Wednesday 13 June 2018

Pranjali prabha (21-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయ నమ:

Photo

అందరికి (ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం) 

నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీలా ) -11
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

21. ఎనుబోతు వానకు జంకున ఎంతైనా - వెల హెచ్చు గల ప్రేమ్ వెఱచు గాక
      కండలున్న కుస్తీకి జంకున ఎంతైనా -  పిన్న బాలుడు మతి వెఱచు గాక
      గుడిసైన పెనుగాలికి జంకి ఎగురునా -  విరగ గాచిన మ్రాను  వెఱచు గాక
      రంకు పెళ్ళాం బజారు రచ్చకు వెరచునా -  వీర ప్రతివ్రత వెఱచు గాక

      నాయకుల మాటలకు ప్రజలు జంకున ఎంతైనా
      కొడుక్కి పదవి ఇవ్వకుండా మణ్డత్రి ఉండునా ఎంతైనా
      నోటి తిట్లకు వెఱచును ఎవ్వరైనా
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా

22. స్నాన సంధ్యాద్యనుష్ఠాన సంపన్నత, శుభలక్షణంబుల సూక్ష్మబుద్ది నమ్రత  
      ఘనా వివేక విక్రమ బాంధవ్య వినమ్రత,  మర్మ విలాసంబు మానుషంబు మమత
      సరస సాహసందొకవేళ వాచాలత , విద్యా విచక్షణ విప్రపూజ,ధర్మబోధ  ప్రేరిత  
      వితరణగుణము భూపతియందు భక్తి తత్పరత, నేర్పుతో గాభీర్యము పరోపకారచింత 

      కనుముక్కు తీరు చక్కగా ఉండి    

      సూక్ష్మా సూక్ష్మాలను గ్రహించి ఉండి 
      కీర్తి సౌఖ్యము సకల విజయ సిరితో ఉండి 
      ధర్మపత్నిగా ఉన్న వానికి నిత్యశోభ 
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--

Photo

బావగారు! మీ చిరకాల ప్రియరాళ్ళు
జీడిపప్పు, సోడా, థమ్స్ అప్, చికెన్, విస్కీ రోజూ వస్తున్నాయా? పోయాయా?

ఇప్పుడు GST, నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం కారణంగా మొదటి నాలిగింటినీ 

వదిలేసాను బావ
బావా! బావా!

ఏమే మరదలు పిల్ల?


మా అక్కనస్సలు నమ్మకు బావా!


సంగతేంటే వరదలాటి మరదలా ?


నువ్వే నువ్వే నాక్కావాలి బావా!


ఒక వరలో రెండు కత్తులు ఇమడవే మరదలా!


అయితే పాత కత్తిని పారేయ్!


కొత్త చీపురుతో ఇల్లు శుబ్రమవదు సరికదా, చీపురు చెత్త కూడా ఇంటిని నింపుతుందే మరదలా!


బావా! అయితే నేనంటే మీకిష్టం లేదా!?


మరదలు బంగారం! 


నాకిష్టమైన వాళ్ళ జాబితా లో నువ్వు కూడా వున్నావ్, కాని నా వ్రాణం మీ అక్క మాత్రమే తెలుసా!

సరే బావ! నేనోడినాను, మా అక్క గెలిచింది!


అసలేమౌతోందో?


మా అక్క "మా ఆయన శ్రీరామ చంద్రుడూ" అంది!


నేనన్నానూ "కాదని నిరూపిస్తా"


పందెమేమిటో?


నేను గెలిస్తే నువ్వు నా స్వంతం, 


మా అక్క గెలిస్తే మా అమ్మా, నాన్న మీ స్వంతం! 

సరే బావా! ఓ గంటలో మా అమ్మా నాన్నా, నేను( నా పెళ్ళయ్యేవరకూ ) మీ ఇంటికొచ్చేస్తాము!

--((**))--

సేకరణ


వేదం ఇలా చెబుతోంది.


“స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయ్యేవ మార్గేణ

మహిం మహీశాః | 
గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినోభవంతు | అపుత్రాఃపుత్రిణఃసంతు |
పుత్రిణస్సంతుపౌత్రిణః |
లోకావుయం క్షోభారహితః |
అధనాః సాధనాః సంతు | జీవన్తు శరదాశ్శతమ్||”

“పాలకులు ప్రజలను న్యాయమార్గమున ధర్మబద్ధంగా పరిపాలించుగాక! గోసంతతికి పండితులకు శుభం కలుగుగాక! సంతతి లేనివారికి సంతతి కల్గుగాక! సంతతి వున్నవారికి మానుమ సంతతి కల్గుగాక! ప్రపంచం శాంతితో నిండియుండుగాక! దరిద్రులు ధనమూ పొందుదురుగాక! అందరూ ఏ ఆపదలు కల్గియుండక నూరు సంవత్సరాలు జీవించుదురు గాక!” అని చెబుతుంది వేదం.


బౌద్ధమత ప్రచారకులు “దానధర్మం”తో జీవిస్తూ ధర్మప్రచారం చేస్తున్నారు. బౌద్ధసూక్తి మీకు తెల్సుగదా!


"బుద్ధం శరణం గచ్ఛామి!”

ధర్మం శరణం గచ్ఛామి !
సంఘం శరణం గచ్ఛామి!"

ధర్మాన్ని శరణు పొందుతున్నాను! సంఘాన్ని శరణు పొందుతున్నాను.బుద్ధుని (జ్ఞానాన్ని) శరణు పొందుతున్నాను. అంటూ ‘ధర్మయానం’ చేస్తుంటారు.


'ధర్మోరక్షతి రక్షితః’


“ధర్మాన్ని నీవు రక్షించితే ధర్మం నిన్ను సర్వదా రక్షిస్తూ వుంటుంది.” నీవు ఎపుడు ధర్మాన్ని నిర్లక్షం చేస్తావో ధర్మం నిన్నేపుడూ రక్షించదు.”


ధర్మాన్ని నమ్మాలి – ధర్మాన్ని ఆచరించాలి.


ధర్మాన్ని ఆశ్రయించాలి – ధర్మమార్గాననే నడవాలి. ధర్మాన్ని గౌరవించాలి.


“యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా!

అభ్యుత్దాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్||”

– అని చెప్పాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్ముడు.


అధర్మపరులను అధర్మంతో ఎదుర్కొనవచ్చు. తప్పుగాదు. ధర్మపరులను అధర్మంతో దెబ్బతీయకూడదు. ఇది పాపకార్యం. ఋతుధర్మంవల్లనే వర్షాలు వస్తున్నాయి. చెట్లు పండ్లు ఫలాలను ఇస్తున్నాయి. కాలధర్మం వల్లనే మనిషి మరణిస్తున్నాడు. సంయోగ ధర్మంవల్లనే మళ్ళీ జన్మిస్తున్నాడు. ‘ధర్మోరక్షతి రక్షితః'


