Saturday 16 June 2018

pranjali pabha (22-06-2018)


నేటి హాస్యం 

నువ్వే తీసుకో…స్వీడన్ జోకు:

కిక్ఓ పట్నం నుంచి ఒకతను వేటాడదామని అడవి చివర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. గ్రామం దగ్గరికి వెళ్ళగానే ఓ కుందేలు పారిపోతూ కనిపించింది. గురిపెట్టి కాల్చాడు అంతే… అది ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడింది.

పక్కనే ఉన్న ఆ పొలం యజమాని

“నా పొలంలో పడింది కాబట్టి అది నాదే” అన్నాడు.

“కాదు నేను కాల్చాను కాబట్టి నాదే” అన్నాడు.

అలా కొద్ది సేపు ఇద్దరూ వాదులాడుకున్నాక పొలం యజమానికి ఓ ఆలోచన వచ్చి పట్నం అతనితో ఇలా అన్నాడు.

“ముందుగా నేను నిన్ను డొక్కలో ఒక్కసారి తంతాను. తర్వాత నువ్వు కూడా నన్ను అదేలాగా తన్ను. ఇద్దర్లో ఎవరు తక్కువగా అరుస్తారో ఆ కుందేలు వాళ్ళకి చెందుతున్నమాట.”

ఈ పందేనికి అతను ఒప్పుకున్నారు.

ముందుగా రైతు అతన్ని ఈడ్చి డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక పట్నం అతను విల విల్లాడిపోతూ కాసేపు నేల మీద పడిపోయాడు. కొంచెం సమయం తర్వాత ఎలాగోలా తేరుకుని

“ఇప్పుడు నా వంతు అన్నాడు” బాధను బలవంతంగా ఆపుకుంటూ.

రైతు నెమ్మదిగా “ఒక్క చిన్న కుందేలు కోసం ఇంత గొడవ అవసరమా చెప్పు? ఆ కుందేలేదో నువ్వే తీసుకో” అన్నాడు.

ఉత్తమశ్చింతితం కుర్యాత్ ప్రోక్తకారి తు మద్యమ: 
అధమో2శ్రద్దయా కుర్యాత్ అకర్తోచ్చరితాత్ పితు: 
-తండ్రి మనసు తెలుసుకుని దానికణుగుణంగా పనిని చేయువాడు ఉత్తమపుత్రుడు , చెప్పిన తరువాత పనిచేయువాడు మధ్యముడు , ఇక అశ్రద్దతో పనిని చేయువాడు అధమపుత్రుడు. ఏమియూ చేయనివాడు తండ్రి యొక్క మలమునకు సమానమైన వాడని భావము. 

ఇంత వున్నతంగా మన పెద్దలు , శాస్త్రాలు తండ్రిని గురించి చెప్పాయి.
--((*))--

Image may contain: 1 person, close-up


వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 

22. స్వప్నము 

స్వప్నమున శరీరము తేలికయై భారమనిపించదు. జ్ఞానులకు స్వప్నమున సంకల్ప సిద్ధులగుటచే సూక్ష్మ శరీరము లభించును. స్వప్నమున కాంచిన వస్తువులు, మేల్కొనిని పిదప కనబడనట్లు, జ్ఞాని ఆది భౌతిక దేహము కనిపించదు. అది మిధ్యయె. స్వప్న, జాగ్రత్‌ పదార్ధములొకే తరగతికి చెందినవే. స్వప్న దృశ్యములు, అసత్యములు. అట్లే ఈ జగత్తు కూడ అసత్తే. లీలావతి తన భర్త శవము వద్ద, సమాధి స్ధితిలో వుండి గడచిన రాజు యొక్క వైభవమును, యుద్ధమును స్వప్నములోవలె గాంచెను. అతివాహిక శరీరము ధృడమైన, సద్వాసనలు గల వారు యవ్వనమును, బాల్యమును మరుచునట్లు, ఆది భౌతిక దేహమును విస్మరింతురు. ఎట్టి వాసనలు లేకున్న అసలు శరీర మేర్పడదు. అయితే రాజు పునరుజ్జీవుడై, తన ఎదుట నున్న లీలను గని నీవెవరవని ప్రశ్నింప, నేను నీ భార్యను, ఇచట గల బంగారు మిధ్యపై నున్నయామె త్రిలోకజననియగు సరస్వతీదేవి ఈమె మనలను పరలోకము నుండి తెచ్చినది. అని చెప్పగా రాజు ఆమెకు సాష్టాంగ నమస్కారమొసగి, తమకు దీర్ఘాయువు, ధనమును, మేధను ప్రసాదింపుమని పల్కెను. అంతట దేవి వారిని దీవించి, రాజ్యసిద్ధి గల్గుగాక, సకల సంపదలు గల్గుగాక అని దీవించెను. అంతట లీల పునర్జీవుడైన భర్తను కౌగిలించుకొని ఆనందమును ప్రకటించెను. ఇట్లు పద్ముడు నిజ ప్రయత్న బలము వలన, సరస్వతీదేవి అనుగ్రహము వలన, పునర్జన్మను, రాజ్యమును, జ్ఞానమును పొందెను. వారు జీవన్ముక్తులై ఎనిమిది వేల ఏండ్లు రాజ్యమును పాలించి, చివరకు విదేహముక్తులైరి.



--((*))--


1 comment: