Wednesday 18 May 2022

111

 



 



నేటి లలిత గీతం


చెప్పు తున్నా చెప్ప లేకా ..కట్టు కోక విప్ప లేక

ఒప్పు కున్నా  తప్పు కోకా..బెట్టు కాటా ఆశ టీకా

అందము బాహ్య మైన... అందు బాటు లేదులే

డెందము జల్లు మనియు.. సర్దు కొందు మందువా


విందుగ సంత యైన...గోల యేల నీకులే

పొందుకు రమ్య మనియు.. పిలుపు ఎలా చూడవే..చె..

నందరు ఉండు టేను...భయము ఏల నీకులే

కొందరు చేత లనియు.. కోప మోద్దు నీకులే


నిద్దుర పొందు టేను... అంత తొంద రెందుకే

హద్దు మాట లనియు... వద్దు లేవొ పొందుకే...చె

చిందు వేసే ఎందుకో... చింత తీర్చె నందుకా

అందు బాటు ఒప్పుకో... వింత గోల దేనికే


ఆది నుంచి కోరికే... యీల వేసి పిల్వకే

పొద్దు పోయి వుంది లే.. పెద్ద చేసి ఒప్పుకో...చె

0


నేటి సమస్యలు పూరణ తోరణం


రవయె రమ్యత చూపులే రమణి కారుణ్యమ్ము ఆనందమే

భవుడే భవ్యుడె భవ్యడే భవుడె తాపమ్మేను భవ్యండొకో

నెవడే యెవ్వడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో

శివుడు నవ్వడె నవ్వడే భవుడు ఆశించాడు దివ్యండొకో


ఆశ తీరదు అలుపు ఆరాట పోరాటమే

పాశ మల్లెలు మనసు లాగు ట ఆరాటమే

 రాశి వున్నను చిక్కె పులి యైన ఓర్పు శల్యమౌనె

కాసినంతయు పొందు ఆశలు మనిషిలో నా మార్పు


బుద్ధిబలం లేనోడికి ఎంత బలమున్నా వ్యర్థమే

మంద బుధ్ధి ఏమాటలు అన్న సహజమ్మే స్వార్ధమ్మె

చేతకాని వాడేనులె గొప్ప మనసున్నా వ్యర్ధమే

పొందు లోన చిక్కాకను ఎంత తెలివి యున్నా వ్యర్ధమే


ప్రతిభతొ వేష భాష మెరుపే ..సమరానికి తోడ్పడు విజయం

ప్రగతికి మెట్లు ఎక్కి మెరుపే ..బయ మంతయు ఆత్రుత విజయం

ప్రధమము అంటు మారె మెరుపే ... మదినంతయు మత్తుగ విజయం

ప్రణయము వల్ల చిందె మెరుపేల... రసపూరపు వెన్నెల విజయం


ధర్మము యే ఈ రాత్రంతా ..సుఖములు వలలో సలుపు ట యే

కర్మలు గా ఈ దాహమ్మే.. కలుకు ల కలలో నలుగు ట యే

నిర్మలమే ఈ ప్రేమించే...మగువ కులుకు నంత మగని కే

వర్ణములు న్నీ మారేనే.. వరుస ఒకటిగా మసలు ట యే


భ్రాంతులు తో మనసే నిలిపే..పద పోషణ వల్లన మంటే

వాంతుల తో వయసే నిలిపే.. వల యందు న చిక్కు ట మంటే

చేతులతో నలిపే బతుకే... జల కమ్మున ఉంచుట మెంటే

చీకటి లో చితిపే చినుకే... చిరు హాసము తెల్పుట మంటే

 

కమ్మని ఆహార మున్న  ముద్దునుగాంచెన్

ఇమ్మని అంటే ఎలాగ అందరు ఉండెన్

గుమ్మములో నున్న ముద్దుగుమ్మను గాంచెన్

సమ్మెట పోటేను సద్దుకో అని తెల్పెన్

 

ముంగిట ముత్యమ్ము ఆశ పాశము వోలెన్

ఎంగిలి పడ్తూనె వాన జల్లులు వోలెన్

రంగులు ఘోషించె మేఘరావము వోలెన్

పొంగును చూపించె కాల మాయల వోలెన్

 

ఎంత కాలము కష్టమా ఏమిటి దౌర్భాగ్యము

కొంత మానస ఇష్టమా కోరిక లక్షణము

సంత మాదిరి అయ్యెను సౌమ్యము నిర్భంధము

వింత నిర్ణయ శాస్త్రము వీధిన దౌర్జన్యము


నాలొ హృదయము కదిలి బెదిరింది ఎందుకో

నాలొ ఇష్టము బతుకు చెదిరింది ఎందుకో

నాలొ కన్నీరు విధిగ తొనికింది ఎందుకో

నాలొ  రోగము విషము చిలికింది ఎందుకో

0


106-ఉపనిషత్ సూక్తి 

106. యా వేదాంతార్ధ తత్వైక స్వరూపా పరమార్ధతః| నామరూపాత్మనావ్యక్త సా మాంపాతు సరస్వతీ||

(సరస్వతీరహస్యోపనిషత్)

- ఏదేవి పరమార్ధమున వేదాంతార్ధతత్వైక స్వరూపయో! నామ రూపములుగా వ్యక్తమైనదో, ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక!

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 19.

ఈ లోకంలో నేను అసహ్యించుకొనేది ఒక్కటే - అది కపటం.

జాగృతి

స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

విధేయతను మొదట అలవరచుకోండి. సేవకుడిగా ఉండడం నేర్చుకుంటే, నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది.

విచక్షణ 

మీ విచక్షణను ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకోండి. మీకుపయోగం లేని విషయాలను వదిలిపెట్టండి. మీ కాలాన్ని ఎన్నడూ సోమరితనముతో గడపకండి. 

శ్రీ పరమహంస యోగానంద ప్రవచనం

శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల

1 వ శ్లోకం

ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినేదినే తమహం! శిరసా వందే రాజానం కులశేఖరం !!   

భావం :-

పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరైన కులశేఖర మహారాజు శ్రీరంగనాథుని సేవించుటకు, భక్తులందరినీ తన వెంట తీసుకుపోవుచూ రంగయాత్రను గూర్చి తెలుపుచున్నారు. శ్రీరంగనాథుని గుణకీర్తనము చేయుచూ, భక్తి తన్మయులై ఈ యాత్రా విశేషాలు తెలుపుతూ ఉంటే సమయము గడిచిపోవుచున్నది.ఇదే విధంగా ప్రతీరోజూ జరుగుచున్నది. ఈవిధంగా శ్రీరంగనాథుని గుణానుభవముననే సమయము గడిపెడి భక్త కులశేఖర మహారాజుకు సాష్టాంగపడి నమస్కరించు చున్నాను.

---

నేటి ఛందస్సు కవిత (13)

నచ్చినవారు మనసారా మాట్లాడితే 

ఆ ఆనందం అమృత భాండమే!

వచ్చినవారు సహనమ్మే చేపేట్లైతే 

ఆ సౌభాగ్యం అమృత లక్ష్యమే ! 


విశ్వమునందు వినయమ్ము విశ్వాసమే 

ఆధ్యంతం నందు సహ జన్మయే!

సర్వులయందు హృదయమ్ము విశ్వాసమే  

సర్వార్ధం నందు సహ జన్మయే! 


మెచ్చిన వారు మనలోనే పోట్లాడితే 

ఆ ఆ భంధం ఎపుడు కష్టమే !

వచ్చిన వారు సహనమ్మే చూపేట్లైతే 

ఆ ఆ భంధం ఎపుడు ఇష్టమే !


సత్యమ్ము తెల్పు విజయమ్ము ఖాయమ్ముయే 

ఆ విన్యాసం సహజ సంపదే !

నిత్యమ్ము తెల్పు విషయమ్ము కాలమ్ముయే  

ఆ సన్మానం సహజ సంపదే ! 


తప్పులు చేయకనె ప్రేమేపంచేందుకే 

ఈ దేహమ్మే సహజ బంధమే !

తప్పులు ఏర్పడిన ప్రేమత్వంతోనులే 

ఈ దాహమ్మే సహజ బంధమే !   


ఒప్పులు సేవగనె  దాహమ్మే ఓర్పుయే 

ఈ లక్ష్యమ్మే మనసు భావమే !

ఒప్పులు స్వేశ్చగనె దేహమ్ము మార్పుయే   

ఈ భావమ్మే వయసు లక్ష్యమే !

