Sunday 3 June 2018

Pranjali Prabha (4-06-2018)

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం  

నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య...పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య

చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
నేపధ్య గానం: బాలు

పల్లవి:

నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వంతెన వేసిన దేవుడు నీవే చినరాయుడు నీవే
నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య

చరణం1:

గాలిలోన తేలే పరువాల పూలకొమ్మ
నేలవాలిపోగా చివురింపచేసినావే
పసుపుతాడుమీద లోకానికున్న ప్రేమ
మనిషి మీద లేదు ఈ నీతికెవరు బ్రహ్మ
తప్పవురా హేళనలు వేదనలే నీ హితులు
గుండెకు బండకు వారధికట్టిన
దేవుడి లీల ఇది కాకుల గోల

నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య

చరణం2:

నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుక
గూటిలోని చిలుక గుబులేదొ ఎవరికెరుక
నుదిటిమీద రాత వేరెవరు మార్చగలరు
న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు
ఒంటరిది నీ పయనం నిబ్బరమే నీకభయం
తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన
దేవుడి లీల ఇది కాకుల గోల

నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వంతెన వేసిన దేవుడు నీవే చినరాయుడు నీవే
నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య

నన్నయ అకాల మరణంపై ఒక కథనం.! 
(పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య... 1879 ) 
ననన్నయ తాను తలపెట్టిన భారతరచన ముగించక ముందే మరణించడానికి కారణం భీమన అను మహాకవియొక్క శాపము అని ప్రతీతి. ఆ కథనం ఇలా ఉంటుంది.. ’’భీమన ఇతఁడు భారతమును తెనిఁగించుటకు మునుపే ఒక భారతమును తెనుఁగున రచియించి ఆ గ్రంథమును నన్నయభట్టారకునివద్దకు కొనివచ్చి దానియందలి లోపములను పరిశీలించి రాజునకు చూపి తనకు సన్మానము కలుగఁజేయవలయును అని అడుగఁగా దానినతఁడు చదివిచూచి అందలి ప్రయోగపద్ధతులు మొదలగునవి మిక్కిలి శ్లాఘనీయములు అయి ఉండఁగా అది బయటవచ్చినయెడల తన భారతము అడఁగిపోవును అని ఎంచి ఆ యభిప్రాయమును బయలుపఱపక భీమకవితో నేను రాజు ప్రేరేఁపణచేత ఒక భారతము రచియించుచు ఉన్నాను. ఆదిపర్వముమాత్రము ఇప్పటికి అయినది. ఇప్పుడు ఈగ్రంథమును రాజునకు చూపిన యెడల తన ప్రయత్నము నెఱవేఱుటకు భంగముగా ఇది ఒకటి వచ్చెను అని తిరస్కరించునుగాని అంగీకరింపఁడు. కనుక సమయముచూచి నీ గ్రంథమును అతనికి చూపి సన్మానము చేయింతును అని చెప్పి అది తీసి తన ఒద్ద ఉంచుకొని, ఆయనను పంపి దానిని కాల్చివేసెను. ఈసంగతి భీమన ఎఱుఁగడు కనుక కొన్ని దినములు తాళి నన్నయభట్టారకుని యింటికివచ్చి అప్పుడు ఆయన ఇంటలేకపోఁగా ఆయన భార్యను పిలిచి నీ భర్త చేయుచు ఉన్న భారతము ముగిసెనా అని అడిగాడు. అంతట ఆమె ఆరణ్యపర్వము జరుగుచు ఉన్నది అని చెప్పెను. అది విని అతఁడు తనకు ఏసమాచారమును తెలియఁజేయకయే ఇతఁడు గ్రంథరచన జరపుచు ఉన్నాఁడు కనుక తన గ్రంథమును ముందుకు రానీయఁజాలఁడు అని తలఁచి, దానివలని సంతాపముచే ఇంకను ఆరణ్యములోనే పడి ఉన్నాడా అని అన్నాడు. అదియే శాపముగా తగిలి ఆ కాలమందు ఏమో పని కలిగి ఊరిముందరి అడవికి పోయి ఉండిన నన్నయభట్టారకుఁడు అక్కడనే దేహత్యాగము చేసెను.’’
భగవంతుని వైపు అడుగులు వెయ్యాలని తెలీక కొన్ని జన్మలు గడిచిపొతాయట,
ఆహార సంపాదన,ప్రాణరక్షణ..కామితాలతో..
జంతువులకూ అవే ప్రాధాన్యాలు...
84కోట్ల జీవరాశులలో ఉత్కృష్టమైన మానవజీవితానికి మాత్రమే భగవంతుని తెలుసుకునే ప్రఙ్ఞ ఉన్నది.
కోట్లనిధిని...తన ఇంటి(పునాదిలో)లో నిధిగా గల వ్యక్తి ..తెలియక..
బిచ్చమెత్తినట్టు..మనం భగవంతుని గురించి తప్ప ఇతర విషయాలకూ.. ఆకర్షణలకు లోనై...అఙ్ఞానంతో వృధాగా
సమయం గడిపేస్తున్నాం.
అఙ్ఞానం పోవాలంటే..ఙ్ఞానం సంపాదించడం ఒకటే మార్గం.
అది ఎంత తొందరగా మొదలైతే..
మనజన్మ సదుపయోగంగా మార్చుకున్నట్టే..
15సం.ల క్రితం నాకు వచ్చిన ఆలోచన- భగవంతుడు నాకు అడగకుండానే..అన్నీ..చాలామంచి జీవితాన్ని ఇచ్చాడు..
అయితే..ఇదేనా జీవితం ????(అప్పటికి నాకివేమీ తెలీదు..కబుర్లు ,సినిమాలు..అలా గడిపేసేదాన్ని)

దేమునికి ఒక ఉత్తరం రాసా...
నా భావాలను ...ఆ డైరీలో ఇప్పటికీ నా దగ్గరే ఉందా ఉత్తరం.
ఆ తరవాత కొన్ని నెలలలో నాకు గురువు దొరికారు...
ఈరోజు నేనేవ(న్నా చెప్పగలుగుతున్నానంటే..
మా గురువుగారు నాకు ఇచ్చిన భిక్షే.

అయితే నేను చెప్పేదేంటంటే..
మనం భగవంతుని వైపు ఒక్క అడుగు వేస్తే..
అతను మనవైపు పది అడుగులేసి..మనల్ని నడిపిస్తా
మన భారం అతనిపై వేసి..
మనం నిశ్చింతగా మన పనులు చేసుకోవడమే.
ఎంత ప్రశాంతంగా మనసు ఉంటుందో!!
నా స్థభాస్కరానంద
(శ్రీ భాస్కరానందగారు పెట్టిన పోస్టు కు నా స్పందనగా)
📢 *భీష్ముడు* 📢 

🌹 కవిః....విరించి🌹 

కురుకుల భూషణు డాతం 
డరివీర భయంకరుడు రణాదిత్యుండౌ 
కురువృద్ధుడు గాంగేయుని 
సరిరాగల ధీరుడెవడు జగడము లాడన్ 

భీషణ ప్రతినను జనకుని 
కోసము చేసిన యనఘుడె కురుకుల మందున్ 
జేసెను త్యాగము రాజ్యము 
నాశయ మించుక విడువక యస్త్రమువిడిచెన్ 

తండ్రి సుఖమును గోరుచు తాను పెండ్లి 
మాని రాజ్యరక్షకుడైన మాన్యుడతడు 
కురుపితామహుడంచును కువలయమున 
మన్ననలవొందె భీష్ముండు మిన్నగాను 

వీడె యస్త్రములనతడు పేడి ముఖుని 
గాంచి ధర్మరక్షణ గోరి కదనమందు 
విజయమొందగ వలెనంచు వీరుడైన 
ఫల్గుణుడను దీవించెనా బ్రహ్మచారి 

రాజు లెవరైన రక్షింతు రాజ్యమనుకు 
రక్షకుడ నగుదు ననుచు ప్రతిన జేసి 
దుర్మతులదురితమ్మును దూరనట్టి 
ప్రతిన పాలకుండతగాడు భారతమున 

మంజరీ ద్విపద:-మంజరీ ద్విపద:-
-------------------
సకల ప్రాణుల గాచు సర్వేసుకొండ !
నిరతంబు గాచేటి నిరజుని కొండ !
అండ అండగ నుండె ఆప్తుని కొండ !
శేషాచల విభుఁని శేషాద్రి కొండ
-----------------
సకల ప్రాణుల గాచు సర్వేసుకొండ !
నిరతంబు గాచేటి నిరజుని కొండ !
అండ అండగ నుండె ఆప్తుని కొండ !
శేషాచల విభుఁని శేషాద్రి కొండ !

"ఎంకి లాంటీ పిల్ల ,".............................డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ
ఎంకి లాంటీ పిల్ల ,
యేడ లేదుర మల్ల !
ఎంకి నోదిలీ నే ,
నేడ కెల్లను మల్ల ! 2 !
వరి సేను కాడకీ ,
వడి వడి గ వత్తాది !
సరసాల పూలతో , (ఊసుతో),
గుస గుసలు పోతాది !
ఎంకి లాంటీ పిల్ల ,
యేడ లేదుర మల్ల !
ఎంకి నోదిలీ నే ,
నేడ కెల్లను మల్ల !
నారు మడి పోసాక ,
నా వంక జూసింది !
సీరా సెంగూ దీసి ,
సెమటద్ది నవ్వింది !
బువ్వ తిని నేనేమొ ,
బుగ్గట్టి గిల్లాను !
సిగ్గు సిగ్గంటూ నె ,
సేయట్టి లాగింది !
రోసమేదంటూ ,
మీసాలు తడిమింది !
కోపమొ ద్దంటూను ,
గోముగా పలికింది !
ఎంకి లాంటీ పిల్ల
యేడ లేదుర మల్ల
ఎంకి నోదిలీ నే
నేడ కెల్లను మల్ల
నీరెట్టు మావా ,
నారెండి పోతాది !
నోరెళ్ళ బెట్టేసి ,
నాకేసి సూడొద్దు !
నాకేసి సూడొద్దు ,
నోరెండిపోతాది !
నీరెట్టు మామా ,
నేపోత నింటిక ని ,
పరుగు పరుగున ఎంకి ,
వురికెత్తి పోయింది !
వూపిరాగీ నేను ,
వుదికెత్తి పోయాను ...!
ఎంకి లాంటీ పిల్ల ,
యేడ లేదుర మల్ల !
ఎంకి నోదిలీ నే ,
నేడ కెల్లను మల్ల !
ఎంకంటే ఎంకిరా !
ఎగిసేటి సోకురా !
మురిసేటి మొలకరా !
పులకించు పూతరా .!.....ఎంకటే ....ఎంకిరా !!
🌞గురువు అవసరం ఏమిటి?.🌞

ప్రతి జీవి పరిపూర్ణత పొందాలి. మన వర్తమాన స్థితి, మన పూర్వ కర్మ, మన పూర్వాలోచన మనకు పరిపూర్ణత అందజేస్తుంది. అలాగే మన భవిష్యత్తు అనేది మన ప్రస్తుత కర్మలకు, భావములకు ఫలితం. ఈ కర్మలను, భావములను సక్రమమైన మార్గంలో నడిపించడానికి ఒక ఉద్దీపన శక్తి కావలసి వుంటుంది. ఆ ఉద్దీపన శక్తి లభించినప్పుడు ఆత్మ శక్తి సామర్థ్యాలు ఉద్దీపన చెందుతాయి. పారమార్థిక జీవితము ప్రబోధాన్ని పొందుతుంది. అభివృద్ధికి చురుకు కలుగుతుంది. అంత్యమున మానవుడు పావనుడై పరిపూర్ణత పొందుతాడు.

గ్రంథ పఠనం వల్ల సాధ్యం కాదు

ఆత్మ శక్తి సామర్థ్యాలను ఉద్దీపన చేసే శక్తిని పుస్తకాల నుంచి పొందలేం. ఒక ఆత్మ ప్రేరణ పొందాలంటే మరో ఆత్మద్వారానే సాధ్యమవుతుంది. దీనికి మరో మార్గం లేదు. యావజ్జీవం గ్రంథ పఠనం చేసేవారు, మహా పండితులు కూడా ఆత్మను ఉద్దీపన చేసే శక్తి సహాయం పొందలేకపోతే ఆత్మ వికాసం పొందలేం. గ్రంథాలను, పురాణాలను పఠనం చేయడం వల్ల మనం ఆత్మవికాసం పొందుతూ వుంటామని అనుకుంటూ వుంటాం. కానీ అది కొంతవరకే నిజం. గ్రంథ పఠనం వల్ల కలిగే ప్రతిఫలాన్ని పరిశీలించినట్టయితే, గ్రంథ పఠనం వల్ల మనకు కొంత ధైర్యం వస్తుందనే మాట మాత్రం వాస్తవం. అయితే అంతరాత్మకు మాత్రం ఒరిగే ప్రయోజనం మాత్రం అంతంత మాత్రమే. ఆధ్యాత్మిక విషయాల గురించి అద్భుతంగా మాట్లాడగలగే వ్యక్తుల కూడా అనుష్ఠానానికి, నిజమైన పారమార్థిక ఆచరణలకు వచ్చేసరికి వెనకబడిపోతూ వుంటాడు. దీనికి కారణం ఆ వ్యక్తి ఆత్మకు మరో ఆత్మ నుంచి తగిన ప్రేరణ శక్తిలభించకపోవడమే.

మరి అలాంటి ప్రేరణ శక్తి మన ఆత్మలకు అందించే మరొక ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ ఎవరిదో కాదు.. గురువుది. ఇలాంటి ప్రేరణ శక్తిని ప్రసరింపజేసే వ్యక్తి గురువు. ఆ శక్తిని స్వీకరించేవారు శిష్యులు. గురువు ఈ ప్రేరణ శక్తిని ప్రసరింపజేసే శక్తిని కలిగి వుండాలి. అలాగే శిష్యుడికి కూడా ఆ శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా వుండాలి. ఎలా వుండాలీ అంటే, విత్తనం నాటితే మొలకెత్తించడానికి సిద్ధంగా వుండే సారవంతమైన భూమిలా వుండాలి. అప్పుడే గురువు అందించే శక్తి ఆ వ్యక్తిలో బీజంలా పడి, సాధన ద్వారా భవిష్యత్తులో మహా వృక్షమవుతుంది.

గురువులేని విద్య గుడ్డి విద్య :

గురువు నుంచి తత్వాన్ని గ్రహించే శిష్యుడు తాత్కాలికావేశాన్ని, భావావేశాన్ని పొందుతూ వుంటాడు. అదే జ్ఞానమని భ్రమపడుతూ వుంటాడు. గురువు శిష్యుడి వెంటే వుంటూ, అతనిలో కలుగుతున్న భ్రమలను గమనించి, వాటిని అతని నుంచి దూరం చేయడానికి తనవంతు సహాయం అందిస్తాడు. గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు కదా.. ఆత్మజ్ఞానం అనే విద్యను నేర్చుకోవడానికి గురువు తప్పనిసరిగా అవసరం. ఈ జ్ఞాన మార్గంలో గురువు దీపంలా ఉపయోగపడతాడు. ఈ మార్గంలో గురువు లేకుండా ప్రయాణించడం అంటే, చీకటిలో చేతిలో దీపం లేకుండా ప్రయాణించడంతో సమానం.

No comments:

Post a Comment