Tuesday 16 May 2023

218--224 stories


218. భగవద్గీతా శ్లోకం:-

కాయేన మనసా బుద్ధ్యా  కేవలైరింద్రియైరపి 

యోగినః కర్మ కుర్వంతి  సంగంత్యక్త్వాఽత్మ శుద్ధయే  (గీ. 05-11)

పెదతిరుమలయ్య వ్రాసిన శ్లోక భావం:

     శరీరం చాతను, మనస్సు చాతను, కేవలమైన యింద్రియముల చాతను ఆత్మ నిష్ఠులు ఫల సంగం విడిచి, చిత్త శుద్ధి కొరకు కర్మమును చేయుదురు.

****


  1) మనస్సులోను, 2) వాక్కులోను, 3) చేసే పనిలోను పవిత్రత ఉండాలి. ఆలా ఉంటే ఆ త్రికరణ శుద్ధి ఉంటే దేవుడు మెచ్చుతాడు. లోకం మెచ్చుతుంది. ఇతరమైన మార్గాల కంటే త్రికరణ శుద్ధి మార్గం కోటి రెట్లు ఎక్కువ, ఊరికే శ్రమ పడతావెందుకు?

1. శరీరం ఆరోగ్యం సహకరించకపోయినా గోదావరి, గంగ, కావేరి, కనకబిందు, యమున-మొదలైన నదులలో మునగాలని- గయ మొదలైన ముఖ్య క్షేత్రాలకు వెళ్ళాలని-వెళ్లకపోతే ఏమవుతుందో అనే బెంగతో ఉండకు. సూర్య, చంద్రగ్రహణాలు వచ్చినప్పుడు ఈ నదులలో స్నానం చేయాలి, ఈ తీర్థయాత్రలు చేయాలి అనే మాటలు వింటూ ఆ అదృష్టం నాకు లేదని బాధ పడకు. ఒక్కసారి కళ్లు మూసుకొని పవిత్రమైన నీ మనస్సులోకి చూడు. సకల క్షేత్రాలు, నదులు నాదగ్గరే ఉన్నాయి అని సంకల్పం చెప్పుకో. ఆ నదీ స్నాన ఫలితం, తీర్థయాత్రల ఫలితం నీకు అనాయాసంగా సిద్ధిస్తాయి. మనస్సు పవిత్రత లేకుండా ఊరికే అన్ని దూరాలు తిరుగుతూ బాధ పడటం దేనికి?

2. వందేళ్లు ఎలాగూ ఈ కల్మష వాతావరణంలో బతకలేం. సగటుగా 60 ఏళ్లు బతికితే, అందులో సగం-అంటే 30 ఏళ్లు నిద్రలో సరిపోతుంది. మిగతా 30 ఏళ్లలో వేదాలు, మంత్రాలు, పురాణాలు, గొప్ప గొప్ప ధర్మ శాస్త్రాలు ఎప్పుడు చదవాలి? ఆ పుణ్యాలన్నీ నా కెప్పుడు రావాలి? ఆ తపస్సు చేసే యోగం నా కెప్పుడు సిద్ధిస్తుంది? అని ఊరికే దిగులు పడకు, హరి అనే రెండక్షరాలు భక్తిగా నోరారా పిలువు. ప్రపంచంలోని అన్ని విద్యలు వాటి సారాంశాలతో నీలో కదలాడుతాయి. వాక్కులో పవిత్రత లేకుండా ఊరికే అది చదవలేదు - ఇది చదవలేదు అని బాధపడకు.

3. గట్టిగా కూచోలేవు..... పడుకోలేవు.. తీర్థయాత్రలు చేయకపోతే పుణ్యం రాదేమోనని బాధతో.. ఈ శరీరాన్ని కష్టపెట్టి మాటిమాటికి దేశాలు తిరిగి రావాలని చూడకు. ఒక్కసారి నీ కళ్లెదురుగ కనబడుతున్న శ్రీవేంకటేశ్వరునికి చేతులెత్తి 'గోవిందా! గోవిందా!' అంటూ నోరారా నమస్కరించు. 16 రకాల దానాలు చేసిన ఫలితం, పంచ మహాయజ్ఞాలు చేసిన ఫలితం నీకు తప్పక సిద్ధిస్తుంది. నా మాట నమ్ము, కర్మలో పవిత్రత లేకుండా అదే పనిగా శరీరాన్ని, మనస్సును కష్టపెట్టకు.

