Wednesday 25 July 2018

వ్యాస పూర్ణిమ - గురు పూర్ణిమ (27-07-2018)


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:-శ్రీకృష్ణాయనమ : 
ప్రాంజలి ప్రభ 
సర్వేజనా సుఖినోభవంతు 

వ్యాస పూర్ణిమ - గురు పూర్ణిమ -1 

గురువుగారు మనం రైల్లో వెళుతున్నాం గదండి, ఈ పట్టాలు ఎందు కలవ వండి, ఈ చెట్లును చూస్తూ ఉంటె వేలిపోతున్నట్లుకనబడు తున్నాయి, అసలు గురువు ఎవరండి వివరంగా మాకు చెపుతార. మనం దిగే ఊరు వచ్చే దాకా కాస్త కాలక్షేపం. 

పరోపకార భావన, జపపూజాదులు  ఆచరణ, సర్ధక మైన పలుకు, శాంతా స్వభావం, వేద వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసియుండటం , యొగశాస్త్ర  సిద్దాంతాలను సులువుగా భోదించడం, దేవతలా మనస్సులను సంతోష పెట్టడం, మొదలైన సుగుణాలతో పరిపూర్ణుడైన వాడే గురువు


పదిమందికి చెప్పదలచిన నీతినిముందుగా తానాచారించి ఇతరులకు చెప్పేవాడే గురువు.
ఇతరులకు ఏమిచేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతుందో, అది నీవు ఇతరులకు చేయకుండా ఉండటమే ఉత్తమెత్తమ ధర్మం 
శిష్యులు ఇచ్చే సంపదను ఆశించక వారికాద్యాత్మిక విషయాలను సులువుగా తెలియపరచి బ్రహ్మసాయుజ్యానికి తోడ్పడేవాడే ఉత్తమ గురువు
 సాక్షాత్ గురువు:  విశ్వేశ్వరుడు 
గురువు నివసించే ప్రదేశం :కశీక్షెత్రమ్ 
గురుపాదోదకం : గంగానది
గురుమంత్రమే : తారక మంత్రం 
మనోధైర్యాన్ని , మనస్సును నిలకడగా ఉంచేవాడు : శివస్వరూపుడు  హనుమంతుడు
 గురు మంత్రం : ఓం శ్రీ రాం

వ్యాస పూర్ణిమ - గురు పూర్ణిమ -2 
గురువు 

పసిడి మనసులపై ప్రేమను ఉంచి 
భావిపౌరులుగా తీర్చి దిద్దే అక్షర శిల్పి 
యువతను సక్రమ మార్గములో నడిపిస్తూ 
విశ్వవిజ్ఞానవన్తులుగా మార్చే నిత్య విద్యార్ధి 

విద్యార్ధులను నిరంతరం కృషీ వరులుగా మార్చే 
నవసమాజ నిర్మాణానికి సహకరించే శ్రమజీవి
ప్రతి ఒక్కరిలో ఉన్న అజ్ఞానంధ కారాన్ని మార్చి 
నిత్య  జ్ఞాన జ్యోతులుగా మార్చే  తేజస్వి 

 విద్యార్ధుల ఆలోచనలునలను గ్రహించి 
స్వయం కృషీవరులుగా మార్చే కృషీవలుడు
ఆటుపోటులకు తట్టుకొనే పడవ తెరచాపగా
ప్రతివిద్యార్ధిని ధర్మపరుడుగామార్చే నావికుడు 

యువతకు నూతన ఉత్తేజం కల్పించి 
భావితరాల భాద్యులుగా మార్చే బాటసారి 
భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని కల్పించే 
విజయాన్ని సహకారరం అందించే సారధి 

మమతకు మార్గదర్శిగా 
మనోధైర్యానికి మార్గంగా    
ప్రేమామృత మూర్తిగా 
ప్రతిఒక్కరికి శక్తినిచ్చె విధాత

ప్రెమ మూర్తులగా, విద్యా వేక్తలుగా 
ఆరోగ్య వంతులుగా, ఆదర్శ వంతులుగా 
పారిశ్రామిక శక్తిగా, అనుభవాలను చెప్పే తాతగా
ఒకరేమిటి సమస్త ప్రాణులను విశ్వ విజ్ఞాన నిధిగా మార్చే వారే గురువు. 
--((**))--

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే!
నమో వై బ్రహ్మనిధయే వాశిశ్టాయ నమోనమ: !!

 

అని వ్యాసునికి విష్ణువుకు  అభేదం చెప్ప బడింది, వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి  పైలునకు ఋక్సంహితను, వైసంపాయనునకు యజుస్సంహితను, జైమినికి సామసంహితను, సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో  వ్యాపించు నట్లుగా విష్ణు, మత్య , భాగవత,  వాయు,  పురాణాలలో పేర్కోనటం జరిగింది. వ్యాసుడు వేదాలని విభాజిచటమే కాకుండా అష్టా  దశ పురాణాల్నిరచించాడు, బ్రహ్మసూత్రాల్ని వివరించాడు, భారత భాగవతాల్ని రచించాడు. మనజాతికి జ్ఞాన భాండా గారాన్ని అందించిన వేదవ్యాస మహర్షికి ముందుగా నమస్సుమాంజలిని అర్పిందాం. దీనినె వ్యాసపూర్ణిమని- గురుపూర్ణిమని పిలిస్తారు.

 గురుర్బ్రహ్మా  గురుర్విష్ణు: గురుద్దేవో మహేశ్వర:
గురుస్వాక్షాత్ పరం బ్రహ్మ తస్మెశ్రీ  గురవే నమ:

అజ్ఞాన తిమిరామ్ధస్య జ్ఞానాన్జన సలాకయా
చక్షురున్మీలి తం యేన తస్మై  శ్రీ గురవే నమన:  

 

అజ్ఞానమనే చీకటి  ఆవరించిన కారణంగా అంధునిగా మారిన శిష్యునకు జ్ఞానమనే వెలుగును కల్పించేది గురువు.  ఆ గురువే జ్ఞాణమనే కాటుకతో దృష్టిని ప్రసదించుతాడు దీనివలన గురుశిష్యుల  భంధం ఏర్పడుతుంది.  అంతటి మహాత్యంగల గురువునకు శిష్యునిగా ణా నమస్కారములు సమర్పిస్తున్నాను 
నిజమైన గురువు అంటే ఎవరో వారిని గురించి ఓ చిన్న కధ చెప్పుతారా అని ఒక శిష్యుడు గురువుగారిని అడిగారు

ఆ నలుగురు అనే కధ ను మీకు తెలియపరుస్తాను వినండి అన్నాడు గురువు 

 నలుగురు విద్యార్దులు వేగముగా కొండప్రాంతమునకు పరిగెడుతున్నారు  ఆ కొండ ప్రక్కన లోయ ఉంది,  ఆలోయలో అనేక మంది పడి  చిని పోతునట్లు ఆ ఊరిలొ పుకారు ఉన్నది.  ఆలోయ ప్రక్కనే ఒక వృద్ధుడు ఎప్పుడు పకృతి అందాలని చూచుటకు ఓపికతొ అక్కడకు చేరి కాస్త విశ్రాంతి తీసుకొని తిరిగి వెల్లే  అలవాటు ఉన్నది. 

చనిపోవటానికి వచ్చిన ఆ ఆనలుగురు ఆ వృద్దున్ని చూసి మీకు ఎందుకు కష్ట మొచ్చింది ఈ లోయకొచ్చారు అని అడిగారు వచ్చినవారు. నా సంగతి అలా ఉంచండి, ఇంతకూ  మీరెందుకు వచ్చారో చెప్పలేదే అని అడిగాడు. ఎందుకోస్తాం మరణించ టానికి అని ముక్త కంఠం గా చెప్పారు వారు. 

మంచిది ఒక్కసారి మీ చిరునామాలు, మీ ఫోన్ నెంబర్లు  అన్ని నాకు ఇవ్వండి, మీ తల్లి తండ్రులు భాధ పడకుండా మీ వివరాలు వారికి చెప్పగలను ఎందుకంటే మిమ్మల్ని వారు కళ్ళలలో వత్తులు పెట్టుకొని పెంచుతారు,  జీవితాంతము  మీసేవ కొరకే  వేచి ఉంటారు వయసులో ఉన్నప్పుడు వారి సుఖాలు కుడా మీకు త్యాగం చేస్తారు, వయసుడికిన తర్వాతా  సుఖపడదామంటే వయసు సహకరించక,  పిల్లలు చూడక భాదపడుట తప్ప ఏమిచేయగలరు. 

ఇంతకూ  మీరు ఇంట్లో చెప్పివచ్చార, చెప్పకుండా వచ్చారా అది చేప్పండి ముందు . 

వృద్ధుని మాటలకు వచ్చినవారు వారిలో ఉన్న భాదను మరచి "చనిపోవాటానికి చెప్పి వచ్చిన చెప్పక వచ్చిన చివరికి భాధపడుతారు మమ్ము కన్నవారు, మేము కాదు కదా " అని మూర్ఖం గా వాదించారు వారు. 

ఆమాత్రం జ్ఞానం  ఉన్నవారు మీరు ఇక చావలేరు, నాతో రండి మీభాదలు తొలగించే మార్గం చూపగలను అని వెంట తీసుకొని వెళ్లి, అక్కడ దగ్గర ఉన్న ఒక ఇంటి నుండి కొంత పైకము  తీసుకొని వచ్చి వారికిచ్చి చనిపోయే వారు ఎవరైనాసరే  చనిపోయే ముందు  ఆత్మ ఘోషించ కూడదు సుబ్రముగా మీకు ఇష్టమైన  తిండి తిని రేపు ఇక్కడకు రండి వచ్చేటప్పుడు   మీకు ఇష్టము కానిది పనికి రానిది ఏదైనా ఉంటె ఒకటి తీసుకొని రండి మరచి పోకండి రేపు మీ భాదలు తొలిగే మార్గం చూపు తానూ అన్నాడు ఆ వృద్ధుడు. 

వెంటనే ఆ నలుగురు యే పుట్టలో యేపామున్నదో ఎవరి తెలుసు "ఈ వృద్ధుడు యేఏమి చేపుతాడో చూద్దాం" అంతగా నచ్చకపోతే అప్పుడే చనిపోదాం అని వేణుతిరిగారు ఆ నలుగురు.

ఆ నలుగురికి ఇంటికి వెళ్ళటం జరిగింది కాని నిద్ర పట్టలేదు కారణం వారికి ఉపయోగము లేని వస్తువేదో తెలుసుకొని  వెళ్ళాలని తెల్ల వార్లు ఆలోచించారు.   అందరు కలసుకొని వృద్ధుని ఇంటివద్దకు పోదామని బయలు దేరారు. అందరు ఇంటివద్దకు చేరారు. కాని అక్కడ కోలాహలం గా ఉన్నది చాలామంది విద్యార్ధులున్నారు ఎందుకువచ్చారని అడిగి లోపలకు వెళ్దామని అనుకున్నరు. లోపలకు వెళ్ళలేక అక్కడే నిల బడినారు చేసేది లేక. 

అక్కడ తెలుసుకున్నారు గురుపౌర్ణమి అని విద్యార్ధులు వచ్చి గురువు సన్మానము చేస్తున్నారని తెలుసుకున్నారు.  
అక్కడే మైకులో  వినబడుతున్నాయి " శుక్రాచార్యులు తానూ మరణిస్తానని తెలిసి శిష్యుడైన కచునికి మృత సంజీవనిని ప్రసాదించడం ద్వారా శిష్యునిపై గల వాత్సల్యం వ్యక్తమవుతుంది. అదేవిధముగా  అంగుష్టాన్ని ఇస్తే ఆయుధ దారణ చేయలేనని తెలిసిన గురుదక్షిణగా ద్రోణుడికి ఇస్తాడు.  ఇప్పుడు గురువు శిష్యుల సంభందము లేకుండా విద్యార్ధులు  పెరుగు తున్నారు, గురుశిష్యులు హృదయతాపాన్ని దూరం  చేయగల వారే నిజమైన గురువులు మన సంస్క్రుతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. జననం ఇచ్చినవారు తల్లితండ్రులైనప్పటికి  జీవిత పధాన్ని తీర్చి దిద్దేది గురువులు మాత్రమే. 

ప్రియమైన విద్యార్దులారా ముందు వరుస కూర్చున్న నలుగురు విద్యార్ధు లేచి చివర నుంచొని ఉన్న వారిని సాదరముగ ఆహ్ఫానించి మీ స్థలముల లో కూర్చొ పెట్టగలరు అన్న మాటలు విన్నారు ఆ నలుగురు.
అనలుగురు కూర్చొనగా అప్పుడే వృద్ధుడు ఈవిధముగా చెపుతున్నాడు. 

ప్రేరకస్పూచకశ్చెవ వాచ్కో ధర్మకస్తథా 
శిక్షకో బొధకశ్చెతి షడేతే గురవ:స్త్రుతా:

1ధార్మిక విషయాలపట్ల ప్రేరణ ఇచ్చేవాడు.
2. పండంటి జీవితానికి చక్కని సలహాలుచ్చేవాడు
3. చదివిన్చేవాడు 
4. బ్రహ్మసాక్షాత్కారం కలుగజేసెవాడు.
5. విద్యనూ భోదిన్చేవాడు
6. అమూల్యమైనహితవచనాలు పలికే వాడు అని అరువిదాలుగా ఉంటారు. ఆ అరు లక్షణాలు ఒకే వ్యక్తి (ఆచార్యుడు ) వద్ద ఉండేవి , ఈనాడు అటువంటి గురు విద్య కన బడుటలేదు. సరిఅయిన విద్యనభ్యసించక దేశంలో బ్రతకలేక కొందరు ఆత్మ హత్యలకు చేసుకుంటున్నారు, కొందరు ప్రభుత్వ సహాయములు అందక కుటుంబ పరిస్థితులు బాగుండక మరణిస్తున్నారు. మనుష్య్లులు   ఓర్పు వహిస్తే సాధించలేనిది లేదు అని నేనుగట్టిగా చెప్పగలను. మీ సన్మానానికి నేను సంతోషించు తూ ఈ ఉపన్యాసమును   ఆపుతున్నాను. అందరు విందారగించి ఎవరిదారి వారు వెళ్లి పోయారు. కాని ఆ నలుగురు కూర్చున్న చోటే ఉన్నారు విందుకు కూడా పోలేదు
వారివద్దకు ఆ వృద్ధుడు వచ్చి మీమనస్సు నొప్పించినందుకు నన్ను క్షమించండి ముందు విందు తీసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం పదండి అన్నాడు వృద్ధుడు.అందరు కలసి విందుకు బయలు దేరారు. 
విందైనతర్వత వచ్చిన విద్యార్ధు లందరూ వెళ్ళిపోయారు ఆనలుగురు వృద్ధుడు మాత్రం అక్కడ ఉన్నారు.  
సరే మీరు స్థిమితంగా కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. ఇంతకీ  నేను పనికిరాని వస్తువు  తెమ్మని  చెప్పాను కదా తెస్తే నాకు  చూపించండి,  అందరు ఒకరి మోఖం ఒకరు చూసు కున్నారు గాని ఎవ్వరు మాట్లాడలేదు, ఇంతకీ మీరు తెచ్చార లేదా అని అడిగాడు వృద్ధుడు. తెచ్చాం మీకు ఎట్లా చూపలొ మాకు అర్ధం కావటం లేదు అన్నారు అందరు. చూపించండి నేను ఏమి అనుకోను అని అడగగానే అందరు కలసి "మేమే పనికిరాని వస్తువులము " అన్ని మాకు పనికొచ్చే వస్తువులగా కనిపించాయి మేము తేలేక పోయాము అన్నారు. 

మంచిది మీ నిజాయితీకి నేను మెచ్చుకున్నాను నేను మీకు సహాయము చేద్దామను కున్నాను మీ నలుగురికి నాలుగు కాగితాలు ఇస్తున్నాను ప్రతి కాగితములో 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటి జీతల వివరాలు ఉన్నాయి.  వాటిలో మీరు చదివిన చదువుకు పనికొచ్చె ఉద్యోగము అనుకుంటే రేపు మరల ఇక్కడకు రండి, వీటిని మీకు సంభందిన్చినవారికి చూప్పించు కోండి, ఆఉద్యోగాలు మీకు నచ్చకపోతే మరలా 4 ఉద్యోగాలు మీకు చెప్పగలను, మీకు ఇవ్వగలను ఒక గురువుగా మీకు చెపుతున్నాను. ఇక వెళ్ళిరండి రేపురండి దయచేసి ఇంటికి వెళ్ళాక కాగితాలలో జాబు చూసుకొని అందరిని సంప్రదించి మీకు ఇష్టమైన కాకా పోయినా రండి. 
ఆ నలుగురు మారు మాట్లాడకుండా వెనక్కు వెళ్లారు. 
అప్పుడే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆ కాగితములో ఏమి వ్రాసారో చెపుతారా   ఎందుకు చెప్పను చెపుతా వారురేపు ఇక్కడకు వస్తే అంతా  వారే చెపుతారు

రెండు రోజులు తర్వాత ఆ నలుగురు తో పాటు మరికొందరు వచ్చారు మా కుటుంబాలను బతికించినవారు మీరు,  మీరే మాకు నిజమైన గురువు అని చెప్పారు
మాకు ముందుగా ఇచ్చి పైకముతో మీకు పండ్లు తీసుకొచ్చాము మమ్మల్ని అసీర్వదించండి అన్నారు వారు. ఆవేశంతో చేసే నిర్ణయాలు అనర్ధాలు కలుగుతాయి, ఆలోచనతో చేసే నిర్ణయాలు సఫలమోతాయి

ఇంతకీ వారి ఉద్యోగాలు ఎలావచ్చాయో మాకు ఇంతవరకు 
తెలియుటలేదు అన్నారు శిష్యులు మనోధైర్యానికి మార్గాలు చదవమని వ్రాసాను, వారి ప్రయత్నాలు నేనే గమనించి వారికి ఉద్యోగాలు వచ్చేటట్లు ఏర్పాటు చేసాను అంతే ...... 
  --((**))--

అధిక్షేప ప్రేమ లీల
లోకతీరు
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 
  
1౦9.  గురు శిష్యుల మధ్య ఉండే రాశి
          - గురువు విద్యను శిష్యులకు తెల్పే రాశి 

         భార్య భర్తల మధ్య ఉండే రాశి
         - ధర్మయుక్తముగా పంచుకొనే ప్రేమ రాశి 

         సూర్య చంద్రుల మధ్య ఉండే రాశి
        - వేడిని చల్లదనాన్ని అందించే మార్గ రాశి 

         ఫలపుష్పాలు మధ్య ఉండే రాశి 
       - రుచులతో పరిమలాలునందించే మధుర రాశి 

        వెలుగు నీడల మధ్య ఉండే రాశి 
       - నమ్మకం, అనుమానం మధ్య నలిగే బ్రమరాశి

        సుఖ దు:ఖాల మధ్య ఉండే రాశి
        - ప్రేమ అనురాగం, దు:ఖంతో నలిగే మౌన రాశి 

        కావడి కుండల మధ్య ఉండే రాశి
        - మంచి చెడుల మధ్య మనస్సు నలిగే త్రాసురాశి 

        ప్రేమ పక్షులు మధ్య ఉండే రాశి
        - ఆకలి దప్పులులేక ప్రేమతో నలిగే ప్రణయ రాశి 
  
బ్రతుకు జీవనకు స్నేహ రాశి
మనస్సు మొక్షానికి తత్వరాశి
ప్రపంచానికి దీక్ష, శాంతి రాశి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా      
    --((**))--

   


'సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్ l 
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ ll ' 

ఈశ్వరుని మొదలుకొని , శంకరాచార్యులను మధ్యనిడి , మా గురువు వరకు ఎవరెవరు ఆచార్యులున్నారో వారందరికీ నమస్కారము అని ఈ శ్లోకార్థము.

భారతీయ సాంప్రదాయంలో గురువు పాత్ర 

సాహితీమిత్రులారా! 
భారతీయ సాంప్రదాయం ఆచార్యులకు అగ్ర తాంబూలం ఇచ్చింది. గురువును లేక ఆచార్యుని త్రిమూర్త్యాత్మకంగా చిత్రించడం మన సంప్రదాయంలోనున్న మహోన్నత దృష్టాంతము. 'గు' అనగా అంధకార బంధురము. 'రు' అనగా ప్రకాశ వంతమైన తేజస్సు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞాన ప్రకాశాన్నందించడమే నిజమైన గురువు యొక్క కర్తవ్యము. ఆధ్యాత్మికంగానూ , సామాజికంగానూ గురువు ప్రాధాన్యత ఎనలేనిది. 

విద్యార్థి , గురువు మఱియు గురుకులము భారతీయ సంప్రదాయంలో పెనవేసుకొన్న బంధాలు. ఇవే విద్యాభివృద్ధికి, సంస్కృత వికాసానికి ఆలంబనాలు. గురు శిష్యుల పరస్పర అన్యోన్యత, సౌజన్యత విద్యాభివృద్ధికి దిశానిర్దేశమయ్యాయి. ‘‘ అన్నదానం మహాదానం విద్యాదానమతః పరమ్ l అన్నేన క్షణికా తృప్తిః యావజ్జీవం తు విద్యయా ll “ అంటూ విద్యాదాన ఔన్నత్యాన్ని చాటిచెప్పిన దేశం మనది. అందుకే పంచమహాయజ్ఞాల్లో 'అధ్యాపనం బ్రహ్మవిద్యా' అంటూ పేర్కొన్నారు. విద్య వల్ల తాను మాత్రమే విరాజిల్లితే అతడు ఆచార్య స్థానానికి అనర్హుడు. విద్యార్థి స్థాయికి దిగివచ్చి ఆతనిని తీర్చిదిద్ది తనతో సమానంగా అంటే ఒక దీపం మరో దీపాన్ని ప్రజ్వలించినట్లు చేయడం ఆచార్యుని ప్రథమ కర్తవ్యం. ఆచార్యుడు, దేవుడు ఒకే సారి వస్తే అచార్యునికే అగ్రపీఠం అంటాడు కబీర్ దాసు (गुरु गोविन्द दोऊ खड़े काको लागूं पायं। बलिहारी गुरु आपने जिन गोविन्द दियो बताय). అందుకే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ 'శ్రీ గురు చరిత్ర' ప్రవచనం లో ఓ గమ్మత్తైన మాట అంటారు. దుష్ట సంహారం కోసం పొందిన భగవంతుని అవతారం చాలా తేలిక. గురువుగా అవతరించి కొన్ని తరాలను ఉద్ధరించడం అవతార ప్రక్రియ లో ఒక క్లిష్టమైన విషయమంటారు వారు. అందుకే గురుపరంపర ఆగకూడదంటారు. 

'సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్ l 
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ ll ' 

ఈశ్వరుని మొదలుకొని , శంకరాచార్యులను మధ్యనిడి , మా గురువు వరకు ఎవరెవరు ఆచార్యులున్నారో వారందరికీ నమస్కారము అని ఈ శ్లోకార్థము.ఈ పరంపర సంప్రదాయమే లేకుంటే మన సంస్కృతి ఏమయ్యేది? మన విజ్ఞానం ఎలా పరిఢవిల్లేది? 
నిజమైన ఆచార్యుడు, సమాజ క్షేమాన్ని కోరే ఆచార్యుడు తాను కష్ట పడి సంపాదించిన జ్ఞానాన్ని అర్హత గల వారికి అందజేయడం కోసం హోమాలు సైతం చేస్తాడని తైత్తిరీయ ఉపనిషత్తు దృష్టాంతం చెపుతుంది. 

'ఆ మా యంతు బ్రహ్మచారిణః స్వాహా 
వి మా యంతు బ్రహ్మచారిణః స్వాహా 
ప్ర మా యంతు బ్రహ్మచారిణః స్వాహా 
ద మా యంతు బ్రహ్మచారిణః స్వాహా' 

అంటే మేధా శక్తి గల వారు, ఇంద్రియ నిగ్రహులు, కోపహీనులు (శాంత స్వభావులు ) అయిన అర్హులు విద్యార్థులుగా రావాలి. శిష్యులను వుద్ధరించాలనే ఈ తపన గురువులను అగ్రస్థానం లో కూర్చోపెడుతుంది. 
గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. అందుకే “गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः“ అంటుంది గురుగీత. విద్యకూ జ్ఞానానికీ బీజం నాటడం ద్వారా బ్రహ్మ, మనస్సు వికల్పం గాకుండా బ్రహ్మజ్ఞాన పరిష్వంగన అయి వుండడం కోసం మరియు సదా ప్రబోధన చేయడం ద్వారా విష్ణుత్వం గురువుకు ఆపాదించబడింది. బ్రహ్మజ్ఞానంలో భౌతికజ్ఞానం లయం చేయడమనే స్థితికి శిష్యుణ్ణి తీసుకొని రావడం శివతత్త్వానికి ప్రతీక. 
గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నది అతిశయోక్తి గాదు. కేవలం విషయ సేకరణ జ్ఞానాన్ని అందించటం లేదు. విద్యను ఒక సముద్రంతో పోలిస్తే గురువు మేఘం వంటి వాడు. సముద్రంలోని క్షారగుణాన్ని నిబద్ధించి స్వచ్చమైన జ్ఞానధారను శిష్యులకు ఉపాధిగా ఇస్తుంటాడు గురువు. బుద్ధి జ్ఞానాల ఆంతర్యాన్ని టి.ఎస్.ఇలియట్ అన్న ఆంగ్లకవి ఇలా చిత్రీకరిస్తాడు: 

Where is the Life we have lost in living? 
Where is the wisdom we have lost in knowledge? 
Where is the knowledge we have lost in information? 

Information నుండి knowledge లోతుల్లోకి వెళ్లి wisdom ను అందించడమే గురువు సమాజానికి చేసే మహోపకారము. 
ఇన్ని సత్ క్రియలు చేసే గురువు ఎలాంటి వాడై ఉండాలో కూడా మన సంప్రదాయం చెబుతుంది. శ్రోత్రియం మరియు బ్రహ్మ నిష్ఠ గురువుల కుండ వలసిన సద్గుణాలు. ప్రస్థానత్రయాల ప్రజ్ఞ శ్రోత్రియుల లక్షణం. విద్యార్థికి ఆత్మజ్ఞానప్రబోధం చేయడానికి కావలసిన వస్తుసామగ్రి శబ్ద రూపంలో గ్రహించి తేట తెల్లంగా చెప్పడానికి శ్రోత్రియం ఉపకరిస్తుంది. మరి బ్రహ్మనిష్ఠా? ఇది అత్యంత అవసరమైన గుణం. తాను స్వయంగా ఆత్మజ్ఞానానుభూతిని పొంది ప్రబోధించడం బ్రహ్మనిష్ఠకు పరాకాష్ట. నరేంద్రుడు 'దేవుణ్ణి చూచారా' అని ఎందర్ని అడిగినా ఒక్క రామకృష్ణ పరమహంస మాత్రం దేవుణ్ణి చూశానని, చూపించ గలనని భరోసా ఇవ్వగలిగాడు. ఈ రెండు గుణాలే కాక గురువు శాంతుడు, వినయశీలి, ఆచారశీలి, బుద్ధిమంతుడు అయి వుండాలన్నారు మన పూర్వీకులు. 

‘శాంతో దాన్తః కులీనశ్చ వినీతః శుద్ధ వేషవాన్l 
శుద్ధాచారస్సుప్రతిష్ఠః శుచిర్దక్షః సుబుద్ధిమాన్ ll 
అధ్యాత్మజ్ఞాననిష్ఠశ్చ తంత్ర మంత్ర విశారదః l 
నిగ్రహస్సు గ్రహీశక్తో గురురిత్యభిదీయతే ll ’ 
'బుద్ధి చెప్పు వాడు గ్రుద్దితేనేమయా ' అంటాడు వేమన. శిష్యుణ్ణి సన్మార్గంలో ఉంచడానికి ఒక దెబ్బ కొడితే అది మంచికే గాని చెడుకు గాదన్న సంగతి పెద్దలు గ్రహించాలి. 
సామృతైః పాణిభిర్ఘ్నన్తి గురవో న విషోక్షితై: l 
లాలనాశ్రయణో దోషాః తాడనా శ్రయణో గుణాః ll 

గురువు శిష్యులను తన అమృతహస్తాలతో కొడతాడే కానీ చెడు అక్షంతలతో కాదు. ఈ శ్లోకార్థమే “లాలనే బహవో దోషాః తాడనే బహవో గుణాః l తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేత్ న తు లాలయేత్ ll“ – లాలించడం వలన చాల దోషాలు ఉన్నాయి. కొట్టడం వలన చాల గుణాలు ఉన్నాయి. అందువలన పుత్రుని శిష్యుని కూడ కొట్టి మంచి మార్గంలో పెట్టాలి అని సుభాషితకారులన్నారు. అంతే కాక “లాలయేత్ పంచవర్షాణి దశ వర్షాణి తాడయేత్ l ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ll“ – పుత్రునికి అయిదు సంllలు వచ్చే వరకు లాలించాలి. తర్వాత పది సంllలు కొట్టి మంచి మార్గంలో పెట్టాలి. పుత్రునికి పదహారు సంllలు వచ్చిన తర్వాత మిత్రునివలె చూసుకోవాలి అని సుభాషితకారులన్నారు. ఇట్లా మన భారతీయ సంప్రదాయంలో పుత్రునికి , శిష్యునికి అభేదాన్ని చెప్పారు. పుత్ర, శిష్యులు ఇరువురూ గురువుకు పుత్రులే అని భారతీయ సంస్కృతి తెలియజేస్తున్నది. 

ఇంతగా గురువును గూర్చి చెప్పిన మన సంప్రదాయం ఇప్పటి విద్యా పద్ధతులకు అనుగుణంగా నిలబడుతుందా? అదేమో గురుకుల సంప్రదాయము. ఇప్పటిదేమో తద్భిన్నమైన సంప్రదాయము. అప్పట్లో గురువు నీడలో శిషులు విద్యాభ్యాసం చేసేవారు. గురుకులంలోనే వుండేవారు. నేడు అలా కాదు. గురు శిష్యుల మధ్య అంతరాలు పెరిగాయి. దూర శ్రవణ విద్య, అంతర్జాలం ద్వారా గురువుతో సంబంధాలు, వీడియో మరియు ఆడియో లాంటి సరికొత్త పోకడలు నేటి అంతర్జాతీయ విద్యా రంగలో క్రొత్త మలుపులు. విద్యా వస్తువు సైతం సమూలంగా మారింది. ఆత్మజ్ఞానమంటే ఏమో అవసరం లేదు. డబ్బెలా సంపాదించాలి? అవసరాల్ని సృష్టించి, పెంచి, అప్పులిచ్చి, వస్తువుల్ని ఎలా విక్రయించాలి? ఇలాంటి భావనలు (consumerism tendencies) ప్రబలంగా విద్యారంగం లో చోటు చేసుకొన్నాయి. 

ఇలాంటి జీవన యానంలో గురువు స్థానం ఎక్కడ? ఇది విశ్లేషించుకోవలసిన విషయము. మన సాంప్రదాయాన్ని నేటి పద్ధతులకు అన్వయంచుకొని ఎలా సంరక్షించుకోవాలి? నేటి గురువు ఈ కాలపు అవసరాల రీత్యా నిత్యం తన జ్ఞానాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతో వుంది. అలాగే శిక్షణా శైలి కనుగుణంగా శిక్షణా నైపుణ్యాన్ని(teaching skills) పెంపొందించుకోవాలి. నైతిక ప్రవృత్తి విద్యార్థులలో పెంపొందించడం కోసం తాను ధార్మికగ్రంథాధ్యయనం చేయాలి. విద్యాభ్యాసనా సమయంలో లోపించిన నైతిక ప్రమాణాలే నేటి సామాజిక రుగ్మతలకు కారణమన్న సత్యాన్ని గురువు దృఢంగా విశ్వసించాల్సిన సమయమిది. ‘Analytical knowledge, emotional knowledge and spiritual knowledge are the integral part of the overall education’ అన్న సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా శిష్యుణ్ణి తీర్చిదిద్ద గలిగే వాడే నేటి గురు స్థానానికి అర్హుడు. 'గూగుల్' కావలి హద్దుల్లోకి వెళ్లి విషయాలను విశ్లేషించి సారాన్ని సారవంతంగా శిష్యునికందించాల్సిన అగత్యం గురువుపైనుంది అనడంలో సందేహం లేదు. అతి కష్టమైన విషయాన్ని సూక్ష్మంగా అన్వయించి అఖండంలో అణువునూ, అణువులో అఖండాన్ని సాక్షీభూతం చేస్తూ సాగరాన్ని సైతం ఘటంలో ఇమిడ్చి ఇవ్వగల నేర్పరి నేటి నిజమైన గురువు. అతనే ఆచార్య స్థానానికి అర్హుడు. సదా సత్కారార్హుడు. 
-------------------------------------------------------- 
రచన- డా. కరణం నాగరాజ రావు, మధురవాణి సౌజన్యంతో 
----------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

శ్రీ గురుభ్యోన్నమః -మాతా పిత్రుదేవతా సహిత
శ్రీవ్యాసాయ నమః
శ్రీసద్గురవేనమః
శ్రీసకలగురుదేవతాభ్యన్నమః..
------తొలిగురువులు మాతాపితరులు,జగద్గురువులు వ్యాస శంకరాచార్య,దత్తాత్రేయ,మరియు బాల్యమునుండి ముగింపువరకు విద్యాబుద్దులు నేర్పి ప్రయోజకులజేసిన సకల గురువులకు నమస్సుమాంజలులు...... 
సకల హిత,సన్నిహిత ,మిత్ర, సోదర,సోదరీ సమాన‌ వనమిత్రమండలికి **గురు‌పౌర్ణమి శుభాకాంక్షలు**
పున్నగా వన మిత్రులకు బృగువాసర శుభాకాంక్షలు

ఓం శ్రీ గురుభ్యోనమః

గురుపౌర్ణమి కేవలం వేదవ్యాసుల వారికి మాత్రమే సంబంధించినది. మొత్తము వేదమంతయు ఏక రాశి గా ఉండేది. ఆ వేదాన్ని నాలుగు భాగములుగా సులభంగా గుర్తించి విభజించారు కావున ఆయన వేదవ్యాసులైనారు. అంతియే గాక వారు 18 పురాణాలను, మరి 18 ఉప పురాణాలను, సంపూర్ణ విజ్ఞానముతో నిండిన మహాభారతమును, బ్రహ్మ సూత్రాలను రచించారు. 
కలియుగంలో మానవాళికి కర్మ, భక్తీ, జ్ఞాన మార్గములు ఉపదేశించినవారు. ప్రాప్రంచిక, ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయం చేసుకోవుటలోనే మానవ జీవిత వికాసం ఉన్నదని భోదించారు. 
నేడు ఆయన జన్మదినం..ఆయన జన్మదినం "వ్యాస పౌర్ణమి " గా జరుపుకొనుట అనాదిగా సనాతన ధర్మంలో వస్తున్నది.

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః ||

త్వమేవ మాతా చ పితా త్వమేవ 
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవ దేవ ||
--((**))--
🌹 🙏శ్రీ గురుభ్యో నమః 🙏🌹

1.దేహ మిచ్చిన తల్లి దండ్రులు 
దైవ సములని వేద మన్నది !
చేయి పట్టుకు దారి చూపుచు
తెలివి నేర్పగ గురువు లున్నది !!

2. వేద వ్యాసుల శౌన కాదుల 
వాల్మీక ముని నైమిశము గని
మనము వనమున పరవశించుచు 
శిరము వంచెద ! పరిణతించెద !!

3. మంగళాశాసన వచస్సంపద
ఆశిషము లిడి మనల నడుపగ
బలము నొసగుచు యశము పొసగుచు
గుబాళించే గుణము గురులది !!

4. వారి దీవెన వాన చినుకుల
తడిసి ముద్దగు తనువు మనదై
తరతరాలకు పరిసరాలకు
వెలుగు నింపెడి దివ్వెలవుదాం!!

5. నార దాదుల హనుమ పాదుల
ఆది శంకర సాయి నాధుల 
దత్త దేవ శ్రీకృష్ణ గురువుల
యోగ శిల్ఫీ కల్ప తరువుల
చిత్త వృత్తిగ సంస్మరింతును !!
వర వచ స్స్వర ఝరీ సరముల 
సమర్పించుచు సమర్చింతును !!

🌹" నోమో నమః శ్రీ గురు పాదు కాభ్యామ్ "🌹
--((**))--
🙏🙏 గురుపౌర్ణమి శుభాకాంక్షలు

గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరా

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ

ఈ గురుపౌర్ణమి రోజున నా పూజ్య గురువులు
పాదాలకు నా తల ఆన్చిన రోజు నేను పొందిన అనుభూతి మాటలలో చెప్పలేనిది .. సాక్షాత్తు ఆ లోకేశ్వరుడే నన్ను అనుగ్రహించ వచ్చాడనే అనుభూతి 
ఇప్పటికీ ఆ పాద స్పర్శ నా నుంచి వీడిపోలేదు నన్నంటే (మనసును) ఉంది .. ఆత్మానుభూతి ..

నా గురు దేవుల ఆశీస్సులు నాకు ఈ లోకానికి
ఎప్పటికీ ఉంటాయని ఆశిస్తూ ..

గురు దేవుల పాద పద్మములు ఈరోజు దూరంగా ఉన్నాయి అనే చింతన లేకుండా ఇలా చిత్తరువు ఉంచి మనందరికీ దగ్గరగా ఉన్నారు .. ఆ పుణ్య పాదాలను కంటితో చూసి మనసుతో ( భావనాయుక్తంగా ) తాకి పునీతులవుదాం ..

గురు దేవుల పాద పద్మములకు తల ఆన్చి .. వినమ్ర ప్రణామములు .. శత కోటి పాదాభివందనాలు
--((**))--
సేకరణ

ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారుని కి ఖాళీ గా ఉన్నాడా లేడా అని కనుక్కుని తన వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. మీ మన కోసం....

తల్లి...నాయనా .పూజా పునస్కారాలు ఐనాయా?
కుమారుడు...ఇలా చెప్పారు.
అమ్మా!నేను ఒక జీవ శాస్త్రవేత్తని.అది కూడా అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు.అలాంటి నేను పూజ లు అవి ఏం బాగోదు.
తల్లి మందహాసం తో కన్నా!నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా.కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా.....అన్నది.
కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు.
అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. ..

నీకు దశావతరాలు అది మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....
కొడుకు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంభంధం అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ తల్లి...హా సంభంధం ఉంది. ఇంకా నువు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.
మొదటి అవతారం మత్స్య అవతారం.అది నీటిలో ఉంటుంది.అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది.ఇది నిజమా కాదా.
కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.
తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు.దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించిన ట్టుగా గమనించాలి.అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.
మూడవది వరాహ అవతారం అంటే పంది.ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్ల ని గుర్తు కు తెస్తుంది.
ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు.దీన్ని బట్టి మనకు జీవ పరినామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమై న జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.
ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు.నీకు తెలుసుకదా మానవులు మొదట హోమో erectes మరియు హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులు గా వికాసం చెందారు.
కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.
తల్లి కన్నా ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలి ని పట్టుకు తిరిగేవాడు.దీని వల్ల ఎం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.
ఇక ఏడో అవతారం రామావతరం.మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు .సమస్త కుటుంబ బంధుత్వనికి అది పురుషుడు.
ఇక ఎనిమిదవ ది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు పాలకుడు ప్రేమించే స్వభావి.అతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజము లో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు.
కొడుకు ఆశ్చర్యం విస్మయం తో వింటున్నాడు.
ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ
తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం.ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమం లో మర్చిపోయిన తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు.ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణ లకు మూలం.
ఇక వచ్చేది కల్కిపురుషుడు.అతను నీవు ఏ మానవునికై వేతుకోతున్నావో అతనే ఇతను. అతను ఇప్పటివరకు వరసత్వానిగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తి.గా వెలుగొందుతాడు.
కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తున్నాడు
అపుడా ఆ కొడుకు ఆనంద భాష్పలతో అమ్మ...హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన నిజమైన ధర్మం. అని అన్నాడు
..
. ఆత్మీయులారా !!
మన వేదాలు ,గ్రంథాలు,పురాణాలు,ఉపనిషత్తులు,
ఇత్యాది అన్ని ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మారాలి.మీరు ఎలాగ అనుకొంటే అలా వైజ్ఞనికమైనవి కావచ్చు.లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్ట్రీయత తో కూడిన ధర్మాన్ని నేడు మూఢచారాలు పేరిట మన సంస్కృతి ని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం.ఇకనైనా మేలుకోండి రుషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.
#మనంమారుదాంయుగంమారుతుంది...
--((**))--
------------మిత్రులందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు------------------ 
"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరంబ్రహ్మ"
తస్మైశ్రీ గురవే నమః

ఒజ్జ, గురువు - ఉపాధ్యాయుడు - ఆచార్యుడు
-------------------------------------------

1. గురువు

గురుర్బన్ధురబన్ధూనాం గురుశ్చక్షు రచక్షుషామ్ I
గురుః పితాచ మాతాచ సర్వేషా న్యాయాయవర్తినామ్ II

బంధువులెవరూ లేనివారికి గురువే బంధువు.కళ్ళు లేని వారికి గురువే కంటి చూపు.గురువే తల్లి, గురువే తండ్రి. యదార్థజ్ఞాన ప్రదర్శకుడు.న్యాయమార్గంలో ప్రవర్తింపచేయువాడు గురువు.

2. ఉపాధ్యాయుడు

ఏకదేశం తు వేదస్య వేదాఙ్గాన్యపి వా పునః I
యో2ధ్యాపయతి వృత్యర్థమ్ ఉపాధ్యాయస్య ఉచ్యతే II

వృత్యర్థం వేదాన్నీ వేదాంగాలనీ ఎవరైతే అధ్యాపనం (బోధన) చేస్తారో వారు ఉపాధ్యాయులు.

3. ఆచార్యుడు

ఆచినోతి హి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి I
స్వయమాచరతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే II
కేవలం శాస్తార్థాలను బోధించడమే కాక, తాను వాటిని ఆచరిస్తూ, సమాజ హితం కోసం ఆదర్శంగా ఆచరింప చేసేవాడు ఆచార్యుడు. రామాయణ శర్మ ,భద్రాచలం

విశేషం

* విద్య పొందాలంటే,మనకి దాన్ని అందించగలిగే వానికి,
అ)విషయ పరిజ్ఞానం కలిగియుండాలి.
ఆ)దాన్ని బోధించే సంకల్పం ఉండాలి.
ఇ)అర్ఠమయ్యేలాగు చెప్పగలగాలి.
* బాహ్య సౌందర్యం( ఉదా॥ అష్టావక్రుడు) ఎలా ఉన్నా, అంతస్సౌందర్యం ముఖ్యం.
--((**))--


సాహితీమిత్రులారా! 
ఈ పొడుపు పద్యం 
విచ్చండి- 

దశబలుండెవ్వండు దశహయుఁడెవ్వండు? 
వేఱర్థములనేవి వేంకటేశ? 
దశహస్తుఁడెవ్వండు దశముఖుఁడెవ్వండు? 
వేఱర్థములనేవి వేంకటేశ? 
శాంతుఁడెవ్వండౌను దాంతుఁడెవ్వండౌను? 
వేఱర్థములనేవి వేంకటేశ? 
పంచమంగళమేది పంచభద్రమ్మేది? 
వేఱర్థములనేవి వేంకటేశ? 
శంఖసక్రధరా గుహాశయమదేది? 
శరధిశయనా యికగృహాశయయదేది? 
మెప్పుగా నుత్తరమ్ములు చెప్పవలయు 
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ! 

సమాధానాలు- 
1. దశబలుడు - బుద్ధుడు 
2. దశహయుడు - చంద్రుడు 
3. దశహస్తుడు - శివుడు 
4. దశముఖుడు - రావణుడు 
5. శాంతుడు - అంతరింద్రియ నిగ్రహముగలవాడు 
6. దాంతుడు - బహిరింద్రియ నిగ్రహముగలవాడు 
7. పంచభద్రము - 5 మంచి లక్షణాలుగల గుఱ్ఱము 
8. పంచమంగళము - 5 మంచి లక్షణాలుగల యేనుగు 
9. గుహాశయము - సింహము(గుహలో నిద్రించేది) 
10. గృహాశయ - తమలపాకుతీగ(ఇంటిలోవలె నీడనాశించేది) 
-------------------------------------------------------- 

- ఏ.వి.రమణరాజు

--------------శుభోదయం---------సుభాషితాలు-----------------
తస్కరేభ్యో నియుక్తేభ్యో శత్రుభ్యో నృపవల్లభాత్ 
నృపతి ర్నిజలోభాచ్చ ప్రజాం రక్షేత్ పితేవ హి 
దొంగలనుంచి, తన ఉద్యోగులనుంచి, శత్రువులనుంచి, రాజబంధువులనుంచి, తన లోభమునుంచి ప్రజలను రాజు తండ్రివలె కాపాడవలయును.

క్షమా శత్రౌ చ మిత్రౌ చ యతీనా మేవ భూషణం 
అపరాధిషు సత్వేషు నృపాణాంనైవ దూషణం 
శత్రుమిత్రాదులయందు అవిపక్షితముగా క్షమాభావము కలిగి యుండుట యతివర్యులకే 
ఆలంకారము గానీ రాజులకు గాదు. దుష్టులను శిక్షించుట, శిష్టులను రక్షించుట రాజులకు శోభనిచ్చును.వివక్షలేని క్షమ రాజులలో దోషమే గానీ గుణము కాదు.రాజైనవాడు దుష్టులను దండించవలయునని భావము.

క్షమీ దాతా గుణగ్రాహీ స్వామీ పుణ్యేన లభ్యతే 
అనుకూలః శుచిర్దక్షా: కవిర్విద్వాన్ సుదుర్లభః 
దాత, గుణగ్రహపారీణుడు, క్షమాశీలి యైన పాలకుడు సుకృత విశేషమువల్ల లభించవచ్చును, గానీ శుచివంతుడు, సమర్థుడు, అనుకూలుడు, పండితుడు,యైన 
సుకవి బహుదుర్లభుడు. ఏ జాతిలోనైనా అట్టివారు జన్మించిన యది ఆజాతికే గౌరవప్రదము.
-------------------------------------------------
యస్మిన్ జీవతి జీవంతి బహవ స్సతు జీవతు
కాకోపి కిం న కురుతే చంచ్వా స్వోదర పూరణం

ఎవడు జీవించి వున్నచో పదిమందికి జీవిక కలుగుతూ వుంటుందో అట్టి వాని బ్రతుకే బ్రతుకు.కానీ కేవలం తన పొట్ట మాత్రమే నింపుకోను వానిది బ్రతుకు కాదు. కాకి \
మాత్రం ఆ పని చేయడం లేదూ? కేవలం తనకోసమే కాకుండా యితరులకోసం బ్రతికే వాడే ఉత్తముడు అని కవి యొక్క భావం
------------------------------------
సహమాతా పిత్రో ర్నిత్యం ప్రియం కుర్యాత్ 
ఆచార్యస్య చ సర్వదా 
తేషు హి త్రిషు తృప్తేషు 
తపస్సర్వ సమాప్యతే 
అర్థము:-- తల్లి తండ్రులతో, గురువులతో ఎప్పుడూ ప్రియముగా మాట్లాడ వలయును. వారు చెప్పినట్టు నడుచుకొని వారికి సంతోషము కలుగ జేయ వలయును. ఈ ముగ్గురు తృప్తి చెందినచో సర్వ తపములు ఫలించి నట్లే.
--((**))--
రెండువేల సంవత్సరముల నాటి ఛందస్సు -

మాత్రాబద్ధము, కాని నా సృజన కాదు, రెండు వేల సంవత్సరముల నాటిది!

పంజరమునఁ - బక్షినైతినే విధి 
రంజన కొక - రాగమైతినే 
సంజెలలో - సాఁగ హాయిగా నును 
కెంజాయలఁ - గేళి యెప్పుడో

మానసమున - మందహాసముల్ విన 
గానములోఁ - గాకలీధ్వనుల్ 
వీణియతోఁ - బ్రేమ రాగముల్ విన 
మానిని నే - మాడుచుంటిఁగా

వర్షములోఁ - బర్వు లెప్పుడో నవ 
హర్షముతో - నాట లెప్పుడో
ఘర్షణమునఁ - గాలమయ్యెనే యను 
కర్షమె నా - కయ్యెఁ బ్రాప్తిగా

శుభ ఘడియలఁ - జూడజాలనో నా 
నభమందున - నల్ల మేఘమో 
విభవమ్ములఁ - బ్రేమ మాయయో నా 
విభుఁ డెప్పుడు - వీడుఁ జేరునో

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
--((**))--
గజల్ 2366.

ఒక వీడని ప్రేమరాశి..అల్లుకుంది గజల్ తనై..! 
ఒక అమృత మధురరాశి..పట్టుకుంది గజల్ తనై..!

అరకన్నుల తోటలోని..వింతలెలా వర్ణించను.. 
ఒక వెన్నెల పూలరాశి..పరచుకుంది గజల్ తనై..!

పసిడివెలుగు తేనెజల్లు..ఒదిగే'నా మాటలలో..
నిత్యనూత్న స్నేహరాశి..విచ్చుకుంది గజల్ తనై..!

సంపెంగల వానలోన..ముంచెత్తే హంస కదా..
శ్రీ చందన ప్రణయరాశి..కలుసుకుంది గజల్ తనై..!

కబురులాడు చేమంతుల..కనులలోని మెఱుపేదో..
గుండెలయల మౌనరాశి..చుట్టుకుంది గజల్ తనై..!

ప్రశ్నించే గుణమేమో..ఆశ్చర్యపు గగనమంటె.. 

మరి మాధవ తత్వరాశి..పాడుకుంది గజల్ తనై..!
--((**))--

No comments:

Post a Comment