Saturday 6 June 2020

*****






1. ఘనమైన (4)నాలుగు
2. రమణ మహర్షి సూక్తులు ......
3. బల్లి శబ్ద శాస్త్రం ..
4. శివలీలలు-...
5. వాస్తవం - అవాస్తవం (చిన్న కధ ) 
6. నవ్వు చాలా రకాలు

ఘనమైన (4)నాలుగు ....... 1

నలుగురి నాలుగు చేతులూ వెయ్యండి., నలుగురితో నారాయణ.

నలుగురు పోయే దారిలో నడవాలి, నలుగురూ నవ్వుతారు...

ఇవీ నిత్యం మనం వినే మాటలు.

అనే కార్థంలో  ‘నలుగురు’.

మాటను వాడుతుంటాం, ఇలా జన వ్యవహారంలో నాలుగు సంఖ్య తరచుగా వినిపిస్తుంది.

మనకు సంఖ్యా శాస్త్రం ఉంది. అంకెలకు సంబంధించి నమ్మకాలు ఉన్నాయి.

కొందరు కొన్ని సంఖ్యల్ని తమకు అదృష్ట సంఖ్యలుగా భావిస్తుంటారు.

కొన్ని ప్రయోజనాలకు తమకు నచ్చిన సంఖ్య రావాలని తపన పడుతుంటారు.

ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలు ఒకదాని కంటే ఒకటి పెద్దదిగా మనం భావించినా సహజంగా అన్ని సంఖ్యలూ వాటికవే విశిష్టమైనవి.

నాలుగు సంఖ్యను చాలామంది ఉత్తమ మైనదిగా పరిగణించరు.

ఎవరి నమ్మకం ఎలా ఉన్నా నాలుగంకెకు ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.

సృష్టికర్త బ్రహ్మను చతుర్ముఖు డన్నారు. సృష్ట్యాదిలో బ్రహ్మ నలుగురు మానస పుత్రుల్ని సృష్టించాడు.

వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు.

వేదాలు నాలుగు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగు.

పురుషార్థాలూ ఆశ్రమ విధానాలు నాలుగింటిని చెప్పారు.

అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం.

చాతుర్వర్ణ వ్యవస్థనూ వేదవాంగ్మయం పేర్కొన్నది.

యుగాలు నాలుగు - కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు.

మానవ జీవిత దశలనూ బాల్య,, యౌవన, కౌమార, వార్ధక్యాలనే నాలుగింటిగా విభజించారు.

దిక్కులు నాలుగు. మూలలూ నాలుగే. తూర్పు దిక్కు ఋగ్వేద సంబంధమైనది.

సూర్యోదయానికి ఆధారభూతం గనుక పూజ్యమైనది.

దక్షిణం యజుర్మంత్రాలకు, పశ్చిమం అధర్వ మంత్రాలకు స్వాభావిక మైనవని,

ఉత్తర దిక్కు సామవేద సంబంధి అని తెలిపే శ్రుతి ప్రస్తావనలున్నాయి.

మండూకోపనిషత్తులో నాలుగు అవస్థలు చెప్పారు. జాగృదవస్థలోని అనుభవాలకు కారణం జాగరిణి.

ఈ అవస్థలోని జీవాత్మ విశ్వుడు.

స్వప్నానుభవ కర్త సూక్ష్మ శరీరధారి అయిన జీవుడు.

వాడిని స్వప్నంలో ప్రేరేపించే వాడు తైజసుడు.

గాఢనిద్రను అనుభవించే సుఖజీవిని ప్రాజ్ఞుడంటారు.

ఈ అవస్థకు కారకురాలైన పరమేశ్వరి ప్రాజ్ఞ.

పై మూడు స్థితులకు అతీతమైన స్థితి

‘తుర్య’.

ఈ మూడు అవస్థల్లో లేని స్థితిని పరదేవత కలిగిస్తుందంటారు.

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష -

నాలుగు వాసనలు.

ఇవి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు అంతఃకరణలకు సంబంధించినవి.

స్నేహితులతో మైత్రి మనసు లక్షణం.

ఆర్తులపట్ల కరుణ బుద్ధి లక్షణం.

పుణ్య కర్మల్ని ఆనందించడం చిత్త లక్షణం.

సజ్జనుల్ని బాధించడం అహంకార లక్షణం.

వాక్కుకు నాలుగు రూపాలు.

పరా, పశ్యంతి, మధ్యమ అనే మూడు అంతరంగంలో ఉండే వాక్కులు;

బహిర్గతమయ్యేది వైఖరి.

మృత్యువు నాలుగు రూపాలని వేదం చెబుతోంది.

అవి సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు.

సూర్యుడు రోజూ ఉదయ సాయంత్రాల ద్వారా ఒకరోజు జీవుల ఆయుర్దాయాన్ని గ్రహిస్తూ,

మృత్యువుకు కారణమవుతాడు.

వాయుసంచారం దేహంలో సరిగ్గా లేనప్పుడు ఊపిరి తిత్తుల వ్యాధుల ద్వారా మరణానికి అవకాశా లెక్కువ.

శరీరంలోని జఠరాగ్ని సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం జీర్ణంకాక ఆకలి దప్పులుండక చనిపోయే అవకాశమూ ఉంది.

చంద్రుడు పంటలకు కారకుడు.

పంటలు పండక పోతే ఆహారం లేక మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది.

మేఘం, మెరుపు, పిడుగు, వృష్టి (వాన)- నీటికి నాలుగు రూపాలు.

రాజ్యరక్షణకు అవసరమైన చతురంగ బలాలు -

రథ, గజ, తురగ, పదాతి దళాలు.

సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు.

సామ, దాన, భేద, దండోపాయాలు రాజనీతికి సంబంధించిన చతురోపాయాలు.

ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా ఎన్నో...

అందుకే నాలుగంకె (4) ఘనమైనదే!


🌹👏🏾🌷

రమణ మహర్షి సూక్తులు ...... 2

1. జీవాత్మ - మనస్సు
ప్రాణము అభివ్యక్తమయ్యే మార్గములలో మనస్సొకటి. ప్రాణ శక్తియే జీవనవ్యాపారముగా, దానిని తెలుసుకొను చైతన్యముగా (మనస్సుగా) వ్యక్తమౌతుంది. తలపు, గ్రహణా మనో వ్యాపారములే.
తలపు వ్యక్తిత్వములో ఒక దశ.
మనస్సు తలపు రూపు. జీవుడే, జీవ భావమే వ్యక్తి, వ్యక్తిత్వమూను. వ్యక్తిత్వానికి జీవుడని వ్యవహారము. మనస్సు జీవ శక్తి యొక్క రూపు. హృదయములో వసిస్తుంది. ఆత్మ చేతన మేధలో ప్రచలితము అవడమే మనకు మెలకువ రావడము, తలపులు, గ్రహించడము మొదలవడమూను.
జీవాత్మ తన్ను ఆవిష్కరించే పలురూపాల్లో తలపు ఒకటి.
శరీరములో మానసికముగా ఏర్పడిన "ఆసామీ" యే జీవాత్మ.
శరీరంలో ఏర్పడిన "ఆసామీ" నిదురిస్తూ ఉండడమే మోక్షము. ఆసామీ రహితమైన (బంధ, సంబంధ రహితమైన) గమనించే తెలివియే ఆత్మ.
ఆత్మ నీకు ఎఱుకయే. ఆత్మ నీ ఎఱుకయే.
🥀
2. నిర్మల కాసారము - నివాత దీపము - నిస్తరంగ జలధి
ఎప్పుడూ ఉన్న, ఉండే చైతన్యము ఆత్మ. ఉదయించే చైతన్యము మనస్సు. లయమయ్యే చైతన్యమూ మనసే.
అన్నీ తెలుస్తూనే, అన్నీ తెలుసుకుంటూనే, అన్నిటినీ తెలుపుతూనే, చెదరని శాంత స్థితిని అనుభవిస్తూ తామరాకుపై నీటిబొట్టు మాదిరి జీవన పథములో చరించవచ్చు.
ఏ ఇతరమూ అక్కర లేకుండా తనంత తానుగా తెలిసే జ్ఞానము అపరోక్ష జ్ఞానము.
మరియొక దాని ద్వారా తెలిసే జ్ఞానము పరోక్ష జ్ఞానము.
మౌనము నిత్య వాక్కు. నిష్క్రియ. నిరంతర క్రియ.
మెట్లు గమ్యాన్ని చేరడానికి ఉపయోగిస్తాయి. గమ్యము చేరాక వాటి స్పృహ అనవసరము. వాటి ప్రమేయము ఇక ఉండదు. శాస్త్రజ్ఞానము అంతే. ఆత్మానుభవము అయ్యే వరకే దాని ఉపయోగము. ఆపై శాస్త్రజ్ఞానము ఉపయోగము లేదు. అన్నము తినివేసిన తరువాత విస్తరితో పని లేనట్టు. ఆ విస్తరిని విసిరి పారేసినట్టు.
గుణములూ, వృత్తులూ మిథ్యాహమునకు (వ్యక్తికీ/జీవాత్మకు) చెందుతాయి. ఆత్మకు కాదు. ఎవడు యత్నించినా, అవిద్యను తొలగించడానికే. ఆ తర్వాత ఏ సందేహములు కలుగవు. సత్యమైన ఆత్మ నిత్య స్థితము. ఆత్మస్థితిని పొందడానికి ప్రయత్నమేమీ అక్కరలేదు.
మౌనము ఎడతెగని వచస్సు. అస్తమానూ మాట్లాడే మాట. వచస్సు సశబ్దమైనపుడు అది మౌన వచస్సుకు అడ్డు వస్తుంది. స్వరయుత వచస్సుకు వాగావయవాలవసరం. కాని మౌన వచస్సు తలపులకి అవ్వలిది. అది వాగతీతము. పలుకని పదము. పరా వాక్కు.
ఉన్న జ్ఞానములు మూడు:
అజ్ఞానము (తెలియమి; నిద్ర - జ్ఞాత - జ్ఞానముల లేమి)
సాపేక్ష జ్ఞానము : జ్ఞాత - జ్ఞానము - జ్ఞేయము ల తో కూడిన త్రిపుటీ యుతము.
జ్ఞానము: శుద్ధ జ్ఞానము. ప్రజ్ఞానము. జ్ఞేయము లేమి.
మనసు, జగత్తు వ్యక్తాత్మ. ఆత్మ వ్యక్తమైనా, కాకున్నా జ్ఞాని స్థితి స్థిరముగా ఉంటుంది. నిర్మల కాసారము వలె. నివాత దీపము వలె
 

3. శ్రీ రమణ మహర్షి పలుకులు
వాసనా క్షయము
విషయానుభవములను వాసనలు అంటారు. ఇవి మనలో విషయ గ్రహణము జరుగుతున్నప్పుడు అప్పుడే ఏర్పడి జ్ఞాపకములుగా స్థిరపడి ఉంటాయి.
మెలకువ అంటే అహంకారము లేవడమే. వాసనలు ప్రేరేపింప బడిన పిదపే అహంకారము లేస్తుంది.
 

