Tuesday 5 June 2018

Pranjali prabha (8-06-2018)

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:
Image may contain: 1 person, outdoor

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 



Image may contain: one or more people, people standing, sky, twilight, outdoor and nature
అజరామర సూక్తి! 
గృహం గృహమటన్ భిక్షుః శిక్షతే న తు యాచతే | 
అదత్వా మాదృశో మా భూః దత్వా త్వం త్వాదృశో భవ || 
- అజ్ఞాత కవి 
ఇల్లిల్లూ భిక్షాటనతో యాచించే యాచకుడు ఏమని సందేశ మిస్తున్నాడంటే ' మీరెప్పుడూ ఇచ్చేవారిగానే ఉండండి, నా లాగా గ్రహీతగా మారిపోవద్దు.' 
'చేతులకు తొడవు అనగా ఆభరణము దానము' అన్నది ఆర్యోక్తి. ఇంకొక మాట కూడా వుంది 
"దరిద్రాయ కృతం దానం శూన్య లింగస్య పూజనం 
అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ సమం విధుః" 
లేనివానికి ఇచ్చుట, పూజలేక ఉండిపోయిన లింగమునకు పూజచేయుట , తల కొరివి పెట్టె వారసుడు లేని మృతునికి దహన సంస్కారము చేయుట కోటి యజ్ఞములు చేసిన ఫలము నిస్తుంది అని. 
అసలు జీవన గమనమునకు ఇచ్చుట పుచ్చుకొనుట రెండు చక్రాలు. ఇస్తేనే తీసుకొనుటకు అధికారమొస్తుంది. 
ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆత్మ అంటే పరమాత్మనే కదా . మరి పరమాత్మను సంతృప్తి పరిస్తే మనకు ఆనందాన్ని ఆయన కలిగిస్తాడు. ఈ జీవన సత్య మొకటి గుర్తుంటే ప్రపంచము సౌఖ్యము సౌభాగ్యముతో నిండిపోదా ! 
నకర్మణా, నప్రజయా, నధనేన, త్యాగైనైకానామృతత్వ మానసుః- అని వేదవాక్యం! దానంగొప్పది. అది యమృతత్వమునకు దారిచూపును. ఇకభిక్షులవిషయం; వారు చేస్తున్నది భిక్షాటన కాదు. మనకుపదేశంచేయటమే! 
యెవరికీ యింత పెట్టక నేనిలాగైనాను మీరు నావలెగావలదు. నలుగుర కింతబెట్టి మీవలెనే సుఖసంపదలతో నానంగింపుఁడని యాసందేశము! 
చెవిని బెట్టుఁడు;

కామాక్షీ అంబా 
రాగం భైరవి 
స్వరజతి - శ్యామశాస్త్రి 

ప) కామాక్షీ అంబా! అనుదినము మరువకనే 
నీ పాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి ||కామాక్షీ 

1) కుందరదనా! కువలయ నయనా! తల్లీ రక్షించు || కామాక్షీ 

2) కంబుగళ నీరద చికురా! విధు వదనా! మాయమ్మ || కామాక్షీ 

3) కుంభ కుచ! మద మత్త గజగమ! పద్మభవ, హరి శంభు నుత పద! 
శంకరీ! నీవు నా చింతల వేవేగ తీర్చమ్మా ఇపుడు || కామాక్షీ 

4) భక్త జన కల్ప లతికా! కరుణాలయా! సదయా! గిరి తనయ కావవే! 
శరణాగతుడ కదా! తామసము సేయక వరమొసగు || కామాక్షీ 

5) పాతకములను తీర్చి నీ పద భక్తి సంతతమీయవే! (సంపదనీయవే!) 
పావని కదా! మొరలిడగా (మొర వినవా?) పరాకేలనమ్మా? వినమ్మా || కామాక్షీ 

6) కలుష హారిణి, సదా నతఫల దాయకి యను (యని) బిరుదు 
భువిలో కలిగిన దొరవనుచు వేగము మొరలిడగ విను || కామాక్షీ 

7) నీప వన నిలయా! సుర సముదయా! కర విధృత కువలయా! 
మద దనుజ వారణ! మృగేంద్రాశ్రిత! కలుష దహన ఘనా! 
అపరిమిత వైభవము కల నీ స్మరణ మదిలో కలిగిన (తలచిన) జనాదులకు 
బహు సంపదలనిచ్చేవిపుడు మాకభయమీయవే || కామాక్షీ 

8) శ్యామ కృష్ణ సహోదరీ! శివ శంకరీ! పరమేశ్వరీ! 
హరి హరాదులకు నీ మహిమలు గణింప తరమా? 
సుతుడన్న అభిమానము లేదా నాపై? 
దేవీ పరాకేలనే? బ్రోవవే ఇపుడు శ్రీ భైరవి || కామాక్షీ

 భార్యా భర్తలకు కోపం వస్తే… 
ఒక భర్త తన భార్య గురించి చెబుతూ 
“నా భార్యకి గానీ కోపం వచ్చిందంటే నా మీద, పిల్లల మీద, చివరికి కుక్కల మీద కూడా అరిచేస్తుంది. ఎవ్వరూ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేరు.” 
“మరి నీకు కోపం వస్తే…” 
“గోడల వైపు, కిటికీల వైపు తిరిగి గట్టిగా అరిచేస్తా! ఏవీ తిరిగి సమాధానం చెప్పలేవు తెలుసా!!”


నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

చల్లగాలిలో, పిల్ల తెంపేర్ల మధ్య 
జింకపిల్ల లాగా గెంతులేస్తూ 
సెలయేటి నీటిలా నెమ్మదిగా కదుల్తు 

వాలు జడలో మల్లెపూలు ఉంచి 
ఉల్లి పొరలాంటి తెల్ల చీరకట్టి 
చిరుజల్లుకు తడిచి నడుస్తూఉంటే 

వంపు సొంపులతో వయ్యారాలు చూపి 
హంస సోయగాలు చూపే నడకతో 
ఉరకలు వేసే వాగులా యదపొంగులతో 
ఎదురైతే 

పెదాల కదలికతో, కళ్ళ చూపులతో  
చిరుజల్లులో తన సౌందర్యమంతా 
హావ బావ విన్యాసముతో నాట్యమాడుతూ 
ఉన్న స్థితిని చూపి  
   
నన్ను చూస్తే ఏకవికైనా తిమ్మిరెక్కదా 
పేరుకు తగ్గ నెరజానను ఇలా తడుస్తూ ఉంటె 
విశ్వవిజ్ఞానము తెలిసినా ఎదో పొందాలని లేదా 
అన్న చూపుతో  

కష్టాలకు నెలవను అనుకుంటున్నావా 
సుఖాలకు నన్ను మించిన వారు లేరని తెలియదా 
అంతులేని సంపదకు కారణము నేనే
తుఫాన్ వచ్చినా, బడబాగ్ని రగిలిన 
నాలో కరుణ పొంగి కాపాడేది నేనే 
జీవులకు పంట జీవనాధారమైతే 
మన:శాంతికి జీవనాధారము నేనే  
కూడు, గుడ్డ, గూడు ఆధారాన్ని నేనే 
అభంశుభం తెలియని అమాయకురాలును నేనే 
నన్ను నేను మరచిపోతా 
నిత్యమూ సంగమానికి ఉరకలు వేస్తా 
ఇంతకీ నేనెవరో తెలిసి పోయుంటుంది కదా  
   
--((*))--

Image may contain: one or more people, ocean and water
 నా పల్లెటూరు!...(రచన: నీలంరాజు నరసింహారావు.) 
పుట్టితి పల్లెటూర మదిపూనిక వార్థక మొందుదాక అ 
ప్పట్టున పెర్గినాడ నతిప్రాభవ వైభవ గౌరవంబులన్‌ 
బెట్టుగ ధర్మ మార్గమున విత్తము కూర్చితి తృప్తి మీర నా 
కెట్టకు ప్రాప్తిలెన్‌నగర హృద్యపు కృత్రిమ జీవితంబిటన్‌ 
తాతల తండ్రులన్‌దనుక ధర్మపథంబున గ్రామవాసమున్‌ 
ప్రీతిగ సేద్యపుం కృషిని వృత్తిగ చేకొని చేయుచుండితిన్‌ 
వేతన వృత్తికిం తవిలి స్వేఛ్ఛ పణంబుగ నేడు పట్నవా 
సాతప తాపమున్‌పొగులుటయ్యెను చల్లని పల్లె వీడుటన్‌ 
ఎంత ధనమున్న భోగములెన్ని యున్న 
మేని శ్రమ లేని వసతులుం పెక్కులున్న 
పారతంత్య్రపు కృత్రిమ పట్టణంపు 
వాసమెంతయు పల్లెకు సాటియౌనె! 
పట్నవాసపు సుందర భవనమందు 
శయనమొందగ మృదు తల్ప శయ్య యందు 
ప్రతిఫలించును నా మనఃఫలకమందు 
పుట్టి పెరిగిన మాయూరి పూర్వస్మృతులు! 
ఎన్నగ రాజకీయముల హెచ్చుగ పాల్గొని దేశపాలనన్‌ 
మిన్నగ నేడు చేయునది మిత్రులు పల్వురు పల్లె రైతులే 
ఎన్నడు రైతు కష్టములొకింతయు వారు తలంపరైరిగా 
మన్నన రైతుబాంధవులె మాటల; శూన్యులు సేతలన్‌తగన్‌ 
హాలిక వృత్తి నేడు కడు దైన్యము బొందెడు నార్థికంబుగా 
జాలిని గొల్పు రైతు అగచాట్ల తలంచిన చీడ పీడలన్‌ 
చాలయె పంట నష్టములు, వల్లని ఖర్చులు, కల్తి యెర్వులున్‌ 
చాలని అమ్మకంపు ధర శక్తికి మించిన అప్పు బాధలున్‌ 
ఈ రీతిం కడు దైన్యపు స్థితిని నేడీ రైతు గాసింబడన్‌ 
కారుణ్యంబున ఈ ప్రభుత్వమయినన్‌సాయంబు చేకూర్చమిన్‌ 
నైరాస్యంబున ప్రత్తి రైతు తనువున్‌త్యాగంబు చేసెన్‌తుదన్‌ 
దారింగానక రైతు లోకమిపుడున్‌దౌర్భాగ్యమున్‌చెందెడిన్‌

Image may contain: one or more people, sky, ocean, twilight, outdoor, nature and water

 తేనె లొలుకు భాష తెలుగేను రోయన్న 
******మధురమైనదిదియె మరువబోకు 
తియ్యనైనట్టిది తెలుసుకోరోయన్న 
******విలువైనదిదరన్న విడువబోకు 
మంచిదారినినీకునెంచునురోయన్న 
*******కలిమిని బెంచును చెలిమి చేయ 
తెలుగు భాషని నమ్ము వెలుగొందెదావన్న 
*******పరభాష పిచ్చిని తరిమి కొట్టు 
తే.గీ 
వేల వత్సరములనుండి వెలుగునొందె 
నేడు తెలుగు విలువలెల్ల నెరల బారె 
పరుల భాషను వాడుట పాడి గాదు 
తెలుగు భాషను నేర్చుమో తెలుగు బిడ్డ.. 


సాగర దినోత్సవ సందర్భంగా.. ముందు 
బాగా వ్రాసింది పోయింది..మరి ఏదోతి వ్రాయాలిగా అసలే మన అమ్మ లక్ష్మీ దేవికి పుట్టిల్లు .. మన మామ చంద్రునికి కూడా సొంతిల్లు కదా? మరి ఏదోటి వ్రాయక పోతే సాగరుడు కోప్పడడా మరి 

చల్ల గాలిలా పిల్ల తెమ్మెరలా వచ్చే నీటిని 
జింక పిల్లలా గెంతే సెలయేటిని 
తెల్ల చీర కట్టిన కన్నెలాంటి నదాలను 
వాలు జడ వేసి మల్లె పూలు తురిమిన యేళ్లను 
వంపు సొంపులతో వయ్యారాలు పోయే ప్రవాహాలను 
హంస వలే సోయగాల నడకలతో వచ్చేటి నదులను 
ఉరకలు వేసే వాగులు వంకలు యేళ్ళు సెలయేళ్ళు 
నదీ నదాలు మరెన్నిటినో ప్రేమతోడ 
ఆహ్వానించి కలుపుకునే నీలిరంగు సంద్రాన్ని 
నా పుట్టు పూర్వోత్తరాలు నాకు తెలియదు కానీ 
నాకు పేర్లు మాత్రం చాలానే ఉన్నాయి మరి 
అనాదిగా ఎందరో కవులకు నేనంటే మహా ఇష్టం 
ఎన్నో కవితలు గ్రంథాలలో నా పేరు లేనిదే పూర్తి కాదు 
విశ్వ విజ్ఞానానికి కొలమానం నేను 
అందుకే తెలియాల్సింది సముద్రమంత అంటారు మీరు 
కష్టాలకు నెలవును నేను కాదు గానీ అందరూ నన్నే ఆడిపోసుకుంటారు 
ఎంతో లెక్కలేని సంపదకు అధిఏణ్తను నేను 
నాలో ఉప్పెన వచ్చినా బడబాగ్ని రగిలినా 
సునామీలు లెనినోలు కత్రినాలు అంటారు మీరు 
నాలో కరుణే పొంగితే వర్షాలను కురిపిస్తా 
సకల జీవులకు పంటలకు జీవాధారమౌతా 
నాలో కోపానలమే రేగితే కారుచిచ్చు తుఫానులా రేగుతా 
ఉన్నవి లేనివి జీవులతో సహా ఊడ్చుకుపోయి నాలో కలుపుతా 
కలుషహర నదులలోన కలుషితాలు కలుపకండిరా 
మీ కూటికి ఆధరామైన నీటికి నిలయాన్ని నేను 
కూటి కోసమై కోటి ఆశలతో నాపై నడచి దెహి యనే 
పిల్లలకు జలపుష్పాలిచ్చి అమ్మవలే ఆదరణ చూపా 
శ్రమ జీవులకే కాదు ఎన్నో రకాల్ జీవ జాలానికి తల్లిని నేను 
నాలొ ఉన్న జీవాల్కు అభం శుభం అన్నెం పున్నెం తెలియదు మరి 
నన్ను ఆసరాగా చేసుకుని బతుకుతున్న శ్రమజీవుల గూర్చి 
నాలో ఉన్న రకరకాల జీవుల గూర్చి 
వాటికే కాక నాకు కూడా ద్రోహం చేసి చిల్లులు వేసే మానవులార 
ఆలోచించండి కాస్త ఆలోచించండి మీ మెదడుకి పదును పెట్టండి

Image may contain: plant, flower, nature and outdoor
జీవితమే సఫలము...రాగ సుధా భరితమూ...ప్రేమ కధా మధురము...

చిత్రం : అనార్కలి
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : సముద్రాల
గానం : జిక్కి

పల్లవి :

జీవితమే సఫలము
రాగ సుధా భరితమూ
ప్రేమ కధా మధురము
జీవితమే సఫలము

చరణం : 1

హాయిగా తీయగా ఆలపించు పాటలా
వరాల సోయగాల ప్రియుల వలపు మాటలా
అనారు పూల తోటలా ఆశ దెలుపు ఆటలా

చరణం : 2

వసంత మధుర సీమలా ప్రశాంత సంజ వేళలా
అంతులేని వింతలా అనంతప్రేమ ప్రేమ లీలగా
పరించు భాగ్యశీలలా తరించు ప్రేమ జీవులా

https://www.youtube.com/watch?v=SvHfiigQbPA
-------------------కనువిందౌ పిచ్చుక కనుమరుగవుతోందా ?----------------------------------

కనువిందౌ పిచ్చుక
కనలేమా నిన్నిక
అనుకుంటే చాలిక
కనుల నీటి చారిక

వచ్చి వాలి ముంగిట్లో
మచ్చికగా తిరిగేవు
వచ్చిన పని కాగానే
ఎచటికో అరిగేవు

గడ్డిపరకలను తెచ్చి
గట్టి గూడు కట్టేవు!
ప్రేమ మీర ఆ గూట్లో
పిల్లలను పెట్టేవు!

అడ్డం లో బింబాన్ని
అదేపనిగ రక్కేవు
వసారాలో కట్టి వున్న
వడ్లకంకి మెక్కేవు

సెల్లు ఫోను టవర్లెన్నో
ఎల్లెడలా నిర్మాణం
అవియే శాపం కాగా
అయ్యెను నీ నిర్యాణం
రచన:--ఆలపర్తి వెంకట సుబ్బారావు, నందివెలుగు,గుంటూరు.

Image may contain: 1 person, outdoor
శ్రీ రఘురాం జయ రఘురాం సీతామనోభిరాం

చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల(జూనియర్)
గానం : నాగయ్య/పిబిశ్రీనివాస్ ?, పి.సుశీల

శ్రీ రామ చ౦ద్రః ఆశ్రిత పారిజాతః
సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతా ముఖా౦బోరుహ చ౦చరీకః
నిర౦తర౦ మ౦గళమాతనోతూ..

శ్రీ రఘురాం జయ రఘురాం సీతామనోభిరాం

అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అన్యోన్యమైనా
త౦డ్రి మాటను నిలుపుటకైన
ధరలోమీరే దశరధరాం

వెలయునేయెడ నీ దివ్యమూర్తి
వెలిగేనాయెడ ఆన౦దజ్యోతి
వెలసి మాగృహ౦ శా౦తినివాస౦
సలుపవె శుభ గుణ శోభితరాం

https://www.youtube.com/watch?v=ZdfI9-Joiag


Image may contain: sky

చందమామ కధ. 
. అనగనగా...... 
ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు. 
దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. సోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు. సోముకు అక్కడి వాతావరణం, ప్రశాంతత చాలా నచ్చాయి. 
అతను అక్కడ కూర్చొని నదిలోకి 
చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు. ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు. 
అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది. 
వాడు పిల్లలతో వాదించి, వాళ్లందరినీ అక్కడినుండి పంపించేశాడు. ఆపైన 
గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి, నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. 
ఆశ్చర్యం! నీళ్లలో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. "ఓ మంచి అబ్బాయీ! నీ మేలు మరువలేనిది. ప్రమాదంలోపడ్డ నాకు, నువ్వు చేసిన మేలు చాలా గొప్పది. ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా 
చేసిపెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో!" అన్నది. 
సోము తనకేం అక్కర్లేదనీ, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి, ముందుకు సాగాడు. 
ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలానికి, సోము యుక్తవయస్సులోకి వచ్చాడు. చాలా విద్యలు నేర్చుకొని, అతను వీరుడుగా పేరుగాంచాడు. 
ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు, తన స్నేహితురాళ్లతో కలిసి స్నానానికని గంగా నదికి వెళ్లింది. నదిలో స్నానమాడుతూండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా 
మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం. అది పోయిందన్న బెంగతో 
రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయటంలేదు. 
ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగమాత్రం తీరలేదు. ఆహారం లేక ఆమె రోజు రోజుకూ కృశించిపోవటం మొదలెట్టింది. ఆమెకు సంతోషం కలిగించటానికి పూనుకున్నారు రాజుగారు. 
గజ ఈతగాళ్ళు అనేక మందిని అమితవేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ 
నదీవేగానికి వాళ్లందరూ కాగితపు పడవల్లా కొట్టుకపోయారు. కొందరైతే 
నదిలోని ముసళ్లకు ఆహారమయిపోయారు పాపం. 
ఇక చేసేదేమీలేక, తెలివిగలవారూ, సాహసవంతులైన యువకులెవరైనా ఆ 
రత్నాలహారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లిచేయటమేకాక, అర్థ రాజ్యాన్నికూడా ఇస్తామ'ని రాజావారు 
చాటింపించారు. 
చాటింపును విన్న సోము ఆలోచించాడు: 
ఇంతమంది గజఈతగాళ్లకు దొరకకుండా 
ఆ హారం ఎటుపోతుంది?' అని. 'అది నదిలోని ఏ రాళ్ళ అడుగునో ఇరుక్కుని ఉండాలి. దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు. అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమౌతుందని, అతను నదిలోకి దూకి, 
రాళ్ళ అడుగున వెతకటం మొదలుపెట్టాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది- 
ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో ఆతని కంటపడింది. అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే 
సోము నీటి పైకి తేలాడు! ఎలాగని చూస్తే, అతని సాయంపొందిన తాబేలు! 
సోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోని బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకు ఇచ్చింది. 
హారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజ భవనానికి చేరుకొని, ఆ రత్నాల హారాన్ని రాకుమారికిచ్చాడు. 
సంతోషించిన రాజు సోముకు తన కూతురుని 
ఇవ్వడమే కాక, అర్థరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా. ఆపైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి, 'దయ గల రాజు' అని పేరు తెచ్చుకున్నాడు.

మన పొపుల పెట్టె - అదో మందు పెట్టె...! 
మన భారతీయుల సంప్రదాయ వంటగది… కేవలం వండి వర్చాడానికే పరిమితమైన నాలుగు గోడల నిర్మాణం కాదు. ఇది అనేక ఔషధాల నిలయం. హిందువుల పోపుల పెట్టే...మనకు అనారోగ్యాల నుంచి విముక్తి కలిగించే మందుల పెట్టె..! 
పాక శాస్ర్తంపై మన దేశంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. భారతీయ వంటింటి విజ్ఞానంపై ప్రాచీన రుషులు ఎన్నో గ్రంథాలు రచించారు. భారతీయులు తీసుకునే భోజనంలో షడ్రోసోపేతమైన రుచులు ఉండాల్సిందే. ఇక పంచభక్ష్య పరమాన్నాలు సరేసరి. ఇంకా రుతువులు, కార్తెలు మారినప్పుడు ఆ మెను సఫరేట్ గా ఉంటుంది. మన పొపుల పెట్టెనే- అదో మందు పెట్టె...! 
ఇప్పుడంతా మోడ్రన్ జమనా..! జస్ట్ జలుబు చేసినా...ఏ మాత్రం చిన్నగా నలతగా ఉన్నా వెంటనే వైద్యుడి దగ్గరకు పరుగెత్తడం కామన్...! ఇది ఆధునిక విజ్ఞానం తెచ్చిన వికృతి. ఒకప్పుడు జలుబు కానీ...ఒంట్లో నలతగా ఉంటే...వంటింటి నుంచి అమ్మ తెచ్చే కషాయమే మందు...! అంతేకాదు..ఆయా ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా తీసుకునే ఆహారంలోను అమ్మ మార్పులు చేసేది. వండే కూరలో పోపులతో, పెరటి తోటలో దొరికే ఆకులతో అమ్మ చేసే వంటకాలు ఆరగిస్తే వెంటనే గుణం కనిపించేది. వైద్యుల వద్దకు వెళ్లకుండానే అమ్మ వంటింటి చిట్కాలతో చికిత్స జరిగిపోయేది. 
వంటింట్లో....పసుపు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, మెంతులు, శోంఠి, నువ్వులు, ఆవాలు, ఇంగువ...ఈ నవ విధ పదార్థాలతోపాటు అల్లం, వెల్లుల్లి, తాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, మినపప్పు, కొత్తిమీర, కర్వేపాకు, పుదినా తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ పోపుల పెట్టె తీయగానే అందులో నుంచి వచ్చే వాసనే సగం మన రోగాలను నయం చేస్తుందని చెబుతారు. ఇక తింటే ఆ సగం రోగం కూడా మటుమాయం అవుతుంది. ఇక డాక్టర్ కు వద్దకు వెళ్లే అవసరమే ఉండేది కాదు. 
పొపుల పెట్టెలోని ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తాయి. శ్వాస అవరోధాలను దూరం చేస్తాయి. 
ఇక జీలకర్ర జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది. 
ఇటు పసుపు గురించి చెప్పనవసరం లేదు. పసుపు యాంటి బయాటిక్ అని మన ప్రాచీన రుషులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. ఇప్పుడు విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు. దీని పేటెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పసుపు రక్త శుద్ధికి, కాలేయం, కంటి వ్యాధులకు, గాయాలు మానుటకు, వాపులతో కూడిన నొప్పులకు ఇలా ఎన్నో వాటికి ఔషధాలలో వాడతారు. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. పసుపును నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్టుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. బెణికినపుడు నొప్పికి, గాయాలకు, కీళ్లవద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది. 
ఇంకా ఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇక మెంతులు తాళింపులు వాడితే...శరీరంలో దీర్ఘ వ్యాధులుంటే వాటిని తగ్గేలా చేస్తుంది. విరేచనాలు కాకుండా ఆపుతాయి. శరీరతత్వాన్ని మృదుపరుస్తాయి. అంతేకాదు చక్కెర వ్యాధినియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని అనేక పరిశోధనల్లోను నిర్థారణ అయ్యింది. వీటిలో జిగురు, చేదు రుచి ఉండటం వల్ల జీర్ణాశయ సంబంధ సమస్యలకు నివారిణిగా ఉపయోగిస్తారు. స్థూలకాయం, చెడు కొవ్వులు, మధుమేహం అదుపుకు మెంతులు ఎంతగానో దోహదం చేస్తాయి. 
ధనియాలను కూరపోడి, సాంబారు, పోడి తయారీలకు, కూరల తాళింపుల కోసం వాడటం ఆనవాయితి. ధనియాలతో రకరకాల ఆయుర్వేద, యూనానీ ఔషధాలు తయారవుతాయి. గ్యాస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్ధకం, అర్శమెలలు, అజీర్ణాన్ని తగ్గించాడానికి వాడుతారు. ఇక తాళింపులో వాడే మరో దివ్వ ఔషధం శొంఠి...దీనిని అరగదీసిన గంథాన్ని కణతలకు రాస్తే తలనొప్పి తగ్గుతుంది. ఇంకా శొంఠిని వేడి నీళ్ళల్లో సలసల మరిగించి, ఆ నీళ్ళతో స్నానం చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. శొంఠి ముక్కను నమిలి బుగ్గన పెట్టుకుంటే పంటి నొప్పులు, చిగురు నొప్పులు తగ్గుతాయి. అరలీటరు మంచి నీళ్ళలో పది గ్రాముల శొంఠిని వేసి బాగా మరగబెట్టి, నీళ్ళు సగం అయ్యాక ఆ కషాయాన్ని శుభ్రంగా వడబోసి కొంచెం తాగితే పొడిదగ్గు, విరేచనాలు వంటివి తగ్గుతాయి. 
