Monday 4 June 2018

Pranjali Prabha

---------------------------------శుభోదయం ------------------------------------------
రామకృష్ణ పరమహంస మరణించిన తరువాత వివేకానందుడు అమెరికా వెళ్ళి భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్య ప్రపంచానికి విప్పి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తనకు మాతృ సమానురాలయిన రామకృష్ణ పరమహంస భార్య ఐన శారదాదేవి ఆశీర్వాదం తీసుకోవాలని వెళ్ళాడు. ఆమె యింట్లో వంట చేస్తూ వుంది. వివేకానందుడు ఆమెకు నమస్కరించి ‘అమ్మా! నేను అమెరికా వెళుతున్నాను. భారతీయ ధర్మాన్ని పాశ్చాత్య ప్రపంచానికి చాటి చెప్పడానికి వెళుతున్నాను. మన ప్రాచీన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని తెలుపడానికి ఈ ప్రయాణం పెట్టుకున్నాను. యింత పవిత్ర కార్యాన్ని నిర్వర్తించే ముందు మాతృమూర్తి ఐన మీ ఆశీర్వచనం నాకు అనివార్యం. మీరు నన్ను ఆశీర్వదించందే నా యాత్రకు సంపూర్ణత, సమగ్రత చేకూరదు’ అన్నాడు.
శారదాదేవి వంట పనిలో వుంది. వివేకానందుడు చెప్పినవన్నీ విన్నది. వెంటనే స్పందించలేదు. వివేకానందుడు ఆశ్చర్యపోయాడు. నేనేం తప్పు చేశాను? అనుకున్నాడు. శారదాదేవి కాసేపటికి ‘నేను ఆ విషయం గురించి కొంత ఆలోచించి కానీ చెప్పలేను’ అంది.
వివేకానందుడు విస్తుపోయాడు. ఆశీర్వదించడానికి ఆలోచించడమా?’ అనుకున్నాడు. పరిస్థితి చిత్రంగా వుంది. వింతగా అనిపించింది. శారదాదేవి వంట పనిలో వుంటూనే వివేకానందుణ్ణి గమనించింది. కాసేపటికి ‘నాయనా! కూరగాయలు తరగాలి. అక్కడ వున్న కత్తిని కాస్త అందివ్వు అంది. వివేకానందుడు కత్తినిచ్చాడు. ఆమె కత్తి తీసుకుని చిరునవ్వుతో ‘నాయనా! నిన్ను హృదయ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. నీవల్ల అందరికీ మేలు జరుగుతుంది. నీ ప్రయాణం విజయవంతమవుతుంది. వెళ్ళిరా’ అంది.
వివేకానందుడు ఆశ్చర్యంతో ‘అమ్మా! నీ ఆశీర్వాదానికి, ఈ కత్తికి వున్న సంబంధమేమిటి?’ అన్నాడు.
శారదాదేవి ‘వుంది నాయనా! నేను కత్తిని అడిగినపుడు నువ్వెలా యిస్తావో పరిశీలించాను. కత్తి పిడిని పట్టుకుని యిస్తావా? లేదా కత్తి కొనను పట్టుకుని పిడిని నావేపు పెట్టి అందిస్తావా? అని గమనించాను. కత్తి కొనను నీ చేతిలో పట్టుకుని పిడిని నాకు అందించావు. దాన్ని బట్టి నీ తత్వం గ్రహించాను. నీలో అనురాగముంది, అధికారం లేదు, ఆత్మరక్షణ లేదు, ప్రతీకారం లేదు. నువ్వు కత్తి కొనను పట్టుకొన్నావు. దానివల్ల నీ వేలు తెగే వీలుంది. కానీ దాన్ని నువ్వు లక్ష్యపెట్టలేదు. నీ కన్నా నా భద్రతే నువ్వు ముఖ్యంగా భావించావు. యిది చిన్ని విషయమే కావచ్చు. కానీ ఇది నీ మనస్తత్వాన్ని తెలుపుతోంది. నీకు అంతా మేలే జరుగుతుంది. యితరుల మేలు కోరేవాడు ఆత్మరక్షణ గురించి ఆలోచించడు’ అంది. వివేకానందుడు శారదామాత పాదాల్ని స్పర్శించాడు.
(మనమెవరైనా కూడా కత్తిని అందించేటప్పుడు పిడిని పట్టుకొనే అందిస్తాము కదా)!

మన జననం తో బంధాలు కలుస్తాయి. మరణం తో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి చెడ్డల సంగమ మైన జీవన యానం లో కీర్తి ప్రతిష్ఠ లే శాశ్వతం కానీ సంపదలు కావు.
నువ్వున్నా లేకున్నా కాలం ఆగదు. నీవు వున్నప్పుడు నీలో మంచిని బ్రతికించు.
నీవు లేకపోయినా కాలం నిన్ను మరువని విధంగా జీవించు.

పొద్దున్నే పట్టిన వాన ఆగేటట్టు కనిపించడం లేదు.

వెచ్చగా కాఫీ కప్పు చేతిలో పట్టుకొని రండి. సరదాగా కథలు చెప్పుకుందాము?

మరి ఈ రోజు ఏ కథ చెప్పుకుందాము.........
ఆ అవిడియా.
భట్టి విక్రమార్కుడు భేతాల కథలు తెలియని తెలుగువారు ఉండరు కదా!
అసలు ఈ భేతాళుడు ఎవరు? విక్రమార్కుడికి వాడికి సంబంధం ఏమిటి? ఈవేళ ఆ వివరం తెలుసుకుందామా?

అందరూ సరేనా. ఘట్టిగా చెప్పాలి.
చాలు చాలింక.......... మొదలెడతా. ఊ కొట్టండి.

అనగనగనగా ఒకసారి ఇట్లాగే బాగా వానపడుతుంటే కైలాసంలో పార్వతికి ఏమీ తోచక, "నాథా నాథా ఏదైనా కథ చెప్పరాదా?" అని శివుడిని బ్రతిమిలాడుకుందట.

"సరే సరే చెప్తా ఆలోచించుకోవాలి కదా. అంత హఠాత్తుగా అడిగితే ఎట్లా?" అని కాస్సేపు ఆలోచించిన శివుడు వరసగా కథలు చెప్తూపోయాడు. అట్లా తెల్లవార్లూ చెప్పిన కథ చెప్పకుండా చెప్పుకుంటూ పోయాడు.

అదే సమయానికి శివుడి దర్శనం చేసుకోవడానికి ఒక బ్రాహ్మణుడు కైలాసానికి వచ్చి ద్వారం బయట నిలబడి ఆ కథలన్నీ వినేసాడు.

పాపం ఏం చేస్తాడు? శివుడు చెప్తూన్న ఆ కథలు అంత అద్భుతంగా ఉన్నాయయి పాయె.
తెల్లారింది. ఇంక భూలోకానికి వచ్చేసి భార్యను కూర్చోబెట్టి కథలన్ని చెప్పేసాడు.

ఆ భార్య పక్కింటామెకు చెప్పింది. అట్లా అట్లా ఆ నోటా ఈ నోటా కథలన్నీ భూలోకంలో ప్రచారం అయిపోయి మళ్ళీ అవే కథలు కైలాసమ్లో పార్వతి చెవిన పడ్డాయి.

ఇంకేముంది ఆవిడ అగ్గిమీద గుగ్గిలం అయిపోయింది. "ఏమయ్యా మగడా నాకు కథలు చెప్పవయ్యా అంటే భూలోకంలో అందరికీ చెప్పేస్తావా హన్నా." ఆవటాన విరుచుకు పడుతుంది.

శివుడు కంగారెత్తి అసలు ఈ కథలు జనానికంతటికి ఎట్లా తెలిసాయా అని దివ్యదృష్ఠితో చూసి సంగతి తెలుసుకుంటాడు.

అసలు నేరస్థుడైన ఆ బ్రాహ్మణుడిని పిలిపించి, "నేను నా భార్యకు రహస్యంగా చెప్పిన కథలు అట్లా కాపీ పేస్ట్ చేసేస్తావా? ఇదిగో నీకు ఇప్పుడే శాపం ఇస్తున్నాను. ఫో పోయి పిశాచివై చెట్టు మీద వేళ్ళాడు." అని ఘాట్టిగా శాపం పెట్టేస్తాడు.

ఆ బ్రాహ్మణుడు లబోదిబో.

పాపం అతని ఏడుపు విన్న శివుడు జాలి తలచి. "అయితే సరే. చాలా సంవత్సరాల తరువాత భూమి మీద విక్రమార్కుడు అనే రాజు పుడతాడు. అతని వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది." అని ఓదారుస్తాడు.

అదిగో అప్పటి నుండి భేతాళుడి పేరుతో ఆ బ్రాహ్మణుడు విక్రమార్కుడి కోసం ఎదురు చూస్తూ చెట్టు మీద వేళ్ళాడుతూ ఉన్నాడు.

మరి విక్రమార్కుడు ఎవరు? శాప విమోచనం ఎట్లా జరిగింది. అది కూడా చెప్పమంటారా?

అమ్మా ఆశ దోసె అప్పడం వడ. అన్నీ ఒక్క రోజే చెప్పుకుంటే ఎట్లా.
మళ్ళి ఇట్లా కుంభ వర్షం పడి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు కదా అప్పుడు మరో కథ చెప్పుకుందాము. సరేనా???????
 

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

1.కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.

2. కరణేషు దక్షః :-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

3. రూపేచ కృష్ణః:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.

4. క్షమయా తు రామః:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం:-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
పైన వి ఆచరించినవాడే నిజమైన పురుషుడు .


రుక్మిణీహృదయసరోరుహభృంగాయ, భామామనఃపద్మభాస్కరాయ
జాంబవతీచిత్తపద్మసంచరణాయ, తారుణ్యమిత్రవిందాధవాయ
భద్రాహృదాంతరఫలదాయకాయ సు, దంతామనోహరస్వాంతజాయ
వరకళిందాత్మజాసరసప్రియాయ ని, రంతరలక్షణారంజనాయ

రాధికాదృక్చకోరతారావరాయ
దివ్యకల్యాణవిభవాయతే నమోస్తు
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల

రెండూ అనర్ధమే
************************
మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండడం.
మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడడం.
- ఈ రెంటివల్ల ఎన్ని అనర్ధాలో చరిత్ర చూసినా ,ఇతిహాసాలు చదివినా తెలుస్తుంది.
కాబట్టి జాగర్త పడదాం.
ఉమ్మడి కుటుంబాలలో , స్నేహితులలో
అతి ముఖ్యంగా భార్యాభర్తలు పాటించవలసిన సుభాషితం.
--------------------సంస్కృతం-సంస్కృతి.-------------------------
శ్రావణ పౌర్ణమి అనగానే అందరికీ గుర్తు వచ్చేది అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ. మరి కొందరికి జంధ్యాల పౌర్ణమి. ఈ రెండు పండగలే కాక ఆధ్యాత్మిక పరంగా హయగ్రీవ జయంతి కూడా ఈ రోజే జరుపుకోబడుతుంది.

మరొక ప్రాధాన్యమున్న దినము అయిన సంస్కృత దినోత్సవం జరుపుకునేది కూడా శ్రావణ పౌర్ణమి నాడే అని చాలా కొద్దిమందికి తెలుసు.

పౌర్ణానికి మూడు రోజులు ముందు, మూడు రోజులు తరువాత కలిపి వారం రోజులపాటు సంస్కృత వారోత్సవాలు జరుపుకుంటారు.

ఆ సందర్భంగా ఈ రోజు మొదలుకొని సంస్కృత భారతి వారు ప్రపంచ వ్యాప్తంగా భాష పునరుద్ధరణ కొరకు చేస్తున్న కార్యక్రమాలు కొన్ని తెలుసుకుందామా.............

పాశ్చాత్య దేశప్రభావంలో కొట్టుకుపోతున్న భారతదేశం క్రమంగా మన భాషను సంస్కృతిని కూడా విస్మరించే స్థితిలో వుంది.

సంస్కృతం అంటే కేవలం ఒక భాష కాదు అది భారతీయులందరి నరనరాల్లో జీర్ణించుకు పోయిన సంస్కృతి. సంస్కృతం అంటేనే "సమ్యక్ కృతం" ఇతి సంస్కృతం అన్న ఉత్పత్తి అర్ధం.

ఒక దేశం యొక్క ఆచార వ్యవహారాది సంస్కారాలన్ని తనలో యిముడ్చుకున్నది కనుకనే అనేకానేకమంది విదేశీయులు మన దేశసంస్కృతి మీద సంస్కృత భాష మీద అంత మోజు పెంచుకొని భాషాధ్యయనం చేస్తున్నారు.

సంస్కృతం భారతీయల ఆత్మ. అన్ని భాషలకు మాతృక అని పాశ్చాత్య పండితులు అభివర్ణించిన ఉదాత్త భాష . మహర్షులు దేవభాషగా ఆదరించారు. అది మన ప్రాచీన భాషే కాకుండా మన సంస్కృతిని ప్రతిబింబించేటటువండి సాధనం. సంస్కృత భాష అవగాహన లేని వారు భారత సంస్కృతిని అందులో అంతర్లీనంగా వున్నసంస్కారాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకోలేరు.

ఒక దేశ భాషను పరిరక్షించి దానిని దృఢమైన సాంస్కృతిక సాధనంగా మలుచుకోవటం మనందరి భాధ్యత అన్నారు శ్రీ అరవిందులు. ఏదైనా దేశం, జాతి లేదా ప్రజలు ఎవరైతే తమ మాతృభాషను వదులుకుంటారో, వారు నిజమైన జీవితం జీవించలేరు అని కూడా అన్నారు.

సంస్కృత భాషలో వచ్చిన సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా పండితులను సంభ్రమానికి గురిచేసింది. వేదాలు ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు శాస్త్రాలలో నిక్షిప్తమైన ఙ్ఞానసంపద అంతా సంస్కృతం లోనే చెప్పబడ్డది.

ఆధ్యాత్మిక వేదాంత భావప్రకటనకు సంస్కృత భాష ఒక్కటే అత్యుత్తమమైన మాధ్యమం అన్న అభిప్రాయం స్వామి వివేకానందుడు శ్రీ అరవిందులు వెలిబుచ్చారంటే ఆశ్చర్యం ఏమీ లేదు.

ఇంకొక ఆశ్చర్యకర విషయము, ఆధునిక యుగంలో వుద్భవించిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ సిస్టమ్స్(artificial intelligence machine systems) వాడుకకు సంస్కృతం ఉత్తమమైన భాషగా భావిస్తున్నారు.
ఆంగ్ల ప్రియుడైన పండిత్ జవహర్‌లాల్ గారి మాటలలో, "గతం గతించింది. ప్రస్తుతం మనచేతిలొ వుంది. మనం భవిష్యత్ కోసం పాటు పడదాము. అది ఏ విధంగా వున్నా, అతి పెద్దదైన, దృడమైన, శక్తివంతమైన మన వారసత్వము సంస్కృత భాషే."
పాండిత్య, ఙ్ఞానసంపదలో గల విభిన్న శాఖలలో భారతదేశపు సహకారం అనంతం. కాని ఈ వాస్తవాన్ని బ్రిటీష్ పరిపాలనలో బానిస తత్వానికి అలవాటుపడ్డ లౌకిక భారతీయ చారిత్రకులు కొట్టి పారేసారు.

స్వతంత్ర భారతంలో తిరిగి భారతీయుల ఆత్మను పునరుజ్జీవించటానికి ప్రయత్నాలు జరగలేదు. ఎందుకు? మెకాలే ప్రవేశ పెట్టిన కాన్వెంట్ ‌విద్యావిధానంతొ ఇంకా ఇంకా బానిసతత్వం పెరిగిందే కాని తగ్గించటానికి ప్రయత్నాలు జరగలేదు.

బ్రిటిష్ పరిపాలనలో పెంచుకున్నఆత్మ న్యూనతా భావం(inferiority complex) జీర్ణించుకు పొయిన పెద్దలు, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని చీదరించుకొని అవహేళన చేయటం మొదలెట్టారు. వారే సంస్కృతం ఒక మృతభాష అన్న వాదన లేవనెత్తారు.

ఈ నాడు మనం రాజకీయ బానిసత్వం నుండి విముక్తి పొందినా సాంస్కృతికంగా బానిసత్వం దృఢంగా పాతుకు పోయింది.

అయితే ఈ నాడు కొందరు సామాన్య భాషా ప్రేమికులు, దేశ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలనే తపన కలిగిన వారి ప్రయాస ఫలితంగా, ఇటువంటి వారసత్వాన్ని మనకందించిన ఈ అమృత భాషను ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళటానికి గత 35 సంవత్సరాలగా అతి పెద్ద వుద్యమ రూపంలో ప్రయత్నాలు జరుగుతూ వున్నాయి.

అదే సంస్కృత భారతి అనే సంస్థ ఆవిర్భావానికి నాంది పలికింది.
దీనికి మనవంతు సహాయ సహకారాలు కూడా ఎంతో ఆవశ్యకం. మన మాతృ భాషను మన మాతృభూమిని మరిచిపోవటం ఎంతఘోరమో దేశ భాషలకన్నిటికి మూలమైన సంస్కృత భాషను విస్మరించటం అంత కంటే ఘోరం.

స్థిరమైన రాష్ట్ర సాధనకు కేవలం ప్రాపంచిక ధ్యేయాలు వుండగానే సరిపోదు. రాష్ట్ర ఉద్యమ సాధన లో ముఖ్యబలహీనత ఆ నాటి ఇంగ్లాండ్‌ను ప్రేమించినంతగా మనం మన దేశాన్ని ప్రేమించకపోవటమే. ఆంగ్లేయులు అందిస్తున్న శాస్త్ర పరిఙానము అంది పుచ్చుకొని వారితో వ్యాపారసరళిలో పోటి పడి వారిని అధిగమించలన్న తాపత్రయంలోమన మూలాలు, మన కళలు సాహిత్యం వీలయినంత మరిచి పోయినాము.

ఈ అభిప్రాయం వెలిబుచ్చినవారు డా. ఆనందా కెన్‌టిష్ కుమారస్వామి(1877-1947) అనే శాస్త్రవేత్త.

అదే విషయానికి వస్తే ప్రాచ్య దేశాలలో అధికారిక సహకారం లేకుండానే వారి మాతృ భాషల పునరుజ్జీవనం నిరాటంకంగా సాగుతున్నది.

ఇజ్రాయిల్ స్వాతంత్ర్యం పొందిన తరువాత ఎలైజర్ బెన్ యహుదా(1858-1922) ఆ దేశపు పురాతన భాష అయిన హిబ్రూ ను పునరుద్దరించటానికి ముమ్మరంగా వుద్యమించాడు.

వివిధ పత్రికలలో సంబంధించిన వ్యాసాలను ప్రచురించాడు. ప్రకటనలు చేసాడు. revivor of the hebrew language గా ప్రజల చేత కొనియాడబడ్డ ఆయన అవిశ్రాంతంగా శ్రమించి ప్రజలలో చైతన్యం తిసుకు రావటానికి శతృవర్గాలతొ పోరాటం సాగించవలసి వచ్చింది.

తత్ఫలితంగా బెన్ యాహుదా డిక్డ్షనరీ ఆవిర్భవించింది.

జ్యూయిష్ భక్తుల ప్రయత్న ఫలితంగా ఈ నాడు ఆధునిక హిబ్రూ మళ్ళీ జన్మ ఎత్తి పునరుద్ధరింపబడి ఇజ్రాయిల్ దేశంలో అత్యధిక ప్రజలచే సంభాషణ రూపంలో ప్రచారం పొందగలిగింది. ఈ సమరమంతా ప్రభుత్వ వ్యతిరేకంగా జరపబడ్డది.

అదృష్టవశాత్తు మన దేశంలో భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ లో భాగంగా రాష్ట్రియసంస్కృత సంస్తాన్ స్థాపించి 2000 సంవత్సరం నుండి శ్రావణ పూర్ణిమ సంస్కృత దినంగా ప్రకటించటం చాల ఆనందకరమైన విషయం.

ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహం అనే చేయూత అందుకొని మనమందరము కూడా అవకాశం వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కొద్దో గొప్పో సంస్కృత భాష లో సంభాషించటం అభ్యసిస్తే మన భాష సంస్కృతి తరతరాలగా మన వారసత్వంగా అందించకలుగే శక్తి పొందగలిగిన వారమవుతాము. అందుకు ప్రజల సహకారం ఎంతొ అవసరం.
వదత సంస్కృతం. పఠత సంస్కృతం

-------------------------------శుభోదయం -------------------------------------
మహాత్మా,గురుదేవానాం అశ్రుపాతః క్షితౌ యది
దేశభంగో మహా దుఖః మరణంచ భావే ధృవం
అర్థము:-- మహాత్ములు, గురువులు, మంచి మనసు కలిగినవారికి దుఃఖము కలిగి వారి కన్నీరు గానీ,రక్తము గానీ భూమిపై పడినచో దేశ నాశనము,మహా దుఃఖము, కరువులు,సామూహిక మరణములు (రైలు, వరద ప్రమాదాలు)తప్పక సంభవించును.
మహా భారతములో ఉత్తర గోగ్రహణ ఘట్టము లో విరాట రాజు కంకుభట్టు(ధర్మరాజు) తో జూదమాడుతుండగా
ప్రతీహారి వచ్చి ఉత్తరుడు కౌరవులను ఓడించి గోవులను మరలించుకొని వస్తున్నాడను వార్త చెప్తాడు. అప్పుడు విరాట రాజు సంతోషముతో ఆ వార్తహరునికి ముత్యాల దండ బహూకరిస్తాడు. అప్పుడు కంకుభట్టు(ధర్మరాజు) ఈ విజయము బృహన్నలదే అయి వుంటుంది. అని అంటాడు. అప్పుడు ద్రుపదుడు నీవు అసూయతో నా కుమారుడిని అవమానిస్తున్నావు. ఆ పేడి వాడు యుద్ధము చేయడ మేమిటి యని చేతిలోని పాచికలను భట్టు మీదికి విసిరి వేస్తాడు. అతని నుదుటి నుండి రక్తము కారుతుండగా, అక్కడనే వున్న సైరంధ్రి (ద్రౌపది)పరుగెత్తి వచ్చి తన చీర కొంగుతో ఆ రక్తాన్ని ఆపుతుంది. అప్పుడు ద్రుపదుడు పెద్ద పతివ్రత నంటావే మరి పర పురుషుడిని ఎలా ముట్టుకున్నావు?అంటాడు. అప్పుడు ద్రౌపది ఈయన రక్తపు బొట్లు ఎన్ని భూమి మీద పడతాయో అన్ని సంవత్సరాలు మీ దేశము లో కరువు సంభవిస్తుంది. మీ రాజ్యము మేలు కోరే నేనీ రక్తాన్ని అపినాను. అని అంటుంది. మహాత్ముల రక్తానికి, కన్నీటికి అంత శక్తి వుంటుంది.
----------------------------------సుప్రభాతం---------------------------------------------------
సురవరం ప్రతాపరెడ్డి అనగానే 'ఆంధ్రుల సాంఘికచరిత్ర"గుర్తుకొస్తుంది.మన పూర్వీకుల
కట్టూ,బొట్టూ ఆచారవ్యవహారాలు,తదితర విషయాల పై అసాధారణ పరిశోధన చేసి సాధికారిక సమాచారాన్ని అందించిన మహా మనీషి ఆయన.'గోలుకొండ కవుల సంచిక "
ద్వారా తెలంగాణా లోని కవుల ప్రతిభా సంపత్తిని లోకానికి చాటారు. కవి,కథకుడు,పత్రికా
సంపాదకుడు కూడా యయిన ఆయనకు అమ్మ భాషంటే చాలా యిష్టం 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' పుస్తకం చివర్లో ఆయన ఈ పద్యమే దీనికి నిదర్శనం.

పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు
అలంపురీ నందనారామ విభ్రాజి మల్గోబఫలరాజ మధురరుచికి
ఆంధ్రీకుమారీ యీ సమాయుక్త పరిపూత తుంగా పయస్సు మాధుర్యమునకు
ఖండశర్కర,జాజి,ఖర్జూర,గోక్షీర ద్రాక్షాదియుత రామరసమునకును
అమృత నిష్యంచి పల్లకీ హ్లాదమునకు
రాగిణీ దివ్య సమ్మోహ రాగమునకు
తేనెతేటల నవకంపు సోనలకును
సాటియగును మా తెనుగు భాషామతల్లి

పవిత్ర జలతరంగాలతో ఉద్వేగంగా పారే గోదావరీ నది గంభీర గమనానికి . అలంపురం
అనే నందనోద్యానవనం లో ప్రకాశించే మల్గోబా మామిడిపళ్ళ మధుర రుచికి,హంద్రీ
(ఆంధ్రీకుమారి)నది తో కలిసిన పావన తుంగభద్రా నదీ జలాల మాధుర్యానికి ఖండ
శర్కర,జాజాజికాయ,ఖర్జూరం,ఆవుపాలు, ద్రాక్ష మొదలైనవి కలిపి చేసిన రామరసానికి
అమృతోపమానమైన వీణావాదనకు, గాయని గొంతునుంచి జాలువారుతూ సమ్మోహన పరిచే రాగానికి,స్వచ్ఛమైన తేనెవానలకు సాటి మా తెలుగు. ఇదీ సురవరం గారి భాషాభిమానం.భాషను మాతృమూర్తి తో పోలుస్తూ అటు సుందరంబాడి సుందరాచారి
'మా తెలుగుతల్లి' అన్న సమయంలోనే (1940 దశకం లో )యిటు సురవరం కూడా అదే భావాన్ని వ్యక్తం చేయడం విశేషం.

తామరాకుపై నీటిబొట్టు..............

ఏ లంపటాలూ అంటించుకొని
ఉన్నత వ్యక్తిత్వానికి పోలిక,
ఉదాత్త భావాలకు,
మెప్పుకోలుకుమురిసి,
ఎదురుచూసి,
నిరాశకులోనవని
అంతరంగ నిర్మలతకు.....
ఎదుటి వారి లక్షణాలకు
లొంగని ఆత్మవిశ్వాసానికీ,
స్వచ్చతకూ,స్వేచ్చకూ....
ఎటుకదిపితేఅటుకదులుతూ..
తనఅస్తిత్వాన్నినిలబెట్టుకుంటూ.
మలయజ -

మలయజ వృత్తమునకు గణములు న/జ/న/స/న/న/భ/న/లగ, అనగా ఏడు చతుర్మాత్రలు, ఒక గురువు. దీనిని కూడశరషట్పదిలా వ్రాయ వీలగును. క్రింద నా ఉదాహరణములు -

మలయజ - న/జ/న/స/న/న/భ/న/లగ
IIII UII - IIII UII - IIII IIII - UII IIII U

26 ఉత్కృతి 33288224

మధురము శీర్షము
మధురము పింఛము
మధురము నామము - మధుహరికిన్
మధురము వాతెఱ
మధురము వాణియు
మధురము బాణియు - మధురిపుకున్
మధురము హాసము
మధురము లాసము
మధురము రాసము - మలహరికిన్
మధురమె యందము
మధురము డెందము
మధురము బంధము - మధురునకున్

మలయజ వాతము
లల లన వీచెను
గలగల సవ్వడి - గలిగెనుగా
మిలమిలమంచును
మెలమెల తారలు
విలసిత మయ్యెను - వెలుఁగులతో
చలితము లయ్యెను
జ్వలితము లయ్యెను
బలు కుసుమమ్ములు - వనములలో
కలరవ మెల్లెడఁ
బులుఁగులు సల్పఁగఁ
జెలఁగెగ నామని - సిరి యనఁగా

మనమున దల్చెను
వనితయు మాధవు
దినమును రాత్రియు - దేవుఁ డనన్
వనమున గాలిని
గను ప్రతి పుల్గును
దన చెలికానికిఁ - దల్లడమున్
గనఁగను రమ్మని
వినఁగను రమ్మని
పనిచెను పాపము - భామినియున్
బ్రణయపు పల్లవి
మనసున మౌనము
వినఁగను రాఁడయె - వెన్నుఁడు దాన్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

భువనమోహన -

చాలమంది ఛందస్సు అంటే మాలికావిక్రీడితములవంటి ఖ్యాత వృత్తములు, కందము, సీసము, గీతులు, మరికొన్ని విశేష వృత్తములు అని అనుకొంటారు. పై ఛందస్సులలో వ్రాయడానికి శక్తి సామర్థ్యాలను గడించాలి, అందులో సందేహము లేదు. కాని ఛందస్సు అంటే ఇవి మాత్రమే కాదు. అది ఒక మహాసాగరము. మనము మాటలాడే మాటలలో ఛందస్సు ఉన్నది, పాడే పాటలలో ఛందస్సు ఉన్నది, వాడే సామెతలలో ఛందస్సు ఉన్నది, ఆడే ఆటలలో ఛందస్సు ఉన్నది.

ఇందుగల దందు లేదని
సందేహము వలదు మనము - ఛందమ్ముల నెం-
దెందు వెదకి చూచిన నం-
దందే కాంచంగ నగును - హరుసముతోడన్

నిన్నరాత్రి పడుకొనేటప్ప్పుడు ఎందుకో "ననుపాలింపగ నడచి వచ్చితివొ" అనే పాట జ్ఞాపకానికి వచ్చినది. ఆ పంక్తిలోని ఛందస్సు నన్ను ఆకర్షించినది. అందులో వరుసగా రెండు చతుర్మాత్రలు (స-గణము, భ-గణము), రెండు చతుర్మాత్రలు కాని ఒక అష్టమాత్ర (IIIUIII) ఉన్నాయి. ఇట్టి అమరిక మాలతి వర్గమునకు చెందినదని నేను వ్రాసిన అష్టమాత్ర వృత్తములు అనే వ్యాసములో తెలిపియున్నాను. "ననుపాలింపగ నడచి వచ్చితివొ" ఛందస్సుతో ఉండే వృత్తమును భువనమోహన అని పిలువ దలచినాను. క్రింద భువనమోహన వృత్తమునకు నా ఉదాహరణములు -

భువనమోహన - స/భ/న/భ/ల
13 అతిజగతి 7668

ఘనపాపమ్ముల - కడలిలోన వడి
మునుగన్ జేయకు - భువనమోహనుఁడ
నను పాలింపగ - నడచి వచ్చితివొ
నిను నే నమ్మితి - నెనరు నిండ మది

చెలువుం డెక్కడ - చెలఁగెనో యెఱుఁగ
చెలియా చెప్పవె - చెదరె నీహృదియు
వలలో నుంటిని - వలపు చేపగను
వెలుఁగే లేదయె - విరహ నక్తమున

నిను నే జూచిన - నిముసమందుఁ జెలి
మనమే నందన - మయెను నేఁడిచట
కనరా వేగము - కలువకంటి నను
వినఁగా గీతముఁ - బ్రియ వినోదముగ

తమిలో వెల్గెడు - తరళ తారకగ
భ్రమలన్ బాపెడు - ప్రణయ దీపికగ
విమలాంభోనిధి - వెలయు వీచివలె
సుమనోరంజని - సుదతి రా దరికి

రమణీయమ్మగు - రజత రాత్రి యిది
కమనీయమ్మగు - కవిత పాడె మది
రమణీ రాదరి - ప్రణయసంగమపు
కమనీయమ్మగు - గడియ వచ్చెఁగద

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


-------------------------------సుప్రభాతం --------------------------------------------
వినుకొండ లో రాజు దగ్గర రామయ భాస్కరుడు అనే మంత్రి వుండేవాడు.ఆయన సమర్థుడైన మంత్రి,గొప్ప
పరాక్రమశాలి,గొప్ప కవి, మంచి దాన కర్ణు డని పేరున్నవాడు.(ఆయనను పదమూడవ ఆదిత్యుడనేవారట ) ఒకసారి నారదుడు .భూలోకానికి వచ్చి ఆయన పరాక్రమము,దానగుణము, పాండిత్యము చూసి ఆశ్చర్య పోయి బ్రహ్మ లోకానికి పోయి తండ్రితో యిలాగ అన్నాడట.
సరి బేసైరిపుడేల భాస్కరులు భాషానాథా!పుత్రా వసుం
ధర యందొక్కడు మంత్రి యయ్యె వినుకొండన్ రామయామాత్య భా
స్కరుడో యౌ నయినన్ సహస్ర కర శాఖల్ లేవే యవే వున్నవే
తిరమై దానము సేయుచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయుచో .
తా:-- మనకు ద్వాదశాదిత్యులు వున్నారని ప్రతీతి.(ద్వాదశ అంటే పండ్రెండు) నారదుడు తన తండ్రి యైన
బ్రహ్మతో, భాషా నాథా!(సరస్వతీదేవి భర్త) సరి గా(పండ్రెండు మంది ) వుండిన భాస్కరులు యిపుడు పదమూడుమంది (బేసి అయినారు)అయినారట ఎందుకు? అన్నాడు బ్రహ్మ దేవుడు అవును పుత్రా! భూలోకం లో వినుకొండ లో
రామయా మాత్య భాస్కరుడు.ఒకడున్నాడు.అప్పుడు నారదుడు అవునా ,మరి అతనికి సహస్ర కిరణాలేవీ?ఎక్కడ?
బ్రహ్మ యిలా అన్నాడట, అవి వున్నాయే స్థిరముగా దానము చేసేటప్పుడు, శత్రువులను తన కత్తితో
చంపేటప్పుడు, కవిత్వం వ్రాసేటప్పుడు ఆయనకు వేయి చేతులువుంటాయి. అంటే ఆయన దానము చేసేటప్పుడు వేయి చేతులతో దానం చేస్తాడట,యుద్ధం లో శత్రువులను తనవేయి చేతులతో ఖండిస్తాడట,
కవిత్వం వ్రాసేటప్పుడు వేయి చేతులతో వ్రాస్తాడట. (అన్నింటి లోనూ అంత వేగం వుంటుందని అర్థం)
ఇదొక చాటు పద్యము.చెప్పిన కవి ఎవరో తెలీదు.
-------------------------------శుభోదయం -----------------------------------------------
ధారానగరము లో యజ్ఞవర్మ అనే బ్రాహ్మణుడు వుండే వాడు. అతను పేదవాడు . కానీ ఎవ్వరిదగ్గారా చేయి చాచి యాచించే వాడు కాదు.వారు సంపాదించిన డబ్బు న్యాయమైనది కాకపొతే తనకు పాపం కలుగుతుందని అది అపరిగ్రహ మని (తీసుకో కూడనిది) అతని అభిప్రాయము. అతడు . నిత్యాగ్ని హోత్రి. తనకు వున్నకొద్దిపాటి పొలము లో పండిన కొద్దిపాటి ధాన్యము అమ్మిన డబ్బుతోనే జీవనం సాగిస్తూ వుండే వాడు.అతని భార్యకు అత్యాశ. భోజరాజు దగ్గరకు వెళ్లి కవిత్వం చెప్పి డబ్బు సంపాదించరాదా అని రోజూ పోరుతూ వుండేది.మనకు అగ్ని దేవుడే రక్షకుడు. ఆయన యెంత యిస్తే మనకు అదే మహాప్రసాదము అనేవాడు. కొనాళ్ళకి భార్య పోరు పడలేక భోజరాజు దగ్గరకు వెళ్లి ఆయనను ఆశీర్వ దిస్తూ శ్లోకాలు చెప్పాడు . రాజు ఆయనకు బహుమానం యివ్వ బోగా రాజా రాజులసోమ్ము క్రూర క్రియార్జితము తాము కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైనా వుంటే ఒక్క రూకైనా చాలు నాకు యిప్పించండి అన్నాడు . రాజు సరే రేపు రండి అని చెప్తాడు. ఆ దినం రాత్రి భోజరాజు మారువేషము లో వెళ్లి ఒక కమ్మరివాని దగ్గర సమ్మెట కొట్టి అతను 16 రూకలు యిస్తే అవి తీసుకొని వస్తాడు. మరుదినం ఆ పదహారు రూకలు యజ్ఞవర్మకు యిచ్చి మహాత్మా యివి నేను రాత్రి సమ్మెట కొట్టి సంపాదించిన డబ్బు స్వీకరించండి అని యిచ్చాడు . యజ్ఞవర్మమహాప్రసాదం అని అవి తీసుకొని వచ్చి భార్య చేతిలో పెట్టాడు . రాజు దగ్గరకు వెళ్లి లక్షలు తెస్తా వనుకుంటే ఈ వెధవ 16 రూకలా మీరు తెచ్చింది అని కోపంగా అక్కడే వెలుగుతున్న అగ్ని హోత్రం లోకి విసిరి వేసింది.. యజ్ఞ వర్మ అయ్యో అని స్నానం చేసి వచ్చి మెల్లిగా ఆ రూకల్ని ఒక్కొకటిగా బయటికి తీస్తున్నాడు . అవి బంగారు నాణాలుగామారి వచ్చాయి.. యింకా ఎన్ని మార్లు తీసినా ఆక్షయముగా
వస్తూనే వున్నాయి . అతను భార్యతో చూశావా కష్ట పడి సంపాదించిన ధనమునకు యెంత మహత్తు వున్నదో అని అన్నాడు .నీతి;- మనం కష్టపడి సంపాదించిన డబ్బే మనకు అక్షయ మవుతుంది. .
మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ...

చిత్రం : యువరాజు (2000)
సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర, రమణగోగుల

పల్లవి :

మనసేమో చెప్పిన మాటే వినదు...అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు...అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఆ కళ్ళే ఆశలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు
ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో

అధరం మధురం నయనం మధురం
వచనం మధురం వదనం మధురం
చరణం మధురం మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం

చరణం : 1

నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా

చరణం : 2

సరసం విరసం విరహం సరిగమ సంగీతం
చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం
అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని
ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే

https://www.youtube.com/watch?v=py3gxhXN5FY

యుగాలెన్ని రానీ పోనీ ముగింపంటు లేనేలేనీ కథే మనం కాదా అననీ

చిత్రం : ముకుంద (2014)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మిక్కీ జె మేయర్, సాయి శివాని

దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్

యుగాలెన్ని రానీ పోనీ
ముగింపంటు లేనేలేనీ
కథే మనం కాదా అననీ...
సమీపాన వున్నాగానీ
కదల్లేని ఈ దూరాన్నీ
మరో అడుగు ముందుకు రానీ..

నిను నను జత కలిపితె గాని
తన పని పూర్తవదనుకోని
మన వెనుకనె తరుముతు రానీ ఈ క్షణాన్నీ...
గడిచిన ప్రతి జన్మ రుణాన్ని
మరిచిన మది నిదరని కరిగించే..
నిజం ఇదే..నని
మరి ఒకసారి ముడిపడుతున్న
అనుబంధాన్ని చూడని

ప్రతి మలుపు దారి చూపద
గంగా సాగర సంగమానికి
ప్రతి చినుకు వంతెనేయద
నింగీ నేలని కలపడానికి
ఏ కాలం.. ఆపిందీ.. ఆ కలయికనీ...
ప్రణయమెపుడు అడిగిందీ
ఎటు ఉంది తొలకరి రమ్మనీ
ఎపుడెదురవుతుంది తానని

ఏ స్వప్నం తనకి సొంతమో
చూపించాలా కంటి పాపకి
ఏ స్నేహం తనకి చైత్రమో
వివరించాలా పూల తోటకీ
వేరెవరో... చెప్పాలా...
తన మనసిదనీ..
కాని ఎవరినడగాలి
తానేవ్వరి గుండెల గూటిలో
ఊపిరిగా కొలువుండాలని

https://www.youtube.com/watch?v=z2ofYACoo90

 తెలుగు సీసంలో సమస్య. ఇచ్చిన క్లూలను బట్టి సమాధానం చెప్పండి.

దశరధాగ్రసుతుండు శశియునుబట్టణం బొకపేరులోపల నుండవలయు
దర్పకాంతకుడు నేత్రంబునుమాలయు నొకపేరులోపలనుండవలయు
వేల్పునుత్రోవయువెలయుబ్రసూనంబు నొకపేరులోపల నుండవలయు
కనకంబుకార్పాసమొనరమహీజంబు నొకపేర్లోపలనుండవలయు

దీనియర్థముదెలియగబూనుకొనుచు
మదివిచారించిపదునైదుమాసములను
సమ్మతిగజెప్పభావజ్ఞచక్రవర్తి
చెప్పలేకున్న నగుదు నేచిన్ని నగవు

నానర్ధగాంభీర్య చమత్కారిక నుండి.

--------------------శుభోదయం- సుభాషితం ----------------------------------------
అతిథౌ తిష్ఠతి ద్వారే హ్యాపో గృహ్ణాతి యో నరః
ఆపోశనం సురాపానం అన్నం గోమాంస భక్షణం
అర్థము:-అతిథులు మన గుమ్మము ముందు కూర్చున్నప్పుడు.మనము భుజించ కూడదు.అలా భుజిస్తే మనం పట్టిన ఆపోశనం సురాపానం తోనూ అన్నం గోమాంసం తోనూ సమానమవుతుంది.
మాచిన్నప్పుడు మా తాతగారు భోజనం చేస్తున్నప్పుడు బయట ఏ బిచ్చగాడైనా అమ్మా
భవతీ భిక్షావం దేహీ అని అరిస్తే మా తాతగారు మా అమ్మతో అనేవారు.శాంతమ్మా!ముందు
వాడికే వేసి రా తర్వాత నాకు వడ్ఢిద్దువుగానీ.అని అనేవారు.

--------------------------శుభోదయం-----------------------------------------

ఇప్పుడు కృష్ణమ్మ పన్నెండేళ్ల పండుగ.అప్పుడే వారం రోజులు గడిచి పోయాయి."వారో దరినీ వీరో దరినీ కృష్ణమ్మ పిలిచింది అందరినీ" అని పాడుకోవాలి. కృష్ణమ్మ విందు భలే పసందు.ఆమె తెలుగువారి నిధి.
తెలుగు 'వారి' నిధి.ఆమె జీవనది.
రసికుడు పోవఁడు పల్నా
డెసగంగా రంభ యైన యేకులె వడకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్
అని కవిసార్వభౌముడు జాలి చూపించిన పల్నాడును సస్యశ్యామలం చేసింది కృష్ణమ్మేగా.
'పలనాడు వెలలేని మాగాణిరా' యని పులుసుల వెంకటకృష్ణయ్య వంటి వారు కవితా గానం చేశారు కూడా.అందుకే "పోషయతీతి పుష్కరం" అన్నారు.పుష్కరాలప్పుడే గాదు
ఎల్లప్పుడూ ఆ తల్లే పోషిస్తుంది అందరిని.
"తెలుగింటికే రాణి మా కృష్ణవేణి
మా అన్నపూర్ణమ్మ పసుపు పారాణి"
అని సినీ కవి వేటూరి సుందరరామమూర్తి అంటే "కదలిరా కదలిరా కడలిరాయని రాణి
ఎదురుచూచు చున్నది తెల్లని మాగాణి"అని జంధ్యాల పాపయ్యశాస్త్రి కొనియాడారు.భారతమాతకు ప్రీతీ పాత్రమైన మువ్వన్నె పతాకాన్ని అందించినదెవరు?
కృష్ణమ్మ ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య.గారు.
అమ్మ పిలిచిందనగానే 'పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పై పైకి' అని
మితిమీరిన ఉత్సాహంతో పరిగెత్తకండి.అది మహా ప్రస్తానం యిది పుష్కర స్నానం పెళ్లి
నడక నడిచినా ఇబ్బందేమీ లేదు.అడుగులో అడుగేసుకుంటూ వెళ్లినా కృష్ణమ్మ దయ ఎలాగూ వుంటుంది,పుణ్యం ఎలాగూ వస్తుంది.అంత తొందరెందుకు?కృష్ణమ్మకూ మనకూ
మధుర స్మృతులే మిగలాలి.
ఆమధ్య నదీమాతలు సమావేశ మయ్యారట.వారందరికీ కృష్ణంమంటే కన్ను కుట్టిందట.
అందులో ఆశ్చర్యమేమీ లేదు.ఆమె స్థాయి అలాంటిది

"గంగా సంగమ మిచ్చగించునె మదిన్ కావేరి దేవేరిగా
నంగీకార మొనర్చునే, యమునతో నానందముం బొందునే
రంగత్తుంగ తరంగ హస్తముల నా రత్నాకరేంద్రు నీ
యంగంబంటి సుఖించెనేని గుణభద్రా తుంగభద్రా నదీ"

అని వికటకవి తెనాలి రామకృష్ణుడు వూరికే అన్నాడా? "గంగా స్నానం తుంగాపానం"
అనే సామెత వూరికే పుడుతుందా?అలాంటి తుంగభద్రా నది కృష్ణా నదికి ఉపనది.
గగనం లో తనప్రగతిని 'వెలుగెత్తి' చాటుతున్న తెలుగు పతాకకూ కృష్ణమ్మే ప్రేరణ.
"తల్లి కృష్ణవేణి భవత్తటము నందె
మోసెనాంధ్ర పతాక ముమ్మొదటి దెగసి
తెలుగువయి నీ దీవెనలు గడించి
యెత్తె తెరచాప దీవుల నెల్ల నెత్తి
ఖండ ఖండాల నాగరికతలు మెరుగు
లల్లనల్లన నీ ప్రజ కుంటియుంటి
కృష్ణవేణి యుదాత్త సంస్కృతి యెవండు
వెడలె భవదగారమ్మున విశ్వహితము "
అని తెలుగు ప్రేమమూర్తి తుమ్మల సీతారామమూర్తి అన్నారు.
కృష్ణానది నీళ్లను చూస్తే 'ఎవరన్నారని నీళ్లు యని / అరెరే! అమృతం లా ప్రవహించే
అక్షరాలవి' అని అనాలనిపిస్తుంది.
విశ్వనాధ సత్యనారాయణ గారు కృష్ణమ్మకు పూజ చేసిన తీరు ఎంతో గొప్పది.

కృష్ణా తరంగ నిర్ణిద్ర గానము తోడ
శిల్పమ్ము తొలిపూజ సేయునాడు
అక్షర జ్ఞాన మెరుగదో యాంధ్ర జాతి
విమల కృష్ణా నదీ సైకతములందు
కోకిలపు బాట పిచ్చుక గూండ్లు కట్టి
నేర్చుకున్నది పూర్ణిమా నిశలయందు" అన్నారు.

ఆమె పాటల డోల మా ఘంటసాల
ఆమె ఆటల హేల మా కూచిపూడి
గళం విప్పితే హాయి మా పిలవాయి
ఆ కృష్ణ మురళి లే మా బాలమురళి
ఆంధ్రజాతికి జాగృతే నందమూరి
జాతి జండా శిల్పి మా పింగళి"
అంటారు వేటూరి.
కృష్ణా నది పొడవునా ఎందరో దేవుళ్ళు కొలువుదీరి వున్నారు.

కదలిరావే కృష్ణవేణి /శ్రీశైలమల్లన్న ఆశీస్సుధలు చిలుక /నాగార్జునులు నీకు స్వాగతమ్ము
ను చిలుక / వేదాద్రి నరసింహు పాదాలు స్పర్శించు /ఆమరేశ్వరస్వామి ఆలయము దర్శించి /గణగణా మోగేటి మణిమేఖల ధరించి /కనకదుర్గమ్మ గుడిగంటలకు పులకించి
చిరునవ్వు పొరలలో సిరులు నిండించుకొని/అలలో బంగారు కలలు పండించుకొని
అని కరుణశ్రీ కవితాగానం అదే దేవతాగానం చేశారు.
మహాకవి దాశరథి యిలా అన్నారు.

తల్లి నీ పాద తీర్థమ్ము త్రావినాము
నీదు బిడ్డల గుండెలనిండ నీవు
ధారవోతువు కరుణా సుధారసమ్ము
ఇంద్రకీలాచల మ్మెంత యెత్తో అంత
లోతునీ గుండె!మా దివ్య మాతవమ్మ
కృష్ణవేణమ్మ!తెలుగమ్మ!తృష్ణవాపి
మాకు జ్ఞానదానము చేసి మనుపుమమ్మ

అవును... కృష్ణానదీ కరుణాపయోనిధీ!నిజమే కృష్ణమ్మా నీకు ఎల్లలు లేవు,నీకు కల్లలు లేవు జలదేకమాతా నమస్తేనమస్తే!

(శంకరనారాయణ) ( తెలుగువెలుగు సౌజన్యముతో)
పవిత్ర రక్షాబంధన శుభాకాంక్షలు-3!!!
మీ ప్రభు!!! 18082016-త్రీ రిపోర్టింగ్!!
సరదాగా తీసుకోవాలండోయ్, మరి!!
ఈ రోజు అమ్మాయి ఫోన్ చేసింది...
పాపం చాలా ఏడ్చింది!!!
నీతో ఎప్పుడూ పోట్లాడను....
నువ్వు చెప్పినట్లే వింటాను ...
నీ మాటా జవదాటను ....
నిజం...ఒట్టు..!! ...........
అంది...
హాశ్చర్య పోయాను .....
నేను వింటున్నది కలా???....
నిజమా ?? అనుకున్నాను....
కల కాదు....నిజమే...!!
కానీ అంతలోనే ....గాలి బుడగలా పేలిపోయింది ...
నాకు వచ్చింది రాంగ్ నంబర్!!

కల్పవల్లియుఁబోలు కౌఁదీఁగెనునుకాంతి
మెఱుఁగుదీగెలతోడ మేలమాడ
పసిఁడికుండలఁబోలు పాలిండ్లుకవకట్టు
చక్రవాకములతో సాటిసేయు
గండుమీలనుబోలు కన్నులచెలువంబు
నీలోత్పలంబుల గేలిసేయు
నిండుచందురుఁబోలు నెమ్మోముదీధితి
కమలపత్రంబులకాంతి నవ్వ

మొనసి నిఖిలభువనమోహనలక్షియై
పరఁగుచున్న పద్మపాణి వాణి
నన్ను నమ్మినారు నావారు వీరని
వాకు లిచ్చుఁగాత మాకు నెపుడు

పోతనామాత్య " వీరభద్ర విజయము" నుండి
నేడు శ్రావణ పూర్ణిమ
సంస్కృత భాషా దినోత్సవం కూడా
మన భాష గొప్పదనాన్ని
ఒక్కసారి తెలుసుకుందాం!
దీర్ఘాయుష్మాన్ భవ అంటే?
చాలా సంవత్సరాల క్రితం
కంచి మహాస్వామి వారి దర్శనానికి
నలుగురైదుగురు పండితులు వచ్చారు.
న కర్మణా న ప్రజయా ధనేన
త్యాగేనైకే అమృతత్వమానసుః.
అంటూ.... స్వామి వారికి
సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ,
ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు.
“భక్తులు నాకు నమస్కరిస్తే,
నేను వారిని “నారాయణ నారాయణ”
అని ఆశీర్వదిస్తాను. మరి మీరు?
గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”
మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’
అని అశీర్వదిస్తాము
అదే సంప్రదాయము” అని అన్నారు.
”అంటే ఏమిటి?” అని
మహాస్వామి వారు ప్రశ్నించారు.
”చాలాకాలం సౌఖ్యంగా ఉండు”
అని దీని అర్థం.
మహాస్వామి వారు
అక్కడ ఉన్న
అందరు పండితులను
అదే ప్రశ్న వేసారు.
అందరూ అదే సమాధానం చెప్పారు.
మహాస్వామి వారు
కొద్ది సేపు మౌనంగా ఉండి,
“మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు.
పండితులు ప్రశ్నార్థకంగా చూసారు.
వాళ్ళందరూ పెద్ద పెద్ద విద్వాంసులు.
సంస్కృత వ్యాకరణాలలో దిట్టలు
తర్క మీమాంసా శిరోమణులు.
మంచి విద్వత్ కలిగిన వారు.
సంస్కృత వాక్యం చాల చిన్నది
“దీర్ఘాయుష్మాన్ భవ” అనునది
చాలా సామాన్యము.
సంస్కృత పరిజ్ఞానము
ఏమి లేకపోయిననూ
అర్థమగును.........కానీ
మన మహాస్వామి వారు
ఆ అర్థము తప్పు అంటున్నారు
అని పండితులు ఒకరి మొహాలు
ఒకరు చూసుకుంటున్నారు.
వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు
”నేను చెప్పనా దాని అర్థం” అని అన్నారు. పండితులంతా చెవులు రిక్కించారు.
”పంచాంగములోని
(తిథి వార నక్షత్ర యోగ కరణ)
పంచ అంగములలో ఉన్న
27 యోగములలో ఒకటి
ఆయుష్మాన్ యోగము,
11 కరణములలో ఒకటి
భవకరణము,
వారములలో సౌమ్య వాసరము
అంటే బుధవారము అని అర్థం.
ఎప్పుడైతే ఇవి మూడు
అంటే ‘ఆయుష్మాన్-యోగము’,
‘భవ-కరణము’,
‘సౌమ్యవాసరము-బుధవారము’
కలిసి వస్తాయో అది శ్లాఘ్యము-
అంటే చాలా శుభప్రదము
మరియు యోగ కారకము.
కావున ఇవి మూడు కలిసిన రోజున
ఏమేమి మంచి ఫలములు
సంభవమగునో అవి నీకు
ప్రాప్తించుగాక” అని అర్థం.
ఈ మాటలు విన్న వెంటనే
ఆ పండితులు ఆశ్చర్యపోయి,
అందరూ మహాస్వామి వారికి
సాష్టాంగం చేసి నమస్కరించారు.
ఒక చిన్ని ఆశీర్వచనంలో
ఎంతర్ధముందో గమనించారా?
అదీ!మన మాతృభాషకి
తల్లి భాష!సంస్కృతం గొప్పదనం!
ఇక పిల్లను చెప్పాలంటారా?




No comments:

Post a Comment