వాసనలంటని, వాసనలు ప్రేరేపింప బడని ఆ తొట్ట తొలి స్థితే; నిత్యమూ, శుద్ధమూ అయిన సంస్థితి. ఆత్మ స్థితి.
గుర్వనుగ్రహము వలన వాసనలు (విషయానుభవములు) క్షయించే కొద్దీ, క్రమముగా ధ్యానము కుదురునేగాని, మరో విధముగా కాదు.
 

గురువు మూడురకములు : మన ఇష్ట దైవము, మానుష గురువు, మన స్ఫురణా శక్తి [ఈశ్వరో గురు: ఆత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్య దేశాయ (దేహాయ) దక్షిణామూర్తయే నమ:]. "వాక్ మనసి సంపద్యతే, మన: ప్రాణే, ప్రాణాత్తేజసి, తేజ: పరస్యామ్ దేవతాయాం ఇతి.
ఇలా జరిగే వాసనా క్షయము తో ఆత్మా దృష్టి అవుతుంది. దీనిని విశ్రాంత దృష్టి అంటారు.
ఆత్మ కన్నుగా , చూపుగా అనుభవానికి రావడమే వాసనా క్షయము.
వాసనా క్షయము పూర్తిగా అయితేనే జ్ఞానము సుస్థిరమవుతుంది.
మనిషి నిజ స్వభావము నిర్విషయానుభవము. వాసనా (విషయానుభవ) రాహిత్యము.
విషయ గ్రహణము [దృశ్యము-కన్ను , శబ్దము-చెవి, రుచి-నాలుక, వాసన (ఘ్రాణము) - ముక్కు, స్పర్శ - చర్మము], విషయానుభవ (విషయములు కలిగించిన అనుభవములు జ్ఞాపకములుగా స్థిరపడి ఉంటాయి) ప్రేరణ విరమింప బడిన స్థితి వాసనా క్షయ స్థితి. బ్రహ్మ స్థితి. ఆత్మ స్థితి.


--((***))--

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 


                                              సర్వేజనా సుఖినోభవంతు


బల్లి శబ్ద శాస్త్రం ..   3. 
మన శరీరం మీద బల్లిపడిన యడల కలుగు శుభాశుభములు .... 
మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..? అప్పుడప్పుడు కిందపడి పరుగెడితుందా? గోడపై మీ కంట పడేటట్లు అటూ ఇటూ తచ్చాడుతుందా? అయితే ఈ కథనం చదవాల్సిందే. 
ఈ బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుండి గనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ వున్నది. అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూద వున్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని నమ్మిక. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో నమ్మకమున్నది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాల గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

ఇదేవిధంగా ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడుతాయి. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగడం, అదృష్టం కలిసివస్తుందని గ్రహించాలి. అదే మీ పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన వార్త అందుతుంది. 

ఇంకా నైరుతి దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే బుధ గ్రహ ప్రభావంతో బంధువులు రాక, స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు, శుభవార్తలు వంటి శుభఫలితాలుంటాయి. అలాగే పడమర దిశలో బల్లి శబ్ధం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది. అదే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభ వార్తలు అందుతాయి. 

బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లికి తెలియక తొక్కేయడం లేదా చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు పురోహితులు చెబుతున్నారు. 
మన శరీరం మీద బల్లిపడి యడల కలుగు శుభాశుభము .... 

పురుషులకు కలుగు శుభాశుభములు :.... 
తలమీద = కలయము, 
బ్రహ రంద్రమున = మరణము 
ముఖము = ధనలాభము 
ఎడమ కన్ను = శుభం 
కుడుకన్ను = అపజయము 
నుదురు = బంధు సన్యాసము 
కుడి చెవి = దుఖము 
ఎడమచెవి = లాభము 
పై పెదవి = కలహము 
క్రింది పెదవి = ధన లాభము 
రెండు పెదవులపై = మృత్యువు 
నోటియందు = రోగ ప్రాప్తి 
ఎడమ మూపు = జయం 
కుడి మూపు = రాజ భయం 
మణికట్టు = అలంకార ప్రాప్తి 
మోచేయి = ధన హాని 
వ్రేళ్ళపై = స్నేహితుల రాక 
కుడిభుజము = కష్టము 
ఎడమ భుజము = అగౌరవము 
తొడలు = వస్త్ర నాశము 
మీసములపై = కష్టము 
పాదములు = కష్టము 
పాదముల వెనుక = ప్రయాణము 
కాలి వేళ్ళు = రోగ పీడనము. 
స్త్రీలకు కలుగు శుభశుభములు :... 
తలమీద = మరణ సంకటం 
కొప్పుపై= రోగ భయం 
పిక్కలు = బంధు దర్శనము 
ఎడమ కన్ను = భర్త ప్రేమ 
కుడికన్ను = మనో వ్వథ 
వక్షము = అత్యంత సుఖము, పుత్ర లాభము. 
కుడిచెవి = ధన లాభము 
పైపెదవి = విరోదములు 
క్రింది పెదవి = సూకగ వస్తు లాభము 
రెండు పెదవులు = కష్టము 
స్థనము నందు = అధిక దుఃఖము 
వీపునందు = మరణ వార్థ 
గోళ్ళయందు = కలహము 
చేతియందు = ధన నష్టము 
కుడుచేయి = ధన లాభము 
ఎడమ చేయి = మనో చలనము 
వ్రేళ్ళపై = భూషణ ప్రాప్తి 
కుడి భుజము = కామ రతి ప్రాప్తి 
తొడలు = వ్వభిచారము , కామము, 
మోకాళ్ళు = బంధనము, 
చీలమండలము = కష్టము 
కుడికాలు = శత్రు నాశనము 



కాలి వేళ్ళు = పుత్ర లాభము.

----------
శివలీలలు-.... 4

శివలీలలు- భక్తుల కోసం కూలిపనికైనా సిద్ధం

కార్తీక మాసం వచ్చిందంటే శివ భక్తులకు పండుగే! నిత్యం శివనామాన్ని స్మరించుకుంటూ, శివుని లీలలు తల్చుకుంటూ సత్కాలక్షేపం చేస్తారు. అలా గుర్తుకు చేసుకోదగ్గ శివలీలలలో ఇది ఒకటి… వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశం పాండ్యుల ఏలుబడిలో ఉన్న రోజులవి. ఆ కాలంలో మీనాక్షిదేవితో కూడిన సుందరేశ్వరుడు కొలువైన మధురైలో, `వంది` అనే ముసలామె ఉండేది. వందికి పాపం నా అన్న వారెవ్వరూ లేకపోయారు. మంచం మీద నుంచి లేవకపోతే పలకరించేవారు కూడా లేరయ్యే! అయినా వంది ధైర్యాన్ని కోల్పోలేదు. తను నిత్యం పూజించే ఆ సుందరేశ్వరుని మీద భారం వేసి జీవితాన్ని ధైర్యంగా గడిపేది. పుట్టు అనే ఓ ఆహార పదార్థాన్ని చేసి, దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేసేది. అంతేకానీ చేయిచాచి ఎవ్వరినీ యాచించి ఎరుగదు. వంది వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మధురై చెంతనే ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి. వైగై వరదపోటుతో మధురై మొత్తం మునిగిపోయింది. ఏది ఊరో, ఏది నదో తెలియనంతగా మధురై దెబ్బతిన్నది.

మధురైని ఏలుతున్న పాండ్యరాజు చెంతకు చేరి ప్రజలంతా వరద గురించి మొరపెట్టుకున్నారు. రాజుగారికి కూడా ఏం చేయాలో పాలుపోలేదు. నదికి అడ్డుకట్ట కడదామంటే కాస్తా కూస్తా తీరం కాదు. ఏళ్ల తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు. కానీ ఈలోపల మరో వరద వస్తే రాజ్యం సర్వనాశనం అయిపోయేట్లు ఉంది. దాంతో ఓ ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు. `పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పుని తప్పించేందుకు ఓ అడ్డుకట్టను నిర్మించాలి. ప్రతి ఒక్కరూ పలుగూ పారా పట్టుకుని ఈ పనిలో పాల్గోవాలి. ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తన బదులు కూలీతో పనిచేయించాలి` అని అదేశించారు రాజుగారు. రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు. ఒక్క `వంది` తప్ప! వయసు మీద పడిన వందికి పార పట్టుకునేంత ఓపికా లేదు, కూలీని పెట్టుకునేంత స్తోమతా లేదు! దాంతో తాను రోజూ తొలి నైవేద్యాన్ని అందించే సుందరేశ్వరుని చెంత నిలిచి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది.
ఆ ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరుని మనసు కరిగిపోయింది. ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చుని శివనామస్మరణలో మునిగిపోయింది. ఇంతలో… `ఎవరికైనా సాయం కావాలా?` అన్న కేక వినిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఓ యువకుడు భుజాన పార పట్టుకుని వెళ్తున్నాడు. `బాబ్బాబూ నీకు పుణ్యం ఉంటుంది. నాకు కాస్త సాయం చేసిపెట్టు!` అని వేడుకుంది వంది. `సాయం చేయడానికి నేను సిద్ధమే! కానీ నాకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా!` అని బేరానికి దిగాడు ఆ యువకుడు. `నా దగ్గర దమ్మిడీ లేదు. కావాలంటే ఇవాళ అమ్మకం కోసం ఉంచిన ఈ ఆహారం ఉంది` అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్న ఆహారపదార్థాన్ని చూపింది వంది. `ఓ! ఇది సరిపోతుంది. ఈ పుట్టుని సుష్టుగా తిని నీ కోసం పని చేసిపెడతాను` అంటూ వంది దగ్గర ఉన్న పుట్టుని శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు. ఆపై వంది తరపున పని చేయబోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకుని పని మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు- వందిని ఆదుకునేందుకు వచ్చిన శివుడే!

