Thursday 18 June 2020

26-06-2020

* సుందరాకాండ ........ 2 
* పిల్లలజాతకాన్నిమార్చలేమా !? చిన్న కధ
* లక్ష సంపూర్ణం ... కధ 
*  ప్రాణాయామం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస కాదు
*. ఆనందసూక్తము  - 5

* సుందరాకాండ ........ 2       


శ్రీ హనుమత్  ద్వాదశ  నామ స్తోత్రము                
                
హనుమానంజనా సూను : వాయుపుత్రో మహాబల:                
రామేష్ఠ: ఫాల్గుణ: సఖ: పింగాక్షో అమిత విక్రమ:                
ఉదధి క్రమణ శ్పైవ  సితాసోక వినాశక:                
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీ వస్య దర్పహొ !!                
                
ద్వాదశైతాని  నామాని కపీంద్రస్య మహాత్మన :                
స్వాపకాలేపఠేన్నిత్యం  యాత్రాకాలే విశేషత:                
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్                 
 

  శ్రీ  రామదూతాంజనేయ స్తోత్రం               
               
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంస్ట్రాకరాళం               
రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం                
రం రం రం రాజయోగం సకలశుభనిధిమ్ సప్తభేతాల భేద్యం                
రం రం రం రాక్షసామ్తం సకలదిశయశమ్ రామదూతమ్ నమామి॥                
               
ఖం ఖం ఖం   ఖడ్గాహస్తం విషజ్వర హరణం వేద వేదాంగదీపం                
ఖం ఖం ఖం   ఖడ్గ రూపమ్ త్రిభువన నిలయం  దేవతాసుప్రకాశం           
ఖం ఖం ఖం   కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయ స్వరూపమ్               
ఖం ఖం ఖం   కాలచక్రం సకల దిశయశం  రామదూతమ్ నమామి॥               
              
ఇం ఇం ఇం  ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం            
ఇం ఇం ఇం  సిద్ధి యోగం  నతజన సదయం ఆర్యపూజార్చితాంగం         
ఇం ఇం ఇం  సింహనాదం అమ్రుతకరతలం ఆది అంత్య ప్రకాశం               
ఇం ఇం ఇం  చిత్స్వరూపమ్ సకలదిశయశం  రామదూతమ్ నమామి॥                
               
సం  సం  సం  సాక్షిరూపమ్ వికసిత వదనం పింగలాక్షం సురక్షం               
సం  సం  సం  సత్య గీతమ్ సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం              
సం సం సం  సామవేదం  సిపునసులితం నిత్య తత్త్వం స్వరూపమ్             
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతమ్ నమామి                 
               
హం హం హం హంసరూపమ్ సుప్త వికటముఖము సూక్ష్మ సూక్ష్మావతారమ్               
హం హం హం  అమ్తరాత్మం రావిశశినయనం రమ్యగంభీరభీమం              
 హం హం హం  అట్టహాసం  సురవరనిలయం ఊర్ద్వరోమం కరాళం              
హం హం హం  హంసహంసం సకలదిశయశం  రామదూతంనమామి॥                    


అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ...      .........    3

                             


* నక్షత్ర వారీగా వారిగా దేవుళ్ళు:👍💐

అశ్విని                      -   సరస్వతి దేవి
భరణి                       -    దుర్గాదేవి
కృతిక                       -    సుబ్రమణ్య స్వామి
రోహిణి                      -    శ్రీకృష్ణుడు
మృగశిర                    -    గురు రాఘవేంద్ర 
ఆరుద్ర                       -   భైరవుడు, శివుడు 
పునర్వసు                  -   శ్రీరాముడు
 పుష్యమి                   -    దక్షిణామూర్తి( శివుడు) 
ఆశ్లేష                         -    నాగమ్మ,, ఆదిశేషుడు
 మఖ                         -    సూర్యనారాయణ
 పుబ్బ                        -   ఆండాళ్ అమ్మవారు
ఉత్తర                         -   శ్రీ మహాలక్ష్మి
హస్త                           -    శ్రీ గాయత్రీ దేవి
చిత్త                            -    చక్రత్తాళ్వార్
స్వాతి                         -     నరసింహ స్వామి
విశాఖ                         -     సుబ్రహ్మణ్యస్వామి
అనురాధ                    -      లక్ష్మీ నారాయణ స్వామి
జ్యేష్ట                           -      శ్రీ వరాహ పెరుమాళ్, 
మూల                         -      ఆంజనేయ స్వామి
పూర్వాషాడ                 -     జంబుకేశ్వరుడు
ఉత్తరాషాడ                  -     గణపతి
శ్రావణ                          -     శ్రీ విష్ణువు
ధనిష్ఠ                           -     శ్రీ అనంత సైనిడు
శతభిష                         - శీమృత్యుంజయ శివుడు
పూర్వాభాద్ర                  -  శ్రీ ఏకపాద శివుడు
ఉత్తరాభాద్ర                    -  సి మహా ఈశ్వర స్వామి
రేవతి                            -   శ్రీ అరంగనాథ స్వామి.

--(())--

🌹. ప్రాణాయామం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస కాదు. విషయాల వల్ల ప్రభావితం కాకుండా సమత్వంలో నిలిపే శక్తి ప్రక్రియ 🌹
✍️. శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
📚. ప్రసాద్ భరద్వాజ 

ప్రాణాయామము అనగా ప్రాణవాయువును నియంత్రించుట. కుంభక అనగా గాలిని నింపుట, పూర్వక అనగా గాలిని నిలుపుట, రేచకము అనగా గాలిని విడుచుట. 

వీటితో మనకు కావలసిన పరిశుద్ధమైన వాయువును తీసుకొని పనికిరాని వాయువును విడిచిపెట్టి, శ్వాసలోనికి తీసుకున్న వాయువును వీలైనంత సమయం నిలుపుకోవాలి. 

తీసుకున్న గాలిని లోపల నిలిపినపుడు అది అన్ని అవయవాలలోకి ప్రవహించి వాటిలోని సకల రోగాలను తొలగిస్తుంది. మనస్సులో నిలిచి మనో దోషాలను తొలగిస్తుంది. నిలకడగా మనల్ని ఉంచుతుంది.

లోపలికి తీసుకున్న గాలిని అనగా ప్రాణవాయువును బయటకు విడిచిపెడుతుంటే ప్రాణవాయువు అంతరించిపోతుంది కావున వాయువును ఎక్కువ మార్లు బయటికి విడిచిన వారు త్వరగా మరణిస్తారు. 

తీసుకున్న వాయువును ఎక్కువ కాలం నిలుపుకోగలిగితే దీర్ఘాయుష్షువంతులు అవుతారు. మన పూర్వపు రాజులు. 

ఋషులు వేల సంవత్సరాలు జీవించడంలోని రహస్యం ఇదే.
🌹 🌹 🌹 🌹 🌹

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

రేకు: 16-4
సంపుటము: 1-98


చింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు !!
॥పల్లవి॥


ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁ
గడమే కాకిఁకఁ గడ యేది
తడఁబడ హరియే దైవమనుచును మది
విడువక వుండిన వెరవే చాలు!! 
॥ఎంత॥


యెన్నితపము లివి యెట్లఁ జేసినా
అన్నువ కధికము కలవేది
వన్నెలఁ గలఁగక వనజాక్షునిపై
వున్న చిత్తమది వొక్కటే చాలు !! 
॥ఎంత॥


యిందరివాదము లెట్ల గెలిచినా
కందే గాకిఁక గరిమేది
ఇందరినేలిన యీ వేంకటపతి
పొందగు మహిమల పొడవే చాలు !!

🕉🌞🌎🌙🌟🚩


కీర్తనలో అర్ధాలు
--------------------------

ఎడపక = యెడతెగక
గడమేకాకి = కొరతేకాని
గడయేది = అంతమెక్కడుంది
 వెరవేచాలు = ఉపాయము చాలుకదా
అన్నువకు = అల్పత్వానికి
కందేగాకిఁక = ఉద్రేకంతో తపించిపోవటమే కాని


భావామృతం:- 
-------------------------

జీవుడికి యెన్ని పుణ్యాలు తపములు వాదములు చేసినా అంతెక్కడుంది. శ్రీహరిపైన ధ్యాస పట్టుబడితే చాలుకదా. యెడతెగక యెన్ని పుణ్యకర్మలు చేసినా కొఱతేకాని అంతమెక్కడుంది. తడబడినప్పుడు శ్రీహరియే నాదైవమని మనస్సులో విడువక చేబూనిన ఉపాయము చాలుకదా. ఎన్నితపములను యెంత కఠిన నిష్టతో చేసినా అల్పత్వానికి అధిక్యానికి కొలది యెక్కడుంది. వన్నెచిన్నెలకు భ్రమించక వనజాక్షుడైనా శ్రీహరిపై ఆ చిత్తము వున్నచో అదోక్కటేచాలు. అందరిని వాదముతో యెన్ని విధాలుగా జయించినా ఉద్రేకంతో తపించిపోవటమే కాని ఔనత్యం యెక్కడ వున్నది. లక్ష్మీదేవిని యేలుకొనిన శ్రీవేంకటేశ్వరుడు చూపే పొందికైన మహిమల అతిశయమే చాలుకదా తక్కినవన్నీ యెందుకు అంటు అన్నమయ్య కీర్తించాడు.

🕉🌞🌎🌙🌟🚩

[14:00, 20/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (563)
🕉🌞🌎🌙?🚩

"ఎలాంటి వెంపర్లాటలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే..?"

ఆత్మానాత్మ వివేకం కలిగినప్పుడు తాము కోరుకుంటున్నది ఎంత అవాస్తవమో అర్ధం అవుతుంది. అప్పుడు కోరికల వెంట పరుగులు ఆగిపోతాయి. అంటే ఉన్నదేదో తెలిస్తే సగం వెంపర్లాట తగ్గుతుంది. కలను అసత్యంగా భావిస్తున్నాం కనుకనే నాకు ఫలానా మంచి కలవస్తే బాగుంటుంది అని ఎవరూ కోరుకోవటంలేదు. ఇప్పుడు మన ముందున్న ఇల కూడా అలాంటి అసత్యమేనని తెలిస్తే ఇక్కడ కూడా కోరికల ప్రవాహం ఆగుతుంది. కోరికలు ఆగిన జీవితంలో పాతకర్మలకు సంబంధించిన బాధ తప్పదుకానీ క్రొత్తగా వచ్చే దుఃఖం మాత్రం తప్పిపోతుంది. ఇప్పుడు మన ముందున్న కర్మను కలలాగా అనుభవిస్తూ క్రొత్తగా వెంపర్లాటలు లేకపోతే జీవితం హాయిగా సాగిపోతుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
కలకు-ఇలకు ఆధారం ఆత్మ !'- (అధ్యాయం -69)

🕉🌞🌎🌙🌟🚩
[14:00, 20/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం" 
 ( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩

 ప్రశ్న: నేనెందుకు ఆత్మని తెలుసుకోలేక పోతున్నాను ?

జవాబు: నీవెప్పుడూ ఆత్మని తెలిసేవున్నావు. ఆత్మకు తననెందుకు తెలియదు. నీవు ఇతరము అనేటువంటి ఆలోచనలకు అలవాటు పడిపోయినావు. ఆత్మను గురించిన తప్పు అభిప్రాయము పోవాలి. ఎప్పుడూ వుండే ఆత్మ గురించి అజ్ఞానం ఎందుకుంటుంది. మిధ్యానేనుకు వుండే అభిప్రాయాలన్నీ ఆలోచనల్నీ పొయ్యేంతవరకు పోరాటము తప్పదు. అది చేయుము. అదే నిన్ను సాక్షాత్కారమునకు చేరుస్తుంది. ఎవరికి దేని గురించి అజ్ఞానము. దీనినే విచారము చేయుము. అలా శోధిస్తూ వుంటే మిధ్యా నేను అదృశ్యమైపోతుంది. అసలు నేను ఆత్మ మిగులుతుంది. పుట్టినది ఏది, ఆత్మ కాదు. మనము ఆత్మలో స్థిరపడితే అదే అంతిమము. అదే అసలైన పుట్టుక. మిగిలిన పుట్టుకలన్నీ కూడా వాసనలరూపములే. అది శరీరము కాదు కనుక, మనము లోపలవుండే ఆత్మను గురించి మాట్లాడుతున్నాము. మనము ఆత్మయే.

✨⚡️✨⚡️✨⚡️

 ప్రశ్న: నేనాస్థితిలో వుండేందుకు ఏమిచేయాలి ?

జవాబు: ఆ స్థితిలో వుండేందుకు ప్రయత్నం అక్కరలేదు. ఏమి చేయాలంటే, తప్పు అభిప్రాయాలు పోవాలి. ఆలోచన వచ్చిన వెంటనే, ఆ ఆలోచన ఎక్కడనుండి పుట్టిందో గమనించు. ఎన్ని ఆలోచనలు వచ్చినా వాటిని విచారించు. ఇలా చేయగా కాలక్రమంలో ఇవన్నీ నశించిపోతాయి.

🕉🌞🌎🌙🌟🚩
 "ఋభుగీత "(30)
🕉🌞🌎🌙🌟🚩

2వ అధ్యాయము

గ్రహింపును అర్థం చేసుకుంటే పరమాత్మ ఏమిటో అర్థమౌతాడు !!

వేదాంతం "నీవు నీవే "అంటుంది. అంటే నీవు అనుభవాల రీత్యా ఏదిగా మారానని అనుకుంటున్నా నీవు నీవుగానే, బ్రహ్మముగానే ఉన్నావు. "అతడే నీవు" అంటుంది. అంటే శివుడవే నీవు అని చెప్తుంది. ఇది దృష్టిపెడితే అందరికీ తెలిసే విషయమే కాబట్టి "ఎరుగుదువు" అని, మనం గ్రహించ గలిగేది కాబట్టి "వీక్షితుడవనీ" ఋభు మహర్షి బోధించారు. ఈ సృష్టిలో ఏదైనా బ్రహ్మోద్భవమే కనుక అందులో భాగమైన మనమంతా బ్రహ్మోద్భవులమే అవుతాము. గ్రహింపును అర్థం చేసుకుంటే పరమాత్మ ఏమిటో అర్థమౌతాడు. గ్రహింపే ఎరుక. అదే బ్రహ్మము. చనిపోయినవారిలో లేనిది మనకి ఉన్నది ఎరుక. నిద్రలోనూ మనకు ఎరుక ఉంటుంది. అది అచేతనావస్థలో ఉంటుంది !

🕉🌞🌎🌙🌟🚩

పరిశుద్ధ జీవనము (చిన్న కధ ) (4 ) 26-06-2020

పరిశుద్ధ జీవనము అనగా ముందు ఆరోగ్యము సక్రమముగా ఉండాలి మనకు సహకరించే వారి మాటలతో మన మాటలు ఏకమవ్వాలి, మర్మములేని మనస్సు అనగా ఏ విషయమును రహస్యముగా ఉంచకుండా నిర్మొహమాటంగా తెలియ పరిచి సిగ్గు పడకుండా మనసులోని విషయమును ఒకరికొకరు తెలియపరుచు కొనేదే, నిర్మల హృదయము అనగా ఏ విషయములోను గాబరా పడకుండా తేలిక గా తీసుకోని, వేరొకరిని బాధపెట్టకుండా ఉంచగలిగేదే,   జిజ్ఞాసువగు చిత్తము తెలిసిన విషయము అదేపనిగా ఆలోచించడం మంచిది కాదు  పరిష్కారం తెల్సుకొని బతకటమేగా, మాటుపడని అతీంద్రియ గ్రహణము అనగా నిజాయితిగా బ్రతకడం, అహంకారం ప్రవేశించకుండా జాగర్తపడకుండా ఉండటమే.     సహాధ్యాయి యెడల సోదర భావము స్నేహ పర్వము జీవితానికి ముఖ్యము, సలహాలను, నియమములను స్వీకరించుటకును, ఇచ్చుటకును సంసిద్ధత కలిగియుండుట ఆలోచనలు లేని జీవితము వయసు బట్టి, ప్రకృతిని బట్టి, సమయాన్ని సద్వినియోగముచేసుకొనేవాడే నిజమైన జీవిగా బతకగలడు.    

దేశికుని యెడల విశ్వాసనీయమైన ధర్మానుష్టాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట,
తన సిద్ధాంతములను నిర్భీతిగా నుద్ఘాటించుట, అన్యాయమునకు గురిచేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్తవిద్య సూచించు ఆదర్శములగు మానవ పురోభివృద్ధి,
పరిపూర్ణతల యెడ నిరంతరము, జాగరూకత కలిగి యుండుట  అనునవి దివ్యజ్ఞానమను  సాధకునిగా మన పూర్వికులు తెలియపరిచిన సమస్త గ్రంధాలు ప్రతిజీవికి  బ్రతుకు మార్గాలు 
 అని తెలుసుకున్న వానికి జీవితం అంతా స్వర్గ సుఖమవుతుందని నమ్మకంగా చెపుతున్నాను. 

--(())--



🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 73 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆనందసూక్తము  - 5  🌻

పరిణామక్రమము చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు ప్రకృతి కనుగొనినది. అది మళ్ళీ మళ్ళీ సరికొత్త మృదువైన దేహన్ని (జన్మల పేరిట)  ఇస్తున్నది. దాన్ని మనము ఇష్టమైనట్లు వినియోగించుకొంటున్నాము. 

అందువల్ల అది పాడైపోతున్నది. బాహ్య వాతావరణానికి గురియైన మనస్సును అనేక పర్యాయములు వాడితే ఆ సున్నితత్వము పోయిన కెమెరావలె అవుతుంది. 

అందుచేత వృద్ధాప్యము వచ్చేసరికి ఆహారపానీయాదులందు, నిద్ర, విశ్రాంతి, కామముల విషయములో విచ్చలవిడిగా వాడిన నిస్సత్తువగల దేహముతో మిగులుతున్నాము. అయితే ప్రకృతి మరో దేహాన్ని ఇవ్వటానికి ముచ్చటపడుతున్నది. దానికొరకే మృత్యువు. అది యీ దేహాన్ని తొలగిస్తుంది.

 కాలాంతరములో సుకుమారమైన నునులేత శరీరాన్ని ప్రసాదించి 'బాగా తెలివితో వ్యవహరించు. ఆనందాన్ని కనుగొనేవరకు దానిని మరింత మెరుగైన రీతిలో  వినియోగించు' అని వానిని ఆశీర్వదిస్తున్నది ప్రకృతి. 

అలా అయినా మళ్ళీ మళ్ళీ శరీరాన్ని పాడుచేసే ప్రయోగాలు చేస్తూ కొన్ని వేల జన్మలు ఎత్తుతునే ఉన్నాము. అయితే ప్రకృతి ఎప్పుడూ నిరాశ చెందదు- విసిగి వేసారదు. 

రవీంద్రనాధ్ టాగూర్ అంటాడు. "మొగ్గ లోకానికి తన పరిమళాన్ని ప్రదర్శించటం నేర్చుకొన్నప్పుడు, అది ప్రపంచానికి ప్రదర్శించాలి! ఏదో ఒకటి చూపించాలి! అనే అభిరుచిని కోల్పోతుంది. 

ఇక అది విచ్చుకోవడం, వికసించటం ద్వారా అందంగా చూడముచ్చటగా మారేటప్పటికి, అది తనకు చెందినవాటిపై, అనగా తన రేకలపై, తనపై పట్టును‌ కలిగియుండుటలో ఉన్న ఆకర్షణను కోల్పోవును. 

జాగ్రత్తగా గమనిస్తే పట్టువదిలితే గాని, పువ్వు విరియలేదు. రంగులను ప్రదర్శించలేదు. ఆ పువ్వు తన ఆడంబరాన్ని, అందంగా కనిపించే స్వభావాన్ని విడనాడితే గాని తన పరిమళాన్ని బహిర్గతం చేయలేకపోయింది". 

ఈ మహాకవి చెప్పినదాని వెనుక ఒక మహత్తర సందేశమున్నది. ఆనందంగా ఉండాలంటే పిడికిలి బిగించే స్వభావాన్ని త్యాగం చేయాలి! నీ మనస్సులోని పట్టు వదలయ్యేవరకు నీ చేతిని వదులు వేయడానికి వీలులేదు. 


కాగా త్యాగంలోనే ఆనందం! అందువల్లనే ఉపనిషత్ కారులు 'ఆనందోబ్రహ్మేతి విజానాత్' అనుట. బ్రహ్మమే ఆనందం! అంతకంటే పొందదగినది ఇంకేముంటుంది కనక.......

*** యువతా నేడేదీ నీ భవిత? *** ( చిన్న కధ ) ...2 ( 25-06-2020) 

కర్తవ్యము వీడి బాధ్యత మరచి, చెడు వ్యసనాల మాయలో పడి పెడదారిన నడుచు కొందరు  యువతా నేడే భవిత అగమ్యగోచరం గా మారుతున్నది దీనికి బాద్యులు ప్రభుత్వమా ? తల్లితండ్రులా ? 

మితిమీరిన ఆధునిక హద్దులు దాటిన పరదేశపు అలవాట్లకు శృతిమించిన పాశ్చాత్య వేషంబులకు బానిసై చరించు యువతా మార్పుకు ఎవరు బాధ్యులు ?

గుప్పు గుప్పున వదులు రింగు రింగుల పొగల ధూమపానము చిత్తు చిత్తుగా తాగి మత్తుగ గమ్మత్తుగా తూలే మద్య పానము పంటి కింద నలిగి నములు పొగాకు పొడులు నరాలు ఆధీనము తప్పి బానిసై బలహీనుని చేయు మత్తు మందులు చతుర్ముఖ పారాయణము నీలి చిత్రాల వీక్షణము...... వీటి విష వలయాన చిక్కి గమ్యము మరచి లక్ష్యము వీడి తిరుగు యువత చెడిపోవుటకు కారణాలు నిరుద్యుగం తల్లితండ్రులను పోషించలేక తిరుగుతున్నారు.   

జాతి సంపదకు, దేశ భవితకు, నవ సమాజ నిర్మాణానికి, మన సంప్రదాయ సంస్కృతుల ఘనతను లోకానికి తెలుపుటకు, రేపటి తరాల భవిష్యత్తుకు, కన్నవారి కలల ఆశల ప్రతి రూపానికి 
నేటి యువతా ఎంతో బాధ్యత ఉన్నది. కేవలము చదువు కూడు పెట్టదు, నీలో ఒక ప్రత్యేకత ఉండే విధముగా ప్రవర్తించాలి, నేర్చుకోవాలి.  అప్పుడే నీకు గుర్తింపు, మన తల్లి తండ్రులు పెద్ద చదువులు చదవలేదు కానీ ధైర్యముగా సంసారాన్ని పోషిస్తూ నిత్యమూ కష్టపడి ఏదో విధముగా యువతను   చదివిస్తున్నారు. 

వృతి కళలు అభివృద్ధి చెయ్యాలి, ప్రభుత్వం ఓట్లకోసం ఇచ్చేధనము తీసుకోవటం, కులాలకు ఉచిత పారితోషకాలు తీసుకోవటం బిచ్చగాళ్లగా మార్చట యే ఒక అభిప్రాయం. వారి ఆలోచనలు మారవు అందుకే ఎక్కువమంది సోమరిపోతులుగా మారుతున్నారు వారివల్ల అందరికీ కష్టాలు తెచ్చి పెడుతున్నాయి.             
కనుక యువత 
క్షణికావేశపు ఆనందము నిజమని భ్రమసి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోకు బంగరు భవితను చే జేతులా కాలరాసుకోకు.
నేను చెప్పేది ఒక్కటే ఓర్పు ఓదార్పు మనిషిలో ఉంటే జీవితము సాగిపోయే మార్గము దొరుకును. 

ప్రకృతి మనకు అన్నివిధాల సహకారము అందిస్తుంది. 

"ప్రకృతి లయ" అనేది...మనస్సును, ప్రకృతిలో లయింప జేయడం, మనస్సు యొక్క ఉన్నత స్థాయి సామర్థ్యం. తద్వారా , సాధకునికి, మనస్సుకి మధ్య అభేదం ఏర్పడుతుంది. భౌతిక మైన విషయాల కంటే కూడా, ప్రకృతి అనేది గొప్పది. ప్రకృతి మరల వ్యక్తము మరియూ అవ్యక్తంగా ఉంటుంది. ప్రకృతి సత్త్వ రజః తమో గుణాలను కలిగియుంటుంది. ఏ మనిషి  అయితే, ప్రకృతిలో , పరిపూర్ణ లయత్వాన్ని పొందుతాడో....అతనికి , భౌతికంగా ఆలోచనలు ఏర్పడుతాయి దానివల్ల ఉన్నత మైన మేధస్సు ఏర్పడి సహాయ సహకారము అందించే శక్తి యుక్తి ఏర్పడి అందరి మనస్సును చేరి ఉండగల తేజస్సు తెచ్చుకోగలుగుతారు. 
అందుకే పెద్దలు గురువులు చెప్పిన మాటలను నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు. 

--(())--   
  

1 comment:

  1. Fine narration ,and good presentation of matter which is easily understandable to a common man also ,think that every one should read ,and utilise in daily life

    ReplyDelete