*****

  219.    అన్నమయ్య తీర్థయాత్రలు మొదలైనవి తప్పనటం లేదు. మనం ఒకరకంగా చేస్తుంటే, వాటిని ఇంకోరకంగా చేయమంటున్నాడు. కస్తూరి మృగం తనలోనే కస్తూరి ఉంచుకొని, కస్తూరి ఎక్కడినుంచో వస్తోందని వెతుక్కుంటుందట, చంకలో పిల్లవాడిని పెట్టుకొని ఒకావిడ ఊరంతా వెతికిందట. ఇలాగే చెంతనే వేంకటేశ్వరుడు ఉండగా ఇతర చింతలు నీకెందుకు? నీ చింతన సమగ్రంగా ఆయన మీదే పెట్టు. అన్నిరకాల ఫలితాలు నీకు లభిస్తాయని కవి ప్రబోధం.

     తీర్ధ యాత్రలు మొదలైన వాటికి వెళతాం. అక్కడి అసౌకర్యాలకు, లంచగొండితనాలకు మనస్సు చివుక్కుమంటుంది. నోట్లకట్టలు కరిగిపోతున్న బాధలో - ఎవడి మీద మనస్సు కరగాలో ఆ దేవుడి పట్ల మనస్సు కరగదు, యాత్రలకు వెళ్లి మనస్సును పరిశుద్ధం చేసుకోవలిసింది పోయి, చెత్త ఆలోచనల బరువుని నింపుకొని ఇంటికి వస్తాం. ఇప్పుడు యాత్ర చేసిన ఫలితం ఏముంది? లేనిపోనిది పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది. పవిత్రమైన మనస్సులేని ఇటువంటి తీర్థయాత్రలు నిరసించదగినవే.

     గో, భూ, తిల, హిరణ్య, రత్న, విద్య, కన్య, దాసి, శయ్య, గృహ, అగ్రహార, రథ, గజ, అశ్వ, ఛాగ, మహిషీదానాలు షోడశ మహా దానాలు. అగ్ని హోత్రం, దర్శ పూర్ణ మాసం, చాతుర్మాస్యం, నిరూఢ పశుబంధం, జ్యోతి ష్టోమం అనేవి పంచ మహా యజ్ఞాలు అని ఒకపట్టిక.బ్రహ్మ యజ్ఞం (వేద శాస్త్రాలు చదవటం), దేవ యజ్ఞం (దేవతలని పూజించటం), పితృయజ్ఞం (పితృదేవతలకి శ్రాద్ధ తర్పణాదులు ఇవ్వటం), అతిథి యజ్ఞం (అతిథి సత్కారం చేయటం), భూతయజ్ఞం (పశు పక్ష్యాదులను యథాశక్తి పోషించటం) అని ఇంకో పంచ మహా యజ్ఞాల పట్టిక ఉంది. ఈ యజ్ఞాలు చేసిన ఫలితం - వేంకటేశ్వరునికి చేయెత్తి మొక్కితే లభిస్తుందని అన్నమయ్య అభిప్రాయం.

     మనస్సుకు పవిత్రత ఎలా వస్తుందో మొదటి చరణంలో, వాక్కుకు పవిత్రత ఎలా వస్తుందో రెండవ చరణంలో, చేసే పనికి పవిత్రత ఎలా వస్తుందో - మూడో చరణంలో క్రమంగా వివరించిన అన్నమయ్య కవితా ప్రతిభకు జోహారు అనక తప్పదు. అన్నమయ్య కీర్తనల్లోని పల్లవి మొగ్గ లాంటిది. అది పుష్ప వికాసంగా చరణాలలో మారుతుంది. ఈ దృష్టితో అన్నమయ్య కీర్తనలు చదవాలి.

     కర్మ యోగం - జ్ఞాన యోగానికి ఒక చక్కటి మార్గంగా పెద్దలు చెబుతారు. వేలకొలది మనుష్యులలో భగవంతుని యథార్ధ స్వరూపాన్ని ఒకడు మాత్రమే తెలుసుకొంటాడు. (గీ.7-03). యథార్ధ స్వరూపాన్ని త్రికరణ శుద్ధిగా తాను దర్శించి, మనలని ఉద్దరించటానికి అన్నమయ్య ఈ గీతం.

******


 220. * శ్రీ సూర్య మండల స్తోత్రం

1) నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే |సహస్రశాఖాన్విత సంభవాత్మనే |

సహస్రయోగోద్భవ భావభాగినే |సహస్రసంఖ్యాయుధధారిణే నమః ||


2) యన్మండలం దీప్తికరం విశాలం |రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |

దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


3) యన్మండలం దేవగణైః సుపూజితం |విప్రైస్తుతం భావనముక్తికోవిదమ్ |

తం దేవదేవం ప్రణమామి సూర్యం |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


4) యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |

సమస్త తేజోమయ దివ్యరూపం |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


5) యన్మండలం గూఢమతి ప్రబోధం |ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |

యత్సర్వ పాపక్షయకారణం చ |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


6) యన్మండలం వ్యాధివినాశదక్షం |యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |

ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


7) యన్మండలం వేదవిదో వదంతి |గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |

యద్యోగినో యోగజుషాం చ సంఘాః |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


8) యన్మండలం సర్వజనైశ్చ పూజితం |జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |

యత్కాల కాలాద్యమరాది రూపం |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


9) యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం |యదక్షరం పాపహరం జనానామ్ |

యత్కాలకల్పక్షయకారణం చ |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


10) యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం |ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |

యస్మిన్ జగత్సంహరతే ఖిలం చ |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


11) యన్మండలం సర్వగతస్య విష్ణోః |ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |

సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


12) యన్మండలం వేదవిదోపగీతం |యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |

తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం |పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||


13) సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |

సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||


ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే శ్రీ సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం.. ||

 🌞ఓం నమో సూర్యాయ నమః🚩

____((())))____

221. ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ?

గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి??? ...

ప్రదక్షిణ అని దేనిని అంటారు??

అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు.

ఋగ్వేదం ప్రదక్షిణ గురించి చెబుతూ దక్షిణం వైపు ముందుకు ఆర్తితో నడవడం అని చెబుతుంది.

స్కాందపురాణం ప్రదక్షిణంలో ప్రతీ అక్షరం గురించి చెబుతూ ...

ప్ర - అంటే పాపాన్ని నివృత్తి చేస్తుంది అని,

ద - అంటే కోర్కెలను ఒసగేది అని, 

క్షి - అంటే కర్మను క్షయం చేసేది అని,

ణ - అంటే మోక్షాన్ని అనుగ్రహించేది అని చెబుతుంది...

శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అర్థం ఏమి???

మొదటి అచ్యుత ప్రదక్షిణ చేస్తే మానసిక పాపాలు నాశనం చేస్తుందని,

రెండవ ప్రదక్షిణ చేస్తే వాచిక పాపాలు నివృత్తి అయిపోతుందని,

మూడవ ప్రదక్షిణ కాయిక పాపాలు క్షయం అవుతుందని శాస్త్ర వచనం.

గుడిలోనికి వచ్చిన వారు ఎన్నో మానసిక భారాలను మోసుకు వస్తారు...

పూర్వం ఒక వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు అతడిని ఒక అరగంట ప్రశాంతంగా కూర్చోబెట్టిన తరువాతనే అతడికి బీపీ వంటి ఇతర వైద్యపరీక్షలు నిర్వహించేవారు.

అంటే ఒకరి భౌతిక పరిస్థితి సాధారణ పరిస్థితికి వచ్చిన తరువాత కానీ అతడి స్థితిని పట్టుకోలేరు, బాగుచెయ్యలేరు అని నిరూపింపబడిన శాస్త్రం.

అలాగే గుడికి వచ్చిన వాడి మానసిక స్థితి సాధారణ స్థితికి రావాలంటే ఆ శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలి అని మన వాంగ్మయం చెబుతుంది. 

ప్రదక్షిణ చేసేటప్పుడు కుడి నుంచి ఎడమవైపుగా నడుస్తాము, దేవాలయం చుట్టూ మొదట దక్షిణం వైపు మొదటి అడుగు వేస్తూ నడుస్తాం. 

ఇలా నడవడం వలన ఎప్పుడూ మన కుడివైపు ఎప్పుడూ లోపలున్న విగ్రహం ఉంటుంది.

కుడి వైపు ఎప్పుడూ మంగళకరంగా చెప్పబడుతుంది.

అత్యంత మంగళప్రదమైన భగవంతుడు మనకు ఎప్పుడూ మంగళం వైపు ఉండి మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్ధిస్తూ ప్రదక్షిణ చేయాలి...

ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా నడవమని నియమం ఉంది, శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి...

ప్రదక్షిణలు ఎలా ఉండాలి???

ఒక నిండు గర్భిణి నెత్తిన ఒక నిండు కుండ పట్టుకుని నడిచినట్టుగా  నడవాలి అని శాస్త్రం చెబుతోంది

 ఒక వలయం సెంటర్ నుండి సమాంతర దూరం గా ఉన్నట్టు లోనున్న భగవంతుని సెంటర్ గా చేసుకుని జీవుడు ప్రదక్షిణ చేసినట్టు అని అర్ధం. 