శివుడు తల్చుకుంటే నదికి అడ్డుకట్టని నిర్మించడం లేదా కూల్చడం ఓ లెక్కా! కానీ తన భక్తురాలితో కాసేపు గడపాలనుకున్నాడేమో… ఆడుతూ పాడుతూ పనిచేయసాగాడు. ఓ గంట పనిచేస్తే ఓ గంట గుర్రుపెట్టి నిద్రపోయేవాడు. అలా ఆ యువకుడు పనిమానేసి చెట్టుకింద నిద్రపోవడం అధికారుల కంట పడనే పడింది. అతగాడిని సమీపంలో ఉన్న రాజుగారి చెంతకి తీసుకుపోయారు. తన కోసం పని చేస్తున్న ఆ యువకుడికి ఏమవుతుందో అని భయపడుతూ వంది కూడా అక్కడికి చేరుకుంది. `నీ అశ్రద్ధ క్షమార్హం కాదు. కొరడా తగిలితే కానీ నీ మత్తు వీడేట్లు లేదు!` అంటూ అతణ్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజు. వెంటనే ఓ సైనికుడు, శివుని ఒంటి మీద కొరడాని ఝుళిపించాడు. అంతే! ఆ దెబ్బకి రాజుగారి కళ్లు బైర్లు కమ్మాయి. ఎవరో తనని కొరడాతో కొట్టినట్లు ఒంటి మీద వాత తేలింది. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు. వంది భక్తికి వశుడైన ఆ శివుడే యువకుని రూపం దాల్చాడని అర్థమైన రాజు ఆమె ముందు మోకరిల్లాడు.(సేకరణ:from telugu one bhakti--- శివలీలలు)

--(())-


వాస్తవం - అవాస్తవం (చిన్న కధ ) 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :

మీరు డాక్టర్ మీద ఆధారపడటం లేదంటే ... ఆరోగ్యంగా ఉన్నట్లు, లాయర్ మీద ఆధారపడటం లేదంటే ... వివాదాలు లేకుండా  ఉన్నట్లు, పోలీస్ మీద ఆధారపడటం లేదంటే ... ధైర్యంగా బాతుకుతున్నట్లే .....   అనేకం  ...    అనేకం 

వాస్తవికత సమర్ధత కలిగి ఉండడమే మన:శాంతికి దగ్గర దారి....
మా వాడికి మెడికల్ సీటు కావాలని దేవుడిని కోరేసమయంలో  (తమ పిల్లలు  డాక్షర్ కావాలని కోరుకునే లక్షలాది తల్లిదండ్రులు దేవుడిని ఇదే కోరిక కోరినపుడు, వారందరినీ పక్కనపెట్టి మీ కోరిక మాత్రమే దేవుడు ఎందుకు తీరుస్తాడు

ఆ మెడికల్ సీటు మీవాడు సంపాదించడానికి తగిన సమర్ధుడిగా తయారయేలా చేసిందెవరో గమనించండి (నమ్మకం - విశ్వాసం తో అంతా అయోమయమే వాస్తవ ఆచరణతో లేనిపోని జంజాటం ఉండదు) 

మీరు ఎవరి నీ నమ్మకండి, నమ్మినపుడే మోసపోతారు, వాస్తవాలు ఆలస్యంగా బయటకు అంతమాత్రాన తప్పుగా భావించకండి, నమ్మకం - విశ్వాసం మిమ్మలని నట్టేట ముంచుతాయి.
వాస్తవాన్ని ఆచరిస్తే కచ్చితంగా ఒడ్డుకు చేరుకుంటారు

**మోసకారులు*
ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల నుంచి వీలైనంత దూరంగా ఉండడమే మంచిది  *ఇగో ఎక్కువ ఉన్నవారు**మోసకారులు*, మోసకారులు ఎల్లప్పుడూ తమ స్వార్థం కోసమే పనిచేస్తారు. తమకు ఏదైనా లబ్ధి జరుగుతుందంటే ఎదుటివారికి ఏదైనా చేసేందుకు వెనుకాడరు. వీరి సహజనైజం కారణంగా వీరు ఇతరులతో ఎప్పటికీ కలిసి ఉండలేరు. ఇటువంటి వారికి దూరంగానే ఉండాలి. నమ్మి మోసపోకూడదు.

*స్త్రీలోలురు*

*అత్యాశపరులు*అతిగా ఆశ పడేవారు, స్వార్థపరుల నుంచి దూరంగా ఉండాలి. వారు ఎప్పటికైనా మనకు నష్టం కలిగిస్తారు. ఇలాంటి వారు ఇతరుల నమ్మకాలను, పట్టుదలను, ఆత్మవిశ్వాసాలను తగ్గిస్తారు. ఇతరులు సంతోషపడితే చూడలేరు.

*ఇతరులను చూసి అసూయ పడేవారు*

ఇతరులను చూసి ఎక్కువగా ఈర్ష్య, అసూయలకు లోనయ్యేవారి నుంచి కూడా మనం దూరంగానే ఉండాలి. వారితోనూ ఎప్పటికీ ప్రమాదాలే పొంచి ఉంటాయి. వారు ఒకరి ఉన్నతిని చూసి ఓర్వలేరు.
--(())--

 ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం 
 ప్రాంజలి ప్రభ - నవ్వు చాలా రకాలు: సర్వేజనా సుఖినోభవంతు
లక్ష్మణదేవర నవ్వు’! 
_రచన: వెల్చేరు నారాయణరావు! 

నవ్వు నాలుగందాల చేటన్నారు. అంటే నాలుగు విధాల అని అర్థం. ఈ నాలుగూ ఏమిటో నాకు తెలీవు. కాని పాత కుటుంబాలలో ఆడవాళ్ళు నవ్వడం తప్పుగా భావించేవారు. ముఖ్యంగా మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు నవ్వితే వాటికి వెంటనే తప్పు అర్థాలు వస్తాయని పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని వారించేవారు. ఆమాటకొస్తే నవ్వడం విషయంలో మొగవాళ్ళక్కూడా ఈ అదుపులు ఉన్నాయని సుమతీశతకం చదివితే తెలుస్తుంది. 

నవ్వకుమీ సభలోపల 
నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్‌ 
నవ్వకుమీ పరసతితో 
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ 

మొగవాళ్ళనుద్దేశించిన ఈ మాటకీ, ఆడవాళ్ళు నవ్వకూడదనే ఆ మాటకీ చిన్న తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆడవాళ్ళు నవ్వడం తప్పు. తప్పు అంటే ఆడవాళ్లుగా వాళ్ల శీలానికి కలిగే మచ్చ. మగవాళ్ళు నవ్వకపోవడం నీతి. నీతి అంటే లౌకిక వ్యవహారాల్లో ఇబ్బందులు తెచ్చుకోకుండా తెలివితేటలుగా వ్యవహరించే పద్ధతి. అంటే లౌక్యం. 

నవ్వు చాలా రకాలు: ఎవరితోనైనా కలిసి నవ్వడం, ఎవరినైనా చూసి స్నేహపూర్వకంగా నవ్వడం, వాళ్లపట్ల ఆకర్షితులై ఆ సంగతి సూచిస్తూ నవ్వడం, వాళ్ళని సంతోషపరచడానికి నవ్వడం, ఊరికే సరదాగా నవ్వడం, ఏదో చమత్కారమైన సందర్భం గుర్తువచ్చి నవ్వడం – ఇవన్నీ ఉత్సాహాన్నీ, మంచితనాన్నీ, ఆకర్షణనీ, అంతరంగాన్నీ తెలిపే నవ్వులు. ఇంకో రకం నవ్వు అవహేళన చేసే నవ్వు. ఈ రెంటికీ మధ్యనున్న తేడా చెరిగిపోయిన సందర్భాన్ని విస్తారంగా చెప్పే పాట స్త్రీల రామాయణపు పాటల్లో లక్ష్మణదేవర నవ్వు అనేది. 

ఈ పాట ఎక్కువ ప్రచారంలో ఉన్నట్టు కనిపించదు. మా అమ్మో, బామ్మో ఈ పాట పాడేది అని చెప్పిన ఆడవాళ్ళెవరూ నాకు తారసపడలేదు. ఈ పాటకి నాకున్న ఆధారం అల్లా ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు ప్రచురించిన స్త్రీల రామాయణపు పాటలు అనే పుస్తకంలో ఉన్న పాఠమే. ఎన్‌. వి. గోపాల్‌&కో వాళ్ళు వాళ్ళ ప్రచురణలో ఇది చేర్చలేదు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి పాఠం చాలా తప్పులతో అన్వయించుకోవడం కష్టమయ్యే అపపాఠాలతో గందరగోళంగా ఉంది. దాని సవరించడానికి కానీ పరిష్కరించడానికి గానీ ఇంకా కొన్ని ఇతర పాఠాలు దొరికితే తప్ప సాధ్యం కాదు. ధైర్యం చేసి దిద్దబోతే స్వతంత్రించి పాటపాడిన కవయిత్రి భాషని ఇష్టం వచ్చినట్టు దిద్దినట్టౌతుంది. అంచేత ఉన్న పాఠం ఆధారంగానే ఈ వ్యాసం రాస్తున్నాను. 

ఈ పాట పేరే చాలా కొత్తరకంగా ఉంది. దేవర అనే మాట తెలుగులో వాడుకలో లేని మాట కాదు. ఉదాహరణకి మనుచరిత్రలో ప్రవరుడి తల్లిదండ్రులను వర్ణిస్తూ, ‘దేవియుందేవరవోలె’ అన్నాడు పెద్దన, అంటే పార్వతీపరమేశ్వరులలాగా అని అర్థం. కాని, ఇక్కడ దేవర అంటే దేవుడు అనే అర్థం కాదు. దేవరన్యాయం అని మీకు తెలిసిందే ఇంకో మాట ఉంది. భర్త వల్ల సంతానం కలగకపోతే అతని తోబుట్టువు ద్వారా సంతానం కనే న్యాయం మహాభారతకథ తెలిసినవాళ్ళకి పరిచితమే. ఇక్కడ దేవర అనే మాటకి మహాభారతంలో లాగా భర్త తోబుట్టువు అని అర్థం. లక్ష్మణుడికి ఈ మాట వాడటం స్త్రీల పాటల్లోనే వుంది. మొత్తంమీద స్త్రీల పాటలు లక్ష్మణుడికి చాలా ఆప్యాయమైన ప్రాధాన్యం ఇచ్చాయని ఇంకోసారి మనకి జ్ఞాపకం వస్తుంది, ఈ పాటవల్ల. 

ఇంతకీ ఈ పాట ఏమిటి? లక్ష్మణుడు తన అన్నతో, అన్న భార్యతో అడవికి వెళ్ళేటప్పుడు ఊర్మిళా తానూ ఒక ఒప్పందం చేసుకున్నారని మనకు తెలుసు. ఆ ఒప్పందానికి సంబంధించిన ఊర్మిళ కథ మనం ఊర్మిళాదేవి నిద్ర పాటలో విన్నాం. ఈ లక్ష్మణదేవర నవ్వు ఆ ఒప్పందానికి సంబంధించిన లక్ష్మణుడి కథ. 

శ్రీరాముడు రావణవధ అనంతరం అయోధ్యకు చేరుకోవడంతో కథ మొదలౌతుంది. ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకుడు, రాముడు కొలువు తీరతాడు. వేల సంఖ్యలో గద్దెలు ఏర్పాటు చేస్తారు. ఆ గద్దెల మీద విభీషణుడు మొదలైన లంకావాసులు, సుగ్రీవుడు మొదలైన కిష్కింధాపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, వారితో పాటు అయోధ్యాపురప్రముఖులు అందరూ కూర్చున్నారు. సభ అంతా నిండుగా గంభీరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిల నవ్వుతాడు. లక్ష్మణుడు అలా నవ్వేసరికి అందరూ విస్తుపోతారు. ఎవరి మటుకి వారు ఆ నవ్వుకి వాళ్ళకి తోచిన అర్థం చెప్పుకుంటారు. జాలరివాళ్ళ అమ్మాయిని, గంగని పెళ్ళిచేసుకుని నెత్తిమీద పెట్టుకున్నానని లక్ష్మణుడు తనను చూసే నవ్వుతున్నాడనుకొని శివుడు తల వంచుకుంటాడు. ఈశ్వరుడి పెళ్ళికి అందరితో పాటు తనూ వెళ్ళగా కాలు మడత పడి క్రింద పడినప్పుడు నడుము విరిగి, ఆ వొంగిన నడుముతోటే ఈ సభకి చక్కా వచ్చినందుకు తన్నే చూసి నవ్వుతున్నాడు అని జాంబవంతుడనుకుంటాడు. అలా అనుకుని తల వంచుకుంటాడు. ఆ సభలో ఆదిశేషుడు కూడా ఉన్నాడు. ఆయన శ్రీమహావిష్ణువుకి సముద్రంలో శయ్యగా ఉండి సేవ చేసినవాడు. కాని ఇప్పుడు అతనికి పగవాడైన శివునికి సేవకుడిగా ఈ సభకి వచ్చాడు. తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడు అని అవమానభారంతో ఆదిశేషుడు తల వంచుకుంటాడు. 

