Tuesday 16 May 2023

178 -- 184 stories

 


దేహం

*అద్దె కొంప కదరా!  ఆశలు ఎందుకురా! తొమ్మిది గడపల ఇల్లు! తొంగి చూడు నీచం రా!!
ఆహారం అద్దె కట్టి! నిరంతరం నీరు పెట్టి! పట్టు బట్టలు కట్టి! పట్టమూ కడితె!
ఏక్షణం కూలునో! ఎక్కడది రాలునో!!*

దేహం ఖచ్చితంగా బాడుగ ఇల్లే. నా స్వంతం అని అహంకరిస్తే అసలు యజమాని  ఖాళీచేయమంటాడు. బాడుగ ఇస్తున్నాను అని వున్న ఇంటిని అలక్ష్యం చేసినప్పుడు కూడా అసలుయజమాని బైటికి తోలేస్తాడు. వున్నన్ని నాళ్ళు నాది అనికాని నాదికాదు అనికాని భావించక నేను నిమిత్త మాత్రం చేయించేది నీవు ఓ పరమాత్మ నీ ఇష్టం ప్రకారం జరిగేది జరగని. జీవునిగా నా ప్రయత్న లోపం జరుపుతాను.

ధనం, జ్ఞానం పంచుతుంటే పెరుగుతుంది. దాచితే నిరుపయోగం అవుతుంది.

****

178. లక్ష సంపూర్ణం ... కధ 

ఇప్పటికీ అర్ధం కాదు...
పనిచేయటానికి బ్రతుకుతున్నానా..?
లేక బ్రతకటానికి పని చేస్తున్నానా అని.... !?

బాల్యంలో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...
పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని?
ఆ సమాధానం ఇప్పుడు దొరికింది!
మళ్ళీ బాల్యం కావాలని!
మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని
మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది
వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని

ఔను...
లోకం లాజిక్కుని  చూపింది వాళ్ళే మరి!
 జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే!
డబ్బు సంపాదించేటపుడు తెలిసింది.....
నా విలాసాలన్నీ అమ్మా నాన్నల డబ్బుతోనే సమకూడేవని
నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని

 నవ్వాలని అనిపించినా ...
నవ్వలేని  పరిస్థితి...
ఎలా ఉన్నావని ఎవరైనా అడిగినప్పుడు ---
ఓహ్ !
నాకేం  బ్రహ్మాండంగా వున్నా!!
అని అనక తప్పనప్పుడు.
ఏడవాలన్నా  ఏడవలేని పరిస్థితి!
వాడికేందిరా....
దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు
ఇది జీవిత నాటకం...
ఇక్కడ అందరూ నటులే...
నటించక తప్పదు....
అవార్డుల కోసం కాదు...
బ్రతకటం కోసం !!
కాదు.. కాదు....
బాగా బ్రతుకుతున్నానని నమ్మించటం కోసం.

రాతి మనిషి నిప్పురాజేయటానికి చాలా కష్టపడ్డాడట....
ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు ...
ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...

సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట....
బాహ్య లోకంలో జీవం ఉందా లేదా అని....

మరి మానవ జీవితంలో సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!

ఓజోన్ పొర డ్యామేజ్ అయి భూతాపం పెరిగుతుందని ఆందోళన ...
ఒకరిపై ఒకరికి వుండే ఈర్ష్యా, ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే...

పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు కర్కశత్వం కూడా !

మట్టిలో మొక్కలు నాటాలి...
మనసులో మానవత్వం నాటాలి
ఇదంతా గట్టిగ అరవాలి.... అందరికి చెప్పాలి....

మళ్ళీ ఒక్క క్షణం...
నాకెందుకులే అని !
సమస్య నా ఒక్కడిదే కాదుగా అని!

నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి
పక్కవాళ్ళ కష్టం గురించి పట్టించుకునేంత తీరికెక్కడిది నాకు!
నా పని...
నా ఇల్లు...
నా పిల్లలు...
నా...నా.. నా...
నాతోనే నలిగిపోతున్నా...!
ప్రక్కవాణ్ణి నిందిస్తూ రోజు గడిపేస్తున్నా!

జీవితమన్నది
తనంత తానుగా...
నడచి పోతుంది…
గడచి పోతుంది....
మనకళ్ళముందే.....
మనకు తెలియకుండానే ముగిసిపోతుంది.

చేయడానికి చాలా టైం వుందని
చావు దగ్గరకోచ్చేదాకా చోద్యం చూస్తున్నా!
చివరికి ఉసూరంటూ కాటిదాక నలుగురి కాళ్ళతో నడిచిపోతున్నా కనుమరుగౌతున్నా...

ఎవరినో అడిగాను ...
అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని ?
ఎవరో మహానుభావుడు ఎంతో  అందంగా సేలవిచ్చాడు !!!
నిద్ర, సగం మృత్యువట!
మరి మృత్యువు,ఆఖరి నిద్రట!!
అసలు ప్రశాంతంగా నిద్రించి ఎన్నేళ్ళయ్యిందో!
ఏదో ఒకనిద్ర ఆవహిస్తే అదే వరం!

ఆనందం లేని అందం...
జవాబు లేని జీవితం....
ప్లాస్టిక్ పరిమళం..
సెల్ ఫోను సోయగం...
వెరసి ఇదీ నా నాగరిక జీవనం!
 తెల్లారి పోతున్నది...
 రోజుమారుతున్నది..
మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....

ఏంటో జీవితం....
రైలు బండి లా తయారయింది!
ప్రయాణమైతే ప్రతి దినం చెయ్యాలి
చేరే గమ్యం మాత్రం లేనే లేదు!

ఒకడు శాసించి ఆనందిస్తాడు
మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు

ఒక రూపాయి విలువ తక్కువే కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే....
అది లక్ష ఎప్పటికీ కాదు...
ఆ లక్ష సంపూర్ణం కాదు...
అందుకే...!

--(())--

179.#పిల్లలజాతకాన్నిమార్చలేమా !? చిన్న కధ 
ఈ ఇతిహా సం చదవండి తెలుస్తుంది..

అవంతీ నగరంలో ఒక వేదపండితుడు ఉండేవాడు ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం. చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చేయలుకున్నా ఇతడి చేత చేయించేవారు.. ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవడం వలన యజ్ఞాలు చేశాడు. యాగాలు చేశాడు. చివరికి పుత్రకామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జతకాది కర్మలు చేశాడు. ఒకరోజు ఈ పిల్లాడి జాతకచక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది.. గుండెఝల్లుమంది. అయినా మళ్ళి మళ్ళి వేశాడు. ఎన్నిసార్లు చుసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు ''బాబోయ్! నేను పండితుడిని. వీడు గజదొంగ. పండితపుత్రుడు పరమ శుంఠ'' అనేమాట నిజమౌతుందేమో!''అని భయపడ్డాడు. ఇంతలోనే మనస్సుని అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేము కాని మనస్సుని అదుపు చేయాలి. ఎలా? ఎలా? ఎలా? అని అలోచించి ఆరోజు నుండి పిల్లాడికి రామాయణ భారత, భాగవతాలు, గరుడపురాణం లాంటి పురాణాలు బాగా పిల్లాడికి చెప్పాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడపురాణం మరీమరీ ఒకటికి పదిసార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది.. ఈ తప్పు చేస్తే ఈశిక్ష పడుతుంది. ఆ తప్పుచేస్తే మరో శిక్ష పడుతుంది.. బంగారం దొంగతనం చేస్తే కుష్ఠు వ్యాది వస్తుంది, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాది వస్తుంది. ఎవరినైనా దూషించడం, పరులమీద నిందలు వేయడం, గురువులని వేదాలని నిందించడం, దొంగతనాలు చేయడం లాంటివి చేస్తే తీసుకుతీసుకు చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనస్సులో లోతుగా పాతుకుపోయింది. ఎట్టకేలకు ఈకుర్రాడు కూడా పండితుడు అయ్యాడు.. ఇతడి పేరు కూడా క్రమంగా ఆనోటా ఈనోటా పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది..

రాజుగారు ఆపండితుడి తండ్రిని పిలిపించి ఓ పండిత బ్రహ్మ! భూసురోత్తమా! నీ కుమారుడి గుణగణాలు విన్నాను. ఇక నుండి నాదగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు. అలా వేళ్ళాడే కాని మనస్సంతా ఆందోళన.. వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది. ఇన్నాళ్ళు నాదగ్గర ఉన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనస్సు మళ్ళకుండా చేశాను. ఇప్పుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి ఇతర విలువైన సామాగ్రి చూసి పొరబాటున మనస్సు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది. అయ్యో పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు. అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు. అని తననుతాను నిగ్రహించుకొని కొడుకుని పిలిచి నాయనా రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చేయాలి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉన్నావా! తలే తీసేస్తాడు రాజుగారు అని మళ్ళి గరుడపురాణం చెప్పి, ఎన్నెన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించాడు.

చిన్ననాటి నుండి ఇలా పురాణాలు, రామాయణ, భారత భాగవతాలు చెప్తుంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండితపుత్రుడికి.. వీడు గజదొంగ అవుతాడని తండ్రికి తప్ప వీడికి తెలిదు. మొత్తమ్మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు. పూజ చేయడానికి పూజామందిరంలోకి వెళ్ళగానే అక్కడ ధగధగ మెరిసిపోతున్న వజ్రాలు, పగడాలు, బంగారం, వెండి వస్తువులు చూసి ఆహా! నాజీవితంలో ఇలాంటివి చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు. తీసుకోవాలి అనుపించింది. వెంటనే మనస్సులో అమ్మో ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పిన మాటలు, పురాణాలు గుర్తొచ్చి అమ్మో! ఒద్దు ఒద్దు అని వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలు చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తీ చేసి ఇంటికి వెళ్లబోతుంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూట చూసి 'ఏంటిది స్వామి చూపించండి;; అనగా అయ్యో ఏమిలేదు ఏమిలేదు అనగా అనుమానం వచ్చి లాక్కుని చుస్తే ఆ మూటలో తవుడు ఉంది. ఇదేంటి స్వామి తవుడు మూట పట్టుకుపోతున్నారు? బెదిరిపోతూ చూశాడు. సందేహంతో రాజుగారి దగ్గర ఇతడిని ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారికి జరిగినదంతా పూసగుచ్చినట్లు భటులు చెప్పారు. అంతావిని భూసురోత్తమా! ''ఎందుకు ఇలా చేశావు? అని అడుగగా ''ఏమిలేదు మహారాజా! ఆవుకి పెట్టడానికి ఇంట్లో తవుడు నిండుకుంది. అందుకే ఇలా చేశాను. అనేసరికి రాజుగారు నవ్వుకొని; అదేంటి పండితపుత్రా! అడిగితే బస్తాలకి బస్తాలకి ఇచ్చేవాడిని. దొంగతనం చేయాల్సిన ఖర్మేమి వచ్చింది? చిన్నపిల్లాడి చేష్టల ఉంది అనుకోని అతడి తండ్రినిపిలిపించాడు.

తండ్రి గజగజా వణికిపోయి అయ్యో వీడేం చేశాడో? అనుకున్నదంతా జరిగినట్లు ఉంది. ఎంత చెప్పిన కర్మని మార్చలేము. అయ్యో వాడి తల తీసేస్తారు. కుయ్యో మొర్రో, అయ్యో, నాయనో అంటూ ఏడుస్తూ దర్బార్ కి వచ్చాడు. అప్పుడు రాజుగారు జరిగింది చెప్పాడు. మనస్సులో హమ్మయ్య! అనుకోని మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి. ఏకాంతంగా మాట్లాడాలి. అని రాజుగారి ఎంకాంత మందిరానికి తీసుకెళ్ళి ; మహారాజా! నన్ను క్షమించండి. ఇదిగో వాడి జాతకం. వీడి జాతక ప్రకారం గజదొంగ అవ్వాలి. కాని నేను మన భారత, భాగవత, రామాయణ, పురాణాలు చిన్ననాటి నుండి భోదించాను. వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తి అయింది. లేదంటే ఈపాటికి వాడు గజదొంగ అయ్యుండేవాడు. వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయ్యింది. ఇకమీదట ఎలాంటి అపశ్రుతి జరగదు అని మాటిస్తున్నాను. అని రాజుగారికి వివరించాడు. ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మణిమాణిక్యాలు ఇచ్చి, బస్తాల కొద్ది ఆహారధాన్యాలు ఇచ్చి, తవుడు ఇచ్చి పంపించాడు.. ఆవిధంగా పిల్లాడి దోషాలని నివృత్తి చేశాడు తండ్రి.

అందుకే పిల్లలకి చిన్ననాటి నుండి ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు చెబితే జాతకాలు మార్చేయవచ్చు.

--(())--

180*'ప్రయత్నలోపం

నాకు తెలిసీ ఇది స్వామి మంచి అంటే అయ్యిందేదో మంచికే అయ్యింది.. 
అవుతున్నదేదో అది మంచికే అవుతుంది  అవ్వపోయేది కూడా మంచికే అవుతుంది.. 
నీవేమి పోకొట్టుకున్నావని విచారిస్తున్నావ్? 
ఏమి తెచ్చావని పోకొట్టుకుంటావ్? 
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది నీవు ఏదయితే పొందావో అవి ఇక్కడినుండి పొందావు ఏదయితే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు నాడు నీవు నాసొంతం అనుకున్నదంతా, నిన్న ఇంకొకరి సొంతం కద, మరి రేపు మరొకరి సొంతం కాగలదు. 
పరివర్తనం మార్పు చెందడం అనేది లోకం యొక్క పోకడ అలవాటు..
కావున జరిగేదేదో జరుగకమానదు..జరిగింది ఎన్నటికీ మారదు..
అనవసరంగా ఆందోళన పడకు  ఆందోళన అనారోగ్యానికి మూలం.. 
'ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు'.. 
ఫలితం ఏదయినా దయివప్రసాదంగా స్వీకరించు..
కాలం విలువైనది..
రేపు అనుదానికి రూపులేదు..
మంచిపనులు వాయిదా వేయకు.. 
అసూయను రూపుమాపు..
అహంకారాన్ని అణగద్రొక్కు..
హింసను విడనాడు, అహింసను పాటించు..
కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు...
ఉపకారం చేయలేకపోయినా, అపకారం తలపెట్టకు..
మతిని సిద్ధంచేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు..
దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు..
తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండగలదు..
ఓం శాంతి శాంతి శాంతి
--(())--  

181* మంచికి అర్ధం 

మంచికి అర్ధం చెయ్యని సమాజం లో బ్రతుకుతున్నాం కలి యుగం... 

తప్పు మనలో ఎవ్వరిది కాదు... ఈ కాలం అంటువంటి స్థితిలో ఉంది.. 
అందుకే, మనందరిలో ఎన్ని మంచి ఊహలు వున్నా, కలి ప్రభావరీత్యా... 
ఆ ఊహ ఆలోచన రూపం దాల్చే సమయానికి క్రూరంగా తయారవుతోంది... 
అది క్రూరమని తెలిసినా, బయట ఎంతో మంది చేయగా, తను చేస్తే పెద్ద తప్పుగా పరిగణింపడదు లే అనే ధైర్యం తో చేసేస్తున్నాం... 
అలా చేసేసిన తరువాత, అరరే ఇలా ఎందుకు చేసాము అని బాధపడటం ఒక్కటే మనము చేస్తున్నాం@మానవత్వం ఉంటే.... 
బాగా పరిణితి ఉన్నవాళ్లు అయితే, అసలు ఇలా చేయటం ఎవరు మొదలుపెట్టారు&ఎందుకు మొదలయింది అని ఆలోచించగా, మనందరిలో జ్ఞానం మొదలవుతుంది... అప్పుడు అలా తమ మనస్సు మారిపోయి తప్పులు జరగకుండా కాపాడమని ఆ దేవుడిని ప్రార్ధిస్తారు@కుదిరితే కొన్ని పూజలు చేయిస్తారు.. కుదరనివాళ్ళు ఆ దేవుని దగ్గర మొక్కుకుంటారు@అలా తప్పు జరగనీకుండా చేసి, తమకు లాభం తెప్పియిస్తే, ఇలా తమ మొక్కులు చెల్లించుకుంటామని నమస్కరిస్తారు . 

ఇలానే జరుగుతున్న సమయంలో, మనలో వింత వింత ఆలోచనలు మొదలయ్యాయి... 'ఎన్ని సార్లు ఆ దేవునికి మొక్కులు చెల్లించాను, ఒక్కసారి చేయకపోతే ఏమీ కాదులే'అని...


మనలోని జ్ఞానికి అర్ధంకానిది ఏమిటంటే, అంతకుమునుపు చెల్లించిన మొక్కులు పని పూర్తిగా జరిగిన పిదప చెల్లించామని....

దేవునితో వ్యాపారాలు కూడా మొదలైపోయింది మనందరిలోకలిప్రభావం...
.
ఇప్పుడు నేను ఇంత సోది చెప్పటానికి కారణం..
.
మంచి అనేది మనలోని ఊహ, ఆలోచన రూపం దాల్చే క్రమంలో జాగ్రత్తగా ఉండటం ప్రధానం&అవసరం కూడా....
దేవుడు ఉన్నది కూడా అందుకే మనకు సహాయం చేయటానికి మాత్రమే కోరింది... 
.
విషయంలోకి వస్తే..మంచి అనేది ఎవరో కనిపెట్టలేదు..మనలోని జ్ఞాని అనవసరంగా ఇతరులకు ఇబ్బంది చేయకూడని మనస్తత్వమే మంచి అంటే..
.
--(())--
,
182* ఆరోగ్య సూత్రాలు 

1. ఆహారము బాగా ఉదుకునట్లు చేసి మరియు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తినవలయును. చాలర్చిన ఆహారం అనారోగ్యానికి హేతువు.
2.గోధుమలు, మరియు బియ్యము పూర్ణముగా ఉపయోగించుట మంచిది.ఇవి సేంద్రియ వ్యవసాయం పద్దతి ద్వారా చేసిన ధాన్యం ఐతే పూర్తిగా మంచిది. లేనిచో దంపుడు బియ్యం లేదా పాత బియ్యం ఉపయోగించుట మంచిది.
3.వేపుడు వస్తువులు వాడకము తగ్గించుకోవాలి.
4.బోజనములో మజ్జిగ వాడకము మంచిది.
5.బోజనము చేసే సమయమున మంచి నీరు యెట్టి పరిస్తితులలో కూడా త్రాగ కూడదు.గుటక పడకపోతే ఒక్క గుక్కెడు నీరు త్రాగ వచ్చును.
6.ఆహారము బాగుగా నమిలి మ్రింగ వలెను.అంటే ఆహారము జ్యూస్ మాదిరిగా ఉండాలి.
7.రోజుకి రెండుపూటల బోజనము చేయడం మంచిది.కనీసం 5- 7 గంటల వ్యవధి అవసరము.
8.భోజనానంతరం మజ్జిగ త్రాగడం శ్రేష్టము.కానీ ఇతర ఐస్ క్రీములు లాంటివి తీసుకో కూడదు.
9.ఉదరము ఒక యంత్రము . గనుక వారమునకు ఒకటి, రెండు పూటలు బోజనానికి విశ్రాంతి ఇచ్చి, ఆ సమయములో పండ్లు, పండ్ల రసము త్రాగ వలయును. 
10. నీరు ఎప్పుడూ వేడి చేసి మాత్రమే త్రాగుట మంచిది. ఫ్రిజ్ లో పెట్టిన నీరు యెట్టి పరిస్థితులలోను త్రాగ రాదు.
11. కూల్ డ్రింక్స్, ఆల్కహాల్,త్రాగే రాదు.
12. తగినన్ని కూరగాయలు,పచ్చివి లేక ఉడికించిన కూరగాయలు,మరియు ఆయా ఋతువులలో లభించు పండిన పండ్లు తినుట మంచిది.
13. సాద్విక ఆహారం ఎప్పుడూ మంచిది. మాంసాహారం నిషేధము.
14.ఆహారము తినే తప్పుడు మీకు త్రెనుపు వచ్చినది అంటే మీ కడుపులో ఆహారం నిండి నట్లు గమనించి  ఆహారము తినుట మానవలేను. లేనిచో అనారోగ్యము వచ్చుటకు అవకాశం ఉండును. 
15.శొంఠి,మిరియాలు, చేదు ధారాళంగా వాడుట మంచిది.
16.ప్రతినిత్యం వ్యాయామము, యోగ ప్రాణాయామము చేయడం మంచిది.

--(() ) --

183*చెత్తకుప్పల చిట్టిబాబు


Train కి ఇంకా చాలా time ఉంది. ఎక్కబోతు ఒకసారి chart లో న పేరు, berth number చెక్ చేసుకున్నా. అసంకల్పితంగా కింద పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు  .....వయసు 50. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను అతనే అయి ఉంటాడు. 


(ఒరేయ్, ఒసేయ్, వాడు, వీడు కాలం కాదుగా మనది) ఇంత విచిత్రమయిన పేరు ఇంకా ఎవరికి ఉంటుంది.  అతనికి ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే ఇతను పుట్టంగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి, మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది గానీ చూట్టానికి smart గా, active గా ఉండేవాడు. నా మనసు గతం లోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు రోజుకో ప్రేమలేఖ రాసిన వీర ప్రేమికుడు ఇతను. (అప్పట్లో నేను కాలేజ్ బ్యూటీ లెండి 😎) కాలేజీ కి వెళ్లినా, ట్యూషన్ కి వెళ్లినా, గుడికి వెళ్లినా bodygaurd లా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది. ఇంట్లోవాళ్ళకి తెలుస్తే చదువు మానిపిస్తారని భయం. చిట్టిబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని. నిజం చెప్పొద్దూ ఏ రోజు అయిన అతను కనిపించకపోతే ఎదో వెలితి గానే ఉండేది.  నేనో రెండ్రోజులు ఏ ఉరన్నా వెళ్లి, కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధ పడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు. అతన్నీ నేను  ప్రేమించక పోయినా మనసులో ఏ మూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్.... బహుశా అతని ప్రేమని అంగీకరించడానికి అప్పట్లో ధైర్యం కూడా లేదేమో.  ఆ తర్వాత మా నాన్నగారికి transfer అవటం ....మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఇపుడు దాదాపు 30 ఏళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో. నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. నాకు పెళ్లి అయ్యి పెళ్లి వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు. అయినా ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి, అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే... exitement తో నా పెదాలమీద చిరునవ్వు వచ్చేసింది. మెల్లిగా ట్రైన్ ఎక్కాను. నా బెర్త్ వెదుక్కుంటూ వెళ్తే....yes అతనే. సీరియస్ గా సామాను సర్దుకుంటున్నాడు. బాగా మారిపోయాడు. సగం బట్టతల, బాగా పొట్ట...పెళ్లి అయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడో పాపం. సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబట్టుకుంటు చూస్తున్నా. ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూసాడు. నా గుండె వేగం పెరిగింది. ఒకటి....రెండు....secinds లెక్క పెడుతున్న. హఠాత్తుగా అన్నాడు అతను....

దొంగ సచినోడు, చెత్త వెధవ, బాన పొట్ట గాడు, వాడి గుడ్లు పీకా, వాడికి రోగం  రానూ

ఏమన్నాడో తెలుసా

" aunty, మీరు పెద్దవారు. పై బెర్త్ ఎక్కలేకపోతే నా lower బెర్త్ తీసుకోండి"

--(())--

184 * జన్మసార్ధకం ఏమిటో   

జన్మసార్ధకం ఏమిటో ఎవ్వరికి తెలియదు , కానీ కొందరికి వంశపార్మపరంగా వచ్చే విద్య ఆధారమే జీవితం అని  సర్దుకు  పోతారు అదే జీవనాధారంగా మార్చుకుంటారు. కొందరు అప్రయాజకులుగా తిరుగుతారు వారి గురించి చెప్పుకోకున్నా ఉంటేనే మంచింది.   

* భౌతిక పదార్ధాన్ని,భౌతిక సంఘటనలను, భౌతిక పరిస్థితులును,భౌతిక వాస్తవాన్ని,మానవ చైతన్య వికాసాన్ని...... సంపూర్ణంగా అధ్యయనం చేసుకుని జ్ఞానపరిధిని విస్తరింప చేసుకోవడానికి భూమి మీద జన్మ  స్త్రీపురుషుల సాగత్యం, అర్ధ పరమార్ధం తెలుసుకొని విజ్ఞానాన్ని పంచుకొని జీవించాలి .

* ఆత్మ చైతన్య వికాసాన్ని అనేక కోణాలలో వ్యాపింప చేసుకోవడానికి,అన్ని శక్తి సామర్ధ్యాలు, మన అంతర్ శక్తిలో ఇముడ్చుకుని భూమి అనే ప్రయోగశాలలో ప్రవేశించి అనేక ఆచారాలు, లక్షణాలు, బుద్ధులు తెల్సుకొని బతకటమే. .

* భూమి పైన జన్మ మనకు అనంతమైన అవకాశాలను వినియోగించుకుని చైతన్య పరిణామం చెందగల సర్వ సమర్ధతలు మనము కలిగి ఉన్నాము. మనం సంకల్పించుకున్న దానికంటే ఎక్కువుగా ఇవ్వడానికి ఈ విశ్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. చదివిన విధ్యతగ్గ వినయంతో విశ్వాన్ని అర్ధం చేసుకొని మన మనసుకు తగినది తెల్సుకొని ఆశకుపోకుంటే జ్ఞాపరిపక్వత.  

* మనం కోరుకోకుండా ఏ భౌతిక సంఘటన,మన జీవితంలోకి ప్రవేశించడం జరుగదు.మనము ఏవైతే కోరుకుంటున్నామో అవే మనం భౌతిక పరిస్థితులగా ఎదుర్కుంటున్నాము. భౌతిక సంపద 
మనకష్టార్జితం అనుకున్న తప్పే. దీనికి ముఖ్యంగా సతి,  దేశ స్థితి, ప్రకృతి, ఆధారమై ఉంటుంది .    
--(())--

No comments:

Post a Comment