Tuesday 16 May 2023

225 -- 231stories

 



అదే ఈ కథలోని తత్త్వం. మానవునికి అనుసరణీయం.

: ప్ర: సంధ్యా కాలం చాలా పవిత్రమైనదని..   

                                                                        ఆ సమయంలో భగవద్ధ్యానం మంచిదనీ అంటారు. సంధ్యాకాలం అంటే సరిగ్గా ఏ సమయం? 'సకాలం'లో సంధ్యావందనం చేయాలి కదా? ఆ 'సకాలం' ఏమిటి? 

జ: రోజుకి మూడు సంధ్యలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. 1. ప్రాతఃసంధ్య, 2. మధ్యాహ్న సంధ్య, 3. సాయం సంధ్య. ఇవికాక కొన్ని ఉపాసనలకు చెప్పబడ్డ సంధ్య - తురీయ సంధ్య. ఇది నాలుగవది. దీని సమయం అర్ధరాత్రి.

ఉదయానికి ముందు వచ్చేకాలం 'ప్రాతఃసంధ్య'. రాత్రికి ముందు వచ్చేది ' 'సాయంసంధ్య', మధ్యాహ్నవేళ 'మధ్యాహ్నిక సంధ్య'. 

ఉదయా ప్రాక్తనీ సంధ్యా

ఘటికా త్రయ ముచ్యతే ౹

సాయం సంధ్యా త్రిఘటికా

అస్తాదుపరి భాస్వతః ౹౹

సూర్యోదయానికి ముందు దాదాపు 70 నిమిషాల కాలం ప్రాతః సంధ్యకు ముఖ్యకాలం. సూర్యుడస్తమించడానికి ముందు ఇరవై నిమిషాలు మొదలుకొని, సూర్యుడస్తమించిన తరువాత 30 నిమిషాల కాలం సాయంసంధ్యకు ముఖ్య కాలం. ఇందులోనూ ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. 

1. ఉత్తమా తారకోపేతా

    మధ్యమా లుప్త తారకా ౹

    అధమా సూర్యసహితా

    ప్రాతఃసంధ్యా త్రిధామతా ౹౹

తెల్లవారు ఝామున నక్షత్రాలుండగా ప్రాతః సంధ్యావందనానికి ముఖ్యకాలం. ఇదే సకాలం. తారకలు లేని ప్రాతఃకాలం మధ్య కాలం, సూర్యుడు ఉదయించిన తరువాత సంధ్యా వందనానికి అధమ కాలం, సకాలంలో చేయడమే సర్వశ్రేష్ఠం. అలా కుదరనప్పుడు, మానేయడం మంచిది కాదు కనుక, "ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం" అధిక అర్ఘ్యప్రదానంతో సంధ్యోపాసన చేయాలి. 

2. ఉత్తమా సూర్యసహితా

    మధ్యమా లుప్త భాస్కరా ౹

    అధమా తారకోపేతా

    సాయం సంధ్యా త్రిధామతా ౹౹

సాయంవేళ సూర్యుడుండగా చేసే సంధ్యావందనం ముఖ్యకాలం, సకాలం. సూర్యుడస్త మించినప్పుడు మధ్యమం. నక్షత్రోదయం తరువాత చేయడం అధమం. కానీ 'సకాలం' దాటిపోతే, ప్రాతః సంధ్యకు లాగానే, 'ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం' అధిక అర్ఘ్య ప్రదానం చేయాలి. 

'మధ్యాహ్న సంధ్య' అంటే మధ్యాహ్నం 11 గంటల తరువాత నుండి సాయంత్రం లోపల చేయాలి....

226. ప్రతి మనిషి పుట్టుకతోనే దేవ, పితృ, ఋషి ఋణాలను కలిగి ఉంటాడు. మొదటిదైన ‘దేవఋణం’ యజ్ఞయాగాదులు, అర్చన, ఆరాధనాది విధులద్వారా తీర్చుకోగలం. సంతానం, వంశప్రతిష్ఠలను పెంచే సత్కార్యాలు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల హితోపదేశాలను పాటించడం, దివంగత పెద్దలకోసం శ్రద్ధతో శ్రాద్ధకర్మలు చేయడం.. వంటివన్నీ ‘పితృ (మాతా పితరుల) ఋణం’ తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. వేదవిజ్ఞానం, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, భాగవత, భగవద్గీతాది మహాగ్రంథాలతో సహా పురాణ వాఙ్మయాన్నంతా భక్తితో అధ్యయనం చేయడం ద్వారా ‘ఋషిఋణం’ తీర్చుకొనే అవకాశం మనకుంది. ‘మహర్షులు అందించిన విజ్ఞాన సంపదను తాను పొందుతూ, పర్యావరణ పరిరక్షణకు, పశుపక్ష్యాదులు, జీవకోటితోపాటు తోటివారి శ్రేయస్సు కోసమూ దానిని ఉపయోగించగల శక్తి సామర్థ్యాలను వివేకవంతుడైన మానవుడు కలిగి ఉన్నాడు.

మానవులలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రకాశింప చేయడానికే వేలవేల సంవత్సరాల క్రితమే మహర్షులు ‘అపారమైన విజ్ఞాన సంపద’ను సిద్ధపరిచి ఇచ్చారు. ప్రజలు తెలుసుకోలేని అపౌరుషేయమైన వేదవిజ్ఞానాన్ని, అతీంద్రియ విషయాలను ఎన్నింటినో తమ తపశ్శక్తి ప్రభావంతో ప్రత్యక్షంగా దర్శించి మనకు అందించిన మహోపకారులే మహర్షులు. ‘మంత్రద్రష్టారో ఋషయః’ అంటే, ‘వేదమంత్రాలను దర్శించినవారు ఋషులు’. నిరుక్తకారుడైన యాస్కాచార్యుడు, ‘ఋషిః దర్శనాత్‌. విశ్వ విజ్ఞానప్రదమైన వేదవిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా దర్శించే మహనీయుడే ఋషి’ అని నిర్వచించాడు. ధర్మశాస్త్ర కల్పసూత్రాల లాక్షణిక గ్రంథాలను ఇతిహాస పురాణాలను, సంగీత, నాట్య, శిల్ప, ఆయుర్వేదాది విద్యలను, తర్క, వ్యాకరణ, మీమాంసాది శాస్ర్తాలను మన క్షేమలాభాల కోసమే ఋషులు అందించారు.

పొంగి ప్రవహించే ప్రేమ, ప్రకృతి-ప్రాణులను ప్రేమించే నడవడిక, వినయశీలత, మధురమైన వాక్కు, లోకహితం- మంగళకరమైన ఆలోచనలు, రాగద్వేషాలకు అతీతమైన మనస్తత్వం.. మొత్తంగా దోషాలు అంటని జీవితాలను మహర్షులు సహజ స్థిరసంపదగా కలిగి ఉంటారు’. ఇదీ ఋషుల వ్యక్తిత్వం, గొప్పతనం. ఇంతేకాదు, లౌకిక సుఖభోగాలపై వైరాగ్యం, సడలని తపస్సు, దృఢమైన మనస్సు, జీవుల క్షేమాన్ని కోరే స్వభావం, అహింసా భావన, ఆడంబరాలు లేని జీవన విధానం, భగవద్‌ భక్తి, ఆదర్శప్రాయమైన సత్కార్యాచరణ, శీతోష్ణ ప్రతిబంధకాలను సహించగల శక్తి, ఆశలు లేని- ఆకర్షణలకు లొంగని ఇంద్రియ నిగ్రహం.. వంటి గుణాలెన్నో మూర్తీభవించిన వారు మహర్షులు. వారు మనకు అందించిన ఆధ్యాత్మిక, ధార్మిక విజ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసి, ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఋషుల చరిత్రను ఆసాంతం తెలుసుకోవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపైనా ఉన్నది.

మానవుల సమగ్ర వికాసానికి దోహదపడే, మానవత్వాన్ని వికసింపజేసే, జీవితానికి పరమార్థాన్ని, కర్తవ్యాన్ని ప్రబోధించే శ్రీరామాయణ, మహాభారత, భాగవతాది మహాగ్రంథాలను వాల్మీకి- వ్యాసాది మహర్షులు అందించారు. మానవజాతికి అవి సుఖశాంతులను అందించే కాంతి కిరణాలు. సాంసారిక తాపత్రయాన్ని తొలగించే తాత్తికమైన మలయ మారుతాలు. సంకుచిత స్వభావం, ఆత్మన్యూనతతో సతమతమయ్యేవారికి, సుఖశాంతి సంతోషాలు మృగ్యమైనవారికి విజ్ఞానదీపికలుగా, హస్తభూషణాలుగా, హృదయాభరణాలుగా వెలుగొందే అమృతరస ఖండాలే ఆ మహాగ్రంథాలు. వీటి సమగ్ర అధ్యయనానికి మానవాళి ఇప్పటికైనా కృషి చేయవలసి వుంది. ఆర్షవాఙ్మయంలోని అనర్ఘ రత్నాలన్నిటినీ శోధించి, ఆ జ్ఞానసంపదను పూర్తి స్థాయిలో వెలికి తీసి, ఆచరణలోకి తెచ్చుకోగలిగితే మన జీవితాలు చరితార్థమవుతాయి.

***

227 *కర్ ఫలం తప్పదు*

పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.

కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.

తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.

’ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడ్తున్నాను’ అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.

’అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటువేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో?’ అన్నాడు.

’తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా‘ అని ప్రశ్నించాడు కశ్యపుడు. అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు.

అంతట కశ్యపుడు, ‘సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం!’ అని అన్నాడా కశ్యపుడు.

అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు.

కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు. ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, ‘అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు!’ అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు.

చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది.

వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని ‘మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షితుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు!’

‘ఇంతకూ తమకు కావలసింది... ‘అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ‘ధనమయ్యా! ధనం!’అన్నాడు కశ్యపుడు.

‘అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను!’ అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.

ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.

మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు!

ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం.

అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.

పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా.

ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి.

కశ్యపుడు రాజును రక్షించుదామని బయలుదేరినా, పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.

ఏమిటి ఆ పాప కర్మ?

ఒక ముని మీద     చచ్చిన పామును వేయడం!

*మంచివారితో మహాత్ములతో చెలగాటమాడడం.  

కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.

రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.

పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది.

మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.

నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.

మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది.

కర్మ బలీయమైనది.

’గోవిందా, నారాయణా, రామా, శివా!కాపాడు!కాపాడు!’ అని ప్రార్ధిస్తూ ఉంటాం. 

ప్రాణాపాయంలో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు…. ‘ఓయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా? నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం వున్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు! నీ కర్మ అని అంటాడు.

మన పుణ్యఫలం మన జాతకంలో గురురూపంలో కనిపిస్తుంది.

గురు అనుగ్రహం వున్నదా?

గురు దృష్టి వున్నదా?

శుభగ్రహ దృష్టి వున్నదా?

వుంటే బ్రతికిపోతాము. లేదా బాధ పడాలి, తప్పదు.

పాపం అంటే… శరీరాన్ని,  తద్వారా మనసును బాధ పెట్టడమే!

"మనసు బాధ పడితేనే పాపకర్మ క్షయం అవుతుంది."

"మనసు సుఖ పడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది" .

పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు,పాపమూ లేదు. అదే అకర్మ,వికర్మ,సుకర్మ, నిష్కామ కర్మ.

కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు

తాతముత్తాతలు చేసిన పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చి తీరుతుంది.

ఆ పుణ్యమే మన సంతానాన్ని, మనుమలన్ని కాపాడుతుంది. మన వంశాన్ని కూడా కాపాడుతుంది.

ఇదే మన జాతకంలో రెండవ స్తానం, తొమ్మిదవ స్తానం స్పష్టంగా చెబుతుంది.

మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృదేవతలు చేసిన పుణ్యఫలితం వలన బ్రతికి బయట పడతాము.

వారి పుణ్యఫలం మనల్ని కాపాడుతుంది.

మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది.

సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు వున్న పరీక్షిత్తు అంతటి వాడు కూడా మాయలో పడ్డాడు గదా!

కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు?

అదే కర్మఫలం, కాల మహిమ.

కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు. దీనిలో మనం మరోకటి కూడా గమనించాలి…

తక్షకుడు విషనాగు అంటే ప్రారబ్దకర్మ. దానిని కూడా జయించింది మంత్రశాస్త్రం.

కాటు చేత పుష్పించిన మహావృక్షం కాలి బూడిద అయితే, మంత్రం మరలా దానిని చిగురింప జేసినది.

అంటే మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగబడుతుంది అని మనం తెలుసుకోవాలి.

మంత్రం ప్రాణం పోస్తుంది.

 కానీ ఆ మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి! అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి!

228 *ఉషా పరిణయం*

పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. ఆటను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు. వేయి చేతులు వున్న బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసురసంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ‘వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు’ అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. ఆటను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు ‘నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. అపుడు వానిలో వున్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి. “ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా” అని అడిగాడు.

అపుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కాని ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు.పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు యిటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనుయాయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈవిధంగా శంకరుడు కోతబయత తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు.ఎప్పుడయితే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో యిక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి ‘శంకరా! ఆరోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడూ వచ్చి నాతొ యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది’ అని కోరాడు. భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనపడింది.

ఈశ్వరుడు తెల్లబోయాడు. అపుడు ఆయన అన్నాడు – ఇపుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది రక్షించవలసినవాడూ తానే. వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడూ తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు వున్న ఇంకొక రూపంతో వేయాలి. ‘నాతో సమానమయిన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు వున్న జండా క్రింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకున్న వ్యగ్రత పోతుంది’ అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆరోజు గురించి ఎదురుచూస్తున్నాడు.

ఇపుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణమును అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివ కేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానమును బాణాసురుని స్థాయికి తీసుకువస్తుంది. ఇపుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యౌవనంలో వుండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకతె ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనుమడయిన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని కొన్ని గుర్తుల చేత స్పష్టముగా తెలిసింది. ఆవిడ నిద్రలేచింది. కానీ ఆవిడ నిన్నరాత్రి కలలో ఎ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతితప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజూ ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకతె ఉన్నది. ఆవిడ వచ్చి “నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పువలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను. ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది’ అని అడిగింది. అపుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది.

అప్పుడు చిత్రలేఖ సఖీ! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందఱో రాజాధిరాజులను చూశాను. వాళ్ళ చిత్ర పటములను గీస్తాను నేను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు’ అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరుపేరునా వివరించింది. అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అపుడు చిత్రలేఖ ‘ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన యందా నీవు మనసు పడ్డావు. సఖీ! ఇప్పుడు నేను నీకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు.

అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంస తూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు.’ అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. బయట మూడుకన్నులున్న వాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనస్సులు ఒక్కటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు అక్కడ ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకొని ఆకాశమార్గంలో తిరిగి వచ్చేసి తిరిగి లోపలి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుని తీసుకొని కోటలోపలికి వెళ్ళడం బయట కోటకి కాపలా కాస్తున్న మూడు కన్నులవాడు చూశాడు. ఏమీ అభ్యంతర పెట్టలేదు.

చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోపెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు నెలలు కాలం గడిచిపోతున్నది. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేరీతిగా ఉండదు. ఉషాదేవి యందు గర్భిణి చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్డుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారినందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగ పాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు యిక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ప్రభూ మీ రథం మీద ఉన్న జండా విరిగి క్రిందపడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతున్నదనుకొని బయలుదేరాడు. అసురీవృత్తి ఎటువంటిదో చూడండి. వానికి కూతురి గొడవ అక్కరలేదు. యుద్ధం కావాలి.

ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలో అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు “అనిరుద్ధుడిని బాణాసురుడు నాగ పాశములతో బంధించాడు. నీవు వెంటనే బయలుదేరవలసినది’ అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి “నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు వున్నావు. నీవు కృష్ణుడు కోటలోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి, కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది’ అని అన్నాడు.

శంకరుడు భక్త వత్సలుడు. భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు.కాబట్టి యిపుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభం అయింది. శివుడు యుద్ధంలో లొంగనంత సేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలులేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు యిచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. అపుడు శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి డీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది.

ఉషాపరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వనాల లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం, విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో, వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమయినదిగా జ్వరము బాధించడానికి వీలులేదు. ఆ మేరకు నేను వరం యిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడయినా జ్వరము చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషా పరిణయమును శరణాగతి తత్త్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరమును యిస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది.

వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మా చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లియైన కోటర ఆ రోజున యుద్ధమునకు వచ్చి ఒంటిమీద ఉన్న వలువలన్నిటిని విప్పేసి, జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయై జుట్టు విడివడి ఎదురునిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనుస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మరల యుద్ధం ప్రారంభం అయింది. అపుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. ‘నేను కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలులేదు. కాబట్టి తగిన విధంగా నీవు వానికి శిక్ష వేయవలసినది అని.

శివకేశవుల హృదయములు ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒక్క పదార్ధం రెండుగా కనపడుతోంది. కాబట్టి ఆరోజు కృష్ణ భగవానుడు

బాణాసురునకు ఉన్న బాహువులలో 996బాహువులను సుదర్శన చక్రధారల చేత తెన్చేశాడు. నాలుగు బాహువులను వదిలేశాడు. అపుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిశాయి. ఇప్పుడు వాని శరీరమునందు రజోగుణ తమో గుణములు లేవు. శుద్ధ సత్త్వంతో ఉంటాడు. ‘ఈశ్వరా వీడు నీ భక్తులలో అగ్రేసరుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసురసంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉష అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని నాలుగు చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదముతో కూడిన ప్రవర్తన వీడియందు ఉండదు’ అని ఆరోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషమును పొందాడు.

ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి యిపుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు.

బాణాసురుడు కోటలోకి వెళ్లి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు మాల్యములు ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారక నగరమునకు సాగనంపాడు. ఈవిధంగా ఉషాపరిణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది.

ఎవరు ఈ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు పరమ శివుడంతటి వాడిని కింకరునిగా చేసుకున్నాడో ఎవరు తుట్టతుదకు నాలుగు చేతులతో, పరమశివునికే కింకరుడు అయ్యాడో కృష్ణుని విజయమునకు పొంగిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో, కల్పాంతం వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయం వింటున్నారో ఆయన నామం ఎవరు చెపుతారో వారికి సమస్త విజయములు చేకూరుతాయి. వాళ్లకి ఓటమి సంభవించదు. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఈ ఉషాపరిణయఘట్టమును, బాణాసుర ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరుతుంటారు. ఇది అంతగొప్ప ఆఖ్యానము.

ప్రాంజలి ప్రభ

229. కష్టాల్లో కుంగిపోకుండా, సుఖాల్లో పొంగిపోకుండా సంయమనం పాటించాలంటుంది బౌద్ధం. అంతే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కలవరపడితే మన మానసిక శక్తులు కుంచించుకుపోతాయి. సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపలేవు. మరింత లోతున పడేస్తాయి. అదే మనం దిగాలు పడకుండా దిటవుగా నిలబడితే... కష్టాలను తొలగించుకొనే మార్గాలు కనిపిస్తాయి. అలాంటి మార్గాన్వేషణలో మనిషి తన ఉపాయ కుశలతను ప్రదర్శించాలంటాడు బుద్ధుడు. అటువంటి ఒక ఉపాయశాలి గురించి ఆయన చెప్పిన కథ ఇది.

పూర్వం జంబూద్వీపంలో, ఒక నిరుపేద కుటుంబంలో బోధిధరుడు పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అతని మిత్రులందరూ తక్షశిలకు వెళ్ళి, విద్యలు నేర్చుకొనేవారు. తాను కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు. కానీ ఆ స్తోమత లేదు. అయినా తల్లితండ్రులకు నచ్చజెప్పి తక్షశిలకు వెళ్ళాడు. అక్కడే ఒక గురువును కలిసి, తన పేదరికం గురించి చెప్పుకున్నాడు. 