ఆ సభలో ఉన్న ఇంకొకడు నీలుడు. నీలుడంటే సముద్రం మీద వారధి కట్టడంలో శ్రీరాముడికి తోడ్పడిన ప్రధాన నిర్మాత. అయితే ఈ నీలుడి గురించి తెలుగుదేశంలో ఒక కథ ఉంది. అతడు చిన్నవాడుగా ఉండగా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులూ తీసుకెళ్ళి నీళ్ళల్లో పారేసేవాడట. అవి మునిగిపోతే వెతికి తెచ్చుకోవడానికి ఇంట్లో వాళ్ళు నానా తాపత్రయాలూ పడేవారట. ఒకరోజున ఈ అబ్బాయి తన తండ్రి పూజాసామగ్రిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పారేశాడట. దాంతో ఆ తండ్రి ఇకనుంచి నీవు నీళ్ళల్లో పారవేసిన ఏ వస్తువైనా మునగకుండా తేలుగాక అని వరం ఇచ్చాడట. శ్రీరాముడు వారధి కట్టించే సమయంలో కోతులు కొండలనన్నీ పట్టుకువచ్చి సముద్రంలో పడేస్తూంటే అవి మునిగిపొయేవి. ఏంచెయ్యాలో తోచక అందరూ అయోమయంలో ఉంటే నీలుడు వొచ్చి తండ్రి తనకిచ్చిన వరం ఈ అవసరానికి పనికొస్తుందనీ, తన చేతుల మీదుగా రాళ్లని సముద్రంలో వేస్తే అవి మునగవనీ, తేలతాయనీ ఆ రకంగా వారధి తేలికగా కట్టొచ్చనీ ఉపాయం చెప్తాడు. ఆ తరవాత వరసగా కోతులు కొండరాళ్ళు పట్టుకురావడం, నీలుడికివ్వడం, నీలుడు వాటిని సముద్రంలో వేసి వారధి కట్టడం జరుగుతుంది. 

అయితే స్త్రీల పాటల్లో ఈ కథకి ఇంకో చిన్న మెలిక ఉంది. నీలుడు తండ్రి పూజాద్రవ్యాలని నీళ్ళలో పడేసి, అవి తేలకుండా నీళ్ళల్లో నొక్కి పట్టేవాడట. అందుకని తండ్రికి కోపం వచ్చి, నువ్వు నీళ్ళల్లో పడేసే ఏ వస్తువూ కూడా ఇక మునగకుండా ఉండుగాక అని శపిస్తాడు. ఆ మాట నీలుడు రాముడికి చెప్పలేదు. తండ్రి ఇచ్చిన శాపాన్ని వరంగా మార్చి అబద్ధం చెప్పాడు నీలుడు. ఆ సంగతి తెలిసి లక్ష్మణుడు నవ్వుతున్నాడని అవమానపడి నీలుడు తలవంచుకుంటాడు. ఆ సభలో ఉన్న అంగదుడు, లక్ష్మణుడు తనని చూసే నవ్వుతున్నాడనుకుంటాడు. తన తండ్రిని చంపిన రామునికి తాను ఈవేళ సేవకుడయ్యాడు అది ఎంత అవమానం. అలాగే సుగ్రీవుడు కూడా. తన అన్న వాలిని అన్యాయంగా రాముని చేత చంపించి, ఆ అన్న భార్యని తన భార్యగా చేసుకుని కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నాడీ సుగ్రీవుడని తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడని తల వంచుకుంటాడు. విభీషణుడు దాచుకున్న రహస్యం కూడా ఒకటుంది. తన అన్న ఆయువుపట్లు రహస్యంగా రాముడికి చెబుతాడు విభీషణుడు. ఆ రకంగా తన అన్నని చంపించి లంకారాజ్యానికి తాను రాజైనానని లక్ష్మణుడికి తెలుసు. ఇక హనుమంతుడున్నాడు. అంత బలవంతుడు, గొప్పవాడు, ఒక చిన్నవాడు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికిపోయాడు. ఆ అవమానపు కథ లక్ష్మణుడికి తెలుసు. అంచేత తన్ను చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడని తల వంచుకుంటాడు. 

ఇకపోతే సీత, లక్ష్మణుడు తనని గురించే నవ్వుతున్నాడనుకునే సందర్భంలో ఈ కింది చరణాలు కొంచెం తికమకగా ఉన్నాయి. 

కారడవిలో దశకంఠునిచేత | పట్టుబడ్డట్టి యో సతి తొడలమీద || 
పెట్టుకొనియున్నాడు సృష్టీశ్వరుడనుచు | అతివ యారునెలలు బాసి యీ రాజు || 
ప్రాణములు యెట్లుండెయో కోమలాంగీ | ఆడరాని మాటలాడి తివనుచూ || 
ఆడవారీ మాట నమ్మరాదనుచు | తలచి లక్ష్మణ నేడు తానవ్వెననుచు || 
ధాత్రిసుత కొలువులో తలవంచుకొనెను | 

ఈ చరణాలని – 
‘కారడవిలో దశకంఠునిచేత పట్టుబడ్డట్టి ఒక సతి(ని) తొడలమీద 
పెట్టుకొనియున్నాడు సృష్టీశ్వరుడనుచు, 
ఆరునెలలు యీ రాజు(ని) బాసి అతివ (నీ) ప్రాణములు యెట్లుండె(ను?) 
ఓ కోమలాంగీ, ఆడరాని మాటలాడితివి అనుచూ 
ఆడవారి మాట నమ్మరాదనుచు తలచి లక్ష్మణుడు నేడు తానవ్వెననుచు 
ధాత్రిసుత కొలువులో తలవంచుకొనెను’ 
అని సవరించుకుని చదివితే వొచ్చే తాత్పర్యార్థం ఇది: 

కారడవిలో రావణాసురుని చేత పట్టుపడిన నిన్ను తొడలమీద పెట్టుకొని ఉన్నాడు రాముడు. ఆయన ఒక క్షణం నీ దగ్గిర లేకపోతే నీకు ప్రాణాలు నిలవవని అన్నావు గుర్తుందా, అప్పుడే నన్ను అనరాని మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు ఆరునెలలు రాముడు లేకుండా ప్రాణాలు నీకు ఎలా నిలిచాయి? ఆడవాళ్ల మాటలు నమ్మకూడదు. 

ఈ రకమైన వూహలు మనస్సులో పెట్టుకుని, తనని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడనుకుంది సీత. 

సీత తలవంచుకోవడం చూసి రాముడు కూడా చిన్నబోతాడు. ఇంతకాలంగా ఈ రాజ్యాన్ని ఏలుతున్నాను, అయినా ఈవేళ ఈ విపరీతమేమిటి అని, లక్ష్మణుడు సభలో నవ్వినందుకు అతని తల తెగవేస్తానని రాముడు కత్తి ఎత్తుతాడు. సభలోని వాళ్ళంతా ఆయన్ని అడ్డుకుంటారు. మహారాజా, లక్ష్మణుడు చిన్నవాడు, అతని తల నరకడం న్యాయం కాదు అని రాముణ్ణి ఆపుతారు. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి అడుగుతాడు, ‘ఓ వీరుడా, శూరుడా, తమ్ముడా, సభలో ఎందుకు నవ్వావు చెప్పు’ అని. 

ఇక్కడ కొన్ని చరణాలు గజిబిజిగా కలిసిపోయి ఉన్నాయి. అయినా సమన్వయించుకొని చదివితే, లక్ష్మణుడు ఇలా అంటాడు. “మనం అడవులకు పోయినప్పుడు, ఆ పర్ణశాలలో మీకు నేను సేవ చేస్తూండగా, రాత్రి రెండు ఝాముల వేళ నిద్రాదేవి ఏడుస్తూ వచ్చింది. సతిరూపంలో వచ్చిన ఆవిడని నేనడిగాను, ‘నీవెవ్వరవు, ఎందుకేడుస్తున్నావు?’ అని. అప్పుడు నిద్రాదేవి తాను నిద్రాదేవిననీ, తాను అష్టదిగ్గజాలలోనూ, ఆదిఋషులలోనూ, వైకుంఠనాథునిలోనూ ఉంటాననీ. మానవులెవ్వరూ తన్ను గెలవలేరు కానీ నేను తనని నాదగ్గిరికి రానివ్వడం లేదనీ అంది. ఆమె ఆజ్ఞను తప్పించుకోవడం సాధ్యం కాదని గమనించి, ఆమెకు ముమ్మారు ప్రక్షిణం చేసి ‘నేను మా అన్నకి, వదినకి ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నన్ను వదిలి నా భార్య ఒక్కత్తే ఉన్నది. ఆవిడ రాత్రీపగలూ లేవకుండా ఆవిడని ఆవహించు. మళ్ళా మేం తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు, రాముడూ, ఆయన సేనలూ మంత్రులూ కొలువై ఉంటారు. అప్పుడు నన్ను ఆవహించు’ అని ఆమెకు విన్నవించాను. ఆమాట ప్రకారం, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది” అని లక్ష్మణుడు సమాధానం చెబుతాడు. తాను చేసిన పాపానికి పరిహారమేమిటని రాముడు విచారిస్తూండగా, వశిష్టుడు ఆయనతో, “అయ్యా, మీరు చేసిన పని మంచి పని కాదు. దానికి పరిహారంగా లక్ష్మణుడికి మీరు కాళ్లు పట్టాలి,” అంటాడు. రాముడు ఆ మాటకి సంతోషించి, సేవకులని పిలిచి లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడు. 

