Sunday 8 July 2018

Pranjali Prabha (9-07-2018)

  ఓం  రామ్ -  మాత్రే నమః - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - అనారోగ్యం -  ఆద్యాత్మికం 
తేది : 9, జూలై 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ఏకాదశి
(నిన్న రాత్రి 11 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 22 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(నిన్న ఉదయం 7 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 49 ని॥ వరకు)
యోగము : శూలము
కరణం : బవ
వర్జ్యం :
ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు :
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 42 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 12 గం॥ 46 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 16 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 10 గం॥ 42 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 20 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 47 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మేషము


నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల ) -2



21. ఎనుబోతు వానకు జంకున ఎంతైనా 
      - వెల హెచ్చు గల ప్రేమ్ వెఱచు గాక
      
       కండలున్న కుస్తీకి జంకున ఎంతైనా
        -  పిన్న బాలుడు మతి వెఱచు గాక
      
       గుడిసైన పెనుగాలికి జంకి ఎగురునా 
        -  విరగ గాచిన మ్రాను  వెఱచు గాక
      
       రంకు పెళ్ళాం బజారు రచ్చకు వెరచునా
         -  వీర ప్రతివ్రత వెఱచు గాక

      నాయకుల మాటలకు ప్రజలు జంకున ఎంతైనా
      కొడుక్కి పదవి ఇవ్వకుండా మణ్డత్రి ఉండునా ఎంతైనా
      నోటి తిట్లకు వెఱచును ఎవ్వరైనా
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా

22.  స్నాన సంధ్యాద్యనుష్ఠాన సంపన్నత, 
       -  శుభలక్షణంబుల సూక్ష్మబుద్ది నమ్రత  
      
       ఘనా వివేక విక్రమ బాంధవ్య వినమ్రత, 
         - మర్మ విలాసంబు మానుషంబు మమత
      
       సరస సాహసందొకవేళ వాచాలత , 
        -విద్యా విచక్షణ విప్రపూజ,ధర్మబోధ  ప్రేరిత  
      
       వితరణగుణము భూపతియందు భక్తి తత్పరత, 
           -నేర్పుతో గాభీర్యము పరోపకారచింత 

      కనుముక్కు తీరు చక్కగా ఉండి    

      సూక్ష్మా సూక్ష్మాలను గ్రహించి ఉండి 
      కీర్తి సౌఖ్యము సకల విజయ సిరితో ఉండి 
      ధర్మపత్నిగా ఉన్న వానికి నిత్యశోభ 
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా




  23.   కన్నె నిచ్చిన వాణ్ని, అప్పు ఇచ్చిన వాణ్ని 
           -  సొంపుగా నింపుగా చూడవలయు
          
           అన్నమిచ్చిన వాణ్ని, నాదరించిన వాణ్ని, 
            - దాతగా తండ్రిగా దలఁప వలయు     
          
           విద్యనేర్పిన  వాణ్ని, వెరపు దీర్చిన వాణ్ని, 
           - గురువుగా హరునిగా నెరుగవలయు 
          
           కొలువు గాచిన వాణ్ని గూర్మి చూపిన వాణ్ని, 
            -  సుతునిగా హితునిగా చూడవలయు  

          ఇట్టి వారిపై ప్రేమ చూపక 

          మనోనిబ్బర మనోనిటి నాననుసరించి  
          కసరు పుట్టిన మనుజుండు గనఁడు కీర్తి
          ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

                                  --((**))--

24.    కనుముక్కు తీరు చక్కని కాంతి ఉన్న
           - ఆకర్షణలు మెండు   
         
         కాని సుభ లక్షనమ్ములు 
             - వారి వారి గుణములు బట్టే ఉండు  
        
         ఘనత, వివేక విక్రమములు,
            - ఆరోగ్యమును బట్టి ఉండు 
         
          కాని పలుకు బంగారమని పించకపోతే
              -కష్టములు మెండు 

         మర్మ విలాసంబులు, బుద్ధి మానవుని
              - ఆరోగ్యానికి మెండు 
         
          కాని  మితిమీరిన ఆశలు, అలవాట్లువల్ల
                - కష్టములుండు 

        సహసవాచాలత, సాహసము,

              - సంస్కారములు మెండు 
        
          కాని విద్యాదానం, వితరణ గుణము లేక
               -  కష్టములుండు   
   
        భయ భక్తి - నీతి నేర్చు చుండు 
        గాంభీర శక్తి  - నీ నేర్పుతో బలముండు
        కీర్తి సౌఖ్యము - నీ సిరితో ముడి పడు ఉండు 
        గలుగుచుండు -  దోషము ల్దొలగుచుండు
        ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

    
 .
25.  ధనముంది దానము చేయని లోభి
        - దేబెను బెల్లున తిట్ట వలయు
       
        దిట్టి నప్పుడే తెలిసి భేదము నొంది
         -  ఇంద్రుడైనను బిచ్చమెత్తవలయు
       
       కలకొద్ధి లోపల  కరుణతో మన్నించి 
         -  ఇచ్చిన వారిని దీవించ వలయు       
      
       దీవించుట వల్ల దీర్గాయువు పొంది 
        -  అట్టివానిని అందలమెక్కించ వలయు 

      ధనముందని ఖర్చు చేస్తే - గుణాన్ని తేలేరు     
      బలముందని దౌర్జన్యం చేస్తే - ఓర్పును తేలేరు 
      మనసుందని  దానం చేస్తే - ప్రేమను తేలేరు 
      ఇది వేణు గోపాల మహిమ సుమా 
                                      --((**))--

26.  పెళ్లి సందడిలో జాతర్లు   
        -  పంతాలు పట్టింపులతో విసుర్లు 
        
        కట్నకానుకలతో కసుర్లు 
          -  పిల్ల పాపలతో నవ్వుల్లో ఏడుపుళ్లు 
        
        పండితుల వేదాల ముచ్చట్లు 
        - ఎరువుతెచ్చి నగలేసుకున్న చప్పట్లు 
        
         ఉన్నవి లేనివి తెలిపేవారు కబుర్లు 
           -  కురులు విప్పి ఎగసెకలతో సొగసుకార్లు 

        అట్టివాడు ఇట్టివాడు తెలుసుకొనేది మానవుడు 

       తెలుసుకో లేనివాడు నిత్యకోపము తెచ్చు దానవుడు 
       ఇది వేణుగోపాల ప్రేమ సుమా 




27.  వ్యాపారి అత్యంత క్షామము కోరు
         - ధనాది పాటి ఇంకా ధనము కోరు 
       
        నక్క చనిపోయిన శవము కోరు
          -  కుజనుడౌ వైధ్యున్డు ప్రజలకు రోగము కోరు 
       
        సామాన్య విపరుండు చావు కోరు
          -  వ్యభిచారి వాటాల మనసు కోరు 

       రాఁబోతుపేదల యశము గోరుఁ 
           - నానాయకుడు ప్రజల బలహీనత కోరు 

       పెదవికైనా  ప్రధాన మంత్రికైనా 

       దేవభూసురుల వృత్తి తీయగోరు  
       బ్రతకనేర్చిన వారు ప్రేమ కోరు 
       ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

                            --((**))--


28.  పటికబెల్లంతో పానకం చేసి 
       -  ముష్టిచెట్టుకు పోసి పెంచిన తీపి పుట్టదు   
       
       పాలమున్నిటి లోపల ముంచిన 
        -  కాకి రెక్కకు తెల్లని వర్ణము పుట్టదు     
       
       వెదురు బద్దలు వేసి కట్టిన
          - కుక్క తోక వంకర ఏ పరిస్థితిలో పోదు   
       
        ఎన్ని నీతి కధలు వినిపించిన
         - దుర్మార్గుని గుణము ఎప్పటికి మారదు

       మంచిమాటల నెంత బోధించి చెప్పగ
       మడియరండకు విగుణంబు విడువబోదు
       పన్నీరు గంధంబు పట్టించి విసిరినఁ, 
       దేలుకొండి విషము తీయఁబోదు
       ఇది వేణు గోపాల ప్రేమ సుమా 



29. మనుష్యుల మధ్య భేదంబులు తెలియక
        - గోల చేస్తూ  గడిపితి కొన్ని నాళ్ళు
      
      పర స్త్రీలను కాసపడి పాప మెరుగక
        - కొమరు ప్రాయంబున గొన్ని నాళ్ళు
      
       ఉదర పోషణకు  విద్య నాశించక
         -  పరులను విమర్శిస్తూ  గొన్ని నాళ్ళు 
      
      ఘోరమైన సంసారం సాగరమును ఈదలేక
        - పరులను బాధిస్తూ గొన్ని నాళ్ళు

     జన్మమెత్తుట మొదలు నీ సరణిఁ గడచె
     నెటులు గృపఁ జూచెదో గతంబెంచఁబోకు
     నా తప్పులు నీకు తెలియ పరచి గడిచె
     నీ కృపకు వేచి ఉన్నా  గతంబెంచఁబోకు
     ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                             --((**))--


30. గిరి మోసే బరువును గాడిదపై ఉంచితే 
      - మొయినా పారవేసి కూయు గాక

     చిలుక పంజరమ్ములో గూబ ఉంచితే 
      - పలుకునా భయపెట్టి అలుగు గాక 
  
     శునకమును సింహాసనంపై ఉంచితే 
     - కూర్చుండునా తోళ్లను కొరుకు గాక

     ధర్మకార్యములకు ధనమును ఉంచితే
      - పంచునా తన్నుకొని చచ్చు గాక

     చెడి బ్రతికినట్టి శుంఠను జేర్చుకొనిన
     వాఁడు చెడు నుంచుకొన్న భూపతియుఁ జెడును
     వ్యభిచరించు చున్న స్త్రీలను చేర్చుకొనిన
     వారి చెడును పంచుకున్న కుల స్త్రీలు జెడును
     ఇది వేణు గోపాల ప్రేమ సుమా




౩1.  పవలింపుపై నల్లులు ఒకవైపు
        -  మరోవైపు మగని గుర్కే గుర్క
       
       పంఖా శబ్ద ఘోష మరో వైపు 
        -   మాకు ఏల నిద్ర పట్టుట లేదు హరీ
       
       సముద్ర ఘోష ఒక వైపు
         - మరోవైపు ఆదిశేషుని బుస బుస
       
       చరణాల వద్ద అమ్మవారు ఉండగా 
        -  ఘోష, బుస లమధ్య నిద్ద్రేల పట్టు హరీ 

       కాయ కష్టం చేసిన వారికి నిద్ర పట్టు
       ఆలోచనలు ఉన్న వారికి ఎలా నిద్రపట్టు
       ఇది వేణు గోపాల ప్రేమ సుమా
                      
                            --((**))--

 32 . డబ్బుందని భందువులను చేరదీసామ్ 
          - కిల్లి కజ్జాలతో  తంపులు పెట్టె లోకమ్
      
        శ్రీ పురుషుల మధ్య బేధాలు సృష్టిస్తున్న లోకమ్
           -  మమ్ము కాపాడుట ఎవరితరమ్   
       
         పగవాని సోదరుడని చేరదీసావ్
          - పగ వాన్ని సంహరించి పట్టం కట్టావ్
       
         సొంత భార్యనే అగ్నిపరీక్ష చేసావ్
         -  నీ మహిమలు తెలుసు కోవటం ఎవరి తరమ్ 

       నిగ్రహశక్తి ఉంటే మనస్సుకు శాంతి
       అనుమానం తీర్చుకుంటే మరో శాంతి
       ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

Photo


33 .పఠించు వేళ, పాఠము చెప్పు వేళ 
      - దున్నపోతులా ర్యాంక్ ఏల 

       సభ నడుపు వేళ, మంత్రం జపించు వేళ
      - కొంటె వారి గోళాలు ఏల 

      ధనము దాచు వేళ, ధనము పంచు వేళ
    - ఆశగా చూసి అరుపు ఏల         

     బిరుదు పొందు వేళ, ఘనంగా గౌరవించు వేళ 
    - కుక్క బుద్ధి చూపు ఏల 
  
పండితుడికైనా, పామరుడికైనా సమయము కానీ వేళ 
అనువుగాని చోట, అధికులున్న చోట బుద్ది మారు వేళ
జనులను చెరచును నొక్కక్క పాపి నరుడు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((*))--   


34.  ఆవు అరవంగ గోసి వండుకు తిను 
       - వారు     భాగ్యవంతులైరి
       మానాభి మానములు లేకుండా తిను
        - వారు గౌరవధాములైరి 
       అక్షరం లేకుండా వర్ణ సంకరులతో తిను 
        - వారు విద్వాన్సులైరి 
      ధనం కోసం రోజు కోకడితో తిరిగి కలసి తిను 
       - వారు పతివ్రతలైరి       

ఆహ హా కలియుగ ధర్మము ఏమని చెప్పవచ్చు 

ఊరక ఉండక మన:శాంతి కోసం ఎలా బ్రతకవచ్చు   
చదివిన వారికన్నా చాకలి మేలన్నట్లు బ్రతకవచ్చు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

35. సంగీత విద్యా బల్ చౌకనాయె
       - వేదశాస్త్రములు వినసొంపు కాదాయె
      
        భూసురలకును దుర్భుద్ధులు మెండాయె
         - నల్పుల వైభవము అధికమాయె  
      
        కవితా రసజ్ఞులకు ఆదరణ కరువాయె
         - ఆర్ధిక దృష్టి అర్ధం అంతు చిక్కదాయె
      
         ఆశ్రమ ఆచార గురు ధర్మములు లేదాయె 
        -  హింసకులంబులు హెచ్చులాయె

పుట్టుక ప్రశస్థం గమనించకపోతే - బ్రతుకు దుర్భరమవుతుంది 

వేశ్య వృత్తికి అలవాటు బడితే - సంపదకు కొరవ అనేది ఉండదు
హెచ్చుతగ్గులు ఆలోచించక - అవని మనుష్యుల అర్ధం చేసుకోగలిగితే 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

   --((*))--

36. వీపు మోపు తలగడౌనా, కల యధార్ధం బౌనా
        - పెను బొఱ్ఱయును, వ్రాత బల్ల యోనా 
      
       మెరుపు వెలుగు ఔనా, మేఘంబు గోడుగౌనా 
        - స్వరము వాద్యంబులతో సమాన మౌనా 
      
       శక్తి బలహీన మౌనా, కొవ్వు బలమౌనా 
         - కులటకు పుట్టిన పుత్రుడు కుమారుఁడౌనా 
      
        అప్పు శాశ్వితమౌనా , ఇల్లు పందిరి అవునా
        - అప్పుడు యండమావులు జలమౌనా 

కని వస్తువుఁ బట్టుకోఁ గాంక్షచేత

బెనఁగుమాత్రంబె కాని లభింపదేమి
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--

37. పాపాత్మునకు దయ యెందును లేదు
        -  వెఱ్ఱివానికి సాధువృత్తి లేదు
   
      ఈతకు మిక్కిలి లోతు లేదు
        - స్త్రీలకు విన్న మాట నిలబడలేదు
   
       తినే వాడికి తిండి కొదువలేదు
        -  కవిజనంబుల కెఱుంగనిది లేదు
     
       అర్థాతురునకు గృత్యకృత్యము లేదు
        - కామాతురుం డర్థకాంక్ష వీడఁదు

మద్యపాయుల కనరాని మాటలేదు
గ్రామ్యమునకు గలుగ దెందు నాగరిక ముద్ర
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

38. ఆశబోతుకు అర్ధికి సౌఖ్యంబు 
      - ధనపరాయణకు ధర్మచింతంబు
      
      కఠిన మనసునకు కరుణత్వంబు
        - వెఱ్ఱి మనిషికి వివేకంబు  
      
       అల్ప విద్యకు సహకారంబు
       - జారకామినికి లజ్జాభరంబు
      
       బహుజనద్వేషికి వరంబు 
       - దేశ వంచకునకు గౌరవంబు

పాపభీరుత సంతాన బాహ్యునకును
గల దనెడు వార్తగలదె లోకములయందు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

39. తన తల్లి తనయుల్ని తలదించుకొనేటట్లు చేసినా 
      - చెడ్డ తల్లి యనుచు వచియించ రాదు సుమా 

      తన తండ్రి పరుల సొమ్మును దొంగిలించినా   
      - అన్యాయ వర్తనుడని వచియించ రాదు సుమా 

     తన దేశికుడు పరదారా సంగమొనర్చినా 
     - పాపకర్ముడని పలుక రాదు సుమా 

     తన రాజు ప్రజలపట్ల తప్పు జూచినా 
     - క్రురాత్ముడని కిరాతకుడని పలుకరాదు సుమా 
  
ఇట్టి పలుకులు తప్పుగా నెన్నునట్టి
కుటిలచిత్తుల గర్వంబు కొంచెపరుప
మీకెకా కన్యులకు శక్యమే తలంప
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--


40. చెప్పిన వినక పొతే ముంచు కొచ్చు ప్రవాహంబు
       - నిద్ర పట్టిన తప్పించుకోలేని దావాగ్ని ప్రవాహంబు

       పై మెరుపు ఉన్నా లోపల బుచ్చు శాఖంబు
        - గొంగలిలో వెచ్చనిపంచి దాగియున్న శీతలంబు

       పైన ఆకర్షించేవి ఉన్నా లోపల ఊబిమౌనంబు
        - నూతి నందు విషము క్రక్కే భుజగంబు

       పులితోలు కప్పుకున్న మేక ప్రతాపంబు
       - కప్పఁకూతలు కూస్తూ కాల నాయకంబు

ఆపద నీవెనుక ఉండు - తెలివి నీతో ఉండు
దుర్జనుఁడు వాని నమ్మిన దొడర కున్నె
హాని యెంతటివానికినైన జగతి
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--






” ప్రభావతీ ప్రద్యుమ్నం” 3

సాహితీమిత్రులారా!
ప్రభావతీ ప్రద్యమ్నం మూడవ  భాగం ఆస్వాదించండి-

తలగడగా రుక్మిణి తొడలు. కాళ్ళొత్తుతూ సత్యభామ. సురటి (గుండ్రటి విసనకర్ర)తో భద్ర. వింజామర వీస్తూ మిత్రవింద. కాళంజి (తాంబూలం వూసే పాత్ర) ధరించి కాళింది. తమలపాకులిస్తూ జాంబవతి. గొడుగు, పాంకోళ్ళు పట్టుకుని నాగ్నజితి. నీళ్ళ గిన్నెతో లక్షణ మెరుపుతీగల పక్క నల్లమబ్బులాగా అష్టభార్యల్తో కృష్ణుడుంటే నిండు నెలవంకలా అక్కడికొచ్చింది శుచిముఖి!
ఆడవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు అలా నదురు బెదురూ లేకుండా వస్తున్న రాజహంసిని చూసి.
కృష్ణుడి దగ్గరగా వెళ్ళి “ఇంద్రుడు పంపగా వచ్చేను ఓ మాట చెప్పి వెళ్దామని ఏకాంతంగా!” అంది శుచిముఖి తన కొడుకుని రాక్షసుడి మీదికి పంపటం రుక్మిణికి నచ్చకపోవచ్చని అనుమానిస్తూ.
దాని ఆలోచనకి ముచ్చట పడి లేచి కూర్చున్నాడు కృష్ణుడు.
అతని భార్యలంతా దూరంగా వెళ్ళేరు.
ఇంద్రుడు తనని పిలిపించిందగ్గర్నుంచి జరిగిందంతా వినిపించింది శుచిముఖి.
చిరునవ్వుతో కృష్ణుడు, “ఔను. ఇది మంచి ఆలోచన. ప్రభావతికి భర్తయ్యే వాడు నిశ్చయంగా ప్రద్యుమ్నుడే! అందగాడు,వీరుడు, రాక్షసుల కన్న ఎక్కువగా మాయలు నేర్చిన వాడు! తప్పకుండా ఆ వజ్రనాభుణ్ణి చంపుతాడు! .. ఇక ఆ వజ్రపురానికి వెళ్ళటానికి దారి కూడ సిద్ధం చేసేన్నేను. భద్రుడనే నటుడు నా తండ్రి యాగానికి వచ్చి తన ఆటల్తో మునుల్ని మెప్పించి ఎన్నో వరాలు పొందేడు. వాటి వల్ల ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతూ ప్రదర్శన లిస్తున్నాడు. నువ్వు వజ్రనాభుడికి అతని గురించి చెప్పి అతన్ని వజ్రపురానికి ఆహ్వానించేట్టు చెయ్యి. ప్రద్యుమ్నుడు భద్రుడిగా అక్కడికొస్తాడు… ఇక నువ్వు వెళ్ళి ఆ పని జరిగేట్టు చూడు” అని ఆదేశించేడు.

వజ్రపురం వైపుకు బయల్దేరేయి హంసలన్నీ.

ద్వారకానగరం బయట
ఆటలాడుతున్నాడు ప్రద్యుమ్నుడు
తనెక్కిన గుర్రం తన మనసు తెలుసుకుని పరిగిడుతుంటే బంతిని కింద పడకుండా బంగారు కోలతో కొడుతూ!
బంతిని నేలకి కొట్టి అది పైకి లేస్తే దాన్ని కొట్టటం ఎవరైనా చేస్తారు. అతనలా కాకుండా బంతిని వేగంగా పైకెగరేసి అది కింద పడకుండా కొడుతూ ఆకాశంలోనే ఉంచి అడుతున్నాడు వాయువేగంతో గుర్రం మీద అటూ ఇటూ తిరుగుతూ! చూసేవాళ్ళు అతని వేగానికి, చాతుర్యానికి ముగ్ధులౌతున్నారు.
కాసేపలా ఆడి తృప్తిగా ఆపి గుర్రం దిగేడు.

పైనుంచి ఇదంతా చూసింది శుచిముఖి.
“మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా. ఇతంతో రెండు మాటలు మాట్టాడి వెళ్దాం” అంది పెద్దగా, అతనికి వినపడేటట్టుగా.
అంటూండగనే హంసలన్నీ కిందికి దిగేయి, అతనికి దగ్గర్లో!
కుతూహలంగా వాళ్ళని చూస్తూ, “ఇక్కడెవర్తోనో మాట్టాడాలన్నారు కదా! ఎవరతను? ఏ పని మీద వెళ్తున్నారు మీరు?” అనడిగాడతను.
మనోహరమైన స్వరంతో శుచిముఖి చెప్పింది “ఇంకెవర్తోనో కాదు, నీతోనే మా పని! ఇంద్రుడు పంపితే నీ తండ్రి దగ్గరికొచ్చి వాళ్ళిద్దరి ఆజ్ఞలు తీసుకుని ఓ చోటికి వెళ్ళబోతున్నాం. కృష్ణుడికి కుడిభుజం లాంటి వాడివి నువ్వు. కనక ఓ సారి నిన్నూ పలకరించి వెళ్దామని దిగేం. వస్తాం మరి”
“మీ పని గురించి అడగను గాని, ఇందాక “మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా” అన్నారు కదా! నా విషయం ఎందుకొచ్చిందో ఎక్కడొచ్చిందో ఐనా నాకు చెప్పకూడదా?”
“అది రహస్యం. పైగా ఒక్క క్షణం కూడ ఆలస్యం చెయ్‌ కూడదు మేం. కాని నీకూ కృష్ణుడికీ తేడా లేదు గనక యిదివరకు నీ విషయం ఎక్కడొచ్చిందో చెప్తా” అంటూ అనుమానంగా చుట్టూ చూసింది శుచిముఖి. దాని చూపు వెంటనే తిరిగిందతని చూపు కూడ. ఆ చూపు తోటే దూరంగా తప్పుకున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా.
“వజ్రనాభుడనే రాక్షసుణ్ణి చంపటానికి ఇంద్రుడూ, నీ తండ్రీ కలిసి చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఐతే వీళ్ళ కన్నా ముందు వాడే ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమో కనిపెట్టమని పంపితే మేం యిప్పుడా వజ్రనాభుడి పురానికి పోతున్నాం” అంది శుచిముఖి గుట్టుగా.
“ఇంత చిన్న పనికి వాళ్ళిద్దరూ ఇన్నాళ్ళు ఆలోచించాలా? నన్నొకణ్ణి పంపితే ఎప్పుడో పూర్తిచేసేవాణ్ణే!” అన్నాడు ప్రద్యుమ్నుడు బాధ పడుతూ.
“నిజంగా వీరుడివంటే నువ్వు. ఇంద్రుడూ, కృష్ణుడూ కూడ చాలా రోజులుగా ఆలోచిస్తున్నారంటే ఆ రాక్షసుడెలాటి వాడో అన్న ఆలోచనైనా లేకుండా ఒక్కడివే వెళ్ళి వాణ్ణి చంపుతానంటున్నావ్‌!.. సరే, యిదివరకు నీ విషయం ఎందుకొచ్చిందో చెప్తా. ఆ మధ్య ఓ సారి వజ్రపురానికి వెళ్ళినప్పుడు ఆ వజ్రనాభుడి కూతుర్ని చూసేన్నేను. ఆమె అందం గురించి చెప్పాలంటే లోకాలన్నీ చూసిన నాకే మాటలు దొరకటం లేదు! ఏవైనా ఉపమానాలు వాడి వర్ణిద్దామంటే సిగ్గేస్తోంది! ఎంత చెప్పినా ఆ అందం దానికి కోటి రెట్లుంటుంది! .. నాకు భాషలో పాండిత్యం లేక్కాదు చెప్పలేంది సరస్వతీ దేవి స్వయంగా తనంత దానిగా చేసింది నన్ను… అసలు, గొప్ప శబ్దసంస్కారం ఉంది గనకే నాకు “శుచిముఖి” అని పేరు పెట్టిందా దేవి. ఓ రోజు తన పెంపుడు చిలక్కీ నాకూ కవిత్వంలో పోటీపెట్టి నన్ను మెచ్చుకుని “ఉపమాతిశయోక్తి కామధేను” అనే బిరుదు కూడ స్వయంగా తన చేత్తో రాసి నా కాలికి తొడిగింది. కావాలంటే ఇదుగో చూడు” అంటూ తన బిరుదు నూపురం అతనికి చూపించింది శుచిముఖి. “అలాటి నాకే ఆ కన్య రూపం వర్ణించటం అలివి కాని పని. పోనీ బొమ్మ గీద్దామా అంటే బ్రహ్మకే అలాటి దాన్ని మరొకర్ని సృష్టించటం చేతకాలేదంటే ఇక గియ్యటం నా వల్లనౌతుందా? .. అసలు బ్రహ్మే ఓ సారి అంటుంటే విన్నా, ఆమెని తను సృష్టించ లేదని, పార్వతీదేవే సృష్టించిందని! అన్నట్టు నీకు చెప్పలేదు గదూ, ఆమె పేరు ప్రభావతి. ఆ ప్రభావతి తన కల్లో ఆ పరమేశ్వరి రాసిచ్చిందని తన చెలికత్తెకి ఓ చిత్రపటం చూపిస్తుంటే చూసేన్నేను. ఆ బొమ్మలో ఉన్నతను అచ్చం నీ పోలికల్తోనే ఉన్నాడు. దాని గురించే “మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా” అన్నదిందాక… సరే,ఇప్పటికే చాలా ఆలస్యం ఐంది. ఇంక వస్తాం” అంటూ ఆకాశాని కెగిరింది శుచిముఖి మిగిలిన హంసల్తో.

వజ్రపురానికి చేరి కన్యాంతఃపురంలో కొలన్లలో తిరగసాగేయవి!

ఇక్కడ ప్రద్యుమ్నుడు ప్రభావతి గురించి శుచిముఖి చెప్పిందంతా మళ్ళీ మళ్ళీ తల్చుకుంటూ ఉంటే, ఆమెని చూడకపోయినా ఆశ్చర్యంగా ఆమె రూపం అతని మనసులో హత్తుకుంది! చుట్టూ ఉన్నవాళ్ళని, పరిసరాల్ని మర్చిపోయి ప్రభావతినే తల్చుకుంటూ బాధపడసాగేడతను “అయ్యో, ఆ శుచిముఖి నాలాటి వాణ్ణే చిత్రంలో చూశానంటే ఆ విషయం ఏదో ఖచ్చితంగా కనుక్కుని ఉండొచ్చు కదా! ఆ హంస ఏమనుకుందో గాని ఆ తర్వాత ఒక్క క్షణం నిలబడకుండా ఎగిరిపోయింది! ఆలోచించి చూస్తే అది ప్రభావతి అందాన్ని నా దగ్గర అంతగా వర్ణించటానికి కారణం నా స్పందన ఎలా వుంటుందో చూడ్డానికిలా ఉంది. అది తనంత తనే ఇక్కడ దిగి నా తండ్రీ, ఇంద్రుడూ కలిసి వజ్రనాభుణ్ణి చంపే ఆలోచనలో ఉన్నట్టు చెప్పటం, నేను నా తండ్రికి కుడిభుజం లాంటి వాణ్ణని అనటం వీటిని బట్టి ఆ వజ్రపురానికి వాళ్ళు నన్ను పంపాలని అనుకుంటున్నట్టు కూడా అనిపిస్తోంది. ఆ విషయం తెలిసిన హంస నాకా కన్య చక్కదనాన్ని గురించి అంతగా చెప్పిందంటే ఆ చిత్రం నాదేనని నమ్మకం కలుగుతోంది! ఐనా, ఆ హంస ప్రభావతి తన సృష్టి కాదని బ్రహ్మ అంటుంటే విన్నానంది కదా! అప్పుడతను ఆమెక్కాబోయే భర్త ఎవరో కూడా చెప్పాడేమో ఆ హంసని అడిగుండొచ్చు కదా, నా బుద్ధి ఏమైపోయింది? ఇక ఇప్పుడా హంస మళ్ళీ ప్రభావతి దగ్గరికి వెళ్తుందో లేదో!” 
                                                                                                 ఇంకా ఉంది 

                                                                                

1 comment: