Monday 9 July 2018

Pranjali prabha (10-07-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీకృష్ణయాణమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం



ఒళ్లు కాలుతోంది... మేలుకోండి!

కాలుతున్నది చేతిలోని సిగరెట్‌ కాదు.. దాన్ని పట్టుకున్న వేలు, ఒళ్లు అని తెలుసు. కానీ ఎంతో మంది నేటికీ.. తమ చేతులతోనే.. తమ ఒంటికి తాము నిప్పు పెట్టు కుంటున్నారు! ఆ పొగలోనే కాలిపోతున్నారు.

పొగ ఒళ్లంతా కబళిస్తుంది. ఇల్లంతా ఆవరిస్తుంది. తాగే వాడినే కాదు.. ఇంటిల్లిపాదినీ రోగాల పాలు చేస్తుంది. అందుకే ఒకళ్లు పొగ మానేస్తే వాళ్లతో పాటు చుట్టూ ఉన్న బోలడంత మంది బాగుపడతారు.
ఇంత తెలిసీ.. మరి మనం ఈ నిప్పు ఆర్పలేమా? కచ్చితంగా దీనిపై నీళ్లు చల్లగలం. అందుకు అవగాహన పెంచుకోవాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఈ రెండూ చేస్తే చాలు.. ప్రపంచం పొగాకు రహితమవటం తథ్యమని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ!
కాలిస్తేనే తప్పనుకోవద్దు..
చుట్ట, బీడీ, హుక్కా, సిగరెట్టు.. ఇలా పొగ తాగటమే కాదు.. పాన్‌, జర్దా, ఖైనీ, కిళ్లీ, ముక్కుపొడుం.. ఇలా పొగాకును ఏ రూపంలో తీసుకున్నా కూడా ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదు. ఎందుకంటే పొగాకులోనే ప్రమాదకర విషతుల్యాలెన్నో ఉంటాయి. వాటిని ఏ రూపంలో తీసుకున్నా అంతిమ ప్రభావం ఒకటే.
పొగ పీల్చగానే.. నికొటిన్‌ వూపిరితిత్తుల నుంచి చాలా వేగంగా రక్తంలో కలిసి, 10-16 సెకన్లలోనే మెదడును చేరుతుంది. వెంటనే కొత్త ఉత్సాహం ఆవరించినట్లుంటుంది. అయితే ఈ నికొటిన్‌ ఒంట్లో ఎక్కువసేపుండదు. దీంతో మళ్లీ నికొటిన్‌ కోసం తహతహ, సిగరెట్‌ తాగాలన్న కాంక్ష బయల్దేరతాయి. వ్యసనానికి ఇదే మూలం!
పొగలో, పొగాకులో ఎంతలేదన్నా 4000 రసాయనాలుంటాయి. వీటిలో చాలా భాగం విషతుల్య పదార్థాలే. ఇవి మన శరీరంలోని కణాలను, వాటి పనితీరును దెబ్బతీస్తాయి. పొగాకులో ఉండే దాదాపు 60 రకాల రసాయనాలు క్యాన్సర్లను తెచ్చిపెడతాయి.
నికొటిన్‌: దీనివల్లే మళ్లీ మళ్లీ పొగ తాగాలనిపిస్తూ, అదో వ్యసనంగా మారుతుంది. ఇది మెదడు నుంచి గుండె వరకూ సర్వాంగాలనూ దెబ్బతీస్తుంది. నికోటిన్‌ వల్ల శరీరంలోనూ, మానసిక ప్రవర్తనలోనూ ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అందుకే దీన్ని సాధారణంగా క్రిమికీటకాలను చంపేందుకు పురుగు మందుల్లో కూడా వాడుతుంటారు.
కార్బన్‌ మోనాక్సైడ్‌: ఇదో విషవాయువు. పొగాకు మండించినప్పుడు వెలువడుతుంది. దీనికి ఎలాంటి రంగూ, రుచీ ఉండదు. దీంతో శరీరం దీన్ని గుర్తించలేక ఆక్సిజన్‌ అవసరమైన ప్రతిచోటా దీన్ని నింపేసుకుంటుంది. ఇది గుండె పనితీరు మందగించేలా చేస్తుంది.
తారు: వాహనాల పొగ గొట్టాల్లో ఉండే జిడ్డులాంటిదే ఈ తారు. దీన్నిండా క్యాన్సర్‌ కారకాలే ఉంటాయి. పొగతాగే వారి గాలి గొట్టాల్లో కూడా లోపల ఈ తారు జిడ్డులా పట్టేస్తుంది. లోపలికి పీల్చిన పొగ బయటకు వదిలినప్పుడు పొగలోని 70% తారు లోపల గాలిగొట్టాలకు పట్టుకుపోతుంది. ఇది లోపలి గోడలకు పేరుకుపోతుంది. దీంతో శ్వాస కష్టంగా తయారవుతుంది. వూపిరితిత్తులు పాడవటమే కాదు, క్యాన్సర్లూ మొదలవుతాయి.
ఇంకా... పొగలో..: ఇంట్లో నేలశుభ్రం చేసేందుకు వాడే క్లీనర్లలో ఉండే అమ్మోనియా.. చెద పురుగులను చంపేందుకు వాడే ద్రావణంలో ఉండే ఆర్సెనిక్‌.. మనుషులను చంపేందుకు గ్యాస్‌ ఛాంబర్లలో వాడే హైడ్రోజెన్‌ సైనైడ్‌.. పురుగులు చేరకుండా కలరా వుండల్లో వాడే నాఫ్తలీన్‌.. ఇలాంటివెన్నో పొగలో ఉంటాయి. తెలిసితెలిసీ మరి మనం వీటిని లోపలికి పీలుస్తున్నామన్న విషయం మీకు తెలుసా?
గర్భిణులు బహుపరాక్‌!
గర్భిణులు పొగ తాగితే.. ఆ పొగ ప్రభావం నేరుగా కడుపులోని పిండంపైనే పడుతుంది. పొగ తాగే గర్భిణులకు- గర్భస్రావాలు కావటం, మృతశిశువులు పుట్టటం, నెలలు నిండక ముందే కాన్పు రావటం, కాన్పు తర్వాత కూడా ఉన్నట్టుండి పసిబిడ్డలు హఠాన్మరణం పాలవ్వటం వంటివన్నీ జరగొచ్చు. పొగలో ఉండే విషతుల్య రసాయనాలన్నీ రక్తం, మాయ ద్వారా పిండాన్నీ చేరతాయి. ఇవి పిండం గుండె, వూపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి గర్భిణులు అస్సలు పొగ జోలికే పోకూడదు. పొగతాగే వాతావరణంలో కూడా ఉండకూడదు.
పక్కవాళ్లకూ పొగ!
సిగరెట్‌ కాలుతున్నప్పుడు చుట్టుపక్కల ఆవరించే పొగలో కూడా ఎన్నో విషతుల్య రసాయనాలుంటాయి. వీటిని పీల్చే వారికి కూడా ఆరోగ్య సమస్యలు తప్పవు. దీన్నే ‘సెకండ్‌ హ్యాండ్‌ స్మోక్‌’ అంటారు. నేరుగా పొగతాగే వారికి ఎంతటి వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందో ఈ పొగ పీల్చేవాళ్లకూ అంతే ముప్పు ఉంటుంది. ఈ ప్రభావం పిల్లలపై మరీ ఎక్కువ. కిటికీల వంటివి తీసి, పొగ తాగినా కూడా ఇంటి వాతావరణం నుంచి ఆ ప్రభావం తొలగిపోదు. కాబట్టి పొగ మానెయ్యటం ఒక్కటే ఉత్తమం.

పొగ గుప్పుమంటూ కేవలం మన వూపిరితిత్తుల్లోకి మాత్రమే వెళుతుందనీ, దీంతో మహా అయితే దగ్గు వస్తుందనీ.. అంతకు మించి పెద్ద సమస్యలేం ఉండవని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. పొగ నేరుగా వెళ్లేది వూపిరితిత్తుల్లోకే అయినా.. అక్కడి నుంచి దాన్లోని వేలాది విషతుల్యాలు రక్తంలో కలిసి, శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్నీ చేరి, దాన్ని భ్రష్టు పట్టిస్తాయి.

రక్తం.. గుండె.. మెదడు
పొగ వల్ల రక్తం, రక్తప్రసారం తీవ్రంగా ప్రభావితమవుతాయి. పొగను పీల్చినప్పుడు.. దానిలో ఉండే వేలాది విషతుల్యాలన్నీ వూపిరితిత్తుల ద్వారా రక్తంలో కలిసి, రక్తం చిక్కబడేలా చేస్తాయి. దీనివల్ల రక్తం గడ్డకట్టి తీవ్ర సమస్యలు తలెత్తే ముప్పు పెరుగుతుంది. రెండోది- పొగ తాగే వారికి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరుగుతాయి. దీంతో గుండె ఎప్పటికంటే బలంగా పని చెయ్యాల్సి వస్తుంది, దానిపై భారం పెరుగుతుంది. మూడోది- పొగతాగే వారిలో రక్తనాళాలు సన్నబడిపోతాయి. దీంతో శరీరంలో చాలా అవయవాలకు రక్తసరఫరా తగ్గిపోతుంది. గుండెలోనూ, మెదడులోనూ రక్తనాళాల్లో అవరోధాలు తలెత్తి గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు ముంచుకొస్తాయి. కాళ్లకు కూడా రక్తసరఫరా తగ్గి పాదాల మీద పుండ్లు మానకపోవటం వంటి సమస్యలు బయల్దేరతాయి. వీటివల్ల కొన్నిసార్లు వేళ్లు, కాళ్లు తొలగించాల్సిన అగత్యం కూడా ఏర్పడుతుంది.
అల్సర్లు
మన అన్నవాహిక గొట్టం చివర గట్టి కండర కవాటాలుంటాయి. ఇవి జీర్ణాశయంలో ఉండే ఆమ్లం, జీర్ణరసాల వంటివన్నీ పైకి ఎగదన్నుకు రాకుండా గట్టిగా అడ్డుపడుతుంటాయి. అయితే పొగ వల్ల- బిగుతుగా ఉండాల్సిన ఈ కండర కవాటాలు వదులుగా తయారై.. పొట్టలోని ఆమ్లాలు పైకి ఎగదన్నుకొచ్చి గుండెల్లో మంట, అన్నవాహికలో పుండ్ల వంటి బాధలు పెరుగుతాయి.
చర్మం
పొగ వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్‌ అందక.. వయసు మీరినట్లుగా, 10-20 ఏళ్లు పెద్దగా కనబడటం మొదలవుతుంది. ముసలి ఛాయలు, ముఖ్యంగా కంటి చుట్టూరా, ముఖం మీద ముడతలు త్వరగా వచ్చేస్తాయి. చెంపలు పచ్చబారినట్లు, బుగ్గలు జారిపోయి లోపలికి పీక్కుపోయినట్లుగా కూడా కనబడతాయి.
ఎముకలు
పొగలో ఉండే రసాయనాల వల్ల ఎముక క్షయం ఆరంభమవుతుంది. ఎముకలు బోలుగా, పెళుసుగా కూడా తయారవుతాయి. అందుకే పొగ తాగే వారికి ఎముకలు, ముఖ్యంగా తుంటి ఎముకలు విరిగే ముప్పు చాలా ఎక్కువ. వీరిలో విరిగిన ఎముకలు అతుక్కోవటానికి కూడా చాలా సమయం పడుతుంది. తగినంత ఆక్సిజన్‌ సరఫరా లేక కండరాలు కూడా బలహీనపడతాయి. అందుకే పొగతాగే వారికి కండరాల నొప్పులు, బాధలు అధికం.
నోటి అవస్థలు
పొగతాగే వారికి నోటి దుర్వాసన, నోటిలో పుండ్లు, దంతాలు పుచ్చిపోవటం, చిగుళ్ల వ్యాధులు, దంతాల మీద పచ్చటి మచ్చల వంటివన్నీ బయల్దేరతాయి. పొగతాగే వారికి దంతాలు త్వరగా వూడిపోతుంటాయి. నోటి క్యాన్సర్లలో 93% వరకూ పొగతాగే వారిలోనే కనబడతాయి.
వినికిడి, చూపు లోపం
పొగ వల్ల చెవిలోని అత్యంత కీలకమైన కర్ణావృత్తం(కాక్లియా)కు కూడా ఆక్సిజన్‌ సరఫరా తగ్గి, దాని పనితీరు శాశ్వతంగా తగ్గిపోవచ్చు. అలాగే పొగవల్ల కంటిలోని సహజకటకం త్వరగా గట్టిబడి, చిన్నవయసులోనే శుక్లాలు ఏర్పడతాయి. రాత్రిచూపూ మందగించొచ్చు.
దుర్బలత్వం
పొగలోని విషతుల్యాల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీంతో చీటికీమాటికీ జబ్బుల బారినపడుతుంటారు. పుండ్లు మానటం వంటి సహజ ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. పుండ్లు పడితే ఒక పట్టాన మానవు. కణజాలం కుళ్లిపోయి (గ్యాంగ్రీన్‌) అవయవాలు తొలగించాల్సిన అవసరం కూడా పెరుగుతుంటుంది.
సంతాన రాహిత్యం
పొగ వల్ల సున్నిత రక్తనాళాలు దెబ్బతిని అంగానికి రక్తసరఫరా క్షీణించి పురుషుల్లో అంగస్తంభన సమస్యలు పెరుగుతాయి. శుక్రకణాల సంఖ్య తగ్గి సంతాన సమస్యలూ ఎదురవ్వచ్చు. ఇక స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గి, సంతాన రాహిత్యం, ముందుగానే మెనోపాజ్‌ దశలోకి వెళ్లటం వంటి ఇబ్బందులూ వెంటాడతాయి.
వూపిరితిత్తులు
పొగతాగటం వల్ల నేరుగా, తొలిగా దెబ్బతినేది వూపిరితిత్తులే! గాలి గొట్టాలు, శ్వాసనాళాల్లోని లోపలి వైపు మృదువైన పొరలు పొగ వల్ల వాచిపోతాయి. దీనివల్ల ఛాతీ పట్టేసినట్టుగా, బిగువుగా అనిపిస్తుంది. బలంగా, వేగంగా గాలి తీసుకోవాల్సి వస్తుంది. క్రమేపీ పిల్లికూతల వంటివి మొదలవుతాయి. ఈ వాపు ఇలాగే కొనసాగుతూ వూపిరితిత్తుల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. తరచుగా జలుబు, దగ్గు, ఉబ్బసం, వూపిరి అందకపోవటం వంటివి మొదలవుతాయి. శ్వాసనాళాల్లో ‘సీలియా’ అని చిన్నచిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలుంటాయి. ఇవి నిరంతరం కదులుతూ, తెమడ, దుమ్మూధూళి వంటివన్నీ లోపలి నుంచి బయటకు వచ్చేసేలా దోహదం చేస్తుంటాయి. పొగ ఈ వెంట్రుకలను దెబ్బతీస్తుంది. దీంతో తరచూ వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వేధిస్తాయి. పొగ క్రమేపీ వూపిరితిత్తుల్లోని చిన్నచిన్న గాలిగదులను పాడు చేసేస్తుంది. దీంతో ఆక్సిజన్‌-కార్బన్‌డైఆక్సైడ్‌ వాయు మార్పిడి సరిగా జరగక, శ్వాస కష్టమై ‘ఎంఫసీమా’, ‘సీవోపీడీ’ వంటి తీవ్ర శ్వాస సమస్యలు చుట్టుముడతాయి. ఇవి పూర్తిగా నయమయ్యేవీ కాదు.
