Tuesday 10 May 2022



98-ఉపనిషత్ సూక్తి 

98. చిత్తమూలంహి సంసారః తత్ ప్రయత్నేన శోధయఏత్||

(వరాహోపనిషత్)

- సంసారము చిత్తమూలముగా నున్నది. కావున స్వ ప్రయత్నముతో ఆ సంసారమును శోధించవలెను.

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!


స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 11.

వీరులై ఉండండి! ధీరులై ఉండండి! మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే. నా శిష్యులు పిరికిపందలు కాకూడదు.

జాగృతి స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

పురాణాలు వర్ణించిన ముఫ్పై మూడు కోట్ల దేవతల్లో విశ్వాసం ఉండీ, మీపై మీకు విశ్వాసం లేకపోతే విముక్తి లేదు.


🧘‍♂️విచక్షణ🧘‍♀️ 

దేవున్ని కనుగొనడమంటే దు:ఖాలన్నింటి యొక్క మరణమే అని గుర్తుంచుకోండి.

శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి / ఒక యోగి ఆత్మకథ లో

ॐ卐సుభాషితమ్ॐ

🧘‍♂️గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం🧘‍♀️

ॐॐॐॐॐॐॐॐॐ

2) కళత్రమ్ ధనమ్ పుత్రపౌత్రాధి సర్వమ్ | గృహమ్ బాంధవా సర్వమేతాధి జాతమ్ |

మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||

అర్ధము:-  భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి గృహం, ఎంతోమంది బంధువులు వున్న గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?


దత్తపది..మధుర..సుధా..రస..ధార


మధుర మాధుర్య మోహన మానసమ్మె

కళ సుధారస మయముగా కాంతులాయె

కరుణ రసమయి గావు మా కామి తార్ధ

రాగ ధారగా రసమయి రమ్య పరచు

---

పెదవులు చిలికే వయసులో పేద నీడ

కట్ట బట్ట లేని కళ యే కారణమ్ము

 నిద్ర లేని రాత్రులు ఎన్నొ నియమ మందు

కాఫి అనునదే తెలియని కటిక బ్రతుకు

......

దేవత లందరూ కలిసె దేవుని తోడు ను నీడకోరుటన్

కావలి లీలలే మనసు కాచెటి తోడుయె మోహతాపమున్

సేవలు చేయిగా అలిసి సంతస వాక్కు లు తెల్పగల్గుటన్

పావని నామమే సహజ పాఠము నిత్యము ‌‌శోభయిచ్చుటన్

---

చీకటి ఇంటిలో వెలుగు చీపురు మల్లెను తర్మి వేయుటన్ 

వాకిట వెల్గుతో సుఖపు వాక్కులు శోభలు పంచిపుచ్చుటన్

తాకిడి వల్లనే వయసు తాపము పెర్గయు కష్టనష్టమున్

సాకులు కార్యసాధనలుగ సాధన శోధన జీవితమ్ముగన్

......

శార్దూలము గా..నాప్రేమ

నీకై నా మనసివ్వ జాల కధయే నీమాట నమ్మేదెలా 

నాకై నీ సహనమ్ము ఏది విధియే నానుండి వేర్పాటు గా

నీకేమైన మదీయభావ మలుపే నిత్యమ్ము దాహమ్ముగన్

నాకేమీ లెదులే ప్రవృత్తి కరుణే నావిద్య నీప్రేమకై

చంపకమాల

కులము యె మందు చెప్పుకొను కూడు యె ఆశ సమాన ప్రేమయే

కలిమి ధనమ్ము యేకధ లు సాగు గణాతి సుఖాల గోడుగా 

చెలిమి యు చేదు గ మాత్ర యె ప్రేమ వినీల  విహారి భావమే

గుళికయె మందు నేస్తముయె కూడును కోరికయేను  గొప్పదే

-- 

నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా  పో..లే..ర..మ్మ ..గా ఆటవెలది లో గ్రామ దేవత స్తుతి


పోరు ఏల నీకు పొయ్యె కాలముగాను 

లేరు ఎవరు అనకు లేత మనసు 

రమ్య చూపు లేల రవ్వల వెలుగు జి 

మ్మగుట కధలు కాదు మానసమ్ము 

---

తేటగీతి 

సర్వపూజితుండు వినయ సార్వభౌమ 

కార్తికేయాగ్ర జుడు సర్య కార్య దక్ష 

పార్వ తీతనయ గణాల నాయకుడవు 

విఘ్న ములకు వినాశకా వక్రతుండ 

    -----

కంఠ నాదాలు నిక్షిప్త మాయ బ్రతుకు    

జీవనస్వరాల కళలు మేలు కలలు  

కవితలో ఆవేశములుగా కాల మగుట 

ఒక్క దానితో తృప్తియే ఓర్పు యగుట 

    ---

మంచి యన్నది నీలోన మచ్చ మాపు 

విచ్చి యున్నపుష్పముననే వింత జూడు  

వచ్చి పోవును బంధము వాక్కులేల 

వెచ్చ నైనది ఆమెయే వేచి చూడు 

---

కళకళ కలతలు కలుగుట కలగన 

విందాయ ముందు వినవోయి   

చెడుగుడు వడివడి తడబడ వలదుగ

సందేహ మందు వలదోయి


తినమని వినమని కనమని అనుటయు 

డెందానఁ గుందు విడదాయె

వలదని వలపుల తినమని అనుటయు 

బంధాల యందు బడయోగ 


వినయపు పలుకులు సమరము అగుటయు   

సందేహ మందు కలలూగె

హృదయపు తలుపులు తెరిచియు కదులుటె

హిందోళమందుఁ దనువూఁగె

*వర్ణచ్ఛందములు - 37 - తిరుప్పుగఴ్ ఛందము

తనతన తనతన తనతన తనతన తందాన తంద తనతాన 

***

---

కందపద్యము 

కాదను శక్తియు ఏదియు  

మొదము తెల్పగను ఉండ మోహపు కధలన్ 

భేదము నాకే ఏలను  

వేదము భరియించలేను వేదన గలిగెన్"

---

గొప్ప లేల నీ బ్రతుకులో గోడ నీతి    

చెప్పి చేయనేల కలలు చేదు నీతి 

కప్పఁ గంతులు చేసితి కాల మందు 

"అప్పడాల వా రిడిరి నా కాత్మబోధ"

---

మూగ జీవుల ప్రాణము ముందు జూడు

మనసు తెల్ప జంతువు గాను మహిమ జూడు

మనిషి కన్న జంతువు మేలు మరువ లేను

జీవహింస తగదు నీకు జీవితాన

.......

దత్తపది........ ఆహా,  ఓహో , హీహీ, హేహే

పద్య పాదాదిన రావాలి


పెదవులు చిలికే వయసులో పేద నీడ

కట్ట బట్ట లేని కళ యే కారణమ్ము

 నిద్ర లేని రాత్రులు ఎన్నొ నియమ మందు

కాఫి అనునదే తెలియని కటిక బ్రతుకు

---

 కంద పద్యం

ఆహాఏమి రుచీ యిది

ఓహో యీప్రకృతిఎంత ఓర్పును చూపెన్

హీహీ కూతల పలుకుల్

హేహే కళలే మనస్సు హితమే తెల్పెన్

శార్దూలము

ఆహాఏమి కధా మనోహరముగా ఆశ్చర్య మే అయ్యె నే

ఓహో మాయలులే మనోమయమునే ఓదార్పు లయ్యేనులే

హీహీ హీ యనటే వినోద కళగా హీనమ్ము చేసేందుకే

హేహే హేళముగా ముఖాన్ని కసరే హస్తమ్ము కోపమ్ము గన్

ఉత్పలమాల 

ప్రేమయు లేకయే మనిషి ప్రేమకు పాఠము చెప్పుగల్గుటన్ 

క్షేమము తెల్పుటే జనుల క్ష0తను చేరుట కాల నిర్ణయమ్ 

భామలు కామచేష్టలతొ బాధ్యత మర్చియు ప్రేమచూపుటన్           

కామకళావిశారదులుగా గనుపించిరి మౌనులెల్లరున్

---

ఏడ్పనె గోలయేల కళ  ఏకము కష్టము మయ్యె నవ్వుటన్

ఏడ్పులు గుండెచప్పుడు లె ఏమని చెప్పెద శోక భావమున్

ఏడ్పులు నిన్ను నన్ను కలిపే కళ కాదని చెప్ప లేకయున్

ఏడ్పుయు దేహ దాహము ను ఏలను చెప్పక హాస్య మేడ్పుయున్

.......

