Tuesday 31 July 2018

Pranali Prabha(1-08-2018)

శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:

ఆనందం ఆరోగ్యం - ఆధ్యాత్మికం  

చాలా తక్కువ మందికే తెలుసు .....ఈ విషయం!! 
మన దేశం లో, డాక్టర్లు, 
నర్సులూ, 
ఆశా వర్కర్లె కాకుండా..... 
మన దేశంలో రోడ్లు, స్పీడ్ బ్రెకర్లూ కూడా, .... 
"గర్భవతులకు" సులభం గా ..... 
ప్రసవించడానికి దోహదపడుతున్నాయి!! 
"మేరా భారత్ మహాన్"

--((**))--


!! ఆత్మ నాశనము లేనిది !!

ఈ లెక్కలేంటో తెలుసుకోవు నువ్వు . 
ఎందుకంటే 
శ్మశానాల లెక్కలు ఎందుకులే అనుకుంటావు 
ఆఖరికి చావు అంటే ఏమిటో కూడా 
అవే అధికారాలు అవే అభిజాత్యాలు 
అవే ఆధిపత్యాలు వాటిపై మంతనాలు 
ఈ లెక్కలేంటో పట్టించుకోవు నువ్వు 
అంతేలే 
ఎన్ని ఊరితాళ్ళు చిటుక్కున తెగిపడ్డాయో
ఎన్ని పసుపు తాళ్ళు పుటుక్కన ఊడిపడ్డాయో
ఎన్ని అమ్మతనాల రోధించాయో 
ఎన్ని ర్యాగింగులు వేధించాయో 
ఈ లెక్కలేంటో తలుచుకోవు నువ్వు
నిజమేలే 
ఎన్ని బాల్యాలు చిధ్రమవుతున్నాయో 
ఎన్ని కన్యత్వాలు చిదిమిపోతున్నాయో 
ఎన్ని పురిటికందులు చెత్తకుప్పల్లో చితికిపోయాయో 
ఈ లెక్కలేంటో తెలుసుకోవు నువ్వు
ఎందుకంటే 
ఎలుగెత్తిచెప్పలేవు ఏడవలేవు ఎదిరించలేవు
రగిలి పగిలి మిగిలి పోవటం తప్ప 
నీకు అధికారం కట్టబెట్టే బలిపశువులు అవి 
కొక్కానికి వేలాడుతున్న రైతుముద్దలు అవి 
పేగుబంధం పట్టుకేడుస్తున్న తల్లుల కన్నీళ్లు అవి 
ఒళ్ళంతా పగుళ్లతో రక్తం ఒడుతున్న అభి”మానాలవి” 
దిక్కులు చూస్తున్న అభాగ్య అనాధలవి
అవును లెక్కలతో సంబంధం లేని 
ప్రజాస్వామ్యానివి నువ్వు
పడగలెత్తిన పన్నగానివి నువ్వు
కళ్లులేని కబోదివి నువ్వు 
పవిత్రాత్మవి నువ్వు 
నిజమే 
ఆత్మ నాశనము లేనిది 
ఆత్మను మనిషితనం చేదింపజాలదు
మానవత్వం దహింపజాలదు 
కారుణ్యం తడపజాలదు 
ఆత్మ నాశనము లేనిది

--((**))--

నేటి హాస్యం (ప్రాంజలి ప్రభ -8 )
దారిన పోతున్న ఒక అమ్మాయిని చూసి 
అబ్బాయి సంభాషణ 

"మీరు చాలా అందం గా వుంటారు".. 
"త్యాన్క్స్ అండీ!!" అంది  
"మీరు చాలా తెలివైఅన వారు .... 
"త్యాన్క్స్ అండీ!!" అంది  
"మీరు నిజం రాజకుమారి లాగా వుంటారు!!!" 
"త్యాన్క్స్ అండీ!!" ...ఇంతకీ మీరెమ్చెస్తూ వుంటారు? అంది  
"జోక్స్ వెస్తూ వుంటానండి!!" అన్నాడు 
ఐతే మీరు చాలా బాగున్నారు 
"త్యాన్క్స్ అండీ!!"
మీరు నాకోసం ఏమైనా ఖర్చు పెడతారు 
"త్యాన్క్స్ అండీ!!"
అయితే షాప్పింగ్ కు వెళదాం 
నో "త్యాన్క్స్ అండీ!!"
మీతో జోక్సు వేయనండి వస్తా .......
ఛీ యీ మొగోళ్లంతా ఇంతే ........   
 --((**))--
ప్రాంజలి ప్రభ నేటి హాస్యం -9  
రచయత: మల్లపగడ రామకృష్ణ 

భార్యాభర్తల ఛలోక్తి సంభాషణలు 

ఈ లైటర్ ఎంతసేపటికి వెలుగుట లేదు     
కోపం వద్దు ఎందుకంటే ఇది పాత బడ్డది 
కాస్త ఓపికతో ఒకటికి రెండు సార్లు కొడితే వెలుగుతుంది 
ఇదిగో ఇలా 
అబ్బా మీ చెయ్ తగిలితే చాలు వెలుగుతుంది 
ఈ రోజు వంట అంతా మిరే చేయండి 
తప్పుతుందా 
నిన్ను కట్టుకున్నప్పడి నుండి 
నేను చేసేది ఇదే గా 
కొత్తలో మిస్సెస్ గా ఉన్నా వే
ఇప్పుడు మిస్ స్ట్రెస్ గా మా రావే 
ఆమాత్రం లేకపోతే ఎంజాయ్ ఏముంటుంది 
ఒకరికొక్కరు స్ట్రెస్ 'ఏ'  కాదండిలోకం 
ఆ....   ఆ...   ఆ.. ఆ.. 
ముందు పని కానీయండి 
తారువాత "" ఆ "" అని నోరు తెరుద్దురు కానీ .....  
--((**))--
Image may contain: 1 person, smiling, text

JOKES
**********
ఒక పెద్దాయన పోలింగ్ బూత్ లో vote వేసి బయటకు వస్తూ poling agent ని ఇలా అడిగేడు : మా ఆవిడ వచ్చి vote వేసి వెళ్లిపోయిందా? 
Poling ఏజెంట్ list లో పేరు check చేసి ఇలా అన్నాడు : హా ! కొద్ది సేపటి క్రితం ఆవిడా ఇక్కడే ఉండెను. Vote వేసి వెళ్ళిపోయేరు !
పెద్దాయన : చాలా విచారం గా మొహం పెట్టి నేను కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది . ఆవిడని కలిసి వుండే వాడిని అని అన్నాడు !
ఏజెంట్ :ఏమి sir! Aunty మీరు ఒక దగ్గర కలిసి ఉండటం లేదా అని అన్నాడు !
Peddayana: మా ఆవిడ చనిపోయి 15 సంవత్సరాలు అయింది !కాని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన vote వేసి వెళ్ళి పోతున్నది అని అన్నాడు !😀😀
****

అత్తయ్య కొత్త కోడలితొ:
నీకు వంట చెయ్యడం రాదని తెలిసినప్పుడు కూడా నేను పెద్దగా బాధపడలేదమ్మా...
పాలు గిన్నె లో పోసి స్టవ్ sim లో పెట్టమని చెప్తే...
"Sim 1లోనా... Sim 2 లోనా అత్తయ్యా " అని నువ్వు అడిగావు చూడు అది మాత్రం భరించడం నా వల్ల కావట్లేదు...



*సాలగ్రామం ఎలా పుట్టింది.............?*
గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||
సాలగ్రామం అంటే తెలుసా.......? విష్ణు చిహ్నంగల శిలనే సాలగ్రామం అంటారు.
అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి.
ఆనది పేరు గండకీ.
చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది!
గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది.
ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు.
గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది.
ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు.
ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది.
ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు.
అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన…
ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది.
సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది.
అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది. ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.
గండకి చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది.
కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది.
గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు.
ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే.
మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.
గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు.
ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.

సీ॥కొనగోట కాటుకఁ । కొసరి కొసరి యింతి 
కనురెప్పలకు దిద్ది । కాంతు లద్ది 
దోరనవ్వును నవ్వి । నోరచూపును రువ్వి 
మూసి కందెఱలతో । బాస లాడు 
చెలికాని స్వరములై । తొలి సంధ్య వెలుగులై 
మధుర తోరణమయి । యెదురు చూచు 
ఇరుల పూ దోటలో । వరుని చే దోటలో 
అరమోడ్పు నయనాల । అరువు లిచ్చు 
ఆ॥చెలియల కనురెప్ప । తొలి రాయబారమై 
వచ్చి పలుక రించి । ముచ్చ టించు 
నర్సపురని వాస । నటరాజ ఘనమోక్ష 
విశ్వ కర్మ రక్ష । వినుర దీక్ష 

No comments:

Post a Comment