Thursday 7 June 2018

Pranjali Prabha (13-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:  శ్రీ కృష్ణాయనమ: 


ఆనందం - ఆరోగ్యం  - ఆధ్యాత్మికం  


ప్రాంజలి ప్రభ -
11. Simplify : 57934 x 9999 =
12. Simplify: 12345 x 999 =
13. Simplify : 839478 x625 =
14. Simplify: 505 x 505 =
15. Simplify: 1605 x 1605 =
16. Simplify:495 x495 =
17. Simplify: 1595 x 1595 =
18. Evaluate: 213 x 213 + 113 x 113 =
19. Evaluate: 313x313 + 287 x287 =,
20. Evaluate: 313x313 - 287 x287 =

--((*))--

ఆన్సర్స్

11. Simplify : 57934 x 9999 =
57934 (1000-1) , 57934000 – 57934 =59876066

12. Simplify: 12345 x 999 =
12345(1000 – 1) , 12345000 – 12345 =12332655

13. Simplify : 839478 x625
= 839478 x 54 = 8394780000 / 16 = 524673750

14. Simplify: 505 x 505 =
(505)2, = (500+5)2 ,= 5002 + 52 + 2x500x5
=2500+25+1000= 3525

15. Simplify: 1605 x 1605 =
(1605)2 , =(1600 + 5 )2, =(1600)2 + 52 +
2x1600x5
=2560000+25+16000=2576025

16. Simplify:495 x495 =
(500)2, = (500-5)2 ,= 5002 + 52 - 2x500x5
=2500+25-1000=

17. Simplify: 1595 x 1595 =
(1595)2 , =(1600 - 5 )2, =(1600)2 + 52 - 2x1600x5
=2560000+25-16000=2400025

18 Evaluate: 213 x 213 + 113 x 113 =
(213)2 + (113) 2= ½ {(a+b)2 + (a-b)2}
½ (213 +113)2 + (213-113)2 = ½{(326)2+(100)2)
=(106276+10000)/2 = 1630000

19 Evaluate: 313x313 + 287 x287 =
(313)2 + (287) 2= ½ {(a+b)2 + (a-b)2}
½ (313 +287)2 + (313-287)2 = ½{600)2 +(26)2
=1/2 (360000 +676) =180338

20. Evaluate: 313x313 - 287 x287 =
(313)2 – (287)2 = (313+287) x
(313-287)=600x26=15600
--((*))--
రోజు కొన్ని నేర్చుకుందాం - నూరు శాతం విజయం సాధిద్దాం

నేటి హాస్యం 

భార్యలు చెప్పిన మాట వినాలంటే...... 
మనసుకు నచ్చినట్లు వుండాలంటే.... 
అటువంటి భార్య దొరకాలంటే .... 
"పత్నీం మనోరమాం దేహి మనో వృత్తానుసారిణీమ్, 
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్ "..... 
అని రోజూ 108 సార్లు చేయాలి .... 
మంత్రాలకి చింతకాయలు రాలుతాయాఅంటే 
మాఇంట్లో రాలలేదు(చెట్టులేదు.).. 
కానీరాలుతాయి..


నేటి హాస్యం

భర్త : ఏమిటే తలుపు వేసావ్
భార్య : ఏమిటి నీకు వాడ్సప్ సుందరి కావాల్సి వచ్చిందా
భర్త : అదికాదే
భార్య : ఇదిగో ప్రూఫ్
భర్త : ఇది సెల్ కదా
భార్య : అవును ఆ లిప్ స్టిక్ ముద్రలు చూడండి
భర్త : ఆ ఈ రోజు నాకు పస్తా
bharya : ఆ అంటూ తలుపు తీసే 
నేటి హాస్యం :

భార్య: ఏవండీ కొంచం డిఫరెంటుగా ఉండాలని ఉంది
భర్త : కొంపలు తీయటానికి నగ్నంగా ఉండాలను కోవటం లేదుకదా
భార్య: ఛీ పాడు అవేమాటలండీ
భర్త : నన్ను చంపక డిఫరెంట్ అంటే ఎలా ఉంటావో చెప్పవే
భార్య: బ్యూటీ పార్లర్ నుండి వచ్చాక చూసి చెప్పండి
భర్త: సరే వెళ్లి త్వరగా రా రా
పోలీసులు ఒక పిచ్చమ్మాయిని తీసుకు వచ్చి ఈ పిల్ల మీ ఆవిడ అంటుంది
నిజమా సార్
ఛీ ఛీ ఈవిడ నా భార్య ఏమిటి తీసుకెళ్లి నాలుగు తన్నండి అప్పుడు నిజం చెపుతుంది
పోలీసులు వెళ్లి పోయారు
భర్త : కొంపతీసి ఇది నా భార్య డిఫరెంట్ రోలు కాదు కదా
         అంటూ ఒకటే పరుగు పోలీసుస్టేషన్ కు .......  .......
 కిడ్న్యాప్పర్లు ....."సదేహం " గాడికి ఫోన్ చేసారు !!!
"నీ భార్య ని మేము కిడ్నాప్ చేసాము ...
మేము అతి కిరాతకులం....
నీకు నమ్మకం కలగ డానికి....
ఆవిడ చేతి వేళ్ళు రెండు నరికి పంపిస్తున్నాము ...
డబ్బు సిద్ధం చెయ్యి" అని
"నాకు నమ్మకం కుదరడం లేదు...
వేళ్ళు కాదు....
తల పంపించండి..
నమ్మడానికి ట్రై చేస్తాను" అన్నాడు "సందేహం"

సరదాగా తీసుకొవాలండొయ్ !..మరి!
"ఎవరికైనా కోపం వస్తుంది...మరి!!"
"ఏవండీ !! కొంచెం డిఫరెంటు గా ఉంటుందని ...
ఇప్పుడె బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తున్నాను!!" అడిగింది ''మిర్యాల వల్లి"
భర్త.."లవంగం" ....ఎగాదిగా చూసాడు భార్య ని !!
"ఓహో!!....
ఈ రోజు కూడా బ్యూటీ పార్లర్ మూసేసి ఉందా??" అన్నాడు "లవంగం"!!

గదిలో

నలుగురుంటారు ఏమీ అనిపించదు
ఒకడు రాగానే అంతా మారిపోతుంది
వాతావరణంలో వసంతం ప్రవేశిస్తుంది

కాంతికి వెలుగొస్తుంది
మాటలకి యవ్వనమొస్తుంది
రక్త ప్రసరణ మహానదిలా సాగుతుంది

మళ్ళా అతనొక్కడే
అట్టే తేడా లేదు

సున్న పక్కన నిల్చొని
ఓ మహా సంఖ్యను స్రుష్టిస్తాడు
అనంత శూన్యాన్ని శక్తితో నింపేస్తాడు

ఆరిపోయిన దీపాలు శిరసెత్తుతాయి
సకల లోకాలు
అతని ఆలింగనాన్ని కోరతాయి

ప్రేమతో పుష్పవ్రుష్టి కురిపిస్తాయి
అధినాయకుడని కీర్తిస్తాయి

అటవీ దేవదారుల్లోకి
కొత్త రుతువొచ్చి
ఊయలలూగుతుంది

మోడువారిన నితంబ వ్రుక్ష శాఖల
చిగుర్లలోకి
కోయల వచ్చి
కూర్చుంటుంది

మైదాన మంతా ఆలివ్ గ్రీన్ రంగు
కప్పు కుంటుంది
చలికి వణకదు
భయానికి చలించదు

-((*))--

మా అమ్మ గారు మాకు చెప్పిన పద్యం!
.
ఎన్ని కష్టాలు ఆయెన నవ్వు తో ఓర్చు కోవాలి .. పాండ వలు వలే
.
"రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో డాగినన్
పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్
గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్
లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా !--
.
రాక, పోక, కాక, లేక మానని విషయాల గూర్చి అనెవారు.

చకారకుక్షి!
,
కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అనేవాడట. దానిపరిణామక్రమం తెలిసికుందాం!
భారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంతపెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు చకారం యెక్కువగా వాడారట!
అదీ కాళిదాసు ఆయన్ని చకార కుక్షి యంటానికి కారణం.
కాళిదాసు విశ్వనాథుని దర్శంచేందుకు ఒకపర్యాయం కాశీ వెళ్ళాడు.
అక్కడ ఒకపరిచాయకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం వద్దకు తీసికెళ్ళి " వీరు వ్యాసులవారు" అనిపరిచయం చేస్తూ విగ్రహం చూపారట.
కాళిదాసు" ఓహో వీరా ఆచకారకుక్షి " అంటూ విగ్రహం బొడ్డులోనికి తన వేలు దూర్చారట. అంతే ఆవేలు యిరుక్కుపోయింది.
కాళిదాసు ఆశ్చర్య పడుచుండగా ఆవిగ్రహంనుండి " మనవడా! నాపొట్టలో చకార లెక్కువ ఉన్నాయని నన్నాక్షేపిస్తున్నావుగదా! ద్రౌపది పాండవులు వారి బంధుత్వాలను గురించి చకారం లేకుండా ఒక్క శ్లోకంచెప్పు,? చెప్పావో నీవేలూడుతుంది. అన్నాడట.
కాళిదాసు వినయంగా తలవంచి" తాతగారూ! నాకుమీరంటే చాలాఅభిమానం.ఊరక యేదోవేళాకోళానికల్లా అన్నాను గానీ మరేదీ గాదు. మీవలెశ్లోకం వ్రాయటం నాచేతనౌతుందా? అయినా ప్రయత్నిస్తాను. ఆశీర్వదించండి" అనిపలికి -
శ్లో: ద్రౌపద్యా ః పాండుతనయాః
పతి ,దేవర, భావుకాః,
నదేవరో ధర్మరాజః
సహ దేవో నభావుకః; -
అని వెంటనే ఒకశ్లోకం చెప్పారట. నెచ్చుకుంటున్నానయ్యా!
నీపాండిత్యానికి, చిరాయుష్మాన్భవ! అని ఆశీర్వదించారట.
కాళిదాసు వేలు బయట పడింది.
ఇంతకీ దీనికి అర్ధంయేమిటి అని మీసమదేహంకదూ!
చెపుతా వినండి.
" ద్రౌపదీ దేవికి పాండవులతో భర్త, మరది , బావగారు, అనేమూడురకాల బాంధవ్యాలున్నాయి. ధర్మరాజు మరదికాడు , సహదేవుడు బావగాడు"
అనిదీవియర్ధం! చూశారా కాళిదాసు ప్రతిభ!
కాళికా వర ప్రసాదిగదా ఆతవికి యిక తిరుగేది?

ప్రాంజలి ప్రభ

కమ్ము కుంటున్న రాక్షస మాయను తొలగిస్తూ
కాలంతో పోటీపడ్తూ సంతానం కోసం కౌసల్య, సుమిత్ర, కైకేయిని వివాహమాడి
కిన్నర, కింపురుష, సమస్త దేవతలు దీవించగా దశరధ మహారాజు రాజ్యమేలే
కీలకమైన నిర్నయాలతో పుత్రులకోసం పుత్ర కామేష్టి యాగం చేసే
కుల పెద్దలను, బ్రాహ్మణులను పిలిపించి యజ్ణ యాగాదులు చేయించే
కూలంకుఫముగా యాగాలు చేయగా అగ్నిగుండంనుండి యజ్ణ పురుషుడు ఆవిర్భవించే
కెంపులతో నిండిన పూర్ణకుంభ పాయసము అందించే
కేక వేస్తూ పాయసాన్ని పుత్రులకోసం రాణులు సమముగా పంచుకొనె
కైక మాత్రము అతి ప్రేమ వలక పోస్తూ అక్కలతో వంత పలికే
కొంత మంది దేవతలు తమ అంశలుగా భూలోకమున జన్మించే
కోలాహలముతో అయేధ్యా నగర మంత సంబరపడే
కౌమారదశలో వారు అతి ఉత్సాహము వెళ్ళబుచ్చిరి
కందోళ రాగంలో సంగీత న్రృత్య పదర్శనలు జరిపే
కః కుః అంటూ సమస్త జన సమూహము సంబరములు జరిపె

ఇది గుణింత రామక్రృష్ణ రామాయణం

ఒక సంఘటన - రెండు కోణాలు
****************************
ఆఫీసు గది
ఇద్దరి పెళ్ళైన మహిళల సంభాషణ
మహిళ నం 1 :నిన్న సాయంత్రం నాకు భలే గడిచింది , మరి నీకో
మహిళ నం 2 :నాకు ఘోరంగా జరిగింది , మా ఆయన ఇంటికి రావడం మూడు నిమిషాల్లో సుష్టుగా భోంచెయ్యడం , రెండు నిమిషాల్లో పడుకోవడం జరిగిపోయింది , నీ సంగతి చెప్పు
మహిళ నం. 1 :మా ఆయన రావడంతోనే నన్ను బయటకు డిన్నర్ కు తీసుకెళ్ళారు, దిన్నర్ తరువాత ఒక గంట అలా వెన్నెలలో చల్లగాలికి నడుచుకుంటూ వచ్చాం , ఇంటికి రావడంతోనే ఇల్లంతా కొవ్వొత్తులు వెలిగించి భలే వుందనుకో వర్ణించనలవి కాని అనుభూతి.

