Tuesday 23 June 2020





రోజువారీ సీరియల్ .... 6
ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణంలో విషయాలు క్లుపంగా 

బాల కాండము (77 సర్గలు) : కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము

అయోధ్యా కాండము (119 సర్గలు) : కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము

అరణ్య కాండము (75 సర్గలు) : వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము

కిష్కింధ కాండము (67 సర్గలు) : రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము

సుందర కాండము (68 సర్గలు) : హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట

యుధ్ధ కాండము (131 సర్గలు) : సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)

                                          .................................   7. 
రోజువారీ సీరియల్ .... 8
ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణంలో విషయాలు క్లుపంగా 

రోజువారీ సీరియల్ .... 9
ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణంలో విషయాలు క్లుపంగా 

అరణ్యకాండము
రామునితో బంగారు లేడిని తెమ్మని చెబుతున్న సీత - రాజా రవివర్మ చిత్రం
సీతారామలక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి 8శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి తన సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మందిగల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.

కిష్కింధకాండము
వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం
రాముడూ, వానరుడైన సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించిదక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెదకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు.


రోజువారీ సీరియల్ .... 10
ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణంలో విషయాలు క్లుపంగా 
సుందరకాండము
హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తున్న రాక్షసులు c.1910's నాటి చిత్రం.
హనుమంతుడు దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, భీతయై కృశించిన సీతను చూచాడు. ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
యుద్ధకాండము
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది. రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో జరిగింది. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు.
రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగిస్తున్న ఇంద్రజిత్తు
ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధం జరిగింది. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.
అనేకమంది రాక్షస వీరులు వానరుల చేత, రామలక్ష్మణులచేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు.
మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి అందరూ వివశులయ్యారు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, ఇంద్రజిత్తును చంపేశాడు.
పట్టాభిషిక్తులైన్ సీతారాములు
ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. హనుమంతుడు మరల గిరిశిఖరానికి వెళ్ళి, శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".
రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.
అనంతరం రాముని నిరాకరణతో క్రుంగిపోయిన సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.

రాముని నిర్యాణము
రావణాది దుష్టులెల్లరును మడసిరి కావున రామా నీవీ అవతారమును చాలింపుము అని యముడు అనెను.రాముడు, ఆతని సోదరులెల్ల సరయూనదిలో దిగి వారి అవతారములు చాలించిరి.[3]

* అరుణాచలేశ్వర ఆలయం,
* పరీక్షిత్తు జననము
ఆరోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
భీష్ముడు రోజూ యుద్ధం

9వ శతాబ్దపు అరుళ్మిగు అరుణాచలేశ్వర ఆలయం,  తిరువణ్ణామలై, తమిళనాడు

అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు.

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.

ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.

పురాణగాధ
త్రిమూర్తులలో అత్యంత శక్తివంతమైనది ఎవరు అనే విషయంపై బ్రహ్మ, విష్ణువు ఒకప్పుడు వాదించారు.  శివుడు జోక్యం చేసుకోవాల్సిన వాదన వేడెక్కింది.
శివుడు ఒక భారీ మండుతున్న లింగం యొక్క రూపాన్ని స్వీకరించాడు, అది స్వర్గం వరకు వెళ్లి భూమిలోకి లోతుగా దిగింది.  జ్వాల ముగింపును ఎవరైతే కనుగొంటారో వారు గొప్పవాడిగా ప్రకటించబడతారు.  బ్రహ్మ తన మౌంట్ హంసా (హంస) తీసుకొని, లింగం వరుసలో పైకి వెళ్లి దాని ముగింపును కనుగొన్నాడు. అతను లింగం పైనుండి పడిపోతున్న కేటాకి  పువ్వును చూశాడు మరియు లింగా చివర దూరం గురించి అడిగాడు, తద్వారా అతను 40 కిలోల నుండి పడిపోతున్నానని కేతకి సమాధానం ఇచ్చాడు! అతను చివరికి చేరుకోలేడని గ్రహించి, పువ్వును తప్పుడు సాక్షిగా వ్యవహరించమని కోరాడు - బ్రహ్మ లింగం చివరికి చేరుకున్నాడు.  కేతకి పువ్వు తప్పుడు సాక్షిగా వ్యవహరిస్తూ బ్రహ్మ శివలింగ ముగింపును చూశారని ప్రకటించారు. సత్యాన్ని తెలుసుకున్న శివుడు మోసానికి కోపం తెచ్చుకున్నాడు మరియు బ్రహ్మకు భూమిపై దేవాలయం ఉండకూడదని మరియు కేతకి పువ్వును ఆరాధించేటప్పుడు ఉపయోగించరాదని శపించాడు.పోరాడుతున్న దేవతల అహాన్ని తొలగించడానికి శివుడు మండుతున్న బ్రహ్మాండమైన లింగాన్ని నిలబెట్టిన ప్రదేశం తిరువన్నమలై మరియు నిర్మించిన ఆలయానికి అరుణాచలేశ్వర ఆలయం అని పేరు పెట్టారు.

నిర్మాణం 
ఈ ఆలయ సముదాయం 10 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రస్తుత  నిర్మాణం 9 వ శతాబ్దంలో చోళ రాజవంశం సమయంలో నిర్మించబడింది, తరువాత విస్తరణలు సంగమ రాజవంశం (1336–1485 CE), సాలూవ రాజవంశం మరియు తులువా రాజవంశం (1491–1570 CE) యొక్క విజయనగర పాలకులకు ఆపాదించబడ్డాయి. 

రాజగోపురం

ఇది శ్రీకృష్ణదేవరాయల నిర్మాణం. రాజగోపురం క్రింది భాగం (బేస్) 135 X 98 అడుగులు. ద్రవిడదేశంలో రాజరాజచోళుడు కట్టించిన తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం (ఎత్తు 216 అడుగులు ) కంటే ఒక అడుగు ఎక్కువగా ఉండేలా,  శ్రీకృష్ణదేవరాయల కట్టించినదీ పదకొండు అంతస్తుల రాజగోపురం. (శతాబ్దాల తర్వాత1987లో కట్టిన శ్రీరంగం ఆలయగోపురం ఎత్తు 239 అడుగులు – ఆ తర్వాత 2008లో నిర్మించిన కర్ణాటకలోని మురుడేశ్వర ఆలయగోపురం ఎత్తు 237 అడుగులు. కానీ ఇవి ఇటీవల కాలంలో కట్టిన సిమెంట్ నిర్మాణాలు).

గోపుర గణపతి
ఈ ప్రాకారంలో ప్రముఖంగా కనిపించే వెయ్యిస్తంభాల మండపం, శివగంగ తటాకం కూడా శ్రీకృష్ణదేవరాయల నిర్మాణాలే. ఆలయం లోపల మూలవిరాట్ కొలువైన గర్భగుడిని మొదటి ప్రాకారంగా భావిస్తే, ఇప్పుడు మనం రాజగోపురం లోపలినుంచి వచ్చి ప్రవేశించాలి – ఐదవ ప్రాకారమన్నమాట. అరుణచలేశ్వరాలయం ఐదు ప్రాకారాలను పంచకోశములుగా అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు ప్రతీకలుగా చెబుతారు.

అరుణాచలేశ్వరాలయం తొమ్మిది గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు పెద్ద గోపురాలు తూర్పు: రాజగోపురం(ఎత్తు 217అడుగులు) పడమర :పేయి గోపురం (ఎత్తు 144అడుగులు) దక్షిణం : తిరుమంజన గోపురం(ఎత్తు 157అడుగులు) ఉత్తరం: అమ్మణియమ్మ గోపురం(ఎత్తు171అడుగులు) – ఇవి కాక ఆలయం లోపల ప్రాకారంలో దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్లో మూడు కట్టాయి (చిన్న) గోపురాలూ, నాలుగవ ప్రాకారానికి తూర్పు- పడమరగా వున్న భళ్ళాలగోపురం, కిళిగోపురంతో కలుపుకొని అరుణాచలేశ్వర ఆలయానికి మొత్తం తొమ్మిది గోపురాలున్నాయి.

శ్రీ రమణాశ్రమము

రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మీల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ స్థానికులకంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చెసే ప్రార్థన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమం (Ramana ashramam) లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూంటాయి. రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి (ఆవు) సమాధి, కాకి సమాధి, శునకం యొక్క సమాధిని కూడా చూడవచ్చు . ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలాయంలో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. 

శేషాద్రి స్వామి ఆశ్రమం
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది.


ArunachaleswararTemple

13.🙏 శ్రీ మదాంధ్ర భాగవతము 🙏

పరీక్షిత్తు జననము 

ఇది జరిగిన పిమ్మట కృష్ణపరమాత్మ  బలవత్తరమయిన కాల స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కలిగించారు.  'ఇంక నేను ద్వారకా నగరమునకు బయలుదేరతాను’ అని కృష్ణపరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు.  కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులు అందరూ కూడ ఆయనను స్తోత్రం చేసి బెంగపెట్టుకొని దీనవదనములతో నిలబడ్డారు. ఆ సమయములో ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరుగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరకు వచ్చి  కృష్ణపరమాత్మ పాదములమీద పడిపోయింది. అప్పటికి ఉత్తర గర్భంతో ఉన్నది. అభిమన్యుడు మరణించాడు.
ఉత్తర కృష్ణుని చూసి – 'కృష్ణా! నాకు ఏమీ తెలియడము  లేదు. కానీ ఏదో దివ్యమయిన తేజస్సు, ఒక ఇనుపబాణం ఏదో వచ్చేస్తోంది. చిత్రం ఏమిటి అంటే అది బయటకు కనపడడము లేదు. నా కడుపులోకి ప్రవేశిస్తున్నది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తున్నది. లోపల ఉన్న పిండము మీద పగబట్టి ఆ బాణం ఆ పిండమును చంపడానికి వెళుతున్నది. నేను తల్లిని ఆ పిండము చచ్చిపోవడము నేను ఇష్టపడడము లేదు. పిండమును తరుముతున్న ఆ బాణం ఏమిటో నాకు తెలియదు. కృష్ణా! నువ్వు రక్షించు’ అని ప్రార్థించింది.
బయటకు వచ్చిన ఉపపాండవులకోసం ద్రౌపది ఏడ్చింది. లోపల వున్న పిండము పోతున్నదని  ఉత్తర ఏడుస్తోంది.
ఉత్తర అలా అనగానే పాండవులు గబగబా ధనుస్సు పట్టుకున్నారు. ఎవరిమీద వేస్తారు? శత్రువు బయట ఎక్కడ ఉన్నాడు?  ఉత్తర గర్భంలో  పిండమును నరకడానికని బాణరూపములో వెళుతున్నది. ఉత్తర ఏమని ప్రార్థించింది? ‘కృష్ణా! నేను నీ చెల్లెలయిన సుభద్రకి కోడలిని. అభిమన్యుని భార్య ఉత్తరను. నా కడుపులో వున్న పిల్లవాడు నీకు మేనల్లుడి కొడుకు' అన్నది. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు. ఎవరో బాణం వేస్తే అది లోపలికి వెళ్ళిపోతున్నది. తామరపువ్వులవంటి నేత్రములు ఉన్నవాడా! నీవు కన్నువిప్పి చూశావంటే శత్రువు మడిసిపోతాడు. ఈ బాణం అగ్నిహోత్రములా ఉన్నది. ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తున్నది. బయట ఉన్నవాళ్ళకు ఏమి తెలుస్తుంది? కడుపులో వున్న పిండమును రక్షించవా! అని శరణాగతి చేసింది.
గాండీవమును ధరించిన అర్జునుడు ఉన్నాడు, చేతి గద తిప్పితే అగ్నిహోత్రమును పుట్టించే భీమసేనుడు ఉన్నాడు. నకుల సహదేవులు ఉన్నారు. అజాతశత్రువయిన ధర్మరాజు ఉన్నాడు. ఉత్తర వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు. (నీ వాళ్ళు నిన్ను రక్షించరు. నీరక్షణ నీఇంటి ఈశాన్య దిక్కున ఉన్నది.
అక్కడ ఉన్న స్వామిని నమ్ముకోవడం నేర్చుకో. అలాగని నీ బంధువులను నిర్లక్ష్యం చేయకు. వాళ్ళని భగవంతునిగా చూసుకో. లోపల పూనికతో ఈశ్వరుడిని శరణాగతి చేయడం నేర్చుకో. ఆయన నీకు రక్షకుడు.) ఆవిడ పాండవులను ప్రార్థన చేయలేదు. కృష్ణుడిని ప్రార్థన చేసింది.
కడుపులో ఉన్న పిండము ‘అగ్నిహోత్రము వచ్చేసింది. నన్ను ఇది కాల్చేస్తుంది, నన్ను రక్షించేవాడు ఎవరు, నేను గర్భంలో వున్నాను. నేను మొరపెడితే ఎవరికీ వినపడుతుంది’ అని ఏడుస్తున్నది. ఈయన ఆ పిండమునకు ఎదురువచ్చి  ఉత్తర గర్భములోని పిండము కూడా  సంహరింపబడాలని అశ్వత్థామ ఉపయోగించిన బ్రహ్మాస్త్రము లోపలవున్న పిండం దగ్గరకి వస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భములో ఉన్న  పిండము ముందు భాగమునందు అంగుష్ఠమాత్రుడై నిలబడ్డాడు. గదను త్రిప్పుతున్నాడు. చక్రహస్తుడై వైష్ణవ మాయను ప్రకటించాడు. ఉత్తరగర్భంలో ఒక్కసారి తన తేజస్సును చూపించాడు. ఆ తేజస్సు పిండమునకు తప్ప మరెవరికీ కనపడడము  లేదు. ఉత్తరకి గాని, పాండవులకి గాని, లోకమునకు గాని కనబడడము లేదు. స్వామి ఈ లీలను ఉత్తర కడుపులో ప్రదర్శిస్తున్నాడు. తాను  బయట నిలబడి ఉన్నాడు. పాండవుల వంశము  నిలబడడం కోసం  పిండమునకు ఎదురువెళ్ళి నిలబడి బ్రహ్మాస్త్రమునుండి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకొని చాలా ఉల్లాసంగా, సంతోషంగా పిల్లాడి వంక చూస్తే, వాడు ఇంకా సరిగా అమరని రెండు చేతులతో ‘ఎంత అందగాడు – బొటన వ్రేలు అంత ఉన్నాడు – పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రమును త్రాగేసి నన్ను రక్షించాడు’ అని స్తోత్రము చెయ్యడము కూడా  చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానము  అయిపోయాడు. అశ్వత్థామ చేత విడువబడిన బ్రహ్మాస్త్రము నుండి పైకివచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడని సూతుడు చెప్పి  – ‘ ఈమాట చిత్రంగా ఉన్నదా? అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నారా? మీకు నేను మొదటే చెప్పాను. స్వామి ఇరవై రెండు అవతారములలో ఆవిర్భవించాడు. ఇవి అన్ని శాశ్వత స్వరూపుడయిన నారాయణునిలోంచి వచ్చినవే. నారాయణుని నాభికమలములోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టిన తేజస్సుని, ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్పకాదు. ఆవిధంగా తేజస్సును పుచ్చుకున్నాడు. ఈ పనిని పాండవులు చేయలేరు కృష్ణుడు చేశాడు. ఇప్పుడు మనం జరిగిన సంఘటనలను అనుసంధానము చేసుకోవాలి. ద్రోణాచార్యుల వారి కుమారుడయిన ఆశ్వత్థామను రథం మీదనుంచి దింపగానే వానిని చంపి వేయవలసినదని కృష్ణుడు సలహా ఇచ్చాడు. అర్జునుడు వెంటనే అశ్వత్థామని చంపివేసి ఉండి ఉంటే ‘వీనికి నేను పద్దెనిమిది అధ్యాయముల గీత చెప్పినా ధర్మము  అంటే ఏమిటో అర్థం కాలేదు.  నేను ఉత్తర గర్భంలో ఉన్న పిండమును రక్షించనవసరం లేదు’ అని అనుకుని ఉండేవాడు. తను చెప్పినా అర్జునుడు అశ్వత్థామని చంపలేదు. ఈ ధర్మమును కృష్ణుడు తన దృష్టిలో పెట్టుకున్నాడు. ‘ధర్మోరక్షతి రక్షితః’ – ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాడిని తాను రక్షించాలి. ఎవరూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఒక్క ఈశ్వరుడు మాత్రమే చేయగలడు. కృష్ణుడు మాత్రమే చేయగలడు. కృష్ణపరమాత్మని నమ్ముకున్న వాడికి తన కోరికలు తీరవన్న అనుమానం పెట్టుకోనవసరం లేదు. అనుమానం పెట్టుకున్న వానిని మార్చగలిగిన వాడు ప్రపంచంలో లేడు.
ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషముతో ‘నా కడుపులో అగ్నిహోత్రము చల్లారి పోయింది. నా పిండము రక్షింపబడింది. పాండవవంశము రక్షింప బడింది’ అని పొంగిపోయింది.
శ్రీకృష్ణ పరమాత్మ రక్షణ వలన ఉత్తర గర్భమునందు జన్మించిన వాడు పరీక్షిత్తు. ధర్మరాజు గారు ఆ పిల్లవానికి విష్ణురాతుడు అని పేరుపెట్టారు. ఆయనను ఎవ్వరూ విష్ణురాతుడు అని పిలువరు పరీక్షిత్తు అని పిలుస్తారు.



🙏శ్రీమదాంధ్ర భాగవతం🙏

భీష్ముడు రోజూ యుద్ధం చేసేవాడు. అనంతరము శిబిరమునకు వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి ‘నీవు ఎంతో గొప్పవాడివని యుద్ధంలో దిగాను. ఎంతమందిని చంపావు? ఏమి చేశావు? నువ్వు తలుచుకుంటే ఆర్జునుడిని చంపలేవా? నువ్వు కావాలని పాండవులను వెనక వేసుకు వస్తున్నావు. నువ్వు పాండవ పక్షపాతివి. అని సూటీపోటీ మాటలతో ములుకులతో పొడిచినట్లు మాట్లాడేవాడు. పాపం భీష్ముడు, ఆ వయస్సులో అన్నిమాటలు విని ఒకరోజు దుర్యోధనునితో ‘దుర్యోధనా! ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కాని!’ అని మండలాకారమయిన ధనుస్సును పట్టుకున్నాడు.
ఆ రోజు భీష్ముడు వేసిన బాణములు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్నివేల మందిని తెగటార్చాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, ఏనుగులతో నిండిపోయింది. ఆయన యుద్ధమునకు పాండవులు గజగజ వణికి పోయారు. అర్జునుడిని భీష్ముని మీద యుద్ధమునకు పంపించారు. అర్జునుడు యుద్ధమునకు వచ్చాడు. భీష్మునికి సర్వ సైన్యాధిపతిగా అభిషేకం చేశారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారధ్యం చేస్తున్నాడు. ఆయన యుద్ధంలో తన చేతితో ధనుస్సు పట్టనని ఏ విధమయిన అస్త్ర శస్త్రములను పట్టాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయమును దూతలు వచ్చి భీష్మునికి చెప్పారు.  భీష్ముడు ‘సర్వ సైన్యాధిపతిగా నేనూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను’ అన్నాడు.
కృష్ణుడు పరమాత్మని భీష్ముడికి తెలుసు.  కృష్ణునితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు.  ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆరోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనుస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి, ఎందుకూ పనికిరాకుండా పోయాడు. భీష్ముడు కొట్టిన బాణములకు కృష్ణ పరమాత్మ కవచం చిట్లిపోయింది.
కృష్ణుని మోదుగచెట్టును కొట్టినట్లు కొట్టేశాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుని శరీరంలోంచి నెత్తురు  కారిపోతున్నది. కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞను మరచిపోయి భీష్ముడిని చంపి అవతల పారవేస్తానని తన చక్రం పట్టుకుని రథం మీద నుండి క్రిందికి దిగిపోయాడు.  భీష్ముడు తన కోదండమును పక్కనపెట్టి కృష్ణుడికి నమస్కరించాడు.
పదిరోజుల యుద్ధం పూర్తయిన తరువాత ధర్మరాజుగారు కృష్ణుడిని పిలిచి  ‘పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంక మనం యుద్ధం చేయలేము. ఆయన సామాన్యుడు కాదు అరివీర భయంకరుడు. ఆయనను యుద్ధం నుండి ఆపడం ఎలా? అని కృష్ణ పరమాత్మని అడిగాడు.  కృష్ణ పరమాత్మ అన్నారు ‘దీనికి ఒక్కటే పరిష్కారం. నీవు నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరమునకు వెళ్ళి నమస్కారం చేసి ఆయననే అడుగు. నేను మీతో వస్తాను పదండి’ అన్నాడు.
అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు. ధర్మరాజుగారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు ‘ధర్మజా ! ఇంత రాత్రివేళ పాదచారివై ఎందుకు వచ్చావు? మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదయినా కోరుకో’ అని చెప్పాడు. ధర్మరాజు ‘తాతా ! నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాతా?’ అని అడిగాడు.    భీష్ముడు ఒక నవ్వు నవ్వి ‘నా చేతిలో ధనుస్సు ఉన్నంత కాలం నేను మరణించను. మనవడు అర్జునుని ప్రజ్ఞచూసి అతను వేసిన బాణములకు పొంగిపోయాను. నా ధనుస్సును కొన్ని సందర్భములలోనే ప్రక్కన పెడతాను. రథం మీద స్త్రీవచ్చి బాణం వేస్తే, ఎవరిదయినా పతాకం క్రిందికి జారిపోతే, వెన్నిచ్చి పారిపోతున్న వానితో నేను యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చెయ్యను. ఇందులో స్త్రీని పెట్టుకుని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకము క్రిందకు జారిపోదు. మీకు ఉన్న అవకాశం ఒక్కటే. మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు. శిఖండిని అర్జునుని రథమునకు ముందు నిలబెట్టండి.  శిఖండి బాణములు వేస్తే నేను ధనుస్సు పక్కన పెట్టేస్తాను. ధనుస్సు పక్కన పెట్టిన పిదప మరల నేను బాణం వెయ్యను.  వెనకనుండి అర్జునునితో బాణపరంపరను కురిపించి, నా శరీరమును పడగొట్టండి’ అని చెప్పాడు.  పాండవులు ‘అలాగే తాతా’ అని చెప్పి వెళ్ళిపోయారు.
శిబిరములోకి వెళ్ళిన తరువాత అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. ‘మహానుభావుడు! తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో నాన్నా అని మేము ఎవరిని పిలవాలో తెలియక కౌరవులు మమ్మల్ని బాధపెడుతుంటే మాపట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి మేము నాన్నని పిలిస్తే నేను నాన్నను కాను  నేను తాతనని చెప్పి ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు గోరుముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలములయందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. అంతటి ధర్మమూర్తియై తన వంశమును చూసుకోవాలని ఇంతకాలం నిలబడి పోయాడు. సవ్యసాచియై గాండీవం పట్టుకుని, శిఖండిని అడ్డుపెట్టుకుని ఆయన మీద బాణ పరంపర కురిపిస్తుంటే, ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్యా?’ అని అడిగాడు. కృష్ణుడు ‘కొట్టక తప్పదు ధర్మం కోసం కొట్టవలసిందే. నీవు కొట్టు’ అన్నాడు.
యుద్ధమునకు  శిఖండిని ఎదురుపెట్టి తీసుకువచ్చారు. భీష్ముడు తన ధనుస్సును పక్కన పెట్టేశాడు.  శిఖండి భీష్ముని మీదకు ఒకేసారి నూరుబాణములు వేశాడు. భీష్ముని కవచం పిట్లి పోయింది. అర్జునుడు ఆ రోజు వేసిన బాణ పరంపరకు అంతేలేదు. భీష్ముని శరీరములో బొటనవేలంత సందు కూడా లేకుండా ఆయనను బాణములతో కొట్టాడు. చుట్టూ బాణ పంజరమే! మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వైపులనుంచి నెత్తురు కారిపోతోంది. వీపు చూపించలేదు. ఒక్క తలవెనక మాత్రం బాణములు తగలలేదు. ఒంటినిండా బాణపరంపరను వేసిన తరువాత సూర్యుడు అస్తమిస్తున్న సమయములో భీష్ముడు రథం మీదనుంచి పడిపోయినపుడు ఆయన శరీరము భూమికి తగలలేదు. బాణములతో పడిపోయి ఉండిపోయాడు.  యుద్ధం ఆపి అందరు పరుగు పరుగున భీష్ముని దగ్గరకు వచ్చారు.  భీష్ముడు ‘నాపని అయిపోయింది. నేను స్వచ్ఛంద మరణమును కోరాను. ఇంకా బ్రతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరమును విడిచిపెట్టను. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తరువాత రథసప్తమినాడు రథం ఉత్తరదిక్కుకు తిరిగాక, ఏకాదశి ఘడియలలో నా ప్రాణం విడిచి పెడతాను’ అని అర్జునుని పిలిచి, ‘నా తల వెనక్కి వ్రేలాడి పోతున్నది. నా మర్మ స్థానములు అన్నీ కదిలిపోతున్నాయి. బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతున్నది. నాకు తలగడ అమర్చు’ అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకు వచ్చారు. ‘ఈ తలగడలు కాదు. నాకు కావలసింది యుద్ధ భూమియందు పడుకున్న వానికి బాణములతో తలగడను ఏర్పాటు చేయాలి. అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు’ అని  భీష్ముడు అంటే అర్జునుడు బాణములతో తలగడను ఏర్పాటు చేశాడు. ఆ తలగడను ఏర్పాటు చేసుకుని ‘నేను ఈ యుద్ధభూమి యందే పడి ఉంటాను. ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకం తవ్వండి’ అని కందకం తవ్వించుకుని ఆ భూమిమీద పడి ఉండిపోయాడు.


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
Image may contain: 4 people
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
Image may contain: one or more people



నేటి హాస్యం 
శ్రీవారూ! I love u So much! 

ఏమైనా కావాలా శ్రీమతిగారూ? 

ఏమీ అఖ్ఖర్లేదు శ్రీవారూ! 
రేపు మా చెల్లి వస్తుంది, శ్రీ రామ చంద్రుడు లా వుండండి చాలు!!!
--((**))--
సుషీ! నీ మీదొట్టు! 
తాగడం మానేసి షాలా సంచ్రాలయిందే! 
నీ హ్రుదయంలో కాస్త చోటు ఇవ్వవే! 

పానకాలు గారూ! మీ ఇల్లు పక్క వీదిలోనుంది! వేగంగా దయచేయండి, 
ఈలోగా మా ఆయన గాని వచ్చారో, 
మీ స్థానం హ్రుదయాల్లో కాదు, 
స్మశానవాటికలో వుంటాది!

--((**))--

బావా! నా పాలకోవా! 
ఈ జన సంచారము లేని అడవిలో 
మనమిద్దరమూ 
డ్యూయెట్ పాడుకందామా? 

ఏం పాట? 

నీ యిష్టమే! 

నాకిష్టమైన పాటలలో నువ్ దేనికి సూట్ అవవే! 
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది 
పాడదామంటే నువ్ డ్రస్ వేసుకున్నట్లు తదేకంగా చూస్తే గాని తెలీదు 

నా హ్రుదయంలో నిదురించే చెలీ అని పాడదామంటే నీకు నా ఆస్తుల మీద పడుక్కోవడము మాత్రమే ఇష్టం 

నీ జెడ వలపు పాశమవి బెదరితిలే అని పాడదామంటే నీ వున్న జుత్తునే తగ్గించేశావు 

లేదనిపించే నీ నడుము పాట పాడదామంటే నడకలో పందెం కడితే తాబేలు నీ కన్నా ముందుంటుంది 

తీగెలాంటి నడుము దాన అని పాడదామంటే నీ నడుము దట్టమైన వటవ్రుక్షంలా వుంటుంది 

ఇది అయే పని కాదు గాని నీకు రెండు గంటల సేపు తినగలిగే తిసు భండారాలు తెస్తాను. 
అవి హాయిగా తినేస్తే ఇంటికి పోదాం 

బావోయ్ 
తంధూరీ చికెన్ తేవడం మర్చిపోకేం!


--((**))--

మీరిప్పుడు కరెంటు కుర్చీలో కూర్చున్నారు.
మరి కొద్ది క్షణాలలో మీరు ప్రాణాలు కోల్పోతారు.
మీ ఆఖరి కోరికేమైనా వుంటే చెప్పండి?'

మీరు తీర్చలేరు వదిలేయండి సార్!

నా మాట నమ్మండి...
ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను

అయితే సరే సార్! నేను మిమ్మల్ని నమ్ముతున్నాను
కరెంటు ఇచ్చినప్పుడు చేతికి ఏ విదమైన తొడుగూ లేకుండా మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!

--((**))--

అత్తగారు! స్వీట్ ప్యాకెట్ లో మైసూర్ పాక్ లేదు, ఏమైందత్తయ్యగారు!

ఏమోనే నాకేం తెలుసు? రాత్రి నువ్వో, మీ ఆయనో తినేసి వుంటారులే, అయినా సంసారంలో అన్ని లెఖ్ఖలేంటే కోడలా!

అత్తయ్యగారు! మీ కడుపులో చక్కెర ఫేక్టరీ వుంది, నిన్న రక్త పరీక్ష లో 450 వుంది!
మీ అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ హెచ్చరిస్తున్నారు, మీ అబ్బాయి అయితే మరో అడుగు ముందుకేసి "నీ అశ్రద్ధ తో మా అమ్మని చంపేసేలాగున్నావు" అంటారు, మీరు చూస్తే ఇలా, చావేదో నాకొచ్చినా బాగుణ్ణు!

కోడలు పిల్లా! ముందు కంటతడి ఆపి ఇలారా తల్లీ!

చెప్పండత్తయ్యగారూ!

నాకు చిన్నప్పటినుంచి మిఠాయిలంటే ప్రాణం!
మంచి వయసులో వుండి, మిఠాయిలు అందుబాటులోనున్నా తినలేకపోయాను,
కారణం
మా అమ్మ "ఒసే! నువ్విలాగ మితం లేకుండా మిఠాయిలు తింటే బాగా వొళ్ళొచ్చేసి నీకు పెళ్ళి అవకుండా పోతుందే "
శోభనముగదిలో అన్నీ వున్నా ఆయనేమనుకుంటారోనని తినలేకపోయాను,
అత్తారింటిలో వుమ్మడి కుటుంబం మూలాన
"భగవంతుడా! ఈ పనులెప్పుడు పూర్తౌతాయి, మగవాళ్ళ భోజనాలెప్పుడవుతాయి, నా కడుపులోకి పిడికెడు మెతుకులెప్పుడెళతాయి" అనిపించేది!
క్రమేపీ నా సంసారమన్నది ఏర్పడ్డాక అంతులేని భాద్యతలతో తిండి మీద ధ్యాస పోయింది!
అమ్మయ్య! కొడుకు బుద్ధిమంతుడు, కోడలు బంగారం ఇక నాకు కావలసిన మిఠాయిలు తినేయొచ్చనుకునేసరికి తోబుట్టువుల్లాగ ఈ చక్కెర, రక్తపోటూ వచ్చి పడ్డాయి, నన్నర్దము చేసుకో తల్లీ!

నిజమే అత్తగారు! ఈ విషయం లో భగవంతుడు మీకు అన్యాయం చేసాడు, ఇకమీదనుండి మీ ఇంట్లో మీరు దొంగతనం చేయాల్సిన పని లేదు, నేనే స్వయంగా నేతి మిఠాయిలు కొని తెచ్చి మీకిచ్చేస్తా, మీ కెన్ని కావాలంటే అన్ని తినొచ్చు!
అయితే మీరు నన్ననుగ్రహించి నా ప్రశ్నకు జవాబు చెప్పాలి!

ఏమిటమ్మ అది?

మీకు కడుపుతీపి అంటే ఎక్కువిష్టమా?
నోటితీపి అంటే ఎక్కువ ఇష్టమా?

కోడలా! నీ అంతరంగం నాకు అద్దంలా కనిపిస్తోంది, నా కొడుకు మీద ఒట్టేసి చెపుతున్నాను "ఇక నేను మిఠాయిలు ముట్టను " ఇదిగో నీ మైసూర్ పాక్!

--((**))--

అర్థా గృహే నివర్తన్తి స్మ శానే మిత్ర బాంధవా
సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మను గచ్చతి
అర్థము:--మనము చనిపోయినప్పుడు ధనము యింటి వద్దనే వుంటుంది, బంధుమిత్రులు స్మశానము వరకే వస్తారు. మనము చేసిన పాప పుణ్యాలే మన వెంట వస్తాయి.

యౌవ్వనం ధన సంపత్తి ప్రభుత్వ మవివేకతా
ఏకైక మప్యనర్థాయ కిము యత్ర చతుష్టయః
అర్థము:-- యౌవ్వన ప్రాయము,ధనసంపత్తి,అధికారప్రాప్తి,వివేకము లేకపోవుట వీటిలో ఒకటి వుంటేనే ఎన్నో అనర్థములు కలుగును కదా! ఏ నాలుగూ ఒకే చోట వున్నచో యేమి జరుగునో చెప్పవలిసిన పనిలేదు.

అల్ప బుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తా దోలగగొట్టు
చెప్పు తినేడి కుక్క చెరుకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ

--((**))--

"డాక్టరు గారూ....గుండె ఆపరేషన్ ని........
"బై పాస్" అని ఎందుకంటారు??" అడిగాడు "సందేహం"
"హహహ...చాలా మంచి ప్రశ్న వేసావు నాయనా....
ఆపరేషన్ విజయవంతం ఐతే...నువ్వు "పాస్" ఐనట్టు ...
లేక పొతే "బై"...అంటె గుడ్ బై అన్నట్టు!! అన్నాడు డాక్టర్ గారు!!

--((**))--

"ఇదిగో అరుంధతి ....నా అనుమానం నిజమయ్యిన్దేవ్ " అంది "చంద్ర కళ"
"ఏం ? ఏమయ్యింది?" అడిగింది "అరుంధతి"
"మా ఆయన ...వాళ్ల ఆఫీసు లో అమ్మాయి కలిసి ........
నిన్న సినెమా కి వెళుతుంటే చూసాను!!" అంది "చంద్ర కళ"
"వాస్నీ..మరి నువ్వు కూడా వాళ్ల వెనకే వెళ్ల లేక పోయావా?" అంది "అరుంధతి"
"అనుకున్నానే...కానీ....
అది...
నేను చూసేసిన సినిమానే !!" అంది "చంద్ర కళ"
__((**))--


బంగారు బాల్యం
......................... 
ఎర్రోజు వెంకటేశ్వర్లు 

కోతుల్లా కొండెంగల్లా దుంకుతూ
మోకాళ్లకు మోచేతులకు దెబ్బలు తాకినా
దులుపుకొని, ఉమ్మి మందు పెట్టుకొని 
ఆడే కోతి కొమ్మ‌చ్చి ఆటలు ఫ్లాష్ బ్యాక్ లా గుర్తొస్తున్నాయి 
కష్టాల ముళ్లు గుచ్చుకుంటున్నా
లెక్క చేయక ఆడిన సిర్రా గోనె.. గోటీల... ఆటల
తీపిగుర్తుల చెలిమె ఊరుతూనే వుంది 
మా కట్కూరు వాగులో
అనేక లోహాల పిసర్ల లాంటి ఇసుక రేణువుల్లో
అందంగా పిట్టగూళ్లు...చేసిన సైకత శిల్పులం.. 
శంఖులు.. కౌశికలు... రంగురంగుల రాళ్లను 
ఏరుకొని దాచుకున్న పురాతత్వ వేత్తలం.... 
గల గలా పారే స్ఫటికంలాంటి నీళ్లలో 
చేపల్తో పోటీపడి ఈదిన గజ ఈతగాళ్లం
అమాయకత్వం అణువణువు నిండి
టైమ్ మిషన్ లో ముందుకెళ్లినట్లు భావించి
బొమ్మలకు పెళ్లిళ్లు చేసి
పెద్ద మనుషుల మైనట్టు భావించిన బాల్యం 
నన్ను నీడలా వెంటాడుతోంది 
అమ్మా నాన్న కోప్పడ్డా
బుడుబుంగల్లా తప్పించుకొని
వానలో తడుస్తూ మట్టితో ఆనకట్టలు కడుతూ
కాలాన్ని కాయిదప్పడవలో తింపిన మధుర జ్ఞాపకాలు... 
బడికి వెళ్లననీ మంకు చేస్తే 
ఐదు పైసలిచ్చీ తన భుజాల కుర్చీ మీద
బడి గుడిలోకి తీసుకపోయిన నాన్న.. 
నా బాల్యపు మొక్కకు 
తన బతుకు ఎరువును వేసి 
కలుపు మొక్కల్ని తీసి పెంచిన అమ్మ గుర్తులు
పచ్చబొట్టులా...
బడికి తప్పిస్తే రకరకాలుగా శిక్షించి 
జీవన విద్యా సమరంలో
జయాపజయాల పాఠాల్ని ఉగ్గుపాలతో నేర్పి
జ్ఞాన జ్యోతిని వెలిగించిన గురువుల అభయ హస్తాలు...వెన్నంటే వున్నాయి 
కానీ నేటి బాల్యం యాంత్రికమైంది
సెల్ ఫోన్.. టీ వీ రిమోట్ రక్కసి బాహువుల్లో బందీ అయిపోతుంది మరి..
--((**))--

కోరఁదగన .. 
============ 

--- 


రాజు – కవి – కావ్యం 

సాహితీమిత్రులారా! 
ఉ. ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందు తృణాగ్రలగ్న నీ 
రాకృతి వార్ధి యింకుట దశాస్యుని జంపుట మిథ్యగాదె వా 
ల్మీకులు సెప్పకున్న కృతిలేని నరేశ్వరు వర్తనంబు ర 
త్నాకరవేష్టితావని వినంబడ దాతడు మేరువెత్తినన్ 

నేనీ పద్యాన్ని మొదటిసారి ఒక చాటువుల పుస్తకంలో చదివాను. చదివిన వెంటనే ఒక గొప్ప విస్మయం. ఇలాంటి పద్యం మునుపెన్నడూ చదివింది లేదు! కవినీ కావ్యాన్నీ ఒక కొత్త కాంతిలో చూసినట్టుగా తోచింది. కవి గొప్పదనాన్ని గురించి, అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః మొదలైన ఉల్లేఖనాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలోని అంశం వేరు, ఈ పద్యంలోని విషయం వేరూను. 

దీని అర్థం సులువే. ఈ పద్యంలో విశేషమైన ఉదాహరణతో ఒక సామాన్య విషయం ప్రతిపాదింపబడింది. ఇలా చేయడాన్ని ఆలంకారిక భాషలో అర్థాంతరన్యాసం అంటారు. ఇక్కడ ప్రతిపాదింపబడిన విషయం – కృతిలేని నరేశ్వరు వర్తనంబు ఆతడు మేరువెత్తినా రత్నాకరవేష్టితావని వినంబడదు – అంటే తన గురించి చెప్పే ఒక కావ్యం అంటూ లేకపోతే, రాజు చేసే ఏ కార్యమైనా, మేరుపర్వతం ఎత్తడమంతటి ఘనకార్యమే అయినా, అది సముద్రవలయితమైన ఈ భూమిపై వినపడదు, అని. దీనికి సమర్థనగా చూపించిన ఉదాహరణ రామాయణం. మహాసముద్రం సైతం భయంతో ఒక గడ్డిపోచ చివరన నీటిబిందువులా రాముని బాణపు చివరన ఇంకిపోయిన విషయము, పదితలల రావణుని రాముడు వధించిన విషయము, వాల్మీకి తన రామాయణ కావ్యంలో వర్ణించి చెప్పకపోయి ఉంటే మనకి తెలియకుండా మరుగున పడిపోయేవి కదా! ఇక్కడ మిథ్య అంటే అసత్యం అని కాదు, అసలవి తెలియకుండా పోయేవని. 

కావ్యానికున్న ఒక అసామాన్య శక్తి ఇక్కడ సూచింపబడింది. ఒక కాలానికి చెందిన వ్యక్తిని, లేదా సంఘటనని, లేదా సామాజిక దృశ్యాన్నీ కాలాతీతం చేసే మార్మిక శక్తి అది! వ్యక్తిగా గతించినా ఒక పాత్రగా ఆ వ్యక్తిని అజరామరం చేసే మహత్తు కవి వాక్కులో ఉంది. అందుకే చరిత్ర చేయలేని పని కావ్యం చేస్తుంది. ఇదంతా ఈ పద్యం సూచిస్తోందా అంటే, జాగ్రత్తగా పరిశీలిస్తే అవుననే నాకు అనిపించింది. భూమికి రత్నాకరవేష్టితావని అన్న పదం ఎందుకు? అది భూమి వైశాల్యాన్ని చెపుతోంది. అంతటి విశాలమైన భూప్రపంచమంతటా ఒక వ్యక్తి చేసిన కార్యం విస్తరించాలంటే, అది ఎలా సాధ్యం? దాని వెంటనే ఉన్న క్రియాపదం దానికి సమాధానం. అది ‘వినపడాలి’. వినిపించాలి అంటే, నలుగురూ దాని గురించి మాట్లాడుకోవాలి. రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకల పైన – అన్నారు జాషువా. ఆ రాజే కవి వాక్కుకి పాత్రుడయితే, అతను కూడా ప్రజల నాలుకలపై జీవిస్తాడు. అలా ఒకరి నుంచి మరొకరికీ, ఒక చోటు నుంచి మరొక చోటుకీ, ఒక తరం నుంచి మరో తరానికీ ఆతని కథ ‘వినిపిస్తూ’ ఉంటుంది. చరిత్ర ‘వ్రాయబడుతుంది’, కావ్యం ‘చెప్పబడుతుంది’. వ్రాతకి లేని వేగం మాటకి ఉంది. అందుకే వాల్మీకులు సెప్పకున్న అన్న ప్రయోగం. ఇక్కడ వాల్మీకులు అన్న మాట కూడా చాలా సొగసైన మాట. ఆ బహువచనం వాల్మీకిపై గౌరవాన్ని సూచిస్తునే, వాల్మీకి వంటి కవులు అనే అర్థాన్ని కూడా ధ్వనిస్తోంది. పైగా కవి వాక్కు ఎలా ఉంటుందో మొదటి రెండు పాదాలూ సూచిస్తున్నాయి. రాముడు సముద్రంపై వారధి కట్టి లంకకు వెళ్లెను, అని చెపితే అది వట్టి చరిత్ర అవుతుంది. అంతటి మహాసముద్రంపై రాముడు వారధి కట్టాడంటే, సముద్రం అతనికి వశమయినట్టే కదా. అది అతని బాణశక్తికి భయపడినట్టు వర్ణించడమే కాకుండా, తృణాగ్రలగ్న నిరాకృతి అనే పోలిక ద్వారా ఆ శక్తి, కథ వినే వారి మనసుల్లో శాశ్వతంగా ముద్రవేసేట్టుగా చేశాడు కవి. అదే కవిత్వంలో ఉన్న పటుత్వ మహత్వ సంపద! అలాగే, దశాస్యుని చంపుట అన్న మాట కూడాను. ఎవరో ఒక శత్రురాజునో, లేదా తన భార్యను అపహరించిన ఒక దుర్మార్గుడినో హతం చేశాడని చెపితే అందులో పస ఏముంటుంది? పదితలకాయలవాడు అంటే ఆతను ఎంత శక్తివంతుడో తెలుస్తుంది. అంతటి శక్తివంతుడిని ఎదుర్కొన్నాడంటే రామునికి మరెంత శక్తి ఉన్నదో వినేవాడు ఊహించుకోగలడు. 

గగనం గగనాకారం సాగరం సాగరోపమం 
రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ 

అన్న కవి వాక్కు రామరావణ సంగ్రామ తీవ్రతని యుగాలు దాటినా చెక్కు చెదరకుండా మనకి అందిస్తోంది! 

ఇంతకీ, యింత గొప్పగా కవి వాక్కులోని మాహాత్మ్యాన్ని వర్ణిస్తున్న యీ పద్యాన్ని వ్రాసిన కవి ఎవరో మనకి తెలియదు. మొదటే చెప్పినట్టు, ఇది ఒక చాటువు. దీని మూలాన్ని వెతుకుతూ వెళితే, ఈ పద్యంలో మరొక కోణం కనిపించింది. ఆ వెతుకులాట కూడా ఆసక్తికరమైన ఒక ప్రయాణం! ఈ పద్యం చివరిసారిగా ప్రస్తావించబడిన గ్రంథం, కూచిమంచి తిమ్మకవి రచించిన సకలలక్షణసారసంగ్రహం. తిమ్మకవి కాలం పద్దెనిమిదవ శతాబ్దం. ఈ గ్రంథం తెలుగు భాష వ్యాకరణానికీ, ఛందస్సుకీ లక్షణాలని వివరిస్తూ, వాటికి అనువైన లక్ష్యాలను కూడా ఉదాహరించే గ్రంథం. స్వంత రచనగా కాకుండా, ఆ ఉదాహరణలను పూర్వకవుల పద్యాల నుండి చూపించాడు తిమ్మకవి. అలా చూపించిన ఉదాహరణల్లో, అఖండ యతికి ఉదాహరణగా యిచ్చిన పద్యం ఇది. ఈ పద్యం చివరిపాదంలో మొదటి అక్షరం త్నా. అయితే, రత్నాకర అన్న పదంలో రత్న+ఆకర అని సంధి జరిగింది. అలా పదంలో స్వరసంధి జరిగిన అక్షరం పాదాదిని ఉంటే సాధారణంగా సంధి జరగకముందున్న అచ్చుతో మాత్రమే యతి చెల్లుతుంది (అంటే, ఇక్కడ ఆ-కారం). కానీ యిక్కడ యతిస్థానంలో వినంబడు అన్న పదంలో నకారం ఉంది. కాబట్టి రత్నాకర పదాన్ని అఖండంగా తీసుకొని, త్నా అన్న అక్షరంలో ఉన్న నకారంతో యతి చెల్లించబడింది. ఇలాంటి యతినే అఖండ యతి అంటారు. ఉదాహరణ పద్యాలు ఇవ్వడంతో పాటుగా తిమ్మకవి చేసిన మరో మంచి పని, ఆ పద్యాలు ఏ కావ్యం లోనివో కూడా చెప్పడం. ఈ పద్యం భైరవుని శ్రీరంగమాహాత్మ్యం లోనిదని తిమ్మకవి పేర్కొన్నాడు. ఆ కావ్యాన్ని వెతికి పట్టుకొని చూస్తే తెలిసి వచ్చినది ఏమిటంటే, ఈ పద్యం అందులో లేదు! అయితే యిలాంటి అర్థమే వచ్చే మరొక పద్యం కనిపించింది. కావ్యవైశిష్ట్యాన్ని గురించి వర్ణించే పద్యం, కావ్య అవతారికలో ఉంది. 

పుట్టకు, బుట్టికోమలికి, బుట్టిన ప్రాగవు లాదరించి చే 
బట్టిన గాదె రాఘవనృపాలక ధర్మజ కీర్తి చంద్రికల్ 
నెట్టన సర్వలోకములు నిండిన విప్పుడు నిందు నందులన్ 
ముట్ట నఖర్వసర్వసుఖమూలము కావ్యమ వో తలంచినన్ 

కవిత్వపరంగా చూస్తే, మనం పైన చెప్పుకొన్న పద్యానికి యీ పద్యం సరితూగదు. అయితే యిందులో రామాయణంతో పాటుగా మహాభారతం కూడా ప్రస్తావించబడింది. పుట్టికోమలి అంటే పడవ నడిపే పడుచు, సత్యవతి. పుట్టకు పుట్టినవాడు వాల్మీకి అయితే పుట్టికోమలికి పుట్టినవాడు వ్యాసుడు. రామునికీ ధర్మరాజుకీ లోకంలో కీర్తి రావడానికి కారణం ఆ కవులే అంటున్నాడు భైరవకవి! అయితే యిక్కడొక తేడా మనం గమనించాలి. రాముని విషయం లోనూ ధర్మరాజు విషయం లోనూ ఆయా కావ్యాలు వారి గురించిన కథలు. కానీ భైరవకవి రచించిన కావ్యం కృతిభర్త చరిత్ర కాదు, శ్రీరంగనాథుని మహత్వం. రాజులు కృతిభర్తలుగా కావ్యాలని అంకితం తీసుకోవడం మనకి సర్వత్రా కనిపించే విషయమే. కృతి సప్తసంతానాలలో ఒకటిగా పేరు కూడా పొందింది. కావ్యాన్ని అంకితం తీసుకోవడం ద్వారా లభించే కీర్తి వేరు, స్వయంగా కావ్యనాయకునిగా రూపొందితే వచ్చే కీర్తి వేరూను. భైరవకవి కాలం సరిగ్గా తెలియదు కానీ ఈ పుస్తకాన్ని పరిష్కరించి ప్రచురించిన మానవల్లి రామకృష్ణకవిగారు, ఇతను పదహారవ శతాబ్దం లేదా దానికి కొంచెం ముందు ఉండవచ్చునని కొన్ని ఆధారాలతో పేర్కొన్నారు. 

సరే, ఇంతకీ అసలు మన పద్యం ఈ కావ్యంలో లేదు. ఈ కావ్యపీఠికలో ఆ పద్యాన్ని గురించి ప్రస్తావిస్తూ మానవల్లివారు, లక్షణకారులు ఉదాహరించిన ఆకుల వృత్తి పద్యం, భైరవుని కావ్యంలో లేదని, భోజరాజవిభూషణం అనే నీతిగ్రంథంలో ఉన్నదనీ అన్నారు. అయితే, ఈ భోజరాజవిభూషణం అనే కావ్యం అలభ్యం! ఇక అన్వేషణ ఇక్కడితో ముగిసినట్టేనా అని అనుకొంటూ, భోజరాజవిభూషణం అన్న గ్రంథం గురించిన ప్రస్తావన ఇంకెక్కడయినా ఉన్నదేమో అని వెతికాను. ఆ వెతుకులాటలో మడికి సింగన సకలనీతిసమ్మతము కంటబడింది. ఇదికూడా మానవల్లివారు సంపాదించి ప్రకటించిన గ్రంథమే! ఇదొక సంకలన గ్రంథం. పూర్వ గ్రంథాలనుండి ఏర్చి కూర్చిన నీతి పద్యాల సంకలనం. ఇందులో సింగన ప్రస్తావించిన గ్రంథాల పట్టికలో భోజరాజవిభూషణం ఉంది. కానీ, అందులో పద్యాలేవీ ఈ సంకలనంలో లేవు! కాకపోతే వెతుకుతున్న పద్యం మాత్రం ఇందులో కనిపించింది. అది నీతిభూషణము అనే గ్రంథంలోని పద్యమని సింగన పేర్కొన్నాడు. బహుశా నీతిభూషణము బదులు రామకృష్ణకవిగారు భోజరాజవిభూషణం అని పొరపాటుగా చెప్పి ఉంటారు. అయితే, ఈ నీతిభూషణము కూడా అలభ్యమే! అదికూడా సకలనీతిసమ్మతము లాగానే సంకలన గ్రంథమే అయ్యుంటుంది. కాబట్టి ఈ పద్యం మూలమేమిటో తెలియదు. బహుశా చాటువే అయ్యుండవచ్చు. మడికి సింగన పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు. అంచేత ఆ కాలానికే యీ పద్యం ప్రచారంలో ఉన్నదన్న మాట. 

ప్రయాణం ఇక్కడికి వచ్చి ఆగింది. అయినా నాకు తృప్తి కలగలేదు. ఈ పద్యం చెపుతున్నది రాజచరిత్రని కావ్యంగా మలిచే విషయం. మనకి కావ్య రచనలో రెండు ప్రధాన ధోరణులు కనిపిస్తాయి. ఒకటి -ఆద్య సత్కథలను, అంటే పురాణాలలో ఉన్న కథలను (రామాయణ, భారతాలు కూడా పురాణ కథలే) చక్కని కావ్యాలుగా మలచడం. మరొకటి -కేవల కల్పనా కథలు, అంటే పూర్తిగా కవి స్వకపోలకల్పితాలయిన కథలతో కావ్యాలు రచించడం. ఎక్కువ భాగం కనిపించే కావ్యాలు మొదటి ధోరణికి చెందినవే. కళాపూర్ణోదయం వంటి కొన్ని కావ్యాలు రెండవ ధోరణిలో వచ్చినవి. అయితే, యీ పద్యం ప్రస్తావించినది మరొక మార్గం. అది చారిత్రకమైన ఒక రాజు చరిత్రను కావ్యంగా రూపొందించడం. ఇది తెలుగులో పదిహేనవ శతాబ్దం నుంచే కనిపిస్తోంది. అయితే ఆలాంటి కావ్యాలకు అంతగా ప్రసిద్ధి లేదు. మరి పదిహేనవ శతాబ్దానికే యిలాంటి పద్యమొకటి ప్రచారంలోకి ఎలా వచ్చి ఉంటుంది? సంస్కృతంలో రాజు చరిత్రను కావ్యంగా చెప్పే ధోరణి ఏడవ శతాబ్దానికి చెందిన బాణుని హర్షచరిత్ర నుంచీ కనిపిస్తోంది. అంచేత యీ పద్యానికి మూలం సంస్కృతంలో దొరుకుతుందేమో అని వెతికితే, చివరకు బిల్హణకవి రచించిన విక్రమాంకదేవచరిత్ర అనే కావ్యంలో కనిపించింది! బిల్హణుడు పదకొండవ శతాబ్దానికి చెందిన కాశ్మీరదేశ కవి. అతను దేశ సంచారం చేస్తూ చివరకు పశ్చిమ చాళుక్య రాజయిన విక్రమదేవుని కొలువులో విద్యాపతిగా చేరాడు. ఆ రాజు గురించిన కావ్యమే విక్రమాంకదేవచరిత్ర. బిల్హణుడు సంస్కృతకవి అయినప్పటికీ తెలుగువారికి బాగా పరిచయమే. అతని గురించిన కథ బిల్హణీయమనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. విక్రమాంకదేవచరిత్ర అవతారికలో కవి మహత్వాన్ని గురించిన రెండు శ్లోకాలు గమనించ దగ్గవి: 

పృథ్వీపతేః సన్తి న యస్య పార్శ్వే కవీశ్వరాస్తస్య కుతో యశాంసి? 
భూపాః కియన్తో న బభూవురుర్వ్యా జానాతి నామాపి న కోऽపి తేషామ్ 

లఙ్కాపతే సఙ్కుచితం యశో యత్ యత్ కీర్తిపాత్రం రఘురాజపుత్రమ్ 
స సర్వ ఏవాదికవైః ప్రభావో న కోపనీయాః కవయః క్షితీంద్రైః 

ఈ శ్లోకాలకి కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారి అనువాద పద్యాలు: 

తమ కెలనన్ గవీశ్వరవితానము నిల్పగలేని ధారణీ 
రమణుల కీర్తిసంతతులు రాజిలు నెట్టుల? రాజు లెందఱో 
క్షమపయి దీప్తితో వెలసి కాలము దీఱ జనంగ లేదె! సం 
భ్రమముననేని నట్టి నరపాలుర పేరు లెఱుంగ డెవ్వడున్ 

రావణుయశ మఱుటయు సీ 
తావరుడు యశోర్హుడగుట తగ నిది సర్వం 
బా వాల్మీకి ప్రభావమె 
కావున గవులయెడ నలుగ రాదు నృపులకున్ 

ఈ శ్లోకాలలో కూడా రాజు కీర్తిమంతుడు కావాలంటే కవి సహాయం ఉండాలన్న భావము, రాముని యశస్సుకు వాల్మీకే కారణమన్న ఉదాహరణతో సమర్థన, స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అందువల్ల నీతిభూషణంలోని మన పద్యానికి యీ శ్లోకాలు స్ఫూర్తి అయ్యే అవకాశం ఉంది. బిల్హణుడు మరొక అడుగు ముందుకు వేసి, రావణుని కీర్తి హరించిపోవడం కూడా వాల్మీకి ప్రభావము చేతనే అని అన్నాడు. అంతకు ముందున్న రాజులు ఎంతమందో సరయిన కవి లభించక మరుగున పడిపోయారని కూడా అంటున్నాడు. పైగా, అందుకే రాజులు కవులకు కోపం రాకుండా చూసుకోవాలని హెచ్చరిక! బిల్హణుని కాలంలో రాజులు కవులపై ఏ రకంగా ఆధారపడేవారన్న అంశం యీ శ్లోకాలలో ప్రతిఫలిస్తోంది. తమాషా అయిన విషయం ఏమిటంటే యీ విక్రమాంకదేవచరిత్ర కావ్యంలో విక్రమదేవుని సాక్షాత్తూ శ్రీరామచంద్రునితో పోలుస్తాడు బిల్హణుడు. బిల్హణుని ఉద్ధతి కూడా కొంత కనిపిస్తుందీ శ్లోకాలలో. ఆ ఉద్ధతిని పరిహరించి, మరింత సొగసుగా తెలుగు చేసిన చాటుకవి ఎవరో మరి! 

మరొక్క ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పి యీ వ్యాసాన్ని ముగిస్తాను. కవులకూ కవిత్వాభిమానులకూ చాలా ఆసక్తి కలిగించే, ఉపయోగపడే పుస్తకం ది సైటెడ్ సింగర్ (The Sighted Singer). ఆలెన్ గ్రాస్‌మన్ (Allen Grossman), మార్క్ హాలిడే (Mark Halliday) అనే యిద్దరు కవుల మధ్య కవిత్వాన్ని గురించి జరిగిన సుదీర్ఘ సంభాషణ. అందులో గ్రాస్‌మన్ పేర్కొన్న ఒక కవిత నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. 

Many heroes lived before Agamemnon 
but they are all unweepable, overwhelmed 
by the long night of oblivion 
because they lacked a sacred bard. 

ఇది క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన రోమన్ కవి హొరెస్ (Horace) చెప్పిన కవిత. ఆగమెమ్నాన్ (Agamemnon) గ్రీకు పురాణాలలో ప్రముఖుడైన రాజు. ట్రోజన్ యుద్ధంలో (Trojan war) గ్రీకు సైన్యాలని ఒకటి చేసిన వీరుడు. హోమర్ (Homer) రచించిన ఇలియడ్ (Iliad), ఆడెస్సీ (Odyssey) కావ్యాలలో ఇతని గురించి విస్తృత వర్ణన ఉంది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, హోమర్ చెప్పడం వల్లనే ఆతని పేరు ఇంత కాలం నిలిచున్నదని, ఆగమెమ్నాన్ ముందు ఎంతమంది వీరులు కావ్యానికి ఎక్కకపోవడం వలన కాలగర్భంలో కలిసిపోయారో అని అంటున్నాడు హొరెస్. హోమర్‌ని సేక్రెడ్ బార్డ్‌గా పేర్కొన్నాడు హొరెస్. సరిగ్గా మన పద్యంలో ఉన్న వాల్మీకి కూడా అదే కదా! 
---------------------------------------------------------- 
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, ఈమాట సౌజన్యంతో 
------------------------------------------------------ 
- ఏ.వి.రమణరాజు

No comments:

Post a Comment