Tuesday 25 May 2021

ప్రాంజలి ప్రభ పాత కధలు (21- 30)



-- Photo

21... బాలరాజా.. దీనివల్ల దేశానికి ఏమిరా.. ఉపయోగం..!!

 ఫేర్ అండ్ లవ్లీ వాడితే ఎవరి ముఖం తెల్లగా కాలే.. 

 కోల్గేట్ వాడితే ఎవరి పళ్లూ మెరిసిపోలే..

 క్లోజప్ వాడితే ఎవరి శ్వాస  తాజాగా రాలే..


 ఏ బ్రాండ్ నూనె వాడినా జుట్టు నల్లగా కాలే.. 

ఏ కూల్ డ్రింక్ తాగినా ఉరిమే ఉత్సాహం రాలే.. బూస్ట్ తాగితే బలం రాలే..

 సెరిలాక్ తింటే చలాకీదనం  రాలే. 


 కాంప్లెన్ తాగితే  పొడుగు పెరగలే.. 

 రిఫైండ్ ఆయిల్ వాడితే గుండె జబ్బులు తగ్గలే..

 అయోడైజ్డ్ ఉప్పు వాడితే థైరాయిడ్ సమస్యలు పోలే.. 

 ఆర్ వో వాటర్ తాగితే ఆరోగ్యాలు బాగుపడలే

 ఐనా వాల్లెవరిని  ఇదేంటని అడిగే ధైర్యం ఎవరికీ లేదు..!! కానీ కృష్ణపట్నం ఆనందయ్య ఉచితంగా ఇస్తానంటున్న  ఆయుర్వేద మందుకు మాత్రం.. సవాలక్ష ప్రశ్నలు..పరీక్షలు....!! రిజల్ట్ అర్జెంటుగా ఇవ్వాలంటూ శల్యపరీక్షలు.. భూతద్దంతో లోపాల వెదుకులాటలు..

 ఏమిరా బాలరాజు ఇది.. ఏమి న్యాయం..  ఇది..ఏమి దేశమ.. ఏమిరా..ఉపయోగం

దయచేసి ‌  బ్రాహ్మణ సోదరులు అందరు చదవండి

ఒక రోజు 

19 సంవత్సరాల వయస్సు గల అమ్మాయి...


రాత్రి 10:45

తన డ్యూటి పూర్తి చెసుకొని

ఇంటికి వెళ్ళడానికి కాళేశ్వరం బస్సు స్టేషన్ లో    

బస్సు కోసం ఎదురుచూస్తుంది........


కానీ కొద్దిసేపటి తర్వాత ఆమెకు  తెలిసింది......

తను వెళ్ళవలసిన చీవరి బస్సు‌‌ ముందే వేళ్శిపోయిందని..... 

ఆమె భయంతో ఆ బస్సు స్టాప్ ముందు నిలబడి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది

ఆమె ముందు నుండి చాలా వాహనలువెళ్తున్న ఎవ్వరిని లిఫ్ట్ అడగలేదు..


కొద్దిసేపటి తర్వాత ఒక 20 సంవత్సరాల వయసు గల యువకుడు బైక్ పై🏍 భూపాలపల్లి వైపు రావడం చూసి అతన్ని లిఫ్ట్ అడగాలని నిశ్చయించుకుంది....

అతను దగ్గరికి రాగానే లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది.. 

Okఅని

అతను ఆమెను బైక్ ఎక్కించుకుంటాడు.

మార్గ మద్యంలో

అతను ఆమెను మీరు ఎక్కడికి వెళ్ళలి అని అడుగుతాడు...

ఆమె తన అడ్రస్ చెప్పి తనను వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చెయ్యరా....!అని కోరుతుంది...

దానికి అతను అంగికరించి.

ఆమెను వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు....

దానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతుంది...

అప్పుడు అతను ఆమెను అడుగుతాడు...

ఏమనీ అంటే నీ ముందు అన్ని వాహనాలు వెళ్తున్న ఎవరిని లిఫ్ట్ అడగలేదు.కానీ నన్ను మాత్రమే అడిగావు ఎందుకని.......

అప్పుడు ఆమె చిరునవ్వుతో....

మీ యొక్క బైక్ పైన ఉన్న నెంబర్ ప్లేట్ పైన........ 

..బ్రాహ్మణ.అని రాసి ఉంది కదా.... 

ఈ సృష్టిలో  బ్రాహ్మణ కంటే గొప్ప ఎవ్వరున్నరు....

ప్రేమను పంచటం లో అచరించడం లో  బ్రాహ్మణ తర్వాతే ఎవ్వరైనా ...

అని చెప్తుంది......

అప్పుడు అతను గర్వంతో ఆమెకు  దన్యవాదాలు తెలిపి అక్కడి నుండి  వెళ్ళిపోతాడు....

బ్రాహ్మణ is a Brand....!

బ్రాహ్మణ is nat a caste it's A Character 

Please.  Share your బ్రాహ్మణ Friends  

🙏🏻🙏🏻

22. ..న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం రేపు ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే క‌నిపించ‌నుంది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప్రారంభంకానున్న చంద్ర‌గ్ర‌హ‌ణం సిక్కిం మిన‌హా ఈశాన్య రాష్ట్రాలు, ప‌శ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని కోస్తా తీర ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో క‌నిపిస్తుంద‌ని ఇండియ‌న్ మెటీరియోలాజిక‌ల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) వెల్ల‌డించింది. కాగా, ద‌క్షిణ అమెరికా, ఉత్త‌ర అమెరికా, ఈశాన్య‌ ఆసియా, ఆస్ట్రేలియా, అంటార‌క్కిటికా, ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రం, హిందూ మ‌హా స‌ముద్ర ప్రాంతాల్లో క‌న్పిస్తుంద‌ని వెల్ల‌డించింది.

సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్‌లో మధ్యామ్నం 3.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.22 గంటలకు ముగుస్తుంది. సంపూర్ణ గ్రహణం 14 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంటుంది. కోల్‌కతా‌లో ఇలాంటి చంద్ర గ్రహణాన్ని దాదాపు పదేళ్ల కిందట 2011 డిసెంబరు 10న కనువిందుచేసింది. అయితే ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ దాదాపు 14 నిమిషాల పాటు సంపూర్ణంగా దర్శనమివ్వనుంది.

అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 4:47:39 గంటలకు ప్రారంభమై 57 నిమిషాల తర్వాత 5.44 గంటలకు పాక్షికస్థాయికి చేరుతుంది.. 7:11:25 గంటలకు పూర్తిస్థాయికి చేరుకుంటుంది. తర్వాత క్రమంగా గ్రహణం వీడుతూ 10:52:22 గంటలకు పూర్తవుతుంది.

సూప‌ర్ బ్ల‌డ్‌మూన్‌

చంద్రుడు సూపర్‌ బ్లడ్‌ మూన్‌గా కనువిందుచేయనున్నాడు. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వస్తాయి. సూర్యుడు, చంద్రుడికి మధ్యకు భూమి వచ్చి భూమి నీడ చంద్రునిపై పడటాన్ని చంద్రగ్రహణం అంటారు. భూమి నీడపడినప్పుడు కాంతి తరంగాలు ఫిల్టర్‌ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపిస్తాడు. చంద్రగ్రహణం సమయంలో మే 26న సాయంత్రం అరుదైన సూపర్‌ బ్లడ్‌ మూన్‌ ఆవిష్కృతం కానుంది

ఉనికి:

ఒక ఎద్దు మైదానంలో గడ్డి మేస్తోంది. పచ్చని గడ్డి తింటూ, తన పని తను చేసుకుంటూ, యే ఆలోచన పెట్టుకోకుండా సంతృప్తిగా వుంది.

ఇలా హాయిగా వున్న ఎద్దు చుట్టూ కాస్సేపటికి ఒక ఈగ ముసరడం మొదలెట్టింది. ఎద్దు కొమ్ములపై వాలింది.

కొంతసేపటికి అలసట తీరాక ఈగ తన దారిని తను వెళ్తూ ఎద్దుతో, “ఇప్పుడు నేను బయలుద్యారుతున్నాను, నీ మీద వాలి అలసట తీర్చుకో నిచ్చినందుకు చాలా థాంక్స్. ఇప్పుడు నేను వెళ్తుంటే నీకు హాయిగా ఉందేమో” అంది.

ఎద్దు ఆశ్చర్యంగా ఈగవైపు చూస్తూ “అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టే నాకు తెలీదు” అంది.

కొంతమంది వాళ్ళని వాళ్ళే చాలా గొప్ప అనుకుంటారు. కాని ఇతర్ల దృష్టిలో మట్టుకు వారికి అంత ప్రాముఖ్యత వుండదు.

0

23... బుద్ధిబలం:

అనగా అనగా ఒక పెద్ద అడవి వుంది. అందులో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే ఒక తోడేలు దాని భార్యా పిల్లలతో కలిసి కాపురం ఒక గుహలో పెట్టింది. అవి పగలంతా అడవిలో తిరిగి ఆహారము తినేవి. రాత్రి వేళలో గుహను చేరి విశ్రాంతి తీసుకునేవి. అలా రోజులు గడుస్తున్నాయి. వానాకాలం మొదలయింది. ఆ సంవత్సరం వానలు విపరీతంగా కురిశాయి. ఆ వానల వలన వాగులు పొంగి వరదలు వచ్చాయి. ఆ అడవి సగం నీటితో నిండిపోయింది. అందులో తోడేలు గుహ కూడా వుంది. దాని కుటుంబానికి ఆహారం దొరకటం కూడా కష్టమయింది. వాటికి ఏమి చేయటానికీ పాలుపోలేదు. అచటి నుండి అవి బయలుదేరి మంచి గుహ కోసం వెతకటం మొదలు పెట్టినాయి. తోడేలు తన భార్యతో "మనకు చాలా చెడు రోజులు వచ్చినాయి. ఆహారము లేదు సరికదా! మన పిల్లలు వానకు తడిసి పోతున్నారు. ఇపుడేమి చేద్దాం?" అని అంది.

ఆడ తోడేలు చాలా తెలివిగలది. అది బాగా ఆలోచించింది. దగ్గరలో ఒక గుహ వుంది. దానిలో ఒక సింహం వుంది. అది విశాలమైన గుహ. బాగా ఆలోచించగా ఈ విషయం ఆడ తోడేలుకు గుర్తుకు వచ్చింది. దానిలో ఎంత కాలమైనా హాయిగా వుండవచ్చు అనుకుంది. ఈ ఆలోచన మగనికి చెప్పింది. అది విని తోడేలు మండిపడింది. "వుండీ వుండీ మనమంతా సింహానికి ఆహారమవుదామా?" అంది. ఆడ తోడేలు ఆలోచించి ఏమి చేయాలో వివరంగా మగ తోడేలుకు చెప్పింది. తోడేలు సంతోషించి ఆ పనికి పూనుకుంది. మగ తోడేలు,ఆడ తోడేలు వాటి పిల్లలు అన్నీ కలిసి సింహం గుహ ముందుకు చేరాయి. మగ తోడేలును, పిల్లలనూ చాటుగా వుండమంది. అచట ఒక చెట్టు చాటున అవి వున్నాయి. ఆడ తోడేలు ఒక్కటీ నెమ్మదిగా ఆ గుహద్వారము దగ్గరకు చేరింది. అచట చప్పుడు యేమీ వినపడలేదు. ఆడ తోడేలు నెమ్మదిగా గుహలోకి తొంగి చూసింది. అచట ఎవరూ కనపడలేదు. గుహ అంతా ఖాళీగా వుంది. నెమ్మదిగా గుహలోపలికి వెళ్ళి అంతా కలియ తిరిగింది. ఎటువంటి అలికిడీ లేదు. సింహం అప్పుడు గుహలో లేదు. బయటకు ఆహారము కోసం వెళ్ళింది. గుహ విశాలంగా చాలా బావుంది. సింహం ఆహారం తిని రాత్రి వేళకు వస్తుందని అర్థమైంది. తోడేలు తన భర్తనూ, పిల్లలనూ లోపలికి రమ్మని సైగ చేసింది. వారంతా లోపలికి చేరారు. పగలంతా అడవిలో తిరిగి ఆహారము తిని చీకటి పడగానే సింహం గుహకు వస్తే, ఏమి చేయాలో మగ తోడేలుకు చెప్పి గుహ బయటనే కాపలా వుంచింది. చీకటి పడసాగింది. దూరము నుంచి సింహం రావటం చూసింది. సింహం గుహకు దగ్గరగా రాగానే మగ తోడేలు గుహలోకి వెళ్ళింది.

ఆడ తోడేలు పిల్లలను గబ గబా నాలుగు దెబ్బలు కొట్టింది. అవి పెద్దగా ఏడవటం మొదలు పెట్టినాయి. మగ తోడేలు, ఆడ తోడేలు కలిసి విచిత్రంగా అరవటం మొదలు పెట్టాయి. ఆ అరుపులూ, కేకలూ వింటుంటే సింహానికి కొంచెం భయమేసింది. ఏదో పెద్ద జంతువు నా గుహలోకి చేరిందేమో అనుకుంది. అది గుహలోకి వెళ్ళకుండా బయటనే వుంది. సింహం ద్వారం వద్ద నిలబడి వుండటం చూచింది. ఆడ తోడేలు ఇలా అరవసాగింది. "పిల్లలు ఏడుస్తున్నారు. వారికి సింహం మాంసం వండి పెట్టాలట! లేకపోతే తిండి తినరట. గోల పెడుతున్నారు. ఇపుడు నేను యేమి చేసేది? ఇప్పటికిప్పుడు సింహపు మాంసం కావాలంటే ఎలా వస్తుంది? నేను ఎక్కడి నుండి తీసుకురాను." అంది. దానికి మగ తోడేలు యిలా అంది "తొందరపడకు ఒక సింహం యిటు రావటం చూశాను. అది బాగా బలిసి వుంది. దాని మాంసం బాగా రుచిగా వుంటుంది. అది యీ వైపుకి రాగానే దానిని చంపి దాని మాంసం తీసుకువస్తాను" అని గట్టిగా అరిచింది. ఈ మాటలు సింహం వింది. దానికి బాగా దడ పుట్టింది. లోపల యే జంతువులు వున్నాయో సింహానికి అర్థం కాలేదు. అవి తనను చంపుతాయేమో అనుకుంది. వెనుకకు చూడకుండా చాలా దూరం వెళ్ళింది. తోడేళ్ళ సంసారం గుహలో చేరటం అచట వుండే ఒక నక్క చూసింది. తోడేళ్ళ సంభాషణ అంతా వింది. సింహం పరుగు తీయటం చూసింది.

తోడేళ్ళ సాహసానికి నక్క ఆశ్చర్యపోయింది. తోడేళ్ళు సింహాన్ని మోసం చేసి గుహనుంచి తరమటం గమనించింది. తోడేళ్ళకి ఎలాగైనా బుద్ది చెప్పాలనుకుంది. సింహం కోసం ఆ ప్రాంతమంతా వెతికింది. అన్ని చోట్లా గాలించింది. దానికి సింహం దగ్గరలో ఎక్కడా కనపడలేదు. నక్క చాలా దూరం వెళ్ళి అంతా వెదికింది. చివరకు ఒక గుట్ట చాటున సింహం పడుకుంది. అది బాగా రొప్పుతోంది. నక్క మెల్లిగా సింహం దగ్గరకు చేరింది. ఇలా అంది. "ఓ మృగరాజా! నీవు ఈ అడవికి రాజువు. నీలాంటి వారు ఒక తోడేలుకి యిలా భయపడటం సబబేనా?నీలాంటి నాయకులు అలా పరుగు తీయవచ్చునా? రేపు యీ విషయం మిగిలిన జంతువులకి తెలిసిన నీ పరువు వుంటుందా" ఈ మాటలకి సింహం యే సమాధానం చెప్పలేదు. దానికి భయం యింకా తగ్గలేదు. నక్క మాటలు సింహం అసలు నమ్మలేదు. నక్క మరలా యిలా అంది. "ఓ రాజా! ఆ తోడేలును నీ గుహనుంచి వెళ్ళగొడతాను. నీవు నాతోరా "సింహం తనలో తాను ఇలా అనుకుంది. ఇది అసలే నక్క దీనిని అసలు నమ్మరాదు. దీనితో వెళితే ఇది నన్ను గుహ దగ్గరకు తీసుకెళ్ళి అచటనే వదలిపెడుతుంది. అపుడు నేనేం చేయాలి? ఆ జంతువుని చూసి నక్క పారిపోతే? ఇంతలో సింహానికి ఒక ఉపాయం తట్టింది. "ఓ నక్కా! నేను నిన్ను నమ్మను. నేను చెప్పింది చేస్తే నీతో రావడానికి ఒప్పుకుంటాను" అంది. నక్క అది యేమిటో చెప్పమంది. "నా తోకతో నీ తోకను ముడివేసుకొని యిద్దరం వెళదాం సరేనా" అంది. దీనికి నక్క ఒప్పుకుంది. ఆ తోడేళ్ళు యేమి చేయలేవని నక్క ఆలోచన.

సింహం, నక్క తోకలు ముడివేసుకొని గుహ వద్దకు చేరుకున్నాయి. సింహం, నక్క కలిసి రావడం ఆడతోడేలు చూసింది. నక్క యేదో ఎత్తు వేసిందని ఆడతోడేలు ఊహించింది. తోడేలు గుహముందుగా వచ్చి పక్కకు నిలబడింది. "ఏం నక్కా నేను రెండు సింహాలను తెమ్మంటే, ఒక్క దాన్నే తెచ్చావేమి? సరే ముందు నిన్ను చంపుతాను. తరువాత సింహాన్ని కూడా చంపి ఆ రెండింటినీ కలిపి వండుకు తింటాను" అని అరిచింది. ఆ మాటలు సింహం వింది. నక్క తనని మోసం చేసిందని భావించి వెనుకకు తిరిగి వేగంగా పరుగెత్తింది. ఆ పరుగులో నక్క శరీరం చీరుకుపోయింది. తోక తెగి, అది క్రిందపడి చనిపోయింది.

ఇదంతా చెట్టుపైన వున్న ఒక కోతి చూచింది. నెమ్మదిగా ఆ కోతి సింహం దగ్గరకు వెళ్ళింది. నక్క చెప్పినట్లే చెప్పింది. మెల్లిగా సింహాన్ని ఒప్పించింది. సింహం కోతితో యిలా అంది "నీవు తాడుతో నా మెడకు నీ మెడకు కట్టు. అప్పుడు వెళ్ళుదాం" అంది. అలాగే చేసింది. ఆ రెండూ తాడుతో మెడలు కట్టుకున్నాయి. నెమ్మదిగా గుహ దగ్గరకు వెళ్ళినాయి. రెంటిని ఆడతోడేలు చూసింది.

ఆడతోడేలు నక్కని అరచినట్లే "ఓసీ కోతి! పొద్దుననగా సింహాన్ని తీసుకువస్తానని ఇంతరాత్రికి వస్తావా? ముందు నిన్ను చంపి, తరువాత సింహాన్ని చంపుతాను" అంది పెద్దగా. ఈ మాటతో సింహానికి వణుకు పుట్టింది. అది వెనుకకు తిరిగి పరుగులంకించుకుంది. దానితో పాటు కోతి కూడా పరుగెత్తాల్సి వచ్చింది. అవి రెండూ అలా పరుగెత్తి ఒక దిగుడు బావిలో పడి చనిపోయాయి.

అందుకే పెద్దలు "బుద్ధిబలం వుంటే బలహీనులు కూడా బలవంతులను జయించవచ్చును" అంటారు.

--((***))--

24. చక్వవేణ మహారాజు కథ .


 “ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.” వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.ఇక్కడ నీటినే ధనం అనుకుంటే... తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం ! అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. 
ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా , ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !! పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది. ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు. తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు. మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది. ఉదయం ఆమె పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘ అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’ అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి. ‘చూసారా స్వామి ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’ అంది, మండోదరి. ‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’ అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి. హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు. మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది. అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి, పంపివేసాడు.నీతి : క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది. దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది ! ఇది సత్యం !
--((**))--


25. ఆహవి(అనువాదకథ)
సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి...............
ఏదో అడవి జంతువు వెంటపడుతున్నట్టు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చింది ఆహవి. ఆమెకు పదేళ్ళుంటాయి. ఆమెతోపాటు గాలికూడా రయ్యిమని లోపలికి దూరింది. పుస్తకాల సంచిని విసిరేసింది. దేన్నో వెతుకుతున్నట్టు అటూ ఇటూ చూసింది. పది మైళ్ళదూరం పరుగుతీసినట్టు రొప్పుతోంది.
అమ్మ వంటగదినుండి తొంగిచూసింది. ప్రతి శుక్రవారమూ జరిగే తంతే ఇది. బడినుండి వచ్చేప్పుడే పేచీ పెట్టుకోడానికి ఏదో ఒక కారణంతో వస్తుంది. అఖిల ఒంటరిగా కెనడాకి శరణార్థిగా వచ్చినప్పుడు నాలుగు నెలల చూలాలు. ఐదునెల్ల తర్వాత ఆహవి పుట్టింది. అమ్మే ఆహవికున్న ప్రపంచం. ఒడిలో పడుకుంటే అఖిల ఆమె తల నిమిరింది.
“నిమరకు. గట్టిగా రెండు చేతులతో నొక్కు!” కయ్యిమంది. తల్లి కూతురి తలను రెండు చేతులతో అదిమింది.
“సరే, ఇక నీ కాకమ్మ కబుర్లతో నా బుర్ర నింపు…” అంది. ఇంత ఆవేశంగానూ కోపంగానూ ఆహవి ఇదివరకు ఎప్పుడూ మాట్లాడలేదు.
అఖిలకి కూతుర్ని ఎలా మంచి చేసుకోవాలో తెలుసు. “ముందు నువ్వు తిను. తర్వాత నేను అబద్ధాలు చెప్పినట్టు ఎవరు చెప్పారో అది చెప్పు.”
“బక్కపీనుగ మైక్‌గాడు చెప్పాడు.”
“వాడికెలా తెలుసు?”
“వాడికి అన్నీ తెలుసు. వాడికి ఇద్దరు నాన్నలు. ఇద్దరూ విమానాలు నడిపేవాళ్ళే!”
“విమానం నడిపేవాళ్ళైతే వాళ్ళకి అన్నీ తెలుసా ఏంటి? ఇంకేం చెప్పాడో చెప్పు,”
“మా నాన్న వదిలేసి పోయాడట…”
“దానికి నువ్వేమన్నావు?”
“గాడిద పళ్ళోడా! ఉడత ముక్కోడా! అని తిట్టాను.”
“ఎందుకలా తిట్టావు?” తల్లి ప్రశ్నించింది.
“అంతకంటే ఎక్కువగా తిట్టడానికి నాకు బూతులు రావు.” నొచ్చుకుంది ఆహవి.
“దానికి వాడేమన్నాడు?”
“మీ అమ్మ నిన్ను పడేసి బొడ్డుపేగుని దాచుకునుండొచ్చు అన్నాడు.”
“అవునా? నువ్వేమన్నావు?”
“నువ్వే చూడటానికి బొడ్డుపేగులా ఉన్నావు. మీ అమ్మ అదే చేసిందేమో అన్నాను,” అంది ఆహవి.
“ఆ పైన?”
“అప్పుడు గంట కొట్టేశారు.” అంది ఆహవి.
శుక్రవారం రాత్రులంటే ఆహవికి నచ్చవు. అఖిలకి కూడా చిరాకే. తను ఉద్యోగం చేసే కంపెనీలో వారానికి నాలుగు రోజులు పగలు ఉద్యోగం. శుక్రవారం మాత్రం రాత్రి ఉద్యోగం. రాత్రంతా మేలుకుని ఎక్స్‌పోర్ట్ చెయ్యాల్సిన వస్తువులను పెట్టెల్లో సర్దిపెట్టాలి. శనివారం పొద్దున్నే వాటిని తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద ట్రక్కులు వస్తాయి. శుక్రవారం రాత్రుల్లో ఆహవికి తొందరగా అన్నం పెట్టి పడుకోమని చెప్పి పనికి వెళ్ళిపోతుంది అఖిల. టీవీ చూస్తూనే అలా మంచం మీద వాలిపోయి నిద్రపోతుంది ఆహవి. పొద్దున్నే లేచే సమయానికి అమ్మ పక్కన ఉంటుంది.
ఆహవి చదువుకునే బడిలో ఐదు రకాల పిల్లలు చదువుతారు. ఇద్దరు తల్లులున్న పిల్లలు. ఇద్దరు తండ్రులున్న పిల్లలు. అమ్మ, నాన్న ఇద్దరూ ఉన్న పిల్లలు. ఒంటరి తండ్రితో ఉండే పిల్లలు. ఒంటరి అమ్మతో ఉండే పిల్లలు. ఇద్దరు తల్లులు, తండ్రులు ఉన్న పిల్లలు గొప్పలు పోతుంటారు. ఒంటరి తల్లులున్న పిల్లల్ని గేలి చెయ్యడం, ఆటపట్టించడం- మీ నాన్న ఎక్కడ? లేచిపోయాడా? అని. వాళ్ళకి అలా ఏడిపించడం సరదా.
“మా నాన్నేడి?” అని ఆహవి తన తల్లి మీద ఎప్పుడూ విరుచుకుపడుతూ వుంటుంది. కొంతకాలంగా ఆహవి తల్లితో సుముఖంగా మాట్లాడటంలేదు. ఏమి చెప్పినా దానికి బదులు మాట్లాడుతుంది. ఏమడిగినా వంకర సమాధానాలు చెప్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ‘ఎలా ఉన్నావు?’ అనడిగితే ‘దిట్టంగా ఉన్నాను!’ అంటోంది. ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తే అవుననో లేదనో అంటే సరిపోతుంది. అయితే ఈ పిల్ల పళ్ళు ఇకిలించుకుంటూ ఏం మాట్లాడకుండా నిల్చుంటుంది.
ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు వంద పెన్సిళ్ళు పోగొట్టుకొచ్చింది. అడిగితే ‘పోయింది’ అని అరుస్తుంది. తనతో చదివే పిల్లలందరూ ఇలానే పోగొడుతున్నారా?
“పెన్సిల్ ఎక్కడే?” అడిగింది అఖిల
“పోయింది,” అంది.
“ఎక్కడ పోగొట్టావు?”
“పెన్సిల్ ఏమైనా నాకు చెప్పా పోతుంది? ఎలానో పోయింది.”
“అదెలా పోతుంది రోజుకొక పెన్సిల్? నీకు పెన్సిళ్ళు కొనే నేను పేదరాల్ని ఐపోయేలా ఉన్నాను!”
“ఇప్పుడేమైనా మనం కోటీశ్వరులమా?”
“మాటకు మాట ఎదురు మాటాడకు. నేనొక్కదాన్నీ రాత్రింబవళ్ళు కష్టపడి సంపాయిస్తున్నాను. నీకు వంట చేసి పెడుతున్నాను. నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను. కొంచం బాధ్యత తెలుసుకుని నడుచుకో. చెప్పేది అర్థమవుతోందా?”
“నువ్వు చెప్పినవాటిల్లో ఏ పదానికి నిఘంటువు చూసి అర్థం తెలుసుకోవాలో చెప్పావంటే అప్పుడు అర్థమవుతుంది!”
ఇడియప్పానికి కలిపిన పిండిని కొంచం తీసుకుని ఉండగా ఒకచేత్తో పిసుకుతూ టేబుల్ కింద కూర్చుని కథల పుస్తకం చదువుతోంది ఆహవి. ఆ ఒక్క చోటే ఆమెకు తల్లి తొందర ఉండదు. చాలా సమయం పట్టే కొత్త అల్పాహారాన్ని తయారుచేసి టేబిల్ కిందున్న కూతురి చేతికి అందించింది అఖిల. దాని రంగునీ ఆకారాన్నీ చూసి ఆహవి ‘వద్దు’ అనేసింది.
“తిని చూడు నచ్చుతుంది,” అంది అఖిల.
“నువ్వు చేసేవి ఏవీ బాగోవు!”
“నువ్వు రానురాను అన్యాయంగా తయారవుతున్నావే! చిన్నపిల్లగా ఉన్నప్పుడే నయం, ఏం పెట్టినా తినేదానివి.”
“అప్పుడేం తినేదాన్ని?”
“నన్ను తినేదానివి!” అంది అఖిల.
అది విని పడిపడి నవ్వింది కూతురు. టేబుల్ కిందనుండి బయటికొచ్చి తల్లి చుట్టూ చక్కర్లుకొడుతూ, “నేను తిని మిగిల్చిన ఆహారమే అమ్మ! నేను తిని మిగిల్చిన ఆహారమే అమ్మ…” అంటోంది. అఖిలకీ నవ్వొచ్చింది. ఆహవితో తర్కించడం అసాధ్యం. మాటలకి తడుముకోదసలు. నోరు తెరిస్తే చాలు, చమత్కారం అలా వచ్చిపడుతూనే ఉంటుంది.
ఇంత తెలివితేటలున్న పిల్ల రోజూ పెన్సిళ్ళెందుకు పోగొడుతోంది? అఖిలకి అంతు చిక్కలేదు. ఆమె స్కూల్ టీచర్ కూడా ‘ఈ పిల్ల కావాలనే పోగొడుతుంది!’ అంది. తనతో చదివే పిల్లలకి కూడా ఈ పెన్సిళ్ళు మాయమయ్యే మర్మం అంతుచిక్కలేదు. కూతుర్ని ఒక సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్ళింది. డాక్టర్ ఇద్దర్నీ కొన్ని ప్రశ్నలడిగాడు. తర్వాత పాపతో ఏకాంతంగా మాట్లాడాడు.
“ఆహవి మనసులోపల తీరని వెలితి ఉంది. దాన్ని పూరించడానికి ప్రయత్నించండి.” అన్నాడు డాక్టర్. అప్పుడనిపించింది అఖిలకి, నాన్నలేని లోటే తనకున్న వెలితైయుండచ్చు అని.
సిల్వియాకి ఫోన్ చేసింది. అఖిలతో కలిసి చదువుకున్న స్నేహితురాలు ఆమె. మీడియాలో దర్యాప్తు కథనాలవీ కవర్ చేస్తుంటుంది. కొలంబోలో ప్రసిద్ధ జర్నలిస్ట్. మాంగుళంలో అఖిలవాళ్ళమ్మ చనిపోయినప్పుడు యుద్ధవాతావరణం నెలకొని ఉండటంతో అంత్యక్రియలవీ సిల్వియా సాయంతోనే నెరవేర్చగలిగింది. జరిగినవన్నీ సిల్వియాకు తెలుసు. రాత్రికి రాత్రి తప్పించుకుని వచ్చిన అఖిలని కొలంబోలో తనతోబాటు ఉంచుకుని, దొంగ పాస్‌పోర్ట్ ఇప్పించి, కెనడా రావడానికి సాయంచేసింది. ఆమెతో ఇప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు,
“పేరు తెలుసా?” అడిగింది.
అఖిల చెప్పింది.
“ఎలా తెలుసు?”
“వాళ్ళు మాట్లాడుకున్నారు.”
“ఇంకేమైనా వివరాలు తెలుసా?”
“కమేండో డివిజన్ మేజర్ జయనాథ్ ఆద్వర్యంలో ముట్టడి చేశారు.”
“ఇది చాలు. కనుక్కుంటాను.” అని ధైర్యం చెప్పింది సిల్వియా.
రెండు నెలల తర్వాత అర్ధరాత్రి సిల్వియా దగ్గరనుండి ఫోన్ వచ్చింది. “వెంటనే బయలుదేరు, కనిపెట్టేశాను!” అంది. సిల్వియా అడ్రస్ చెప్తుండగా న్యూస్ పేపర్ మీద రాసుకుంది. రెండు రోజుల్లో బయల్దేరుతామని చెప్పింది అఖిల. “ఎంత తొందరగా వస్తే అంత మంచిది. రెండు నెలలుగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఫలితం ఈ వివరాలు. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఈ అవకాశం రాదు. వెంటనే రా!” అంది సిల్వియా.
జూలై 9, 2010 శుక్రవారం అఖిల తన కూతురితో కొలంబోలో దిగింది. మినువాంగొడ కొలంబోనుండి 35 కిలోమీటర్ల దూరం. అక్కడనుండి ఉడుగంపొల అనే గ్రామానికి వెళ్ళాలి. అవన్నీ పూర్తిగా సింహళులు నివసించే ప్రాంతాలు కావడంతో అఖిలకి కొంచం బెరుకు ఉండింది. సిల్వియా నవ్వింది. “గుర్తుందా? నువ్వు కెనడా వెళ్ళేప్పుడుకూడా ఇలానే భయపడి చచ్చావు. నేను చెప్పాను–రెండువేల ఏళ్ళ క్రితం ఏసుని కనడానికి మేరీమాత పది రోజులు గాడిదల మీద ప్రయాణించలేదా? నువ్వు విమానంలోనే కదా ఎగరబోతున్నావు! ఎందుకింత భయపడుతున్నావు? అని. ఇప్పుడు చూడు, యుద్ధం లేదు. ఒక గంట ప్రయాణమే. నిర్భయంగా వెళ్ళి రా. నాకు తెలిసిన ఆటో అతన్ని ఏర్పాటు చేశాను.” అంది సిల్వియా.
ఆహవి ఆటోని చూడటం ఇప్పుడే. దానిలో ప్రయాణం అనగానే ఆమెకి పట్టలేనంత కుతూహలం! తల బయటకి పెట్టి వేడుక చూసింది. ఆకాశానికేసి చూసింది. ఇంత నిర్మలమైన నీలవర్ణపు ఆకాశాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూసింది లేదు. ఇంత వెలుతురు కూడా కొత్తే ఆమెకి. మినువాంగొడ దాటగానే తారు రోడ్డు మట్టి రోడ్డుగా మారింది. ఆటో కుదేయడం మొదలుపెట్టింది. ఆ కుదుపులకి ఆహవి తుళ్ళింత జతచేరింది. వీధుల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఆటోని వెంటాడాయి. రోడ్డు పక్కనే ఉన్న అరటి చెట్లకు పెద్దపెద్ద అరటి గెలలు వేలాడుతున్నాయి. చిన్న మూతి ఉన్న బాటిళ్ళ లోపల పెద్ద మామిడికాయలు చెట్లకి వేలాడుతున్నాయి. “ఇదెలా సాధ్యం?!” అడిగింది ఆహవి. “నీకన్నీ తెలుసంటావు కదా? ఆలోచించు…” అంది అఖిల. గిన్ని కోళ్ళను ఆహవి టేబుళ్ళ మీద చూసిందిగానీ ఇలా వీధుల్లో తిరగడం చూళ్ళేదు. చిన్న తలతో, పెద్ద శరీరంతో అవి మేత పొడుచుకుతింటూ అటూ ఇటూ నడవడం ఆశ్ఛర్యంతోబాటూ నవ్వూ తెప్పించాయి. ఆమె చిన్ని బుర్ర అన్ని ఆశ్చర్యాలను నింపుకోలేకపోయింది. ఉన్నట్టుంది, “అమ్మా, ఎక్కడికెళ్తున్నాము? అమ్మమ్మ వాళ్ళ బంధువుల ఇంటికా?” అనడిగింది.
“కొంచం ఆగు, ఎందుకంత తొందర? చెప్తాను. వెళ్ళేచోట తిన్నగా ప్రవర్తించు. అక్కడ నీ వంకర మాటలు ప్రదర్శించకు. నీ బుర్రని కాసేపు వాడకు. నీ పేరేమని ఎవరైనా అడిగితే ఒక మంచి కెనడా అమ్మాయిలా ఆహవి అని చెప్పు. పళ్ళికిలించుకుంటూ నిల్చోకు.”
“సరే, అలా బుద్ధిమంతురాలిగా నడుచుకుంటే నాకేమిస్తావు?”
“ఏమివ్వాలేంటీ? క్లాసులో మంచిపేరు తెచ్చుకుంటే గిఫ్ట్ అడగచ్చు. లేదా వంద మీటర్ల పరుగుపందెంలో నెగ్గితే ఏదైనా ఇవ్వచ్చు. తిన్నగా ఉండటానికి కూడా ఏదైనా ఇస్తారా?”
“ఓ దేవుడా! నా జీవితమే ముగిసిపోయింది. పదివేల మైళ్ళు ఎగిరివచ్చింది నా సత్ప్రవర్తనని ప్రదర్శించడానికా!”
“సరే సరే. ఇక ఆపు. ఇంక కొన్ని నిముషాలే! నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుంది.”
“నేను నమ్మను,” అంది ఆహవి.
“గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారే రోజు. ఒకసారి అది మారాక మళ్ళీ గొంగళిపురుగుగా మారగలదా?”
“అదెలా మారుతుంది? సీతాకోకచిలుక సీతాకోకచిలుకే!”
“అదే. నీ జీవితంలోకూడా అలాంటొక సమయం ఇది.”
“నేను రూపు మారబోతున్నానా?”
“మట్టి బుర్ర!” అనొకసారి ముద్దుగా ఆహవి తలమీద మొటికేసింది తల్లి.
అఖిలకి కొంచం సింహళం వచ్చు. ఏం మాట్లాడాలన్నది మనసులో ఓ సారి ఆలోచించుకుంది. ఆ వీధిలో అన్నీ మూడు నాలుగు గదులున్న ఇళ్ళు. అన్నిటికీ పైకప్పుగా ఆస్బెస్టాస్ రేకులు. పూలచెట్లు మెండుగా నాటివున్నాయి. ఎక్కడ చూసినా బోగన్‌విలియా, గులాబీ, అంథూరియం, కార్నేషన్ పువ్వులు పూసివున్నాయి.
ఆటో డ్రైవర్ దార్లో వెళ్ళే ఒకతన్ని సిఱిబాలా గురించి విచారించాడు. అతను ఒక ఇంటిని చూపించాడు. ‘ఒక సాధారణమైన సిపాయి ఇల్లు ఇంత పెద్దదా!’ అని అఖిల మనసులోనే ఒకసారి ఆశ్చర్యపోయింది. డ్రైవర్‌ని వెయిట్ చెయ్యమని ఆహవి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కగానే ఒక మహిళ వచ్చి తలుపు తీసింది. ఇంటిలో వేసుకునే దుస్తుల్లో ఉంది. 14 సైజ్ దేహాన్ని 12 సైజ్ దుస్తుల్లో కుదించినట్టు, దుస్తులు పిగిలిపోతాయా అన్నట్టు ఉంది ఆమె శరీరం. అయితే నవ్వు ముఖం. మెడలో లావుపాటి గొలుసులు. రెండు చేతులకీ మోచేతులదాకా గాజులు. వయసు ముప్పైకి లోపే ఉంటుంది.
“ఎవరు కావాలి?” అని అనుమానంగా అడిగింది.
“సిఱిబాలా…” అని అఖిల చెప్పగానే,
“ఆ! లోపలికి రండి,” అని సగం చిరునవ్వుతో ఆహ్వానించింది. నోటితో రమ్మని చెప్పినా మనసులో గాబరా ముఖంలో కనిపించింది.
“నా పేరు అఖిల. నేను కెనడా నుండి వస్తున్నాను. ఈమె నా కూతురి ఆహవి,” అంది.
ఆ ఇంటి ఆవిడకి ఏమీ అర్థంకాక దిగ్భ్రమ చెందినట్టు చూస్తూ ఉంది. చప్పుడు వినబడి లోపలనుండి ఓ పాప బయటికొచ్చింది. ఆ పాపను చూడగానే ఆహవికీ అఖిలకీ ఆశ్చర్యం! ఆహవిని అచ్చు గుద్దినట్టుంది. అదే ఎత్తు, అదే ఉంగరాల జుట్టు, అవే పొడవాటి కళ్ళు.
ఆ పాపని చూపించి, “మా కూతురు అసుందా. ఏమైనా తాగుతారా?” అనడిగింది ఇంటావిడ.
“నీళ్ళు మాత్రం…” అంది అఖిల.
“ఆయన లీవులో వచ్చివున్నారు. రెండు రోజుల్లో తిరిగెళ్ళిపోతారు. ఇప్పుడు సంతకెళ్ళారు. వచ్చేస్తారు,” అని చెప్పి వంటగది వైపుకెళ్ళింది.
ఆహవీ, ఆ ఇంటి పాపా ఒకరినొకరు ‘ఎంత వింతా!’ అన్నట్టు చూసుకున్నారు. సిఱిబాల ఇల్లాలు వంటగదినుండి నీళ్ళతో వెనుతిరిగిన సమయానికి సైకిల్ మీద వచ్చి దిగాడు సిఱిబాల. చేపలు, కాయగూరలు ఉన్న సంచుల్ని పట్టుకుని ఇంటి లోపలకి నవ్వుతూ అడుగులేశాడు. ఆ క్షణం తన జీవితం తల్లకిందులవ్వబోతోందని అతనికి తెలీదు.
అఖిల లేచి నిల్చుంది. అఖిలనీ ఆహవినీ చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఓ అడుగు వెనక్కేశాడు. ఆహవిని చూసి, తర్వాత తన కూతుర్ని చూశాడు. వాడికి ఏమీ అర్థం కాలేదు. వాడి భార్య బిత్తరపోయినట్టు చూస్తూ ఉంది. ఏదో చెడు తన జీవితంలోకి అడుగుపెట్టినట్టు తోచింది.
అఖిల సిఱిబాలని చూసింది. అదే ముఖం, అవే విరిగిన పళ్ళు. వాడి నవ్వు తల్లకిందులుగా కనిపించింది. ఏం చెప్పాలి, ఏం దాచాలి అన్నది ముందే నిర్ణయించుకుని పొడిపొడిగా మాట్లాడింది అఖిల.
“జెయసిక్కుఱు యుద్ధం జరుగుతున్న సమయం. 21 నవంబర్ 1997. శుక్రవారం. మాంగుళం. అర్ధరాత్రి ఒంటిగంట. మిలిటరీ వాహనంలో నువ్వు నీ జతగాడితో వచ్చి నా ఇంటి తలుపు పగలగొట్టావు. మా అమ్మ తల మీద నీ స్నేహితుడు తుపాకీతో కొట్టాడు… ఇది నీ కూతురు. పేరు ఆహవి. ఈమెకు తన తండ్రిని చూపించాలని కెనడానుండి వచ్చాను.”
సిఱిబాల భార్య దండెం మీంచి తడిచీర తెగిపడినట్టు నేలమీద దబ్బున పడిపోయింది. నీళ్ళ గ్లాసులు చెల్లాచెదురయ్యాయి. సిఱిబాల నోరు తెరచుకుని వణికిపోతూ నిల్చున్నాడు.
ఆహవిని చేయిపట్టి లాక్కుపోతూ అఖిల పరుగున వెళ్ళి ఆటోలో కూర్చుంది. డ్రైవర్ తలదువ్వుకుంటూ ఉన్నాడు. “తొందరగా… తొందరగా పోనివ్వు!” అంది అఖిల. ఆహవికి అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నది ఏదీ అర్థంకాలేదు. ఏం జరిగిందన్నది ఆమె చిన్న బుర్రకి అంతుచిక్కలేదు. ఆటో కదలగానే ఏదో పెద్ద ఇబ్బందినుండి తప్పించుకుని పారిపోతున్నట్టు ఆహవికి తోచింది. అమ్మ ముఖానికేసి చూసింది. ఆవేశంలో చమటలు పోస్తున్న ఆ ముఖం మరెవరిదోలా అనిపించింది.
“నేను మంచిగా ప్రవర్తించానా? ఎవరది? నా పేరెందుకు సింహళంలో చెప్పలేదు?” అనడిగింది ఆహవి.
అఖిల కూతుర్ని దగ్గరకి తీసుకుని ముద్దుపెట్టింది. తర్వాత, “అతని పేరు సిఱిబాల. అతడే మీ నాన్న. అతని ముఖాన్ని గుర్తుపెట్టుకో. బుర్రలో నిలుపుకో. ఇదే చివరిసారి. ఇక నువ్వెప్పుడూ అతణ్ణి చూడబోవు.”
“అప్పుడు అసుంద? ఆమె తల్లి, తండ్రి ఎవరు?”
“ఈ రోజునుండి అసుంద ఒంటరి తల్లికి కూతురు”
“నాలాగా?”


“నీలాగే.”

----------------------------------------------------------


రచన: అవినేని భాస్కర్, 

26. ముత్యాల చెరువు”
రచన....శ్రీమతి ఐ. వి. యస్. అచ్యుతవల్లి.

చిట్టి ప్యాసింజరు దిగుతూనే స్టేషను నలుమూలలా చూసింది. ‘ వెంకన్న కానీ సూరయ్య కానీ వచ్చినట్టు లేదు. నేను వస్తున్నట్టు రాసిన ఉత్తరం బహుశా నాన్నగారికి అంది ఉండదు. లేకపోతే బండి ఎందుకు పంపరు?’ అనుకుంది. స్టేషను బయటికి వచ్చి జట్కా ఎక్కింది.

జట్కా చిట్టి వాళ్ల ఊరు డాము దాకా ఉన్న సన్నటి కంకర రోడ్డు మీద బాగానే వచ్చింది. ఇక ఆ డాము దగ్గర్నుంచి వాళ్ళ ఊరు దాకా సుమారు రెండు ఫర్లాంగుల మట్టిరోడ్డు. ఇటీవల పడిన వర్షాల వల్ల ఆ మట్టంతా రేగడి బెడ్డలవడంవల్ల దిగబడిపోయింది. ముందు దారంతా బంద బందగా వుంది. ఇంక జట్కావెళ్లే అవకాశం లేదు. చిట్టి జట్కా దిగి, ఊళ్లోకి నడవడం మొదలుపెట్టింది. వెనకాల జట్కా వాడు పెట్టె, బెడ్డింగూ మోసుకుంటూ వస్తున్నాడు.

ఇంకా ఊరు కనుచూపుదూరంలో వుండగానే చిట్టి దృష్టి ఊరి పొలిమేరలో ఉన్న చెరువు మీద పడింది. చెరువు నిండా ఎన్నెన్నో తామరాకులు.., వాటినిండా వర్షపు తుంపర్ల వల్ల కలిగిన నీటికణాలు ఎండలో తళుక్కు తళుక్కుమని మెరుస్తూ , ఆకాశంనుంచి దేవతలు మంచి ముత్యాలు కురిపించేరా అన్న భ్రాంతిని కలిగిస్తున్నాయి. సన్నటి పొడుగాటి కాళ్ళతో నీటికొంగలు ఆ ఆకులమీద తేలిపోతూ నడుస్తున్నాయి. చెరువునిండా అరవిరిసిన తెల్లటి తామరపూలని చూసి ముచ్చట పడుతూ చిట్టి గబగబ నడిచి, చెరువుని కరువుతీరా చూసి, అందులో కాళ్లూ, చేతులూ మొహమూ కడుక్కుని ఇంటికి చేరింది.

ఇంట్లో అందరూ చిట్టి చుట్టూచేరి ఏవేవో కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ చిట్టికేదో వెలితిగా అనిపిస్తోంది. ఫలానా అని చెప్పలేని మూగబాధ ఆమె గుండెల్ని పిండేస్తున్నట్టుగా ఉంది. కాసేపటికి ఆమె తండ్రి పొలంనుంచి వచ్చాడు.
” జట్కా వేసుకు వచ్చావామ్మా! ఉత్తరం అందింది. కానీ ఏం చెయ్యను? పాలేళ్లకి ఎక్కడా ఖాళీలేదు. ఈ వర్షాలతో దాళవా కుప్పలన్నీ నాశనమయి పోయాయి. ఇంకా అన్యాయమేమిటంటే- ఏ పనికైనా కుడిభుజంలా ఉండే ఆదెయ్య మతిపోయి తిరుగుతున్నాడు. అన్నాడు చిట్టి తండ్రి.

“ఆదెయ్యకి ఆరోగ్యం బాగోలేదా నాన్నా?” అంది చిట్టి.
” ఏం బాగు తల్లీ! ఆ ‘ముత్తి’ పోయిందగ్గర్నుంచీ వాడికి అసలు మతే లేదు. ఇవ్వాళో రేపో అన్నట్టున్నాడు. నీకు చెరువుకట్ట మీద కనపళ్ళేదా?” అన్నారాయన. చిట్టి నిర్ఘాంతపోయింది. కారణం తెలియకుండా తన కడుపులో మెలిదిరుగుతున్న బాధ ఎందుకో అర్థమైంది.
” ముత్యాలు చచ్చిపోయిందా! ఎలా చచ్చిపోయింది నాన్నా? ఎప్పుడు జరిగిందీ?” ఆవేదనగా అడిగింది చిట్టి.
“ఆర్నెల్లవ్వొస్తోంది. పాపం!” అన్నారాయన బయటికి వెళ్ళిపోతూ.
‘ఆర్నెల్లయిందన్న మాట! నాకు ఉత్తరం కూడా రాయలేదు. అవును , వాళ్ల దృష్టిలో ఒక పాలేరు కూతురు చనిపోవడం ఒక సర్వసామాన్యమైన విషయం. ఎందుకు రాస్తారు? నేను పుట్టినది మొదలు ఇప్పటివరకూ నాకు ఎవ్వరూ ఇవ్వలేనంత మానసికానందాన్ని ప్రసాదించిన స్నేహశీలిని నేను ఎలా మరచిపోతాను?’ ఆలోచనలతో దుఃఖం తన్నుకు రాగా చిట్టి తన గదిలోకి వెళ్ళి మౌనంగా కూచుంది.

‘ముత్యాలు! మంచి ముత్యాలు! తన స్నిగ్ధ స్నేహంతో నా మనస్సుని బంధించిన ముత్యాలుకి అప్పుడే నూరేళ్ళు నిండాయా? నాతో ఒక్కమాట కూడా ఎందుకు చెప్పలేదు?’ చిట్టి తన సందేహాలకు సమాధానం ఎవరు చెప్పగలరు అనుకుంటోంది. ఇంతలో చిట్టిని స్నానం చేసి, బట్టలు మార్చుకోమంటూ ఆమె వదిన వచ్చింది.
“ముత్యాలుకేం జబ్బు చేసింది వదినా?” అడిగింది చిట్టి.
“జబ్బూ లేదు పాడూ లేదు. చెరువులో పడి చనిపోయింది” అంది వదిన.
“చెర్లోపడి ఎలా చచ్చిపోయిందొదినా?” దానికి ఈదటం వచ్చునే!” అంది చిట్టి.
“అయ్యో! వెర్రిపిల్లా…చావాలని పడ్డది.. ఈదుకుని గట్టుమీదకి వస్తుందా? ముందు లేచి స్నానం చెయ్యి” అంది ఆమె వదిన.
చిట్టికి కదలానిపించలేదు. ఆమె మనసు గతించిన సుందర జ్ఞాపకాల్లో పరిభ్రమించడం ప్రారంభించింది.

ఆ రోజు చిట్టి చెరువుగట్టు మీద కూర్చునుంది. ఇంతలో వెనకనుంచి “సిట్టీ” అని పిలిచింది అక్కడికొచ్చిన ముత్యాలు. “నిన్నో పాలి ముట్టుకోనిద్దూ.. ఏం!” అంది తనే మళ్ళీ. చిట్టి నవ్వి, ” ఇలా వచ్చి కూర్చో” అంది. కానీ ముత్యాలు దూరంగానే కూర్చుని, నెమ్మదిగా తనచేత్తో చిట్టి చేతికున్న గాజుల్ని తడిమింది.
“ఇలా పక్కన కుర్చోమంటే అంత దూరంగా కూర్చున్నావేం?” అంది చిట్టి.
“వోరన్నా సూత్తారు” అంది ముత్యాలు.
“చూస్తే..?” అంది చిట్టి.
” ఏం నేరనట్టు మాటాడుతావే. సూత్తే ఇంకేమన్నా ఉందా? ఇద్దర్నీ నిలేసి తంతారు పెద్దోళ్ళు” అంటూ నవ్వింది ముత్యాలు. అక్కడ చెరువుగట్టువార సన్నటికాడకి అరకు చుక్కల్లాంటి ఆకులుండి, ఊదారంగులో అరచేయంత పువ్వులున్నాయి. అవేమిటో తెలీక, చిట్టి ” అవేం పూలు ముత్తీ?” అని అడిగింది.
“తెలవ్వా! తూటు పూలు” అంది ముత్యాలు. ఇంతలో నల్లటి చారలున్న ఓ సన్నటి పాము నీళ్ళల్లో ఈదుకుంటూ పోయింది.
“అమ్మో! పాము..! అని అరిచింది చిట్టి.
“అవ్వేం చేస్తయ్… బురద కట్టెలు! ఆట్ని సంపితే పాపమంట. అయి ముందు జన్మలో రుసీస్వరులంట” అంటూ చిట్టి పాదాల్ని నెమ్మదిగా ముట్టుకుని మళ్ళీ వేగంగా చెయ్యి వెనక్కి తీసేసుకుంది ముత్యాలు.
చిట్టి నవ్వి, ” ఎందుకంత భయం? ఇక్కడ పల్లెటూరవడంవల్ల ఇలాంటి పిచ్చిలున్నాయి. కానీ మా బస్తీలో ఇలాంటివేంలేవు తెలుసా? నీలాంటి వాళ్ళంతా మా పక్కనే కూర్చుంటారు. నాతో చదువుకొందుకూ, ఆడుకొందుకూ మా ఇంటికి వస్తారు. మా పెద్దనాన్న గారు ఏమీ అనరు” అంది.
“ఆళ్ళంతా అదురుట్టమంతులు. అవును సిట్టీ! మీ బత్తీలో బయస్కోపు లుంటాయి కదా! మరి నువ్వు రోజూ సూత్తావా?” అంది ముత్యాలు.
“సినిమాలా?… రోజూ చూస్తే చదువో..! ఎప్పుడైనా మంచి సినిమా వచ్చినప్పుడు చూస్తాను” అంటూ ఇంటికి వెళ్ళడానికి లేచింది చిట్టి.
“అప్పుడే ఎల్లి పోతవా?” అంది ముత్యాలు
“కాఫీ వేళయింది కదూ..” అంది చిట్టి.
” రేపు వొత్తవా? రెండు వారాల కింద మీ ఇంటికి ఉలవల బత్తా బాగుసెయ్యటాని కొచ్చినప్పుడు అమ్మగారు నువ్వొచ్చినావని సెప్పేరు. అప్పట్నించీ నీతో మాట్టాడాలని ఒకటే మనసు నాకు!” మెరుస్తున్న కళ్ళతో అంది ముత్యాలు.
” రోజూ వస్తాను. నువ్వు కూడా రోజూ రా! ఏం..” అంటూ ముత్యాలు భుజంమీద చెయ్యివేసి చెప్పింది చిట్టి. ముత్యాలు కొద్ది క్షణాలు చిట్టికేసి చూస్తూ నిలబడింది. కాస్సేపటికి తమాయించుకుని, తన భుజంమీదున్న చిట్టి చెయ్యిని తనచేతుల్లో పట్టుకుని వదిలేసింది. ఆ తర్వాత సెలవులయిపోయి, వచ్చేసే ముందు చిట్టి ముత్యాలుకి ఒక పాత సిల్కు చీర ఇచ్చింది. ముత్యాలు ఎంతో సంబరపడిపోయింది.

మళ్ళీ సంవత్సరం చిట్టి సెలవులకి ఇంటికి వచ్చి పదిహేను రోజులైనా ముత్యాలు కనిపించలేదు. ఓ రోజు చిట్టి చెరువు గట్టున కూచునుండగా , ” ఎప్పుడొచ్చావు సిట్టీ?” అంటూ వచ్చింది ముత్యాలు.
“నేనొచ్చి పదిహేను రోజులయింది. ఎక్కడా కనిపించడం లేదే?” అంది చిట్టి.
“ఊడ్పులకి గూడెం ఎళ్లేం. నిన్న సాయంత్రమే వస్త.” అంటూ చిట్టికి కొంచెం దూరంలో కూచుంది ముత్యాలు.
“అదేంటీ? మనూరిలో పని లేదా?” అడిగింది చిట్టి.
“ఎందుకు లేదు? ఇక్కడ కూలి తక్కువ సిట్టీ. గూడెంలో మడుసులు తక్కువ. రెండు రూపాయలు ఇత్తన్నారు. ఈ పదిరోజులూ పోయ్యిలోకీ, కడుపులోకీ ఇచ్చి, రెండు రూపాయలిచ్చేరు.
“ఈ వారం రోజులుగా ఒకటే వర్షం కదా! మీరెలా పనిచేశారు?” ఆశ్చర్యంగా అడిగింది చిట్టి.
” బలే దానివే! వాన లేకపోతే ఎక్కడూడ్వమంటావ్? ఆ వానదేవుడు సల్లంగ సూత్తేనేకదా…మన కడుపులోకి బువ్వ వచ్చేది! అంటూ పకపక నవ్వింది ముత్యాలు.

చిట్టి ముత్యాలుకేసి చూసింది. ‘ముత్యాలు దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంది. పది రోజులుగా మోకాలు లోతు బురదలో , వర్షంలో తడుస్తూ పనిచేసిన మనిషల్లే లేదు. నిగనిగలాడుతూ మెరుస్తూనే ఉంది. అదే నాకైతే కొంచెం తడిస్తే చాలు జలుబు చేసేస్తుంది.’ అనుకుంది చిట్టి తనలో. రెండు పూటలా శుభ్రంగా తిండి తినే తను….జావ నీళ్లతో బతుకుతున్న ముత్యాలు చేసే పనిలో ఎన్నో వంతు చెయ్యగలదు? సరైన పోషక పదార్థాలు తీసుకోలేని వాళ్ళు–మాకోసం పని చేస్తున్నారు. వేలాదిమంది పొట్టలు నింపడానికి వాళ్ల పొట్టల్ని చిలక్కొయ్యలకి వేలాడేసి శ్రమిస్తున్నారు. వాళ్ల కన్నా మేం ఎక్కువ వాళ్ళం ఎలా అవుతాము?” ఆలోచనలో ములిగిపోయింది చిట్టి.
“వొత్తాను సిట్టీ…మరేటంటే….నేను ఊడ్పుకి గూడేనికి పోయినానని మీ నాన్నోరికి కోపంగా వుంది. కాస్త నువ్వు సదరాలి.” అంది ముత్యాలు.

“చెప్తాలే…అయినా నువ్వు ఊడ్పులకి వెళ్తే ఆయనకెందుకు మధ్యలో?” అంది చిట్టి.
“నీకేం తెల్దు సిట్టీ! మా అయ్య మీ కమతంలో పాలికాపు గందా! అందు గురించి ఆడివోళ్ళంతా మీ కమతంలోకి ఊడ్పులోకి రావల్సుంటది.”అంది ముత్యాలు.
“అయితే మరెందుకు రాలేదు?” అడిగింది చిట్టి.
“ఏం సేయను సిట్టీ? నాన్నగారు పదణాలు , ముప్పావులా ఇత్తన్నారు. గూడెంలో రూపాయిన్నరా రొండూ ఇత్తన్నారు. అందుకని అక్కడికి పోయాను.” అంది ముత్యాలు.
“అవును మరి! మీకు నాలుగు డబ్బులు ఎక్కువ ఎక్కడ దొరికితే అక్కడే పనిజేస్తారు. దానికి కూడా మా ఆజ్ఞేనా?” అంది చిట్టి.
” మేమందరం మీచేలో వొంగాల్సినాళ్ళం. డబ్బులకి ఆశపడి అట్టాపోయినాను. మీ నాన్నగోరికి కోపమొచ్చి మా అయ్యని పనిలోంచి తీసేస్తనన్నారు. కొత్త ఏడాదిలో రెండు నెల్లయి సేత్తన్నాడు. ఊడ్పులు అయిపోవచ్చాయి… ఇప్పుడాడిని పనిలో కెవురు పెట్టుకుంటారు?” అందులో పని పూర్తికాకుండా మానిపించినోణ్ణి అసలెట్టుకోరు. మేము ఈ ఏడంతా తిండి లేకుండా మాడిపోవాలి.” అంది ముత్యాలు.
“నేను చెప్తాలే.” అంది చిట్టి.

మర్నాడు చిట్టి తన తండ్రితో మాట్లాడింది. ఆ సమయానికి ముత్యాలు, ఆమె తండ్రి ఆదెయ్యా అక్కడే వున్నారు. ” నీకు తెలియదులేమ్మా! తండ్రి తండ్రే ! కూతురు కూతురే! ఉత్త దొంగ వెధవలు. వీడు మొన్న వడ్లు ఆడించుకుని , ఆ తవుడు మనకివ్వకుండా అమ్ముకున్నాడు. ఆ ముత్తి దొంగముండ! మనకి రాకుండా గూడేనికి పోయింది. నా సొమ్ము తింటూ వూళ్లు ఏలమనా–వీళ్ళని ‘ పాలె’ కి పెట్టుకున్నది? అన్నాడు చిట్టి వాళ్ల నాన్న.

” ఈసారికి క్షమించండి నాన్నగారూ…పాపం ఏటికేడాదీ తిండి లేకుండా చేసినవాళ్లమవుతాం.” అంది చిట్టి.
” నా తల్లి.., నా బంగారు తల్లి! నీ కడుపు నిండాలమ్మా. నీ పాదాలకి మొక్కుతా” అన్నాడు ఆదెయ్య.
“ఏదో బుద్ధి గడ్డి తిన్నది బాబులూ! తవుడు మేం అమ్ముకోలేదయ్యా. కోళ్లకి ఏసుకుందామని దాసుకున్నాం. ఆ తవుడు బత్తా తెచ్చి మన పాకలో పెట్టేత్తాను. అంది ముత్యాలు.
చిట్టి తండ్రి అక్కడినుంచి వెళ్ళిపోయాకా , “మీరు ధాన్యం మరలో ఆడించుకుంటే వచ్చిన తవుడు మాకెందుకివ్వాలి? మీరు అమ్ముకుంటే నాలుగు డబ్బులోస్తాయి గదా!” అంది చిట్టి.
” అలా కామందులు ఊరుకుంటారా? మీ నాన్నోరు సాలుకి పదేను దాన్నెపు బత్తాలు మా బాబుకి జీతాల కింద ఇత్తారు. అయ్యి ఆడించుకున్న సిట్టూ, తవుడూ మీకే ఇయ్యాల. గొడ్లున్న వాళ్ళయితే అడిగి తీసుకుంటారు.” అంది ముత్యాలు.
చిట్టికి ఈ పద్ధతి న్యాయంగా తోచలేదు. కానీ ఆమెను ఎవరూ అర్థంచేసుకోవడం లేదు.
” ఏమిటీ..దాన్నలా రాసుకు పూసుకు తిరుగుతావ్? నీకు చిరాకెయ్యదూ?” అంటుంది చిట్టి వాళ్ల మామ్మ.
” చిన్నప్పట్నుంచీ దీనివి దరిద్రగొట్టు లక్షణాలే. దీన్నెత్తుకునే నరిసి దగ్గరే అన్నం తింటాననేది అత్తయ్యా!” అనేది చిట్టి వాళ్ళ అమ్మ.

కాలం పరిగెడుతోంది. చిట్టి ఈసారి సెలవులకొచ్చేసరికి చెరువుకి ఏ దోషం తగిలిందో ఏమో..! తామరపూలన్నీ తలలు వాల్చేసాయి. ఆకులన్నీ వాడిపోయాయ్. చెరువు నిర్జీవమై పోయింది. “తామర అంతా అలా చచ్చిపోయిందేమిటే ముత్యాలూ?” అంది చిట్టి.
“అరిగె బియ్యం కడిగారు కాబోలు.. ఎదవసచ్చినోళ్ళు. తామర దుంపంతా సచ్చిపోనాది.” అంది ముత్యాలు.
దానికి ఎన్ని విషయాలు తెలుసు! అని ఆశ్చర్యపోతూ , “అరిగె బియ్యం అంటే ఎలా ఉంటాయి?” అంది చిట్టి.
“అయి నువ్వెప్పుడూ సూడలేదేటి? అయ్యీ ఓరకం దాన్నెమే. మినుముల్లా నల్లగా ఇంకాత్త పొడుగ్గా ఉంటాయి. నున్నగా జారిపోయేలా ఉంటాయి. అయి బియ్యం అవటానికి బోలెడు చాకిరీ చెయ్యాల! ముందు ఓ పాలి దంపి, తిరగట్లో ఇసరాల.” అంది ముత్యాలు. చిట్టి మళ్ళీ చెరువుకేసి దిగులుగా చూసింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“సిట్టీ! నీ ద్యాస అంతా సెరువుమీదే వుంది కాబోలు. మొకం వాడిపోయింది. నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఈ సెరువు నిండా మునుపటికన్నా ఎక్కువ పూలుండేట్టు సేత్తాను. దిగులు పడమాక. పాలెం పెద్దసెరువులో బోలెడు తామర దుంపలుంటాయ్. నాలుగు తెచ్చి పడేత్తాను.” అంది ముత్యాలు.
అక్కడే ఉన్న సూరయ్య ఆ మాటలు విన్నాడు.
“ఏటేటీ..? తామర దుంపలు నువ్వుతెచ్చి ఏత్తావా…? పెద్ద ఈరురాలు బయల్దేరింది! బతుకుదామనా.. సద్దామనా?? అన్నాడు గట్టిగా.
“తామర దుంపలు పాతుతేనే పేనం పోతదా?” అంది ముత్యాలు.
” అవును… ఎనకా ముందూ ఎవరూ లేనోళ్లూ, రేపోమాపో సచ్చే ముసలోళ్లూ ఎయ్యాల ఇత్తనం! ఎవురుపడితే ఆరు ఎయ్యకూడదు. ఏత్తే మూడ్రోజులు తిరక్కుండానే సత్తారు! శాపం ఉందట!” అన్నాడు సూరయ్య.
“మా గొప్పగా సెప్పావులే. అదేందో నేనూ సూత్తాను.” అంది ముత్యాలు బింకంగా.
“ఏత్తే నువ్వు సావడం ఖాయం! నిన్ను నమ్ముకున్న ఆ ముసలోడ్ని ఏటి సేత్తావ్? సెర్లో ఆకులూ , పూలూ లేనంత మాత్రాన వొచ్చిన లోటేటి? ఎవరన్నా ముసలోడు దొరికితే ఆడిసేత ఏయిద్దాం.” అన్నాడు సూరయ్య.

చిట్టికి చాలా భయం వేసింది. ” ఒసే ముత్యాలూ…నువ్వుగానీ తామర దుంప తేబోకుస్మా! నాకు ఈ చెరువు ఇప్పుడే ఎంతో బాగుంది. నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి. నేను వచ్చినప్పడల్లా నువ్వు కనబడితే నాకు చాలు! చెరువు ఎలా ఉన్నా పరవాలేదు.” అంది కంగారుగా.
“నేను ఏటవుతాను సిట్టీ! అదేదో ముసలాడి మాట సెప్పేడు. ముసలాడు ఏసినా సత్తాడు…ఎయ్యక పోయినా సత్తాడు. నువ్వు అలాటిదేం పెట్టుకోక.” అంది ముత్యాలు.
” నామీదొట్టే ముత్యాలూ! నువ్వు మాత్రం తేబోకు” అంది చిట్టి.
“నాకు మాత్రం పానాలమీద తీపి ఉండదేటి సిట్టీ. అది సరేకానీ ఎప్పుడూ సదువేనా? పప్పన్నం ఎప్పుడు పెడతావ్? అంది మాట మారుస్తూ.
“నేనొక్కదాన్నేనా? నువ్వు ఎప్పుడు చేసుకుంటావు?” అంది చిట్టి.
“నామీద నీకెంత అభిమానం?” అంది ముత్యాలు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. “ఏం చెయ్యను సెప్పు సిట్టీ…నేను మా సీతయ్యని సేసుకోటానికి మాఅయ్య ఒప్పుకోటం లేదు. కులపోళ్లు ఊరుకోరు అంటున్నాడు” అంది.
” అదేం? మీరూ మీరూ ఒకటి కాదా?” అంది చిట్టి.
” సీతయ్యా వాళ్లూ కిరస్తానం పుచ్చుకున్నారు. అందుకని మేం ఆళ్లిళ్ళల్లో బోజనాలు సెయ్యం.. ఇంకెలా పెళ్లి జరుగుద్ది? ” అంది ముత్యాలు దిగులుగా.
‘ఎంత దిగులు మనసులో దాచుకుంది?’ అనుకుంది చిట్టి. వచ్చేటప్పుడు తామర దుంప తేవద్దని మరీ మరీ చేతిలో చెయ్యి వేసి చెప్పింది. తేనని చెప్తూనే కళ్లమ్మట నీళ్ళెట్టుకుంది ముత్యాలు.

వర్తమానంలోకి వచ్చిన చిట్టి తనగది కిటికీలోంచి చెరువుకేసి చూసింది. నిండా ఉన్న తామర పువ్వుల్లో , ఆకుల్లో , ఆకులమధ్యని… అంతటా ఆమెకి వేలరూపాల్లో ముత్యాలే కనిపించింది. తప్పకుండా తామరదుంపలు ముత్యాలే వేసి ఉంటుంది. ఆ దోషం కొట్టి చచ్చిపోయింది! దాని రక్త బిందువులను నింపుకున్నాయి కనకనే ఆ పూలకి అంత అందమొచ్చింది. చిట్టికి ఏదో తెలియని బాధ మనసునిండా కమ్మేసింది.

“నేను నీకు కనపడతానే ఉన్నాను సిట్టీ! ఎందుకంత బెంగ పడతావు?” అన్నట్టు ఆమెకి ముత్యాలు గొంతు వినిపించింది. “ముత్యాలూ! నీ స్నేహ సౌరభంతో నా మనసంతా నిండిపోయిందే! ఈ చెరువుకి శాశ్వత సౌందర్యం చేకూర్చడానికి నీ ప్రాణం పణంగా పెట్టేవా? నీఋణం ఎలా తీర్చుకోవాలి? నీమీద బెంగతో కుమిలిపోతున్నానని చెబితే వీళ్లంతా నన్ను పిచ్చిదానికింద జమ చేస్తారు.” చిట్టి మనసు పరి పరి విధాల పోతుండగా…
“అలా కిటికీలోంచి చూస్తూ ఇంకా అల్లానే కూర్చున్నావుటే? అలా చికీరి గంపలా కూచోక లేచి స్నానం చెయ్యి” అంది చిట్టి మామ్మ.
“చిన్నప్పట్నుంచీ అది వట్టి మట్టిముద్ద. ఎప్పుడూ ఏమిటో ఆలోచిస్తూ కూచుంటుంది.” అంటూ చిట్టి తల్లి వంత పాడింది. ఇంతలో ” రాగానే దాన్నెందుకు అలా సాధిస్తారు?” అంటూ చిట్టి వాళ్ల నాన్న వచ్చారు. ఆయన్ని చూడగానే చిట్టి లేచి, “నాన్నగారూ! మనూరి చెరువు పేరేమిటండీ?” అంది.
“పేరేమీ లేదమ్మా… ఏం?” అన్నారాయన.
“ముత్యాల చెరువు అందామా దాన్ని..?” అంది చిట్టి.
“అనుకోమ్మా…. దానికేం..? అన్నారాయన. ఆ మాట విని ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది.
“అలా అయితే చిన్న బోర్డుమీద వ్రాసి అక్కడ పెట్టిద్దామా నాన్నగారూ?”
“నువ్వనుకో… చాలమ్మా… ఎవరైనా వింటే నవ్వుతారు” అన్నారాయన.
ఆ మాటకి చిట్టికి చాలా కోపమొచ్చింది. ‘నవ్వుతారట! ఎందుకు నవ్వుతారు?’ అని తనలో అనుకుంటూ, “నాకు నేనే అనుకుంటాను లెండి. ఏ మంత్రిగారినో పిలిచి , నామకరణోత్సవం చేయించే స్తోమత నాకు లేదుగా” అంది నిష్టూరంగా.
“ఏమిటే.. వెధవసొద! ఇదేమన్నా తిరుపతా? శ్రీరంగమా? ఇంతోటి పుష్కరిణికీ పేరు కావాలిట! చదవేస్తే ఉన్న మతి పోయింది దీనికి! అందుకే మహాప్రభూ! ఎవడ్నో చూసి దీనికి ఆ మూడుముళ్ళూ పడేయించండి!” అంటూ చిట్టి వాళ్ళమ్మ అందుకుంది.
‘నాకు మాత్రం తిరుపతి , శ్రీరంగం పుష్కరిణుల కన్నా, నా “ముత్యాల కోనేరే” ఎక్కువ అని వీళ్ళకి చెప్పినా తెలీదు. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నక్షత్రాలకి జతగా ఆకాశంలో ఉంది!’ తనలో తను అనుకుంది చిట్టి.

******

ఈ కథలో అలనాటి అచ్చమైన పల్లెటూరు కళ్ళకి కట్టినట్టుంటుంది. అరమరికలు ఎరుగని అందమైన స్నేహబంధం ఉంది. పల్లెల్లోని శ్రమైక జీవన విధానం ఉంది. భూకామందుల నిరంకుశ ధోరణి కనపడుతుంది. కులకట్టుబాటు పేరిట వ్యధలకి గురయ్యే ప్రేమికురాలి వేదన ఉంది. మంచిముత్యం లాంటి మనసున్న స్నేహవల్లరి, త్యాగశీలి ‘ముత్యాలు’ ఉంది. బూజు పట్టిన చాదస్తపు భావాల పైనా, తిరోగమన పోకడల మీదా తన వ్యతిరేకతని వ్యక్తపరచిన ‘ చిట్టి’ ఉంది.
--((**))--


27.... కర్ణుడు - కృష్ణుడు!

మహాభారతంలోని రెండు పాత్రలైన కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది...
కర్ణుడు- కృష్ణుడుని అడిగాడు...
నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది..

అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే..

ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో..

పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు..

పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..

ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది..
ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..

నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే..
అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...

దానికి శ్రీకృష్ణుడు కర్ణునికి ఇలా సమాధానం చెప్పాడు ...
నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను..

నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది..
నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను..

చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు..
నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను...

నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను..

నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా..
నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..

మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ..

సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది..
నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు..

నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ..

జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది..

అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది..
సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది...

అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన...
ఒకటి గుర్తుంచుకో కర్ణా..

జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి...
వితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు...అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు...
దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే...
ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు...

మనకు ఎంత అన్యాయం జరిగినా...
మనకు ఎన్ని పరాభవాలు జరిగిన...
మనకు రావల్సినది మనకు అందకపోయినా...

మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది...
జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో... అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (Licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి క్రృష్ణుడు బోధించాడు...
--((**))--


28.... #పండుగా... నీకు జోహార్!*
#రచన... అయ్యగారి శ్రీనివాసరావు గారు
#ఆటోలోంచి దిగగానే అనుకున్న ప్రకారం పదిరూపాయలందించాడు భుజంగం. ఆ నోటందుకోకుండానే ఆటోడ్రైవర్ "మరో ఐదొస్తుంది సార్!" అన్నాడు ఎటో చూస్తు నిర్లక్ష్యంగా.
"నువ్వడిగింది పదిరూపాయలే కదా? ఇంకా అయిదెందుకు?" అడిగాడు భుజంగం.
అలా అడుగుతున్నతడ్ని అమాయకుడ్ని చూసినట్టు ఎగాదిగా చూశాడా ఆటోడ్రైవర్. అంతలోనే "అన్నీ తెలిసిన మీరు కూడా ఏమీ తెలియనట్టడుగుతారేంటి సార్!" అన్నాడు అదేదో అతిసామాన్య విషయమన్నట్టు.
దాంతో బిక్క మొహం వేశాడు భుజంగం. "అందరికీ తెలిసి తనకు మాత్రమే తెలియని విషయమేమై వుంటుందా?" అని ఆలోచించాడు. ఫలితం శూన్యం.
అలా ఆలోచనల్లో ఉన్న భుజంగంతో ఆటోడ్రైవర్ "ఏంటి సార్! ఏమీ ఎరుగని వళ్లలా అలా బిక్కమొహం వేస్తారు? ఆ అయిదూ దసరా మామూలు" అన్నాడు చిక్కుముడి విడదీసిన వాడిలా.
గీరుకుపోయిన చర్మంమీద కారంగుండ తగిలినట్లు చురుక్కుమందా మాట వినగానే భుజంగానికి. దాంతో ఖస్స్‌స్...మని లేచాడా ఆటోడ్రైవర్ మీద. "నీ పిండం పిట్టలకి పెట్ట. అదేదో ఇంటర్నేషనల్ ఎఫైర్ లాగ ఎంత బిల్డప్ ఇచ్చావురా? టెన్షన్‌తో చంపావు కదా! అయినా ప్రతీ అణాకాణీ ఆవారా వెధవకీ ఇదో అలవాటై పోయింది. దసరా మామూలట... దసరా మామూలు" అంటూ వగరుస్తూ.
అతడన్న మాటల్లో "పిండం" అన్న మాటకి అర్థం ఆ ఆటోడ్రైవర్‌కి తెలియదు కాబట్టి పెద్ద గండం తప్పింది భుజంగానికి. అయినా మిగిలిన మాటలు వింటూనే "బిల్డప్పు...లాకప్పు...అంటూ ఎక్కువ మాటలొద్దు సారూ! మీరిచ్చేది ఆఫ్టరాల్ అయిదు రూపాయలు. దానికింత... అక్కర్లేదు" అన్నాడు పరమ నిర్లక్ష్యంగా.
దాంతో అంటుకున్న తారాజువ్వలా 'ర...య్యి'మని లేచాడు భుజంగం. "నీ మొహం మండ. నీ కంటికి నేను వెర్రి వెంగళప్పలా కనబడుతున్నానేంట్రా! నీ బతుక్కి దసరా మామూలు కావాల్సొచ్చిందా! ఇలా అడిగిన ప్రతి అణాకాణీ ఆవారాగాడికల్లా ఇవ్వడానికి నా తాత కూడబెట్టిన ముల్లె ఏమైనా ఉందనుకున్నావా?" అంటూ వెర్రిగా కేకలేసాడు. దానికి కారణం అతని మనసులో రగులుతున్న బాధ. నెల్లాళ్ళ పొద్దయింది ఈ తద్దినం మొదలై. వినాయక చవితి పండుగ వెళ్ళాక కరెంటు రీడింగ్ తీసుకోవడానికొచ్చినవాళ్ళు మొదలెట్టారు. "సార్! దసరా మామూలు" అంటూ బుర్రగోక్కుంటూ.
ఆ మాట విన్న భుజంగం "ఇప్పుడెక్కడి దసరా... రెణ్నెల్లులంది కదా?" అన్నాడు.
"నిజమే సార్. కానీ మళ్ళీ మేం రీడింగొచ్చేసరికి దసర వెళ్ళిపోతుంది సార్. ఏదో మీకు తోచినంత..." అన్నాడు వివరణ ఇచ్చి, చివరగా నసిగేస్తూ.
ఆ మాటతో అంత దీనంగా అడుగుతున్నారు కదా అని అయ్లిదు రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టాడు భుజంగం. అది చూస్తూనే అందులో ఒకడు వెర్రినవ్వొకటి నవ్వుతూ "మాలాంటి వాళ్ళతో మీకు జోకులేంటి సార్" అన్నాడు.
ఆ మాట అతడెందుకన్నాడో అర్థంకాని భుజంగం "మీతో నేను జోకులెప్పుడేసాను" అన్నాడు మాడిపోయిన గారెలా మొఖం పెట్టి.
ఆ మాటకు రెండో వ్యక్తి "లేకపోతే ఏంటి సార్! యాభై రూపాయలివ్వవలసిన దసరా మామూలుకి అయిదు రూపాయలిస్తే జోక్కాక మరేంటి సార్? రండి సార్. మాకవతల పనుంది" అన్నాడు బాకీదారుణ్ని అప్పిచ్చిన వాడడిగిన లెవెల్లో.
దాంతో ఒళ్లుమండిన భుజంగం "ఏభై కావాలా?... వందొద్దూ?..." అన్నాడు వ్యంగ్యంగా. అప్పటికే లోపల రక్తం మరగడం మొదలైంది భుజంగానికి.
"లేద్సార్! ఈ సంవత్సరానికింతే ఫిక్స్ చేసాం. అంతకంటే ఎక్కువిచ్చినా తీసుకోం" అన్నాడూ ఆ యిద్దరులో ఒకడు. అలా వాళ్లన్న ఒక్కొక్కమాట వింటుంటే పొయ్యిమీద పెట్టిన పాలలాగా రాన్రానూ పెరిగింది బీపీ. ఆ చివరిమాట వినేసరికి పగిలిన అగ్నిపర్వతం లావా ఎగజిమ్మినట్లు తన మనసులోని కోపాన్నంతా వాళ్లమీద చూపించేసాడు. అతడి ఉగ్రరూపం చూసి ఏమనుకున్నారో గాని ఆ సర్వీసు నంబరు దగ్గర ఏదో రాసుకుని మౌనంగా వెళ్ళిపోయారు.
అయితే అంత సులువుగా వాళ్ళు వెళ్ళిపోవడం వెనుక ఆంతర్యం బిల్ కట్టడానికి వెళ్ళినపుడు గాని తెలిసిరాలేదు భుజంగానికి. నెలాఖరు. కూర ఖర్చుకే కటకటలాడుతున్న రోజులు. బిల్ కట్టడానికి ఆఖరు రోజు కావడంతో దాని పేరు చెప్పి నెల ఖర్చులకి కూడా కలిపి అప్పు చేసిన భుజంగం బిల్ కట్టడానికెళ్ళాడు.
ఆ బిల్ కట్టించుకునే వ్యక్తి ఇతడి సర్వీస్ నంబరు చూడగానే "సార్! మీరు రీడింగ్ తీయడానికొచ్చిన బాయ్స్‌కివ్వాల్సిన దసరా మామూలు పెండింగ్‌లో ఉందిసార్. అది, మాది కలిపి ఇప్పుడిస్తేనే బిల్ తీసుకుంటాం" అన్నాడు. ఆ మాటతో భుజంగం బుర్ర బొంగరంలా తిరిగింది. ఎన్నో రకాల చెప్పిచూసాడు. సామదానబేధోపాయాలు ప్రయోగించాడు. ఇలాంటి పరిస్థితిలో తగవు పెట్టుకోకూడదని దండోపాయం ప్రయోగించలేదు. అక్కడంతమందున్నారు. వాళ్లూ తనలాగే బిల్ కట్టడానికొచ్చిన వారే. అందరూ బాధితులే. ఏ ఒక్కరైనా తనకి సపోర్ట్‌రారా అని ఆశించిన అతని ఆశ అడియాసే అయింది. వాళ్లెవరూ కలగజేసుకోలేదు సరికదా! తిరిగి తనకే పాఠాలు చెప్పడం మొదలెట్టారు కొందరు. తనను పిసినారిని చూసినట్టు చూసినవాళ్లు కొందరు.జాలిగా చూసేవాళ్లు కొందరు.చాటుగా నవ్వుకుంటున్న వాళ్లు కొందరు. అందర్నీ చూస్తున్నాడు భుజంగం. నీర్సం వచ్చింది. అయినా ఫలితం లేదు. దాదాపు చేతులు నులిపి బలవంతంగా లాకున్నట్టు లాకున్నారు రెండురకాల దసరా మామూళ్లని.
అలా మొదలైన దసరా మామూళ్ళ ప్రహసనం అలా అలా కొనసాగింది. ఉధృతమైంది. పాలుపోసేవాడు, రోడ్డు తుడిచేవాడు, కాలువ తుడిచేవాడు, చెత్తలెత్తేవాళ్ళు, ఇస్త్రీ చేసేవాడు... ఇలా వాళ్ళు వీళ్ళని లేదు... మనిషి ముఖం కనబడితే చాలు... దసరా మామూలడిగేసే వారెవరో ఒకరు.
కొన్నాళ్ళు మామూళ్ళివ్వకుండా తప్పించుకున్నాడు. ఆ కాలంలో అతడు పడ్డ పాట్లు మామూలు పాట్లు కాదు. కుక్కపాట్లు. ఇస్త్రీ బండి వాడికి దసరా మామూలు ఇవ్వకపోత అసలు మడత బదులు మరో దగ్గర మడత వచ్చేటట్లు ఇస్త్రీ చేసేవాడు. దాంతో రెండు మడతలతో బట్టలు అసహ్యంగా తయారయేవి. పోనీ వాణ్ని మార్చి మరొకడికి ఇద్దామంటే ఆ అవకాశమే లేదు. ఎందుకంటే ఆ కాలనీకంతటికీ వాడొక్కడే కాంట్రాక్ట్.
పాలవాడు కొలత తగ్గించి పొయ్యడమో, నీళ్ళు ఎక్కువ కలిపేయడమో చేసేవాడు. వాడి దగ్గర మానేద్దామా అంటే తన బడ్జెట్‌కి తగిన చవకలో మరెవరూ ఇవ్వరాచుట్టుపక్కల.
పేపర్‌బోయ్ ఒకరోజు ముఖానికి తగిలేట్టు పేపర్ విసిరాడు. మరోరోజు పూలమొక్కలకి నీళ్ళు పోస్తుంటే ఆ నీట్లో పడేటట్లు విసిరేసాడు. అదీ ఇదీ కాకపోత ఏదో ఒక ఎడిషన్ పేపర్ తప్పించేసేవాడు. వాడికేంపోయింది? నష్టపోతే ఏజెంట్ కదా నష్టపోయేది. మానేసినా బాధ లేదు. మళ్ళీ బుర్రతిని బుక్‌సేల్స్ ప్రమోటర్స్ ఉండనే ఉన్నారాయె.
రోడ్డు తుడిచేవారు, కాలువతీసేవారు సరేసరి. మొదటిరోజు వాళ్ళింటి దగ్గర తుడవడం మానేసారు. రాన్రాను వారి నిరసన తీవ్రతరం చేసి ఎక్కడెక్కడి చెత్తా కూడదీసి వాళ్ళ గుమ్మం ముందు పోసేవారు. పనిమనిషి దగ్గర ఉండనే ఉంది పెద్దాయుధం. అదే నాగా పెట్టడం. వచ్చినా వదిలీ వదలకుండా, అరకొరగా తోమేసి, సబ్బుపిసర్లో, జిడ్డు ముద్దలో ఉంచేసి కడిగిపడేసేది. కూరలమ్మేవాడు, ఘూర్ఖా, కేబుల్ కనెక్షన్ వాళ్ళు, ఫోన్‌వాళ్ళు, చిన్నచిన్న రిపేర్లు చేసే వాళ్ళు... వాళ్ళంతా ఎవరి స్థాయిలో వారు నిరసన తెలిపి భుజంగాన్ని ఓడించి, దసరా మామూలు పట్టుకెళ్ళిపోయారు. ఆఖరుకి ఇంటికి రోజూ వచ్చే ముష్టివాడు కూడా ఘరానాగా మామూలు వసూలు చేసుకుని వెళ్ళిపోయాడు. అయిదూ పదీ ఇస్తే తీసుకునే వాళ్ళు కొందరైంతే, పాతిక యాభైకి తగ్గనివాళ్ళు కొందరు.
అలా అలా ఇచ్చీ ఇచ్చీ చివరికి పెద్దమొత్తం అప్పు చెయ్యవలసి వచ్చింది. అదీనా దసరా మామూళ్ళ నిమిత్తమే. అప్పట్నుంచి అలా అప్పుల ఊబిలో చిక్కుకునే పరిస్థితులు తెచ్చిన దసరా మామూలు మాట వింటేనే చిర్రెత్తుకొస్తూంది. అందుకే ఇప్పుడీ ఆటోవాలా అలా అడిగేసరికి అంతలా రియాక్ట్ అయ్యాడు.
* * *
అనుకోకుండా మధ్యలో తెలివొచ్చింది కనకానికి. తన నిద్రాభంగానికి కారణమేమిటో తెలీక అటూ ఇటూ చూస్తోంది. ఫేన్ తిరిగే చప్పుడు తప్ప అంతటా నిశ్శబ్దమే. కాకపోతే జాగ్రత్తగా గమనిస్తే ఏదో చిన్న ధ్వని. అది కూడా తనకు అతి దగ్గర్నుంచి వస్తూంది. అదేమిటో తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ గదిలో అలుముకున్న చీకటివల్ల ఏదీ స్పష్టంగా కన్పించని పరిస్థితి. అయినా అతి కష్టమ్మీద కనిపెట్టగలిగింది ఆ ధ్వని తన పక్కనున్న భర్త దగ్గర్నుంచని. నెమ్మదిగా తడుముకుంటూ వెళ్ళి అంచనా మీద స్విచ్ నొక్కింది. స్టార్టర్ వీక్ అయిన ట్యూబ్‌లైట్ మధ్యతరగతి కుటుంబ యజమానిలాగా నీర్సంగా వెలిగింది. ఆ వెలుగులో అతి దీనంగా మొఖం పెట్టుకుని దిగులుగా కూర్చున్న భర్త ముఖాన్ని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడింది. తర్వాత తేరుకుని నెమ్మదిగా అంది "ఎందుకండీ అంత టెన్షన్ పడుతున్నారు?" అని. ఎందుకంటే ఈ మధ్య చాలా రోజుల్నుంచి భర్త అలాగే ఉండడం గమనిస్తోంది. కానీ ఇంతలా నిద్రమానుకుని బాధ పడుతున్నాడనుకోలేదు.
అలా అడిగిన కనకం మాట విన్న భుజంగం "ఏం చెయ్యమంటావు కనకం? చూస్తున్నావు కదా అప్పులు. ఇవన్నీ ఎలా తీర్చాలో అర్థంకావడం లేదు. అయినా కడుపుకింత తిన్నామనా? కంటికింపుగా ఒక బట్ట కట్టుకోవడానికి కొన్నామనా? లేకపోతే ఇల్లు కట్టామనా? అక్కడైదు, ఇక్కడ మూడు, మరోదగ్గర రెండు... ఇలా దొరికిన చోటల్లా అప్పులు వాడేసాను. ఇవన్నీ ఎలా తీరుతాయి చెప్పు?" పగటి వేషగాడ్ని అసురసంధ్య వేళలో చూసి, నిద్దట్లో జడుసుకున్న చంటి పిల్లాడిలా వణికి పోతూ అన్నాడు భుజంగం.
అతడ్నలా చూస్తూంటే జాలేసింది కనకానికి. కాని అంతలోనే కలిపురుషుడు ప్రవెశించిన ద్వాపరయుగం మనిషిలా మారిపోయింది. దానికి కారణం ఆమె మదిలో అప్పుడే వచ్చిన ఆలోచన. ఆ ఆలోచన ఆచరణలో పెట్టడానికి తగిన సమయమిదే. అందుకే నెమ్మదిగా పిలిచింది.
ఆ పిలుపులో ఆత్మీయత, కరెంట్ పోయిన మిట్టంధ్యాహ్నపు వేసవి వేళలోని మనిషి స్థితిలో ఉన్నతనికి, కూల్‌డ్రింక్ తాగే స్ట్రాతో మొహం మీద ఊదినట్టనిపించిందా పిలుపు.
ఆత్మీయంగా పిలిచిన ఆ పిలుపుతో "ఏమిటి?" అనడిగాడు కరిగిపోతూ.
"ఇలా బెంగెట్టుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పండి! అయిందేదో అయిపోయింది. ఈ వడ్డీలు, అప్పులు... వీటన్నిటికంటే నన్నో మాట చెప్పమంటారా?" అడిగింది నెమ్మదిగా.
మండువేసవిలో కరెంట్ ఉన్న ఫ్రిజ్‌లోని కూలింగ్ వాటర్ దొరికినంత ఆనందమన్పించామాట. అలాంటప్పుడు వద్దనెలాగంటాడు?
మధ్యతరగతి మొగుళ్ళని అంత సులువుగా నమ్మరు యిల్లాళ్ళు. కారణం? వారికేమాటంటే ఏ కోపమొస్తుందో తెలీదు. అందుకే నెమ్మదిగా అంది "చిరాకు పడనంటేనే" అని మాట తీసుకుని చెప్పడం మొదలెట్టింది.
"ఎలాగూ పదివేలు అప్పుంది. నెలకి వడ్డీ మూడు నాలుగు వందలెలాగూ కట్టాలి కదా! ఎందుకంటే మూడు రూపాయలు, నాలుగు రూపాయలు లెక్కన వడ్డీకి వాడారు. దాని బదులు ఒక సులువు చెప్పనా?" అంది.
"చెప్పు..." అన్నాడు నెమ్మదిగా నడుంమీద చెయ్యివేసి రాస్తూ.
ఆ చర్యలోనే అతడి మనసెంత ఖుషీగా వుందో అర్థం చేసుకుని నెమ్మదిగా అంది... "మీరు ఎన్నాళ్లనుంచో నాకు నెక్లెస్ చేయిస్తానంటున్నారు. కాని కుదరడంలేదు కదా?" అని ఆపేసి, "మీరు మాత్రం కోపగించుకోనంటేనే" అంటూ ఆగిపోయిందామె. ఎందుకంటే ఆమె మధ్యతరగతి ఇల్లాలు.
ఆ మాటకి భార్యమీద జాలేసింది. అప్పుడప్పుడు తన చిరాకు ప్రవర్తనకి సిగ్గనిపించి, "లేదులే... చెప్పు..." అన్నాడు ఆమెని ఒడిలోకి లాక్కుంటూ.
ఆమె చెప్పడం కొనసాగించింది. "అక్క్డా ఇక్కడా అప్పులకంటే మీ పి.ఎఫ్.లో లోన్ తీసుకుంటే అన్ని సమస్యలూ తీరిపోతాయి కదా. పాతిక వేలు లోన్ తీసుకుంటే పదివేలు అప్పుతీరిపోగా మిగిలిన పదిహేనువేలు పెడితే తులంనర నెక్లెస్ వచ్చేస్తుంది. అదీకాక నెలకిప్పుడెలాగూ నాలుగు వందలు వడ్డీ కడుతున్నారు కదా. దాని మీద మరికొన్ని వందలు కలిప్తే ఇరవై నెలల్లో మీ అప్పు తీరిపోతుంది. నాకు నెక్లెస్ మిగిపోతుంది" అంది.
ఆ మాటతో "ఇదేదో బాగానే ఉందిలాగుంది" అనుకుని, అంతలోనే ఏదో గుర్తొచ్చి తుళ్ళుపడ్డాడు. అంతలోనే తమాయించుకుని, "అయితే నీకూ దసరా మామూలు కావాలంటావ్! అంతేనా...?" అన్నాడు.
అలా అంటున్న అతడి ముఖం ప్రశాంతంగానే ఉందని గ్రహించిన ఆమె "దసరా వెళ్ళిపోయి పదిహేను రోజులైపోయింది కదా! లోన్ శాంక్షన్ అయి, నెక్లెస్ తయారయ్యేసరికి సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇది పండగ మామూలు" అంది.
అంతలోనే మంచి సీన్‌లో కరెంట్‌పోయిన టీవీ ప్రేక్షకుడిలా ముఖం పెట్టాడు ఏదో గుర్తొచ్చి.
పరమాన్నం నోట్లో పెట్టగానే కంకరరాయి పంటికి తగిలినట్లు ఏదో కీడు శంకించిన కనకం "ఏమైందండీ..." అంది. ఆమె ఆశకు అప్పుడే తిలోదకాలు ఇచ్చేసింది.
ఆ మాటకి భుజంగం "లోన్ శాంక్షన్ చెయ్యడానికీ మామూలివ్వలి కాబోలు..." అన్నాడు.
అది విన్న కనకం తేలికగా నిట్టూరుస్తూ "మీరే అంటుంటారు కదా, 'నూరు గేదలని కడిగిన వాడికి ఒక సాలగ్రామం లెక్కా...' అని" అంది.
ఆ మాటకు భుజంగం భార్యవైపు మెచ్చుకోలుగా చూస్తూ "ఏమైనా నువ్వు కూడా చమత్కారివేనోయ్" అన్నాడు ఆమెను కౌగిలించుకుంటూ.




అతడి సమస్యకి పరిష్కారం చూపిన, ఆమె ఆ క్షణంలో అందాలరాశిలా, అపరంజిబొమ్మలా ఇంకా ఇంకా... లా... లా... కనబడుతోందతడి కళ్ళకి. అతడి మనసులో ఆనందభావనే ఆ సంతోషానికి కారణం.

--((**))--


29.... పెద్దల పరిహాసాలు

మన యిళ్ళలో పెళ్ళిళ్ళు జరిగినపుడు పెళ్ళికి వచ్చినవారు ఒకరితో నొకరు యెన్నిపరిహాసాలో! యెన్నెన్ని


వినోదాలో! చెప్పటానికి వీలా? అలాటి సందర్భంలో ఒకవేళ జగత్పాలకులైన త్రిమూర్తులే అలాంటి వ్యవహారం నడిపితే యెలాఉంటుంది? దానిని ఊహించే శ్రీమతి గంటికృష్ణవేణమ్మగారు తాము విరచించిన "గిరిజా కళ్యాణము"- అనేకావ్యలో ఒక
చక్కని ఘట్టం చిత్రించారు.
గిరిజా కళ్యాణానికి విష్ణుమూర్తి సకుటుంబంగా విచ్చేశాడు. వివాహం జరిగాక భోజనాలు జరుగుతున్న సందర్భం. శివుడు విస్తరిలో ఉన్నపదార్ధాలను అటుఇటు కదుపుతున్నాడట!
అప్పుడు విష్ణువు శివుడు ఒకరినొకరు వేళాకోలా లాడుకొన్నారట! ఎలా...? 
ఇదిగో ఇలా---
విష్ణువు శివునితో-- " విసము తిన్న నోట కసవయ్యెఁగాబోలు
భక్షణంబులెల్ల పార్వతీశ!
అట్టి దివ్యమైన ఆహారములు లే
వటంచు పల్కె విష్ణుఁ డభవు తోడ ..
విష్ణువు శివునితో యిలా అంటున్నాడు. " ఏమయ్యా! ఈబూరెలూ ,గారెలూ, అవీ నీకు నచ్చినట్లు లేదే? 
కాలకూటం తిన్న నోటికి యీభక్ష్యాలన్నీ గడ్డిలాగ రుచిలేనివై కనబడుచున్నవేమో? ఏంచేస్తాం? అన్నాడు.
దానికి సమాధానంగా శివుడు ఇలా అంటున్నాడు.
" నిక్కము నీవుపల్కినది నీరజనాభ! ఇటెందు మ్రుచ్చిలన్
చిక్కదు వెన్న ! తెత్తు మన చిక్కవు యెంగిలి కాయలెందు, నీ
కెక్కడ దెత్తుమయ్య? అవి ; ఇప్పు డటంచు శివుండు నవ్వగా
నక్కడ పంక్తి భోజనము నందు ఫకాలున నవ్విరందరున్ "!
నిజమేనయ్యా విష్ణూ! నువ్వుచెప్పింది. ఇక్కడెక్కడా దొంగతనంచేద్దామన్నా వెన్న దొరకదు. తెద్దామన్నా యెంగిలి కాయలుదొరకనే దొరకవు. ఎక్కడనుండి తేగలం మరి ! అని శివు డనగానే బ్రహ్మ, ఇంద్రాది దేవతలు ఫకాలున నవ్వారట !
మనదృష్టిలో యిది పరిహాసమేయైనా కవిదృష్ట్యా ఇది నిందాస్తుతి!
దీని అంతరార్ధం యేమిటంటే- లోకాలను నాశనంచేసే కాలకూట విషాన్ని కంఠాన ధరించి, అందరినీ కాపాడిన వాడు శివుడని విష్ణువు ప్రస్తుతించితే, వెన్నదొంగిలి నెపంతో గోపికలనుధ్ధరించినవాడనీ,, శబరి యెంగిలిపండ్లను తిని భక్తపరాధీనుడైన వాడు విష్ణు వనీ శివుడు విష్ణువును ప్రశంసించాడు..
బాగుంది కదూ?
స్వస్తి!

# ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రాజయ్య స్కూలుకు సెలవుదినమైతే ఇంట్లో నుంచి కదలడు. ఏదో పుస్తకమో, పేపరో చదువుతూ కాలక్షేపం చేయడం ఆయనకలవాటు. ఒకరోజు ఉదయంపూట మార్కెట్టుకు వచ్చాడు. మామూలుగా అతను మార్కెట్టుకు రాడు. ఆ పని భార్య నిర్మలే చేస్తుంది. అయితే ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకున్నారు. నిమ్మకాయ పచ్చడి అంటే రాజయ్యకు ప్రాణం. నిమ్మకాయలు మీరు తెచ్చేపక్షంలో నిమ్మకాయ పచ్చడి పెడతానంది భార్య నిర్మల. దానితో ఇక లాభం లేదనుకొని ఆ కాయలు కొనడం కోసమే రాజయ్య మార్కెట్టుకు రావడం జరిగింది. ఆదివారం కావడంవల్ల ఆ రోజు మార్కెట్టు చాలా రద్దీగా ఉంది. రాజయ్య నాలుగు దుకాణాలు తిరిగాడు. ఈ చివరగా ఉన్న బండిని సమీపించాడు. కాయలు నవనవలాడుతూ తాజాగా కనిపించాయి. బాగా నచ్చాయి. కాయ ఒకటి చేతిలోకి తీసుకుని వంద కాయలు కావాలి. ధర ఎంత? అని అడిగాడు.
దుకాణాదారు కాస్త పరధ్యానంలో ఉన్నట్టున్నాడు. రాజయ్య ఒకటికి నాలుగు సార్లు అడిగేసరికి, వంద యాభైరూపాయలు అన్నాడు. రాజయ్య ముప్పైకి ఇమ్మన్నాడు. బండివాడు సరేనన్నాడు. రాజయ్య గబగబా వంద నిమ్మకాయలు ఏరుకొని సంచిలో వేసుకొన్నాడు. వందరూపాయలు నోటు అందించాడు. అందుకు తన దగ్గర చిల్లరలేదని త్వరగా చిల్లర తెస్తానని గబగబా జనంలోకి వెళ్ళాడు దుకాణందారుడు. రాజయ్య చాలాసేపు ఆ దుకాణం దగ్గర నిలబడ్డాడు. ఆ వెళ్ళినవాడు ఎంతకూ రాలేదుగాని వేరొకడు వచ్చాడు. తెచ్చిన చిల్లర గల్లాపెట్టెలో వేసుకొని మిగతాది రాజయ్యకు ఇవ్వబోయాడు. రాజయ్య అయోమయంగా చూస్తూ నేను ఇచ్చింది వంద. నాకు రావాల్సింది నిమ్మకాయలధర పోను డైబ్భై రూపాయలు అన్నాడు. దుకాణాదారు వెర్రిగా చూస్తూ నువ్వు ఉల్లిగడ్డలు తీసుకొని ఇరవై రూపాయల నోటు ఇచ్చావుకదా? అది తీసుకొని చిల్లర కొసం వెళ్ళి అష్టకష్టాలు పడి తీసుకొని ఇప్పుడే వచ్చాను. అంతేకదా! అన్నాడు. రాజయ్య ఉలిక్కిపడ్డాడు. తాను తీసుకున్నవి నిమ్మకాయలేనని సంచి గుమ్మరించాడు. తానిచ్చింది వంద గనుక నిమ్మకాయల ధర ముప్పై పోగా తనకు డెబ్బై రావాలని లబోదిబోమన్నాడు. ఆ గోలకు పదిమంది అక్కడ చేరారు. దుకాణం వాడికి పిచ్చెక్కిపోయింది. జరిగిన విషయం దుకాణం వాడికి పూర్తిగా అర్థమయింది. వాడు అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి అయ్యా! ఈయనకంటే ముందు నా దగ్గరకు ఒకడొచ్చి కిలో ఉల్లిగడ్డలు కొని ఇరవై నోటు ఇచ్చాడు. నా దగ్గర చిల్లర లేకపోవడంతో ఆ నోటు తీసుకొని చిల్లర కోసం వెళ్ళాను. వాడు బండి దగ్గరే నా కోసం నిలబడ్డాడు. ఈలోగా ఇతనొచ్చి వాడే దుకాణం వాడనుకొని నిమ్మకాయలు కొన్నాడు. చిల్లర లేదంటూ వాడికి వంద నోటు ఇచ్చాడు. చిల్లరలేదంటూ వాడు నాలాగే ఆ నోటుతో వెళ్ళాడు. కాని తిరిగి రాలేదు. వాడు నా దగ్గర కొన్న ఉల్లిగడ్డలు ఇవిగో! మోసం జరిగిపోయింది. దానికి వాడు బాధ్యుడయితే నేనెలా మూల్యం చెల్లించేది చెప్పండి. అంటూ తల బాదుకున్నాడు.
అది పగటి మోసంగా భావించి జనం వెళ్ళిపోయారు. చేసేది మాష్టారు ఉద్యోగం కనుక ఒకసారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు రాజయ్య. తన తెలివి తక్కువతనమే తనను మోసపోయేలా చేసింది. ఇందులో దుకాణాదారు తప్పులేదు. అని గ్రహించాడు రజయ్య. మరి కాసేపు తన డబ్బులు కోసం అరిస్తే ఆ నిమ్మకాయలు తనకు మిగిలేట్టు లేవని జడిసి రాజయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రాజయ్య ఇంటిదారి పట్టాడుగాని అతని మనస్సు మనస్సులో లేదు. తనొక కొత్త తరహాలో మోసపోయాడని బాధపడుతూ నడుస్తున్నాడు. అల్లంత దూరంలో జనం గుమ్మిగూడి ఉండటం చూసి, అదేంటో చూద్దామని అక్కడికి నడిచాడు కుతూహలంగా. రాజయ్య జనాన్ని తోసుకొని లోనికి వెళ్ళాడు. ఆ మధ్యలో ఒకడు రక్తం మడుగులో పడివునాడు. వాడి ముఖం పరిశీలనగా చూచి, అతను ఉలిక్కిపడ్డాడు. ఇంతకు వాడు ఎవరో కాదు? ఇందాక తానే దుకాణాదారుగా ఫోజు కొట్టి వందకు చిల్లర తీసుకువస్తానని వెళ్ళినవాడే. ఎవరో పాపం కంగారుగా పరుగెత్తుతూ వచ్చి ఎదురుగా వస్తున్న లారీని గుద్దుకొని పడిచచ్చాడు. అన్నారెవరో ఆ గుంపులోనుంచి. విషయమంతా రాజయ్యకు అర్థమయింది. మోసం చేసి పారిపోతున్న అతను కంగారులో ప్రమాదానికి గురై చచ్చాడన్నమాట. అవును పరధనం పామువంటిది. అది ఎప్పటికైనా కాటువేయకమానదు. కానీ ఆ మోసానికి తగిన శిక్ష అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది బాధంటే ఏమిటో. ఈ మోసగాడికి దేవుడే మరణశిక్ష విధించాడు. ప్రతి చెడ్డపనికి శిక్ష ఉన్నట్లే నమ్మిన తోడి మనుష్యుల్ని మోసగించినందుకు కూడా ఆ శిక్ష పడింది మరి. తన డబ్బు పోయినందుకుకాదు అతను చచ్చినందుకు తోటి మానవునిగా రాజయ్య మరింత బాధపడుతూ ఇల్లు చేరాడు.
--drkaana ((**))--




ప్రాంజలి ప్రభద్వారా ప్రపంచ తెలుగు ప్రజలందరికి అమూల్యమైన కధలను అంతర్జాలముద్వారా అందించిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు  డిట్లు మీ అభిమాన రచయత: మల్లాప్రగడ రామకృష్ణ .  






No comments:

Post a Comment