అక్కడ వీరిద్దరి భర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి.
మగాడు నం 1 : నిన్న సాయంత్రం ఎలా జరిగింది/
మగాడు నం 2: గొప్పగా వుంది , ఇంటికి వెళ్ళడంతోనే టేబుల్ మీద అన్నం రడీగా వుంది , చక్కగా భోంచేసి,హ్యాపీగా పడుకుండిపోయాను.
మగాడు నం 1:నాకు చుక్కలు కనిపించయిరా, నేను ఇంటికెళ్ళేసరికి భోజనం లేదు , కరంట్ బిల్ కట్టడం మర్చిపోయినందు వల్ల కరంట్ లేదు , మా ఆవిడను తీసుకుని హోటల్ కు వెళ్ళా , అది కాస్ట్లి హోటల్ వచేటప్పుడు ఎందుకు టాక్సీ కి డబ్బులు దండగని మా ఆవిడతో కబుర్లు చెపుతూ ఇంటికి నడిపించుకుంటూ తీసుకొచ్చా , ఇక ఇంటికొస్తే కరంట్ లేదు ఇంటిలోని కొవ్వొత్తులన్నీ వెలిగించి పోర్టికోలో పడుకున్నాం :)
కధలోని నీతి : సమయానుకూలతకు తగ్గట్టు స్పందించడం తెలియకపోతే పెద్ద చిక్కే. :)
ర్మానుగో గచ్ఛతి జీవ ఏకః” కర్మ ఒక్కటే జీవిని అనుసరించును.!
.
ఎన్నాళ్ళు ఉండేదేవు
ఇహ సుఖములలో ..
కొన్నల్లె కద మనసా.
పోయేనాడు వెంబడి రాదు పూచిక పుల్లేనా..అన్నారు.
.
నావి అనుకోన్నవేవి మనవెంట రావు, మనం చేసిన మంచి,చెడుల కర్మ ఫలం ఒక్కటే మన వెంట వస్తుంది. అని తెల్పే మంచి సుభాషితం వంటి చాటువు యిది.
.
“ ద్రవ్యాణి భూమౌ, పశవశ్చ గోష్టే, భార్యా గృహ ద్వారి, జన శ్మశానే,/
దేహశ్చితాయాం, పరలోక మార్గే ‘ కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః” //
.
మనం మరణించి నపుడు – “ రాత్రి,పగలు కష్టపడి సంపాదించిన
సంపదలు భూమి మీదనే ఉండి పోతాయి, పశువులు కోష్టం అంటే ‘పశువుల పాక’ అందులోనే ఉంటాయి, ఎంతో ప్రేమగా చూసుకొన్న భార్య ఇంటి ద్వారం వద్దే ఉండి పోతుంది, ( హిందూ సంప్రదాయం లో స్త్రీలు శ్మశానానికి రాకూడదు.) ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించిన ఈ దేహం చితిలో కాలిపోతుంది.
మనం చేసిన కర్మ ఫలం ఒక్కటే మనవెంట వస్తుంది.” కనుక మంచి కర్మలు(పనులు) చేసి ఉత్తమ గతులు పొందాలని పై శ్లోకం హెచ్చరిస్తుంది.తస్మాత్ ‘ జాగ్రత, జాగ్రత’.
శకుని .!
.

కౌరవ సార్వభౌముని మేనమామ. దుష్టచతుష్టయంలో ప్రముఖపాత్ర శకునిది. శకునిని కౌరవులకు ఆత్మీయుని జేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి.
ఘోషయాత్ర పరాభవానంతరం దేహత్యాగానికి సిద్ధపడిన అల్లునితో శకుని - ఓ దుర్యోధన సార్వభౌమ! పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరు, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ సౌఖ్యం, గొప్పదనం చేకూరుతాయి అంటాడు.
ఈ బోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్న మహాభారత సంగ్రామం జరిగెడిది కాదు గదా?
శకుని వంటి కుటిలస్వభావుని చరిత్ర గురించి తెలియని ఆంధ్రుడు లేడంటే ఆశ్చర్యపోనక్కరలేదు. శకునిలాంటి వ్యక్తులను మనం నిత్యం జూస్తూనే ఉంటాం. అసూయాద్వేషాలు, కలహాలు, కుటిలబుద్ధులకు వీరు ఉనికిపట్టులు. ధర్మపక్షమున వీరెన్నటికీ చేరరు. హితము చెప్పుట వీరి చేతగాని పని. కుల్లిన హృదయమున్న చోటనే కుటిలస్వభావులు చేరుదురు. చెడు మార్గమున నడిపేందుకు, వెనుదిరుగుటకు వీలులేకుండా చేయుదురు. కుటిలస్వభావుల సాంగత్యం తాత్కాలికలాభము గూర్చినను శాశ్వత నష్టమును కల్గించును. మానవస్వభావమున అసూయా ద్వేషములున్నంతకాలం, మానవునికి మానవునికి మధ్య కలహం కొనసాగుతున్నంత కాలం సమాజమున శకునులు చిరంజీవులు!
శకుని సుయోధనునికి మేనమామ. బాంధవ్యమును బట్టి కౌరవపక్షమున నుండవలసినవాడే. కాని శకునిని, కౌరవుల కంత ఆత్మీయుని చేసినది అతని బాంధవ్యము గాదు, కుటిలబుద్ధి. ఆ కుటిలబుద్ధి నుండి పుట్టిన ప్రియవాక్కు మాయాద్యూతము.
రాజసూయమున పాండవుల వైభవమును చూచి అసూయపడి ఒకరితో చెప్పుకొనలేక తానోర్చుకొనలేక కుమిలి క్రుశించిపోవు దుర్యోధనునితో శకుని,
"భానుప్రభులగు పాండుమహీనాథాత్మజుల లక్ష్మి యెల్లను నీకున్
నేనపహరించి, యిత్తు ధరానుత మాయాదురోదరవ్యాజమునన్"- అన్న మాట నిల్పుకొన్నాడు. ఈ మాయాద్యూతము తోడనే శకుని మహాభారతమున వెలుగులోనికి వచ్చినాడు. దుష్టచతుష్టయంలో సుయోధనుని హృదయమున సుస్థిరస్థానమేర్పరచుకున్నాడు.
ఘోషయాత్ర:
పాండవులు ద్వైతవనసరోవరతీరంలో ఉన్నారని, వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను, విశేషించి పాండవపట్టమహిషి అయిన ద్రౌపదిని, తమ అనంత సంపదల విలాసాల ప్రదర్శనంలో వెక్కిరించి, వారు మనసులో కుమిలిపోయేటట్లు చేసి తాము సంతోషించే దుష్టవ్యూహం పన్నింది చతుష్టయం. ఈ వ్యూహముల కర్త కర్ణుడు.
ద్వైతవనంలో ఉన్న గోవులు క్రూరమృగబాధకు గురి అవుతున్నాయనీ, తత్క్షణమే ప్రభువులు వాటికి రక్షణ కల్పించాలని నాటకమాడి మహావైభవంగా అట్టహాసంగా సకుటుంబ ససైన్యపరివారంగా, వంధిమాగధులతో మందీమార్బలంతో దుష్టచతుష్టయం ద్వైతవనం బయలుదేరారు. దీనికి ధృతరాషు్ట్రననుమతి సాధించినవాడు శకుని.
ద్వైతవనం చేరిన దుర్యోధనాదులు, కొంతకాలం మృగయావినోదం సాగించారు. పిమ్మట చిత్రసేనుడనే గంధర్వరాజు క్రీడార్థం కల్పించుకొన్న కొలను వద్దకు చేరి అందులో విహరించాలని తలచారు. కావలివారు హెచ్చరించినా లెక్కచేయక గంధర్వసేనతో యుద్ధానికి దిగారు. చిత్రసేనుడు మాయా యుద్ధనిపుణుడు. వేల గంధర్వసేన చుట్టుముట్టగా భీకర యుద్ధం జరిగింది. కర్ణుడు శక్తి కొలది ఒంటరిగా పోరాడవలసివచ్చినా, శత్రుసహస్రసంఖ్య గల గంధర్వసేన తాకిడికి నిలువలేక, రణరంగం నుండి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడింది. తుదకు దుర్యోధనుడు కూడా యుద్ధరంగంలో ప్రవేశించక తప్పలేదు. చిత్రసేనుడు దుర్యోధనుని రథం విరుగగొట్టి జుట్టు పట్టి లాగి పెడకేల బంధించి సింహనాదం చేశాడు. అతని ఆజ్ఞతో దుశ్శాసనాది భ్రాతృవర్గాన్ని, కౌరవుల భార్యలను, మంత్రులను బట్టి బంధించారు. కౌరవసేన చెల్లాచెదరై పారిపోయింది. యజ్ఞదీక్షితుడైన ధర్మరాజు వద్దకు దుర్యోధనుని మంత్రులు వెళ్లి జరిగిన కథంతా చెప్పారు. దుర్యోధనుని సకుటుంబంగా చిత్రసేనుని చెరనుండి విముక్తి కలిగించవలసినదిగా ధర్మరాజును ప్రార్థించారు.
భీమసేనుడు మిక్కిలి సంతోషించి కాగల కార్యము గంధర్వులే తీర్చారని, వనక్లేశాలనుభవిస్తున్న మనలను పరిహసించటానికి పన్నాగం పన్ని వచ్చిన ఆ పాపి తన పాపఫలం అనుభవిస్తున్నాడని దయార్హుడు కాడన్నాడు.
భయంకరశత్రువైనా శరణని వస్తే సంతోషంతో రక్షించాలి, ఇది దయామయుల తీరు, దీనికి ఏ ధర్మాలూ సరిగావని, అతడిని రక్షిస్తే పుణ్యం, కీర్తి కలుగుతాయని భీమార్జునులను ఒప్పించి, ధర్మరాజు గంధర్వులను ఎదుర్కొనమంటాడు.
ఇరువురూ గంధర్వులతో భీకరయుద్ధం సాగించి విజయులై సామరస్యంగా పెడరెక్కలు కట్టిన దుర్యోధనుని, ధర్మరాజు ఎదుట నిలుపగా, అతని దుష్టస్వభావాన్ని గంధర్వుడు, ధర్మరాజుకు వివరిస్తాడు. భీమునితో కట్లు విప్పజేసి, ఇటువంటి సాహసాలు ఇక ముందు చేయబోకుమని మందలించి దుర్యోధనుని నగరానికి సాగనంపుతాడు ధర్మరాజు.
దుర్యోధనుడు పాండవుల చేత విడిపింపబడి అవమానాన్ని, అపకీర్తిని భరించలేక, నగరానికి తిరిగిపోతూ మార్గమధ్యంలో -
"ఒవ్వనివారల ఎదురన్, యివ్విధమున భంగపడితి నేనింక జనుల్ నవ్వగ నేటి బ్రతుకుగా నివ్వసుమతి యేలు వాడ? నెట్లు చరింతున్"- శత్రువుల సమక్షంలోనే ఈ విధంగా మిక్కిలి పరాభవం పొందాను గదా! ఇక ప్రజలు అందరూ నన్ను వెక్కిరించరా? ఇటువంటి బ్రతుకు ఇక ఎందుకు? ఈ భూమిని నేను ఇక ఎట్లా పరిపాలించగలను? ఇక మీద ఏ మొగం పెట్టుకొని తిరుగాడగలను?
అయ్యో! అయ్యో! నాకు ఎంతటి దురవస్థ కలిగింది? నా అంతటివాడిని శత్రువులు యుద్ధంలో ఓడించి చెరబట్టడమా? జాలితో ఒకడెవడో వచ్చి నన్ను బంధవిముక్తుణ్ణి చేయటమా? ఏ విధంగానైనా జరిపించటానికి దైవానికి శక్తి ఉన్నది. ఎంతటి బలవంతులైనా విధి చేతిలో కీలుబొమ్మలే కదా?
ఆత్మాభిమానం పాడైపోయి ఈ విధంగా ఈ శరీరంలో అసువులను నేను ఎట్లా భరించగలను? మానం కంటే ప్రాణం గొప్పది కాదు. ఇది నా దృఢమైన అభిప్రాయం. నేను ప్రాయోపవేశ దీక్ష పూని ప్రాణాలను విడనాడదలచాను. దీనికి తిరుగులేదు. ఎవరూ నా సాహసాన్ని మాన్పలేరు - అంటూ "అన్న దుశ్శాసన, నిన్ను రాజ్యమునకు బట్టము గట్టెద బతివిగమ్ము" అనగా..
"అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట కల్గినన్ మహార్ణవమది యింకినన్, దివసనాథుడు ఇంద్రుడు తేజమేగినం, గువలయనాథ! నీకు నొక కుత్సితభావము కల్గనేర్చునే? భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే!"
ఓ దుర్యోధన సార్వభౌమా! రాజ్యభారం వహించవలసినవాడవు నీవే! నీ కొరకే ఈ రాజ్యం ఏర్పడింది. ఈ పృథ్వి ముక్కచెక్కలగు గాక, సముద్రం ఇంకిపోవు గాక, సూర్యచంద్రులు తమ తేజాలు కోలుపోతారు గాక, హిమాలయపర్వతమే కదులుగాక, నీలో ఎట్టి నికృష్టభావాలు పొడసూపకుండును గాక, నేను నీవు వహింపదగిన రాజ్యభారాన్ని మోయజాలను సుమా! అంటూ తమ్ముడు దుశ్శాసనుడు అన్న పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాడు.
కర్ణుడు ప్రవేశించి, అసలు పాండవులు ఎవరు? వారు నీరాజ్యంలో సుఖంగా జీవిస్తున్న పౌరులు గదా? రాజుకు ఆపద వచ్చినప్పుడు తమ ప్రాణాలొడ్డి అయినా వారు రాజుకు సేవ చేయాలి గదా? పాండవులు నీ సేవకులు, నీవు పాండవులకు ఏలిక అయిన సార్వభౌముడవు. పాండవులు నీ రాజ్యంలో శాంతి, భద్రతలను అనుభవిస్తూ నివసించటం సేవకుల ధర్మం. కాబట్టి వారు తమ ప్రభు ఋణం దీర్చుకొనటానికి నిన్ను విడిపించారు. ఇది వారికి అవశ్య కర్తవ్యం. జూదంలో ఓడిన నాడే వారు నీకు దాసులు, వారి పౌరుష ప్రాభవాలన్నీ నీ సొత్తు అంటూ ఓదార్చాడు.
దీనికి సమ్మతించని దుర్యోధనునితో శకుని,
త|| "కడగి బుద్ధిబలంబు నంద యకంటకంబుగ జేసి యే
పుడమి రాజ్యము సర్వముం దగ బుచ్చియిచ్చిన నిమ్ములం
గుడువనేరక దీని నిచ్చట గూల దన్ని శరీరమున్
విడుతుగా కని నిశ్చయించెదు వెర్రివైతె నరేశ్వరా!"
ఓ దుర్యోధనా, నీవు సాధారణ మానవుడవు కావు, సార్వభౌముడవు. నీ కర్తవ్యాన్ని గూర్చి జాగరూకతతో యోచించుము. నీకు ఈ భూమి, రాజ్యాన్ని సమస్తాన్ని కేవలం నా బుద్ధిబలం చేత (మయాద్యూత మహిమ చేత) నీకు సంపాదించి ఇచ్చాను. నీవు నీ బాహుబలం చేత సంపాదించింది కాదు గదా. ఈ రాజ్యం నీవు ఆర్జించినచో దానిని నీవు త్యజింపవచ్చును గాని నేను నీకు సంపాదించి ఇచ్చిన దానిని నీవు త్యజిస్తే నా మనస్సు ఖేదపడుతుంది కదా! నీవు కష్టపడి సంపాదించనక్కరలేకుండా సంక్రమించిన రాజ్యాన్ని హాయిగా అనుభవించకుండా, ప్రాయోపవేశదీక్షతో ఆత్మహత్యకు పూనటం అవివేకం. నీకు పిచ్చిపట్టిందా ఏమి? పాండునందనులు నీకు ఉపకారం చేసిన మాట నిజం. నీవు వారికి ప్రత్యుపకారం చేయటం పాడి. ఘోరమైన దుఃఖమనే అగ్నిలో పడి వెతచెందుట సరిగాదు.
శకుని హితబోధ దుర్యోధనుని మనస్సును ఏమాత్రం తాకలేదు. ఆ ఎత్తు మార్చి పాండవుల ప్రశంస మొదలెట్టినాడు. వారికి రాజ్యభాగమిమ్మని,
"కృతము దలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించి సన్మతుల బృథాతనుజుల నమానుషతేజుల బిల్వబంచి తత్పితృధనమైన రాజ్యము నభీష్టముగా దగ నిమ్ము! నీకు నీ క్షితీవలయంబునం బరమకీర్తియు పుణ్యము గల్గు భూవరా!"
పాండవులు నీకు చేసిన మేలును గుర్తించి నీ మనస్సులో ఉన్న పాపాన్ని అంతటిని తుడిచివేసి, వారిని ఆహ్వానించుము. కుంతీకుమారులు సజ్జనులు. లోకోత్తరపరాక్రమవంతులు. దివ్యతేజస్సు గలవారు. పాండవుల పైతృకమైన రాజ్యాన్ని యిచ్చి సంప్రీతితో సమ్మానించుము. అప్పుడు నీకు ఈ భూమండలంలో సాటిలేని కీర్తి, పుణ్యం లభించగలవు.
"వారలు నీ తోబుట్టువులీ రాజ్యము మీరు వారు ఏకంబై పెంపారగ, నేలుడు దీనం గౌరవకులనాథ ! సౌఖ్య గౌరవ మొందున్"
- కౌరవవంశానికి అధినేతవైన ఓ దుర్యోధనా, పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరూ, పాండవులు ఐకమత్యం కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే మీ ఉభయులకూ సఖ్యం, గొప్పదనం చేకూరుతాయి.
ఈ హితబోధ చావుబోవు వ్యక్తికి చివరి చికిత్సగా గరళము బోయుట వంటిది. ఈ హితబోధలో ఏమాత్రం చిత్తశుద్ధియున్నను మహాభారతసంగ్రామము సంభవించెడిది గాదు. సర్వనాశనము జరిగెడిది కాదు.
శకుని వంటి కుటిలబుద్ధులకు బుద్ధిబలమున్నంతగా బాహుబలముండదు. బాహుబలము ప్రదర్శించవలసిన చోట వీరు పరిహాసముల పాలగుదురు. అంతేగాక ఇంతకు ముందపకారము పొందినవారు కుటిలబుద్ధుల పాటు చూచి - "ఆనాడు మోసము చేసినట్లు గాదు, ఇప్పుడు నీ పప్పులుడుక"వని ఎత్తి పొడుతురు. సమరభూమిలో శకుని కల్పించిన మాయలన్నింటిని వమ్ము చేసి చిరునవ్వుతో అర్జునుడు-
"మాయలు జూదము తోడన బోయెం గాకింక నిచట బొనగునె యవి! మ
త్సాయకము లడ్డసాళే్ల? నీ యా చవి లేదు పొమ్ము నిలువక మామా!"
శకుని మామా! నీ మాయలన్నీ జూదంతోనే పోయినవిలే! అవి యుద్ధరంగంలో పొసగవు. నా బాణాలంటే పాచికలనుకొన్నావా? నీకా కపటజూదంలోని రుచి ఇచట దొరుకదు. ఆగక ఇటనుండి వెళ్లిపొమ్ము - అర్జునుడు ఆ విధంగా పలికి నిశితమైన బాణాలు దేహం నిండా నింపగా శకుని కలతపడి, ధైర్యాభిమానాలు విడిచి తోడివారు నవ్వగా యుద్ధభూమి నుండి పారిపోయాడు.
సహదేవుడు, శకునితో యుద్ధరంగంలో పారిపోకుండా నిలువుము మామా అంటూ భయంకరమైన కాంతితో చలిస్తున్న బల్లెం దెబ్బతో శకుని కంఠాన్ని ఖండించగా, తల, మొండెం భూమిపై పడి దొర్లాయి.
కౌరవుల చెడు ప్రవర్తనకు కారణమైన శకుని, దుర్యోధనుడు చూస్తుండగానే సంహరింపబడ్డాడు. కుటిలబుద్ధుల కిట్టి గతులు తప్పవు. ప్రపంచమున కుటిలబుద్ధికి శకుని పర్యాయపదము.

--((*))--

No comments:

Post a Comment