Sunday 15 May 2022



 సమస్యను పూరించండి........ పూరించుట 

కన్నము బెట్టువాని  ననఘాయని      పిల్చిన  సార్థకంబగున్ 

🟢🟢🟢

విన్నపమేనులే ఝరులు వెన్నెల లీలలు మానసమ్మునన్

మన్నన పొందు కే మరులు మధ్యన సాగుటె మాయ కమ్మియున్

కన్నుల దాహమే కలలు కామిత భావము పొందు చుండుటన్

కన్నము బెట్టువాని ననఘాయని పిల్చిన సార్ధకంబగున్

---

 గారము నుండుటే బ్రతుకు గాళము చుట్టును వేల్పులవ్వుటన్

మారము పెర్గియే మనసు మన్నన లేకయె మధ్యమాడుటన్

నేరము చేయుబుధ్ధి యగు నిర్మల దారియు లేక బత్కుటన్

సారము ఏదియైననులె సంఘము మేలును కోరుజీవిగన్

* ప్రాంజలి ప్రభలు 

*సత్యాన్వేషకులు అన్వేషణ మార్గమున మా ప్రాంజలి ప్రభలు.  బోధనలు నాచరించుటయే ప్రమాణము కాని జీవుల నాకర్షించుట ప్రమాణము కాదు.  ఆచరణ మార్గమున చూపుట యే నిజమైన ప్రభలు లక్ష్యము


*నీలో ఉన్న అహంకారము రుద్ర స్వరూపము. మమకారం శక్తి స్వరూపం రేండు లేకపోతే జీవితమే లేదు. ఈ అహంకారమనే పంతాన్ని ప్రేమతో మమకారాన్ని  తీవ్ర మోక్షేచ్చగా మార్చుకోవాలి అదే కలసి యుండె కళల జీవితం


*సజ్జనుల స్నేహము చేతనే మంచివారి గుణగణాలు 

గాలి వీచినందు వలననే కదా పూలయొక్క సువాసనలు  

మనుషులకు చేరి ఆనందముతో హృదయ్ పవనాలు 

అదే కలసి యుండె కళల జీవితం


*ప్రాపంచిక వ్యవహారములను వేటినీ త్రోసిపుచ్చక, 

వీనిని కావాలని కోరుకొనక,ఆకర్షణ, వికర్షణ విధి విధానాల కాలాన్ని  గమనించుటే  అదే కలసి యుండె కళల జీవితం

---

నేటి కవిత 

ప్రార్ధనగా ఉండి హృదయాన 
స్వార్ధము ఏ లేక నజరాన 
అర్ధము నే పంచు మదిలోన 
తీర్ధము గా నిచ్చు నదియే న 

భారమ్ము తో మలుపు తిరిగేను 
వైరమ్ము  నే మరచి పెరిగేను 
ధైర్యమ్ము గా శక్తి తెలిపే ను     
సౌర్యమ్ము ఏ చూపి కదిలే ను 

దాహమ్ము తో శక్తి నజరాన 
స్నేహమ్ముతో నిత్య మదిలోన 
మోహమ్ము తో రక్తి తెలిపే న 
సాహిత్యమే సమయ విధిగానె 
---

ఆకిక్కే వేరబ్బ -- కవిత 
పిల్లవాడిని ఏడుపు ఆపడానికి సెల్యతే
ప్రేమ పిచ్చిపెరగటానికి ఫేస్ బుక్ అయితే
చిత్రవిచిత్రంగా చూడటానికి సులోచనమైతే
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష ఉన్నట్లైతే

ఆకిక్కే వేరబ్బ
విజ్ఞానుల తత్వజ్ణానము పొందగలిగితే
దౌర్జన్య స్వార్ధ  బుధ్ధినే తరమ గలిగితే
ఆహారమే తినక మనిషి జీవించ గలిగితే
మనిషిక నిత్య యవ్వనం గా ఉండ గలిగితే

ఆకిక్కే వేరబ్బ
సర్వ గుణసంపదుడు రామ కృప కలిగితే 
సర్వ హృదయము ధైర్యము నింప గలిగితే 
సర్వ లోకరక్షకడు మనసున ఉండగలిగితే 
సర్వ స్త్రీలమానప్రాణ రక్ష అమ్మ అయితే 

ఆకిక్కే వేరబ్బ
నేటి మనిషికి విలువను తెల్పి బ్రతికితే 
డబ్బు విలువను గుర్తించి నదించితే 
మనసు తెలిసిన వ్యక్తిని నమ్మ గలిగితే 
మనిషి మనిషికి మధ్యన బేధము లేకపోతె

ఆకిక్కే వేరబ్బ
ప్రతి ఇంట గాలి లో ఎగిరే కారు లైతే
వృద్ధాప్యం లో షుగర్ బిపి లేని రోజులైతే
మాత్రలతో నే గర్భం వచ్చినట్లయితే
అద్దె కే సుఖాలు ఎక్కువ గా ఉన్నట్లయితే
ఆకిక్కే వేరబ్బ
---((())))___

---


No comments:

Post a Comment