ఆ తరవాత దాదాపు పదహారు చరణాలు ఆ పక్క వర్ణన. ఆ పక్కమీద మల్లెలూ, చామంతులూ, పారిజాతాలూ, కనకరత్నాలు, కలవపువ్వులూ, జాజిపువ్వులూ అన్ని పరిచి, మొగలిపూరేకుల తలగడలు పెట్టి అందంగా ఏర్పాటు చేస్తారు. అంగదుడూ, హనుమంతుడూ, సుగ్రీవుడూ ఆ పక్క చూసి, ఆ సొంపు చూడడానికి రెండుకళ్ళు చాలవని ఆశ్చర్యపోతారు. తన పాదాల వద్ద అలిసిపోయి పడి ఉన్న లక్ష్మణుణ్ణి రాముడు ఎత్తి పక్కమీద పడుకోబెడతాడు. ఊర్మిళాదేవి తలంటుపోసుకుని, పీతాంబరం కట్టి, నగలు పెట్టుకుని, పైట జారుతూండగా వారచూపులు చూస్తూ భర్త దగ్గిరికి వస్తుంది. లక్ష్మణుడు ఆమెను వారించి, నువ్వు రావడానికి ఇది సమయం కాదు అంటాడు. తరవాత లక్ష్మణుడు నిద్రపోతాడు. అలా చాలాసేపు నిద్రపోతూంటే, ఏమిటి తమ్ముడు ఇంతసేపు నిద్రపోతున్నాడని, రాముడు హనుమంతుణ్ణి పంపుతాడు: ఊర్మిళతో సరసాలాడుతున్నాడా, జలక్రీడలాడుతున్నాడా చూసి చెప్పమని. హనుమంతుడు వెళ్ళి వచ్చి, లక్ష్మణుడు నిద్ర పోతున్నాడు, తన దగ్గిర ఎవ్వరూ లేరు అని చెబుతాడు. అప్పుడు రాముడు, శతృఘ్నునితో సహా లక్ష్మణుడి పడకగదిలోకి వచ్చి పక్క మీద కూర్చుని, తమ్ముడి పాదాలు తన తొడమీద పెట్టుకుని కాళ్ళు పట్టడం ప్రారంభిస్తాడు. నిద్రలో ఉన్న లక్ష్మణుడు కలగంటున్నా ననుకుంటాడు. తీరా కళ్ళు తెరిచి అది కల కాదు నిజమే, ఆ కాళ్ళు పట్టేవాడు శ్రీరాముడని చూసి, లేచి ఆయన పాదాలమీద పడతాడు. “నేను మీ పాదాలు వొత్తవలసిన వయసు వాణ్ణి. సమస్తదేవతలూ మీ పాదాలు పట్టుకుంటారు. అహల్యను పవిత్రురాలిని చేసిన పాదాలు మీవి. బలి శిరస్సు మీదనున్న పాదాలు మీవి. నా పాదాలు మీరు పట్టడం తగదు.” అంటాడు లక్ష్మణుడు. తన పాదాలమీది పడిన లక్ష్మణుణ్ణి రాముడు లేవనెత్తి కనక సింహాసనం మీద కూర్చోబెట్టి, 

చంద్రుడు లేని రాత్రి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు || 
దీపమ్ము లేనిల్లు యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు || 
పతిలేని సతి యెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు || 
ఉదకమ్ములేని కలశ మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు || 
చిలుకలేని పంజర మెట్టిదట బోలు | తమ్ముడా నీవులేని సభయట్లె బోలు || 

అని లక్ష్మణుడిని సభకు తీసుకొనివచ్చి, ముత్యాలగద్దె మీద కూర్చుండబెట్టి తాను రత్నసింహాసనం మీద కూర్చుంటాడు. 

ఇక్కడితో ఈ పాట అయిపోయింది. కానీ అచ్చుపుస్తకంలో ఈ పాట ఇంకో పాటతో కలిసిపోయి ఇంకా దీర్ఘంగా సాగుతుంది. 

ఇంతకీ ఈ పాటవల్ల మనకి తెలిసేదేమిటి? ఇందులో భాష, మాటల వాడుక, చరణాలు కూర్చే తీరు ఇవన్నీ చూస్తూంటే, ఇది స్త్రీలు పాడుకునే పాటే కాకుండా, ఎవరో స్త్రీ రాసిన పాట కూడా అని తెలుస్తుంది దురదృష్టవశాత్తూ, రకరకాల అనాదరణలు కారణంగా అచ్చులో గజిబిజిగా వచ్చింది. అయినా, పాటలో అర్థం బోధపరచుకోడానికీ అది పెద్ద అడ్డంకి కాదు. అందుకని, ఈ పాట ఉద్దేశించిన సంగతుల్ని బోధపరచుకోవడానికి ప్రయత్నిద్దాం. 

నవ్వు నాలుగందాల చేటు అనే మాట వల్ల ఎక్కువగా తమ సంతోషాలని అణగదొక్కుకుని లోపలుండే నవ్వుల్ని పెదవుల అంచుల దగ్గరే ఆపేసి ఉంచుకోవలసిన ఆడవాళ్ళు నవ్వు గురించి రకరకాలుగా ఊహించిన పాట ఇది. దాంతో పాటు పైకి ఎంతో గంభీరంగా కనిపించే ప్రపంచంలో చాలామంది నవ్వుని ఎందుకు వెంటనే అపార్థం చేసుకుంటారో మనకి నవ్వొచ్చేలా చెప్పే పాట ఇది. ఇంకొంచెం ముందుకెళితే  ప్రపంచంలో అందరూ, దేవుళ్ళ దగ్గరి నించీ మామూలు మనుషుల దాకా పైకి నిబ్బరంగా కనిపించే వాళ్ళే కానీ, లోపల ప్రతి వాళ్ళకీ ఏదో ఒక లొసుగు ఉంది. ఆ లొసుగు,  ఎవరికీ తెలీదనుకుని బతికేస్తూంటారు కానీ, అది తెలిసిపోయిందనే అనుమానం వస్తే వాళ్ళు గాలి తీసిన బుడగల్లా ముడుచుకుపోతారు. ఈ ప్రపంచపు తరహా అది. ఈ సంగతి ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకే ఎక్కువ తెలుసు అని చెప్పే పాట కూడా ఇది. వాళ్ళని నవ్వకుండా చేసే ఈ ప్రపంచం ఎందుకు నవ్వకుండా చేసిందో వాళ్ళ కర్థమయిందని మరీమరీ చెప్పే పాట ఇది. 

ఈ పాట మొత్తం మీద లక్ష్మణుడి నవ్వు వల్ల తలవంచుకోనివాడు రాముడొక్కడే. కానీ ఆ రాముడే అందరికన్నా ఎక్కువగా తలవంచుకోవాల్సిన తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించి చివరికి తమ్ముడి కాళ్ళు పట్టుకోవలసిన శిక్షకి గురి అవుతాడు. 

నామాట విని నవ్వండి, నవ్వు వల్ల ఏ చేటూ రాదు, ఎవరి నవ్వూ ఎవరి లోపాన్నీ చూపించదు, మీరు రకరకాల అర్థాలు చెప్పుకోకుండా మీరూ నవ్వండి. నవ్వితే అందరూ సంతోషంగా అందంగా ఉంటారు, అని చెప్పే చక్కని పాట ఇది. 

మరిది లక్ష్మణుడు ఆడవాళ్ళందరికీ దగ్గిరవాడు. అతను నవ్వితే లోకమంతా నవ్వుతుంది.

అన్న‌కు ద్రోహం చేసిన విభీష‌ణుడు, అన్న‌ను చంపిన సుగ్రీవుడు, 
జాల‌రిపిల్ల‌ను నెత్తి నెక్కించుకున్న శివుడు, ఆడ‌రాని మాట‌లాడిన సీత‌… 
ఇలా అంతా లోలోప‌ల ఉలిక్కిప‌డ‌తారు. 
‘నీ నువ్వుకు కార‌ణ‌మేమిటి?’ అని రాముడు అడుగుతాడు. 
అప్పుడు తాము అడ‌విలో ఉన్న‌ప్పుడు నిద్ర స్త్రీ రూపంలో వ‌చ్చి ఆవ‌హించ‌బోతే, 
అన్న సేవ‌లో ఉన్నాన‌ని, అన్న ప‌ట్టాభిషేకం అయ్యాక ర‌మ్మ‌న్నాన‌ని – 
ఇప్పుడు చిన్న కునుకు ప‌ట్ట‌గా న‌వ్వొచ్చింద‌ని చెబుతాడు ల‌క్ష్మ‌ణుడు

--(())--

🙏ఒక్క పల్లెటూరు లో ఒక్క హోటల్ ఉంది...
అక్కడకి ఒక్క సినిమా వాళ్ళు ఒక్క 40మంది వచ్చారు అందరు వచ్చి రాగానే ఆ హోటల్ లో జనం అంత చుట్టూ చూస్తున్నారు సినిమా వాళ్ళని. సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయపోతూన్నారు... అందరు హోటల్ లో కూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డెరెక్టర్ గారు వచ్చారు...
అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డెరెక్టర్ గారు అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని చూసాడు... 
చూడగానే ఎందుకో ఆ తాత అలా చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాత
ఇటురా అని పిలిచాడు...

ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు... 
తాత చేసా బాబయ్య అని చెప్పాడు...

మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే నీకు ఇష్టమా అని అడిగాడు...??

అదేం లేదు బాబయ్య అని కొంచెం దీనంగా మొహం పెట్టి చెప్పాడు...

మరి ఏంటి ఏమైనా డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే  చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు...

అదేం లేదు బాబయ్య.. నేను ఒక్కటి అడగాలి అనుకుంటున అడగనా బాబయ్య...??
సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు...

మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా ఎవరేనా విడుదల అవ్వక ముందే పైరసీ చేస్తే ఏం చేస్తారు బాబ్బయ్య...??

ఏముంది అలా చేసిన వాడిని జైల్లో పెడతాం.. ఇంకా లక్షలో జరిమానా వేస్తారు ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అడిగాడు...??

అప్పుడు ఆ తాత మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు...??

అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా ...
అపుడు తాత అడిగాడు మీరు ఇంత మంది ఇక్కడ భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల మంది సగం అన్నంలో చేతులు కడిగేసారు.అందుకే నేను అలా
చూస్తున్నా మిమల్ని అని అన్నాడు...

దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా.. అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు...

అపుడు ఆ తాత అన్నాడు... 
మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా కట్టిస్తారు... 
కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా రాబందులు మమల్ని పీక్కు తింటున్నా మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు...??

డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని అడిగాడు...??

తాత చెప్పాడు కోట్లు ఉన్న కోటీస్వరుడు అయినా, దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు,దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు... కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి.. ఆకలి తో ఉన్న వాడు ఎదో ఒక్కసారి అయినా మమల్ని గుర్తు చేసుకోకపోయినా వాడి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటయీ అని చెప్పాడు...

అందుకే బాబు ఇందాక మీరు సగం అన్నం లో చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి
చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు...
ఈ దేశం లో ప్రతి రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే రైతు ఉన్నాడు కానీ నిర్మాత లేడు...
మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు...

ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం...
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాలో వేస్తారు.. అలాగే ఎక్కడో ఒక్క చోట
అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని
బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు🙏

రోజు అన్నం లేక ఎంత మంది చనిపోతున్నారో  ఇక్కడ ఎంత మంది కి తెలుసు...??? 
మనకి భోజనం సమయానికి వస్తుంది కాబట్టి మనకి తెలియట్లేదు.. అదే రాకపోతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది... 
తినే వాడికి ఏం తెలుసు వండే వాడి బాధ,పండించే వాడి ఆవేదన..........!!!

