Saturday 13 May 2023

128--135 stories*


 

 128.  ఏళ్ల వృద్ధుడు జనరల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.  అతని సంతోషకరమైన ప్రవర్తన చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అడిగారు--

 'మీ ఆరోగ్య రహస్యం ఏమిటి....?'

  'నేను సూర్యుడు ఉదయించకముందే లేచి సైకిల్ తొక్కడానికి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి రెండు గ్లాసుల వైన్ తాగుతాను!

 బహుశా ఇదే నా ఆరోగ్య రహస్యం.  ' డాక్టర్ - 'సరే, అయితే మీ నాన్నగారు చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎంత అని నేను మిమ్మల్ని అడగవచ్చా...?'

 - 'నాన్న చనిపోయాడు...!!

 అతను చనిపోయాడని మీకు ఎవరు చెప్పారు. డాక్టర్ (ఆశ్చర్యంగా):- 'మీకు 80 ఏళ్లు, మీ నాన్న ఇంకా బతికే ఉన్నారని అంటున్నావా...?

 ఇంతకీ అతని వయసు ఇప్పుడు ఎంత....?  '

 - 'అతనికి 102 సంవత్సరాలు, ఈ ఉదయం నాతో సైకిల్ తొక్కాడు, ఆపై రెండు గ్లాసుల వైన్ తీసుకున్నాడు'

 డాక్టర్ - 'ఇది చాలా బాగుంది.  దీర్ఘాయువు మీ కుటుంబ జన్యువులలో ఉందని దీని అర్థం. ఇంతకీ మీ తాత చనిపోయినప్పుడు ఆయన వయస్సు ఎంత...?

 --- 'అరే ఇప్పుడు తాతయ్యను ఎందుకు చంపుతున్నావ్ ...?'

 డాక్టర్ (అయోమయంలో) - 'మీకు 80 ఏళ్లు, మీ తాత ఇంకా చాలా బతికే ఉన్నారని అర్థం! అతని వయసు ఎంత.....?  '

 --- 'అవును, అతని వయస్సు 123 సంవత్సరాలు.'

 --- 'అతను కూడా ఈ ఉదయం మీతో సైకిల్ తొక్కేసి వైన్ కూడా తీసుకుని ఉంటాడని అనుకుంటున్నా.....?' డాక్టర్ అన్నాడు

 ---లేదు, తాత ఈ ఉదయం వెళ్ళలేకపోయాడు, ఎందుకంటే

 అతను ఈరోజు పెళ్లి చేసుకుంటున్నాడు. డాక్టర్ (పిచ్చిగా మారే దశలో)

 'అతను 123 ఏళ్ల వయసులో ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడు...?

 --- 'పెళ్లి చేసుకోవాలని మీ తాతకు ఎవరు చెప్పారు....?

 అతను బలవంతంగా పెళ్లి చేసుకోవా ల్సి వచ్చింది. - 'అయితే ఎందుకు........ అని అరిచాడు డాక్టర్! - 'అమ్మాయి గర్భవతి, అందుకే!'

 అప్పటి నుంచి డాక్టర్ రోజూ సైకిల్ తొక్కుతూ వైన్ తాగుతున్నాడు.

 క్లినిక్ మూసి ఉంది.

 😝😝😂🤣😂🤣😍🤩😍🤩

129. ..నేటి చిన్న కధ  "చెప్పులు"


కొత్త చెప్పులు కొందామని ఓ ప్రముఖ చెప్పుల దుకాణం కు వెళ్ళాను, షాపులోని సేల్స్ మేన్
నాకు రక, రకాల క్రొత్త చెప్పులు చూపిస్తున్నాడు,

కానీ సైజు కరెక్ట్ ఉంటే చెప్పులు నచ్చడం లేదు, నచ్చిన చెప్పులు సైజు సరిపోవడం లేదు,
అయినా పాపం సేల్స్ మేన్ ఓపిగ్గా ఇంకా కొత్తరకాలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు,

అంతలో షాపు ముందు ఓ పెద్ద కారు వచ్చి ఆగింది, అందులోనుండి ఓ వ్యక్తి హూందాగా
షాపులోకి వచ్చాడు, ఆయన్ని చూడగానే సేల్స్ మేన్స్ అందరూ మర్యాదగా లేచి నిలబడి
నమస్కారం చేసారు, ఆయన చిరునవ్వుతో యజమాని సీట్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసి
తన పనిలో నిమగ్నం అయ్యారు, మీ యజమానా?
అని సేల్స్ మేన్ ను అడిగాను,

అవును సార్, ఆయన మా యజమాని ,

ఇలాంటి షాపులు ఆయనకు ఓ పది వరకు ఉంటాయి,

చాలా మంచి మనిషి అండి అని ఓ క్రొత్త రకం చెప్పుల జత చూయించాడు,
ఆ చెప్పుల జత చూసే సరికి నాకు తెలియకుండానే నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది,

కానీ సైజే కాస్త అటు, ఇటు గా ఉన్నట్టుంది, చెప్పుల జత నాకు నచ్చిన విషయం సేల్స్ మేన్ కనిపెట్టినట్టున్నాడు , ఎలాగైనా నాతో ఆ చెప్పులజత కొనిపించేయాలని తెగ ఆరాట పడుతున్నాడు, కాస్త బిగుతుగా ఉన్నట్టున్నాయి కదా అంటే, అబ్బే అదేం లేదు సార్,
మీకు కరెక్ట్ సైజే అంటూ బలవంతపెట్టడం మొదలుపెట్టసాగాడు,

ఇదంతా గమనిస్తున్న షాపు యజమాని లేచివచ్చి ముందు క్రింద కూర్చుని సార్
ఓసారి మీ పాదం ఈ చెప్పులో పెట్టండి అని నా పాదం ను తన చేతిలో  తీసుకుని చెప్పును తొడిగాడు,,

నాకు అంత పెద్ద మనిషి (వయసు లో పెద్ద, హోదాలో కూడా) నా పాదం ముట్టుకుని
చెప్పు తొడుగుతుంటే ఇబ్బంది గా అనిపించింది,

పరవాలేదులెండి సర్ నేను  తొడుక్కుంటాను లెండి అని వారిస్తున్నా అతను వినకుండా
రెండు కాళ్ళకుతన చేతులతో నాకు చెప్పులు తొడిగి లేచి నిలబడి ఓసారి నడిచి చూడండి సర్,
మీకు కంఫర్ట్ గా ఉన్నాయో లేదో, లేకుంటే మరో జత చూద్దాం అన్నారు, కానీ ఆ జత సరిగ్గా సరిపోయాయి, నేను బిల్ పే చేస్తూ షాపు యజమాని తో మనసులో మాట బయటపెట్టాను,
సర్ మీరు ఈ హోదా లో ఉండికూడా మా పాదాలు పట్టుకుని మరీ చెప్పులు తొడగడం మాకు ఇబ్బంది గా ఉందండీ? అన్నాను,

ఆయన చిల్లర తిరిగి ఇస్తూ చిరునవ్వుతో సర్!

ఇది నా వృత్తి, నాకు దైవం తో సమానం, "షాపు బయట మీరు కోటి రూపాయలు ఇస్తాను అన్నా
నేను మీ పాదాలు ముట్టుకోను, అదే షాపు లోపల మీరు కోటి రూపాయలు ఇచ్చినా
మీ పాదాలు వదలను " అన్నారు.. నాకు ఆశ్చర్యమేసింది, ఎంత గొప్ప వ్యక్తిత్వం!

తను చేసే పని మీద గౌరవం, నిబద్ధత!

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పాఠం నేర్పడానికి నాకు దేవుడు పంపిన
గురువు లా కనిపించారు,

మనం చేసే పని చిన్నదా? పెద్దదా? అన్నది కాదు సమస్య,

న్యాయబద్ధ మైందా? కాదా అని చూడాలి, న్యాయబద్ధమయినప్పుడు చేసే చిన్న పనికి సిగ్గు పడకూడదు.

ఎప్పుడూ మనం చేసే పనిని కానీ, ఉద్యోగంను కానీ తిట్టరాదు, అదికూడ లేక రోడ్ల మీద
వృధా గా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని కోరుతూ.
***

130 *సంస్కార బీజం..!*        ➖➖➖

*చెన్నై మహానగరంలో అదొక విశాలమైన కాలనీ. దాని పేరు బృందావన కాలనీ. ఆ కాలనీలో  ఏ ఇంటిని కనుగొనాలన్నా రెండు ల్యాండ్ మార్కులు. ఒకటి ‘కమలాసని నిలయం.’  రెండవది ‘దీనదయాళ్ హాస్పిటల్.’*

*కమలాసని నగసుత, హరికృష్ణ దంపతుల ఇల్లు.  ‘నగసుత’ సంగీత విద్వాంసురాలు. ఎంతోమందికి ఉదారంగా శాస్త్రీయ సంగీతం నేర్పుతుంది.* 

***************

*ఒకరోజు సాయంత్రం చిన్నపిల్లల క్లాసు జరుగుతున్నది . ఒక 8 ఏళ్ళ పిల్లవాడిని తల్లి తీసుకొని వచ్చింది. ఆ పిల్లవాడి పేరు ‘వాసుదేవ్‘ అని చెప్పింది. పిల్లవాడిని సంగీతం క్లాసులో చేర్చి వెళ్ళిపోయింది. వాసుదేవ్ ఏకసంథాగ్రాహి!*

*కమలాసని  ఇంటి ముందునుండే దీనదయాళ్ ఆసుపత్రికి అంబులెన్స్ వెళ్తూవుండేవి. ఎంత ఏకాగ్రంగా సంగీతం క్లాసు సాగుతున్నాసరే అంబులెన్స్ శబ్దం వినపడగానే వాసుదేవ్ పాడటం ఆపేసి ‘నారాయణ నారాయణ నారాయణ’ అంటూ కళ్ళు మూసుకొని ఉండిపోయేవాడు.* 

*అప్పడు క్లాసుకి అంతరాయం కలిగేది. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటే ఒకరోజు టీచర్ గట్టిగా కోప్పడింది. వాసుదేవ్ ఏడుస్తూ…”క్షమించండి టీచర్” అంటూ దణ్ణం పెట్టాడు.*

*టీచర్ కి జాలివేసింది . “నాయనా! పాఠం చెబుతున్నప్పుడు   నువ్వు ఎందుకలా చేస్తావు?” అన్నది కళ్ళు తుడుస్తూ.*

*అప్పుడు వాసుదేవ్ 'టీచర్! మాఅమ్మ ఏం చెప్పిందంటే అంబులెన్స్ సౌండ్ వినపడినప్పుడు మనం చేస్తున్న పనిని ఆపి, ఆ రోగి వెంటనే ఆరోగ్యవంతుడు కావాలని నారాయణ స్మరణ చేయాలని, మా ఇంట్లో అందరం అలాగే చేస్తాం టీచర్, అందుకే అలాచేశాను!' అన్నాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ.* 

*టీచర్ కళ్ళే కాదు, అక్కడి పిల్లలందరి కళ్ళూ వాళ్ళకి తెలియకుండానే వర్షించాయి.*

*”నాయనా, వాసుదేవ్! నేను కాదురా, నీవే నా గురువ”ని అంటూ కౌగిలించుకున్నది టీచర్ అతడి తల నిమురుతూ.* 

*”టీచర్, నేను పెద్ద అయిన తరువాత హాస్పిటల్స్ కి అంబులెన్సు కొనిస్తాను. ఇది మా అమ్మ కోరిక టీచర్!” అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చేతులూపుతూ.* 

*”తథాస్తు!” అన్నది టీచర్ మనసులోనే.*

 *అలా 6 ఏళ్ళు గడిచాయి. సంగీతం చాలా బాగా అబ్బింది వాసుదేవ్ కి. అతని తండ్రిగారికి ట్రాన్స్ఫర్ అవడంతో వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు. అలా కాలం గిర్రున తిరిగిపోయింది!*

****************

131 *ఒక రోజు పొద్దున ఓ పిల్లవాడి చేయి పట్టుకొని తెల్లని డ్రస్సులో హుందాగా ఉన్న వ్యక్తి ‘కమలాసని’ ఇంటి గేటు తీసుకొని లోపలికొచ్చాడు.*

*”అమ్మా , ఎవరో వచ్చారు!” అని చెప్పింది ఇంట్లోని అమ్మాయి.* 

*అంతలో ‘గురో అజగురో త్యాగరాజ గురో గురో..” అంటూ పాడటం మొదలుపెట్టాడు వచ్చినతను.* 

*”వాసుదేవ్! నువ్వా!”  అంటూ లోపలినుండి గబగబా పరుగులాంటి నడకతో వచ్చింది నగసుత టీచర్.*

*”టీచర్!” అంటూ ఆమె కాళ్ళకు ప్రణమిల్లాడు. అతడిని లేవనెత్తి.. “ఎలావున్నావు వాసుదేవ్?” ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు? నన్ను మరచిపోయావా?” అని అడిగింది  టీచర్.* 

*అతని కళ్ళవెంట కన్నీటిధారలు కారుతున్నాయి.*

*”అమ్మా! నేనిప్పుడు కార్డియాలజిస్టు ని. ఇక్కడే దీనదయాళ్ హాస్పిటల్ కు డాక్టరుగా వచ్చాను. ఇప్పుడు నాకు అమ్మలేదు. తొలి గురువుగా మా అమ్మ నేర్పిన సంస్కారాన్ని వదలరాదని 10 అంబులెన్సులను హాస్పిటల్ కు డొనేట్ చేశాను. నాకు భగవంతుడు శక్తినిస్తే ఇంకా కూడా చేస్తాను. వీడు నాకొడుకు దయాసాగర్. సంగీత జ్ఞానం కోసం వీడిని మీకు అప్పగిస్తున్నాను!”అన్నాడు.* 

*ఆ పసివాడిని ఆనందంగా గుండెలకు హత్తుకుంది నగసుత టీచర్.*

*అందుకే మాతృదేవోభవ అన్నది వేదం. ఎంతవారికైనా తొలిగురువు అమ్మేకదా ! కన్నతల్లి అయినా , అమ్మలాంటి గురువులైనా పసి మనస్సులలో సంస్కారబీజాలు నాటేది వారే. అందుకే కాలనియమంలేని సంస్కారాలను ఉగ్గుపాలతోనే నేర్పమంటారు మహాత్ములు .*

0 Comments

132 *నేటి జీవిత సత్యం. 

వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు. 

 అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది. 

 అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది. 

 రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది. 

 ఒకరు గురువుగారిని అడిగారు దైవీశక్తిని నేను చవిచూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి గురువుగారు ఇలా చెప్పారు- 

 500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు....అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది. 

 ప్రత్యక్షానుభవం కలుగుతుంది. 

 కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని *చేయడం వలన కలుగుతుంది...అన్నారు. 

 అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ, ప్రయత్నం చేయలేకపోయాడు.

 ఈ ఘట్టం విని అతని స్నేహితుడు, గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు. 

 అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్షం చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా 

 ప్రయత్నం చేసి దైవీశక్తిని అనుభవించాడు. 

 తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు.. 

 కొందరు "అతడు పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు... 

 కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు. 

 అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక. 

 వాస్తవానికి ప్రతి ఒక్కరు ఈ భూమ్మీదకు దిగంబరంగానే 

 వస్తారు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు.. 

 తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందుతారు...తిరిగి అందరినీ, అన్నింటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతారు. 

 " ఖాళీ" అవడం తథ్యం.... 

 కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే 

 గురువుగారు చెప్పిన "మెలకువలో నిద్ర".

 భగవద్గీతలో చెప్పినట్టు- "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు." 

 నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు. 

 "ఖాళీ"గా ఉండడం. అదే యోగనిద్ర. 

 భగవద్గీత చరమశ్లోకంలో- 

 సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు. 

 సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నారు. 

 ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి. 

 "ఖాళీ" అనేది పరానికి సంబంధించినది. 

 శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత. 

 కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు, 

 అర్థరాత్రి... ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని) అంధకారాన్ని(అభేదాన్ని) 

 ఆస్వాదించడమే కాళీమాత దర్శనం. 

 పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి. 

 కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం. 

 వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం. 

 అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం. 

 నిజానికి తాను "ఖాళీ" అయిపోతే.... ఆ ఖాళీ ఖాళీగా ఉండదు... ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది. 

ఇదే "ఖాళీతత్త్వరహస్యం".

 అదే ఇది.... ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం. ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం. ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం. 

 నేను చేస్తున్నాను అనేది మన బ్రమ అదే మన కర్మ కు మూలం. అలా కాకుండా ఈ జగత్తు మొత్తం  జగన్మాత(ఖాళీ) 

 నడుపుతోంది. అని అనుకుంటే 

 అది దైవ దర్శనం మార్గం అవుతుంది మన ప్రయాణం శక్తి (ఖాళీ) తో కూడి చక్కగా సాగిపోతుంది అదే ఖాళీ తత్వ మార్గం. ఈ మార్గం కర్మలకు దూరంగా వున్న సర్వ సంతోషాల నిలయానికి 

 చేరుకోవడానికి సహాయపడుతుంది. ఆ సంతోషి మాత దర్శనం మనకు లభిస్తుంది. 

 తింటేనే రుచి తెలుస్తుంది,అనుభవంతోనే అమ్మ (ఖాళీ) గొప్పతనం తెలుస్తుంది.

సేకరణ. మానస సరోవరం 👏


133 *ఆకు కూరలు అమ్మే అవ్వ !  

ఈ కథ చదివితే కన్నీరు రాని వారు ఉండరు ..

    రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్.  భార్య డెలివరీకి వెళ్ళింది.  అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు, స్వయంపాకం చేసుకుంటాడు.

     ఆరోజు ఆదివారం.  పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు.

ఆకు కూరలు, ఆకు కూరలు అని కేక వినిపించింది.  డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది, పిలిచాడు.

"కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె.

"పాలకూర కట్ట ఎంత?"  అడిగాడు.

"పది రూపాయలకు మూడయ్యా"  చెప్పింది అవ్వ.

"మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు."  అన్నాడు చిరుకోపంగా

"నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ

పదిరూపాయలు ఇచ్చాడు.  "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ తనవైపు పట్టుకుని.

గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి ....

అవ్వ వెళ్ళిపోయింది.

"ఎంత ఆశో ఈ ముసలిదానికి,ఇవాళో రేపో చావబోతుంది, ఇంకా మూటలు కడుతున్నది"ముసిముసిగా నవ్వుకున్నాడు.

అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు.

కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు.  అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ "నానమ్మా.. నన్ను స్కూల్ నుంచి పంపేశారు..." ఏడుస్తూ వచ్చింది.

అవ్వ కంగారుగా "అయ్యో నా బిడ్డ.. బాబూ...కాస్త గంప కిందికి దించు!" అన్నది రవితో.*

"ఏడవకమ్మా...నేనొచ్చి చెబుతాలే.  రేపు ఫీజు కడతాలే..నా తల్లే... ఇంటికిపొదాం పద"  అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ.*

రవికి అర్ధం కాలేదు.  "ఎవరీ పిల్ల?"  అడిగాడు అవ్వను.*

"నా మనవరాలు బాబూ...ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు ఎలుకలమందు మింగి చచ్చిపోయింది.  మా ఆయన మూడేళ్ళబట్టీ మంచం మీదున్నాడు.   ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని  మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ  అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా.  మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు.  నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు.  ఈరోజు చూడు బాబు... పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు." అన్నది కళ్ళు తుడుచుకుంటూ.

రవి నరాలు మొత్తం బిగుసుకుని పోయాయి.   రక్తప్రవాహం స్తంభించి పోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు.  అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది.  మనసంతా ఉష్ణ జలపాతం  అయింది.  ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు  ధారలు కట్టాయి.  "ముసల్దానికి ఎంత డబ్బాశ" అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది.  ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటి గాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు ...

పర్సులో చెయ్యి పెట్టాడు.  బయటకొచ్చి "అవ్వా ... ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి"  అన్నాడు.   బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని.

హంపి మొహంజదారో శిధిలాలకు  ప్రతీకలాంటి   అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది.

"బాబూ .... ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది"  అన్నది వణుకుతూ.

"అప్పని ఎవరు చెప్పారు?  చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ....  ఇప్పుడే కాదు .... నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను .... రేపటినుంచి రోజూ  నేను ఉన్నా లేకపోయినా  పది రూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు" గంప పైకెత్తాడు రవి.

మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు.  వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి!

ఇట్టాంటి చిట్టి కధలు మన మనస్సులని కదిలిస్తాయి ..                                 

సర్వేజనా సుఖినోభవంతు.... లోకా సమస్త సుఖినోభవంతు...

****

134.   ఇద్దరి బ్రతుకు అటు. కథ ఇటు..

మొదటి వ్యక్తి : "నీ వల్ల నా జీవితం సర్వ నాశనం అయింది ...." (ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ)

రెండవ వ్యక్తి : "నీ వలనే నా జీవితం ఇంత అభివృద్ధి చెందింది...." (ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ)

సాధారణంగా చూసిన వాళ్లకు ....విన్న వాళ్లకు ఏం అనిపిస్తుంది ....మొదటి వ్యాఖ్య చేసిన వ్యక్తి జీవితం ...పాపం ఆ ప్రభుత్వం లేదా మరో వ్యక్తి దుర్మార్గం వలన ఎంత నాశనం అయింది ....అని ...,,,,

రెండో వ్యాఖ్య చేసిన వ్యక్తి జీవితం... ఆహా ఆ ప్రభుత్వం లేదా మరో వ్యక్తి మంచితనం వలన ఎంత బాగుపడింది ....అని ...,,,,,అనిపిస్తుంది ....

కానీ అన్ని సమయాల్లోనూ మనం / అందరూ అనుకునేది నిజం కాకపోవచ్చు ....

మొదటి వ్యాఖ్య చేసిన వ్యక్తి జీవితం ...ఆ మరో వ్యక్తి లేదా ప్రభుత్వము మంచితనం వలన , తన మీద ఆధారపడేలా ప్రవర్తించడం వలన , లేదా ఆ వ్యక్తికి కావలసినవన్నీ సమకూర్చి ఏమీ చేతకాని వ్యక్తిగా తయారు చేయడం వలన ...ఆ తర్వాత ఏమీ చేయలేని వాడిగా తయారవడం వలన అతని జీవితం సర్వ నాశనం అయి ఉండొచ్చు .....(ప్రభుత్వం యిచ్చే ఉచితాల పై అనగా సోమరిపోతు గా మారి ఉండొచ్చు అది వేరే విషయం ....)

రెండో వ్యాఖ్య చేసిన వ్యక్తి జీవితం ...ఆ మరో వ్యక్తి చెడ్డతనం వలన ..., ఆ వ్యక్తి  ప్రభుత్వం మీద ఆధార పడకుండా తన స్వసక్తి తో చేయు పనులన్నీ తనే చేసుకోవడం వలన ....అన్ని భావాలు సమర్ధించుకునే శక్తిని పెంపొందించుకోవడం వలన ....సమర్ధుడిగా/సమర్ధురాలిగా  పేరు తెచ్చుకోవడానికి అన్ని విధాలా ఆ వ్యక్తి అసమర్ధత ప్రభుత్వం ఇచ్చు సహాయం పొందక ఉండటం వలన ఈ వ్యక్తి జీవితం బాగుపడి ఉండొచ్చు ....

కాబట్టి ...ఎప్పుడైనా ఒక ప్రభుత్వాన్ని, వ్యక్తిని మనం నిందించే ముందు....పొగిడే ముందు ....ఆ వ్యక్తి మంచివాడైనా ,చెడ్డవాడైనా ...ఆ ప్రభుత్వము, వ్యక్తి వలన మనం ఏం కోల్పోయాం ,ఏం పొందాం అని ఆలోచించుకోవడం ఉత్తమమైన ఆలోచన ....

ఒక్కోసారి మంచివాళ్ళు మంచి చెయ్యకపోవచ్చు ....చెడ్డ వాళ్ళు చెడూ చేయకపోవచ్చు ....

మంచి వాళ్ళు దూషణకు అర్హులు కావచ్చు ,....చెడ్డ వాళ్ళు పొగడ్తలకు అర్హులు కావచ్చు ....

చెప్పలేం ....

ఏది ఏమైనా ..ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ,ఆనందిస్తూ జీవిస్తూ జీవించాల్సినంత అద్భుతమైనది జీవితం ....

ఆశలకు లొంగితే అభాసుపాలు, ఉచితాలకు అలవాటుపడితే సోమరిపోతయి కుటుంబంలో సరిగమలు,

కష్టపడి, మాటపడకుండా ఒక్క పైసా సంపాదన కూడు, గుడ్డ, గూడు, పొంది అందరికీ ఆదర్శము శాంతి కుటుంబములో సుఖాలు సంతోషాలు

మీ ప్రాంజలి ప్రభ 

******

ప్రాంజలి ప్రభ నేటి కథ ...   

135. నువ్వు తెలుసుకో! నీ సాకారం చేసుకో!

ఒకసారి, ఒక బిచ్చ గాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు, చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్ మరియు బూట్లు ధరించి ఉండటంగమనించాడు. అతని దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు.

ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి, “మీరుఎల్లప్పుడూ అడుక్కుంటూ, ప్రజల నుంచి ఏదో ఒకటి అడగతమేనా ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా?" అని అడిగాడు . నేను ఎవరికైనా, ఏదైనా ఎలా ఇవ్వగలను? చెప్పండి” అన్నాడు

 "మీరు ఎవరికీ ఏమీ ఇవ్వ లేనప్పుడు,  మీరుకూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా. నేను ఒక వ్యాపార వేత్త మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే,  మీకు ప్రతి ఫలంగా ఏదైనా ఇస్తాను." అన్నాడు. ఆ వ్యాపార వేత్త ట్రైన్ దిగి వెళ్లి పోయాడు.

ప్రతిఫలంగా నేను ఎవరికీ ఏమీ ఇవ్వలే నందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేను అనిఅనుకొంటూ ఆలోచించడం  మొదలు పెట్టాడు.

బిచ్చగాడు ఆ వ్యాపారవేత్త చెప్పినదాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అతనిమాటలు ఎలాగోలా బిచ్చగాడి హృదయాన్ని చేరు కున్నాయి.

 కానీ నేను బిచ్చగాడిని, ఎవరికైనా ఇవ్వడానికి  నా దగ్గర విలువైనదేదీ లేదు కదా! 

’అయినా ఎంతసేపు నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమి బాగా లేదు.’  అని లోతుగా ఆలోచించిన తరువాత, భిక్షగాడు దానం అడిగే దాని కన్నా ముందు ఏదైనా తన వద్ద వుంటే, అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించు కున్నాడు.

కానీ ఇప్పుడు వున్న ప్రశ్న ఏమిటంటే, అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వ గలడు?   రోజంతా దీని గురించే ఆలోచిస్తూ గడిచింది. కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు.

మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్న ప్పుడు, భిక్షకు బదులుగా అతని కళ్ళు స్టేషన్ పక్క షాప్ మీద పడ్డాయి.  అతనికి ఒక ఆలోచన వచ్చి, వాళ్ళు చేసే దానానికి బదులుగా ప్రజలకు కొన్ని బిస్కట్లు  ఎందుకు ఇవ్వకూడదు అని అనుకొన్నాడు.

అతనికి ఈ ఆలోచన నచ్చి,  వెంటనే అక్కడ నుండి కొన్ని బిస్కట్లు తెచ్చుకున్నాడు. భిక్షాటన చేయడానికి రైలు ఎక్కడు.

ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు, అతను వారికి ప్రతిగా కొన్ని బిస్కట్లు ఇచ్చేవాడు.  ప్రజలు ఆ బిస్కట్లు తమతో సంతోషంగా ఉంచుకునేవారు. కానీఅతనితో ఎక్కువ బిస్కట్లు లేనప్పుడు, అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు. ఇలా ప్రతి రోజూ కొనసాగుతూ ఉండేది. 

తన ఓంకార కాలుతో 

ఒకరోజు అతను భిక్షాటనచేస్తున్నప్పుడు, అదే వ్యాపారవేత్త రైలులో కూర్చుని ఉండడం చూశాడు, అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు.

*భిక్షగాడు వెంటనే అతని దగ్గరకు వెళ్లి, "ఈ రోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని బిస్కట్లు  నా దగ్గర ఉన్నాయి అవి మీకు ఇస్తాను " అన్నాడు.

అప్పుడా వ్యాపారవేత్త  అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో,  బిస్కట్లు ఇచ్చాడు. 

అతను, "వావ్! ఈ రోజు మీరు కూడా నాలాగే వ్యాపార వేత్తగా మారారు!” అని అతన్ని అభినందించి. బిచ్చ గాడి నుండి బిస్కట్లు తీసుకొని, అతను ప్రక్క స్టేషన్‌లో దిగిపోయాడు.

బిచ్చగాడు  బిగ్గర గొంతుతో ఇలా అన్నాడు, “నేను ఇకపై బిచ్చగాడిని కాదు, నేను ఇప్పుడు వ్యాపారిని, నేను కూడా ఆ పెద్దమనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను, నేను కూడా ధన వంతుడిని కాగలను"  అని అనడం జరిగింది.

అక్కడున్న ప్రజలు అతడిని చూసి, బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడై ఉంటాడని అనుకున్నారు. మరుసటి రోజు నుండి ఆ బిచ్చ గాడు మళ్లీ ఆ స్టేషన్‌లో కనిపించ లేదు.

నాలుగు సంవత్సరాల తరువాత, సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు.  ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు, అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి,   "మీరునన్నుగుర్తించారా?" అని అడిగాడు.

మరొక వ్యక్తి "లేదు! బహుశా మనం మొదటి సారి కలుస్తున్నామేమో." అని అనడం జరిగింది.

మొదటి వ్యక్తి మళ్లీ అన్నాడు, "మనం మొదటిసారి కలుసు కోవడం కాదు., ఇది మూడోసారి" అన్నాడు.

రెండవ వ్యక్తి, "అవునా సరే, నాకు గుర్తులేదు. మనం ఎప్పుడు కలుసు కున్నాము?" అని అడగడం జరిగింది.

అప్పుడా మొదటి వ్యక్తి నవ్వి, "మనం ఇంతకు ముందు ఒకే రైలులో రెండుసార్లు కలుసు కున్నాము. నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చ గాడిని, రెండవ సమావేశంలో 'నేను నిజంగా బిజినెస్ మ్యాన్' అని మీరు నన్ను మెచ్చు కొన్నారు అది కూడా నేనే"!

ఫలితంగా, ఈ రోజు నేను చాలా పెద్ద బిస్కట్లు వ్యాపారిని ఇప్పుడు అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను." 

"మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు. దాని ప్రకారం ’మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకుఏదైనా లభిస్తుంది!" అని.

”ఈలావాదేవీ నియమం నిజంగా పనిచేసింది. నేను దానిని బాగా అనుభూతి చెందాను, అంతకు మునుపు నేను ఎప్పుడూ… నన్ను నేను బిచ్చగాడిగానే భావించుకొనే వాణ్ని , నేను దాని కంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు.”

”కానీ, నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు, నేను ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు. మీకు ధన్యవాదాలు, ఆ రోజు నుండి, నా దృక్పథం మారిపోయింది. ఇప్పుడు నేను వ్యాపార వేత్తగా మారాను, నేను ఇకపై బిచ్చగాడిని కాదు.” అని ఆ వ్యాపార వేత్తతో అనడం జరిగింది.

బిచ్చగాడు తనను తాను బిచ్చగాడిగా భావించినంత కాలం, అతను బిచ్చగాడుగానే ఉన్నాడు. మరియు తనను తాను వ్యాపార వేత్తగా భావించి నప్పుడు, అతను ఒకవాపారవేత్త గా ఎదగడం జరిగింది.

          

కాబట్టి, పట్టుదల రావాలని ఎదో ఒకటి ఆధారము కావాలి ... ఏ ఆధారము లేకపోవుటవల్లనే సోమరిపోతుల్లా తయారవుతున్నారు.  నీలో వున్న విద్యా ధనాన్ని సద్వినియోగము చేసి నట్లయితే జీవన సాఫల్యము సుఖమయము   



No comments:

Post a Comment