Sunday 14 June 2020

21-06-2020



R.D. Roy | Paintings by R.D. Roy | R.D. Roy Painting - SuchitrraArts.com
🌻. ఆనందసూక్తము  - 5  🌻

పరిణామక్రమము చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు ప్రకృతి కనుగొనినది. అది మళ్ళీ మళ్ళీ సరికొత్త మృదువైన దేహన్ని (జన్మల పేరిట)  ఇస్తున్నది. దాన్ని మనము ఇష్టమైనట్లు వినియోగించుకొంటున్నాము. 

అందువల్ల అది పాడైపోతున్నది. బాహ్య వాతావరణానికి గురియైన మనస్సును అనేక పర్యాయములు వాడితే ఆ సున్నితత్వము పోయిన కెమెరావలె అవుతుంది. 

అందుచేత వృద్ధాప్యము వచ్చేసరికి ఆహారపానీయాదులందు, నిద్ర, విశ్రాంతి, కామముల విషయములో విచ్చలవిడిగా వాడిన నిస్సత్తువగల దేహముతో మిగులుతున్నాము. అయితే ప్రకృతి మరో దేహాన్ని ఇవ్వటానికి ముచ్చటపడుతున్నది. దానికొరకే మృత్యువు. అది యీ దేహాన్ని తొలగిస్తుంది.

 కాలాంతరములో సుకుమారమైన నునులేత శరీరాన్ని ప్రసాదించి 'బాగా తెలివితో వ్యవహరించు. ఆనందాన్ని కనుగొనేవరకు దానిని మరింత మెరుగైన రీతిలో  వినియోగించు' అని వానిని ఆశీర్వదిస్తున్నది ప్రకృతి. 

అలా అయినా మళ్ళీ మళ్ళీ శరీరాన్ని పాడుచేసే ప్రయోగాలు చేస్తూ కొన్ని వేల జన్మలు ఎత్తుతునే ఉన్నాము. అయితే ప్రకృతి ఎప్పుడూ నిరాశ చెందదు- విసిగి వేసారదు. 

రవీంద్రనాధ్ టాగూర్ అంటాడు. "మొగ్గ లోకానికి తన పరిమళాన్ని ప్రదర్శించటం నేర్చుకొన్నప్పుడు, అది ప్రపంచానికి ప్రదర్శించాలి! ఏదో ఒకటి చూపించాలి! అనే అభిరుచిని కోల్పోతుంది. 

ఇక అది విచ్చుకోవడం, వికసించటం ద్వారా అందంగా చూడముచ్చటగా మారేటప్పటికి, అది తనకు చెందినవాటిపై, అనగా తన రేకలపై, తనపై పట్టును‌ కలిగియుండుటలో ఉన్న ఆకర్షణను కోల్పోవును. 

జాగ్రత్తగా గమనిస్తే పట్టువదిలితే గాని, పువ్వు విరియలేదు. రంగులను ప్రదర్శించలేదు. ఆ పువ్వు తన ఆడంబరాన్ని, అందంగా కనిపించే స్వభావాన్ని విడనాడితే గాని తన పరిమళాన్ని బహిర్గతం చేయలేకపోయింది". 

ఈ మహాకవి చెప్పినదాని వెనుక ఒక మహత్తర సందేశమున్నది. ఆనందంగా ఉండాలంటే పిడికిలి బిగించే స్వభావాన్ని త్యాగం చేయాలి! నీ మనస్సులోని పట్టు వదలయ్యేవరకు నీ చేతిని వదులు వేయడానికి వీలులేదు. 


కాగా త్యాగంలోనే ఆనందం! అందువల్లనే ఉపనిషత్ కారులు 'ఆనందోబ్రహ్మేతి విజానాత్' అనుట. బ్రహ్మమే ఆనందం! అంతకంటే పొందదగినది ఇంకేముంటుంది కనక.......





🌿బ్రాహ్మణ జన్మ - గొప్పదనం🌿

🌺  బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...
ధర్మరాజు ఇలా అడిగాడు...!
శ్రీ పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు.

🌺 భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను.

🌿 పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు.
దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది.

🌿 గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు.

🌿 విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు.
గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది.

🌿 ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.

🌿 మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు.

🌿 ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు.

🌿 ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు.
ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా !

🌿 ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు.
దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు.
దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు.
దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు.
దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు.

🌿 అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.
ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు.

🌿 తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు.

🌿 మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు.
అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు.

🌿 మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు.
కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.
(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).

🌿 అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన అందరిది.



--(())--

మాతృశ్రీ వందన పుష్పాలు - 
కవితలు - 1

వేయి పడగలు కమ్మి ఉన్న ఈ లోకంలో 
చేయి కలిపియి కొల్చి ఉన్న ఈ ధర్మంలో 
నేయి కలిపియు భిక్ష పెట్టు ఈ కాలం లో 
ఓయి అనియు చేసె తప్పు ఈ మర్మం లో 

నీ పాద పద్మాల ధూళి ధారణ చేసి 
నీ మంచి వాక్యాలు తూచ తప్పక చేసి 
నీ శక్తి సౌర్యాలు నమ్మి కొల్చితి నేను 
నీ నమ్మ కమ్మూను నిల్పి వేడితి నేను 

ధూళిని ఒడలెల్ల అలదుకొని కొలిచెద
పాపిని తలపెల్ల తలచుకొని మలిచెద 
రోగిని  బతుకెల్ల మలచు కొని కొలిచెద 
వాదిని ఋతులెల్ల కొలిచెద నిను జనని
భయము లేకుండా బిడ్డను కని
భయ మనేది లేని వారిగా పెంచేది తల్లి
అంతఃకరణ సిధ్ధితో మదనపడి
ఆత్మ సిధ్ధి ప్రభోధాన్ని తెలియ పరిచేది తల్లి

నవమాసాలు మోసి యోగ సిధ్ధితో బిడ్డను సృష్టంచి
బ్రతుకులో జ్ణాన యోగాన్ని నేర్పేది తల్లి
నిత్యము చెయ్యగల సహాయముతో బిడ్డను పెంచి
ఉన్నదానిలో కొంత దానం చెయ్యాలని తెల్పేది తల్లి

బాహ్యేంద్రియ నిగ్రహముతో తల్లిగా ఉండి 
బిడ్డకు ఇంద్రియ సుఖాలను అందించేది తల్లి
ఇతరుల దోషము లెంచక, దోషము లేని ప్రేమను పంచి
బిడ్డకు దోషము చేసిన ముప్పు వచ్చునని తెల్పేది తల్లి

ఏ పనికైన దయయే ఆయుధంగా ఉపయోగించి
బిడ్డకు త్యాగ గుణం నేర్పేది తల్లి
ప్రపంచ విషయాశక్తి లేకుండి 
ప్రపంచ జ్ణానాన్ని బిడ్డకు పంచేది తల్లి

--(())--

#సూర్యగ్రహణం 

 శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం చూడామణి నామక సూర్యగ్రహణం తేదీ : 21-06-2020  ఉదయం స్పర్శ కాలం 10గం. 24 నిమి.నుండి కాలం 1గం. 53నిమి. ల వరకూ కాలం 12గం. 07నిమి.  గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 29 నిమిషాలు   
.మృగశిర, ఆరుద్ర నక్షత్ర ములవారు చూడరాదు,  మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది . 
మిధున, వృశ్చిక, కర్కాటక రాశి వారికీ  ఫలం. 
మకర సింహ రాశివారికి శుభఫలం. 
మిగిలిన రాశులవారికి మధ్యమ ఫలము. 
ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును. 
గ్రహణ సమయనియమాలు 
గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు  ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 8 గంటల వరకు తినవచ్చు. అది కూడా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును. గ్రహణం సమయంలో  మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. పరమ పవిత్రమైన శక్తివంతమైన స్వర్ణ భైరవ మంత్రం. ఓమ్ నమోభగవతేస్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా
 లేదా సూర్య గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు.
గ్రహణం  రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం గ్రహణం విడుపు తర్వాత అనగా మధ్యాహ్నం 2  గంటలకు ఇల్లు శుభ్రంగా కడుగుకుని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను శుద్ధి చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం గూఢాన్నాన్నినివేదన చేయాలి, ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. గర్భవతులు ఎవరైన గ్రహణం ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జన చేయకూడదు. గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును. మిధున, కర్కాటక,వృచ్చిక మీన రాశుల వారు తప్పక మీ గృహంలో పార్థివ శివ లింగ అభిషేశం శుభ ప్రదమైనది ద్వాదశ రాశుల వారు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని  కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.

ఒక ప్రక్క సూర్య గ్రహణం  మరియు గ్రహఫలములు చూడగా  ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించడం వాటికి తగిన శాంతుల చేయడం కూడా జరిగింది. దాని ప్రభావం వల్ల ఈ సమయంలో కరోనా అనీ రాక్షసి ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈ సమయంలో  క్షేత్ర పాలక కాలభైరవ స్వామి కి, సూర్యభగవానుడు కి తగిన విధంగా ప్రార్థన చేసి ఈ కరోనా నుండి ప్రపంచాన్ని కాపాడమని వేడుకుందాం.

--(())--

ఈ క్రింది పదాలకు
: జవాబులు 'ణి ' తో అంతమవ్వాలి.
******************************
1. సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ.
2. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం
3. తమిళనాట మురుగన్ ఆలయం ఉన్న ఒక ఊరు.
4. శంకరాచార్యులు రచించిన తత్వశాస్త్రం.
5. చిరుగంట
6. శ్రీరామ చంద్రుడు
7.  శ్రీ మహా విష్ణువు
8. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం.
9. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ.
10. నరకం లోని ఏరు
11. పార్వతి
12. సరస్వతి
13. శ్రీ మహాలక్ష్మి
14. యముడు
15. ఒక రాగం
16. ఒక నక్షత్రం
17. భార్య
18. దుర్గా మాత రెండవ అవతారం
19. తలమానికం
20. ధూప ద్రవ్య విశేషం
21. భూతద్దం
22. కోనేరు
23. సారాయి
24. మంచి మాటలు మాట్లాడే స్త్రీ
25. పద్ధతి
26. తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం.
27. పావడ
28. చెల్లుబాటు
29. నిలువు బొట్టు
30. సూర్యుడు
[15/06, 10:42] +91 90009 72611: 1.  చూడామణి
2.  చింతామణి
3. పళణి
4. వివేక చూడామణి
5. రవణి
6. రమణి
7. ఆశుశుక్షణి
8. తరవాణి
9. అలివేణి
10. వైఖరణి
11. ఆర్యాణి
12. వాణి
13. నారాయణి
14. ఆరుణి
15. కీరవాణి
16. రోహిణి
17. సతీమణి
18. బ్రహ్మాణి
19. శిరోమణి
20. సాంబ్రాణి
21. దుర్భిణి
22. పుష్కరిణి
23. వారుణి
24. మధురవాణి
25. కరణి
26. పేరిణి
27. పరికిణి
28. చలామణి
29. తిరుమణి
30. అంబరమణి


గురు బోధ
.......................................
ఆత్మ స్వరూపులు అందరికీ శుభోదయం
ఆత్మ స్వరూపులు ఐన మనము దైవ వారసులం.  కానీ మనం ఆత్మ స్వరూపులగా ఉండలేక పోవడానికి కారణం మనము దేహ దారులుగా ఉన్నాం, దేహమే నేను, నా నామము పలానా, నేను పలానా వారి బిడ్డను, పలానా కుటుంబము వారు మా పూర్వీకులు వంటి నేను పలానా అని చెప్పు కుంటు వస్తున్నాము . కావున మనము దైవ వారసులం అని ,మనము దైవం నుండి వచ్చిన ఆత్మ స్వరుపులం అని మరచి పోయాము.నేను దేహదారిని అనుకుంటున్నాము కావున మనకు కష్టం, నష్టం, అనారోగ్యం, దుఖం, బాధ, బంధం, ఈర్ష్య, ద్వేషం, అసూయ వంటివి అనేక రకాల భావాల బారిన పడి ఉన్నాము. ఎందువల్ల అంటే కేవలం నేను దేహం అను కుంటున్నం కనుక. దేహం జడ పదార్థం ఇదే పంచ భుతాలతో తయారైనది. పంచభూతాలతో తయారైనది కావున, మాయలో చిక్కు కుంటుంది ఈ దేహం. అందుకే మనిషి అనబడే ఈ దేహం కష్టాల పాలు అవుతుంది. .ఎందుకు ఇలా జరిగింది ? అని ప్రశ్నించుకుంటే నేను అను ఆత్మ తాను, ఆత్మను అను భావం మరచి, మనస్సుతో కూడి తాను దేహమే అని తనకు తాను తనను మార్చుకుంది. కావున దేహమే తాను అని అనుకుంటుంది కావున పంచభూతాలతో తయారు కాబడిన ఈ దేహానికి మాయ అనునది అంటుకుని పైన చెప్పుకున్న బాధలన్నీ అనుభవిస్తుంది. కానీ ఈ బాధలన్నీ దేహానికి దేహానికి అంటిన మనస్సుకు వస్తుంది కానీ ,ఆత్మకు కాదు. ఆత్మ నీటిలో నానదు,అగ్నిలో కాలదు, ఇది ఎప్పుడూ శుద్దమే. ఆశుద్దమయ్యేది దేహము, మనస్సు. కావున మనకు కష్టం నష్టం అనారోగ్యం దుఖం బాధ బంధం ఈర్ష్య ద్వేషం అసూయ వంటివి కలగ కుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏమి చేయాలి?  నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఆయన శక్తి ద్వారా మనము జీవిస్తూ ఉన్నాము. మనకు ఏ విధమైన శక్తి లేదు ఉన్నదంతా పరమాత్మ యొక్క శక్తే అని తెలుసుకుని , పరమాత్మను ధ్యానిస్తూ స్తుతిస్తూ, కీర్తిస్తూ , నిరంతరం నేను ఎవ్వరూ? అని ప్రశ్న వేసు కుంటు ఈ దేహంతో కూడి నేను ఉన్నాను కావున నన్ను నేను ఏవిధముగా తెలుసుకోవాలి? నన్ను నేను ఏ విధముగా శుద్ది చేసుకోవాలి? అని నిన్ను నీవు ప్రయత్న పూర్వకంగా తయారు చేసుకోవాలి.
సరైన గురువు వద్దకు వెళ్లి ఆయన పర్యవేక్షణలో నిన్ను నీవు శుద్ది చేసుకోవాలి. గురువు అందరికీ ఒకే విధముగా శుద్ది చేసుకోవడానికి  అనుమతి ఇవ్వక ఒక్కొక్కరికి ఒక్క విధముగా మనస్సుని శుద్ది చేసుకోవడానికి ఉపాసన ఇవ్వడమనేది జరుగుతుంది. ఎలాగంటే కొన్ని పాత్రలు నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. కొన్ని పాత్రలు మట్టితో శుభ్రపరచాలి, కొన్ని పాత్రలు రెండు రోజులు నీటిలో నానబెడితే కానీ శుభ్ర పడవు, నీటిలో నానబెట్టి అప్పుడు పాత్రను తోమడం జరుగుతుంది. అప్పుడు ఆ పాత్ర శుభ్ర పడుతుంది. ఆ విధముగా ఈ ఆత్మ ఎన్నో దేహాలను ధరించి ఇప్పటికి ఈ దేహంతో ఉంది. మరి ఈ మనస్సుని ఏ విధముగా శుభ్ర పరచాలి అను విషయం సత్య గురువుకి మాత్రమే తెలుస్తుంది. వారి పర్యేక్షణలో లో మాత్రమే శుద్ది కాబడాలి.

ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ప్రప్నచంలో చాలా ఆశ్రమాలు,  దేవాలయాలు , దేవాలయాలలో గురువులు , యోగా కేంద్రాలు వంటివి వచ్చి వారి గురువులు అని చెప్పుకునేవారు ఏ విధమైన తర్పిదు ఇచ్చారో నేర్చుకుని అదే సాధన అని అనుకుని అదే సాధనను తమ వద్దకు వస్తున్న వారందరికీ ఉపదేసిస్తు ముందుకు నడిపిస్తున్నారు. ఒకే విధమైన సాధన ప్రక్రియ అందరికీ ఏ విధముగా సరిపోతుంది? ఈ విషయం పైన మనము తెలుసుకున్న పాత్రల శుభ్రపరిచే చిట్కాలు చాలా ఉన్నాయి ఏ పాత్రను ఎలా తోమలి ? తెలుసుకునే తోముతున్నం. అంతే గాని అన్ని పాత్రలను ఒకే విధంగా తోమాడం లేదుకదా!!

అదే విధముగా మనుష్యులు అందరికీ ఒకే విధమైన సాధన సరిపోతుంది అని ఏ విధముగా గా చెప్పగలము?  ఇప్పుడు ఉన్న గురువులు ( అంటే కొంత మంది ) గురువులుగా చెప్పు కుంటున్నవారు అందరూ గురువులు కాదు, వారు కేవలం టీచర్స్ మాత్రమే వారు చదివిన పాఠాన్ని మరలా చెప్పే టీచర్స్ మాత్రమే. వారు గురువులు కాదు. ఎందుకంటే ఒక మనిషి గురువు వద్దకు వెడితే ఈ మనిషి యేన్ని జన్మల నుండి ఎన్ని కర్మలు చేశాడు? ఇతనికి ఏ విధమైన సాధనను ఇస్తే ఇతని కర్మలు సరి అవుతాయి? అను విషయం సత్య గురువుకి మాత్రమే తెలుస్తుంది.

సత్య గురువు కొంత మందికి జపం నేర్పడం, కొంత మందికి ధ్యానం నేర్పడం, కొంత మందికి  ధ్యానం లోనే కొన్ని క్రియలు నేర్పడం మొదలగు ప్రక్రియల ద్వారా , ఆత్మను ఉద్దరుంచు కోవడానికి ఉపాసనలు ఇస్తారు. సత్య గురువుకి తెలుస్తుంది నా వద్దకు వచ్చినది ఈ సాధకునికి అసలు నేను తగిన గురువు నా, కాదా? అను విషయం తెలిసి నేను ఇతనికి విద్య నేర్పాలా? లేదా ఇతనికి విద్య నేర్పే గురువు వేరే ఉన్నారా అను విషయం పూర్తిగా తెలుస్తుంది. వారు చెబుతారు నీ గురువుని నేను కాదు నీ గురువు నీ వేరే ప్రదేశంలో ఉన్నారు నీవు వారి వద్దకు వెళ్లి విద్య నేర్చుకో అని పంపిస్తారు. అటువంటి సాధన చేసిన గురువు మాత్రమే ఈ విధంగా చేయగలరు. ఉదాహరణకు యోగానంద పరమహంస గారు బాల్యంలో ఎంతోమంది గురువుల వద్దకు వెళ్లి వారిని సంప్రదించగా కొంతమంది కొన్ని ప్రక్రియలను నేర్పినవారు ఉన్నారు , కొంతమంది నీకు నేను విద్యను నేర్పడానికి సరికాను , నీవు వేరే గురువును ఆశ్రయించి విద్యను నేర్చుకో అని పంపిస్తారు .అదే సత్య గురువు అంటే...
కానీ ఈ రోజు ఆ విధమైన సత్య గురువు లేరు. ఎవ్వరూ వస్తె వారికి మేము ఇచ్చే సాధన చేయి సరిపోతుంది అని సాధన నేర్పిస్తున్నారు. ఈ సాధన ఈ సాధకునికి సరిపోతుందా? సరిపోదా? ఈ సాధకుని సమయం వృదా చేస్తున్నామా? అను విషయం ఈ గురువుకి తెలియదు. ఎందుకంటే ఈ గురువు ఒక టీచర్ మాత్రమే అందుకే ఎవరు వచ్చినా తాను నేర్చుకున్న విద్య అప్పగిస్తాడు కానీ ఏ విధమైన సాధన ఇస్తే  ఇతని ఆత్మ శుద్ది అవుతుంది అను జ్ఞానం ఈ టీచర్ కి తెలియదు. ఎందుకంటే ఈ టీచర్ గురువు కాదు కాబట్టి.

ఈ రోజులలో అంతా వ్యాపారం. చేస్తున్నారు. ఆధ్యాత్మికత అనేది ఒక వ్యాపారంగా మారినది. సాధకులు అర్థం చేసుకోలేని పరిస్తితి. ఎందుకంటే సాధకునికి ఆ జ్ఞానం లేదు కావున గురువుగా చెప్పబడే గురువుకే తెలియాలి .....

--(())--

Venue : Convention Centre Foyer, India Habitat Centre (IHC), Lodhi Road


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము తెలుగు  అనువాదము  
నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ... 11  నుండి 20 యదార్ధ శ్లోకభావాలు    
ఓం నమో భగవతే వాసుదేవాయ

మహారాజా! భగవంతుడు సత్యసంకల్పుడు. ఆయనయే జగదుత్పత్తికి నిమిత్తకారణమై ప్రకృతి, పురుషులకు ఆశ్రయమైన కాలమును సృష్టించును. కనుక, ఆయన కాలమునకు అధీనుడుకాదు. కాలమే ఆయన యొక్క అధీనములో ఉండును. కాలస్వరూపుడైన ఈశ్వరుడు సత్ప్వగుణమును వృద్ధిచేయునప్పుడు సత్త్వమయుడైన దేవతల బలమును పెంపొందింప జేయును. పరమయశస్వి, దేవతా ప్రియుడైన ఆ పరమాత్మ అప్పుడు దేవవిరోధులు, రజస్తమోగుణములు గల దైత్యులను సంహరించును. వాస్తవముగా అందరును ఆయనకు సమానులే.

రాజా! ఈ విషయమున దేవర్షియైన నారదుడు ప్రీతితో ఒక గాధను తెలిపియుండెను. మీ తాతయైన యుధిష్ఠిరుడు రాజసూయ యాగసమయమున ఈ విషయమును గూర్చి నారదుని ప్రశ్నించెను.

రాజసూయ యాగసమయమున చేది రాజైన శిశు పాలుడు అందరు చూచు చుండగనే శ్రీకృష్ణభగవానునిలో ఐక్యమైన అద్భుతమైన సంఘటనను యుధిష్ఠిరుడు స్వయముగా తిలకించెను. ఆ మహాసభయందు మహామునులు ఆసీనులై యుండిరి. దేవర్షి యగు నారదుడు గూడ అప్ఫుడు అచట ఉండెను. మిగుల ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును గాంచి, పాండు సుతుడగు యుధిష్ఠిరుడు దేవర్షిని ఇట్లు ప్రశ్నించెను.

యుధిష్ఠిరుడు పలికెను-ఔరా! ఈ దృశ్యము మిగుల అద్భుతమైనది. పరమాత్ముడైన శ్రీకృష్ణుని యందు ఐక్యమగుట అనన్య భక్తులకు గూడ దుర్లభము. కావున, శ్రీకృష్ణుని నిరంతరము ద్వేషించునట్టి శిశుపాలునకు ఇట్టి దుర్లభమైన గతి ఎట్లు ప్రాప్తించెను.

మునీశ్వరా! మేము అందరము ఈ రహస్యమును తెలియ గోరుచున్నాము. పూర్వ కాలమున భగవంతుని నిందించుటచే వేనుడను రాజును ఋషీశ్వరులు నరకమున పడద్రోసిరి.

దమఘోషుని సుతుడు, పాపాత్ముడైన శిశుపాలుడును, దుర్భుద్ధియైన దంతవక్త్రుడును బాల్యము నుండియు ఇంతవరకును భగవంతుడైన శ్రీకృష్ణుని యందు ద్వేషభావమును కలిగియే యున్నారు.

శాశ్వతుడు, పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణభగవానుని తిట్టిపోయుచునే యున్నారు. ఐనను, వారికి నాలుకపై చిన్న మచ్చకూడ ఏర్పడలేదు. వారికి ఘోరాంధకారమయమైన నరకము గూడ ప్రాప్తించలేదు. పైగా, అత్యంత దుర్లభమైన భగవత్ప్రాప్తి అందరును చూచుచుండగనే అనాయాసముగా వీరికి లభించినది. దీనికి కారణమేమి?

ఈ విషయమున గాలి తాకిడికి దీపశిఖవలె నా బుద్ధి భ్రమకులోనై అటునిటు కొట్టుకొనుచున్నధి. దేవర్షీ! నీవు సర్వజ్ఞుడవు. కావున, ఈ అద్భుతఘటనలోగల రహస్యమును వివరింపుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)
                                                                                             తదుపరి ....3


No comments:

Post a Comment