‘‘గురువర్యా! గురుదక్షిణ లేకుండా విద్యను అభ్యసించడం మంచిది కాదు. నేను తమకు ఇప్పుడు ఏమీ సమర్పించలేను. కానీ విద్య ముగిశాక యాచించి, ధనాన్ని తెచ్చి, మీకు సమర్పిస్తాను’’ అని చెప్పాడు.

గురువు సంతోషించి ‘‘సరే!’’ అన్నాడు. గురుదక్షిణ కన్నా బోధిధరుడిలో దక్షతను ఆ గురువు చూడగలిగాడు. అందుకే అతను అడిగిన వెంటనే తన శిష్యుడిగా చేర్చుకోవడానికి అంగీరకించాడు.

కొన్నాళ్ళకు బోధిధరుడి విద్యాభ్యాసం పూర్తయింది. ‘‘గురుదేవా! నా మాట ప్రకారం యాచించి, దక్షిణ తెచ్చి ఇస్తాను. అనుమతి ఇవ్వండి’’ అని కోరాడు. 

‘‘అలాగే...వెళ్ళి రా!’’ అన్నాడు గురువు. 

బోధిధరుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. తన గురించి చెప్పాడు ఎందరో కాదనకుండా, లేదనకుండా శక్తి కొలదీ సహాయాన్ని అందించారు. ఇలా వచ్చిన వాటన్నిటినీ బంగారు నాణేలుగా మార్చుకున్నాడు. గురుదక్షిణ సమర్పించడం కోసం తక్షశిలకు బయలుదేరాడు. 

దారిలో ఒక నది అడ్డుగా ఉండడంతో... పడవ మీద ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో గాలి వీచింది. సుడి రేగింది. పడవ కొద్దిగా పక్కకు ఒరిగింది. అతని జేబులోని బంగారు నాణేల మూట నదిలో పడిపోయింది. నావికుడు పడవను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు. కానీ... గురుదక్షిణ మొత్తం గంగపాలైంది. 

ఈ విషయం తెలిసి అక్కడున్నవారందరూ విచారపడ్డారు. ‘‘మళ్ళీ గ్రామాలకు పోయి యాచించు’’ అని సలహా ఇచ్చారు.

కానీ ఆ సొమ్మును రాజు దగ్గర నుంచి సంపాదించాలనుకున్నాడు బోధిధరుడు. వెంటనే తన బుద్ధికుశలతను ఉపయోగించాడు. ఆ నదీ తీరంలో... ఇసుకలో కూర్చొని మౌనవ్రతం పట్టాడు. తిండి మానేశాడు. అలా రోజంతా గడిచింది. అక్కడి నుంచి బోధిధరుడు కదల్లేదు. 

సమీప గ్రామాల ప్రజలు ఎందరో వచ్చి అతణ్ణి పలకరించారు. ‘‘ఎందుకిలా చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘ఆహారం తీసుకోండి’’ అని అర్థించారు. బోధిధరుడి నుంచి వారికి ఎలాంటి సమాధానం రాలేదు.

రెండు రోజులు గడిచాయి. ఈ వార్త దేశమంతా పాకింది. రాజుగారికి చేరడంతో, తన మంత్రులను పంపాడు. వారు ప్రశ్నించినా బోధిధరుడు ఉలకలేదు, పలకలేదు.

చివరకు రాజే తరలివచ్చాడు. ‘‘ఎవరు నీవు? ఇక్కడ ఎందుకు నిరాహారంగా, మౌనంగా కూర్చున్నావు?’’ అని అడిగాడు. 

అప్పుడు బోధిధరుడు నోరు తెరచి మాట్లాడాడు. తన చరిత్ర చెప్పాడు. 

రాజు ఆశ్చర్యపడి ‘‘ఈ విషయం నాతోనే ఎందుకు చెప్పావు? మిగిలినవారికి ఎందుకు చెప్పలేదు?’’ అని అడిగాడు. 

‘‘రాజా! మనం సమయా సమయాలు ఎరిగి సహాయాన్ని అర్థించాలి. ఎవరు మన కష్టాలను తీర్చగలరో వారికే చెప్పుకోవాలి. అలాకాని వారికి చెప్పడం వల్ల మన కష్టం తీరదు సరికదా... హేళనకూ, అవమానానికీ గురవుతాం. మనిషి కష్టం రాగానే కలతపడి, కనబడిన ప్రతివారితో చెప్పుకోకూడదు. తీర్చగలవారు దొరికేవరకూ ఆ కష్టాన్ని దిగమింగుకొని భరించాలి. చాలా రోజులపాటు ఎన్నో గ్రామాలు తిరిగి, ఎందరెందరి నుంచో తీసుకున్న డబ్బు గంగపాలైంది. అంత సహాయాన్ని అందించగలవారు మీరొక్కరే. అందుకే మీతోనే మాట్లాడాను’’ అన్నాడు. 

బోధిధరుడి ఆలోచనలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే గురుదక్షిణకు కావలసినన్ని బంగారు నాణేలు ఇచ్చాడు. అతణ్ణి తన కొలువులో ఆస్థాన పండితుడిగానే కాదు, తన ఆంతరంగికుడిగానూ నియమించుకున్నాడు. కధలు గాన

 స్థానము కనుక మారినా సహజమైన

రీతిలో నలుగుట నిత్య రీతి ఈశ్వరా

****

230*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 1 🌹*

*ప్రథమ సంపుటము*

*🌻. ఉపోద్ఘాతము  - 1 🌻*

ఇది అష్టాదశ మాహాపురాణాలలో ఒకటి. అగ్నిరూపుడైన శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించడం చేత దీనికి "అగ్ని మహా పురాణము" అనే పేరు వచ్చినది. 

అగ్నిదేవుడు వసిష్ఠునకు చెప్పిన ఈ పురాణాన్ని వ్యాసుడు ఆయన నుండి (వసిష్ఠుని నుండి) గ్రహించి తన శిష్యుడైన సూతునికి బోధించాడు. అగ్ని పురాణంలో 15000 శ్లోకాలున్నవని భాగవతంలోను, 16000 శ్లోకాలున్నవని మత్స్యపురాణంలోను చెప్పబడి ఉన్నది. 

శ్లోక సంఖ్య12000 అని అగ్నిపురాణం లోనే 272వ అధ్యాయంలోనూ, 15000 అని చివరి అధ్యాయంలోను చెప్పబడి ఉన్నది. వాస్తవంలో ఉన్న శ్లోకాల సంఖ్య మాత్రం 11457 అయితే దీనిలో కొన్ని గద్య భాగాలు ఉన్నాయి. వాటిని 32 అక్షరాల శ్లోకాలుగా భాగించి లెక్క పెటితే దాదాపు 1000 శ్లోకాలు పెరగవచ్చును. 

383 అధ్యాయాల ఈ మహాపురాణంలో పరాపర విద్యలకు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నవనీ, అందుచేత ఒక విధంగా ఇది విజ్ఞాన సర్వస్వం అనీ అక్కడక్కడ చెప్పబడింది.

ఈ పురాణంలో మొత్తం 50 ప్రధాన విషయాలు చెప్పబడినట్లుగా చివరి అధ్యాయంలో ఉన్నది. "సర్గశ్చ ప్రతిసర్గశ్చ" ఇత్యాది పురాణ లక్షణం ప్రకారం ఈ పురాణంలో కూడా సృష్టి, అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశాలు, మన్వంతరాలు, రాజవంశాలు అనే ఐదు విషయాలు ఉన్నాయి అని చెప్పినా ఈ విషయాలు అసంపూర్ణంగానే కనబడతాయి. 

ఈ పురాణం వ్యాసరచితమైనదనే సంప్రదాయం ఉన్నది కాని ఆధునికులు మాత్రం అనేకమైన ఆంతరంగిక ప్రమాణాలను పురస్కరించుకొని దీని రచన క్రీ. శ. 700-900 సంవత్సరాల కాలంలో జరిగినట్లు భావిస్తున్నారు.

వైష్ణవ పాంచరాత్రము, భగవద్గీత మొదలైనవి పొందు పరచటం చేత ఈ పురాణానికి వైష్ణవచ్ఛాయ కల్పించడం జరిగింది. కృష్ణుని నారాయణునిగా, విష్ణువునుగా పూజించ వలెనని దీనిలో ప్రతిపాదింపబడింది. 

అగ్ని విష్ణువుగాను, కాలాగ్నిగాను, రుద్రుడుగాను ప్రారంభాధ్యాయములలో వర్ణింపబడినాడు. "విష్ణువు, అగ్ని అనేవి ఒక దేవత యొక్క రెండు రూపాలు. ఈ పురాణంలో విష్ణువే అగ్నిగా స్తుతింపబడినాడు" అని 174వ అధ్యాయంలో చెప్పబడింది. 

అగ్ని విష్ణువు యొక్క రూపాంతరమే. సర్వ పాపాలను దహించ కలిగిన ఈ అగ్నిని ధ్యానించి, పూజించి, స్మరించి, స్తుతించాలి. అయితే ఈ పురాణంలో శైవాగమానికి సంబంధించిన విషయాలు, శివలింగపూజ, తాంత్రిక పూజా విధానాలు కూడా చెప్పబడి ఉన్నాయి.

సశేషం....
  *సమస్యాపూరణభారతి*
    *******************
    *శ్రీ పేరి అప్పాజీగారు* ఈనాటి రుక్మిణీకల్యాణఘట్టసమీక్షలో అగ్నిద్యో తనుడు శ్రీకృష్ణునకు అందజేసిన సందే శము, రుక్మిణి విప్రుని రాకకై చెందిన
మనోవేదన, ఆతండు తిరిగి వచ్చి తెలిపినశుభవార్త ఇత్యాది అంశాలను వర్ణించే పోతనగారి భాగవతప్రఖ్యాత
పద్యాలకు సమకూర్చిన వ్యాఖ్యానం
హృదయపరవశమే.మందారమకరం
దమాధురీపానమే. 
   శ్రీ పేరివారి సమీక్షావివరణలో ఆఘట్ట
పాత్రలు సజీవంగ కనులముందు సాక్షా
త్కరిస్తాయి.ఎన్నిసార్లు చదివినా ఆ సుమనోజ్ఞఘట్టం ఎప్పటికప్పుడు జుంటి తేనియాస్వాదనమే.
   శ్రీ అప్పాజీగారికి కృతజ్ఞతాపూర్వక
శుభాభినందనలు.
   పద్యసారస్వతపరిషత్,
               చదలవాడ.
   *************************
[06/02, 11:10] +91 88977 16466: ऊँ !
----
"ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యోనమః !!!
--
* పద్యప్రకాశినీభారతిస్థ శ్రీభారతీముఖేభ్యోమహద్భ్యో నమః * !!!!
----

231 * బమ్మెఱ పోతరాజొకఁడు *...
----
భీష్మకమహారాజతనయయైన,రమా భగవత్యంశయైన , మహాగుణమణియైన ,పద్మయతాక్షియైన , సరసీరుహగంధియైన , కన్యకామణియైన రుక్మిణమ్మ ' తననుఁజేకొనుపొమ్ము '  అనిగోపికాసేవ్యునకు వేదశిఖామణియు ,  గురూత్తముఁడైన అగ్నిద్యోతనునిద్వారా సందేశమంపెను.. చాలా త్వరఁబడుచు..! ఎందుచేననగా..' లగ్నంబెల్లివివాహమున్ గదిసె ' అని పెండిలిమూర్తమునిర్ణేతమైనదికూడా..
ఇంతేకాకుండా..తనమాటలనుసరిగనర్థమీచేసికొనెనో..లేదో ..ఆ గోగోప జనమధ్యసంస్థుఁడైనవాసుదేవుఁడు ?

1) ఘనుఁడాభూసురుఁడేగెనోనడుమమార్గశ్రాంతుఁడైచిక్కెనో?
వినికృష్ణుఁడదితప్పుగాదలఁచెనో ..విచ్చేయునో..యీశ్వరుండనుకూలింపఁదలంచెనో దలఁపఁడో..యార్యామహాదేవియున్
నిజమేననురక్షింపనెఱుంగునో..యెఱుఁగదో నాభాగ్యమెట్లున్నదో ???
--
నిజమే..అగ్నిద్యోతనభూసురుఁడాద్వారకకేగెనా ? లేక..మార్గమధ్యమునందునలసటతోచిక్కెనో..
లేక..నందనందనుఁడదివినితప్పుగాతలఁచెనో.?
ఇంతకీ..నాభాగ్యంబెట్లున్నదో..???
ఎందుకంటే..యయ్యార్యామహాదేవి నన్ను రక్షింపఁదలఁచెనా ?
భగవదనుగ్రహమనుకూలముగనున్నదో..లేదో?
ఇట్లనేకవిధాలుగనాందోళనపడసాగెను..
తదస్తు..

2) పోఁడనుబ్రాహ్మణుండుయదుపుంగవువీఁటికి వాసుదేవుఁడున్

రాఁడనునింకఁబోయిసరిరమ్మని చీరెడియిష్టబంధుఁడున్

లేఁడనురుక్మికిన్ దగవులేదిఁటఁజైద్యునకిత్తునంచు..ను

న్నాఁడను గౌరికీశ్వరికి నావలనన్ గృపలేదు నేఁడనున్ ..
--
మనస్సునందెంతఁటి తటపటాయింపునుఁగలిఁగినయవస్థయోగదా..?!
లేకపోతే..అబ్బ్రాహణుఁడఁటకేగెనా ? తనమాటలనుచెప్పెనా ?
ఇష్టబంధుఁడైనదేవకీవసుదేవకుమారుఁడురాఁడేమో ?
తనయన్నగారైన రుక్మి తనమాటకెదురులేనేలేదనుదర్పముతోతననాచైద్యునకికట్టఁబెట్టునేమో ?
అయిననూ..పరమశివుని తనకుభర్తగానిశ్చలభక్తితపోమార్గములచేసాధించుకొని..
అయ్యీశ్వరికి తనపై దయఁగలుఁగలేదేమో ???
అదేధ్యాసతో నున్ననీమెయొకవిధమైననిర్విణ్ణస్థితిలోనుండిపోయె..

3)
చెప్పదుతల్లికిన్ దలఁపుఁజిక్కు..దిశల్ దరహాసచంద్రికన్

గప్పదువక్త్రతామరసగంధసమాగతభృంగసంఘమున్
రొప్పదునిద్రఁగైకొనదురోజనరస్పరసక్తహారముల్

విప్పదుకృష్ణమార్గగతవీక్షణపంక్తులఁద్రిప్పదెప్పుడున్..
--
ఆమె..తన యావేదనను తల్లికిచెప్పదు , చంద్రికోపమదరహాసములనుమోముపైచిందించదు , పద్మనిభముఖముపైవ్రాలుచున్నభ్రమరములను తొలఁగునట్లుచేయదు , 
ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములకునటునిటుముడిపడుచున్నముత్యాలహారాలనుసర్దుకొనదు..
అంతేకాక.. శ్రీకృష్ణ స్వామిమూర్తిదర్శనమునుండిచూపులనిసుమంతైన త్రిప్పదు..

4)
తుడువదుకన్నులన్ వెడలుతోయకణంబులు..కొప్పుఁజక్కగా
ముడువదు..నెచ్చెలిన్ గదిసి ముచ్చటకున్ జనదన్నమేమియున్
గుడువదు నీరమున్ గొనదు కూరిమికీరముఁజేరి పద్యమున్

నొడువదు వల్లకీగుణవినోదముసేయదు డాయదన్యులన్..
--
తననా కృష్ణుఁడుచేకొనఁడేమోయనెడియారాటమునందు ధారాపాతముగాస్రవించుకన్నీఁటిని తుడువదు , వేణీభరమీనుచక్కనొత్తదు , సఖురాండ్రనుచేరదు , అన్నపానీయొదులనుగైకొనదు , పెంపుడుచిలుకలకు మంచి పద్యములనుచెప్పదు , వీణియతంత్రులనుసరిచేయదు..సుశ్రుతిబద్ధమై..!?
5)
సీ.
--
మృగనాభియలఁదదు మృగరాజమధ్యమ
    జలములనాడదు జలజగంధి
ముకురంబుఁజూడదు ముకురసన్నిభముఖి
   పువ్వులఁదరుమదు పువ్వుబోణి
వనకేళిఁగోరదువనజాతలోచన
    హంసంబుఁబెంచదు హంసగమన
లతలఁబోషింపదులతికాలలితదేహ
   తొడవులుఁదొడవదు తొడవు తొడవు
ఆ.
--
తిలకమిడదునుదుఁట తిలకినీతిలకంబు
కమలగృహముఁజొరదుకమలహస్త
గారవించితన్నుఁగరుణఁగైకొనచన
మాలిరాఁడు తగవుమాలియనుచు
--
ఇప్పద్యమునందు సర్వలక్షణశోభితయు ,సర్వాలంకారార్హయునైన రుక్మిణమ్మను..
' మృగరాజమధ్యమ , ముకురసన్నిభముఖి ,కమలహస్త , పువ్వుబోణి ,లతికాలలితదేహ , తిలకినీతిలక , పువ్వుబోణి , తొడవు తొడవు ( తొడవులకే తొడవు )... మొదలైన విధాలుగా..యెంత మనోజ్ఞ ప్రసన్నకలిత - రుచిరార్థపదప్రయోగవర్ణనములనుచేసెనోకదా..పోతరాజుగారు !
ఇంతలో..తన సందేశమునునాలకించుటయేకాక , పలుపలు విధాలుగా తృప్తిమీర..జగదారాధ్యుఁడైనపురుషోత్తమునిచే ఆరాధింపఁబడినవాఁడైన అగ్నిద్యోతనుఁడు ( అగ్నివంటిప్రకాశమునుకలవాఁడు )..మనోవేగముతో భీష్మకనగరానికేతెంచుచు , శిష్యురాలైన నామెతో..
6)
మెచ్చెభవద్గుణోన్నతికమేయధనాదులనిచ్చెనాకుఁ..దా
వచ్చెసుదర్శనాయుధుఁడువాఁడెసురాసురులెల్లనడ్డమై
వచ్చిననైనరాక్షసవివాహమునన్ గొనిపోవునిన్ను..నీ
సచ్చరితంబుభాగ్యమును సర్వమునేఁడుఫలించెఁగన్యకా !
--
వచ్చియురాగానే..' మెచ్చెభవద్గుణోన్నతి '..యనిచెప్పి యానందమునుఁగల్గఁజేసెను..
ఆదికవి విరచితశ్రీమద్రామాయణాంతర్గతసుదరకాండమునందు..
సీతామహాసాధ్వియొక్కజాడనుతెలిసికొనినవాఁడైన సంకటహరణుఁడైన హనుమంతుఁడు తనవారినిఁజేరికొని ' దృష్టా మయా సీతా '..యనిపలికిన ప్రప్రథమవాక్యముద్వారా తమవారందరికి అమందానందకందళితహృదయులుగాచేసెను !
పూర్వకాలమున.. మన పెద్దలు కూడా వెళ్ళినపనిగుఱించి ' కాయా - పండా ' యనడిగేవారు.
ఏతత్సమాధానమునుబట్టి కార్యనిర్ణయముజరిగేది..
అభ్భూసురుఁడప్పుడామెతో..
' నీ గుణోన్నతిని , సౌందర్యమును , తాచ్ఛీల్యమును అనేకధా మెచ్చుకొనిన ఆ ద్వారకానాథుఁడు ( సుదర్శనః & సుదర్శనాయుధః ) వచ్చునిఁటకు !!!
అంతేకాక.. నాకు అపర్యాప్తధనాదులనిచ్చెనుకూడా !!! 
----------------సశేషం-------------
                    స్వస్తి!!!
----------------------------------------


No comments:

Post a Comment