ఆది శంకరాచార్యులు చెప్పినట్టు 1008 విశ్వాలు ఆ పరమాత్ముని చుట్టూ తిరిగినట్టు నువ్వు గుడిచుట్టూ తిరగాలి అని అంటారు..

 21 ప్రదక్షిణలు చేసిన వారు సకల సంపదలు పొందగలరని స్వయంభూ ఆగమ శాస్త్రం చెబుతుంది ...

శివతాండవం చూసేందుకు ఆదిశేషుడు ఎత్తిన అవతారం - పతంజలి

భారతీయులు ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగశాస్త్రం. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ శాస్త్రపు విలువ పెరుగుతూనే ఉంది. ఆరోగ్యానికి అంతకు మించిన సాధన లేదని రుజువు చేస్తూనే ఉంది. అంతటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి గురించి మాత్రం పెద్దగా సమాచారం కనిపించదు. కానీ కొన్ని కథలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ఇదిగో... శివుడు ఒకసారి దేవతలు, రుషులందరి సమక్షంలోనూ తాండవం చేశాడట. చూపరులందరినీ కట్టిపడేసిన ఆ తాండవం గురించి లోకమంతా గొప్పగా చెప్పుకోసాగింది. ఆ నృత్యాన్ని స్వయంగా వీక్షించిన విష్ణుమూర్తి సైతం శివతాండవం గురించి పదే పదే తల్చుకోసాగాడు. విష్ణుమూర్తిని మోస్తున్న ఆదిశేషునికి సైతం ఆ పొగడ్తలు చేరాయి. ఇంతమందిని అలరించిన తాండవాన్ని తాను చూడలేకపోయానే అని ఆదిశేషునిలో బాధ మొదలైంది. ఆ బాధ క్రమేపీ పెరిగి ఆయన మనసుని దహించివేసింది. ఎలాగైనా తాను కూడా శివతాండవాన్ని చూడాలని అనుకున్నాడు. కానీ అది మాటలు కాదు కదా! ఎప్పుడో కానీ సంభవించని సందర్భం అది.

ఆదిశేషుని మనసులోని దుగ్ధను గ్రహించిన విష్ణుమూర్తి- భూమిమీద జన్మించి, శివుని ధ్యానించి తన కోరికను తీర్చుకోమని సూచించాడు. అదే సమయంలో గోనిక అనే భక్తురాలు సంతానం కోసం భగవంతుని ప్రార్థిస్తోంది. ఒకరోజు ఆమె సూర్యునికి అర్ఘ్యం అందిస్తుండగా ఆ నీటిలో ఒక పాముపిల్ల రూపంలో అవతరించాడు ఆదిశేషుడు. అంజలి ఘటిస్తుండగా పతం (ఆకాశం) నుంచి వచ్చిపడ్డాడు కాబట్టి అతనికి ‘పతంజలి’ అన్న పేరు స్థిరపడిందంటారు.

పతంజలి పెరిగిపెద్దవాడయి సకలశాస్త్రాలనూ ఔపోసన పట్టేశాడు. చిదంబరంలో శివుని గురించి తపస్సు చేసుకుంటూనే వేదాధ్యయనాన్ని సాగించాడు. అదే సమయంలో చిదంబరంలో వ్యాఘ్రపాదుడు అనే మరో రుషి కూడా ఉండేవాడు. శివుని అర్చించేందుకు ఎంతటి శ్రమకైనా ఓర్చి పూలు సాధించేందుకు తనకు పులి పాదాలు కావాలని ఆ ముని కోరుకున్నాడట. అందుకనే ఆయనకు ఆ పేరు వచ్చింది. చిదంబరంలో ఉన్న ఆ ఇద్దరు రుషుల దీక్షకు మెచ్చి పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమైనాడు. వారి కోసం ఆనందతాండవాన్ని నర్తించాడు. అక్కడే నటరాజ స్వామిగా వెలిశాడు.

చిదంబరంలో వ్యాఘ్రపాదుడు, పతంజలి స్వామివారిని పూజించారనేందుకు నమ్మికగా అక్కడి చిత్రాలలో స్వామివారిని పూజిస్తున్న ఇద్దరు రుషులూ కనిపిస్తారు. అసలు చిదంబరంలోని ఆలయాన్ని పతంజలి స్వయంగా నిర్మించారని కూడా కొందరంటారు. నిజానికి పతంజలి పేరుతో చాలా ప్రముఖ గ్రంథాలే కనిపిస్తాయి. ఇవన్నీ రాసినవారు వేర్వేరు వ్యక్తులనీ.... భారతీయ సాహిత్యంలో కనీసం ఒక ఐదుగురు పతంజలిలు ఉన్నారని కొందరంటారు. కానీ పతజంలి అన్నవాడు ఒక్కడే అని మరికొందరి నమ్మకం! పతంజలి జీవన కాలం గురించి కూడా ఇలాంటి సందిగ్ధతే ఉంది. క్రీ.పూ ఊదో శతాబ్ది వాడని కొందరంటే అంతకు కొన్ని వేల సంవత్సరాల మునుపువాడని మరికొందరి వాదన.

ఏది ఏమైనా అప్పటివరకూ జ్ఞానులకు మాత్రమే తెలిసిన యోగసూత్రాలను క్రోడీకరించి ప్రపంచానికి అందించడంలో పతంజలి అనే వ్యక్తి చేసిన కృషి అసాధారణం అని మాత్రం ఒప్పుకోక తప్పదు. ఇక పతంజలిని సగం పాము రూపంలో కొలవడంలోనూ ఒక ఆంతర్యం కనిపించకపోదు. మనలోని కుండలినిని సర్పంగా భావిస్తుంటారు. నిద్రాణంగా ఉన్న ఆ కుండలినిని జాగృతం చేయగలిగిన రోజున మోక్షం సాధ్యమన్నది యోగుల మాట. ఆ కుండలినీ శక్తిని సూచించేందుకు యోగశాస్త్రకారుడైన పతంజలికి సర్పరూపాన్ని అందించి ఉండవచ్చు.

*🎣సేకరణ:

*****

222. హరిఓం  ,                               -                                           - 

*1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంట  చాలదు ...

కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.

2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:

శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.

3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:

పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:

కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.

5. ఎవరి పనులు వారే చేసుకోవడం:

అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.

6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:

కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.

7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:

ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.

8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:

అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:

కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.

10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :

నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.

11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:

పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.

12. ఆడది తలుచుకుంటే ఏమైనా చేస్తోంది

కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది.

13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:

చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు ,కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.

14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:

పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్లాన్(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.............  

223. వ్యక్తిత్వ వికాస సూత్రాలు🙊🙉🙈

===================

🌺నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.

🌺చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది. 

🌺మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. 

🌺జీవితంతో పోరాడితేనే మా bhiనవత్వం ఉన్న మనిషిలా మారుతాము...

🌺మంచులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా, మనసులో నిలిచిపోయే మంచితనమే గొప్పది.

🌺 కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.......

🌺 మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.

🌺 నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న....

🌺 మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు.

🌺 నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.

🌺 సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.

🌺 పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.

🌺 ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.

🌺 మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .

🌺 ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

🌺 ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.

🌺 మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిభింభిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు. 

🌺తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవిత పరమార్ధం

             *జీవితమొక అందమైన అనుభవం.

****
224  * జాలి - దయ 

జాలి పడుట దయ చూపుట కాదు. జాలి వేరు, దయ వేరు. జాలి పడువారు జాలిని కోరుదురు కూడ. తమపై ఎవరికిని జాలిలేదని కూడ వారికనిపించుచుండును. తానితరులపై జూపిన జాలి తనపై నెవ్వరును చూపుట లేదని కూడ జాలి పడుదురు. దుఃఖింతురు కూడ. ఆ దుఃఖము నుండి ఇతరులపై ఆరోపణలు చేయుట ప్రారంభింతురు. తమను గూర్చి ఎవరును పట్టించు కొనుట లేదని రోషము చెందుదురు. తమలో గల జాలి తమపై ఆవరించి చైతన్యమునకు అవరోహణము కలిగించు కొనుచుందురు. వారి దుఃఖము, ద్వేషము, రోషము కారణముగ రోగగ్రస్తులు కూడ నగుదురు. దయ, జాలివంటిది కాదు.

దయ కలవాడు, ఇతరుల కష్టములను చూచి కేవలము జాలిపడక వారికేమి కావలయునో బుద్ధి నుండి గ్రహించి నిర్వర్తించును. వారి కష్టనష్టములను తన లోనికి గొనక వారికి సహాయ సహకారము లందించును. దయ గలవాడు, జాలి గలవాడి వలె దుఃఖించడు. కర్తవ్యనిర్వహణమే గావించును. జాలి హృదయ దౌర్బల్యము కలిగించును. దయ, హృదయ వికాసమును గావించును. జాలి విషయమున “జాలి పడుట" అందురు. దయ విషయమున “దయ చూపుట” అందురు. ఒకటి పడుట కాగ రెండవది చూపుట యుండును. పడుటకన్న చూపించుట మేలు కదా! హృదయము నందలి పురుషప్రజ్ఞ - దయ. స్త్రీ ప్రజ్ఞ - జాలి.

---

No comments:

Post a Comment