Tuesday 24 July 2018

Pranjali prabha (25-07-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం



శ్లో === లోభశ్చేదగుణే నకిం? పిశునతాయద్యస్తి కిం పాతకై? 
స్సత్యం చేత్తపసా చ కిం ? శుచి మనో యద్యస్తి తిర్దేనకిమ్ ? 
సౌజన్యం యది కిమ్బలేన ? మహియా యద్వాస్తి కిం మండనై ? 
సద్విద్యా యది కిం ధనై ? రపయశో యద్యస్తి కిం మృత్యునా ? 

భావము -=== లోభి తనము కన్నను చెడ్డ గుణము, ఇతరులపై నిందలు వేయుట కన్న మహాపాపము, సత్య ము కంటే తపస్సు, స్వచ్చమైన మనస్సు కంటే తీర్ధము, సౌజన్యము కంటే బలము, గొప్ప దానము కన్న అలంకారము, మంచి విద్య కంటే ధనము, అపకీర్తి కన్న మృత్యువు లేవు.
--((**))--

హనుమంతుడికి ఎక్కువగా తమలపాకులతో పూజలు చేయడం తెలిసిన విషయమే. అలాగే ఆంజనేయుడికి ఇష్టమైన పుష్పాలు ఏంటో తెలుసా? వాయుపుత్రుడికి పొన్నపువ్వు, మొగలి, పొగడ, నందివర్ధనం, మందారం, కడిమి, గజనిమ్మ, పద్మం, నల్లకలువ, ఎర్ర గన్నేరు, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, కనకాంబర, మెట్ట తామర, పొద్దు తిరుగుడు పువ్వులంటే చాలా ఇష్టం.

అలాగే మంకెన, బండికెరివెంద, అడవిమల్లె, సురపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం లాంటి పుష్పాలతో ఆంజనేయుడిని పూజించినవాళ్లు సిరిసంపదలతో తులతూగుతారట.

ఇంకా పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, రుధ్ర జడ, తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఇష్టం. ఈ పుష్పాలతో స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
రోజూ ఉదయం, సాయంత్రం ఆంజనేయుడి మంత్రాన్ని పటిస్తూ ఉండాలట. అలాగే శనివారం, మంగళవారం మాంసాహారాన్ని త్వజించాలట.
ధీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు పూర్తిగా మాంసాహారాన్ని వదిలిసే వాయునందనుడిని సేవిస్తే తక్షణమే వాటి నుంచి ఉపశమనం పొందుతారట.

రోజుకు ఒకసారి హనుమాన్ చాలీసాను పఠిస్తే జీవితంలో క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడొచ్చట.

శుభ మంగళ వారం
శుభ శుభోదయపు వందనాలు ఫ్రెండ్స్....





నేటి హాస్యం 
సుషీ! నీ మీదొట్టు! 
తాగడం మానేసి షాలా సంచ్రాలయిందే! 
నీ హ్రుదయంలో కాస్త చోటు ఇవ్వవే! 

పానకాలు గారూ! మీ ఇల్లు పక్క వీదిలోనుంది! వేగంగా దయచేయండి, 
ఈలోగా మా ఆయన గాని వచ్చారో, 
మీ స్థానం హ్రుదయాల్లో కాదు, 
స్మశానవాటికలో వుంటాది!

వాల్మీకి మహర్షి విరచిత 
యోగ వాశిష్ట సారము 

36. బాలకోపాఖ్యానము 
ఒక అమాయక బాలుడు తన దాదిని ఒక మంచి కధను చెప్పమనెను. ఆ దాది యిట్లు చెప్ప దొడగెను. ఒకానొక శూన్య నగరమున సౌందర్యవంతులు, ధార్మికులు, వీరులునగు మువ్వురు రాజపత్రులు గలరు. వారిలో ఇద్దరు ఇంకను జన్మించలేదు. మరియొకఓడు తల్లి గర్భమున ప్రవేశింపలేదు. దైవవశమున, బంధువులు మరణించుటచే, దు:ఖతులై అందలి శూన్య నగరము నుండి మరియొక నగరమునకు బయలుదేరిరి. ఆ సుకుమారులైన ముగ్గురు రాజకుమారులు, శూన్యనగరము నుండి ఎండలో బయలుదేరుటచే,అవేడికి తపించిరి కాళ్ళుకాలినవి. అప్పుడు కొంతదూరమువెళ్ళిన తదుపరి మూడు వృక్షములను జూచిరి అందులో ఒకదానియందు వారు విశ్రమించిరి. అచట వారు దాని ఫలములను భుజించిరి. ఆకలి తీర్చుకొని కొంత విశ్రమించి, మరల బయలుదేరిరి. కొంత దూరమెళ్ళిన తదుపరి వారికి మూడు నదులు కనబడినవి. అందులో ఒక దాని యందు జలము శుష్కించియె యుండును. మిగిలిన రెండింటియందు అసలు జలమేమియు వుండదు. ఆ జలము లేని నది యందు, ఆ మువ్వురు స్నాన మొనర్చిరి. జలపానము చేసిరి. సూర్యాస్తమయమున వారు ఒక భవిష్య నగరము, ఎత్తైన భవనములు గలది చేరిరి. అందు శ్రేష్ఠమైన మూడు భవనములు గాంచిరి. వానిలో రెండింకను నిర్మించబడలేదు. మూడవ దానికి గోడలు లేవు. ఆ గోడలు లేని భవనమున ముగ్గురు నివసించి, అచట మూడు సుందరమైన పాత్రలు జూచిరి. రెండు కపాలముల వలెను. మూడవది చూర్ణమై యుండెను. ఆ చూర్ణ పాత్ర వారు అన్నమును ఇతర సంభారములు వండిరి. ముగ్గురు బ్రాహ్మలను భోజనమునకు పిలచిరి. ఇరువురికి దేహము లేదు. ఒకరికి తల లేదు. ఆ తల లేని బ్రాహ్మణుడు, ఆ మువ్వురు రాజ కుమారులు భోజనమును పూర్తి చేసిరి. తదుపరి రాజపుత్రులు, ఆనగరమున వేటాడబోయిరి. వారు నేటికిని సుఖముగ నుండిరి. 
ఆ కధ విని బాలుడు సంతసించెను. ఈ కథ వలన రామా! జగత్తంతయు, మనోవికల్పము మాత్రమే ననియు తెలియుచున్నది. ఈ కన్పించిన దంతము, సంకల్ప మాత్రమే కాని అన్యము కాదు. వాస్తవమునకున్నది లేనిది కాని, అనిర్వచనీయముగాని, యగును. అలాగే స్వర్గ, పృధ్వీ, ఆకాశ, వాయువు, పర్వత, నదులన్నియు స్వప్నమువలె సంకల్ప రూపములే పరమాత్మ నుండి మొదట సంకల్ప మాత్రముదయించి, పిమ్మట ఈ జగత్తంతయు విస్తరించినది. కావున నిర్వికల్ప సమాధి నాశ్రయించి, సంకల్ప త్యాగమాచరించిన, నిశ్చయముగ, విశ్రాంతి లభించును. 
ఆత్మ దేహ రహితమైనను, దేహముతో నున్నట్లు భ్రాంతి చెందుచున్నది. అట్టిచో నీ దేహము చిన్నాభిన్నమైనను, ఆత్మకేమి హాని. భేదాభేదములు, వివాదములు శరీరమునకే గాని ఆత్మకు కాదు. ఘటము నశించిన ఘటాకాశము, మహాకాశము నందు యధారీతిగ నుండునట్లు, శరీరము నశించినను, జీవాత్మ, చిత్తాకాశము నందు, యథాప్రకారముగ స్థితి కల్గి యుండును. ఈ మనస్సే యిష్టానిష్ట వస్తువులందు, రాగ ద్వేషములుగలదై తద్వారా బంధమున తగుల్కొనుచున్నది. ఇదంతయు భ్రాంతియె యగును. మానసిక శక్తియె దీర్ఘ స్వప్నము వంటి, మిధ్యారూపమగు, జగత్‌ వైచిత్య్రము నంతను, సత్యంగానే కల్పనమొనర్చినది. ఓరామా! సూర్యుడెట్లు తన వేడిమిచే, మంచును కరిగించి వైచి, నశింప జేయునో, అట్లే నీవును ఆత్మ విచారణచే, మనస్సు ఆత్మను దర్శంచుచున్నది. కాని తన నాశనమును తాను ఎరుగకున్నది. మనోనాశము నాశించు వివేకుల యిభీష్టము, సంకల్ప మాత్రమేననే సిద్ధింపజేయును. మనస్సు నశించిన పరమ పురుషార్ధమగు, మోక్షము లబించును. కాన మనోనాశము కొరకు ప్రయత్నింపుము. 
సముద్ర మందు తరంగములవలె, యీ చిత్తము ప్రకటితమై క్రమముగ జగత్‌ విస్తార మొనర్చుచున్నది. దృష్టము గాని వస్తువును కూడ, ఈ మనస్సు సుమేరు పర్వతమువలె, ప్రకాశింపజేయుచు, ప్రత్యక్ష మొనర్చు చున్నది. బ్రహ్మ చైతన్యము నుండి, వికాసము పొందిన, ఈ మనస్సు ఒక్క నిముషములో అనేకబ్రహ్మండములను నిర్మించుచు, నాశన మొనర్చు చున్నది. స్ధావర జంగమాది ఈ దృశ్య ప్రపంచమంతయు, చిత్తము నుండియె యావిర్భవించుచున్నవి. సత్యమును మిధ్యగను, మిధ్యను సత్యముగను, ఈ మనస్సే చేయుచున్నది. మృత్తికచే బాలుడెట్లు బొమ్మలు చేయునో అట్లే మనస్సును, ఈజగత్తే కల్పనలు చేయుచున్నది. ఈ మనస్సు క్షణమును కల్పముగను, కల్పమును క్షణముగను చేయుచున్నది. మనస్సు యొక్క ఏకాగ్రత వలన ఏ కార్యమైనను అవశ్యము సిద్ధించును. భ్రమ, వ్యామోహము మొదలైన యనర్ధములు, వృక్షము నుండి పత్రము లావిర్భవించునట్లు, చిత్తము నుండియె కల్గును.


No comments:

Post a Comment