Monday 4 June 2018

Pranjali Prabha

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం


విలంబిని నేను
వనాల విహరిస్తాను
అణువణువూనాదే
పవిత్ర ప్రదేశాలునావే

ఏడు రంగులలోన
ఏవో తెలియని మధురిమల
పులరింపజేస్తుంటాఎద
ఎదల సుధలకురిపించెద

పిల్లగాలులే నాపిల్లలు
ఉల్లములు వికసించ
మల్లెల పరిమళించ
మనోహర మోహాల
పరవశించ ఉరకలెత్త
తరగలై పరుగులెత్తసాగెదను
తొలిజల్లుల నా స్వాతి
చినుకులు
సోయగాల చల్లి మట్టివాసనలై
ఆశల చిగురించ ఆశయాల
మొలకత్తవానలై వరదలై
పుడమినంత తడిమి
అదిగో వేసవికి సెలవు చెప్పి
వర్ష విలంబిని వస్తున్నాను
రచన జయంత్ నమిలకొండ
మగువ మనసు (చందస్సు )

మది తలపులు వలపులు మగణి పరువములే

నయనముల కదలికలు నటన తమకములే

పరువముల పదనిసలు పగలు తడి సెగలే

కురులు మెరుపులు తనువుకు సరిగమలగునే



శిరులు కతలు తనువు శశి కళ కళ కళలే

మసలు యతలు తపనలు మది కరుణ వలలే

తెలుగు వెలుగు చదువులె తరుణి తమకములే

శిరి మళపుల తలపుల శివుడు కధ కలిపే

--((*))--
ఇంతకన్నా గొప్పగా నేనేమి చెప్పగలను ?
****************************
పొరుగువాడిని
ప్రవాసాంధ్రుడిని
తమిళదేశంలో వున్నవాడిని
మీకన్న గొప్పగా నేనేమి చెప్పగలను
కాని
తెలుగు గొప్పతనాన్ని
తెలుగేతరులే గొప్పగా చెప్పారు

పోని పెద్దలేం చెప్పారో చెప్పనా
ఆంధ్ర దేశంలో పుట్టడం అందునా తెలుగు వాడిగా పుట్టడం
పూర్వ జన్మ సుకృతం -అప్పయ్య దీక్షితులు
ఇంతకన్నా చెప్పగలనా నేను

కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు
మా తెలుగు తల్లివి - శంకరంబాడి
ఇంతకన్నా చెప్పగలనా నేను

తెలుగదేలన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ ,తెలుగొకొండ
ఎల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స -శ్రీకృష్ణదేవరాయలు
ఇంతకన్నా చెప్పగలనా నేను

తరపి వెన్నెల ఆణిముత్యాల సొబగు
పునుగు జవ్వాజి ఆమని పూలవలపు
మురళి రవళులు కస్తూరి పరిమళములు
కలిసి ఏర్పడే సుమ్మ మా తెలుగుభాష -నండూరి రామకృష్ణమాచార్యులు
ఇంతకన్నా చెప్పగలనా నేను

భాషలొక పదితెలిసిన ప్రభువు చూచి
భాషయనిన ఇద్దియని చెప్పబడిన భాష
-కవి సామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ
ఇంతకన్నాగొప్పగా చెప్పగలనా నేను

తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? - కాళోజి
ఇంతకన్నా గొప్పగా చెప్పగలనా నేను

ఇంతమంది చెపుతూనే వున్నారు
తెలుగుభాష గొప్పతనాన్ని గురించి
వినకుండా
తల్లి భాషను చంపెయ్యడం
తగదు మనకు
కడుపులో వున్న శిశువును తెలిసి తెలిసి చంపేస్తామే దానికి సమం.
ఆ పాపానికి ఒడిగట్టకండి.
మన భాష మనకి తెలియడం
మన ప్రధమ కర్తవ్యం
-గోటేటి వెంకటేశ్వరరావు

తుంగ - "తుంగ" షట్పది

తుంగ అని ఎనిమిది అక్షరాల వృత్తము ఒకటి ఉన్నది. ఇది అనుష్టుప్పు ఛందమునకు చెందినది, అందులో 64వ వృత్తము. ప్రతి పాదములో గణములు న/న/గగ, అనగా III III UU. క్రింద నా ఉదాహరణములు -

తుంగ - న/న/గగ III III UU
8 అనుష్టుప్పు 64

రయము నదియు తుంగ
మ్మయిన యలల సాఁగెన్
బయన మయెను వార్ధిన్
స్వయము తుదకుఁ జేరన్

మనసు పిలిచెఁ గాదా
వినఁగ మనసు లేదా
దినము రజని నీవే
యినుఁడు శశియు నీవే

ఇప్పుడీ తుంగ వృత్తపు అమరికతో ఒక షట్పదిని నిర్మిద్దామా? అసలు షట్పది లాటి అమరికలు ఒకే విధమైన పాదములు లేకుండా ఛందస్సుకు ఒక వైవిధ్యమును కలిగిస్తుంది. అప్పుడు పాట నడకలో monotony ఉండదు. తుంగ షట్పదికి 1,2,4,5 పాదములు తుంగవలెనే, అనగా 3, 3, 4 మాత్రలు. మూడవ, ఆఱవ పాదములలో చివర ఒక త్రిమాత్ర, ఒక గురువు అదనముగా ఉంటాయి. క్రింద "తుంగ"షట్పదికి నా ఉదాహరణములు -

తుంగ షట్పది - 3,3,4/3,3,4/3,3,4-3,2 మాత్రలు

నింగిలోని తారా
రంగఁ డెక్కడే హృ-
ద్రంగమందు నాడన్ - రాఁడుగా
మంగళమ్ము గల్గన్
తుంగ షట్పదిన్ నే
రంగనికయి వ్రాతున్ - రమ్యమై

మనసు పిలిచె రావా
దినము నిన్నె దేవా
వినఁగ రా సురావా - వేగమే
మనసు నాది నీకే
స్వనము నాది నీకే
యనఘ నీవు నాకే - యమల రా

జీవితమ్మ దేమో
నావ నడుపు టెవరో
యీ విషాదములతో - నెట్టులో
దైవ ముండు టెచటో
దైవ మండ యగునో
పూవు లేని ముండ్లే - మోదమా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
 చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు
నన్నయ తిక్కన ఎఱ్ఱన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు

హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు
గణయతిప్రాసల రసధ్వనిశాఖల కవితలల్లు పులుగు
నవ నవ పదముల కవితా రధముల సాగిపోవు నెలవు
అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు

అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు
శ్రీనాధుని కవితా సుధారలో అమర గంగ పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రసధారయై ధృవతారయై మనదేశ భాషలను లెస్సయై
దేవభాషతో చెలిమిచేసి పలు దేశదేశముల వాసికెక్కినది

మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు
మన భాష పాలకడలి - భావం మధుమురళి
అజంత పదముల అలంకృతం మనభాష అమృత జనితం
భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం

భార్య:- ఏమండీ!మీకునెల కోక సారి 'శాలరీ డే' అని ఒకటుంటుంది కదా! అలాగే మా ఆడవాళ్ళకూ "నెల కొక సారి "శారీ డే"అని ఒక రోజు వుంటే బాగుంటుంది కదా!
·
పెళ్లి సంబధం కుదిరింది.అబ్బాయికి ఏమికావాలని అమ్మాయి తరుపు వారు అడుగుతున్నారు.
ఫ్రిజ్,టీవీ,ఎ.సి ఏమి యిస్తామన్నా అన్నీ మాకున్నాయని అంటున్నారు మగ పెళ్లి వారు.చివరకు అమ్మాయి తరుపు వాళ్ళు మీరే చెప్పండి మీకేమి కావాలో అని అడిగారు.
"కరెంటు తో ఆ వస్తువులు పని చేసేందుకు కావలిసిన 'జెనరేటర్' ఇప్పించండి చాలు.అన్నారు అబ్బాయి తరుపు వాళ్ళు.
 యమకవిన్యాస వృత్తము -

