Wednesday 18 July 2018

Pranjali prabha (19-07-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- : శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
"ఫై.సి.నారి" కి ఇంట్లొ పని చేస్తుంటే...కరెంట్ షాక్ కొట్టింది!! 
భార్య గాభరా పడుతూ ... 
"అయ్యో! అయ్యో!!..మీకు ఏమీ కాలేదు కదా?!" అంటూ పరుగు పరుగున వచ్చింది!! 
"నా సంగతి దేవుడెరుగు.... 
ముందు ఎన్ని యూనిట్లు కాలేయో చూడవె ... 
వెర్రి మొహమా!!" అన్నాడు "పి.సి.నారి"
గజల్ 2348. 

పరుగులెటో తెలియని ఈ..లోకానికి ఆదర్శం..! 
పేదరికం పారద్రోలు..తన పరుగే..'హిమ'గీతం..! 

దివ్యదీక్ష చేపట్టిన..కంటిచుక్క తానైనది 
ఆశలన్ని ఒడిసిపట్టి..ఎగరేసెను జయపతాకం..! 

చిత్తశుద్ధి నిధికాగా..కర్మవీర నారికదా.. 
నవచరితను సృష్టించిన..ఘనభారత ప్రియరత్నం..! 

మేలుకొలుపు రాగాలకు..స్వరాలవరాల అడుగులు.. 
మెఱుపుమల్లె తీవమల్లె..ఏల తెచ్చెనో పతకం..! 

ఏమి చదివెనో ఏమో..మనోవేగ మధిగమించె.. 
దేశాలే అవాక్కైన..సమయానికి ప్రతిబింబం..! 

మాధవుడా అక్షరాల..నీ గజలే తనకు గొడుగు.. 
కసికన్నా గురువెవ్వరు..సంకల్పమె అసలు బలం..!
--((**))--

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర - భాష్యం-5
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ

మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా

నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా .... 3

మనోరూపేక్షు కోదండా : శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి.

మనస్సు అనేది పరుగెత్తే గుఱ్ఱము లాంటిది, గుర్రానికి కళ్లెం వేసి ఆపినట్లుగా, మనసుకు బంధం అనే, భక్తి అనే కళ్లెం వేసి ఆపాలి. చెరకు గడ పిప్పి ఎక్కువా, రసం తక్కువా కానీ రుచి తెలుసు కోలేనివారు జీవితమే గడపలేరు, అట్లాగే మన మనస్సులో అనేక సమస్యలు చెరుకు గడ చెత్త లాంటివి, చెత్తను ఇంకా పిండితే రసం వస్తుందని ఆసిస్తాం. అట్లాగే మన మనస్సులో తెగని సమస్యలు వెంబడిస్తూ కల్లోపరుస్తాయి. అవి మనస్సును ఆఆకర్షించే బాణాలు, అవి మనస్సును కలవరపరిచే నేత్రాలు. వాటిని తొలగించి మనస్సు శాంత పర్చమని ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాము తల్లి.

పంచతన్మాత్రసాయకా : శ్రీదేవి కుడిభాగము బాహువు యందు పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.

చిన్న శబ్దానికి కలవరపడే మనసు మాది, దానికి తోడు స్పర్శ సుఖం కోసం వెంపర్లాడే గుణం మాది, రూపాన్ని చూసి ఆకర్షించే లక్షణం మాది, వాసనకె మనసు మెచ్చుకొని బుద్దిని మార్చుకొనే స్నేహం మాది, జిహ్వచాపల్యానికి తట్టుకొని జీవించటమే కష్టాముగా ఉన్నది మాకు. అమ్మ మీ పంచ బాణాలను మాపై ప్రయోగించమ్మా మాలోఉన్న దుర్గుణాలను తిలగించమ్మా అందుకో మేము నిత్యం మిమ్ము వేడుకుంటున్నాము తల్లి .

--((**))--

నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవద్దు 
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు 

చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) 
సంగీతం: టి.వి. రాజు 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవద్దు 
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు 

సత్యం కోసం సతినే అమ్మినదెవరు... హరిచంద్రుడు 
తండ్రి మాటకై కానలకేగినదెవరు... శ్రీరామచంద్రుడు 
అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా... లక్ష్మన్న 
పతియే దైవమని తరించింపోయినదెవరమ్మ... సీతమ్మ 
ఆ పుణ్యమూర్తులు చూపినమార్గం.. అనుసరించుటే ధర్మం 
అనుసరించుటే.. నీ ధర్మం 
నీ ధర్మం.. మరవద్దు 
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు 

చరణం 1: 

చాపకూడుతో సమతను నేర్పెను.. నాటి పలనాటి బ్రహ్మన్న 
మేడిపండులా మెరిసే సంఘం.. గుట్టువిప్పెను వేమన్న 

వితంతుల విధివ్రాతలు మార్చి బ్రతుకులు పండించే.. కందుకూరి 
తెలుగు భారతిని ప్రజలభాషలో తీరిచిదిద్దెను.. గురజాడ 
ఆ సంస్కర్తల ఆశయరంగం.. నీవు నిలిచిన సంఘం 
నీవు నిలిచిన.. ఈ సంఘం 

నీ సంఘం.. మరవద్దు.. 
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు 

చరణం 2: 

స్వతంత్రభారత రథసారథియై.. సమరాన దూకే నేతాజి 
సత్యాగ్రహమే సాధనమ్ముగా.. స్వరాజ్యమే తెచ్చె బాపూజి 
గుండుకెదురుగా గుండె నిలిపెను.. ఆంధ్రకేసరి టంగుటూరి 
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను.. అమరజీవి 

ఆ దేశభక్తులు వెలసిన దేశం.. నీవు పుట్టిన భారతదేశం 
నీవు పుట్టిన.. ఈ దేశం 

నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవద్దు 
జాతిని నడిపి.. నీతిని నిలిపిన.. మహనీయులనే మరవద్దు 
మహనీయులనే.. మరవద్దు 

https://www.youtube.com/watch?v=VAC_2b1ZK2M
Kodalu Diddina Kapuram | Nee Dharmam song
Watch the melodious song, "Nee Dharmam" sung by P Susheela from the film Kodalu Diddina Kapuram. Cas...

--((**))--
గార్ధభంబున కేల కస్తూరితిలకంబు? మర్కటంబునకేల మలయజంబు? 
శార్ధూలమునకేల శర్కరాపూరంబు? సూకరంబుల కేల చూతఫలము? 
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? 
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు 

ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు 
మధురమైనట్టి నీనామమంత్రమేల? 
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస 
దుష్టసంహార నరసింహ దురితదూర 

నరసింహ శతకము - శేషప్పకవి
--((**))--
టీచర్ :ఒరేయ్ మాలోకం, స్కూటర్ ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పు?? 
మాలోకం: ....బుర్ర్ ర్ర్ ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్... 
టీచర్: ఆపు రా రాస్కెల్!! 
మాలోకం: బుర్ర్ర్ర్ర్ర్ర్ర్...ర్ర్ర్ర్.ర్ర్..బ్లుప్ ...బ్లుప్ బ్లుప్..ప్ ప్ ప్!!
--((**))--
"కొత్తెం" గాడు రాత్రి తెల్లవార్లూ... 
ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తూనే వున్నాడు... 
కళ్లు మండటం మొదలయాయి ... 
అయిన అతి కష్టం మీద చాటింగ్ కంటిన్యూ చెస్తూనె వున్నాడు!! 
ఆఖరికి... 
"వుంటాను బాబు...తెల్లారి పోయింది మడిబట్ట కట్టుకుని వంట చెయ్యాలి!!" అని అనగానే 
"అంటే మీరు....మీరు ..." హాస్చర్య పోయాడు "కొత్తెం" గాడు !! 
"నువ్వు ఇదాకటినుండి...."మాలా"...మాలా" అని అన్నావు చూడూ...వాళ్ల బామ్మని ....ఏదో వెధవది నిద్ర పట్టి ఛావడమ్ లేదు....కాలక్షేపం గా వుందని చాటింగ్ చేశా!!..మనవరాలు నిద్దరోతోంది !!" అంది బామ్మ గారు
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
"నిద్ర" వెనుక పడకండి ...టైమ్ వేస్టు!! 
"చదువు" వెనుక పరుగెత్తండి..... 
నిద్ర మీ వెనుకే పరుగెడుతూ వస్తుంది!!
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
గాయని "గాత్రావళి"..ని ఒక ఫంక్షన్ కి పిలిచారు , పాటలు పాడటానికి!! 
కానీ అమ్మడు ....ఎన్ని సార్లు అనౌన్స్ చేసినా పాడటానికి లేవలేదు!! 
"ఏమైందమ్మా....మీరు పాట మొదలు పెట్టక పొతే ... 
జనం నా ప్రాణం తీస్తారు.... 
త్వరగా పాట మొదలు పెట్టండి !!" అన్నాడు ఆర్గనైజరు! 
"మూడ్ ఆఫ్ అయిందండీ ... 
నా కొత్త చెప్పుల జత కనిపించడం లేదు... 
ఎవరో కొట్టేసారు!!" అంది "గాత్రావళి" 
"చెప్పులదేముండీ!!... 
మీరు పాడటం మొదలు పెడితె ... 
లెక్ఖ లేనన్ని విసురుతారు ఆడిఅన్స్ .... 
లేవండి ....లేవండి ...పాట మొదలు పెట్టండి" అన్నాడు "ఆర్గనైజరు"!!
--((**))__
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
"కంచి కి వెళ్ళని కధ ....." 
ఒక "పెద్ద మనిషి" కి ... 
3 స్నేహితులు వున్నారు!! 
3 రూ డాక్టర్ లే!! 
అందులో 2 రు పిచ్చివాళ్ళు.. 
1 కి ఏమీ అర్ధం కాదు!!! 
--((**))--
1. నీవు బట్టిన విల్లు నేటైన బల్ గట్టు, పసమీఱు మీనారి బుసలగొట్టు, 
నీజటజూటంబు నిల్వ గంగకుఁబట్టు, నఱమేను పార్వతికైన దెట్టు 
నీరథచక్రముల్ నిలువకరుగు రట్టు, నీముఖంబున కగ్ని నీటిబొట్టు 
నీగళచ్ఛయకు నీకును చలినట్తు, విను నీనివాసంబు వెండిచట్టు 

