

రూప లావణ్య మెరుపుకు దాసుడునై 
తనువంతా మధురాతి మధురమై
మౌనపు చీకట్లో కౌగిలింతల మయమై 
చెలి చెంత చేరి వేడి దుప్పటి నై .

వలపుల కొలనులో  రాపిడి స్నానమై 
నాట్య మయూరి నర్తనకు ఆలమై 
కలువ పూల రేకుల దరహాసమై 
విచ్చుకున్న పువ్వులా వికసించే ఆనందమై .

మధుర స్మృతులకు మార్గమై 
దోబూచులాటలకు నిలయమై 
విలుకాడు విసిరే అస్త్రమై 
హృదయానంద భరిత ప్రేమ రసమై 

నడిరేయి స్వప్నాల మొహమై 
చెంతచేరి బంధించే చెలి రూపమై 
అనురాగపు ఆత్మీయతాభావమై 
తనువంతా సువాసనలు ఘంధమై 

ప్రకృతి తో కనువిందు అపురూపమై  
ఆశల పల్లకిలో చెలి సంతోషమై 
ఇంద్రధనస్సు ఉయ్యాల్లో ఊహలై 
మాటలెన్నో పూలమాలలా నలిగినవై  

 ప్రేమ రథములో కదలికనై 
మగువ మనసుకు అర్ధమై 
మౌనంగా ఆశలు తీరినిదై 
ఆధార మధురం ఆనందమై 
సృష్టికి శ్రీకరమై నూతన జంట ఏకమై 

****

   -                                             -    🙏.

తే. అంధ కారము వల్లనే ఆంధ్ర మాత
కనులు విప్పినా చూడకే కదలి కదలి
శాప మిచ్చె కర్మలవల్ల శాంతి కరువు
ఆంధ్ర నుద్ధారణ జరుగు అదును బట్టి
.........



No comments:

Post a Comment