Saturday 30 June 2018

Pranjali prabha (02-07-2018)

ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీకృష్ణయాణమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
ఇది నా బాల్య విశేషాలు
ఏమని చెప్పది నాటి బాల్యం
అనుభవాల శుభ శోభ రోజులు

కోతి కొమ్మచ్చి ఆట ఆడి
కోతిలా వ్రేలాడ లేక పడ్డ రోజులు
ముళ్ళను లెక్క చేయక తెగిన
పతంగం కోసం పరిగెత్తిన రోజులు

కొబ్బరి తెడ్డుతో క్రికెట్ (కార్కు) బంతిని
కొట్టి ఆటలో పరుగులు తీసిన రోజులు
వంగు దూకుల్లు దూకుతూ వరుసగా
మోదటి బహుమతి తెచ్చిన రోజులు

పిచ్చి బంతి అంటూ వీపున బంతితో
కొట్టి వేగముగా పరిగెత్తించిన రోజులు
బిల్లం గోడు ఆడుతూ ఫర్లాంగ్ దూరం
వెళ్ళి పట్టలేక కంటికి తగిలిన రోజును

ఇసుకలోచేరి గుడి, గోపురాలు కట్టి
చివరకు కాళ్ళతో తొక్కేసిన రోజులు
హోళీ నాడు రంగులు పూసుకుంటూ
నీళ్ళు చల్లుకొని వరుసలు లేని రోజులు

సినమాబండి వెంట నడుచుకుంటూ
పోయి ఇల్లు తెలుసుకోలేక ఏడ్చిన రోజును
నాన్న కోపించగా ఇంటినుండి వెళ్ళి
మరునాడు బిక్కమోహంతో వచ్చిన రోజును

డబ్బులులేక నాన్న కాకి డ్రస్సును
చింపి నాకు గుడ్డలు కుట్టించిన రోజును
స్కూల్లో ఇచ్చే రాగి పైసాకోసం అమ్మ
సేమ్యా తయారికి సహకరించిన రోజును

బాదంపుల్లలు ఏరి, బాదం ఆకులు ఊడ్చి
అమ్మకు తోడుగా కుంకుళ్ళను పొడి చేసిన రోజును
నాన్నతోపాటు ధూపపుపొడి, బేబి మాత్రలు,
ఆవుపాలమందును అమ్మివచ్చిన రోజును

నా ఆరోగ్యం కొరకు అమ్మ వ్రతాలంటూ,నోములంటూ
తిండి తినక ఉపవాసము ఉన్న రోజులను
అమ్మ అనారోగ్యానికి యెటువంటి సేవలు
చేయలేక, చెప్పుకోలేక ఏడ్చిన రోజులు

చదువుకు తగ్గ ఉద్యోగం రాక, ఎవ్వరికీ
చెప్పు కోలేక సినమా పిచ్చోడని పించు కున్న రోజులు
బిఇడి చదువుటకు 3000 లేవని అన్నప్పుడు
నీ బతుకు నీవు బతకటం నేర్చుకో అన్నప్పుడు
కొంప కొంప తిరిగి ట్యూషన్లు చెప్పిన రోజులు

ఈ రాతలు యధార్ధం ఇవి మాత్రం కల్పితాలు
కావు నేను గతంలో అనుభవించిన కొన్ని రోజులు.
ఎందరో మహానుభావులు ఆదరికీ వందనములు

--((**))--

నేటి హాస్యం 

మీరిప్పుడు కరెంటు కుర్చీలో కూర్చున్నారు. 
మరి కొద్ది క్షణాలలో మీరు ప్రాణాలు కోల్పోతారు. 
మీ ఆఖరి కోరికేమైనా వుంటే చెప్పండి?' 

మీరు తీర్చలేరు వదిలేయండి సార్! 

నా మాట నమ్మండి... 
ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను 

అయితే సరే సార్! నేను మిమ్మల్ని నమ్ముతున్నాను 
కరెంటు ఇచ్చినప్పుడు చేతికి ఏ విదమైన తొడుగూ లేకుండా మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!

--((**))--

నేటి హాస్యం 

డాక్టర్ గారూ! ఏమటండీ ఇంత బిల్లు! 

ఐటమ్ టూ ఐటమ్ వ్రాసాను చదవండి, 
ఆనక అడగండి! 

Congratulation fees. 200 
Blood test. 200 
మరి ఈ మూడోది బోదపడడము లేదు, 
అంకె 5,000 అని వుంది! 

మీరిక్కడున్నంత సేపూ 8 సిగరెట్లు కాలుస్తూ మా హాస్పిటల్ సోఫా తగలెట్టారట, 
సోఫా కొన్న రసీదు నఖలు బిల్లుకు జతపరిచాను చూసుకోండి!
--((**))--


--------సుభాషితాలు.---------------------

దానం ప్రియ వాక్సహితం జ్ఞాన 
మగర్వం క్షమాన్వితం శౌర్యం
విత్తం చ త్యాగనియుక్తం
దుర్లభ మే తచ్చతు ర్భద్రం 

తా:--ప్రియవచనములతో గూడిన దానమున్నూ,గర్వము లేని విద్య యున్నూ, క్షమ గలిగిన శౌర్యము న్నూ, త్యాగముతో గూడిన ధనమున్నూ , ఈ నాలుగూఎక్కడో అరుదుగా వుంటాయి.

భాష (పలుకులు,వాణి ) మనుష్యుడికి దేవుడిచ్చిన వరము.దాన్ని సక్రమంగా ఉపయోగించాలి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.భాషను దురుపయోగం చేయ కూడదు.