శొంఠి, జీలకర్ర, కొత్తిమీర సమాన భాగాలుగా తీసుకుని నీళ్ళలో వేసి మరిగించి, వడబోసి, చల్లార్చి తాగితే ఆరోగ్యానికి మంచిది. పదిగ్రాముల శొంఠిని అరగదీసి పులిసిన మజ్జిగలో కలుపుకుని మూడు పూటలా తాగితే కడుపుకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. 
ఇక తాళింపులో వాడే నువ్వులు విషయానికి వస్తే... శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. నువ్వుల నూనె వలన చర్మ రక్షణ, జుట్టు రాలకుండా నివారిస్తాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం వంటి ఇతరేతర పోషకాలు మధుమేహ వ్యాధి తగ్గించుటలో సహాయడతాయి. నువ్వు విత్తనాల నుండి తీసిన నూనెలు శక్తివంతమగా శరీర రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను మరియు రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది. 
నువ్వులతో చేసిన నూనెలను వాడటం వలన అథెరోస్క్లెరోటిక్ గాయాల నుండి ఉపశమనాన్ని తగ్గిస్తుంది. నువ్వులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే మూలకాలు, యాంటీ-అథెరోస్క్లెరోటిక్ గుణాలను కలిగి ఉండి హృదయనాళ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నువ్వులు మొనోశాకరైడ్'లను కలిగి ఉండి కరోనరీ ధమని వ్యాధులు శక్తి వంతంగా తగ్గించి మరియు శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి. 
మన వంటగదిలోని మరో దివ్వ ఔషధం ఇంగువ...! ఇంగువను కొద్దిగా వేయించి పిప్పి పన్ను మీద ఉంచితే నొప్పి తగ్గుతుంది. ఇంగువకు పాత నెయ్యి కలిపి గాఢంగా వాసన చూస్తే మలేరియాలో ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ నుంచి ఉపశమనాన్ని కలిగించే ఓషధాల్లో ఇంగువ ముఖ్యమైన ఓషధి. ఆహారం జీర్ణం కాకపోవటం, కడుపునొప్పి వంటి సమస్యల్లో ఇంగువను వాడుతారు. పొట్ట ఉబ్బరించి గ్యాస్తో నిండిపోయినప్పుడు ఇంగువను వాడుతారు. 
ఇంకా పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయి. అటు దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇటు లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు. 
మరోవైపు కుంకుంపువ్వు ను సైతం కొంతమంది ధనవంతులు పొపుల పెట్టెలో వాడుతారు. ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసనకోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి. 
ఏలకులకు ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది. ఇంకా మినపప్పు వెన్నుపూసకు బలాన్నిస్తుంది. అంతే కాదు మినపప్పు లో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి ఉపమన పొపుల పెట్టె - అదో మందు పెట్టె...! 
మన భారతీయుల సంప్రదాయ వంటగది… కేవలం వండి వర్చాడానికే పరిమితమైన నాలుగు గోడల నిర్మాణం కాదు. ఇది అనేక ఔషధాల నిలయం. హిందువుల పోపుల పెట్టే...మనకు అనారోగ్యాల నుంచి విముక్తి కలిగించే మందుల పెట్టె..! 
పాక శాస్ర్తంపై మన దేశంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. భారతీయ వంటింటి విజ్ఞానంపై ప్రాచీన రుషులు ఎన్నో గ్రంథాలు రచించారు. భారతీయులు తీసుకునే భోజనంలో షడ్రోసోపేతమైన రుచులు ఉండాల్సిందే. ఇక పంచభక్ష్య పరమాన్నాలు సరేసరి. ఇంకా రుతువులు, కార్తెలు మారినప్పుడు ఆ మెను సఫరేట్ గా ఉంటుంది. మన పొపుల పెట్టెనే- అదో మందు పెట్టె...! 
ఇప్పుడంతా మోడ్రన్ జమనా..! జస్ట్ జలుబు చేసినా...ఏ మాత్రం చిన్నగా నలతగా ఉన్నా వెంటనే వైద్యుడి దగ్గరకు పరుగెత్తడం కామన్...! ఇది ఆధునిక విజ్ఞానం తెచ్చిన వికృతి. ఒకప్పుడు జలుబు కానీ...ఒంట్లో నలతగా ఉంటే...వంటింటి నుంచి అమ్మ తెచ్చే కషాయమే మందు...! అంతేకాదు..ఆయా ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా తీసుకునే ఆహారంలోను అమ్మ మార్పులు చేసేది. వండే కూరలో పోపులతో, పెరటి తోటలో దొరికే ఆకులతో అమ్మ చేసే వంటకాలు ఆరగిస్తే వెంటనే గుణం కనిపించేది. వైద్యుల వద్దకు వెళ్లకుండానే అమ్మ వంటింటి చిట్కాలతో చికిత్స జరిగిపోయేది.

Image may contain: sky and outdoor
---------------------------------శుభోదయం ------------------------------------- 
ఎటువంటిది సభ యని చెప్పబడదో ఈ శ్లోకం లో చెప్ప బడినది. 
న సా సభా యత్ర న సంతి వృద్ధా: 
న ది వృద్ధా యే న వదంతి ధర్మం 
నా సౌ ధర్మో యత్ర న సత్యమపి 
న తత్సత్యం య ఛతేనా భ్యుపేతం 

ఎక్కడ వృద్ధులు లేరో అది సభ కాజాలదు.ఎవరు ధర్మము చెప్పరోవారు వృద్ధులుగారు. 
దేనియందు సత్యము లేదో అది ధర్మము కాదు.దేనివల్ల లోకకళ్యాణమొన గూడదో అది 
సత్యము గాజాలదు,అనగా లోక కళ్యాణ మొనగూర్చు సత్యధర్మ ప్రవచన మొనర్చు 
పండితులు కూర్చున్నదే సభ యని అర్థము.(మహాభారతము) 

యత్ర ధర్మో హ్యధర్మేణ 
సత్యం యత్రానృతేనచ 
హన్యతే ప్రేక్ష మానానాం 
హతా స్తత్ర సభాసదః (మనుధర్మ శాస్త్రం) 

ఏ న్యాయ సభ యందు ధర్మము అధర్మము చేతను, సత్యము అసత్యము చేతనూ 
కొట్టబడుతుందో, ఆ సభలోని సభాసదులు మృతతుల్యులే అవుతున్నారు.
----------------------------------సుప్రభాతం--------------------------------------- 
సభ అంటే యెలావుండాలోనన్నయభట్టు గారు తన భారతం లో యిలా పేర్కొన్నారు. 

పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణ పుంజ వారిజో 
త్కర రుచిరంబులై సకలగమ్య సుతీర్థములై మహా మనో 
హర సుచరిత్ర పావన పయ:పూర్ణము లైన సత్స భా0 
తర సరసీ వనంబుల ముదం బొనరం గొనియాడి వేడుకన్ 

వివేక పరీమళాలను గుబాళిస్తూ,ఉత్తమ గుణసంపదలను వెదజల్లుతున్న పద్మాలతో సుందరంగా ప్రకాశిస్తూ,అందరికీ అనుభవించే అవకాశాన్నికల్పిస్తూ,పవిత్రులూ, సుచరిత్రులూ.మహోదాత్త వ్యక్తిత్వ సమన్వితు లైన మనీషులున్న విద్వత్సభలు సదస్సు ల వంటివి.ఈ విద్వత్సభలలో వివేకం,సౌశీల్యం, పవిత్రత,సకల ప్రజాహితత్వం 
కళకళ లాడుతుంటాయి.నన్నయగారి ఈ పద్యం చాటువు కాదు.కానీ ఉత్తమ కవిత్వం 
ఎలాంటి సహృదయులుంటే పుట్టుకొస్తుందో,తీగ సాగుతుందో,పుష్పిస్తుందో,ఫలిస్తుందో 
ధ్వనింప జేస్తుంది.ఈ పద్యం లోని 'వివేక'శబ్దం ఒక్కటి చాలు కవితా పారమ్యాన్ని తెలుసుకోడానికి,ఎన్ని దశలుగా కవిత్వం ప్రసరిస్తుందో దర్శించడానికి. 

సుభాకల్పతరుమ్ వందే 
వేదశాఖోప జీవితం 
శాస్త్రపుష్ప సమాయుక్తం 
విద్వద్భ్రమర శోభితం 

వేదములనెడి శాఖల తోనూ,శాస్త్రములనే పుష్పములతోనూ,విద్వామ్సు లనెడి తుమ్మెదల తోనూ ప్రకాశించు సభయనెడి కల్పవృక్షమునకు నమస్కరించు చున్నాను. 

కవి చేత విభుడువిభుచే 
గవి,సభ కవి,విభుల చేత గడు విలసిల్లున్ 
రవి చే రుచి, రుచిచే రవి 
రవి రుచి విభవమున నభము రంజిల్లు క్రియన్ 

కవి వలన రాజు,రాజువలన కవి,వీరిద్దరి చేత సభ ప్రకాశిస్తుంది.ఎలాగైతే సూర్యుని వలన 
కాంతి,కాంతి చేత సూర్యుడు,వీరిద్దరివల్ల ఆకాశం ప్రకాశించు నట్లు.
------------------------------------శుభోదయం ---------------------------------------- 
స్త్రీణాం ద్విగుణ మాహారో 
బుద్ధిశ్చాపి చతుర్గుణం 
సాహసం షడ్గుణం చైవ 
ప్రేమోశ్చ గుణ ఉచ్ఛతే 
అర్థము:--స్త్రీలు ఆహారం లో రెండింతలు,బుద్ధిలో నాలుగింతలు,సాహసం చెయ్యడం లో ఆరింతలు యింక 
ప్రేమను కురిపించడం లో చాలా ఉచ్ఛ స్థితిలో వుంటారు.మహిళలూ 
మనం భుజాలు చరుచుకోవచ్చు 

ఆఖరి పాదం మాత్రం అక్షరాలా నిజం వాళ్ళు చూపించే ప్రేమకు సాటి లేదు.ఆడ వాళ్ళు అల్పసంతోషులు,భర్త ,ఏ మాత్రం కొంచెం పొగడినా పొంగిపోతారు.ఎంతో ప్రేమను పంచుతారు.వాళ్ళు తక్కువ తిని ఎక్కువ భాగం భర్తకు,పిల్లలకు పెడతారు..అంత ప్రేమ మయి,త్యాగమయి స్త్రీ.. 
కానీ లోకం లో మగవాళ్ళు నీకేమీ తెలియదు నోరుమూసుకో అంటూ ఆధిక్యం చెలాయించి ఆడవాళ్ళ నోళ్ళు నొక్కేశారు.ఎప్పుడూ అలా అనడంతో అదేదో బ్రెయిన్ వాష్ అంటారే అయిపోయి మనకేమీ తెలియదేమో అనే స్థితికి వచ్చారు.(మగవాళ్ళు క్షమింతురు గాక ) ఇప్పటికీ చాలా ఇళ్ళల్లో ఆడవారికి వస్తువుల ధరలు,కూరగాయల ధరలు తెలియనే తెలియవు.మగవాళ్ళు తెచ్చిపడేస్తే వీళ్ళు వండడమే. 
ఎప్పుడయినా యింటి దగ్గరికి వచ్చాయి కదా అనికూరగాయల్లాంటివి ఏవైనా కొంటే వీటికి యింత తగలే శావా? నేనయితే తక్కువ ధరకే తెస్తాను.అంటారు.అలాంటి కుటుంబాలు నాకు చాలా తెలుసు. 
ఇంకా కొంతమంది అన్నీ ఆడవాళ్ళే తెచ్చుకోవాలని డబ్బు మాత్రం యిచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు.ఆవిడ వుద్యోగం చేస్తున్నా సరే యింటికి వచ్చి వంటపనీ సరుకులు,కూరగాయలు తెచ్చుకుంటున్నారు.వీసమెత్తు సహాయం చేయకుండా పేపరు,.టి.వి చూడడం తో గడిపేస్తున్నారు.అన్నీ చేతి కందించాలి.ఇప్పుడిప్పుడు కొంతమంది మారినా చాలా ఇళ్ళల్లో పాతపద్ధతే కొనసాగు తూంది.తాను స్నేహితులతో గడిపి రాత్రి పొద్దుపోయి వచ్చినా పరవాలేదు.భార్య మాత్రం ఎక్కడికి వెళ్ళినా త్వరగా వచ్చెయ్యాలి.పిల్లలబాధ్యత,వాళ్ళని చదివించే బాధ్యత అంతా ఆడవాళ్లే చూసుకోవాలి.ఉద్యోగాలు చేసే మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటూంది. 
మగవాళ్ళు వుడుక్కోకుండా మీ అహం కొంచెం పక్కకు నెట్టి నిండు మనసుతో ఆలోచించండి.అందరూ అలా వున్నారని నేననడం లేదు.ఎక్కువ శాతం అలాగే వున్నారు.ఆడ వాళ్ళ లోని ప్రతిభ గుర్తించి ప్రోత్సహిస్తే 
ఆడవాళ్ళు చెయ్యలేని పని ఏదీ లేదు. 
కొంతమంది వయసులో వున్నప్పుడు యెలా వున్నా వృద్ధాప్యం వచ్చాక భార్యకు సహాయం చేస్తున్నారు. 
కార్యేషు దాసీ కరణేషు మంత్రీ 
రూపేచ లక్ష్మీ భోజ్యేషు మాతా 
శయనే తు రంభా .క్షమయా ధరిత్రీ 
షట్కర్మ యుక్తా కుల ధర్మ పత్నీ 
అర్థము:--దాసీ లాగ పని చెయ్యాలి, సలహాలివ్వడం లో మంత్రి లాగా వ్యవహరించాలి,రూపములో లక్ష్మీ దేవిలాగా వుండాలి, అన్నం భోజనం పెట్టె టప్పుడు తల్లిలాగా ఆదరించి పెట్టాలి,.పడకగదిలో రంభాలాగా వుండాలి, ఓర్పులో భూదేవిలాగా వుండాలి కుల ధర్మపత్ని అన్నారు. 
ఆ రెండోది "కరణేషు మంత్రీ" అనేదాన్ని వదిలేసి మిగతావన్నీ ఉండాలంటున్నారు.నీ సలహా ఏమీ 
అక్కర్లేదు మిగతావన్నీ చెయ్యి చాలు.అంటున్నారు. 
ఇలా చాలా ఇళ్ళల్లో జరగడం లేదా?ఈ 21 వ శతాబ్దం లో కూడా.భర్తలను సతాయించే వాళ్ళు లేరా? 
అని మగవాళ్ళు (భార్యా బాధితులైనవారు) అడగ వచ్చు.వున్నారు కానీ చాలా తక్కువ.అయినా జోకుల్లో,కార్టూన్స్ లో మాత్రం ఆడవాళ్ళను భయంకరంగా చిత్రీకరిస్తున్నారు. 
ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించండి.కానీ కోపం తెచ్చుకోకుండా నిదానంగా ఆలోచించండి

No comments:

Post a Comment