మట్టుమీరిన నీచర్యలెట్టుకట్టు, పఱచి వాక్రువ్వఁగను బల్లపడుటదెట్టు 
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ, రాజితశుభాంగ రేపాలరాజలింగ 

2. చలిమలసుత మీకు వలసినపెన్ రాణి, ముసలియెద్దే మీకు మిసిమి ఘోణి 
ఆకాశమే మీకు హాశ్చర్యమగు వేణి, చాలదు మీ కథల్ జదువ వాణి 
అంబరంబయ్యె మీ కఖిలదిశాశ్రేణి, పరమేశ మీకయ్యె శరధితూణి, 
భక్తసంరక్షణాస్పదమగు మీపాణి, తలంప మీపిన్నాలు బలుపఠని, 

లీలగణియింప వేదములేని రాణి, మీకరమున నున్నదే మేలియైణి 
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ, రాజితశుభాంగ రేపాలరాజలింగ 

రేపాల రాజలింగ శతకము - కొమఱ్ఱాజు వేంకటశివకవి

--((**))--
"అయ్యా...నాకు పెళ్లి కావడం లేదు!!" అన్నాడు జ్యోతిష్కుడి వద్ద,మన ''పూల రంగడు" 
"ఎలా అవుతుంది నాయనా??!!.... 
నీ జాతకం లో , 
అంతా సుఖమే రాసి పెట్టి వుంది,మరి!!" అన్నారు "జ్యోతి -ఇష్క్"
--((**))--. 
 సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
నీ జ్ఞాపకాల తో ... 
నా మనస్సు... 
గవర్మెంటు ఆఫీస్ లాగా అయిపోయిది !! 
ఎవరి మాటా వినదు... 
ఏ పనీ చెయ్యదు!!
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
కిర్కెట్ మ్యాచ్ ని చూసి ఆనందించు!! 
"మ్యాచ్ ఫిక్సింగ్" సంగతి మన కెన్దుకూ?? 
..... 
నీ పెళ్లి కూడా.... 
"మ్యాచ్ ఫిక్సింగ్" జరిగితేనే కదా అయ్యింది!!
--((**))--
సోమకాసురునితోఁ జొచ్చి పాధోరాశి, మత్యమై సుఖలీల మరగినావొ 
కూర్మరూపముచేతఁ గుంభిని జొరఁబాఱి, వ్రేగుచే బయలికి వెళ్ళలేదొ 
వరాహావతారమై వసుధవర్తించిన, సిగ్గుచే మూలలఁ జేరినావొ 
బాలుని పల్కు వెంబడి వేగరా నుక్కు, కంబములో దాఁగఁ గడగినావొ 

కాక నిజరూపముననున్న ఖలులుజేయు 
చేతలకు నూరకుందువే చేయమఱచి 
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస 
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక 

భద్రగిరి శతకము - భల్లా పేరయకవి
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
ఒక పెళ్లి లో ... 
ఒక పెద్దాయన కనిపిస్తే... 
"మిమ్మల్ని చివరి సారిగా.... 
చాలా సార్లు కలిసాను!!.....గుర్తున్నానా??" అని అడిగాను. 
ఆయన , నా కేసి అదోలా చూసారు!! 
ఎందుకో??
--((**))-- 
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
అభిమానం, సిగ్గులేనితనం.... 
ఎక్కడైతే హద్దులు దాటుతుందో.... 
అక్కడి నుంచి ఇంకో 4 అడుగులు వేస్తె... 
అక్కడె....సరిగ్గా అక్కడె ... 
"కాన్-గ్రేస్ " ఆఫీసు వుంటుంది!!
--(**))--
"ప్రభోదయం"....ప్ర-వచనం!! 
అళ్లుళ్లకి ...కోడళ్ళకి ప్రత్యేకం 
"అత్తగారి ప్రేమ 1000 రూపాయల నోటు లాంటిది... 
"కొంపదీసి నకిలీ నోటు కాదు కదా!??" 
అనే అనుమానం వెంటాడుతూనె వుంటుంది!!!
--((**))--

నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము 
శ్లో === అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనమ్ 
అస్థిరం దారపుత్రాది ధర్మః కీర్తి ర్ధ్వయం స్థిరమ్ 
భావము === జీవితము, లోకము, యౌవనము, ధనము, భార్యాబిడ్డలు, ఇవన్నియు శాశ్వతములు కావు. ఒక్క ధర్మము , కీర్తి మాత్రమె స్థిర మైనవి.
--((**))--

No comments:

Post a Comment