Tuesday 16 May 2023

206- 212 stories

 


206. నేటి సూక్తి : జీవితం మార్మికమైనది. వివరించ లేనిదేదో ఉంది అనే భావనను అంగీకరించడమే సమర్పణకు తొలి మెట్టు.  

!! శ్రీగణేశాయ నమః !!

 1)లక్ష్మీర్యస్య పరిగ్రహః కమలభూః సూనుర్గరుత్మాన్ రథః పౌత్రశ్చన్ద్రవిభూషణః సురగురుః శేషశ్చ శయ్యాసనః ।

 బ్రహ్మాణ్డం వరమన్దిరం సురగణా యస్య ప్రభోః సేవకాః స త్రైలోక్యకుటుమ్బపాలనపరః కుర్యాత్ సదా మఙ్గలమ్ ॥

 2)బ్రహ్మా వాయుగిరీశశేషగరుడా దేవేన్ద్రకామౌ గురుశ్- చన్ద్రార్కౌ వరుణానలౌ మనుయమౌ విత్తేశవిఘ్నేశ్వరౌ ।

 నాసత్యౌ నిరృతిర్మరుద్గణయుతాః పర్జన్యమిత్రాదయః సస్త్రీకాః సురపుఙ్గవాః ప్రతిదినం కుర్వన్తు వో మఙ్గలమ్ ॥

 3)విశ్వామిత్రపరాశరౌర్వభృగవోఽగస్త్యః పులస్త్యః క్రతుః శ్రీమానత్రిమరీచికౌత్సపులహాః శక్తిర్వసిష్ఠోఽఙ్గిరాః ।

 మాణ్డవయో జమదగ్నిగౌతమభరద్వాజాదయస్తాపసాః శ్రీమద్విశ్ణుపదాబ్జభక్తినిరతాః కుర్వన్తు వో మఙ్గలమ్ ॥ 

 4)మాన్ధాతా నహుషోఽమ్బరీషసగరౌ రాజా పృథుర్…

207: 🧘‍♀️నవరాత్రులు🧘‍♂️

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అవ్యక్తము నుంచి వ్యక్తమయిన స్థితినే అమ్మవారు లేక మూలప్రకృతి అంటారు.

నవ రాత్రులనగా:--

1) మొదటి రోజు పృధ్వీ🌎తత్త్వము:- అనగా అన్నమయ శరీరమునకు సంబంధించినది.

 2) రెండవ రోజు జల 💦తత్త్వము:- ప్రాణమయ శరీరమునకు సంబంధించినది. రెండవ రోజు పూజ కోరికలు ధర్మయుక్తము అవడానికి.

3) మూడవ రోజు అగ్ని  🔥తత్త్వము:-  మనోమయ కోశమునకు సంబంధించినది. మనలో భావాలు అగ్నితో పునీతమవుతాయి. అక్కరలేని భావాలు ఉండవు.

4) నాల్గవ రోజు వాయు 🌬తత్త్వము:-  దైవీ పరమైన భావాలు కలుగుతాయి. పంచభూతముల యందు స్వామిత్వము వస్తుంది. అంతర్లోకాలకి తీసుకొని వెడుతుంది.

5) అయిదవ రోజు ఆకాశ🎇తత్త్వము. మన హృదయము లోపల ఆకాశము దర్శనమిస్తుంది. అమ్మవారిని 'దహరాకాశరూపిణి' అంటాము గదా!

6) ఆరవ రోజు  మనసు మీద గూడా స్వామిత…

*****

 208. జీవాత్మ ప్రపంచ నియమాలు - 18 🌹
అధ్యాయము : ఆత్మలోకం

Q:-- ఆత్మలోకం లో ఆత్మలు ఏ పనులు చేస్తాయి?

A:--  ఆత్మలోకంలో వుండే ఆత్మలకు కోరికలు, ఆకలి దాహం, అలసట ఉండదు, వారి లక్ష్యం సేవ, ఆత్మకు సూర్యకాంతి అవసరం, అక్కడ పళ్ళు రకరకాల వాసనలతో లభిస్తాయి.

ఆత్మకు ఆహారం అవసరం ఉండదు, కానీ ఆ పళ్లలోని అమృతరసం సానుకూల శక్తి ఇస్తుంది, ఇక్కడి ఆత్మలు నిరంతరం ఆరోగ్యంగా వుంటారు.

వీరికి పునఃశక్తి కావలిసినప్పుడు సరస్సులో మునుగుతారు, ఆ నీటికి స్వస్థత చేకూర్చే గుణం ఉంటుంది, నీళ్ళల్లో నుండి బయటకు రాగానే పొడిగా, శక్తివంతంగా వుంటారు.

🌻. ఆత్మలోకంలో ఆత్మలు చేసే కొన్ని పనులు :  🌻

1) మనం దైవ నియమాలు అర్థం చేసుకునేలా telepathy కమ్యూనికేషన్ చేస్తారు.

2) మార్గదర్శకుల రూపంలో భూలోక ఆత్మలకు సహాయపడతారు.

3) భూలోక ఆత్మలకు ఉపచేతనాత్మక మనస్సు ద్వారా సందేశాలు పంపుతారు.

4) కొంతమంది విశ్రాంతి మందిరంలో పనిచేస్తారు.

5) ఆకాశిక్ రికార్డ్స్ తాలూకు విషయాలు నమోదు చేయడం.

6) ఆత్మహత్య చేసుకోవాలనుకునే మానవుల కోసం ప్రార్ధించడం, వారికి సందేశాలు పంపడం.
7) ప్రేమ, శ్రద్ధ, ఏకాగ్రత తో వ్యతిరేక ఆత్మలకు అర్ధమయ్యేలా శిక్షణ ఇవ్వడం.
8) జ్ఞాన మందిరంలో శిక్షణ పొందడం.
9) కింది ఆవరణలు కు సహాయపడడం.
10) మళ్ళీ జన్మించాలకునే వాళ్లకు మార్గదర్శకంగా ఉండడం.
11) భూలోకంలో వారికి మహిమలు చూపించడం.
12) భూలోక ఆత్మలను సన్మార్గంలో పెట్టడానికి భూలోకానికి రావడం.
13) భూలోకంలో మరణించే ముందే వారిని సముదాయించడానికి ఇక్కడికి వస్తారు.
14) మరణించే వారికి సానుకూలంగా ఆత్మలోకానికి రావడానికి వీలైనంత సౌకర్యం కుదురుస్తారు.
15) స్వస్థత చేకూర్చే నూతన విధానాలు, కొన్ని నేర్చుకుంటారు, కొన్ని కనుగొంటారు.
16) నృత్యం, సంగీతం, పాటలు, క్రీడలు, వివిధ అంశాలలో పాల్గొంటారు.
17) ఉద్యానవనాలు పెంచుతారు.
18) భూలోక చరిత్ర ను ఇతర గ్రహ చరిత్రను చర్చిస్తారు.

ఇవన్నీ సృష్టికర్త సేవ చేయడానికి వారికిచ్చిన అవకాశం గా భావిస్తారు.

🌹 🌹 🌹 🌹 🌹

****** 

 209. ఎంగిలి దోషం.

మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు. 

ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే. 

ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం.. 

పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు. 

పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు. 

ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది. 

ర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?! 

వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం. 

కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు. 

ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు. 

ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో  నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు. 

ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.

1. చిలక కొరికిన పండు,

2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.

3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.

వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం.  

*****

210. నేటి కధ ...

ఇది వాస్తవం.. భార్య విహీనులైన చాలా మంది భర్త లు చరమాన్కంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు..వారికి రోజులు గడవడం కష్టం..........

ఆమె లేని అతడు.. వట్టి మోడు!                                                                                                                                                                                                            భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు. అలుగుతారు. తిడతారు. కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా! అన్నింటినీ భరించే భార్యను ‘టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’గా తీసుకుంటారు!! ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం.. తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు! ‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం!! అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు.. ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపో..తా..రు!!                                                                                                                                                                                      ‘‘నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు. ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని. ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా?’ అనుకోకు. వుంటారు. నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం. ఉరిమితే భయం. మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది!            

                                        నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.                                                                                                                                                  ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.                                                                                                                                                                                                                               దాంపత్యం అంటే.:- రెండు మనసుల కలయిక. మరణం ఆ బంధాన్ని వేరు చేస్తే.. ఓ భాగస్వామి దూరమైతే.. మిగిలి ఉన్నవారి మనసు కకావికలమవుతుంది. స్ర్తీ, పురుషులెవరికైనా ఆ బాధ ఒకటే. కానీ శేషజీవితాన్ని గడపడంలో మాత్రం తేడాలు కనపడతాయి. భర్త దూరమైనా భార్య తట్టుకుని జీవించగలదు. కానీ.. పురుషులు కుటుంబసభ్యులతో కలిసిపోలేరు. మానసికంగా ఒంటరులైపోతారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.                                                                                                                                                                                   కావాల్సింది సహకారం.. వ్యాపకం:- కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే భార్య గతించి ఏళ్లు గడిచినా ఉత్సాహంగా ఉన్నవారు ఉన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే.. ‘నా వయసు 90 ఏళ్లు. నా భార్య ఎన్నో ఏళ్ల క్రితమే మరణించింది. కొడుకు, కూతురు రమ్మన్నారు. కానీ, వెళ్లాలని అనిపించలేదు. అందుకే మా వూరిలో ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నా. ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతున్నాను. ఇప్పుడు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండటంతో అమ్మాయి ఇంటికి వచ్చేశా. ఆ భగవంతుడి పిలుపుకోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ పెద్దాయన చెప్పుకొచ్చారు. ‘నా వయసు 92 ఏళ్లు. భార్య పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి నా కోడలు నన్ను కన్న తండ్రిలా సాకుతోంది. సాయంత్రంపూట గుడికి వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తాను. ఖాళీగా ఉండకుండా పుస్తకాలు చదవుతుంటాను, రాస్తుంటాను’ అని చెప్పుకొచ్చారు రఘురామ్‌ అనే మరో వృద్ధుడు.                             

అధ్యయనంలోనూ అదే తేలింది:- దాదాపు ఆరేళ్లక్రితం.. అంటే 2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. అదేంటంటే.. భర్తను కోల్పోయిన మహిళలతో పోలిస్తే, భార్యను కోల్పోయిన పురుషులు త్వరగా చనిపోయే అవకాశం 30 శాతం ఎక్కువని! భర్త చనిపోతే బాధ ఉంటుందిగానీ.. దాన్ని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం మహిళలకు ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి చేసి మహిళలు సిద్ధమై ఉంటారట. తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు.                                                                                                

  ఇలా చేస్తే కొంత బెటర్‌:-1.చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. వారి ఆటపాటలు.. చిలిపి చేష్టలు వయసు మళ్లిన వారికి ఆనందాన్ని కలిగించటమే కాదు.. తమ చిన్న తనం నాటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చి మరింత హుషారుగా మార్చేస్తాయి. 2. వయసు పెరుగుతున్న కొద్దీ తమకంటూ ఒక ప్రపంచం ఉండాలి. ఎందుకంటే ఓ వయసు వచ్చిన తరువాత బయట సంబంధాలు తగ్గిపోతాయి. కుటుంబంలో కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆఖరికి మనవళ్లు మనవరాళ్లు కూడా వారి ప్రపంచంలో వారుంటున్నారు. అందుకే తమ దైన ప్రపంచం సృష్టించుకోవాలి. అది తమ అభిరుచులకు తగినట్లుగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన హాబీ ఉండి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఆ హాబీని మూలన పడేసి ఉండొచ్చు. దాన్ని పైకి తీస్తే కాలక్షేపం అవుతుంది. 3. లాఫింగ్‌ క్లబ్‌ లాంటి వాటిలో చేరటం లేదా సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఫలితం ఉంటుంది. 4. స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. కొత్త స్నేహాలకు చేయిచాచాలి. ఇలాంటి వాటివల్ల కాస్తంత ఉపశమనం కలిగి బాధ నుంచి తేరుకునే శక్తి వస్తుంది.                                                                                                                                                                          ఆధారపడడమే కారణం:- సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని.. తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భార్య దగ్గర ఉన్న స్వతంత్రం కొడుకు, కోడళ్ల వద్ద ఉండదు. దానికి తోడు వయోభారం. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అన్నీ కలిసి కుంగుబాటుకు దారితీస్తాయి. నాణేనికి మరోవైపు చూస్తే.. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తగ్గించుకోవడం కారణంగా ఆరోగ్యంగా పూర్తి జీవితాన్ని గడపగలుగుతారని విశాఖ జీజీహెచ్‌ మానసిక వైద్యులు మురళీ కృష్ణ విశ్లేషించారు.                                                               

 మహిళలే స్వతంత్రులు:- స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.- ప్రొఫెసర్‌ రాజు, ఏయూ, సైకాలజీ                                                                                                                                                                                                                                భావోద్వేగ బలం ఆమెదే:- పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది

--(())--

 211 - శ్రీరామకృష్ణుని కధామృతం లోని కొన్ని అమృత బిందువులు

మహాసమాధి అనంతరం.

రామకృష్ణులు, తమ మధ్యనుండి కనుమరుగు అవడంతో, యువశిష్యులు, భక్తులు కలతచెందిన మనస్సులతో దుఃఖసాగరంలో మునిగిపోయి, ప్రయాణిస్తున్నపడవ మార్గమధ్యంలో మునిగిపోతుంటే, అందులో చిక్కుకున్నవారిలా దిక్కుతోచనివారు అయ్యారు.

ఆతరువాత సురేంద్రుని ప్రోత్సాహంతో, ఆర్ధిక సహాయంతో,  ఒక చిన్నఇల్లు వరాహనగర్ లో అద్దెకు తీసుకుని సన్యాసులకు మఠంగా రూపొందించి నడుపుకోసాగారు.  రామకృష్ణుల జీవనసరళిని ఆలంబనంగా చేసుకుని జీవితం సాగించసాగారు. రామకృష్ణులు ఉద్యానగృహంలో ఉపయోగించిన పరుపు, ఇతర వస్తువులు ఆ మఠంలోకి చేర్చారు.  శారదామాతను రాఖాల్ తదితరులు బృందావనం లో వుంచి కంటికిరెప్పలా కాపాడుకోసాగారు.

కొంతకాలం గడిచాక, నరేంద్రుడు, రాఖాల్ , నిరంజన్, శరత్, శశి, బాబూరామ్, యోగీన్, తారక్, కాశీ , లాటూ మొదలైన యువకులు, సన్యాసము స్వీకరించారు.

శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం సన్యాసం స్వీకరించిన ప్రత్యక్ష శిష్యులు, వారి సన్యాసాశ్రమ నామాలు :

నరేంద్రుడు : స్వామీ వివేకానంద ;    రాఖాల్ : స్వామీ బ్రహ్మానంద ;   యోగీన్ : స్వామీ యోగానంద ;   నిరంజన్ : స్వామీ నిరంజనానంద ;    లాటూ : స్వామీ అద్భుతానంద ;   బాబూరామ్ : స్వామీ ప్రేమానంద ;       తారక్ : స్వామీ శివానంద ; హరి ; స్వామీ తురీయానంద ;   శరత్ : స్వామీ శారదానంద ;   శశి : స్వామీ రామకృష్ణానంద ;    కాళీ : స్వామీ అభేదానంద ; గంగాధర్ : స్వామీ అఖండానంద ;    పెద్ద గోపాల్: స్వామీ అద్వైతానంద ;     శారదాప్రసన్న : స్వామీ త్రిగుణాతీతానంద ; సుబోధ్ : స్వామీ సుభోదానంద ;   హరి : స్వామీ విజ్ఞానానంద .

సురేంద్రా ! నీవు ధన్యుడవు. మొట్టమొదట ఈ మఠం నీచే స్థాపింపబడినది.  నీచోరవతోనే, రామకృష్ణుల మూలమంత్రమైన కాంతా కనకాల పరిత్యాగ చిహ్నం సమకూరింది.  నిర్మల హృదయుడు,  పరిశుద్ధాత్ముడైన నరేంద్రుడు మొదలైన అనేక యువసన్యాసుల ద్వారా అమరమైన, అజేయమైన హై౦దవ ధర్మాన్ని హిందువులు పాటిస్తారు.

రామకృష్ణులపై సురేంద్రుడు చూపించిన ప్రేమ, ఉదారతే, ఈ ఉన్నతభావాలు వున్న యువకులు సన్యాసం స్వీకరించ డానికి దోహదపడింది.   రామకృష్ణులు ఉపయోగించిన మరికొన్ని వస్తువులను బలరాం ఇంటినుండి కూడా మఠానికి తీసుకువచ్చారు.  అనుదినం వారంతా రామకృష్ణులను ఆరాధించసాగారు.   మఠ నిర్వహణ బాధ్యతను నరేంద్రుడే స్వీకరించి, మఠాధిపతిగా వ్యవహరించసాగాడు.   భగవద్ దర్శనానికి నిష్కామకర్మలే సాధనాలని, వివేకానందుడు తన సోదరశిష్యులను  పదేపదే హెచ్చరించేవాడు. వారంతా వివేకానందుని నడవడిని ఆసరాగా, ఆదర్శంగా తీసుకున్నారు.

వారిది కఠోర ఆధ్యాత్మికజీవితం.  బాహ్యలోకం నుండి కనుమరుగైన రామకృష్ణులు తమ హృదయపీఠాలలో కొలువుండాలనే ఆరాటంలో వారువున్నారు.   వేదం పురాణం, తంత్ర శాస్త్రాలలో పేర్కొన్న అనేక సన్యాసజీవిత నియమాలను వారు తు. చ. తప్పక మనస్పూర్తిగా ఆచరిస్తూ,  ధ్యానం కొనసాగించడానికి ఆ యువకులు పస్తులు కూడా వుండి మరణానికైనా సిద్ధపడ్డారు.

నరేంద్రుడు అందమైన కాషాయాంబరాలలో ముఖంలో, శరీరం లో కనబడుతున్న దివ్య తేజస్సుతో, ముఖాన కరుణ తొణికిసలాడుతుండగా, ప్రజలకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు బోధించడానికి ఉద్భవించిన మహనీయుడిగా తరువాత తరువాత గోచరించసాగాడు.  అప్పుడు నరేంద్రుని ( వివేకానందుని ) వయస్సు 24 ఏళ్ళు.

 మనందరిపై రామకృష్ణుల కరుణాకటాక్ష వీక్షణలు ప్రసరించాలని ఆయన జీవితం మనకు ఆదర్శం కావాలనీ కోరుకుంటూ...

(సమాప్తం)

****

:212 యోగ సూత్రం :

||జాత్యంతర పరిణామః ప్రకృత్యాపూరాత్||

-- పతంజలి యోగ సూత్రాలు, కైవల్య పాదం

తాత్పర్యం : మరొక జాతిగా పరిణమించుట, ప్రకృతి పరిణామ సమాప్తి వలన కలుగుచున్నది.

వ్యాఖ్యానం: ఇలాంటి సిద్ధులు జన్మ వలన, కొన్ని సమయాలలో రసాయన సాధన వలన, తపస్సు వలన సంప్రాప్తిస్తాయని పతంజలి మహర్షి ప్రతిపాదిస్తాడు. ఈ శరీరాన్ని ఎంతకాలమైనా నిలిపి ఉంచడం మనకు సాధ్యమే అంటాడు. శరీరం మరొక జాతిగా పరిణమించడానికి కారణం ప్రకృతి పరిణామ సమాప్తి అని అంటూ....ఆ విషయాన్ని మిగతా సూత్రాలలో వివరిస్తాడు పతంజలి.

అసలు జాత్యంతర పరిణామమంటే, జీవుడు క్రింది స్థాయి నుండి పై స్థాయిలకు వికసించడమని అర్థం. 

పరిణామం రెండు రకాలు. 1. అవ పరిణామము 2. అధి పరిణామము. ఇక్కడ జాత్యంతర పరిణామాలంటే, వికసన స్థాయిలని అర్థం. ఈ నిచ్చెనలో, తమః స్థితి నుండి మొదలు పెట్టి, పైపైకి ఎక్కుతూ...చివరికి సత్వ స్థితికి చేరడమే, జాత్యంతర పరిణామమని కూడా చెప్పవచ్చు.

జాతిలో మార్పు కలుగుట , ప్రకృతి వలననే జరుగును. ప్రకృతియే మార్పు చెంది ఇన్ని రూపములను నింపుచుండును. ఆకాశము నుండి వాయువు పుట్టుట...ఇది కూడా పరిణామమే కదా! ఖనిజములు --- వృక్షములు --- పశు పక్ష్యాదులు --- మనుజులు... ఈ క్రమం పరిణామ విశేషమే కదా! ప్రకృతియే మరొక తరగతిలో ఆ రూపాన్ని పూరించుట వలన ఈ మార్పు జరుగును. "ప్రకృతి ఆపూరాత్" అనగా, ప్రకృతి పరిపూర్తి యగు వరకు కలుగునది.

జాత్యంతర పరిణామం! మరో జాతి లోనికి మనం పరిణమించడం అనేది ఎప్పుడు జరుగుతుంది? "ప్రకృత్యాపూరాత్"...ప్రకృతి యొక్క పరిపూరత జరిగినందువలన మాత్రమే. పరిణామము అనగా మార్పు. ఈ మార్పు, ప్రకృతి వ్యూహం. ఇది ఒక సారి పూర్తయితే..."ఆపూరము" అంటారు. ఇలాంటి ఏడు ఆవృత్తులు జరిగేటప్పటికి...ఆ అవస్తను "మూల ప్రకృతి" అంటారు. 

సంకలనం : భట్టాచార్య
--(())--

No comments:

Post a Comment