____(((())))____


నేటి ఛందస్సు కవిత 


కాలమ్మే లే - కళలు కనుసైగల్తొ- కాపాడు చుండే 

వేళమ్మే లే - వరుస కధలే మార్చు - వాక్యాలుతెల్పే 

మేళమ్మేలే - మిడిసిపడుటే శబ్ద - మిత్రత్వ మందే 

గాళమ్మేలే - కలలు కదిలించేది - కారుణ్య మొందే


ప్రేమామృత్వం - పిలువు మనసయ్యేను - ప్రేమింతు నిన్నే  

సామ్రాజ్వత్వం - సమర సహనమ్మేను  - సాధించ నిన్నే 

గమ్యామృత్వం - గమన గరళమ్మేను - గాలింతు నిన్నే 

రమ్యాంమృత్వం - రమణి తరుణమ్మేను - రమ్యమ్ము నీతో 


తీయంగా రా - దినము నిను నేఁదల్తు - దేహమ్ము నీకే 

మాయాతీతా - మనమునను నేఁగొల్తు - మంత్రమ్ము నీవే 

పాయంగాదే - వనజనయనా నేను - వాంఛింతు నిన్నే 

రాయంచా నా - ప్రణయ మొక యందాల - ప్రస్థానమేగా  


*మందాక్రాంతము - మ/భ/న/త/త/గగ UUUU - III II UUI - UUIUU

___((()))___

నేటి కవిత 


ప్రాధాన్య మిచ్చె మనసే - పదిలమ్ము కాదా      

వేదాంత భావ మదియే - వలపమ్ము కాదా 

సిద్ధాంత తత్వముగనే  - శిఖరమ్ము కాదా 

రాద్ధాంత మంత రణమే - రసరమ్య కాదా 


కళ్ళల్లొ నీళ్ళు కలిగే - కలలాగ తీర్పే 

కాళ్ళల్లొ చెందె  మెరుపే - కలలాగ ఓర్పే 

నీళ్ళల్లొ ఉండె వెలుగే - నటనమ్ము నేర్పే 

గోళ్ళల్లొ నుండె నునుపే - గుణపమ్ము మార్పే 


శ్రీవారి కేను వలదా -సిరి నేను కాదా 

రావేల వేగ వరదా -రసరాగ దీపా 

భావాల పూల సర మో - పరమేశ నీకే 

రావాలు నీవి వినఁగా - రమణీయమేగా 

వసంతతిలకము - త/భ/జ/జ/గగ UUI UI IIU - IIUI UU


___((())))___


【 పాట సంఖ్య:-【277】 🌹.నేటి నా పాట.🌹】

【***************】
పాట సందర్భంపై విశ్లేషణ.
*********
చలి కాలం వచ్చినా రాకున్నా వలపు గాలి సోకినాక
ప్రేమలో వెచ్చదనం  పురి విప్పుకోవడం
ప్రేమికులు వెచ్చదనం కోరుకోవడం  సర్వ సాధారణం.
ఈ పాటలో ప్రేమ జంట హృదయ స్పందన  పైన చెప్పినది యధావిధిగా జరిగిందే  ఒకరిపై ఒకరి ఆశల 
స్పందనయే ఈ పాటగా మారి ఇద్దరి నోట విరబూసింది.
*****************
పల్లవి:-
****
చలికాలంలో నులి వెచ్చదనం
 నాలో తొంగి చూస్తుందే సఖి నిను చూస్తుంటే
గిలిగింతల యవ్వన పవనపు చిలిపి తనం
 నీ సాయం కోరిందే చెలి.

 చలి పులి చంపేస్తుంటే
 నెగడు వేడి చాలక
 మది కోరిందే నీ ఒడి
 కాదనకే కాత్యాయని

అవుననవే వరూధిని
అవకాశం ఇవ్వవే సునందిని
 వచ్చేయవే  వసంతంలా
ఇచ్చేయవే నీ అందాల సీమనంతా...

చలికాలంలో నులి వెచ్చదనం
నాలో తొంగి చూస్తుంధే సఖి నిను చూస్తుంటే
గిలిగింతల యవ్వనపు పవనపు చిలిపితనం
 అది నీ సాయం కోరిందే చెలి...
 చరణం:-1
****
 ముసురు పట్టిన వేళ
మనసులో కోరిక తోంగి చూసిందే
 నీపై ఆశగా వేడి తాకగా 
 శ్వాసలో తాపమే చేరిందే...

కునుకు రాకుండా
కనుల ముందు నిలిచావే
 మెలుకువే లేని నిదురలో కూడ
 స్వప్నమై కనిస్తున్నావే..

 ఎంతో అందంగా కనువిందు చేస్తు
 కోరికల దావనమై నెనల్లాడేలా చేస్తున్నావే
 ముంగురులన్ని విసిరేసి 
నల్లని మేఘ మాలలా మార్చేశావే..

 నాలో ఇంద్రధనుస్సులే  విరిసేలా వలవేశావే
 లోకాన్నంతా అందాల బృంధావనమై
 అవతరించేలా ఆదేశించావే మహారాణివై
మహా భోగాలన్ని నీ పాదాల చెంతా
 ప్రణమిల్లినావే ఓ అందాల దేవతా..

చలికాలంలో నులి వెచ్చదనం
నాలో తొంగి చూస్తుందే చెలీ నిన్ను చూస్తుంటే
చలి మంటలు ఆపలేవులే
చెలి సాయం  తీసుకోక తప్పదులే. 
హా హ హాహా హాహా.....
***************


No comments:

Post a Comment