Tuesday 16 May 2023

157 --163 stories

 


157 నేటి మాట

సన్యాసమనగానేమి? - అవి ఎన్ని రకములుగా చెప్పబడినవి? - వాటి వివరములు!!

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు!!...

అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు, ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు. 

అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము!!...

సన్యాసం నాలుగు రకాలు...

1. వైరాగ్య సన్యాసం...

వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది.

 ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు. 

అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది...

2. జ్ఞాన సన్యాసం...

సత్ సాంగత్యం ద్వారా, లౌకిక వాంచలు తగ్గిపోయి. 

సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు...

3. జ్ఞాన వైరాగ్య సన్యాసం...

సాధన ద్వారా, ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు .

4. కర్మ సన్యాసం...

బ్రహ్మ చర్యము, గృహస్త, వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ, ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం.

ఈ సన్యాసులు ఆరు రకాలు...

1. కుటిచకుడు...

శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ  అల్పాహారం తీసుకుంటూ ఉంటారు...

2. బహుదకుడు...

వీరు రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు

3. హంస...

ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.

4. పరమహంస...

వెదుర దండాన్ని కలిగి, ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి నిరంతర సాధన లో ఉంటారు...

5. తురియాతితుడు...

దేహాన్ని ఓ శవంలా చూస్తాడు...

6. అవధూత...

ఇతనికి ఏ విధమైన నిష్ఠ నియమాలు లేవు. 

జగత్ మిధ్య నేను సత్యం అంటూ, నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. 

చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు. 

నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము, అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి  దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు... 

కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు..

***

158/ తెనాలి రామ కృష్ణ కధలు 

శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి, చతురతను పరీక్షించాలని ఎప్పుడు కోరికగా ఉండేది. ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. బంగారు నాణేలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణేలు కిందపడతాయి. #పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది.


ఎవ్వరూ ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్ది సేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో #నింపుకుని, మూటను వీపు మీద వేసుకుని, వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు.


#రామలింగడు సమయస్పూర్తికి ఆశ్చర్యపోయిన రాజు "శభాష్ రామలింగా! శభాష్!" అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేలమీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను, ముటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ, లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరు తలోమాట అన్నారు.


ఎంత దురాశపరుడు" అన్నాడు ఆస్ధాన పూజారి. "గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణేల కోసం వెతుకుతున్నాడు" అన్నాడు సేనాధిపతి. "అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన ఒకటి" అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గర కొచ్చి ఆయన చెవిలో "ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు" అంటూ రామలింగడిని ధూషించసాగాడు.


రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు "రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చాను కదా! మరి ఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. "రాజా! ఇది దురాశ కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను" అని చెప్పడంతో సభంతా మూగబోయింది.

రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా #ఇచ్చాడు...

159. *నీవు ఎవరు* 

*64 లక్షల జీవకణాలు* అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనే అంటాం.
కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?
ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో.
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి.
రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు. 
ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.
కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్.
--(())--


160. కలం స్నేహం రాధా కుసుమ

 అనురాగం రాగాలా అనురాగాలలో పలుకుల సుగంధాలలో వరాల జల్లుల  సోయగాల పరిమళాలు నీ మాటల చమత్కారాల ఆనంద తరంగాలు నన్నే పరవశంలో ముంచేస్తున్నవి...!

కనులు కలవరింతలు మనసు ఆవేదనలు అర విరిసిన మందార మకరందాల 
సోయగాల సొగసులు అలరించే కోయిల గానాలాపనలు నునులేత చిగురుల పచ్చదనాలు పావురాల కువ కువల ప్రేమ భాషా సౌందర్య లహరులలో 
నీ కోసమే వేచిన ప్రేమికను మరుమల్లియను పచ్చదనాల చెట్ల పూలతో 
కొలువు దీరిన నన్ను  కానరాని నీకై నా ఎద విరహంతో రగిలిపోతున్నది...!

ఎవరి చెంత చేరావో చెలినే మరిచావో చింతలో నేనున్న నా చిరునామా చిరునవ్వు నీవేనని ఎంచని నీ చూపుల చమత్కారం చప్పున గమనించ లేనని
చూసినా చెప్పలేనని నన్నే నీవు   తలంచితివా గోపికల చిరుమువ్వల చిరు జల్లుల సడిలో నీవుంటూ చిరు దరహాసంతో నిన్ను చూడ నాహృది చలించిపోయి చంపలపై కన్నీరు కార్చుతూ కుమిలితి  చామంతివలె 
గమనించిన నీ చంచలత్వాన్ని చూసి నా ఎద కుమిలిపోతున్నది...!
నాడు మెరుపుల మేఘాల మిరుమిట్లు గొలిపే మెరిసే మేని మెరుపుల మందార మకరందాల మౌనరాగాల మంజీర నాదాల మరుమల్లెల మలయ పవనాల పయనాలలో నీవే పయనించే పయోదరుడివై మునిమాపువేళ ముంగురులు ముచ్చట గొల్పగా ముంగిట్లో ముచ్చట్లు ఆడి మురిపించిన నీ నైజం
మారిన తీరు నాకు మనోక్లేశం కలిగిస్తున్నది..!
ఇకపై దారి కాచినా కాలానికి కాపుకాసినా కలకాలం నీకు దూరంగా
కలవక కలవని కలువనై దూరమౌతున్న రవిని ఎన్నడు కాంచని దాననై  నీటి కొలనులోని కుసుమమునై...!

--(())--
161. ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.

2. ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి.
5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం కదా ... కొన్ని నిజాలు చూద్దాం ...

అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని 
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి 
అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. 
అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు. 

తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షo కలుగుతుంది.

బాదాం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. 
జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.

1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. 


2) దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది 

తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. 

పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది 

ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది 
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది
కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు
******************************************* 
అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టట,దుర్భాష లాడుట చేయరాదు. 
ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు. 
ఎట్టిపరిస్థితిలో నైనా ఒడిలో కంచెం పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును. 
భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం 
భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.
 నీవు చేసే నీ పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ... ఆనందమే విజయానికి సోపానం. *అనంతవచనం*

--(())--


162 *60-కర్మ - జన్మ*

 *7 వ ఆధ్యాయం - "కర్మ క్షయం"*

 *కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 2* 

*ప్రాయ ఇతి శబ్దేన  దోషసంపాదనం చిత్త మితి*

*తాస్ర ప్రతిషేధః తస్మా త్ప్రాయశ్చిత్తమిత్యాచ్యతే*

*భావం:-*  

 'ప్రాయ' అంటే, దోష సంపాదనం అని అర్ధం. 'చిత్తం' అంటే దాన్ని నివారించుకోవడం అని అర్ధం. 'ప్రాయశ్చిత్తం' అంటే దోషాన్ని నివారించుకోవడానికి చేసే కార్యక్రమం అని అర్ధం.

 *కృచ్చ వ్రతం:-* 

 ఈ వ్రతం ఆరంభించిన రోజునించి మూడు రోజుల దాకా మధ్యాహ్న సమయంలో పెద్ద నిమ్మకాయంత పరిమాణంలో ఇరవై ఆరు అన్నపు ముద్దలు తినాలి. ఉదయం రాత్రి ఏమీ తినకూడదు.

తర్వాతి మూడు రోజులు సాయం కాలం మాత్రమే ముప్ఫై రెండు ముద్దలని, తర్వాతి మూడు రోజులు కోరకుండా లభించిన ఇరవై నాలుగు అన్నపు ముద్దలని తినాలి.

ఆ తర్వాతి మూడు రోజులు కటిక ఉపవాసం ఉండాలి. ఈ విధంగా పన్నెండు రోజులు చేసే వ్రతాన్ని కృఛ్ఛ్ర వ్రతం అంటారు.

 *చాంద్రాయణ వ్రతం:* 

 చంద్రుని వృద్ధి క్షయాలని అనుసరించి ఆచరించే ప్రతం ఇది. ఇదీ ఉపవాసానికి సంబంధించిందే. ఈ వ్రతం అమావాస్య వెళ్ళిన తర్వాతి రోజు, అంటే శుక్ల పక్ష పాడ్యమి నించి ప్రారంభం అవుతుంది.

పాడ్యమి రోజు కేవలం ఒకే ఒక్క అన్నం ముద్ద తినాలి. రెండో రోజు రెండు ముద్దలు, మూడో రోజు మూడు ముద్దలు, ఇలా పూర్ణిమ దాకా ప్రతీ రోజు ఒకో ముద్దని పెంచుకుంటూ తినాలి.

 అలా పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు తిని, మర్నాటి నించి కృష్ణ పక్ష పాడ్యమి దాకా ఒకో రోజు ఒకో ముద్దని తగ్గించుకుంటూ తినాలి. అమావాస్య రోజు కటిక ఉపవాసం ఉంటే చాంద్రాయణ వ్రతం ముగుస్తుంది. 

 పరస్త్రీ పొందు, శాఖాహార మాంసాహార భక్షణం చేయడం లాంటి పాపాలని పోగొట్టుకోడానికి ఈ రెంటినీ ధర్మ శాస్త్రంలో పెద్దలు ఏర్పాటు చేసారు. 

 ఓ ప్రముఖ స్వామి ఆశ్రమంలోని ఒకరు, ఆ ఆశ్రమంలోని పరస్త్రీని అనుభవించిన కారణంగా, ఆ పాపాన్ని పోగొట్టుకోవాలన్న తపనతో ఈ చాంద్రాయణ వ్రతాన్ని స్వచ్ఛందంగా, రహస్యంగా చేసి తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ ఉదంతం ఈ పుస్తక రచయిత దృష్టికి వచ్చింది.

 కాబట్టి, వయసు పైబడ్డవారు, బి.పి, షుగర్ లాంటి వ్యాధులు గలవారు ఎవరూ కూడా వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ వ్రతాన్ని చేయకూడదు.

 ఋషికేశ్ లోని ముని-కి-రేతిలో గల అతి ప్రాచీన ఆశ్రమం అయిన కైలాసఆశ్రమంలో చేరిన బ్రహ్మచారులు అనుమతి లేకుండా ఆశ్రమం దాటి బయటకి పోకూడదు.

అలా వెళ్తే, ముఖ్యంగా రాత్రి బయటే ఉంటే వారిని గోమూత్రంతో స్నానం చేయించి, శుద్ధి చేసి కాని తిరిగి ఆశ్రమంలోకి అడుగు పెట్టనివ్వరు. ఈ నిబంధనని కొన్నేళ్ళ క్రితం దాకా కఠినంగా పాటించేవారు. 

 *"పంచగవ్యములు"* -: అనగా గోవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిలని కలిపి తినిపించి కూడా ప్రాయశ్చిత్తం చేస్తారు. రాత్రి లేదా పగలు నీళ్ళల్లో మెడ దాకా ముణిగి ఉండి ఉపవాసం చేస్తూ గడపటం కూడా ఓ ప్రాయశ్చిత్తం. ఒకటుంది.

 జైన మతంలో *"నిర్జరం"* అనే తీవ్ర ప్రాయశ్చిత్తం ఒకటి ఉంది.  కఠిన నిష్టతో అన్నాహారాలు మానేసి శరీరాన్ని శిధిలం చేసి దేహ త్యాగం చేయడమే నిర్జరం అనే ఈ ప్రాయశ్చిత్తం. మన పురాణాల్లో దీన్ని *"ప్రాయోపవేశం"* అంటారు.

 ఈ అన్ని ప్రాయశ్చిత్త పద్ధతులలో శారీరక కష్టాన్ని స్వచ్ఛందంగా అనుభవించి, తద్వారా కర్మఫలాన్ని స్వచ్ఛందంగా ముందే అనుభవించడం అవుతుంది. 

 ఉద్దేశపూర్వకంగా జరిగిన పాప కర్మలకి ప్రాయశ్చిత్తం లేదని యాజ్ఞవల్క్యస్మృతి లో చెప్పబడింది (3-226) 

అనాలోచితంగా జరిగినవి ప్రాయశ్చిత్తం ద్వారా పోవడం తేలిక. స్మృతులు రాసిన వారిలో ప్రాయశ్చిత్తం మీద ఏకాభిప్రాయం లేదు. కొందరు అవి పాపనిర్మూలనని చేయదని రాస్తే, మరి కొందరు చేస్తుందని రాసారు.

*జానతాతుకృతమ్ పాపం గురుసర్వం భవత్యుత* 

*అజ్ఞానాత్‌స్ఖలితే దోషే ప్రాయశ్చిత్తం విధీయతే*

                        - శాంతి పర్వం 36-41 

*భావం:-*  

 *ఉద్దేశపూర్వకంగా చేయబడిన దుష్కార్యాలు చాలా తీవ్రమైనవి. ఉద్దేశం లేకుండా అంటే యాదృచ్ఛికంగా చేయబడిన దుష్కార్యాలు తీవ్రములు కావు. వాటిని ప్రాయశ్చిత్తంతో నిరోధించవచ్చు.*

 ఈ రోజు పంచశాంతులలో ఒకటైన ఉపవాసం గురించి తెలుసుకున్నాం.

......

163. నవ్వులే నవ్వులు - విద్యార్థుల్లో 

నలుగురు  వ్యక్తులు ఒకచోట కలిస్తారు. వారిలో  రోజు కొకరు ఒక సమస్య చెపుతారు. ఆ సమస్యకు మిగతా ముగ్గురుకి  నవ్వు వచ్చే విధముగా హాస్య విషయాలు తెలియపర్చాలి  నాల్గవాడికి నచ్చే విధముగా ఉండాలి. అవి ధర్మ భద్దముగా ఉండాలి 

సందర్భం ఏదైనా తీసుకొవచ్చు ఇందులో నిభందనలు ఏమి ఉండవు

1. అరవకుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి  

మొదటి వ్యక్తి : నేను స్కూల్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా  (ఓ .కె )

                   : 

టీచర్ : అరవ  కండి నిశ్శబ్దం ఉండండి పిల్లలు 

పిల్లలు :  అరవ కుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి, అంటూ 

            తప్పుకోండి టిచర్  మేమంతా బయటకు వెళ్తాం,

మీరు  నిశ్శబ్దంగా మీ పనిమీరు చేసుకోండి  

ఏమంటున్నారు 

            నిశబ్దం అంటూ నోటి మీద  వేలు వేసుకొని బయటకు వెళ్లారు 

నోరు తెరుచు కున్నది టీచర్  

అందరు ఒక్కటే నవ్వులు .......... 

రెండవ వ్యక్తీ : నేను స్కూ ల్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా  (ఓ .కె )

  పిల్లలు :  అరవకుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి అని ఆడి గారుకదా టీచర్ 

  టీచర్ : నోటి మీద వెలు చూపి మాట్లాడలేదు         

పిల్లవాడు :       అద్యక్షా అద్యక్షా అని అరిచాడు ఒక పిల్లవాడు  

   టీచర్ :         నోటి మీద వేలుచూపి మాట్లాడలేదు  

పక్కపిల్లవాడు : అరచిన వ్యక్తి నోరు గట్టిగా మూసాడు 

మరోపిల్లవాడు : ఇప్పుడు నిశ్శబ్దం వహిస్తే వాడు చస్తాడు టీచర్

టీచర్ :             నోటి మీద చేయి తీయరా  అని గట్టిగా అరిచింది

పిల్లవాడు :        అయితే మాట్లాడవచ్చా  టీచర్ 

                       నోరు తెరుచు కున్నది టీచర్  

                       అందరూ  ఒక్కటే నవ్వులు ............. 

మూడవ వ్యక్తి : నేను ఇంట్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా 

 శ్రీమతి  : ఏమిటండి  ఆ చెవులకు పెట్టుకున్నారు, నేచేప్పేది కాస్త వినండి    

 భర్త   :     నోరెత్త కుండా చెప్పినది చెప్పినట్లు చేయాలి కదా,  ఈ మైకులో మాట్లాడు ,నేను మాట్లాడుతా ఎవరికీ వినబడదు. 

 భార్య :    గట్టిగా మాట్లాడింది అంతే 

 భర్త   :    అప్పుడు నానోరు నిశ్శబ్దం, ఇప్పుడు నాచెవులు కుడా నిశ్శబ్దం వహించాయి 

 భార్య :        ఆ మరేం నష్టం లేదు ............ 

                   ఆ అంటూ   నోరు తెరుచాడు భర్త ................ 

                       అందరూ  ఒక్కటే నవ్వులు ............... 

*****


No comments:

Post a Comment