Friday 6 July 2018

ప్రాంజలి ప్ద్రభ -(0 7 - 0 7 - 2 0 1 8)*

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
Indian art
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

 అధిక్షేప ప్రేమలీల 
ప్రాంజలి ప్రభ లోకం తీరు 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

హిమాలయం ఎక్కినంత మాత్రాన వీరుడు కాదు
- కాకి కూస్తే కోకిల గానంలా ఉండదు 
గంగ మునిగినంత మాత్రాన మోక్షమన్నట్లు కాదు
- తల వెండ్రుక ఎప్పటికీ దర్భగా మారదు
తెగతిని తలెగరేసి నంతమాత్రాన బలాఢ్యుడు కాదు
 - దున్నపోతు ఎప్పటికీ  ఏనుగు కాదు 
పొదుగు లావై ఎంత పొడుగుగా పెరిగిన స్థిరం కాదు
  - కుక్క ఎన్నటికీ గోవు కాదు

ఉన్నత స్థానమందు గూఎచుండగానె
భ్రష్టు భ్రష్టే యగుం గాని శిష్టుగాడు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

అప్రయోజునకు ఆర్భాటము ఎక్కువ 
- ఆరిపోయే దీపానికి కంటి ఎక్కువ
బ్రతుకు జాలిబిడ్డకు ఖర్చు ఎక్కువ
 - మోసం చేసేవారు చనువు చూపుటెక్కువ
అసలు అదే లేని వాడికి మిడిసిపాటు ఎక్కువ
 - ఎదగలేని మనిషికి ఆకలెక్కువ 
ముందుకన్నా వెనుక వెనకవారికి తొందరెక్కువ 
- రోజు సుఖం పంచేవారికి మెరుగు ఎక్కువ

బెరుగుటయు విఱుగుటకని యెఱుఁగలేక
యదిరిపడుచుండు నొక్కొక్క యల్పజనుడు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

-((**))--

Pencil portrait

వార్ధక్యమున చిన్నవయసు పెళ్ళాం మైన 
- దరిద్రునకు పెక్కు బిడ్డలైన
పొరుగున అత్తిల్లి పొసగ నైన
 - ఆత్రుడౌ మన్మధునికి కతిభాషి ముండైన 
సంగీతకారునకు జతగాడు తోడైన
 - వానాకాలంబు నందు ప్రయాణమైన
చలి కాలంబున దీక్ష సలుపు టైన 
- సముద్రాన్ని ఈదుటకు ప్రయత్ని౦చిన

మరణ మిక లేదు వేఱె భూమండలమున
గణనసేయంగ నగునె యీ కష్టమహిమ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--

క్షణం క్షణం ఒక్క క్షణం మమేకం
- క్షణ వీక్షణం మమకార బ్రమరం

క్షణం క్షణం మనసు మనసు బక్షణం
- క్షణ నిరీక్షణ అనురూప సమన్వయం

క్షణం క్షణం ఆలోచన అర్ధం పరమార్ధం
- క్షణ రక్షణ జగతికి ప్రేమామ్రృతం

క్షణం క్షణం స్నేహ, ప్రేమభక్తి మేకీక్రృతం
- క్షణ జ్ణాణ సముపార్జణ జీవతలక్ష్యం

ఏ క్షణమైనా మనస్సు బాధపడకుండా, 
బాధ పడేటట్లు మాట్లాడకుండ సుఖాన్ని అందించి
 సుఖం పొందటమే మానవజన్మకు సార్ధకం
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--

Places to visit
అత్యాశతో నిత్యం ఆరాట పడేవానికి 
- జీవితంలో సంతృప్తి అనేది ఉండదు 
చేసిన మేలు మరచి అవమానించే వానికి
 - జీవిత సమరం నిత్యం తప్పదు 
అదేపనిగా చెడ్డ పనులు చేసే వానికి
 - మనస్సు చెడి స్థిమితం కోల్పోక తప్పదు 
మాట్లాడ దోరణి మార్చక వాదించే వానికి
 - అనురాగ లోపం కోపం రాక తప్పదు      

తల్లి తండ్రులను, గురువులను గౌరవించనివాడు 
విరక్తి లక్షణం ఉన్న వాడు జీవితానికి పనికిరాడు 
అవలక్షణం లేనివాడే ప్రేమ పాత్రుడు 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా    

 వితరణశౌర్య ప్రవిష్టునకే కాక,- 
 మీసము పిసినారి కోసకేల
సిరిగల ఘనసువాసిని కొప్పునకుఁ గాక,- 
 బొండుమల్లెలు బోడిముండ కేల
ప్రజలు సుఖింపగజేయు పంటచెర్వుకుగాక,-
 గండిగుంటకు ఱాతికట్ట యేల
జాతైన బారహాజారి తేజికిఁగాక,-
 కఱకుల కళ్ళెంబు గాడ్దెకేల

అతులితంబైన యల పతివ్రతకుఁ గాక
శుద్ధవేశ్యకు మంగళసూత్ర మేల
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

--((**))--
Urban farming


పాలన లేని మంత్రిని గెల్చుట రోత
 - యోదార్యహీనుని నడుగుట రోత
కులహీనజనులతో నడుగుటయు రోత
 - గుణహీనకామిని గూడ రోత
పాషా౦డ జనులపై భ్రాంతినొందుట రోత
 - మధ్యపాయుల తోడ మైత్రి రోత
తుచ్ఛంపు బణులకు నిచ్చనొందుట రోత
 - చెలఁగి సద్గురు నిండా సేయు రోత 

వేదబాహ్యుల విద్యలు వినుట రోత
క్రూరుఁడైనట్టి హరిభక్తుఁ గూడ రోత
ఇది వేణు గోపాల పేమ సుమా 
--((**))--

పసచెడి యత్తింటఁబడి యుండు టది రోత,
 పరువు దప్పినయెడ బ్రతుకు రోత
ఋణపడి సుఖమున మునిగియుండుట రోత,
 పరులకల్మికి దుఃఖపడుట రోత
తన కులాచారంబుఁ దప్పి నడువ రోత,
 ధరణీశునకు బిర్కితనము రోత
పిలువని పెత్తనంబునకుఁ బోవుట రోత,
 యల్పుతో సరసంబు లాడ రోత

ఒకరి యాలిని గని వగనొంద రోత
సతికి జార పురుషుని బ్రతుకు రోత
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))-- 

మహాకవి శ్రీశ్రీ గారి సినిమా గేయము 

గృధ్రరాజస్య సోదర్యః సంపాతిర్నామ గృద్రరాట్, 
శ్రుత్వా భ్రాతృవధం కోపాదిదం వచనమబ్రవీత్. 
యవీయాన్ కేన మే భ్రాతా హతః క్వ చ నిపాతితః, 
ఏతదాఖ్యాతుమిచ్ఛామి భవస్భిర్వానరోత్తమా. 
అంగదో కథయత్తస్య జనస్థానే మహద్వధమ్, 
రక్షసా భీమరూపేణ త్వాముద్దిస్య యథాతథమ్. 

ఆ వచ్చిన పక్షిరాజు జటాయువు సోదరుడైన సంపాతి. సోదరుని మరణవార్త విని సంపాతి క్రుధ్ఢుడై ఇలా పలికాడు. 
ఓ వానరశ్రేష్టులారా! నా తమ్ముడైన జటాయువు ఎక్కడ ఎవరి చేతుల్లో ఓటమి పొంది మరణించాడో నాకు తెలపండి. 
జనస్థానంలో నిన్ను(సీతను) కాపాడడానికి ముందుకు వచ్చిన జటాయువు ఒక భయంకర రాక్షసుని చేతుల్లో సంహరింపబడిన ఉదంతాన్ని అంగదుడు పూసగుచ్చినట్లు సంపాతికి చెప్పాడు.


తెలుగు వీర లేవరా ఆ ఆ 
ధీక్షబూని సాగరా ఆ ఆ 
తెలుగు వీర లేవరా ఆ ఆ 
ధీక్షబూని సాగరా ఆ ఆ 
దెశ మాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా 
తెలుగు వీర లేవరా 
ధీక్షబూని సాగరా 
దెశ మాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా 
ఆ ఆ ఆ ఓ ఓ ఓ 
ఒహో ఓ ఓ 
ధారున మారణ కాండకు తల్లడిల్ల వద్ధురా 
ఆ ఆ ఆ 
నీతిలేని శాసనాలు నేతినుండి రద్ధురా 
ఆ ఆ ఆ 
ధారున మారణ కాండకు తల్లడిల్ల వద్ధురా 
నీతిలేని శాసనాలు నేతినుండి రద్ధురా 
నిధుర వద్ధు బెదర వద్ధు 
నిధుర వద్ధు బెదర వద్ధు 
నింగి నేకు హద్ధు రా 
నింగి నేకు హద్ధు రా 
ఆ ఆ ఆ ఓ ఓ ఓ 

ఓ ఓ ఓ ఓ 
ఎవడు వాడు ఎచటి వాడు 
ఎవడు వాడు ఎచటి వాడు 
ఇటు వచ్చిన తెల్లవాడు 
ఇటు వచ్చిన తెల్లవాడు 
కండ బలం గుండె బలం కబలించిన దుండగెడు 
కబలించిన దుండగెడు 
మాన ధనం ప్రాన ధనం దొచుకున్న దొంగవాడు 
దొచుకున్న దొంగవాడు 
ఎవడు వాడు ఎచటి వాడు 
ఇటు వచ్చిన తెల్లవాడు 
తగిన శాస్థి చెయ్యరా 
తగిన శాస్థి చెయ్యరా 
తరిమి తరిమి కొట్ట రా 
తరిమి తరిమి కొట్ట రా 
తెలుగు వీర లేవరా ధీక్షబూని సాగరా 
దెశ మాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా 
ఆ ఆ ఆ ఓ ఓ ఓ 

ఈ దెశం ఈ రాజ్యం 
ఈ దెశం ఈ రాజ్యం 
నాదెనని చాటించి 
నాదెనని చాటించి 
ప్రతి మనిషి తొడలు కొట్టి 
శ్రుంఖలాలు పగలగొట్టి 
శ్రుంఖలాలు పగలగొట్టి 
చుర కత్తులు పదును పట్టి 
తుది సమరం మొదలుపెట్టి 
తుది సమరం మొదలుపెట్టి 
సిం హాలై గర్జ్జించాలే 
సిం హాలై గర్జ్జించాలే 
సం హరం సాగించాలే 
సం హరం సాగించాలే 
వందెమాతరం వందెమాతరం 
వందెమాతరం వందెమాతరం 

ఓ ఓ ఓ ఓ స్వతంత్ర్య వీరుడా స్వరాజ్య బాలుడా 
అల్లురి సీతారమరాజా అల్లురి సీతారమరాజా 
స్వతంత్ర్య వీరుడా స్వరాజ్య బాలుడా 
అల్లురి సీతారమరాజా అల్లురి సీతారమరాజా 
అందుకో మా పూజ లందుకో రాజా 
అందుకో మా పూజ లందుకో రాజా 
అల్లురి సీతారమరాజా అల్లురి సీతారమరాజా 
ఓ ఓ తెల్లవారి గుండెల్లొ నిదురించిన వాడా 
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా 
తెల్లవారి గుండెల్లొ నిదురించిన వాడా 
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా 
త్యాగాలె వరిస్తం కష్తలె భరిస్తం 
త్యాగాలె వరిస్తం కష్తలె భరిస్తం 
నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనె నడుస్తాం 
నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనె నడుస్తాం 
నీ వెంటనె నడుస్తాం

మహాకవి శ్రీశ్రీ గారి సినిమా గేయము 

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 
మనసులు కలసిన చూపులె పులకించి పాడెలే 
వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 
చరనం 1 
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు 
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు 
చెలి తలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలు 
ఓ….వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 
చరనం 2 
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి 
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి 
నీ హృఉదయములో వొదిగినచో బెదురింక యేమ్మునది 
వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 

చరనం 3 
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు 
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు 
పెదవులపై మధురిమలే చిలికించ మన్నాయిలే 
ఓ….వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 
మనసులు కలసిన చూపులె పులకించి పాడెలే

వలపు విరిసిన పువ్వు అందం - ఏమని చెప్పేది ఎలా చెప్పేది  

మనసు కలిసిన నవ్వు అందం - ఏంతని చెప్పేది ఏమని చెప్పేది 

--((**))--

Indian paintings

” ప్రభావతీ ప్రద్యుమ్నం” - 1
(మొదటి భాగము )
సాహితీమిత్రులారా!
మనం ఇంతకు మునుపు కళాపూర్ణోదయము ఆసాంతం చదివాము
ఇప్పుడు ప్రభావతీ ప్రద్యుమ్నం ఆస్వాదించండి-

(“కతరాజు” గా పేరుపడ్డ పింగళి సూరన సంప్రదాయ తెలుగు సాహితీకారుల్లో ఎంతో విశిష్టుడు. అతను రాసిన “కళాపూర్ణోదయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం” తెలుగు సాహిత్యంలో అపూర్వ కథా రచనలు. కథాకల్పనలో ఇతనికున్న ప్రతిభ ఇంకెవర్లోనూ కనిపించదు. పురాణపాత్రల్ని వాడుకుంటూనే పూర్తిగా స్వయంకల్పిత కథల్ని అల్లటంలోనూ ఉత్కంఠత పెంచుకుంటూ చెప్పటం లోనూ ఇతనికితనే సాటి. ఇవి రెండూ కాక చిన్నతనంలోనే “రాఘవపాండవీయం” అనే రెండర్థాల కావ్యం కూడ రాసిన ప్రతిభామూర్తి పింగళి సూరన. ఈ “ప్రభావతీప్రద్యుమ్న” కావ్యాన్ని అతను 1590 ప్రాంతాల్లో రాసి వుంటాడని పరిశోధకుల అభిప్రాయం. “సంప్రదాయ కథా లహరి” ప్రాంజలి ప్రభ  లో తొలి ప్రయత్నంగా (రోజువారీ ) దీన్ని అందిస్తున్నాం. )

విష్ణువు కృష్ణుడుగా ద్వారకలో ఉన్న కాలాన ఒక నాడు
ఆయనతో ఓ ముఖ్యమైన పని కలిగి అక్కడికొచ్చేడు స్వర్గాన్నుంచి ఇంద్రుడు.
వస్తూ ఆ నగరం అందాన్ని చూసేసరికి అతనికి ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది.
అతనూ, అతని సారథి మాతలీ అక్కడి వింతల గురించి చెప్పుకుని ఆనందిస్తూ భూమికి దిగేరు.
వాళ్ళ రాక విన్న కృష్ణుడు సాత్యకిని ఎదురు పంపేడు. ఉగ్రసేనుడు, వసుదేవుడు మొదలైన పెద్దల్తో వచ్చి ఆహ్వానించి వాళ్లని లోపలికి తీసుకెళ్ళేడు.
“అంతా క్షేమమే కదా!” అడిగేడు కృష్ణుడు.
“కృష్ణా! నీకు తెలియందేవుంది? ఐనా నా నోటి మీదగా వినాలంటే విను, చెప్తా.
ఆ మధ్య వజ్రనాభుడనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మని మెప్పించేడు. దాంతో ఆ బ్రహ్మ వాడికి మేరుపర్వతం దగ్గర వజ్రపురి అనే అద్భుతమైన నగరం తయారుచేసి ఇచ్చేడు.అదెలాటి నగరమో తెలుసుగా! ఆ వజ్రనాభుడి అనుమతి లేకుండా చివరికి గాలీ వెలుతురూ కూడా దాన్లో ప్రవేశించటానికి వీల్లేదు!
వాడు మొన్న స్వర్గం మీద దాడికొచ్చి ఏకంగా వెళ్ళి నందన వనాన్నే తన సేనలకి విడిది చేసేడు. ఆ మోటు రాక్షసులెక్కడ, అందమైన నందన వనం ఎక్కడ? అక్కడ వాళ్ళు చేసిన రోతపన్లు చెప్పటానికి నాకు నోర్రావటం లేదు. అది తలుచుకుంటుంటే ఇప్పటికీ నా గుండె గతుక్కుమంటోంది!
ఈ గొడవతో యీ మధ్య నా బుర్ర సరిగా పనిచెయ్యక నీకిందాకే చెప్పలేదు గాని బ్రహ్మ వరంలో ఒక భాగం వాడిని దేవతలెవరూ ఎదిరించలేరనేది కూడా! దాంతో మేం ఎవరం వాడివైపు కన్నెత్తి చూట్టానికైనా కుదర్లేదు!
ఇక ఇలా లాభం లేదని బృహస్పతితో ఆలోచించుకుని, “మనం మనం దాయాదులం. ఈ గొడవలెందుకు? ప్రశాంతంగా అన్ని విషయాలూ మాట్లాడుకుందాం రా” అని నెమ్మదిగా చెప్పి వాడ్ని పట్నంలోకి రప్పించి విడుదులేర్పాటు చేయించా. అప్పుడు చూడాలి వాళ్ళ ఆగడాలు!
“నాకు తేరగా యిచ్చే వస్తువులు యివేనా?” అని కోప్పడే అనామకపు రాక్షసుడొకడు!
“నా విడిదికి రంభని పంపలేదేం?” అని బూతులు తిట్టే అణాకానీ రాక్షసుడొకడు!
“నాకు తగ్గ మర్యాదలు జరగటం లేద”ని మండిపడే నిర్భాగ్యపు రాక్షసుడొకడు!
“నాకు అమృతం పోసి పంపలేదే” అని అదిలించే రక్కస పీనుగొకడు!
వాళ్ళందరికీ సర్ది చెప్పలేక నేను పడ్డ పాట్లు ఎన్నని చెప్పమంటావ్‌! “ఎంత పాపం చేసుకున్న జంతువో కదా నాలా ఇంద్రుడయ్యేది!” అని లెంపలేసుకున్నా.

సరే, అలా కొద్దిరోజులు గడిచాయి.
ఇంతలో నేను భయపడ్ద రోజు రానే వచ్చింది!
ఆ రోజు వాడు ఏకంగా నా మందిరం మీదికే దొమ్మీకొచ్చేడు.
మెరికల్లాంటి రాక్షసులు ద్వారపాలకుల్ని చితగ్గొట్టేరు! సభలో కూర్చుని ఉన్న వాళ్ళని యీడ్చి పారేసి వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నారు!
దేవతలూ, మునులూ కిక్కురుమనకుండా మూలమూలల్లో బిక్కుబిక్కుమని దాక్కున్నారు!
నా గుండె గుభేల్‌ మంది. “ఇప్పుడు వీడు నన్ను బంధిస్తే దిక్కెవర్రా దేవుడా!” అనుకుంటూ ఆ భయం కప్పిపుచ్చుకోటానికి వాడికి మర్యాదలు చెయ్యమని సేవకుల్ని పురమాయించి కొంత హడావుడి చేశా.ఐతే వాడి ముందు ఆ పప్పులుడికితేనా! “చేసిన మర్యాదలు చాలు. ఐనా నాకు రావాల్సిందాన్ని యింకేవరో నాకిచ్చేదేవిటి నే తీసుకోలేకనా? జాగ్రత్తగా విను. ఒక తండ్రి బిడ్డలం మనం. కనక నువ్వెన్నాళ్ళు స్వర్గాన్ని పాలించేవో నేనూ ఇకనుంచి అన్నాళ్ళు దాన్నిపాలించబోతున్నా. కాదన్నావా, నిన్ను బంధించటం నాకో పని కాదు” అని కర్కశంగా గర్జించేడు వాడు.
నేను మాత్రం నవ్వు నటిస్తూ, “నువ్వన్నట్టు మనం ఒక తండ్రి బిడ్డలం. కనక ఆయన దగ్గరికే వెళ్ళి ఈ విషయం అంతా చెప్పి ఆయన ఎలా చెయ్యమంటే అలా చేద్దాం” అని వాడికి సర్ది చెప్పి మా తండ్రి కశ్యప మహాముని దగ్గరికి తీసుకెళ్ళా. నా అదృష్టం బాగుండి ఆ సమయాన ఆయనో యాగం చేస్తున్నాడు. అదయాక మా తగువు తీరుస్తానని చెప్పి అప్పటిదాకా వజ్రపురంలోనే వుండమని వాణ్ణి ఆజ్ఞాపించేడాయన. ఏ కళనున్నాడో గాని వాడూ దానికి కిక్కురుమనకుండా ఒప్పుకుని తిరిగెళ్తే మేం పులి నోట్లోంచి బయటపడ్డట్టు పడి చావుదప్పి కన్ను లొట్టబోయి స్వర్గానికి చేరుకున్నాం.


(ఇది అంతర్జాల సేకరణ)                                  మిగతా భాగము రేపటి ప్రభలో చదవండి 



1 comment: