Sunday 16 May 2021

ప్రాంజలి ప్రభ - పద్యచంద్రిక


మనసు మాయ పొరలు మగువ ఏమి చేయ లేని పరి స్థితిఎ   

వినిన చెప్పలేక వింత బత్క ఉన్న ఒప్పు తప్పు అన ఎ   

అనిన మాటబట్టి నరక మంటచూపు చున్న తిధిన ఆట  

మనిషి చేయుచున్న పనులు గిట్టుబాటు కాక పొంద లేని   ... ... 01


కాల మాయబట్టి కణము వెతుకులాట బతుకు ఆకలి యే    

గోల చేసియున్న గొప్ప మార్గమంత చితికి పోవుటయే 

మాల లాగయుండి మాట పరిమళముతొ ఉదయ మాడుటయే

శీల మనునదియే సత్య ధర్మ చరిత కల్గి ఉండుటయే ... ....  02 


రాగ మెంత బతుకు రాత్రి లోనరక్తి లేక జీవితమ్ము 

భోగ మైనపొంద బోధ  జీవితమ్ము నరక యాతనమ్ము 

త్యాగ రాజుభక్తి  త్యాగ మైనదయ్యె  ఏమి చేయ లేను 

యోగి లాగనేను యోని ఆశలు యే నాది సంసారం ... ... ... ౦౩  


చక్కని శరీరం జాడ్య ము ఉన్ననే మియును అందమైన

చుక్క లాంటి భార్య చక్కని భాద్యతతొ ధనము చుట్టూ లే

ఎక్కు వగా కీర్తి ఏక మవుటకేను కాని గురుపాదం

పైకి  నీస భక్తి  పెరుగకుండు నేమి ఏమి లాభముండు ... ....  4


భార్య ఉండి ఉన్న, బాధ పొంచివున్న, సంపదలు ఉన్నా

పుత్రులు మనుమలే పుడమి నందు గొప్ప వారు అని ఉన్నా

సూర్య ళక్తితోడు శాంతి సౌఖ్యము న్న బంధు వర్గమున్న

గురువు పైన భక్తి కానరాక వుంది ఏమి లాభముండు    ... .... 5


సకల శాస్త్రవిద్య సూత్ర మల్లె వృద్ధి నిత్య సత్యముగా 

ప్రకృతి మూలమయ్యె మాట తీర్పు వల్లె విద్య సత్యముగా 

ఒకటి అనుట మరియు ఓడి బతుకు మార్చె తత్వ బోధలుగా      

భక్తి అనేదేది భయము గురువు వెంట లేదు ఎందువల్ల ... ... 6


ధర్మ రక్షణ లో ధైర్య ముంచి నడక సాగు తీరు 

కర్మ భూమియందు కార్య శోధ నంత బతుకు తీరు 

నిర్మలమ్ము యేను నిన్ను రక్ష చేసి నడుపు తీరు 

శర్మ బావమంత శాంతి ఇచ్చి పుచ్చు కొనుట తీరు .... 7 


సర్వ శక్తులలో సమర లక్ష్యమ్ము గ దారి చూపు

నిర్వ హించుటలో నీది నాదియనుట లోక మాయయుండు 

కార్య సాధనలో కావ్య రచనలేలు సాను భవముఉండు 

ఆర్య మాటలలో ఆకలెంతొ వుంది అనుట కాదు మనసు... 8     

 

జ్ఞాన భిక్షపెట్టి  జ్ఞాపకమును తెల్పి జీవితమ్ముసాగు 

జ్ఞాన నిష్ఠతెల్పి జ్ఞాన సమ్మతమ్ము మనసు మార్చి సాగు 

జ్ఞాన విద్యనేర్పి జ్ఞాన గీతలోన ధర్మ మనుకరించు      

జ్ఞాన లక్ష్యమంత జ్ఞాన నీడజనుల కుండు గీత అండ  .... .. 9    


సహన ముంచి పలుకు సామరస్య మగును నిజము నిష్ఠురమూ  

మహిమ చూప వలదు మనసు పంచివిషయ వాంఛ తీర్చ వలే 

అహము చూపవద్దు అరటి మొక్కవలే బతుకు దేనికొరకు 

విహిత కర్మలన్ని విజయ మార్గ మందు చేయు ధర్మమేను  ..... ... 10 

         

మనసు ఉపకారి మనము అపకారికి చేయు ఉపకారము 

వినయ మున్న పాము విషము మార్చలేదు కాటు వేయు చుండు 

వనము నందు దొరుకు వలపు పంట చెరకు  తీపి కలకండా

జనము మధ్య చేయు జపము నిస్వార్ధము  నీటి నిజాయితీ ..... .... 11

      

ధర్మ మార్గమ్మున ధర్మ చరితమ్మును చెప్పు చుండవలే 

శరణు అనిఉన్నా శరణు తెల్పి యుండి ధైర్యముపురికొల్పు    

కరుణ చూపు లతో కమల నాధునినీ వేడు కొనుట మేలు 

ధరణి భారమంత తగ్గు ముఖము పడుట పూజ లతొ  ప్రేమ   ..... ... 12       


 రమ్ము నీదుభక్తి రమ్య మైన దండి శాంతి బహుమతి గా

సొమ్ము నీదె కదా సోకు తెలుసు ఇవ్వు సేవ బహుమతిగా

చిమ్ము నీలొ భయము చిత్తముంచి చూడు నిజము తెల్పి బతుకు

నమ్ము జీవితాన నటన చూప వద్దు విజయ మంత నీదె.....13


జగతి లోన జీవ జపము జాతి నెంచి సేవ మనసు ఉంచె

జగతి శాంతి కోరి జరుగు దైవ పూజ నిత్య సత్య మవ్వు

జగతి రూపమైన చలువ గాలి లేక రోగ మవ్వు చుండు

జగతి వినయ మేను చదువు నేర్పు చుండె సకల జాతి నందు..14 


 దేవుని తలంపే దేశ  జీవునిగా జన్మగా ప్రకటిత 

మవుతు జీవితాన్ని మగువ చుట్టు తిరుగు

 అవును నిజమే దో అలక ఏదో ఒక రూపములో ఉన్న

శివుడు జెప్పు మాట సత్య మేను నామ రూపమ్ము న భక్తి..15


అక్షర సాహిత్య అక్షతులు గానే స్వర రచన వుండు

అక్షర ములన్నీ అక్కరకు వచ్చే వేద పాఠాలగు

అక్షర సంపదే అక్షయ మవ్వునే ఆది వెలుగు నీడ

అక్షరం వ్రాయుట అక్షరం చదువుట ఆత్మ గౌరవమ్ము.... 16 


కలకల నవ్వలే గలగల శబ్దాలు కిలకిల మవ్వుటే 

విలవిల లాడేటి విసుగును  ఏడ్చేటి  చిన్న పసిపాపలు

మలమల మాడే మనసు మధురతలను కోల్పోయే  పిల్లలలొ ఏడ్పులు

తళత ళమెర్పులే గణగణ మ్రోగె గునుగు నా మువ్వలు...17


ధనధనా మ్రోగే దడదడా సాగే ఝణఝణామ్రోగే 

గడగడా అంటూ గుడగుడాత్రాగూ దడదడా కాద్లే

 కిటకిటా తల్పులు గటగటా గుక్కలు కటకటా సాగే

పటపటా కొరికే మకతిక ముక్తికీ  కితకితా పిల్చే  .... ..... 18


కిచకిచ ఆర్పులే గిలిగిలి కజ్జాలు మెకమెకాచిందులు  

జిబజిబ బత్కులో చకచక సాగేను బెకబెక అర్చేను

నకనక లాడేను నకసిక పర్వమే  జరజర జారేను

చిరచిర చూపులే  బిరబిర ఊపులే చురచుర సేవలే ... ... 19


పనులు కష్టమైన పరిధి ఇష్టము తో చేయు బుధ్ధి వెలుగు

మనసు ధర్మముగా మగువ నీతినిజాయితీ మనిషి వెలుగు

మనిషి నిర్వహించు మనుగడే సంపద పెరుగు చున్న వెలుగు

తనువు అత్యాశకు ధనము కలుషితమై విలువ లేని వెలుగు....20


 మనిషి ఎక్కడానికి మనసు తోడు నీడ చాలు ఒక నిచ్చెన 

చినుకు కుర్వడానికి చింత ఉంటె చాలు  తప్పు చేసి ఉన్న

మనము ఎదగడంలొ మగని ఆధ్యాత్మిక సూక్తి చాలుకదా

వెనక బాధలన్ని వెళయు మల్లెచుట్టి వేడి పుట్టు చుండు  .... 21


విధియు తెల్పు చున్న విలువ వివేకమ్ము అర్ధ మవుటలేదు

మదిలొ మార్పువచ్చు మగని సంబంధము తెల్పి తెల్పలేను

నిధిని పొందేందుకు నిగమ శర్మ లాగ వేచి యుండి యున్న

తిధిని బట్టి నడిచి తినక ఉండలేను బతుకు భారమైన   ..... ... 22


సృష్టి ఎందుకంటె సృష్టి కర్తలకే నిత్యమూ తెలిపుట 

ఇష్ట మైన దంటె ఇష్ట విషయాలను సత్యముగా పలుకు     

కష్ట మొచ్చి ఉంటె కష్ట మునుభరించి ధర్మమునే తెలుపు     .

నష్టమైన వృత్తి నష్ట మెలాగనియు చూసి తప్పు పట్టు.... 23


శరణు శ్రీలక్ష్మీ శరణు శ్రీవాణీ శరణు ఉమాసతీ

శరణు శ్రీభక్తీ శరణు శ్రీశక్తీ శరణు శ్రీయుక్తీ     

శరణు సర్వాణీ శరణు గీర్వాణీ శరణు విజ్ఞాణీ

శరణు వసుంధరా శరణు వాగ్వాదిని శరణు పద్మశ్రీ .... 24

   

కరుణ నొసంగుమా కమల దళయతాక్ష కావ్య ధర్మ దక్ష 

శరణు అంటినయ్య సకల జీవరాసి ధర్మ దీక్ష చూడు 

ధరణి పై ఉంటిమి దయను చూపుమయ్య సర్వ విశ్వ రక్ష

పరమ పవన మిత్ర పగలు రేయినందు నీవు దిక్కు మాకు .... 25         


వినుము వినయ నేత్ర విమల చరితమేను విధిన ఆటలన్ని 

కనుము శారదాంబ కనుము హంసవాహి శుభము లిడువమ్మా 

మనువు అడుబుద్ది మనసు  తపోశక్తి తనువు పంచు యుక్తి        

కొనుము నమస్సులివె కొనుము తపస్సులివి హృదయ మనస్సు ఇది ... 25 


మనసు కదలాలీ మమత చేరువ గనే కదిలె కాలంతో     

ధనిక పేదలలో ధనము చుట్టు బేధాలే లేక స్నేహమ్మే 

మనసులోని భావాలను మాపు  కోవటానికి కొందరితొ స్నేహం

మనకు అన్వేషణ మనసు చుట్టు తిరుగుతుంది అదే స్నేహమ్మే  ... 26

  

కళ్ళ కన్నీరే కళ్ళ స్నేహమ్మే కలువలా విచ్చే 

చెలిమి పొందేదే చెలియ స్నేహమ్మే జీవ నాధారము

కులమతాల మధ్య కుల సమానము లే కాల స్నేహమ్మే

వెల్గు నీడ మల్లె వెల లేని చెలిమి బతుకు మార్గమ్మే  ... ...... 27


మంచి దేహమ్మే మంచు అగ్నివేడి వల్లె స్నేహమ్మే      

మంచి తరుణ మందు మంచి మనిషి నందు తలపు కాలమ్మే 

మంచి విషయ వాంఛ మంగళమ్ముగాను మనసు తరుణమ్మే   

మంచి బుద్ధి ఉండుటలో మంచి చెలిమి చేయు సేవ కథనమ్మే ... .. 28

 

  సత్య శోధన లో సత్య హరిశ్చంద్ర కధలు తెల్సు కొమ్ము

నిత్య జీవితంలొ నిత్య సత్యాలను అనుకరించాలీ

తత్వ అర్ధాలను తత్వ ధర్మాలను తెల్పి సుఖించాలి

సత్య వాక్కులన్ని సత్వరమ్ము చూపు జీవి సౌఖ్య మందు  ..... ... 29


తెలప మాటలలో తెలుగు వెలుగు లుండె జీవి సంత సమ్మె      

అలక  మాటలలో అలుకు వెలుగులుండె ఆశ తీర్చు కొరకు 

తలపు శబ్దాలే   తపన వెలుగులా ఎ గుండె బరువు తగ్గె 

మలుపు లెన్నైనా మనసు  వెలుగులుండె నిత్యా బతుకు లోన ...... 30


 కలము చేతబట్టి కలల మనసంతా తెల్పి కధలు సలిపె

కళలు విశ్వ మయం కళలు నేర్పాలీ సర్వ జగతి నందు

 చిలక లాగ వుండి పలుకు పరమాత్మా తత్వమును తెలిపే

 చులకనే అనియే చిలక లాగ అరుదు మోక్ష మంత తెలుపు  .....31

 

మంద బుద్ధి మార్చి మంచి మార్గ మివ్వు మౌన మందహాస 

చందన లేపనలు చెంద మనసు నివ్వు కరుణ చిద్వి లాస

కంద పద్యాలను గద్యములను తెల్పు బుద్ధి నివ్వు దేవ 

సుందరమ్ము గాను  సుందరతత్వాన్ని తెల్పు దారి చూపు .... ... 32


వింత పోకడలే విజయమునకు అడ్డు ఏమి చెప్ప లేను

చింత కల్గుట ఏ చిత్తముయు మారే చిన్మయానందా 

చెంత నుండి సేవ చేయ దలచినాను సర్వ కర్యార్ధయి                 

పంత మొదలి వేసి మాయ లేని బతుకు మాకు చూపువయ్య  .... 33


మేరు నవ్వులోను మేలి  చిన్మయ లయ సుంద.హృద్యమేను  

చారు హాస చిద్వి జాతి కారుణ్యం భావ బంధుతత్వ  

నేర్పు కూర్చియున్న నేత చెప్పుటయే ప్రేమ పాఠములే 

ఆరు నూరుగుటయు ఆశలే ప్రేమగ సాక్షి  ఉండుటయే   .... ..... 34


ఏమి నీ సిగలో ఎంత  మందారం మనసు సింగారం  

ఏమి నన్ను అనకు  ఏదొ ఆకర్షణ కొరకు మాత్రమేను 

ఏమి ఆనందం ఏల నీకులేదు మెడన బంగారం 

ఏమి టీ తనువే వయ్యారం ఎదలొ ఆదుర్దా       ..... .... 35


మనకు మాధుర్యం మధుర నవనీతం మమత నవదీపం 

మనసుకు  పరిమళం మహిమల సుమధురం వయసు వయ్యారం 

మనుగడ కలయకుల  మగని ఉల్లాసం సొగసు ఆమోదం 

వినుము మాటలన్ని విధిన విపరీతం వద్దులె సంబరం .... 36 


చిరు నగవులమయం చిత్త మలుపు తలుపు సర్వ సమ్మోహం 

మరుమళ్లే లే మదిన మైమరుపులు మానస మ్ము మహిమ 

అరుపులు వద్దులే అలసి ఆర్భాటం అసలు గ వద్దులే 

తరువు గాలి పీల్చి  దరువు తపన చూపి తలపులన్ని పంచె .... 37           

   

విన్న విషయాన్నీ వీనులవిందుగా పంచు ఆరోగ్యం  

కన్నుల ముందునే కదులుతున్నవిగా తెల్పు ఆశ్చర్యం 

మన్ను తిన్న పాము మన్నులోనె ఉండు మౌనముగా

మిన్ను నంటు ఆశ మితముగున్న శుభము అమితమే కష్టం .... 38


అన్న మాటలకే అలిగి ఊరెళితే ఉన్న వాడి గతియు  

చిన్న పెద్ద మధ్య జిలుగు ఘటనలుండు దానికే భయమా 

విన్న మాటలన్ని విడిచి నీకు తెలివి ఉంది వచ్చి చేరు 

కన్న వారి యందు కాని వారిగాను ఉండు ట ఎందుకే   ..... ... 39


చిన్మయానందం చిత్త మందు దాగి సమ్మ తమ్ము కలుగు

అన్న మాటలన్ని అన్య మనస్సునే చేరలేవు

ఉన్న సంతోషం ఉత్తమమ్ము గానె ఉంచి సేవ దీన్ని

కన్న తల్లి మాట కాదనలేని దే గౌరవించుటయే  .... .... 40


మనిషి ఆరోగ్యము మహా భాగ్యముయే శాంతి సౌఖ్యమ్ములె
ధనము దరిద్రమ్ము దరిన చేరకుండ ఆశ కల్గించులె          
మనము నందుఁకాంతి మనకు వెలుగుజూపి కొంతసేదతీర్చు 
గొనుము సంతసమ్ము గొప్పమేలుచేయు  నీకు సంపూర్ణములె   .... 41 

భారతీయులందు బానిసత్వముయే లేదు భాగ్యమ్ములె
వీర నారీమణి విశ్వ జగతి తీర్పు చెప్పి మేలు చేయు 
భార మంతమోసి బాధ్యతంత తెల్పి త్యాగ బుద్ది చూపు 
దారి నిడిన ఋషులు దాన గుణము తెల్పి తప్పు త్రోవ మార్చె  .... 42       

జనుల బాధ తీర్చు జపతపంబులుగా యోగ ఋషులెందరొ    
ఘనత నెక్కిన మన గుణ్య చరిత్రయే మేలు చేయు చుండు 
కనుల ముందు మనకు కావ్య చరితమ్ముఎ దేశ సౌభాగ్యము   
వినుట గీతభోధ విజయమిచ్చు చుండు ధర్మ మార్గ మొవ్వు  .... 43

తెల్ల వారిందా దరిన చేర్చేదే కాఫి ముచ్చట్లే 

ఎల్ల వేళల్లో ఎరుక పరచి సంత సమ్ము పంచి యుండు 

కళ్ళ మాటల్లో గొల్లె మగుట కొరకు కొంత ఉత్త్సాహము 

తల్ల డిల్లి పోవు తరుము కొచ్చు కాఫి వాసనేలు ..... 44

          

పరిసరాలు మరచు మైమరపులు మనసు కలత మారు 

సరి పదాలు వినుచు సై అరుపులు సహజ మొవ్వు చుండు 

కరుణ చూపు చూస్తు కై అణకుయు కలువ పువ్వు విచ్చె 

మరవ నీక మదిన చేరి మహిమ చూపు చుండు ...... 45


తృప్తి కలిగించియు తనువు తపించియు తహతహలాడుచూ 

జ్ఞప్తి కున్నదంత దెలఁప దలచి చుండు ఆ సమయముననే

తెల్ప కున్న దంత తెల్పుచుండు కాఫి మహిమ వల్ల

స్వల్పమైన దంత సంతసమ్ము చేరి సహన మవ్వు చుండు ....46 

వంపు సొంపులతో వయసు పిలుపు తోపు సొగసు వయ్యారం

చొప్పదండి తోపు చెంగు జార్చకయే మోయు వనిత నేర్పు

చొప్పపాటు లేదు తొందరగా లేదు తనివి తీరు భుక్తి

ఒప్పు వాలు చూపు వళ్ళు కనపడే ను చూస్తె నడ్డి విరుగు..47


హృదయ వన సీమ న హొయలు ఒంపు లొలుకు వన మయూరి వైతి

మది న ఊరడించు మగువ రూపమ్మే నాలొ వేదనవ్వు

పొదిలి వేడుకగా పొడుపు కథలు లాగ పోరు సలుపు చుంటి

అదిఇదియు అనకే అలక మాని వెంట పడ్డ నడ్డి విరుగు...48


అన్న దాత మనకు అన్నము పెట్టునే ఆద మరచి వద్దు

కాలము దుర్భిక్ష గాలి యుసుభిక్షే మనిషి బతుకు లోని

ఋణము లేకుండా రుజువు చూపించీ జీవిగా ఉండుట

నిత్య సత్యాలే నిన్ను రక్షించే వందనమ్ములేను.....49


నిత్య పలుకులలో నిజము ఎంత వరకు బందమవ్వు చుండు 

తత్వ భావముంటె  దయయు  కోరుచుండు బాద పొందకుండు 

సత్య మైన బతుకు సమర మల్లు చుండు నిత్య జీవితాన 

హత్య చేయుబుధ్ధి హాని కల్గుచుండు దుష్ట బుద్ధి వదులు ... ... 50


తీరు మారు నెపుడు దుర్దశ వలననే యింట కష్టమవ్వు

కోరు చుండి ఉన్న కళలు వృద్ధి గాక నష్ట మోచ్చు చుండు 

మారు చుండి ఉన్న మార్పు ఎప్పు డొచ్చు మాన వత్వమ్మున 

ధీర వనితవోలె  ధైర్య‌ ముంచి సాగు  నేటి తీర్పు మనిషి ... .... 51


పేద విద్యార్థులు పేరు తెచ్చుకున్న చెప్పు కొనలేరే

వాద మవ్వుచుండు వాదిమల్లె బతుకు  లoదు జీవితమ్ము

బాధ వచ్చియున్న భాగ్య మెంటుంటే సర్దుకొనియు బతుకు 

పాద మహిమయున్నవేద కాలములో విద్య వీధి చీరె  ... ...52

                        

యవని ఆలోచన ఎవరి కొరకు ఉండు ఏది ఏమైనా 

అవని యందు కళలు అర్ధ నిస్వార్ధం తోను సాగెనులే

యెవరు కోరినంత ఎంత వరకు సుఖము కల్గు జీవితమ్ము  

ధవళ కాంతి తోను దేహ మందు సుఖము దైవ నిర్ణయమ్ము.... ... 53

     

బ్రతుకు శాంతి గోరి భద్రతతో సాగు వేద జీవితమ్ము  

సతతము నిర్ణయం సామరస్య మగుట సర్వ సాధారణ 

హితము తెల్పుచుండి హాయి కొలుపు చుండి మాయ నంత తరిమె

గతము గూర్చి అణకు గాయ మెంత యున్న మనసు తోను ఈదు   ... .. 54        


మురిసి పోయె పువ్వు మునిగి దోచు నవ్వు హాయి గొలుపు చుండు

విరిసి వాడి పొయ్యె వీధిన పడి జీవి శవాలల్లె మారు

మరువ లేనిరోగ మచ్చె గాలి లేక కాటి చేరు బతుకు

తరువు లాగ లేక తండ్రి లాగ లేక దహన మయ్యె జీవి  ... .... 55


 ఆమె నీలి కురులు ఆవిరులతొ కలిసి ఆశ్రయ మిచ్చాయి 

ఆమె కళ్ళ చూపు ఆత్రముగా ఉండె ఆదరణ కొరకే

ఆమె జీవితాన్ని ఆశల వలయంలొ చిక్క గుండ సాగె

ఆమె సతమతమే ఆకలితో ఉండి అర్ధ మగుట లేదు  ... .... 56

--(())--

   

       



ఇది పద్యప్రక్రియ ఇందులో 4 పాదాలు ఉండును

ప్రతి పాదములో 6 గణాలు ఉంటాయి

ప్రతి పాదములో మూడవ గణము యొక్క మొదటి అక్షరముకు యతిస్థానము కలదు

నాలుగు పాదాల్లో  ప్రాసనియమoను గలదు

ప్రతి పాదములో 1 3 5 స్థానాల్లో మూడు మాత్రలను కలిగి ఉండును

2 4 6 గణములులో  ఆరు మాత్రలు వచ్చేలా రాయాలి


1. వినుము నామొరలను వేంక టేశ్వరుడా నన్ను కరుణించుము

కనుము బాధలనో కంట తిరుమలగిరి వాస శరణుశరణు

అనుది నముదలతును అచ్యు తాముకుంద చక్రి ప్రణతులిడుదు

జనులు నిత్యమునిను చక్క గాగొలుతురు శౌరి కాపాడుము!!


2.పసిడి నవ్వులుతో  పరవశమొనరించి నన్ను మురిపించుము

కసిగ మాటలతో కంట  తడినేపెట్టినా శుభముకాదు

 వసియె వాడిపోవు వసుధ లోనప్రగతి నిజముతెలుసుకోను

మసియె బారిపోక మలుచు యువతబతుకు ఇలన గురువుగాను


 3.శుభము లనివ్వగా సోమ శేఖరహర నతులు గొనరండూ

యభయ మందించర నాది శంకరభువి యనఘ భవానీశ

విభవ సారహరే విరుల పూజ లందు శివా నమామ్యహమ్

శుభము గూర్చుమురా శూలి పరమేశ్వర జనుల కీవెప్పుడూ.


నేటి చంద్రిక పద్యాలు 

అమ్మ పలుకు లన్ని ఆదరించకుండ నామె కొరకు పోయి 
చెమ్మగిల్లు పనులు చేసి సేవ కుణిగ చేతులెత్తి మ్రొక్కి 
కమ్ము కొస్తున్నా కామ్యబుద్ధి తోను కాల మంత వేచి
ప్రేమ పంచాలీ పేరుఅడగను ఇమ్మహిలో నీవు         ....  ...57       

ఆమని మాటలే అర్ధమవ్వకుండ ఆకలయ్యుటేల     
భామ వయ్యారం భాగ్య మగుట యేను దివ్య జీవితముకు    
ఏమి చెప్పి యున్న ఏల చూపు వున్న మంచు లాగ కరుగు    
నామ మేదయితే నయన సుందరేగ నన్ను దోచు కుంది   ..... 58

సమయఫలము పొంది సాను కూలమైన మాట లందించే  
విమల భావముంచి వివరములన్నిటిని తెల్పి సుఖముపంచె
క్రమము తప్పకుండ కరుణ జూపి కామి తార్ధమునే తెలిపి 
గమన విషయ వాంఛ గమ్యమునే తెలిపి సౌఖ్య మివ్వ గలిగె   .... ...59

చంద్రిక పద్యాలు 

బాట సారి బతుకు భయము లేక కదులు నిజము వెంట తిరుగు
ఆట లాగ సాగి అసలు కొసరు వెలుగు మధ్య బతుకు సాగు
ఇష్ట మైన దంత  ఈశ్వరును శక్తి గ నమ్మి బతుకు తున్న
కష్ట నష్టాలతొ కాపు రమనేదే లేని బతుకు వేట     .... ...... 60

ఉనికి మనకు చూపి వున్నత గుణముంచి విశ్వ భావ ముంచె
మనకు ఎవని వలన మాట మంచి నేర్పు కనబడే ది నిజము
మనసుకు దాహమే మమతకు మార్గమే తెల్సు కొను విషయము
మన మనేది ఉంచి మనము అనుభావము వుంచి సా గు జీవి  ...... 61

నిన్ను దలంచితిని నాజనకుని మాట బట్టి కదులు చున్న
మిన్ను నాకు దిక్కు నీ కృప మా పైన ఉంచి బతికించుము
నాన్న నడక నేర్పి నాకు దారి చూపి నాలొ ఆశ పెంచె
మన్ను నమ్మి ఉన్న మానవత్వంతో బతుకు తెరువు గున్న.... .... 62



నాన్న హృదయములో నన్ను హెచ్చరిస్తు నేను ఉన్నా నని
వెన్ను తట్టి లేపి వదలకు ధైర్యమూ అదియు నీకు రక్ష
కన్న వారి ఆశ కాలమున తీర్చూ కధలు చెప్ప కెపుడు
అన్న మాట తోను ఆదరణతో నువే హాయిగా ఉండుము ..... 63

వాని మాటవల్ల వరుస తెల్సి ఫలము పొంద లేక యున్న 
కాని వారికెల్ల కనికరమును చూపె కార్య సాదకునిగ     
ధీను లందరికీ దీప్తి వెలుగు లంద చేయు చుండు బతుకు 
కాని పనులు వదలి కాలయాపన చేయకయు జీవమందు    ..... 64

తెలుగు వారి కున్న తెలివి తేట లు వేఱనకు ఇపుడు 
తెలుగు మెచ్చుకొను తెగువ ఎక్కువేను మారు చెప్ప కుండు 
తెలుగు జాతి కున్న తెగులును గనుమోయి విశ్వ మంత చేరి 
తెలుగు  నరుల మాట తేనియల మూటా పంచ బుద్ధి  కలిగె    ..... 65

తెలుగు వారి బాట తల్లి నేర్పు మాట తెల్లవారి వెలుగు
తెలుగు పాట బతుకు తెల్ల వారి తీయని పలుకులతొ మెలుగు 
తెలుగు అక్ష రమ్ము తల్లి నేర్పు చున్న మాతృ భూమి వెలుగు 
తెలుగు భాష మనసు తరుణ మంత హాయి నింపి హృదయ మెలుగు .... 66
          
రామ చెంతచేరి రాఘవు ని రాజ్యముకు రమ్మనే బరతుడు
రామ పల్కు వల్ల రాజ్యము నకు వెళ్ళె భరత బ్రతిమలాడె
రామ పాదుకలను రాజ సింహాసన పైన ఉంచె భరత
రామ మేము సేవ రాజ్య రక్ష గాను పలుకు వేద వాక్కు  .... .... 67


మనకు ఆనందం మాత్ర అందరిలో ఉండి తీరుతుంది 
వెనుక సంతృప్తిగ వేకువనే తృప్తి గాను కల్గివుండు 
తనువు తపనల పొర తక్షణము సుఖాలు భావ సంతృప్తిఎ
మనలొ వేదభావ మోక్ష మిచ్చు దారి ఒక్క ఆనందం 

కాలము వృధాగా కర్మకు కొదిలివేసి భావ నలో చిక్కి 
దూలము వల్లేను దరిన ఉన్నట్టి  సమయ మంత వృధా 
పాలన లేనిధై ఫలము పొందనిదై ప్రకృతి ఆనందం 
మేళము శబ్దమే పేరు గుర్తు లకై పరుగు ఆనందం  

రేండు భావనలే రకర కములుగాను కలుగు ఆలోచన 
రండు అని వేదనల రమ్య సుఖము హోళి రంగ రించు చుండు 
పొండు దుర్భాషల పొందు ఆనందం చిందు లాట లగును 
మండు మాయ వళ్ళ మాన రక్షణలే మౌన తీర్పు వళ్ళ            
   \

కాల మహిమతో మనసుకు కష్ట సుఖము వచ్చు వరుసగా
బేల కనులలో తెలియని ఇష్ట మొకటి  తెల్పి తెలపకా 
మాల లతలులా పరిమళ మంత పలక రింపు పరముగా 
వేళ బతుకులో ఒకటిది వేరు సుఖము పంచు మహిళగా 

కాలము మనకే కధలను కావ్యములను తెల్పగలుగుటే
వేలపు మనసే మధనము వైపు కదలి మాయ పరుగులే  
మాలిక వలనే మనుగడ  మోనముగను చేదు బతుకులే 
ఏలిక కొరకే సుఖమును ఎంచు తలపు మోహ వలపుకే                   

జ్వాల వలన జనిత మగు నేస్తములను వీడ వలదులే 
గోల జరిగి విషయమగు  గొప్ప కొరకు గోడు కలలులే   
ఆలి కొరకు కద పెరుగు అల్పమయిన తెల్ప గలుగుటే
ఏలి క తగు విధమగును  ఏది యనక  సేవ తెలుపుటే

--(())--

2 comments: