Wednesday 10 June 2020



ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:



సంసారంలో సరిగమలు -2

నాగ భూషణం గారి కూతురికి వివాహము చేశారు, భర్త చూచుటకు అందగాడే, కొంచము బలాఢ్యుడె, కాపురము వేరేగా పెట్టారు వారు.

ఒక నాడు కూతురి కాపురాన్ని చూడడానికి నాగభూషణం భార్యతో కలసి వెళ్లారు, అల్లుడు సరదాగా పలకరించి నాకు అఫీస్ పని ఉన్నది వెళ్లి వస్తాను అని చెప్పి వెళ్ళాడు.

తల్లి వళ్లి ఎట్లావుందమ్మా నీ ఆరోగ్యం, బాబు కానీ పాప కానీ కనబోయారా ఇంకెందుకు ఆలస్యం, మీరు ఆలస్యంగా పెళ్లి చేసుకున్నారు, ఇంకా ఆగటం అనవసరం.

నేను అదే అన్నాను మా ఆయన తో, నాకు డబ్బులు సరిపోవు, బాకీలు ఉన్నాయి, పిల్లలు పుడితే పోషించటం కష్టం అని ఏవో కోటి సాకులు చెపుతాడు. ఒక వేపు ఉద్యోగమూ చేయొద్దంటాడు, మరో వైపు గవర్నమెంటు ఉద్యోగము సాధించలేవు ఎందుకు, నీవు కష్టపడు అంటాడు, కానీ దగ్గర ఉండి సహాయము చేయడు.ప్రోత్సహించడు. 

మొగవాలంతేనమ్మా మనమే సర్దుకు పోవాలి. వాళ్లకు ఇష్టమైనప్పుడు ప్రేమ కురిపిస్తారు, ఒక్కొక్కప్పుడు కఠినంగా ప్రవర్తిస్తారు తప్పదమ్మా ఆడజన్మకు కష్ట సుఖాలు.     

ఏదన్న అడిగాననుకో మా అమ్మను దారిలో పెట్టుకో, మా అమ్మ నాన్నలను సరిగా చూసుకో అంటాడు

పోనీ అలానే చేయపోయావా, మా మావ అత్తా కలసి వంట చేస్తారు, నేను చేస్తే తినరు, ఎదో  ఒంక పెడుతారు, అది ఎక్కు వయింది, ఇది ఎక్కువయింది. ఎదో వంక పెట్టి సణుగుతాడు. పోనీ రాత్రి అన్న దగ్గర తీసుకుంటాడంటే నేను కష్ట పడుతున్నాను, వచ్చేటప్పడికల్లా 10 దాటుతున్నది, ఏమోనమ్మా పట్టి పట్టనట్లుగా, చూసి చూడనట్లుగా ఉంటాడు, పిల్లలు ఇప్పుడొద్దంటాడు. అదమ్మా పరిస్థితి అన్నది .
                                              
సరే మేము నాలుగు రోజులు ఇక్కడ ఉంటాము కదా నేను వంట చేస్తాను.
ఏమిటత్తయ్యగారు ఈ ములక్కాడల పులుసు పెట్టారు చాలా బాగున్నది, ఏమో బాబు నీవు అమ్మాయి తింటారని చేశాను అన్నది.

మరునాడు ఉల్లిపాయల కూర చేసింది అదికూడా చాలా బాగుణ్నది అని తిన్నారు ఇద్దరు.       

అమ్మాయిని అల్లుడిని పిలిచి అత్త గారు ఇలా చెప్పటం మొదలు పెట్టింది.

మొన్నటికి మొన్న మా ఇంటి ప్రక్కన ఉన్న అమ్మాయి పెళ్లైందో లేదు అప్పుడే మూడో నెల కడుపుతో పుట్టింటికి వచ్చింది.    

ఇంతకీ మేము చెప్పబోయే దేమిటంటే మాకు మనవడిని అర్జంటుగా కని మీరు ఇవ్వాలి అన్నాడు మావగారు అంటూ సంతాన సాఫల్య కేంద్రవారు పంచె కాగితం చూపాడు.

దానిని అల్లుడు చదివాడు.  
ఇటీవల పెళ్లయిన చాలా మంది భార్యా భర్తలు ఎదుర్కొంటున్న సమస్య సంతాన లేమి. అనేక కారణాలతో ఇప్పటి కాలంలో పిల్లలు పుట్టడం కష్టంగా మారింది. మారిపోయిన ఉద్యోగాల టైమింగ్స్ సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఉద్యోగ, ఆర్థికపరమైన ఒత్తిళ్లూ కారణమవుతున్నాయి. తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడం, కంటినిండా నిద్ర లేకపోవడం, శరీరానికి వ్యాయామం లేక బరువు పెరిగి పోవడం అన్నీ వెరసి అమ్మా నాన్న అనే పిలుపును దూరం చేస్తున్నాయి. సంతానం కోసం వేలకు వేలు ఖర్చు చేసే బదులు లైంగిక సామర్థ్యాన్ని పెంచే కొన్ని ఆహారాలను తింటే సరిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కింద చెప్పే రెమిడీ వెంటనే పిల్లలు పుట్టేందుకు దోహదం చేస్తుంది. అదేమిటో చూద్దాం..