అన్నదానాత్పరం దానం విద్యాదాన మతః పరం 
అన్నేన క్షణికా తృప్తి: యావజ్జీవంచ విద్యయా 

అర్థము:--అన్నదానం గొప్పదే కానీ విద్యా దానం అంతకంటే గొప్పది. అన్నదానం వలన క్షణికమైన తృప్తి కలుగును. విద్యా దానము వలన అజ్ఞాన మనే చీకటి విడి పోయి జీవితమతయు సుఖ శాంతులు లభిస్తాయి కదా!

నతులగుచున్ మహోన్నతి దనర్చుచు, నవ్య గుణోక్తి చే గుణో 
న్నతి ప్రకటించుచున్, పరజన ప్రియ కార్య సమర్థతన్ సమం 
చిత నిజ కార్య సంగ్రహము జేయుచు, నిష్టుర వాదులన్ క్షమా 
ధృతి నిరసించుచుం, బరగు ధీరులు పూజ్యులు గారె యేరికిన్

అర్థము:-- సత్పురుషులు అణుకువ కలిగియే ఔన్నత్యమును పొందుదురు. పరుల గుణములను పొగడుచుచు తమ సహృదయత్వమును కనబరుతురు. పరుల కార్య సాఫల్యమున కై ఎక్కువ ప్రయత్నించి వారి కార్యములను సానుకూలము చేయుచు, తమకార్యములను కూడా చేసికొను చుందురు . తమను పరుషముగా నిందించు దుర్జనుల యందు ఓర్పు కనపరిచి వారే దుఃఖ పడునట్లు చేయుదురు. ఇట్టి నడవడిక గలిగిన మహాత్ములు అందరికీ పూజనీయులే. (భర్తృహరి సుభాషితము, ఏనుగు లక్ష్మణ కవి అనువాదము)
--------------శుభోదయం ---------సుభాషితాలు.---------------------

నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ 
దివ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు,కొన్ని విషప్రయుక్తముల్ 
పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధ మైనవే 
నవ్వులు, సర్వ దుఃఖ శమనంబులు, వ్యాధులకున్ మహౌషధుల్ 

అర్థము:--జంతువులు నవ్వవు. మనిషే నవ్వుతాడు. మనసును వెలిగించేవి నవ్వులు. అయితే కొన్ని నవ్వులు ఎటూ తేలవు. మంచో చెడో తెలియ జేయవు. కొన్ని నవ్వులు విషపూరితం గా వుంటాయి. ప్రేమతో నవ్విన నవ్వులే నవ్వులు. నవ్వులు పువ్వుల లాంటివి. సర్వ దుఖాలనూ పోగొట్టేవి నవ్వులే. అలాగే రోగాలకు గొప్ప ఔషధాలు కూడా నవ్వులే. హాయిగా మనసారా నవ్వుకోండి యితరులను నవ్వించండి. .

లోకేషు నిర్ధనో దుఃఖా:
రుణగ్రస్త తతోధికం 
తాభ్యాం రోగ యుతో దుఃఖా 
తేభ్యో దుఃఖా కు భార్య కః 

అర్థము:-- లోకం లో డబ్బులేనివాడు దుఖిస్తాడు,వాడికంటే అప్పు వున్నవాడు ఎక్కువగా దుఖిస్తాడు,వాడికంటే రోగ గ్రస్తుడైనవాడు ఎక్కువ దుఖిస్తాడు, వీళ్ళందరి కంటే గయ్యాళి భార్య వున్నవాడు ఎక్కువ దుఃఖితుడు.

షడ్దోషా పురుషే ణే హ హాతవ్యా భూతిమిచ్చతా 
నిద్రా తంద్రా భయం క్రోధ౦ ఆలసస్య దీర్ఘ సూత్రతా 
అర్థము:--బాగు పడాలనుకునే వాడు అతినిద్ర,సోమరితనము,భయం, కోపం,ఎంతకాలానికీ పని తెమలనీయక పోవడం ఈ ఆరు దోషాలనూ విడిచి పెట్టాలి.

నాస్తి మేఘ సమం తోయం నాస్తి చాత్మ సమం బలం 
నాస్తి చక్షు సమం తేజో నాస్తి నాస్తి ధాన్య సమం ప్రియం 

అర్థము:--వాన నీటి తో సమాన మైన నీరులేదు. ఆత్మా బలం తో సమాన మైన బలం లేదు. కంటి వెలుగు కు సమాన మైన వెలుగు దొరకదు. ఆహారం తో సమానమైన పదార్థము లేదు.ఈ మధ్య బుల్లితెర లో ( టీవీ)
లో చూశాను. వాన నీటిలో బి 12 విటమిను చాలా ఎక్కువగా ఉంటుందని. దీన్ని మన ఋషులు ఎప్పుడో గ్రహించారని ఈ శ్లోకాన్ని బట్టి తెలుస్తోంది. మనవాళ్ళకి పరాయిదేశం వాళ్ళు కనిపెట్టి చెప్తేనే గొప్ప, నమ్ముతారుకూడా.

అభ్యానుసారిణీ విద్యా బుద్ధి: కర్మానుసారిణీ 
ఉద్యోగానుసారిణీ లక్ష్మీ ఫలం భాగ్యానుసారిణీ 
అర్థము:--అభ్య్యాసము (పదే పదే చదువుట)వల్ల విద్యలు, కర్మను బట్టి బుద్ధి, ప్రయత్నము చేయుట చేతనే పనులు జరుగుట, అదృష్టము వల్లనే ధనము లోకములో సమ కూరు చున్నవి.
--((**))--



No comments:

Post a Comment