క్యాన్సర్లు
పొగతాగే వారికి ఆపాదమస్తకం క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరంలోని ప్రతి జీవకణంలోనూ డీఎన్‌ఏ ఉంటుంది. కణాల ప్రతి చర్యనూ ఇదే నియంత్రిస్తుంటుంది. పొగ ఈ డీఎన్‌ఏనూ, దీనిలోని సమాచారాన్నీ ధ్వంసం చేసేస్తుంది. డీఎన్‌ఏ దెబ్బతింటే సరైన మార్గదర్శనం లేక, శరీర కణాలు అస్తవ్యస్తంగా ప్రవర్తించటం, విపరీతంగా విభజన చెందటం ఆరంభిస్తాయి. కణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ.. కాన్సర్‌ కణాలుగా, క్రమేపీ కణుతులుగా పెరగటం మొదలుపెడతాయి. మన శరీరం డీఎన్‌ఏను మరమ్మతు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటుందిగానీ నిరంతరం దాడి చేస్తుండే పొగ.. దాన్ని కోలుకోనివ్వదు. అందుకే పొగతాగే వారికి ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం క్యాన్సర్‌ మరణాల్లో మూడోవంతు పొగ, పొగాకు కారణంగా సంభవిస్తున్నవే. పొగతాగే వారికి.. నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, జీర్ణాశయం, వూపిరితిత్తులు, మూత్రాశయం, మూత్రపిండాలు, క్లోమం, పెద్దపేగు.. ఇవన్నీ క్యాన్సర్‌ బారిన పడొచ్చు. రక్త క్యాన్సర్లు, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, పురుషుల్లో వృషణాల క్యాన్సర్‌ వంటివీ ముంచుకురావచ్చు.
సంకల్పం ఉంటే చాలు
ఎవరైనా పొగలో ఉండే నికోటిన్‌ వల్ల దానికి బానిసయ్యే మాట నిజమే అయినా.. సరైన దృక్పథంతో దీన్నుంచి బయటపడటం కష్టమేం కాదు. దీనికి ఎన్నో మార్గాలున్నాయి. మందులున్నాయి. మానాలనుకునే వారికి కుటుంబం, స్నేహితులు, ముఖ్యంగా వైద్యులు ఎన్నోరకాలుగా సహాయం చెయ్యగలరు. కాకపోతే ముందుగా ఎలాగైనా మానాలని దృఢమైన సంకల్పం తీసుకోవటం మాత్రం అవసరం. దీనికోసం ఒక కచ్చితమైన తేదీ నిర్ణయించుకోవటం, దానికి మానసికంగా సంసిద్ధం కావటం తప్పనిసరి. మానెయ్యగానే నిద్రపట్టకపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, చికాకుగా అనిపించటం వంటి మానసిక ఇబ్బందులు తలెత్తొచ్చు. వీటి గురించి వైద్యులు ముందే అవగాహన కల్పిస్తారు కాబట్టి అధిగమించటానికి ప్రయత్నించొచ్చు. అవసరాన్ని బట్టి వైద్యులు నికొటిన్‌ ప్యాచ్‌లు, చ్యూయింగ్‌ గమ్‌ల వంటివీ ఇచ్చి, సహకరిస్తారు. అనుకున్న మొదటిసారే మానెయ్యలేకపోవచ్చు. కానీ మళ్లీమళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉంటే మానెయ్యటం కచ్చితంగా సాధ్యపడుతుంది. పొగ మానెయ్యగానే డబ్బు ఆదా అవుతుంది. రుచి మొగ్గలు మెరుగ్గా పని చెయ్యటం ఆరంభించి.. మళ్లీ కొత్త జీవితం మొదలైనట్లనిపిస్తుంది. ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి. వీటన్నింటి నుంచీ తిరిగి పునరుత్తేజం పొందుతూ.. సంకల్పాన్ని మరింత దృఢతరం చేసుకోవాలి. మళ్లీ ఎప్పుడైనా తాగాలనిపిస్తే ‘ఈ ఒక్కటీ తాగి ఆపేద్దామని’ మాత్రం అనుకోవద్దు. వెంటనే దృష్టి మరల్చుకోవటానికి ప్రయత్నించటం, ఎవరితోనైనా మాట కలపటం, చిన్నగా వాహ్యాళికి వెళ్లిరావటం, ఏదో పనిలో తలదూర్చటం, ఏదైనా ఒక గ్లాసు జ్యూసు తాగటం, ఆ వాతావరణం నుంచి దూరంగా వెళ్లిపోవటం.. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలతో ఆ తహతహను తప్పించుకోవచ్చు. సంకల్పం స్థిరంగా ఉంటే పొగను.. తేలికగా.. దూరంగా... వూదిపారెయ్యొచ్చు!
ఫలితం.. తక్షణం!
పొగ తాగటం మానేసిన మరుక్షణం నుంచే దాని సత్ఫలితాలు, ప్రయోజనాలు కనబడటం మొదలవుతుంది. మానేసిన 20 నిమిషాల్లో.. గుండెకొట్టుకునే వేగం సాధారణ స్థాయికి చేరుకుంటుంది. 8 గంటల తర్వాత రక్తంలో నికొటిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ స్థాయులు సగానికిపైగా తగ్గిపోతాయి. ఆక్సిజన్‌ స్థాయులు సాధారణ స్థాయికి వస్తాయి. 48 గంటల తర్వాత ఒంట్లో నికోటిన్‌ అనేదే ఉండదు. రుచి, వాసన, సామర్థ్యం మెరుగుపడతాయి. 72 గంటల తర్వాత శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. శ్వాస నాళాలు విప్పారటం మొదలవుతుంది. ఒంట్లో శక్తి పెరిగిన భావన కలుగుతుంది.
మీ .... " వాగ్దేవి విజయం "
ఒళ్లు కాలుతోంది... మేలుకోండి!
కాలుతున్నది చేతిలోని సిగరెట్‌ కాదు.. దాన్ని పట్టుకున్న వేలు, ఒళ్లు అని...


మనసుకు మనసే తోడైన అదే భాగ్యము  - బ్రతుకుకు బ్రతుకు తోడైన అదే స్వర్గము  
ఆశల బాసలు తోడైన అదే సౌభాగ్యము - ఆశయాలు సుఖాలుగా మారినా అదే స్వర్గము 
చీకటి వన్నెల తోడైన అదే సంసారము - వేడితో చలి కలసి వెచ్చగ మారినా అదే స్వర్గము
మనసు మమత తోడైతే అదే సంతోషము - నీప్రేమ నాప్రేమ ఒక్కటిగా మారినా అదే స్వర్గము
    
క్షణం కన్నీరు, క్షణం అనుమానం
క్షణం కష్టం, క్షణం నష్టం, ఓర్పుగా 
పరిష్కారం ధర్మంగా తెలుసుకోవటం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  
    --((**))--





సంగీత స్వరములతో పాడుతున్నప్పుడు కాని
 - చేతులతో వాద్యము వాయించు నప్పుడు కాని 


ఆటలయందు గట్టి పట్టు చూపునప్పుడు కాని 
- శత్రువులపై యుద్దము చేయునప్పుడు కాని  

మంచి ఆకలితో భోజనం చేయు నప్పుడు కాని
 - వ్యవహారములు జరుపు తున్నప్పుడు కాని 

పట్టు విడుపులతో సిగ్గు విడిచిన వారికే సుఖము కాని
 - మొండిగా వాదించే వానికి కష్టాలు అని 



ఏపని అయిన దారం తెగేదాక లాగా కూడదు

చెప్పిన మాటవిని, కృషితో, తెల్వితో, పట్టుదలతో 
ఉండి కొన్ని పరిస్తుతులలో సిగ్గి విడిచిన తప్పుకాదు   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
 --((**))--



పవళింపు పట్టు పాన్పులు సుఖము కన్నా

 - చల్లని వెన్నెలలో పచ్చ గడ్డి చేను మిన్నా 

తియ్య తియ్యని మధుర ఫలాల రుచి కన్నా 
- మనస్సును నొప్పించని మాటలు మిన్నా 

అందానికి అందం ఆభరణాలు అనుకున్నా 
- అనురాగమైన ఆప్యాయత ఉన్న భర్త మిన్నా 

రంగు రంగులు విరజిమ్మే విద్యు కాంతులు కన్నా
 - ఒకే ఒక్క సూర్య కాంతి ప్రపంచానికి మిన్నా 



ఏది ఉన్న ఎంత మంది అన్నా 

జరిగేపని జరగక మానదన్నా 
ఆశకుపోతే అంటే నిండు సున్నా   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--



మహాకవి శ్రీశ్రీ గారి సినిమా గేయము

మనసున మనసైరంగు రంగు 
బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము అదే స్వర్గము
ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే బాగ్యము అదే స్వర్గము



నిన్ను నిన్నుగ ప్రేమించుటకు

నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము



చేలిమియే కరువై వలపే అరుదై

చేదరిన హ్రుదయమే సిల ఐ పోగ
నీ వ్యధ తేలిసి నీడగ నిలిచి



తోడొకరుండిన అదే బాగ్యము అదే స్వర్గము



మనసున||


--((**))--

ఆలింగన స్పర్శ ఇది అని ఎలా చెప్పేది 
- అంతులేని ప్రేమతో  అవధులు దాటే ఆనందం 

ఒకరి మనసు మరొకరికి ఏమని చెప్పేది 
- క్షణ మాయను చేధించు కుంటూ సాగే ఆనందం           

హృదయానికి హృదయ స్పర్శ ఎం చెప్పేది
 - జిహ్వచాపల్యంతో ఆశలు పంచుకొనే ఆనందం  

పగలు కృషి రాత్రి విశ్రా0తి సుఖమే ఎలా చెప్పేది
 - కొత్త ఖర్చులతో సుఖదు:ఖాల ఆంనందం 
        
నల్లేరులా పెళ్లైన కొత్తలో పరుగెత్తి  
పల్లేరు ముళ్ళ బాధను భరించి   
జీవిత మలుపుల్లో సాగే పరవళ్లు    
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

చెలియ మోముపై చిరునవ్వు సింగారించే
 - ముంగురులు ముచ్చట గొలిపి పిలిచే

ముంజేతి గాజులు కెరటాలులా ధ్వనించే
 - కాలి మువ్వల కదలిక ఘల్ మనిపించే

ముడిరెవిక బిగువు తో తడిసి వికసించే
 -పెదవి సిగ్గు దోంతరులు తొందర చేయించే

సిరిమల్లే పరవాలు చిందులు వేయించే
- కుచ్చిల్ల తపన హృదయాన్ని కరిగించే

మగువ అందం మగధీరునికి సొంతం
మగని పొందు మాతృత్వానికి సొంతం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--

ప్రపంచ దేశాల్లో చాటాలి మనదేశ ఘనత  
- దుష్ట శక్తుల మధ్య చేరి తెచ్చుకోకు కలత 

ఒకరికొకరు అర్ధం చేసుకొని ఉండేదే సమత
- రాజకీయాల్లో ఎప్పుడు ఆవహించేది మగత 

హృదయ స్పందనతో ప్రేమను ఆశించేది మమత  
- మాటలతో కృషితో ధర్మమార్గాన నడిచేది మానవత

విజ్ఞానం గురువు, తల్లితండ్రులవద్ద పొందేది నవత
- ప్రభుత్వ ఉద్యోగ ద్వారా కుటుంబాన్ని చూసేది భవిత    
  
జరిగి పోయిన "చరిత" తెలుసుకుంటూ 
మనసుకు నచ్చే " కవిత" చదువుకుంటూ 
స్వతంత్రముగానే "భద్రత" కల్పించుకుంటూ 
"జనత" బ్రతకాలనేదే వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--
  
సీ॥దేశాని,కతి ముప్పు । మోసము తడుతుంటె
దేవుళ్ళ పయి,చర్చ । దేనికంట
మనుధర్మ శాస్త్రము । మంటంటి పోతుంటె
కులమని కొట్లాట । పలదు పెంట
పరదేశ శక్తులు । చొరబడఁ చూస్తుంటె
మనమధ్య ద్వేషాలు । మాను మంట
ప్రగతి మూల ధనము । పతనమై పోతుంటె
స్వార్థమనెడి కంపు । చాలు నంట
ఆ॥ఖ్యాతి బొందుట కని । కోతిగుణము మాని
జాతి భవిత కొరకుఁ । సాగు మోయి
నర్సపురని వాస । నటరాజ ఘనమోక్ష
విశ్వ కర్మ రక్ష । వినుర దీక్ష
ప్రాంజలి ప్రభ - అధిక్షేప ప్రేమ లీల
లోకం తీరు 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ముప్పు ముప్పు అనకు, తప్పు తప్పు అనకు
 - పరిష్కారం నీముందే ఉంది వెతుకు

మోసం, ద్రోహం అనకు, మంచి ఉంది మనకు
 - స్వార్ధం వీడి నిజాన్ని గమనించి బ్రతుకు 

మనమధ్య ఉంది ఐకమత్యం, అది మరువకు
 - బలహీనతను తరిమి ధైర్యముతో బ్రతుకు    

కృషితో ప్రగతి జగతికి, మన ఆకలి తీర్చుటకు
 - మానవత్వానికి ప్రేమే ఆయుధమని మరువకు     

దేశం ఏమిచ్చిందని అనకు - దేశానికి నీవేం చేశావో ఆలోచించు 
తల్లి తండ్రులను తక్కువ చేయకు - నీ జన్మ కారకుల్ని మరువకు
ఇది వేణు గోపాల ప్రేమసుమా  


--((**))--

ఉద్యానవనంలో తిరుగుతున్నాడతను. పూలలో, లతల్లో, కొమ్మల్లో, ప్రకృతి అంతట్లో ప్రభావతే కన్పిస్తోంది! ఇలా లాభం లేదని తన విషయం అంతా ఆ హంసకి ఓ లేఖ రాసి పంపుదామనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం రాసేశేడు.ఐతే దాన్ని శుచిముఖికి తీసుకెళ్ళి ఇచ్చేదెవరు?

విరహంతో అతని వివేకం నశించిపోతోంది. లేఖని తీసుకెళ్ళగలరా లేదా అన్న ఆలోచన లేకుండా ఉత్తర దిక్కుగా వెళ్ళే వాళ్ళందర్నీ పిల్చి వజ్రపురానికి వెళ్తున్నారా అంటూ అడగసాగేడతను చిలకల్ని, తుమ్మెదల్ని,కోయిలల్ని, గాలుల్ని, మేఘాల్ని, హంసల్ని!

హఠాత్తుగా ఓ చిలక ఆకాశాన ఎగుర్తూ అతని పరిస్థితి చూసి ఆగింది. “నేను వజ్రపురానికే వెళ్తున్నా. నీ పనేవిటో రెండు మూడు ముక్కల్లో టక్కున చెప్పెయ్‌.” అన్నదది హడావుడిగా. “ఈ లేఖని అక్కడున్న శుచిముఖి అనే హంసకివ్వాలి, అంతే” అన్నాడతను ఆనందంగా. “సరే ఐతే. ఎవరికీ కనపడకుండా నా రెక్కల మధ్య ఉండేట్టు దాన్నిచకచక కట్టెయ్‌” అంటూ అతని దగ్గర వాలిందది. అతను అలా చెయ్యటం, అది ఎగిరి పోవటం క్షణంలో జరిగేయి.

ఈలోగా శుచిముఖి ప్రభావతితో పరిచయం కలిగించుకోటానికి సరైన అవకాశం కోసం చూస్తోంది. ప్రభావతి మళ్ళీ అదివరకు వచ్చిన సరస్సు దగ్గరికే వచ్చిందో రోజు.

ఆమె కూడ ప్రద్యుమ్నుడి గురించిన కలవరింతల్లోనే ఉంది!
మళ్ళీ ఓ సారి అతని చిత్రాన్ని చూస్తేనన్నా తాపం కొంత తగ్గుతుందని దాన్ని తెప్పించి చూసుకుంది, ఇంకా విరహంలో మునిగిపోయింది!
ఇదే సరైన సమయం అని వాళ్ళ దగ్గరగా వెళ్ళింది శుచిముఖి!
రకరకాలుగా అనేక చోట్ల నుంచి ఆ చిత్రం వంక చూస్తూ ఏదో ఆలోచనలో వున్నట్టు నటిస్తూ అటూ ఇటూ నడవసాగింది.
అది గమనించింది ప్రభావతి!
“ఈ పక్షికి ఏం తెలుసో, పదేపదే ఈ చిత్రాన్నిలా చూస్తోంది!” అంది తన చెలికత్తెతో.
వెంటనే అందుకుంది శుచిముఖి!
“ఆ చిత్రాన్ని నేనింతగా చూట్టానికి కారణం ఉంది! ఇదివరకు నేనొక అందగాణ్ణి చూశా. అంత అందం ఉన్న మనిషి నాకు మళ్ళీ కనిపించనే లేదు! ఇప్పుడీ చిత్రం అతందిలా అనిపిస్తే, అతని బొమ్మేనా, లేక యింకెవరైనా అలాటి వాళ్ళున్నారా అని ఆలోచిస్తున్నా, అంతే” అని చెప్పీచెప్పనట్టుగా చెప్పింది.
ప్రభావతికి ఎక్కడలేని కుతూహలం కలిగిందా మాటల్తో.
“ఏమిటేమిటీ, మళ్ళీ చెప్పు! ఇలా వచ్చి జాగ్రత్తగా దగ్గరగా గమనించి చూడు అతనో కాదో! మా దగ్గరికి రావొచ్చు,నీకేం భయం అక్కర్లేదు” అంది కంగారుగా.
“మనుషుల్ని చూట్టంతోనే వాళ్ళకి భయపడాలో లేదో చెప్పగలన్నేను. కాకపోతే మీరిద్దరూ ఏకాంతంగా మాట్టాడుకుంటుంటే మీరు పిలవకుండా మీ మధ్య కొచ్చేంత అమర్యాదస్తురాల్ని కాను గనక యిప్పటి దాకా ఆగా” అంది శుచిముఖి ఖచ్చితంగా.
ఆ మాటలకి ఆశ్చర్యపడిపోయారు వాళ్ళిద్దరూ!
“నువ్వు నిజంగా బుద్ధిమంతురాలివి. ఇలాటి వ్యక్తి ఉన్నాడా లేడా అని మేం పందెం వేసుకున్నాం. ఒక్కసారి చూసి చెప్పు” అని బతిమాలింది చెలికత్తె రాగవల్లరి.
“పందెం కోసమో మరోదాని కోసమో నాకెందుకు? బొమ్మని చూడమని కోరేరు, చూస్తా” అంటూ దగ్గరగా చూసి,
“సందేహం లేదు, అతనే ఇతను” అని తీర్పిచ్చింది శుచిముఖి.
పొంగిపోయింది రాగవల్లరి. జాగ్రత్తగా ఆ హంసనెత్తుకుని ప్రభావతి దగ్గరి కెళ్ళింది, “నిజంగా నువ్వు నాపాలిటి దేవతవి, నా పందెం గెలిపించావ్‌” అని దాన్ని ముద్దు చేస్తూ.
“ఉండుండు, ఈ చిత్రంలో అతని గుర్తులేవైనా కనిపిస్తున్నాయేమోకనుక్కుందాం” అంది ప్రభావతి అసహనంగా.
“ఇంకా అనుమానం ఎందుకు? అవిగో అతని వక్షాన ఉన్నవి శంకరుడితో యుద్ధం నాటి దెబ్బల గుర్తులు! మెడమీద రతీదేవి కంకణాల ముద్రలు కూడ కన్పిస్తున్నాయి! ఈ బొమ్మ వేసిందెవరో అతన్ని బాగా ఎరిగిన వాళ్ళే!” అంటూ,”ఏదేమైనా మీ పందెం తేలటానికి యిప్పటికి నేనిచ్చిన సమాచారం చాలు. మిగిలిన విషయాలు మీకక్కర్లేదులే” అని పైకెగరబోయింది శుచిముఖి. సున్నితంగా పట్టి ఆపింది ప్రభావతి. “దయచేసి మమ్మల్నొదిలి వెళ్ళకు. మాతో స్నేహం చెయ్యవా?” అనడిగిందా హంసని జాలిగా. “మీరిద్దరూ రహస్యాలు మాట్టాడుకుంటుంటే మధ్యలో నేనెందుకు? ఇంక వెళ్ళొస్తా” అని బయల్దేరబోయింది శుచిముఖి మళ్ళీ. “మాట్టాడితే పోతాపోతానంటావ్‌! నువ్వుండటం మా ఏకాంతానికి అడ్డం కాదు. నిజానికి మంచిది కూడా. ఈ చిత్రంలో ఉన్నతని మీద మా ప్రభావతి ఆశలన్నీ పెట్టుకుని ఉంది. అతని విషయాలన్నీ మాకు చెప్పాలి నువ్వు. అప్పుడు గాని ఆమె ప్రాణాలు నిలబడవు. ఆ తర్వాత మా రహస్యం అంతా నీకు చెప్తాం” అని ప్రాధేయపడింది రాగవల్లరి.

ఇక తన వంకరమాటలు ఆపొచ్చని గ్రహించింది శుచిముఖి.
“సరే చెప్తా వినండి. ద్వారకానగరం అనే అద్భుత పట్టణానికి రాజు కృష్ణుడి రూపంలో ఉన్న విష్ణువు. అతనికి ఎనిమిది మంది భార్యలు. వాళ్ళలో పెద్ద భార్య రుక్మిణీ దేవి. ఆమె కొడుకే ఈ చిత్రంలో ఉన్న ప్రద్యుమ్నుడు. సౌందర్యానికి సరిపడే మంచి గుణాలున్నవాడు” అంటూండగా ప్రభావతి పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది.
“ఇంకేం, పార్వతీదేవి చెప్పిన పేరు కూడా సరిపోయింది! ఈ హంస వాలకం చూస్తుంటే ఇక మిగిలిన పని కూడా సాధించే చాతుర్యం వున్న దాన్లానే ఉంది” అంది రాగవల్లరి కూడా సంతోషంగా. ఇంతలో శుచిముఖి కాలికున్న పెండెరం కనిపించిందామెకి. గబగబ దాన్ని చదివి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ “ప్రభావతీ! మన పని చేసిపెట్టటానికి ఇంతకు మించిన వాళ్ళు దొరకరు” అని చెప్తూ శుచిముఖికి ప్రభావతి కల విషయం, ఆ తర్వాత జరిగిన విషయాలూ అన్నీ చెప్పేసింది.శుచిముఖి కూడా తను ఆమె విషయం అంతకు ముందే ప్రద్యుమ్నుడికి చెప్పినట్టు, ఐతే అతను దానికి ఏమీ స్పందించనట్టూ చెప్పేసరికి
ప్రభావతి తెల్లబోయింది.
శుచిముఖి వెంటనే, “రాకుమారీ, నీకేం భయం అక్కర్లేదు. అతను కాకపోతేయేం? ఏ లోకంలో ఉన్నవాణ్ణైనా ఎవర్నైనా మరొకర్ని కోరుకో. అతన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. పార్వతీదేవి అందుకు ఒప్పుకోదేమో అని సందేహం వద్దు నీకు. నీ ఇష్టమే ఆమె ఇష్టం … నీ అందాన్ని అంతగా వర్ణించినా కిక్కురుమనకుండా ప్రద్యుమ్నుడున్నాడంటే అదతని సౌందర్య గర్వం. నీ సంగతి నీకు తెలీకపోవచ్చు గాని నిన్ను గురించి నేను వర్ణిస్తే విని నీ కాళ్ళ మీద వచ్చి వాలని వాడు ఏలోకంలోనూ ఇంకెవడూ ఉండడు. నువ్వు కావాలంటే నా ప్రయాణాల్లో చూసిన చక్కటి యువకుల చిత్రాలు రాయించి తెస్తా. నువ్వు ఊఁ అను చాలు” అని హుషారుచేసింది.
ప్రభావతికి నచ్చలేదా మాటలు.
“అంతా విని మళ్ళీ యిలా అడ్డంగా మాట్టాడతావేం? ఐనా నువ్వు తెచ్చేదేమిటి నా తండ్రే యింతకు ముందు అన్ని లోకాల్లోనూ ఉన్న యువకుల చిత్రాలు రాయించి చూపించేడు నాకు. వాళ్ళెవర్నీ ఒక్క చూపు మించి చూడలేదు నేను.తనకి శత్రువని ఈ ప్రద్యుమ్నుడి చిత్రం మాత్రం చూపించలేదతను. ఏదేమైనా నా ప్రతిజ్ఞ విను ఎన్ని జన్మలకైనా ఆ ప్రద్యుమ్నుడే నా భర్త!” అని నిశ్చయంగా తెగేసి చెప్పింది ప్రభావతి.

కొంచెం సేపు ఆలోచించి, “శుచిముఖీ! నాకొక్క ఉపకారం చేసి పెట్టు. ఇంకో సారి నువ్వు ద్వారకకి వెళ్ళి ప్రద్యుమ్నుడితో నా విషయం చెప్పి చూడు. ఆ తర్వాత ఎలా జరగాలో అలా జరుగుతుంది” అంది ఆఖరిప్రయత్నంగా.
ఆమెకి ప్రద్యుమ్నుడి మీద ఎంత ప్రేమ కలిగిందో స్పష్టంగా అర్థమైంది శుచిముఖికి.
“ప్రభావతీ! నీ ప్రేమ ఎంత లోతైందో చూట్టానికి నీకిష్టం లేని కొన్ని మాటలన్నా, క్షమించు. ప్రద్యుమ్నుడిని నీ దగ్గరికి తెచ్చే బాధ్యత నాకొదిలిపెట్టు. అప్పుడేదో పరాకున ఉండి అతను మాట్టాడలేదు గాని అతను నీ భర్త కాక తప్పదు. ఎందుకంటే, ఒకసారి బ్రహ్మకీ సరస్వతికీ ప్రణయకలహం వచ్చి ఆమె అలిగితే అమెకి సర్దిచెప్పటానికి అతను నన్ను పిలిచేడు. ఆ మాటల సందర్భంలో మన్మథుణ్ణి తిడుతూ, “ఒరేయ్‌ మన్మథా! నన్నింత బాధిస్తున్నావిప్పుడు. నీక్కూడా తొందర్లో ప్రభావతి విరహంతో వేగే రోజులొస్తున్నాయిలే చూసుకో!” అన్నాడు. ఆ మన్మథుడే ఈ జన్మలో ప్రద్యుమ్నుడు. కనక, అతనిప్పుడు నీ విరహంతో బాధ పడుతుంటాడని తెలుస్తోంది కదా! ఇక నే త్వరగా వెళ్ళి ఆ విషయం చూస్తా” అంది శుచిముఖి ఆమెని ఓదారుస్తూ.

ఐతే ప్రభావతికి నమ్మకం కలగలేదు. “ఈ హంస అక్కడికి వెళ్ళేదెప్పటికి? వెళ్ళి అతన్ని చూడాలి. అతనికి నామీద కోరిక కలగాలి. ఇక్కడికి రావటానికి అతని తండ్రి ఒప్పుకోవాలి. ఇక్కడ నా తండ్రి అతను రావటానికి ఒప్పుకోవాలి. ఇవన్నీ జరిగేదెప్పుడు? నాకోరిక తీరేదెప్పుడు?” అంటూ దిగాలుపడిపోయింది.
అంతలో
ఓ చిలక రెక్కలు టపటప కొట్టుకుంటూ కేకలు పెట్టింది ఎదురుగా ఉన్న ఓ చెట్టు మీద వల్లో తగులుకుని!
అంత దిగుల్లోనూ దాని అవస్థకి మనసు కరిగి దాన్ని విడిపిద్దామని పరిగెత్తింది ప్రభావతి. దాన్ని వల్లోంచి తప్పించింది.
ఐతే హడావుడిగా ఆమె చేతులు విడిపించుకుని వేగంగా ఎగిరిపోయిందా చిలక, ఆమెకి తన ముఖం చూపించకూడదన్నట్టుగా!
ఆ గడబిడలో జారిపడిందో లేఖ, దాని రెక్కల్లోంచి!
“శుచిముఖీ, ఇదేదో విచిత్రంగా ఉందే! నువ్వెళ్ళి ఆ చిలకని పట్టుకురాగలవా?” అనడిగింది ప్రభావతి. “అదెంత పని? ఇప్పుడే తెస్తా” అని చిలక వెంట పడిందా రాజహంసి.
“ఇంతకీ యీ చెట్టు మీద వలెవరు పెట్టారో, దుష్టులు!” అని ప్రభావతి కోపగించుకుంటే,
“కోయిల్లొచ్చి కూసి నీ విరహాన్ని పెంచుతున్నాయని వాటిని పట్టటానికి నేనే పెట్టా .. సరేగాని, యీ లేఖలో ఏవుందో చూద్దామా?” అని దాన్ని లాక్కుంది రాగవల్లరి.
ఇలా ఉంది దాన్లో
“సరస్వతీదేవి చేత ఉపమాతిశయోక్తి కామధేను బిరుదు పొందిన శుచిముఖికి ప్రద్యుమ్నుడు స్నేహపురస్సరంగా పంపిన రహస్యలేఖ. ప్రప్రభాభావతి గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ ..” అని చదువుతూనే ఆనందంగా గెంతుతూ,
“నిన్ను గురించి నీ ప్రియుడు పంపిందే యీ ఉత్తరం. నీ అదృష్టం పండింది” అనరిచింది రాగవల్లరి.
“నువ్వు చదివింది నిజంగా దాన్లో ఉందేనా?”
“దేవుడి మీద ఒట్టు, నిజం”
“ఐతే ఆ ప్రప్రభాభావతి ఎవరో! ఇంకా ఏముందో చూడు” అని ప్రభావతి అంటే, “నీ వెర్రి గాని అది నీపేరే. కంగారులో అలా రాశాడంతే. చదువుతా విను. ప్రప్రభాభావతి గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ తలుచుకునే కొద్దీ నా మనసంతా ఆమే నిండిపోయి విరహంతో కాగిపోతున్నా. ఆమె అధరామృతం కావాలని చెప్పు ..” అంతవరకు రాగవల్లరి చదివేసరికి ఆమె చేతిలోంచి లేఖని లాగేసుకుంది ప్రభావతి. “ఔన్లెమ్మా. తరవాత్తరవాత యింకెంత పచ్చిగా రాశాడో! నువ్వే చదువుకో!” అంది రాగవల్లరి గడుసుగా. దానికి సిగ్గు పడుతూ కోపం నటిస్తూ ప్రభావతి ఆ ఉత్తరం చించబోతే, “భలే దానివే. అది శుచిముఖికి రాసిన ఉత్తరం. నువ్వు చించేస్తే ఎలా? పైగా ప్రియుడు నీ గురించి రాసిన తొలి ఉత్తరం చించటం అమంగళం కూడా” అంటూ లాలించి, బుజ్జగించి, బెదిరించి ఆపింది రాగవల్లరి.

ఈలోగా శుచిముఖి చిలకని చిక్కించుకుంది!
“ఓసి దొంగచిలకా! నీ రెక్కల్లో ఉత్తరం తీసుకుని ఎక్కడికెళ్తున్నావ్‌? రాక్షసరాజు కూతురు నిన్ను పట్టుకురమ్మంది పద!” అని గద్దించింది దాన్ని తన కాళ్ళ సందున ఇరికించుకుని.
“చంపితే చంపు గాని నన్నక్కడికి మాత్రం తీసుకుపోవద్దు. ఇక్కడ చస్తే నేనొక్కదాన్నే. అక్కడికి తీసుకుపోతే ఇంకెంతమందో!” అని గింజుకుంది చిలక.
“ఎంత గింజుకున్నా ఏవీ ఉపయోగం లేదు. ఎలాగూ ఆ ఉత్తరం మాకు దొరికింది. నువ్వు గనక బుద్ధిగా నాతో వస్తే ప్రభావత్తో చెప్పి నిన్ను విడిపిస్తా” అని ఆశ చూపించింది శుచిముఖి.
“అలా కాదు. దయచేసి నా మాట విను. ఎక్కడన్నా ఆగుదాం. నా పరిస్థితి నీకు చెప్తా. విన్నాక నీకే తెలుస్తుంది నేనెందుకింత పట్టు పడుతున్నానో” అంది చిలక.
సరేనని ఆ చిలకని తీసుకుని ఓ కొండ శిఖరం మీద దిగి దాన్ని తన రెక్కల్తో పట్టుకుని “ఇక నీ విషయం మొత్తం చెప్పు నాకు” అంది శుచిముఖి.
“నేనో పని మీద ద్వారకకి వెళ్ళి తిరిగొస్తుంటే ఆ వూరి బయట ఒకతను ఉత్తరానికి వెళ్తున్న పక్షుల్నీ, మేఘాల్నీ,గాలుల్నీ కూడ మీరు వజ్రపురానికి వెళ్తున్నారా అని అడుగుతుంటే నేను జాలిపడి ఆగా. అతను నాకో ఉత్తరం ఇచ్చి దాన్ని శుచిముఖి అనే హంస కిమ్మంటే నేనిక్కడ కన్యాంతఃపురంలో హంసల్ని చూసి వాళ్ళలో శుచిముఖి ఉందేమో కనుక్కుందామని చెట్టు మీద దిగి వల్లో చిక్కా. దాంతో ఈ పాట్లన్నీ వచ్చి పడినయ్‌” అన్నదా చిలక.
“దీనికి తెలిసింది ఇంతేలా ఉంది. కనక ఇంకెక్కడా యిది ఈ విషయం చెప్పకుండా చూడాలి” అనుకుంది శుచిముఖి.
“పక్షికి పత్రిక పంపేవాడు వెర్రివాడై వుంటాడు. అలాటి ఉత్తరంలో ఏముంటుంది ప్రేలాపన తప్ప! కనక దాని సంగతి మర్చిపో నువ్వు… అది సరే గాని .. అసలు నువ్వు ద్వారకకి ఎందుకు వెళ్ళాల్సొచ్చిందో చెప్పు ముందు” అంది శుచిముఖి తీవ్రంగా.

-----------------------------------------------------------రచన: కె. వి. ఎస్. రామారావు, 

No comments:

Post a Comment