* ఖర్జూరాలు లైంగికశక్తికీ తోడ్పడతాయి. రాత్రికి మేక పాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకుల పొడి జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా సంతానలేమితో బాధపడే పురుషులకు ఎంతో మేలుచేస్తాయి.

* పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఖర్జూరపండ్లను భార్యా భర్తలు ఇద్దరూ ఆహారంలో భాగం తగిన పోషకాలను శరీరానికి అందించి లైంగిక సామర్థ్యాన్ని వృద్ధి చేస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

* గర్భం రావడానికంటే ముందు, వచ్చిన తర్వాత ఆరోగ్యానికి ఎడారిఫలాలు ఎంతో మేలు. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచించేలా చేయడంతోబాటు, బిడ్డపుట్టాక పాలు పడేందుకూ కారణమవుతాయి. గర్భస్థశిశువులో జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకూ సాయపడతాయి.

నిజమేను మావగారు మేము పిల్లలను కనాలని నిర్ణయించు కున్నాము, మీ అమ్మాయి కి కూడా ఉద్యోగము వస్తే బాగుండును కదా అన్నాడు.

నీ కున్నది సరిపోదా, నేను అతి తక్కువ సంపాదనతో కుటుంబాన్ని పోషించలేదా, పిల్లలకు చదివించలేదా, నేను అను కున్నానా అప్పడు.

అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు.

అప్పుడు అన్నమే తిన్నాము, ఇప్పుడు అన్నమే తింటున్నాము ఏదన్న తేడా ఉన్నదా ఏంటీ అన్నాడు మావగారు.

అప్పడు అద్దెలు తక్కువండి, ఇప్పుడు అద్దెలు ఎక్కువండి అన్నాడు

అప్పుడు 1000 రూపాయల సంపాదన ఇప్పుడు లక్ష రూపాయలతో సమానము అంతే తేడా, పిల్లల కనటంలో తేడా ఇప్పుడు చూపిస్తున్నారు.

సంపాదన బట్టి పోవాలి కదా మావగారు

నిజమే వయసులో ఉన్నప్పుడు పిల్లలు కంటే వయసు మల్లి నప్పుడు ఆసారాగా ఉంటారు అన్నాడు.

ఏమండీ మరి ఎక్కువ మాట్లాడుతున్నారు అల్లుడితో తొందర పడకండి అన్నది శ్రీమతి వల్లి, ఇది వాళ్ళ విషయం మనం కలగ చేసుకో కూడదు, వాళ్ళ అమ్మ నాన్నగారు వంశోద్దారకుడు కావాలని పట్టుపట్టుటలేదు మనం తొందర పడకండి, ఇవాళ ఉండి రేపు వెళ్లే వాళ్ళము.

అవునే నిజము నేను తొందర పడ్డాను, నా మూలంగా వారిద్దరి మధ్య గొడవలు రాకుండా ఉంటే చాలు, మీ అమ్మ  నాన్నను  పిలి పించి మరీ అడిగించావే మన అమ్మాయిని అడగ కుండా అనే చాలు అని అన్నాడు. అవునండి నాకు అదే భయము గా ఉన్నది, మరో రెండు రోజులు ఉండి వారి ప్రవర్తనను చూసి మరి పోదాము మన పెద్దబ్బాయి దగ్గరకు.
అట్లాగేనండి వెళ్దాము

మావయ్యగారు, అత్తయ్యగారు మీరు వెళుతున్నట్లు తెలిసింది, తొందరలో మీకు శుభవార్త చెపుతాను అన్నాడు అల్లుడు .

అదేనయ్యా ఈవయసులో జరిగే సరసాలు, కోరికలు ఆవయసులో అనుభవంచాలి, ఎవరు ఎమన్నా  నొచ్చు కోకుండా, జరిగి పోయిన కాలాన్ని ఆలోచించకుండా, జరగ పోయే కాలాన్ని గమనించి, మంచిని ఆశ్రయించి బ్రతుకును సరి  చేసుకోవాలి .

బాబు నేను ఒకటే చెపుతాను ఒకరు వేణువు శ్రీకృష్ణుని వెంటే ఉండుట కారణమేమి అని అడిగారు ఒకరు. అప్పుడు వేణువు  అన్నది నాలో ఉన్నది అంతా డొల్ల ఉపయోగించే వారిని బట్టి  స్వరాలు వినిపిస్తాను అంది. అట్లే ' స్త్రీ '  అనేది ఎటువంటి కల్ముషం లేని మనసు కలది. తన మనసుని దోచిన వానికి సర్వము అర్పించి సుఖ శాంతులు కల్పించునది అన్నాడు. 

నాకు తెలియదా  మావగారు , ఎదో ఉండబట్టలేక చెప్పాను అన్నారు మావగారు . 

Q 35:--  పూర్ణాత్మ - అంశాత్మ ?

Ans :--
1) మన దేహాన్ని ఒక పెద్ద జీవకణం గా ఊహించుకుందాం,ఆ జీవకణంతో పాటు కొన్ని కోట్ల జీవకణాలు ఆ దేహంలో వుంటూ పరిణామం చెందుతూ ఉంటాయి.

2) ఆ పెద్ద దేహానికి ఆత్మ ఉంది,అలానే పెద్దదేహంలో పరిణామం చెందుతున్న మనకు ఒక ఆత్మ ఉంది. అలానే ఇతర జీవకణాల కు ఆత్మ ఉంది.

3) మన దేహంలో ఉన్న ఏ జీవకణం తన విశిష్టత ను వ్యక్తిత్వాన్ని కోల్పోవడం లేదు. ఆ పెద్ద దేహంలో ఇమిడి ఉన్న ఆత్మలో ఈ జీవకణాల ఆత్మలన్నీ ఇమిడి ఉన్నాయి.

4) పెద్ద దేహంలో ఉన్న ఆత్మ పూర్ణాత్మ అయితే, ఆ జీవకణాలలో ఉన్న ఆత్మలన్నీ అంశాత్మలు.ఇక్కడ జీవకణం,దేహం రెండూ వేరు కాదు రెండూ ఒక్కటే. అలానే పూర్ణాత్మ, అంశాత్మ ఒక్కటే. కానీ దేని వ్యక్తిత్వం దానిదే, దేని విశిష్టత దానిదే.

5) దేహంలోని జీవకాణాలన్నీ తమ స్వతంత్రతను, ఉనికిని
కోల్పోకుండా తాము చైతన్య పరిణామం చెందుతూ పూర్ణాత్మ చైతన్య పరిణామాన్ని పెంచుతున్నాయి.

6) దేహంలో క్షణ కాలంలో ఎన్నో జీవకణాలు మృతి చెందుతున్నాయి. మళ్ళీ కొత్త జీవకణాలు పుడుతున్నాయి. అలానే మన అంశాత్మలమైన మనం పుడుతూ చస్తూ ఉంటాం. జనన మరణ చట్రాలలో పరిణామం చెందుతూ ఉంటాం.

7)  పూర్ణాత్మ ... అంశాత్మలు సాధించిన ప్రగతితో తాను పరిణామం చెంది ... చైతన్యాన్ని వ్యాకోచింప చేసుకుంటుంది. అలానే అంశాత్మ జ్ఞాన పరంగా ఎదిగితే అంశాత్మ తన చైతన్యాన్ని వ్యాకోచింప చేసుకుంటుంది. అంశాత్మ చైతన్య పరిణామం చెంది అనగా జ్ఞానాన్ని సముపార్జించి ఆచరించి అద్వైతానికి చేరి పూర్ణాత్మగా తయారవుతుంది. అంతే గాని ఏ అంశాత్మ పూర్ణాత్మ తో విలీనం అవ్వడం జరుగదు. జ్ఞాన సముపార్జన వివిధ frequency గల లోకాలలో అంశాత్మలు జన్మ తీసుకుని సంపాదిస్తాయి.

8) మన దేహంలో ఎలా అయితే జీవకణాలు... ఆ జీవకాణాలన్నింటిలో ఆత్మ వుందనుకుంటున్నామో, అలానే
భూమి పైన మానవులు, ఇతర జంతుజాతి, పక్షి జాతి.....etc...  మధ్య సహకారంతో భూమి అనే ఆత్మ చైతన్య పరిణామం చెందుతుంది. అనగా భూమి మీద నివశించే మానవ జాతి ఇతర జంతుజాతి చైతన్య పరిణామం చెందితే పూర్ణాత్మ అయిన భూమి చైతన్య పరిణామం చెందుతుంది. అనగా మన దేహంలో వైరస్ లు బాక్టీరియా ఎలాగో, భూమి పైన మానవులు, ఇతర జంతుజాతులు అలానే.

9) మన దేహంలో కోట్ల electrons, పరమాణువులు, అణువులు, వైరస్ లు బాక్టీరియా లు అన్ని కలిసి వాటి సహకారంతో మన దేహం ఎలా నిలబడుతుందో, అలానే భూమి పైన మానవ జాతి, జంతుజాతి, రాళ్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు అన్ని కలిసి భూమి అనే దేహాన్ని నిలిపివుంచుతున్నాయి.
🌹 🌹 🌹 🌹 🌹

అరుణాచల👏  ధ్యానం..... అంటే ఏమిటి... ఇది.. ఒక చిన్న పిల్లవాడిని వెంటాడే ప్రశ్న. అయితే.. బాలుడు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో వివరించలేనందున అతని తల్లిదండ్రులు విచారణలో పడ్డారు.  ఒకసారి ఆ కుటుంబం శ్రీ రమణ మహర్షి దర్శనం కోసం వెళ్లారు. అప్పుడు ఆ బాలుడు తన ప్రశ్నను రమణ మహర్షిని అడిగాడు.  శ్రీ రమణ మహర్షి తనలో తాను నవ్వుకున్నారు. అప్పుడు నవ్వుతున్న ముఖంతో, ఆయన భక్తుడుకి  వంటగది నుండి అబ్బాయికి దోస తెచ్చి పెట్టమన్నారు.  ఒక ఆకు మీద దోస వడ్డించారు. శ్రీ రమణ మహర్షి బాలుడ వైపు చూస్తూ.. ఇప్పుడు నేను "హ్మ్ " అని చెప్తాను అప్పుడు నువ్వు దోస తినడం ప్రారంభించాలి. అప్పుడు మళ్ళీ నేను "హ్మ్" అని చెప్తాను, ఆ తరువాత దోస ముక్కను నీ ఆకు మీద ఉంచకూడదు." అని అనగా..   బాలుడు అంగీకరించాడు. అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మరికొందరు కుతూహలముతో  చూస్తున్నారు. ఇప్పుడు బాలుడు శ్రీ రమణ మహర్షి ముఖాన్ని చూసి ఆయన ఆజ్ఞ కొరకు ఆత్రంగా ఎదురు చూశాడు. ఆయన "హ్మ్" అని ఆజ్ఞాపించగానే బాలుడు తినడం ప్రారంభించాడు.  ఇప్పుడు ఆ పిల్లవాడి దృష్టి శ్రీ రమణులపై ఉంది. అతను మరల ఆజ్ఞ రాకముందే దోస పూర్తి చేయాలనుకున్నాడు. బాలుడు ఆత్రుతలో దోస తినడం, దోస పెద్ద ముక్కలుగా చేసి తినడం చేస్తున్నాడు, కానీ, అన్ని సమయాలలో శ్రీ రమణులపై మాత్రమే దృష్టి ఉంది. దోస  క్రమంగా తగ్గుతోంది. ఇక ఒక చిన్న ముక్క మిగిలి ఉంది. బాలుడు రెండవ ఆజ్ఞ కోసం శ్రీ రమణుల వైపు ఆత్రుతగా చూస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపించిన  క్షణం, బాలుడు వెంటనే దోసను నోటిలో పెట్టాడు.  ఇప్పుడు శ్రీ రమణులు ఆ బాలుడిని అడిగారు "ఇప్పటి వరకు నీ దృష్టి ఎక్కడ ఉంది..? నా మీద లేదా దోస మీద..?"... బాలుడు "రెండింటి మీద " అని బదులిచ్చాడు  శ్రీ రమణుల "అవును. నీవు దృష్టిని నా మీద ఉంచుతూ దోస పూర్తి చేయడంలో నిమగ్నం ఆయి ఉన్నావు.." నీవు అస్సలు పరధ్యానం చెందలేదు.  ఇలాగ మీరు మీ రోజువారీ కార్యకలాపాలను చేస్తూ మీ దృష్టి మరియు ఆలోచనలు యల్లవేేలలా ఆ ఈశ్వరుడు పైన ఉంచాలి... దీనినే ధ్యానం అంటారు...  *🙏|| ఓం నమః శివాయ |

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

గానం. శ్రీ ప్రియాసిస్టర్స్


1.అందరికాధారమైన ఆది పురుషుడీతడు 
విందై మున్నారగించె విదురునికడ నీతుడు !!
||అందరికి||


2.సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు 
వనజ భవాదులకును దైవంబై నతడీతడు | 
ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు !!
||అందరికి||


3.సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు 
ధరనావుల మందలలో తగ జరించె నీతడు | 
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు 
ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు !! 
||అందరికి||


4.పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతడు సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు | 
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు 
వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడితడు !! 
||అందరికి||


🕉🌞🌎🌙🌟🚩


No comments:

Post a Comment