ఎందుకు దేశకాలమున ఏమని చెప్పెద అంతదుఃఖమే

ముందుగ ఉద్యమం కలలు ముంపుగ ఆంగ్లము బోధలవ్వుటన్

పొందుకి భత్యమేదియును పోరుగ పొందుట భాగ్యమవ్వుటన్

బిందు విద్యార్ధి కే కళలు బీటలు బారెను ఏలచెప్పెదన్

.......

సర్వ మనేదియే సకల సృష్టికి మూలము సాధుసంఘమే

గర్వమనేదియే జనుల గానపు గాయము గద్యపద్యమున్

నుర్వి జనైక గాధలుయె నుజ్జ్వల లక్ష్యము సర్వ కామమున్

పర్వమ ప్రేమచుట్టముయు పాశము బంధము బాధ్యత వ్వుటన్

***


అమృతస్య పుత్రాః

శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు - 2

పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు. అలాగే భగవదాకాంక్ష - ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు. 

అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి. కైవల్యోపనిషత్తు ఇలా వచిస్తోంది: 

"కర్మ చేత, సంతతి చేత, లేక  ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం."

శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు.

"ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది. జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేం. 

ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే.

"కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం."

"నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా కోర్మెలు దాగి ఉంటాయి. 

ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది. పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు. నెయ్యి లేదని ఇతడన్నాడు. అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా? అని చెప్పాడు. కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది. 

ఆ విధంగా కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి. వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి. కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొటే, సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి." 

ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి. కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు. మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి. రామకృష్ణుల మనస్సులో కూడా 

అవి మెదలకపోలేదు. ఆయన ఇలా జ్ఞాపకం చేసుకున్నారు:

"ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి. ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు - ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. నా మనస్సును ఇలా ప్రశ్నించాను: 

'నీకు ఏం కావాలి? వీటిలో దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్ప, అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు. భగవంతుడి పాదపద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది."

ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక - బద్ధ శత్రువు. ఈ శత్రువును తుదముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి. వాటిలో కొన్ని - త్యాగాగ్ని జ్ఞానాగ్ని యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు.

రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు:

"ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి, 'ఓ ప్రభూ! ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు." ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటూడు.

---

*యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 

2-8

అన్తర్వాసనయా జన్తుర్దీనతామనుయాతయా 

జితో భవత్యన్యథా తు మశకోఽప్యమరాచలః. 

“దేహాదులు నశించిన నేను నశించుదును” అను ఈ ప్రకారమగు దేహాద్యహంభావ రూపవాసన యెవని అంతఃకరణమున నుండునో అతడు పిరికితనమును, దీనత్వము నొందును. మఱియు నట్టివడు ఇతరులచే జయింపబడును. అట్టి వాసన లేకున్న చిన్న దోమకూడ మేరుపర్వత సమానముగ నగును. (గంభీరమై, అచంచలమై మహాశక్తివంతమై

యుండునని భావము) 

2-9

వాసనాతన్తుబద్ధో  యో లోకో విపరివర్తతే 

సా ప్రవృద్ధాతిదుఃఖాయ సుఖాయోచ్ఛేదమాగతా, 

వాసనయను త్రాటిచే బంధింపబడిన మనుజునకు విపరీతజ్ఞానము కలుగును, వాసన అభివృద్ధి నొందిన మహాదుఃఖమును కలుగజేయును, ఛేదించి వేయబడిన మహాసుఖమును కలుగజేయును.

2-10

ధీరోఽప్యతి బహుజ్ఞోఽపి కులజో౽పి మహానపి 

తృష్ణయా బధ్యతే జన్తుః సింహః శృఙ్ఖలయా యథా. 

మనుజుడు ఎంత ధీరుడైనను, మహాపండితుడైనను, గొప్పకులమందు జనించిన వాడైనను, ఎంత గొప్పవాడైనను  గొలుసుచే సింహమువలె తృష్టచే బంధించివేయబడుచున్నాడు.

***

*అమృతస్య పుత్రాః*

*🧘‍♂️శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు - 1🧘‍♀️*

మనసులోని చెడు సంస్కారాలను రూపుమాపేదెలా?

ఏదైనా ఒక కర్మను మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏర్పడిన మనఃప్రవృత్తినే 'సంస్కారం' అంటారు.

చాలాకాలం గారాబం చేయడం వల్ల మనపై ఆసక్తిని పెంచుకొని, మనల్ని అంటిపెట్టుకొనుండే పెంపుడు కుక్కల లాంటివే ఈ సంస్కారాలు. ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఒక నాడు వీటిని పారద్రోలాలంటే సాధ్యం కాదు. వీటి నుంచి మనం తప్పించుకొంటూ ఉండాలి. ఇవి మనల్ని సమీపిం చిననాడు వాటిపై దాడి చేసి దూరంగా తరిమి వేయాలి.

కాబట్టి ముందుగా చేయవలసిందే మంటే మన చెడు సంస్కారాల గురించి ఎరుక కలిగి ఉండడం! వాటిని పురికొల్పే సందర్భాల నుంచి తప్పించుకోవడం! ఇది ఒక సుడిగుండాన్ని ఎదుర్కోవడం లాంటిదే. తెలిసో తెలియకో ఒకసారి దానిలో చిక్కుకుంటే మనం నిస్సహాయిలమే సుమా.

కానీ మన ముందున్న ఆ సుడి గుండం గురించి మనకు తెలిసి ఉన్నప్పడు, దాని నుంచి తప్పించు కోవాలన్న కోరిక దృఢంగా ఉన్నప్పడు దాని దరిదాపులకు కూడా పోకూడదు, అయితే కేవలం కళ్ళు మూసుకుంటే సరిపోదు. భయంతో తలను ఇసుకలో దూర్చడం ద్వారా ఉష్ణపక్షి ప్రమాదాలకు తావిస్తుంది. మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడమనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. 

యోగసూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన మంచి సంస్కారాలపై మనసును ఏకాగ్రపరచడమే మార్గం.

మంచి సంస్కారాలకు నిదర్శనాలైన వ్యక్తుల పైన లేదా విషయాల పైన మనస్సును లగ్నం చేయవచ్చు. కానీ భగవంతునిపై దృఢవిశ్వాసమున్న వ్యక్తి విషయంలోనైతే ప్రార్థన, ధ్యానం లాంటివి సాధన చేస్తూ దేవునితో మమేకమవడం ఉత్తమం.

పాపప్రవృత్తి నుంచి బయటపడేందుకు భగవద్గీత ఇలా మార్గం చూపుతోంది: 

"ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి - ఇవే పాపప్రవృత్తికి నిలయాలు. ఇవి జ్ఞానాన్ని ఆవరించి, జీవుణ్ణి వంచిస్తాయి. అందువల్ల ఇంద్రియాలను ఆదిలోనే నియంత్రించడం ద్వారా పాపనివృత్తి కావించవచ్చు.

భోగ విషయాల కన్నా ఇంద్రియాలు; ఇంద్రియాల కన్నా మనస్సు; మనస్సు కన్నా బుద్ధి; బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనవి. ఆత్మ ఆధారంగా మనస్సును వశపరచుకోండి. విషయలాలస రూపంలో దాగిన శత్రువును నాశనం చేయండి".

మన మనస్సులోని ప్రతిచర్యలపై దృష్టి పెడుతూ, కేవలం సాక్షిగా వాటిని గమనించడం ద్వారా వాటి ప్రభావం నుంచి బయట పడగలుగుతాం. కాబట్టి మన ఇంద్రియాలు ఒక భోగవస్తువు మాయలో పడకుండా వాటిని బయట నుంచి పరిశీలించ గలిగినప్పడు లేదా మన బుద్ధి మనస్సులోని ఒక ముద్రను పరిశీలిసూ దానితో తనను తాదాత్మ్య పరచు కోకుండా వివేకం చూపగలిగినప్పడు మనలోని భావాన్ని లేదా సంస్కారాన్ని జయించగలుగుతాం. 

మనలోని సంస్కారాలపై పట్టు సాధించాలంటే కేవలం సాక్షీభూతంగా నిలవడమే మార్గం. బుద్ధి శ్రేష్టమని చెప్పడం ద్వారా భగవద్గీత చెబుతున్నది ఇదే! సూక్ష్మంలోనే శ్రేష్టత్వం, తద్వారా సూల విషయాలను సాక్షిగా పరిశీలించే సుగుణం దాగి ఉన్నాయి. 

సాక్షిగా చూడడమంటే దేనితోనూ తాదాత్మ్యం చెందకపోవడం, తద్వారా సూలంలోని మాలిన్యాల నుంచి తప్పించుకోవడం. కానీ ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కన్నా ఉన్నతమైనదీ, జీవులందరిలోనూ వెలుగుతున్న దివ్య కాంతిపుంజమూ ఆ భగవంతుడే. ఆయన చలవ వల్లే ఈ జగత్తంతా నడుస్తున్నది. 

అందువల్ల మనం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ద్వారా హృదయపూర్వక ప్రార్థన, ధ్యానాలతో దేవుని వైపు మరలాలి. చివరకు చెడు సంస్కారాల నుంచి మనకు విముక్తిని ప్రసాదించేది ఆయనే!.

..........

శ్రీ పెదతిరుమలాచార్య సంకీర్తన

వెదకెద నిను నే వేదము చెప్పఁగ

హృదయములోననే యిరవు నీ కటా!! 

॥పల్లవి॥


శ్రీనాథా పిలిచితిఁ బలుకఁగదే

పూని యన్నిటా నుందువట

మానితముగ నామాట వినఁగదే

వీనుల సర్వము విందువటా!! 

॥వెద॥

 దు 

పరమాత్మా తప్పక పొడచూపవే

తరుణవయసు మరుతండ్రివటా

పరగ మొక్కెదను పాదము చాఁచవే

సిరుల బ్రహ్మ పూజించినదే యటా!!

॥వెద॥


గోవిందా నీ గుఱు తెఱిఁగించవే

వేవేలు మహిమల విభుఁడవటా

శ్రీవేంకటేశా జిగి నలమేల్మంగ

కైవసమై మముఁ గాతువటా!!

॥వెద॥

***

స్వామి నీకు మా హృదయంలోనే స్థానము వేదములో ఇదే చెప్పబడినది. మరి నేను ఎక్కడెక్కడో వెదుకుతున్నాను. శ్రీనాథ నేను పిలిస్తే బదులియ్యవేమయ్యా. నీవు ప్రయత్నంతో అన్నింటిలోనూ వుంటావట కదా. మన్నింపు తొణికిసలాడే నామాటలను వినవేమయ్యా.

 అనేకమైన ముఖములున్న నీకు అంతకు రెట్టింపు చెవులున్నవి కదా. పరమాత్మ యెక్కడవున్నా తలచుకొన్నంతనే పొడచూపలేవా. మసస్సే నివాసస్థానమైన మన్మథుని తండ్రివి కదా. పోనీ మొక్కెదనంటే నీ పాదాలనైనా చూపవేమయ్యా. మంగళకరమైన ఆ పాదాలను బ్రహ్మ పూజిస్తాడు కదా.

గోవిందా నిన్ను గుర్తుపట్టేదెలాగో నీవే చెప్పు. అనేక మహిమలు కలవాడవట కదా. ఓ శ్రీవేంకటేశ్వరా కాంతులీను అలమేలుమంగను కైవసము చేసికొని మమ్ము రక్షించెదవట కదా అంటు పెదతిరుమలాచార్య కీర్తించాడు.

****

*భారతంలో ద్రౌపది

పంచమవేదంగా ప్రణుతికెక్కిన మహాభారతంలో విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ మూర్తిగా... కురుక్షేత్ర యుద్ధానికి మూల కారకురాలిగా ద్రౌపదికి పేరుంది. పంచకన్యలలోనే కాదు, ఆరుగురు మహాపతివ్రతలలోనూ ఆమె పేరు చోటు చేసుకున్నదంటేనే అర్థం చేసుకోవచ్చు ద్రౌపది ఎంత విశిష్టమైన వ్యక్తిత్వం గల స్త్రీనో. ద్రౌపది అయోనిజ. యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు. 

పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. ఫలితంగా మరుజన్మలో ఆమె సంతానం కోసం యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. నల్లగా ఉండటం వల్ల ఆమెకు కృష్ణ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు ద్రుపదుడు. యుక్తవయసు రాగానే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు.

ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడే. దాంతో ఆమె మీద ఆశలు పెట్టుకున్న క్షత్రియ వీరులందరూ అర్జునుడిపై కయ్యానికి కాలుదువ్వారు. వారందరినీ అర్జునుడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, ద్రౌపదిని తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆ అయిదుగురు సోదరులనూ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రచ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఒకానొక సందర్భంలో ఉల్లంఘించవలసి వచ్చిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని, శ్రీ కృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు.

వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు. అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకు వచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటనగరం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాటరాజు పత్ని అయిన సుధేష్ణాదేవికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు. అది మామూలుగా జరగలేదు. ద్రౌపది ధర్మరాజాదులను పలువిధాలుగా రెచ్చగొట్టిన పిదపనే జరిగింది. 

అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. అదెలాగో చూద్దాం. ద్రౌపది పట్టమహిషి. ఆమెయందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కన్నబిడ్డలెవరో వారే సింహాసనానికి ఉత్తరాధికారులు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదు. చిన్న పిల్లలు. గాఢనిద్రలో ఉన్నారు.

అశ్వత్థామకు ఉన్మాదం కలిగింది. తొడలు విరిగిపోయి పడిఉన్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ‘నీ పగను నేను చల్లారుస్తా’ అన్నాడు. పాండవులమీదికి యుద్ధానికి వెళ్లడం ఎలా!  రాత్రివేళ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడినుంచో ఒక గుడ్లగూబ వచ్చి చెట్టుమీద ఉన్న ఒక పక్షి గూట్లో పెట్టిన పిల్లలను తన వాడి ముక్కుతో చీల్చి చెండాడేసింది. ఆ ఇదీ నేను చేయవలసింది...అనుకున్నాడు. నిద్రలో ఉన్న ద్రౌపదీ దేవి ఐదుగురు పిల్లలను ఒక్క రాత్రిలోనే సంహరిస్తాను. పాండవులకు ఉత్తరాధికారులు లేకుండా చేస్తాననుకుంటూ పిచ్చెక్కిన వాడిలా అయిపోయాడు. శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుడి కంఠాన్ని తుంచేశాడు. ఏనుగుల కుంభస్థలాలు ఛేదించాడు. గుర్రాల్ని చంపేశాడు. ఐదుగురు ఉపపాండవుల కుత్తుకలు కత్తిరించేశాడు. అది తెలిసిన అర్జునుడు వెతుక్కుంటూ వెళ్లి అశ్వత్థామ జాడ కనిపెట్టి, అతణ్ణి పశువును కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేశాడు.

ఆమె ఐదుగురు భర్తలు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఊ..అంటే చాలు భీమసేనుడు అశ్వత్థామ తలను వేయి వక్కలు చేసేస్తాడు. కానీ ఆ క్లిష్ట సమయంలో ద్రౌపది ఎంతో సంయమనం పాటించింది. కొడుకులు చచ్చిపోయి నేను ఏడుస్తున్నా. ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉన్న ఒక్క కొడుకు కోసమని ఇంటిదగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు. నా ఐదుగురు బిడ్డల్ని చంపేశాడనే కోపంతో పాండవులు అశ్వత్థామను ఎక్కడ చిత్రవధ చేసేస్తారన్న భయంతో ఎంత ఏడుస్తోందో! గురుపత్ని ఏడుపు మన వృద్ధికి ప్రతిబంధకం కాకూడదు. వీడిని మనం చంపకూడదు. వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది. నేను పడుతున్న బాధ నాకు తెలుసు. వేరొక తల్లి ఎందుకు పడాలి. వదిలిపెట్టేయండి’’ అన్నది.

అంతగొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన ద్రౌపది ధీరవనిత కాక మరేమిటి? ప్రతి పురుషుడి విజయం వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న ఆధునిక కాలపు నానుడిని అనుసరించి మహాభారతపు కాలంలో కురుక్షేత్రంలో పాండవులు ఐదుగురు సాధించిన విజయంలో వారి ధర్మపత్ని ద్రౌపది పాత్ర ఎంతో కీలకమైనదని అందరూ గ్రహించి తీరాలి.

***


No comments:

Post a Comment