Saturday 13 May 2023

 

102 *అంత్యక్రియలు 

తిరువణ్ణామలై‌కి చెందిన ఒక పురోహితుడు వివాహాది శుభకార్యాలతోపాటు శ్రాద్ధాది అపర కర్మలు కూడా చేయిస్తుంటాడు, ఆయన పరమాచార్య స్వామివారి పరమభక్తుడు, ప్రతినెలా తిరువణ్ణామలై నుండి కంచికి వచ్చి మహాస్వామి వారిని దర్శించుకొనేవాడు.  వానరానీ ఎండరానీ పిడుగులే పడనీ కంచికి రావడం మానేవాడు కాదు.

ఇలా ఉండగా ఒక నెలలో అతడు మహాస్వామివారి దర్శనానికై కంచికి వచ్చి భక్తులందరితోపాటు వరుసలో నిలబడి ఉన్నాడు.  భక్తులకు దర్శన ప్రసాదాలిస్తున్న మహాస్వామి ఒక్క క్షణం ఆగి తన శిష్యుడొకరిని పిలిచి, "తిరువణ్ణామలై నుండి ప్రతి నెలా వచ్చే పురోహితుడు ఈ వరుసలో నిలబడి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతడికి ఈరోజు దర్శనం లేదు వెళ్ళిపొమ్మని చెప్పు" అన్నారు నిర్దాక్షిణ్యంగా.  ఇలా ఎందుకు చెప్పారో తెలియని శిష్యుడు ఈ విషయం పురోహితునికి చెప్పాడు.  'ఇన్నేళ్ళుగా లేనిది ఇవ్వాళ స్వామి నాకు దర్శనమివ్వక వెళ్ళిపొమ్మని ఎందుకున్నారు' అని వెనక్కి వెళ్ళడానికి మనస్కరించక అక్కడే గేటు దగ్గర పచార్లు చేస్తూ ఉండిపోయాడు.

అతను తిరిగి వెళ్ళలేదని తెలుసుకున్న మహాస్వామి తన శిష్యునితో ఆ పురోహితునికి ఇలా కబురు పంపారు.  "ఆ పురోహితుడు తిరువణ్ణామలై నుండి బయలుదేరేప్పుడు అక్కడ ఎవరింట్లోనో ఒక వ్యక్తి మరణించాడని, అంత్యక్రియలు జరపడానికి రావాల్సిందిగా అతనికి కబురు అందింది, కానీ ఈ పురోహితుడు అహంకారంతో ప్రతినెలా తను కంచికి వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఉంది కాబట్టి, ఆ మరణించిన వ్యక్తి అంత్యక్రియలు తాను నిర్వహించనని చెప్పి కంచికి బయలుదేరాడు".  అతడు ఆ వ్యక్తికి అంత్యక్రియలు పూర్తిచేసి పదమూడవ రోజు శుభం పూర్తయిన తర్వాతే కంచికి రావాలని, అప్పుడే దర్శనం ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పు అన్నారు.

ఈ విషయం విన్న పురోహితునికి దిగ్భ్రాంతి కలిగింది, తన ఊర్లో జరిగిన ఈ విషయం కంచిలోని మహాస్వామి వారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు.  ఇక ఏమీ ఆలోచించకుండా తిరువణ్ణామలై వెళ్ళి మరణం సంభవించిన ఇంటిలో అంత్యక్రియలు నిర్వహించి, పదమూడు రోజుల తర్వాత శుభస్వీకార దినాన్ని పూర్తి చేసుకుని మరలా కంచికి వచ్చాడు.

అప్పుడు అతనికి దర్శనం కరుణించిన మహాస్వామి నెమ్మదిగా మందలిస్తూ "నువ్వు శుభకార్యాలకు రాకున్నా, వాటిని తప్పించుకున్నా ఫరవాలేదు.  కానీ ఒక శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని అనుసరించే పురోహితుడుగా ఇలాంటి అపరకార్యాలను ఉదాసీనపరచడం తగదు.  అంతేకాదు, అలాంటి కార్యాల నిర్వహణకు సంభావన గురించి ఖచ్చితంగా ఉండకూడదు.  వారెంత ఇస్తే అంతే పుచ్చుకోవాలి.  అలా పుచ్చుకున్న సంభావనలో సగాన్ని శివాలయంలో దీపం వెలిగించడానికయ్యే ఖర్చు క్రింద ఇవ్వాలి.  ఇలా చేయడమే మనం వేదాలలో చెప్పినదాన్ని అనుసరించడానికి అర్థం" అని అతనికి విలువైన సలహాలతోబాటు భారీగా ప్రసాదాలను కూడా అందజేశారు.

అంత్యక్రియలు నిర్వహించడం మనం రుద్రునికి చేసే సేవకు సమం.  అది ఒక యజ్ఞఫలితాన్నిస్తుంది.  ఒక జీవుడు తన జీవితకాలంలో ఎన్నో యజ్ఞాలను నిర్వహించవచ్చు, కానీ తన మరణమనే యజ్ఞకార్యాన్ని అతడు నిర్వహించుకోలేడు.  అప్పుడు ఆ యజ్ఞకార్యాన్ని ఆ మృతుని సంతానం పురోహితుల సాయంతో ఎలాంటి లోపాలు దోషాలు లేకుండా నెరవేర్చాలి, అది తప్పనిసరిగా నెరవేర్చబడాల్సిన కర్తవ్యం!

 ---  "శ్రీ కంచి మహాస్వామి దివ్య మంగళ చరితం" నుండి 

 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం 

 శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

 ****

If Kansa Knew That Devaki's Child Would Kill Him, Then Why Did He Let Her Stay With Vasudeva? - Make The World Smile- Humor Nation


104. *ఉప్మా 
*ఉప్మా   గురించి నీ కేం తెలుసు.. 
#ఉప్మా పై చిన్న చూపు చూడకు  రుచి కరమైన సందేశం!!
ఉత్తి పుణ్యానికి #ఉప్మా మీద పడి ఏడుస్తుంటారు కానీ జనాలు.. అసలు ఎంత బావుంటుందో తెల్సా ..
మండించే ఎండల్లో  వండివార్చలేనిపూట ఆకలితో మాడకుండా ఆదుకునే అమృతమేరా #ఉప్మా అంటే ..
అన్నం పప్పూకూరలకి ఇప్పుడేం చేస్తామని బద్ధకించిన ప్రాణానికి ..
అప్పటికప్పుడు దొరికే అన్నపూర్ణేరా #ఉప్మా అంటే ..
ముగ్గురికి సరిపోయే రవ్వకి ఓ గ్లాసుడెక్కువ నీళ్లు పోస్తే ఐదుగురికి సరిపోయే అద్భుతమేరా #ఉప్మా అంటే ..
కూరముక్కలేసినా పొంగిపోక ..వేయకపోతే కుంగిపోక ..స్ధితప్రజ్ఞతతో మన కడుపులో సర్దుకుపోయేదేరా ఉప్మా అంటే ...
ఎర్రరవ్వైనా ఏడిపించక ..
తెల్లరవ్వైనా పోజుకొట్టక ...
చిటికెలో తయారై చింత తీర్చేదేరా #ఉప్మా అంటే ...
సేమ్యాతో చేస్తే సూపర్ హిట్ గా
బియ్యపురవ్వతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచే 
మినిమం గ్యారంటీ వున్న ఏకైక డిష్ రా #ఉప్మా అంటే ..
నేతితో చేసినా ..నూనెతో చేసినా ...
రుచిలో మాత్రం సాటిరాదు దీనికేదైనా ...
చట్నీలేకపోయినా చింతించక ఆవకాయతో అమాంతం జతకట్టేస్తుంది ..
ఊరగాయ అందుబాటులో లేపోయినా ..నిమ్మచెక్క పిండితే చాలు ..నోరూరించేలా సిద్ధమైపోతుంది ..
జీడిపప్పులేయకున్నా ఏమనుకోదు ..కర్వేపాకు వేయకున్నా కలవరపడదు ...
కొత్తిమీర చల్లితేనే పొంగిపోయి ఘుమఘుమలాడే 
ఆత్మీయ నేస్తంరా #ఉప్మా అంటే ...
అకాల క్షుద్బాధకు చెక్ మేట్ చెప్తూ ..
సకాలంలో తయారైపోయే డిష్ ఆఫ్ ఆల్ టైం పర్ఫెక్ట్ ..
ఉదయమైనా సాయంత్రమైనా 
ఉన్నట్టుండి రిలేటివ్సొస్తే ..ఏ అర్ధరాత్రైనా ..
ఉప్మారవ్వుంటే ఇంట్లో కొండంత నిశ్చింత.. 
ఉన్నమాటొప్పుకోవాలి మరి తప్పదెప్పుడో ఒకసారైనా మనమంతా ..
అందుకే మరి చెప్పేదేంటంటే .... 
అమ్మాయిలమీద ..పెళ్లాలమీద ..అవసరానికి ఆదుకునే ఆపద్భాంధవి ఉప్మా మీద జోకులేయక ...
అమ్మాయిల్ని గౌరవిస్తూ ..
పెళ్లాన్ని ప్రేమిస్తూ ..
ఉప్మాని ఆరగిస్తూ వుంటే మీకు అన్నీ ఇట్టే కలిసొచ్చేస్తాయని ఉపమానాలంకారాన్ని ఉపయోగిస్తూ ..కాళిదాసు మహాకవి అప్పుడప్పుడెప్పుడో నొక్కివక్కాణించిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ ...
జై #ఉప్మా ..జై సేమ్యా #ఉప్మా ..
#ఉప్మాఉదయం సాయంత్రం రాత్రి లో సుఖ తెలిక జీర్ణమయ్యే ఆహారం దయచేసి తక్కువచేయకండి
***

105 1.  నవ్వులే నవ్వులు - విద్యార్థుల్లో 

నలుగురు  వ్యక్తులు ఒకచోట కలిస్తారు. వారిలో  రోజు కొకరు ఒక సమస్య చెపుతారు. ఆ సమస్యకు మిగతా ముగ్గురుకి  నవ్వు వచ్చే విధముగా హాస్య విషయాలు తెలియపర్చాలి  నాల్గవాడికి నచ్చే విధముగా ఉండాలి. అవి ధర్మ భద్దముగా ఉండాలి 

సందర్భం ఏదైనా తీసుకొవచ్చు ఇందులో నిభందనలు ఏమి ఉండవు

1. అరవకుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి  

మొదటి వ్యక్తి : నేను స్కూల్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా  (ఓ .కె )

       : 

టీచర్ : అరవ  కండి నిశ్శబ్దం ఉండండి పిల్లలు 

పిల్లలు :  అరవ కుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి, అంటూ 

            తప్పుకోండి టిచర్  మేమంతా బయటకు వెళ్తాం,

మీరు  నిశ్శబ్దంగా మీ పనిమీరు చేసుకోండి  

ఏమంటున్నారు 

            నిశబ్దం అంటూ నోటి మీద  వేలు వేసుకొని బయటకు వెళ్లారు 

నోరు తెరుచు కున్నది టీచర్  

అందరు ఒక్కటే నవ్వులు .......... 

రెండవ వ్యక్తీ : నేను స్కూ ల్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా  (ఓ .కె )

  పిల్లలు :  అరవకుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి అని ఆడి గారుకదా టీచర్ 

  టీచర్ : నోటి మీద వెలు చూపి మాట్లాడలేదు         

పిల్లవాడు :       అద్యక్షా అద్యక్షా అని అరిచాడు ఒక పిల్లవాడు  

   టీచర్ :         నోటి మీద వేలుచూపి మాట్లాడలేదు  

పక్కపిల్లవాడు : అరచిన వ్యక్తి నోరు గట్టిగా మూసాడు 

మరోపిల్లవాడు : ఇప్పుడు నిశ్శబ్దం వహిస్తే వాడు చస్తాడు టీచర్

టీచర్ :             నోటి మీద చేయి తీయరా  అని గట్టిగా అరిచింది

పిల్లవాడు :        అయితే మాట్లాడవచ్చా  టీచర్ 

                       నోరు తెరుచు కున్నది టీచర్  

                       అందరూ  ఒక్కటే నవ్వులు ............. 

మూడవ వ్యక్తి : నేను ఇంట్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా 

 శ్రీమతి  : ఏమిటండి  ఆ చెవులకు పెట్టుకున్నారు, నేచేప్పేది కాస్త వినండి    

 భర్త   :     నోరెత్త కుండా చెప్పినది చెప్పినట్లు చేయాలి కదా,  ఈ మైకులో మాట్లాడు ,నేను మాట్లాడుతా ఎవరికీ వినబడదు. 

 భార్య :    గట్టిగా మాట్లాడింది అంతే 

 భర్త   :    అప్పుడు నానోరు నిశ్శబ్దం, ఇప్పుడు నాచెవులు కుడా నిశ్శబ్దం వహించాయి 

 భార్య :        ఆ మరేం నష్టం లేదు ............ 

                   ఆ అంటూ   నోరు తెరుచాడు భర్త ................ 

                       అందరూ  ఒక్కటే నవ్వులు ............... 

*****


No comments:

Post a Comment