🙏ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్నీ కాపాడుతుంది🙏





 శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:  

ఆధ్యాత్మిక విషయములు

* గురు శిష్యులు , * సగుణ - నిర్గుణములు,  * విధిరాత, లలాట లిఖితం, 
* జ్ఞానానికి పరాకాష్ఠ * * మోక్షసాధనకు ఇక్కడ 3 ఉపాయాలు * * ఆధ్యాత్మిక విషయాలు (కోరికలు), *వాసనలు, కర్మఫలాలు ఎలా ప్రోగు పడుతున్నాయి?*    

* గురు శిష్యులు --10--

అగ్గిపెట్ట ఒకచోట అగ్గిపుల్ల ఒకచోట ఉంటే అగ్గి ఎలా పుడుతుంది?
 సద్గురు ఒకచోట శిష్యుడు ఒకచోట ఉంటే 'ఆధ్యాత్మిక సత్యాలు' ఎలా వస్తాయి?

ఎవరో - ఏదో (పరమాత్మ) అని ఉన్న నిర్గుణ తత్వమే;
ఇప్పుడు - ఇక్కడ - ఇలా (ప్రకృతి) అన్న సగుణ తత్వంగా భాసిల్లుతూ ఉన్నది.

పుట్టాక జాతకం - పోయాక సూతకం; నడి మధ్యలో నాటకం., ఇదే జీవితం.

: ఒక గురువుని శిష్యుడు రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నాడు.

 చివరగా శిష్యుడు 'గురూజీ, వచ్చే జన్మలో మీరు ఏమవుతారు?'  అని అడిగాడు.

అప్పుడు గురూజీ -- నరకానికి వెళ్తాను అని అన్నారు.

అదేంటి స్వామి మీరు మహా జ్ఞాని కదా., నరకానికి ఎందుకు వెళ్తారు అని అడగ్గా,..

ఇలాంటి వెధవ ప్రశ్నలతో గురువులను విసిగించే మీలాంటి శిష్యులంతా నరకానికే కదా నాయనా వెళ్తారు.

నేను అక్కడికి రాకపోతే మీరు ఎలా ఉద్ధరింపబడతారు?  అని గురువుగారు సమాధానమిచ్చారు.

మంత్రాలకు చింత కాయలు రాలుతాయా?

మంత్రాలకు చింతకాయలు:

మన్ త్రాయతే ఇతి మంత్రః  = మనస్సును ఆలోచనలనుండి రక్షించును గాన మంత్రము.
చింతలు అనగా ఆలోచనలు. ఆలోచనలు ఎక్కువగా ఎడతెరిపి లేకుండా వస్తూ ఉంటె అవి కాయలు అనగా గుత్తులుగా కడతాయి. 

అవి పోవాలంటే ఆపకుండా మంత్రాలు ఒక దాని వెంబడి ఒకటి చదువుతే ఇంకొక ఆలోచనకు తావు ఉండదు.  

కూటస్థము అనగా రెండు కనుబొమ్మల అనగా భ్రూమధ్య భాగము. ఆ కూటస్థము మీద మనస్సు దృష్టి పెట్టవలయును.  ‘ఓంకారము’.   వెంటవెంటనే ఉచ్ఛారణ చేస్తూ ఉందవలయును.

మంత్రము ఎక్కువ నిడివి ఉండకూడదు. ఎక్కువ నిడివి ఉండని మంత్రము ‘ఓంకారము’.  ఆ కూటస్థములో మనస్సు దృష్టి పెట్టి ‘ఓంకారము’  అనగా ‘ఓం’ అని వెంటవెంటనే ఉచ్ఛారణ చేస్తూ ఉంటె ఆలోచనలు చస్తాయి.

వేరే ఆలోచన రాదు. రాలిపోతాయిఅందువలనమంత్రాలకు చింతలు అనే చింతకాయలు రాలి పోతాయా..., అంటే తప్పక రాలిపోతాయి.

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

* సగుణ - నిర్గుణములు  ---9 ---

ఎవరైతే సాధన యొక్క అనుభవములు పొందడానికి ప్రయత్నించరో, వారిలో అనేక వాద-వివాదములు,తర్క-వితర్కములు ఉత్పన్నమగును. సగుణము శ్రేష్టమా? లేక నిర్గుణమా? భక్తి గొప్పదా? లేక జ్ఞానం గొప్పదా? ....ఇటువంటి సందేహములెన్నో సాధన - అనుభవములు లేకపోవుట వలన కలుగుతూ ఉంటాయి. వాద-ప్రతివాదముల ద్వారా తగు సమాధానము లభించదు. సాధన ద్వారానే తగు అధ్యాత్మిక అనుభవములు పొందాలి. అనుభవమును పొందిన సాధకుడు మాటలాడుట తగ్గించును. ఆ స్థితిలో అనుభవామృతమును మరింత గంభీరముగా ఆస్వాదించును. సగుణమైననూ-నిర్గుణమైననూ సాధకుడు ఉన్నత అనుభవమును పొందవలెను. ఈ దృష్టి తోనే నిర్గుణ సాధకునకు రంగు, శబ్దము, స్పర్శ, రస, గంధములను తన్మాత్రా రూపములలో సగుణ అనుభవములు కలుగును. సగుణ ప్రవృత్తి సాధకునకు తగు సమయములో నిర్గుణ అనుభవములు పొందును. ఇంద్రియ భావమునకు అతీతముగా అతీతముగా పోగలిగిన వారు దివ్య గోవిందుని అర్థం చేసుకోగలుగుతారని సంత్ జ్ఞానేశ్వర్  నుడివినాడు. గోవిందుడు లభ్యమైన తరువాత  రాతి బొమ్మలో కూడా ఈ గోవిందుడే దర్శనమగును. సంత్ రామకృష్ణ పరమహంస, తాను  సగుణ మార్గం త్యజించిన తర్వాతనే నిర్గుణ వేదాంతము ప్రాప్తించినది. సగుణ నిర్గుణములు మనః స్థితి ననుసరించి అనుభవాలనిస్తాయి.

 క్రియాయోగ పరమహంస యోగానంద    ఇలా సెలవిచ్చారు ....

    అవతారపురుషుడు సర్వవ్యాపకమయిన ఆత్మలో వసిస్తాడు . నాలుగు దిశల మధ్యదూరభావం వారికి ఉండదు .
    
    కాబట్టి క్రియాయోగ బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతికరూపాన్ని నిలుపుకోడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే :

   మానవజాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలన్న కోరిక . దైవత్వాన్ని మాంసల ( మానవ ) రూపంలో దర్శించే అవకాశం మనిషికి
లేకపోయినట్లయితే , మర్త్యత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయా భ్రాంతి అతన్ని అణచి పెట్టి ఉంచుతుంది .
విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ                      
                  🌻 ఓం తత్సత్🌺

*  విధిరాత, లలాట లిఖితం --8--
 *)  విధిరాత, లలాట లిఖితం అంటుంటాము. ఇది సత్యమా? ఒక వ్యక్తి రోగాలను అధ్యయనం చేయడం కోసం జన్మలు ఎలా తీసుకుంటాడు?

Ans :--
1) విధిరాత, లలాట లిఖితం అనేది ఏ ప్రాణికి ముందుగానే నిర్ణయింపబడి ఉండదు.

Forex:-- ఒక వ్యక్తి ఒక రోగాన్ని జీవితాంతం అనుభవిస్తున్నాడంటే అతను జన్మ తీసుకోకముందే ఆ రోగాన్ని ఎంచుకోవడం జరిగింది.

కానీ ఇప్పుడు గనుక అతను తీవ్రంగా ఆ రోగాన్ని నయం చేసుకోవాలని సంకల్పిస్తే దేహం దానికి తగ్గ జీవరసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ లోకంలో ఏ జీవాత్మ గతం యొక్క దాయాదాక్షిణ్యాలపై జీవించాల్సిన అవసరం లేదు.

2) ఇదే వ్యక్తి ఒక జన్మలో డాక్టర్ గా వుంటూ ఆ వ్యాధి రావడానికి మూలకారణాన్ని కనుక్కుని, శాస్త్ర చికిత్సను కనుగొనవచ్చు. ఈ విధంగా ప్రతి జన్మ కూడా మనమే ఎంచుకున్నాము అని గుర్తుంచుకోండి.

3) ఈ విశ్వంలో ఏ cosmic డైరెక్టర్, లేదా ఏ దేవుడో మన జీవితాన్ని శాసించట్లేదని తెలుసుకోండి.

4) పిల్లలు లేకుండా ఒక జన్మ,పిల్లలతో ఒక జన్మ,స్త్రీగా,పురుషుడిగా, భిక్షగాడిగా, రాజుగా, రైతుగా, అలా అనేకానేక జన్మలు మనం స్వతంత్రంగా ఎంచుకుంటాము.

5) జీవిత శాస్త్రాన్ని అనేక కోణాల్లో దర్శించి అధ్యయనం చెయ్యడం కోసం ,ప్రతి ఆత్మ తన ఇష్టానుసారం జన్మ తీసుకుంటుంది.

6) ప్రతి ప్రాణి ప్రకృతి ఒడిలో క్షేమంగా ఉంది.ఒక వృక్షం తన ఆహారం కోసం భూమి నుండి భిక్షం అడగడం లేదు. సూర్యకిరణాలు కోసం పడిగాపులు కాయడం లేదు. వృక్షానికి కావలసిన వనరులన్నింటిని ప్రకృతి సమకూరుస్తుంది.

అలానే ఈ భూమి మీద ప్రతి ప్రాణికి కావలసిన వనరులన్నింటిని ప్రకృతి సమకూరుస్తుంది. మనం చేయాల్సింది ప్రకృతిని విశ్వసించడమే.

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--


* జ్ఞానానికి పరాకాష్ఠ * --7--

సౌందర్యం ద్వి విధమైనది. ఒకటి దృశ్యజగత్తుకు సంబంధించినది. రెండవది అదృశ్య జగత్తుకు సంబంధించినది. 

పాంచభౌతిక బాహ్యప్రపంచంలోని కొండలూ, లోయలూ, మైదానాలూ, జలపాతాలూ, సరస్సులూ, పూలూ, ఇవన్నీ అంటే మన కంటికి కనిపిస్తున్న ప్రతీది బాహ్యసౌందర్యం. 

అదృశ్యజగత్తంటే కనిపించని ప్రపంచమని అర్థం. అది జ్ఞాననేత్రంతో దర్శించాల్సింది. ఆ అంతరలోకంలోనూ అనంత సౌందర్యం నిక్షిప్తమై ఉంది. ఇందులోనూ పూలు, సెలయేళ్ళు, కొండలు, ధగద్ధగిత రత్నస్థగిత భవంతులూ, విశాలమైదానాలూ అసంఖ్యాకం. 

నిరంతర ధ్యానంలో బాహ్యప్రకృతి సౌందర్యం కూడా కనుమరుగై, కలగాపులగమై, వస్తువుల నిర్దిష్ట రూపజ్ఞానం నశించి నైరూప్యంలోకి మారినట్లే, అంతరంగంలోని దృశ్యజగత్తు సమసిపోయి నిరాకారంలో లీనమైపోతుంది. 

అది సౌందర్యం నుండి జ్ఞానానికి, వస్తు పరిశీలన నుండి వస్తు నిజతత్వానికి మానవుడు చేరుకున్న మజిలీ. అది జ్ఞానానికి పరాకాష్ఠ.
 
-విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
-(())--
* మోక్షసాధనకు ఇక్కడ 3 ఉపాయాలు  --6--

*ఆధ్యాత్మిక వికాసానికి - మోక్షసాధనకు ఇక్కడ 3 ఉపాయాలను చెప్పారు. అవి 1) భగవద్గీత అధ్యయనం, 2) గంగాజలపానం, 3) మురారి అర్చనం*. 

*1) భగవద్గీత* :- ఇది ఉపనిషత్తుల సారమైన బ్రహ్మవిద్య. ఇది 18 అధ్యాయాల గ్రంథం. ఇందులో చెప్పిన విషయాలను గనుక చక్కగా విని, విశ్లేషణ చేసి, గ్రహించగలిగితే ఈ జీవిత పరమార్థం ఏమిటో - ఆ పరమార్థాన్ని సాధించటం ఎలాగో తెలిసిపోతుంది. మనస్సును శుద్ధిచేసి, శుద్ధమైన మనస్సును పరమాత్మలో లయంచేసి ముక్తినందుకోవటానికి కావలసిన జ్ఞానం అంతా  అందులో ఉంది. కనుక జీవిత సార్థక్యానికి ముందుగా గీతాధ్యయనం చేయటం ఎంతో ముఖ్యమైనది. 

*2) గంగా జలపానం* :- గంగ హిమాలయాల్లో పుట్టింది. ఎక్కడో ఆకాశంలో ఉన్న దాన్ని ఎంతో ప్రయత్నం చేసి భగీరథుడు నేలమీదికి తెచ్చాడు. అది పుణ్యజలం; జీవబలం. దానిని పానం చేస్తే జన్మ పావనమౌతుందని భారతీయుల విశ్వాసం.

*అయితే ఇక్కడ గంగ అంటే గంగానది అని అర్థం కాదు. జ్ఞానగంగ అని అర్థం. సాధారణ మానవుడికి అందనంత దూరంలో వేదాలలోను, ఉపనిషత్తులలోను ఉన్న ఈ జ్ఞానగంగను భగవద్గీతలోనికి తెచ్చాడు శ్రీకృష్ణుడు. దానిని భగీరథ ప్రయత్నంతో - పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నించి సాధించాలి*. ఆ జ్ఞానగంగను పానం చేయాలి. ఎలా వస్తుంది మనవద్దకు? శివుని ద్వారా ఆ గంగ ఆకాశం నుండి భూమి మీదకు వచ్చినట్లు *ఈ జ్ఞానగంగ - వేద విజ్ఞానం గురువుల ద్వారా, గురుశిష్య పరంపరగా రావాలి. కనుక సద్గురువుల నాశ్రయించి ఈ జ్ఞాన గంగను పానం చెయ్యాలి. అంటే కేవలం శ్రవణం చేయటమే గాదు, మననం చేసి దానిని జీర్ణించుకోవాలి. ఆచరణలోనికి తెచ్చుకోవాలి*.

*3) మురారి సమర్చనం* :- ముర అను రాక్షసుని చంపిన శ్రీకృష్ణుని పూజించటం. శ్రీకృష్ణుని పూజించటం ద్వారా చిత్తాన్ని భగవదాయత్తం చేయాలి. ఇది పై పై అర్థం. 

‘ముర’ అనే రాక్షసుడు మనలోని అహంకారమే. ఆ అహంకార రాక్షసుణ్ణి జయించాలి - అని సూచన. ఎలా జయించాలి? భగవంతుని ప్రార్థించటం వల్ల, పూజించటం వల్ల, సేవించటం వల్ల, భగవంతునిలో ఐక్యం కావటం ద్వారా దీనిని సాధించాలి. 

 భగవద్గీతలోని అద్భుత వేదాంత విషయాలను సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని - జ్ఞానగంగను మననం ద్వారా పానం చేయాలి. అంటే గ్రహించాలి. అలా గ్రహించిన జ్ఞానాన్ని ఆచరణలోనికి తేవటం ద్వారా - నిధిధ్యాసన ద్వారా నీలోని అహంకారాన్ని అంతం చేసి ఆత్మగా పరమాత్మగా, బ్రహ్మముగా మిగిలిపోవాలి. అదే ముక్తి - మోక్షం. 

*సేకరణ :* : భజగోవిందం
విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--

 ఆధ్యాత్మిక విషయాలు (కోరికలు) ..--5-- 

కోరికలు గృహస్థులనూ వదలవు. సన్యాసులనూ వదలవు. సన్యాసులు అన్ని భోగాలు విడిచిపెట్టినవారు. తిండి, బట్ట, ఇల్లు - అనే కనీస సౌకర్యాలను గురించి కూడా పట్టించుకోరు. అట్టివారిని గురించి ఎంతో రమ్యంగా వర్ణించారీ శ్లోకంలో. అతడికి ఇల్లులేదు. కనుక శీతోష్ణాలను తట్టుకోవాలి. అందుకోసం తన వీపును సూర్యుని కెదురుగా ఉంచి కూర్చొని, తనకెదురుగా చలిమంట వేసుకుంటాడు. దానితో ముందూ, వెనుకా చలిబాధ తప్పిపోతుంది. ఇక రాత్రిళ్ళు నిద్రపట్టకపోతే మోకాళ్ళకు గడ్డాన్ని ఆనించి ముడుచుకు కూర్చుంటాడు. తిండి తినటానికి బొచ్చె కూడా ఉండదు. అందువల్ల తెచ్చుకున్న భిక్షను దోసిలిలో పెట్టుకొని తింటాడు. ఇక పడుకొని నిద్రపోవటానికి మంచం, పరుపు, దిండ్లు, దుప్పట్లు ఉండవు కనుక ఏ చెట్టు మొదట్లోనో తలక్రింద చేయి పెట్టుకొని క్రిందనే పరుండి నిద్రపోతాడు. ఇవన్నీ సర్వసంగపరిత్యాగిని, సన్యాసిని గుర్తుకు తెస్తాయి. అయినప్పటికి అతడిలో కూడా ఏవో కోరికలు ఉంటూనే ఉంటాయి. అతడూ ఆశ అనే పాశాలతో బంధింపబడి ఉంటాడు. 

ప్రాపంచిక వస్తువులను వదలి, ఏకాంతప్రదేశాలకు వెళ్ళి, అహంకారాన్ని నశింపజేసుకొనుటకు భిక్షాటనచేస్తూ, సామాన్యమైన జీవితాన్ని గడుపుతుంటారే గాని మనస్సులో కోరికల బీజాలు అలాగే ఉండి కలకలం రేపుతాయి. 

కనుక వస్తువులను, భోగాలను వదిలినంత మాత్రాన సరిపోదు. ఆ వస్తువుల కొరకు, భోగాల కొరకు మనస్సులో తపన ఉండకూడదు. వాటిపై వ్యామోహం చెందకూడదు. *అంటే వస్తువులను వదలటం కాదు. వాటిపై వ్యామోహాన్ని వదలాలి. ఆసక్తిని వదలాలి. మమతను వీడాలి*.

మనస్సులో తీరని కోరికలు పెట్టుకొని, పైకి మాత్రం వైరాగ్యం ప్రదర్శించే వారిని మిధ్యాచారులు - కపటాచారులు అని గీతాచార్యులు తెలియజేశారు. అందువల్ల మనస్సులోని కోరికలను - వ్యామోహాలను వదలడం ప్రధానం. అందుకోసం మనస్సును ఉన్నత మార్గంలో నిలపాలి. దానివల్లనే పూర్తి ప్రయోజనం. ముక్తి.

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--

 *వాసనలు, కర్మఫలాలు ఎలా ప్రోగు పడుతున్నాయి?* --4--

ప్రతి మానవుడూ ఏవో కర్మలను చేస్తూ ఉంటాడు. మమకారంతో, కోరికతో, రాగద్వేషాలతో ఇలా కర్మలు చేసినప్పుడు చేసిన కర్మల కారణంగా కర్మఫలాలు; కోరికల కారణంగా వాసనలు చేరుకుంటాయి. ఈ కర్మఫలాలు, వాసనలు రాకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది. ఐతే మానవుడు బండరాయి కాదు గదా! ఏ పనీ చేయకుండా ఉండడానికి. కనుక పని చేయాల్సిందే. ‘కుర్వన్నే వేహ కర్మాణి’ - ‘ఇక్కడ కర్మలు చేస్తూ ఉండవలసిందే’ అని ఈశావాస్యోపనిషత్ చెబుతున్నది. ‘నహికశ్చిత్ క్షణ మపి జాతు తిష్టత్య కర్మకృత్’ - ‘కర్మలు చేయకుండ ఒక్క క్షణం కూడా ఉండే వీలులేదు’ అంటూ భగవద్గీత బోధిస్తున్నది. కనుక కర్మలు చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి? కోరికలు లేకుండా, నేను చేస్తున్నాను అనే స్పృహ లేకుండా - కర్తృత్వ బుద్ధి లేకుండా, కర్తవ్యతా భావంతో, భగవదార్పణ బుద్ధితో, కర్మలతో ఎట్టి సంగభావం లేకుండా, నిష్కామంగా చేయాలి. ఇలా చేసినప్పుడు క్రొత్త వాసనలు చేరుకోవు. కర్మఫలాలు కూడా నీకు అంటవు. 'ఇలా చెయ్యాలి' అంటే మనం మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకొని, మనస్వస్వరూపమైన ఆత్మలో నిలిచి, పరమాత్మలో మనస్సు నిల్పి నిర్లిప్తంగా చేయాలి. అలా చేసినప్పుడే ఇక పునర్జన్మ ఉండదు. అలా చేయనంతకాలం ఈ పుట్టటం - చావటం అనే చక్రబంధంలో ఇరుక్కుపోవాల్సిందే. 

పుడితే ఏమిటి నష్టం? పుట్టేటప్పుడు ఏడుపు. పెరిగేటప్పుడు ఏడుపు. రోగాలొస్తే ఏడుపు. ముసలితనం వస్తే ఏడుపు. కోరుకున్నట్లు జరగకపోతే ఏడుపు. నీది అనుకున్నది నిన్ను విడిపోతే ఏడుపు. చివరకు మరణించేటప్పుడు అయ్యో! అన్నింటిని, అందరిని వదలి పోతున్నామే అని ఏడుపు. ఆ అవ్యక్తలోకాల్లో ఎన్ని కష్టాలు పడాలో, ఎంత నరకం అనుభవించాలో అని ఏడుపు. 


ఇక మళ్లీ పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించాలి. అక్కడ తల్లి తీసుకున్న ఆహారంతో పెరగాలి. అక్కడ ఉండటానికి చాలా ఇరుకు. సూక్ష్మజీవులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి . జుగుప్సాకరమైన రక్తం, చీము, మాంసం మొదలైన పదార్థాలతో నివాసం. ఇక ఉండటం కూడా తలక్రిందకు మోకాళ్ళకు ఆని ఉంటుంది. అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. దుర్భరం, బాధాకరం. అది గర్భనరకం. 


