Thursday 11 June 2020


I got: Purple! What Is Your Inner Eye Color?
* సంభాషణ 
* శరణాగతి"
* రాత్రి - పగలు
* నిద్ర, స్వప్నావస్థ
 * వైజ్ఞానిక రహస్యం 

🕉🌞🌎🌙🌟🚩

శిష్యుడు:- దైవోపాసన అంటే?

గురువు:- తానెవరో విచారించడం.

⚡️✨⚡️✨⚡️✨

శిష్యుడు:- నిజంగా దేవుణ్ణి కోరవలసినది ఏమీ?

గురువు:-  కోరికలు లేని స్థితిని.

⚡️✨⚡️✨⚡️✨

శ్వాస - శ్రీ కాళహస్తీశ్వరుడు (వాయులింగం)

ధ్యాన స్థితి -  జ్ఞాన ప్రసూనాంబిక (శక్తి)

⚡️✨⚡️✨⚡️✨

వాయువును గమనిస్తే మనస్సు శూన్యమై విశ్వ శక్తి లభించును.

దేహం అన్నది ఘటం. ఆత్మ అన్నది ఘటాకాశం.

⚡️✨⚡️✨⚡️✨

శివుడికి :-

అందరూ చేసేది బిల్వార్చన.
మనం చేసేది అక్షరార్చన.

అవి పత్రాలు.
ఇవి సూత్రాలు.

అవి నలిగిపోతాయి.
ఇవి మిగిలిపోతాయి.

⚡️✨⚡️✨⚡️✨

గురు సన్నిధిలో మనస్సు అప్రయత్నంగా తాను పుట్టు చోటుకి వెళ్ళిపోతుంది.


🕉🌞🌎🌙🌟🚩


"శరణాగతి"  🌹ఒక మంచి కథ 🌹
ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు.. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. 
దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి 'నా దగ్గర ఏమీ లేదు ' అని అన్నారు.
దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు.
మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి' అని అన్నాడు.

బ్రాహ్మణుడు ఆలోచించి, "బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు.
ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో, పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు"
అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు. దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు.  ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.
ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.

బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ,
 'ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ' అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది.. తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది.

అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.
ఆనందబాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. 

ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు.
అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణడిని ,నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?" అని బాధపడ్డాడు.
అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు 
' నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు , కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం, సమర్పణ, "శరణాగతి" ఉన్న చోటే నేను ఉంటాను." (అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ)

మనం చేసే ధ్యానం అయినా అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఫలితాన్ని పొందగలం!
సర్వేజనా సుఖినోభవంతు!     
(సేకరణ)

Q 37:-- రాత్రి - పగలు

Ans :--
మన ప్రాచీన నాగరికత ల్లో, రాత్రి చాలా అద్భుతమైంది గా భావించారు. 

రాత్రిళ్ళు ఎక్కువ కాలం చైతన్య పరిణామ వికాసానికి అంతర్ ప్రయాణానికి కేటాయించేవాళ్ళు. 

చైతన్యశక్తి, అంతరశక్తి గురించి పరిశోధన చేసేవాళ్ళు. రాత్రి పరిశోధన, పగలు ఆచరణ.

🌻 🌻 🌻 🌻 🌻 

Q 38:-- నిద్ర, స్వప్నావస్థ

Ans :--
1)మనకు జాగృదావస్థ కంటే స్వప్నావస్థ ముఖ్యమైనది,స్వప్నావస్థ లో అఖండజ్ఞానం మనకు అందుతుంది, ఈ అఖండ జ్ఞానాన్ని మనం గుర్తు పెట్టుకోవాలంటే 2గంటల నిద్ర మరియు బ్రేక్ తీసుకుని మరల 2 గంటల నిద్ర పోవాలి.దీనివల్ల స్వప్నాలు బాగా గుర్తుంటాయి.

2)8 గంటల నిద్ర దేహానికి గాని,ఆరోగ్యానికి గాని చైతన్య పరిణామానికి గాని ఎటువంటి మేలు చేయదు.

3) 4గంటల నిద్ర జాగృదావస్థ లో మన దేహాన్ని ఆరోగ్యంగా ఉత్తేజంగా ఉంచుతుంది. conscious, subconscious మైండ్ లను అందుబాటులోకి తెస్తుంది.

4) అంతర్వాణి, స్వప్నాల ద్వారా మనకు జ్ఞాన సముపార్జన లభిస్తుంది. 4 గంటల నిద్ర జీవితంలో ఆత్మస్థైర్యాన్ని కలుగజేస్తుంది.

5) దేహంలో కావలసిన హార్మోన్స్, enzymes రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. దేహానికి గల బద్ధకాన్ని మనోశక్తికి గల బద్ధకం వదులుతుంది.

6) conscious మైండ్ easy గా వ్యాకోచం చెందుతుంది.మనోవికాశం పెరుగుతుంది. అంతర్ ప్రపంచం గురించి అవగతమవుతుంది.

7) మనం దేహం మాత్రమే కాదు అపారమైన అంతర్ శక్తితో కూడిన ఆత్మని తెలుస్తుంది. మృత్యు భయం పోతుంది.

8) జంతుజాతిని గమనిస్తే తెలుస్తుంది అవి చాలా తక్కువ నిద్ర పోతాయి. అందుకే అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి.

9) మానవులు డాక్టర్స్ ని సృష్టించుకొన్నారు, కానీ జంతువులకు డాక్టర్స్ తో పనిలేదు. జంతువులు వైద్యులు ను సృష్టించుకోలేదు.

10) అంతర్ శక్తి , భౌతిక వాస్తవం గురించి తెలుసుకుంటే డాక్టర్స్ తో పనిలేదు. 2గంటల నిద్ర+ break+ 2గంటల నిద్ర వలన నరాల వ్యాధులు, నాడిమాండల వ్యాధులు, మానసిక వ్యాధులు సంక్రమించవు.

11) మన దేహానికి ఏది సహజమైన ఆహారమో స్పష్టంగా తెలుస్తుంది.

12) రాత్రి సమయంలో ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్య రీత్యా అవసరం.  కానీ మన నమ్మకపు వ్యవస్థ దానికి వ్యతిరేకంగా ఉంది.

13) జంతుజాతులు నిద్రావస్థలో దేహం,మైండ్ కి విశ్రా0తి పొందుతూ చైతన్య శక్తి పరంగా alert గా వుండగలుగుతున్నాయి.ప్రకృతి ప్రళయాలను, ప్రమాదాలను చాలా బాగా పసిగట్టగలుగుతున్నాయి.

14) జాగృదావస్థ లో ఏఏ విషయాలలో రాణించాలో, ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందో, మన స్వప్నావస్థ లో తెలియజేయ బడుతుంది. వ్యక్తిగతంగా, సామాజికంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

15) ఊహాశక్తి, కలలు కనడం, అంతర్ ప్రయాణం, ఇవన్నీ ఇప్పటి సమాజంలో వృధాగా అనిపిస్తుంటాయి. ఇవే ఆత్మ పురోగతికి ముఖ్యమని గుర్తించాలి. సమాజంలో యువతను రెచ్చగొట్టి పోటీతత్వం పెంచుతున్నారు.అవన్నీ అనవసరమైనవి.


🌹 🌹 🌹 🌹 

🌹. మంత్ర  విద్య - దాని వెనుక ఉన్న వైజ్ఞానిక రహస్యం 🌹

మంత్రం అంటే ఏంటి అని సందేహం వస్తుంది. మంత్రం అంటే ఎంతో యుక్తితో కోడింగ్ (Coding) చేయబడిన విజ్ఞానం యొక్క రహస్య రూపం. 