యమకము ఒక అలంకారము. ఇందులో ఒకే పదమునకు వివిధమైన అర్థములు ఉంటాయి. అందఱు కవులు ఎప్పుడో ఒకప్పుడు యమకాలంకారమును ఉపయోగించినవారే. కొందఱు కావ్యములనే ఈ అలంకారములో వ్రాసియున్నారు, ఉదా. ఆనందతీర్థుల యమకభారతము. అతఁడు మాధవుఁడా, అతఁ డుమాధవుఁడా అన్నప్పుడు మనకు యమకము గోచరిస్తుంది.

వృత్తముల అమరికలలో వేఱువేఱు గతులను మనము చూడవచ్చునని ఎన్నియో ఉదాహరణములతో మీకు ఇంతకు ముందు తెలిపియున్నాను. ఆ అమరికలకు తగినట్లు పదములను పద్య పాదములలో విఱిచి వ్రాసినప్పుడు ఆ అమరికలకు లేక విన్యాసమునకు "యమకత్వమును" ఆపాదించవచ్చును. ఉదాహరణముగా సురనర్తకీ వృత్తమును తీసికొందాము. దీని గణములు ర/న/ర/న/ర/న/ర లేక UIUIII - UIUIII - UIUIII UIU. UIUIII అమరికను UIU III పదముల విఱుపుతో లేక UI UIII పదముల విఱుపుతో వ్రాస్తే మనకు యమక విన్యాసము లభిస్తుంది. క్రింద ఒక ఉదాహరణము. ఇందులో బేసి పాదములలో UIU III విఱుపు, సరి పాదములలో UI UIII విఱుపు గలదు. ఇక్కడ యమకత్వము పదముల వలన కాదు, పదముల విఱుపు వలన, గతి భేదము వలన గణముల అమరికకు కలుగుతుంది.

సురనర్తకీ - ర/న/ర/న/ర/న/ర
UIUIII UIUIII UIUIII UIU

మాధవున్ గనఁగ - మోదమే యెపుడు - భూధర మ్మలరుఁ బూవులన్
రాధ పెన్నిధియు - మోద వార్నిధియె - బాధ యుండదిఁక జీవులన్
శ్రీధరుం డనఁగ - వేదముల్ బలుకు - నాదముల్ వెలయు రాగముల్
వేద మంత్రములు - బోధ నామృతపు - నాద సింధువుల యోగముల్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