ఇట్టి బాధాకరమైన పరిస్థితి నుండి మనలను మనం ఉద్ధరించుకోవాలి. మనకు సాధ్యమా ఇది? మన శక్తి సరిపోతుందా? చాలదు. కనుక పరమాత్మను ఆశ్రయించాలి. ఓ ప్రభూ! ఇక నీవే నాకు దిక్కు అని శరణు కోరాలి. భగవంతునితో తాదాత్మ్యం చెందాలి. ఆయనను విడిచి ఒక్క క్షణమైనా ఉండరాదు. 


*సేకరణ :* : భజగోవిందం


*  పరమాత్మ సౌశీల్యము --3--

పరమాత్మ వివిధ అవతారాలలో సౌశీల్య గుణం తాను అవలంభించడమే కాక తన అంశావతారములుగా ఆవేశావతారములుగా వచ్చిన వ్యాస, వాల్మీకి, భరద్వాజ, నంద, అగస్త్య, మను, వశిష్ఠ, యజ్ఞవల్క్య, భృగు, శ్రీవత్స మొదలగు ఋషులు మన కోసం అందించిన ఇతిహాసములు, పురాణములు, ధర్మ శాస్త్రములు వారి సౌశీల్యానికి పరాకాష్ఠ. 

వారు అవతరించినదే ధర్మ సంస్థాపన, ధర్మ ప్రబోధం కొరకు. మన కోసం తపస్సులను యజ్ఞ యాగాదులను తగ్గించుకొని ఇతిహాస, పురాణ, ధర్మ శాస్త్రాలను అందించారు. 

ఒక్క వ్యాస భగవానుడే 18 పురాణాలు, మహా భారతంతొ కలిపి మొత్తం 5,25,000 శ్లోకాలు అందించారు. 

అంతే కాక వ్యాస స్మృతి వ్యాస సంహిత వేరు ఇలా 18 శ్రుతులలో 1,50,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణం 24,000 శ్లోకాలు, ఈ రూపంలో దుర్భోదములైన వేదంలోని అర్ధాలను అందరికి అందుబాటులో తేవడం సౌశీల్యమే. 

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పరమాత్మ సౌశీల్యాన్ని వర్ణించడానికి మరో 18 పురాణాలు రాయాలి.

ప్రతి వ్యక్తిలో తప్పకుండా ఉండవలసిన గుణం సౌశీల్యమే. గౌరవానికి, ఆదరానికి ధనం, అధికారం, సాధనం కాదు జ్ఞానమే సాధనమని చెప్పేది సౌశీల్యం. 

అజ్ఞానులకు జ్ఞానం ప్రసాదించాలి, పేదవారికి ధనాన్ని ప్రసాదించాలి, అన్నార్తులకు అన్నం పెట్టాలి. అన్నదానానికి, వస్త్ర దానానికి, ధన దానానికి కులం, మతం, గుణం చూడక వారి అవసరం చూసి ఆదుకోవాలి అదే సౌశీల్యానికి పరమార్ధం.

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--

ఈశ్వరుడు తనను తాను తెలుసుకునే ప్రయత్నం లోనే సకల సృష్టి ఏర్పడినది.

ఈశ్వరుడు తనను తాను తెలుసుకున్న క్షణం ప్రపంచం ఉండదు.


ప్రతి జీవి కనుపాపల్లో వెలిగే జ్యోతి 🔥శ్రీ అరుణాచలేశ్వరుడు. (అగ్ని లింగం)

ప్రతి జీవి శ్వాసలో కదిలే వాయువు 🌬️శ్రీ కాళహస్తీశ్వరుడు. (వాయు లింగం)

🕉🌞🌎🌙🌟🚩

*ఆత్మను తెలుసుకొని అనుభూతి --2--

ఆత్మ తెలియబడదు అనగానే దానిని తెలుసుకొనే అవకాశం ఎన్నటికీ లేదు అని అర్థం కాదు. కాకపోతే దానిని ప్రత్యక్షంగా తెలుసుకొనే వీలులేదు అనియే భావం. మనం కంటితో మన ఎదుట నున్న వస్తువును - దృశ్యాన్ని చూస్తున్నట్లుగా ఆత్మను చూడలేం. ఎందుకంటే ఆత్మ నీకన్నా వేరుగా నున్న వస్తువు కాదు, దృశ్యం కాదు. అలాగే ఆత్మను ప్రత్యక్షంగా ఒక శబ్దాన్ని విన్నట్లు వినలేము. ఆత్మను ఒక సంఘటనను భావించినట్లు భావించలేం.

 అయితే మనం తెలుసుకొనే ప్రతి విషయజ్ఞానంతోను ఆత్మ తెలియ బడుతూనే ఉంటుంది. మనం ఏ వస్తువును చూచినా ఆ చూడటం వెనుక ఆత్మయే ఉన్నది. దేనిని విన్నా ఆ వినటం వెనుక ఆత్మయే ఉన్నది. మనం ఏ విషయాలను భావించినా ఆ భావనల వెనుక ఆత్మయే ఉన్నది. మనస్సు విషయ వస్తువుల మీదకు పరుగెడుతున్నప్పటికీ ఆత్మను తెలుసుకోవటం సాధ్యమే. ప్రతి విషయ జ్ఞానంలోను తెలియబడేది ఆత్మచైతన్యమే. అయితే మనదృష్టి విషయం మీదకు గాక దానికి ఆధారమైన చైతన్యం మీదకు మళ్ళాలి.

అందుకే ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే అన్నారు. ప్రతి మనోవృత్తి ద్వారా - ప్రతి విషయజ్ఞానం ద్వారా ఆత్మ తెలియబడుతుంది. అలా తెలుసుకున్నవాడు ఆత్మనే పొందుతాడు అని.

అక్కడొక పుస్తకం ఉన్నది. దానిని కన్ను చూచింది. అది పుస్తకము అని మనస్సు నిర్ధారించింది. అదే విషయాన్ని వాక్కు ద్వారా చెబుతున్నాం. అది ఒక పుస్తకం అని. పుస్తకం విషయవస్తువు. అది పుస్తకం అని తెలుసుకున్న తెలివి విషయజ్ఞానం. ఈ తెలివి (విషయజ్ఞానం) ఎలా కలిగింది? కన్ను చూచి మనస్సుకు చెబితే. కన్ను ఎలా చూడగలిగింది? కంటికి వెనక ఉన్న చైతన్యం వల్ల కన్ను చూడగలిగింది.

 అలాగే మనస్సు వెనకనున్న చైతన్యం కన్ను చూపిన వస్తువుపైబడి ఆ వస్తువుతో కలిసి విషయజ్ఞానమైంది. కనుకనే ఆత్మ ప్రతిబోధ విదితం అన్నారు. మనస్సులో వృత్తులు (ఆలోచనలు) కదులుతున్నాయంటే ప్రతి వృత్తి వెనుక ఉన్నది ఆత్మచైతన్యమే. ఆత్మచైతన్యం యొక్క ఆధారంతోనే మనోవృత్తులు కదులుతున్నాయి. చైతన్యం లేనివానిలో ఏ వృత్తులు కదలవు.

 అయితే మనం మనస్సులో కదిలే వృత్తులపై దృష్టినుంచక, ఈ కదిలే వృత్తులు దేని ఆధారంగా కదులుతున్నాయి? దేని కారణంగా - ఏది ఉండటం వల్ల ఈ వృత్తులు కదులుతున్నాయి? అని ధ్యానపూరిత హృదయంతో అవగతం చేసుకొనుటకు ప్రయత్నించాలి. అప్పుడే సత్యం స్పష్టంగా అవగతమౌతుంది. 

 భాష్యం వ్రాస్తూ శంకరాచార్యుల వారు ఒక చక్కని ఉపమానాన్ని అందరికీ అవగతమయ్యే ఉదాహరణను ఇచ్చి మనకు మార్గం చూపారు. మన దృష్టిని కనిపించే వస్తువు పైనుండి కనిపించని ఆధారం వైపుకు ఎలా మరలించాలో తెలియజేస్తున్నారు.

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--

శ్రీ చక్రము -  విశ్లేషణ : --1-

శ్రీచక్రము విశ్వానికి సూచిక అని అంటారు కదా.

ఒకాయన ఇలా  అడిగారు.'అదేంటండి. అందులో అన్నీ గజిబిజిగా త్రికోణాలే ఉన్నాయి.విశ్వం వర్తులాకారం కదా. మరి పొంతన ఎలా కుదురుతుంది?'

ఒకరోజున రోడ్డుమీద పోతుండగా ఒక బండిదగ్గర పుచ్చకాయకు గాటుపెట్టి ఒక ముక్కను కోస్తున్నాడు అమ్ముకునే అబ్బాయి.ఆ ముక్క త్రికోణంలాగా బయటకు వచ్చింది.అడిగిన అతనికి చూపించాను. 

'చూడు వర్తులం నుంచి త్రిభుజం వచ్చింది కదా.అలాగే అనేక త్రిభుజాలతో నిండియున్న వర్తులం విశ్వం.దానికి సూచిక శ్రీచక్రం' అని చెప్పాను.

బిందువు, వృత్తము, త్రిభుజి, చతుర్భుజి అనేవి లేకుండా ఏ యంత్రమూ లేదు.బిందువు అనేది విశ్వానికి మూలం..బిందువును పెంపు  చేస్తే వృత్తం అవుతుంది.దానిని అనంతంగా expand చేస్తూ పోతే విశ్వం (యూనివర్స్) గా మారుతుంది.త్రిభుజి, చతుర్భుజి,పంచభుజి ఇలా ఉన్నాయి కదా.విశ్వాన్ని ఒక గుర్తు అనుకుంటే దానిని మినిమైజ్ చేసుకుంటూ వస్తే మనకు మిగిలేది ఒక త్రిభుజం ఎందుకంటే అతి తక్కువరేఖలతో ఏర్పడే జ్యామెట్రీకల్ ఆకారం త్రిభుజి మాత్రమె.కనుక బిందువు,త్రిభుజి,వృత్తం,చతుర్భుజి అలా శ్రీచక్రం ఉంటుంది.

బిందువు శైవం.త్రికోణం శాక్తేయం.చతుర్భుజి వైష్ణవం.ఒకసారి చిన్మయ మిషన్ వారు నన్ను ఉపన్యాసం చెప్పమని అడిగారు. సరేనని వెళ్లాను. 'నాకు వేదాంతం తెలియదు.లెక్కల మేష్టార్ని కాబట్టి లెక్కలు చెప్పమంటే చెబుతాను' అని వారితో అన్నాను.

      బిందువు అంటే పరమశివుడు.త్రికోణం అంటే శక్తి.'చిదగ్ని కుండ సంభూతా' అని లలితానామాలలో ఉన్నది.చిదగ్నికుండం అంటే బిందుసహిత త్రికోణం.ఇది శ్రీ యంత్రంలో లోపలగా ఉంటుంది.చతురస్రం అంటే బయటగా ఉన్న భూపురత్రయం.చతుర్భుజం అనేది  సూచిక. బిందువు,త్రికోణం,చతుర్భుజం-ఈ మూడూ లేకుండా ఏ యంత్రమూ ఉండదు.

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

No comments:

Post a Comment