Tuesday 16 May 2023

213 --210 stories



213  : గురువు రకాలు :-

1. సూచక గురువు - చదువు చెప్పేవాడు 

2. వాచక గురువు - కుల ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు చెప్పేవాడు 

3. బోధక గురువు -  మహామంత్రాలు ఉపదేశించేవాడు 

4. నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాలు చెప్పేవాడు

5. విహిత గురువు - విషయ భోగాల మీద విరక్తి కలిగించేవాడు 

6. కారణ గురువు - జీవ బ్రహ్మైక్యము బోధించేవాడు

7. పరమ గురువు - 'జీవాత్మ , పరమాత్మ ఒకటే' అనే ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు.

 214*🧘‍♂️మౌనం🧘‍♀️*

      *శ్రీ దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.*

         *గురువు మౌనం జ్ఞానానుగ్రహం.*

       *జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.*

        *భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.*

*ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌన అనుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.*

*మౌనమంటే -*

 *నిరంతరం మనస్సు భాషణ.*

 *చింత, చింతన లేని తపస్సు.*

 *అఖండ ఆనందపు ఆత్మస్థితి.*

 *విషయ శూన్యావస్థ.*

*యోగస్య ప్రధమం ద్వారం వాక్ నిరోధః  అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం.సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది. పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం  ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు.*

*తనను తాను తెలుసుకుంటే, ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. తనని తాను, తాను తెలుసుకోక, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. ప్రవర్తన వినయంగా వుండేకొద్దీ మేలు అధికంగా, బహుముఖంగా వుంటుంది. దానికి సోమరితనం పనికిరాదు, కాలం వృధా చేయకూడదు, వర్తమానంలో జీవించాలి.*

*మౌనమే అనంత భాషణం.. అదే ఒక్కమాట.. అదే నిక్కమైన యిష్ఠాగోష్ఠి.. మౌనము నిరాటంకమైన విద్యుత్ ప్రవాహము వంటిది. కొన్ని వందల ఉపన్యాసాలు, గ్రంధాలు చేయలేని పనిని, జ్ఞాని కొన్ని క్షణాలలో మౌనం ద్వారా సాధకునిలో వివేకాన్ని నింపగలడు.*

 *'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది.*

 *మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది.*

 *హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతి చెందుతుంది'.*

***

*మౌనం అంటే ఏమిటి?*

 *మౌనం ఒక మానసిక నిశ్శబ్దం,*

*మాట ఓ భౌతిక శబ్దం,*

 *మౌనం ఓ సమస్యకు పరిష్కారం,*

*మాట ఒక సమస్యకు కారణం*

*మాట హద్దులు దాటితే యుద్ధం,*

 *మౌనం హద్దులు దాటితే ఆత్మ జ్ఞానం,*

 *కొన్నిటికి సమాధానం మౌనం,*

 *కొన్నిటికి సమాధానం మాట,*

 *మాట, మౌనం రెండు అవసరం, వాటిని వాడే విధానం తెలుసుకోవాలి.*

 *అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు.*

*సనాతన భాషా స్రవంతి. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు.నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు. విజ్రుంభణను ఆపడం.*

*మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం.ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.*

*మౌనమంటే -నిరంతర భాషణ.చింత, చింతన లేని తపస్సు.అఖండ ఆనందపు ఆత్మస్థితి.విషయ శూన్యావస్థ.*

*యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు.*

*మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం.అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది. పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి.అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు.*

*ఈ మౌనం మూడు రకాలు:-*

*1. వాజ్మౌనం :-*

*వాక్కుని నిరోదించడం.ఈ రకమైన మౌనం వలన కఠువుగా మాట్లాడుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.*

*2. అక్షమౌనం :-*

*కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి.*

*3. కాష్ఠ మౌనం :-*

*దీనిని మానసిక మౌనమంటారు.మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠ మౌనమంటారు.ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.*

 *'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది.మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.*

215 *🧘‍♂️మౌనం🧘‍♀️*

*దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.*

*గురువు మౌనం జ్ఞానానుగ్రహం.*

*జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.*

*భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.*

*ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. 

ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది.*

*మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది. మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటి కంటే అతీతమైన సమర్ధవంతమైన భాష.అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు.*

*మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి.*

*మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.*

*'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది.*

 *భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం.*

*మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది.*

*మౌనమే సత్యం, శివం, సుందరం.  ఇదే అఖండానందం, ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.*

*****

216 *శ్రీ దక్షిణామూర్తి యనగా పరమేశ్వరుడే.* 

*శ్రీ దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.*

*బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మదేవుడు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.*

*ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ దేవుడినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ, పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ, పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.*

*పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో "భాండీరము" అను ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణాభి ముఖంగా పద్మాసనంలో కూర్చుని దక్షిణ హస్తంతో "చిన్ముద్ర" ధరించి తురీయాతీత స్థితిలో వారికి దర్శనమిచ్చాడు.. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.*

****

*మనని మనం దేహంగా భావిస్తున్నాం కాబట్టి గురువు కూడా మరో దేహం అనుకుంటున్నాం. నిజానికి నీవు కొలిచే గురువులోని తత్వం విశ్వమంతా వ్యాపించి ఉంది. అది నీ అంతరంగంలో కూడా ఉంది. దేహధారిగా కనిపించే నీ గురువు, నిన్ను అంతర్ముఖం చేయటం కోసం వైరాగ్యాన్ని, ప్రపంచం పట్ల విముఖతను కలిగిస్తాడు. అప్పటికే నీలో ఉన్న గురువు శాంతిని రుచిగా చూపించి, నిన్ను లోపలికి లాగుతాడు. మనం బాహ్య గురువు నోటి వెంట వచ్చిన మాటలనే గురుబోధగా భావిస్తున్నాం. మన అంతరంగంలో జనించే ప్రతి వివేకవంతమైన ఆలోచన కూడా ఆయన ప్రసాదించినదేనన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. ఈ విషయం అర్థమైతే కానీ "గురుస్వరూపం" ఏమిటో అర్థం కాదు. మనకి మంచి ఆలోచన కలిగినా, పూజ బాగా కుదిరినా, జపంలో ఏకాగ్రత సిద్ధించినా, ధ్యానస్థితి కలిగినా.. ఇవన్నీ మన గురువు మనపై కురిపించే అనుగ్రహమేనని గుర్తుంచుకోవాలి. అలా తెలుసుకున్న రోజు, గురువు నీవు అనుకున్నట్లు దేహమాత్రుడు కాడని, విశ్వవ్యాప్తంగా ఉన్న గురువు నీలోనే ఉన్నాడని బోధపడుతుంది !*

****

217 *"గురువు అనుగ్రహం కోసం చెయ్యాల్సిన సాధన ఏమిటి ?"*

*మనసుని కలుషితంచేసే కోరికలే కాదు అనవసరంగా దొర్లే చిన్న మాట కూడా మనని బాహ్యముఖంచేసి శాంతిని దూరం చేస్తుంది. అందుకే సాధకులు స్నేహితులు, బంధువులతో కూడా మితంగానే ఉండాలి. ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనామకత్వాన్ని అలవాటు చేయాలి. సాత్వికత లేనివారి సహచర్యాన్ని, లౌకిక విషయాసక్తిని, సాధనకు సహకరించని పరిచయాలను తగ్గించుకోవాలి. ఎంతమందిలో ఉన్నా దైవనామాన్ని జపిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి. మనసులో ఆలోచనలు రేకెత్తించే వ్యాపకాలను తగ్గించుకోవాలి. ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన గురుబోధ మనలో నుండి వినిపిస్తుంది. గురు అనుగ్రహం వల్ల కలిగే పరిణామం అంతర్ముఖత్వం. మనసు అంతర్ముఖం కావడమంటే ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, చూసిందల్లా కావాలనిపించని నిర్లిప్త గుణం అలవడితే మనసు అంతర్ముఖం అవుతుందని అర్ధం. గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు నిరంతర సావధానత అవసరం. మన మనసును అనుక్షణం నిగ్రహించుకుంటే గానీ ఇది సాధ్యం కాదు !*

*"వద్దనుకుంటున్నా కోరికలు పెరుగుతుండటం, శాంతిని ఆశిస్తున్నా అది దూరం అవుతుండటం ఏమిటి ?"*

*కోర్కెలకు కారణం అసత్యదృష్టి. అట్టి అసత్యదృష్టిని తొలగించేవాడే గురువు. ప్రతిరోజూ నిద్రలో అప్రయత్నంగా మనసు అహంకార రహిత స్థితి పొందుతుంది. మెలకువలోనూ ఆ స్థితిని సాధించేందుకు అవరోధంగా ఉన్నది మనలోని కోరికలే ! గురువు అనుగ్రహాన్ని ఆశించడం అంటే మనసు యొక్క స్వచ్ఛతను కోరుకోవటమే. నిరంతరం శాంతిగా ఉండాలన్న అభిలాష కలగటం గురువు యొక్క తొలి అనుగ్రహం. ఆ శాంతి కోసం సాధన సాగటం మలి అనుగ్రహం. పరిపూర్ణ శాంతిని పొందటమే గురువు యొక్క పూర్ణానుగ్రహం. శుభేచ్ఛ కలిగింది మొదలు అది నెరవేరేవరకు లభించే పరిణామాలన్నీ మనపై గురువు చూపించే కనికరమే. ఈ సత్యాన్ని సదా మననంచేసే సంపూర్ణ శరణాగతి మనందరికీ అలవడాలన్నది భగవాన్ శ్రీరమణమహర్షి బోధనల్లోని అంతర్యం. తన సాధన ఎలా సాగుతుందోనన్న సంశయం ప్రతి సాధకుడికీ ఉంటుంది. రోజురోజుకు మనసు శాంతిని పొందటమే ఏ సాధకుడికైనా కొలమానం అవుతుంది !*

****

 218. తల్లి గల్గిన నేల తపసి గానిచ్చు

తల్లి గల్గిన నేల తలజడల్గట్టు 

తల్లి యున్న విషంబు ద్రావనేలిచ్చు

తల్లి యుండిన తోళ్ళు తాల్ప నేలిచ్చు   

తల్లి పాములనేల ధరియింపనిచ్చు   

తల్లి బూడిద యేల తా పూయనిచ్చు    

తల్లి పుచ్చునె భువి తనయుని దిరియ

తల్లి పుచ్చునె సుతు వల్లకాటికిని

తల్లి లేకుండిన తనయుడు గాన

ప్రల్లదుడై ఇన్ని పాట్లకు వచ్చె

(పాల్కురికి సోమనాధుని బసవ పురాణం నుండి)

తల్లి లేకపోవడం వల్లనే శివుడు తాపసుడై పోయాడట . అతనికి  అమ్మే గనక ఉంటే ఒప్పుకునేది కాదు. 

తల్లి లేకపోవడం వల్లనే శివునికి జడలు కట్టాయట . ఒక వేళ అమ్మే అతనికి ఉండి ఉంటే రోజు చక్కగా తలదువ్వేది. 

తల్లి లేకపోవడం వల్లనే శివుడు విషం త్రాగాడట. తల్లి ఉంటే ససేమిరా ఒప్పుకునేది కాదట . 

తల్లి లేకపోవడం చేతనే శివుడు తోళ్ళు కట్టు కు౦టున్నాడట. తల్లి ఉంటే కట్టనిచ్చేది కాదు.  

తల్లి లేకపోవడం వల్లనే పాములు ధరిస్తున్నాడట. తల్లి ఉంటే పాములు దరించనిచ్చేది కాదు. 

తల్లి లేక పోవడం వల్లనే శివుడు వీధి వీధి తిరుగుతూ అడుక్కు౦టున్నాడట. అమ్మే ఉంటే ఆ దుస్థితి అతనికి కలిగేది కాదు . 

 అమ్మ లేకపోవడం వల్లనే శివుడు స్మశానంలో ఉంటున్నాడట . ఒక వేళ ఆమ్మే ఉంటే అక్కున చేర్చుకుని ఒళ్లో కూర్చోబెట్టుకునేది . 

ఈ విధంగా శివుని దయనీయస్థితికి కారణం అతనికి తల్లి లేకపోవడమే అని శివ భక్తురాలి భావన.

తల్లి వైశిష్ట్యాన్ని ,అమృతత్వాన్ని  తెలియచేసే  తొలి తెలుగు పద్యం, అద్భుత ద్విపద...

***

219: *మోడీ ఎవరు?*

 దీనికి సమాధానాన్ని తెలివైన *రాజకీయ వైద్యుడు *చాలా అందంగా వివరించారు.  ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రంలో, తేనెను ఔషధంగా భావిస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కుక్క తేనెను నాకితే అది చనిపోతుంది.!

 అంటే మనుషులకు ఔషధం అయిన తేనె కుక్కలకు విషం. ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రం స్వచ్ఛమైన * దేశీయ ఆవు నెయ్యిని  ఔషధ లక్షణాల స్టోర్‌హౌస్‌గా పరిగణిస్తాయి.!

 కానీ ఆశ్చర్యం, మురికిలో సంతోషంగా ఉండే ఈగ ఎన్నటికీ స్వచ్ఛమైన దేశీయ నెయ్యిని తినదు.!

 పొరపాటున, ఒక ఈగ దేశీయ నెయ్యి మీద కూర్చుని రుచి చూసినా, అది వెంటనే అక్కడ వేదనతో చనిపోతుంది.!?

 ఆయుర్వేదంలో, * మిశ్రి అంటే కడి చక్కెర * ఔషధంగా మరియు ఉత్తమ మిఠాయిగా కూడా పరిగణించబడుతుంది. అయితే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కండ చక్కెర మిఠాయిని గాడిదకు తినిపిస్తే, దాని జీవితం కొంత సమయంలో ఎగిరిపోతుంది.!

 ఈ తేనె లాంటి ఉత్తమమైన డెజర్ట్, చక్కెర మిఠాయి * గాడిద * ఎన్నటికీ తినదు.  వేప చెట్టు మీద నాటిన పండిన వేప పండ్లలో (నింబోలిలో) అనేక వ్యాధులను ఓడించే ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం దీనిని *"ఉత్తమ "ఔషధం" అని పిలుస్తుంది.  అయితే వేప చెట్టు మీద నివసించే కాకి పగలు మరియు రాత్రి నింబోలి తింటే, ఆ కాకి మరణం ఖాయం.!

 అర్థం, ఈ భూమిపై ఇలాంటివి చాలా ఉన్నాయి ... అవి మనకు అమృతం లాంటివి, ప్రయోజనకరమైనవి, ఔషధాలు...

 కానీ ఈ భూమిపై అలాంటి కొన్ని జీవులు ఉన్నాయి, వీరి కోసం అదే తేనె విషం.!

 * *మోడీ* అదే ఔషధం. శక్తివంతమైన తేనె మందు.*  కానీ కుక్కలు *(తీవ్రవాదులు-అల్లరి మూకలు), * మాఫియా *(దేశద్రోహి-ధూళి), *  గాడిదలు *(వామపక్ష ఆలోచనపరులు-రాజకీయ మూర్ఖులు) * మరియు  కాకులకు * (స్వార్థపూరిత కృత్రిమ మీడియా) * మొదలైనవారికి... విషం లాంటివాడు మోడీ.!

 అందుకే ఈ నిర్దిష్ట మూలకం చాలా భయానకంగా ఉంది.   * ఈ పోస్ట్‌ను తేలికగా తీసుకోవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. * మీ వద్ద ఉన్న అన్ని గ్రూపులకు ఈ పోస్ట్ పంపండి, ధన్యవాదాలు, ధన్యవాదాలు.  * దేశం ప్రధానమైనది, పోస్ట్ చదవడానికి కొంత సమయం తీసుకోండి.*

***

210 *🧘‍♂️శ్రీ గురు స్తోత్రం🧘‍♀️*

*1)అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |*

*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- సమస్త విశ్వమంతటా చర-అచర వస్తువులన్నింటి యందు వ్యాపించిన పరమాత్మ తత్త్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురువునకు నమస్కారములు.*

*2)అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |*

*చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- అజ్ఞానాంధకారంతో నిండిన నాకు జ్ఞానమనే కాటుక పెట్టి అంతః నేత్రం తెరిచిన సద్గురువునకు నమస్కారములు.*

*3)గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |*

*గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- పరమాత్మ తత్త్వరూపాన్ని అంతః దర్శనం చేయించిన సద్గురువే బ్రహ్మ గురువే విష్ణువు మరియు పరమేశ్వరుడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమయిన సద్గురువునకు నమస్కారములు.*

*4)స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |*

*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- స్థిరమైన, అస్థిరమైన అనగా నిరంతరం చలించే జీవులతో సహా చరాచర జగత్తు అంతటా వ్యాపించిన పరమాత్మ తత్త్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురుదేవునికి నమస్కరించుతున్నాను.*

*5)చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |*

*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- పరమానందరూపుడై ముల్లోకాలలోని సకల చరాచర ప్రాణులలో వ్యాపించిన పరమేశ్వరుని తత్త్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురువునకు నమస్కారములు.*

*6)సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః |*

*వేదాంతాంబుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- సకల వేద విదులు విరాజిల్లే పాదపద్మములు కల వేదాంత కమలంలో(వేదాంత కమలంలో ఆశీనుడవడం అనగా వేదాంతం ప్రతిపాదించిన బ్రహ్మ తత్త్వాన్ని ఔపోసన పట్టిన బ్రహ్మనిష్ఠా గరిష్ఠుడని అర్ధం) ప్రకాశిస్తున్న సద్గురువునకు నమస్కారములు.*

*7)చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |*

*బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- నిరంతర చైతన్యుడు, శాంతస్వరూపుడు, అంతరిక్షం కంటే అతీతుడు (అనగా- హద్దులు లేనివాడు), నిర్మలుడు, సకల నాదాలకు (హత-అనాహతనాదాలకు) అతీతుడయిన సద్గురువునకు నమస్కారములు.*

*8)జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |*

*భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- పరమాత్మ తత్త్వరూపాన్నే ఆభరణంగా ధరించి, జ్ఞానపీఠాన్ని అధిరోహించి జిజ్ఞాసువుకు భక్తి-ముక్తి ప్రసాదించు సద్గురుదేవునికి వందనాలు.*

*9)అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |*

*ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- అనేక జన్మల నుండి ప్రోగు చేసుకొనిన కర్మ బంధనాలన్నింటినీ నాశనం చేయు ఆయుధమైన ఆత్మజ్ఞానం ప్రసాదించిన సద్గురు దేవునికి నమస్కరించుతున్నాను.*

*10)శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |*

*గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- దరిదాపు లేని భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్న నాకు తన చరణామృతాన్ని ప్రసాదించి తత్త్వసారాన్ని తెలియచెప్పి భవసాగరం నుండి రక్షించిన సద్గురుదేవునికి ప్రణామాలు.*

*11)న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |*

*తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- తత్త్వజ్ఞానం లేకుండా పరమాత్మ ప్రాప్తి అసంభవం. ఆ తత్త్వజ్ఞానం, తద్వారా చేయు తపస్సు కన్నా వాటిని ప్రసాదించు సద్గురువువే అధికమయినవాడు (శ్రేష్ఠుడు). తత్త్వజ్ఞానం ప్రసాదించిన సద్గురువునకు నమస్కరించుతున్నాను.*

*12)మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |*

*మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- నాలోని ఆత్మవై, సకల జీవుల ఆత్మయై, నాకు నాధుడవై, సకల జగత్తుకూ నాథుడవై జగద్గురువుగా విలసిల్లుతున్న సద్గురుదేవునికి నమస్కారములు.*

*13)గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |*

*గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||*

*భావం:- ఆది-అంతమూ గురువే. గురువే పరమ దైవం. సద్గురువు కృపా-కటాక్షమూ లేకుండా పరమపద ప్రాప్తి అసంభవం. మోక్ష మార్గం సులభతరం చేసిన సద్గురువునకు నమస్కారములు.*

*14)బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్ |*

*ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతంభావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ||*

*భావం:- నిత్యం శోకరహితుడై బ్రహ్మానందంలో లీనమై అజ్ఞాన అంధకారానికి తావు లేక జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్న, ఆకాశ సమానంగా (ఎల్లలు లేకుండా సకల ప్రదేశాలలో భాసిస్తూ) తత్త్వమసి ఆదిగా గల ఉపనిషద్వాక్యాలు లక్ష్యంగా గల (అనగా- సద్గురువు శిష్యులకి లౌకిక లక్ష్యాలు కాక కేవలం అలౌకిక లక్ష్యాలనే నిర్దేశిస్తారు) ఏకమై, నిత్యమై, విమలరూపుడై, సకల క్రియ, కర్మలకు సాక్షీభూతమైన, భావాలకి అతీతుడయిన, సత్వ, రజో, తమో గుణాలకి అతీతుడయిన సద్గురుదేవునికి వందనాలు.*

*15)త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |*

*త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ ||*

*భావం:-  దేవదేవా – నీవే నా తల్లివి. నీవే నా తండ్రివి. నీవే నా బంధుడవు. నీవే నా మిత్రుడవు. నీవే నా విద్యవు (జ్ఞానమువు). నీవే నా సంపదవు. (బలమువు, శక్తివి). నీవే నా సర్వస్వమును.*

***


No comments:

Post a Comment