Thursday 18 June 2020

27=06-2020


ఓం శ్రీ రామ్ ..... ఓం శ్రీ మాత్రేనమ:

సుందరాకాండ ....3   
* కణ నాట్యమే- నటరాజు పరమ శివుడి తాండవం
* అన్నమయ్య సంకీర్తన
* భగవత్తత్త్వము - సంఖ్యాత్మకం - వైజ్ఞానిక విశ్లేషణ :
* కంద పద్యాలు 
* విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది

సుందరాకాండ ....3   
            
ఓం నమోభగవతే  వాయునందనాయ  
శ్రీ హనమత్ స్తుతి:

అతులిత బలధామం  స్వర్ణ  శైలాభ దేహం
ధనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిదానం వానరాణా  మధీశం
రఘు పతి  ప్రియభక్తం వాతాజాతం నమామి

గోష్పధీకృత  వారాశిం  మసకీ కృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజం   

అంజనా నందనం వీరం జానకి శోకనాశనం  
కపిస మక్షహంతారం వందే లంకా  భయం కరం

ఉల్లంఘ్య  సింధో సలిలం సలీలమ్! య: సోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం!   నమ్మమితం ప్రాంజలి రాంజనేయం        

శ్రీ మారుతీ  స్తోత్రం 

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ
నమస్తే రామదూతాయ కామరూపాయ  శ్రీమతే 
మొహశోక వినాశాయ సీతాశోక వినాశినే 
భగ్నాసోక వనాయాస్తు  దగ్ద లంకాయ వాజ్మినే 
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయ  చ 
వనోకసాం వరిష్టాయ వాశినే వనవాసినే
తత్త్వజ్ఞానసుదాసిమ్దునిమజ్ఞాయ  మహియసే 
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ చ
జన్మమ్రుత్యు భయఘ్నాయ సర్వక్లేశ  హరాయ చ 
నే దిష్టాయ భూత ప్రీత పిశాచ  భయహారిణే

యాతనా  నాసనాయస్తు నమోమర్కత రూపిణే 
యక్షరాక్షస శార్దూల  సర్ప  వృశ్చిక  భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీ వి న ఉద్ద్రుతే 
హారిణే  వజ్ర దేహాయ చొల్ల్మ్ఘిత మహాబ్దయే 
బలీనా  మగ్రగణ్యాయ నమో నమ: పాహి మారుతే 
లాభదోసిత్వ మేలాశు  హనుమాన్ రాక్షసాంతక
యశో జయం  చ మేదేహి శ త్రూన్  నాశయ నాశయ
స్వాశ్రితానా మభయదం  య యేవం స్తౌతిమారుతిం
హాని: కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్                             

శ్రీ హనుమత్పంచరత్నం 

వీతాఖిలవిషయేఛ్ఛం జాతానందాశ్రుపులకమత్యఛ్ఛం | 

సీతాపతిదూతాద్యం వాతాత్మజ భావయే హృదం || 

తరుణారుణముఖకమలం కరుణారసపూరితాపాంగం | 

సంజీవనమాశాసే మంజుల మహిమానమంజనాభాగ్యం || 

శంబరవైరిశరాతిగమంబుజదలవిపులలోచనాదారం | 

కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || 

దూరీకృతసీతార్తిః ప్రకతీకృత రామవైభవస్ఫూర్తిః | 

దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతోమూర్తిః || 

వానరనికరాధ్యక్షం దానవకుల కుముద రవికరసదృక్షం | 

దీనజనావనదక్షం పవనతపః పాకపుంజ మద్రాక్షం || 

యేతత్పవన సుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం | 

చిరమిహనిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీ రామభక్తి భాగ్భవతి || 

ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచితం హనుమత్పంచరత్న స్తోత్రం సంపూర్ణం
   Lik
                           ..................                                           ......   4 
* కణ నాట్యమే- నటరాజు పరమ శివుడి తాండవం
* అన్నమయ్య సంకీర్తన
* భగవత్తత్త్వము - సంఖ్యాత్మకం - వైజ్ఞానిక విశ్లేషణ :
* కంద పద్యాలు 
* విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది

భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?

అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు

ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"

స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"

మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.

అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.

"అదెలా" అని అందరూ అడిగారు.

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు.

ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

--(())--
* కణ నాట్యమే- నటరాజు పరమ శివుడి తాండవం
* అన్నమయ్య సంకీర్తన
* భగవత్తత్త్వము - సంఖ్యాత్మకం - వైజ్ఞానిక విశ్లేషణ :

* కంద పద్యాలు 

🌻. 1 వ పద్యం

శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా.ll
భావం:--
శ్రీ రుక్మిణీదేవికి నాథుడవు, జలమున నిద్రించువాడవు, నారద సంగీతమునకు వశడవు గోవర్ధనపర్వతమెత్తి గోపకులమును రక్షించినవాడవు. ద్వారకా వాసుడవు. భక్తులను పాలించువాడవు అగు ఓ కృష్ణా ! దయతో మమ్ము రక్షింపుము.

🌻 2 వ పద్యం

నీవే తల్లి వి దండ్రి వి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా.ll

భావం :--
హే కృష్ణా ! నీవే నా తల్లివి, తండ్రియు, హితుడవు, వీడవలెవెన్నంటి యుండువాడవు, గురుడవు దైవము అయినవాడవు, నా ప్రభుడవు, నాకు ఆధారుడవు అని నమ్మితిని. నిజముగ సుమా !

🌻 3 వ పద్యం

నారాయణ పరమేశ్వర
ధారా ధర నీలదేహ దానవవై రీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా నను గావు కరుణ వెలయఁగ కృష్ణా.ll

భావం:--
నారాయణుడు, పరమేశ్వరుడు నీలదేహుడు, రాక్షసవైరి, క్షీరాబ్దిశయనుడు, యదువీరుడు అను బిరుదులతో విహరించే ఓ కృష్ణా ! దయతో నన్నుగావుమయ్యా.


ఆంజనేయ స్వామి  సింధూరాన్ని  పెట్టుకోవడం వలన  లాభాలు

( ॐ~

* ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
* ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది.
* ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది.
* చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.
* వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతరు.
* విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు.
* లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది.
* గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.

*ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ నెరవేరుతాయి.
* ఆంజనేయస్వామికి సింధూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుంది

( ॐ~


భగవత్తత్త్వము - సంఖ్యాత్మకం - వైజ్ఞానిక విశ్లేషణ :

 గీత ఏమి చెప్పిందో చూద్దాం. "ఏకాంశేన స్థితో జగత్" అన్నది. ఈ చెప్పిన స్థిర నిశ్చల బ్రహ్మలో ఒక అంశకు చంచలత్వము కలగడం వల్ల, ఆ చంచలత్వం క్రమంగా పెరుగుతూ వచ్చి ఈ జగద్బ్రహ్మాండ సృష్టి జరిగింది. దీంట్లోనే అది నిలదొక్కుకున్నది. 

ఏకాంశం అన్నదానికి అర్థం, ఆ అనంత బ్రహ్మలోని ఒక భాగం అని అనుకోకూడదు. ఒకవేళ అలా అనుకొంటే, తక్కిన భాగంలో చంచలత్వం లేదని  చెప్పవలసి ఉంటుంది. పోనీ అలాగే అంటామనుకోండి. దాని వల్ల పెద్ద తప్పు అయిపోతుంది. అందువల్ల ఏకాంశం అన్నదానిని, మొత్తంలో నూరింట ఒక పాలు అని గ్రహించాలి.(One per cent among the whole). అంటే అనంతంలో కేవలం ఒక్క శాతం చంచలమయిందన్నమాట. మరి ఆ ఒక్క శాతం చంచలత్వము కూడా తక్కిన 99% నికి మధ్యలోనే ఉండిపోయింది. పూర్ణమయినది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. 100% స్థిరం ఎప్పుడూ 100% గానే ఉంటుంది. దానిని విభజించడం సంభవం కాదు. ఇందువల్లనే 100 శాతానికి మధ్యలో ఒక్క శాతం చంచలమయ్యి, ఆ 100 శాతంలోనే ఉండిపోయింది. ఆతరువాత ఆ ఒక్క శాతము చంచలత్వము క్రమంగా పెరుగుతూ వచ్చింది. చివరిలో పూర్తి చంచలత్వంగా బయలు పడింది. ఈ ప్రకారంగా ఒక్క శాతం చంచలత్వము...సున్న శాతం నుండి 1, 2, 3,4  .....మాదిరిగా పెరుగుతూ వచ్చి పది రెట్లు అయింది.

     మొదటి పది శాతం చంచలం అయినప్పుడు , ఆ స్థితిని "ఆకాశ తత్త్వం" అంటారు. ఇందువల్ల ఆకాశ తత్త్వం చాలా సూక్ష్మమయినది. మరి 10 x  10 = 100 శాతం చంచలమయినప్పుడు , ఆస్థితిని "వాయుతత్త్వం" అంటారు. ఈ వాయుతత్త్వం శూన్యం కంటే స్థూలమైనది కావడం వల్ల , కళ్ళకు కనబడకపోయినా...దాని స్పర్శానుభూతి మనకు కలుగుతుంది. తరువాత 100 x 10 = 1000 తరంగాలు ఏర్పడినప్పుడు  ఆ అవస్థను "తేజస్తత్త్వం" అంటారు. ఈ తేజస్తత్త్వం...వాయు తత్త్వం కంటే స్థూలమైనది. అందువల్ల కళ్ళకు అగ్ని కనిపిస్తుంది...కానీ వేడి కనబడదు. వేడి అనుభూతి వల్ల తెలుస్తుంది. తరువాత 1000 x 10 = 10,000 తరంగాలు ఏర్పడినప్పుడు ఆ అవస్థను "ఆప తత్త్వం" లేదా " జలతత్త్వం" అంటారు. ఈ జలతత్త్వం, తేజస్తత్త్వం కన్నా స్థూలమైనది. అందువల్ల కంటికి కనిపిస్తుంది. 10,000 x 10 = 1,00,000 తరంగాలేర్పడినప్పుడు ఈ అవస్థను ...పృథ్వీ తత్త్వం లేదా భూతత్త్వం అంటారు. ఈ పృథ్వీతత్త్వం...అన్ని తత్త్వాల కంటే స్థూలమైనది. అందువల్ల సమస్త జీవులూ 1,00,000 తరంగ విశిష్టాలై భూతత్త్వంలో నెలకొని ఉన్నాయి. అంటే ప్రాణం తాలూకా 1,00,000 తరంగాల్లో  జడచేతనాలు...రెండూ ఉన్నాయన్నమాట. ఈ చివరి లక్ష తరంగాలవల్లనే సమస్త సృష్టి పూర్తిగా వ్యక్తమయింది. కాబట్టి ప్రతీ ఒక్క జీవికీ ఉనికి లక్ష తరంగాల అవస్థ అనుకోవచ్చు. ఈ స్థితిలోనే స్థూల శరీరం పూర్తిగా తయారవుతుందన్నమాట. శరీరంలోని 49 వాయువులు తయారై పనిచేయడానికి , సమర్థం అవుతాయి. ఈ వాయువులన్నిటి ద్వారా సకల ఇంద్రియాలూ...శత్రువులూ ఉత్పన్నమై, కర్మ సమర్థాలు అవుతాయి. కళ్ళు చూస్తాయి. చెవులు వింటాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము...అన్నీ పనిచేస్తాయి. ఇక్కడ స్పష్టం అయ్యే విషయం ఏమిటంటే...ఈ ప్రాణం యొక్క 1,00,000 తరంగాల మూలావస్థ ...స్థిరావస్థయే. ఆ స్థిరావస్థ లేకపోతే తరంగాలు ఉండడం సంభవం కాదు. కాబట్టి స్థిరత్వమే అన్నిటికీ మూలం. ఈ స్థిరత్వాన్నే " బ్రహ్మము" అంటారు. ఈ కారణం చేతనే ఋషులు, "బ్రహ్మ సత్యం, జగన్మిథ్య" అన్నారు.

మూలం : గురుదేవ్ అశోక్ కుమార్ చటోపాధ్యాయ

✒️ భట్టాచార్య

--(())--

🌹. మనల్ని కట్టి పడవేసేవి ప్రియ, మోద, ప్రమోదములు. వాటిని అధిగమించుటకై కావలసినది, సాధనా చతుష్టయ సంపత్తి. నిత్యా అనిత్య వత్యాసమును గుర్తుంచుకుని ఆ సంపత్తితో  జీవించేవాడే ఆత్మజ్ఞానాన్ని సాధించగలడు  🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ గారు
అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 

మానవ జీవితమంతా నడపబడుచున్నది ఈ  ప్రియ, మోద, ప్రమోదముల చేతనే. అందువలననే ఆత్మ జ్ఞానము కలుగుట లేదు, పరమాత్మ జ్ఞానము బోధ పడుట లేదు.

వైదవ్యము కలిగిన వారు పూర్వ కాలము తెల్లని వస్త్రములను మాత్రమే ధరించే వారు. ఎందు వలన?
రంగులు విషయములకు , మార్పు చెందే దానికి సాదృశ్యం. ఒకే రంగు(తెలుపు) చీర కట్టుట  విషయ వైరాగ్యమునకు  సాదృశ్యం.

పరిణామము లేని శాశ్వతమైన నేనును తెలుసుకొనే నిమిత్తమై నేను జీవితమును  జీవిస్తున్నాను అని తనకు తానే దీక్ష తీసికొనుటకు ప్రతీక తెల్లని వస్త్రమును ధరించుట. (సన్యాసము తనకు తానే స్వీకరించిన విధముగా). మన పూర్వ కాల ఆచారములలో ప్రతి ఆచరణ వెనుక ఆత్మజ్ఞానము దాగి ఉన్నది. 

కాని వాని వెనుక ఉన్న అంతరార్ధము తెలియక, లక్ష్యము లోపించుట వలన  కేవలము ఆచారముగా ఆచరించుట వలన క్రమముగా అన్ని కనుమరుగవు చున్నవి. ఆచార సంప్రదాయములను బ్రతికించ వలెనన్న నీవు ఆత్మ జ్ఞానముతో జీవించు. 

ఆప్పుడు ఆ జ్ఞానప్రభావము నీ చుట్టూ ఉన్న ప్రాణులపై పడి వాటిని సహితము ఆచరణకు పురికొల్పుతుంది, వారిని మేల్కొల్పుతుంది. అంతే కాని బలవంతముగా చేయించే ఏ ఆచరణ నిలబడదు.

నిత్యానిత్య వివేకము, ఇహాముత్ర ఫల భోగ విరాగము అనేవి ప్రతి మాట , చేత , ఆలోచన వెనుక పనిచెయ్యాలి. అవి నీ రోజువారి  జీవిత ఆచరణలో సహజమై పోవాలి (నీ ఆచరణలో భాగమై పోవాలి). మరణ కాలములో బుద్ధి విరమించే లోపు ఉపయోగ పడే సంపదలు ఏవైనా ఉంటే అవి ఈ రెండే.

సాధనా చతుష్టయ  సంపత్తితో జీవించేవాడు సాధకుడు
సాధనా చతుష్టయ  సంపత్తి   సహజమై పోయినవాడు శిష్యుడు
అట్టి శిష్యులలో అగ్రగణ్యుడు  సచ్చిష్యుడు.

సాధనా చతుష్టయ  సంపత్తి లేకుండా జీవించే వారు,సత్సంగములలో పాల్గొనే వారంతా  అనుసరించే వారు.
సాధనా చతుష్టయ  సంపత్తి లేకుండా సత్సంగములలో పాల్గొనే వారు విషయములచే బాధించ బడనంత వరకు ప్రశాంతముగానే ఉంటారు. 

కాని విషయములచే బాధించబడినపుడు విషయములలో మునిగి పోతాడు, కనుక ఆధ్యాత్మిక మార్గమును అనుసరించే వారంతా సాధనా చతుష్టయ  సంపత్తిని సంపాదించి ముందు సాధకులు కావాలి. 

ఈ సాధనా చతుష్టయ  సంపత్తి సాధించ బడకుండా నీకు ఏ ఆత్మజ్ఞాన పరమైన ఏ అనుభవము కలుగదు.

ప్రాధమికముగా గురువు చేసే పని ఈ సాధనా చతుష్టయ  సంపత్తిని ఏవిధముగా పొందాలి, దానిని ఏ విధముగా అనుభవములోనికి అనేది తెలియజేస్తారు. ఇదే గురువు మార్గదర్శకత్వము వహించడము అంటే.
🌹 🌹 🌹 🌹 🌹

* కణ నాట్యమే- నటరాజు పరమ శివుడి తాండవం
* అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

రేకు: 17-1
సంపుటము: 1-101.


ఏఁటికి దలఁకెద రిందరును
గాఁటపు సిరులివి కానరొ ప్రజలు!

ఎండలఁ బొరలక యేచిన చలిలో
నుండక చరిలోనుడుకక
అండనున్న హరి నాత్మఁదలఁచిన
పండిన పసిఁడే బ్రతుకరో ప్రజలు!!

అడవుల నలియక ఆకునలముఁదిని
కడుపులు గాలఁగఁ గరఁగక
బడి బడి లక్ష్మిపతికి దాసులై
పొడవగు పదవులఁ బొందరో ప్రజలు!!

పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ
దిక్కులనంతటఁ దిరుగక
గక్కన తిరువేంకటగిరిపతిఁ గని
వొక్క మనసుతో నుండరొ ప్రజలు!!

🕉🌞🌎🌙🌟🚩  

కీర్తనలో అర్ధాలు

ఎందుకు నెత్తికెక్కదు అందరికీ అధికమైన సంపదలు చూడండి ప్రజలారా. ఎండలో తిరగక ఎంచక చలిలో ఉండక తిరిగేవాడు అండ ఉన్న హరిని ఆత్మలో తలచిన పండిన బ్రతుకు బంగారమౌతుంది. అడవులలో ఆకులు అలమలు తిని కడుపు నింపుకోకుండా కడుపు కాలితే క్రమముగా లక్ష్మీదేవి భర్తకి దాసులై ధీర్ఘమైన పదవులు పొందరో ప్రజలారా. గుంతలు పడిన కాళ్లు పుళ్ళు రేగగా దిక్కులన్ని తిరగగా అక్కడ తిరువేంకటగిరిపతిని చూచి ఒక్క మనసుతో ఉండండి అంటు అన్నమయ్య కీర్తించాడు.

🕉🌞🌎🌙🌟

: శ్రీరమణీయం - (563)
🕉🌞🌎🌙?🚩

"ఎలాంటి వెంపర్లాటలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే..?"

ఆత్మానాత్మ వివేకం కలిగినప్పుడు తాము కోరుకుంటున్నది ఎంత అవాస్తవమో అర్ధం అవుతుంది. అప్పుడు కోరికల వెంట పరుగులు ఆగిపోతాయి. అంటే ఉన్నదేదో తెలిస్తే సగం వెంపర్లాట తగ్గుతుంది. కలను అసత్యంగా భావిస్తున్నాం కనుకనే నాకు ఫలానా మంచి కలవస్తే బాగుంటుంది అని ఎవరూ కోరుకోవటంలేదు. ఇప్పుడు మన ముందున్న ఇల కూడా అలాంటి అసత్యమేనని తెలిస్తే ఇక్కడ కూడా కోరికల ప్రవాహం ఆగుతుంది. కోరికలు ఆగిన జీవితంలో పాతకర్మలకు సంబంధించిన బాధ తప్పదుకానీ క్రొత్తగా వచ్చే దుఃఖం మాత్రం తప్పిపోతుంది. ఇప్పుడు మన ముందున్న కర్మను కలలాగా అనుభవిస్తూ క్రొత్తగా వెంపర్లాటలు లేకపోతే జీవితం హాయిగా సాగిపోతుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
కలకు-ఇలకు ఆధారం ఆత్మ !'- (అధ్యాయం -69)

🕉🌞🌎🌙🌟🚩
: "అమర చైతన్యం" 
 ( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩

 ప్రశ్న: నేనెందుకు ఆత్మని తెలుసుకోలేక పోతున్నాను ?

జవాబు: నీవెప్పుడూ ఆత్మని తెలిసేవున్నావు. ఆత్మకు తననెందుకు తెలియదు. నీవు ఇతరము అనేటువంటి ఆలోచనలకు అలవాటు పడిపోయినావు. ఆత్మను గురించిన తప్పు అభిప్రాయము పోవాలి. ఎప్పుడూ వుండే ఆత్మ గురించి అజ్ఞానం ఎందుకుంటుంది. మిధ్యానేనుకు వుండే అభిప్రాయాలన్నీ ఆలోచనల్నీ పొయ్యేంతవరకు పోరాటము తప్పదు. అది చేయుము. అదే నిన్ను సాక్షాత్కారమునకు చేరుస్తుంది. ఎవరికి దేని గురించి అజ్ఞానము. దీనినే విచారము చేయుము. అలా శోధిస్తూ వుంటే మిధ్యా నేను అదృశ్యమైపోతుంది. అసలు నేను ఆత్మ మిగులుతుంది. పుట్టినది ఏది, ఆత్మ కాదు. మనము ఆత్మలో స్థిరపడితే అదే అంతిమము. అదే అసలైన పుట్టుక. మిగిలిన పుట్టుకలన్నీ కూడా వాసనలరూపములే. అది శరీరము కాదు కనుక, మనము లోపలవుండే ఆత్మను గురించి మాట్లాడుతున్నాము. మనము ఆత్మయే.

✨⚡️✨⚡️✨⚡️

 ప్రశ్న: నేనాస్థితిలో వుండేందుకు ఏమిచేయాలి ?

జవాబు: ఆ స్థితిలో వుండేందుకు ప్రయత్నం అక్కరలేదు. ఏమి చేయాలంటే, తప్పు అభిప్రాయాలు పోవాలి. ఆలోచన వచ్చిన వెంటనే, ఆ ఆలోచన ఎక్కడనుండి పుట్టిందో గమనించు. ఎన్ని ఆలోచనలు వచ్చినా వాటిని విచారించు. ఇలా చేయగా కాలక్రమంలో ఇవన్నీ నశించిపోతాయి.

🕉🌞🌎🌙🌟🚩
 "ఋభుగీత "(30)
🕉🌞🌎🌙🌟🚩

2వ అధ్యాయము

గ్రహింపును అర్థం చేసుకుంటే పరమాత్మ ఏమిటో అర్థమౌతాడు !!

వేదాంతం "నీవు నీవే "అంటుంది. అంటే నీవు అనుభవాల రీత్యా ఏదిగా మారానని అనుకుంటున్నా నీవు నీవుగానే, బ్రహ్మముగానే ఉన్నావు. "అతడే నీవు" అంటుంది. అంటే శివుడవే నీవు అని చెప్తుంది. ఇది దృష్టిపెడితే అందరికీ తెలిసే విషయమే కాబట్టి "ఎరుగుదువు" అని, మనం గ్రహించ గలిగేది కాబట్టి "వీక్షితుడవనీ" ఋభు మహర్షి బోధించారు. ఈ సృష్టిలో ఏదైనా బ్రహ్మోద్భవమే కనుక అందులో భాగమైన మనమంతా బ్రహ్మోద్భవులమే అవుతాము. గ్రహింపును అర్థం చేసుకుంటే పరమాత్మ ఏమిటో అర్థమౌతాడు. గ్రహింపే ఎరుక. అదే బ్రహ్మము. చనిపోయినవారిలో లేనిది మనకి ఉన్నది ఎరుక. నిద్రలోనూ మనకు ఎరుక ఉంటుంది. అది అచేతనావస్థలో ఉంటుంది !

🕉🌞🌎🌙🌟🚩

* కణ నాట్యమే- నటరాజు పరమ శివుడి తాండవం:

 శివ తాండవం అంటే ఏమిటో తెలియచేయాలంటే అది అనుభవించిన వాడే చెప్పగలడు. అట్టి అనుభవానికి జాతి, కుల, మత, దేశ కాల నియమాలు లేవని తెలియ చేయడానికే ఒక పాశ్చాత్యుని అనుభవం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
డా. ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రా అమెరికాలో నివసించే భౌతిక శాస్త్రవేత్త. డెబ్బయ్యవ దశకంలో ఉన్న కాప్రా వయోవృధ్ధుడే కాదు; అభివృధ్ధుడు, ఙ్ఞాన వృధ్ధుడు కూడా. ఙ్ఞానికి, చైతన్యానుభవానికి దేశ కాలాలు అడ్డుకావని చెప్పడానికి ఒక సజీవ ఉదాహరణ డా.కాప్రా. అతడు తన 'తావో ఆఫ్ ఫిజిక్స్' అనే గ్రంథం ఉపోద్ఘాతంలో పొందుపరిచిన అనుభవం ఇది:

"ఐదు సంవత్సరాల క్రితం కలిగిన అద్భుతమైన అనుభవం నన్ను ఒక కొత్త మర్గంలో నడిపించి, ఈనాడు ఈ గ్రంథ రచనకు ప్రేరణగా నిలిచింది.

ఒకనాటి ఎండాకాలం సాయంకాలం సముద్రపు ఒడ్డున వచ్చి పోయే అలలను చూస్తూ, నా శ్వాసనిశ్వాసల లయబద్ధతను గమనిస్తూ కూర్చొని ఉన్నాను. ఉన్నట్టుండి నా అంతరంగానికి ఈ చుట్టూ ఉన్న వాతావరణమంతా ఒక గొప్ప నృత్యంలో భాగంగా నాట్యం చేస్తున్నట్టు గోచరించసాగింది.

ఒక శాస్త్రవేత్తగా ఈ ఇసుక, రాళ్ళు, నీరు, గాలి - అన్నీ కదుల్తున్న అణు, పరమాణువుల చేత చేయబడినవని తెలుసు. అలాగే భూమి యొక్క వాతావరణమంతా పదార్థ రాశి నిర్మింపబడడానికి అణుపరమాణువుల మధ్య జరిగే నిరంతర సంగ్రామాన్ని ఒక భౌతిక శాస్త్రవేత్తగా గ్రాఫ్లు ,బొమ్మలు, సూత్రాల ద్వారా మాత్రమే ఎరిగి ఉన్నాను.

కానీ ఈనాడు చల్లని ఈ సాయం సంధ్య నా పుస్తక ఙ్ఞానికి ప్రాణం పోసింది.

శక్తి తరంగాలు ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను.

లయబద్ధంగా ఆ శక్తి తరంగాలు పదార్థ రాశిగా మారడం, తిరిగి శక్తిగా లయించిపోవడం నేను చూశాను.
పదార్థంలోని పరమాణువులను నేను దర్శించగలిగాను.ప్రతి పదార్థములోని అణువులకు, చలనం ఉన్నది. ఉప పరమాణు క్షేత్రము (sub atomic field)లోనే కాకుండా, పరమాణు క్షేత్రములో కూడా "కణ తాండవం" జరుగుతూ ఉంటుంది. కానీ అది మన మామూలు కనులకు కనబడదు. పరమ సూక్ష్మ స్థాయిలో ఇది జరుగుతూ ఉంటుంది.భూ వాతావరణాన్ని, కాస్మిక్ కిరణాలు, నిరంతరం మర్దిస్తున్నాయని, అందులో ఉన్న అతి శక్తి కణాలు, గాలి లోకి చొచ్చుకొని వచ్చినపుడు , బహుళ సంఘాతాలకు గురి అగునని నాకు తెలుసు. భౌతిక శాస్త్ర పరిశోధనల వలన ఈ విషయం నాకు తెలుసు. అయితే ఈ పరిజ్ఞానమంతా, ఇప్పటి వరకు, గ్రాఫుల ద్వారా, చిత్రాల ద్వారా, గణిత-భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ద్వారా మాత్రమే తెలుసు కున్నాను. సముద్ర తీరాన కూర్చొన్నపుడు, నా గత అనుభవాలన్నీ జీవం పోసుకున్నాయి. బాహ్య ఆకాశము నుండి అవతరించు, ఆవర్తనములను (సుడులు), అందులోని కణములు లయాత్మకంగా స్పందిస్తూ పొందు సృష్టిని, నాశనాన్ని చూశాను. మూల కాల పరమాణువులు, నా శరీరంలోని పరమాణువులు....ఈ విశ్వ శక్తి నాట్యంలో పాల్గొనడం నేను చూసాను. ఆ లయను నేను అనుభవించాను. ఆ ధ్వని విన్నాను. అదియో హిందువులు పూజించు "నటరాజు - శివుని నాట్యమని" ఆ క్షణంలో తెలుసుకున్నాను. ఇట్టి శివ తాండవములో పాల్గొనని నక్షత్రముండునా? పరమాణువు ఉండునా? చలించని తరంగ ముండునా?

    అనుక్షణం తాండవిస్తూ, అట్టి కదలికల వలన శబ్దాన్ని ఉత్పన్నం చేయు పరమాణు సమూహములే, కంటికి కనిపించే "చరాచర జగత్తు". ఆ నృత్యం యొక్క క్రమం మారితే, దాని శబ్దం మారుతుంది. ప్రతి పరమాణువు కూడా తన గానాన్ని తానే పాడుతుంది. ఆ శబ్దము స్థూల-సూక్ష్మ రూపాలను ఉత్పన్నం చేస్తుంది. ఆ శబ్దమే.....శబ్ద బ్రహ్మముగా....అదే సృష్టి స్థితి లయలకు కారణాలుగా భావించి, దాని రూపమైన సంగీతాన్ని.....ఆధ్యాత్మిక సాధనగా గైకొనిన కబీరు, గురునానక్, త్యాగరాజు మొదలగు ఆత్మ వేత్తలు చెప్పిన దానికి, నేటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు ఎంతో సన్నిహితంగా ఉన్నాయి.

నా శరీరంతో సహా సర్వంలోనూ ఉన్న ఆ అణుపరమాణువులు ఒక మహా శక్తి తరంగ నృత్యంలో భాగాలుగా నర్తించటం చూశాను.

ఆ లయను నేను గుర్తించాను.

ఆ శబ్దాన్ని నేను విన్నాను.

ఆ క్షణంలో నేను అనుభూతి చెందింది హిందువులు నటరాజుగా పూజించే పరమశివుని తాండవంగా తెలుసుకొని పరవశంతో నన్ను నేను మరచిపోయాను.

సజల నయనాలతో కాలం తెలియని అలౌకిక స్థితికి తీసుకెళ్ళిన ఆ అనుభూతిని, కాదు అనుభవాన్ని ఏమని వర్ణించగలను?!!

ఈ అనుభవమే నా గమ్యాన్ని, గమనాన్ని మార్చే దిక్సూచి అయింది. నా అడుగులు తూర్పు దేశాలలోని అద్భుత విద్య వైపు కదిలేలా చేసింది. ఎందరో మహనీయులను దర్శించే అవకాశం కలిగించింది".

     వివిధ గ్రంథాల్లో, శివ తాండవాన్ని, కవితాత్మక వర్ణనగా, కవిత్వం రూపంగా మాత్రమె కాదు. సర్వ రూపములు ఈశ్వరుడే....అంటే పరబ్రహ్మమే. కావున తాండవం అనగా నిత్యం స్పందించే (vibration) విశ్వమే శివుడు (ఈశ్వరుడు).ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పినట్లు, ఈ తాండవం నిత్యం జరుగునదేఅంటాడు fritze of Capra.

   ఇలా విశ్వం యొక్క  సృష్టి-స్థితి-లయలను, Fritze of Capra నటరాజు నృత్యంతో పోలుస్తాడు. నటరాజు కుడి చేతిలో డమరుకం, ఎడమ చేతిలో అగ్ని ఉంది. డమరుకం, నూతన అణువుల సృష్టికి సంకేతం. అగ్ని , పాత అణువుల విలీనానికి సంకేతం. మరొక కుడి చేతిలో అభయ ముద్ర, మరొక ఎడమ చేతితో వరద ముద్ర నెపంతో, తన పాదాలను ఆశ్రయించమని సూచిస్తున్నాడు. ఆయన గ్రంథం Tao of Physics మొదటి ముద్రణ ముఖ చిత్రంగా, నటరాజు పరమ శివుణ్ణే ఎన్నుకున్నాడు. మన పురాణ వర్ణనలు, వేదోక్త భావనలు, ఉపనిషత్తుల జ్ఞాన సంపద.....పాశ్చాత్య శాస్త్రవేత్తలకు క్రొంగొత్త భావనలు అందిస్తూ ఉంటే, భారతీయులలో భావ దాస్యం గల కొంతమంది మన సాహిత్యాన్ని పుక్కిటి పురాణాలుగా చెబుతున్నారు. ఎంత హైన్యం? ఎంత దైన్యం?

భట్టాచార్య

No comments:

Post a Comment