మూడు గొడ్డళ్ళ కథ!
(By - Virabhadra Sastri Kalanadhabhatta)
.
ఒకడు నదిమీదకు వంగి వున్న కొమ్మను గొడ్డల్తో కొడుతూవుండగా, గొడ్డలి జారి నదిలో పడింది. వాడు విచారిస్తూవుంటే నది దేవత ప్రత్యక్షమై విషయం తెలుసుకొని, నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదన్నాదు. మళ్ళీ నదిలోకి మునిగి, ఈసారి వెండి గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదు అన్నాడు. మూడోసారి మునిగి వాడి గొడ్డలినే తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. ఆ! ఇదే నాది అన్నాడు సంబరపడిపోతూ. వాడి నిజాయితీకి మెచ్చుకొని బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా వాడికి ఇచ్చింది. వాడు ఆనందంగా వాటిని తీసుకు ఇంటికి వెళ్ళాడు.
*** *** ***
రాజు అతని భార్య ఒక చల్లటి సాయంత్రం (బహుశా శీతాకాలం అయివుంటుంది. ఈ వేళ అయితే 46 డిగ్రీలు) విజయవాడ బ్యారేజీమీద షికారుకుచేస్తూ, పల్లీలు కొనుక్కుని నముల్తూ కబుర్లు చెప్పుకుంటు నడుస్తున్నారు. రాజు భార్య బ్యారేజీ ప్రక్కనవున్న రైలింగు మీదనుంచి నదిలోకి తొంగిచూస్తోంది. రాజు ఏదో విట్ వేసాడు. పకపకా నవ్వుతూ హమ్మ అబ్బ అంటూ నవ్వలేక మెలికలు తిరిగిపోతూ ఆవూపులో కృష్ణా నదిలో పడిపోయింది. రాజు లబో దిబో మన్నాడు. ఆసమయంలో బ్యారేజీమీద సంచారం తక్కువగా వుంది. ఇంతలో కృష్ణవేణమ్మ నదిలోంచి పైకి వచ్చి ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది. నా భార్య నదిలో పడిపోయింది. నాకు ఈత రాదు. ఆమెను రక్షించడం ఎలాగ అని అఘోరిస్తున్నాను అన్నాడు రాజు.
ఓ అదా సంగతి. వుండు అని నదిలోకి మునిగి తిరిగి ఒక అందమైన యువతితో పైకి వచ్చి చూడు నాయనా ఈమేనా అని అడిగింది.
వెంటనే రాజు ఆ! ఈమే అన్నాడు.
ఛీ ద్రోహీ! నీచుడా ఈమె నీభార్యా! ఇదేనా నీభార్యమీద నీకున్న ప్రేమ? అని కోపంగా అంది అసహ్యంగా మొహం పెట్టి (ముందే అసహ్యంగా మొహం పెట్టిందనుకుంటాను)
అమ్మా! నీవు కృష్ణవేణితల్లి వని నాకు అర్ధమైంది. ఇప్పుడు ఈమెను కాదన్నాననుకో. ఇంకొక అమ్మాయిని చూపిస్తావ్ ఆమెకూడా కాదన్నాననుకో. చివరిసారిగా మా ఆవిడను తీసుకు వచ్చి నాకు అప్పగించి, నా నిజాయితీకి మెచ్చుకొని మొదటి ఇద్దర్నీ కూడా ఇచ్చేస్తావు. నాకు తెలియదాం ఏమిటి ఇప్పుడే శాస్త్రి గారు పైనే వ్రాసారు మూడు గొడ్డళ్ళ కథ. తల్లీ! ఒక భార్యతోనే వేగలేక చస్తున్నాను. నువ్వు ముగ్గుర్ని ఇస్తే వాళ్ళతో ఎలా వేగేది?? అన్నాడు రాజు బేలగా!
కొండమీద కనకదుర్గ నవ్వింది భర్త మల్లిఖార్జునుని, ఆయన నెత్తిమీదవున్న గంగమ్మను చూసి.
ముగింపు మీ ఇష్టం

* కృష్ణుడి కోసం తపించే హృదయాలు
(ఛందస్సు)

కలసి నట్టులా - వెతికి ఇవ్వలా మరీ
పుడమి పువ్వులా - మెరిసి పొయ్యావా మరీ
కలువ కళ్లకే - వగరు సంతసం మరీ
కళల కన్నయా - కలవ పిల్చావా మరీ

నెమలి నాట్యమే - మనసు మెచ్చెనే మరీ
గుబురు పిట్టలే - కలసి నవ్వేనా మరీ
వలస పక్షులే - తలచి వచ్చెనే మరీ
కలల కన్నయా - కలవ పిల్చావా మరీ

చిగురు కొమ్మల్లో - చిలిపి కోయలా మరీ
పొగరు గిత్తల్లో - దుముకె సంతోషం మరీ
తెలుపు హంసల్లో - తెలివి పుత్తడే మరీ
నటన కన్నయ్యా - కలవ పిల్చావా మరీ

పడతి శ్వాసతో - కలవ ముచ్చటే మరీ
వరుణ స్వేదంతో - చలువ పంచెనే మరీ
మెరిసె గోవుళ్లు - తడిపె క్షిరాళ్లే మరీ
అలిగె కృష్ణయ్యా - కలవ పిల్చావా మరీ

--((*))--

No comments:

Post a Comment