Sunday 9 May 2021

విశ్వంలో ... విజ్ఞాన దీపం కధలు


విశ్వంలో ... వ్యామొహం (రోజువారి కథ )

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (ఇది కధ కాదు అనుభవ సారం ) 

          సూర్యోదయం ఉద్యోగ ధర్మంగా జగతిలో సంచారిస్తూ ఉన్న వారు గుర్తించారా లేదని అను కోకుండా తనగమ్యం ఏమిటో నిర్ధారణ చేసుకొని తన ప్రవర్తన మార కుండా ఊపిరిలో ఊపిరిగా, ఉదకంలో ఉదకంగా, విశ్వవ్యాప్తిగా ఉపకారిగా.... ... .... 

కంటిలో తెలుపు నలుపు ఏకమై, కనురెప్పలు ధగ ధగ మెరుపులు చూసి, చూడనట్లుగా. నెత్తిమీద ఎర్ర ఎర్రని పొరలు కమ్ముకొస్తూ, కాలు కింద ధూళిపొర పొరలుగా విస్తరించి అద్దముపై సేదతీచుకొనగా, కిరణ ప్రతిబింబాలు జిలుగు జిలుగుగా, కదలసాగె .... ...

అంబరవీధులనుంచి కొండ చెరియలు చేరి, వృక్షమాలికల మధ్య నలిగి, నే నొస్తున్న నాకు దారి ఇవ్వండి అంటూ సముద్ర మట్టంపై విస్తరించి కెరటాలమధ్య నలిగి గుర్తించే విధముగా థళ థళ మెరుపుల్లా నావికుల దిక్సూచిగా సంద్రము మీద కిరణాలు  కదలసాగె .... ...

పాలమీగడ తరగల్లా, మంచు తుషార బిందువుల్లా,  పువ్వుల నుండి విస్తరించే పొప్పొడి  రేణువుల్లా, చీకటి తరిమే మిణుగురు పురుగుల్లా, విత్తుల పొత్తి కడుపులో చెట్ల నెత్తురు నింపుకొని కొత్త వెలుగుల్లా, పువ్వునుండి రాలిన గులాబీ రేకులు గాలితో సమానము గా ఉనికి  విధముగా కథలు లాగా .... ..... ...            

అంబరం నుండి కాళ్ళు విఱిగి నేల మీద పడ్డ మేఘాలలో కరిగిన చినుకులు, పుడమిని చేరే పుడమి తల్లి పురిటి నెప్పుల్లా,  హాహాకారాలు, అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలా, వళ్ళు విరుచుకొని విస్తరించే పువ్వులా, డొక్కలు ఎండిన వాడికి నీటిచుక్కలు బతికిచ్చినట్లు పుడమి ఆవిరి కొంత తగ్గే ..... .... ...      

మధురిమలు (పుడమితల్లి పులకరింతలు ఇలా వున్నాయి ) 

మల్లె పువ్వు అడిగిందే - కొంత సౌరభమున్నదా

మందారం అడిగిందే  - కొంత మాధుర్యమున్నదా 


గులాబీ అడిగిందే   . కొంత  సోయగమున్నదా 

చామంతీ కలగందే - కొంత లావణ్య ముగదా 


మలయా నిలం ఉరికింది  - కెరటాలలొ గమ్మత్త0ది 

కోయిల పాట పాడింది  - గొంతులొ గాంధర్వముంది  

 

పున్నమి వెన్నెల విస్తరి - పులకింత గిలిగింత సిరి 

కిరణాలలోను ఊపిరి  - ప్రకృతిలోన హృదయేస్వరి 

                                               
                                                  ఇలా సాగుతున్నది కిరణాల వెల్లువా .... (2)

విశ్వంలో ... వ్యామొహం (రోజువారి కథ (2)

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (ఇది కధ కాదు అనుభవ సారం ) 


      మేఘసందేశాలు కదులుతున్నాయి, రసవత్తరమైన సంఘటనలు జరుగుతున్నాయి, ఉజ్వలమైన కాంతి ఒకవైపు ప్రజ్వలిస్తున్నది, కడలి కెరటాలు ఎగసి పడుతూ గట్టు దాటాల్ని ఉబలాట పెరిగింది. చూపులు సోపానాలు కదిలి మన మనుగడ ప్రశ్నల పరంపరంగా ఉషస్సులేంతగా ఉద్వేగపడ్డాయో, కాలచక్రము తిరుగుతూనే ఉంటుంది. ఋతువులు మార్చుకున్నా హృదయవేదన, వాదన, సమర్ధన, ఉషోదయ కిరణాలకు మేఘాలు కమ్ముకున్నా విశ్రాంతిగా మేఘాలు కదిలాక విశ్వవ్యాప్త విదితమగును ప్రజ్వలించే కిరణాలు.

విశ్వాంతరాళంలోని మనకు తెలిసిన లేక తెలియని సమస్త చరాచర జీవుల సుఖానుభవం లేక దుఃఖానుభవం ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ "సరాసరి"  లెక్కన అనుభవించటం జరుగుతుంది.

 అందువల్ల నీ సుఖం, నీ శాంతి నీ ఒక్కని స్థితిపై ఆధారపడి లేదు.  జగత్తు యొక్క మొత్తపు సుఖం మీద ఆధారపడి ఉంది.  దు:ఖమనేది, నాకు చేతకాదు, రాదు, అనే బలహీనత పలుకులు, ఈ, ఏ, స్థితిలోను  నీలో రానీయకు.   


మనుషులు తలలెత్తి తిరిగేట్లు  
మనసు పంచి బతుకు 
మనసుని నిర్భయంగా ఉంచు 
తనువు దారి చూపు 
జ్ఞానం విరివిగా వెలువరించు  
మౌన మిధ్య సలుపు  
సంసారపు నడక గోడలే 

అలసట నెరగని శ్రమజీవి 
పలుకుల నిజములుగ 
మేల్కొలుపును దేశ గతి నంత    
కాలమాయ ఇదియు 
స్వేచ్ఛా స్వర్గానికి దారిగా 
స్వచ్ఛ తనము చూపు 
విడిపోదు ఎపుడు ప్రపంచము 

సత్యాంతరాళంలోంచి పలుకు 
నిత్య సత్య మొవ్వు  
వ్యత్సాస్యమేమియు చూపకు 
మతియు తెలిపి చదువు  
ఆచారపుటెడారి మనసునే 
ఆచి తూచి నడువు 
మనసు నిరంతరం వికసించె 

--(())--


చూడమన సూర్య వెలుగే 
సమయ మంతయును సమాన కళలే, 
వినయ రూపమున, పొందు పరచే, 
విషయవాంఛలను, సమ్మతముగా, 
తనువు వేడిగను పెంచుటయు, 
సాను భవంతమును తెల్పు చునె. 

                                                                    ఇలా సాగుతున్నది కిరణాల వెల్లువా .... (3)


విశ్వంలో... విజ్ఞాన దీపం ..రోజువారి కధ..3
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ...ప్రాంజలి ప్రభ

జరుగుతున్నదంతా - దైవే చ్ఛ.
మనగడన్నదంతా - ప్రేమే చ్ఛ
పలుకులను తిని మారే - వాదే చ్ఛ
కరుగుతున్నదంతా - పాపే చ్ఛ

 ఇలా జరగాలి, అలా జరగాలి అని అనుకుని ప్రయత్నించడం - పురుష ప్రయత్నం.
 పురుష ప్రయత్నం, దైవే చ్ఛ రెండు ఒక్కోసారి కలిగుట వల్లనే మనస్సంతా ప్రసాంత త
 అవుతుంది. అప్పుడు సంతోషం కలుగుతుంది, అలా కానప్పుడు దుఃఖం కలుగుతుంది. దానికి కారణాలు అనేకం అవి తెలుసుకొనే లోపే వయసు కరిగి పోతుంది.
అందుకే ఏ సమయానికి ఏది సంభవిస్తే దానిని అనుభవించడానికి సిద్ధపడడమే - శరణాగతి.

ఆనందం.... పరమానందం.... బ్రహ్మానందం...
 శరణాగతి అంటే కర్మరాహిత్యం కాదు,  కర్తృత్వరాహిత్యం.
 జన్మ సార్థకం అవ్వాలంటే ముందు నిన్ను నీవు నిమ్ము, నీలో ఒకదైవమున్నదని నిమ్ము, నిన్ను నడిపించేది ప్రేమే అని తెలుసుకో, ప్రేమకు మూలం ప్రకృతి, పుడమి, గాలి, అగ్ని, జ్నానం అని తెలుసుకో, తెలుసుకున్నది నలుగురికి పంచుటే ఆది దైవము లీల అని తెలుసుకో, నీ ప్రయత్నమే కుటుంబానికి ధనం చేకూరుస్తూ ఉంటుంది. కోట్ల సంపాదన ఉన్నా తినేది అన్నమే, 

సంపద పెరుగుట విరుగుట కొరకే
ఆశలు పెరిగియు కలుగుట కొరకే
కాలము తెలియక తిరుగుట కొరకే
శాంతిని మరచియు పెరుగుట కొరకే

సార్థకం అయ్యాకే జన్మ పరిపక్వత జరుగుతుంది.
సార్ధకమనగా జీవి నిస్వార్ధంగా, ధర్మంగా, న్యాయంగా, సత్యంగా, దైవికంగా, ప్రేమగా ఉండగలిగితే నే......ఇది కలియుగం కనుక 
అహాన్ని వదిలి ప్రేమను పెంచు
మోహాన్ని వదిలి స్నేహము పేంచు
దాహాన్ని వదిలి డబ్బును పెంచు
మోనాన్ని వదిలి శాంతిని పెంచు
ఏది ఏమైనా శీలం చెడకుండా జీవించడమే జీవితలక్ష్యంగా భావించు.
0

విశ్వంలో ... విజ్ఞాన దీపం ..(4) ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. ‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి.
ధర్మం గా ప్రవర్తించు ఆధర్మమే నిన్ను నీకుటుంబాన్ని నీదేశాన్ని రక్షిం చెబుతుంది.
ధర్మం అంటే

 ‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించు గాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా ధర్మము గా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు గారు.
ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు.  న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. 
అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు.  

దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు.
ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి. 
‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్‌’’ అని గురువు ఆజ్ఞాపించాడు.
గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. 
ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు. 
రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్లు వారికి దొరికాయి. వాటిని చూడగానే.. ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు.. అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదనుకున్నారు. తూకంరాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు.  

మళ్లీ తన దగ్గరికి చేరిన తూకంరాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు వ్యాపారి. ‘‘నేను వీటిని ఏరులో పారేశాను. మళ్లీ నా దగ్గరికి వచ్చాయి గురువు గారూ’’ అని విన్నవించుకున్నాడు.
 ‘‘నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో.. దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు.  నిజాయతీగా సంపాదించావు కనుకనే.. నీ సొమ్ము మళ్లీ నీ దగ్గరికి చేరింద’’న్నాడు గురువుగారు.

నీవు చేసే పనిలో శాంతి కల్గించు ఆనందాన్ని అనుభవించి అందరికీ నీ సహాయము అందించు.  అదే నీకు గమ్యము, మోక్షము.
శాంతి సంతోషంలాగా వ్యక్తం కాదు. అందుకే శాంతి పొందిన మనసు రహస్యానంద స్వరూపమే అవుతుంది. ఒక్కసారి ఆనందం చవిచూస్తే ఇక అది మనని వదలివెళ్ళదని తెలుస్తుంది. అప్పుడది సదానందంగా నిలిచిపోతుంది. అదే మహానందంగా పరిణమిస్తుంది. అప్పుడు లోకం కూడా ఆనందమయంగానే కనిపిస్తుంది. ఆనందం తనలోనిదేనని అర్థమైన తర్వాత దానికోసం ఈ లోకంలో వెతకాల్సిన పనిలేదని తెలుస్తుంది. అలా తెలుసుకున్న మనసు లోకాతీతమైన ఆనందంలో ఉండిపోతుంది !_
విశ్వంలో విజ్ఞాన మనేది ఆనందం వల్లే ఏర్పడుతుంది. ఈర్ష్యా ద్వేషం ఉంటే విజ్ఞానం ఉన్నా లేనట్టే
--(())--
0

విశ్వంలో ... విజ్ఞాన దీపం ..(5) రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

ఈలోకాన్ని ఎవరు ఉద్దరించలేరని అనుకుంటున్నారు, ఎందరో మహానుభావులు మనదేశ రక్షణకు , దేశప్రజల ఉన్నతికి సహకరించారు అందులో నేనొకణ్ణి  
మన ప్రజలలో కొందరు 

గుణములు పంచని మనసే ల 
తృణము లెక్క యగును
మంచిని గమనించక అరుపే
నీచ తీర కుండు
ధర్మం తప్పి నడువు డెందుకు
మర్మ మంత మాయ
కాలాన్ని ప్రశ్నించు టెందుకు

చాతకాని పనులు ఎందుకు
వెతలు పొందు టేల 
మాటతూలి పనులు ఎందుకు
వేట వల్లె మారు
తప్పుని ఒప్పను టెందుకు
ఉప్పు లాగె బతుకె 
ప్రకృతిని ప్రశ్నించు డెందుక

ఆశ పాశము తోను ఎందుకు
పాశ మైన బతుకు
వేష మోసములన్ని ఎందుకు
ఘోష వచ్చి చేరు
ఉన్నభాషను మర్చు టెందుకు
అన్న మాట మరచు
ఈ లోక మాయ బతుకు లోన
--(())--

నేను మనసుని నమ్మినవాణ్ణి, నిస్వార్ధ పరుణ్ణి, నిర్భయుణ్ణి, ధీబలుణ్ణి, తలయెత్తుకు తిరుగువాణ్ణి, నన్నునేను తెలుసుకోవటానికి ప్రయత్నించేవాణ్ణి, హృదయానందం అందించేవాణ్ణి, జ్ఞాన మనే పవనాలు హాయిగా పీల్చే పిచేవాణ్ణి, మాయా మర్మాన్ని చేధించేవాణ్ణి, విజ్ఞన సర్వస్వాన్ని అందరికీ పంచేవాణ్ణి, ధర్మమార్గములో దప్పికంటు లేకుండా శ్రమించేవాణ్ణి, మాటకు కట్టుబడి ప్రవర్తించే 
వాణ్ణి, సంకుచితభవాలు, స్వార్ధపు ఆలోచనలు లేనివాణ్ణి,  సంస్కృతి సంప్రదాయాలు అడవి కాచిన వెన్నెల కాకుండా, మతాలలో ఉన్న నమ్మకాలు వ్యర్థ పరచ కుండా, వంశపారంపర విద్యను మరువకుండా, ఆధునీక విద్యా విధానమును అనుకరిస్తూ,  ఎంతదూరమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, తనగమ్యం కడలి వైపు అనే సాగె నదీమ తల్లిని నమ్మిన వాణ్ణి,  మనసు పెడదారి పట్టకుండా, బంధాలకు చిక్కకుండా, పట్టుదల చెదర కుండా, ఆనంద పదములో అందర్నీ ఆనంద పరిచే వాణ్ణి, నిద్రలో కూడా కలలు రానివాణ్ణి, దేశ ఉన్నతి కొఱకు, చేతనైన సహాయము చేసేవాణ్ణి, తెలుగువారి ఆత్మగౌరవమును, తెలుగు భాషను బతికించుటకు కంకణం కట్టుకున్న వాణ్ణి, అక్రమాలను అరి కట్టడానికి, అనాధులను రక్షించ టానికి, విద్యా వ్యాప్తికి సర్వ మత సమ్మేళణంగా, సమస్త హృదయాలను జాగృతి పరిచి జాగృతుణ్ణైనవాణ్ణి, ఇవి కలలు కావు కళలు గా భావించి జీవించేవాణ్ణి .                                 
అదేవిధముగా ప్రతిఒక్కరూ ధైర్యము ఆయుధముగా శాంతి లక్ష్యంగా జీవితసాఫల్యమును పొందగలరని ఆశిస్తున్నాము 

--(())--
విశ్వంలో ... విజ్ఞాన దీపం ..(6) రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

అపరిశుభ్రమైన ఇల్లు రోగాలకు నిలయమైనట్లు, మోసపూరితమైన వ్యవహారాలు కష్టాలకు ప్రధాన ద్వారాల వంటివి. ధర్మబద్ధంగా చేసే వ్యాపారం, కర్మ బద్ధంగా చేసే ఉద్యోగం, ఆత్మ శుద్ధి తో చేసే పూజలు, మనో నిబ్బరంతో వ్యవహరించే తీరు ఎల్లప్పుడూ మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. 

నియమ బద్ధమైన జీవితం అంటే, కేవలం మనసులో దానికి తగిన పవిత్ర భావాలకు తగ్గ క్రమ శిక్షణ  గా జీవితం, శాంతితో సాఫీగా సాగిపోతుంది. మన జీవితంలోని మాధుర్యాన్ని గుర్తించి పంచు కున్నప్పుడే అందరికీ సంతోషము.  పెద్దలు జీవితం అశాశ్వతమని గుర్తించు అని చెప్తారు. అంటే నిరాశకు లోనుకావాలని వారి ఉద్దేశ్యం కాదు. దాన్ని వదిలివేయమని సూచనకాదు. అర్ధంచేసుకొని సరిగా సాగించమని బోధ. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వితమో గుర్తించమని సూచన. ఐస్క్రీమ్ ఐదునిముషాల్లో కరిగిపోతుందని తెలిస్తే పిల్లాడు దాన్ని వెంటనే పూర్తిగా తిని సంతృప్తి చెందుతాడు. ఇదీ అలాంటిదే. జీవితం ఎందుకు వచ్చింది. మనం ఎలా జీవించాలి. ఎలా జీవిస్తే మనకి దాని పూర్తి ప్రయోజనం అందుతుందో తెలిపేదే సరైన మార్గదర్శనం !

నేటి స్థితి 
గాలి మాటలు చెవులనే కరచి వేయు 
గాలి ఊపిరి నిలిపును కాలమంత  
నేడు గాలిలేనిబతుకు నాట్య మాడె   
ప్రకృతి గాలిలే సరిపోక కుత్రిమమ్ము  

సమాజానికి మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది  ఇంటి ముందర తుమ్మ చెట్టు పెంచుకొని దానికి మామిడి కాయలు కాయ లేదు అని బాధపడినట్లు మన వ్యవహారం ఉండకూడదు.
మంచి మామిడి చెట్టు ను పెంచుకుంటే తీయని మామిడి పండ్లును, చల్లని నీడను ఇస్తుంది. అలాగే మన ప్రవర్తన మారుతూ ఉండే కొద్ది సత్ఫలితాలు వాటంతట అవే రావడం మొదలు పెడతాయి. అది ఎలా అంటే చెట్టు మొదలు దగ్గర నీళ్లు పోస్తే అవి కొమ్మలకు ఆకుల కు చేరి పూలు పూసి, కాయలు కాసినట్లు, మనం చేసుకునే మంచి పనులే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. 
--(())--

విశ్వంలో ... విజ్ఞాన దీపం ..(7) రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

మనిషిలో భయము ,  ధైర్యము కోల్పోయినప్పుడు కొన్ని ఆలోచనలు నిన్నుతట్టుతాయి, అవే   

బెదరు విడి మానసము పదిలపడి నపుడు, 
కుదుటపడి ఆనందము కలిగినపుడు, 
కలతలు తొలగి సంతోషపడినపుడు ,  
పరువుతో తల యెత్త బడియున్నపుడు, 
కళలతో విజయము పొందినపుడు,  
విజ్ఞాన బంధములు చేరి సంసార బంధమున 

సుఖలు దు:ఖములు కలిగినపుడు, 
ఇఱుకు సంసారముల కఱకు గోడల నడుమ, 
బరువు బాధ్యతలు మోసినప్పుడు, 
ఆశలు అడియాశలు అయినపుడు, 

భువనాలు తునుకలై పోక మిగిలిన యపుడు, 
పలుకులు సత్యగర్భమ్ము వెలువడు నపుడు, 
ధర్మము న్యాయము రెండు పాదముల మీది 
నడచినపుడు, 

సకల సౌకర్యాలు కలిగి నపుడు,  
 అలసి యెఱుగనియట్టి హస్తములు పరిపక్వ దశ 
నంటగను సాగు తరుణ మొదవిన యపుడు, 
పండిత పామరులు, మనసును వేదించనపుడు, 
ఐశ్వర్యము ఉన్న బీదరికంలో బతికినపుడు, 
బీదరికంలో ఉండి ఐశ్వర్యాన్ని ఆశించినపుడు, 
వేషాలు వేసినపుడు,  

చెడ్డ యలవాటనెడు చీకటెడారిలో 
తేటతెల్లని తెలివి బాట తప్పని యపుడు, 
దైవ ప్రార్ధనలో మనసుకు శాంతి కలిగినపుడు 
నిత్యవిస్తృతమైన నిర్మలిన భావనా- శ్రయ 
కర్మముల చేయ స్వాంతమును ముందునకు 
నా స్వామి నీవుగా నడుప బూనిన యపుడు, 
లోకంలో ఉన్న ప్రకృతిని స్వాదించినపుడు, 
మనిషిగా మానవత్వాన్ని బతికిస్తూ 

తల్లి తండ్రుల సేవకు అంకితమయినపుడు,  
సర్వార్ధ సాధనకు నిత్యమూ పుడమితల్లి సాక్షిగా, 
గగనమ్ము సాక్షిగా, నాలో ఉద్యమించుచున్న 
శాంతి నిలిపే సమస్త భోదలు తెలపాలిపుడు. 
అందుకే ప్రతిఒక్కరు ధైర్యాన్ని వీడకండి 
అదే మిమ్ము రక్షించుతుంది. 

తోడును వదలకండి అదే మిమ్ము బతికిస్తుంది.   
సర్వేజనా సుఖినోభవంతు ... ఓం శాంతి: శాంతి: శాంతి:
--(())--


విశ్వంలో ... విజ్ఞాన దీపం ..8...రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

గురువర్యా చెట్ల గురించి వివరించగలరా 
అట్లాగే "మధురిమలు " ద్వారా క్లుప్తముగా 'చెట్ల' గుఱించి తెలియపరుస్తాను। వీటి మీ మేధస్సు ప్రకారముగా వ్యాసం వ్రాయండి 

ఓపిగ్గా తోటనంతా - కోవెలగ చేరుస్తుంది
వేళ్ళతో పలక రింతా - వేణువై శ్వాసిస్తుంది
లోక కళ్యాణానికై   - దేహము ఆర్పనౌతుంది  
సకల విశ్వా సానికై  - పందిరిగా మారుస్తుంది

విశ్రమించిన ఊపిర్నీ - బంధువుగా మోస్తుంది.
దాహము లోని ఊపిర్నీ  - అక్కున చేర్చుకుంటుంది.
వయసులో  ఆనందాన్ని - బతుకునే నేర్పిస్తుంది 
గుండె అక్షర శిల్పాన్ని - భద్రంగాను దాస్తుంది.

మొగ్గ తొడగదన్న చింత - ఆశ మరవదన్న బాధ 
తోట లతలు మారు పూయ - కల మహిమ చేటు చేయు   
ఇక తలపులు మరవవన్న   - ఇక పలుకులు చిలకవన్న 
ఇక కులుకులు తగువులన్న  - ఇక మెరుపుల తళుకులన్న  

తోడు లేదన్న ధ్యాస - ఈడు కాదన్న ధ్యాస 
దేవు డేనన్న ధ్యాస  - కాలు డేనన్న ధ్యాస  
మనిషిని చీల్చిన కోపం - వయసుని తేల్చిన కోపం  
తనువుని మార్చిన కోపం  - మనసుని మార్చిన కోపం 

పెరట్లో చోటులేదన్న పట్టింపు లేదు
పనుల్లో లోటు ఉందన్న పట్టింపు లేదు 
కళల్లో వేటు ఉందన్న పట్టింపు లేదు 
కథల్లో పట్టు లేదన్న పట్టింపు లేదు 

అడవి మనిషినన్న గొడవ లేదు
మృగపు తలపులన్న గొడవ లేదు 
అలక వలపులన్న గొడవ లేదు 
అటక మెఱపు లన్న గొడవు లేదు 

ప్రాణం తీసారని కన్నీరై విలపించదు
ద్వేషం వచ్చిందని కన్నీరై విలపించదు
ప్రేమే పొంగిందని కన్నీరై విలపించదు
నవ్వే వచ్చిందని కన్నీరై విలపించదు
--(())--

విశ్వంలో ... విజ్ఞాన దీపం ..( 9    ) రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ (ఇది కధ కాదు అనుభవ సారం )


మైదాన మంతా ఎగిరి ఎగిరి, అలసిన బంతి ఎండిన గడ్డి మీద , ఆయాసం వగర్పూ
చెమటలా ఆరి పోయే ఆట కబుర్లు, అట్లాగే ఉదయం లేచిన నప్పడి నుండి సాయత్రం వరకు కష్టపడి చల్లని వెన్నెల తగల గానే హృదయం చల్లబడి ఆత్మారాముడు చల్లఁబడి, శ్రీమతి చెప్పు కబుర్లు,   ఆ సమయమునా ముసురు కాకి అరుపులు వినరావు, రెక్కలు సహకారం అందుతుంది సమస్యలు అనేవి ఆ సమయాన అసలు గుర్తుకు రావు, విషయ వాంఛ అనుభవేశ్చ తృప్తి సంతృపి మధ్య అనురాగ సంగమం ముద్దర ఏర్పడుతుంది।  ఇంకా పైకి ఎదగడానికి ఆరోగ్యం ఆనందం కలసి మెలసి ఒకటౌతుంది। 

ఇక తెల్లవారిన తర్వాత ఇక ఈ గూడు ఖాళీ ఎటు పడితే అటు కదులుతుంది ఎండిన ఆకులా తల్లి వంట కార్యక్రమములోభార్య,  పిలల్లు చదువునిమిత్తం బయటకు, భర్త ఉద్యోగధర్మం నిర్వహిస్తారు।  
మరలా చుక్కలు లేని రాత్రి వర్షం వచ్చిన  చప్పుడుతో, ఒళ్ళు నెప్పులతో దెబ్బలతో నొప్పులతో బయటికి ఇక మళ్ళీ సాయంత్రం, ఏ గాలి దెబ్బకు ఇమి జరిగినా గూటికిచేరిన పక్షులు ఆనందం చేటుచేసుకుంటూ గతాన్ని మరచి వర్తమానాన్ని అనుకరిస్తూ, భవిషత్తుకు పునాది వేసుకుంటూ బతకాలి ప్రతిఒక్కరు।   


సోయగములు 
సాటిలేనిది మేలు చేసేది  
పాట మనసు చేరు 
పోటీలొ ఉన్నా హృద్యంచేరు 
ఆట లాంటి తీరు 
వేటతో ఉబలాట పెరిగెను 
తాట తీసి కదులు 
ఎవరికి వారుఈ లోకంలొ   

గురువుయే మమతల తరువు 
అరువు లేని బతుకు 
తరువుల ఉపయోగము మనకు 
పరువు నిలుపు చుండు 
చిరు నగవులతోను జీవితం 
మెరుపు పుట్టు చుండు 
తారుమారు అయిన బతకాలి 

త్యాగమభయహస్తముగనులే 
వేగ ముంచి కదులు 
భాగ్యమెప్పుడు నీతొ ఉండును 
త్యాగ బుద్ధి వల్ల 
స్వాగతించుము బీదవారిని 
సాగు తుంది కలిలె 
ఎంతోతెలిపెను సోయగములు 

  --(())--

విశ్వంలో ... విజ్ఞాన దీపం ..( 10   ) రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ (ఇది కధ కాదు అనుభవ సారం )
కాలమన్నది కదులుతూ సాగి పోతుంది, దాన్ని ఎవ్వరు ఆపలేరు, అది సృష్టిధర్మాన్ని అనుకరిస్తూ ముందుకు సాగువుతుంది। నాకే గనక తెలిస్తే నీకు నిలబెట్టి చెప్తానులే కాల మహిమ నీకు ఆవేళ చెప్పను, ఈవేళ చెప్పను, అయినా సమయము ఆగదు,  ఎందుకో అని అనుకుంటే లాభం లేదు। మనం  చెల్లించవలిసింది వెల, ఋణము, బంధము  తెలిసి తెలిసీ, తన మాను తానూ బిగదీసుకుంటుంది వగలాడి కాలం; కానీ ఏసమయం ఎం జరుగుతుందో వేచి చూడమంటున్నది ।   
కోణంగి చేష్టలకి బిక్కచచ్చిపోయే రోజు వస్తే, కొత్తకోడలు అడుగు పెట్టగానే అత్తగారి ఆలోచన మార్పువస్తే , పెళ్లి ఆయన కొత్తలో కొడుకు మారుతాడేమోనని భయము చూపే తల్లి అనిపిస్తే,  , 
గాయకుల పాటలకి చెల్లి పోయే రోజులు వస్తే, వర్ధమాన గాయకులకు అవకాశము ముందు వస్తే ,  కాల తీర్పే ఇది మానవుని లోని మార్పు.  
పండుగ పూటా ఊళ్ళో పదుగురం కలిసి ఏడిస్తే, రోగాలువచ్చి ఊరు ఊరు స్మశానంగా మారితే , అంటా కాల మహిమ అని సర్దుకు పోవడమే। 
జాతకాలు చెప్పవలసిన అదృష్టాలు లేవు, మనిషి మనిషి మీద నమ్మకాలు లేవు, డబ్బున్న ఖర్చులు లేవు, రోగం ఉన్న మందులు లేవు, పాతకాలు చెయ్యకూడని ఆదర్శాలు లేవు,
ఐనా అలవి కానంతగా నన్ను ప్రేమిస్తున్నాను అనేటి కాలము ఎప్పటికీ మారదు, అది అందరి వెంట ఉంటుంది ।  
వీచే గాలులు ఎక్కణ్ణించి రేగి వస్తాయో, పూచే పువ్వులు ఎవ్వర్నడిగి వీగి పోతాయో,ఆకులు రాలే కారణాలు ఏమోతాయో, ప్రేమల మధ్య అఘాతాలు ఎలా వస్తాయో, స్పర్ధలు ఎలా ఏర్పడుతాయో ,  
ఏమి జరిగినా కాలం గొణుక్కుంటుంది, సణుక్కుంటుంది ।
రోజాలకు నిజంగా పెరగాలనే ఉందేమో, కన్ను కలకాలం కనిపిద్దామనే అనుకుందేమో, ఏమో ఋతువులు చావని దేశం ఒకటి ఉందేమో, వెలుతురులో వేదన ఎలా ఉందేమో, చీకటిలో చిందులు లేని రాజ్యముందేమో, కొదమ సింహాలు దడుసుకుని తడబాటుపడి దౌడు తీస్తాయో ,,
సెలయేళ్ళు మొనగాళ్ళు బెదరిపడి వెనుదిరిగిపోటాయో, కళా మాయను ఎలా వర్ణించాలో నాకు అస్సలు తెలియటులేదు, ఫలితాలు ఎలాఉన్నా కల గమనము బట్టి మనుషుల తీరుబట్టి, జీవిచటమే నిజ మైన జీవితం।
0 Co



మన జీవం, భావం అన్నీ శివుడే. బ్రతికుంటే శివం.. లేదంటే శవం... మన జ్ఞానం, అజ్ఞానం అన్నీ శివంగా ఉన్నప్పుడే! శవంగా ఉన్నప్పుడు ఏదీ ఉండదు. గుడిలో ఉన్నాడనుకునే దైవం గుండెల్లోకూడా ఉన్నాడని తెలుసుకునేందుకు ఈ దేహాన్ని దేవాలయంగా పవిత్రంగా చూసుకోవాలి. మనం పవిత్రంగా లేనంతమాత్రాన మనలోని దైవం పారిపోదు. కానీ మనం [19:34, 

ఒకరు:- అందరూ సమానం ఎలా?

సృష్టించింది బ్రహ్మ, దృష్టుంచింది అమ్మ,భరించింది అమ్మ 
అన్నింటికీ మూలం : పుడమితల్లి ; ధర్మ దేవత; కర్మ బంధం 
  
ఇరువురు - అందరు సామానము ఎలా ?

భార్య భర్తలు, హృదయంలో ఉంచుకొనేవారు, నాలుకపై ఉచుకొనేవారు, 
సగభాగంలో ఉంచుకొనేవారు,   

ముగ్గురు - అందరు సమానము ఎలా? 

భార్య భర్త కలిస్తే జీవితం; జీవితంలో మెళుకులకు ఆధారం బిడ్డలు ; బిడ్డలకు మూలం ఆశల  పల్లకిలో లక్ష్మి  ;  కాలంతో ముగ్గురు ప్రయాణం 

నలుగురు - అందరూ సమానము ఎలా ?
నాలుగు దిక్కులలో , నాలుగు మూలల్లో, నాలుగు ధర్మాలతో (సత్యం, న్యాయం, ధర్మం, సహనం) నాలుగు భయాలతో (అహం, ఈర్ష్య,  ద్వేషం అనుమానం ), ,    

సద్గురు:- భౌతికపరంగా అందరమూ మరణిస్తాము. ఆత్మపరంగా అందరమూ శాశ్వతులము.
: జీవితం..
అందుకే ఆశకు పోక, ఉనందాంట్లోతృపిపడి, ఆడంబరాలకు పోక ఉనందాంట్లో సర్దుకొని, కోపతాపాలకు చిక్కక శాంతి ప్రజానాతి మధ్య బతుకుతూ నేను నాదేశం నా సంఘం నా ధర్మం న దైవం నన్ను బతికిస్తుంది కనుక నావంతు నేను సహకరించాలి అనే భవన అందరిలో ఉండాలి అదే జీవితం    
అందుకే 
అభినయంగా ఉంటే స్వర్గం; అనుభవంగా ఉంటే నరకం ప్రతిఒక్కరు అర్ధం చేసుకుంటే స్వర్గం చేసుకోలేక పొతే నరకం.  .

జ్ఞాని యొక్క లో-లక్షణాలు:- నిర్భయత్వం, నిర్దయత్వం.
    
         జ్ఞాని యొక్క పై-లక్షణాలు:-  ఆగ్రహం, అనుగ్రహం.తెలుసుకునే అవకాశం ఉండదు. మన ఇంట్లోనే ఉన్న నిధిని మనం గుర్తించకుండానే దరిద్రాన్ని అనుభవించడం ఎలాంటిదో, మనలోనే ఉన్న దైవాన్ని గుర్తించ కుండా దైన్యాన్ని అనుభవించడం అలాంటింది !

మహీ = అన్నిటికీ ఆధారభూతమైనది.
అన్నీ దేని మీద ఆధారపడుతున్నాయో ఆలోచిస్తే చిట్టచివరకు ఎక్కడకు వెళ్తామో దాన్ని 'మహీ' అంటారు.
'క్షమయాపృథివీసమా' - అని చెబుతారు. ఓర్పు ఒక రూపాన్ని పొందితే అది 'మహీ ఔతుంది.
1) అన్నిటికీ ఆధారభూతమైనది. 
2) ఓర్పు యొక్క స్వరూపిణి - అమ్మ ..... 
శ్రీ  మాత్రే  నమః 



సూర్య  కొక ముద్దు నిడనా, 
యచట సూర్య నను రమ్మనెను, 
ముద్దు లిడఁగా, సూర్యవలె వెల్గు లిడనా  
యచట గాలులు  ప్రియమ్మలర నూఁదగలనా. 
సూర్యవలెఁ ఉండ గలనా,. 
యచట గొప్పగ రణమ్మునను గుమ్మగలనా, 
సూర్యవలె సుందరముగా,  
నచట సూర్యవలెఁ గమ్మగను నవ్వగలనా.  

వేడి మన భారమది, సుందరమగాఁ బెరిగి,  సొంపు లిడుచుండె భగడే , ఆడె మన యింట మది  యందముగ మోద మిడ, హృద్యమున మండ గలిగే,  వేడి యిది చాలదుగ , మేలిమిగ నాడుటకు తర్వులకు వెల్గు మెరుగే, నీడవలె నాసరస  నేను జను చోటులకు , నిక్కముగ వచ్చు వెలుఁగై 

            
మననం కోసం ఉషస్సులు ఎంత ఉద్వేగ పడ్డాయో, విచ్చుకున్న తమ కంటిలో జలపాతం విముక్తి ఎప్పుడు పొందుతుందో. వెన్నెలంతా తాను విసిరిన  వలలో ఎన్ని జంటలు  చిక్కుతాయో , ఎంతటి కలవరమో ప్రత్యేక వెదుళ్ళకు,  నన్ను ఉపయోగించు కుంటున్నాడు  పరమాత్ముడు, నాలో అంతా  సూన్యము అయినా ఆ పరమాత్ముని నోటి స్ప ర్సతో నాదంగా  గానామృతముగా మారి హృదయాలను నిద్రలేపి శక్తి  నా కెక్కడిదో,     ఎంతటి ఆరాటమో బాండ రాళ్లకు ఉలి దెబ్బలు ఎన్ని తిన్నా నాలో ఉన్న భాగాల్ని ముక్కలుచేసినా నన్ను ఒక మూర్తిగా మార్చి నిత్యమూ కొలిచే దైవంగా ఉపయోగపడుతున్నాను ఎందుకో, ఎంతెంత ఉబలాటమో చిరుజల్లు పడగానే   నెమళ్లకు ఎక్కడాలేని సంతోషము కలిగి సరిగమలతో  నాట్యమాడే కన్య కన్నా పురివిప్పి అందాలన్నీ చూపుతూ ఎగురుట ఎవరికోసమో,   

ఉండి ఉండి జలపాతములు కొండలనుండి జాలువారి, నులివెచ్చని సెగలతో పరవళ్లు తొక్కుంకుంటూ నదులచేరి ఉరకలు పరుగులతో కడలి చేరుట ఎందుకో, కడలి కి ఎక్కడలేని సంతోషం పెల్లుబికి  కెరటాలకుపోటిగా సై అంటూ సై సై అంటూ మంచినీరు కలసిపోయి తన ఉనికినే కోల్పోవుట ఎందుకో మరి ఎందుకో ........   

మధురిమలు 

ప్రేమ తీరాల వైపు - ఆశ పాశాల వైపు 
ఆట పాఠాల వైపు  - మాట సాగు ఆ వైపు 

అందాల  ప్రేయసితో - ఆనంద డోలికలతో  
ఆర్భాట ఉత్త్సవముతో  - ఆద మర్చె పిల్పులతో 
 
అద్భుత మైనట్టి జంట  - ఆదర్శ మైనది జంట 
ఆత్మీయ పరిచే జంట - ఆరాట పడినది జంట 

బ్రహ్మ కలిపే మా జంట - తన్మ యత్త్వమ్ముతొ జంట 
మాయ మర్మమ్ముతొ జంట - విధివల్ల కల్సి న జంట 

ఏడు జన్మల భందం  - ఎదను మార్చేటి బంధం  
మరచి పోలేని బంధం  - సంతృప్తి పరచు బంధం 


సుడిగాల్పుల గాలిలో పడగలెత్తిన రెక్కలు, ముసుగు టాకుల ను మాడ్చే ఎండలు , మండుచున్న చెట్ల ముఖాలు చూసి చిక్కుళ్లు ఎర్రబడి మాది పోయిన ముఖములా, పాలిపోయిన తరువులా, ఎవరిని ఏమి అనలేక నిస్సహాయతతో విలవిలలాడిన వృక్షరాజము ఒకవైపు, తూర్పు కొండమీద ఉవ్వెత్తున లేచి భగభగ మండుచు లోకాలన్నీ తిరుగుచు పడమటి కొండమీద  చేరి ఉరితాడుకి చిక్కిన ఎర్రటి రూపం అస్తమం ఇకలేక నల్లని ముసుగుకమ్మే క్రమేపి తేనెతుట్టెనుండి వచ్చిన తేనెటీగల్లా, మిణుగురు పురుగుల స్వేరవిహారం మధ్య మధ్యలో పాదరసం కదలికల్లా మెరుపు తీగలు అంబరాన్ని క మ్మివేసాయి        

మనిషి ఆశలనూ, భావాలనూ, బంధాలను, అనుభంధాలను, చెరిగి పోని జీవిత సత్యాలనూ, మరచి పోలేని న్యాయాలను, వదిలించుకోలేని చట్టాలను, అర్ధం పరమార్ధం తెలుసుకోవాలని,  నింపుకున్న ఒక శాశ్వతమైన అవగాహన,  ఆది మానవుడి నుండి వ్యోమగామి దాకా, ప్రతి మనిషిలో ఉండే మృదు భావాలను, ఉరిమే శ్రావణ మేఘంలా, దూది పింజలా చెదిరే తెల్లటి మబ్బులా,  హేమంతం లో గాలిని నింపే పొగమంచులా,  గడ్డి రేకుల మీద నిలిచిన హిమ బిందువులా , నందన వనం లో ఎగిరే రంగురంగుల సీతాకోకచిలుకలా, కీకారణ్యం లో వేగంగా ఉరికే చిరుత పులిలా, బొరియ లోంచి మళ్లీ మళ్లీ తల బయటకు పెట్టి చూసే చిట్టెలుకలా,  ఎగిరెగిరి పడే మహా సముద్రపు కెరటంలా,  గోపురం మీద నుండి ఎగిరి పోయే పిట్టలలా, బెదురు చూపులు చూసే జింక పిల్లలా, ఎడారిలో అనంతంగా సాగే ఒంటె లాగా , ప్రతి కుహూరవం లోనూ కొత్త రాగాలొలికించే కోయిలమ్మ తీయని పిలుపులా,  బతుకు తెరువు కోసం బానిస బతుకులా, ఒకే జీవితం ఒకే నిర్ణయం జీవిత పాఠాలు నేర్చుకోవాలని .... ...... 

నల్ల కలువలా విరిసిన రాత్రి, నక్షత్రాల మధ్యన పుప్పొడి రేణువులు ఆవహించి,  పారదర్సకమైన పరదాలలా కళ్ళ కు కనబడుతున్నది అంబరం.    
అవిశ్రాంతముగా శ్రమపడి చీకటి గుహలో ముడుచుకొని నిద్రకు గవాక్షాలుగా ఉన్న కళ్ళకు మల్లెపువ్వుల సుఘందాలు నీలాంబరి నీడలో ఆనంద మందారాలు. సౌగంధిక పుష్పాల సువాసనలు ఒక వైపు, సెలయేటి నీటిలో జలకన్య తో స్నాన మాడినట్లు రంగు రంగు స్వప్నాలు     
ఆవహించి నిద్ర లేక  నక్షత్రాల వంక చూస్తూ ఉండిపొయ్యాను.   

అందమైన ఆలాపనలా సుళ్ళు తిరుగుతూ కలల అలల మీద తేలే జ్ఞాపకాల ఆనవాళ్ళతో మనసు అల్లకల్లోలమైనది. కన్ను మూసి తెరిచే లోపు ఉమ్మెత్త పువ్వులా తెల్లగా పున్నమి వెన్నెలను ఆస్వాదించాను. 

జల్లులు కుర్సీకురవగానే నా మనసునున్న కవితలన్నీ కరిగి పోయాయి, వానలో తడిపోయాయి,   
పారేనీరులా, రిలే పారిజా పువ్వులా, పున్నాగపూల వాసన నాసికా రేంద్రాలలో చేరి కళ్ళు చేమంగిల్లె,    
పచ్చిక మీద పాకె పురుగుల్లా, పిల్లల గెంతుల్లా, కాలువ నవ్వుల్లా, 

మంచుతెరల పొరలు ఊరుని విడిచి అలాగే గ్రీష్మము గురించి  చెప్పే తెరల్లా ,
ఎండలో ఏమిచేయటం తడిసిన వట్టివేళ్ళ వెనుక తాటి ముంజెలు తినడం తప్ప… 
శూన్యంలోంచి రాలిన పువ్వులా

ఏవండోయ్ ఏమిటండి అదేపనిగా వ్రాస్తున్నారు, ఏంచెయ్యమంటావే లోక మంతా భయాందోనలో ఉన్నది, బ్యాటు పొయ్యే పరిస్థితి లేదు, అందుకనే నాకున్న చిన్న మెదడులో ఆలోచనల ద్వారా కదా రాస్తే ఎలాగుంటుందని వ్రాస్తున్నా 
కథ ఏమిటీ నాకేతెలియదు, సరే వ్రాయండి నాకు తెలిసినవి తెలియపరుస్తాలే 
సంతోషం "ఎదో పిచ్చి కధరాస్తున్నావు అని మాత్రం అనలేదు. 

ఆ రాయండి. 
అట్లాగే 
      

మనవి 
గౌరవనీయులైన తెలుగు రాష్ట్రాల ప్రజలు, భారతదేశం మరియు ప్రపంచము తెలుగు భాష ను అదఃరించే ప్రతిఒక్కరిని పేరుపేరునా కృతజ్ఞతలు, నమస్కారములు, ఎందరో మహానుభావులు అందరికి వందనములు నేను అనగా "మల్లాప్రగడ రామకృష్ణ" విశ్రాంతి యకౌంట్స్ ఆఫీసర్ గా (స్కూల్ ఎడ్యు కేషన్ డిపార్ట్మెంట్)  పనిచేసి 30 -06 -2019  పదవి విరమణచేసితిని, ముఖ్యముగా నాభార్య శ్రీదేవి సహకారంతో " ప్రాంజలి ప్రభ " ఆన్లైన్ ల్లో 12  బ్యాగుల సహాయంతో, 2012 నవంబర్ ౦౩ నుండి తెలుగును బతికించాలని ఉద్దేశ్యంతో సొంతగా వ్రాయాలని ప్రారంభించాను  అప్పటి నుండి ఇప్పటివరకు 50 జి పి గూగుల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా సేకరించటం,(ఆయా సంస్తలలో పనిచేయు వారికీ శుభాకాంక్షలు)  మరియు నా సొంత రచనలు ఎప్పటికప్పుడు అందరికి అందిస్తూ వచ్చాను, ఇది ఎవరిని ఉద్దేశించి వ్రాసిన కధలు కావు, నాకు నచ్చి సేకరించిన కధలు ఎవరు వ్రాసారో నాకు తెలియదు  వారందరికి  నా నమస్కారములు                      
2012 వ్రాసినవి నాకు నచ్చినవి ఒక క్రమంలో ఉంచుతున్నను. (మాతాతగారు నిజాం ఆస్థానంలో పండితుడు జోశ్యులుగా ఉన్నారు మానాన్న, పెదనాన్నలు అందరూ పండితులే) వారి జ్ఞాపకార్ధం నేను తెలుగులో  వ్రాస్తున్నాను) తప్పులుంటే క్షమించగలరు.
ఐ విధేయుడు ... ప్రాంజలి ప్రభ ... మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ , ౯౮౪౯౧౬౪౨౫౦
       

No comments:

Post a Comment