Saturday 22 May 2021

ప్రాంజలి ప్రభ పాత కధలు (61- 70)



African Art :: Journey - Simba Craftware


61...* బాత్రూంలో వచ్చే  మూర్ఛ *

స్నానం చేస్తూ పడిపోయి స్ట్రోక్ వచ్చిన  వ్యక్తుల గురుంచి మనం తరచుగా  వింటాము.  మరెక్కడా పడి పోవడం  గురించి మనం ఎందుకు వినడంలేదు?

నేను ఆరోగ్యానికి జీవనశైలి అనే  కోర్సులో పాల్గొన్నప్పుడు, ఈ కోర్సులో పాల్గొన్న నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ కూడా మీరు స్నానం చేసే ముందు తల స్నానం చేయవద్దని, మొదట మీ శరీరంలోని ఇతర భాగాలను శుభ్రపరచాలని సలహా ఇచ్చారు.

ఎందుకంటే, తల తడిగా మరియు చల్లగా ఉన్నప్పుడు చల్లబడిన రక్తనాళాలలో ఉష్ణోగ్రత పెంచడానికి , రక్తం తలపై కి  వేగం గా ప్రవహిస్తుంది.  రక్త నాళాలు బలహీనంగా గాని, సన్నగా గాని ఉన్నట్లైతే, రక్త నాళాలు చిట్లిపోయే  అవకాశం ఎక్కువగా ఉంది.

ఇలా సాధారణంగా స్నానాల గదిలో  జరుగుతుంది కాబట్టి, ఇది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.

  1. పాదం నుండి స్నానం ప్రారంభిచండి.

  2. కాళ్ళు.

  3. తొడ.

  4. ఉదరం.

  5. భుజం.

  6. 5-10 సెకన్ల పాటు ఆగిన  తరువాత

మనం శరీరం నుండి ఆవిరి / గాలి పొంగిపొర్లుతున్నట్లు అనిపిస్తుంది, ఆపై యథావిధిగా తల  స్నానం చేయండి. తల స్నానానికి మాత్రం తప్పనిసరిగా గోరువెచ్చని నీరు వాడండి.

 ✅ వేడి నీటితో నిండిన గాజుపాత్రలో  వేడి నీరు ఖాళీ చేసి వెంటనే  చల్లటి నీటితో నింపండి. ఏం జరుగుతుంది?
గాజు పాత్ర పగిలిపోతుంది *

అదే విధంగా మన శరీర ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉంటుంది మరియు నీరు  చల్లగా ఉంటుంది, మనం స్నానం తల స్నానంతో మొదలు పెడితే, రక్త నాళాల ఉష్ణోగ్రతల మార్పు వలన తలలో రక్తనాళాలు చిట్లే అవకాశం ఎక్కువగా ఉంది.

అకస్మాత్తుగా బాత్రూంలో పడటం మనం తరచుగా చూస్తాము.  కానీ తప్పుడు స్నాన పద్ధతి కారణంగానే, మనకు స్ట్రోక్ గాని  లేదా మైగ్రేను (తలనొప్పి) రావడానికి  కారణం అని మనలో ఎంత మందికి తెలుసు.

ఈ సమాచారం ప్రతి ఒక్కరికి  అందేలా చూడడం మనఅందరి బాధ్యత.🙏

ఆరోగ్యమే మహా భాగ్యం.
--(())--

 62... *చాలా కాలం తరువాత నా  మిత్రుడు కలిస్తే ఎరా 50 ఏళ్ళు దాటాయి మనకి. వయస్సు తో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని క్యాజువల్ గా అడిగాను.* అప్పుడు అతను అన్నాడు

*అవును నేను మారుతున్నాను* !!

తల్లిదండ్రులను బంధువులను భార్యను పిల్లలను స్నేహితులను ఇన్నాళ్లు ప్రేమించాను
ఇప్పుడిప్పుడే  నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను.

నేనేమీ ప్రపంచ పటాన్ని కాదు
ప్రపంచాన్నంతా నేనే ఉద్ధరించాలని అనుకోవడం లేదు.

కూరగాయల వాళ్లతో పండ్ల కొట్ల వాళ్ళతో బేరాలు ఆడటం మానేశాను వాళ్లకు
నాలుగు రూపాయలు ఎక్కు విచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను
 ఆ డబ్బులు వాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కన్నా పనికి వస్తాయి.

టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడటం లేదు
ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు ఆనందంగా ఉంది
ఏదేమైనా జీవిక కోసం నాకన్నా ఎంతో కష్ట పడుతున్నాడు అతను

చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్ అని పెద్దవాళ్ళను అడగడం మానేశాను
వాళ్లు గతాన్ని నెమరు వేసుకోవడానికి అది పనికి వస్తుందని గ్రహించాను.

తోటివారిలో తప్పు ఉంది అని తెలిసినా వారిని సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను
అందరిని సరైన దారిలో పెట్టే బాధ్యత నా ఒక్కడి భుజాలమీద లేదు అని తెలుసుకున్నాను
సమగ్రత కన్నా ప్రశాంతత ముఖ్యo.

ఉచితంగా ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను
అది వారితో పాటు నాకు ఆనందాన్నిస్తోంది.

చొక్కా పై పడ్డ మరకలు చూసి బెంబేలు పడటం మానేశాను
ఆకారం కన్నా వ్యక్తిత్వంముఖ్యం అని తెలుసుకున్నాను.

నాకు విలువనివ్వని వారికి దూరం గా జరగడం నేర్చుకున్నాను
వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు కానీ నా విలువ ఎంతో నాకు తెలుసు.

ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీ లోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను
నాకు ఎవరితో పోలిక పోటీ అవసరం లేదు.

నా భావావేశాలు నన్ను కలవర పెట్టకుండా చూసుకుంటున్నాను
ఎందుకంటే నన్ను నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే
ఒక బాంధవ్యాన్ని ఒక సంబంధాన్ని తుం చుకోవడం కన్నా అహంకారాన్ని చంపుకోవడం మంచిదని గ్రహించాను
ఎందుకంటే నా అహంకారం నన్ను ఒంటరి గా నిలబెడుతుంది
సంబంధ బాంధవ్యాలు కొనసాగితే నేను ఎప్పుడూ ఒంటరిని కాదు కదా


*ప్రతిరోజు అదే చివరి రోజు అన్నట్టుగా బతకడం నేర్చుకున్నాను

*అవును నేను మారుతున్నాను* !!

నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను

*నా సుఖసంతోషాలకు నేనే...నేను మాత్రమే బాధ్యుడిని.*!!!!!🙏🏻


విజయానికి ఎన్ని మెట్లు ?
  మొదటి  లో వున్న ఆమె దురదృష్టవంతురాలు అని , రెండు లో వున్న ఆమె అదృష్టవంతురాలు అని , లేదా మొదటి ఆమె చదువుకోవాడానికి అవకాశాల్లేక అలాగే - ఒక కూలీ లాగా - వుండిపోయిందని , రెండో ఆమెను ఆమె తల్లితండ్రులు బాగా ప్రోత్సహించారని , మంచి బడి లో చేర్పించారని ,  లేదా  మొదటి ఆమె పేదరికానికి బలి అయితే , రెండో ఆమె సంపాదన బాగా వున్న కుటుంబం లో పుట్టిందని , అందుకే బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొందని , దేనికైనా రాసిపెట్టివుండాలని , మన తల మీద శని నాన్ స్టాప్ నాట్యం చేస్తున్నాడని ... ఇలా రకరకాలుగా అనుకోవచ్చు. వాస్తవానికి ఈ రెండు ఫొటోల్లో వున్నది ఒకే ఆమె. మొదట్లో , ఉదయం నుండి మధ్యాహ్నం దాకా రాళ్ళు కొట్టి , రోళ్ళు  తయారు చేసి , మధ్యాహ్నం దాటాక , పసి బిడ్డను చంకనేసుకొని , రోళ్ళను అమ్ముకొని , ఆ అర కొర పైసలతొనే  బతుకు బండి ని లాగే ఈమె , ఆ పని చేస్తూనే రాత్రిళ్ళు చదువుకొని , పరీక్షలకు కట్టి , పాస్ అయ్యి , ఇంకా ముందుకు చదివి , ఇపుడు ఏకంగా police sub inspector అయ్యింది  అంటే అది ఎంత గొప్పవిషయం కదా ! జీవితం లో విజయం సాధించడం ఎలా ? అన్న ప్రశ్న కు '' విజయానికి ఆరు మెట్లు లేదా ఏడు మెట్లు '' లాంటి పుస్తకాల్లో సమాధానం వుండదు. ఇలాంటి పుస్తకాలు వ్రాసిన రచయిత / లు  , మరో రంగం లో కి అడుగుపెట్టి ఘోరంగా విఫలమయ్యారు. ఆయన / వాళ్ళు వ్రాసిన పుస్తకాలు ఆయనకే / వాళ్ళకే పనికిరాలేదు.  అలాంటి వాళ్ళు కొందరు '' వ్యక్తిత్వ వికాస నిపుణులు '' అనే పేరుతో పట్టణాల్లో ఇంజినీరింగ్ కళాశాలలకు  , కార్పొరేట్  బళ్ళకు వస్తుంటారు. [ మా అనంతపురానికి కూడా వీళ్ళు తరచు వస్తుంటారు ] ఆయా కళాశాలలు , పాఠశాలల యాజమాన్యాలు వీళ్ళకు డబ్బు కూడా ఎక్కువగానే చెల్లించుకోవాలని విన్నాను.  విజయానికి ఆరు , ఏడు , పది , పన్నెండు .. ఇలా ఎన్ని బడితే అన్ని మెట్లు వుండవు.

విజయానికి రెండే మెట్లు : ఒకటి : నీ పట్ల నీ కున్న ఆత్మవిశ్వాసం , రెండు : పరమాత్మ పట్ల నీకున్న విశ్వాసం.  ఇవి రెండూ వుంటే మిగతావి నిన్ను వెతుక్కొంటూ వస్తాయి.
--(())--

63... * అనుకున్నది జరగలేదని దేవుళ్లను మారుస్తున్నారా?

కష్టమొస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలా మందికి. అందుచేతనే దేవుడు ఎప్పుడూ గుర్తు రావాలనే కుంతీదేవి తనకు ఎప్పుడూ కష్టాలు కలగాలని కోరుకుంది. అయితే సాధారణంగా అందరూ కష్టాలు తొలగించమనే దేవుణ్ని కొలుస్తారు.

ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా బాదర బందీ పెరిగి బ్రతుకు బరువు అవుతున్నా అప్పుడు కనిపించేది దేవుడొక్కడే. ఆయన్ను ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టా విప్పుతాం. కొబ్బరికాయలు కొడతాం, నీ కొండకు వస్తామని అంటాం, ఉపవాసాలు చేస్తాం, కనిపిం చిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం, మన బాధలు తీరక పోతుంటే సులభంగా దేవుళ్లని మార్చడం.  ఇది ఇప్పుడు సమా జంలో అతి సహజాతి సహజంగా జరుగుతున్న పరి ణామ క్రమం.

* ఈ కథ ఎలా ఉన్నా దీనిలోని నీతిని గ్రహించాలి.

పూర్వం ఒకాయనకి చాలా చిక్కులొచ్చేయి. ఎక్కడి కెళ్లినా చుక్కెదురవుతోంది . ఆ పరిస్థితి నుంచి బయటపడా లంటే అపార మైన దైవ కృప అవసరమని ఎవరో చెప్పేరు. ఏ దేవుని పూజించా లనే మీమాంస వచ్చింది. #శివుడు భోళా శంకరుడు కదా భక్తులు పిలవగానే పలుకు తాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు. ఇంతలోఎవరో చెప్పేరు #కృష్ణుడు అద్భుత లీలలు, మహిమలు చేసినవాడని, ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడతా డని వారు చెప్పారు. అంతే ఆయన శివ లింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడి పూజ మొదలు పెట్టాడు.

కష్టాలు తీర లేదు. ఇంతలో వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే #వినాయకుణ్ని పూజించాలని ఆయన ఆరాధన మొదలెట్టాడు. ధూపదీప నైవేద్యాలతో వినాయకుణ్ని పూజించాడు.

కొన్నాళ్ళలా సాగింది. ఈయన కోరికలు తీరలేదు. ఈతి బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పేరు ఆంజనేయుడయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయనను పూజించమని. ఈయనకీ నిజమేననిపించింది. వెంటనే #ఆంజనేయస్వామి విగ్రహం తెచ్చి పూజించటం మొదలెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, నియమాలు అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే పూజించాడు.

ఫలితం కనపడలేదు. ఈ దేవుళ్లు అందరూ ఇంతే. మగ దేవుళ్లు సులభంగా కరగరు, #అమ్మ వారి లాంటి వారయితే కరుణ, ప్రేమ ఎక్కువ. తల్లిలా ఆదుకుంటుందని అమ్మను  కొలవాలనే నిర్ణయానికి వచ్చాడు.

అయితే ఆయన సుకృతమో, కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరేయి, కోరికలు నెరవేరాయి. సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలిగాయి. అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది.

ఒకరోజు అమ్మ  ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ ధూపం, తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్లడం చూశాడు. వారికి ఈ ధూపం ఆఘ్రాణించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలా గుడ్డలు కట్టాడు .

అప్పుడు మళ్లీ అమ్మని  ధ్యానిస్తూ కళ్లు మూసుకున్నాడు. కొంత సేపైన తర్వాత కళ్లు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్లని చూసి ఆశ్చర్యపోయాడు.

అయితే తేరుకుని 'నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనిపుడు మిమ్మల్ని పిలవలేదు. రమ్మనలేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు, నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలు కట్టాను అన్నాడు.

అప్పుడు శివుడు 'నాయనా అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కనుకనే ధూపం ఆఘ్రాణించకూడదని ముక్కునోళ్లకు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో చూసి దర్శనమిచ్చాం' అని చెప్పాడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్టు చిరునవ్వు చిందించారు. అందరూ అతణ్ని ఆశీర్వదించి అంతర్థానమయ్యారు.

ఇక్కడ మనం తెలుసుకోవలసింది భగవంతుణ్ని విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి. ఆరాధిం చాలి. అప్పుడే వారు కనిపిస్తారు.

రామకృష్ణ పరమహంస చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పట్టుకెళ్ళాల్సి వచ్చింది. అది పుచ్చుకు బయలుదేరాడు. నైవైద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు. ఆవిడ రోజూ నైవేద్యం తింటుందనుకున్నాడు. 'రోజూ తినే దానివి ఈ రోజు తినవేమి. తింటే కాని వెళ్లన'న్నాడు. తాను తింటా నన్న అతని దృఢ విశ్వాసానికి మెచ్చి ఆమె నైవేద్యం తిన్నది. అదీ విశ్వాసమంటే. అందరు దేవతలు ఒకే దేవుని వేర్వేరు రూపాలు.

 కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి. అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో కష్టాల నుంచి ఉప శమనం  లభిస్తుంది.

-(())--
 

64..*"నాన్న ఎందుకో వెనకబడ్డాడు"*

అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు...
రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు

ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న
ఇద్దరి శ్రమా సమానమే అయినా అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు

ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న
ఇద్దరి ప్రేమా సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో
బాగా వెనకబడ్డాడు

ఫోను లోనూ అమ్మ అనే పేరే దెబ్బ తగిలినప్పుడూ..అమ్మా అనే పిలుపే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధ పడ్డాడా?అంటే..
ఏమో!
ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమ పొందడం లో తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు
నాన్న బట్టలకు దండెం కూడా నిండదు!

తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాక్కూడా పట్టనంత వెనకబడ్డాడు

అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచె ఒక్కటే!
కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడం లో నాన్నేందుకో బాగా వెనకబడ్డాడు!

పిల్లల ఫీజులు ఖర్చులున్నాయ్ అన్నప్పుడు ఈసారి పండక్కి చీర కొనొద్దని అమ్మ
ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులు తో ఇష్టంగా తినే నాన్న

ఇద్దరి ప్రేమ ఒక్కటే అయినా మా అమ్మకంటే నాన్న చాలా వెనకబడ్డాడు వయసు మళ్ళాకా...
అమ్మైతే ఇంట్లో  పనికి పనికొస్తుంది నాన్న ఎందుకూ పనికిరాడని మేం తీర్మానం చేసేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే!

నాన్న ఇలా వెనకబడి పోవడానికి కారణం

*ఆయన మా అందరికీ*
*వెన్నుముక కావడమే!*

--(())--

65.. హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము
-------------------------------------

1. గంటలు :
----------------
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:
------------------
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. " స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.

3. ధూపం
--------------
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి
------------------------
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ
---------------------
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.

6. పూజ
------------
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము)
-------------------------
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము)
----------------------------------
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు)
-------------------------
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు)
---------------------------
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు
---------------------------
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము
---------------------------
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము
-----------------------
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు

†****
66...సభ్యులందరికీ అతిముఖ్యమైనన
 సూచన:-
ఇద్దరు వ్యక్తులు రెండు వేరు వేరు ఇళ్ళలో ఉండే వాళ్ళు. ఆ రెండిళ్ళ మధ్య ఒక గోడ మాత్రం ఉండేది. ఒకరు రిటైర్ అయిన పెద్దమనిషి, మరొకరు ఒక యువకుడు.

ఆ ఇద్దరు ఒకే లాంటి మొక్కలు నాటి ఇంటికి ఇరు వైపులా పెంచడం మొదలుపెట్టారు.

ఆ యువకుడు చెట్లకి చాలా నీళ్ళు ఎరువు ఇవ్వసాగాడు. కాని, ఆ పెద్దమనిషి కాస్తంత ఎరువు కొన్ని నీళ్లు ఇచ్చేవాడు.

కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క పచ్చగా ఆకులతో నిండుగా తయారయింది.

ఇక ఆ పెద్దమనిషి నాటిన మొక్క అంత ఎక్కువగా కాక పోయిన బలంగా నిండుగా అయింది.

ఒక రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

మర్నాడు ఉదయం ఆ ఇద్దరు వాళ్ళు నాటిన మొక్కల పరిస్థితి ఎలా ఉందా అని చూడడానికి బయటకు వచ్చ్చారు.

ఆ యువకుడు అంత జాగ్రత్తగా పెంచిన చెట్టు వేళ్ళతో పాటు పడిపోయి ఉండడం చూసాడు. కాని ఆ పెద్దమనిషి అంతంత మాత్రంగా చూసిన చెట్టు మాత్రం అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.

దాంతో ఆ యువకుడు అలా ఎందుకు జరిగింది అని ఆ పెద్దాయనను ప్రశ్నించాడు.

ఆయన చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం కావాలి.

"* చూడు బాబు, నువ్వు ఒక చెట్టుకి ఏమేమి కావాలో అన్నీ అవసారానికి మించి అందించావు. అందువల్ల దాని వేళ్ళు నీళ్ళ కోసమో పోషకవిలువల కోసమో భూమి లోతుల వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. నేను చెట్టు బ్రతకడానికి మాత్రం సరిపడే నీళ్ళు ఎరువు ఇఛ్చినందువల్ల ఇతర పోషకాల కోసం అది తన వేళ్ళను భూమి లోతుల వరకు పరిచింది.

నీ వేళ్ళు పైపైన మాత్రమే ఉండడంవల్ల గాలికి తట్టుకుని భూమిలోపల నిలదొక్కుకోలేకపోయాయి.

నా వేళ్ళు భూమి లోతుల వరకు పాకి ఉండటంవల్ల ప్రకృతి విసిరిన సవాలును తట్టుకుని చెట్టు అలాగే  నిలబడగలిగింది.*"

ఈ విషయం మనం పెంచే చెట్ల విషయంలోనే కాదు మనం కని పెంచే పిల్లలకు కూడా వర్తిస్తుంది అని అందరం గమనించాలి.

🌳🌲🌴👶👶

     67....  _*😱*చాలామందికి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియడంలేదు. ఫోన్ లలో అవతల వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నారు అన్న విషయాన్ని అవగాహన చేసుకొని మాట్లాడాలి. లేదంటే ఇతడి మాటల ప్రభావం అవతల వారి మానసిక పరిస్థితిపైన తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం మెండుగా ఉంది. ఇంకా ఇతడి మాటల ప్రభావం అవతలి వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ కథనాన్ని పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది..*_😱

     _**అప్పారావుకు కరోనా సోకడంతో కొడుకు రవి అతడిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ విషయం పెద్దనాన్న గారికి తెలియజేసేందుకు ఆయనకు ఫోన్ చేసి “పెద్దనాన్నగారూ! నాన్నను నిన్ననే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసాను. నాలుగు రోజులుగా జ్వరం తగ్గడంలేదు! ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఇక ఛాన్స్ తీసుకోలేక, వెంటనే అపోలోకి తెచ్చా. రాపిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ గా వచ్చింది, నిన్ననే రెమిడీసివర్ మొదలు పెట్టారు! నా ఫ్రెండొకడు పెద్ద రికమెండేషన్ మీద అతి కష్టమ్మీద హాస్పిటల్లో రూమ్ ఇప్పించాడు అంటూ పాఠం అప్పచెప్పినట్టు చెప్పేసాడు భయంతో, కొంత తండ్రి గురించిన ఆందోళనతో ఉన్న రవి. అవతల వింటున్న ఆయన అవునా! ఎలా ఉన్నాడ్రా వాడు? అని అడిగారు సుబ్బారావు. ఇదిగోండి ఇస్తా ! ఒకసారి మాట్లాడండి! అంటూ ఫోన్ తండ్రిచేతికి ఇచ్చాడు రవి. “అన్నయ్యా!” అంటూ నీరసంగా పలకరించాడు అప్పారావు..*_

     _**ఒరే అప్పారావ్ “జాగ్రత్తరోయ్! అసలే రోజులేం బాలేవు, మన కుటుంబంలోనే ఇప్పటికి డజన్ కేసులు అందులో నలుగురు పోనే పోయారు. మా చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో రోజుకో రెండుమూడు కేసులురా! ఈ సెకండ్ వేవ్ ఊడ్చిపెట్టేస్తోంది జనాలను! రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయినా ఇంట్లో ఏ కషాయాలో తాగి ఉండకుండా ఆ వెధవ ఆసుపత్రికి ఎందుకు పోయావురా. ఆస్పత్రికి వెళ్ళిన వాళ్ళు సగం మంది తిరిగే రావడం లేదట! పైగా మూడువేల రెమిడీసివర్ మందును ముప్ఫైవేల నుండి అరవై వేలకు అమ్ముతున్నారట. అయినా రవి నీతో ఉండడమేంటి? వాడు మరీ చిన్నవాడాయే. మొన్న మా రాజారావ్ కొడుకు తల్లీతండ్రికీ కోవిడ్ వచ్చిందని తెలుసి వారికి సేవ చేయాలని అంత దూరం నుండి పరిగెట్టుకొచ్చిన వాడికీ మహమ్మారి అంటుకుని మొత్తంగా కుటుంబానికి కుటుంబమే బలయిపోయారు!” అంటూ ఇంకా ఏవేవో అంటున్న అన్నగారి భయభ్రాంత పూరిత మాటలకు అప్పటికే వణికిపోతున్నాడు అప్పారావు. స్వాభావికంగా వారి కుటుంబంలోనే అతి పెద్ద పిరికివాడు, అర్భకుడు అతను. దానికి తోడు కోవిడ్ బారిన పడ్డాడాయే. దాంతో ఇక నేను చస్తానేమో అనే భయంతో మరింతగా కుంగిపోయాడు.*_ 

      _**ఇంతలో తన భర్తచేతిలోంచి ఫోన్ లాక్కున్నట్టు తీసుకుంది సత్యవతమ్మ! చూడు నాయనా సూర్యం నేను పెద్దవదిన్ని అందో లేదో భోరుమన్నాడు మరిది! ఇంకేముంది వదినా! అంతా అయిపోయింది. పిల్లల్ని, సీతనీ దిక్కులేని వాళ్లను చేసి పోతున్నాను. ఇక వాళ్ళ పెళ్ళిళ్లు, పుణ్యకార్యాలూ నీదే బాధ్యత వదినా అంటూ ఏవేవో అనేస్తున్నాడు అప్పారావు. “నీ మొహం! ఆపు ఏంటి ఆ మాటలు నీకు ఏమీ అవ్వదు. అంతా బాగయ్యి రెండు రోజుల్లో లక్షణంగా ఇంటికొచ్చేస్తావు. అంత భయంగా ఉంటే! పోనీ నన్ను రమ్మంటావా, నీకు తోడుగా, చూడూ నీకొకటి చెప్పనా, ఏడిద సుబ్బారాయుడి గారు రాసిన నీ జాతకం ప్రకారం నీకు తొంభై ఎనిమిదేళ్ళ ఆయుర్దాయం ఉంది. ఇప్పటి వరకూ ఆయన చెప్పిన విషయం ఏది కూడా తప్పలేదు. నిన్ను చిన్నప్పుడు మలేరియా, మశూచికమే ఏమీ చెయ్యలేదు నిన్ను. ఇప్పుడు ఈ కోవిడ్ ఎంతయ్యా! దాని మొహం, అదేంచేయ్యలేదు నిన్ను నువ్వేం భయపడక..*_

     _**నువ్వు ఏంతో మంది గురువుల దగ్గర ఎన్నెన్నో నేర్చుకున్న నువ్వు నిరంతరం సాధన చేసుకునే మహాసౌరజపం, ప్రాణాయామం వంటివి ఉత్తినే పోవు. ఆ మహమ్మారిని ఇట్టే తరిమేస్తాయి. నీవేమి భయపడకుండా, అధైర్య పడకుండా ధైర్యంగా ఉండు. మరిచి పోయావా నాకూ, సీతకూ మానససరోవరం చూపిస్తానన్నావు. నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా! కనుక వెర్రి ఆలోచనలు మాని, హాయిగా వైద్యం చేయించుకుంటూ, బలమైన పౌష్టికాహారం తింటూ, భగవత్ ధ్యానం చేసుకో. దాంతో నీకు శుభ్రంగా నయమయి పోతుంది. అన్నయ్య చేత ఓ లక్షరూపాయిలు నీ అకౌంట్లో వేయిస్తా. అందాకా వుంచు! అవసరమయితే అందరం నీతో ఉన్నాం, ఇక మీదట కూడా ఉంటాం సరేనా నాన్నా!” అంటున్న వదినగారి మాటలతో అప్పారావులో ఎక్కడలేని హుషారు, ఉత్సాహం పుట్టుకొచ్చాయి.*_

      _**ఆమెతో వదినా ఇందాక “అన్నయ్య నన్ను తెగ భయపెట్టేసాడనుకో అన్నాడు కొంచెం బాధపడుతూ. అవును “విన్నానయ్యా! ఏం మనిషో ఏం లోకమో! ఆయనది. అలాగేనా మాట్లాడేది? అంత తెలివే ఉంటే కలెక్టర్ గా రిటయిర్ అయ్యేవాడు కదా! చివరికి ఇలా డిప్టీగానే మిగిలిపోయారు కదా! అందామె కినుకగా! అది విన్న అప్పారావుకు ఆమె మాట్లాడిన తీరుకి ! నవ్వోచ్చి పకపకా నవ్వాడు ఆనందంగా. ఇదంతా గమనిస్తున్న సుబ్బారావు తనేం తప్పుగా మాట్లాడేడో తెలియక, అయోమయంగా చూస్తూ, మళ్ళీ టీవీలో వస్తున్న కరోనా వార్తలకు అతుక్కుపోయారు సుబ్బారావు. ఆమె సాంత్వన వచనాలతో సగం రోగం తగ్గనట్టయింది అప్పారావుకు! హమ్మయ్య అయితే ఇంక నాకేం కాదు అనుకుంటూ నాలుగు రోజులుగా నిద్రపట్టక సతమతమైన వాడు వదిన మాటలతో ఇప్పుడు హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.*_

     _**చూశారా మిత్రులారా! ఇక్కడ ఒకరి నెగటివ్ మాటలు ఎదుటి వారిలో భయాన్ని పుట్టించి చావుకు దగ్గర చేస్తే మరొకరి పాజిటివ్ మాటలు ప్రాణాలు పోతాయేమో అనే భయం ఉన్న వాడికి, వాడిలోని ఆ ప్రాణభయం నుండి బయటపడేలా చేసి అతడిలో ధైర్యాన్ని నింపి ఆతడినుండి చావును దూరం చేస్తాయి. కాబట్టి అందరూ ఎదుటి వారితో పాజిటివ్ గా మాట్లాడుదాం. ఆ పాజిటివ్ మాటలతో ఎదుటి వారిలో ఉన్న భయాన్ని ప్రారదోలుదాం, ఆ మనిషిని దక్కించుకొందాము.. శుభం భూయాత్..*_👌

_*🫀*మీఆరోగ్యంమీచేతుల్లోనేఉంది.**_🫀

      _*🫁*ఆరోగ్యమే మహాభాగ్యం.**_🫁        _*🧠*Health is Wealth.**_🧠

   _**Prevention is Better than Cure.**_ _**క్రియేశ్వరానంద గిరి**_   _**8008 494979*_

68.. ✍️ ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడ్ని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లారు, మళ్లీ రెండు వారాల తరువాత అదే రైలులో ఇంటికి తిరిగి వస్తారు.

🤷‍♂️ అయితే ఒక రోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు. నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను. కొంచెం ఆలోచన తరువాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు. తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్ కి వెళ్తారు, ట్రైన్ ప్లాట్ ఫాం మీద ఉంది, ఫ్లాట్ ఫాం మీదఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదేపదే జాగ్రత్తలు చెబుతున్నారు. తెలుసు నాకు తెలుసు, మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు. అన్నాడు బాలుడు కొంచెం అసహనంతో. రైలు బయలుదేరబోతోంది, ఇంతలో తండ్రి జేబులో ఏదో పెడుతూ గుస గుసలుగా, అయ్యా, నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే, ఇది చూడు.

🤷‍♀️ ట్రైన్ బయలుదేరింది, ఇప్పుడు బాలుడు ఒంటరిగా రైలులో కూర్చున్నాడు, మొదటిసారి తల్లిదండ్రులు లేకుండా, అతను కిటికీ గుండా వెళ్లే దృశ్యాన్ని చూస్తాడు. అతని చుట్టూ అపరిచితులు హల్‌చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు, కొంతమంది కంపార్ట్మెంట్‌లోకి ఎక్కుతున్నారు, కొంతమంది దిగుతున్నారు, అటూ ఇటూ చూస్తున్నాడు అన్ని కొత్త మొహలు తెలిసిన మొహం ఒక్కటీ లేదు. అతను ఒంటరి గా ఉన్నాడు అనే భావన అతనికి వస్తుంది. ఒక వ్యక్తి విచారకరమైన మొహం తో తననే చూస్తూన్నాడు. ఆది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు ఒక్క సారిగా భయపడటం ప్రారంభించాడు. రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలవుతుంది మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. సీట్లో మూలకి ముడుసుకుని కూర్చున్నాడు, ఒక్క సారిగా అతని కళ్ళల్లో నీళ్ళు.

🤷‍♂️ ఆ సమయంలో అతని కి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తు. వణుకుతున్న చేతితో అతను ఆకాగితాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు, అందులో ఇలా ఉంది, "భయపడవద్దు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను". ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు దైర్యం తో మొహం మెరిసి పోయింది. గుండె నిండా దైర్యం, చిరునవ్వు తో తల పైకి ఎత్తుకొని కూర్చున్నాడు, గుండె వేగం తగ్గింది, కడుపు నొప్పి ఛాయలు లేవు. అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు. 

 ✍️ నీతి 🌱

👉 అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు, మనoదరి జేబులో కూడా ఒక నోట్ వుంచుతాడు, "నేను మీతో ప్రయాణిస్తున్నాను" అని. కాబట్టి భయపడవద్దు, నిరాశ చెందకండి,

ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

✍️ ప్రస్తుతం ప్రపంచం లో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో, ఏవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు.

🙏 ఆయనను విశ్వసించండి, ఆయనపై నమ్మకం ఉంచండి, మన ప్రయాణమంతా మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. 

                                                                                🙏దయచేసి అందరి కోసం ప్రార్థించండి🙏

--(())--

69.. " *అనుష్ఠానం* "


నేను ఎప్పుడు " *అనుష్ఠానానికి* " కూచున్నా సరిగ్గా టాయిలెట్స్  కడిగే అమ్మాయి అప్పుడే వస్తుంది. మనిషి బక్కపలచగా నీరసంగా ఉంటుంది. జక్కంపూడి నుంచి రానూపోనూ 50/-ఇచ్చి ఆటో లో వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మంగళ,శుక్రవారాల్లోనే వస్తుంది. మొదట్లొ కొంచెం విసుక్కున్న మాట నిజమే! 

కానీ ఆ అమ్మాయికి ఆకలి, అరడజను ఆడపిల్లల ఆలనా పాలనా తప్ప మన సెంటిమెంట్ పట్టదు అని గ్రహించా.

నాలాంటి వారు నలుగురు పని చెబితేనే ఆరోజు గడుస్తుంది ఆ ఇంటిల్లిపాదికి. 

ఆటో చార్జీలు దాన్లో మళ్ళీ ఆసిడ్ బాటిల్, ఫినాయిల్ కి పెట్టుబడి పోగా మిగిలే ఏ యాభయ్యో, వందో రూపాయల కోసం మనం అసహ్యించుకునే పనిని ఆప్యాయంగా చేస్తుంది. అటువంటి అమ్మాయిని ఇవ్వాళ  శుక్రవారం.. పైగా పూజ మధ్యలో ఉన్నా..రేపురా అని ఎలా అనగలను??

అలా అంటూ.." *అన్తశ్చరతి* *భూతేషు* *

* *గుహాయామ్* *విశ్వమూర్తిషు* "అంటూ మననం చేస్తుంటే  పూజిస్తున్న దేవుడు తెల్లబోడూ?? 

చదువుతున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి?? అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోను?? అందుకే పూజ ఆపి ఆ అమ్మాయి పని అయి పంపాకే శేషానుష్ఠానాన్ని సాగిస్తున్నా.

 *ఇక్కడే* *నాకు* *సందేహం* ** వచ్చింది!!

అసలు " *అనుష్ఠానం* "అంటే ఏమిటని!!??

అనుష్ఠానం ఒక పవిత్రమైన పదం. 

పదం ఎంత గంభీరమో! దాని అర్ధం కూడా అంతే గూఢం.

భగవంతుడికి సంబంధించిన పదం  కాబట్టి దీని అర్ధం  విలక్షణంగానూ విస్తృతంగానూ  ఉంటుంది.

 " *ఫలానా*లా చేస్తేనే అనుష్ఠానం *"*  అని గిరి గీసి చెప్పటానికి లేకుండా  " *గిరి* "  అంత ఉన్నతమైన విలువ కలది.  ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతునిలానే అనిర్వచనీయం. 

సమాజహితం కోసం ఏకాగ్రత తో  చేసే అనుష్ఠానం, ధ్యానం లేదా తపస్సు ఒక దృఢమైన సంకల్పశక్తి గా లోకకల్యాణానికి  ఎలా మారుతుందో! మహానుభావుల చరిత్ర చూస్తే తెలుస్తుంది.

మరి మనం అలా చెయ్యాలంటే అంత మానసిక శారీరక తుష్టి పుష్టి మనకి ఉందా? అంత ఏకాగ్రత మనం సంపాదించుకోగలమా?? ఖచ్చితంగా నాలాంటి వాడు చెయ్యలేడనే చెప్పాలి. మరి సమాజానికి మన అనుష్ఠానం ఉపయోగపడటం ఎలా??

ఎలా అంటే, " *మన* *స్థాయిలో* *సమాజానికి* " ఉపయోగపడేలా మనం చేసే  ప్రతీ చర్యా అనుష్ఠానమే. అలాంటి అనుష్ఠానాలు అవలోకించి చూస్తే అడుగడుగునా బోలెడు.

ఉదాహరణకు జోరున వర్షం పడుతోంది.పక్కవాటా వాళ్ళు లేరు.కానీ వారు ఆరేసిన బట్టలు వానలో తడుస్తున్నాయి. వెంటనే మీరు అవి తీసి మడతబెట్టి  రాగానే ఇస్తే  వాళ్ళు ఎంత ఆనందిస్తారో కదా?

తెల్లవారుజామున మీరు జిమ్ కని బండి మీద వెళ్తున్నారు. ఇంతలో ఒక పెద్దమనిషి చేతిలో సూట్ కేస్ తో అటూ ఇటూ ఆదుర్దాగా చూస్తున్నాడు.

మీకు అర్ధం అయ్యింది ! ఆయన స్టేషన్ కి వెళ్లాలని. కనుచూపుమేరలో ఆటో కనపడటం లేదు. పోనీ మీ పని అంత అర్జంట్ కానప్పుడు ఆగి స్టేషన్ దగ్గర దింపితే ఆయన కి ఎంత ఊరట!! రైలు లో కూచొని " *దైవం* *మానుష* *రూపేణా* "!! అన్నట్లు " దేముడిలా అతనెవరో దించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది?"  అన్న  ఆయన *కృతజ్ఞతా* *తలంపు*  మీకు ఎంత పెద్ద దీవెన!! 

ఇలాంటివన్నీ అనుష్ఠానాలు కాదూ!!

పండగ వచ్చింది. లాక్ డౌన్ మూలంగా పక్కవారు ఎక్కడో ఉండిపోయారు. పండగ రోజు  కాస్త ముగ్గు, నాలుగు మామిడాకులు వాళ్ళ గుమ్మం ముందు ఉంచితే  మన బతుకు *పచ్చ* *తోరణం* అవ్వదూ!!

 * మన నోటికి భయపడి జోరు వర్షం లో కూడా మానకుండా వచ్చే పనిమనిషికి మనం తాగే కాఫీ లాంటిది ఇస్తే ఆ అమ్మాయి లో కలిగే 

 *అల్ప* *కృతఙ్ఞత* మనకి 

అనల్పసంతోష హేతువవ్వదూ!!

మన ఇంట్లో మనం తినటం కన్నా పక్క ఇంట్లో భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత 

సంతోషంగా వడ్డిస్తారో అలాగే మన ఒంట్లో భగవానుడు..పక్క ఒంట్లో వాడికి పెడితే అంతగానూ సంతోషపడతాడు కదా!!.

భార్య శ్రద్ధగా వంట చేసి పెడుతుంటే మెచ్చుకోవడం,

పక్కవాడి తులసిమొక్కకి కాసిని నీళ్లు పోయడం,

వాళ్ళ కుక్కకి అన్నం పెట్టడం..ఇలా ఎన్ని రకాల అనుష్ఠానాలని!!

చీరల షాపులో  పనిచేసేవారికి సరైన పౌష్ఠీ కాహారం ఎక్కడ ఉంటుంది?? పైగా షాపులో ఉన్నంతసేపు అలా నుంచొని ఉండాల్సిందే.!!.డజన్లకొద్దీ చీరలు తీయిస్తూ, 

ఆ సేల్స్ గర్ల్ సహనాన్ని పరీక్షిస్తూ, ఒక చీర కనీసం జాకెట్ కూడా తీసుకోకుండా వెళ్ళేవాళ్ళు ఎందరో??

ఆ అమ్మాయికి " *అమ్మే* *తెలివితేటలు* *లేవని* "  ఓనర్ తిట్టే అరుపులు మన చెవికి వినపడవు. గతిలేని ఆ అమ్మాయి కన్నీరు మనకి కనపడదు...ఇది గ్రహించని మనం చేసే పూజకి పరమార్థం ఉందంటారా??

ఎక్కే గుమ్మం దిగేగుమ్మం గా ఉద్యోగాలు చేసేవారు.. ఉంటారు. 

ఉదాహరణకు కేబుల్ టీవీ వాళ్ళుబిల్లు కోసం మూడంతస్తులు ఆయాసపడి ఎక్కివస్తే " *మళ్ళీ* *రండి* "అని విసుక్కోకుండా  వెంటనే కట్టేస్తే ఆ చిరుద్యోగి  " అందరూ ఇలా ఉంటే ఎంత బాగుండు!!" అనుకోడూ!! అతనికి లభించిన ఆ *చిన్న* *స్వాంతన* భగవంతుడు మీ వైపు చూసేలా చెయ్యదూ?

ఒక చిన్న సైకిల్ మూలంగా మొత్తం ట్రాఫిక్ ఆగిపోతే ఎవరికి వారు నామోషీకి పోయి కార్లు, బళ్ల మీద బిర్రబిగుసుకుని కూచోకుండా ఆ సైకిల్ మీరు జరిపితే కొంతైనా సంస్కారం ఉన్న వ్యక్తులు మీ వైపు కృతజ్ఞతతో చూసే చూపు మీ వైటల్ ఎనర్జీ ని రెట్టింపు చెయ్యదూ??

ఏదో వీక్ ఎండ్ లో మీరు ఏ పుణ్యక్షేత్ర మో వెళ్తున్నప్పుడు మీ కుటుంబసభ్యులు తో బాటు ఏ బీదవారినో ఒకర్ని తీసుకెళ్లి దర్శనం చేయిస్తే గుళ్లో దేముడు బోల్డు సంతోష పడిపోడూ?? 

మన ఇంట్లో పూచినవో, కాచినవో నలుగురికీ మనస్ఫూర్తిగా అందిస్తే,  ఆ చెట్లు మరింత ఇవ్వడానికి సిద్దమవుతాయట. వాటి సగటు ఆయుర్దాయం కూడా  పెరుగుతుందని చదివా. మనఇంటి పూలతో నలుగురూ చేసే పూజ, మన కాయలతో చేసే వైద్యమో,  నైవేద్యమో!! ఎంత మంది చేస్తే  అంత  అనుష్ఠానం మనం చేస్తున్నట్లు కాదూ!!

 నేను చూస్తూ ఉంటా..చాలామంది ఇంట్లో చెత్త ని రోడ్డు మీద ఎవరూ చూడట్లేదన్న భ్రమలో ఇంకోరి ఇంటిముందు పారపోసేస్తూంటారు.

కొంతమంది చెత్త బుట్ట లో వేస్తారు కానీ దాన్లో కుమ్మరించడం వలన తీసుకెళ్లే పారిశుధ్య కార్మికులకు ఎంతో అవస్థ. కొన్ని చెత్తబుట్టలు చిల్లులు పడినా మార్చరు.. వాటినుంచి చెత్తరాలుతూ, కారుతూ ఉంటుంది..తినడానికి, సినిమాలకి పెడతాం కానీ చెత్త బుట్ట మంచిది కొననే కొనం.

పాపం ఆకార్మికుడు మనసు కష్టపెట్టుకున్నా మనకి చెప్పే ధైర్యం అతనికి ఉండదు. చెత్త నంతటినీ కారి బాగ్స్ లో పెట్టి వేస్తే తీసుకెళ్లే అతనికి ఎంత సౌకర్యంగా ఉంటుంది!!   ఇలాంటి *చిన్న* *సామాజిక* *బాధ్యత* ని గుర్తించి మన వంతు కర్తవ్యాన్ని మనము నిర్వహిస్తే అంతకన్నా పెద్ద అనుష్ఠానం ఇంకేముంటుంది??

చివరిగా ఒక ఆహ్లాదమైన అనుష్ఠానాన్ని చెబుతా..

ఆ మధ్య "హంసల దీవి " కి వెళ్ళా...నాకు తెలుసు అక్కడ బెస్తవారి పిల్లలు ఉంటారు. వాళ్ళకి చేపలు, సముద్రం తప్ప వేరే లోకం తెలియదు. 

కార్లు, బైకులు వేసుకొచ్చి సముద్రంలో దిగి ఆటలాడుతూ తింటూ, తాగుతూ ఉండే మనుష్యులని ఆశ్చర్యంగా ఆశగా చూస్తూ దూరంగా ఉంటారు.

నేను వారికి సర్ ప్రైజ్ ఇద్దామని "కొన్ని వేఫర్లు..కొన్ని మిల్క్ డైరీ చాకలెట్స్ తీసుకెళ్లి పిలిచా"  అవి చూపిస్తూ. 

ముందు రామంటూ అడ్డంగా తల ఊపుతూ పారిపోయారు. తర్వాత దూరంగా నన్ను చూస్తూ నిలబడ్డారు. ఒకళ్లిద్దరు గుడిసె లో దూరి వాళ్ళమ్మకి చెప్పినట్లున్నారు. ఆవిడ తల బైట పెట్టి నన్ను చూసి ఏమనుకుందో ఏమో!! వాళ్ళకి ఏదో చెప్పింది. 

అప్పుడు వాళ్ళు భయం భయం గానే దగ్గరకి వచ్చారు. అప్పుడు నేను చాకలెట్స్ ఇస్తూ వాళ్ళ వివరాలు కనుక్కుంటూ కబుర్లు చెప్పా. 

 ఆ వేఫర్స్, చాకలెట్స్..వాళ్ళు ఎప్పుడూ తినలేదట!.ఎవరూ ఇవ్వలేదట!! అసలు వాళ్ళని చేరదీసి ఇలా పలకరించింది లేదనే !చెప్పారు. 

మాటల్లో సముద్రం గురించి ఎన్ని విషయా లు చెప్పారో?? ఆశ్చర్యం వేసింది.

 "అలలు, వారి వలలు 

చేపలు , తెరచాపలూ

బోటులు,  కడలి అటు పోటులూ"..

ఇలా మా మధ్య స్నేహం కుదిరిన ఆ గంట అలా అలలా జారిపోయింది..నా హృదయం అల జారిన మెత్తని ఇసుకగా మారిపోయింది.

కొందరు ఆ చాక్ లెట్స్ కాగితాలు దాచుకున్నారు జేబుల్లో. 

ఆడపిల్లలయితే నెమ్మదిగా తింటూనే ఉన్నారు. 

చెలియల కట్ట దాటిన ఆ చిన్నారుల స్వచ్ఛ దరహాస తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పరుగున వెళ్లి   వాళ్ళు దాచుకున్న గవ్వలూ, ఆల్చిప్పలు,నత్తగుల్లలు..ఇత్యాదివి పోటీపడి చూపించారు.  " *అచ్చంగా* *నన్ను* ** *తీసుకోమని* "  ఒకరిద్దరు కోరారు కూడా. నాకు ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆ  " *శైశవతపన* " చూస్తే  ఎంత ముచ్చటేసిందో!!

నేనిచ్చిన  చిన్న కానుక్కే వాళ్ళ మొహాలు లైట్ హౌస్ లా మారి వింతకాంతిపుంజం విరబూసి జీవితం పట్ల నా కున్న దృక్కోణానికి దిశానిర్దేశం చేసాయా ?? అనిపించింది.

చాలు ఈ జీవితానికి!!  ఆ పసిమనసుల సమక్షంలో నేను చేసుకున్న ఈ " *చిన్ని* ** *అనుష్ఠానం* " . *

 ఇలా చేసే "అనుష్ఠానాలు" కాకుండా కొన్ని  చేయకుండా ఉంటే "అనుష్ఠానాలుగా" మారేవి ఉన్నాయి.  

ఉదాహరణకు

తన దారిన తాను పోతున్న కుక్కనో, పందినో ఊరికే కొట్టడం,  నడుస్తున్న వారి మీద  రోడ్డుపై నిలిచిన వాననీళ్లు పడేలా బళ్లు వేగంగా నడపడం, 

అందుతున్నాయికదా!! అని అనుమతి లేకుండా పక్కవారి పూలు కాయలు కోసేయడం ఇలాంటివి చేయకుండా ఉంటే అనుష్ఠానం చేసినట్లే!!

ఇలా రాస్తూ పోతే ఎన్ని రకాల అనుష్ఠానాలైనా చెప్పచ్చు , చేస్తూ పోవచ్చు..

తోటివారి ని సంతోష పెట్టేదో, సాటివారి కన్నీరు తుడిచేదో!! ఏదైనా " *అనుష్ఠానమే* "

మీరూ ఆలోచించండి...ఆరంభించండి.

 *శరీరానికి*ఎంత* *కాంతి* 

* *మనసుకి* *ఎంత* *శాంతి* !!

70,  

నడకలో కధల సంసారం (కధ )

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

రాజు గారి  దంపతులు, రావు గారి దంపతులు రోజూ కలసి వాకింగ్ చేస్తూఉంటారు. రాజు గారికి ముగ్గురు కొడుకులు, రావు గారికి ముగ్గులు కూతుర్లు అందరికీ పెళ్లిళ్లు చేశారు వాళ్ళ కుటుంబాల గురించి గొప్పలు చప్పుకుంటూ మాట్లాడు కుంటున్నారు.     

రాజుగారు మీ మనవుడికి ఎందుకో ఎప్పుడూ వంట్లో బాగోలేదంటారు,  ఉద్దేశ్యమేమంటే మనం ఋణానుబంధం ఉంటే అలాంటి పిల్లలు పుడతారండి అన్నాడు. అవునండి మీరన్నట్లుగా 

గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకుని వుండచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండచ్చు. అటువంటి వాళ్ళు మాకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మావద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి ఆపాత ఖర్చులు సరి సమానం అయ్యేవరకు మనతోనే వుంటారు.
    
అవునండి రాజుగారు మీరన్నట్లు నిజమే, కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారా, ఇటు తల్లి తండ్రులను, అత్త మామలను ఒకటే  ఆడిస్తూ ఉంటారు. వీరు కూడా      

మన పూర్వ జన్మలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో అల్లుళ్ళ,  సంతాన రూపంలో తిరిగి పుడతారు. అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు,నానా గొడవలూ చేస్తారు. జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు. ఎల్లప్పుడును తల్లితండ్రులను, అత్తమామలను  నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ ఆనంద పడుతుంటారు.

 ఇంకా అటువంటి పరిస్థితి నాకు లేదు లేండి మా కోడళ్ళు అందరూ చాలా మంచివారు, మంచిగా మమ్ము చూసుకుంటారు తెలుసా   

కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు కొడుకు చేష్టలు  భరించి  బతుకుతారు వారు,   అన్నారు  రావు  గారి భార్య   అవునండి మనకు పిల్లలు పుట్టడం ఒక ఎత్తు వారిని పెంచి పెద్దచేసి వారిచేత మనం  మాటలు పడటం తప్పదు 

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది అని అనుకోవద్దు. 

ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును వాళ్ళే మీ కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును. ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్యాకుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు. లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు.

అందుకనే నేను జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్యవద్దు. ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏదిచేస్తే దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి అనుభవంలో కి తెస్తుంది.

మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్యబడతాయి.  ఒకవేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి. (అనగా పాప పుణ్యాలు)

కొద్దిగా ఆలోచించండి " మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు, మళ్లీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు..? ఇప్పటివరకు పొయినవాళ్లు ఎంత బంగారం, వెండి పట్టుకుపోయారు..? 
మీరు పోయె ముందు మీ బ్యాంకులో ఉన్న నగా, నట్రా, డబ్బు మూలుగుతుందో అది పూర్తిగా పనికిరాని సంపాదన కాదా..? 

మీరు వేదాంతం చెపుతున్నట్లున్నారు తెలిసినవే మరలా చెప్పకండి, మంచి చేసిన వారి గురించి చెప్పండి  

ఒకవేళ మీ మీ సంతానం సమర్ధులైతే మీరు వదిలిన డబ్బు దస్కం వాళ్లకు అనవసర వస్తువు కాదా..? వాటి అవసరం వాళ్లకు లేదు కదా..?

ఒక వేళ వాళ్ళు అసమర్ధులైతే ఎందుకూ కొరగాని వాళ్ళుగా, చేతకాని వాళ్ళుగా అయి.. 
వాళ్ళు సదరు డబ్బు, నగానట్రా వాడుకుని కొద్ది రోజుల్లోనే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుని తీరుతారు. ఆ తర్వాతే వాళ్లకు శాంతి లభిస్తుంది.

చూడండి ఎవరు సుహాసిని ఖర్మ వారు అనుభవిస్తారు, మన మధ్య మాటలెందుకండి 

ఏమిటండి కొడుకులేకాదు కూతుర్లుకూడా అలాంటివారే, మొగుళ్లను వెనకేసుకొచ్చి సాధించాలని విశ్వప్రయత్నం చేస్తుంటారు. అబ్బా ఆపండి ఎప్పుడూ ఇదే గోలా , ఇంట్లోనూ వీధిలోనూ . 

మీ మాటల్లో పడి మన ఇల్లు దాటి పోతున్నాం 
అవునండి అన్నయ్యగారు కధలు చెపుతుంటే కాలం ఆలా కరిగి పోతుంది అన్నది రాజు గారి భార్య .  

--((***))--  

No comments:

Post a Comment