ప్రణయ రాయబారం !
--------------------------------
కావ్యరచన ఒక శిల్పం. తిక్కనకూడా ఇదేమాట యన్నాడు." అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునన్ బారగుడన్ అన్నాడు. (చూ: భారతం విరాటపర్వం అవతారిక) అనల్పరచనా విన్యాసమే శిల్పం. అట్టిరచనతో రసజ్ఙులను మెప్పించిన కవులరుదు. అట్టివారిలో ప్రథమ గణ్యుడు శ్రీనాధుఁడు.
అతని రచన లనువాదములే ! అయిన నేమి ?స్వతంత్ర రచనలను దలపింపఁజేయును. నిజమారసినచో అనువాదము బహు కష్టమైనపని. మూలాను సరణము చేయక తప్పదు. ఇక యనువాదకుని ప్రతిభ కనఁడునవకాశములెవ్వి? అయినను శ్రీనాధరచనలు అనువాదములే యైనను స్వతంత్రగ్రంధముల వలెభాసించు చున్నవి.దానికాతని ప్రతిభా వ్యుత్పత్తులే కారణమనక తప్పదు.
ఆంధ్ర సాహిత్యమున కొన్ని వింతలున్నవి. అట్టివానిలో తిర్యక్కులైన పక్షులొనర్ఛిన ప్రణయ రాయభారములు. పేర్కొన దగినవి .శృంగార నైషథములోని హంస రాయభారము మొదటిది.కాగా పింగళిసూరనగారి ప్రభావతీ ప్రద్యుమ్నములోని శుచిముఖియను చిలుక రాయభారము రెండవది. మనమిప్పుడు హంసరాయభారమును తెలిసికొందము.
నైషధమున హంస ప్రణయ రాయభార ఘట్టము రసజ్ఙుల మన్ననల నందుకొన్నది. అదిమామూలు పక్షికాదు.మాటలు నేర్చిన పక్షి! మనుజుల హృదయాలలో మరులు నింపఁగల దిట్ట. నిషధ రాజు ఉద్యావమున నతనిచే బట్టువడి యతవినిని మాటలతో మెప్పించి యాయందగానికి తగిన యందగత్తె కుండిన పురాధీశుని కుమార్తె దమయంతియేనని యామెసౌందర్యమును బొగడి నలున కామెపై ప్రేమరగిల్చి, వారిరువురకు పెండ్లి గూర్చెద నని నమ్మబలికినది. తోడనే పెండ్లిండ్ల పేరయ్యవలె కార్యాచరణమున కుపక్రమించినది.
నిషధ లోనెగిరి , విదర్భలో దమయంతి యంతః పురమున వ్రాలినది. రమణీయమైన దానినడకలకు ముచ్చట పడి దమయంతి చెలికత్తెలచే దానిన తెప్పించినది. ఇక నక్కడితో దాని చాతుర్యము ప్రారంభమైనది. "ఏమమ్మో! దమయంతీ! నేను చతుర్ముఖుని వాహనమగు హంసను. మంచివారితో స్నేహమే నానైజము. నీకు మహదుపకారమొనర్ప కుతూహల మగుచున్నది. నాసామర్ధ్యమును తక్కువగా నెంచకుము.
మ: స్మర వాత్స్యాయన కూచిమార కృత శాస్త్ర గ్రంధ సందర్భముల్
పరిశీలించిన వాఁడ; దంపతుల కుత్పాదింతు సారస్యముల్ ;
మురి పంబొప్పగ మంద మంద గమనంబుల్ నేర్పుదున్ మేదినీ
శ్వర శుధ్ధాంత నితంబినీ జనులకున్ ; సంపూర్ణ చంద్రాననా!
శృం: నైషధము 2 ఆశ్వా 56 పద్యం ; శ్రీనాధమహాకవి;
నాకు మన్మధశాస్త్రృసంబంధమైన విషయాలన్నీ తెలుసు. ఆలుమగల మధ్య యనురాగ మును పెంపుజేయు సామర్ధ్యము గలవాఁడను. అంతఃపుర కాంతలకు మంద గమనంబులను నేర్పు సామర్ధ్యము గలవాడను. నన్ను తక్కువగా నెంచబోకుమీ? అవును నీకు ఉపకారమేదైన చేయవలె ననుకొంటిని గదా!
కన్నియలకు ప్రియమైనదేమైయుండును? వేరేమి యందాల మగడే గదా!'కన్యావరయతేరూపం'. ఆహాఁ! గుర్తువచ్చినది. అందాల రాకుమారీ! నీకొఱకొక యందాల రాకుమారుని వెదకి యుంచితి నమ్మా! నిషధ నేలు నలుఁడే నీకు తగిన భర్త. ఆయందము. ఆవైభవము నింతింతని యనజాలము.నీభాగ్యము పండినదిలెమ్ము. నలుని వరించి తరింపుము. బ్రహ్మకు సరూప ఘటన చేయజాలని వాడను నపనింద గలదు.దానిని తొలగింప గోరి యతడేమీ యిరువురకు సంగతిని కూర్చుటకు నిర్ణయించినాడమ్మా ! నామాట నమ్ముము. నేడోరేపో ప్రకటింపగలఁడు.
చ: అడిగితి నొక్కనాడు ,కమలాసను తేరికి వాహనంబ నై
నడచుచు , నుర్విలో నిషధ నాధున కెవ్వతె యొక్కొ భార్యయ
య్యెడునని , చక్ర ఘోషమున నించుక యించుక గాని, యంత యే
ర్పడ విన నైతి ' నీవ యను చందము తోచెడి నమ్మ భామినీ!
శృం; నైష : 2ఆశ్వా 58 పద్యం -శ్రీనాధుఁడు;
హంస యెంత చమత్కారం చేసిందో చూడండి. " మేంప్రయాణంలో ఉండగా విరించిని స్వయంగా నేనడిగానమ్మా ఈధరలో నలునకు భార్యగా నెవరిని సృష్టించితిరని. మాయదారిమోత రథచక్రాలు నీవేనని చెప్పినట్లు గుర్తు.
ఉ: నిర్ణయ మానృపాలునకు నీకును సంగతి ; నెల్లి నేటిలోఁ
దూర్ణము సేయఁగా గలఁడు తోయజ సూతి ; తదన్యధా వృధా
దుర్ణయ వృత్తికిన్ మనసు దూర్చిన యేని ,జగజ్జనాపవా
దార్ణవ ముత్తరించుటకు నాతని కెయ్యది తెప్ప చెప్పుమా?
నీకు , నలునికీ బ్రహ్మముడి పడిపోయింది. తప్పించుకోవాలని జూచావో మధ్యలో బ్రహ్మగారి పరువు పోతుంది. బ్రహ్మ వ్రాతకు తిరుగు లేదు అనేమాట వట్టిదే నని ప్రజలు నిందిస్తే, ఆ అపవాద సముద్రమును దాటేందుకు బ్రహ్మకు తెప్పేది?దారేముంటుంది. అందువల్ల నలుని పెండ్లాడి బ్రహ్మ మాట నిలబెట్టవమ్మా! "- అంటోంది రాయభారి హంస!
మాటలతోనే సరిపెట్టక " నలుని మాత్రమే పెండ్లాడెద నని"- యామెచేత ప్రమాణమునుగూడ చేయించి తనమాటను నెగ్గించుకొన్నది హంస!
(శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యముతో, వివరణతో)


Photo

No comments:

Post a Comment