Thursday 20 May 2021

ప్రాంజలి ప్రభ ... ప్రజ్ఞకు మార్గాలు (91-110)


ప్రశ్నలు : జవాబులు.... 93 

1. లలితా సహస్రనామం ఏ పురాణం లోనిది?

  బ్రహ్మాండ పురాణం

2. విభావసు, శాశ్వత, పురుష.. లాంటివి ఎవరి పేర్లు?

సూర్య భగవానుడు

 3. కశ్యపుని ఏ భార్యకు అప్సరసలు జన్మించారు?

ముని

4. అంబ ఏ నదిలోపల తపస్సు చేసింది?

యమునానది ఒడ్డున

5. ఛందస్సులలో తాను ఏ ఛందస్సు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు?

గాయత్రి

6. చైతన్య మహాప్రభు అసలు పేరేంటి?

విశ్వంభరుడు

7. శత సహస్ర మహాపద్మములను ఏ సంఖ్యతో పిలుస్తారు?

ఖర్వం

8. అగ్ని దేవుడు మొదట అగ్ని పురాణాన్ని ఏ మహర్షికి చెప్పాడు?

 వశిష్ఠుడు

9. బ్రహ్మ పురాణం ప్రకారం బ్రహ్మ పుత్రులు ఏ లోకంలో ఉంటారు?

 జనలోకం

10. శత స

హస్ర మహావృందములను ఏ సంఖ్యతో పిలుస్తారు?

పద్మం

*****

ప్రశ్నలు...  92

అ. కమ్మగా చెవికి సోకి కంచి కేగినవేవి ?

కథలు


ఆ. పితరుల పిండమే పిట్ట తినును ?

కాకి


ఇ. వెన్నుడు సారధి యెన్నఁగా యెవరికి ?

కిరీటి


ఈ. సింహపు బలమున్న జెట్టి యెవరు ?

కీచకుడు


ఉ. జలముల నింపుగ జమ జేయు పాత్రేది ?

కుండ లేదా కుటము 


ఊ. బాటలు నాలుగెచ్చోట గలియు ?

కూడలి


ఋ. విష్ణువే పేరున వెలసే ద్వాపరమున ?

కృష్ణుడు


ఎ. ఆదిత్య దేవుని కనుకూల మణియేది ?

కెంపు


ఏ. రథమున కెయ్యది రాణ గూర్చు ?

కేతనము


ఐ. అడవులకే రాణి యంపించె  రాముని ?

కైక


ఒ. రాయంచ లెట విహార మొనర్చు ?

కొలను


ఓ. కూయన కూయని కూసెడు పులుగేది ?

 కోయిల


ఔ. చంద్రుడు వెదజల్లు చలువ యెద్ది ?

కౌముది


అం. పద్యరాజమ్మని పదుగురందురు దేని ?

కంద పద్యము


 ఈ ఆంగ్ల పదములకు తెలుగు పదం రాయాలి.  .... 91  

ప్రతి పదం "" ప్ర"" తో మొదలవ్వాలి. 


1.Proposal

2.Reflection

3.Reaction

4.Use 

5.vibrations 

6.Entry

7.world

8.Government 

9.famous 

10.Flood

11.Love 

12.Announcement 

13.Region

14.People 

15.Commendation

16.Trial

17.Journey

18.Flow

19.Talent 

20.Process 

21.Nature 

22.Pledge 

23.Promise 

24.Accident 

25.Delivery 

26.Announcement 

27.LORD

28.Influence 

29.Compound 

30.Bright 

31.Experiment 

32.standards

33.every 

34.gospel 

35.prime 

36.copy

37.peaceful 

38.speech 

39.Replica 

40.Involvement


1.Proposal. ప్రతిపాదన

2.Reflection. ప్రతిబింబం

3.Reaction  ప్రతీకార చర్య

4.Use       ప్రయోజనం

5.vibrations ప్రకంపనలు

6.Entry.  ప్రవేశం

7.world.  ప్రపంచం

8.Government ప్రభుత్వం

9.famous   ప్రసిధ్ధి

10.Flood. ప్రవాహం

11.Love ప్రణయం

12.Announcement ప్రకటన

13.Region.  ప్రదేశం

14.People ప్రజలు

15.Commendation. ప్రశంస

16.Trial.  ప్రయత్నం 

17.Journey.  ప్రయాణం

18.Flow. ప్రవాహం

19.Talent   ప్రతిభ

20.Process   ప్రకారం

21.Nature   ప్రకృతి

22.Pledge   ప్రతిజ్ఞ

23.Promise   ప్రమాణం

24.Accident   ప్రమాదం

25.Delivery   ప్రసవం

26.Announcement  ప్రకటన

27.LORD. ప్రభువు

28.Influence  ప్రభావం

29.Compound ప్రాకారం

30.Bright  ప్రకాశం

31.Experiment  ప్రయోగం

32.standards.  ప్రమాణములు

33.every ప్రతి

34.gospel  ప్రవచనం  లేక  ప్రభువాక్యం

35.prime  ప్రత్యేక

36.copy.  ప్రచురణ

37.peaceful   ప్రశాంతం

38.speech  ప్రసంగం

39.Replica  ప్రతిరూపం

40.Involvement. ప్రమేయం

--(())--


[: ప్రతి  సమాధానం  "" నై  " తో మాత్రమే  ప్రారంభం   .... 92

 కావాలి  .

1)  South West .....

2) దేవుడి కి  సమర్పించేది  

3)   గుణము  

4) మునులు  పూర్వం  ఇక్కడ  ఎక్కువ గా  సంచరించే  వారట  

5) " ఈజిప్ట్  వరప్రసాదిని "  అని దీనికి  పేరు .

6)ప్రతి  మనిషికి  ఇవి  ఉండాలంటారు  .

7) ఇంగ్లీషు   " నిశీది "

8) ఉత్తరాఖండ్  రాష్ట్రంలో  గల వేసవి విడిది  

9) వాతావరణం లో  ఈ వాయువు పరిమాణమే  ఎక్కువటగా  

10) వడ్రంగి, నేత పనిలాంటి  వారికి ఇది ఎక్కువ  అవసరం  

11) నిరాశ  ,నిసృహ  

12) పూర్వో పరాలు   

13)  ఒక ప్రముఖ  బాండ్  

14) కెన్యా  దేశపు రాజధాని  

15) తమిళ నాడు లో  ఒక  పట్టణం  

16) సరోజిని నాయుడు  

17) ఓంటారియో  నది  పై గల జలపాతం  

18) వేసవి కాలం  చెమట పొక్కులు  (  Prickle) రాకుండా వాడుతారు  

19) అబ్బో  ఈ దారం  బహు గట్టి  

20).ఈ మధ్య ఆడవాళ్ళు  ..... మరిచి పోయి  ఇవే  వాడు తున్నారు  .

21 ) పది వరకు  ఆంగ్లం లో లెక్క పెట్టండి, దొరుకుతుంది  

22) శ్రీ విష్ణు సహస్ర నామం లో  ఒకపేరు  ( అబ్బో సంఖ్య చెప్పను) 

23 ) ఒక ఆంగ్ల పదం  , శ్రీ మతి ని గుర్తు తెచ్చుకోండి  .

24) ఒక దేశపు ఎల్లలు వర్ణించడాన్ని  ...అంటారు 

        🤔🤔🤔

[ 1.నైరుతి

2.నైవేద్యం

3.నైజం 

4.నైమిశారణ్యం

5.నైల్

6.నైతికత

7.నైట్

8.నైనిటాల్ 

9.నైట్రోజన్

10.నైపుణ్యం 

11.నైరాశ్యం 

12.నైత్యం 

13.నైకి 

14.నై రోబి

15.నైవేలి 

16.నైటింగేల్

17.నైయాగర 

18.నై సీల్

19.నై లోన్

20.నైటీలు 

21.నైన్

22.నైక మాయో 

23.నైఫ్ 

24.నైసర్గిక

*******

క్రింది ఖాళీలను మూడక్షరాల పదాలతో పూరించండి.

ప్రతి పదము టి తో పూర్తవ్వాలి.  .... 93


1.ఏనుగును నియంత్రించేవాడు——.

2.చలినుండి కాపాడే వస్త్రం——.

3.పాండవులలో ఒకరినిఇలా కూడా పిలుస్తారు——.

4.రాగి,జొన్నలతో చేసే ఒక వంటకం——.

5.కాళహస్తీశ్వర శతకాన్ని వ్రాసిన కవి——.

6.పాతకాలం నటులు శివరాం ఇలా ప్రసిద్ధులు——.

7.పూర్వకాలం చలికాలం వెచ్చదనం కోసం దీన్ని వాడేవారు——.

8.ఈనిద్ర పనికి రాదంటారు——.

9.మోసగాడు——.

10.నేటి బాలలే——పౌరులు.

11.కనుబొమల మధ్యభాగాన్ని ఇలా అంటారు——.

12.పురాణాలను కొందరు ఇలా కూడాఅంటారు——.

13.——రంగ రంగా,మాయన్న కస్తూరి రంగ రంగా.

14.అంకెల్లో ప్రథమం——.

15.వెలుపటికి వ్యతిరేకం——.

16.వైశ్యులను ఇలా కూడా పిలుస్తారు——.

17.తిమిరం అంటే——.

18.——బ్రతుకు నాటకము అన్నాడొక కవి——.

19.సంవత్సరం పొడువునా దొరికే పండు——.

20.ఇంత మంది దేవతలుంటారని ప్రతీతి——.

21.వాక్పటిమను ఇలా కూడా అంటారు——.


) మావటి (2) దుప్పటి (3) కిరీటి (4) సంకటి (5) దూర్జటి (6) పెకేటి (7) కుంపటి (8) పగటి (9) కపటి (10) రేపటి (11) బృగుటి (12) పుక్కిటి (13) కావేటి (14) ఒకటి (15) లోపటి (16) కోమటి (17) చీకటి (18).   (19) అరటి (20) ముక్కోటి (21) వాగ్ధాటి

PUZZLE TIME   .... 94

Fill in the blanks with *parts of the body* to complete the following phrases...

for eg.  _______ bowl will be 'finger' bowl

1. ________ beans

2. ________ biting finish

3. ________ the line

4. ________ opener

5. ________ dive

6. ________ twister

7. Water ________ nut

8. ________ watch

9. Cut _____ competition

10. Bottle _______

11. Stiff upper_______

12. _______ dancer

13. _______ stool

14. _______ leather

15. _______ chair

16. _______ room

17. ______ & ______ above d others

18. _______some

19. Shake a _____

20. Aqua _____

Shoot buddies. ..😄


1. Kidney, 2. Nail. 3. Toe, 4. eye, 5.  Nose, 6. Tongue, 7.Water, 8. Wrist, 9.  Thought  10. Neck, 

11. Lip, 12. Belly 13. Foot 14. Skin, 15. Arm. 16 Leg. 17. Head and Shoulders 18. Hand 19. Leg., 20.

****

: మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి ..... 95

ఉదాహరణకు:  - - లీ, సిసిలీ

1. ➖➖యి

2. ➖➖లు

3. ➖➖న

4. ➖➖త

5. ➖➖జు

6.➖➖ రం

7. ➖➖న

8. ➖➖ధ

9. ➖➖గం

10. ➖➖యి

11. ➖➖లు

12.➖➖ కారం

13. ➖➖త్సుడు

14. ➖➖ఆట

15. ➖➖ని

16. ➖➖ద్రి

17. ➖➖ట

18.➖➖పు

19. ➖➖లు

20. ➖➖మంత్రం

21. ➖➖బసవన్న

22. ➖➖పట్టు

23.➖➖త

24.➖➖నం

*****

 1బాబాయి

2పాపాలు/కాకాలు

3లలన

4మమత

5రారాజు

6శిశిరం

7లోలోన/పై పై న

8 వివిధ

9..తతగం

10పాపాయి

11జేజేలు/బాబాలు

12మమకారం

13యుయుత్సుడు

14ఖోఖోఆట

15కాకాని

16పాపాద్రి

17మామాట

18దాదాపు

19దాదాలు

20తూతూమంత్రం

21డూడూబసవన్న

22కాకాపట్టు

23మమత

24గగనం

******

morning dear friends   ..... 96

Translate into Telugu Proverbs using emojis meaning also in Telugu.


1. In first  🦢 creeper

2. One cotton yarn for 🌙

3. Why step in mud...why wash 🦵

4. King's 💵 stone' s 🥛

5. Teaching cough to 👴🏻

6. 🍞 breaks fall in ghee

7. 🦙 Colored 🐈

8.💅  lamp ⛰️ light

9. Stone in  👡....🐝in 👂

10. 3 🦵🦵🦵 for  🐰

11. How much 🌳 that air

12. Neighbour' s sour 🥗 tastes

13. Eating in 🏠 counting beams

14. Village marriage 👩‍❤️‍👨.🐶🐶🐶🐶' s busy

15. For begger...66 🍛s

16. Forest boiling 🌙

17. 😋 No taste...😴.  No comfort.

18. 👵🏻👴🏻 ' s talk  🍚 pack

 19. For 🏠 ...🪔🥻

20. 🥚 Comes ...teasing 


ఆదిలో హంస పాదు 

చంద్రునికో నూలుపోగు 

అడుసు తొక్కనేల కాలు కడుగనేల 

రాజుల సొమ్ము రాళ్ళ పాలు 

తాతకు దగ్గులు నేర్పడము 

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు 

మేక వన్నె పులి 

గోరంత దీపం కొండంత వెలుగు 

చెప్పులో రాయి చెవిలో జోరీగ 

తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు 

ఎంత చెట్టుకి అంతే గాలి 

పొరుగింటి పుల్ల కూర రుచి 

తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం 

ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి 

అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు 

అడవి కాచిన వెన్నెల 

పెద్దల మాట చద్ది మూట 

ఇంటికి దీపం ఇల్లాలు 

గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు


--(())--

[01/06, 18:31 Below are 22 jumbled words. Arrange them to form meaningful words all ending in ‘x' .... 97


1. HTNXAAR

2. ERXLFE

3. MCXOPEL

4. FNUIXL

5. ARXLYN

6. PXELUD

7. PNEXAIPD

8. NIACMITLXA

9. EHOPXIN

10. ARALPLXA

11. FRCUIXIC

12. EUMXLITLP

13. MFXLOUM

14. OVNEXC

15. NPXYHRA

16. EXTBHCATOR

17. HXODROTO

18. QINEUXO

19. NPXSYH

20. LXPPREE

21. AXYNST

22. IXCA 

*"""*

2.Reflex

3.Complex

4.Finlux

5.Larynx

6.Duplex

7.Appendix

9.Phoenix

10.Parallax

11.Crucifix

12.Multiplex

14.Convex

15.Pharynx

17.Orthodox

18.Equinox

19.Sphynx

20.Perplex

21.Syntax

****************************

భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి   .... 98


1. భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

14. “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

28. భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

43. అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

44. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

46. ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

48. మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

50. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.


51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

62. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

64. భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

77. ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

105. తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

107. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

వేదవ్యాసుడు.


నా రచనలు... సేకరణలు  .... 99

*🌷గణిత పదనిసలు....*

⭕6 బయట 7 స్తూ కూర్చోకు!

⭕లెక్కలు అర్ధం కాకుంటే 7 పొస్తుంది.

⭕100న రావు ఎలా ఉన్నాడు??

⭕గురువులకు 100 నం చేద్దాం!

⭕1/2 టి కాయ బజ్జీలు బాగా రుచిగా ఉంటాయి.

⭕ఈ రోజు మా కూర 1/2 టి కాయ వేపుడు.

 ⭕కూరలో కారం తక్కువ 1000.

⭕10 కాలాల పాటు చల్లగా ఉండాలి.

⭕చెడువ్యసనాలతో ఆయువు 3 తుంది.

⭕పెళ్లికూతురు 100000 ణంగా ఉంది.

⭕పై 1/2 లో 1/4 రం ఉన్నది.


 *నవ్వండి సరదాగా... ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలలో.....*  100

😃😀😃😀😝😍


1. మీ  సంగతి ఏమిటి? 

   మీసం  గతి ఏమిటి? 

2. గురూజీ  వనం  బాగుందా? 

  గురూ  జీవనం బాగుందా?

3. ఆమే  కమలమును తొక్కింది. 

 ఆ  మేక  మలమును తొక్కింది. 

4. మాట  మాట పెరిగింది. 

   మా  టమాట పెరిగింది. 

5. ఆహారం చూడ ఎంత బాగుందో!

 ఆ హారం చూడ ఎంత బాగుందో! 

6. మాతా తమరు నిమిషంలో చేరారు. 

    మా తాత మరునిమిషంలో చేరారు. 

7. నావ లతలపై పడింది. 

  నా వల తలపై పడింది. 

8. ఆమె కవితలతో జీవనం చేయును.

  ఆమె కవి తలతో జీవనం చేయును. 

9. మాతా  మరను పట్టుకో. 

  మా తామరను పట్టుకో.


 *ఇదే మన తెలుగు భాష  లోనే సాద్యం.👌👌*

[29/05, 09:21] Mallapragada Ramakrishna: *అమ్మ అబద్దాలు* 😊


వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిఝంగా నిజం అండి... 101

అవునండి మనకి అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడూ నిజమే చెప్పాలి అని హరిశ్చంద్రుడు , గాంధీగారి కధలు చెప్పిన అమ్మ, మన చిన్నప్పటి నుండి మనకెన్ని అబద్ధాలు చెప్పిందో తెలుసా? 


అందగాడిని గాకున్నా ......              *చందమామనంటుంది*

కంచం నిండా తిన్నా .......               *కొంచెమే కదా అంటుంది*

అల్లరెంతగా చేసినా .......          *పిల్లలింతేనని చెబుతుంది*

అత్తెసరున పాసయినా .......        *కొత్త సిలబసే కారణమంటుంది*


ఆటలు పాటలు రాకుంటే ......           *వాటికి విలువలేదంటుంది*

ఇంత కప్పు నే గెలిస్తే మాత్రం .......     *ఎంతో గొప్పని అంటుంది*

తప్పులెన్ని నే జేసినా ........           *ఒప్పులుగనే లెక్కలేస్తుంది*

అప్పుడప్పుడూ అబద్దమాడినా .......   *చెప్పనే చెప్పదు నాన్నకైనా*


పాతికేళ్ళ వయసున్నా ........        *పసివాడిగానే చూస్తుంది*

కష్టపడి వాళ్ళు సంపాదించినా .......     *అదృష్టం నాదంటుంది*

మనం తల్లి తండ్రులo అయ్యాకే  తెలిసేది .......      *అమ్మ అబద్ధాలు*

ఆమె మమతల నుంచి .......          *రాలిన పూలరెక్కలం*


ఆమె వాత్సల్యంతో ఒలికించిన .......    *తేనె చుక్క లం*

ఏమిచ్చి ఆ ఋణం తీర్చుకోగలం  .... ప్రేమతో అమ్మని చూసుకోవడం తప్ప..


సేకరణ 🙏  102

✍🏻మూడింటినీ నిలువుగానూ, అడ్డంగానూ చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!✍🏻


స మ త

మ జ్జి గ

త గ ము


కం చ ము

చ క్కె ర

ము ర ళి


క్షీ ర ము

ర వ్వ లు

ము లు కు


కా ను పు

ను వ్వు లు

పు లు లు


కా ర ము

ర గ డ

ము డ త


స మ త

మ ర ల

త ల పు


త మ కం

మ ర్యా ద

కం ద కం


పొ ల ము

ల లి త

ము త క


ధ న ము

న వ్య త

ము త క


వ ర స

ర వి క

స క లం


హి మ జ

మ న ము

జ ము న


క వి త

వి న ల

త ల క


కో వె ల

వె న్నె ల

ల ల న


మ న సు

న య నం

సు నం ద


ది న ము

న గ రి

ము రి కి


టో క రా

క వ్వ ము

రా ము డు


చ దు వు

దు ర ద

వు ద కం


ప్ర వే శం

వే ది క

శం క రం 


*తెలుగు భాష గొప్పదనం చూశారా...!*


*శుభరాత్రి*  ... 103

 ఓంకారం: తెలుగు సాహిత్య పద ప్రహేళిక

*************************

సమాధానాలు వరుసగా 'గ ' గుణింతంలో వుంటాయి. 

1.చిలకమర్తి వారి రచన

2.పాలగుమ్మి వారి ప్రసిద్ధ కథ

3.జాషువా రచనల్లో ఇదొకటి

4.తిరుపతి కవుల వివాద 

    సాహిత్య రచన

5.బృహత్కథకు కర్త ఎవరు

6.కుబ్జుడు 

7.తెలుగు తొలి స్త్రీల 

   పత్రికలలో ఇదొకటి.

8.పండ్ల సమూహాన్ని ఇలాగూ

    అంటారు.

9.ఇల్లాలు.. ఇలా అనవచ్చు

10. పర్వత ధాతువిశేషము

11.'కళ్ళు' -నాటకరచయిత 

     ఇంటిపేరు

12.'అసమర్థుని జీవనయాత్ర'-

     రచయిత పేరు.

13.శ్రీనాథుడు పగులగొట్టించిన

     కంచుఢక్క ఎవరిది?

14.పుక్కిలింత.

*********************

ప్రయత్నించండి.

 1.గణపతి

2.

3.గబ్బిలం

4.గుంటూరు సీమ.....గీరతం

5.గుణాఢ్యుడు.

6.గుజ్జారి.

7.

8.గు త్తు లు

9.గృహిణి

10.గిరి.

11.

12.

13.గౌడ  డిండి మ భ ట్టు.

14.గండూ షము


94.. ఇవి మీకు తెలుసా ?  104
• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ తెలియచేయండి...
ఈ విషయాన్ని మీరు కూడా షేర్ చేయండి ..

--(())--

95..అంశము: కవులు రచనలు   105
   
సరియైన సమాధానం గుర్తించండి

1. "రాజు మరణించె నొకతార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగన మెక్కె"
ఈ పద్యము ఏ కావ్య ఖండిక లోనిది
అ) పిరదౌసి ఆ) నా కథ ఇ) కొత్త లోకం

2. పానశాల  కావ్యమును రచించిన కవి
(అ) రామస్వామి (ఆ) రామ్మూర్తి (ఇ) రామిరెడ్డి

3. విశ్వనాథ వారి ఏకవీర నవలను మలయాళంలోకి అనువదించిన కవి
(అ) నారాయణ శాస్త్రి (ఆ) నారాయణ శర్మ (ఇ) నారాయణాచార్యులు

4. బారిష్టర్ పార్వతీశం నవల రచయిత
(అ) లక్ష్మీ నరసింహం (ఆ) నరసింహ శాస్త్రి  (ఇ) లక్ష్మీ నారాయణ

5. ప్రపంచ పదులతో సంబంధం ఉన్న కవి ఎవరు?
(అ) జాషువా (ఆ) సినారె (ఇ) ఆరుద్ర

6. శృంగార వీధి పద్య కావ్యం రచించిన కవి       
(అ) విశ్వనాథ (ఆ) శ్రీనాథుడు (ఇ) దేవులపల్లి

7. ఆంధ్ర సాహిత్య చరిత్ర గ్రంథ రచయిత b 
(అ) ద్వా.నా శాస్త్రి (ఆ) పింగళి లక్ష్మీకాంతం (ఇ) ఆరుద్ర

8. కన్యక రచన ఎవరిది?
(అ) పాపయ్య శాస్త్రి (ఆ) కందుకూరి (ఇ) గురజాడ

9. రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిదేది? a 
(అ) తృణకంకణము (ఆ)రమ్యలోకము (ఇ) స్నేహలోకము

10. సత్యహరిశ్చంద్రీయము నాటక రచయిత ఎవరు? a 
(అ) బలిజేపల్లి లక్ష్మీకాంతం  (ఆ) బండారు రామారావు (ఇ) డి వి సుబ్బారావు..

--(())--

96..స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం.. 106

రామునికి       —       సీత
కృష్ణునికి        —       రాధ 
ఈశునకు      —    ఈశ్వరి
మంత్రపఠనంలో —   గాయత్రి 
గ్రంధ పఠనంలో    —      గీత
దేవుని యెదుట
     వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన
     వీరికి తోడుగా  శ్రద్ధ

మన దినచర్యలో భాగంగా
ఉదయానికే—ఉష, అరుణ
సాయింత్రం     —   సంధ్య
చీకటైతే           —   జ్యోతి, దీప
పడకలో -            మేనక 
పడుకున్నాక    —   స్వప్న

చూచేటప్పుడు— నయన
వినేటప్పుడు  —   శ్రావణి
మాట్లాడునప్పుడు—వాణి
ఓరిమిలో        -వసుధ
వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు—  హంస
నవ్వుచున్నప్పుడు  —  హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే—  సుందరి
చేసేపనికి  -స్పూర్తి
పని చేయడానికి    —  స్పందన
మంచి పనికి —  పవిత్ర
ఇష్టంగాచేసే పనికి  —  ప్రీతి
నీరు త్రాగునపుడు —  గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు —  హిమజ
సినిమా చూస్తున్నప్పుడు —  చిత్ర
అబద్ధ మాడునపుడు —  కల్పన
నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల
ఆలోచనలప్పుడు  —  ఊహా, భావన
చదువుచున్నప్పుడు  —  సరస్వతి
వ్యాపారంలో      —   ప్రతిభ , ప్రగతి
సంతోషంలో—   సంతోషి
కోపంలో       —   భైరవి
ఆటలాడునప్పుడు—  ఆనంది 
గెలుపు కోసం— జయ, విజయ
గెలిచిన తర్వాత  —   కీర్తి
     
      సరిగమలు నేర్చునపుడు  —  సంగీత
      పాటలు పాడునపుడు  —  శృతి, కోకిల
      తాళం వేయునపుడు  —   లయ
      
సాహిత్య గోష్టిలో    —   కవిత 
నగరాన్ని కాపాడుతూ  —   ప్రకృతి

జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో  —   విద్య
సంపాదనప్పుడు —   లక్ష్మి
చేసేవృత్తిలో        —   ప్రేరణ,
పని చేసి వచ్చాక —  శాంతి
చిన్నతనంలో — లాలన
మధ్యవయస్సులో -మాధురి
ముసలితనంలో- కరుణ, మమత
జీవితాంతం మనతో  —  “జీవిత”.🙏 

బాగుంది కదా!మన తెలుగుభాష యొక్క గొప్పతనం.

🌹💐🙏🙏

107... పుర్యష్టకము :-యిా దేహమే పుర్యష్టకము యంటున్నాం.వొక పురానికి 8 దిక్కులున్నట్లు యిా దేహమునందు 8 తత్త్వములు నిర్వచించబడుచున్నాయి. 

 1.జ్ఞానేంద్రియ పంచకము: చెవులు - చర్మము-కళ్ళు-నాలుక-ముక్కు వాటి కార్యక్రమములగు......శబ్దము....స్పర్శ..రుాపం రసములు....గంధములు 

 2.కర్మేంద్రియ పంచకము:-వాక్కు.. కాళ్ళు...చేతులు....పాయువు....వుపస్థ. 

 3.వాయు పంచకము:-ప్రాణవాయువు, యపానవాయువు, వ్యానవాయువు, వుదానవాయువు, సమానవాయువు 

4.భుాతపంచకము:-భుామి,వాయువు, యగ్ని, జలము , ఆకాశము 

5.యంతకరణచతుష్టయము:-మనస్సు, బుధ్ధి, చిత్తము, యహంకారము

 .6.యవిద్య:- ఆత్మదృష్టి, లేక ఆత్మ స్వభావము నుండి విక్ఛేపము. బాహ్యాపాదార్థిక దృష్టి యెుక్క ఆశ్రయము .

7. కామము:-మరింకేదో కావాలి యను కోరుకొను ప్రవృత్తి.

 8. కర్మము:- క్రియావ్యాసంగము యిా పుర్యష్టకము సర్వప్రాణుల హృదయమునందు వొక తుమ్మెదను పోలి వుంటుంది.

--((***))--...... .... 71


108. Shared from my school group: There is a fruit in each sentence. Just need to identify the fruit from the given statement:

Example: 

Question : Did you see a man go by? 

Answer : *(Mango)*

1. ​He found his home lonely after his dog’s death.

2.​ One dare not rob an anaconda of its prey. 

3.​ The crook made his escape armed with a gem. 

4. ​She told her uncle money was what she needed more. 

5.​ If I go out now, I shall miss my cousin. 

6. ​Either courage or anger made him move swiftly. 

7.​ The beggar held out his cap pleading for money. 

8.​ Matters regarding rape should be dealt differently. 

9. ​The English teacher Ryan teaches French too.

10.​ He saw his papa yawning at work.

11.​ He had kept on his lap lumpsum of money.

12.​ Are classes for Telugu available in this city? 

13.​ It is easy to shape a child rather than a man.  

14. ​He is an extremely cheesy guy. 

15.​ Can I wear a khaki with a black shirt? 


Please try.....👍🏻

Very interesting..food for brain..the letters are all found next to each other..No need to jump or skip anywhere or separate in the sentence.

Anseers

1. Melon

2. Banana

3. Pear

4. Lemon

5. Fig

6. Orange

7. Apple

8. Grapes

9. Cherry

10. Papaya 

11. Plum

12. Guava

13. Peach

14. Lychee

15. Kiwi


--(())--

109

 హలో మీరు చదివిన మన మాతృ భాష నీ మార్చి పోకూడదు అని మళ్లీ మీకు మెదడు కి మేత

ఈ ఆధారాలను బట్టి జవాబులు ఇవ్వండి. ప్రతీ జవాబు రెండు అక్షరాలు మాత్రమే. అన్ని జవాబులలో రెండో అక్షరం"లి" ఉండాలి.

 1 క్రూర మ్రుగం(పులి)

 2 భార్య(ఆలి)

 3 హిందీలో మాత్ర(గోలి)

 4 పెద్ద హోటళ్లలో ప్లేట్ మీల్స్(తాలి)

 5 ఇండోనేషియా లో హిందూ

     దేవాలయాల ద్వీపం(బాలి)

 6 పెనుగొండలో జమీందారుల

     ఇంటి పేరు.

  7 కరుణా దయ లాంటిది(జాలి)

  8 రామాయణం లో తార భర్త(వాలి)

  9 ముష్టి కోసం భుజానికి

      వేసుకున్న సంచి(జోలి)

10 తోట సంరక్షకుడు(మాలి)

11 శిల్పి/వడ్రంగి వద్ద ఉండే

      ఓ పనిముట్టు(ఉలి)

12 శ్రామికుని భత్యం(కూలి)

13 గ్రామ దేవతల కు అర్పణ(బలి)

14 వేళాకోళం/అపహాస్యం.. గోళి

15 భాగ్యనగరం లో _ _ గూడ

      ఓ ప్రముఖ బస్ స్టాప్(గౌలి)

16 ప గో జిల్లా లో అత్తిలి 

      వద్ద ఓ గ్రామం.(పాలి)

17 పాలు కాచటం కోసం 

      కాల్చే పిడకల దొంతర 

18 పర్వత శ్రేణుల లో యాత్రీ

      కుల ను కూర్చోపెట్టి 

      మోసుకుంటూ తీసుకు

      వెళ్ళే ప్రయాణసాధనం(డోలి)

 19 తూ గో జిల్లా లోని ఓ

      వైష్ణవ పుణ్యక్షేత్రం(రాలి)

 20 కంటికి కనపడదు అది

       మన జీవన ఆధారం(గాలి)

21 మొదటి(తొలి)

22 రెండవది.(మలి)


--(())--


🙄 మెదడు కి చిన్న మేత   ..... 110

***********************

👇 కింది ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి.  ప్రతి పదం "" ఉ "" తో మొదలవ్వాలి .

***********************

1.salt..... 

2.free...... 

3.steel

4.swing

5. potato

6. Idea

7. relief

8. Teacher... 

9.  Both

10. Fasting 

11. Help 

12. Speech

13. Wool

14. Ring...... 

15. Lump

16. Squirrel ...

17. Anxiety  ... 

18. Temperature ... 

19. Horse gram

20. Joint

21. Satellite 

22. Neglect 

23. Tsunami 

24. Escape 

25. Example

26. North 

27. Opinion 

28. Job

29. Rise

30. Production 

31. Water

32. Wash

33. park

34. Letter

35. Thunder 

36. Asthma 

37. Episode  
38 Movement 
39. Send off    
40. Stomach 

--(())--
🙄 మెదడు కి చిన్న మేత
*********
👇 కింది ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి.  ప్రతి పదం "" ఉ "" తో మొదలవ్వాలి .
*********
1.salt        ఉప్పు 
2.free        ఉచితం 
3.steel       ఉక్కు 
4.swing     ఉయ్యాల 
5. potato    ఉర్లగెడ్డ 
6. Idea        ఉపాయం 
7. relief       ఉపశాంతి 
 Teacherఉపాధ్యాయుడు 
9.  Both       ఉభయులు 
10. Fasting  ఉపవాసం 
11. Help        ఉపకారం 
12. Speech   ఉపన్యాసం 
13. Wool       ఉన్ని 
14. Ring         ఉంగరం 
15. Lump       ఉండ 
16. Squirrel    ఉడుత 
17. Anxiety   ఉత్సకత 
18. Temperature ఉష్ణం 
 Horse gram ఉలవలు 
20. Joint        ఉమ్మడి 
21. Satellite    ఉపగ్రహం 
22. Neglect   ఉపేక్ష 
23. Tsunami ఉప్పెన 
24. Escape  ఉడాయించు 
25. Example ఉదాహరణ 
26. North ఉత్తరం 
27. Opinion ఉద్దేశం 
28. Job   ఉద్యోగం 
29.Rise    ఉదయించు 
30. Production ఉత్పత్తి 
31. Water ఉదకం 
32. Wash ఉతుకు 
33. park ఉద్యానవనం 
34. Letter ఉత్తరం 
35. Thunder ఉరుము 
36. Asthma ఉబ్బసము 
37. Episode  ఉదంతం 
38 Movement ఉద్యమం 
39. Send off   ఉద్వాసన 
40. Stomach ఉదరం

No comments:

Post a Comment