అసలు మంత్రమే ఒక కోడ్ (Code). అది పైకి మాములుగానే కనిపిస్తుంది, కానీ అర్దం చేసుకుంటే అద్భుతాలు గమనిస్తాం. ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఉద్దేశ్యము ఉంటుంది. పెద్ద మర్రిచెట్టు చిన్న విత్తనంలో ఉన్నట్లే, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం మంత్రాల్లో ఉంటుంది. 

విత్తనాన్ని మట్టిలో వేసి, నీరు అందించి, తగిన పోషకాలు అందించినప్పుడు, భూమిలో పరిస్థితులు అనుకూలించినప్పుడు అది ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో, అదే విధంగా తగిన వ్యక్తికి, కొన్ని ప్రత్యేక సమయాల్లో మంత్రాల్లో అర్ధాలు వెళ్ళడవుతాయి. 

ఈ మంత్రాలను డికోడింగ్ (Decoding) చేసిన వ్యక్తులనే మనం ఋషులు అంటున్నాం. ఇలా భగవంతుడు మంత్రరూపంలో చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. 

ఒకటి సమస్త విజ్ఞానమంతా మంత్రంలో బీజరూపంలో ఉంచి, మేదస్సును, మనోశక్తిని ఉపయోగించి విజ్ఞానాన్ని కనుగొనమన్నారు. 

రెండవది లోకంలో అనేక మనస్తత్త్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. కొందరు పరమ నిస్వార్ధపరులు ఉంటారు. తమ గురించి ఏమీ ఆలోచించరు, ఎప్పుడు పదిమంది బాగుండాలని కోరుకుంటారు, అవసరమైతే లోకం కోసం తమ కోరికలను, సుఖాలను సైతం విడిచిపెడతారు. ఈ కోవలోకి వస్తారు ఋషులు. 

వారు కాక, కొందరు తమ స్వార్ధం చూసుకుంటూ లోకం బాగుండాలని కాంక్షిస్తారు. వారు రెండవరకం. మూడవరకం వారు కేవలం తమ స్వార్ధమే చూసుకుంటారు, లోకం ఏమైపోయినా వీరికి అనవసరం. 

నాలుగవరకం వారు తమ మాత్రమే బాగుండాలి, లోకం నాశనమవ్వాలి, తాము మాత్రమే సుఖంగా ఉండాలి, వెరొకరు అలా ఉంటే చూడలేరు. 

ఒక గొప్ప విషయం చెప్పవలసి వచ్చినప్పుడు, అది సరైన వ్యక్తులకే చెప్పాలి, దుర్మార్గులకు కానీ ఒక అద్భుతమైన జ్ఞానం వెళ్ళిందా, అది లోకకంటకం అవుతుంది. 

మంచివాళ్ళకి, నిశ్వార్ధపరులకు జ్ఞానం చేరితే, అది లోకకల్యాణ కారకమవుతుంది. అందుకే భగవంతుడు తాను చెప్పదల్చుకున్న విషయాలను వేదమంత్రాల ద్వారా చెప్పారు.

మంత్రమనగానే అది కేవలం ఒక అక్షరసమూహం అని భావించకూడదు. మంత్రానికి శబ్దానికి చాలా సూక్ష్మమైన, విశేషమైన సంబంధం ఉంటుంది. శబ్దం చరాచరాత్మక ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. 

రెండు వస్తువుల రాపిడివల్ల శబ్దం ఏర్పడుతుంది. అణువుల మధ్య రాపిడి వల్ల కూడా చాలా సూక్ష్మమైన శబ్దాలు ఏర్పడతాయి. లోకమంతా శబ్దతరంగాలు వ్యాపించి ఉంటాయి. 

ఈ శబ్దానికి మూలం నాదం, అదే ఓంకారం. ఏ వస్తువుల మధ్య రాపిడి లేకపోయినా, నిశ్శబ్దం నుంచి వినిపించే ఏకైక నాదం ఓంకారం. ఈ మంత్రాలకు కూడా మూలం ఓంకారం.

 🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment